జయలలితను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టేందుకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఈనెల 13న సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ భేటీ తర్వాత రెండు రోజుల్లో లేదా ఈనెల 17వ తేదీన జయలలిత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతకు ముందు పార్టీ శాసనసభా నేతగా ఎన్నుకునేందుకు అనుమతి కోరుతూ గవర్నర్ కె.రోశయ్యకు వినతిపత్రం సమర్పించనున్నారు.
ఈనెల 16, 17 తేదీల్లో శుభఘడియలు ఉన్నందున జయ ప్రమాణ స్వీకారం అప్పుడే ఉంటుందని తెలుస్తోంది.