గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ(61) ప్రమాణ స్వీకారం రాష్ట్ర రాజధాని గాంధీనగర్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, డిప్యూటి ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీలు కూడా విచ్చేశారు.