మీడియాతో మాట్లాడుతున్న యశోదాబెన్ పటెల్
అహ్మాదాబాద్, గుజరాత్ : కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ‘ప్రధాని మోదీ అవివాహితుడు’ అనే వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ వార్త ఇంత క్రేజ్ రావడానకి కారణం ఈ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి. ఇంతకు ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరంటే కొంత కాలం క్రితం వరకూ గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసి..ప్రస్తుతం మధ్య ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేస్తున్న ఆనందిబెన్ పటేల్. ఒక మీడియా సమావేశంలో ఆనందిబెన్ పటేల్ ‘నరేంద్ర భయ్యా(ప్రధాని నరేంద్ర మోదీ)కు పెళ్లి కాలేదు’ అని ప్రకటించారు. దాంతో ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.
ఎందుకంటే మోదీ ప్రధాని పీఠం అధిరోహించడానికి కొన్ని రోజుల ముందే ఆయన భార్య యశోదాబెన్ పటేల్ గురించి అన్ని టీవీ చానెల్స్‌లో ప్రచారం జరిగింది. మోదీ ప్రధాని కావాలని తాను తీర్థయాత్రలు చేస్తున్నట్లు స్వయంగా యశోదాబెన్నే ప్రకటించింది. ఆ సమయంలో కొన్ని టీవీ చానెల్స్ యశోదాబెన్‌ను ఇంటర్వ్యూ కూడా చేశాయి. ఆ సమయంలో యశోదాబెన్ తనకు, మోదీకి వివాహం అయ్యిందని కానీ వృత్తిపరమైన బాధ్యతల వల్లే తాము వేర్వేరుగా ఉంటున్నామని కూడా తెలిపారు. ఈ నేపధ్యంలో ఆనందిబెన్ పటెల్ ‘మోదీ అవివాహితుడు’ అని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దాంతో మరోసారి మోదీ భార్య యశోదాబెన్ మరోసారి స్వయంగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు.
ఈ వియషం గురించి యశోదాబెన్ ఎన్డీటీవీతో ‘ఆనందిబెన్ వ్యాఖ్యలు విని నేను నిజంగా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే 2004 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇచ్చిన డిక్లరేషన్ ఫామ్‌లో స్వయంగా మోదీయే తనను తాను వివాహితుడునని పేర్కొనడమే కాక..నా పేరును కూడా ఆ పత్రంలో తెలిపార’న్నారు. అంతేకాక మొదట సోషల్ మీడియాలో వచ్చిన ఈ వార్తను తాను నమ్మలేదని తెలిపారు. కానీ తరువాత ఇదే విషయం ఒక ప్రముఖ దిన పత్రికలో కూడా వచ్చిందని, అందుకే తాను ఈ విషయం గురించి వివరణ ఇస్తున్నట్లు తెలిపారు.
ఉన్నత చదువులు చదివిన ఆనందిబెన్ లాంటి ఒక మహిళ తనలాంటి సాధరణ పాఠశాల ఉపాధ్యాయురాలి గురించి ఇలా మాట్లడటం సరికాదన్నారు. ఆమె బాధ్యాతరహిత ప్రవర్తన వల్ల మోదీకి చెడ్డ పేరు వస్తుందన్నారు. అంతే మోదీ అంటే తనకు చాలా గౌరవం అని ఆయన తన పాలిట రాముడన్నారు యశోదాబెన్.
Comments
Please login to add a commentAdd a comment