Fresh
-
ఎగ్సలెంట్ ఎక్సలెంట్ ఐడియా - నెలపాటు గుడ్లు ఫ్రెష్
కోడిగుడ్డు ఓ మంచి పౌష్టికాహారం, ప్రతి రోజు ఓ గుడ్డు తినమని వైద్యులు సైతం సలహాలిస్తుంటారు. కాబట్టి చాలామంది రోజుకో గుడ్డు తినేస్తుంటారు. అయితే ప్రతి రోజూ గుడ్లు తెచ్చుకోవడం, వాటిని నిల్వ చేసుకోవడం కొంత కష్టమైన పనే. అయినా తగ్గేదేలే అన్నట్టు కొందరు గుడ్లు నిల్వచేయడానికి వివిధ పద్ధతులను అనుసరిస్తుంటారు. కానీ చాలా రోజులు నిల్వ చేసుకోవడం మాత్రం దాదాపు అసాధ్యమే. దీనిని సుసాధ్యం చేయడానికి 'ఎగ్సలెంట్' (EGGcellent) ముందుకు వచ్చింది. దీని గురించి తెలుసుకోవడానికి సంస్థ ఫౌండర్ 'విశాల్ నారాయణస్వామి'తో సంభాషించాము.మీ గురించి చెప్పండినా పేరు 'విశాల్ నారాయణస్వామి'. నేను ఎగ్సలెంట్ ప్రారభించడానికి ముందు హైడ్రోపోనిక్ వ్యవసాయంతో పంటలు పండించాను. తరువాత ఆహార వ్యర్థాలను తగ్గించడానికి.. వాటిని ఫ్రీజింగ్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఇందులో భాగంగానే గుడ్లను ఎక్కువ రోజులు నిల్వ చేసి అందించాలని ఈ సంస్థ ప్రారంభించాను.గుడ్లను ఎక్కువ రోజులు నిల్వ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది?ఇతర దేశాల్లో అయితే చిప్స్, నూడుల్స్ వంటి ఆహార పదార్థాల మాదిరిగా.. ఉడికించిన గుడ్లను కూడా షాపింగ్ మాల్స్ లేదా ఇతర స్టోర్లలో కొనుగోలు చేసి తింటున్నారు. ఈ విధానం మనదేశంలో లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని భారతీయులకు కూడా ఉడికించిన గుడ్లనే నేరుగా అందించాలనే ఉద్దేశ్యంతో ఈ ఆలోచన వచ్చింది.ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి? ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయా?ఎగ్సలెంట్ గుడ్లు నెల రోజులు (30 రోజులు) తాజాగా ఉంటాయి. ఇప్పటికే దీనిపై రీసెర్చ్ చేసి సక్సెస్ కూడా సాధించాము. ప్రస్తుతం 60 రోజుల నుంచి 90 రోజులు నిల్వ చేయడానికి కావాల్సిన ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా త్వరలోనే రానున్నాయి.గుడ్లను నిల్వ చేయడానికి ఏమైనా ద్రావణాలు ఉపయోగిస్తున్నారా?అవును, మేము గుడ్లను నిల్వ చేయడానికి ప్రత్యేకంగా తయారు చేసిన 'ఎగ్సలెంట్ ఎగ్స్టెండర్' (EGGcellent EGGstender) ద్రావణం ఉపయోగిస్తున్నాము.ఎగ్సలెంట్స్ ప్రారంభించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది?ఒకేసారి ఎక్కువ గుడ్లను కొనుగోలు చేసి నిల్వ ఉంచుకోవడం కష్టం. అంతే కాకుండా గుడ్ల ధరలు ప్రతి రోజూ మారుతూ ఉంటాయి. ఉదాహరణకు.. ఈ రోజు గుడ్డు ధర రూ.5 అనుకుంటే, మరుసటి రోజు అది రూ.5.50 పైసలు కావొచ్చు, 6 రూపాయలు కూడా కావొచ్చు. అలాంటప్పుడు వారానికి 10 గుడ్లు, నెలకు 30 గుడ్లు చొప్పున కొంటే.. ఎంత ఖర్చు అవుతుంది. కాబట్టి ప్రజలు కూడా కొంత డబ్బుకు ఆదా చేసుకోవాలని.. మళ్ళీ మళ్ళీ గుడ్ల కోసం స్టోర్స్‌కు వెళ్లే పని తగ్గించాలని అనుకున్నాను.ఇప్పటికి కూడా చాలా మంది కొనుగోలు చేసిన గుడ్లలో.. చెడిపోయినవి లేదా పాడైపోయినవి కనిపిస్తూనే ఉంటాయి. అంతే కాకుండా ఎక్కువగా గుడ్లను కొనుగోలు చేస్తే.. కొన్ని రోజులకు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ దూరాలకు గుడ్లను ఎగుమతి చేయాలనంటే అవి తప్పకుండా పాడైపోకుండా ఉండాలి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఎగ్సలెంట్స్ ప్రారభించాలనుకున్నాను.ఎగ్సలెంట్స్ గుడ్ల వల్ల ఉపయోగాలు ఏమిటి?భారతదేశంలో మాత్రమే కాకుండా ఇతర దేశాలకు కూడా సంకోచం లేకుండా ఎగ్సలెంట్స్ గుడ్లను ఎగుమతి చేసుకోవచ్చు. రిమోట్ ఏరియాలలో గుడ్లను విక్రయించాలనుకునే వారు కూడా కొన్ని రోజులు నిల్వ చేసుకుని వీటిని అమ్ముకోవచ్చు.ఎగ్సలెంట్స్ గుడ్ల ధరలు ఎక్కువగా ఉంటాయా?ఎగ్సలెంట్స్ గుడ్ల ధరలు సాధారణ మార్కెట్ ధరల కంటే 6 పైసల నుంచి 15 పైసలు మాత్రమే ఎక్కువ. కానీ ధర తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ గుడ్లను కొనుగోలు చేస్తే.. ధరలు పెరిగినప్పుడు ఆ ప్రభావం ప్రజల మీద పడకుండా ఉంటుంది. విక్రయదారులు కూడా వాటిని అప్పటి పెరిగిన ధరలకే విక్రయించుకోవచ్చు. -
కేక్ మిగిలిపోయిందా? ఇలా చేస్తే పాడవకుండా ఉంటుంది
సెలెరీని సిల్వర్ ఫాయిల్‌లో చుట్టి రిఫ్రిజిరేటర్లో పెడితే రెండు మూడు వారాల పాటు తాజాగా ఉంటుంది. చీమలు ఎక్కువగా ఉన్న చోట దాల్చిన చెక్క పొడిని నీటితో కలిపి స్ప్రే చేయడంతో చీమలు పారిపోతాయి. కాఫీ పౌడర్ లేదా మిరియాల పొడి నీళ్లలో కలిపి ఆ ప్రాంతంలో చల్లినా చీమలు రాకుండా ఉంటాయి. వేపుళ్ళు చేస్తున్నప్పుడు చెంచా వెనిగర్ చేర్చితే కూరగాయలు నూనె ఎక్కువగా పీల్చకుండా ఉంటాయి. వెల్లుల్లి రెబ్బలను నీటిలో నానబెట్టి తీస్తే త్వరగా పొట్టు వదిలిపోతుంది. మిగిలిపోయిన పాలను ఐస్‌ట్రేలో పోసి ఫ్రీజర్‌లో పెట్టాలి. గడ్డకట్టిన పాల బిళ్లలను టీ కాఫీలలో వాడుకోవచ్చు. ఒక్కోసారి క్యారట్పైన ఎక్కువగా మట్టిపేరుకుపోతుంటుంది. అటువంటప్పుడు .. స్టీల్ స్క్రబర్‌తో రుద్ది కడిగితే, సులభంగా మట్టి వదులుతుంది. టొమాటోలను పసుపు నీళ్లల్లో వేసి పదినిమిషాలు ఉంచాలి. తరువాత కడిగి తుడిచిపెట్టుకుంటే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. కేక్ మిగిలిపోయినప్పుడు అంచులకిరువైపులా బ్రెడ్‌స్లైసులను పెట్టాలి. స్లైసులు పడిపోకుండా టూత్ పిక్ గుచ్చి, రిఫ్రిజిరేటర్లో పెడితే కేక్ పాడవకుండా తాజాగా ఉంటుంది. -
కొనసాగుతున్న ఉగ్రవేట.. మరో సైనికుడి వీరమరణం
కశ్మీర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేట గత మూడు రోజులుగా కొనసాగుతోంది. ఉగ్రవాదులకు సైనికులకు మధ్య భీకరపోరు జరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు ఆర్మీ అధికారులతో పాటు ఓ పోలీసు అధికారి మరణించారు. ఈ రోజు అనంతనాగ్ జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరో సైనికుడు తీవ్ర గాయాలతో నెలకూలాడు. జమ్ముకశ్మీర్ పోలీసులు, ఆర్మీ సంయుక్త ఆపరేషన్ చేపట్టింది. అనంతనాగ్ జిల్లాలో అటవీ ప్రాంతంలో తలదాచుకున్న ఉగ్రవాదులతో 48 గంటలుగా భీకర పోరు నడుస్తోంది. అటవీ ప్రాంతంలో భయంకరమైన బాంబుల శబ్దాలు వినిపిస్తున్నాయి. బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్, పోలీసు అధికారి డీఎస్పీ హుమయూన్ భట్లు ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య వారి అంత్యక్రియలు జరిగాయి. ఇదీ చదవండి: Kerala Nipah Virus Updates:కేరళలో మరో వ్యక్తికి వైరస్ పాజిటివ్.. ఆరుకి చేరిన నిఫా కేసులు -
ఎండుకొబ్బరి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే.. ఇలా చేయండి
ఎండుకొబ్బరిని నిల్వ ఉంచిన కొద్దిరోజులకే కొబ్బరిచిప్ప లోపల బూజులాగా రావడం, కొన్నిసార్లు లోపల తెల్లగా ఉన్నప్పటికీ చేదుగా మారడం చూస్తుంటాం. ఇవేవీ రాకుండా, కొబ్బరిచిప్పలను చింతలేకుండా ఇలా నిల్వచేసుకోండి... మార్కెట్ నుంచి తెచ్చిన ఎండు కొబ్బరి చిప్పలను శుభ్రంగా తుడిచి, ఎండలో ఆరబెట్టాలి. ఆరిన చిప్పలను ఉప్పునీటిలో ముంచిన గుడ్డతో తుడవాలి. ఇప్పుడు కొద్దిగా కొబ్బరినూనెను వేళ్లతో తీసుకుని చిప్పకు రాసి నిమిషం పాటు రుద్దాలి. ఈ చిప్పలను రెండురోజుల పాటు ఎండలో పెట్టి , కవర్లో మూటకట్టాలి. ఈ మూటను గాలిచొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఇలా పెట్టిన కొబ్బరి నెలల పాటు పాడవకుండా ఉంటుంది. టేబుల్ స్పూను పటిక పొడిని కప్పు నీటిలో కలపాలి. పటిక మొత్తం కరిగిన తరువాత ఈ నీటిలో చిన్న గుడ్డను ముంచి కొబ్బరి చిప్పల లోపల, బయటా తుడవాలి. ఇలా తుడిచిన చిప్పలను ఎండలో రెండు రోజుల పాటు ఆరబెట్టి, కవర్లో మూటకట్టాలి. ఈ మూటను గాలిచొరబడని డబ్బాలో నిల్వచేయాలి. ఇలా కూడా ఎక్కువ రోజుల పాటు చిప్పలు తాజాగా ఉంటాయి. -
బెండకాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి
రిఫ్రిజిరేటర్లో పెట్టినప్పటికీ ఒకోసారి బెండకాయలు పాడవుతుంటాయి. వర్షాకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. బెండకాయలను తాజాగా ఉంచేందుకు ఇలా చేసి చూడండి... ∙మార్కెట్ నుంచి లె చ్చిన బెండకాయల్లో తాజాగా ఉన్న బెండకాయలను ఏరి పక్కన పెట్టుకోవాలి. ∙తాజా బెండకాయలన్నింటిని స్పూను వెనిగర్ వేసిన నీటిలో వేసి ఇరవై నిమిషాలు ఉంచాలి. తరువాత సాధారణ నీటితో కడిగి, తడిలేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలి. ∙ ఆరిన బెండకాయలను నచ్చిన పరిమాణం, ఆకారంలో ముక్కలుగా తరిగి జిప్‌లాక్ బ్యాగ్‌లో వేసి రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకోవాలి. ∙ ఇలా నిల్వచేసుకుంటే బెండకాయలు ఎక్కువ రోజులపాటు తాజాగా , రుచిగా ఉంటాయి. అవసరమైనప్పుడు జిప్‌లాక్ బ్యాగ్‌ను బయటకు తీసి వేడినీటిలో కొద్దిసేపు ఉంచాలి. కూలింగ్ తగ్గిన తరువాత వాడుకోవాలి. -
సరికొత్త గరిష్టాలకు సెన్సెక్స్, నిఫ్టీ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లలో వరుసగా రికార్డుల మోతమోగుతోంది. వరుసగా రెండోరోజు మంగళవారం కూడా దేశీయ సూచీలు సరికొత్త రికార్డుల వద్ద ఆరంభమయ్యాయి. సెన్సెక్స్ 34,400 దాటగా నిఫ్టీ కూడా ప్రస్తుతం ఆరంభ లాభాలనుంచి స్వల్పంగా వెనక్కి తగ్గిన మార్కెట్లు ఫ్లాట్‌గా మారాయి.ప్రస్తుతం మళ్లీ లాభాల్లోకి మళ్లి 52 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 34404 వద్ద, నిఫ్టీ 4 పాయింట్లు పెరిగి 10627వద్ద ట్రేడ్ అవుతోంది. కోల్ ఇండియా, అశోక్ లేలాండ్, గెయిల్, జీఎస్కే కన్జ్యూమర్, రేమాండ్ , అరవింద్ మిల్స్, విప్రో, టాటా మెటార్స్ లాభపడుతున్నాయి. ఎన్ఎండీసీ, ఐషర్ మోటార్స్, హెచ్‌పీసీఎల్, ఏసీసీ, ఆర్‌కామ్,ఎస్‌బ్యాంక్, యునైటెడ్ స్పిరిట్స్ నష్టపోతున్నాయి. -
కొనసాగుతున్న రూపాయి దూకుడు
ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి డాలర్ మాకరంలో బాగా పుంజుకుంది. గురువారం 15పైసలు లాభపడి రూ.63.56 వద్ద మరోసారి రెండేళ్ల కనిష్టాన్నినమోదు చేసింది. 2015 ఆగస్ట్ నాటి స్థాయి వద్ద స్థిరంగా ఉంది. గ్లోబల్ గా డాలర్ బలహీనంగా ఉండడంతోపాటు, ఆర్బీఐ తాజా పాలసీ సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ రెపో, రివర్స్ రెపో రేట్లలో పావు శాతం కోత పెట్టడంతో మరింత ఊపందుకుంది. దీంతో వరుసగా మూడో రోజు కూడా రూపాయి దూకుడు చూపుతోంది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో 4 పైసలు బలపడి 63.66 వద్ద మొదలైంది. ఇది బరింత బలపడి 63 స్థాయి వద్ద స్థిరంగా 63.62 వద్ద ట్రేడవుతోంది. నిన్నటి ర్యాలీ ద్వారా కీలక సాంతికేతిక స్థాయి రూ.64 దిగువన ముగిసినసంగతి తెలిసిందే. ఇటీవల ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ బలహీనపడుతూ రావడం రూపాయికి బలాన్నిచ్చినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ బాటలో డాలరు ఏడాదిన్నర కనిష్టానికి చేరగా.. కీలకమైన బ్యాంకులు, ఎగుమతి సంస్థలు డాలర్లను విక్రయిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అటు ఆర్బీఐ వడ్డీరేట్ల కోత ప్రభాతం ఈక్విటీ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్ 142 పాయింట్లు, నిప్టీ 40 పాయింట్లకు పైగా నష్టాలతో కొనసాగుతోంది. -
ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించాలి
డీపీఓ నారాయణరావు ఖమ్మం జెడ్పీసెంటర్ : గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య సమస్య తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో డీఎల్పీఓ రామయ్యతో కలిసి సెక్రటరీలు, ఈఓఆర్డీలతో పంచాయతీల అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైందని, గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉన్న నేపథ్యంలో పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో ఎక్కడా మురుగునీరు నిల్వ లేకుండా చూడాలని, దోమలు వ్యాప్తి చెందకుండా ఫాగింగ్ చేపట్టాలని, అన్ని గ్రామాల్లో బ్లీచింగ్‌ను స్టాక్ పెట్టుకుని ఎప్పటికప్పుడు చల్లిస్తూ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. మంచినీటి పథకాల నిర్వహణ సక్రమంగా చూడాలని చెప్పారు. ప్రతీ వారం వాటర్ ట్యాంక్‌లు శుభ్రం చేయాలని, మంచినీటి సమస్య తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత సెక్రటరీలదేనని సూచించారు. గ్రామజ్యోతి కార్యకలాపాలను ప్రియాసాఫ్ట్లో అప్లోడ్ చేయాలన్నారు. పంచాయతీలకు సంబంధించిన ప్రతీ ఖర్చు జమలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపర్చాలని సూచించారు. ఇంటి పన్నుల వసూళ్లలో 500 పంచాయతీలకు పైగా వందశాతం కలెక్షన్లు సాధించాలని చెప్పారు. పంచాయతీల్లో ఆడిట్ అభ్యంతరాలు లేకుండా చూడాలని, అభ్యంతరాలు ఉంటే వెంటనే క్లియర్ చేయాలని ఆయన ఆదేశించారు. -
బీరు బాబులకోసం ఓ యాప్
లండన్ : మండే ఎండలకి చల్లని బీరు తో చెక్ చెప్పాలనుకునే మందుబాబులకు శుభవార్త. మీరు తాగే బీర్ ఎంత ఫ్రెష్ దో, లేదా ఎంత పాతదో కనిపెట్టేసే స్మార్ట్ పద్ధతి ఒకటి అందుబాటులోకి వచ్చింది. అవును... ఇక కాలం చెల్లిన బీరు కారణంగా పార్టీ పాడవుతుందేమో నని బెంగపడొద్దంటూ పరిశోధకులు మద్యం ప్రియులకు ఒక గుడ్ న్యూస్ అందించారు. బీర్ తాజాదనాన్ని పట్టిచ్చే ఒక సరికొత్త యాప్ ను మాడ్రిడ్ కంప్లుటెన్స్ విశ్వవిద్యాలయ రసాయన శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ యాప్ లోని పాలీమర్ సెన్సర్ ద్వారా బీర్ లోని తాజాదనం కొలిచేందుకు అనుమతించే ఒక పద్ధతిని అభివృద్ధి చేశారు. స్మార్ట్ ఫోన్ లోని ఈ యాప్ ద్వారా అతి సులువుగా, చవకగా బీర్ నాణ్యతను కొలిచే యాప్ ను ఎలీనా బెంటిటో, పెనామారియా క్రజ్ అనే పరిశోధకులు డెవలప్ చేశారు.ఇప్పటివరకూ బ్రెవరేజ్ కంపెనీలు క్రొమటోగ్రఫీ పద్ధతుల ఆధారంగా ఫర్ ఫ్యూరల్ ( బీర్ లో కలిపే ఒక రకమైన కృత్రిమ, రంగులేని ద్రవం) ఇతర తాజాదనం సూచికలను కొలిచే వారన్నారు. కానీ వారు ఉపయోగించే ఈ పద్ధతి చాలా ఖరీదుతో కూడుకున్నదని, ఎక్కువ సమయం కూడా తీసుకుంటుందని తెలిపారు. అయితే తమ కొత్త యాప్ లోని సెన్సర్ ద్వారా బీర్ ఫర్ ఫ్యూరల్ శాతం, ఇతర నాణ్యతలను చాలా ఈజీగా తెలుసుకోవచ్చని చెబుతున్నారు. పాత బీరును పరీక్షించినపుడు, పసుపురంగు నుంచి పింక్ రంగుకు మారేలా ఈ సెన్సర్ డిస్క్ ను డిజైన్ చేశామని, దీని ద్వారా డాటాను స్వీకరించి, తద్వారా బీర్ తాజాదనాన్ని కొలవచ్చని పేర్కొన్నారు. కాంటాక్ట్ లెన్స్ లను తయారుచేయడానికి ఉపయోగించే పాలిమర్ నుంచి ఈ సెన్పర్లు తయారు చేసినట్టు తెలిపారు. ఈ డేటా అప్లికేషన్ ఓపెన్ సోర్స్ లో అందుబాటులో ఉందని, ఏ ప్రోగ్రామర్ అయినా దీన్ని తమకనుగుణంగా సవరించుకొని ఉపయోగించుకోవచ్చని చెప్పారు. అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో ఆ అప్లికేషన్ ఇపుడు అందుబాటులో ఉందని, త్వరలో ఆపిల్ ఫోన్లకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. ఎనలిటికల్ కెమిస్ట్రీ జర్నల్ ఇది ఈ పరిశోధన ప్రచురితమైంది. -
తాజాదనానికి 'సిల్క్' కోటింగ్!
వాషింగ్టన్ః పక్వానికి వచ్చిన కాయలు త్వరగా పండటానికి, పండ్లు మంచి రంగులో కనిపించడానికి వ్యాపారులు అనేక రసాయనాల వినియోగానికి పాల్పడుతుంటారు. అయితే అటువంటి రసాయనాల వల్ల శరీరానికి ఎంతో నష్టం కలుగుతుందని, కాల్షియం కార్బైట్ వంటి రసాయనాల వినియోగాన్ని నిషేధించాలని ఆందోళనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే పండ్లపై సిల్క్ కోటింగ్ వేస్తే ఫ్రీజర్ తో అవసరం లేకుండా వారం రోజులపాటు తాజాగా ఉంటాయంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. పండ్లపై కనిపించకుండా ఉండే బయో కంపాటిబుల్ సొల్యూషన్ పూస్తే, మృదువుగా ఉండే పండ్లు రిఫ్రిజిరేటర్ లో భద్రపరచాల్సిన అవసరం ఉండదని తాజా పరిశోధనల ద్వారా కనుగొన్నారు. సహజంగా తయారయ్యే సిల్క్ ద్రావణాన్ని వినియోగించి పండ్లను తాజాగా ఉంచుకోవచ్చంటున్నారు పరిశోధకులు. నీటి ఆధార ప్రక్రియతో సున్నితంగా ఉండే పండ్లను భద్రపరచుకోవడం, ఫ్రీజర్ వినియోగానికి ప్రత్యామ్నాయ మార్గమంటున్నారు. స్ఫటికరూపంలో ఉండే ఫైబ్రాయిన్ ప్రోటీన్ కలిగిన సిల్క్... ఇతర పదార్థాలను రక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని అధ్యయనకారులు చెప్తున్నారు. స్ట్రాబరీలపై వేసే సిల్క్ కోటింగ్ 27 నుంచి, 35 మైక్రాన్ల మందం ఉంటుందని, ఈ ప్రకియ అనంతరం స్ట్రాబరీలను సాధారణ గది ఉష్ణోగ్రతలో భ్రదపరచుకోవచ్చని చెప్తున్నారు. పూత వేసిన పండ్లను, వేయని వాటిని విడివిడిగా భద్రపరచి పరిశీలించారు. బీటా షీట్ సిల్క్ కోటింగ్ వేసిన పండ్లు సాధారణంగా నిల్వ ఉంచిన పండ్లకంటే తాజాగా, రసంతో ఉన్నట్లు గమనించారు. ఎడిబుల్ సిల్క్ ఫైబ్రాయిన్ కలిగిన బేటా షీట్ కోటింగ్ వల్ల పండ్లలో ఆక్సిజన్ తగ్గిపోకుండా ఉండి తాజాదనాన్ని మరింతకాలం పెంచుతుందని టఫ్ట్స్ యూనివర్శిటీ పరిశోధకులు ఫియోరెంజో తెలిపారు. ఇదే పద్ధతిని అరటిపండ్ల పై కూడ ప్రయోగించి చూశామని, సిల్క్ కోటింగ్ వేసిన పండ్లపై తొక్కలు ఎక్కువకాలం తాజాగా, మృదువుగా ఉండటాన్ని గమనించామని తెలిపారు. అయితే ఈ సిల్క్ పూత వల్ల పండ్ల ఆకారంలో ఎటువంటి మార్పులు రావని, అయితే పూత వేసిన అనంతరం రుచిలో తేడాలపై ఎటువంటి అధ్యయనాలు నిర్వహించలేదని పరిశోధకులు వివరించారు. సిల్క్ పూత పండ్లను సహజ పద్ధతిలో నిల్వ చేసేందుకుకే కాక, రసాయనాలతో పని లేకుండా ఎగుమతులకు కూడ ఉపయోగంగా ఉంటుందని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకుడు బెనెడెట్టో మారెల్లీ తెలిపారు. ఈ తాజా అధ్యయనాల వివరాలను జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్ లో నివేదించారు. -
కన్హయ్యపై మరో దేశద్రోహం కేసు!
మీరట్: జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ ను సమస్యలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఇప్పటికే దేశద్రోహం కేసులో జైలుపాలై, మధ్యంతర బెయిల్ పై బయటకొచ్చిన అతడిపై మరో కేసు నమోదైంది. భారత సాయుధ దళాలను అవమానించాడంటూ కన్హయ్యపై భజరంగ్ దళ్ కార్యకర్త ఫిర్యాదుతో అతడిపై తాజాగా మరో దేశద్రోహం కేసు దాఖలు చేశారు. ఈ నెల 28న కోర్టులో విచారణకు రానుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున కన్హయ్య కుమార్ భారత సైన్యానికి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేశాడని రైట్ వింగ్ కార్యకర్త హేమంత్ సింగ్ ఆరోపించారు. భారత సైనికులు కాశ్మీర్, ఈశాన్య ప్రాంతాల్లోని మహిళలపై అత్యాచారాలతో పాటు, దురాగతాలకు పాల్పడ్డారంటూ కన్హయ్య చేసిన వ్యాఖ్యలు దేశ వ్యతిరేక వ్యాఖ్యలుగా భావించి అతడిపై బులందర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్ళామని ఆయన తెలిపారు. అయితే అక్కడి పోలీసులు తమ ఫిర్యాదును స్వీకరించికపోవడంతో బులందర్ ఛీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించామని హేమంత్ సింగ్ తెలిపారు. సెక్షన్ 124-A (సెడిషన్) తో పాటు.. ఇండియన్ పీనల్ కోడ్ 153-B కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు. తమ స్టేట్ మెంట్ రికార్డు చేసేందుకు మార్చి 28న హాజరు కావాలని కోర్టు చెప్పిందని అన్నారు. ఈ సందర్భంలో తాను కోర్టుకు టెలివిజన్ లో ప్రసారమైన కన్హయ్య కుమార్ తప్పుడు వ్యాఖ్యల వీడియో క్లిప్పులను సమర్పించినట్లు తెలిపారు.