Anandiben Patel
-
ప్రభుత్వ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం
లక్నో: బలవంతపు మత మార్పిడులను నిరోధించేందుకు యోగి ఆదిత్యనాథ్ సర్కారు తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు శనివారం ఆమె తన నిర్ణయాన్ని వెల్లడించినట్లు ప్రభుత్వాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. కాగా దేశ వ్యాప్తంగా లవ్ జిహాద్ గురించి చర్చ నడుస్తున్న తరుణంలో పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు(యూపీ, మధ్యప్రదేశ్, కర్ణాటక) దీనికి వ్యతిరేకంగా చట్టం రూపొందిస్తామని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్ చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ ఆర్డినెన్స్- 2020ను తీసుకువచ్చింది. దీని ప్రకారం.. బలవంతంగా, కేవలం వివాహం కోసమే మతాన్ని మార్పించడం వంటి అంశాలను నేరంగా పరిగణిస్తారు. (చదవండి: ముస్లిం కుర్రాళ్లను హెచ్చరించిన ఎస్పీ ఎంపీ) అంతేగాకుండా ఈ తరహా కేసుల్లో బెయిలు కూడా మంజూరు చేయకుండా కఠిన చర్యలు తీసుకునే వెసలుబాటు ఉంటుంది. అదే విధంగా నేరం రుజువైతే కనిష్టంగా ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 15 వేల నుంచి రూ. 25 వేల మేర జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇష్టప్రకారమే మతం మార్చుకోవాలని ఎవరైనా భావిస్తే రెండు నెలల ముందుగానే సంబంధిత అధికారిని సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కాగా యోగి సర్కారు నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. ఇక మేజర్లైన ఇద్దరు వ్యక్తులు తమకు నచ్చినవారితో జీవితాన్ని పంచుకునే హక్కు ఉంటుందని.. ఇందులో మూడో వ్యక్తి జోక్యం తగదంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చిన కొన్ని గంటల్లోనే ఈ ఆర్డినెన్స్ వెలువడటం గమనార్హం. -
కొత్త మంత్రుల ప్రమాణం.. సింధియా మార్క్!
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో గురువారం కొత్తగా 28 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. మధ్యప్రదేశ్ అడిషనల్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ గురువారం ఉదయం వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన మంత్రివర్గంలో అత్యధికులు జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందినవారు కావడం విశేషం. కాంగ్రెస్‌తో విభేదాల అనంతరం బీజేపీలో చేరి రాజ్యసభకు ఎన్నికైన సింధియా తనతో పాటు వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గ విస్తరణలో తన వర్గీయులకు పదవులు దక్కించుకోవడంలో తన బలాన్ని నిరూపించుకున్నారు. మంత్రులుగా ప్రమాణం చేసినవారిలో సింధియా వర్గంతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు గోపాల్ భార్గవ, ఇమార్తి దేవి, ప్రభురామ్ చౌదరి, ప్రధుమాన్ సింగ్ తోమర్‌తో పాటు సిందియా అత్త, బీజేపీ ఎమ్మెల్యే యశోధర రాజే సింధియాలు ఉన్నారు. (ముగ్గురు ముఖ్య నేతలకు కీలక బాధ్యతలు) కమల్‌నాథ్‌తో ఏర్పడిన విభేధాలతో కాంగ్రెస్ పార్టీకి మార్చి 10న రాజీనామా చేసిన సింధియా బీజేపీలో చేరారు. సింధియాతో పాటు 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతో కమల్‌నాథ్ ప్రభుత్వంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత, మార్చి నెలలో సీఎంగా శివరాజ్ సింగ్ చౌహాన్ బాధ్యతలు చేపట్టారు. నెల రోజుల తర్వాత మంత్రిమండలిలోకి ఐదుగురిని తీసుకున్నారు. అయితే రాజ్యసభ ఎన్నికలతోపాటు, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింథియాతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఎవరెవరికి మంత్రిమండలిలో చోటుకల్పించాలనే అంశంపై స్పష్టత లేకపోవడంతో క్యాబినెట్ విస్తరణ ఇన్నిరోజులుగా వాయిదాపడుతూ వస్తున్నది. దీనికి తోడు లాక్డౌన్ ఉండడంతో మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు. తాజాగా గురువారం 28 మంది మంత్రులు ప్రమాణం చేయడంతో శివరాజ్ సింగ్ ప్రభుత్వంలో పూర్తి కేబినెట్ కొలువు దీరినట్లయింది. (కాషాయ ‘కుటుంబం’లోకి సింధియా) -
పెద్ద మనసు చాటుకున్న యూపీ గవర్నర్
లక్నో : ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ పెద్ద మనసు చాటుకున్నారు. క్షయ వ్యాధితో బాధపడుతున్న ఓ బాలికను దత్తత తీసుకున్నారు. ఆమెకు మెరుగైన వైద్యంతోపాటు చదువు చెప్పిస్తానని వెల్లడించారు. గవర్నర్ అడుగుజాడల్లో నడిచిన రాజ్‌భవన్ సిబ్బంది మరో 21 మంది పిల్లల్ని దత్తత తీసుకున్నారు. పిల్లలకు వైద్యం, విద్య, పౌష్టికాహారం అందిస్తారు. 2025 నాటికి దేశం నుంచి క్షయను పూర్తిగా తరిమేద్దామనే ప్రధాని మోదీ పిలుపు మేరకు చర్యలు చేపట్టామని గవర్నర్ చెప్పారు. అందుకోసం రాజ్‌భవన్ నుంచే తమ కార్యక్రమాన్ని మొదలు పెట్టామని తెలిపారు. క్షయతో బాధపడుతున్న చిన్నారుల్ని దత్తత తీసుకోవడం మనందరి బాధ్యత అన్నారు. ఆరోగ్య భారతాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ ముందుకురావాలని పిలుపునిచ్చారు. తమకు తోచిన విధంగా సాయపడి క్షయ రోగులకు చేయూతనివ్వాలన్నారు. ఇక ప్రభుత్వ పథకాలకు అర్హులైనా కూడా చాలామంది వాటిని పొందలేకపోతున్నారని ఆనందిబెన్ చెప్పారు. కేవలం ప్రభుత్వం వల్లనే ఇది సాధ్యం కాదని.. చదువుకున్న వారు పేదలకు ప్రభుత్వ పథకాలు పొందేవిధంగా తోడు నిలవాలని కోరారు. ఇదిలాఉండగా.. లక్నో నగరంలోనే 14,600 మంది క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్నారని జిల్లా వైద్యాధికారి పీకే గుప్తా తెలిపారు. పౌష్టిక ఆహారం కోసం వారికి నెలకు రూ.500 ఇస్తున్నామని తెలిపారు. -
గవర్నర్ల మార్పుపై ఊహాగానాలు..
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు తర్వాత ప్రస్తుతం వివిధ రాష్ట్రాల గవర్నర్ల మార్పుపై ఊహాగానాలు సాగుతున్నాయి. పరిపాలన, రాజకీయ పరమైన కారణాల దృష్ట్యా పలు రాష్ట్రాల్లో కొత్త గవర్నర్లు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. చాలామంది గవర్నర్లు మోదీ మొదటిసారిగా ప్రధాని అయిన 2014లో నియమితులైనవారు కావడంతో తాజా పరిస్థితిని కేంద్ర హోం శాఖ సమీక్షిస్తున్నట్టు తెలుస్తోంది. కొందరు గవర్నర్లు చాలాకాలంగా కొనసాగుతున్నారు. కొందరు ఇతర రాష్ట్రాలకు ఇన్చార్జిలుగా ఉన్నారు. మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ఛత్తీస్‌గఢ్ ఇన్చార్జిగా ఉన్నారు. ఈఎస్ఎల్ నరసింహన్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా అలాగే తెలంగాణ గవర్నర్‌గా పదేళ్లుగా కొనసాగుతున్నారు. కాగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న అనిల్ బైజాల్ ప్రధానమంత్రి కార్యాలయానికి బదిలీ కావచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే గవర్నర్లను ఎప్పుడు మార్చేదీ, ఎందరిని మార్చేదీ తెలియరాలేదు. సోమవారం నాటి పరిణామాల తర్వాత ప్రభుత్వం ఈ వ్యవహారం గోప్యంగా ఉండాలని భావిస్తోంది. మరోవైపు అయిదు రాష్ట్రాల గవర్నర్లు...కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేసరీ నాథ్ త్రిపాఠీ, తమిళనాడు గవర్నర్ భన్వర్‌లాల్ పురోహిత్, జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము, అరుణాచల్ గవర్నర్ బీడీ మిశ్రా తదితరులు కేంద్ర హోంమంత్రితో భేటీ అయ్యారు. -
‘మోదీకి పెళ్లయ్యింది.. ఆయనే నా రాముడు’
అహ్మాదాబాద్, గుజరాత్ : కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ‘ప్రధాని మోదీ అవివాహితుడు’ అనే వార్త హల్చల్ చేస్తోంది. ఈ వార్త ఇంత క్రేజ్ రావడానకి కారణం ఈ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి. ఇంతకు ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరంటే కొంత కాలం క్రితం వరకూ గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసి..ప్రస్తుతం మధ్య ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేస్తున్న ఆనందిబెన్ పటేల్. ఒక మీడియా సమావేశంలో ఆనందిబెన్ పటేల్ ‘నరేంద్ర భయ్యా(ప్రధాని నరేంద్ర మోదీ)కు పెళ్లి కాలేదు’ అని ప్రకటించారు. దాంతో ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఎందుకంటే మోదీ ప్రధాని పీఠం అధిరోహించడానికి కొన్ని రోజుల ముందే ఆయన భార్య యశోదాబెన్ పటేల్ గురించి అన్ని టీవీ చానెల్స్‌లో ప్రచారం జరిగింది. మోదీ ప్రధాని కావాలని తాను తీర్థయాత్రలు చేస్తున్నట్లు స్వయంగా యశోదాబెన్నే ప్రకటించింది. ఆ సమయంలో కొన్ని టీవీ చానెల్స్ యశోదాబెన్‌ను ఇంటర్వ్యూ కూడా చేశాయి. ఆ సమయంలో యశోదాబెన్ తనకు, మోదీకి వివాహం అయ్యిందని కానీ వృత్తిపరమైన బాధ్యతల వల్లే తాము వేర్వేరుగా ఉంటున్నామని కూడా తెలిపారు. ఈ నేపధ్యంలో ఆనందిబెన్ పటెల్ ‘మోదీ అవివాహితుడు’ అని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దాంతో మరోసారి మోదీ భార్య యశోదాబెన్ మరోసారి స్వయంగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. ఈ వియషం గురించి యశోదాబెన్ ఎన్డీటీవీతో ‘ఆనందిబెన్ వ్యాఖ్యలు విని నేను నిజంగా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే 2004 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇచ్చిన డిక్లరేషన్ ఫామ్‌లో స్వయంగా మోదీయే తనను తాను వివాహితుడునని పేర్కొనడమే కాక..నా పేరును కూడా ఆ పత్రంలో తెలిపార’న్నారు. అంతేకాక మొదట సోషల్ మీడియాలో వచ్చిన ఈ వార్తను తాను నమ్మలేదని తెలిపారు. కానీ తరువాత ఇదే విషయం ఒక ప్రముఖ దిన పత్రికలో కూడా వచ్చిందని, అందుకే తాను ఈ విషయం గురించి వివరణ ఇస్తున్నట్లు తెలిపారు. ఉన్నత చదువులు చదివిన ఆనందిబెన్ లాంటి ఒక మహిళ తనలాంటి సాధరణ పాఠశాల ఉపాధ్యాయురాలి గురించి ఇలా మాట్లడటం సరికాదన్నారు. ఆమె బాధ్యాతరహిత ప్రవర్తన వల్ల మోదీకి చెడ్డ పేరు వస్తుందన్నారు. అంతే మోదీ అంటే తనకు చాలా గౌరవం అని ఆయన తన పాలిట రాముడన్నారు యశోదాబెన్. -
ఓట్లు కావాలంటే ఇది సరిపోదు
-
మధ్యప్రదేశ్ గవర్నర్ వీడియో వైరల్
సాత్నా : మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనంది పటేల్ నగర మేయర్‌తో జరిపిన సంభాషణ తాలూకు వీడియో వైరల్ అవుతోంది. విషయమేమిటంటే.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రెండు రోజుల పర్యటన నిమిత్తం మధ్యప్రదేశ్‌కు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు గవర్నర్ చిత్రకూట్‌కు వెళ్లారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మేయర్, ఇతర బీజేపీ నేతలతో ఆమె మాట్లాడారు. పోషకాహార లోపంతో బాధపడే చిన్నారులను, నిస్సహాయులను దత్తత తీసుకున్నపుడే మీకు ఓట్లు పడతాయంటూ వారికి సూచించారు. ఇందుకోసం క్యాంపెయిన్ నడపండి. ఇతరుల నుంచి సలహాలు, సూచనలు తీసుకోండి అంటూ మేయర్ మమతా పాండేకి చెప్పారు. అందుకు సమాధానంగా ఆమె అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లల్ని దత్తత తీసుకున్నామని తెలిపారు. అయితే ‘ఓట్లు కావాలంటే ఇది సరిపోదు. గ్రామాల్లోకి వెళ్లాలి. ప్రజల ఇళ్లలోకి వెళ్లి వారి చేతులు పట్టుకుని మాట్లాడాలి. అప్పుడే నరేంద్ర భాయ్(ప్రధాని మోదీ) 2022 కల నెరవేరుతుందంటూ’ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ వ్యాఖ్యానించారు. అంతేకాదు అక్కడున్న అధికారులతో మాట్లాడుతూ ‘మీకు ఓట్లు అవసరం లేదు. కానీ మాకు అవసరం’ అంటూ పేర్కొన్నారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవడంతో ప్రతిపక్ష కాంగ్రెస్ గవర్నర్‌పై విమర్శనాస్త్రాలు సంధించింది. రాజ్యాంగ పరంగా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఈవిధంగా మాట్లాడడం అధికార దుర్వినియోగానికి పాల్పడటమేనని విమర్శించింది. వచ్చే ఏడాది మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గవర్నర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
ఆనంది బెన్‌కు గవర్నర్ పదవి..
న్యూఢిల్లీ: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనంది బెన్ పటేల్ మధ్యప్రదేశ్ తదుపరి గవర్నర్‌గా నియమితులయ్యారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌కు ఆమెను గవర్నర్‌గా రాష్ట్రపతి నియమించినట్టు రాష్ట్రపతి భవన్ ట్విట్టర్లో తెలిపింది. ఆనంది బెన్ పదవీ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపింది. 2014లో నరేంద్రమోదీ గుజరాత్ అసెంబ్లీకి రాజీనామా చేసి.. ప్రధానమంత్రి పదవి చేపట్టడంతో ఆయన స్థానంలో ముఖ్యమంత్రిగా ఆనంది బెన్ తెరపైకి వచ్చారు. పటీదార్ రిజర్వేషన్ల ఆందోళన, ప్రభుత్వ వ్యతిరేకత తదితర కారణాల వల్ల ఆమె రెండేళ్లకు మించి సీఎం పదవిలో ఉండలేకపోయారు. ఆనంది బెన్ దిగిపోవడంతో గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్ రుపానీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించి.. రెండో పర్యాయం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మధ్యప్రదేశ్ గవర్నర్ గా ఓం ప్రకాశ్ కోహ్లి వ్యవహరిస్తున్నారు. 2016 నుంచి గుజరాత్ బాధ్యతలు అదనంగా చూస్తున్నారు. మధ్యప్రదేశ్ గవర్నర్‌గా ఆనంది బెన్ బాధ్యతలు చేపడితే.. గుజరాత్ పూర్తిస్థాయి గవర్నర్‌గా కోహ్లి కొనసాగుతారని తెలుస్తోంది. -
మధ్యప్రదేశ్ గవర్నర్‌గా ఆనందిబెన్ పటేల్
-
'వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేను'
గుజరాత్: రానున్ను సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేయలేనని గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ ప్రకటించారు. ఈ మేరకు వయసు రీత్యా, రానున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగలేనని బీజీపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు లేఖ రాశారు. 75ఏళ్ల వయసులో తాను పోటీ చేయలేనని, తన పరిస్థితిని లేఖలో పార్టీ అధినేతకు వివరించారు. పార్టీలో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అంతేకాకుండా భవిష్యత్తు తరాలకు మార్గనిర్దేశకురాలిగా ఉంటానని ఆనందీ తెలిపారు. దాదాపు 20ఏళ్లపాటు ఆమె ఎమ్మెల్యేగా కొనసాగారు. మితవాదిగా ఆమెకు పార్టీలో మంచిపేరుంది. అయితే తాజాగా వివాదాస్పద బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి, గత వారం పార్టీలో సీనియర్ నేతలు బాధ్యతల నుంచి తప్పుకొని వచ్చే ఎన్నికల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ఆనందీబెన్‌కు సూచిస్తూ సోషల్ మీడియా ట్విట్టర్లో పోస్టు చేశారు. ఆ మేరకు ఆమె ఈ నిర్ణయం తీసుకుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ 2014లో ప్రధాని అవడంతో ఆయన స్థానంలో పటేల్ ఆనందీబెన్‌ను ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత పటేల్ రిజర్వేషన్ల సాధనకు జరిగిన అల్లర్లను అదుపు చేయలేకపోవడంతో పాటు, పలు రాజకీయం కారణాలతో గత ఏడాది ఆగస్టులో పదవి నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి విజయ్ రూపానీ గుజరాత్ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. Anandiben Patel writes to BJP Pres Amit Shah, stating that in place of her new people must be given a chance to contest 2017 Gujarat polls. pic.twitter.com/TB7doOG12A — ANI (@ANI) October 9, 2017 -
మాజీ సీఎంను పిలిపించిన మోదీ?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని సూరత్ లో బీజీపీ ర్యాలీ విఫలం కావడంపై ఆయన వాకబు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ ను ఢిల్లీకి పిలిచినట్లు సమాచారం. శనివారం ఆనందీ బెన్ పటేల్ హుటాహుటిన ఢిల్లీ వెళ్లడానికి ఇదే కారణమని తెలిసింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు ఆనందీ కూడా గురువారం జరిగిన ర్యాలీలో పాల్గొన్న విషయం తెలిసిందే. పాటీదార్లలో తమకు ఉన్న బలనిరూపణ కోసం చేపట్టిన ర్యాలీని పాటీదార్లే అడ్డగించడంతో బీజేపీ కంగు తింది. దీంతో నష్టనివారణ చర్యల కోసమే ఆనందీ బెన్ ను ఢిల్లీకి పిలిపించారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. మోదీ గుజరాత్ ను పాలించిన 12 ఏళ్ల కాలంలో ఆనందీ బెన్ పటేల్, అమిత్ షా ఆయనకు సన్నిహితులు. 2014 ఎన్నికల తర్వాత గుజరాత్ బాధ్యతలను ఆనందీ బెన్ కు, అమిత్ షాకు పార్టీ అధ్యక్ష పదవిని అప్పగించడానికి కూడా ఇదే ప్రధాన కారణం. -
నితిన్కాదు.. విజయ్ ముఖ్యమంత్రి
-
నితిన్‌కు నిరాశ
గాంధీనగర్: ముఖ్యమంత్రి పీఠం దక్కుతుందని ఆశించిన నితిన్ భాయ్ పటేల్‌కు కొంత నిరాశ కలిగింది. ఆయన డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి ప్రస్తుతం గుజరాత్ నాయకుల్లో.. మంత్రుల్లో నితిన్ భాయ్ పటేల్ మాత్రమే సీనియర్. మొత్తం నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన మొన్న ఆనందీ బెన్ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ నిర్వహించారు. కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. ఈయనకు ఉన్న బలహీనత ఒక్కటే అది కూడా ఈయనకు పటేల్ సామాజిక వర్గం కొంత దూరంగా ఉంటుంది. ఉద్యోగాల విషయంలో రిజర్వేషన్లను ఇప్పించాలనే డిమాండ్ తోనే పటేళ్ల ఉద్యమం వచ్చిన విషయం తెలిసిందే. సీఎం పీఠం మార్పునకు కూడా ఈ ఉద్యమం, దళితుల ఉద్యమం ఓ కారణమైంది. ఇలాంటి సమయంలో తిరిగి పటేళ్లకు పడని వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి అప్పగిస్తే వివాదంగా మారుతుందేమోనని భావించిన బీజేపీ అధిష్టానం వ్యూహాత్మకంగా ఈ పదవిని విజయ్ రూపానికి అప్పగించినట్లు తెలుస్తోంది. కొత్త సీఎం అభ్యర్థిని ప్రకటించడానికి ముందు నితిన్ భాయ్ నే సీఎం అభ్యర్థి అని ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో ఆయన కూడా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పటేళ్ల ఆందోళన సమస్యను అదిగమిస్తామన్నారు. 'పటేళ్ల వర్గం నాయకులతో మాట్లాడతాం. హర్థిక్ పటేల్, లాల్జీ, ఇతర నేతలందరితో సమస్యపై చర్చిస్తాం. దళితుల ఆందోళనను గుజరాత్ ప్రభుత్వం నియంత్రించలేక పోయిందనడం సరికాదు. ఆనందీ బెన్ పటేల్ ఆమె పనిచేసిన 26 నెలలు ఎంతో కష్టపడి పనిచేశారు' అని చెప్పారు. కానీ అనూహ్యంగా సీఎం అభ్యర్థి మారిపోయారు. నితిన్ భాయ్ డిప్యూటీ సీఎం అయ్యారు. -
నితిన్కాదు.. విజయ్ ముఖ్యమంత్రి
గాంధీనగర్: అనూహ్యంగా ఖాళీ అయిన గుజరాత్ సీఎం పీఠాన్ని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయ్ రూపాని అధిష్టించనున్నారు. అంతకుముందు ఈ పదవి దక్కించుకుంటారని ఊహాగానాలు వచ్చిన రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత, ఆనందీ బెన్ పటేల్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నితిన్ పటేల్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ఎమ్మెల్యేలతో భేటీ అయిన అమిత్ షా ఈ నిర్ణయాన్ని వెలువరించారు. విజయ్ రూపాని ఆనందీబెన్ పటేల్ ప్రభుత్వంలో రవాణా మంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా రూపానీకి మోదీ, అమిత్ షాతోపాటు ఆరెస్సెస్ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అన్ని వర్గాలను కలుపుకుపోతారని ఈయనకు పేరుంది. పరిపాలన పరంగా కూడా మంచి పట్టున్న వ్యక్తిగా పేరుంది. ప్రస్తుతం అమిత్ షా అహ్మదాబాద్ లోనే ఉండి పార్టీ ఎమ్మెల్యేలందరితో కాబోయే సీఎంపై వారితో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, నితిన్ భాయ్ పటేల్ ఉత్తర గుజరాత్లో బలమైన నాయకుడని ఆయననే సీఎం పీఠం వరిస్తుందని తొలుత ఊహగానాలు వెలువడ్డాయి. -
గుజరాత్ సీఎం మరో సంచలన నిర్ణయం
సూరత్: గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన రెండు రోజుల తర్వాత ఆనందీబెన్ పటేల్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన మరణాంతరం తన శరీరాన్ని దానం చేయాలని ఆమె కోరారు. సూరత్ యూనివర్శిటీ క్యాంపస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆనందీబెన్ ఈ విషయాన్ని ప్రకటించారు. అవయవాలు దానం చేసిన వారి కుటుంబ సభ్యులను, ఇందుకు సేవలందిస్తున్న వైద్యులను ఆనందీబెన్ సన్మానించారు. ఓ ఎన్జీవో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. 70 ఏళ్లు రాగానే మనం ఇంట్లో కూర్చుని విశ్రాంతి తీసుకోవాలని భావిస్తామని, కానీ అంతేకంటే ఎక్కువ వయసులో కూడా డాక్టర్లు అవయమార్పిడి ఆపరేషన్లు విజయవంతం చేయడానికి కృషిచేస్తున్నారని ప్రశంసించారు. పలుకార్యక్రమాల్లో పాల్గొన్న ఆనందీబెన్ రాజకీయ విషయాలను మాత్రం ప్రస్తావించలేదు. గత బుధవారం వయోభారం కారణంగా గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆమె ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆనందీబెన్ రాజీనామాను గుజరాత్ గవర్నర్ ఆమోదించారు. కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టేవరకు పదవిలో కొనసాగాల్సిందిగా గవర్నర్ ఆమెను కోరారు. -
గుజరాత్ సీఎం ఈయనేనంట!
గాంధీనగర్: అనూహ్యంగా ఖాళీ అయిన గుజరాత్ సీఎం పీఠాన్ని రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత, ఆనందీ బెన్ పటేల్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నితిన్ పటేల్ అధిరోహించనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర అధికార వర్గంతో రాష్ట్ర ఎమ్మెల్యేలు భేటీ కానున్న కొన్ని గంటలముందు కీలక వర్గాలు ఈ సమాచారం వెల్లడించాయి. నితిన్ పటేల్ ఉత్తర గుజరాత్లో బలమైన నాయకుడు. ఆయన తొలిసారి గుజరాత్ అసెంబ్లీకి 1999 ఎన్నికయ్యారు. మొత్తం నాలుగుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. మొన్న ఆనందీ బెన్ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ నిర్వహించారు. కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఉన్న మంత్రి వర్గ సభ్యులందరికన్నా ఈయనే సీనియర్ కూడా. అయితే, ఈయనకు పటేల్ సామాజిక వర్గం కొంత దూరంగా ఉంటుంది. ఉద్యోగాల విషయంలో రిజర్వేషన్లను ఇప్పించాలనే డిమాండ్ తోనే పటేళ్ల ఉద్యమం వచ్చిన విషయం తెలిసిందే. సీఎం పీఠం మార్పునకు కూడా ఈ ఉద్యమం, దళితుల ఉద్యమం ఓ కారణమైంది. కొత్త సీఎం అభ్యర్థిని ప్రకటించడానికి ముందు నితిన్ పటేల్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పటేళ్ల ఆందోళన సమస్యను అదిగమిస్తామన్నారు. 'పటేళ్ల వర్గం నాయకులతో మాట్లాడతాం. హర్థిక్ పటేల్, లాల్జీ, ఇతర నేతలందరితో సమస్యపై చర్చిస్తాం. దళితుల ఆందోళనను గుజరాత్ ప్రభుత్వం నియంత్రించలేక పోయిందనడం సరికాదు. ఆనందీ బెన్ పటేల్ ఆమె పనిచేసిన 26 నెలలు ఎంతో కష్టపడి పనిచేశారు' అని చెప్పారు. -
సీఎం పదవికి ఆనందీ రాజీనామా
న్యూఢిల్లీ: గుజరాత్ సీఎం పదవి నుంచి వైదొలగుతానన్న ఆనందీబెన్ పటేల్ అభ్యర్థనకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆమోదం తెలిపింది. బుధవారం సాయంత్రం ఈ నిర్ణయం వెలువడిన వెంటనే ఆమె .. గవర్నర్కోహ్లికి రాజీనామా పత్రాలను సమర్పించారు. మరొకరు సీఎం బాధ్యతలు స్వీకరించేదాకా సీఎం పదవిలో కొనసాగాలని గవర్నర్.. ఆమెను కోరారు. అంతకుముందు అమిత్ షా అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. ప్రధాని మోదీ కూడా హాజరైన ఈ సమావేశం.. ఆనందీ రాజీనామా ప్రతిపాదనకు ఆమోదం తెలపడంతో పాటు తదుపరి సీఎం ఎంపిక బాధ్యతను పార్టీ అధ్యక్షుడుషాకు అప్పగించింది. కొత్త నాయకుడి ఎంపిక కోసం ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపేందుకు గడ్కారీ, సరోజ్ పాండేలను కేంద్ర పరిశీలకులుగా నియమించింది. కొత్త సీఎం ఎంపికపై పార్టీ నాయకులతో చర్చించేందుకు షా గురువారం గుజరాత్ వెళ్లనున్నారు. కాగా సీఎం రేసులో అమిత్ షా లేరని బీజేపీ నేత వెంకయ్య చెప్పారు. -
ఆనందీబెన్ వారసుడెవరు?
-
ఆనందీబెన్ వారసుడెవరు?
తెరపైకి నితిన్ పటేల్, రూపానీ, కేంద్రమంత్రి పురుషోత్తం అహ్మదాబాద్: గుజరాత్ సీఎంగా ఆనందీబెన్ పటేల్ రాజీనామా ప్రకటనతో ఆమె స్థానాన్ని ఎవరితో భర్తీచేస్తారనే విషయంపై స్పష్టత రాలేదు. బుధవారం ఢిల్లీలో జరిగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆనందీబెన్ పటేల్ రాజీనామాను ఆమోదించటంతోపాటు కొత్త సీఎంనూ ప్రకటించే అవకాశాలున్నట్లు తెలిసింది. సీఎం రేసులో పలువురు ముఖ్యనేతల పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. గుజరాత్ ఆరోగ్య మంత్రి నితిన్ పటేల్, రాష్ట్ర బీజేపీ చీఫ్ విజయ్ రూపానీ, సౌరభ్ పటేల్, కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా, అసెంబ్లీ స్పీకర్ గణపత్ వసావా (గిరిజన నాయకుడు) జాబితాలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నితిన్‌భాయ్ పటేల్‌కు పార్టీలో మంచి పట్టుంది. దీనికి తోడు మోదీ పీఎం అయ్యాక.. గుజరాత్ సీఎం రేసులో నితిన్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే.. పటేల్ సామాజిక వర్గానికి చెందినవాడైనా ఆ వర్గం యువత ఈయనపై పూర్తి వ్యతిరేకతతో ఉండటం.. నితిన్‌కు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. జైన్ వర్గానికి చెందిన రాష్ట్ర బీజేపీ చీఫ్ రూపానీకి మోదీ, అమిత్ షాతోపాటు ఆరెస్సెస్ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అన్ని వర్గాలను కలుపుకుపోతారని ఈయనకు పేరుంది. గుజరాత్ ఇంధన మంత్రి సౌరభ్ పటేల్ పేరు కూడా సీఎం రేసులో వినబడుతోంది. ఈయన.. అంబానీ సోదరులకు దగ్గరి బంధువు. కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా, స్పీకర్ గణపత్ వసావాలకూ అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే.. గుజరాత్ బీజేపీ కార్యకర్తలు మాత్రం అమిత్ షా సీఎం అయితే.. పార్టీకి రాష్ట్రంలో ఎదురవుతున్న చిన్నాచితకా సమస్యలను అధిగమించవచ్చని భావిస్తున్నారు. కాగా, బీజేపీ సీఎంగా ఆనందీబెన్ పటేల్‌ను తొలగించటం.. ఆమెను బలిపశువును చేయటమేనని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. -
ఆమె త్యాగం బీజేపీని కాపాడలేదు: రాహుల్
న్యూఢిల్లీ: గుజరాత్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు నరేంద్ర మోదీ 13 ఏళ్ల పాలన కారణమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. బలిపశువు త్యాగం బీజేపీని కాపాడలేదని ఘాటు వ్యాఖ్య చేశారు. 'గుజరాత్ లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు 2 ఏళ్ల ఆనందీబెన్ పాలన కారణం కాదు. 13 ఏళ్ల మోదీ పాలనే కారణమ'ని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. తనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని బీజేపీ అధినాయకత్వాన్ని ఆనందీబెన్ పటేల్ కోరిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ఈ పరిణామంపై స్పందించారు. బీజేపీ హైకమాండ్ ఆదేశాల మేరకు ఆనందదీబెన్ రాజీనామాకు సిద్ధపడ్డారని శంకర్‌సిన్హ్ వాఘేలా అన్నారు. 2017లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదన్న సంకేతాలు వెలువడ్డాయని సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ పేర్కొన్నారు. 13 years of Modi rule, not 2 years of Anandiben are responsible for Gujarat burning. Sacrificing the scapegoat won't save the BJP — Office of RG (@OfficeOfRG) 2 August 2016 -
బెన్ను దించారా..? దిగిపోయిందా?
