oath
-
Delhi: రేఖా గుప్తాతో పాటు ప్రమాణం చేయనున్న ఆరుగురు మంత్రులు వీరే..
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరనే విషయాన్ని బీజేపీ ప్రకటించింది. పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో రేఖ గుప్తా పేరును ముఖ్యమంత్రి పదవికి ఖరారు చేశారు. తాజాగా రేఖా గుప్తాతో పాటు మరో ఆరుగురు మంత్రులుగా ఈరోజు (ఫిబ్రవరి20)న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్లోంది. ప్రవేశ్ వర్మ, ఆశిష్ సూద్, మంజీందర్ సిర్సా, పంకజ్ సింగ్, కపిల్ మిశ్రా, రవీంద్ర ఇంద్రజ్‌లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని సమాచారం.రేఖ గుప్తా (50) హర్యానాలోని జింద్ జిల్లాకు చెందినవారు. రేఖ గుప్తా(Rekha Gupta) కుటుంబం 1976 సంవత్సరంలో ఢిల్లీకి వచ్చింది. ఆమె భర్త పేరు మనీష్ గుప్తా. రేఖ గుప్తా ఎల్ఎల్బీ పూర్తి చేశారు. న్యాయవాదిగా పని చేస్తున్నారు. ఢిల్లీలోని షాలిమార్ బాగ్ అసెంబ్లీ స్థానం నుండి ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు. ఆమె ఆప్‌కు చెందిన వందన కుమారిని 29,595 ఓట్ల తేడాతో ఓడించారు.రేఖా గుప్తా తన విద్యార్థి దశ నుండే రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఆమె 1992లో ఢిల్లీ విశ్వవిద్యాలయం(Delhi University)లోని దౌలత్ రామ్ కళాశాల నుండి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆమె 1996-97లో ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా ఉన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా ఎంపిక కావడంపై బీజేపీ నేత ప్రవేశ్ వర్మ హర్షం వ్యక్తి చేశారు.ఇది కూడా చదవండి: Delhi: సీఎంగా రేఖా గుప్తా ఎంపికతో హర్యానాలో సంబరాలు -
రాజ్యాంగమే సాక్షి.. ఛత్తీస్‌గఢ్‌లో ఆదర్శ వివాహం చేసుకున్న జంట
రాయ్‌పూర్:ఛత్తీస్‌గఢ్‌లో ఓ జంట ఆదర్శ వివాహం చేసుకుంది. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలు,ఆచారాలు పక్కనపెట్టి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్నారు. ఏడడుగులు నడవడం, తాళి కట్టడం, సింధూరం పెట్టడం లాంటి అన్ని ఆచారాలను దూరంగా పెట్టారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేయడమే కాకుండా దండలు మార్చుకుని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఇంతటితో ఆగకుండా పెళ్లికి అనవసర ఖర్చు కూడా చేయకుండా సింపుల్‌గా కానిచ్చేశారు. పెళ్లికయ్యే ఖర్చులతో కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయవచ్చనే ఆలోచనతోనే ఇలాచేసినట్లు పెళ్లికొడుకు ఇమాన్ లాహ్రె చెప్పారు. తమకు ఆచారాలు,సంప్రదాయాల మీద కన్నా రాజ్యాంగం మీదనే తమకు నమ్మకం ఉందన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని జాష్పూర్ జిల్లాలోని కాపు గ్రామంలో డిసెంబర్ 18న ఈ పెళ్లి జరిగింది. ఈ జంట చేసుకున్న ఆదర్శ వివాహంపై వారి బంధువులు, గ్రామస్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది మిగిలిన వారికి ఆదర్శంగా నిలవాలని వారు ఆకాంక్షించారు. -
‘సుప్రీం’ జడ్జిగా జస్టిస్ మన్మోహన్ ప్రమాణం
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్(61) గురువారం సుప్రీంకోర్టు జడ్జీగా ప్రమాణం చేశారు. సుప్రీంకోర్టు కాంప్లెక్స్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆయనతో ప్రమాణం చేయించారు. జస్టిస్ మన్మోహన్ చేరికతో సీజేఐతో కలిపి సుప్రీంకు మంజూరైన 34 మంది జడ్జీలకు గాను ప్రస్తుతం 33 మంది ఉన్నట్లయింది. జస్టిస్ మన్మోహన్‌ను అత్యున్నత న్యాయస్థానానికి నవంబర్ 28న కొలీజియం సిఫారసు చేయడం, డిసెంబర్ 3న ఆయన్ను రాష్ట్రపతి ముర్ము నియమించడం తెల్సిందే. ఆల్ ఇండియా హైకోర్టు జడ్జీల్లో సీనియారిటీ పరంగా జస్టిస్ మన్మోహన్ రెండో స్థానంలోనూ, ఢిల్లీ హైకోర్టులో సీనియర్ మోస్ట్ న్యాయమూర్తిగాను ఉన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పట్టా పుచ్చుకున్న ఈయన 1987లో న్యాయవాదిగా పేరు నమోదుచేసుకున్నారు. సుప్రీంకోర్టు జడ్జీల రిటైర్మెంట్ వయస్సు 65 ఏళ్లు కాగా, హైకోర్టు జడ్జీల విరమణ వయస్సు 62 ఏళ్లు. -
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం.. సెలబ్రిటీల సందడి (ఫోటోలు)
-
ప్రధానిని కలిసిన హేమంత్ దంపతులు..
న్యూఢిల్లీ: జార్ఖండ్ తాత్కాలిక ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకుని సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించారు. నవంబర్ 28న రాంచీలోని మోర్హబడి మైదానంలో జార్ఖండ్ నూతన సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు హేమంత్ సోరెన్ అతని సతీమణి, గండే నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే కల్పనా సోరెన్ ఢిల్లీకి వెళ్లారు. కాగా రాజధాని రాంచీలోని సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి సన్నాహాలు ఘనంగా జరుగుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తేజస్వీ యాదవ్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలున్నాయి. आज दिल्ली में माननीय प्रधानमंत्री आदरणीय श्री @narendramodi जी से मुलाकात कर उन्हें 28 नवंबर को अबुआ सरकार के शपथ ग्रहण समारोह में शामिल होने हेतु आमंत्रित किया। pic.twitter.com/dPgWW6l7ir— Hemant Soren (@HemantSorenJMM) November 26, 2024మొన్నటి జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి ఘన విజయం సాధించింది. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్) మొత్తం 56 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నాయి. జేఎంఎం ఒక్కటే 34 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, సీపీఐ(ఎంఎల్) రెండు స్థానాల్లో విజయం సాధించాయి. జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. జార్ఖండ్ తాత్కాలిక ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తన ఎమ్మెల్యే భార్య కల్పనా సోరెన్‌తో కలిసి న్యూఢిల్లీ చేరుకున్నారు. వారు ప్రధాని మోదీని కలుసుకుని ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు.ఇది కూడా చదవండి: ప్రియురాలిని హత్య చేసి.. రాత్రంతా మృతదేహంతోనే గడిపి.. -
హైకోర్టు జడ్జీలుగా ముగ్గురు ప్రమాణం
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా కుంచం మహేశ్వరరావు, తూటా చంద్ర ధనశేఖర్, చల్లా గుణరంజన్‌లు సోమవారం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన కార్యక్రమంలో ఈ ముగ్గురితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. అంతకుముందు.. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వై. లక్ష్మణరావు ఈ ముగ్గురు నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీచేసిన ఉత్తర్వులను చదవి వినిపించారు. అనంతరం సీజే వారితో ప్రమాణం చేయించారు. ఆ తర్వాత సీజే ఒక్కొక్కరికీ రాష్ట్రపతి జారీచేసిన ఉత్తర్వులను అందచేశారు.ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దొనడి రమేష్, విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ చల్లా కోదండరాం, జస్టిస్ మంతోజు గంగారావు, ప్రమాణం చేసిన న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు ఏజీ ఇవన సాంబశివ ప్రతాప్, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) పసల పొన్నారావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కలిగినీడి చిదంబరం, హైకోర్టు రిజిస్ట్రార్లు, న్యాయవాదులు పాల్గొన్నారు.ప్రమాణం అనంతరం జస్టిస్ ధనశేఖర్ సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ గుహనాథన్ నరేందర్‌తో కలిసి కేసులను విచారించారు. జస్టిస్ మహేశ్వరరావు, జస్టిస్ గుణరంజన్‌లు సింగిల్ జడ్జీలుగా కేసులను విచారించారు. ప్రమాణం సందర్భంగా న్యాయవాదులు, శ్రేయోభిలాషులు వీరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ముగ్గురితో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది. మరో 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను న్యాయాధికారులు, న్యాయవాదులతో భర్తీచేసేందుకు జనవరిలో చర్యలు చేపట్టే అవకాశం ఉంది. -
17న హర్యానా సీఎం ప్రమాణ స్వీకారం
చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అమోఘ విజయం సాధించిన బీజేపీ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రారంభించింది. అక్టోబర్ 17న నూతన సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త మంత్రులతో గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణం చేయించనున్నారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం హర్యానాలోని పంచకుల సెక్టార్ 5లోని పరేడ్ గ్రౌండ్లో గురువారం ఉదయం 10 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. బీజేపీ నేత నయాబ్ సింగ్ సైనీ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. అక్టోబరు 17న పంచకులలో సీఎం, మంత్రి మండలి ప్రమాణస్వీకారం చేసేందుకు ప్రధాని ఆమోదం లభించిందని కేంద్ర మంత్రి, హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు.త్వరలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల సమావేశం జరుగుతుందని, అందులో శాసనసభా పక్ష నేతను ఎన్నుకుంటారని తెలుస్తోంది. నయాబ్ సింగ్ సైనీని ఎమ్మెల్యేలు అధికారికంగా తమ నేతగా ఎన్నుకోనున్నారని సమాచారం. తాము మళ్లీ అధికారంలోకి వస్తే నయాబ్ సింగ్ సైనీ ముఖ్యమంత్రి అవుతారని బీజేపీ ఎన్నికల ప్రచారంలో ప్రకటించింది.ఇటీవల నయాబ్ సింగ్ సైనీ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా బీజేపీ సీనియర్ నేతలను కలుసుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 37 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. #WATCH | Union Minister & former Haryana CM Manohar Lal Khattar says, "We have received the nod of the PM that on October 17, in Panchkula, the CM and council of ministers will take oath." pic.twitter.com/SLxvKGPWSq— ANI (@ANI) October 12, 2024ఇది కూడా చదవండి: ‘హిందువులు ఎక్కడున్నా ఐక్యంగా మెలగాలి’ -
లడ్డూ వివాదం.. తిరుమలలో భూమన కరుణాకర రెడ్డి ప్రమాణం (ఫొటోలు)
-
Video: భగవద్గీత సాక్షిగా బ్రిటన్ ఎంపీగా శివాని ప్రమాణం
భారత సంతతికి చెందిన 29 ఏళ్ల శివాని రాజా యూకే పార్లమెంటులో హిందువుల పవిత్రగ్రంథం భగవద్గీత సాక్షిగా ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. తాను ఎంపీగా ప్రమాణం చేసిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. లీసెస్టర్ ఈస్ట్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేయడం గౌరవంగా భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. భగవద్గీతపై ప్రమాణం చేసి కింగ్ ఛార్లెస్ రాజుకు విదేయతగా ఉంటానని పేర్కొన్నారు.శివాని రాజా చేసిన స్వీకారోత్సవం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనేక మంది నెటిజన్లు ఆమెను మెచ్చుకుంటున్నారు. మన పవిత్ర గ్రంథాలకు మీరు తగిన గౌరవం ఇవ్వడం సంతోషంగా ఉంది. మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడంలో ఈ భగవద్గీత మార్గదర్శకంగా పనిచేస్తుందని భావిస్తున్నాం* అంటూ కామెంట్ చేస్తున్నారు.It was an honour to be sworn into Parliament today to represent Leicester East. I was truly proud to swear my allegiance to His Majesty King Charles on the Gita.#LeicesterEast pic.twitter.com/l7hogSSE2C— Shivani Raja MP (@ShivaniRaja_LE) July 10, 2024 కాగా గుజరాత్ మూలాలున్న ఈ 29 ఏళ్ల శివాని వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ఇటీవల జరిగిన యూకే పార్లమెంట్ ఎన్నికల్లో లీసెస్టర్ ఈస్ట్ నుంచి ఆమె కన్జర్బేటివ్ పార్టీ ఎంపీగా విజయం సాధించారు. అక్కడ గత 37 ఏళ్లుగా కన్జర్వేటివ్ పార్టీకి చెందిన నేతలెవరూ గెలవకపోవడం గమనార్హం. ఇన్నేళ్ల తరవాత గెలిచి శివాని రాజా రికార్డు సృష్టించారు. అయితే ఈ ఎన్నికల్లో ఓడించింది కూడా భారత సంతతికి చెందిన నేత (రాజేశ్ అగర్వాల్) కావడం విశేషం. శివానికి 14,526 ఓట్లు రాగా రాజేశ్‌కు 10,100 ఓట్లు పడ్డాయి.ఇక ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ వ్యాప్తంగా 650 పార్లమెంటు స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ మార్కు 326 సీట్లు కాగా లేబర్ పార్టీ 412 స్థానాల్లో గెలుపొందింది. కన్జర్వేటివ్‌లు కేవలం 121 స్థానాలకే పరిమితమైంది. దీంతో భారత సంతతికి చెందిన రిషి సునాక్ అధికారాన్ని కోల్పోగా.. 14 ఏళ్ల తర్వాత లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ బ్రిటన్ కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. -
‘బ్లాక్ బుక్’లో మంత్రి పొన్నం పేరు: పాడి కౌశిక్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్: తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఫిలింనగర్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి బుధవారం(జూన్ 26) ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవినీతికి పాల్పడలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వచ్చి తనతో పాటు ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ‘మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఫిలింనగర్‌లోని వేంకటేశ్వర ఆలయంలో ప్రమాణం చేయాలని డిమాండ్ చేశా. ఫ్లైయాష్ స్కామ్ చేయలేదని ప్రమాణం చేయాలని కోరాను. నువ్వు నీతి మంతుడివి అయితే ఎందుకు రాలేదు. నాపై తప్పుడు ఆరోపణలు చేశారు పొన్నం. తడి బట్టలతో హుజురాబాద్‌లో హనుమాన్ విగ్రహం సాక్షిగా ప్రమాణం చేశాను.నీ నిజాయితీ ఎందుకు నిరూపించుకోవడం లేదు పొన్నం ప్రభాకర్. వే బ్రిడ్జిలో కొలతలు తక్కువ వచ్చాయి. దీనికి ప్రూఫ్ ఉంది. వే బిల్ సరిగా లేదు. రవాణా శాఖ మంత్రిగా మీకు బాధ్యత లేదా? రోడ్లు నాశనం చేస్తున్నారు. ఫ్లైయాష్ వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజల శవాల మీద పైసలు ఏరుకుంటున్నాడు’అని కౌశిక్‌రెడ్డి మండిపడ్డారు. ప్రమాణం సందర్భంగా బ్లాక్ బుక్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ పేరును కౌశిక్‌రెడ్డి రాశారు. తాము అధికారంలోకి వచ్చాక పొన్నంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, ప్రమాణం చేసేందుకుగాను బుధవారం ఉదయం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌కు చేరుకున్న కౌశిక్‌రెడ్డి అక్కడి నుంచి వెంకటేశ్వరస్వామి గుడికి బయలుదేరారు. -
ఆ తమిళ ఎంపీకి తెలుగుపై ఎందుకంత ప్రేమ?
తమిళనాడుకు చెందిన ఒక ఎంపీ తెలుగులో ప్రమాణ స్వీకారం చేయడం ఆసక్తికరంగా మారింది. పార్లమెంట్ సమావేశాల రెండో రోజు లోక్‌సభలో ఇది చోటు చేసుకుంది. ఇంతకీ ఆయన తెలుగులో ఎందు ప్రమాణం చేశారు? ఆయనకు తెలుగుతో ఉన్న అనుబంధం ఏమిటి?పార్లమెంట్ సమావేశాల రెండవ రోజున కొత్తగా ఎంపీకైన ఎంపీలలోని పలువులు తమ ప్రాంతీయ భాషలలో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తమిళనాడులోని కృష్ణగిరి లోక్‌సభ నుంచి కాంగ్రెస్ తరపున గెలుపొందిన ఎంపీ కే గోపినాథ్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో ఒక రాష్ట్రానికి చెందిన ఎంపీ మరొక రాష్ట్రపు మాతృ భాషలో ప్రమాణ స్వీకారం చేయడం ఏమిటా? అని అందరూ అతనిని ఆసక్తిగా గమనించారు. ఎంపీ గోపినాథ్ ఓ చేతితో రాజ్యాంగ ప్రతిని పట్టుకొని ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రమాణ స్వీకారం చివరిలో జై తమిళనాడు అని తమిళంలో నినదిస్తూ మరో ట్విస్ట్ ఇచ్చారు. ఆయన ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ గోపీనాథ్ తెలుగు కుటుంబానికి చెందిన వారు. కృష్ణగిరి జిల్లా హోసూరు ఆయన స్వస్థలం. గోపీనాథ్ విద్యాభ్యాసం తెలుగులో కొనసాగింది. 2001, 2006, 2011లలో హోసూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూ వచ్చారు. తమిళనాడులో ఏర్పడిన తెలుగు భాషా సమస్యలతో పాటు, అక్కడి తెలుగు వారి కోసం ఎంపీ గోపీనాథ్ పోరాడారు. తమిళనాడు అసెంబ్లీలోనూ ఆయన పలుమార్లు తెలుగులో ప్రసంగించారు. మాతృభాషపై ఎనలేని మమకారమున్న గోపీనాథ్ మరోమారు పార్లమెంటులోనూ తెలుగులోనే ప్రమాణస్వీకారం చేశారు.కృష్ణగిరి జిల్లా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతుంది. ఈ జిల్లా ఆంధ్రప్రదేశ్‌కు అతి సమీపంలో ఉంది. దీంతో ఇక్కడి ప్రజలు తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషలను కూడా మాట్లాడుతారు. కాగా గతంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత కూడా అసెంబ్లీలో తెలుగులో ప్రసంగించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో వివిధ సందర్భాల్లో వైరల్ అవుతుంటుంది. .@INCTamilNadu MP K. Gopinath from the Krishnagiri constituency surprised everyone by taking his oath in #Telugu. pic.twitter.com/ooGgVDg4VH— South First (@TheSouthfirst) June 25, 2024 -
రాజ్యాంగం చేతబూని ఎంపీగా ప్రమాణం
న్యూఢిల్లీ: 18వ లోక్‌సభ ప్రత్యేక సమావేశాల్లో రెండో రోజు మంగళవారం పలు పార్టీల సభ్యులు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ సభ్యుడు రాహుల్ గాం«దీ, సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు అఖిలేష్ యాదవ్, డింపుల్ యాదవ్, బీజేపీ సభ్యుడు ఓం బిర్లా, బీజేపీ సభ్యురాలు హేమామాలిని, డీఎంకే నేత కనిమొళి, కేంద్ర మంత్రులు నారాయణ్ రాణే, ఎన్సీపీ(ఎస్పీ) నేత సుప్రియా సూలే, శివసేన(ఉద్ధవ్) సభ్యుడు అరవింద్ సావంత్ తదితరులు లోక్‌సభ సభ్యులుగా ప్రమాణం చేశారు.రాహుల్ గాం«దీ, అఖిలేశ్ యాదవ్ సహా పలువు ప్రతిపక్ష సభ్యులు రాజ్యాంగ ప్రతిని చేతబూని ప్రమాణం చేయడం విశేషం. ప్రమాణ స్వీకారం అనంతరం రాహుల్ గాంధీ ‘జైహింద్, జై సంవిధాన్’ అంటూ నినదించారు. స్వతంత్ర సభ్యుడు రాజేశ్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ ‘నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలి’ అని రాసి ఉన్న టి–షర్టును ధరించి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆజాద్ సమాజ్ పార్టీ(కాన్షీరామ్) ఎంపీ చంద్రశేఖర్ ప్రమాణం చేసిన తర్వాత ‘జైభీమ్, జైభారత్, జై సంవిధాన్, జైమండల్, జైజోహార్, జైజవాన్, జైకిసాన్’ అని నినాదాలు చేశారు. -
లోక్‌సభలో నినాదాల వివాదం.. స్పీకర్ కీలక ప్రకటన
సాక్షి,న్యూఢిల్లీ: లోక్‌సభలో రెండోరోజు మంగళవారం(జూన్25) కొత్త ఎంపీల ప్రమాణస్వీకారం సందర్భంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రమాణాలు చేసిన తర్వాత పలువురు ఎంపీలు చేసిన నినాదాలు వివాదాస్పదమయ్యాయి. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తన ప్రమాణం ముగిసిన తర్వాత జై తెలంగాణ, జై భీం, జై పాలస్తీనా అని నినాదాలు చేశారు.BREAKING : Huge uproar in the Parliament after Hyderabad MP Asaduddin Owaisi says “ Jai Palestine” at the end of his oath. Your thoughts on this. pic.twitter.com/FQMEIeaFHX— Roshan Rai (@RoshanKrRaii) June 25, 2024తమిళనాడులోని తిరువళ్లూర్ ఎంపీ శశికాంత్ సెంథిల్ రాజ్యాగం చేత పట్టుకుని తమిళ్లో ప్రమాణం చేశారు. ఈయన కూడా తన ప్రమాణం ముగిసిన తర్వాత ‘ఆదివాసీలు, దళితులు, మైనారిటీల మీద వేధింపులు ఆపండి. జై భీం, జై సంవిధాన్’అని నినదించారు. ఈయన కాశ్మీర్ స్వయంప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 370 రద్దుకు నిరసనగా అప్పట్లో తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. The IAS officer who resigned after the abrogation of #Article370 in #Kashmir and #Tiruvallur's #Congress MP #SasikanthSenthil took oath in Tamil.When he said, "Stop the shameful atrocities against the Minorities, Dalits & Adivasis. Jai Bhim, Jai Sanvidhan" #BJP MPs protested.… pic.twitter.com/jv1uyp2pGu— Hate Detector 🔍 (@HateDetectors) June 25, 2024సభలో అసదుద్దీన్, శశికాంత్ సెంథిల్ చేసిన నినాదాలపై బీజేపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్పీకర్ కలుగజేసుకుని ఎంపీలు చేసిన వివాదాస్పద నినాదాలను రికార్డుల నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చారు. -
అసదుద్దీన్ నినాదాలతో లోక్‌సభలో దుమారం
సాక్షి,న్యూఢిల్లీ: లోక్‌సభలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ప్రమాణం దుమారం రేపింది. మంగళవారం(జూన్25) తెలంగాణ ఎంపీల ప్రమాణాల్లో భాగంగా అసదుద్దీన్ కూడా ప్రమాణం చేశారు.ఈ ప్రమాణం ముగిసిన తర్వాత అసదుద్దీన్ చేసిన నినాదాలు వివాదాస్పదమయ్యాయి. జై తెంగాణ, జై భీమ్, జై పాలస్తీనా అని అసదుద్దీన్ నినదించారు. దీనిపై అధికారపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన ప్రొటెం స్పీకర్ మెహతాబ్ అసదుద్దీన్ నినాదాలను రికార్డుల నుంచి తొలగిస్తామని ప్రకటించారు. స్పీకర్ ప్రకటన అనంతరం వివాదం సద్దుమణిగింది. BREAKING : Huge uproar in the Parliament after Hyderabad MP Asaduddin Owaisi says “ Jai Palestine” at the end of his oath. Your thoughts on this. pic.twitter.com/FQMEIeaFHX— Roshan Rai (@RoshanKrRaii) June 25, 2024 -
ఆ ఎంపీ మాతృభాషలో ప్రమాణం ఎందుకు చేయలేకపోయారు?
18వ లోక్‌సభలో భాషా సాంస్కృతిక వైవిధ్యం కనిపించింది. పలువురు ఎంపీలు తమ మాతృభాషలో ప్రమాణం చేశారు. అయితే తన భాష అయిన భోజ్‌పురిలో ప్రమాణం చేయలేకపోయినందుకు బీహార్‌లోని సారణ్కు చెందిన బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ విచారం వ్యక్తం చేశారు.లోక్‌సభలో కొత్తగా ఎన్నికైన ఎంపీలు ఇంగ్లీష్, సంస్కృతం, హిందీ, డోగ్రీ, బెంగాలీ, అస్సామీ ఒరియాలతో సహా పలు భారతీయ భాషల్లో ప్రమాణం చేశారు. ఎంపీలు ఇంగ్లీషులో లేదా రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో పేర్కొన్న 22 భాషల్లో దేనిలోనైనా ప్రమాణం చేయవచ్చు. అయితే భోజ్‌పురి భాషకు ఎనిమిదవ షెడ్యూల్ జాబితాలో స్థానం దక్కలేదు. రాజీవ్ ప్రతాప్ రూడీ భోజ్‌పురిలో ప్రమాణం చేయకపోవడానికి కారణం ఇదే. ఎంపీలు మాతృభాషలో ప్రమాణ స్వీకారం చేయడం గొప్ప అనుభూతిని కలిగిస్తుందని రూడీ అన్నారు.ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీహార్‌లోని తూర్పు చంపారన్‌కు చెందిన బీజేపీ ఎంపీ రాధామోహన్ సింగ్ అధ్యక్షత వహించారు. కాగా రాజీవ్ ప్రతాప్ సింగ్ రూడీ హిందీలో ప్రమాణం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్యపై రాజీవ్ ప్రతాప్ రూడీ విజయం సాధించారు. -
ఏపీ అసెంబ్లీ: శాసనసభ్యుడిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం (ఫొటోలు)
-
YSRCP MLA's ప్రమాణ స్వీకారం
-
ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రమాణస్వీకారం
-
ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి ప్రమాణస్వీకారం
-
ఎమ్మెల్యేగా తాటిపర్తి చంద్రశేఖర్ ప్రమాణస్వీకారం
-
ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన సీఎం చంద్రబాబు
-
ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
-
ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన వైఎస్ జగన్
-
ఒడిస్సా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరైన పీఎం మోదీ
-
ఏపీ మంత్రిగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం
-
అధికారం కోసమో..పదవి కోసమే నేను రాలేదు : పీఎంవోలో ప్రధాని మోదీ
అధికారం కోసమో పదవి కోసమే నేను రాలేదని ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ పీఎంవో సిబ్బందితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. 140 కోట్ల మంది భారతీయులు నాకు పరమాత్మతో సమానం. ఇది మోదీ పీఎంవో కాదు.. ప్రజల పీఎంవో.. దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యతమీదే. అభివృద్ధికి మీరు వారధి లాంటి వారంటూ పీఎంవో సిబ్బందనిపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. -
కెనడా ఎంపీ.. కన్నడలో ప్రమాణం
ఒట్టావా: ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారిలో చాలా మంది తమ మాతృభాషలో కాకుండా ఇంగ్లీష్‌లో ప్రమాణస్వీకారం చేసే రోజులివి. మన దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి ఎంపీలుగా ఎన్నికైన వాళ్లు మాతృభాషలో కాకుండా ఇంగ్లీష్, హిందీ భాషల్లో పార్లమెంటులో ప్రమాణస్వీకారం చేయడం, ప్రసంగించడం తరచుగా చూస్తుంటాం. కానీ కెనడాలో ఎంపీగా ఎన్నికైన ప్రవాస కన్నడిగుడు చంద్రఆర్య అక్కడి పార్లమెంటులో కన్నడ భాషలో ప్రమాణస్వీకారం చేసి మాతృభాషపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. చంద్రఆర్య కన్నడలో ప్రమాణస్వీకారం చేసిన వెంటనే సహచర ఎంపీలు ఆయనను సీట్లలో నుంచి లేచి అభినందించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఎంత ఎదిగినా ఎక్కడికి వెళ్లినా మనం ఎక్కడి నుంచి వచ్చాం అనేది మరచిపోవద్దని నెటిజన్లు చంద్ర ఆర్య వీడియోనుద్దేశించి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. pic.twitter.com/lYW3RDH4vO— Harish Itagi (@HarishSItagi) June 9, 2024 -
రాజ్యసభ ఎంపీగా 'సుధామూర్తి' ప్రమాణ స్వీకారం
ఇంజనీర్ నుంచి పరోపకారిగా మారి ఎంతోమందికి సహాయం చేస్తున్న'సుధామూర్తి' ఈ రోజు (గురువారం) తన భర్త ఎన్ఆర్ నారాయణ మూర్తి సమక్షంలో రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ హౌస్‌లోని తన ఛాంబర్లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో పీయూష్ గోయల్ కూడా పాల్గొన్నారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్పర్సన్, రచయిత్రి సుధామూర్తి పిల్లల కోసం అనేక పుస్తకాలను రచించింది. కన్నడ, ఇంగ్లీష్ సాహిత్యానికి ఆమె చేసిన కృషికి సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారంలభించింది. అంతే కాకుండా ఈమెను 2006లో పద్మశ్రీ, 2023లో పద్మ భూషణ్ అవార్డులు వరించాయి. గత శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు. TELCOతో పనిచేసిన మొదటి మహిళా ఇంజనీర్ అయిన సుధామూర్తి.. నేడు వేలకోట్ల సామ్రాజ్యంగా మారిన ఇన్ఫోసిస్ ప్రారంభానికి ప్రధాన కారకురాలు కూడా. #WATCH | Author and philanthropist Sudha Murty, nominated to the Rajya Sabha by President Droupadi Murmu, takes oath as a member of the Upper House of Parliament, in the presence of House Chairman Jagdeep Dhankhar Infosys founder Narayan Murty and Union Minister Piyush Goyal… pic.twitter.com/vN8wqXCleB — ANI (@ANI) March 14, 2024 -
జేడీ(యూ) ఎల్పీ భేటీకీ ఎమ్మెల్యేలు డుమ్మా
పాట్నా: సీఎం నితీశ్ కుమార్ సర్కారుపై అసెంబ్లీలో సోమవారం జరిగే విశ్వాస పరీక్షలో నెగ్గుతామని అధికార జేడీయూ ధీమా వ్యక్తం చేసింది. శనివారం సీఎం నితీశ్ ఇచ్చిన విందుకు కొందరు డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. అలాగే, ఆదివారం మంత్రి విజయ్ కుమార్ చౌదరి అధ్యక్షతన జరిగిన పార్టీ శాసనసభా పక్షం భేటీకి సైతం కొందరు గైర్హాజరవడం కలకలం రేపింది. ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు తప్పనిసరి పరిస్థితుల్లో గైర్హాజరయ్యారని చౌదరి చెప్పారు. తొలుత ఆర్జేడీకి చెందిన స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం, అనంతరం ప్రభుత్వంపై విశ్వాస పరీక్షలో వారంతా ఓటేస్తారన్నారు. స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ కుమార్ జేడీయూ ఎల్పీ భేటీలో పాల్గొనడం విశేషం. సోమవారం వామపక్ష సభ్యులతో కలిసి ఆర్జేడీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకుంటారని తెలిసింది. వారం రోజులుగా హైదరాబాద్‌లో మకాం వేసిన 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారం పటా్న చేరారు. -
ఆస్ట్రేలియా పార్లమెంట్ చరిత్రలో తొలిసారి.. సెనేటర్‌గా భగవద్గీతపై ప్రమాణం!
బ్రిటన్ పార్లమెంట్లో ప్రధానిగా రిషి సునాక్ భగవద్గీతపై ప్రమాణం చేయడం భారతీయులకు ఎంతో గర్వంగా అనిపించింది. వలస పాలనతో మన దేశాన్ని పాలించిన ఆంగ్లేయుల దేశంలో మన భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ ప్రధాని అవ్వడం, మన హిందూమత గ్రంథం భగవద్గీతపై ప్రమాణం చేయడం ప్రతీ భారతీయుడిని భావోద్వేగానికి గురి చేసింది. అలా చేసిత తొలి యూకే ప్రధానిగా రిషి సునాక్ అందరీ దృష్టిని ఆకర్షించారు కూడా. మళ్లీ అదే తరహాలో ఆస్ట్రేలియా పార్లమెంట్లో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమయ్యింది. అంతేగాదు ఆస్ట్రేలియన్ పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారి ఓ చారిత్రక ఘట్టానికి వేదికయ్యింది. అదేంటంటే.. ఆస్ల్రేలియా పార్లమెంట్ చరిత్రలో తొలిసారిగా ఓ అపూర్వ ఘట్టం ఆవిష్కృతమయ్యింది. భారత సంతతికి చెందిన బారిస్టర్ వరుణ్ ఘోష్.. ఆస్ట్రేలియా పార్లమెంటు సాక్షిగా భగవద్గీతపై ప్రమాణం చేశారు. ఆస్ట్రేలియన్ పార్లమెంట్ చరిత్రలో ఈ ఘటన సాధించిన తొలి సభ్యుడిగా చరిత్ర సృష్టించారు. హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత. ఇప్పటికీ మన కోర్టుల్లో దీనిపైనే ప్రమాణం చేస్తారు. మన చట్ట సభల్లో భగవంతుని సాక్షిగా, మనస్సాక్షిగా మన ప్రజాప్రతినిధులు ప్రమాణం చేస్తుంటారు. కానీ, ఆస్ట్రేలియన్ పార్లమెంటులో మన పవిత్ర గ్రంథంపై భారతీయ సంతతికి చెందిన సెనేటర్(ఎంపీ) ప్రమాణం చేసిన తొలి ఆస్ట్రేలియన్ సెనేటర్‌గా చరిత్ర సృష్టించారు. The Legislative Assembly and the Legislative Council have chosen Senator Varun Ghosh to represent Western Australia in the Senate of the Federal Parliament. 📄Read Hansard or view our broadcast archive after the joint sitting: https://t.co/TtFao460FO pic.twitter.com/TMEx59SqTG — Legislative Assembly (@AssemblyWA) February 1, 2024 లెజిస్టేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఫెడరల్ పార్లమెంట్ సెనేట్‌లో పశ్చిమ ఆస్ట్రేలియాకి ప్రాతినిథ్యం వహించేందుకు వరుణ్ ఘోషను ఎంపిక చేశాయి. ఈ మేరకు ఆస్ట్రేలియన్ విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ వరుణ్ ఘోష్‌కి స్వాగతం పలుకుతూ ట్విట్టర్లో..పశ్చిమ ఆస్ట్రేలియా సరికొత్త సెనెటర్ వరుణ్ ఘోష్‌కి స్వాగతం. సెనేటర్ భగవద్గీతపై ప్రమాణం చేసిన తొలి ఆస్ట్రేలియన్ సెనేటర్ మీరు. తొలిసారిగా ఓ వ్యక్తి సరికొత్త అధ్యయానికి తెరతీసినప్పుడూ అతనే చివరి వారు కాదని గుర్తుంచుకోవాలి. సెనేటర్ ఘోష్ పశ్చిమ ఆస్ట్రేలియన్ల బలమైన గొంతుకగా ఉంటారని నమ్ముతున్నా. అని పేర్కొన్నారు పెన్నీ వాంగ్. ఇక ఆస్ట్రేలియన్ ప్రధాన మంత్రి ఆంథోని అల్బనీస్ కూడా ట్విట్టర్లో పశ్చిమా ఆస్ట్రేలియా సరికొత్త సెనెటర్ వరుణ్ ఘోష్‌కి స్వాగతం. మీరు పార్లమెంటు సభ్యుడిగా ఉండటం అద్భుతంగా ఉంది. అని అన్నారు. Welcome Varun Ghosh, our newest Senator from Western Australia. Fantastic to have you on the team. pic.twitter.com/TSnVoSK3HO — Anthony Albanese (@AlboMP) February 5, 2024 వరుణ్ నేపథ్యం.. పెర్త్‌లో నివాసం ఉండే వరుణ్ ఘోష్ వృత్తి రీత్యా న్యాయవాది. అతను వెస్ట్రన్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం నుంచి ఆర్ట్స్ అండ్ లాలో డిగ్రీని పొందాడు. క్రేం బ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో కామన్వెల్త్ స్కాలర్కూడా. అతను వాషింగ్టన్ డీసీలో ప్రపంచబ్యాంకు సలహదారుగా, న్యూయార్క్ ఫైనాన్స్ అటార్నీగా బాధ్యతలు నిర్వహించారు. ఆస్ట్రేలియాలోని లేబర్ పార్టీలో చేరడంతో అతని రాజకీయ జీవితం పెర్త్‌లో ప్రారంభమయ్యింది. ఇక వరణ్ ఘోష్ మాట్లాడుతూ..తాను మంచి విద్యను అభ్యసించడం వల్లే అధికారాన్ని పొందగలిగాను కాబట్టి నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉండాలని గట్టిగా విశ్వసిస్తాను అని చెప్పారు. కాగా, అనారోగ్య కారణాలతో పదవీ విరమణ చేయబోతున్న సెనెటర్ పాట్రిక్ డాడ్సన్ స్థానంలో వరుణ్ ఘోష్ సెనేటర్‌గా ఎంపికయ్యారు. 17 ఏళ్ల వయసులోనే వరుణ్ ఘోష్ లేబర్ పార్టీలో చేరారు. భారతీయ – ఆస్ట్రేలియన్ బారిస్టర్ అయిన ఘోష్ గతవారం లేబర్ పార్టీ అధికారికంగా కీలక పాత్రకు ఎంపిక చేసింది. #VarunGhosh on Tuesday became the first ever India-born member of the Australian Parliament to take oath on #Bhagavadgita. Varun Ghosh from Western Australia has been appointed as the newest Senator after the Legislative Assembly and the Legislative Council chose him to represent… pic.twitter.com/KzIhIYSZC0 — DD India (@DDIndialive) February 6, 2024 (చదవండి: 'ఉక్కు మనిషి' సర్దార్ అని ఎందుకు అంటారంటే..?) -
'టీ-పాడ్' నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం
తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ 'టీ-పాడ్' నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. టెక్సాస్‌లోని ఇర్వింగ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో డాలస్ ప్రాంతీయులు, అన్ని స్థానిక, తెలుగు జాతీయ సంస్థల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజల్వన, గణపతి ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమైంది. కొత్తగా ఎన్నికైన కార్యవర్గ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. టీ-పాడ్ 2024 అధ్యక్షురాలిగా కన్నయ్యగారి రూప, కార్యదర్శిగా అన్నమనేని శ్రీనివాస్, కోశాధికారిగా గణపవరపు బాలాలు ఎన్నికయ్యారు. ఫౌండేషన్ కమిటీ అధ్యక్షుడిగా జానకిరాం, ఉపాధ్యక్షుడిగా అజయ్ రెడ్డి, ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌గా బుచ్చి రెడ్డిలు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గానికి సభ్యులు అభినందనలు తెలిపారు. టీ-పాడ్ తెలంగాణ సంస్కృతిని ప్రోత్సహించడమే కాకుండా జట్టు సభ్యులకు నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించడానికి వేదిక అయిందని సంస్థ అధ్యక్షురాలు పేర్కొన్నారు. టీ-పాడ్ ఏర్పాటు చరిత్ర, అనేక సంవత్సరాలుగా నిర్వహించిన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాల గురించి ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులు వివరించారు. తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించటం.. బతుకమ్మ, దసరా సంబరాలను వాటి సిగ్నేచర్ స్టైల్లో నిర్వహించడం గురించి వివరించారు. చివరగా ఈ ఏడాది టీపాడ్ చేపట్టాల్సిన కార్యక్రమాలపై నూతన కార్యవర్గం చర్చించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు ప్రాంతీయ, జాతీయ సంస్థల నాయకులు.. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను అభినందించారు. (చదవండి: న్యూయార్క్ టైమ్స్ స్వ్కేర్ రామ మయం) -
ఐ లవ్ యు డాడీ...అసెంబ్లీలో పాడి కౌశిక్ రెడ్డి కూతురు
-
ఓట్ తో దుమ్ము రేపుదాం..!
-
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ నరేందర్ ప్రమాణం
సాక్షి,అమరావతి/ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):: ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా గుహనాథన్ నరేందర్ సోమవారం ప్రమాణం చేశారు. ఆయన చేత రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు. ప్రమాణం అనంతరం జస్టిస్ నరేందర్‌ను గవర్నర్ అభినందించారు. అంతకు ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఈ కార్యక్రమ ప్రొసీడింగ్స్‌ను నిర్వహించారు. అనంతరం జస్టిస్ నరేందర్ నియామకానికి సంబంధించి రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వై.లక్ష్మణరావు చదివి వినిపించారు. కాగా.. రాజ్‌భవన్‌లో జస్టిస్ నరేందర్‌ను అటు గవర్నర్, ఇటు ముఖ్యమంత్రికి జస్టిస్ ధీరజ్ సింగ్ పరిచయం చేశారు. కార్యక్రమం అనంతరం రాజ్‌భవన్ ఏర్పాటు చేసిన తేనీటి విందులో అందరూ పాల్గొన్నారు. 30కి చేరిన న్యాయమూర్తుల సంఖ్య జస్టిస్ నరేందర్ నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. జస్టిస్ నరేందర్ హైకోర్టులో నాలుగో స్థానంలో కొనసాగుతారు. మంగళవారం ఆయన జస్టిస్ దుర్గాప్రసాదరావుతో కలిసి కేసులను విచారిస్తారు. వాస్తవానికి ఈ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొనాల్సి ఉంది. ఇందుకు సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారైంది. అయితే.. విజయనగరంలో జరిగిన రైలు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వెళ్లడం, తిరిగి రావడంలో జాప్యం జరగడంతో జస్టిస్ నరేందర్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొనలేకపోయారు. దుర్గమ్మను దర్శించుకున్న జస్టిస్ జి.నరేందర్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.నరేందర్ సోమవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందచేశారు. ఆలయ ఏఈవో చంద్రశేఖర్ జస్టిస్ నరేందర్‌కు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు సమర్పించారు. -
ఓటు వేసి సరైన నాయకుడిని ఎన్నుకోండి
-
ఓటు వేసి సరైన నాయకుడిని ఎన్నుకోండి
-
మెట్టు మొక్కి సభలోకి అడుగుపెట్టిన డీకే శివకుమార్..
-
నేపాల్ అధ్యక్షుడిగా రామ్ చంద్ర పౌడెల్
నేపాల్ అధ్యక్షుడిగా సీనియర్ నేపాలీ కాంగ్రెస్ నాయకుడు రామచంద్ర పాడెల్ సోమవారం ప్రమాణం చేశారు. ఈ మేరకు శీతల్ నివాస్‌లోని రాష్ట్రపతి కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి హరి కృష్ణ కర్కీ 78 ఏళ్ల పౌడెల్ చేత ప్రమాణం చేయించారు. పౌడెల్ నేపాల్ కొత్త అధ్యక్షుడిగా గురవారం ఎన్నికయ్యారు. ఆయన అధ్యక్ష ఎన్నికల్లో 33,802 ఓట్లు సాధించగా, పౌడెల్ ప్రత్యర్థి సుభాష్ చంద్ర నెంబ్వాంగ్ 15,518 ఓట్లు సాధించారు. ఈ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో ఫెడరల్ పార్లమెంట్‌లోని 313 మంది సభ్యులు, అలాగే ప్రాంతీయ అసెంబ్లీల నుంచి 518 మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ ఓటింగ్ ఖాట్మాండ్‌లోని న్యూ బనేశ్వర్‌లోని నేపాల్ పార్లమెంట్లో జరిగింది. నేపాల్ ఎన్నికల సంఘం ఫెడరల్ పార్లమెంటేరియన్లు, ప్రావిన్స్ అసెంబ్లీ సభ్యుల కోసం రెండు వేర్వేరు పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసింది. ఈ అధ్యక్ష ఎన్నికల కోసం అన్ని ప్రావిన్సులకు చెందిన శాసనసభ్యులు ఖాట్మాండుకు చేరుకున్నారు. ఇందులో 884 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. అందులో 274 మంది సభ ప్రతినిధుల సభ్యులు, 59 మంది నేషనల్ అసెంబ్లీ సభ్యులు కాగా, ఏడు ప్రావిన్షియల్ అసెంబ్లీలకు చెందిన 550 మంది సభ్యులు ఉన్నారు. ఈ మేరకు పౌడెల్ మాట్లాడుతూ.."పాలనలో తనకు అనుభవం ఉందని, రాష్ట్ర యంత్రాంగాల పని తీరుకు ఈ కొత్త పదవి సరిపోతుంది. నేపాల్ రాచరికం సమయంలో మాజీ హౌస్ స్పీకర్‌గా పనిచేసిన పౌడెల్ తనకు వాటిల్లో అపార అనుభవం ఉంది. ఇంతకుముందు వివిధ ప్రభుత్వ అధికారులుగా బాధ్యతలు నిర్వర్తించాను . రాచరికం సమయాల్లో రాజభవనాలకు వెళ్లాను. సభాపతిని అయ్యాను. వారానికి ఒకసారి ప్యాలెస్‌ని సందర్శించాను. మాజీ అధ్యక్షులతో సమావేశాల్లో పాల్గొన్నాను. అక్కడ చేపట్టాల్సిన విధులు గురించి తనకు తెలుసునని, ఇవేమి తనకు కొత్త కాదు అని" తేల్చి చెప్పారు. కాగా, పౌడెల్ మాజీ హౌస్ స్పీకర్‌గానే కాకుండా దశాబ్దం పాటు జైల్లో ఉన్నారు కూడా. ఇప్పటి వరకు ఆరుసార్లు శాసన సభ్యుడిగా, ఐదుసార్లు మంత్రిగా పనిచేశారు. ఆయన ఇప్పుడూ నేపాల్ దేశానికి మూడవ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గురువారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పౌడెల్‌కు మొత్తం పది పార్టీల మద్దతు లభించింది. -
త్రిపుర సీఎంగా మాణిక్ సాహా ప్రమాణం
అగర్తలా: త్రిపుర ముఖ్యమంత్రిగా డాక్టర్ మాణిక్ సాహా ప్రమాణం చేశారు. అగర్తలాలోని వివేకానంద మైదాన్‌లో బుధవారం ఉదయం జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు. ప్రధాని మోదీ, అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంల సమక్షంలో ఆయన సీఎంగా ప్రమాణం చేశారు. కాగా, మాణిక్ సాహా సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఇది వరుసగా రెండోసారి. కిందటి ఏడాది.. విప్లవ్ కుమార్ దేవ్ రాజీనామాతో అనూహ్యంగా మాణిక్ సాహాను తెర మీదకు తెచ్చింది బీజేపీ. మే 15వ తేదీన మాణిక్ సాహా త్రిపుర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బోర్దోవాలీ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకు ముందు ఆయన రాజ్యసభ సభ్యుడిగానూ సేవలందించారు. త్రిపుర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా 2020 నుంచి 2022 మధ్య ఆయన పని చేశారు. అయితే.. ఆయన రాజకీయ ప్రస్థానం మాత్రం మొదలైంది కాంగ్రెస్ పార్టీతోనే. 2016లో ఆయన కాంగ్రెస్‌ను వీడి.. బీజేపీలో చేరారు. గతంలో.. త్రిపుర క్రికెట్ అసోషియేషన్‌కు ఆయన అధ్యక్షుడిగా పని చేశారు. Prime Minister Narendra Modi arrives at Swami Vivekananda Maidan in Agartala for the swearing-in ceremony of Tripura CM-designate Manik Saha. (Source: DD) pic.twitter.com/5QrhWbl0fp — ANI (@ANI) March 8, 2023 సాహా డెంటల్ డాక్టర్. రాజకీయాల్లోకి రాకమునుపు.. హపానియాలోని త్రిపుర మెడికల్ కాలేజీలో పాఠాలు చెప్పారు కూడా. ఆయనకు భార్య స్వప్న, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ప్రధాన నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో 'ఉన్నత త్రిపుర', 'శ్రేష్ట త్రిపుర' నిర్మించేందుకు అన్ని సంక్షేమ వర్గాల ప్రజలతో కలిసి పని చేస్తాం అని మాణిక్ సాహా పేర్కొన్నారు. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 32 సీట్లతో అధికారం దక్కించుకుంది. తర్వాతి స్థానంలో తిప్ర మోత పార్టీ 13 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మార్క్సిస్ట్) 11 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ మూడు సీట్లు గెలుచుకుంది. ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(ఐపీఎఫ్టీ) కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకుంది. (చదవండి: బైక్ ట్యాక్సీ నడుపుతున్న విదేశీయుడు.. ఆటో డ్రైవర్ సీరియస్ వార్నింగ్) -
మేఘాలయ, నాగాలాండ్ ముఖ్యమంత్రులు ప్రమాణం
నాగాలాండ్, మేఘాలయా ముఖ్యమంత్రులుగా ఎన్డీపీపీ చెందిన నీఫియా రియో, నేఫనల్ పీపుల్స్ పార్టీకి చెందిన కాన్రాడ్ సంగ్మా మంగళవారం ప్రమాణం చేశారు. మొదటగా నేషనల్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు కాన్రాడ్ కె సంగ్మా మేఘాలయ ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా తోపాటు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరయ్యారు. మంగళవారం సంగ్మా తోపాటు ఎన్పీపీకి చెందిన ప్రిస్టోన్ టిన్సాంగ్, స్నియావ్‌భలాంగ్ ధర్లు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే బీజేపీకి చెందిన అలెగ్జాండర్ లాలూ హెక్, యుడీపీకి చెందిన పాల్ లింగ్డో, కిర్మెన్ షిల్లా, హెచ్ఎస్పీడీపీకి చెందిన షక్లియార్ వార్జ్రీ కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ మేరకు నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలలో యూడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ, హెచ్ఎస్పీడీపీకి నుంచి ఒక్కొక్కరు సంగ్మా మంత్రివర్గంలో సభ్యులుగా గవర్నర్ ఫాగు చౌహాన్ ప్రమాణం చేయించారు. ఇదేరోజు నాగాలాండ్ ముఖ్యమంత్రిగా నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డిపిపి)కి చెందిన నీఫియు రియో కూడా ప్రమాణ చేశారు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నీఫియు ఐదోసారి ప్రమాణం చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులుగా టిఆర్ జెలియాంగ్, వై పాటన్ ప్రమాణ స్వీకారం చేయగా, రియో క్యాబినెట్‌లోని ఇతర సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే సోషల్ మీడియాలో కామెడీ చేస్తూ ఫేమస్ అయినా రాష్ట్ర బీజేపీ చీఫ్ టెమ్జెన్ ఇమ్నా అలోంగ్, నానాగాలాండ్ అసెంబ్లీకి తొలిసారిగా ఎన్నికైన ఇద్దరు మహిళల్లో ఒకరైన సల్హౌతుయోనువో క్రూసే మంత్రి మండలి సభ్యులుగా ప్రమాణం చేశారు. హోలీ తర్వాత రోజు గురువారం త్రిపురలో బీజేపీకి చెందిన మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికల ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి ఎన్డీపీపీ, బీజేపీ రెండూ తన ముఖ్యమంత్రి అభ్యర్థిగా 72 ఏళ్ల రియోను ఎన్నుకున్నాయి. అలాగే రాష్ట్రంలోని అన్ని ఇతర పార్టీలు రియో నేతృత్వంలోని కూటమికి తమ మద్దతను ఇచ్చాయి. మేఘాలయాలో ఎన్పీపీ నేతృత్వంలోని కూటమి బీజేపీకి చెందిన ఇద్దరితో సహా మొత్తం 45 మంది ఎమ్మెల్యేల మద్దతుతో సీఎం కాన్రాడ్ సంగ్మా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. సంగ్మా ఫిబ్రవరి 27న జరిగిన ఎన్నికల్లో 26 సీట్లు గెలుచుకున్నారు. ఆయన మంగళవారం ఇతర క్యాబినేట్ మంత్రులతో కలిసి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, సోమవారం కొత్తగా ఎన్నికైన 58 ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయగా, ప్రొటెం స్పీకర్ తిమోతి షిరా వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ వేడుకగా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగ్మా కూడా హాజరయ్యారు. కొత్తగా ఏర్పాటైన అసెంబ్లీకి స్పీకర్‌ను మార్చి9న ప్రత్యేక హౌస్‌లో సెషన్లో ఎన్నుకోనున్నట్టు సమాచారం. త్రిపురలో బీజేపీ నాయకుడు మాణిక్ సాహా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతారని ఆ పార్టీ ప్రకటించింది. సోమవారం అగర్తలాలో జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో సాహాను ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాజీబ్ భట్టాచారీ తెలిపారు. అంతేగాదు బీజేపీ దాని మిత్ర పక్షాలు త్రిపుర, నాగాలాండ్‌లో అధికారాన్ని నిలుపుకోగా, మేఘాలయాలో నేషనల్ పీపుల్స్ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. (చదవండి: విమానం ల్యాండింగ్ అవుతుందనంగా.. ఎమర్జెన్సీ డోర్ తెరిచే యత్నం..) -
హిమాచల్ ప్రదేశ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సుఖ్వీందర్ సింగ్ సుఖ్
-
ఏపీ ముఖ్య సమాచార కమిషనర్ & కమిషనర్ ప్రమాణస్వీకారం
-
మెడికల్ కాలేజీలో ‘చరక శపథం’ రగడ.. డీన్ సస్పెండ్
చెన్నై: తమిళనాడులోని మదురై ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కొత్తగా చేరిన విద్యార్థులు ప్రాచీన ఆయుర్వేద వైద్యుడు చరకుడు పేరు మీద ప్రమాణం చేయడం వివాదానికి దారి తీసింది. మెడికల్ కాలేజీలో చేరేటప్పుడు విద్యార్థులు వైద్య శాస్త్ర పితామహునిగా చెప్పుకునే హిపోక్రేట్స్ పేరిట ప్రమాణం చేస్తారు. కానీ, మదురై మెడికల్ కాలేజీ డీన్ రత్నవేల్ కొత్త విద్యార్థులతో శనివారం ‘మహర్షి చరక శపథం’ చేయించడం కలకలం రేపింది. దాంతో ప్రభుత్వం ఆయనను బాధ్యతల నుంచి తొలగించింది. పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్లో ఉంచింది. దీనిపై విచారణకు ఆదేశించింది. ఇలా నిబంధనలు అతిక్రమించడం సరికాదని ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్ అన్నారు. నిబంధనల మేరకే విద్యార్థులతో ప్రమాణం చేయించాలని మెడికల్ కాలేజీలను ఆదేశించారు. ఈ ఘటనపై బీజేపీ నాయకుడు నారాయణన్ తిరుపతి స్పందిస్తూ, డీన్ తొలగింపు నిర్ణయం రాజకీయ ఎత్తుగడ అని పేర్కొన్నారు. -
పంజాబ్ సీఎంగా 16న మాన్ ప్రమాణం
చండీగఢ్/న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత భగవంత్ మాన్ ఈ నెల 16న పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్వాతంత్య్ర పోరాట యోధుడు భగత్‌సింగ్ పూర్వీకుల గ్రామమైన నవన్షార్ జిల్లాలోని ఖట్కార్ కలాన్‌ను ప్రమాణ స్వీకారానికి వేదికగా నిర్ణయించుకున్నారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్‌ను కలిశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు. భేటీలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆప్ పంజాబ్ వ్యవహారాల ఇన్చార్జి రాఘవ్ చద్ధా కూడా పాల్గొన్నారు. 13న కేజ్రీవాల్, భగవంత్ మాన్ కలిసి అమృత్‌సర్‌లో రోడ్‌షోలో పాల్గొంటారని ఆప్ వర్గాలు తెలిపాయి. మాన్ పంజాబ్ సీఎంగా ప్రమాణం చేయబోతున్నారని, తనకు ఆహ్వానం అందజేశారని కేజ్రివాల్ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రిగా పంజాబ్ ప్రజల ఆకాంక్షలను ఆయన నెరవేరుస్తారన్న విశ్వాసముందని వెల్లడించారు. ఆయనతో భేటీకి సంబంధించిన ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. భగవంత్ మాన్ ధూరీ నుంచి తన సమీప ప్రత్యర్థిపై 58,206 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. థ్యాంక్యూ మోదీ సర్: కేజ్రివాల్ పంజాబ్‌లో ఆప్ ఘన విజయంపై ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. పంజాబ్ సంక్షేమానికి కేంద్రం నుంచి సహకారం అందిస్తానంటూ ట్వీట్ చేశారు. దీనికి థ్యాంక్యూ సర్ అంటూ కేజ్రివాల్ బదులిచ్చారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరగా నిర్వహించాలని కోరారు. ఎన్నికలు వాయిదా వేస్తుంటే ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనమవుతుందన్నారు. -
ఎమ్మెల్సీగా తాతా మధు ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన తాతా మధుసూదన్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ అమీనుల్ హసన్ జాఫ్రి తాతా మధుతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి శాసనసభా వ్యవహారాల శాఖమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మంత్రి సత్యవతి రాథోడ్, రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తెలంగాణ లెజిస్లేచర్ కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తదితరులు హాజరయ్యారు. -
మాటంటే మాటే.. ‘డ్యూటీలో ఉన్నా లేకున్నా మందు ముట్టం, ఆన’
పట్నా: మద్యాన్ని పూర్తిస్థాయిలో నిషేధించేందుకు బిహార్ ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర డీజీపీ సందీప్ కుమార్ సింఘాల్.. తన సహొద్యోలతో కలిసి.. మద్యాన్ని జీవితంలో ముట్టబోనని ప్రమాణం చేశారు. రాష్ట్రంలో మద్యపానం నిషేధాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కృషి చేస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. పాట్నాలోని పోలీసుశాఖ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. నిబంధనలను ఉల్లంఘించే పోలీసు సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తామని డీజపీ స్పష్టం చేశారు. ఆయన ప్రమాణం చేస్తూ.. ‘సందీప్ కుమార్ సింఘల్ అనే నేను.. మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తానని, జీవితంలో దానిని ఎప్పుడూ ముట్టనని ఈరోజు (నవంబర్ 26) ప్రమాణం చేస్తున్నాను. విధుల్లో ఉన్నా, లేకపోయినా.. నా ప్రతిజ్ఞకు కట్టుబడి ఉంటాను. రోజువారీ జీవితంలో లిక్కర్ కు తావివ్వను. మద్యపాన నిషేధ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కృషి చేస్తాను‘ అని డీజీపీ ప్రమాణం చేశారు. ప్రమాణం చేసిన సీఎం బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా ఇదే విషయమై ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్ర అసెంబ్లీలోని ప్రభుత్వ అధికారులతో కలిసి ఆయన శుక్రవారం ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నితీశ్ మాట్లాడుతూ.. ’మద్యంతో కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తాము. మద్యపాన నిషేధాన్ని అధికారులు కఠినంగా, నిష్పక్షపాతంగా అమలు చేయాలి’ అని పిలుపునిచ్చారు. గత కొంతకాలంగా.. రాష్ట్రంలోని వివిధ హోటళ్లు, వెడ్డింగ్ హాల్స్ లో పోలీసులు రైడ్లు చేసి.. మద్యం సేవిస్తున్న వారిని అరెస్ట్ చేశారు. ప్రజలను హింసిస్తున్నారని విపక్షాలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. అయితే నితీశ్ కుమార్ ఆ ఆరోపణలను తిప్పికొట్టారు. మద్యాన్ని రాష్ట్రంలో పూర్తిగా నిషేధిస్తామని తేల్చిచెప్పారు. ఈ క్రమంలోనే కఠిన నిర్ణయాలకు పూనుకున్నారు. #WATCH | Patna: Bihar DGP SK Singhal administers an oath to all Police personnel at the Police HQ to ensure implementation of liquor ban in the state, and personally abide by the ban too. pic.twitter.com/DTXloFSJXb — ANI (@ANI) November 26, 2021 చదవండి: Starlink: ఎంట్రీకి ముందే షాకుల మీద షాకులు.. బుక్ చేసుకోవద్దంటూ జనాలకు కేంద్రం సూచన -
కేరళ సీఎంగా పినరయి విజయన్ ప్రమాణస్వీకారం
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌ఖాన్ విజయన్ చేత రెండోసారి సీఎంగా ప్రమాణం చేయించారు. కాగా విజయన్‌తో పాటు 21 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే రాష్ట్రంలో గతేడాది కరోనా కట్టడిలో ఆరోగ్య శాఖ మంత్రిగా కీలకపాత్ర పోషించిన కేకే. శైలజకు మంత్రి వర్గంలో చోటుదక్కలేదు. ఆమె స్థానంలో వీణా జార్జ్‌కు ఆరోగ్య శాఖ కేటాయించారు. ఇక పినరయి విజయన్ అల్లుడు మహ్మద్ రియాస్‌కు పబ్లిక్ అండ్ టూరింజ్ శాఖను అప్పగించారు.ఇక కేబినెట్లో చేరిన వారంతా అందరూ కొత్తవారే. ఈ సందర్భంగా సీఎం విజయన్‌తో పాటు మంత్రులకు గవర్నర్, ఇతర ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. కాగా మే2న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలోని మొత్తం 140 సీట్లకు గాను, 99 సీట్లను ఎల్డీఎఫ్ కైవసం చేసుకుంది. ప్రతిపక్ష యూడీఎఫ్ 41 స్థానాల్లో గెలుపొందింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ రెండోసారి గెలవదనే సంప్రదాయాన్ని చెరిపేసిన విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ 40 ఏళ్ల చరిత్రను తిరగరాసి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. చదవండి: Pinarayi Vijayan: పినరయి దిగ్విజయన్ ఉద్దండులకు సాధ్యపడలేదు.. కానీ ఆయన సాధించారు -
ఈసారి బలహీనమైన సారథిగా...
బిహార్ రాజకీయాల్లో క్రమేపీ బలహీనపడుతూ వస్తున్న జేడీ(యూ) అధినేత నితీశ్‌కుమార్ సోమవారం మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గాలివాలును పసిగట్టడంలో, అందుకనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడంలో, దీర్ఘకాలం అధికారానికి అంటిపెట్టుకుని వుండటంలో నితీశ్‌ది ప్రత్యేకమైన రికార్డు. 2005తో మొదలుపెట్టి ఇంతవరకూ చూస్తే సీఎంగా ఆయనకిది నాలుగో దఫా. కానీ అంతక్రితం 2000 మార్చిలో పదిరోజులపాటు ముఖ్యమంత్రిగా వుండటాన్ని, 2014–15 మధ్య ఒకసారి ఆ పదవికి రాజీనామా చేసి జితన్ రాం మాంఝీకి అప్పగించి, తిరిగి కొన్ని నెలలకే మళ్లీ సీఎంకావడం...2017లో కొన్నాళ్లు బీజేపీని వదిలి ఆర్జేడీతో జట్టుకట్టి సీఎం అయి, ఆ తర్వాత బీజేపీ శిబిరానికొచ్చి తిరిగి సీఎం కావడం వంటివి పరిగణనలోకి తీసుకుంటే ఆయన ఇప్పటికి ఏడుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినట్టు లెక్క. నితీశ్‌కుమార్ వ్యక్తిత్వం తెలిసున్న కొందరు సీనియర్ నేతలు ఆయన ఈసారి ముఖ్యమంత్రిగా వుండటానికి ఇష్టపడరనుకున్నారు. ఎందుకంటే ఎన్డీఏలో ప్రధాన భాగస్వామ్యపక్ష అధినేతగా రాష్ట్రంలో దాని నడతనూ, నడకనూ శాసించిన నాయకుడాయన. ఒక సందర్భంలో అయితే నరేంద్ర మోదీ ప్రచారానికొస్తే తాను ఎన్డీఏలో కొనసాగబోనని చెప్పిన చరిత్ర ఆయనది. మొన్నటికి మొన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక ఎన్నికల ప్రచార సభలో పౌరసత్వ సవరణ చట్టం అమలును ప్రస్తావించి, దేశభద్రతకు ముప్పు తెచ్చేవారిని దేశం నుంచి తరిమేస్తామని అన్నప్పుడు, ఆ వెంటనే స్పందించిన నితీశ్...ఈ దేశ పౌరులెవరినీ ఎవరూ బయటకు తరమలేరని, అలాంటి మాటలు అర్థరహితమైనవని వ్యాఖ్యానించారు. రాజకీయంగా తన సోషలిస్టు నేపథ్యానికి దెబ్బ తగులుతుందన్న సంశయం తలెత్తినప్పుడు గతంలోనూ ఆయన కుండబద్దలుకొట్టినట్టు మాట్లాడిన సందర్భాలు లేకపోలేదు. బహుశా అందుకే ఈసారి సీఎంగా తాను కొనసాగబోనని ఎన్డీఏకు నితీశ్ చెప్పారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. బీజేపీకి తమకంటే అధిక స్థానాలొచ్చాయి గనుక, ఆ పార్టీకి చెందిన నాయకులే ముఖ్యమంత్రిగా వుంటే బాగుంటుందని ఆయన తెలిపారని ఆ కథనాల సారాంశం. అయితే మీరే పగ్గాలు చేపట్టాలని బీజేపీ నేతలు పట్టుబట్టారని, అందువల్లే బాధ్యతలు తీసుకోవాల్సివచ్చిందని తన సన్నిహితులతో నితీశ్ చెప్పినట్టు ఆ కథనాలు తెలిపాయి. మొన్న ఎన్నికల్లో ఎన్డీఏకు 125 స్థానాలు లభించగా...ఆ శిబిరంలో బీజేపీ 74 సీట్లతో పెద్ద పార్టీగా అవతరించింది. జేడీ(యూ) బలం ఒక్కసారిగా 43కి పడిపోయింది. ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి 110 స్థానాలు తెచ్చుకుంది. అయితే నితీశ్ బీజేపీ వినతి మేరకు ముఖ్యమంత్రి పదవి తీసుకున్నా, తనంత తానే ఆ పనిచేసినా గతంలోవలే ఆయన నిర్ణయాత్మకంగా వ్యవహరించలేరన్నది వాస్తవం. బిహార్‌లో ఎప్పుడేం చేయాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఈసారి ఏలుబడిలో బీజేపీ దృఢంగా చెబుతుంది. వారు కోరుతున్నవి అమలు చేయకపోయినా, వారికి అసంతృప్తి కలిగించే నిర్ణయాలు చేసినా బీజేపీ నేతలు గతంలోవలే మౌన ప్రేక్షకుల్లా వుండే అవకాశం లేదు. బిహార్‌లో భిన్న సామాజిక వర్గాలకు, వాటి ప్రయోజనాలకు ప్రాతినిధ్యంవహించే పార్టీల మధ్య మనుగడ సాగిస్తూ, అచ్చం ఆ పార్టీల మాదిరే కుల సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటూ...అదే సమయంలో హిందుత్వనూ, తనదైన జాతీయవాద ముద్రనూ బీజేపీ కొనసాగిస్తోంది. అవి ఆ పార్టీకి మెరుగైన ఫలితాలే ఇస్తున్నాయి. పార్టీ విస్తరణకు దోహదపడుతున్న ఈ విధానాన్నే అది కొనసాగించదల్చుకుంది. పైగా ఇటీవలికాలంలో మిత్రపక్షాలతో వచ్చిన వైరంవల్ల కలిగిన అనుభవాలు వుండనే వున్నాయి. మహారాష్ట్రలో శివసేన, పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్ పార్టీలు వేర్వేరు కారణాలతో ఎన్డీఏకు దూరమయ్యాయి. అందుకే బిహార్‌లో ఇప్పటికిప్పుడు స్టీరింగ్ తీసుకోవాలన్న ఆత్రుతను బీజేపీ ప్రదర్శించదలచుకోలేదు. అలాగని కీలకమైన మంత్రిత్వ శాఖలపై, ఇతర పదవులపై అది చూసీచూడనట్టు వుండే అవకాశం లేదు. అత్యధిక స్థానాలున్న పక్షంగా ఎటూ పదవుల్లో దానికి సింహభాగం దక్కుతుంది. కీలకమైన స్పీకర్ పదవి బీజేపీయే తీసుకుంది. గతంలో ఎన్నడూ ఆ పదవిని నితీశ్ బీజేపీకి వదల్లేదు. ఉప ముఖ్యమంత్రిగా గత పదిహేనేళ్లుగా కొనసాగుతున్న పార్టీ నేత సుశీల్ మోదీని ఈసారి తప్పించి ఆయన స్థానంలో అదే బనియా కులానికి చెందిన తార్కిశోర్ ప్రసాద్‌ను ఎంపిక చేసింది. మరో ఉప ముఖ్యమంత్రిగా బిహార్‌లో అత్యంత వెనకబడిన కులంగా ముద్రపడిన నోనియా కులానికి చెందిన రేణూ దేవిని ఎంపిక చేయడం గమనించదగ్గది. మొన్న జరిగిన ఎన్నికల్లో మహిళలు భారీయెత్తున ఎన్డీఏకూ, ప్రత్యేకించి బీజేపీకీ ఓట్లేశారన్న సంగతిని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నానుకోవాలి. అదే సమయంలో ఆధిపత్య కులానికి చెందిన మహిళనెవరినో కాక, బాగా వెనకబడిన కులానికి చెందిన మహిళను ఉప ముఖ్యమంత్రి చేయడం బీజేపీ ఎత్తుగడను తెలియజెబుతుంది. ఇప్పుడున్న సమీకరణాలు గమనిస్తే రాగల కాలంలో బిహార్ రాజకీయంగా అనేక పరిణామాలు ఏర్పడే అవకాశం లేకపోలేదు. అధికారంలో కొనసాగడానికి కావలసిన కనీస మెజారిటీ 122 కాగా ఎన్డీఏకు కేవలం అంతకన్నా మరో ముగ్గురు మాత్రమే అదనంగా వున్నారు. తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడానికి బీజేపీ పావులు కదిపితే విపక్ష శిబిరం చెల్లాచెదురయ్యే అవకాశంవుంది. బీజేపీ ఈ మార్గాన్ని ఆశ్రయించి బలం పెంచుకోదల్చుకుంటే జేడీ(యూ) మౌనంగా వుంటుందా...రాజకీయ నైతికతను ముందుకు తెచ్చి అభ్యంతరం చెబుతుందా అన్నది చూడాలి. ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీ మరింత బలపడితే విపక్షాలకన్నా మున్ముందు జేడీ(యూ)కే అది అధిక నష్టం కలిగిస్తుంది. మొత్తానికి ఎన్డీఏలో జూనియర్ భాగస్వామిగా ఈసారి రాష్ట్రానికి నితీశ్ ఎలా సారథ్యంవహిస్తారో మున్ముందు చూడాలి. -
కొలువు దీరిన నితీష్ కొత్త సర్కార్
సాక్షి, పట్నా: బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ (69)ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం పీఠాన్ని వరుసగా నాల్గవసారి ఆయన సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఏడవసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికైన ఘనతను నితీష్ దక్కించుకున్నారు. సోమవారం రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ ఫగు చౌహాన్ నితీష్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి బీజేపీ నేత, కేంద్రమంత్రి అమిత్‌షా, జేపీ నడ్డా హాజరయ్యారు. ఉత్కంఠ పోరులో విజయాన్ని చేజిక్కించుకున్న ఎన్డీఏ కొత్త సర్కార్ కొలువు దీరింది. బీజేపీ నుంచి ఏడుగురికి, జేడీయూనుంచి ఐదుగురికి కేబినెట్లో చోటు దక్కగా, ఉప ముఖ్యమంత్రి పదవులను బీజేపీ సొంతం చేసుకోవడం విశేషం. 12 మంది మంత్రులుగా ప్రమాణం స్వీకరించారు. డిప్యూటీ సీఎంలుగా బీజేపీ నేతలు తార్కిషోర్ ప్రసాద్ రేణూ దేవీ పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఆదివారం సమావేశమైన ఎన్డీఏ శాసనసభ పార్టీ నాయకులు నితీష్ కుమార్‌ను నాయకుడిగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేసినవారు: కొత్త మంత్రివర్గంలో చేరిన 12 మంది మంత్రులలో బీజేపీ నుంచి మంగల్ పాండే , అమరేంద్ర ప్రతాప్ సింగ్ ఉన్నారు. హిందూస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం)కు చెందిన సంతోష్ మాంజి, జేడీయూ నుంచి విజయ్ కుమార్ చౌదరి, విజేంద్ర ప్రసాద్ యాదవ్, అశోక్ చౌదరి, మేవా లాల్ చౌదరి, వికా షీల్ ఇన్సాన్ పార్టీ (విఐపి) కు చెందిన ముఖేష్ మల్లా మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. -
రఘునందన్ ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయాన్ని నమోదు చేసిన బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ప్రమాణ స్వీకారానికి సిద్ధమయ్యారు. 18వ తేదీన మధ్యాహ్నం ఒంటి గంటకు దుబ్బాక ఎమ్మెల్యేగా రఘునందన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఫలితాల్లో 1079 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించిన విషయం తెలిసిందే. అనూహ్య రీతిలో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై గెలుపొందారు. ఈ విజయంతో రాష్ట్ర వ్యాప్తంగా రఘునందన్ ఒక్కసారిగా హాట్‌టాపిక్‌గా మారారు. తాజాగా ప్రమాణస్వీకారానికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి. (దుబ్బాకలో బీజేపీ సంచలన విజయం) -
నితీష్ ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే..
పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించడంతో ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ మరోసారి బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. దీపావళి తర్వాత నవంబర్ 16న సీఎంగా నితీష్‌కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ కన్నా తక్కువ స్థానాల్లో జేడీయూ గెలిచినప్పటికీ.. ముందే కుదిరిన అంగీకారం మేరకు నితీష్ కుమారే సీఎంగా ఉంటారని బీజేపీ స్పష్టం చేసింది. దీంతో ఏడోసారి జేడీయూ నేత నితీష్ కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా తనకు అఖండ విజయం అందించిన ప్రజలకు, ఇందుకు సహకరించిన ప్రధాని మోదీకి ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. (నితీష్ కుమారే బీహార్ సీఎం: ఎన్డీయే) ఇక ప్రభుత్వ ఏర్పాటు విషయమై జేడీ(యూ) కోర్ కమిటీ నిన్నరాత్రి బీజేపీ నాయకులతో సమావేశం నిర్వహించింది. ఈ ఎన్నికల్లో జేడీయూతో పోలిస్తే ఎక్కువ స్థానాలు గెలుచుకున్న బీజేపీ మంత్రివర్గంలో అధిక వాటాను, కీలక శాఖలను డిమాండ్ చేసే అవకాశముంది. కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే 125 కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో బీజేపీ 74 స్థానాలు, జేడీయూ 43 స్థానాలు గెలుచుకుంది. గట్టిపోటీనిచ్చిన ఆర్జేడీ నాయకత్వంలోని విపక్ష మహా కూటమి 110 స్థానాలతో సరిపెట్టుకుంది. (నితీష్ సీఎం అయితే మాదే క్రెడిట్: శివసేన) -
ఎమ్మెల్సీగా కవిత ప్రమాణ స్వీకారం
సాక్షి,హైదరాబాద్: శాసన మండలి సభ్యురాలిగా నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా నుంచి ఎన్నికైన కల్వకుంట్ల కవిత శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి చాంబర్లో గురువారం మధ్యాహ్నం 12.45కు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో పాటు, ఉమ్మడి నిజామాబాద్‌కు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వెంట వచ్చారు. ప్రమాణ స్వీకారం అనంతరం కవితను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అభినందించగా, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి రూల్స్ బుక్‌ను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డితోనూ కవిత మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఎమ్మెల్సీగా తనకు అవకాశం కల్పించిన పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులకు కవిత ధన్యవాదాలు తెలిపారు. స్థానిక ప్రజా ప్రతినిధులతో భేటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాత పబ్లిక్ గార్డెన్స్‌లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులతో కవిత మండలాల వారీగా కలసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మహమూద్ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, చీఫ్ విప్ బోడ కుంటి వెంకటేశ్వర్లు, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యేలు భాస్కర్ రావు,జీవన్ రెడ్డి, డా.సంజయ్ కుమార్, గణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, షకీల్ అహ్మద్, ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్ ,శేరి శుభాష్ రెడ్డి, ఫరూక్ హుస్సేన్, ఆకుల లలిత, అసెంబ్లీ సెక్రెటరీ నర్సింహా చార్యులు, నల్లగొండ జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు హాజరయ్యారు. -
24 ఏళ్ల తరువాత రాజ్యసభకు దేవెగౌడ
సాక్షి, బెంగళూరు: మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడ (87) రాజ్యసభ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ఆదివారం ఆయన రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు సమక్షంలో కన్నడభాషలో ప్రమాణం చేశారు. సుమారు 24 ఏళ్ల తర్వాత ఆయన రాజ్యసభలో అడుగుపెట్టడం విశేషం. గతంలో 1996 జూన్ నుంచి 1997 ఏప్రిల్ వరకు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దేవెగౌడ రాజ్యసభ సభ్యునిగానే ఉన్నారు. కాగా, ఈ ఏడాది జూన్‌లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆయన కర్ణాటక నుంచి ఎన్నికయ్యారు. కరోనా లాక్డౌన్ ఉండడంతో ఆయన ఢిల్లీకి వెళ్లలేదు. -
కాగ్‌గా బాధ్యతలు చేపట్టిన గిరీశ్ చంద్ర ముర్ము
సాక్షి,ఢిల్లీ : గిరీశ్ చంద్ర ముర్ము ఇవాళ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)గా బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని కాగ్ ఆఫీసులో శనివారం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కాగ్ ఆఫీసులో గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు ఆయన నివాళి అర్పించారు. గత వారం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ముర్ము జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ముర్ము స్థానంలో మనోజ్ సిన్హా కశ్మీర్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 14వ కాగ్‌గా ముర్ము బాధ్యతలు నిర్వర్తించనున్నారు.ఒడిశాలోని మయూర్బంజ్ జిల్లా బెట్నోటి గ్రామానికి చెందిన గిరీశ్ చంద్ర 1959, నవంబర్ 21న ముర్ము జన్మించారు. గుజరాత్ ఐఏఎస్ క్యాడర్‌కు చెందిన గిరీశ్ చంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా చేశారు. -
మహిళపట్ల గొప్ప మనసు చాటుకున్న జడ్జీ..!
వాషింగ్టన్: మనసుంటే మార్గం ఉంటుందని వాషింగ్టన్‌లోని ఓ కోర్టు జడ్జి నిరూపించారు. తన కళ్లెదుటే ఓ యువ న్యాయవాది ఇబ్బందులు పడుతుండటం చూసి.. ఆమెకు సాయం చేశాడు. అతని గొప్ప మనసును పొగుడుతూ.. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. వివరాలు.. జూలియానా లామర్ అనే వివాహిత లాకోర్సు సమయంలో గర్భం దాల్చింది. కోర్సు పూర్తయ్యేనాటికి ఓ పడంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈక్రమంలోనే ఆమె న్యాయవాద వృత్తిని చేపట్టడానికి సిద్ధమైంది. అయితే, జూలియానా అడ్వకేట్‌గా ప్రమాణం చేస్తున్నప్పుడు ఓ చిక్కొచ్చిపడింది. అక్కడే ఉన్న ఆమె కుమారుడు బెకమ్ అల్లరి చేయడంతో.. అతన్ని ఎత్తుకుని ప్రమాణం చేసేందుకు తంటాలు పడింది. జూలియానా ఇబ్బందిని గమనించిన జడ్జీ రిచర్డ్ డింకిన్స్ చిన్నారి బెకమ్ను చేతుల్లోకి తీసుకున్నాడు. ఓ చేతిలో పిల్లాడిని, మరో చేతిలో ప్రమాణ పత్రాన్ని పట్టుకుని జడ్జీ జూలియానాతో ప్రమాణం చేయించి అందరిని ఆశ్చర్య చకితుల్ని చేశారు. View this post on Instagram This feeling is indescribable. To say you’re going to do something then do it is such an amazing feat. There were a few times during this journey that brought me to my knees asking God for strength and reason. I’m glad he heard every prayer!! I’M A LICENSED ATTORNEY!! ⚖️ Today, I was sworn in to the Tennessee Bar by my mentor, Judge Dinkins, who has helped and guided me into my legal career, and my baby boy Beckham, who motivates me to keep going everyday and has been with me during half of my law school “experience.”❤️Thank you to my Husband for being there during all the late nights, all the suits you’ve ironed 😉, coffee you’ve bought to keep me awake, and taking my laptop to force me to go to sleep. Thank you to my Mom, for believing in me, knowing my potential, and (trying) to make me not be so hard on myself. Thank you all for your love and support. 😬 A post shared by Juliana Lamar, Esq. (@jaydotpett) on Nov 8, 2019 at 4:48pm PST Y'all. Judge Dinkins of the Tennessee Court of Appeals swore in my law school colleague with her baby on his hip, and I've honestly never loved him more. pic.twitter.com/kn0L5DakHO — Sarah Martin (@sarahfor5) November 9, 2019 వీడియో చూసిన వాళ్లలో కొందరు.. సదరు జడ్జీకి ఈ ఏడాది ప్రెసిడెన్షియల్ గుడ్ హ్యూమానిటీ అవార్డు ఇవ్వాలని అభిప్రాయపడగా, మరికొందరు... స్త్రీలను గౌరవించే సమాజం ఉందని చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణగా అభివర్ణించారు. ఒక మహిళ తన జీవితాన్ని పరిపూర్ణంగా జీవించడానికి అనువైన వాతావరణం కల్పిస్తున్న సమాజానికి చేసే ప్రయత్నం అని కామెంట్ చేశారు. పిల్లాడు మారాం చేయకపోయి ఉంటే ఇంత గొప్ప మానవీయ దృశ్యం ప్రపంచానికి దక్కేది కాదని.. పిల్లాడు పెద్దవాడైన తర్వాత అతనికి చూపించడానికి వీలుగా ఈ వీడియో దాచి ఉంచమని కొంతమంది లాయరమ్మకు సలహా ఇచ్చారు. -
తదుపరి సీజేఐ జస్టిస్ బాబ్డే
న్యూఢిల్లీ: కీలకమైన పలు కేసులను విచారిస్తున్న జస్టిస్ శరత్ అరవింద్ బాబ్డే(63) సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జస్టిస్ బాబ్డే నవంబర్ 18వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2021 ఏప్రిల్ 23 వరకు అంటే 17 నెలల పాటు జస్టిస్ బాబ్డే పదవిలో కొనసాగుతారు. సుప్రీంకోర్టులో సీనియారిటీ ప్రకారం జస్టిస్ బాబ్డే రెండో స్థానంలో ఉన్నారు. ప్రస్తుత చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీకాలం నవంబర్ 17వ తేదీతో ముగియనుంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో 1956 ఏప్రిల్ 24న బాబ్డే జన్మించారు. ఈయన తండ్రి ప్రముఖ న్యాయవాది అరవింద్ శ్రీనివాస్ బాబ్డే. నాగపూర్ యూనివర్సిటీ నుంచే బీఏ, ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1978లో బాబ్డే మహారాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడిగా చేరారు. బాంబే హైకోర్టులో 21 ఏళ్లు పనిచేశారు. 1998లో ఆయన్ను సీనియర్ న్యాయవాదిగా నియమించారు. 2000లో బోంబే హైకోర్టు అడిషనల్ జడ్జిగా, 2012లో మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 ఏప్రిల్ 12న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. కీలక తీర్పుల్లో జస్టిస్ బాబ్డే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం గోప్యత పౌరుడి ప్రాథమికహక్కు అంటూ 2017లో చారిత్రక తీర్పునిచ్చిన తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ బాబ్డే కూడా ఒకరు. జస్టిస్ బాబ్డే సహా ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని 9 మంది సభ్యుల ధర్మాసనం గోప్యత హక్కుకు రాజ్యాంగం రక్షణ కల్పించిందని వ్యాఖ్యానించింది. దేశ పౌరులెవరూ కూడా ఆధార్ కార్డు లేని కారణంగా కనీస సదుపాయాలను గానీ, ప్రభుత్వ సేవలకూ గానీ దూరం కారాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాలుష్యాన్ని వెదజల్లుతోన్న టపాసులను కాల్చడాన్ని పూర్తిగా నిషేధించాలన్న వాదనను ఈ ఏడాది మార్చిలో జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. రాజకీయంగా అత్యంత సున్నితమైన రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదం కేసును విచారిస్తోన్న ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ బాబ్డే కూడా ఉన్నారు. యావద్దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఈ కేసుపై సుప్రీంకోర్టు నవంబర్ 15న తుదితీర్పును వెలువరించనుంది. ఆ తరువాత రెండు రోజులకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీ విరమణ చేయనున్నారు. -
కొలువుదీరిన కొత్త పాలకమండలి
సాక్షి, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి కొలువుదీరింది. ఆ వెంటనే చైర్మన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. తొలి సమావేశంలోనే పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా కలియుగదైవం శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని నిర్ణయించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని నిర్ణయిం చారు. అమరావతిలో టీటీడీ నిధులతో నిర్మించనున్న శ్రీవారి ఆలయానికి గత ప్రభుత్వం అంచనాలకు మించి జరిపిన కేటాయింపులను కుదిం చారు. తిరుమల శాశ్వత తాగునీటి పరిష్కారా నికి బాలాజీ రిజర్వాయర్ పూర్తిచేయాలని నిర్ణ యం తీసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న అనేక అభివృద్ధి పనులు పూర్తిచేసే విషయమై చర్చిం చారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన టీటీడీ పాలకమండలి సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. వారితో పాటు ప్రత్యేక ఆహ్వానితులు ఏడుగురు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన తొలి పాలకమండలి సమావేశం జరిగింది. ఈనెల 30 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేసేలా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా తిరుమలలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లలో అధికారులు, సిబ్బంది బిజీబిజీగా ఉన్నారు. తిరుమల శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారం దిశగా.. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు, అధికారులు, స్థానికులకు మంచినీటి సమస్య లేకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారం దిశగా పాలకమండలి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా బాలాజీ రిజర్వాయర్‌ను పూర్తి చేసి అక్కడి నుంచి మల్లిమడుగు, కళ్యాణి డ్యాం నుంచి నీటిని సరఫరా చేసే విషయమై చర్చిం చారు. ఈ విషయమై గతంలోనే చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి బాలాజీ రిజర్వాయర్ని పరిశీలించిన విషయం తెలిసిందే. బాలాజీ రిజర్వాయర్ పనులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల కేటాయింపు వంటి వాటి గురించి సమావేశంలో ప్రస్తావించారు. బాలాజీ రిజర్వాయర్ పూర్తి చేసేందుకు రూ.150 కోట్లు అంచనా వేసినట్లు తెలిసింది. అందుకు సంబంధించిన అంచనాలను వచ్చే పాలకమండలి సమావేశంలోపు సమర్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి నట్లు తెలిసింది. తిరుపతిలో నిర్మాణంలో ఉన్న గరుడ వారధి నిర్మాణానికి టీటీడీ నిధులు కేటాయించే విషయమై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. అవిలాల చెరువు సుందరీకరణ పనులు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో కాలుష్య రహిత వాహనాల విషయమై చర్చిం చారు. అందులో భాగంగా తిరుమలలో ఎలక్ట్రికల్ కార్లు, బస్సులు నడపాలని నిర్ణయించారు. టీటీడీలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై సబ్ కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై చర్చించారు. పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందిం చారు. టీటీడీ నూతన పాలకమండలి ప్రమాణస్వీకారం చేసిన వెంట నే సమావేశం ఏర్పాటు చేసి, కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంపై టీటీడీ అధికారులు, సిబ్బంది, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన సబిత
-
మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన హరీష్ రావు
-
వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార ముహుర్తం ఖరారు
-
మనసున్న మారాజు
-
లోక్‌పాల్‌గా జస్టిస్ ఘోష్ ప్రమాణం
న్యూఢిల్లీ: దేశంలో తొలి లోక్‌పాల్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ శనివారం రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి కోవింద్ ఆయన చేత ప్రమాణం చేయించారు. ప్రజాప్రతినిధుల అవినీతికి సంబంధించిన కేసులను విచారించే లోక్‌పాల్, లోకాయుక్తా చట్ట్టం 2013లో ఆమోదం పొందింది. లోక్‌పాల్‌లో జ్యుడీషియల్ సభ్యులుగా జస్టిస్ దిలీప్ బీ భోసాలే, జస్టిస్ ప్రదీప్ కుమార్ మొహంతి, జస్టిస్ అభిలాష కుమారి, ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అజయ్‌కుమార్ త్రిపాఠిలు నియమితులయ్యారు. నాన్–జ్యుడీషియల్ సభ్యులుగా పారా మిలటరీ దళమైన సశస్త్ర సీమాబల్ (ఎస్సీబీ) మాజీ చీఫ్ అర్చనా రామసుందరం, మహారాష్ట్ర మాజీ చీఫ్ సెక్రటరీ దినేష్‌కుమార్ జైన్, మాజీ ఐఆర్ఎస్ అధికారి మహేంద్ర సింగ్, గుజరాత్ కేడర్ మాజీ ఐఏఎస్ ఇంద్రజిత్ ప్రసాద్ గౌతమ్‌లు వ్యవహరించనున్నారు. నిబంధనల ప్రకారం లోక్‌పాల్ కమిటీలో చైర్పర్సన్, గరిష్టంగా ఎనిమిది మంది సభ్యులు ఉండాలి. అందులో నలుగురు జ్యుడీషియల్ సభ్యులతోపాటు 50 శాతానికి తగ్గకుండా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలు, మహిళలు ఉండాలని నిబంధనల్లో ఉంది. కమిటీలోని చైర్పర్సన్, సభ్యుల పదవీకాలం ఐదేళ్లు లేదా 70 ఏళ్ల వయసు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారు. భారత ప్రధాన న్యాయమూర్తికి ఉండే జీతాభత్యాలే చైర్‌పర్సన్‌కు, సుప్రీంకోర్టు జడ్జీలకు ఉండే జీతాభత్యాలే సభ్యులకు ఉంటాయి. -
మధ్యప్రదేశ్ సీఎంగా కమల్‌నాథ్.. 17న ప్రమాణస్వీకారం
-
మంత్రిగా మహమూద్ అలీ ప్రమాణస్వీకారం
-
ప్రభుత్వ ఏర్పాటుకు చకాచకా ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీ తక్షణమే ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చకచకా చేస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశముందని అనధికార సమాచారం. తాము విజయం సాధిస్తే డిసెంబర్ 12నే ప్రమాణ స్వీకారం చేస్తానని మూడు నెలల క్రితమే కేసీఆర్ ప్రకటించారు. అయితే రేపు ప్రమాణ స్వీకారంపై అధికారిక ప్రకటన రావాల్సివుంది. ఈ సాయంత్రం టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశం నిర్వహించనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. శాసనసభపక్ష నాయకుడిగా కేసీఆర్‌ను ఎన్నుకునే అవకాశముంది. ఈరోజు సాయంత్రమే గవర్నర్ నరసింహన్‌ను కేసీఆర్ కలసి, ప్రభుత్వ ఏర్పాటుకు తమకు ఆహ్వానించాలని కోరతారని మీడియాలో ప్రచారం జరుగుతోంది. -
ఏపీ కేబినెట్లో కొత్త ముఖాలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర కేబినెట్లో కొత్తగా మరో ఇద్దరు మంత్రులు చేరారు. కొత్త మంత్రులుగా ఎన్ఎమ్డీ ఫరూక్, కిడారి శ్రవణ్ కుమార్‌లు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఆదివారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాస ప్రజావేదికలో రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వారితో ప్రమాణం చేయించారు. ఫరూక్ తెలుగులో, శ్రవణ్ కుమార్ ఆంగ్లంలో ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారిద్దరికి శాఖలను కేటాయించారు. కర్నూలు జిల్లాకు చెందిన ఫరూక్‌కు వైద్య, ఆరోగ్యశాఖ, మైనార్టీ వెల్ఫేర్ శాఖలను, విశాఖపట్నం జిల్లాకు చెందిన కిడారి శ్రవణ్ కుమార్‌కు గిరిజన సంక్షేమశాఖను కేటాయించారు. ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి మంత్రులు, పార్టీనేతలు తదితరులు హాజరయ్యారు. కొన్ని రోజుల క్రితం అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు హత్యచేసిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన కుమారుడు శ్రవణ్‌కుమార్‌కు కేబినెట్లో చోటు కల్పించారు. దాంతో శ్రవణ్‌కుమార్ చట్టసభల్లో సభ్యుడు కాకుండానే నేరుగా మంత్రివర్గంలో స్థానం పొందినట్లయ్యింది. -
చివర్లోనే జస్టిస్ జోసెఫ్ పేరు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు జడ్జీలుగా జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వినీత్ సరన్‌లు మంగళవారం ప్రమాణం చేశారు. వీరి చేత సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ మిశ్రా ఉదయం కోర్టురూమ్‌లో ప్రమాణంచేయించారు. జస్టిస్ జోసెఫ్ సీనియారిటీని కేంద్రం తగ్గించడాన్ని సుప్రీంకోర్టు జడ్జీలు నిరసించినప్పటికీ కేంద్రం ఇచ్చిన వరుస క్రమంలోనే ముగ్గురు జడ్జీల ప్రమాణస్వీకార వేడుక పూర్తయింది. తొలుత జస్టిస్ ఇందిర, తర్వాత జస్టిస్ వినీత్, చివర్లో జస్టిస్ జోసెఫ్ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ఇతర జడ్జీలు, లాయర్లు, తదితరులు హాజరయ్యారు. సుప్రీంకోర్టు జడ్జి పదవికి జస్టిస్ జోసెఫ్ పేరును.. జస్టిస్ ఇందిర, జస్టిస్ వినీత్‌ల పేర్లకంటే కొన్ని నెలల ముందుగానే కొలీజియం సిఫారసు చేసింది. అయినా జస్టిస్ జోసెఫ్ పేరును ఈ ముగ్గురి పేర్ల వరసలో కేంద్రం చివరన చేర్చడం వివాదమైంది. దీనిపై పలువురు సుప్రీంకోర్టు జడ్జీలు సోమవారమే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాను కలిసి తమ ఆందోళనను తెలియజేశారు. కాగా, సుప్రీంకోర్టులో ఉండాల్సిన మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 31 అయినప్పటికీ, మంగళవారం కొత్తగా ముగ్గురు జడ్జీలు నియమితులయ్యాక కోర్టులోని జడ్జీల సంఖ్య 25 మాత్రమే. చరిత్రలో తొలిసారి.. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఇందిరా బెనర్జీ మంగళవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేయడంతో ఓ రికార్డు నమోదైంది. సుప్రీంకోర్టుకు ఇందిర రాకతో ప్రస్తుతం సుప్రీంకోర్టులోమహిళా జడ్జీల సంఖ్య మూడుకు పెరిగింది. చరిత్రలో ఎన్నడూ సుప్రీంకోర్టులో ఒకేసారి ముగ్గురు మహిళాజడ్జీలు లేరు. అలాగే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జిగా నియమితురాలైన ఎనిమిదో మహిళ జస్టిస్ ఇందిర. 2002లో కలకత్తా హైకోర్టు జడ్జిగా నియమితురాలైన జస్టిస్ ఇందిరా బెనర్జీ.. 2017 ఏప్రిల్‌లో మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న ముగ్గురు మహిళా న్యాయమూర్తుల్లో జస్టిస్ ఆర్ భానుమతి అత్యంత సీనియర్. ఆమె 2014 ఆగస్టు నుంచి సుప్రీంకోర్టులో జడ్జిగా ఉన్నారు. -
ప్రమాణ స్వీకారం చేసిన సుప్రీంకోర్టు కొత్త జడ్జ్‌లు
-
టీఎస్‌టీడీసీ చైర్మన్‌గా భూపతిరెడ్డి ప్రమాణస్వీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్(టీఎస్‌టీడీసీ) చైర్మన్‌గా పి.భూపతిరెడ్డి పదవీ ప్రమాణస్వీకారం చేశారు. శనివారం హిమాయత్‌నగర్‌లోని టీఎస్ టీడీసీ భవన్లో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. టీఎస్‌టీడీసీ ఎండీ బి.మనోహర్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా భూపతిరెడ్డి మాట్లాడుతూ... పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి పాటుపడతానన్నారు. కార్యక్రమంలో టీఎస్‌టీడీసీ పీఆర్వో పురందర్, టీఎస్‌టీడీసీ అధికారులు సుమిత్‌సింగ్, జనార్దన్, సత్యకుమార్‌రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు టీఎస్‌టీడీసీ కాంట్రాక్ట్ – ఔట్సోర్సింగ్ ఎంప్లా యీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బు రాజమౌళి తన సంఘ ప్రతినిధులతో భూపతిరెడ్డిని కలసి అభినందనలు తెలిపారు. -
కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి వాళ్లు దూరం... ఎందుకు ?
