Jashodaben
-
మోదీ భార్యను కలుసుకున్న మమత
కోల్కత్తా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్రమోదీ భార్య జశోదాబెన్‌ను కలిసి మాట్లాడారు. మోదీని కలుసుకునేందుకు ఢిల్లీ బయలుదేరిన మమత మంగళవారం రాత్రి కోల్కత్తా విమానాశ్రయానికి చేరుకున్నారు. అదే సమయంలో జశోదాబెన్ కోల్కత్తా నుంచి ధన్‌బాద్ వెళ్లేందుకు అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఎదురుపడిన వారిద్దరూ ఒకరినొకరు పలుకరించుకున్నారు. పరస్పరం యోగక్షేమాలు అగిడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జశోదాబెన్‌కు మమత చీర బహుకరించారు. కాగా నరేంద్ర మోదీతో మమతాబెనర్జీ బుధవారం సమావేశమైన విషయం తెలిసిందే. మమత తన తరఫున బహుమతిగా మోదీకి ప్రత్యేక కుర్తా, బెంగాలీ స్వీట్స్‌ను బహుకరించారు. చదవండి: మోదీకి కుర్తా బహుకరించిన దీదీ -
ప్రధాని భార్యను పలకరించిన మమత
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ప్రధాని మోదీ భార్య జశోదాబెన్‌తో మాట్లాడారు. ఢిల్లీలో ప్రధాని మోదీని కలుసుకునేందుకు బయలుదేరిన సీఎం మమత కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకున్నారు. అదే సమయంలో జశోదాబెన్ కోల్‌కతా నుంచి ధన్‌బాద్ వెళ్లేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఎదురుపడిన ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకున్నారు. ‘విమానాశ్రయంలో అనుకోకుండా కలుసుకున్న వారిద్దరూ పరస్పరం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జశోదాబెన్‌కు సీఎం మమత చీర బహూకరించారు’అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా, మమత బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. -
భార్యను వదిలేసినోడు.. చెల్లెళ్లను గౌరవిస్తాడా?
గోరఖ్‌పూర్: బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి ప్రధాని మోదీపై ఘాటు విమర్శలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే అమాయకురాలైన భార్య జశోదాబెన్‌ను మోదీ వదిలేశారని ఆరోపించారు. ఇప్పుడు బీజేపీలోని మహిళా నేతలు కూడా మోదీలా తమ భర్తలు తమను వదిలేస్తారేమో అని కలవరపడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం మోదీ సెకనుకో కులం మార్చుకుంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాబట్టి మోదీలాంటి వ్యక్తికి ఓటేయవద్దని దేశంలోని మహిళలందరికీ విజ్ఞప్తి చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాయావతి ప్రధానిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీజేపీ మహిళా నేతలకు భయం రాజస్తాన్‌లోని ఆళ్వార్‌లో దళిత మహిళపై అత్యాచారం నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలన్న మోదీ డిమాండ్‌పై మాయావతి స్పందిస్తూ.. ‘ఈ విషయంలో మోదీ నీచ రాజకీయాలు చేస్తున్నారు. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. రాజకీయ ప్రయోజనాల కోసం సొంత భార్యనే వదిలేసిన వ్యక్తి ఇతరుల చెల్లెళ్లు, భార్యలను ఎలా గౌరవిస్తాడు? ఇటీవల నాకు ఓ కొత్త విషయం తెలిసింది. తమ భర్తలు మోదీకి సమీపంగా ఉండటం చూసి బీజేపీ మహిళా నేతలే ఆందోళనకు గురవుతున్నారట! వాళ్లంతా మోదీలాగే తమను వదిలేస్తారని భయపడుతున్నారట. మోదీ హయాంలో గుజరాత్లో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై తీవ్రమైన దాడులు జరిగాయి. కాబట్టి ఆళ్వార్ ఘటనపై మాట్లాడే నైతిక అర్హత ఆయనకు లేదు’ అని స్పష్టం చేశారు. మోదీని తప్పించేవరకూ ఎస్పీ–బీఎస్పీ పొత్తు దృఢంగా ఉంటుందని స్పష్టం చేశారు. మాయావతి క్షమాపణ చెప్పాలి: బీజేపీ మోదీపై వ్యక్తిగత విమర్శలు చేసిన మాయావతి క్షమాపణలు చెప్పాలని కేంద్ర రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాయావతి కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీల వివరాలను సీతారామన్ మీడియా ముందు ప్రదర్శించారు. ‘దళిత హక్కుల సాధన కోసం బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన మాయావతి.. దళిత్ బేటీ(దళిత కులం యువతి) స్థాయి నుంచి దౌలత్‌కీ బేటీ(ధనికురాలైన మహిళ)గా మారారు’ అని దుయ్యబట్టారు. మోదీపై విమర్శలతో మాయావతి తన స్థాయిని దిగజార్చుకున్నారనీ, ఆమె ప్రజాజీవితానికి అనర్హురాలని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ విమర్శించారు. -
‘మోదీకి పెళ్లయ్యింది.. ఆయనే నా రాముడు’