గాంధీనగర్: గుజరాత్లో ముఖ్యమంత్రి పదవికి అనూహ్యంగా ఆనందీబెన్ పటేల్ రాజీనామా చేశారు. ఆమె రాజీనామా లేఖ అందిందని, కొత్త ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలనేది పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నిర్ణయిస్తారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. అయితే, వయోభారంతోనే తాను రాజీనామా చేసినట్లు ఆనందీబెన్ చెబుతున్నా దీని వెనుక వేరే కారణం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీనే ఆమెతో రాజీనామా చేయించినట్లు పార్టీలోని కొన్ని వర్గాలు అంటున్నాయి. రాజీనామాకు కొన్ని గంటలు ముందు కొన్ని పథకాల ప్రకటనలు చేసిన ఆమె రాజీనామా అనూహ్యంగా ఎందుకు చేస్తారని పలువురు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే, ఎవరినీ ఈ పీఠంపై కూర్చొబెడితే పార్టీకి లాభం చేకూరుతుందనే అంశంపై ఇప్పటికే ఆ పార్టీ ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వారి ఆలోచనల్లో నలుగురు వ్యక్తులు సీఎం అభ్యర్థులుగా ఉన్నారు. వారిలో ముందు వరుసలో.. 1. నితిన్ భాయ్ పటేల్: ఈయన పార్టీలోనే పటేల్ వర్గంలో ప్రముఖ నేత. ఆరెస్సెస్ నేపథ్యం కూడా ఉంది. అయితే, కొన్ని కులాలవారికి ఈయన గిట్టదు. ముఖ్యంగా పటేదార్లకు. 2.భూపేంద్రసింగ్ చుడాసమా: ప్రస్తుతం సీఎం స్థానానికి పోటీపడుతున్న వారిలో ఈయనే వయసులో పెద్ద. బీజేపీలో రాజపుత్ర కులానికి చెందిన నేతల్లో అగ్రగణ్యుడు. దళితుల విషయంలో కమిట్ మెంట్ ఉన్నవ్యక్తి. ఇతడికి ఆరెస్సెస్ కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే, అతి తక్కువ ప్రొఫైల్ మాత్రమే ఉన్న ఈయన పార్టీని నడిపించలేరని అంటున్నారు. 3. సౌరబ్ పటేల్: ఈయన వద్ద ప్రస్తుతం రెండు ముఖ్యమైన శాఖలు ఉన్నాయి. ఒకటి ఆర్థికశాఖ మరొకటి శక్తి వనరులు. రాష్ట్రంలోని విద్యుత్ రంగం పునర్నిర్మాణంలో ఈయన పాత్రే కీలకం అని పేరుంది. మచంఇ పాలకుడు అని కూడా ముద్రకలదు. దీంతోపాటు ప్రధాని మోదీకి కూడా అత్యంత దగ్గరగా ఉంటాడు. 4.విజయ్ రుపణి: విజయ్ రూపని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు. ఆయన వద్ద ట్రాన్స్ పోర్ట్, నీటి పంపిణీ శాఖలు ఉన్నాయి. జైన్ బనియ కులానికి చెందిన వ్యక్తి. ప్రధాని మోదీకి, అమిత్ షాకు అతి సమీపంగా ఉంటాడు. ఇక ఆరెస్సెస్ లో కూడా మంచి పేరుంది. మంచి రాజకీయ వ్యూహకర్త అనే పేరుతోపాటు మందిమార్బలాన్ని నడిపించగల సత్తా ఉన్న వ్యక్తి అని పేరుంది. అయితే, ప్రస్తుతం పలు శాఖలు నిర్వహిస్తున్న మంత్రులందరికన్నా తక్కువ అనుభవం ఉన్న వ్యక్తి అని అంటున్నారు. -
కేజ్రీవాల్ జోస్యం నిజమైందోచ్!
గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ ఊహించనిరీతిలో తన పదవికి రాజీనామా చేశారు. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఏకంగా ఫేస్బుక్లో తాను రాజీనామా చేసినట్టు ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోషల్ మీడియా వినియోగంలో చాలా ముందుంటారనే విషయం తెలిసిందే. మోదీ బాటలోనే నడుస్తూ ఆనందిబెన్ కూడా సోషల్ మీడియా వేదికగా రాజీనామా నిర్ణయం వెల్లడించారు. ఇది ఈ రోజుల్లో సాధారణ విషయమే కానీ.. ఇంతకూ ఆనందిబెన్ రాజీనామా రాజీనామా నెటిజన్లు ఏమంటున్నారు. అరవింద్ కేజ్రీవాల్ నుంచి సామాన్య నెటిజన్ వరకు ఏమంటున్నారంటే.. ఆనందిబెన్ ఫేస్బుక్ ద్వారా తన రాజీనామాను ప్రకటించారు. 'డిజిటల్ ఇండియా' పథకంలో ఇది కొత్త అఛీవ్మెంట్ అని చెప్పొచ్చు. #AnandibenPatel resigns via Facebook. A new achievement under Digital India initiative ! — Saket Aloni (@SaketAloni) August 1, 2016 'అరవింద్ కేజ్రీవాల్ చెప్పిన మరో జోస్యం నిజమైంది. ఆనందిబెన్ రాజీనామా చేసింది' అంటూ ఓ నెటిజన్ రెండు నెలల కిందట కేజ్రీవాల్ చేసిన ట్వీట్‌ను గుర్తుచేశాడు. 'ఆనందిబెన్ అవినీతి, అక్రమాల పరిపాలనతో ప్రజలు విసిగిపోయారు. ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ మద్దతు లభిస్తున్నది. త్వరలోనే బీజేపీ ఆనందిబెన్‌ను మార్చి ఆయన స్థానంలో అమిత్ షాను కూర్చోబెట్టబోతున్నదని విశ్వసనీయంగా తెలుస్తున్నది' అని కేజ్రీవాల్ గత జూన్ 9న చేసిన ట్వీట్లో పేర్కొన్నారు. Another prediction of @ArvindKejriwal comes true. #Anandibenpatel to resign as Guj CM..lol...coward and psycho feku pic.twitter.com/K8wY18aO2V — Mayur Panghaal (@mayurpanghaal) August 1, 2016 ఆనందిబెన్ ఫేస్బుక్లో రాజీనామా పోస్టుచేశారు. దానిని కేజ్రీవాల్ లైక్ కొట్టారు. Gujarat CM Anandiben Patel posted her resignation on Facebook. Arvind Kejriwal Liked it — Joy (@Joydas) August 1, 2016 ఆనందిబెన్ రాజీనామాను బీజేపీ ఆమోదించవచ్చు. ఎందుకంటే ఆ పార్టీ గోవుల రక్షణకు కట్టుబడి ఉంది. #AnandibenPatel has resigned. The BJP will probably accept because they are committed to taking care of cows. — lindsay pereira (@lindsaypereira) August 1, 2016 కేజ్రీవాల్ ఏమంటున్నారంటే.. గుజరాత్లో ఆప్‌కు ప్రజాదరణ పెరిగిపోతుండటంతోనే ఆనందిబెన్ రాజీనామా చేశారు. గుజరాత్ విషయంలో ఇప్పుడు బీజేపీ భయపడుతోంది... గుజరాత్లో అవినీతికి వ్యతిరేకంగా ఆప్ జరిపిన పోరాట విజయమే ఆనందిబెన్ రాజీనామా.. - ట్విట్టర్లో అరవింద్ కేజ్రీవాల్ మేడం మీరు వెళ్లొద్దు.. ఆనందిబెన్ రాజీనామా నిర్ణయంపై ఆమె అభిమానులు విచారం వ్యక్తం చేశారు. "మేడం మీరు ముఖ్యమంత్రిగా కొనసాగాలి. గుజరాత్ కోసం మీరు ఎంతగా కష్టపడుతున్నారో ప్రజలకు తెలియదు. తమ చేతుల్లో ఉన్న వజ్రాన్ని ప్రజలు గుర్తించడం లేదు' అని దేవల్ షా అనే వ్యక్తి ఆనందిబెన్ రాజీనామా పోస్టుపై కామెంట్ చేశారు. -
ఆమె నా కార్యక్రమాన్ని అడ్డుకున్నారు: సీఎం
అహ్మదాబాద్: కేంద్ర ప్రభుత్వంపై తరచూ విమర్శలు చేసే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. బీజేపీ పాలితరాష్ట్రం గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. గుజరాత్‌లోని సూరత్‌లో జరగాల్సిన తన కార్యక్రమాన్ని ఆనందీబెన్ అడ్డుకున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిఒక్కరికీ తమ అభిప్రాయాలను వెల్లడించే హక్కు ఉందన్నారు. శనివారం ఉదయం కేజ్రీవాల్ తన కుటుంబ సభ్యులు, ఆప్ నేతలతో కలసి గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు వెళ్లారు. సోమ్నాథ్లోని ప్రసిద్ధ శివాలయాన్ని దర్శించారు. ఆ తర్వాత 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రెండురోజుల పర్యటనకు గుజరాత్‌కు వచ్చానని, ఆదివారం సూరత్ వెళ్లాల్సివుందని కేజ్రీవాల్ చెప్పారు. అయితే ముఖ్యమంత్రి ఆనందీబెన్ సూరత్‌లోని వ్యాపారవేత్తలు, ప్రజలపై ఒత్తిడి చేసి తమ పార్టీ కార్యక్రమాన్ని రద్దు చేయించారని ఆరోపించారు. కాగా సూరత్ పర్యటనకు రావాలని కేజ్రీవాల్‌కు పంపిన ఆహ్వానాన్ని ఓ వర్తక సంఘం విరమించుకోగా, దీనివెనుక బీజేపీ ప్రభుత్వం హస్తముందని ఆప్ నేతలు చెబుతున్నారు. -
గుజరాత్ సీఎంను తొలగించే ధైర్యం లేదా?
గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్‌ను తప్పించాలని, ఆమె స్థానంలో కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఎప్పటి నుంచో యోచిస్తున్నారు. పటేళ్ల రిజర్వేషన్ల ఆందోళనను అణచివేయడంలో ఆమె వైఫల్యమే అందుకు కారణం. ఆమె నాయకత్వాన వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పోటీ పడినట్లయితే పటేళ్లందరూ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారన్నది ఇద్దరి నేతల భయం. అయితే పటేళ్ల ఆందోళనకారణంగా సీఎం పదవి నుంచి తప్పిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించే సాహసం బీజేపీ అధిష్టానం చేయలేదు. మరెలా తప్పించాలి? అందుకు మోదీకి ఓ తరుణోపాయం చిక్కింది. 75 ఏళ్లు వయస్సు మీద పడిన వాళ్లు ఇటు ప్రభుత్వ నాయకత్వానికి, అటు పార్టీ నాయకత్వానికి దూరంగా ఉండాలన్నది మోదీ ఎప్పటి నుంచో చెబుతున్న అభిమతం. ఈ అభిమతం లేదా సాకుతోనే నాడు పార్టీ సీనియర్ నాయకులు అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను పార్టీకి, నాయకత్వానికి దూరంగా పెట్టారు. ఏజ్బార్నే సాకుగా చూపించి ఆనందిబెన్ పటేల్‌ను తప్పించాలని నరేంద్ర మోదీ ఇంతకాలం భావిస్తూ వచ్చారు. దీన్ని సమర్థించుకోవడానికి ఆయనకు ఓ తాజా ఉదాహరణ కూడా ఉంది. 75 ఏళ్లు పైబడిన వారిని మంత్రివర్గం నుంచి తొలగించాల్సిందిగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు బీజేపీ అధిష్టానం ఆదేశించింది. దాంతో రాష్ట్ర హోం మంత్రి బాబూలాల్ గౌర్ (86)ను, రాష్ట్ర ప్రజా పనుల శాఖ మంత్రి సర్తార్ సింగ్ (76)ను శివరాజ్ సింగ్ కేబినెట్ నుంచి తొలగించారు. ఇదే సూత్రాన్ని అనుసరిస్తూ నవంబర్‌లో 75వ ఏట అడుగుపెడుతున్న గుజరాత్ సీఎం ఆనందిబెన్‌ను తప్పించాలని అనుకున్నారు. ఈ విషయాన్ని సూచనప్రాయంగా ఆమెను ఢిల్లీకి పిలిపించి మరీ చెప్పారు. ఆమె గత మే నెలలో మోదీని, అమిత్‌షాను కలసుకున్నప్పుడు త్వరలో ఆమెకు ఉద్వాసన తప్పదని మీడియాలో కూడా ఉహాగానాలు చెలరేగాయి. ఇప్పుడు అనుకోకుండా ఆనందిబెన్‌కు ఓ అదృష్టం కలసివచ్చింది. 75 ఏళ్ల అనంతరం కూడా కేంద్ర కేబినెట్లో మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లా, సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమల శాఖ మంత్రి కల్రాజ్ మిశ్రాలను మోదీ కేబినెట్లో కొనసాగించడమే పటేల్‌కు కలసివచ్చే అదృష్టం. వాస్తవానికి కేంద్ర కేబినెట్ పునర్వవ్యవస్థీకరణలో భాగంగా 75వ ఏటలో పడిన వీరిద్దరిని తప్పించాలని మోదీ భావించారట. అయితే ఉత్తరప్రదేశ్ బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి అవడం వల్లనే కల్రాజ్ మిశ్రాను తొలగిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని పార్టీ అధిష్టానం భావించిందని విశ్వసనీయ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యూపీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనుండడం, ఓటర్లలో 9 శాతం మంది బ్రాహ్మణులు ఉండడం తెల్సిందే. నరేంద్ర మోదీ తన ఏజ్ బార్ నిబంధనను తన కేబినెట్‌కే వర్తింప చేయనప్పుడు ఆనందిబెన్ పటేల్‌కు ఎలా వర్తింప చేస్తారని ఆమెకు విశ్వాసపాత్రుడైనా ఓ మంత్రి వ్యాఖ్యానించారు. ఈ కారణంగా ఆమెను తొలగించే దమ్ము మోదీకి లేదని ఆయన సవాల్ చేశారు. -
అవి వదంతులే.. సీఎం పీఠం నుంచి దిగిపోను!
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆనందిబేన్ రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెను ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపేసి.. మరొకరికి ఆ పగ్గాలు ఇవ్వాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తున్నట్టు కథనాలు గుప్పుమన్నాయి. ఈ రెండేళ్లకాలంలో సీఎంగా ఆమె తనదైన ముద్ర వేయకపోవడంతో కమలనాథులు ఈ మేరకు ఆలోచిస్తున్నట్టు వందతులు వినిపించాయి. ఈ వదంతులను సీఎం ఆనందిబేన్ కొట్టిపారేశారు. గుజరాత్ లో సీఎం మార్పుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నోటి నుంచి నేరుగా వస్తేనే తాను విశ్వసిస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రానికి సేవ చేయడంపైనే తాను దృష్టి పెట్టానని చెప్పారు. సీఎం మార్పుపై సొంత పార్టీ నేతలే లీకులు ఇచ్చారా? అంటే అది తనకు తెలియదని, ఇది మాత్రం పక్కాగా వదంతులు సృష్టించేవారి పనేనని చెప్పారు. అమిత్ షాతో తనకెలాంటి విభేదాలు లేవని, సీఎంగా తాను పగ్గాలు చేపట్టిన తర్వాత బీజేపీ షా వర్గంగా, తన వర్గంగా రెండుగా చీలిందన్న కథనాల్లో వాస్తవం లేదని వెల్లడించారు. -
సీఎం ఉద్వాసనకు రంగం సిద్ధం!