ముంబై/భువనేశ్వర్ : ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేతోపాటు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ దూరంగా ఉన్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి దేవెగౌడ పంపిన ఆహ్వానాన్ని శివసేన అధినేత ఉద్ధవ్ సున్నితంగా తిరస్కరించారని ఆ పార్టీ ఎంపీ తెలిపారు. పాల్ఘార్ లోక్‌సభ స్థానానికి 28న జరిగే ఉప ఎన్నికల ప్రచారంలో ఉద్ధవ్ బిజీగా ఉన్నందునే బెంగళూరు వెళ్లలేకపోయారన్నారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలతో తీరికలేకుండా ఉన్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కార్యక్రమానికి హాజరు కాలేదని బీజేడీ పార్టీ తెలిపింది. రాష్ట్రానికే పరిమితమయిన బీజేడీకి జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లతో కలిసి ఉండటం వల్ల ఒరిగేదేమీ లేదని వ్యాఖ్యానించింది. అయినా, గత 18 ఏళ్లలో జరిగిన ఏ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికీ సీఎం నవీన్ హాజరు కాలేదని పార్టీ పేర్కొంది. -
కర్ణాటక గవర్నర్ పంపిన ఆహ్వానం ఇదే..
సాక్షి, హైదరాబాద్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 222 స్థానాలకు గాను 104 సీట్లను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. తరువాతి స్థానాల్లో కాంగ్రెస్(79), జేడీఎస్(38). ఎవరికీ సంపూర్ణ మోజారిటీ లేని కారణంగా ముఖ్యమంత్రి పదవిపై పెద్ద హైడ్రామానే నడిచింది. నిమిష నిమిషానికి కన్నడ రాజకీయం మారుతూ వచ్చింది. మేము అధికారం చేపడతామంటే.. కాదు మేమే చేపడతామంటూ బీజేపీ, కాంగ్రెస్-జేడీయూ పోటీలు పడ్డాయి. అయితే బుధవారం సాయంత్రం ఈ సస్పెన్స్‌కు తెర దించుతూ ఆ రాష్ట్ర గవర్నర్ వజుభాయ్ అత్యధిక స్థానాలు సాధించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటు చేయాలంటూ ఆహ్వనించారు. ఆయన పంపిన ఆహ్వాన లేఖ చూడండి. -
రాజ్యసభ ఎంపీగా అరుణ్ జైట్లీ ప్రమాణం
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ(65) ఆదివారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. గత నెలలో బీజేపీ తరఫున యూపీ నుంచి ఆయన రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇటీవల కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న జైట్లీ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందిన కారణంగా ఆయన ప్రమాణ స్వీకారం ఆలస్యమైంది. ఆదివారం రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు చాంబర్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు. -
రాజ్యసభ సభ్యుడిగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రమాణస్వీకారం
-
వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రమాణస్వీకారం
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా గెలుపొందిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గురువారం ప్రమాణం స్వీకరించారు. రాజ్యసభలో ఆయన ఆంగ్లంలో ప్రమాణం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గెలుపొందిన సంగతి తెలిసిందే. కొత్తగా ప్రమాణం చేసిన పలువురు సభ్యులు గురువారం రాజ్యసభలో ప్రమాణం స్వీకరించారు. అనంతరం రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. -
ఎంపీలుగా ఆ ముగ్గురి ప్రమాణం..
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో గెలుపొందిన ముగ్గురు సభ్యులు శుక్రవారం ఉదయం లోక్‌సభలో ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీకి ప్రతికూల పవనాలు వీస్తున్నాయనడానికి ఈ ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనమని భావిస్తున్న నేపథ్యంలో నూతన ఎంపీల ప్రమాణ స్వీకారం ప్రాధాన్యం సంతరించుకుంది. సభికుల హర్షద్వానాల మధ్య తొలుత ఆర్జేడీ నుంచి గెలుపొందిన సర్ఫ్రాజ్ ఆలం ఎంపీగా ప్రమాణం చేశారు. తర్వాత ప్రతిష్టాత్మక గోరఖ్‌పూర్, ఫూల్‌పూర్‌ల నుంచి విజయం సాధించిన సమాజ్‌వాదీ అభ్యర్థులు ప్రవీణ్‌కుమార్ నిషాద్, నాగేంద్ర పటేల్ సింగ్ పాటిల్ లు ప్రమాణం చేశారు. వీరంతా హిందీలో తమ ప్రమాణ పాఠాన్ని చదవడం విశేషం. పార్టీ టోపీలు ధరించి ఎంపీలుగా.. సమాజ్‌వాది పార్టీ సంప్రదాయ ఎరుపు రంగు టోపీలను ధరించి ప్రవీణ్‌కుమార్, నాగేంద్ర పటేల్‌లు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, బీజేపీ సీనియర్ నాయకుడు అద్వానీ, ఏఐసీసీ చైర్పర్సన్ సోనియా గాంధీ తదితరులు పాల్గొన్నారు. -
హిమాచల్ సీఎంగా ఠాకూర్ ప్రమాణం
సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా జైరాం ఠాకూర్(52) బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. సిమ్లాలోని రిడ్జ్ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం వేడుకతో రిడ్జ్ మైదానం మొత్తం కషాయం జెండాలతో నిండిపోయింది. హిమాచల్ ప్రదేశ్‌లో గెలుపు అనంతరం ముఖ్యమంత్రి అభ్యర్థిపై తర్జనభర్జనలు జరిపిన బీజేపీ ఆదివారం ఠాకూర్ పేరును ఖరారు చేసింది. ఠాకూర్ మండీ జిల్లాలోని సెరాజ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హిమాచల్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 44 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఠాకూర్‌తో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మరికొందరు కేంద్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. హిమాచల్‌ప్రదేశ్ కేబినేట్ మంత్రులు వీరే.. మహేంద్ర సింగ్ సురేష్ భరద్వాజ్ కిషన్ కపూర్ అనిల్ శర్మ సర్వీన్ చౌదరి విపిన్ సింగ్ పర్మార్ వీరేంద్ర కన్వర్ బిక్రమ్ సింగ్ గోబింద్ సింగ్ రాజీవ్ సైజల్ -
గుజరాత్ ముఖ్యమంత్రిగా రూపానీ ప్రమాణం
గాంధీనగర్ : గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ(61) ప్రమాణ స్వీకారం రాష్ట్ర రాజధాని గాంధీనగర్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, డిప్యూటి ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీలు కూడా విచ్చేశారు. కాగా, మంగళవారం ఉదయం భార్య అంజలితో కలసి విజయ్‌రూపానీ అక్షరధామ్ దేవాలయాన్ని సందర్శించారు. రూపానీ తర్వాత నితీశ్ పటేల్ మరోమారు ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. రూపానీతో పాటు 19 మంది మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రమాణస్వీకారం చేసిన మంత్రుల వివరాలను కింది ఫొటోలో చూడొచ్చు. -
ముఖ్యమంత్రిగా రూపానీ ప్రమాణ స్వీకారం
-
ఆరుగురు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు ఆరుగురు... గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు ఉదయం ఉమ్మడి హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సమక్షంలో దూర్వాసుల వేంకట సూర్యనారాయణ సుబ్రహ్మణ్య (డీవీవీఎస్) సోమయాజులు, కొంగర విజయలక్ష్మి, పోట్లపల్లి కేశవరావు, మంతోజ్ గంగారావు, అభినంద్‌కుమార్ షావిలి, తొడుపునూరి అమర్నాథ్ గౌడ్ న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా నూతన న్యాయమూర్తులకు పలువురు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా టి.అమర్నాథ్ గౌడ్ మాట్లాడుతూ... హైకోర్టు జడ్జిగా ఎంపిక కావటం ఆనందంగా ఉందని, ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనిదన్నారు. తన తల్లిదండ్రుల ఆశీర్వాదం, తన గురువు అయిన విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వంగా ఈశ్వరయ్య ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి ఎదిగినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికీ న్యాయం అందించేలా కృషి చేస్తానని అమర్నాథ్ గౌడ్ పేర్కొన్నారు. సంబంధిత వార్త... ఉమ్మడి హైకోర్టుకు ఆరుగురు న్యాయమూర్తులు -
ఎంపీలుగా అమిత్‌షా, స్మృతి ప్రమాణం
న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ శుక్రవారం రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు ఉదయం పదిన్నర సమయంలో ఇరువురు ప్రమాణం చేశారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఇరువురు బీజేపీ నేతలతో ప్రమాణ స్వీకారం చేయించారు. సమాచార ప్రసార శాఖ మంత్రి స్మృతి ఇరానీ సంస్కృతంలో ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం అమిత్ షా... పార్టీ సీనియర్ నేత ఎల్కే అద్వానీని ఆయన నివాసంలో కలుసుకున్నారు. కాగా అమిత్ షా, స్మృతి ఇరానీ ..రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన విషయం తెలిసిందే. -
ముఖ్యమంత్రిగా నితీశ్ ప్రమాణ స్వీకారం
-
ముఖ్యమంత్రిగా నితీశ్ ప్రమాణ స్వీకారం
►నిన్న రాజీనామా, ఇవాళ ప్రమాణ స్వీకారం పట్నా: బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. నిన్న అనూహ్యంగా రాజీనామా చేసిన ఆయన 24 గంటలలోపే తిరిగి సీఎం పీఠాన్ని అధిష్టించారు. రాష్ట్ర గవర్నర్ త్రిపాఠీ ఈ రోజు ఉదయం 10 గంటలకు నితీశ్ కుమార్‌తో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుశీల్ కుమార్ మోదీ కూడా ప్రమాణం చేశారు. కాగా అవినీతి ఆరోపణల నేపథ్యంలో లాలు యాదవ్ తనయుడు తేజస్విని యాదవ్‌ను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని నితీశ్ యత్నించిన విషయం తెలిసిందే. అయితే, తేజస్వి మంత్రివర్గం నుంచి తప్పుకోడంటూ, అసలు నితీశ్‌ను ముఖ్యమంత్రిని చేసింది తానేనని లాలూ వ్యాఖ్యలతో బిహార్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఆర్జేడీతో నితీశ్ తెగదెంపులు చేసుకుని జేడీయూ...బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంది. బీహార్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు నితీశ్ కు మద్దతు ఇస్తామని బీజేపీ ప్రకటించిన బీజేపీ ఈ మేరకు గవర్నర్‌కు లేఖ కూడా అందచేసిన విషయం విదితమే. -
యాహూ ఇక గతమే.. కొత్త పేరెంటో తెలుసా?
ఇంటర్నెట్ దిగ్గజంగా గతంలో ఓ వెలుగు వెలిగిన యాహూ కంపెనీ ఇక కాలగర్భంలో కలిసిపోనుంది. యాహూను సొంతం చేసుకున్న వెరిజాన్ కంపెనీ.. తన ఏవోఎల్ మెయిల్‌ను దానితో విలీనం చేసి.. ఓథ్ (ప్రమాణం) పేరిట కొత్త బ్రాండ్‌ను తెరపైకి తీసుకొచ్చింది. ఇకమీదట ఓథ్ మెయిల్, ఓథ్ ఫైనాన్స్ కంపెనీలు ఇంటర్నెట్ యూజర్లను పలుకరించనున్నాయి. వెరిజాన్ కంపెనీ 4.8 బిలియన్ డాలర్ల మొత్తానికి యాహూ కంపెనీని కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏవోఎల్ మెయిల్లో యాహూ విలీనమైన తర్వాత ఈ రెండింటినీ కలిపి.. ఓథ్ అనే కొత్త కంపెనీ గొడుగు కిందకు తీసుకురానున్నట్టు ఏవోఎల్ సీఈవో టిమ్ ఆర్మ్‌స్ట్రాంగ్ ట్విట్టర్లో వెల్లడించారు. 'వందకోట్లకుపైగా వినియోగదారులు, 20కిపైగా బ్రాండ్లు, ఎదురులేని బృందం.. టేక్ ద ఓథ్ (ప్రమాణం చేయండి)' అంటూ ఆర్మ్‌స్ట్రాంగ్ ట్వీట్ చేశారు. -
'మా' కార్యవర్గ ప్రమాణ స్వీకారం
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడిగా శివాజీ రాజా ఆదివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. నగరంలోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో 'మా' తొలి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. 'మా' కార్యవర్గ సభ్యులతో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేయించారు. మా కార్యదర్శిగా నరేశ్ కూడా ప్రమాణం చేశారు. -
టీడీపీ ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం
-
టీడీపీ ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం
అమరావతి: కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు నారా లోకేష్, కరణం బలరామకృష్ణమూర్తి, పోతుల సునీత, డొక్కా మాణిక్య వరప్రసాద్, బీటెక్‌రవి(మారెడ్డి రవీంధ్రనాథరెడ్డి), జీ దీపక్ రెడ్డి బచ్చుల అర్జునుడు గురువారం ఉదయం శాసనసమండలిలో ప్రమాణస్వీకారం చేశారు. వారి చేత శాసనమండలి చైర్మన్ చక్రపాణి ప్రమాణస్వీకారం చేయించారు. -
అనుకున్నట్లే ఆయనకే కొత్త సీఎం పదవి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్స్‌కు తెరపడింది. అందరూ ఊహించినట్లుగానే త్రివేంద్ర సింగ్ రావత్‌నే తమ ముఖ్యమంత్రిగా ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపిక చేసుకున్నారు. ఆయనను శాసనసభా పక్ష నేతగా ఎంచుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌లో బీజేపీ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 70 స్థానాలున్న అసెంబ్లీలో 57 స్థానాలు బీజేపీకే దక్కాయి. అయితే, ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్స్ మాత్రం అలాగే ఉండిపోయింది. దీనిపైనే శుక్రవారం డెహ్రాడూన్‌లో కేంద్రమంత్రులు జేపీ నడ్డాతోపాటు డీ ప్రధాన్ తదితరులు వెళ్లి కొత్త సీఎం అభ్యర్థిపై చర్చించారు. సీఎం రేసులో ప్రకాశ్ పంత్, త్రివేంద్ర సింగ్ రావత్, సత్పాల్ మహారాజ్ ఉన్నప్పటికీ అదృష్టం మాత్రం త్రివేంద్రను వరించింది. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ స్థాయి నుంచి తన జీవితాన్ని త్రివేంద్ర ప్రారంభించారు. 2014లో ఈయన కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చారు. రావత్‌కు ఆర్ఎస్ఎస్ మద్దతు ఉండటమే కాక, అమిత్ షా ఆశీస్సులు సైతం మెండుగా ఉన్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అమిత్ షా యూపీ ఇన్చార్జిగా ఉన్నప్పుడు ఇద్దరూ కలిసి పనిచేశారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాకు సన్నిహితుడైనందునే ఈయన ఎంపిక ఖరారయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసే అధికారాన్ని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు కట్టబెట్టింది. శనివారం రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌లో కొత్త ముఖ్యమంత్రి, మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా హాజరవనున్నారు. -
సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన ఖేహర్
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ జగదీష్‌సింగ్ ఖేహర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్లో ప్రణబ్ ముఖర్జీ ఈ రోజు ఉదయం ఖేహర్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో జస్టిస్ ఖేహర్ 44వ సీజేఐగా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు 8 నెలలపాటు.. ఆగస్టు 27 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు మంత్రులు హాజరయ్యారు. దేశ చరిత్రలో సిక్కువర్గానికి చెందిన వ్యక్తి సీజేఐగా బాధ్యతలు చేపట్టనుండటం ఇదే తొలిసారి. టీఎస్ ఠాకూర్ పదవీకాలం ఈ నెల 3వ తేదీ (మంగళవారం)తో ముగిసిన విషయం తెలిసిందే. కాగా జస్టిస్ ఖేహర్ సుప్రీంకోర్టులో పలు ధర్మాసనాలకు నేతృత్వం వహించారు. పలు కీలక తీర్పుల్లో భాగస్వామ్యం పంచుకున్నారు. ఎన్‌జేఏసీ కేసును విచారించిన ధర్మాసనానికి నేతృత్వం వహించడంతోపాటు గత జనవరిలో అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనను రద్దుచేసిన ధర్మాసనానికి కూడా ఆయనే నేతృత్వం వహించడం గమనార్హం. అలాగే సహారా చీఫ్ సుబ్రతారాయ్‌ను జైలుకు పంపిన కేసును విచారించిన ధర్మాసనంలోనూ ఆయన పాలుపంచుకున్నారు. ఇటీవల ఒకేరకమైన పనికి ఒకే వేతనం ఉండాలంటూ కాంట్రాక్టు ఉద్యోగుల కేసులో కీలక తీర్పిచ్చిన ధర్మాసనానికీ ఆయన నేతృత్వం వ్యవహరించారు. -
'కొత్త సీఎం ప్రమాణం చేశారు'
ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా పెమా ఖండూ ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం రాజధాని ఈటానగర్ లో ఈ కార్యక్రమం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి నబాంగ్ టుకీపై శనివారం అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి ఓ గంట ముందు నాటకీయ పరిణామాల మధ్య ఆయన ముఖ్యమంత్రి పదవితో పాటు కాంగ్రెస్ లీడర్ పదవికి రాజీనామా చేశారు. టూకీని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ లో రెబల్స్ గా మారిన 30 మంది ఎమ్మెల్యేలలో ఖండూ కూడా ఒకరు. వారి సపోర్టుతో గవర్నర్ కు లేఖను సమర్పించిన ఖండూ అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమయ్యార. కాగా, అరుణాచల్ ప్రదేశ్ లో ముఖ్యమంత్రి పీఠం మార్పు వెనుక కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చక్రం తిప్పినట్లు సమాచారం. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు కలిగిన అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ 45 మెజారిటీ స్థానాలను గెలుపొందింది. -
14 మంది మంత్రులపై వేటు
మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణపై సీఎంకు పూర్తి స్వేచ్ఛ మరో 14మందికి మంత్రి మండలిలో చోటు నేడు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం! పదవులు కోల్పోనున్న మంత్రుల తిరుగుబావుటా ? ఎమ్మెల్యే స్థానానికి కూడా రాజీనామా చేస్తానని అంబి హెచ్చరికలు బెంగళూరు: రాష్ట్ర మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణకు ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆమోదం లభించింది. మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణలో సీఎం సిద్ధరామయ్యకు పూర్తి స్వేచ్ఛను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కల్పించారు. ఇదే సందర్భంలో పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే మాటను కూడా పూర్తిగా తీసేయకుండా ఆయన కోరిన వారిలో ఒకరిద్దరిని మంత్రి పదవుల్లో కొనసాగించడంతో పాటు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేకు మంత్రి మండలిలో స్థానం కల్పించాల్సిందిగా సోనియాగాంధీ ఆదేశించినట్లు సమాచారం. ఇక ఇదే సందర్భంలో చక్కని పనితీరును కనబరుస్తున్న రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యు.టి.ఖాదర్‌ను సైతం మంత్రి పదవి నుంచి తప్పించరాదని సోనియాగాంధీ, సీఎం సిద్ధరామయ్యను ఆదేశించినట్లు తెలుస్తోంది. మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణకు సంబంధించి గత రెండు రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న కసరత్తు ముగిసింది. దీంతో శనివారం సాయంత్రం సీఎం సిద్ధరామయ్య ప్రత్యేక విమానంలో బెంగళూరు చేరుకున్నారు. మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణకు సంబంధించి సీఎం సిద్ధరామయ్యకు కాంగ్రెస్ హైకమాండ్ పూర్తి స్వేచ్ఛను కల్పించడంతో మొత్తం 14 మందిని మంత్రి మండలి నుంచి తప్పించేందుకు సిద్ధరామయ్య నిర్ణయించారు. మంత్రులు కిమ్మనె రత్నాకర్, శ్యామనూరు శివశంకరప్ప, పరమేశ్వర్ నాయక్, అంబరీష్, శ్రీనివాసప్రసాద్, ఖమరుల్ ఇస్లామ్, అభయ్ చంద్రజైన్, మనోహర్ తహశీల్దార్, వినయ్‌కుమార్ సూరకె, దినేష్ గుండూరావ్, ఎస్.ఆర్.పాటిల్, సతీష్ జారకీహోళీ, శివరాజ్ తంగడగి, బాబూరావ్ చించన్సూర్లను మంత్రి మండలి నుంచి తప్పించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ వీరందరికీ తమ తమ రాజీనామా పత్రాలను అందజేయాల్సిందిగా సీఎం సిద్ధరామయ్య సూచించినట్లు సమాచారం. వీరిలో శ్యామనూరు శివశంకరప్ప, అంబరీష్‌లను వారి వయసు, అనారోగ్య కారణాల వల్ల మంత్రి పదవుల నుంచి తప్పిస్తుండగా, మిగతా వారిలో కొంతమందిని అవినీతి ఆరోపణలు, సరైన పనితీరును కనబరచకపోవడం వంటి కారణాలతో మంత్రి వర్గం నుంచి తప్పిస్తున్నట్లు సమాచారం. ఇక మంత్రి పదవులను కోల్పోనున్న కొంత మంది అప్పుడే తిరుగుబాటు బావుటాను ఎగురవేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి అంబరీష్ తనను మంత్రి పదవి నుంచి తప్పిస్తే ఎమ్మెల్యే స్థానానికి సైతం రాజీనామా చేసి వెళ్లిపోతానని హెచ్చరించారు. 14 మందికి ‘మంత్రి భాగ్య’...... ఇక 14 మంది ఎమ్మెల్యేలకు ‘మంత్రి భాగ్య’ను సీఎం సిద్ధరామయ్య కల్పించనున్నారు. మంత్రి వర్గంలో కొత్తగా చేరనున్న వారిలో రమేష్‌కుమార్ (శ్రీనివాసపుర), ప్రమోద్ మద్వరాజ్(ఉడుపి), ప్రియాంక్ ఖర్గే(చిత్తాపుర), బసవరాజ రాయరెడ్డి(యలబుర్గా), ఎస్.ఎస్.మల్లికార్జున్ (దావణగెరె ఉత్తర), కాగోడు తిమ్మప్ప (సాగర), రుద్రప్ప లమాణి (హావేరి), ఎం.కృష్ణప్ప (విజయనగర), రమేష్ జారకీహోళీ (గోకాక్), ఈశ్వర్ ఖండ్రే (బాల్కీ), హెచ్.వై.మేటి (బాగల్కోటె), ఎన్.ఎ.హ్యారిస్ (శాంతినగర), తన్వీర్‌సేఠ్, ఎమ్మెల్సీ ఎం.ఆర్.సీతారామ్లకు మంత్రి పదవులు దక్కనున్నాయి. వీరంతా నేడు (ఆదివారం) రాజ్‌భవన్‌లో జరగనున్న కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. -
...అను నేను కార్పొరేటర్‌గా..
♦ నేడు కొలువు దీరనున్నఖమ్మం కార్పొరేషన్ పాలకవర్గం ♦ ఉదయం 11 గంటలకు ముహూర్తం ♦ సీల్డ్ కవర్లో మేయర్, డిప్యూటీ మేయర్ల పేర్లు ♦ ఫాం- ఏ సమర్పించిన పార్టీల అధినేతలు ♦ మార్గదర్శకాలు రాలేదని కోఆప్షన్ ఎన్నిక వాయిదా ♦ సర్వం సిద్ధం చేసిన జిల్లా యంత్రాంగం ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్ నూతన పాలకవర్గం మంగళవారం ఉదయం కొలువుదీరనుంది. సరిగ్గా ఉదయం 11 గంటలకు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఎన్నికైన కార్పొరేటర్లు, ఎక్స్అఫీషియో సభ్యులకు ఇప్పటికే ఆహ్వానం పంపారు. ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లను అధికారులు పూర్తి చేయించారు. కౌన్సిల్ కొలువు దీరేదిలా.. 50 డివిజన్లలో గెలుపొందిన కార్పొరేటర్లు ఉదయం 11 గంటల కల్లా కార్పొరేషన్‌లోని సమావేశ మందిరానికి వస్తారు. వీరితో కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ‘మేయర్ ఎన్నిక నిర్వహిస్తాం.. పోటీలో నిలిచే వారు నామినేషన్ ప్రకటించాలి’ అని కోరుతారు. మేయర్ పదవి కోసం ఒక్క అభ్యర్థి మాత్రమే నామినేషన్ వేస్తే పోటీ లేదని భావించి ఏకగ్రీవ ంగా నియమిస్తారు. ఒకవేళ పోటీ ఉంటే చేతులు ఎత్తే పద్ధతిలో ఎన్నిక నిర్వహిస్తారు. మెజార్టీ సభ్యులు ఆమోదించిన వారిని మేయర్‌గా ప్రకటిస్తారు. మేయర్‌ను ఎంపిక చేసే పద్ధతిలోనే డిప్యూటీ మేయర్‌నూ ఎంపిక చేస్తారు. ఎంపికైన మేయర్, డిప్యూటీ మేయర్లకు ప్రిసైడింగ్ అధికారి నియామక పత్రాలు అందజేస్తారు. కొత్తగా నియమితులైన వారితో కోరం (25 మంది సభ్యుల కంటే ఎక్కువ) ఉంటే కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తారు. కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించే నాటికి ప్రమాణ స్వీకారం చేయని కార్పొరేటర్లు తిరిగి సర్వసభ్య సమావేశం నిర్వహించే వరకు వేచిచూడక తప్పదు. అప్పటి వరకు కార్పొరేటర్లుగా పరిగణించే అవకాశం ఉండదు. కాబట్టి సభ్యులందరూ సకాలంలో హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు. కవర్లోనే ర హస్యం.. కార్పొరేషన్ ఎన్నికలప్పటి నుంచి మేయర్ అభ్యర్థి నియామకం దాదాపుగా ఖాయమైందని అధికార పార్టీ చెబుతోంది. కానీ సోమవారం రాత్రి వరకు కూడా మేయర్, డిప్యూటీ మేయర్ల విషయమై అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. సీల్డ్ కవర్లోనే మేయర్, డిప్యూటీ మేయర్ల గుట్టు ఉన్నట్లు తెలుస్తోంది. మేయర్ పదవిని ఆశిస్తున్న వారిలో డాక్టర్ పాపాలాల్, రామ్మూర్తి పేర్లు వినిపిస్తున్నాయి. డిప్యూటీ మేయర్ పదవికి విపరీతమైన పోటీ ఉంది. ఎక్కువ సంఖ్యలో ఆశావహులు ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. ‘తామే డిప్యూటీ మేయరంటే.. తామే..’ అంటూ అనుచరుల వద్ద ప్రగల్భాలకు పోతున్నారు. సీఎం కేసీఆర్ ఆమోదంతో ప్రకటించిన మేయర్, డిప్యూటీ మేయర్ల పేర్లు సీల్డ్ కవర్లో ఉంచి మంగళవారం రిటర్నింగ్ అధికారికి ఇవ్వనున్నట్లు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు షేక్ బుడాన్‌బేగ్ ప్రకటించారు. ఫాం ఏ సమర్పణ కార్పొరేషన్ కౌన్సిల్ నియామకానికి సంబంధించిన ఫాం-ఏను టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బేగ్ కలెక్టర్‌కు సో మవారం అందజేశారు. కౌన్సిల్ ఏర్పాటుకు తమ పార్టీకి మెజార్టీ సభ్యులున్నారని తెలిపారు. మేయర్, డిప్యూటీ మేయర్ల పేర్లు వెల్లడించే ఫాం-బీని మంగళవారం ఉదయం అందజేసేందుకు టీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. కో-ఆప్షన్ వాయిదా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు రాలేదన్న కారణంతో కోఆప్షన్ సభ్యుని నియామకాన్ని వాయిదా వేసినట్లు కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు. ఖమ్మం కార్పొరేషన్ స్థాయికి అనుగుణంగా మొత్తం ఐదుగురు కో-ఆప్షన్ సభ్యులను నియమించే అవకాశం ఉంది. వీరిలో ఇద్దరు మైనార్టీలు, ముగ్గురు కార్పొరేషన్ పాలనా వ్యవహారాలపై అనుభవం ఉన్నవారు ఉంటారు. కౌన్సిల్ ప్రారంభమైన 60 రోజుల లోపు కోఆప్షన్ సభ్యుల నియామకం చేపట్టవచ్చనే నిబంధన ఉంది. ఈ మేరకు తిరిగి కౌన్సిల్ సమావేశం నాటికి సభ్యుల ఎంపిక జరగనుంది. ఎక్స్ అఫీషియో సభ్యులకూ ఆహ్వానం.. కౌన్సిల్ సమావేశం, ప్రమాణస్వీకారోత్సవం కార్యక్రమానికి ఎక్స్అఫిషియో సభ్యులకూ ఆహ్వానం పంపారు. స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యులు రేణుకాచౌదరి, ఎమ్మెల్సీ, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణ, పల్లా రాజేశ్వరరెడ్డి కౌన్సిల్ సమావేశానికి హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకారం, ఎంపిక కార్యక్రమాలు జిల్లా ఎన్నికల పరిశీలకులు ఇలంబరితి, కలెక్టర్ లోకేష్‌కుమార్ పర్యవేక్షణలో జరగనున్నాయి. -
'అందరూ రాజ్యాంగంపైనే ప్రమాణం చేయాలి'
ముంబై: మత పరమైన గ్రంధాల మీద కాకుండా అందరూ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని శివసేన కోరింది. దీని ద్వారా దేశంలో ఉన్నటువంటి మతపరమైన అడ్డంకులను తొలగించినట్లు అవుతుందని శివసేన అధికార పత్రిక సామ్నాలో సోమవారం పేర్కొన్నారు. చట్టం ముందు అందరూ సమానులే కానీ రాజ్యాంగం అనేది అన్నింటి కంటే అత్యుత్తమమైనదని వ్యాఖ్యానించింది. అన్నిమతాల వారికి భారత రాజ్యాంగమే పవిత్ర గ్రంథం కావాలని శివసేన అభిప్రాయపడింది. భారత రాజ్యాంగం ముందు అన్ని మతాల వారు సమానమేనని గతంలో బాల్ థాక్రే వెల్లడించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసిన శివసేన.. కోర్టుల్లో ప్రజలంతా మత గ్రంథాల పైన కాకుండా రాజ్యాంగంపైనే ప్రమాణం చేసేలా చర్యలు తీసుకోవాలని కొరింది. ఇటీవల పార్లమెంట్లో మోదీ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగాన్ని పవిత్ర గ్రంథంగా పేర్కొంటూ దాన్ని మార్చడం అంటే ఆత్మహత్యకు పాల్పడటంతో సమానం అని ప్రకటించిన నేపథ్యంలో శివసేన ఈ కామెంట్స్ చేసింది. -
'మోదీ ప్రధానిగా మళ్లీ ప్రమాణం చేయాలి'
పట్నా: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి పదవీ ప్రమాణం చేయాలంటూ ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ ఓ డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. బిహార్ మంత్రిగా లాలూ తనయుడు తేజ్‌ప్రతాప్ యాదవ్ ప్రమాణం చేస్తూ తడబడటంతో ఆయనను మరోసారి ప్రమాణం స్వీకరించాల్సిందిగా ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాలూ గత ఏడాది మేలో ప్రధాని మోదీ ప్రమాణం చేసిన వీడియో లింకును ట్విట్టర్లో పోస్టు చేశారు. ప్రమాణంలో భాగంగా మోదీ భారత సార్వభౌమాధికారం, సమగ్రతను నిలబెడతానని చెప్పాల్సిండగా.. ఆయన హిందీలో 'అక్షున్' (నిలబెట్టడం)కు బదులు 'అక్షాన్' అన్నారని లాలూ తెలిపారు. 'ఆయన 'అక్షున్' అనలేదంటే.. ప్రమాణం అర్థం లేనిది అవుతుంది. కాబట్టి ప్రధాని మరోసారి ప్రమాణం చేయాల్సిందే. అక్షాన్ పదానికి హిందీలో ఎలాంటి అర్థం లేదు' అని ఆయన చెప్పారు. 'ప్రధాని అజెండా దేశాన్ని విడగొట్టడమే. అందుకే ఆయన దేశ సమగ్రతను నిలబెడతానని ప్రమాణం చేయలేదు' అని లాలూ విమర్శించారు. గత శుక్రవారం లాలూ కొడుకు తేజ్‌ప్రతాప్ ప్రమాణంలో 'ఆపేక్షిత్' (అంచనా) పదానికి బదులుగా 'ఉపేక్షిత్' (ఉపేక్షించడం) అనడంతో ఆయనను మరోసారి ప్రమాణం చేయాల్సిందిగా గవర్నర్ రామ్‌నాథ్ గోవింద్ సూచించారు. రెండోసారి ప్రమాణంలో కూడా తేజ్‌ప్రతాప్ తడబడ్డారు. లాలూ రెండు కొడుకు తేజస్వి బిహార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. -
పురం మార్కెట్ కమిటీ చైర్మన్‌గా క్రిష్టప్ప ప్రమాణస్వీకారం
హిందూపురం టౌన్ (అనంతపురం) : రాయలసీమలోనే పేరు ప్రఖ్యాతలు గాంచిన హిందూపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా లేపాక్షి మండలానికి చెందిన శిరివరం క్రిష్టప్ప, ఉపాధ్యక్షునిగా ఆదిరెడ్డి, కార్యవర్గ సభ్యులు శుక్రవారం ప్రమాణస్వీకారోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిందూపురం ఎంఎల్ఎ బాలకృష్ణ, పార్లమెంట్ సభ్యుడు నిమ్మల క్రిష్టప్ప, పెనుకొండ ఎంఎల్ఎ పార్థసారధి, చైర్పర్సన్ ఆర్.లక్ష్మి, వైస్ చైర్మన్ జెపికె రాము, మాజీ ఎంఎల్ఎ రంగనాయకులు, నాయకులు అంబికా లక్ష్మినారాయణ, నాగరాజు తదితరుల సమక్షంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా క్రిష్టప్ప మాట్లాడుతూ.. నా మీద ఎంతో నమ్మకం ఉంచి నాకు ఈ పదవిని కట్టబెట్టిన ఎంఎల్ఎ బాలకృష్ణకు, స్థానిక నాయకులకు రుణపడి ఉంటానని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రైతు సంక్షేమానికి, వ్యాపారస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మార్కెట్ యార్డులో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను వెంటనే పరిష్కరించి రైతులకు అసౌకర్యాలు లేకుండా చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు దాదాపీర్, షాజియాబాను, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీగా ఉమ్మారెడ్డి ప్రమాణం
-
ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన జయ
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత శనివారం ఆర్కేనగర్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. గతవారం జరిగిన ఉప ఎన్నికలో జయ ఆర్కే నగర్ నుంచి లక్షన్నర ఓట్ల మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే. సచివాలయంలోని స్పీకర్ పి. ధన్పాల్.. జయతో ప్రమాణం చేయించారు. పన్నీరు సెల్వం, విశ్వనాథన్, వైద్యలింగం తదితర ముఖ్యులు మాత్రమే జయ వెంట ఉన్నారు. కాగా స్పీకర్ కార్యాలయంలోకి ఫొటోగ్రాఫర్లు సహా మీడియా ప్రతినిధులను అనుమతించలేదు. జయ ప్రమాణం చేస్తున్న సమయంలో స్పీకర్ కార్యాలయం వెలపల ఏఐడీఎంకే కార్యకర్తలు సందడిచేశారు. -
జయ ప్రమాణ స్వీకారానికి ఎవరెవరు వచ్చారంటే..
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రమాణ స్వీకారానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మద్రాస్ యూనివర్సిటీ సెంటినరీ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, నటుడు శరత్ కుమార్, ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, జయ ఇష్టసఖి శశికళ, కుమారుడు సుధాకర్, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. రజనీకాంత్, శరత్ కుమార్ పక్కపక్కనే ఆశీనులయ్యారు. అలాగే అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున అమ్మ పట్టాభిషేకానికి తరలి వచ్చారు. గవర్నర్ రోశయ్య ..జయలలితతో ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం ఆమెను అభినందించారు. ఆ తర్వాత మంత్రులంతా సామూహికంగా ప్రమాణ స్వీకారం చేశారు. -
తమిళనాడు సీఎంగా జయ ప్రమాణ స్వీకారం
-
కొత్త అవతారంలో కవిత
-
స్కౌట్స్ అండ్ గైడ్స్ టీ.చీఫ్ కమిషనర్‌గా కవిత
హైదరాబాద్ : భారత్ స్కౌట్క్ అండ్ గైడ్స్ తెలంగాణ చీఫ్ కమిషనర్‌గా నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కవిత సోమవారం దోమలగూడలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలోనే స్కౌట్క్ అండ్ గైడ్స్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. స్కౌట్క్ అండ్ గైడ్స్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని కవిత తెలిపారు. గతంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ వేలల్లో ఉండగా, ప్రస్తుతం వందల సంఖ్యకు తగ్గిపోయారని ఎంపీ కవిత అన్నారు. స్కౌట్క్ అండ్ గైడ్స్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఏపీ స్కౌట్స్ అండ్ గైడ్స్ చీఫ్ కమిషనర్ శశిధర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ప్రమాణం రేపే
హైదరాబాద్: కొత్తగా ఎన్నికైన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు కోలగట్ల వీరభద్రస్వామి, పిల్లి సుభాష్‌చంద్రబోస్ రేపు పదవీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. వారిద్దరూ ఉదయం 10.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ ఏ.చక్రపాణి ఛాంబర్లో పదవీ ప్రమాణం చేస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. -
నేడు జమ్మూకశ్మీర్ సీఎంగా ముఫ్తీ ప్రమాణం
-
అమ్మలేని బాధ.. నాన్న రాలేని స్థితికి ఆవేదన
* ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన అఖిలప్రియ * ఆళ్లగడ్డతోపాటు నంద్యాల ప్రజలనూ కలుసుకుంటానని వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన భూమా అఖిలప్రియ గురువారం ఎమ్మెల్యేగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఉదయం 9.40 గంటలకు ఆమెతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీలోని తన చాంబర్లో ప్రమాణం చేయించారు. తెలుగులో దేవునిసాక్షిగా ప్రమాణం చేసిన అఖిలప్రియ పీఏసీ ఛైర్మన్ భూమా నాగిరెడ్డి, దివంగత ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి దంపతుల కుమార్తె. తన తల్లి శోభ మృతి వల్ల ఏర్పడిన ఖాళీ నుంచి ఆమె ఏకగ్రీవంగా ఇటీవలే ఎన్నికైన విషయం విదితమే. నవంబర్ 3వ తేదీనే ప్రమాణస్వీకారం చేయాలని భావించినప్పటికీ తన తండ్రి నాగిరెడ్డి అక్రమ కేసులో అరెస్టయి ఉన్నందున ఈ కార్యక్రమాన్ని గురువారం నాటికి వాయిదా వేసుకున్నారు. బెయిల్ లభించక పోవడంతో తన కుమార్తె ప్రమాణస్వీకారోత్సవానికి నాగిరెడ్డి హాజరు కాలేక పోయారు. ఇదే విషయాన్ని అఖిలప్రియ తన ప్రమాణస్వీకారం పూర్తయిన తరువాత మీడియాతో మాట్లాడుతూ ఆవేదనగా వెల్లడించారు. ‘‘అమ్మ లేని లోటు ఓ వైపు, నాన్న ఉండి కూడా రాలేని పరిస్థితి చూస్తే నాకు చాలా బాధగా ఉంది. నాన్న పక్కన లేనిదే ప్రమాణం చేయనని తాను చెప్పానని, అయితే తాను వచ్చేవరకూ నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉండటం ఏ మాత్రం సరికాదని, వారి అవసరాలు చూడాల్సిన బాధ్యత మనపై ఉందని నాన్న నచ్చ జెప్పడంతో ప్రమాణస్వీకారానికి వచ్చాను’’ అని ఆమె తెలిపారు. తానికపై ప్రజ ల్లోకి వెళతానని, ఆళ్లగడ్డతో పాటుగా నంద్యాల ప్రజలను కూడా కలుసుకుంటానని తెలిపారు. తప్పుడు కేసులు అన్యాయం తన తండ్రి నాగిరెడ్డితో పాటుగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలపై సర్కారు తప్పుడు కేసులు పెట్టి వేధించడం అన్యాయమని, సమయం వచ్చినపుడు ప్రజలే తగిన రీతిలో సమాధానం చెబుతారని అఖిలప్రియ హెచ్చరించారు. అక్రమ కేసులకు గురై వేధింపుల పాలవుతున్న నంద్యాల మున్సిపల్ కౌన్సిలర్లను, వారి కుటుంబీకులను తాను తొలుత కలుసుకోబోతున్నట్లు తెలిపారు. ఆ తరువాత ఆళ్లగడ్డలోని ప్రతి మండలంలోనూ పర్యటిస్తానన్నారు. తన తండ్రికి త్వరలో బెయిల్ వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆయన బయటకు వచ్చాక ఇద్దరమూ కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తనపై ఉంచిన నమ్మకానికి సార్థకత చేకూరుస్తూ ఆయన గర్వపడేలా ఎమ్మెల్యేగా పనిచేస్తానని అఖిలప్రియ చెప్పారు. కక్షసాధింపు తగదు తమ పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, ప్రజాస్వామ్యంలో ఇదెంత మాత్రం మంచిది కాదని వైఎస్సార్సీ శాసనసభాపక్షం ఉప నేత జ్యోతుల నెహ్రూ విమర్శించారు. అందరికీ తలలో నాలుక మాదిరిగా మెలిగే మంచి నాయకురాలు శోభ మృతి చెందడం, భూమా నాగిరెడ్డి రిమాండ్‌లో ఉండటం చూస్తే ఆ కుటుంబాన్ని దురదృష్టం వెన్నాడుతోందన్న బాధ కలుగుతోందన్నారు. తల్లి, తండ్రులిద్దరూ లేని స్థితిలో అఖిలప్రియ ప్రమాణస్వీకారం చేయాల్సి రావడం నిజంగా బాధాకరమన్నారు. జగన్ టీంలోకి ఒక యువశాసనసభ్యురాలిని అందించిన కర్నూలు ప్రజలకు తాను అభినందనలు తెలుపుతున్నానని, వైఎస్సార్సీపీకి ఆ జిల్లాలో ఇక తిరుగు లేదని చెప్పారు. భవిష్యత్‌లో అఖిల ప్రియ ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు మైసూరారెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎస్.వి.మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, భూమా కుటుంబీకులు హాజరయ్యారు. ఏపీ శాసనసభ కార్యదర్శి (ఇన్చార్జి) కె.సత్యనారాయణరావు ప్రమాణస్వీకారాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. -
ఎమ్మెల్యేగా భూమా అఖిల ప్రియ ప్రమాణ స్వీకారం
హైదరాబాద్ : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికైన భూమా అఖిల ప్రియ గురువారం ఎమ్మెల్యగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీలోని తన ఛాంబర్లో ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రు, పార్టీ సీనియర్ నేత మైసూరారెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. (ఇంగ్లీష్ కథనం కోసం) -
మండలిలో నాయని ప్రమాణ స్వీకారం
-
ఎమ్మెల్యేలతో మళ్లీ ప్రమాణ స్వీకారం
హైదరాబాద్ : నియామవళి ప్రకారం ప్రమాణం చేయని ఎమ్మెల్యేలతో ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరోసారి ప్రమాణ స్వీకారం చేయించారు. శుక్రవారం ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే రవీంద్రనాథ్ రెడ్డి .... వైఎస్ రాజశేఖర్ రెడ్డి, విజయమ్మల సాక్షిగా అంటూ ప్రమాణం చేశారు. దాంతో అలా ప్రమాణ స్వీకారం చేయటం నిబంధనలకు విరుద్దమని అధికారులు తేల్చి చెప్పడంతో మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రవీంద్రనాథ్ రెడ్డితో పాటు ప్రమాణ స్వీకారం చేసిన వారిలో కేఎస్ జవహర్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎం. వెంకటరమణ, రవీంధ్రనాథ్ రెడ్డి తదితరులు ఉన్నారు. -
ఎమ్మెల్యేగా రోజా ప్రమాణ స్వీకారం
-
ప్రొటెం స్పీకర్‌గా పతివాడ ప్రమాణ స్వీకారం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నెల్లిమర్ల శాసనసభ్యుడు పతివాడ నారాయణ స్వామి నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ గురువారం ఉదయం రాజ్‌భవన్‌లో ఆయనతో ప్రమాణ స్వీకారం చేయంచారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. కాగా తొలిరోజు అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలతో పతివాడ నారాయణస్వామి నాయుడు ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించి, సభ్యులతో ప్రమాణ స్వీకారాలు, స్పీకర్ ఎన్నికను నిర్వహించనున్నారు. సభ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్ ముందుగా సభానాయకుడైన ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఆ తరువాత ఇతర సభ్యులందరితోనూ ప్రమాణాలు చేయించనున్నారు. మొత్తంమీద ఎమ్మెల్యేలుగా ఎన్నికైనట్టు ఫలితాలు ప్రకటించిన నెలా మూడు రోజుల తర్వాత సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈనెల 24వ తేదీ వరకూ పార్లమెంట్ సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. -
కొత్త ఉత్సాహం
నెరవేరనున్న జిల్లా కొత్త ఎమ్మెల్యేల ఆశలు 19న ప్రమాణస్వీకారం తొలిసారి అసెంబ్లీ మెట్లు ఎక్కేందుకు సన్నద్ధం సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల్లో గెలిచారు. ఎప్పుడు అసెంబ్లీ మెట్లు ఎక్కుదామా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. సీనియర్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేసి అధికారులతో సమీక్షలు కూడా చేస్తుండడంతో తమకా అవకాశం ఎప్పుడు వస్తుందా అని నిరీక్షిస్తున్నారు. ఎట్టకేలకు అసెంబ్లీ సమావేశాలకు ఈ నెల 19న ముహూర్తం ఖరారుకావడంతో తమ ఆశలు నెరవేరబోతున్నాయని సంబరపడుతున్నారు. తొలిసారిగా అసెంబ్లీ మెట్లు ఎక్కనున్న జిల్లాలోని ఎనిమిది మంది ఎమ్మెల్యేల ఆనందమిది. ఈ నెల 19న వీరంతా కొత్త ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరిలో వాసుపల్లి గణేష్‌కుమార్(విశాఖ దక్షిణం), విష్ణుకుమార్‌రాజు(విశాఖ ఉత్తరం), పీలా గోవింద్(అనకాపల్లి), పల్లా శ్రీనివాస్ (గాజువాక), గిడ్డి ఈశ్వరి(పాడేరు), కిడారి సర్వేశ్వరావు(అరకు), వంగలపూడి అనిత (పాయకరావుపేట), బూడి ముత్యాలనాయుడు(మాడుగుల) ఉన్నారు. వాస్తవానికి గెలిచిన పదిరోజుల్లోగా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయడం ఆనవాయితీ. కానీ ఈసారి రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ ప్రక్రియ చాలా రోజులు వాయిదా పడింది. దీనికితోడు కొత్త ఆంధ్రప్రదేశ్‌కు కనీసం రాజధాని లేకపోవడం, ఆస్తుల పంపకం, ఉద్యోగుల కేటాయింపు, అసెంబ్లీ విభజన, ముఖ్యమంత్రి పేషీలు తేల్చడం తదితర అంశాలు మరో కారణం. మే 16న కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికి కొత్త ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకార ముహూర్తం కోసం జూన్ 8 వరకు ఆగడంతో అసెంబ్లీ సమావేశాలు చాలా ఆలస్యమయ్యాయి. దీంతో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం వాయిదా పడుతూ వచ్చింది. సీనియర్ ఎమ్మెల్యేల్లో ఇద్దరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొందరు టీడీపీ ఎమ్మెల్యేలయితే ప్రమాణస్వీకారం చేయకుండానే అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా అప్పుడే నియోజకవర్గాల్లో పెత్తనం కూడా మొదలుపెట్టేశారు. జిల్లా, నియోజకవర్గ స్థాయి ప్రభుత్వ అధికారులను ఇంటికి పిలిపించుకుని అభివృద్ధి పనులపై సమీక్ష కూడా ప్రారంభించారు. అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ రెండు అడుగులు ముందుకువేసి నేరుగా అధికారిక సమీక్ష చేపట్టారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా ఇలా సమీక్షలు జరపడంపై గవర్నర్‌కు ఫిర్యాదు కూడా వెళ్లింది. మరి కొందరైతే నేరుగా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లడం, తమకు నియోజకవర్గ నిధులు ఎన్ని వస్తాయి?, ఇప్పటివరకు మంజూరైన నిధులెన్ని?, నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు?, ఇంకా చేయాల్సిన పనులు ఏమున్నాయి?.. వంటి వివరాలను ఆరా తీసి ఉంచారు. 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నందున కొత్తగా ఎన్నికైన పలువురు ఎమ్మెల్యేలు రెండు రోజులు ముందుగానే హైదరాబాద్‌కు పయనమవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రక్రియ ముగిశాక నియోజకవర్గాలకు ఊరేగింపుగా వచ్చి అనుచరులతో భారీగా ర్యాలీ నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. -
ఢిల్లీ ఎంపీలు సంస్కృతంలో ప్రమాణం
సాక్షి, న్యూఢిల్లీ: పదహారవ లోక్‌సభ కు ఢిల్లీ నుంచి ఎన్నికైన ఎంపీలు ప్రమాణస్వీకారం రోజున లోక్‌సభలో తమ వైవిధ్యాన్ని చాటుకున్నారు. ఏడుగురిలో నలుగురు ఎంపీలు - చాందినీచౌక్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న కేంద్ర ఆరోగ్యమంత్రి డాక్టర్ హర్షవర్ధన్, న్యూఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తోన్న మీనాక్షీ లేఖి, ఈస్ట్ ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తోన్న మహేష్ గిరీ, పశ్చిమఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తోన్న ప్రవేశ్ సాహిబ్ సింగ్ వర్మ సంస్కృతంలో ప్రమాణస్వీకారం చేశారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తోన్న భోజ్‌పురి నటుడు, గాయకుడు మనోజ్ తివారీ ఆకుపచ్చ ధోవతి, లేత నీలం రంగు కుర్తా , నల్లటి జాకెట్ ధరించి ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. ఆయన ప్రమాణస్వీకార పత్రం చూడకుండానే ప్రమాణం చేయడం తోటి ఎంపీల నుంచి ప్రశంసలు అందుకుంది. వారు హర్షధ్వానాలతో ఆయనను అభినందించారు. మనోజ్ తివారీ హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఏడుగురు బీజేపీ నేతలు తొలిసారి ఎంపీలే కావడం విశేషం. విక్టోరియా జూబ్లీ సీనియర్ సెకండరీ స్కూలు విద్యార్థిగా హర్షవర్ధన్ సంస్కృతం చదివారని అంటున్నారు. హర్షవర్ధన్‌తో పాటు మరో ఇద్దరు కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, ఉమాభారతీ, లోక్‌సభ స్పీకర్ అభ్యర్థి సుమిత్రా మహాజన్ కూడా సంస్కృతంలో ప్రమాణస్వీకారం చేశారు. -
తెలుగులో వైఎస్ అవినాశ్‌రెడ్డి ప్రమాణస్వీకారం
-
లోక్‌సభలో తెలుగు ఎంపీల ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ : 16వ లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇరు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హిందీలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. అనంతరం ఎల్ కే అద్వానీ, సోనియాగాంధీ, నితిన్ గడ్కరీ, సుష్మా స్వరాజ్, రాజ్‌నాథ్ సింగ్ వరుసగా ప్రమాణ స్వీకారం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బుట్టా రేణుకా, వెలుగపల్లి వరప్రసాద్ రెడ్డి ఆంగ్లంలో, వైవీ సుబ్బారెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే టీడీపీకి చెందిన ఎంపీలు అశోక్ గజపతిరాజు ఆంగ్లంలో, జేసీ దివాకర్ రెడ్డి తెలుగులో, నిమ్మల కిష్టప్ప హిందీలో ప్రమాణం చేశారు. కాగా ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం కూడా కొనసాగనుంది. -
మోడీ, అద్వానీ, సోనియా ప్రమాణం స్వీకారం
న్యూఢిల్లీ : 16వ లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం కొనసాగుతోంది. ప్రోటెం స్పీకర్ కమల్‌నాథ్ గురువారంలోక్సభకు ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఎల్.కె అద్వానీ, సోనియాగాంధీ లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అద్వానీ లోక్ సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సభ్యుల వద్దకు స్వయంగా వెళ్లి అభివాదం చేశారు. సుష్మా స్వరాజ్ సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు ప్రోటెం స్పీకర్ కమల్ నాథ్ మూడు లోక్‌సభ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీ, సమాజ్‌వాదీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ రాజీనామాలను ఆమోదించినట్లు ఆయన తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు జూన్ 2 నుంచి అమల్లోకి వచ్చినట్లు తెలిపారు. సభ్యుల ప్రమాణ స్వీకారం శుక్రవారం కూడా కొనసాగనుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి 315 మంది కొత్తగా ఎన్నికయ్యారు. -
మంత్రులుగా అలీ,రాజయ్య,నాయిని,ఈటెల,హారీశ్‌రావు ప్రమాణస్వీకారం
-
మంత్రిగా కేటీఆర్ ప్రమాణ స్వీకారం
-
కేసీఆర్ పై కరుణానిధి ప్రశంసల వర్షం
చెన్నై: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేయనున్న టీఆర్ఎస్ అధినేత కే చందశేఖరరావు(కేసీఆర్)కు డీఎంకే అధ్యక్షుడు కే. కరుణానిధి అభినందనలు తెలిపారు. 'తాజా ఎన్నికల్లో పార్టీని విజయం వైపుకు నడిపించి.. ముఖ్యమంత్రి పదవి చేపడుతున్న కేసీఆర్ కు నా అభినందనలు' అని కరుణానిధి అన్నారు. 'మీ ఎత్తుగడలు, కఠోర శ్రమ, అకుంఠిత దీక్షను తెలంగాణ ప్రజలు గుండెల్లో ఉంచుకుంటారు' అని ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 2004లో తనని కలిసి చర్చించిన విషయాన్ని కరుణానిధి గుర్తు తెచ్చుకున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. లక్ష్యాన్ని కేసీఆర్ చేరుకున్నారని కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రాంతం అభివృద్దిని సాధిస్తుందని.. శాంతియుతమైన పాలన ఉంటుందనే విశ్వాసాన్ని కరుణానిధి వ్యక్తం చేశారు. 29వ రాష్ట్రంగా తెలంగాణ జూన్ 2 తేదిన అవతరిస్తున్న సంగతి తెలిసిందే. -
జూన్ 2 కేసీఆర్ ప్రమాణ స్వీకారం: కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కే చంద్రశేఖరరావు జూన్ 2 తేదిన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన జూన్ 2 తేదిన రోజునే కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జూన్ 2 తేదిన మధ్యాహ్నం కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన కుమారుడు, ఎమ్మెల్యే కేటీఆర్ పీటీఐకి వెల్లఢించారు. 119 సీట్లున్న అసెంబ్లీలో టీఆర్ఎస్ పార్టీకి 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇటీవల జరిగిన లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో కేసీఆర్ ను శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. -
గుజరాత్‌కు తొలి మహిళా సీఎంగా ప్రమాణం
-
గుజరాత్‌కు తొలి మహిళా సీఎంగా ప్రమాణం
అహ్మదాబాద్ : గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా ఆనందిబెన్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. నరేంద్ర మోడీ సమక్షంలో ఆమె గుజరాత్ రాష్ట్ర తొలి మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. గుజరాత్ గవర్నర్ కమలా బేనీవాలా ఈరోజు మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో ఆనందీ బెన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ అగ్రనేతలు అద్వానీ, రాజ్‌నాథ్, గడ్కరీతో పాటు పలువురు హాజరయ్యారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడంతోపాటు ఆమె అనేక సహసోపేతమైన పనులు చేశారు. దాంతో ఆమెకు గుజరాత్ ఉక్కు మహిళగా పేరొచ్చింది. మోడీ ప్రధాన మంత్రి అయితే కేబినెట్లో సీనియర్ మంత్రి అయిన ఆనంది బెన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. ఆనంది బెన్ గతంలో విద్యా, రెవెన్యూ, మహిళా, శిశు సంక్షేమ తదితర కీలక శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. ఆమె గుజరాత్ మెహసాన జిల్లాలోని ఓ కుగ్రామంలో రైతు కుటుంబంలో 1941లో జన్మించారు. 1965లో భర్త మఫత్ లాల్ పటేల్‌తో కలిసి అహ్మదాబాద్‌లో స్థిరపడిన ఆమె అంచెలంచెలుగా ఎదిగారు. ఎంఎస్సి,బిఇడి చదివి, టీచరుగా పనిచేస్తూ మోడీ ప్రోత్సాహంతో ఆనంది బెన్ రాజకీయాల్లో వచ్చారు. బిజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పని చేశారు. 1994లో రాజ్యసభ వెళ్లారు. 1994 నుంచి ఎమ్మెల్యేగా ఎంపికవుతూ వచ్చారు. గుజరాత్లో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మహిళా నేత ఆనంది బెన్ ఒక్కరే. -
అమ్మా.. మజాకా!
చెన్నై, సాక్షి ప్రతినిధి:రాష్ట్రంలోని 39, పుదుచ్చేరిలోని ఒకటి కలుపుకుని మొత్తం 40 స్థానాల్లో గెలుపొందినపుడే కేంద్రంలో పట్టుసాధిస్తామని పార్టీ క్యాడర్‌కు అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత అనేకసార్లు నూరిపోశారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో మంత్రిని ఇన్చార్జ్గా నియమించారు. 37 స్థానాల్లో గెలవగా కన్యాకుమారి, ధర్మపురి, పుదుచ్చేరి స్థానాల్లో పార్టీ పరాజయం పాలైంది. దేశమంతా అన్నాడీఎంకే విజయాన్ని ఆకాశానికి ఎత్తేసినా అమ్మ మాత్రం ఆ మూడు స్థానాలపై ఆలోచనలో పడ్డారు, తనదైన శైలిలో ఆరాతీశారు. అంతే ఇంకేముంది ముగ్గురు మంత్రులపై వేటుపడింది. కొందరు పార్టీ పదవులను కోల్పోయారు. కన్యాకుమారిలో అన్నాడీఎంకే అభ్యర్థి మూడోస్థానానికి దిగజారడంతో అక్కడి ఇన్చార్జ్ మంత్రి పచ్చయమ్మాల్ పదవి కోల్పోయారు. ఈరోడ్ ఇన్చార్జ్ మంత్రి దామోదరన్ అనారోగ్యం పేరున సరిగా ప్రచారం చేయకపోవడం, అభ్యర్థుల కోసం పార్టీ ఇచ్చిన నిధులను సక్రమంగా పంచకపోవడంతో మాజీగా మారిపోయారు. తిరువళ్లూరు ఎంపీ వేణుగోపాల్ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందినా అక్కడి ఇన్చార్జ్ మంత్రి బీవీ రమణకు వేటుతప్పలేదు. ఇది పార్టీలో సంభ్రమాశ్చర్యానికి గురిచేసింది. రమణ తొలగింపునకు సరైన కార ణాలను పార్టీ నేతలే అన్వేషిస్తున్నారు. అమ్మ కేబినెట్లో కీలక పోర్టుఫోలియోలను నిర్వర్తిస్తున్న కేపీ మునుస్వామి నుంచి తప్పించి సాధారణమైన కార్మిక సంక్షేమ శాఖను అప్పగించారు. ఎన్నికల సమయంలో అనేక చోట్ల ప్రజలు తాగునీటి సమస్య ఎదుర్కొన్నా తగిన నివారణ చర్యలను తీసుకోలేదన్న ఆరోపణ వుంది. పార్టీ క్రమశిక్షణా సంఘం అధ్యక్షునిగా ఉన్న మంత్రి కేపీ మునుస్వామిని తప్పించి ఎడప్పాడీ పళనిసామిని నియమించారు. కన్యాకుమారి, ధర్మపురిల్లో పార్టీ బాధ్యతలను నిర్వహిస్తున్నవారిపై కూడా జయ వేటువేశారు. మాజీలకు మళ్లీ చోటు సక్రమంగా పనిచేయనివారిపైనే కాదు సమర్థవంతంగా వ్యవహరించిన నేతలపైనా తన నిఘా ఉందని అమ్మ నిరూపించుకున్నారు. గతంలో మంత్రి పదవుల నుంచి తొలగింపునకు గురైన వేలుమణి, అగ్రి కృష్ణమూర్తి, గోకుల ఇందిర ఈ ముగ్గురు తాజా ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు విశేషంగా కృషి చేసినందుకు మెచ్చుకోలుగా అమ్మ మళ్లీ పదవులను కట్టబెట్టారు. మంగళవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ కె.రోశయ్య సీఎం జయ సమక్షంలో వారి చేత ప్రమాణస్వీకారం చేయించారు. -
ప్లీనరీలో కార్యకర్తలతో వైఎస్సాఆర్ సీపీ ప్రమాణం
-
కేజ్రీవాల్ అను నేను..
సాక్షి, న్యూఢిల్లీ: రెండున్నరేళ్ల కిందట.. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానం.. అవినీతికి వ్యతిరేకంగా ‘సామాన్యుడు’ గర్జించాడు.. జనలోక్‌పాల్ కోసం నినదించాడు..! ఇప్పుడూ అదే రామ్‌లీలా మైదానం.. లక్షల గొంతుల జయజయధ్వానాలతో మార్మోగింది.. నాడు అవినీతిపై గర్జించిన ఆ ‘సామాన్యుడి’ రాక కోసం ఎదురుచూసింది.. అందరిలాగే ఆ ‘ఆమ్ ఆద్మీ’ మెట్రో రైల్లో వచ్చాడు.. వస్తూ వస్తూ రెండున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను మోసుకొని వచ్చాడు.. వారి ఆశలను ఢిల్లీ పీఠంపై కూర్చోబెట్టాడు!! ఆ అ‘సామాన్యుడే’ కేజ్రీవాల్!!! శనివారం మధ్యాహ్నం ఢిల్లీ ఏడో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ లె ఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు మనీష్ సిసోడియా, రాఖీబిర్లా, గిరీష్సోనీ, సౌరభ్ భరద్వాజ్, సోమ్‌నాథ్ భారతి, సత్యేంద్రజైన్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఆప్ కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలిరావడంతో రామ్‌లీలా మైదానం కిక్కిరిసిపోయింది. జైహింద్ నినాదాలతో మార్మోగిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తయిన చీపురు కట్టలను చేతపట్టుకొని కార్యకర్తలంతా ఉత్సాహంగా కనిపించారు. నేను మీ వాడిని.. ఇది మీ ప్రభుత్వం: సీఎంగా ప్రమాణం చేసిన అనంతరం కేజ్రీవాల్ ప్రజలనుద్దేశించి 20 నిమిషాలప్రసంగించారు. ఇది మీ ప్రభుత్వం అని, మీలో ఒకడిగా పనిచేస్తానని చెప్పారు. భారత్ నుంచి అవినీతిని తరిమేద్దామని, మరో పదేళ్లలో దేశం సగర్వంగా తలెత్తుకొనే స్వర్ణయుగపు రోజులు వస్తాయని పేర్కొన్నారు. ప్రజలు, రాజయకీయ నేతలు, అధికార యంత్రాంగం కలిసిక ట్టుగా పనిచేస్తే సాధించలేనిదంటూ ఏదీ ఉండదన్న సత్యాన్ని చాటుదామని పిలుపునిచ్చారు. పాలనలో తమ ప్రభుత్వం కొత్తదనాన్ని చూపిస్తుందని, అధికారగర్వాన్ని ప్రదర్శించకుండా సామాన్యుడి కోసం పనిచేస్తుందని చెప్పడంతో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. ‘‘ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసింది అరవింద్ కేజ్రీవాల్, ఇతర మంత్రులు కాదు. ఈ ప్రమాణ స్వీకారం చేసింది ఢిల్లీ ప్రజలు. ఈ పోరాటమంతా కేజ్రీవాల్‌ను సీఎం చేయడానికి కాదు.. మార్పు కోసం.. ప్రజల చేతికే అధికారం ఇవ్వడం కోసం.. నిజంగా మేం అధికారంలోకి రావడం ఆ దేవుడి మహిమే..’’ అని అన్నారు. సమస్యలు పరిష్కరించేందుకు తన చేతిలో మంత్రదండమేదీ లేదంటూనే ఢిల్లీవాసులంతా సహకరిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతామని ధీమా వ్యక్తంచేశారు. ‘‘మాకు ఎలాంటి గర్వం లేదు. భవిష్యత్తులోనూ రాదు. ప్రజలకు సేవచేయడమే మా లక్ష్యం. అవినీతి రహిత సమాజ నిర్మాణమే ప్రధాన లక్ష్యం’’ అని ఉద్ఘాటించారు. జీవితంలో లంచం ఇవ్వబోమని, తీసుకోబోమని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. లంచం అడిగేవారిని పట్టించడంలో సహకరించాలని, వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించాలన్నారు. ఎవరైనా లంచం అడిగితే తమకు ఫోన్ చేయాలని, ఫోన్ నంబరును రెండు రోజులలో ప్రకటిస్తామని చెప్పారు. అహంకారం వద్దు.. నిరాడంబరత ముద్దు: అహంకారం అలవరచుకోరాదని, హంగూ ఆర్భాటాలు లేకుండా నిజాయతీగా పనిచేయాలని పార్టీ ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు కేజ్రీవాల్ సూచించారు. సామాన్యునికి సేవచేయడం కోసం తామున్నామన్న సంగతిని గుర్తు పెట్టుకోవాలన్నారు. నిజాయితీతో పోటీ చేసి ఎన్నికల్లో ఎవరైనా గెలవవచ్చన్న సందేశాన్ని ఢిల్లీ ప్రజలు దేశవ్యాప్తంగా చాటారని అభినందించారు. రెండున్నరేళ్ల కిందట ప్రారంభమైన అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ తన గురువు అన్నా హజారేను గుర్తుచేసుకున్నారు. రాజకీయాలు బురద అని వాటికి దూరంగా ఉండాలని అన్నా అనే వారని, కానీ ఆ మాలిన్యాన్ని తొలగించాలంటే బురదలోకి దిగాల్సిందే అని తాను ఆయనకు నచ్చచెప్పేవాడినని కేజ్రీవాల్ చెప్పారు. వారం రోజుల తర్వాత బల నిరూపణలో ప్రభుత్వం ఉంటుందో పోతుందో అన్న భయం తమకు లేదని, అది చాలా చిన్న విషయమని పేర్కొన్నారు. ప్రభుత్వం పడిపోతే మళ్లీ ఎన్నికల్లో పోటీచేసి పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తామన్నారు. ప్రభుత్వం నడపడంలో అధికారస్వామ్యం అడ్డుపడుతుందని అందరూ అంటున్నారని, అయితే గడిచిన రెండు మూడ్రోజుల్లో తనను కలిసిన ఢిల్లీ ప్రభుత్వ అధికారులలో చాలామంది మంచివారున్నారని పొగిడారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన బీజేపీ శాసనసభా పక్ష నేత హర్షవర్దన్‌పైనా ప్రశంసలు కురిపించారు. ఆయన నిజాయితీపరుడంటూ కొనియాడారు. భారత్ మాతాకీ జై, ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాలతో ప్రసంగాన్ని ముగించారు. ఢిల్లీ పగ్గాలు చేపట్టిన అతి పిన్న వయస్కుల్లో కేజ్రీవాల్(45) రెండో వ్యక్తి. 1952లో చౌదరి బ్రహ్మ ప్రకాశ్ 34 ఏళ్ల వయసుకే ఢిల్లీ సీఎంగా పనిచేశారు. నిస్వార్థంగా సేవ చేయి: కేజ్రీవాల్‌కు హజారే సూచన రాలెగావ్ సిద్ధి: ఢిల్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తన ఒకప్పటి శిష్యుడు కేజ్రీవాల్‌కు సామాజిక కార్యకర్త అన్నా హజారే అభినందనలు తెలిపారు. కొత్త ప్రభుత్వం ఫలితాలపై ఆలోచించకుండా నిస్వార్థంగా ప్రజాసేవ చేయాలని సూచించారు. రాజకీయాల అంతిమ లక్ష్యం ప్రజాసేవేనని రాలెగావ్‌సిద్ధిలో చెప్పారు. అనారోగ్యం వల్ల కేజ్రీవాల్ ప్రమాణస్వీకారానికి హాజరుకాలేకపోయానన్నారు. ఈ మేరకు కేజ్రీవాల్‌కు లేఖ కూడా రాశారు. కీలక శాఖలు సీఎం వద్దే.. సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత కేజ్రీవాల్ ఢిల్లీ సచివాలయానికి వెళ్లి బాధ్యత లు స్వీకరించారు. ఆ తర్వాత విలేఖరుల సమావేశంలో మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలను వెల్లడించారు. విద్యుత్తు, హోం, ఆర్థిక, విజిలెన్స్, సర్వీసెస్, ప్లానింగ్ వంటి కీలక శాఖలను కే జ్రీవాల్ తన వద్దే ఉంచుకున్నారు. ఎవరెవరికి ఏయే శాఖ కేటాయించారంటే ? మనీష్ సిసోడియా: రెవెన్యూ, ప్రాథమిక విద్య, ఉన్నత విద్య, పీడ బ్ల్యూడీ, పట్టణాభివృద్ధి, స్థానిక సంస్థలు, భూమి-భవనాలు సోమ్‌నాథ్ భారతీ: పాలనా సంస్కరణలు, పర్యాటక, న్యాయ, కళలు, సాంస్కృతిక శాఖ సౌరభ్ భరద్వాజ్: రవాణా, ఆహారం-పౌర సరఫరాలు, పర్యావరణం, ఎన్నికలు, సాధారణ పరిపాలన గిరీష్ సోనీ: ఉపాధి, కార్మిక, ఎస్సీ, ఎస్టీ వ్యవహారాలు, నైపుణ్య అభివృద్ధి సత్యేంద్ర జైన్: ఆరోగ్యం, పరిశ్రమలు, గురుద్వారా ఎన్నికలు రాఖీ బిర్లా: సామాజిక అభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమం, మహిళా భద్రత, భాషలు ‘సౌభ్రాతృత్వ’ గీతాలాపన ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కేజ్రీవాల్, ఈ సందర్భంగా ‘సౌభ్రాతృత్వ’ గీతాన్ని ఆలపించారు. విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని చాటే ‘ఇన్సాన్ కా ఇన్సాన్ సే హో భాయ్‌చారా... యెహీ పైగామ్ హమారా’ (మనిషితో మనిషికి ఉండాలి సోదరభావం... ఇదే మా ఆహ్వానం...) అంటూ పాడారు. 1959లో విడుదలైన ‘పైగామ్’ చిత్రం కోసం కవి ప్రదీప్ రాసిన ఈ పాటను మన్నాడే ఆలపించారు. ఈ పాట మనం ఎలాంటి దేశాన్ని, సమాజాన్ని కోరుకుంటున్నామో చెబుతుందని కేజ్రీవాల్ అన్నారు. దేవుడి మహిమ: కేజ్రీవాల్ కొన్నేళ్ల కిందటి వరకు తాను నాస్తికుడినని చెప్పుకున్న కేజ్రీవాల్ సీఎంగా ప్రమాణం తర్వాత చేసిన ప్రసంగంలో భగవన్నామాన్ని జపించారు. దేశంలోని నాలుగు ప్రధాన మతాల దేవుళ్లను పేరుపేరునా కొనియా డారు. ఇటీవలే పుట్టిన ఆప్ ఎన్నికల్లో సాధించిన విజయం దేవుడి మహిమ అని, తమను అధికారంలోకి తీసుకొచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు.‘ఇది చారిత్రక దినం. అవినీతిని ఓడించి, ప్రజాపాలనను నెలకొల్పే విప్లవం రెండేళ్ల వరకూ ఊహకే అందనిది. ఇది మా ఘనత కాదు, కచ్చితంగా దేవుడి మహిమే. పరమపితకు, ఈశ్వరుడికి, అల్లాకు, వాహే గురువుకు కృతజ్ఞతలు’ అని అన్నారు. కేజ్రీవాల్‌కు ప్రధాని శుభాకాంక్షలు న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన కేజ్రీవాల్‌కు ప్రధాని మన్మోహన్సింగ్ శనివారం ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన బాధ్యతలు స్వీకరిస్తున్న వేళ తన మద్దతు ఉంటుందని చెప్పారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. హామీలు అమలు చేస్తే మద్దతు కొనసాగుతుంది ఢిల్లీవాసులు విద్యుత్, మంచినీటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను పరిష్కరిస్తామంటూ ఎన్నికలప్పుడు ఆప్ ఇచ్చిన హామీలు నెరవేరిస్తే వారికి మా మద్దతు కొనసాగుతుంది. - షకీల్ అహ్మద్ (కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, పార్టీ ఢిల్లీ ఎన్నికల ఇన్చార్జి) ప్రభుత్వం స్థిరంగా ఉండాలి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన కేజ్రీవాల్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కాంగ్రెస్, ఆప్ స్థిర ప్రభుత్వాన్ని అందించాలని కోరుకుంటున్నా. కొత్త ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చి ప్రజల అంచనాలను అందుకుంటుందని ఆశిస్తున్నా. - రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ అధ్యక్షుడు -
నేటి నుంచి ‘సీఎం’ కేజ్రీవాల్
ప్రజల నడుమ ప్రమాణ స్వీకారం రామ్‌లీలా మైదాన్‌లో భారీ బహిరంగ సభ సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయాలను ప్రక్షాళిస్తానంటూ సామాన్యుని పక్షాన రంగంలోకి దిగి దుమ్ము రేపిన అరవింద్ కేజ్రీవాల్, అదే సామాన్యుల నడుమ సాదాసీదా రీతిలో హస్తిన పాలనా పగ్గాలు చేపట్టనున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు చారిత్రక రామ్‌లీలా మైదాన్‌లో జరిగే భారీ బహిరంగ సభలో ఢిల్లీ ఏడో ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో ఆరుగురు సహచరులు మనీశ్ సిసోడియా, రాఖీ బిర్లా, సౌరభ్ భరద్వాజ్, సోమ్‌నాథ్ భారతి, గిరిషీ సోని, సత్యేంద్ర కుమార్ జైన్ కూడా మంత్రులుగా కేజ్రీవాల్‌తో పాటు ప్రమాణ స్వీకారం చేస్తారు. అవినీతిపై పోరాటం నుంచి అసెంబ్లీ ఎన్నికల ప్రచారం దాకా అన్ని విషయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఆయన, ప్రమాణస్వీకారం విషయంలోనూ రొటీన్‌కు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమానికి వీఐపీలకు ఆహ్వానం పంపడం, వీఐపీ పాసులు జారీ చేయడం వంటి ఆనవాయితీని పక్కన పెట్టారు. అందుకు బదులుగా, ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఢిల్లీ వాసులను ఆహ్వానించారు. మైదాన్‌లో తన, పార్టీ ఎమ్మెల్యేల కుటుంబసభ్యులు కూడా సామాన్యులతో పాటే కూర్చుంటారని ప్రకటించారు. రామ్‌లీలా మైదాన్‌లో ఒక సీఎం ప్రమాణ స్వీకారం జరగనుండటం ఇదే తొలిసారి. పైగా ఈ కార్యక్రమానికి కేజ్రీవాల్ బృందం మెట్రో రైల్లో వెళ్లనుంది. కౌశాంబీ నుంచి మైదాన్ దాకా మెట్రోలో వెళ్తామని కేజ్రీవాల్ తెలిపారు. అవినీతి వ్యతిరేకోద్యమంలో తనకు గురువైన అన్నాహజారేకు ఆయన ఫోన్ చేసి ప్రమాణానికి ఆహ్వానించారు. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న అన్నా వచ్చేదీ రానిదీ తెలియడం లేదు. 45 ఏళ్ల కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంలలో అతి పిన్న వయస్కుడు కానున్నారు. ఆయన మంత్రివర్గం కూడా అతి పిన్న వయస్కుల బృందంగా రికార్డు సృష్టించనుంది. 41 ఏళ్ల మనీశ్ సిసోడియానే వారందరిలోనూ పెద్దవాడు కాగా, అతి పిన్న వయస్కురాలైన రాఖీ బిర్లాకు 26 ఏళ్లు. మంత్రివర్గంలో ఏకైక మహిళ కూడా ఆమే. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆప్ 28 సీట్లతో ప్రభంజనం సృష్టించగా, మూడు పర్యాయాలు వరుసగా అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలతో ఘోర పరాజయం మూటగట్టుకోవడం తెలిసిందే. కాంగ్రెస్ బయటి నుంచి ఇస్తున్న మద్దతుతోనే ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ప్రమాణ కార్యక్రమానికి లక్ష మందికి పైగా తరలి వస్తారని ఢిల్లీ పోలీసుల అంచనా. దాంతో రామ్‌లీలా మైదాన్‌లో మూడంచెల రక్షణతో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. కిరణ్ బేడీ, సంతోష్ హెగ్డేలను కూడా ఆప్ తరఫున ఆహ్వానించాల్సిందిగా లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను కేజ్రీవాల్ కోరారు. సుష్మాస్వరాజ్‌తో పాటు మాజీ సీఎంలందరికీ ఆహ్వానం అందినా తాజా మాజీ సీఎం షీలాదీక్షిత్ మాత్రం రాకపోవచ్చంటున్నారు. ఫైళ్లకు నిప్పు అవినీతికి నిదర్శనం.. కేజ్రీవాల్: అధికార మార్పిడి నేపథ్యంలో ఢిల్లీ సచివాలయంలో పలు కీలక ఫైళ్లను చించేస్తున్న, తగలబెడుతున్న వైనాన్ని ఆజ్‌తక్ వార్తా చానల్ స్టింగ్ ఆపరేషన్ వెలుగులోకి తెచ్చింది. దీనిపై కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. పలు శాఖల్లో పెచ్చరిల్లిన అవినీతికిది తాజా నిదర్శనమన్నారు. ముఖ్యమైన ఫైళ్ల రక్షణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు. ఫైళ్లు కాలిన ఉదంతంపై దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని కేంద్ర సమాచార కమిషనర్ డాక్టర్ మాడభూషి శ్రీధర్ ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించారు. మరోవైపు ఆప్‌కు సంఘీభావం తెలిపేందుకు జమీల్ అహ్మద్ అనే యువకుడు చేయి కోసుకున్నాడు. శుక్రవారం కేజ్రీవాల్ తన నివాసం వద్ద నిర్వహించిన జనతా దర్బార్‌కు వచ్చిన అతను, అకస్మాత్తుగా మణికట్టును బ్లేడుతో కోసుకున్నాడు. కేజ్రీవాల్ సూచనపై ఆప్ కార్యకర్తలు అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కరెంటు నుంచి నీటి దాకా పలు సమస్యలపై వేలాదిగా ప్రజలు దర్బార్‌కు వచ్చి కేజ్రీవాల్‌కు ఫిర్యాదులు చేస్తున్నారు. -
28న కేజ్రీవాల్ ప్రమాణం
ఢిల్లీ 7వ ముఖ్యమంత్రిగా ‘ఆమ్ ఆద్మీ’ నేత సాక్షి, న్యూఢిల్లీ: అన్నాహజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక పోరుకు వేదికగా నిలిచిన రామ్‌లీలా మైదానంలో ఢిల్లీ(నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ) ఏడవ ముఖ్యమంత్రిగా డిసెంబర్ 28న ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభా పక్ష నేత అరవింద్ కేజ్రీవాల్(45) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేబినెట్ మంత్రులుగా మనీశ్ సిసోడియా, రాఖీ బిర్లా, సోమ్‌నాథ్ భార్తి, సౌరభ్ భరద్వాజ్, గిరీశ్ సోని, సత్యేంద్ర జైన్లు కూడా ప్రమాణస్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి వారం లోపల(జనవరి 3 లోగా) కేజ్రీవాల్ అసెంబ్లీలో బలం నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వ ఏర్పాటుపై ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ పంపిన ప్రతిపాదనకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. జనవరి 1న నూతన అసెంబ్లీ సమావేశం జరిగే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రమాణస్వీకార కార్యక్రమానికి అన్నాహజారే, కిరణ్ బేడీ, సంతోష్‌హెగ్డే సహా అవినీతి వ్యతిరేక పోరాటంలో సహచరులుగా నిలిచిన వారందరినీ ఆహ్వానిస్తున్నట్లు కేజ్రీవాల్ బుధవారం తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలేదని, ఆ పార్టీతో ఎలాంటి ఒప్పందాలు కూడా ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల్లో, ఆ తరువాత తాము పేర్కొన్న 18 అంశాల అమలుకు కృషిచేస్తామని, అందుకు అన్ని పార్టీలు మద్దతిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. తామిచ్చిన హామీలను అమలు చేయడంలో వచ్చే అన్ని అడ్డంకులను అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జన్ లోక్‌పాల్ బిల్లును 15 రోజుల్లోగా తీసుకువస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అయితే, ఆ బిల్లుకు తక్ష ణం చట్టబద్దత కల్పించడంలో సమస్యలున్నాయన్నారు. నిబంధనల ప్రకారం జన్‌లోక్ చట్టం చేయడానికి కేంద్రం అనుమతి తీసుకోవలసి ఉంటుందన్నారు. రాష్ట్రప్రభుత్వం ఏదైనా చట్టం చేసేముందు కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలన్న నిబంధనను ఆయన తప్పుపట్టారు. అది బ్రిటిష్ కాలంనాటిదని విమర్శించారు. మంత్రిపదవుల విషయంలో పార్టీలో ఎలాంటి అసంతృప్తి లేదని, లక్ష్మినగర్ ఎమ్మెల్యే బిన్నీకి మంత్రిపదవిపై ఆసక్తి లేదని, ఆ విషయం ఆయనే తనకు స్వయంగా చెప్పారని కేజ్రీవాల్ వివరించారు. కాగా, ప్రభుత్వ ఏర్పాటు తరువాత రాజకీయ కక్ష సాధింపు చర్యలు దిగవద్దని ఆప్‌కు కాంగ్రెస్ సూచించింది. అలా చేస్తే మేం కూడా ప్రతిచర్యకు దిగాల్సి వస్తుందని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ శాఖ నూతన అధ్యక్షుడు అర్విందర్ సింగ్ హెచ్చరించారు. -
శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారం
-
శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారం
-
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అప్పారావు ప్రమాణం
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ వేగి సూరి అప్పారావు గురువారం ప్రమాణం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా ఆయనతో ప్రమాణం చేయించారు. హైకోర్టులో జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ పొన్నం అశోక్‌గౌడ్, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గిరిధర్‌రావు, ప్రభుత్వ న్యాయవాదులు, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు. అనంతరం జస్టిస్ సూరి అప్పారావు కోర్టులో కేసులను విచారించారు. హైకోర్టులో అనుమతించిన మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 49 కాగా, జస్టిస్ సూరి అప్పారావు రాకతో ప్రస్తుత న్యాయమూర్తుల సంఖ్య 36కు చేరింది. జస్టిస్ అప్పారావు... 2010 నవంబర్ 15న రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2011 ఏప్రిల్ 21న కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. దాదాపు 18 నెలల తర్వాత ఆయన తిరిగి రాష్ట్ర హైకోర్టుకు బదిలీపై వచ్చారు.