ఐనా... ఆయనే పీఎం కావాలి! | Jashodaben, named by Narendra Modi as his wife, prays for him to become PM | Sakshi
Sakshi News home page

ఐనా... ఆయనే పీఎం కావాలి!

Published Sat, Apr 12 2014 1:45 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

ఐనా... ఆయనే పీఎం కావాలి! - Sakshi

ఐనా... ఆయనే పీఎం కావాలి!

మోడీ భార్య యశోదాబెన్ పూజలు
 మెహ్సానా (గుజరాత్): వివాహం గురించి దాచిపెట్టి నరేంద్ర మోడీ ఒకవైపు రాజకీయ విమర్శనాస్త్రాలు ఎదుర్కొంటున్నా... దశాబ్దాలుగా దూరంగా ఉన్న భార్య యశోదాబెన్ మాత్రం ఆయనే ప్రధానమంత్రి పీఠమెక్కాలని పూజలు చేస్తున్నారట! అంతేకాదు ఆయనను ప్రధాని సీటులో చూసేంతవరకు అన్నం ముట్టుకోనని, కాళ్లకు చెప్పుల్లేసుకోనని ప్రతినబూనారట! తన కోరిక నెరవేరాలని బద్రినాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు ప్రస్తుతం ఆమె చార్‌ధామ్ యాత్రకు వెళ్లారట. గతంలో మోడీ సీఎం కావాలని ఆమె మనస్ఫూర్తిగా కోరుకున్నారని, ఇప్పుడు ప్రధాని కావాలని ఆశిస్తూ పూజలు చేస్తున్నారని యశోదాబెన్ సోదరుడు కమలేశ్ చెబుతున్నారు.
 
 ఆమెకు 17 ఏళ్ల వయసులో 1968లో మోడీతో వివాహమైం దని, వారు కలసి ఉన్నది స్వల్ప కాలమేనని చెప్పా రు. టీచర్‌గా ఉద్యోగ విరమణ చేసిన 62 ఏళ్ల యశోదాబెన్ మెహ్సానా జిల్లాలోని ఇశ్వార్‌వాడ అనే పల్లెటూర్లో ఇద్దరు సోదరులతో ఉంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement