
జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ)లో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు - కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం జరుగుతోంది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం 2025 - 26 బడ్జెట్‌లో సాధారణ రూపాయి చిహ్నానికి బదులుగా.. తమిళ చిహ్నంతో భర్తీ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కొత్త జాతీయ విద్యా విధానం ద్వారా 'హిందీ విధించడం'పై బీజీపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంతో.. అధికార డీఎంకే పోరాటం చేస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం రూపాయి చిహ్నం మార్చేసింది. ఈ మార్పుపై ఇప్పటివరకు తమిళనాడు ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. తమిళనాడు చర్య భారతదేశంలో ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా ఉందని బీజేపీ ప్రతినిధి అన్నారు.

అంతే కాకుండా తమిళంలో చదవడం, రాయడం వచ్చి ఉంటేనే.. తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని, మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది.
ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్ కార్ల కథ ముగిసినట్టే?.. ఈవీ పాలసీ 2.0 గురించి తెలుసా
తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ''హిందీ, సంస్కృత ఆధిపత్యం కారణంగా ఉత్తర భారతదేశంలో 25 కంటే ఎక్కువ స్థానిక భాషలు కనుమరుగయ్యాయి. శతాబ్దాల నాటి ద్రవిడ ఉద్యమం అవగాహన, నిరసనల ద్వారా తమిళం.. దాని సంస్కృతిని రక్షించింది" అని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment