
గుజరాత్ సీఎంగా ఆనందీ పటేల్!
గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ స్థానంలో ఆయన కు సన్నిహితురాలిగా పేరున్న ఆ రాష్ట్ర రెవెన్యూమంత్రి ఆనందీబెన్ పటేల్ ఎన్నికయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
నేడు బీజేపీఎల్పీ ఎన్నుకునే చాన్స్
రేసులో అమిత్ షా, నితిన్ పటేల్, భికు భాయ్.. బుధవారం రాజీనామా చేయనున్న మోడీ
అహ్మదాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ స్థానంలో ఆయన కు సన్నిహితురాలిగా పేరున్న ఆ రాష్ట్ర రెవెన్యూమంత్రి ఆనందీబెన్ పటేల్ ఎన్నికయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వానికి కొత్త నేతను ఎన్నుకునేందుకు బీజేపీ శాసనసభా పక్షం బుధవారం నాడిక్కడ సమావేశం కానుంది. గుజరాత్ తదుపరి ముఖ్యమంత్రిగా ఆనందీ పటేల్ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమని బీజేపీ వర్గాలు తెలిపారుు. అరుుతే మోడీ వారసులెవరో బీజేపీ ఎల్పీ నిర్ణరుుంచేవరకు కచ్చితంగా చెప్పలేమని పేరు వెల్లడించడానికి ఇష్టపడని మరో నాయకుడు అన్నారు. డెబ్బై మూడేళ్ల ఆనందీ పటేల్‌తో పాటు బీజేపీ ప్రధాన కార్యదర్శి అమిత్ షా కూడా సీఎం రేసులో ఉన్నారు. షా కారణంగానే ఉత్తరప్రదేశ్‌లో పార్టీకి అనూహ్య విజయం సాధ్యమైందనే అభిప్రాయం ఉంది. ఆనందీ బెన్ పేరు తెరపైకి రావడంపై ఆయన అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. మరోవైపు సీనియర్ మంత్రులు నితిన్ పటేల్, సౌరభ్ పటేల్, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి భికుభాయ్ దల్సానియూలు కూడా ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఇలావుండగా బుధవారం జరిగే బీజేపీ ఎల్పీ సమావేశానికి మోడీ కూడా హాజరుకానున్నారు.
ఒకవేళ ఆనందీ కనుక ముఖ్యమంత్రిగా ఎన్నికైతే ఆమె గుజరాత్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా వినుతికెక్కనున్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో.. బుధవారం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించనున్నారు. అలాగే గుజరాత్ శాసనసభకు సైతం రాజీనామా చేయనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో మోడీ రాజీనామా సమర్పించే అవకాశం ఉందని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి హర్షద్ పటేల్ చెప్పారు.