గుజరాత్కు తొలి మహిళా సీఎంగా ప్రమాణం | anandi-patel-takes-oath-as-first-woman-chief-minister-of-gujarat | Sakshi

May 22 2014 2:29 PM | Updated on Mar 22 2024 11:19 AM

గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా ఆనందిబెన్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. నరేంద్ర మోడీ సమక్షంలో ఆమె గుజరాత్ రాష్ట్ర తొలి మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. గుజరాత్ గవర్నర్ కమలా బేనీవాలా ఈరోజు మధ్యాహ్నం రాజ్భవన్లో ఆనందీ బెన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ అగ్రనేతలు అద్వానీ, రాజ్‌నాథ్, గడ్కరీతో పాటు పలువురు హాజరయ్యారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడంతోపాటు ఆమె అనేక సహసోపేతమైన పనులు చేశారు. దాంతో ఆమెకు గుజరాత్ ఉక్కు మహిళగా పేరొచ్చింది. మోడీ ప్రధాన మంత్రి అయితే కేబినెట్లో సీనియర్ మంత్రి అయిన ఆనంది బెన్‌ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement