Tamil Nadu CM
-
నీట్ ఒక కుంభకోణం: ఎంకే స్టాలిన్
చెన్నై: మెరిట్‌కు కొలమానంగా పేర్కొంటున్న నీట్ ఒక కుంభకోణం, ఈ పరీక్ష పేద విద్యార్థుల ప్రయోజనాలకు, సామాజిక న్యాయానికి విరుద్ధమని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. ఇటువంటి విధానం అమలును నిలిపివేయాలని ఆదివారం ఆయన ‘ఎక్స్’లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ‘నీట్ చుట్టూ ముసురుకున్న వివాదాలు, ఈ విధానంతో జరుగుతున్న అన్యాయాన్ని చెప్పకనే చెబుతోంది. సమాజంలో అణగారిన వర్గాల విద్యార్థుల అభ్యున్నతికి మరిన్ని దారులు తెరవడానికి బదులుగా వారికి నీట్ అవకాశాలను దూరం చేస్తోంది’అని ఆరోపించారు. ‘కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎన్టీఏను సమరి్థస్తున్నప్పటికీ వాస్తవం మరోలా ఉంది. గుజరాత్లో ఓఎంఆర్ షీట్లను ట్యాంపర్ చేసినట్లుగా వచ్చిన ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదంతా ఓ కుట్ర. నీట్ కోచింగ్ సెంటర్లు, ఫిజిక్స్ ఉపాధ్యాయుడు, ఓ స్కూల్ ప్రిన్సిపల్‌కు ఇందులో హస్తముంది. ఈ వ్యవస్థను మార్చాల్సిన అవసరముంది’అని స్టాలిన్ పేర్కొన్నారు. -
ఎన్నికల ముందు ఎందర్ని జైల్లో వేస్తారు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: తమిళనాడు సీఎం స్టాలిన్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో సత్తై దురై మురుగన్ అనే యూట్యూబర్‌కు బెయిల్‌ను సుప్రీంకోర్టు పునరుద్ధరించింది. ‘‘యూట్యూబ్‌లో ఆరోపణలు చేశారంటూ ఎన్నికల వేళ ప్రతి ఒక్కరినీ జైళ్లలో వేయడం ప్రారంభిస్తే ఎందరు కటకటాల పాలవుతారో ఊహించండి’’ అని జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. నిరసన తెలపడం, అభిప్రాయాల వ్యక్తీకరణ ద్వారా స్వేచ్ఛను దుర్వినియోగపరిచినట్లుగా భావించరాదని పేర్కొంది. స్టాలిన్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు ఆపడం లేదన్న ఫిర్యాదుపై మద్రాస్ హైకోర్టు బెయిల్ రద్దు చేయడంతో మురుగన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ఉమ్మడి గళం వినిపిద్దాం
చెన్నై/న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దె దించేందుకు ఉమ్మడిగా పోరాడాల్సిందేనని డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుండబద్దలు కొట్టారు. విపక్ష పార్టీలు కూటమి కట్టకుండా విడిగా పోటీ చేస్తే ఎలాంటి లాభం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో మళ్లీ సామాజిక న్యాయం, సమైక్యత, సోదరభావం, సమానత్వం సాధించాలంటే విపక్ష పార్టీలన్నీ ఉమ్మడిగా పోరాడాలని పిలుపునిచ్చారు. డీఎంకే ఆధ్వర్యంలో ఆన్లైన్ వేదికగా హైబ్రిడ్మోడ్లో సోమవారం తొలి ‘సామాజిక న్యాయ సదస్సు’ జరిగింది. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, నేషనల్ కాన్ఫెరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, తృణమూల్ కాంగ్రెస్ నేత డిరెక్ ఒబ్రియన్, ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్, ఎన్సీపీ, ఐయూఎంఎల్, బీఆర్ఎస్, ఎండీఎంకే, ఆర్ఎస్పీ, ఎల్ఎస్పీ, వీసీకే తదితర పార్టీల నేతలు పాల్గొని ప్రసంగించారు. అన్ని పార్టీలను ఏకతాటి మీదకు తేవడం అత్యంత ప్రధానమైన విషయమని స్టాలిన్ అన్నారు. ‘‘ఇది కొన్ని రాష్ట్రాలకే పరిమితం కాకూడదు. దేశవ్యాప్తంగా సాకారం కావాలి. అందరం కలసి పోరాడదాం’’ అని పిలుపునిచ్చారు. ‘‘కేంద్రం ఏ హేతుబద్ద ప్రమాణాల ఆధారంగా 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటా అమలుచేస్తోంది? ఇది సామాజిక న్యాయం అనిపించుకోదు’’ అన్నారు. దేశవ్యాప్త కులగణన: తేజస్వి వెనకబడిన కులాలకు రిజర్వేషన్ ఫలాలు దక్కాలంటే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాల్సిందేనని తేజస్వీ యాదవ్ స్పష్టం చేశారు. ‘‘బిహార్‌లో మహాఘట్బంధన్ సర్కార్ ఈ దిశగా ఇప్పటికే అడుగేసింది. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో ఓబీసీలకు అదనపు రిజర్వేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. కానీ గవర్నర్లు మోకాలడ్డుతున్నారు’ అని ఆరోపించారు. సామాజిక న్యాయ రాజకీయాలతో బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కొందామని అన్నారు. దేశవ్యాప్త కులగణన డిమాండ్‌కు విపక్ష నేతలంతా మద్దతు పలికారు. విడివిడిగా ఎలాంటి లాభం ఉండదు: డీఎంకే చీఫ్ స్టాలిన్ ‘సామాజిక న్యాయ’ తొలి సదస్సులో పాల్గొన్న విపక్ష నేతలు -
మావటీల జీవితాల్లో వెలుగు తెచ్చారు
‘నాకు అడివింటే చాలా భయం’ అంటుంది బెల్లి. ఆస్కార్ వచ్చిన ‘ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీ లో మావటి బొమ్మన్ భార్య ఆమె. భర్తతో కలిసి రఘు అనే పిల్ల ఏనుగును ఆమె సాకుతుంది. దాంతోపాటు ‘అమ్ము’ అనే ఇంకో పిల్ల ఏనుగు బాగోగులను బెల్లి చూస్తుంది. బొమ్మన్ ప్రభుత్వ ఉద్యోగి. బెల్లి కాదు. అయినా సరే భర్త డ్యూటీలో ఆమె భాగం పంచుకుంది. భర్తతో పాటే పసి ఏనుగులను చూసుకుంది. ‘నా భర్తను పులి చంపింది. అప్పటి నుంచి అడివంటే భయం. బొమ్మన్‌ను చేసుకున్నాక కొంచెం భయం పోయింది. పిల్ల ఏనుగుల బాగోగుల్లో పడ్డాక, వాటి వెంట తిరుగుతుంటే అడివంటే భయం పోయింది’ అంటుంది బెల్లి. నీలగిరి (ఊటీ) అడవుల్లో ఉండే ఎలిఫెంట్ క్యాంపుల్లో ఏనుగుల సంరక్షణ మావటీలు చూస్తారు. వీళ్లంతా దాదాపు ఆ ప్రాంత గిరిజనులే. ఏనుగులను చూసుకోవడం మగవారి పనే. అయితే బొమ్మన్ చూసేది పిల్ల ఏనుగులను కనుక వాటి అమాయకత్వానికి ముగ్ధురాలై అమ్ము కూడా వాటితో అనుబంధం పెంచుకుంటుంది. ఆమెకు రఘు, అమ్ము ఎంత మాలిమి అంటే డాక్యుమెంటరీలో అమ్మును పిలిచి ‘ఏయ్... నా ఒడిలో కాదు. పక్కన పడుకో. లేకుంటే దెబ్బలు పడతాయి’ అనంటే ఆ ఏనుగు ఆమె పక్కన మెల్లగా ఒత్తిగిలి పడుకోవడం ముచ్చట గొలుపుతుంది. అమ్ముకు బెల్లి రెండు జడలు వేసి నవ్వుకుంటూ ఉన్నప్పుడు ఈ డాక్యుమెంటరీ ముగుస్తుంది. అయితే బొమ్మన్ వల్ల, అమ్ము వల్ల, ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించిన కార్తికి వల్ల దేశంలో ఇప్పుడు ఏనుగుల సంరక్షణ గురించి చర్చలు జరుగుతున్నాయి. తమిళనాడు సి.ఎం స్టాలిన్ వెంటనే స్పందించి బొమ్మన్, బెల్లిలను పిలిచి చెరొక లక్ష డబ్బు ఇచ్చి సన్మానం చేశారు. తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న 91 మంది మావటీలకు కూడా మనిషికో లక్ష ఇవ్వనున్నారు. వీరి నివాసాల కోసం 9 కోట్లు మంజూరయ్యాయి. అలాగే ఏనుగుల క్యాంపుల కోసం 13 కోట్లు మంజూరయ్యాయి. ప్రేమ, ఆదరణల వల్ల ఎప్పుడూ మంచే జరుగుతుంది. బొమ్మన్, బెల్లిలతో అది మరోసారి రుజువయ్యింది. -
నటి వాణిశ్రీని పెద్ద సమస్య నుంచి గట్టెక్కించిన తమిళనాడు సీఎం స్టాలిన్
చెన్నై: నటి వాణిశ్రీకి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అండగా నిలిచారు. ఓ పెద్ద సమస్య నుంచి ఆమెను గట్టెక్కించారు. నటి వాణిశ్రీకి చెందిన స్థలాన్ని కొందరు కబ్జా చేశారు. ఆ స్థలం విలువ దాదాపుగా రూ.20 కోట్లు. ఈ విషయాన్ని తెలుసుకున్న సీఎం ఎం.కె.స్టాలిన్, తమిళనాడు ప్రభుత్వం.. వాణిశ్రీ భూమిని కబ్జా కోరల్లో నుంచి విడిపించారు. చదవండి: బన్రూటితో బంతాట.. పదవి నుంచి తప్పించిన పళణి స్వామి! సదరు భూమి పత్రాలను వాణిశ్రీకి స్టాలిన్ అప్పగించారు . ఇదే సందర్భంలో నకిలీ పత్రాలు, వ్యక్తుల ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తే దాన్ని రద్దు చేసే అధికారాన్ని కలిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తమిళనాడు ప్రభుత్వం. తన భూమిని తనకు అప్పగించిన స్టాలిన్ సాయానికి వాణిశ్రీ ధన్యవాదాలు తెలియచేశారు. -
విద్య, వైద్యంపై ఖర్చు ‘ఉచితాలు’ కావు.. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్
చెన్నై: ఆరోగ్యం, విద్యారంగాలపై ప్రభుత్వాలు చేసే వ్యయం ఉచితాలు కిందికి రాదని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. ఈ రెండింటిపై చేసే పథకాలు పేదలకు ఎంతో మేలు చేసేవేనన్నారు. ఉచిత పథకాలు దేశాభివృద్ధికి ప్రతిబంధకాలంటూ ఇటీవల ప్రధాని మోదీ వ్యాఖ్యానించడం, దీనిపై ఢిల్లీ సీఎం కేజ్రివాల్, కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించడం తెలిసిందే. శనివారం కొలత్తూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో స్టాలిన్ కూడా ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉచితాలు, సంక్షేమ పథకాలు వేర్వేరని అంటూ ఆయన..ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే రాజకీయం అవుతుందని పేర్కొన్నారు. ‘విద్య, వైద్యంపై చేసే వ్యయం ఉచితాల కిందికి రాదు. ఎందుకంటే విద్య జ్ఞానసముపార్జనకు, వైద్యం ఆరోగ్యానికి సంబంధించినది. మా ప్రభుత్వం ఈ రెండు రంగాల్లో సంక్షేమ పథకాలను అమలు చేయాలనుకుంటోంది. ఇవి ఉచితాలు కావు. సంక్షేమ పథకాలు. ఉచితాలు ఉండకూడదంటూ ఇటీవల కొందరు కొత్తగా సలహాలిస్తున్నారు. దాన్ని మేం పట్టించుకోం. కానీ, ఎక్కువ మాట్లాడితే రాజకీయం అవుతుంది. కాబట్టి, దీనిపై మరింతగా మాట్లాడదలుచుకోలేదు’అంటూ ముగించారు. -
MK Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్‌కు కరోనా
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(69) కరోనా బారిన పడ్డాడు. కోవిడ్-19 నిర్ధారణ కావడంతో ఐసోలేషన్లోకి వెళ్లారు ఆయన. స్టాలిన్‌కు తీవ్ర అలసట, జ్వరం లక్షణాలు ఉన్నట్లు తమిళనాడు సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో ప్రజలంతా మాస్క్‌లు ధరించాలని, వ్యాక్సినేషన్లో పాల్గొని జాగ్రత్తగా ఉండాలని ట్విటర్ ద్వారా సీఎం స్టాలిన్ పిలుపు ఇచ్చారు. తమిళనాడు గత కొంతరోజులుగా.. కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్, సబ్ వేరియెంట్స్ కారణంగానే కేసులు పెరిగిపోతున్నాయని తమిళనాడు వైద్య శాఖ చెబుతోంది. సుమారు 2వేలకు పైనే కొత్త కేసులు నమోదు అవుతున్నాయి తమిళనాడులో. இன்று உடற்சோர்வு சற்று இருந்தது. பரிசோதித்ததில் #COVID19 உறுதிசெய்யப்பட்டதையடுத்து தனிமைப்படுத்திக் கொண்டுள்ளேன். அனைவரும் முகக்கவசம் அணிவதோடு, தடுப்பூசிகளைச் செலுத்திக் கொண்டு, பாதுகாப்பாய் இருப்போம். — M.K.Stalin (@mkstalin) July 12, 2022 -
సీఎంను కలిసిన నయనతార.. పెళ్లిపై లవ్‌బర్డ్స్ క్లారిటీ
Nayanthara Vignesh Wedding: సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా కీర్తి గడించింది నయనతార. ఆమె ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారన్న వార్తలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. దక్షిణాదిన వీరిద్దరి పెళ్లి హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ పెళ్లి వార్తలు నిజమేనని ఈ జంట తాజాగా స్పష్టం చేసింది. శుక్రవారం (జూన్ 3) సాయంత్రం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసిన ఈ లవ్ బర్డ్స్ తమ వెడ్డింగ్ ఇన్విటేషన్‌కు అందజేసింది. తమ వివాహానికి హాజరు కావల్సిందిగా కోరారు. వారిని అభినందించిన సీఎం స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపారు. స్టాలిన్‌తో పాటు ఆయన కుమారుడు హీరో, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ కూడా ఉన్నాడు. దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న నయనతార, విఘ్నేష్ శివన్‌ల నిశ్చితార్తం కుటుంబసభ్యుల సమక్షంలో గతేడాది జరిగింది. తాజాగా మహాబలిపురంలోని మహబ్ హోటల్లో జూన్ 9న వీరి పెళ్లి వేడుక జరగనుంది. ఈ వివాహానికి బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నట్లు సమాచారం. ఇప్పటికే కొందరు గెస్ట్‌లకు 'డిజిటల్ వీడియో ఇన్విటేషన్ కార్డ్' పంపించినట్లు తెలుస్తోంది. కాగా వీరి పెళ్లి తిరుమలలో జరగుతుందని అంతా అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో మహాబలిపురంలోని మహబ్ హోటల్లో హిందూ సాంప్రదాయాల ప్రకారం నయన్, విఘ్నేష్ వివాహం జరగనుంది. అయితే ఇదే వేదికపై జూన్ 8న సాయంత్రం సౌత్ ఇండియా సినీ పరిశ్రమలోని ప్రముఖులు, రాజకీయవేత్తల మధ్య రిసెప్షన్ గ్రాండ్‌గా నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ రిసెప్షన్‌కు రజనీ కాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, సూర్య, కార్తీ, శివకార్తికేయన్, విజయ్ సేతుపతికి ఆహ్వానం అందినట్లు టాక్. చదవండి: కాస్ట్లీ గిఫ్ట్‌తో సమంతను సర్ప్రైజ్ చేసిన నయనతార -
నేను ఏర్పాటు చేస్తున్న ‘సమాఖ్య’లోకి రండి: ఎంకే స్టాలిన్
సాక్షి ప్రతినిధి, చెన్నై: నిర్లక్ష్యానికి గురవుతున్న వెనుకబడిన సామాజికవర్గాల సంక్షేమం కోసం తాను ఏర్పాటు చేస్తున్న అఖిల భారత సామాజిక సమాఖ్యలో భాగస్వాములు కావాలని జాతీయ, ప్రాంతీయ పార్టీల అధినేతలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్తో పాటు దేశంలోని 37 పార్టీలకు బుధవారం ఈ మేరకు ఆయన లేఖ రాశారు. జాతీయ స్థాయిలో పార్టీలన్నీ సహకరిస్తేనే సామాజిక న్యాయం సాధ్యమని అందులో పేర్కొన్నారు. గత నెల 26న గణతంత్ర దినోత్సవం వేడుకల రోజు స్టాలిన్ ఈ సమాఖ్య ఏర్పాటును ప్రకటించడం తెలిసిందే. మతోన్మాదం, మతపరమైన ఆధిపత్యంతో మన దేశ ప్రత్యేకమైన, వైవిధ్యమైన, బహుళ-సాంస్కృతిక సమాఖ్యకు ముప్పు వాటిల్లిందని లేఖలో స్టాలిన్ పేర్కొన్నారు. సమానత్వం, ఆత్మగౌరవం, సామాజిక న్యాయంపై విశ్వాసం ఉన్నవారంతా ఏకమైతేనే ఈ శక్తులతో పోరాడగలమని అభిప్రాయపడ్డారు. ఈ లక్ష్యాలను సాధించేందుకు కలిసికట్టుగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మండల్ కమిషన్‌ను ఏర్పాటు చేయడానికి ఏవిధంగా పోరాటం చేశామో.. అదే విశ్వాసం, ధ్యేయంతో ఏకం కావాలని పిలుపునిచ్చారు. (క్లిక్: 'సీఎం సార్ హెల్ప్ మీ'.. వెంటనే కారు ఆపి..) -
శ్రీలంక నేవీ అదుపులో 55 మంది తమిళ జాలర్లు
రామేశ్వరం: తమిళనాడుకు చెందిన 55 మంది జాలర్లతోపాటు 8 మర పడవలను శ్రీలంక నావికాదళం ఆదివారం అదుపులోకి తీసు కుంది. ఈ నెల18న రామేశ్వరం నుంచి కట్చ తీవు దీవికి 500 బోట్లలో వెళ్లిన మత్స్య కారుల్లో 43 మందిని, 6 బోట్లను శ్రీలంక నేవీ అదుపులోకి తీసుకుందని మత్స్యశాఖ తెలిపిం ది. తమిళ మత్స్యకారులపై శ్రీలంక నేవీ దౌర్యన్యాలు ఎక్కువయ్యాయని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆరోపించారు. జాలర్లందరినీ వెంటనే విడిపించాలని, ఇప్పటి వరకు శ్రీలంక ఆధీనంలో ఉన్న మొత్తం 73 పడవలను విడుదల చేయించాలని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ను కోరారు. తమ వారిని విడు దల చేసే వరకు నిరాహార దీక్ష చేపడతామని మత్స్యకారుల సంఘం హెచ్చరించింది. -
తమిళనాడు సీఎం పూర్వీకులు ఎక్కడి వారో తెలుసా..?
ఒంగోలు(ప్రకాశం జిల్లా): తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ మూలాలు ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. ఆయన పూర్వీకులు ఒంగోలు నగర పరిధిలోని పెళ్లూరులోని వెంకటగిరి రాజుల ఆస్థాన పరిధిలోని దేవాలయాలకు ఆస్థాన విద్యాంసులుగా పని చేస్తుండేవారు. ఈ క్రమంలోనే వారికి అక్కడికి అతి సమీపంలోని ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెంలో 150 ఎకరాల భూమిని, పెళ్లూరు చెరువు కింద 20 ఎకరాల మాగాణి భూమిని, చెరువుకొమ్ముపాలెంలో నివాసం ఉండేందుకు భూమిని ఇచ్చినట్లుగా ఆ గ్రామస్తులు పేర్కొంటున్నారు. వెంకటగిరి రాజుల వారసులు ఇప్పటికీ ఈ గ్రామంలో ఉన్నారు. వారు మాత్రం డీఎంకే అధినేత, దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి తాతల కాలంలోనే పంటలు పండక కరువు కాటకా వల్ల చెన్నపట్నంకు వలస వెళ్ళినట్లు తమ పూర్వీకులు చెబుతుండేవారని పేర్కొంటుంటారు. అయితే అలా వెళ్ళిన కరుణానిధి చివరకు ముఖ్యమంత్రిగా ఒక వెలుగు వెలగడం తమ గ్రామానికి గొప్పతనంగా వారు చెబుతుంటారు. భూములు ఇప్పటికీ ఉన్నా వారు ఎప్పుడు కూడా వచ్చిన దాఖలాలు లేవని చెబుతూ కరుణానిధి కుమారుడు మరలా స్టాలిన్ సీఎం కావడం తమకు గర్వంగా ఉందని పేర్కొంటున్నారు. కరుణానిధి ఏలూరులో జరిగిన ఒక సాహిత్య సభలో ఈ అంశాన్ని ప్రస్తావించాడని, ఒంగోలులో జరిగే సాహిత్య సభకు కూడా త్వరలోనే వస్తానని చెప్పారని, స్టాలిన్‌ను కూడా ఒకసారి జిల్లాకు రావాలని కోరడం జరిగిందని, అయితే ఆయన రాలేకపోయారంటూ నాయీ బ్రాహ్మణులు పేర్కొంటున్నారు. ఏదేమైనా తెలుగువాడు, అందులోను మన ఒంగోలు వాసి తమిళనాట మరో సీఎం కావడం జిల్లావాసులకు కూడా గర్వ కారణంగానే చెప్పవచ్చు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: తమిళనాడు సీఎంగా స్టాలిన్ రంగస్వామి రికార్డు.. పుదుచ్చేరి సీఎంగా నాలుగో సారి -
తమిళనాడు సీఎం విజయ్..!
చెన్నై, పెరంబూరు: తమిళనాడు సీఎం నటుడు విజయ్. ఏమిటీ ఆశ్చర్య పోతున్నారా? ఇదేంటీ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాటి పళనిసామి కదా..? నటుడు విజయ్ అంటారేమిటీ అని అనుకుంటున్నారా? మనందరికీ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాటి పళనిసామినే. అయితే నటుడు విజయ్ అభిమానులకు మాత్రం ఆమనే సీఎం. విజయ్‌కు తమిళనాడు దాటి ఇతర రాష్ట్రాల్లోనే కాదు విదేశాల్లోనూ అభిమాన గణం భారీగానే ఉన్నారన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా తమిళనాడులో విజయ్ను ఆయన అభిమానులు ముఖ్యమంత్రిగా చూడాలని కలలు కంటుంటారు. ఆయన అభిమానులు ఏదోవిధంగా విజయ్ను ముఖ్యమంత్రిగా చిత్రీకరిస్తూ వార్తల్లోకి వెక్కడంతో పాటు ఆయనకు రాజకీయ రంగప్రవేశం గురించి గుర్తు చేస్తూనే ఉంటున్నారు. అలా మరోసారి తమిళనాడు సీఎం విజయ్ అంటూ పోస్టర్లను ప్రింట్ చేసి ప్రచారం చేస్తున్నారు. ఆ పోస్టర్లో ట్యాగ్‌లా కలెక్షన్ మాస్టర్ అని పేర్కొన్నారు. ఈ పోస్టర్లు మరోసారి విజయ్ను వార్తల్లోకి నెడుతున్నాయి. -
జైలుపక్షి చేతిలో కీలుబొమ్మ సీఎం అయ్యారు
చెన్నై: వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో పేరొందిన సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే చీఫ్ శశికళను జైలుపక్షిగా సంబోధిస్తూ.. ఆమె చేతిలో కీలుబొమ్మగా పళనిస్వామిని అభివర్ణించారు. తమిళులు పళనిస్వామిని ముఖ్యమంత్రిగా అంగీకరించడాన్ని తప్పుపడుతూ, ఇది అవమానకరమని అన్నారు. కట్జూ తమిళులను ఉద్దేశిస్తూ రాసిన బహిరంగ లేఖను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. 'జైలుపక్షికి కీలుబొమ్మ తమిళనాడు సీఎం అయ్యారు. మీరు ఈ విషయంలో ఏం చేయలేకపోయారు. మీరు మహావీరులైన చోళులు, పాండ్యుల సంతతికి చెందినవారు. తిరువళ్లువర్, ఇళంగో, కంబార్, అండాల్, సుబ్రహ్మణ్య భారతి వారసులు. మీ పూర్వీకులు మిమ్మల్ని చూసి సిగ్గుపడే పరిస్థితి రాకూడదు. నేను తమిళుడని చెప్పేందుకు గర్వంగా భావిస్తాను. ఇప్పుడు ఈ ముఖంతో ఎలా చెప్పగలను? ముఖ్యమంత్రిగా పళనిస్వామి కొనసాగడం తమిళులకు కళంకం. ఆయన పదవిలో ఉంటే నేను తమిళుడిగా ఉండలేను. అవమానంతో, అగౌరవంతో బతకరాదు. దీనికంటే చావడం మేలు' అని కట్జూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. -
పళనికే పీఠం
► సీఎంగా రైతు బిడ్డ ► చిన్నమ్మ సేనల్లో సంబరాలు ► బెల్లం మండి నుంచి సీఎంగా.. ► నా కొడుకు ప్రజలు మెచ్చే పాలన అందిస్తాడు ► సీఎం పళనిస్వామి తల్లి ఆనందం బలపరీక్షలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఎడపాడి కే పళనిస్వామికే సీఎం పీఠాన్ని అప్పగించారు. రైతు బిడ్డగా, బెల్లం మండితో బతుకు జీవన పయనంలో అడుగు పెట్టిన పళనిస్వామి సీఎంగా అవతరించడంతో స్వగ్రామం ఎడపాడిలో సంబరాలు అంబరాన్ని తాకాయి. చిన్నమ్మ సేనల్లో ఆనందం తాండవం చేసింది. తన కొడుకు ప్రజలు మెచ్చే పాలనను అందిస్తాడని పళనిస్వామి తల్లి తవసాయమ్మాల్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమిళనాడుకు 13వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడమే కాకుండా, బల నిరూపణలో మెజారిటీ నిరూపించుకున్న పళనిస్వామి జీవిత ఇతివృత్తాంతంలోకి వెళ్తే.. సాక్షి, చెన్నై : సేలం జిల్లా ఎడపాడి సమీపంలోని నెడుంకుళం గ్రామం శిలువం పాళయంకు చెందిన కరుప్ప గౌండర్, తవ సాయమ్మాల్ దంపతుల చిన్న కుమారుడు పళనిస్వామి(63). చదువు మీద మక్కువ ఎక్కువే. ప్రాథమిక విద్యాభ్యాసం కోసం నాలుగు కిలో మీటర్లు రోజు నడక పయనం సాగించారు. ఇక, ఉన్నత చదువుగా ఈరోడ్‌లోని ఓ కళాశాలలో బీఎస్సీ(పూర్తి కాలేదు) చేశారు. గౌండర్ సామాజిక వర్గానికి చెందిన పళనిస్వామి తన తండ్రి చూపిన మార్గంలో వ్యవసాయంతో పాటు బెల్లం మండితో జీవన పయనాన్ని సాగిం చారు. దాయాదుల సమరాన్ని ఎదుర్కొనేందుకు తీవ్రంగానే ప్రయత్నించి, నెత్తిన కేసుల మోత వేసుకున్నారు. ఆధారాల కరువుతో ఆ కేసుల నుంచి బయట పడ్డారు. భార్య రాధా, కుమారుడు మిథున్‌లతో కలిసి ఓ వైపు బెల్లం మండిని ముందుకు తీసుకెళ్తూ, మరో వైపు నాగలి పట్టి పొలం పనుల్లో నిమగ్నం అయ్యారు. తన పొలం పక్కనే అప్పటి మంత్రి ఈరోడ్ ముత్తు స్వామి పొలం ఉండడంతో ఆయన అడుగు జాడల్లో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. తొలుత శిలువం పాళయం గ్రామ పార్టీ కార్యదర్శి అయ్యారు. 1986లో జరిగిన స్థానిక ఎన్నికల్లో నెడుంకుప్పం పంచాయతీ యూనియన్ అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సెంగోట్టయన్ మద్దతుదారుడిగా : ఎంజీయార్ మరణంతో ఆ పార్టీలోచోటు చేసుకున్న పరిణామాలు పళని స్వామికి రాజకీయంగా బలాన్ని పెంచాయి. ఈరోడ్, సేలం, నామక్కల్ జిల్లాల్లో అన్నాడీఎంకేకు కీలక నేతగా ఉన్న సెంగోట్టయన్ తీవ్ర మద్దతు దారుడిగా అమ్మ జయలలిత శిబిరంలో చేరారు. సెంగోట్టయన్ వెన్నంటి నడిచారు. జయలలిత నమ్మిన బంటుల్లో ఒకరిగా రాష్ట్ర రాజకీయాలపై సెంగోట్టయన్ దృష్టి పెట్టగా, ఆయన మద్దతు సేలం జిల్లా రాజకీయాల్లో పళనిస్వామి చక్రం తిప్పారు. ఈ సమయంలో అమ్మ సెంగోట్టయన్‌ను దూరం పెట్టడం పళని స్వామికి మరింతగా కలిసి వచ్చింది. సెంగోట్టయన్ స్థానాన్ని భర్తీ చేసే రీతిలో అప్పట్లో చిన్నమ్మ శశికళ పావులు కదిపారన్న ప్రచారం ఉంది. ఇందుకు అద్దం పట్టే పరిణామాలు తాజాగా చోటు చేసుకున్నాయి. చిన్నమ్మకు విధేయుడిగా ఉంటూ వచ్చిన పళని స్వామిని ప్రస్తుతం సీఎం పదవి వరించడం గమనార్హం. సంబరాల్లో చిన్నమ్మ సేన : బల పరీక్షలో పళనిస్వామి నెగ్గడంతో చిన్నమ్మ సేనల్లో ఆనందం తాండవం చేసింది. ఎక్కడికక్కడ బాణసంచా పేల్చుతూ , స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకున్నారు. పుదియ పురట్చి తలైవీ( నవ విప్లవ నాయకీ) చిన్నమ్మ , త్యాగ తలైవీ( త్యాగ నాయకీ) చిన్నమ్మ వర్ధిల్లాలన్న నినాదాన్ని మార్మోగించారు. చిన్నమ్మ శపథం నెరవేరిందన్న ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, రోడ్ల మీద ఆనంద తాండవం చేశారు. పళని స్వామి స్వగ్రామం ఎడపాడిలో అయితే, ఆనందానికి అవధులు లేవు. పశ్చిమ తమిళనాడులోని (కొంగు మండలం) ధర్మపురి, కృష్ణగిరి, సేలం, నామక్కల్, తిరుప్పూర్, ఈరోడ్, కోయంబత్తూరుల్లో అయితే, చిన్నమ్మ వర్గీయుల్లో ఆనందం రెట్టింపు అయింది. కొంగు మండలానికి చెందిన రైతు బిడ్డ సీఎం కావడంతో తమ ప్రాంతాలకు మహర్ధశ పట్టినట్టే అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సుపరి పాలన : తన కొడుగు బల పరీక్షలో నెగ్గడంతో పళని స్వామి తల్లి తవసాయమ్మాల్ ఆనందం వ్యక్తం చేశారు. ఎంజీఆర్, జయలలిత చూసిన మార్గంలో ప్రజలకు మంచి పాలనను అందిస్తాడన్నారు. కష్టపడి పైకి వచ్చాడని, కష్టం అంటే ఏమిటో తెలిసిన వాడు కాబట్టి, ప్రజలు మెచ్చే విధంగా మంచి పనులు తప్పకుండా చేస్తాడని తెలిపారు. పళని పయనంలో కొన్ని ఘట్టాలు: ♦ 1989లో కోడిపుంజు చిహ్నంతో ఎడపాడి నుంచి గెలిచి అసెంబ్లీ మెట్లు ఎక్కారు. ♦ 1991లో అన్నాడిఎంకే రెండాకుల చిహ్నంతో అదే నియోజకవర్గం నుంచి మరో సారి గెలుపు. ♦ 1992 –1996 వరకు ఆవిన్ సంస్థ అధ్యక్షుడు. ♦ 1996 ఎన్నికల్లో ఎడపాడి నుంచి ఓటమి ♦ 1998 లోక్ సభ ఎన్నికల్లో తిరుచ్చంగోడు నుంచి తొలి సారిగా పార్లమెంట్‌కు ఎన్నిక ♦ 1999లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి ఓటమి ♦ 1999–2004 వరకు తమిళనాడు సిమెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడు ♦ 2006 అసెంబ్లీ ఎన్నికల్లో ఎడపాడి నుంచి ఓటమి ♦ 2011లో అసెంబ్లీ ఎడపాడి నుంచి గెలుపు. తొలి సారిగా రాష్ట్ర రహదారుల శాఖ మంత్రి పదవి. ఒకే నియోజకవర్గం నుంచి గెలుస్తూ రావడంతో కే పళని స్వామి కాస్త ఎడపాడి కే పళని స్వామి అయ్యారు. ♦ 2016 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు. ప్రజా పనులు, రహదారులు, చిన్న హార్బర్ల శాఖ కేటాయింపు ♦ 2017 ఫిబ్రవరి 14 అన్నాడిఎంకే శాసన సభా పక్ష నేతగా ఎన్నిక ♦ 2017 ఫిబ్రవరి 16 తమిళనాడు 13వ సీఎంగా ప్రమాణ స్వీకారం. ♦ 2017 ఫిబ్రవరి 18 బల పరీక్షలో విజయ కేతనంతో సీఎం పీఠం పదిలం. -
పళనితో గవర్నర్ ప్రమాణ స్వీకారం
-
పళనితో గవర్నర్ ప్రమాణ స్వీకారం
చెన్నై: తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా ఎడప్పాడు పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం సాయంత్రం రాజ్ భవన్ లోని దర్బారు హల్ లో జరిగిన కార్యక్రమంలో పళనిస్వామితో గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు ప్రమాణం చేశారు. తర్వాత మంత్రులందరితో ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా జయలలిత, చిన్నమ్మకు మద్దతుగా అన్నాడీఎంకే నేతలు నినాదాలు చేశారు. అమ్మ.. అమరహే, చిన్నమ్మకు జై అంటూ నినదించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శశికళ శిబిరం ఎమ్మెల్యేలు, మద్దతుదారులు హాజరయ్యారు. -
చిన్నమ్మకు పెద్ద సవాల్
-
ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం భేటీ
న్యూఢిల్లీ: జల్లికట్టు నిర్వహణకు అనుమతి ఇవ్వాలని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఇందుకోసం ఆర్డినెన్స్ జారీ చేయాలని విన్నవించారు. ఢిల్లీలో గురువారం ప్రధాని మోదీని ఆయన నివాసంలో పన్నీరు సెల్వం కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. జల్లికట్టు నిర్వహణ కోసం తమిళనాడులో ఆందోళనలు తీవ్రమైన నేపథ్యంలో ఆయన ప్రధానితో సమావేశమయ్యారు. అనంతరం పన్నీరు సెల్వం మీడియాతో మాట్లాడుతూ.. జల్లికట్టుపై నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని ప్రధాని మోదీని కోరామని చెప్పారు. కేంద్రం ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని, జల్లికట్టు తమిళ సంప్రదాయంలో ఓ భాగమని అన్నారు. జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని తమిళనాడులో వరుసగా మూడో రోజు ఆందోళనలు చేపట్టారు. ఇందుకు మద్దతుగా విద్యా సంస్థలు సెలవులు ప్రకటించాయి. సినిమా షూటింగ్‌లను రద్దు చేశారు. ఈ రోజు చెన్నై మెరీనా బీచ్‌లో వేలాదిమంది విద్యార్థులు ఆందోళనలో పాల్గొన్నారు. తమిళులు సంప్రదాయ క్రీడగా భావించే జల్లికట్టును సంక్రాంతి సందర్భంగా నిర్వహిస్తారు. అయితే సుప్రీం కోర్టు దీనిపై నిషేధం విధించింది. తమిళనాడులో ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని పార్టీలకతీతంగా జల్లికట్టుకు మద్దతు ఇస్తున్నారు. సినీ ప్రముఖులు కూడా సంఘీభావం తెలిపారు. -
ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం భేటీ
-
మూగబోయిన టీ నగర్
చెన్నై: ముఖ్యమంత్రి జయలిలత మృతితో చెన్నైలోని ప్రధాన బిజినెస్ సెంటర్లు మూగబోయాయి. ముఖ్యంగా చెన్నైలో ప్రధాన షాపింగ్ కేంద్రంగా ప్రసిద్ది చెందిన టీ నగర్ లో వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేశారు.వీటితోపాటు ఉస్మాన్ రోడ్, పాండీ బజార్ సహా రంగనాధన్ వీధి లో అన్ని దుకాణాలను తమ అభిమాన ముఖ్యమంత్రి, ప్రియతమ అమ్మ మృతిపట్ల గౌరవ సూచకంగా మూసివేశారు. దీంతో కొనుగోలుదారులతో ఎంతో రద్దీగా ఉండే పలు ప్రాంతాల్లో తీరని విషాదంతో నిశ్శబ్దం అలుముకుంది.ఎపుడూ ఆటోరిక్షాలు, కార్లు, ద్విచక్రవాహనాలు సందడి ఉండే పలువాణిజ్య కూడళ్లు నిర్మానుష్యంగా మారిపోయాయ. ఈ ప్రాంతంలో పరిస్థితిని పర్యవేక్షించడానికి ఉద్దేశించిన కొన్ని పోలీసు వాహనాలు మాత్రం దర్శనమిస్తున్నాయి కాగా తీవ్ర అనారోగ్యం సోమవారం తుదిశ్వాస విడిచిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పార్ధివ దేహానికి పూర్తి అధికార లాంఛనాలతో ఈ సాయంత్రం 4.30 ని.లకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆమెకు తుది నివాళులర్పించేందకు గాను దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే చెన్నైలోని రాజాజీకి భవనకు చేరుకుని నివాళులర్పించారు. అలాగే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఇతర రాజకీయ ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. -
బీజేపీ చేతిలో అన్నాడీఎంకే భవితవ్యం?
-
అమ్మ ఇకలేరు!
-
జయలలిత ఎప్పుడు కోరితే అప్పుడు డిశ్చార్జి
-
జయలలిత ఎప్పుడు కోరితే అప్పుడు డిశ్చార్జి
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంగా ఉన్నారని అపోలో చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి చెప్పారు. ఐసీయూ నుంచి ఆమెను త్వరలో స్పెషల్ రూమ్‌కు మారుస్తామని తెలిపారు. జయలలిత ఎప్పుడు కోరితే అప్పుడు డిశ్చార్జి చేస్తామని ప్రతాప్ సి రెడ్డి చెప్పారు. సెప్టెంబర్ 22 నుంచి జయలలిత అపోలోలో చికిత్స పొందుతున్నారు. మొదట్లో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్తలు వచ్చినా, క్రమేణా కోలుకున్నారు. పలువురు వీఐపీలు ఆపోలో ఆస్పత్రికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. -
‘అమ్మ’ కోసం కైలాస పర్వతం నుంచి..
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వేగంగా కోలుకుంటున్నారని, త్వరలోనే ఆమె డిశ్చార్జి కావడంతో పాటు విధులు నిర్వహిస్తారని బీజేపీ ఎంపీ తరుణ్ విజయ్ చెప్పారు. జయలలిత కోసం కైలాస పర్వతంలోని మానసరోవరం సరస్సు నుంచి పవిత్ర జలాన్ని ప్రత్యేకంగా తీసుకువచ్చానని తెలిపారు. లక్షలాదిమంది ప్రజల ప్రార్థనలు ఫలించాయని జయలలత ఆరోగ్యం ఉన్నారని విజయ్ చెప్పారు. ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రికి వెళ్లి తమిళనాడు సీఎంను పరామర్శిచారు. జయలలిత ఆరోగ్యం మెరుగుపడిందని, త్వరలోనే డిశ్చార్జి అవుతారని అన్నా డీఎంకే నేతలు చెప్పారు. అపోలో ఆస్పత్రి వైద్యులు కూడా ఇదే విషయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 22 నుంచి జయలలిత అపోలోలో చికిత్స పొందుతున్నారు. మొదట్లో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్తలు వచ్చినా, క్రమేణా కోలుకున్నారు. పలువురు వీఐపీలు ఆపోలో ఆస్పత్రికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. -
స్నేహ బంధమా!
ఎన్డీఏ, అన్నాడీఎంకేల మధ్య స్నేహబంధానికి బీజం పడే రీతిలో అమ్మ జయలలిత ఢిల్లీ పర్యటన సాగి ఉండొచ్చని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కేంద్రానికి అన్నాడీఎంకే ఎంపీల మద్దతు తప్పనిసరి కావడం, అప్పుల్లో ఉన్న తమిళనాడుకు కేంద్రం నిధులు అవసరం కాబట్టి స్నేహపూర్వక మద్దతు దిశగా ఈ పర్యటనలో చర్చ జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక, పీఎం నరేంద్ర మోదీ ముందు 29 వినతులను అమ్మ జయలలిత ఉంచి వచ్చారు. అవన్నీ పాతవే అయినా, అమలు తప్పనిసరి కావడం, నిధుల కోసం విన్నవించారు. ఒక్క రోజు అమ్మ పర్యటనను బ్రహ్మరథంతో అన్నాడీఎంకే వర్గాలు విజయవంతం చేశారు. ♦ ప్రధాని మోదీతో అమ్మ భేటీ ♦ మోదీ ముందు 29 వినతులు ♦ నిధుల కోసం వేడుకోలు ♦ విన్నపాలు పాతవే..అయినా..కొత్తగా ♦ ఢిల్లీలో తమిళ సీఎం జయలలిత ♦ పార్టీ వర్గాల బ్రహ్మరథం సాక్షి, చెన్నై: ఆరోసారిగా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టినానంతరం ప్రప్రథమంగా ఢిల్లీ పర్యటనకు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత సిద్ధమయ్యారు. దీంతో ఈ పర్యటనకు ప్రాధాన్యం చోటు చేసుకుంది. పలు ముసాయిదాల అమలుకు కేంద్రం పడుతున్న పాట్లు, అన్నాడీఎంకేకు కలిసి వచ్చే అంశంగా మారినట్టు చెప్పవచ్చు. ఇందుకు కారణం ఉభయ సభల్లో యాభై మంది ఎంపీలతో దేశంలోనే అతి పెద్ద మూడో పార్టీగా అన్నాడీఎంకే అవతరించడమే. ఈ పరిస్థితుల్లో అమ్మ ఢిల్లీ పర్యటనలో ఎంపీల మద్దతు ను కూడ గట్టుకునే దిశగా ప్రధాని మోదీ చర్చలు, తమిళనాడు ప్రగతికి నిధుల వరద లక్ష్యంగా అమ్మ విన్నపాలు సాగ వచ్చని సర్వత్రా భావించారు. అందుకు తగ్గట్టుగానే ఈ పర్యటన సాగి ఉండే అవకాశాలు ఎక్కువే అని, స్నేహ పూర్వక మద్దతు కేంద్రానికి అన్నాడీఎంకే ఇచ్చే దిశగా చర్చలు జరిగి ఉండొచ్చని రాజకీ య వర్గాలు భావిస్తుండడం గమనార్హం. అమ్మ పర్యటన: ఉదయం పదకొండున్నర గంటలకు చెన్నై నుంచి మీనంబాక్కం విమానాశ్రయానికి చేరుకున్న జయలలితకు ఆర్థిక మంత్రి ఓ పన్నీరు సెల్వం, అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ మధుసూధనన్ పుష్పగుచ్ఛాలతో ఆహ్వానించారు. అక్కడి నుంచి నెచ్చెలి శశికళ , ఇతర అధికారులతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. సరిగ్గా ఒకటి యాభై గంటలకు ఢిల్లీకి చేరుకున్న అమ్మకు అన్నాడీఎంకే వర్గాలు బ్రహ్మరథం పట్టాయి. పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై నేతృత్వంలో ఉభయ సభల్లోని అన్నాడీఎంకే ఎంపీలు, ఢిల్లీలోని పార్టీ వర్గాలు తరలి వచ్చి అమ్మకు ఘనస్వాగతం పలికారు. అభిమానులు, కార్యకర్తలు దారి పొడవున పుష్పాలను చల్లుతుండగా, అమ్మ కాన్వాయ్ తమిళనాడు భవన్‌కు చేరుకుంది. అక్కడ ఎనిమిదో బెటాలిన్ ప్రత్యేక పోలీసు విభాగం నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తదుపరి రెండు గంటల పాటుగా విశ్రాంతి తీసుకున్నారు. సరిగా నాలుగుగంటల 40 నిమిషాలకు అక్కడి నుంచి నేరుగానం.7 రేస్ కోర్సు రోడ్డులోని ప్రధాని నివాసం వైపుగా అమ్మ కాన్వాయ్ బయలు దేరింది. 4.45 నిమిషాల నుంచి యాభై నిమిషాల పాటుగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. 29 విన్నపాలు : ప్రధాని నరేంద్ర మోదీతో స్నేహ పూర్వక, రాజకీయ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రగతి పథకాల విషయంగా చర్చలు జరిగినట్టు సమాచారం. కేంద్రానికి మద్దతు ఇచ్చే రీతిలో చర్చలు సాగినట్టు, జీఎస్టీ తదితర ముసాయిదాల్లో సవరణల దిశగా సూచనలు ఇచ్చినట్టు తెలిసింది. ముసాయిదాల విషయంలో కేంద్రానికి మద్దతు ఇచ్చే రీతిలో చర్చలు సాగినా, ప్రధాని నరేంద్ర మోదీ ముందు 29 రకాల విన్నపాలను అమ్మ జయలలిత ఉంచడం గమనార్హం. ఇవన్నీ పాతవే అయినా సరికొత్తగా ఇప్పుడు అమలు చేయాల్సిన అవశ్యం ఉన్న అంశాలు. ఇందులో కచ్చదీవులు, జాలర్ల సమస్య, ముల్లై పెరియార్వ్యవహారం, కావేరి జల వివాదంలో ట్రిబ్యునల్ తీర్పు, జల్లికట్టు వంటి అంశాలు ఉండటం కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టినట్టే. ఈ ఇద్దరి మధ్య సాగిన భేటీలో తమిళనాడు ప్రగతి, విన్నపాల మీద పరిశీలించి అమలు దిశగా ప్రత్యేక కమిటీని రంగంలోకి దించే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇవ్వడం గమనార్హం. తదుపరి అక్కడి నుంచి తమిళనాడు భవన్‌కు చేరుకున్న జయలలితను కేంద్ర సహాయ మంత్రులు నిర్మల సీతారామన్, పొన్ రాధాకృష్ణన్ భేటీ కావడం విశేషం. ఈ భేటీలో వైజాగ్ నుంచి చెన్నై వరకు సరుకు రవాణా నిమిత్తం సాగనున్న కారిడార్ నుంచి తూత్తుకుడి, కులచల్ వరకు విస్తరించేందుకు తగ్గ సమాలోచన సాగినట్టు నిర్మలా సీతారామన్ మీడియాకు వివరించారు.ఒక రోజు ఢిల్లీ పర్యటన ముగించుకుని రాత్రి తొమ్మిదిన్నర గంటలకు చెన్నైకు సీఎం జయలలిత చేరుకున్నారు. వినతుల్లో ముఖ్యమైనవి కొన్ని.. ♦ ముల్లై పెరియార్ వ్యవహారంలో కేరళ సర్కారు తీరుపై ఆగ్రహం. 142 నుంచి 152 అడుగులకు నీటి మట్టం పెంపునకు చర్యలు తీసుకోవాలి. ♦ నదుల అనుసంధానానికి చర్యలు వేగవంతం, అవినాశి - అత్తి కడవు పథకానికి కేంద్రం నిధులు ♦ కేంద్రం నుంచి వివిధ పథకాలు,సంక్షేమ కార్యక్రమాలకు రావాల్సిన నిధులు బకాయిలతో పాటుగా సక్రమంగా విడుదల చేయాలి. ♦ శ్రీలంకకు దారాదత్తం చేసిన తమిళ భూభాగం కచ్చదీవుల్ని తిరిగీ స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టాలి. ♦ జాలర్లపై జరుగుతున్న దాడుల్ని వివరిస్తూ, ఆ దేశ చెరలో ఉన్న బందీలందర్నీ విడుదల చేయించాలి. మళ్లీ దాడులు పునరావృతం కాకుండా శ్రీలంకతో చర్చలు జరపాలి. ♦ విద్యుత్, వ్యవసాయ రంగాలకు కేటాయింపులు పెంచాలి. ♦ చెన్నైలో మెట్రో రైలు రెండో దశ పనులకు అనుమతి ఇవ్వాలి. నిధుల కేటాయింపులు త్వరితగతిన జరగాలి. ఎంఆర్టీఎస్కు అనుమతి ఇవ్వాలి. ♦ గ్రామీణ,ఆరోగ్య, నగర, విద్య, ఐటీ రంగాల బలోపేతానికి తగ్గట్టుగా పూర్తి సహకారం అందించాలి. ♦ కావేరి జల వివాదంలో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును త్వరితగతిన అమలు పరచాలి. కావేరి అభివృద్ధిమండలి, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయాలి. మేఘదాతులో డ్యాం నిర్మాణానికి కర్నాటక ప్రయత్నాల్ని అడ్డుకోవాలి. ♦ మద్రాసు హైకోర్టులో తమిళం అధికారిక భాషగా ప్రకటించారు. తమిళంలో వాదనలకు అనుమతి త్వరితగతిన ఇవ్వాలి. ♦ తమిళనాడుకు నిత్యవసర వస్తువుల పంపిణీలో కోతల్ని విధించకుండా సక్రమంగా పంపిణీ చేయాలి. ♦ తమిళుల సాహస, సంపద్రాయ క్రీడ జల్లికట్టకు మళ్లీ అనుమతి దక్కే విధంగా చట్ట సవరణలు చేయాలి. ఆహార భద్రతా చట్టంలో తమిళనాడుకు మినహాయింపులు ఇవ్వాలి. ♦ జౌళి, చిరు వర్తకులకు అభ్యున్నతిని కాంక్షించే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటుగా మూత బడ్డ నోకియాను మళ్లీ తెరిపించేందుకు ప్రయత్నాలు వేగవంతం చేయాలి. ♦ కొచ్చిన్ నుంచి బెంగళూరుకు తమిళనాడులోని ఏడు జిల్లాల్లోని పంట పొలాల మీదుగా తీసుకెళ్తున్న గ్యాస్ పైప్ లైన్ పనుల్ని నిలుపుదల చేసి, జాతీయ రహదారి గుండా పనులు చేపట్టాలి. -
మోదీ ముందు 29 డిమాండ్లు ఉంచిన అమ్మ
న్యూఢిల్లీ: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తొలిసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. మంగళవారం ఆమె ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. జయలలిత 29 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మోదీకి అందజేశారు. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను మోదీ దృష్టికి తీసుకువెళ్లారు. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని, కావేరి జలవివాదాల పరిష్కారానికి బోర్డు ఏర్పాటు చేయాలని జయలలిత కోరారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో అన్నాడీఎంకే చేరనున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. తమిళనాడులో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయం సాధించి, జయలలిత వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ వేర్వేరుగా పోటీచేసినా.. ఎన్డీయే ప్రభుత్వంలో అమ్మ పార్టీ చేరవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. -
జయ అక్రమాస్తుల కేసులో తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే చీఫ్ జయలలితపై అక్రమాస్తుల కేసును విచారించిన సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఈ కేసులో కర్ణాటక హైకోర్టు జయలలితను నిర్దోషిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 18 ఏళ్లు సాగిన అక్రమాస్తుల కేసులో జయలలితను దోషిగా తేలుస్తూ గతేడాది ప్రత్యేక కోర్టు ఆమెకు నాలుగేళ్ల జైలుశిక్ష, వంద కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. దాంతో ఆమె పరప్పన అగ్రహార జైలుకు వెళ్లాల్సి వచ్చింది. తర్వాత ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తర్వాత కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా..జయకు ఊరట లభించింది. దీంతో ఆమె మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. -
సీఎం పీఠంపై జయ
ఐదోసారి తమిళ నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అన్నాడీఎంకే అధినేత చెన్నై: అన్నాడీఎంకే అధినేత జయలలిత ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల జయజయధ్వానాల మధ్య గవర్నర్ కె.రోశయ్య శనివారం జయతో సీఎంగా ప్రమాణం చేయించారు. తమిళనాడు సీఎంగా ఆమె పగ్గాలు చేపట్టడం ఇది ఐదోసారి. చెన్నైలోని మద్రాస్ వర్సిటీ ఆడిటోరియంలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు తరలివచ్చారు. జయతో పాటు 28 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం కాగా, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు, వివిధ రంగాల ప్రముఖులతో పది గంటలకే ఆడిటోరియం నిండిపోయింది. 10.56 గంటలకు జయ, 11 గంటలకు గవర్నర్ వేదికపైకి చేరుకున్నారు. పుష్పగుచ్ఛం ఇచ్చి గవర్నర్‌కు స్వాగతం పలికిన జయ.. తన మంత్రివర్గ సభ్యులను ఆయనకు పరిచయం చేశారు. తర్వాత గవర్నర్ ఆమెతో ప్రమాణం చేయించారు. ముహూర్త సమయం ముంచుకురావడంతో కార్యక్రమం మొదట్లో జాతీయ గీతాన్ని కుదించారు. ప్రమాణస్వీకారం పూర్తయిన తర్వాత పూర్తి గీతాన్ని ఆలపించారు. 28 మంది మంత్రులు 14 మంది చొప్పున రెండు విడతలుగా ప్రమాణ ం చేశారు. 20 నిమిషాల్లో కార్యక్రమం ముగిసింది. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నటులు శరత్‌కుమార్, శివకుమార్, సంగీత దర్శకులు ఇళయరాజా, కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్, పార్టీ నేత, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎం.తంబిదురై, ఇండియా సిమెంట్స్ అధిపతి ఎన్.శ్రీనివాసన్, పలువురు మత పెద్దలు హాజరయ్యారు. జయ నెచ్చెలి శశికళ తన కుటుంబ సభ్యులతో కలసి ముందు వరుసలో కూర్చున్నారు. ప్రధాని మోదీ.. జయకు ట్విటర్లో అభినందనలు తెలిపారు. ప్రమాణం తర్వాత జయలలిత అక్కడ్నుంచి నేరుగా తన నివాసానికి వెళ్లారు. ఆకుపచ్చ సెంటిమెంట్: చేతికి ఆభరణాలను ధరించే అలవాటు లేని జయ తొలిసారి ఆకుపచ్చరాయి ఉంగరం ధరించడం విశేషంగా మారింది. శుక్రవారం గవర్నర్‌తో భేటీ సమయంలో, జయ ఆకుపచ్చ రంగు చీరలో కనిపించారు. శనివారం ప్రమాణానికీ అకుపచ్చ చీరలోనే వచ్చి, అదే రంగు పెన్నుతో తొలి సంతకం చేశారు. వేదికపై గవర్నర్‌కు స్వాగతం చెబుతూ జయ ఇచ్చిన పుష్పగుచ్ఛం సైతం ఆకుపచ్చ రంగులోనే ఉండడం విశేషం. 8 నెలల తర్వాత తమ అభిమాన నేత జయ మళ్లీ సీఎంగా పగ్గాలు చేపట్టడంతో చెన్నైలోని అన్నాడీఎంకే శ్రేణులు, అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. కరుణ రికార్డు సమం తమిళనాడు సీఎంగా ఐదుసార్లు ప్రమాణం చేసిన డీఎంకే కరుణానిధి రికార్డును శనివారం జయ సమం చేశారు. 1991లో జయ తొలిసారిగా సీఎం అయ్యారు. 2001 మే 14న రెండోసారి సీఎం పగ్గాలు చేపట్టారు. అయితే కొద్దికాలానికే టాన్సీ కేసుల్లో చిక్కి పదవి నుంచి వైదొలిగారు. ఈ కేసుల నుంచి బయటపడ్డాక 2002 మార్చి 2న మూడోసారి సీఎం అయ్యారు. 2011 మే 16న నాలుగోసారి సీఎం పగ్గాలు చేపట్టిన జయ.. గతేడాది సెప్టెంబర్‌లో ఆస్తుల కేసులో దోషిగా తేలడంతో పదవి కోల్పోయారు. ఈనెల 11న కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో శనివారం ఐదోసారి సీఎం పీఠం ఎక్కారు. జయకు కష్టకాలంలో రెండుసార్లు సీఎంగా వ్యవహరించిన రికార్డు పన్నీర్ సెల్వం సొంతమైంది. సీఎంగా పన్నీర్‌సెల్వం చేసిన రెండు ప్రమాణాలు సెప్టెంబర్ నెలలోనే జరగడం విశేషం. రాజకీయ ఫీనిక్స్! పురచ్చితలైవి రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఉత్థానపతనాలు! ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా వాటన్నింటినీ అధిగమించి పునరుజ్జీవం పొందిన ‘ఫీనిక్స్’ పక్షిలా పెకైగరడం ఆమె నైజం. ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తుచేయడంలో అయినా, రాజకీయ ఎత్తుగడలు వేయడంలో అయినా జయలలితది ప్రత్యేక శైలి. ఆమె జీవిత విశేషాలివీ.. అసలు పేరు: కోమలవల్లి జననం: 1948, ఫిబ్రవరి 24. మైసూరు రాష్ట్రం (ప్రస్తుతం కర్ణాటక)లోని మాండ్య జిల్లా మెలుకొటే విద్యాభ్యాసం: బెంగళూరులోని బిషప్ కాటన్ గర్ల్స్ హైస్కూలు సినీ జీవితం: 140కిపైగా తమిళ, తెలుగు, కన్నడ సినిమాల్లో నటన మొదటి సినిమా: చిన్నడ గొంబే(కన్నడ), 1964 పేరు తెచ్చిన సినిమా: మనుషులు మమతలు, 1965 రాజకీయాల్లోకి.. 1981: రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఎంజీఆర్ 1983: అన్నాడీఎంకే ప్రచార కార్యదర్శిగా 1984-1989: రాజ్యసభ సభ్యురాలు 1987: ఎంజీఆర్ మృతి, చీలిన పార్టీ. ఎంజీఆర్ భార్య జానకి వర్గం జయ వర్గంలో విలీనం 1989: తొలి మహిళా ప్రతిపక్ష నేతగా బాధ్యతలు 1991-96: తొలిసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు గెలుపోటములు: 1989, 1991, 1996, 2002, 2006, 2011 సంవత్సరాల్లో అసెంబ్లీకి పోటీ. 1996లో తప్ప మిగతా అన్నిసార్లు జయకేతనం -
అమ్మ.. ఐదోసారి!
-
అమ్మ 'ఆకుపచ్చ' సాక్షిగా ప్రమాణం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే అధినేత్రి జయలలితకు జ్యోతిష్యం అంటే అపార నమ్మకం. ముఖ్యమైన పనులు చేసేటపుడు తప్పకుండా జ్యోతిష్యుడి సలహా తీసుకుంటారు. సమయం, వారం, ధరించే దుస్తులు, రంగు వంటి విషయాల్లో జయలలితకు సెంటిమెంట్లు ఎక్కువ. జయకు సన్నిహిత వర్గాలు ఈ విషయాలు వెల్లడించారు. 67 ఏళ్ల జయలలిత శనివారం ఐదోసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆమె ఆకుపచ్చని చీర ధరించి వచ్చారు. ప్రమాణం చేశాక ఆకుపచ్చ రంగు పెన్నుతో సంతకం చేశారు. జయ చేతి వేలిపై ఆకుపచ్చ రంగు ఉంగరం ధగధగలాడి పోయింది. మొత్తానికి జయ ఆకుపచ్చని రంగుతో మెరిసిపోయారు. ప్రమాణ స్వీకార వేదికను కూడా ఆకుపచ్చ రంగుతో అలంకరించారు. మరో విశేషమేంటంటే జయ ప్రమాణ స్వీకారం ముహూర్తం రోజును శనివారం ఎంచుకున్నారు. శనివారం శుభదినమని, సుస్థిరత చేకూరస్తుందని జయ విశ్వాసం. ఇక టైమ్ కూడా జయ కచ్చితంగా పాటించారు. ఈ రోజు ఉదయం 10:37 గంటలకు ఆమె తన నివాసం పోయెస్ గార్డెన్ నుంచి బయల్దేరారు. ప్రమాణ స్వీకార వేదిక మద్రాస్ యూనివర్సిటీ సెంటనరీ ఆడిటోరియంకు సరిగ్గా 11 గంటలకు వచ్చారు. అరగంటలోపే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ముగించారు. జయలలితతో ప్రమాణం చేయించిన గవర్నర్ రోశయ్య.. అనంతరం మంత్రులందరి చేత సామూహిక ప్రమాణం చేయించారు. -
మాజీ సీఎంకు రెండో స్థానం
చెన్నై: అన్నా డీఎంకే నేత పన్నీరు సెల్వంకు ఊహించని విధంగా రెండుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. అన్నా డీఎంకే అధినేతి జయలలిత అవినీతి కేసులో పదవి నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడటంతో తనకు నమ్మినబంటయిన సెల్వంను సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. కర్ణాటక హైకోర్టు జయలలితను నిర్దోషిగా ప్రకటించడంతో 'అమ్మ' ముఖ్యమంత్రి అయ్యేందుకు వీలుగా సెల్వం రాజీనామా చేశారు. శనివారం ఉదయం జయలలిత ఐదోసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. జయ తన కేబినెట్లోకి సెల్వంను తీసుకున్నారు. జయ కేబినెట్లో సెల్వంది రెండోస్థానం. ఆయనకు కీలకమైన ఆర్థిక శాఖను కేటాయించారు. తమిళనాడు గవర్నర్ రోశయ్య.. జయతో పాటు 28 మందితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. -
జయ ప్రమాణ స్వీకారానికి ఎవరెవరు వచ్చారంటే..
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రమాణ స్వీకారానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మద్రాస్ యూనివర్సిటీ సెంటినరీ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, నటుడు శరత్ కుమార్, ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, జయ ఇష్టసఖి శశికళ, కుమారుడు సుధాకర్, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. రజనీకాంత్, శరత్ కుమార్ పక్కపక్కనే ఆశీనులయ్యారు. అలాగే అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున అమ్మ పట్టాభిషేకానికి తరలి వచ్చారు. గవర్నర్ రోశయ్య ..జయలలితతో ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం ఆమెను అభినందించారు. ఆ తర్వాత మంత్రులంతా సామూహికంగా ప్రమాణ స్వీకారం చేశారు. -
తమిళనాడు సీఎంగా జయ ప్రమాణ స్వీకారం
చెన్నై : అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత మరోసారి తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. శనివారం ఉదయం 11.08 గంటలకు ఆమె ముఖ్యమంత్రిగా తమిళంలో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ రోశయ్య మద్రాస్ యూనివర్సిటీ ఆడిటోరియంలో జయలలితతో ప్రమాణ స్వీకారం చేయించారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా జయ గద్దెనెక్కడం ఇది అయిదోసారి. అనంతరం ఆర్థికమంత్రిగా పన్నీర్ సెల్వం, విద్యుత్ మంత్రిగా నాథమ్ ఆర్ విశ్వనాథన్, గృహ నిర్మాణశాఖ మంత్రిగా ఆర్.వైదిలింగం ప్రమాణం చేశారు. కీలకమైన హోం, పోలీసు, పబ్లిక్, ఆల్ ఇండియా సర్వీసెస్, సాధారణ పాలన వంటి శాఖలను జయ తన వద్దే ఉంచుకున్నారు. జయలలితతో పాటు 28మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత దోషిగా తేలడం, ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పుకోవడంతో కిందటేడాది సెప్టెంబర్ 29న పన్నీర్ సెల్వన్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. కాగా ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు ఈనెల 11న జయను నిర్దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. జయ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, పార్టీ నేతలు హాజరయ్యారు. అంతకు ముందు జయలలిత ప్రమాణ స్వీకారానికి పోయెస్ గార్డెన్ నుంచి మద్రాస్ యూనివర్శిటీకి వెళుతుండగా అభిమానులు, కార్యకర్తలు రోడ్డుకు ఇరువైపుల నిలబడి అమ్మకు ఘన స్వాగతం పలికారు. -
నేడు సీఎంగా జయలలిత ప్రమాణస్వీకారం
-
జయ ప్రమాణం నేడే
ఐదోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు మద్రాస్ యూనివర్సిటీ ఆడిటోరియంలో ప్రమాణస్వీకారం శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన పురుచ్చితలైవి సీఎం పదవికి పన్నీర్‌సెల్వం రాజీనామా.. గవర్నర్ ఆమోదం అభిమానుల జయజయధ్వానాల మధ్య రాజ్‌భవన్‌కు పయనం గవర్నర్ రోశయ్యతో భేటీ.. 28 మందితో కూడిన మంత్రుల జాబితా అందజేత చెన్నై: అన్నాడీఎంకే అధినేత జయలలిత ముఖ్యమంత్రి పీఠం అధిష్టించేందుకు ముహూర్తం ఖరారైంది. శనివారం ఉదయం 11 గంటలకు మద్రాస్ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఐదోసారి తమిళనాడు సీఎంగా ఆమె ప్రమాణం చేయనున్నారు. 28 మంది మంత్రులు కూడా ప్రమాణం చేస్తారు. శుక్రవారం తమిళనాట కీలక పరిణామాలు చకచక చోటుచేసుకున్నాయి. ఉదయం ఏడు గంటలకే పార్టీ ప్రధాన కార్యాలయంలో 148 మంది ఎమ్మెల్యేలు సమావేశమై జయను శాసనసభా పక్ష నేత(ఎల్పీ)గా ఎన్నుకున్నారు. అదే సమావేశంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఒ.పన్నీర్ సెల్వం ప్రకటించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయ దోషిగా తేలడం, ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పుకోవడంతో కిందటేడాది సెప్టెంబర్ 29న ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో జయ పేరును పన్నీర్ సెల్వమే ప్రతిపాదించగా.. ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ భేటీకి విజయ్‌కాంత్ నేతృత్వంలోని డీఎండీకేకు చెందిన ఏడుగురు రెబల్ ఎమ్మెల్యేలు కూడా హాజరై జయకు మద్దతు పలకడం గమనార్హం. ఈ భేటీ తర్వాత పన్నీర్ సెల్వం తన రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించారు. మధ్యాహ్నం 2.15 గంటలకు జయలలిత రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్ కె.రోశయ్యకు కొత్త మంత్రుల జాబితాను అందజేశారు. తర్వాత రాజ్‌భవన్ నుంచి నేరుగా మౌంట్‌రోడ్డుకు వెళ్లి ఎంజీఆర్, అన్నాదురై, పెరియార్ విగ్రహాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. పన్నీర్ సెల్వం రాజీనామాతోపాటు కొత్త మంత్రుల జాబితాను ఆమోదించినట్లు రాజ్‌భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిర్దోషిగా బయటపడి ఎనిమిది నెలల తర్వాత జనంలోకి వచ్చిన జయకు జనం బ్రహ్మరథం పట్టారు. రాజ్‌భవన్‌కు వెళ్లే మార్గం అభిమానులు, కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది. నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా వేలాది మంది జయకు జేజేలు పలికారు. ఆమెపై పూలవర్షం కురిపించి తమ అభిమానం చాటుకున్నారు. నగరంలో ఎక్కడ చూసినా అన్నాడీఎంకే ఫ్లెక్సీలు, జెండాలు, తోరణాలే కనిపించాయి. జయ నివాసం వద్ద కూడా సంబరాలు మిన్నంటాయి. భారీ సంఖ్యలో చేరుకున్న మహిళా కార్యకర్తలు రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు. వారందరికి అభివాదం చేస్తూ జయ తన కారులో ముందుకు సాగారు. మంత్రివర్గంలో పాత ముఖాలే! జయ సారథ్యంలో కొత్తగా కొలువుదీరబోయే ప్రభుత్వంలో ముగ్గురు మినహా పాత మంత్రులే కొనసాగనున్నారు. 2011-14 మధ్య తాను సీఎంగా ఉన్న సమయంలో మంత్రులుగా ఉన్నవారిని అలాగే కొనసాగించేందుకు ఆమె మొగ్గుచూపారు. ఆర్థికమంత్రిగా పన్నీర్ సెల్వం, విద్యుత్ మంత్రిగా నాథమ్ ఆర్ విశ్వనాథన్, గృహ నిర్మాణశాఖ మంత్రిగా ఆర్.వైదిలింగం ప్రమాణం చేయనున్నారు. కీలకమైన హోం, పోలీసు, పబ్లిక్, ఆల్ ఇండియా సర్వీసెస్, సాధారణ పాలన వంటి శాఖలను జయ తన వద్దే ఉంచుకున్నారు. ఈనెల 11న ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు జయను నిర్దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. నిర్ణయం తీసుకోవాల్సి ఉంది: కర్ణాటక సీఎం బెంగళూరు: జయ కేసులో అప్పీలుకు వెళ్లే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చెప్పారు. ‘ఈ అంశాన్ని న్యాయశాఖ పరిశీలిస్తోంది. తీర్పును వారు అధ్యయనం చేస్తున్నారు. న్యాయశాఖ, ఈ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీ ఆచార్య, అడ్వొకేట్ జనరల్ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటాం’అ ని విలేకరులకు చెప్పారు. కాగా, అప్పీలుకు వెళ్లాల్సిందిగా తాను ఇప్పటికే సలహా ఇచ్చినట్లు అడ్వొకేట్ జనరల్ రవివర్మ కుమార్ తెలిపారు. -
17లోగా సీఎంగా పగ్గాలు!
జయలలితను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టేందుకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఈనెల 13న సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ భేటీ తర్వాత రెండు రోజుల్లో లేదా ఈనెల 17వ తేదీన జయలలిత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతకు ముందు పార్టీ శాసనసభా నేతగా ఎన్నుకునేందుకు అనుమతి కోరుతూ గవర్నర్ కె.రోశయ్యకు వినతిపత్రం సమర్పించనున్నారు. ఈనెల 16, 17 తేదీల్లో శుభఘడియలు ఉన్నందున జయ ప్రమాణ స్వీకారం అప్పుడే ఉంటుందని తెలుస్తోంది. -
'రూ. 190 లకే సిమెంట్ బస్తా'
చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అమ్మ సిమెంట్ పథకాన్ని శుక్రవారం చెన్నైలో ప్రకటించారు. ఈ పథకం ద్వారా పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు బస్తా సిమెంట్ రూ. 190లకే అందించనున్నట్లు తెలిపారు. సిమెంట్ బస్తా ధరలు ఆకాశాన్ని అంటాయి. ఈ నేపథ్యంలో పేద మధ్య తరగతి వర్గాలు ఇల్లు కట్టుకోవాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆయా వర్గాల వారికి తక్కవ ధరకే సిమెంట్ బస్తా అందించాలని ఉద్దేశ్యంతో జయలలిత అమ్మ సిమెంట్ పథకాన్ని ప్రకటించారు. త్వరలో అమ్మ సిమెంట్ పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. జయలలిత సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పేదలు, మధ్య తరగతి ప్రజల కోసం అమ్మ పేరిట పలు పథకాలను ప్రారంభించారు. అమ్మ క్యాంటిన్లు, అమ్మ మెడికల్స్, అమ్మ వాటర్, అమ్మ కూరగాయలతోపాటు పలు పథకాలను ఇప్పటికే ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకాలు తమిళ ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. -
చల్లని కబురు
చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడులోని తాగునీటి సమస్య ఈనాటిది కాదు. ప్రజలు దశాబ్దాలుగా నీటి కోసం అగచాట్లు పడుతున్నారు. నీటి సమస్య పరిష్కారం దిశగా ముఖ్యమంత్రి హోదాలో ఎంజీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అప్పట్లో ఒప్పందం కుదుర్చుకున్నారు. తద్వారా ఏటా తెలుగుగంగ నీరు రాష్ట్రానికి వస్తోంది. అలాగే చిన్నాచితక పథకాలు అమలవుతున్నాయి. ఈ క్రమంలోనే సముద్రపు నీటిని మంచినీటిగా మార్చేందుకు అన్నాడీఎంకే ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి రెండు నిర్లవణీకరణ కేంద్రాలను తీసుకు వచ్చింది. మరోవైపు కావేరి నీటి కోసం కర్ణాటకతో పోరాటం సాగిస్తోంది. నాలుగు జిల్లాల్లో మరో పథకం తిరుప్పూరు, ఈరోడ్, తంజావూరు, కోయంబత్తూరు జిల్లాల్లో రూ.717.32 కోట్ల అంచనా వ్యయంతో సహకార తాగునీటి పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ముఖ్యమంత్రి జయలలిత శనివారం ప్రకటించారు. ఈ పథకంతో తిరుపూరు జిల్లాలోని వెల్లకోయిల్, మాలనూర్, తారాపురం, కున్నట్టం, కాంగేయం ప్రాంతాలు లబ్ధి పొందనున్నాయి. ఈరోడ్ జిల్లా చెన్నమలై పంచాయతీలోని 1262 పక్కాగృహాలకు నీటిని సరఫరా చేయనున్నారు. అలాగే తంజావూరు జిల్లా తిల్లుల పేరావూరణి, పెరుమగళూర్, అదిరామపట్టినం, మరో 9 పంచాయతీల్లోని 1153 పక్కాగృహాలకు నీటిని సరఫరా చేస్తారు. ఇందుకు నిర్మాణ వ్యయంగా రూ.495.70 కోట్లు, ఏడాది నిర్వహణ వ్యయంగా రూ.9.19 కోట్లు కేటాయించారు. కోయంబత్తూరు జిల్లా తొండాపుత్తూరు, పులువపట్టి, తేన్కరై, వేటపట్టి, దాళ యూర్, ఆలిందురై, పేరూర్, మరో 134 పంచాయతీల్లోని పక్కాగృహాలకు రూ.130.46 కోట్లతో పథకం అమలు చేయనున్నారు. ఈ పథకం అధికశాతం కావేరి నదీ జలాలపై ఆధారపడి ఉండడం గమనార్హం.