న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి ఆనంది బెన్ పటేల్ ఉద్వాసనకు రంగం సిద్ధమవుతోందా? అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమెను మార్చాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. గుజరాత్ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు జాతీయ నాయకత్వానికి తలనొప్పిగా మారాయి. వచ్చే ఎన్నికల వరకు ఇదే పరిస్థితి కొనసాగితే నెగ్గుకురావడం కష్టమని కాషాయ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఆనంది బెన్ పటేల్ ను తొలగించి నితిన్ భాయ్ పటేల్ ను సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని బీజేపీ యోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆనంది బెన్ పటేల్ ను గవర్నర్ గా నియమించే అవకాశముందని తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికల కోసం అవలంభించాల్సిన వ్యూహంపై రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి నివేదిక సమర్పించారని తెలుస్తోంది. గుజరాత్ సీఎం మార్పిడితో పాటు కేంద్ర కేబినెట్ లోనూ మార్పులు, చేర్పులు జరగనున్నాయని ఢిల్లీలో జోరుగా ఊహాగానాలు విన్పిస్తున్నాయి. -
' అమిత్ హత్య కేసులో జోక్యం చేసుకోండి'
అహ్మాదాబాద్: యూఎస్‌లో గుజరాతీ వ్యాపారవేత్త అమిత్ పటేల్ హత్య కేసులో జోక్యం చేసుకోవాలని ఆ రాష్ట్ర సీఎం ఆనందీబెన్ పటేల్ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ హత్య కేసుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి త్వరతగతిన పూర్తి చేసి.. నిందితులను కఠినంగా శిక్షించేలా యూఎస్ ప్రభుత్వాన్ని కోరాలని ఆమె నరేంద్ర మోదీని కోరారు.ఈ మేరకు ఆనందీబెన్ పటేల్ మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు.గుజరాత్ కైదా జిల్లాలోని ఉత్తరసంద్ గ్రామానికి చెందిన పటేల్ యూఎస్ ఎడిసన్ పట్టణంలోని ఇర్వింగ్టన్లో వైన్ షాపు నిర్వహిస్తున్నాడు. ఆ క్రమంలో కొందరు దుండగులు సోమవారం అమిత్ పటేల్ షాపులోకి ప్రవేశించి... విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు.దీంతో అమిత్ రక్తపుమడుగులో కుప్పకూలి ప్రాణాలు విడిచారు.ఆ సమాచారాన్ని వారి కుటుంబసభ్యులకు తెలిపారు. దాంతో వారు స్థానిక ఎమ్మెల్యేను కలసి ఈ కేసులో మోదీ జోక్యం చేసుకుని యూఎస్ అధికారులు త్వరితగతిన విచారణ చేపట్టేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. దీంతో సదరు ఎమ్మెల్యే సీఎం ఆనందీబెన్ పటేల్‌ను కలిసి పరిస్థితిని వివరించారు.దీంతో ఆమెపై విధంగా స్పందించారు. -
గుజరాత్ సీఎంకు మోదీ అభినందనలు
న్యూఢిల్లీ:గుజరాత్ సీఎం ఆనందీబెన్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆమెకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. గత మే నెల్లో గుజరాత్ రాష్ట తొలి మహిళా సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆనందీబెన్ శుక్రవారం 73 ఒడిలో అడుగుపెట్టిన శుభ సందర్భంలో మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆనందీ బెన్ మంచి ఆరోగ్యంతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. మోదీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. 1941 వ సంవత్సరంలో గుజరాత్ లోని ఖరోడ్ గ్రామంలో జన్మించిన ఆనందీబెన్ రాష్ట్ర రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగి ప్రముఖ స్థానాన్ని సంపాదించారు. -
పోలీసు ఉద్యోగాల్లో స్త్రీలకు 33% కోటా
గుజరాత్ సీఎం ఆనందీబెన్ ప్రకటన స్త్రీలకు పోలీసుశాఖలో 33% కోటా దేశంలో ఇదే తొలిసారి గాంధీనగర్: గుజరాత్ రాష్ట్ర పోలీసు ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం ఆనందీబెన్ పటేల్ ప్రకటించారు. సమాజంలో మహిళల అభ్యున్నతి కోసం వారికి సాధికారతను కట్టబెట్టడం తప్పనిసరి అని ఆమె అన్నారు. మంగళవారం గాంధీనగర్‌లోని గుజరాత్ పోలీసు అకాడమీలో ఆర్మ్డ్ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్స్, ఇంటెలిజెన్స్ అధికారుల పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించారు. పోలీసుశాఖలో అన్ని కేడర్లలోనూ స్త్రీలకు రిజర్వేషన్ అమలుచేయనున్నట్లు ఆమె తెలిపారు. గుజరాత్లో దేశంలోనే అతితక్కువ నేరాల రేటు ఉందని, అలాంటి సామరస్య వాతావరణాన్ని కల్పించినందుకు పోలీసులకు కృతజ్ఞతలు చెప్పారు. కార్యక్రమంలో గుజరాత్ డీజీపీ పీసీ ఠాకూర్ మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగాల్లో స్త్రీలకు 33 శాతం కోటా కల్పించిన తొలి రాష్ట్రం ఇదేనన్నారు. మహారాష్ట్రలో మహిళా పోలీసులు 10 శాతం మంది ఉన్నారని, ఇది దేశంలోనే అత్యధిక శాతమన్నారు. అలాగే గుజరాత్లో ప్రస్తుతం మహిళా పోలీసులు 5 శాతంలోపే(2,500) ఉన్నారని, 33 శాతం కోటా అమలైతే వారి సంఖ్య 19,800కు పెరగనుందన్నారు. యూపీలోని బదాయూలో ఇద్దరు బాలికలపై అత్యాచారం, హత్యతోపాటు దేశవ్యాప్తంగా స్త్రీలపై లైంగికదాడుల నేపథ్యంలో గుజరాత్ తొలి మహిళా సీఎం నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది. -
'అబ్బాయిలు రిజెక్టెడ్ మెటీరియల్....'
గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ ఉంటే వివాదాలకు తక్కువేమీ ఉండదు. ఆమె అహ్మాదాబాద్ లోని ఒక స్కూల్ డే ఫంక్షన్ కి వెళ్లి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'అమ్మాయిలు బాగా చదువుకోవాలి. చదివి ముందుకు రావాలి' అంటూ మొదలుపెట్టిన ఆనందీబెన్ చదువుకుంటే 'మంచి మొగుళ్లు వస్తారు' అన్నారు. అంతటితో ఆగకుండా 'మీరెంత ఎక్కువ చదువుకుంటే మీకంటే ఎక్కువ చదువుకున్న అబ్బాయిలు భర్తలుగా వస్తారు' అని కూడా అన్నారు. 'చదువుకోని అబ్బాయిలను ఎవరూ పెళ్లి చేసుకోరు. వారిని అమ్మాయిలు రిజెక్టు చేస్తారు. అలాంటి రిజెక్టెడ్ మెటీరియల్ కి పెళ్లికాదు' అని గుజరాత్ ముఖ్యమంత్రి అన్నారు. ఆమె ప్రసంగానికి చప్పట్లు బాగా పడ్డాయి. ఎందుకంటే ఆ స్కూలు ఆడపిల్లల స్కూలు. కానీ గుజరాతీ అబ్బాయిలు మాత్రం మమ్మల్ని రిజెక్టెడ్ మెటీరియల్ అంటారా అని భగ్గుమంటున్నారు. -
'ప్రతి మహిళ ముఖ్యమంత్రే'
తాను ముఖ్యమంత్రి పదవి అలంకరించడంతో రాష్ట్రంలోని ప్రతి మహిళ ఆ పదవిని చేపట్టినట్లు భావిస్తున్నారని గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ వెల్లడించారు. గురువారం గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆనందీ బెన్ పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆమె విలేకర్లతో మాట్లాడారు. బీజేపీ అగ్రనాయకత్వం తనకు పెద్ద బాధ్యత అప్పగించిందన్నారు. ఆ బాధ్యతను త్రీకరణశుద్ధీతో పని చేస్తానని తెలిపారు. గురువారం గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో ఆ రాష్ట్ర గవర్నర్ కమల బెనివల్... ఆనందీ బెన్ పటేల్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ కార్యక్రమానికి ఆనందీ భర్త మఫత్‌లాల్, ఆమె కుమార్తె అనార్లు హాజరైయ్యారు. అనార్ మాట్లాడుతూ ... తల్లి సీఎం పీఠం అధిష్ఠించిన తరుణం తనకు చాలా గర్వంగా ఉందన్నారు. తనకు, తన కుటుంబానికి ఈ విషయం గర్వంగా భావిస్తున్నామని ఆనందీ భర్త మఫత్‌లాల్ తెలిపారు. గతంలో నరేంద్ర మోడీ మంత్రివర్గంలో పలు కీలక శాఖలలో పని చేసిన ఆనందీ బెన్ పటేల్ గురువారం గుజరాత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ బుధవారం గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 26న మోడీ భారతదేశ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం విదితమే. -
గుజరాత్‌కు తొలి మహిళా సీఎంగా ప్రమాణం
-
గుజరాత్‌కు తొలి మహిళా సీఎంగా ప్రమాణం
అహ్మదాబాద్ : గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా ఆనందిబెన్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. నరేంద్ర మోడీ సమక్షంలో ఆమె గుజరాత్ రాష్ట్ర తొలి మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. గుజరాత్ గవర్నర్ కమలా బేనీవాలా ఈరోజు మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో ఆనందీ బెన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ అగ్రనేతలు అద్వానీ, రాజ్‌నాథ్, గడ్కరీతో పాటు పలువురు హాజరయ్యారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడంతోపాటు ఆమె అనేక సహసోపేతమైన పనులు చేశారు. దాంతో ఆమెకు గుజరాత్ ఉక్కు మహిళగా పేరొచ్చింది. మోడీ ప్రధాన మంత్రి అయితే కేబినెట్లో సీనియర్ మంత్రి అయిన ఆనంది బెన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. ఆనంది బెన్ గతంలో విద్యా, రెవెన్యూ, మహిళా, శిశు సంక్షేమ తదితర కీలక శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. ఆమె గుజరాత్ మెహసాన జిల్లాలోని ఓ కుగ్రామంలో రైతు కుటుంబంలో 1941లో జన్మించారు. 1965లో భర్త మఫత్ లాల్ పటేల్‌తో కలిసి అహ్మదాబాద్‌లో స్థిరపడిన ఆమె అంచెలంచెలుగా ఎదిగారు. ఎంఎస్సి,బిఇడి చదివి, టీచరుగా పనిచేస్తూ మోడీ ప్రోత్సాహంతో ఆనంది బెన్ రాజకీయాల్లో వచ్చారు. బిజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పని చేశారు. 1994లో రాజ్యసభ వెళ్లారు. 1994 నుంచి ఎమ్మెల్యేగా ఎంపికవుతూ వచ్చారు. గుజరాత్లో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మహిళా నేత ఆనంది బెన్ ఒక్కరే. -
రేపు ప్రమాణస్వీకారం చేయనున్న ఆనందీబెన్
-
రేపు ప్రమాణస్వీకారం చేయనున్న ఆనందీబెన్
గాంధీనగర్: గుజరాత్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఆనందీబెన్ పటేల్(73) గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గుజరాత్ బీజేపీ శాసనసభపక్ష నాయకురాలిగా ఆమె ఎన్నికయ్యారు. సీఎం పదవికి నరేంద్ర మోడీ రాజీనామా చేసిన వెంటనే ఆమెను బీజేపీ ఎమ్మెల్యేలు తమ నేతగా ఎన్నుకున్నారు. గుజరాత్లో నరేంద్ర మోడీ సాధించిన ప్రగతిని కొనసాగిస్తానని ఆనందీబెన్ పటేల్ ఈ సందర్భంగా హామీయిచ్చారు. బీజేపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ప్రసంగిస్తూ మధ్యలో ఆమె ఉద్వేగానికి గురయ్యారు. ఉపాధ్యాయురాలిగా ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఆనందీబెన్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 1994 నుంచి ఎమ్మెల్యేగా ఎంపికవుతూ వచ్చారు. గుజరాత్ లో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మహిళా నేత ఆనందీ బెన్ ఒక్కరే కావడం విశేషం. -
గుజరాత్ సీఎంగా ఆనందీబెన్ పటేల్‌గా అవకాశం
-
గుజరాత్ సీఎంగా ఆనందీ పటేల్!
