
జయ ప్రమాణ స్వీకారానికి ఎవరెవరు వచ్చారంటే..
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రమాణ స్వీకారానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మద్రాస్ యూనివర్సిటీ సెంటినరీ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, నటుడు శరత్ కుమార్, ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, జయ ఇష్టసఖి శశికళ, కుమారుడు సుధాకర్, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. రజనీకాంత్, శరత్ కుమార్ పక్కపక్కనే ఆశీనులయ్యారు. అలాగే అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున అమ్మ పట్టాభిషేకానికి తరలి వచ్చారు.
గవర్నర్ రోశయ్య ..జయలలితతో ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం ఆమెను అభినందించారు. ఆ తర్వాత మంత్రులంతా సామూహికంగా ప్రమాణ స్వీకారం చేశారు.