కొనసాగుతున్న రూపాయి దూకుడు
కొనసాగుతున్న రూపాయి దూకుడు
Published Thu, Aug 3 2017 11:31 AM | Last Updated on Sun, Sep 17 2017 5:07 PM
ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి డాలర్ మాకరంలో బాగా పుంజుకుంది. గురువారం 15పైసలు లాభపడి రూ.63.56 వద్ద మరోసారి రెండేళ్ల కనిష్టాన్నినమోదు చేసింది. 2015 ఆగస్ట్ నాటి స్థాయి వద్ద స్థిరంగా ఉంది. గ్లోబల్ గా డాలర్ బలహీనంగా ఉండడంతోపాటు, ఆర్‌బీఐ తాజా పాలసీ సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ రెపో, రివర్స్ రెపో రేట్లలో పావు శాతం కోత పెట్టడంతో మరింత ఊపందుకుంది. దీంతో వరుసగా మూడో రోజు కూడా రూపాయి దూకుడు చూపుతోంది.
ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో 4 పైసలు బలపడి 63.66 వద్ద మొదలైంది. ఇది బరింత బలపడి 63 స్థాయి వద్ద స్థిరంగా 63.62 వద్ద ట్రేడవుతోంది. నిన్నటి ర్యాలీ ద్వారా కీలక సాంతికేతిక స్థాయి రూ.64 దిగువన ముగిసినసంగతి తెలిసిందే. ఇటీవల ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ బలహీనపడుతూ రావడం రూపాయికి బలాన్నిచ్చినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ బాటలో డాలరు ఏడాదిన్నర కనిష్టానికి చేరగా.. కీలకమైన బ్యాంకులు, ఎగుమతి సంస్థలు డాలర్లను విక్రయిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అటు ఆర్‌బీఐ వడ్డీరేట్ల కోత ప్రభాతం ఈక్విటీ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్ 142 పాయింట్లు, నిప్టీ 40 పాయింట్లకు పైగా నష్టాలతో కొనసాగుతోంది.
Advertisement