నేడు బీజేపీఎల్పీ ఎన్నుకునే చాన్స్ రేసులో అమిత్ షా, నితిన్ పటేల్, భికు భాయ్.. బుధవారం రాజీనామా చేయనున్న మోడీ అహ్మదాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ స్థానంలో ఆయన కు సన్నిహితురాలిగా పేరున్న ఆ రాష్ట్ర రెవెన్యూమంత్రి ఆనందీబెన్ పటేల్ ఎన్నికయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వానికి కొత్త నేతను ఎన్నుకునేందుకు బీజేపీ శాసనసభా పక్షం బుధవారం నాడిక్కడ సమావేశం కానుంది. గుజరాత్ తదుపరి ముఖ్యమంత్రిగా ఆనందీ పటేల్ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమని బీజేపీ వర్గాలు తెలిపారుు. అరుుతే మోడీ వారసులెవరో బీజేపీ ఎల్పీ నిర్ణరుుంచేవరకు కచ్చితంగా చెప్పలేమని పేరు వెల్లడించడానికి ఇష్టపడని మరో నాయకుడు అన్నారు. డెబ్బై మూడేళ్ల ఆనందీ పటేల్‌తో పాటు బీజేపీ ప్రధాన కార్యదర్శి అమిత్ షా కూడా సీఎం రేసులో ఉన్నారు. షా కారణంగానే ఉత్తరప్రదేశ్‌లో పార్టీకి అనూహ్య విజయం సాధ్యమైందనే అభిప్రాయం ఉంది. ఆనందీ బెన్ పేరు తెరపైకి రావడంపై ఆయన అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. మరోవైపు సీనియర్ మంత్రులు నితిన్ పటేల్, సౌరభ్ పటేల్, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి భికుభాయ్ దల్సానియూలు కూడా ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఇలావుండగా బుధవారం జరిగే బీజేపీ ఎల్పీ సమావేశానికి మోడీ కూడా హాజరుకానున్నారు. ఒకవేళ ఆనందీ కనుక ముఖ్యమంత్రిగా ఎన్నికైతే ఆమె గుజరాత్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా వినుతికెక్కనున్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో.. బుధవారం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించనున్నారు. అలాగే గుజరాత్ శాసనసభకు సైతం రాజీనామా చేయనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో మోడీ రాజీనామా సమర్పించే అవకాశం ఉందని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి హర్షద్ పటేల్ చెప్పారు. -
మోడీ స్థానంలో ఉక్కు మహిళ ఆనందీ బెన్
గాంధీనగర్: గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ స్థానంలో గుజరాత్ ఉక్కు మహిళగా పేరు గాంచిన రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఆనందీ బెన్ పటేల్ పేరు దాదాపు ఖరారైంది. కొత్త ముఖ్యమంత్రిగా ఆమె పేరును రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన వెలువడితే గుజరాత్‌కు ఆమే తొలి ముఖ్యమంత్రి అవుతారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడంతోపాటు ఆమె అనేక సహసోపేతమైన పనులు చేశారు. దాంతో ఆమెకు గుజరాత్ ఉక్కు మహిళగా పేరొచ్చింది. మోడీ ప్రధాన మంత్రి అయితే కేబినెట్లో సీనియర్ మంత్రి అయిన ఆనంది బెన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. గుజరాత్ తదుపరి ముఖ్యమంత్రిగా ఆనంది బెన్ పటేల్ సమర్ధురాలని అందరి అభిప్రాయం. మంత్రిగా అపార అనుభవం కలిగిన ఆనందిబెన్ సీఎం పదవికి అర్హురాలుగా మెజార్టీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. విద్యా, రెవెన్యూ, మహిళా, శిశు సంక్షేమ తదితర కీలక శాఖలను ఆమె సమర్థవంతంగా నిర్వహించారు. ఇటీవల కాలంలో మోడీ దేశ రాజకీయాలపై దృష్టిపెట్టడంతో రాష్ట్రంలో పరిపాలనాపరమైన కీలక బాధ్యతలను ఆమే నిర్వహించారు. మంత్రులను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లడంతోపాటు, అధికారులతో సమీక్షలు నిర్వహించారు. అనేక మంది పోటీపడినప్పటికీ బిజెపి అధిష్టానం ఆనంది బెన్ సమర్థతను గుర్తించి సీఎం పదవికి ఎంపిక చేసింది. గుజరాత్ మెహసాన జిల్లాలోని ఓ కుగ్రామంలో రైతు కుటుంబంలో 1941లో ఆనంది బెన్ జన్మించారు. 1965లో భర్త మఫత్ లాల్ పటేల్‌తో కలిసి అహ్మదాబాద్‌లో స్థిరపడిన ఆమె అంచెలంచెలుగా ఎదిగారు. అయితే చాలా కాలం క్రితం ఆమె భర్త నుంచి విడిపోయారు. ఎంఎస్సి,బిఇడి చదివి, టీచరుగా పనిచేస్తూ మోడీ ప్రోత్సాహంతో ఆమె రాజకీయాల్లో వచ్చారు. 1987లో ఆమె రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. బిజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పని చేశారు. 1994లో రాజ్యసభ వెళ్లారు. 1994 నుంచి ఎమ్మెల్యేగా ఎంపికవుతూ వచ్చారు. గుజరాత్లో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మహిళా నేత ఆనందీ బెన్ ఒక్కరే. -
గుజరాత్ కొత్త సీఎంగా ఆనందీ బెన్ పటేల్ ?
-
గుజరాత్ కొత్త సీఎంగా ఆనందీ బెన్ పటేల్ ?
సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ అఖండ విజయం సాధించింది. దాంతో ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రధాని పీఠం అధిష్టించనున్నారు. అందుకోసం ఈ నెల 21న గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి మోడీ రాజీనామా చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఆ రోజే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు అధ్యక్షత వహించేందుకు కొత్త సీఎంను ఎంపిక చేయాలి. ఈ నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి ఎంపికపై బీజేపీ అగ్రనాయకత్వం కసరత్తు తీవ్రతరం చేసింది. అందులోభాగంగా ఆ పార్టీ పరిశీలకులు ఇప్పటికే గుజరాత్ చేరుకున్నారు. మోడీ మంత్రి వర్గంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళ మంత్రి ఆనందీ బెన్ పటేల్ ఎంపికపై రాష్ట్ర పరిశీలకులు అటు పార్టీ రాష్ట్ర నాయకులు ఇటు కేంద్ర నాయకులతో చర్చిస్తున్నారు. ఆనందీబెన్ పటేల్‌ను గుజరాత్ సీఎంగా ఎంపిక చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఆనందీబెన్ పటేల్ రోడ్లు, భవనాలు, పట్టణాభివృద్ధి, విపత్తు నిర్వహణ మంత్రిగా మోడీ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.