కోల్‌కత్తా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్రమోదీ భార్య జశోదాబెన్‌ను కలిసి మాట్లాడారు. మోదీని కలుసుకునేందుకు ఢిల్లీ బయలుదేరిన మమత మంగళవారం రాత్రి కోల్‌కత్తా విమానాశ్రయానికి చేరుకున్నారు. అదే సమయంలో జశోదాబెన్ కోల్‌కత్తా నుంచి ధన్‌బాద్ వెళ్లేందుకు అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఎదురుపడిన వారిద్దరూ ఒకరినొకరు పలుకరించుకున్నారు. పరస్పరం యోగక్షేమాలు అగిడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జశోదాబెన్‌కు మమత చీర బహుకరించారు. కాగా నరేంద్ర మోదీతో మమతాబెనర్జీ బుధవారం సమావేశమైన విషయం తెలిసిందే. మమత తన తరఫున బహుమతిగా మోదీకి ప్రత్యేక కుర్తా, బెంగాలీ స్వీట్స్‌ను బహుకరించారు.
చదవండి: మోదీకి కుర్తా బహుకరించిన దీదీ
మోదీ భార్యకు చీర బహుకరించిన దీదీ
Published Wed, Sep 18 2019 7:30 PM | Last Updated on Wed, Sep 18 2019 7:33 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment