
చెన్నై, సాక్షి: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై డీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా రూల్ తమిళనాడులో చెల్లదంటూ ప్రత్యక్షంగా విమర్శలు గుప్పించారు. విభజించు పాలించు సిద్ధంతం ఇక్కడ పని చేయదు. తమిళనాడు ఏనాటికీ ఢిల్లీ నియంత్రణలోకి వెళ్లబోదు అంటూ వ్యాఖ్యానించారు.
నీట్, జాతీయ విద్యా విధానం విషయంలో కేంద్రానికి, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య నడుస్తున్న వైరం సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తాజాగా అక్కడి రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీతో అన్నాడీఎంకే చేతులు కలపడంతో వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