అహ్మాదాబాద్, గుజరాత్ : కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ‘ప్రధాని మోదీ అవివాహితుడు’ అనే వార్త హల్చల్ చేస్తోంది. ఈ వార్త ఇంత క్రేజ్ రావడానకి కారణం ఈ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి. ఇంతకు ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరంటే కొంత కాలం క్రితం వరకూ గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసి..ప్రస్తుతం మధ్య ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేస్తున్న ఆనందిబెన్ పటేల్. ఒక మీడియా సమావేశంలో ఆనందిబెన్ పటేల్ ‘నరేంద్ర భయ్యా(ప్రధాని నరేంద్ర మోదీ)కు పెళ్లి కాలేదు’ అని ప్రకటించారు. దాంతో ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఎందుకంటే మోదీ ప్రధాని పీఠం అధిరోహించడానికి కొన్ని రోజుల ముందే ఆయన భార్య యశోదాబెన్ పటేల్ గురించి అన్ని టీవీ చానెల్స్‌లో ప్రచారం జరిగింది. మోదీ ప్రధాని కావాలని తాను తీర్థయాత్రలు చేస్తున్నట్లు స్వయంగా యశోదాబెన్నే ప్రకటించింది. ఆ సమయంలో కొన్ని టీవీ చానెల్స్ యశోదాబెన్‌ను ఇంటర్వ్యూ కూడా చేశాయి. ఆ సమయంలో యశోదాబెన్ తనకు, మోదీకి వివాహం అయ్యిందని కానీ వృత్తిపరమైన బాధ్యతల వల్లే తాము వేర్వేరుగా ఉంటున్నామని కూడా తెలిపారు. ఈ నేపధ్యంలో ఆనందిబెన్ పటెల్ ‘మోదీ అవివాహితుడు’ అని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దాంతో మరోసారి మోదీ భార్య యశోదాబెన్ మరోసారి స్వయంగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. ఈ వియషం గురించి యశోదాబెన్ ఎన్డీటీవీతో ‘ఆనందిబెన్ వ్యాఖ్యలు విని నేను నిజంగా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే 2004 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇచ్చిన డిక్లరేషన్ ఫామ్‌లో స్వయంగా మోదీయే తనను తాను వివాహితుడునని పేర్కొనడమే కాక..నా పేరును కూడా ఆ పత్రంలో తెలిపార’న్నారు. అంతేకాక మొదట సోషల్ మీడియాలో వచ్చిన ఈ వార్తను తాను నమ్మలేదని తెలిపారు. కానీ తరువాత ఇదే విషయం ఒక ప్రముఖ దిన పత్రికలో కూడా వచ్చిందని, అందుకే తాను ఈ విషయం గురించి వివరణ ఇస్తున్నట్లు తెలిపారు. ఉన్నత చదువులు చదివిన ఆనందిబెన్ లాంటి ఒక మహిళ తనలాంటి సాధరణ పాఠశాల ఉపాధ్యాయురాలి గురించి ఇలా మాట్లడటం సరికాదన్నారు. ఆమె బాధ్యాతరహిత ప్రవర్తన వల్ల మోదీకి చెడ్డ పేరు వస్తుందన్నారు. అంతే మోదీ అంటే తనకు చాలా గౌరవం అని ఆయన తన పాలిట రాముడన్నారు యశోదాబెన్. -
రోడ్డు ప్రమాదం.. ప్రధాని భార్యకు గాయాలు
-
రోడ్డు ప్రమాదంలో ప్రధాని మోదీ భార్యకు గాయాలు
జైపూర్ : జైపూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భార్య జశోదా బెన్ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. రాజస్థాన్‌లో ఆమె ప్రయాణిస్తున్న కారు ట్రక్కును ఢీకొనటంతో ఒకరు చనిపోగా, పలువురు గాయపడ్డారు. కోటాలో జరిగిన శుభకార్యానికి హాజరైన జశోదా బెన్ బుధవారం మధ్యాహ్నం కారులో బంధువులతో కలిసి చిత్తోర్‌గఢ్‌కు బయలుదేరారు. పర్సోలీ సమీపంలో ముందు వెళ్తున్న ట్రక్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో కారు ట్రక్కును బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న జశోదా బెన్ బంధువు బసంత్ భాయ్ మోదీ(67)తోపాటు అతని భార్య విమలా మోదీ, ఒక పోలీసు కానిస్టేబుల్, చిన్నారి(5) గాయపడ్డారు. జశోదా బెన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బసంత్ భాయ్ మోదీ చనిపోయారనీ, విమలా మోదీ, కానిస్టేబుల్‌ను మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించారని పోలీసులు తెలిపారు. -
ప్రధాని మోదీ భార్య కోసం దీక్ష.. భగ్నం
సాక్షి, హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ భార్య యశోదా బెన్ కోసం.. వైద్యురాలు పాలెపు సుశీల చేస్తోన్న దీక్షను మియాపూర్ పోలీసులు భగ్నం చేశారు. మోదీ.. యశోదాను భార్యగా అంగీకరించి గౌరవించాలని, లేకుంటే, జెడ్ కేటగిరి భద్రత తొలగించి ఆమెకు స్వేచ్చ ప్రసాదించాలని డిమాండ్ చేస్తూ ఎనిమిది రోజులుగా దీక్ష చేస్తోన్న సుశీలను ఆదివారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాగా నీరసించినపోయిన ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించేప్రయత్నం చేశారు. అయితే తాను మాత్రం డిమాండ్లు పరిష్కారం అయ్యేదాకా దీక్ష విరమించబోనని సుశీల సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఎవరీ డాక్టర్ సుశీల? : అఖండ భారత ఉద్యమ వ్యవస్థాపకురాలిగా ఉన్న డాక్టర్ పాలెపు సుశీల.. హైదరాబాద్ మియాపూర్ లోని న్యూ హఫీజ్ పేటలో క్లినిక్ నడుపుతున్నారు. హైందవ జీవన విధానంలో మహిళ పూజ్యనీయురాలని, స్త్రీల గౌరవాన్ని, స్వేచ్ఛను కాపాడటం కోసమే తాను దీక్షకు దిగినట్లు సుశీల పేర్కొన్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సుశీల.. ఎప్పటికప్పుడు దీక్ష వివరాలను పోస్ట్‌చేశారు. ప్రధానిపై ఘాటు వ్యాఖ్యలు : దీక్ష భగ్నం అనంతరం ప్రధానిని ఉద్దేశించి డాక్టర్ సుశీల ఘాటు వ్యాఖ్యలు చేశారు. యశోదా బెన్ భారతనారి అని, మోదీ బ్రిటిష్ అధికారి అని, ఇద్దరిలో తాను భారతనారివైపే ఉంటానని చెప్పుకొచ్చారు. కాగా, ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచిఉన్నందునే యశోదా బెన్‌కు భద్రత కల్పిస్తున్నారని, ఈ విషయంలో దీక్షలు అవసరం లేదని నెటిజన్లు సుశీలకు సలహాలిస్తున్నారు. బాల్యంలోనే యశోదను పెళ్లాడిన నరేంద్ర మోదీ.. అనంతరకాలంలో ఆమెకు దూరంగా ఉండిపోయిన సంగతి తెలిసిందే. ఎన్నికల అఫిడవిట్లోనూ భార్య గురించిన వివరాలేవీ ఆయన పొందపర్చలేదు. దీనిపై విపక్షాలు ఆందోళన చేయడంతో మోదీ వైవాహిక బంధంపై బీజేపీ నాయకులు కొన్ని ప్రకటనలు చేసిన విషయం విదితమే. డాక్టర్ సుశీల(ఫేస్బుక్ నుంచి తీసుకున్న ఫొటో) -
భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రధాని సతీమణి పూజలు
హైదరాబాద్: నగరంలోని చార్మినార్ వద్ద ఉన్న చారిత్రాత్మక భాగ్యలక్ష్మి ఆలయాన్ని ప్రధాని నరేంద్రమోదీ సతీమణి జశోద బేన్ సందర్శించారు. శనివారం ఉదయం ఆలయానికి విచ్చేసిన ఆమె అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
వికారాబాద్‌లో ప్రధాని మోదీ సతీమణి
-
వికారాబాద్‌లో ప్రధాని మోదీ సతీమణి
హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భార్య జశోదా బెన్ శుక్రవారం తెలంగాణ రాష్ట్రం విచ్చేశారు. వికారాబాద్‌లోని రెండు దేవాలయాలను ఆమె సందర్శించుకున్నారు. నాగదేవత గుడిలో జశోదా బెన్ పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం కార్యక్రమంలో పాల్గొని భక్తులకు వడ్డన చేశారు. ఆ తర్వాత సంతోషిమాత ఆలయాన్ని జశోదా బెన్ సందర్శించి, అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి ఆమె గోమాతను కానుకగా ఇచ్చారు. అలాగే రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బీఆర్ అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. కాగా జశోదా బెన్ గురువారం రాత్రే వికారాబాద్ చేరుకున్నారు. నాగదేవత ఆలయ పూజారి నివాసంలో ఆమె బస చేశారు. అయితే ప్రధాని సతీమణి వచ్చిన వార్త తెలియడంతో భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారితో కొద్దిసేపు జశోదా బెన్ మాట్లాడారు. అయితే జశోదా బెన్ మాత్రం తన రాకపై ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అక్కడకు రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆమె శనివారం గుజరాత్ తిరుగు ప్రయాణం అవుతారు. -
ప్రధాని మోదీకి బాసటగా నిలిచిన భార్య
ఉదయ్‌పూర్: పాత పెద్ద నోట్ల చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంది విమర్శిస్తున్నప్పటికీ ఆయన సతీమణి జశోదాబెన్ మాత్రం సమర్థించారు. నల్లధనం వెలికితీయడానికి డీమోనిటైజేషన్ ఉపకరిస్తుందని అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయురాలిగా రిటైరైన 64 ఏళ్ల జశోదాబెన్ బుధవారం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఒక ప్రైవేటు స్కూల్ స్వర్ణోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘పాత పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీజీ తీసుకున్న నిర్ణయం సరైనదే. పాత రూ. 500, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేయడంతో దేశంలోని నల్లధనం బహిర్గతమవుతుంద’ని పేర్కొన్నారు. ‘వందేమాతరం’ తో ప్రసంగం ప్రారంభించిన జశోదాబెన్.. మహిళలు స్వశక్తితో రాణించాలని అన్నారు. సుష్మాస్వరాజ్, మాయావతి, ఇందిరాగాంధీలా మహిళలు ఆయా రంగాల్లో దూసుకెళ్లాలని పిలుపునిచ్చారు. గ్యాస్ సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకోవాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుతో పేద కుటుంబాల్లోని మహిళలకు మేలు జరిగిందని తెలిపారు. చాలా మంది స్వచ్ఛందంగా సబ్సిడీని వదులుకోవడంతో దారిద్ర్యరేఖ దిగువనున్న కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం సాధ్యమయిందని వివరించారు. -
మా ఆయన పాస్ పోర్టు కాపీ ఇవ్వండి: మోదీ భార్య
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ పాస్ పోర్టులోని వివరాలు తెలపాల్సిందిగా ఆయన భార్య జశోదా బెన్ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. తన సోదరుడు అశోక్ మోదీ, మరో బంధువుతో కలసి ఆటోలో అహ్మదాబాద్ ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయానికి (ఆర్పీఓ) వచ్చిన జశోదా బెన్ మోదీ పాస్ పోర్టు కాపీ ఇవ్వాల్సిందిగా కోరారు. విదేశాల్లో ఉన్న బంధువులు, స్నేహితులను కలిసేందుకోసం జశోదా బెన్ పాస్ పోర్టుకు దరఖాస్తు చేయగా.. మ్యారేజ్ సర్టిఫికేట్ పొందుపరచలేదన్న కారణంతో గత నవంబర్‌లో అధికారులు ఆమెకు పాస్ పోర్టు ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఆమె మోదీ పాస్ పోర్టులోని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మోదీ తీసుకున్న పాస్ పోర్టు, రెన్యువల్ చేసిన పాస్ పోర్టుల కాపీలను ఇవ్వాల్సిందిగా ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయం అధికారులను కోరారు. ఆర్పీఓలో 15 నిమిషాలు ఉన్న జశోదా బెన్.. వ్యక్తిగత పనిమీద వచ్చానని చెప్పారు. అయితే వివరాలు వెల్లడించలేదు. జశోద్ బెన్ దరఖాస్తును పరిశీలిస్తున్నామని, 30 రోజుల్లోగా సమాధానమిస్తామని ఆర్పీఓ అధికారి జెడ్ ఏ ఖాన్ చెప్పారు. జశోదా బెన్ తన భద్రతకు సంబంధించి గతంలో ఓసారి సమాచారం హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నారు. ప్రధాని మోదీ భార్యగా తనకు కల్పిస్తున్న భద్రత గురించి వివరాలు తెలియజేయాల్సిందిగా కోరారు. అయితే భద్రత కారణాల వల్ల సమాచారం ఇవ్వలేమని, ఈ విషయం సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాదంటూ మెహ్సనా జిల్లా ఎస్పీ అప్పట్లో జశోద్ బెన్‌కు వివరించారు. మోదీ, జశోదా బెన్ వేర్వేరుగా ఉంటున్న సంగతి తెలిసిందే. -
అహ్మదాబాద్ నుంచి అండమాన్‌కు
మోదీ భార్య వార్త ప్రసారం చేసినందుకు దూరదర్శన్ అధికారిపై వేటు! న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ భార్య జశోదాబెన్‌కు సంబంధించిన వార్తను ప్రసారం చేసిన అహ్మదాబాద్‌లోని దూరదర్శన్ గుజరాత్ చానల్ అధికారిపై బదిలీ వేటు పడింది. ఏడాదిలో రిటైర్ కాబోతున్న ఆయనను ఏకంగా అండమాన్‌కు బదిలీ చేశారు. ప్రధాని భార్యగా తనకు అందిస్తున్న సదుపాయాలు ఏమిటో తెలపాలని జశోద దాఖలు చేసిన సమాచారహక్కు దరఖాస్తుపై రెండు నిమిషాల్లోపు వార్త గత నెల 1న ‘డీడీ గిర్నార్’లో ప్రసారమైంది. ఆ రోజు చానల్ కోసం గుజరాత్ వార్తలు సేకరించిన అసిస్టెంట్ డెరైక్టర్ వీఎం వనోల్(58)ను జనవరి రెండో వారంలో అండమాన్‌లోని పోర్ట్ బ్లెయిట్ స్టేషన్‌కు బదిలీ చేశారు. దీన్ని వనోల్ ధ్రువీకరించారు. అయితే బదిలీకి దారితీసిన వివరాలు వెల్లడించడానికి నిరాకరించారు. మందలింపు..! ఈ వార్త ప్రసారమైన మరుసటి రోజు ఢిల్లీలోని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు డీడీ గిర్నార్ అధికారులతో మాట్లాడి వివరణ ఇవ్వాలన్నారు. జనవరి 1 నాటి వార్తలు సమకూర్చిన వనోల్తోపాటు జాయింట్ డెరైక్టర్, మరో ఇద్దరు అసిస్టెంట్ డెరైక్టర్లను మందలించినట్లు సమాచారం. అయితే ఢిల్లీ అధికారులు సాధారణ సమీక్షలో భాగంగానే గిర్నార్ అధికారులతో మాట్లాడారని, ఏదో ప్రత్యేక అంశంపై కాదని సమాచార, ప్రసార శాఖ ఉన్నతాధికారులు అధికారులు చెబుతున్నారు. వనోల్ బదిలీ సంపాదక, పాలనాపరమైన నిర్ణయమని, దీనికి మరే ఉదంతంతోనూ సంబంధం లేదని చెప్పారు. దీనిపై డీడీ గిర్నార్ ఉద్యోగి ఒకరు మాట్లాడుతూ.. ‘ఆ రోజు(జనవరి 1) గుజరాత్ వార్తల సేకరణ బాధ్యత వనోల్ చేపట్టారు. జశోదాబెన్ వార్తను అన్ని ప్రైవేట్ టీవీ చానళ్లు ప్రధానంగా ప్రసారం చేయడంతో దానిపై ఆయన చిన్నవార్త ఇవ్వాలని నిర్ణయించారు’ అని తెలిపారు. కాగా, జశోద ఆర్టీఐ దరఖాస్తు వార్తను డీడీ గిర్నార్ గత డిసెంబర్‌లోనూ ప్రసారం చేసినా ఎవరూ దాన్ని పెద్దగా పట్టించుకోలేదని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. -
ఆయనతో కలిసుండాలని ఉంది!
-
ఆయనతో కలిసుండాలని ఉంది!
* ఒక్కసారి పిలిస్తే చాలు.. జీవితాంతం తోడుంటాను * మోదీ భార్య జశోదాబెన్ ఆకాంక్ష ముంబై/అహ్మదాబాద్: ‘ఆయనతో కలిసుండాలనే నాకుంది. తనతో కొత్త జీవితం ప్రారంభించాలని ఉంది. నాకు ఆ ఆశ ఎప్పట్నుంచో ఉంది. తనకు సేవ చేయాలని ఉంది. ఒక్కసారి రమ్మని పిలిస్తే చాలు.. సంతోషంగా వెంట వెళ్తాను. నేనుంటు న్న ఇంటి దగ్గరికి వచ్చి తనతో రమ్మని ఒక్కసారి ఆహ్వానిస్తే.. మరుక్షణమే ఆయన తోడుగా వెళ్తాను. జీవితాంతం తోడుంటాను. కానీ ముందు ఆయన నన్ను పిలవాలిగా!’ ప్రధాని నరేంద్రమోదీ భార్య జశోదా బెన్(64) ఆకాంక్ష ఇది. 43 ఏళ్లుగా విడిగా ఉంటున్నా.. భర్తపై మమకారం తగ్గలేదని, తన పూజలన్నీ ఆయన కోసమేనని జశోదాబెన్ చెబుతున్నా రు. ఇప్పటికీ వారంలో 4రోజులు ఆమె ఉపవాసం ఉంటారు. విడిపోయి 43 ఏళ్లు 1968లో మోదీకి 17 ఏళ్ల వయసులో జశోదాతో వివాహమయింది. మూడేళ్ల తరువాత వారిద్దరూ విడిపోయారు. తండ్రి సహకారంతో చదువుకుని గుజరాత్‌లోని వాద్గం జిల్లా, రాజోషన గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయినిగా జశోదాబెన్ కొత్త జీవితం ప్రారంభించారు. వారిద్దరూ విడిపోయి దాదాపు 43 ఏళ్లు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల వరకు తన వివాహం గురించి కానీ, భార్య గురించి కానీ మోదీ ఎక్కడా బహిరంగంగా ప్రస్తావించలేదు. వడోదర స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న సందర్భంగా.. ఎన్నికల అఫిడవిట్లో తన భార్య పేరు జశోదాబెన్ అని తొలిసారి వెల్లడించారు. అఫిడవిట్లో భార్యగా తన పేరును మోదీ రాశారని తెలిసినప్పుడు తన భావాలను మిడ్డే పత్రికతో ఆమె పంచుకున్నారు. ‘చాలా సంతోషమయింది. నా కళ్లల్లో నీళ్లొచ్చేశాయి. నాకు తెలుసు. ఆయనకు నేనంటే ఇష్టమే. తన హృదయంలో నాపై ప్రేమ ఉంది. అందుకే ఆయన నా పేరు రాశారు’ అన్నారు. నేను ఆటోలో.. సెక్యూరిటీ వారు వెనక కార్లో..! మోదీ ప్రధాని అయిన తరువాత తనకు ఏర్పాటు చేసిన భద్రత తనకు ఇబ్బందిగా మారిందని జశోదాబెన్ చెప్పారు. మే 30 నుంచి గుజరాత్ పోలీస్‌కు చెందిన ఐదుగురు అధికారులు ఆమెకు ఎస్కార్ట్‌గా వస్తున్నారు. జశోదాబెన్ ఆటోలో వెళ్తుంటే.. వారు వెనక కార్లో ఫాలో చేస్తుంటారు. ‘ఎక్కడికెళ్లినా వస్తున్నారు. చిరాగ్గా ఉంది’ అని ఆమె విసుక్కున్నారు. ఆర్టీఐకి దరఖాస్తు ప్రభుత్వం తనకు కల్పిస్తున్న భద్రత వివరాలను తెలపాల్సిందిగా జశోదాబెన్ సోమవారం సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ‘నేను ప్రధానమంత్రి భార్యను. ప్రొటోకాల్ ప్రకారం నాకందిస్తున్న సెక్యూరిటీ వివరాలను తెలపండి’ అని ఆమె కోరారు. ‘మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ఆమె సెక్యూరిటీ గార్డులే చంపేశారు. నాకిస్తున్న సెక్యూరిటీ విషయంలో నేను భయపడ్తున్నాను. నాకు సెక్యూరటీగా వస్తున్నవారి పూర్తి వివరాలు నాక్కావాలి’ అని ఆమె అందులో అభ్యర్థించారు. -
ఏ హోదా కింద భద్రత కల్పిస్తున్నారు: జశోదాబెన్
అహ్మదాబాద్: తనకు ఏ హోదా కింద భద్రతా ఏర్పాట్లు కల్పిస్తున్నారో తెలపాలంటూ ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోదీ భార్య జశోదాబెన్ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. భద్రతతో పాటు ప్రధాని భార్యకు ప్రోటోకాల్ ప్రకారం ఇంకా ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తారని ఆమె అడిగారు. తాను ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణిస్తుంటే, తన భద్రతా సిబ్బంది అధికార వాహనాలు వాడుతున్నారని తెలిపారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ బాడీగార్డుల చేతిలోనే హత్యకు గురైయ్యారని, తనచుట్టూ ఉన్న భద్రతా సిబ్బంది కారణంగా భయపడుతున్నానని దరఖాస్తులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనకు కేటాయించిన భద్రతా సిబ్బంది వివరాలు ఇవ్వాలని కోరారు. తన వివాహం గురించి నరేంద్ర మోదీ తొలిసారిగా ఈ ఏడాది ఏప్రిల్ లో అధికారికంగా వెల్లడిచేశారు. వడోదర నుంచి నామినేషన్ వేసినప్పుడు తన భార్య పేరు జశోదాబెన్ అని దరఖాస్తులో పేర్కొన్నారు. మోదీ ప్రధాని అయిన తర్వాత నుంచి జశోదాబెన్ కు 24 గంటలూ భద్రత కల్పిస్తున్నారు. -
మోడీ కోసం జశోదా బెన్ ప్రత్యేక ప్రార్థనలు
పలన్‌పూర్: ప్రధాని నరేంద్ర మోడీ కోసం ఆయన భార్య జశోదా బెన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మోడీ ఆయురారోగ్యాలతో నిండూ నూరేళ్లు జీవించి, విజయాలు సాధించాలని దేవుణ్ని కోరారు. శుక్రవారం గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా మగర్వాద గ్రామంలో వెలసిన వీరభద్ర మహారాజ్ ఆలయాన్ని జశోదా బెన్ సందర్శించారు. శ్రావణ మాసం సందర్భంగా వేలాది మంది ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు. 1980 ప్రాంతంలో ఇక్కడ టీచర్‌గా పనిచేశానని, అప్పట్లో ఈ ఆలయానికి తరచూ వెళ్లానని జశోదా బెన్ గుర్తు చేసుకున్నారు. ఇక్కడి నుంచి తాను బదిలీ అయ్యాక మళ్లీ రాలేదని, తన భర్త కోసం ప్రార్థనలు చేయడానికి ఇప్పుడు ప్రత్యేకంగా వచ్చానని బెన్ చెప్పారు. జశో్దా బెన్‌కు మోడీ దూరంగా ఉంటున్నా ఆమె భర్త కోసం పూజలు చేస్తుంటారు. -
యశోదాబెన్ కూడా ఎస్పీజీ భద్రత
భోపాల్: వాళ్లిద్దరూ దశాబ్దకాలంగా కలిసి ఉన్న దాఖలాలు లేవు. కాని కాబోయే దేశ ప్రధాని భార్య అనే హోదా మాత్రం ఆమెకు దక్కింది. ఆమె హోదాకు తగినట్టుగానే భద్రతను కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదంతా కాబోయే ప్రధాని నరేంద్రమోడీ భార్య యశోదా బెన్ భద్రత గురించి. మోడీకి ఇచ్చే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) భద్రతను యశోదాబెన్ కు ఇవ్వాలని కల్పించనున్నారు. ప్రధాని కుటుంబ సభ్యులకు ఎస్పీజీ భద్రతను కేటాయించాలనే నిబంధన ఉందని.. ఆ చట్ట ప్రకారమే మోడీ భార్యతోపాటు ఇతర సభ్యులకు ఎస్పీజీ భద్రతను కల్పిస్తున్నామని మధ్యప్రదేశ్ మాజీ పోలీస్ డైరెక్టరేట్ జనరల్ సుభాష్ చంద్ర పీటిఐకి వెల్లడించారు. మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ కు సుభాష్ చంద్ర సెక్యూరిటీ అధికారిగా సేవలందించారు. -
'ఆయన భార్యగా అంగీకరించారు.. చాలా సంతోషం'
కొత్త ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారానికి ఒకపక్క వేగంగా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. మరోవైపు ఆయన భార్య యశోదాబెన్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. తనను తొలిసారి భార్యగా అంగీకరించిన తర్వాత ఆయన అత్యున్నత పదవికి చేరుకున్నారని ఆమె అంటున్నారు. ఇది తనకు చాలా సంతోషకరమైన వార్త అని, ఆయన భార్య అయినందుకు గర్వపడుతున్నానని, ఆయనెప్పుడూ తలెత్తుకునే ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో ఆమె అన్నారు. సమయం వచ్చినప్పుడు ఆయన్ని కలవడానికి వెళ్తానని అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసేటప్పుడు మోడీ తనను భార్యగా అంగీకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన తనను గుర్తుపెట్టుకున్నారని, అందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇంతకు ముందు తన పేరు ఎప్పుడూ చెప్పకపోయినా, పెళ్లి కాలేదని మాత్రం అనలేదని.. అసలు తన గురించి చెడ్డగా ఏమీ మాట్లాడలేదని, అందుకే ఆయనంటే తనకు గౌరవమని యశోదాబెన్ అన్నారు. తానెన్నటికీ ఆయన భార్యగానే ఉండిపోతానని చెప్పారు. దేశానికి సేవ చేయడం కోసమే ఆయన కుటుంబాన్ని వదిలి వెళ్లారు తప్ప తామేమీ విడాకులు తీసుకోలేదని, విడిపోలేదని స్పష్టం చేశారు. బాల్య వివాహం చేసుకున్న నరేంద్రమోడీ.. యువకుడిగా ఉన్నప్పుడే ఇంటిని, కుటుంబాన్ని విడిచిపెట్టి తర్వాత ఆర్ఎస్ఎస్లో చేరారు. -
నరేంద్ర మోడీ 'వివాహ' వివాదం
ఢిల్లీ/చెన్నై/గాంధీ నగర్: గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ తనకు వివాహమైన విషయాన్ని ఇంతకాలం దాచిపెట్టిన అంశం వివాదానికి దారితీసింది. పలువురు ఈ విషయాన్ని ప్రశ్నిస్తున్నారు. మద్రాస్ హైకోర్టులో ఒకరు ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేస్తే, ఢిల్లీలో కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.వడోదరలో నామినేషన్ దాఖలు చేసే సమయంలో మోడీ మొదటిసారిగా తనకు పెళ్లైన విషయాన్ని బయట పెట్టారు. తన భార్య పేరు యశోదా బెన్ అని కూడా పేర్కొన్నారు. భార్య పేరును దాచిపెట్టిన నరేంద్రమోడీపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని కోరుతూ చెన్నైకి చెందిన వారాహి అనే జర్నలిస్ట్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. గుజరాత్లో ఇంతకు ముందు మోడీ తన నామినేషన్ పత్రాల్లో అవివాహితుడిగా పేర్కొని భార్య పేరును గోప్యంగా ఉంచారని వారాహి తన పిల్లో పేర్కొన్నారు. తాజా ఎన్నికల సమయంలో మాత్రమే తన కు 17 ఏళ్ల వయసులో యశోదాబెన్ అనే మహిళతో వివాహం అయ్యిందని పేర్కొన్నారని వారాహి కోర్టుకు తెలిపారు. ప్రజాప్రతినిధిగా వివరాలను దాచిపెట్టడం చట్టప్రకారం నేరం అవుతుందని పిటిషన్‌దారుడు వ్యాఖ్యానించారు. ఇవే అభియోగాలపై ఈ నెల 20న ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఇది ఎన్నికల సంఘం పరిధిలోని అంశంగా కోర్టు పేర్కొంది. ఇదిలా ఉండగా, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా అతని వివాహ అంశంపై తమకు ఫిర్యాదు అందిందని, అది తమ పరిశీలనలో ఉందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ విఎస్ సంపత్ గాంధీనగర్‌లో చెప్పారు. మోడీ తన అఫిడవిట్లో భార్యకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వలేదని వడోదరలో తన ప్రత్యర్థి మధుసూదన్ మిస్త్రీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. -
మోడీ భార్యకు జెడ్ కేటగిరి భద్రత కల్పించండి
భోపాల్: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ భార్య జశోదా బెన్‌కు జెడ్ కేటగిరి భద్రత కల్పించాలనే డిమాండ్ వినిపిస్తోంది. బీజేపీ గాక కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ డిమాండ్ రావడం విశేషం. ఉగ్రవాదులకు ఆమె లక్ష్యంగా మారే అవకాశముందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు అభయ్ దుబె, రవి సక్సేనా ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేకే ఈ మేరకు లేక రాశారు. చిన్న వయసులోనే జశోదా బెన్ను వివాహం చేసుకున్న మోడీ మూడేళ్లు మాత్రం కలిసున్నారు. ఆ తర్వాత వైవాహిక జీవితానికి పూర్తిగా దూరమై రాజకీయాల్లో నిమగ్నమైపోయారు. కాగా తన వైవాహిక జీవితంపై ఎన్ని విమర్శలు వచ్చినా స్పందించని మోడీ తాజా ఎన్నికల నామినేషన్లో తన భార్య పేరును ప్రస్తావించారు. దీంతో జశోదా జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. -
ఐనా... ఆయనే పీఎం కావాలి!
మోడీ భార్య యశోదాబెన్ పూజలు మెహ్సానా (గుజరాత్): వివాహం గురించి దాచిపెట్టి నరేంద్ర మోడీ ఒకవైపు రాజకీయ విమర్శనాస్త్రాలు ఎదుర్కొంటున్నా... దశాబ్దాలుగా దూరంగా ఉన్న భార్య యశోదాబెన్ మాత్రం ఆయనే ప్రధానమంత్రి పీఠమెక్కాలని పూజలు చేస్తున్నారట! అంతేకాదు ఆయనను ప్రధాని సీటులో చూసేంతవరకు అన్నం ముట్టుకోనని, కాళ్లకు చెప్పుల్లేసుకోనని ప్రతినబూనారట! తన కోరిక నెరవేరాలని బద్రినాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు ప్రస్తుతం ఆమె చార్ధామ్ యాత్రకు వెళ్లారట. గతంలో మోడీ సీఎం కావాలని ఆమె మనస్ఫూర్తిగా కోరుకున్నారని, ఇప్పుడు ప్రధాని కావాలని ఆశిస్తూ పూజలు చేస్తున్నారని యశోదాబెన్ సోదరుడు కమలేశ్ చెబుతున్నారు. ఆమెకు 17 ఏళ్ల వయసులో 1968లో మోడీతో వివాహమైం దని, వారు కలసి ఉన్నది స్వల్ప కాలమేనని చెప్పా రు. టీచర్‌గా ఉద్యోగ విరమణ చేసిన 62 ఏళ్ల యశోదాబెన్ మెహ్సానా జిల్లాలోని ఇశ్వార్వాడ అనే పల్లెటూర్లో ఇద్దరు సోదరులతో ఉంటున్నారు. -
నరేంద్ర మోడీది బాల్యవివాహం: వెంకయ్య నాయుడు
ఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ వైవాహిక జీవితంపై ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు స్పందించారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా కాకుండా, వ్యక్తి గత విషయాలపై దృష్టి పెట్టినట్లు కనబడుతోందన్నారు. మోడీ బాల్య వివాహం చేసుకున్నారని వెంకయ్య స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తన 10 ఏళ్ల పాలనపై చర్చించకుండా.. వ్యక్తిగత విషయాలపై మాట్లాడుతుందని వెంకయ్య విమర్శించారు. ఈ తరహా విధానమే కాంగ్రెస్ దివాలాకోరుతనానికి నిదర్శమన్నారు. తెలంగాణ ప్రాంతంలో మోడీ, సుష్మా స్వరాజ్ సభలను నిర్వహిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. టీడీపీతో తమ పార్టీ పెట్టుకున్న పొత్తుతో మంచి ఫలితాలు వస్తాయని వెంకయ్య తెలిపారు. దక్షిణ భారతదేశం నుంచి బీజేపీకి 50 సీట్లు వస్తాయని వెంకయ్య జోస్యం చెప్పారు. ఎలక్షన్ నామినేషన్ కాలమ్ లో యశోదాబెన్ ను తన భార్యగా మోడీ తొలిసారి పేర్కొనడంపై వివాదం రాజుకుంది. ఇప్పటి వరకూ ఆమె పేరును దాచి ఉంచిన మోడీ.. తాజాగా ఆమెను ఎందుకు తెరపైకి తెచ్చారని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. -
పెళ్లయింది.. భార్య పేరు యశోదా
*ఎన్నికల అఫిడవిట్లో తొలిసారి మోడీ ప్రకటన * ఆమె ఆస్తుల వివరాలపై మాత్రం సమాచారం లేదని వెల్లడి వడోదరా: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ (63) తన వైవాహిక స్థితిపై రాజకీయంగా జరుగుతున్న చర్చకు స్వయంగా తెరదించారు. గుజరాత్‌లోని వడోదర లోక్‌సభ స్థానానికి బుధవారం దాఖలు చేసిన నామినేషన్లో తాను వివాహితుడినని తొలిసారి ప్రకటించారు. తన భార్య పేరును యశోదాబెన్ (62)గా పేర్కొన్నారు. అయితే భార్య ఆస్తుల వివరాలను పేర్కొనాల్సిన చోట మాత్రం ‘నా వద్ద సమాచారం లేదు’ అని రాశారు. 2012 అసెంబ్లీ ఎన్నికలు సహా గతంలో సమర్పించిన అన్ని ఎన్నికల అఫిడవిట్లలో మోడీ తన వైవాహిక స్థితి గురించి వివరాలు పొందుపరచాల్సిన చోటును ఖాళీగా వదిలేసేవారు. మోడీ సమర్పించిన అఫిడవిట్‌ను వడోదరా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నోటీసు బోర్డులో పెట్టింది. కాంగ్రెస్ ఎదురుదాడి: మోడీ వైవాహిక స్థితి అంశం రాజకీయ రంగు పులుముకుంది. ఇప్పటివరకూ భార్య పేరును వెల్లడించకుండా తప్పుడు అఫిడవిట్లు సమర్పించిన మోడీ ఈ విషయమై వివరణ ఇవ్వాలని గోవాకు చెందిన కాంగ్రెస్ ఎంపీ శాంతారాం నాయక్ డిమాండ్ చేయగా ఓ మహిళను వెంటాడిన (మోడీ ఆదేశాల మేరకు గుజరాత్ పోలీసులు ఓ మహిళపై నిఘా పెట్టినట్లు వచ్చిన ఆరోపణలను ఉద్దేశించి), భార్య హక్కులను కాలరాసిన వ్యక్తిని దేశ మహిళలు నమ్మగలరా? అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ ట్విట్టర్లో విమర్శించారు. మరోవైపు భార్య ఆస్తుల వివరాలు సమర్పించనందుకు మోడీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసి కేసు నమోదు చేయాలని వడోదరా నుంచి ఆయనపై పోటీచేస్తున్న కాంగ్రెస్ నేత మధుసూదన్ మిస్త్రీ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినోద్ రావును కోరారు. అయితే ఓ కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఉదహరిస్తూ మిస్త్రీ అభ్యర్థనను కలెక్టర్ తిరస్కరించారు. ఆ పెళ్లి లాంఛనమే: మోడీ అన్నయ్య మోడీపై విమర్శల నేపథ్యంలో ఆయనకు సోదరులు సోమాభాయ్, ప్రహ్లాద్‌లు బాసటగా నిలిచారు. మోడీ వివాహాన్ని సుమారు 50 ఏళ్ల కిందట జరిగిన సామాజిక లాంఛనంగానే చూడాలని మోడీ పెద్దన్నయ్య సోమాభాయ్ కోరారు. పెద్దగా చదువుకోని తమ తల్లిదండ్రులు పేదరికం కారణంగా మోడీకి చిన్న వయసులోనే పెళ్లి చేశారన్నారు. స్వామి వివేకానంద, గౌతమ బుద్ధుని నుంచి స్ఫూర్తి పొందిన మోడీ...వసుదైక కుటుంబమనే సిద్ధాంతాన్ని నమ్మి పెళ్లయిన వెంటనే దేశ సేవ కోసం ఇంటిని, కుటుంబాన్ని విడిచిపెట్టి చిన్న వయసులోనే ఆర్ఎస్ఎస్కే జీవితాన్ని అంకితం చేశారన్నారు. మోడీ నాటి నుంచి కుటుంబానికి దూరంగా ఉన్నారని, టీచర్‌గా పనిచేసి రిటైరైన యశోదాబెన్ ప్రస్తుతం తండ్రి వద్దే ఉంటున్నారన్నారు. మోడీ ఆస్తులు రూ. 1.51 కోట్లు: అఫిడవిట్లో మోడీ తన ఆస్తులను రూ. 1.51 కోట్లుగా చూపారు. తనకు సొంత వాహనం లేదని, గత రెండేళ్లలో ఆభరణాలేవీ కొనుగోలు చెయ్యలేదని పే ర్కొన్నారు. తనకు రాజధాని గాంధీనగర్‌లో రూ. కోటి విలువైన ఇల్లు, రూ.51,57,582 విలువైన చరాస్తులు ఉన్నాయన్నారు. తన వద్ద రూ. 29,700 నగదు, రూ. 1.35 లక్షల విలువైన 4 ఉంగరాలు ఉన్నట్లు అఫిడవిట్లో చూపారు. 2012-13కు దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్‌లో ఆదాయాన్ని రూ. 4,54,094గా చూపారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ తన ఆస్తులను రూ. 1.33 కోట్లుగా పేర్కొన్నారు. -
'మోడీ పెళ్లి 50 ఏళ్ల కిందటి ఓ సామాజిక లాంఛనం'
డోదరా: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ (63) వివాహాన్ని సుమారు 50 ఏళ్ల కిందట జరిగిన ఒక సామాజిక లాంఛనంగానే చూడాలని మోడీ పెద్దన్నయ్య సోమాభాయ్ ఓ ప్రకటనలో కోరారు. గుజరాత్‌లోని వడోదరా లోక్‌సభ స్థానానికి బుధవారం దాఖలు చేసిన నామినేషన్లో తాను వివాహితుడినని నరేంద్ర మోడీ తొలిసారి ప్రకటించిన విషయం తెలిసిందే. తన భార్య పేరును జశోదాబెన్ (62)గా కూడా ఆయన పేర్కొన్నారు. తన వైవాహిక స్థితిపై రాజకీయంగా జరుగుతున్న చర్చకు మోడీ స్వయంగా తెరదించారు. నరేంద్ర మోడీపై కాంగ్రెస్ విమర్శల నేపథ్యంలో ఆయనకు సోదరులు సోమాభాయ్, ప్రహ్లాద్‌లు బాసటగా నిలిచారు. పెద్దగా చదువుకోని తమ తల్లిదండ్రులు పేదరికం కారణంగా మోడీకి చిన్న వయసులోనే పెళ్లి చేశారని పెద్దన్నయ్య సోమాభాయ్ పేర్కొన్నారు. స్వామి వివేకానంద, గౌతమ బుద్ధుని నుంచి స్ఫూర్తి పొందిన మోడీ...వసుదైక కుటుంబమనే సిద్ధాంతాన్ని నమ్మి దేశ సేవ కోసం ఇంటిని, కుటుంబాన్ని విడిచిపెట్టి చిన్న వయసులోనే ఆర్ఎస్ఎస్కే జీవితాన్ని అంకితం చేశారన్నారు. నాటి నుంచి మోడీ కుటుంబానికి దూరంగా ఉన్నారని తెలిపారు. జశోదాబెన్ కూడా టీచర్‌గా పనిచేసి రిటైరయ్యారని, ప్రస్తుతం ఆమె తన తండ్రి వద్దే ఉంటున్నారని వివరించారు. మరో సోదరుడు ప్రహ్లాద్ మాట్లాడుతూ మోడీ ఎప్పుడూ పెళ్లయిన విషయాన్ని దాచలేదన్నారు. -
భార్య పేరును మోడీ ఎందుకు దాస్తున్నారు?
న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఇప్పటి వరకు రాజకీయ దాడి చేసిన దిగ్విజయ్ .. ‘నీ భార్య పేరును ఎందుకు దాస్తున్నారు’ అంటూ మోడీని పశ్నించారు. మోడీ భార్య పేరు యశోదా బెన్ . ఆమె ఇప్పుడు సాధారణ మహిళగా తన జీవితాన్నిఅద్దె ఇంటిలోని సాగిస్తుందని దిగ్విజయ్ తెలిపారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆమెకు కనీసం బంగ్లాలో ఉండేందుకు ఏర్పాట్లు ఎందుకు చేయలేదన్నారు. ఆమె వివరాలు చెప్పకుండా ఎందుకు గోప్యత పాటిస్తున్నారని విమర్శించారు. 'మహిళలంటే కనీస గౌరవం మీ హృదయంలో ఉంటే ఎన్నికల దరఖాస్తులో భార్య పేరును ఎందుకు పూరించలేదన్నారు. ఈ అంశానికి సంబంధించి మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. ఆమెను ఎందుకు దాచిపెడుతున్నారని చెప్పాలన్నారు. జశోదా బెన్ ను మోడీ పెళ్లి చేసుకున్నారా లేదా? అలా అయితే విడాకులిచ్చారా? ఆమెతో ఎందుకు కలిసి ఉండట్లేదు ? తన వైవాహిక స్థితిని ఆయన ఎందుకు ప్రకటించలేదని దిగ్విజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు.