lok sabha election 2014
-
సుప్రియపై భార్యను నిలబెట్టి తప్పు చేశా: అజిత్ పవార్
ముంబై: కుటంబాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలను ఇంటి వరకు రానివ్వకూడదని ఆయన అన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బారామతి స్థానం నుంచి తన భార్యను, సోదరి సుప్రియా సులేకు వ్యతిరేకంగా నెలబెట్టి తప్పు చేశానని పేర్కొన్నారు,.రాష్ట్రవ్యాప్తంగా 'జన్ సమ్మాన్ యాత్ర' చేపట్టిన ఉన్న అజిత్ పవార్ ఒక మరాఠీ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో సునేత్రాను(అజిత్ భార్య) పోటీ చేయించాలనే నిర్ణయం ఎన్సీపీ పార్లమెంటరీ బోర్డు తీసుకున్న నిర్ణయమని అన్నారు."నేను నా సోదరీమణులందరినీ ప్రేమిస్తాను. రాజకీయాలను ఇంట్లో వరకు రానివ్వకూడదు. నా సోదరిపై సునేత్రను పోటీకి దింపి నేను తప్పు చేశాను. ఇది జరిగి ఉండకూడదు. కానీ పార్లమెంటరీ బోర్డు (ఎన్సీపీ) ఈ నిర్ణయం తీసుకుంది. అది తప్పు అని ఇప్పుడు నేను భావిస్తున్నాను’ అని అజిత్ పవార్ అన్నారు.కాగా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ పవార్ భార్య సునేత్రపై సుప్రియా సూలే 1.5 లక్షల ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. బారామతి స్థానం నుంచి వరుసగా నాలుగోసారి ఆమె గెలుపొందారు. సుప్రియా సూలే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె. ఇదిలా ఉండగా ఎంపీ ఎన్నికల్లో ఓటమి తర్వాతత సునేత్ర పవార్ జూన్ 18న రాజ్యసభకు ఎన్నికయ్యారు. -
కౌంటింగ్ రోజున మద్యం షాపులు బంద్: సీఈవో వికాస్‌రాజ్
సాక్షి, హైదరాబాద్: కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలులో ఉంటుందని.. ఈసీ రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్ రాజ్ హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఈసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు.కౌంటింగ్ రోజున మద్యం షాపులు బంద్ అవుతాయన్నారు. తెలంగాణలో కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సీఈవో తెలిపారు. జూన్ 4న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని సీఈవో వెల్లడించారు.34 కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతుందని.. 120 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశామన్నారు. పోస్టల్ బ్యాలెట్ కోసం 19 కౌంటింగ్ హాల్స్ సిద్ధం చేశామన్నారు. 12 కేంద్ర బలగాలతో కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని సీఈవో పేర్కొన్నారు. -
మోదీ వేవ్ ఉంది.. నా గెలుపు ఆపలేరు: కంగనా రనౌత్
దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ఎన్నికల్లో భాగంగా ఆఖరి విడత పోలింగ్ శనివారం ఉదయం నుంచే ప్రారంభమైంది. కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్‌తో పాటు బిహార్, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతుంది.హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ నుంచి బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ బీజేపీ అభ్యర్థిగా తొలిసారి ఎన్నికల బరిలో దిగారు. తాజాగా ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశ ప్రజలు అందరూ తమ ఓటు హక్కును తప్పకుండా ఉపయోగించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఓటు వేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. హిమాచల్ ప్రదేశ్‌లో ప్రధాని మోదీ వేవ్ ఉందని ఆమె అన్నారు. మండీ ప్రజలు తప్పకుండా తనను గెలిపించడమే కాకుండా రాష్ట్రంలో ఉన్న 4 ఎంపీ స్థానాల్లో బీజేపీనే గెలిపిస్తారని ఆమె అభిప్రాయపడ్డారు. మండిలో బలమైన అభ్యర్థితో కంగనా పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరు సార్లు ముఖ్యమంత్రిగా కొనసాగిన వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్‌తో ఆమె పోటీ పడుతున్నారు. రాజకుటుంబంలో జన్మించిన విక్రమాదిత్య కూడా ప్రస్తుతం క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు.#WATCH | Himachal Pradesh: BJP candidate from Mandi Lok Sabha, Kangana Ranaut says "I have cast my vote right now. I want to appeal to the people to take part in the festival of democracy and exercise their right to vote. PM Modi's wave is there in Himachal Pradesh...I am hopeful… pic.twitter.com/aBv0zVNyFM— ANI (@ANI) June 1, 2024 -
జూన్ 4న సినిమా థియేటర్లలో ఎన్నికల ఫలితాలు
దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ఎన్నికల్లో భాగంగా ఆఖరి విడత పోలింగ్ శనివారం జరుగనుంది. కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్‌తో పాటు బిహార్, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. ఇక అందరి దృష్టి ఎన్నికల ఫలితాలపైనే ఉంది.జూన్ 4న ఓట్ల లెక్కింపుపై అందరి దృష్టి ఉంది. ఈ క్రమంలో జూన్ 1న సాయంత్రం పలు న్యూస్ చానెళ్లు కూడా ఎగ్జిట్ పోల్స్ పేరుతో గణాంకాలను విడుదల చేయనున్నాయి. ఈ తతంగం ముగిసిన తర్వాత జూన్ 4న ఫలితాలు కోసం యావత్ దేశం టీవీలు, ఫోన్లకు అతుక్కుపోతుంది. అయితే, ఎన్నికల ఫలితాలు లైవ్‌లోనే బిగ్ స్క్రీన్‌పై ప్రసారమైతే..? ఆ అనుభూతి ఎలా ఉంటుంది..? ఇప్పుడు మహారాష్ట్రలోని కొన్ని సినిమా థియేటర్లు ఈ ప్లాన్‌నే అమలు చేయబోతున్నాయి. ముంబైలో ఎస్ఎం 5 కళ్యాణ్, సియాన్,నాగ్‌పుర్‌లోని మూవీమ్యాక్స్ ఎటర్నిటీ, కంజూర్‌మార్గ్‌లోని మూవీమ్యాక్స్, థానేలోని ఎటర్నిటీ మాల్, వండర్ మాల్,పుణెలోని మూవీమ్యాక్స్, మీరా రోడ్ ప్రాంతంలోని మూవీమాక్స్ చైన్ ఆఫ్ థియేటర్లు జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలను ప్రదర్శిస్తాయి. ఇందుకోసం ఇప్పటికే ఆన్లైన్లో టికెట్ల విక్రయాలు కూడా జరిగిపోయాయి. ఉదయం 9గంటల నుంచి ఆ థియేటర్లలోకి అనుమతిస్తారు. సుమారు 6గంటల పాటు థియేటర్లో ఎన్నికల ఫలితాలను ప్రదర్శిస్తారు. టికెట్ ధర రూ. 99 నుంచి రూ. 300 వరకు ఉంటుంది. బిగ్ స్క్రీన్‌పై ఎన్నికల ఫలితాలు చూడాలని ఆశించేవారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది. దీంతో చాలా థియేటర్లు హౌస్‌ఫుల్ అయిపోయాయి. -
Lok Sabha Election 2024: సిట్టింగ్ సీట్లలో గట్టి పోటీ
ఆరో విడతలో భాగంగా జార్ఖండ్‌లో 4 లోక్‌సభ స్థానాలకు శనివారం పోలింగ్ జరగనుంది. ఇవన్నీ ఎన్డీఏ సిట్టింగ్ స్థానాలే కావడం విశేషం. మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్ బీజేపీ ప్రతీకార రాజకీయాలకు నిదర్శనమంటూ జేఎంఎం ప్రచారంలో హోరెత్తిస్తోంది. బీజేపీకి మద్దతుగా నిలుస్తున్న ఆదివాసీలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయతి్నస్తోంది. ఆరో విడత స్థానాలపై ఫోకస్... ధన్‌బాద్ బొగ్గు గనుల స్థావరం. ఇక్కడి ఓటర్లలో 62 శాతం పట్టణవాసులే. ఎస్సీలు 16 శాతం, ఎస్టీలు 8 శాతముంటారు. యూపీ, బిహార్, పశి్చమబెంగాల్ నుంచి వలస వచ్చినవారు ఎక్కువ. 2009 నుంచి బీజేపీ కంచుకోటగా ఉంది. హ్యాట్రిక్ కొట్టిన సిట్టింగ్ ఎంపీ పశుపతినాథ్ పోటీకి దూరంగా ఉండటంతో ఎమ్మెల్యే దుల్లు మహతోకు బీజేపీ టికెటిచి్చంది. కాంగ్రెస్ నుంచి అనుపమా సింగ్ పోటీ పడుతున్నారు. వీరిపై రెండు పారీ్టల్లోనూ అసంతృప్తే ఉంది. బీఎస్పీ, సమతా, ఆజాద్ సమాజ్, సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా వంటి పారీ్టలు, స్వతంత్రులు... ఇలా మరో డజను మంది బరిలో ఉన్నారు.జంషెడ్పూర్ దీన్ని టాటా నగర్, స్టీల్ సిటీ అని కూడా పిలుస్తారు. టాటా స్టీల్ అతిపెద్ద ప్లాంట్ ఇక్కడ ఉంది. బీజేపీ సిట్టింగ్ ఎంపీ బిద్యుత్ బరణ్ మహతో హాట్రిక్‌పై కన్నేశారు. 2019లో ప్రస్తుత సీఎం చంపయ్ సోరెన్‌పై 3 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారాయన. మాజీ ఎమ్మెల్యే కునాల్ సారంగికి టికెటివ్వకపోవడం ఒడిశావాసుల ఓట్లపై ప్రభావం చూపేలా ఉంది. కాకపోతే కురి్మ–మహతో ఓటర్లు 3 లక్షలకు పైగా ఉండటం మహతోకి కలిసొచ్చే అంశం. 27 శాతమున్న ఆదివాసీలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జేఎంఎం నుంచి సమీర్‌కుమార్ మొహంతీ బరిలో ఉన్నారు.రాంచీ సిట్టింగ్ ఎంపీ సంజయ్ సేత్‌ను కాదని 2014లో గెలిచిన రామ్ తహాల్ చౌదరికి బీజేపీ ఈసారి టికెటిచ్చింది. కాంగ్రెస్ నుంచి కేంద్ర మాజీ మంత్రి సు¿ోద్కాంత్ సహాయ్ కుమార్తె, ప్రముఖ న్యాయవాది. యశస్వి పోటీ చేస్తున్నారు. తండ్రి ప్రాతినిధ్యం వహించిన స్థానం కావడం ఆమెకు కలిసొచ్చే అంశం. అయితే ఎంపీగా సంజయ్ పనితీరుపై ఏకంగా 73 శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినట్టు గతేడాది ఓ సర్వేలో తెలిసింది. రాష్ట్రంలో బీజేపీకి ఆయన బలమైన గళంగా నిలుస్తున్నారు.గిరిధ్ బీజేపీకి బలమైన స్థానమిది. పొత్తులో భాగంగా ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ)కు విడిచిపెట్టింది. ఏజేఎస్‌యూ సిట్టింగ్ ఎంపీ చంద్రప్రకాశ్ చౌదరి మరోసారి పోటీ చేస్తున్నారు. జేఎంఎం నుంచి మధుర ప్రసాద్ మహతో బరిలో ఉన్నారు. వీరిద్దరికీ స్వతంత్ర అభ్యర్థి జైరాం కుమార్ మహతో గట్టి సవాల్ విసురుతున్నారు. ముగ్గురు నేతలూ కుర్మి సామాజికవర్గీయులే. టైగర్ జైరాంగా పిలిచే జైరాం ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజల మంచి స్పందన కూడా వస్తోంది. దీంతో పోటీ ఆసక్తికరంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎన్నికల ప్రచారం ఎంత కష్టమో తెలిసింది: కంగనా రనౌత్
లోక్‌సభ ఎన్నికల బరిలో హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ నుంచి బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తొలిసారి ఎన్నికల బరిలో దిగారు. వాస్తవంగా బీజేపీలో చేరకముందే ఆమె టికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆమె రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఏడో దశ ఎన్నికల్లో భాగంగా మండిలో జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఆమెకు పోటీగా కాంగ్రెస్ నుంచి విక్రమాదిత్యసింగ్ బరిలో నిలిచారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె తాజాగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల రణరంగంలోకి దిగిన తర్వాత ఎంత కష్టమో తనకు తెలిసిందని ఆమె చెప్పింది. ఎన్నికల ప్రచారం కోసం తను పడుతున్న కష్టం ముందు సినిమా కష్టాలు చాలా చిన్నవని కంగనా పేర్కొంది.ఎన్నికల యుద్ధం ప్రారంభం నుంచి వరుసగా ప్రజా సభలతో పాటు పార్టీ కార్యకర్తలతో అనేక సమావేశాలు నిర్వహించినట్లు ఆమె అన్నారు. ఈ క్రమంలో పర్వత ప్రాంతాల్లో చాలా కష్టమైన రహదారులపై ఒక్క రోజే 450 కిలోమీటర్ల మేరకు ప్రయాణం చేసినట్లు కంగనా తెలిపారు. ఎన్నికల ప్రచారం వల్ల సరిగ్గా నిద్రకు కూడా సమయం దొరకడం లేదని ఆమె చెప్పారు. కనీసం సమయానికి భోజనం కూడా తీసుకోవడంలేదని అన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఈ పోరాటం ముందు సినిమా నిర్మించడానికి పడే కష్టాలు ఓ జోక్ లాంటివేనని కంగన చెప్పడం విశేషం. కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం 'ఎమర్జెన్సీ'. జూన్ 14న విడుదల కావాల్సిన ఈ సినిమా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేసిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) -
Lok sabha elections 2024: సామాన్యుడిలా క్యూలో నిలబడి ఓటేసిన సినీ స్టార్స్
లోక్ సభ నియోజకవర్గాలలో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అలాగే ఏపీలో 25 ఎంపీ, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ మొదలైంది. ఉదయం ఏడు గంటల నుంచే సామాన్య ప్రజలతో పాటుగా పలువురు సీనీ సెలబ్రిటీలు కూడా తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ ఉదయం 7 గంటలకే భార్య ప్రణతి, తల్లితో కలిసి ఓటింగ్‌లో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్‌లోని ఓబుల్ రెడ్డి స్కూల్ పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి క్యూలైన్ లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. జూబ్లీహిల్స్‌లోని బీఎస్ఎన్ఎల్ సెంటర్‌కు ఉదయం 7.30 గంటలకే వచ్చిన బన్నీ.. అందరితో పాటు క్యూలో నిలబడి తన వంతు రాగానే ఓటు వేశాడు. అనంతరం మాట్లాడుతూ..ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. #WATCH | Telangana: Actor Jr NTR arrives at a polling booth in Jubilee Hills, Hyderabad to cast his vote. #LokSabhaElections2024 pic.twitter.com/irFIjHVGVq— ANI (@ANI) May 13, 2024 #WATCH | Telangana: Actor Allu Arjun casts his vote at a polling booth in Jubilee Hills, Hyderabad. #LokSabhaElections2024 pic.twitter.com/M0yhR7XLeP— ANI (@ANI) May 13, 2024 మెగాస్టార్ చిరంజీవి కూడా తన భార్య సురేఖ, కూతురితో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ క్లబ్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. Actor and former Union Minister K Chiranjeevi along with his wife surekha and daughter stand in the queue to cast their vote at Jubilee hills club in Hyderabad #Chiranjeevi @TOIHyderabad #ElectionDay #Hyderabad pic.twitter.com/V0tSJd4wu3— Sudhakar Udumula (@sudhakarudumula) May 13, 2024 'ఆర్ఆర్ఆర్', 'బాహుబలి' సినిమాల దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, భార్య రమా రాజమౌళి, కొడుకు కార్తికేయతో కలిసి హైదరాబాద్ లోని షేక్ పేటలో తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు. ఓటేసిన మహేశ్‌బాబు, రామ్‌చరణ్.Flew from Dubai… Rushed to the polling booth directly from the airport, hence the tired looks..🙂Done! YOU? pic.twitter.com/kQUwa1ADG6— rajamouli ss (@ssrajamouli) May 13, 2024 ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లోని ఎఫ్ఎన్సీసీ పోలింగ్ బూత్‌లో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేశారు. ఎఫ్ ఎన్ సిసి లో ఓటు వేసిన దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారు, కుటుంబ సభ్యులు.. #KRaghavendraRao #ElectionDay pic.twitter.com/OydpOtOBmj— Vamsi Kaka (@vamsikaka) May 13, 2024 హైదరాబాద్ లోని ఎఫ్ఎన్ సీసీలో ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. వయసు సమస్యల కారణంగా మరో వ్యక్తి సాయంతో పోలింగ్ బూత్ లోకి వచ్చారు.Senior Versatile actor #KotaSrinivasaRao garu to cast his vote at FNCC pic.twitter.com/VOTzqZJg7W— Telugu Film Producers Council (@tfpcin) May 13, 2024టాలీవుడ్ నటులు మోహన్ బాబు, అతడి కొడుకు మంచు విష్ణు.. తిరుపతి జిల్లాలోని ఏ. రంగంపేటలో తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు.Actor @chay_akkineni cast their vote 🗳️ #Elections2024 #NagaChaitanya pic.twitter.com/wS51UCYnGr— Suresh PRO (@SureshPRO_) May 13, 2024#ManchuManoj exercised his right to vote @HeroManoj1#Elections2024 #LokSabhaElections2024 pic.twitter.com/gX0ciNPiB6— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) May 13, 2024పద్మారావు నగర్ వాకర్స్ టౌన్ హాల్ లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల pic.twitter.com/hgI4v69IhW— Telugu Film Producers Council (@tfpcin) May 13, 2024 -
రాహుల్ పోటీ చేస్తున్న రాయ్‌బరేలీలో ఏం జరుగుతోంది?
దేశంలో ఎక్కడకు వెళ్లినా ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన చర్చలే వినిపిస్తున్నాయి. వీటిలో యూపీలోని రాయ్‌బరేలీ స్థానం పలువురి నోళ్లలో నానుతోంది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని సోనియా గాంధీ ప్రకటించినప్పటి నుంచి ఆమె ప్రాతినిధ్యం వహించిన రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం భవితవ్యంపై చర్చలు మొదలయ్యాయి.కాంగ్రెస్ అధిష్ఠానం పలు దఫాలుగా చర్చలు నిర్వహించిన దరిమిలా పార్టీ రాహుల్ గాంధీని రాయ్ బరేలీ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో రాయ్‌బరేలీలోని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. ప్రస్తుతం ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పార్టీ వ్యూహకర్తల బృందం కాంగ్రెస్‌కు అనుకూలంగా అక్కడి వాతావరణాన్ని సృష్టించే పనిలో బిజీగా ఉంది.గత ఎన్నికల్లో అమేథీ విజయం తర్వాత రాయ్‌బరేలీపై కన్నేసిన బీజేపీ ఈ స్థానంలోనూ విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తోంది. అయితే గాంధీ కుటుంబ వారసత్వానికి కంచుకోటగా నిలిచిన ఈ సీటును దక్కించుకోవడం బీజేపీకి సవాల్‌గా మారింది.గత లోక్‌సభ ఎన్నికల్లో అమేథీని కోల్పోయి, రాయబరేలీకి మాత్రమే పరిమితమైన కాంగ్రెస్‌కు ఇప్పుడు ఈ స్థానాన్ని కాపాడుకోవడం ప్రతిష్టాత్మకంగా మారింది. అందుకే రాయ్ బరేలీ స్థానం నుంచి రాహుల్ గాంధీని పోటీకి దింపాలని కాంగ్రెస్ అధిష్టానం చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం కాంగ్రెస్ పోటీ చేస్తున్న రాష్ట్రంలోని ఇతర 16 స్థానాలపై ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ నేతలు భావించి ఉంటారని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాయ్‌బరేలీలో బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్‌పై రాహుల్ గాంధీ పోటీకి దిగారు.2009 నుంచి సమాజ్‌వాదీ పార్టీ రాయ్‌బరేలీ స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో తమ అభ్యర్థిని నిలబెట్టలేదు. ఈసారి కాంగ్రెస్, ఎస్పీ మధ్య పొత్తు ఉంది. పలువురు ఎస్పీ నేతలు తమ పార్టీ జెండాలు చేతపట్టుకుని కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని పూర్తి సహకారం అందించారు. కాగా రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గంలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మే 20న ఐదవ దశలో రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరగున్నాయి. -
పాతాళంలో దాక్కున్నా మిమ్మల్ని వదలం.. అమిత్ షా హెచ్చరిక
పాతాళంలో దాక్కున్నా సందేశ్ ఖాలీ దోషుల్ని వదలి పెట్టేది లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్ నదియా జిల్లాలోని రణఘాట్ లోక్‌సభ స్థానంలోని మజ్డియాలో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి అమిత్ షా మాట్లాడారు.సందేశ్‌ఖాలీ అంశంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎందుకు మౌనం వహిస్తున్నారని అమిత్ షా ప్రశ్నించారు. బీజేపీ అలా కాదు. ఒక్క దోషిని వదిలిపెట్టదు. వారిని తలక్రిందులుగా వేలాడదీస్తోందన్నారు. నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని సందేశ్‌ఖాలీలో టీఎంసీ నేతలపై వస్తున్న ఆరోపణలపై అమిత్ షా మాట్లాడుతూ.. మమతా బెనర్జీ, మహిళా ముఖ్యమంత్రి అయినప్పటికీ, దోషులను రక్షించడానికి ప్రయత్నించడం సిగ్గుచేటు అని అన్నారు.సందేశ్‌ఖాలీలో టీఎంసీ నేతలు వందలాది మంది అక్కాచెల్లెళ్లను మతం ఆధారంగా చిత్రహింసలకు గురిచేశారు . సందేశ్‌ఖలీ నేరస్థులను అరెస్టు చేసేందుకు మమతా దీదీ సిద్ధంగా లేరు. హైకోర్టు ఆదేశాల తర్వాత కూడా విచారణ జరగకపోవడంతో హైకోర్టు విచారణను సీబీఐకి అప్పగించిందని తెలిపారు. సందేశ్‌ఖాలీలో అఘాయిత్యాలకు పాల్పడిన వారెవరైనా.. పాతాళంలో దాక్కున్నా.. కనిపెట్టి జైల్లో పెడతాం.. ఈ దోషులను బీజేపీ శిక్షిస్తుందని అమిత్ షా పునరుద్ఘాటించారు. -
ఢిల్లీకి ఏటీఎంగా మార్చేశారు.. కాంగ్రెస్‌పై అమిత్ షా ఫైర్
సాక్షి, సిద్దిపేట: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిందని.. ఢిల్లీకి ఏటీఎంగా మార్చేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్దతుగా సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ‘బీజేపీ విశాల జన సభ’ నిర్వహించారు.అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశవ్యాప్తంగా 400కుపైగా స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని.. తెలంగాణలో 12 సీట్లను గెలవబోతున్నామని అన్నారు. గత పదేళ్లలో దేశం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను ప్రధాని మోదీ పరిష్కరించారని చెప్పారు. జమ్ము కశ్మీర్లో 370 ఆర్టికల్‌ను రద్దు చేసి.. 70 ఏళ్ల సమస్యను పరిష్కరించామన్నారు. కశ్మీర్‌ను భారత్‌లో శాశ్వతంగా అంతర్భాగం చేశామన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మించడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు మజ్లిస్ అంటే భయం మజ్లిస్‌కు భయపడటం వల్లే బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు తెలంగాణ విమోచన దినోత్సవానికి దూరంగా ఉన్నాయని అమిత్ షా విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని, అవి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు నిండా అవినీతిలో మునిగిపోయారని ఆరోపించారు. మోదీని మూడో సారి ప్రధాన మంత్రిని చేస్తే అవినీతిని పూర్తిగా అంతం చేస్తామని చెప్పారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా చెప్పారు. ఆ స్థానంలో ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు తెస్తామని ప్రకటించారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. మెదక్ ఎంపీ స్థానంలో బీజేపీ కమలం పువ్వును వికసింపజేయాలని, ఎంపీగా రఘునందన్‌రావును భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ది నయవంచన: రఘునందన్‌రావు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోవడం నయవంచనేనని బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే నయవంచనకు పర్యాయపదమని విమర్శించారు. మోదీ అంటే గ్యారంటీ అని.. విశ్వసనీయమైన నాయకుడంటే మోదీయేనని పేర్కొన్నారు. సిద్దిపేట సభలో మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సహరా ఇండియా బాధితుల నిరసన సహరా ఇండియా సంస్థలో డిపాజిట్ చేసిన డబ్బులు వెనక్కి రాక ఇబ్బంది పడుతున్న వరంగల్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకు చెందిన బాధితులు అమిత్ షా సభలో నిరసన తెలిపారు. తమకు డబ్బు చెల్లించాలని, న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే పోలీసులు వారిని సభ నుంచి బయటికి పంపించారు. -
‘అవును.. ఆ రెండు పార్టీలను చీల్చే మేం అధికారంలోకి వచ్చాం’
సాక్షి,ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన 2019 అసెంబ్లీ ఎన్నికల ప్రచార స్లోగన్ ‘ఐ విల్ బి బ్యాక్’ గురించి ప్రస్తావించారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఓ పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న దేవేంద్ర ఫడ్నవీస్ రచయిత ప్రియమ్ గాంధీ-మోదీతో 2019 ఎన్నికల గురించి మాట్లాడారు. తాను ఐ విల్ బి బ్యాక్ అంటూ ఎన్నికల ప్రచారంతో హోరెత్తిచ్చాను. రెండోసారి అధికారంలోకి వస్తామని భావించాం. కానీ అది సాధ్యపడలేదు. మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఆ కూటమిని చీల్చి అధికారంలోకి వచ్చాం. ఇదంతా చేయడానికి రెండున్నరేళ్లు పట్టిందని అన్నారు. అదే ఎన్నికల్లో ‘బీజేపీ గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలుచుకుంది.శివసేన (2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఉద్ధవ్ ఠాక్రే మాకు ద్రోహం చేశారు. ఫలితంగా మేం ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది’ అని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. రాజకీయ పరిణామాలతో ఆ ఎన్నికల్లో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు మహా వికాస్ అఘాడీ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సీఎంగా ఉద్దవ్ ఠాక్రే ఎంపికయ్యారు. అయితే, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో మహా వికాస్ అఘాడీ కూటమి కుప్పకూలింది. ఆ తర్వాత బీజేపీ, శివసేనలోని ఏక్నాథ్ షిండే వర్గం, ఎన్సీపీలోని అజిత్ పవార్ వర్గాలు ఒక్కటై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం ఆ కూటమిలో మహరాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలుగా దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లు కొనసాగుతున్నారు. -
రేపు బీజేపీ తొలి జాబితా
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల కా నుంది. కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదముద్ర పడడంతో మార్చి 3న తొ లి జాబితాను బీజేపీ కేంద్ర కార్యాలయం అధికారికంగా విడుదల చే యనుంది. గురువారం రాత్రి 10:50 గంటలకు ప్రారంభమైన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం సుమారు నాలుగు గంటల పాటు జరిగింది. తెలంగాణ సహా ఇతర రాష్ట్ర నాయకత్వాలు తయారు చేసిన అభ్యర్థుల జాబితాలపై ఆయా రాష్ట్రాల కోర్ కమిటీ సభ్యులతో విడి విడిగా భేటీ అయి కూలంకషంగా చర్చించింది. అందులో భాగంగా తె లంగాణకు సంబంధించి ఆరు స్థానాలకు అభ్యర్థులపై సీఈసీ ఏక గ్రీ వంగా ఆమోదముద్ర వేసిందని సమాచారం. సిట్టింగ్ స్థానాల్లో సికింద్రాబాద్ నుంచి జి.కిషన్‌రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజా మాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్‌లు మరోసారి బరిలో దిగేందుకు గ్రీ న్ సిగ్నల్ ఇచ్చారు. ఇక భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నాగర్‌కర్నూల్ నుంచి పోతుగంటి భరత్‌ల అభ్యర్థిత్వాలపై కూడా సీఈసీ ఆమోదముద్ర వేసిందని సమాచారం. ఆచితూచి నిర్ణయం బీఆర్ఎస్కు చెందిన సిట్టింగ్ ఎంపీలు బీజేపీలో చేరుతున్నందున వివిధ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. మరో సిట్టింగ్ స్థానమైన ఆదిలాబాద్ నుంచి సోయం బాపూరావ్ అభ్యర్థిత్వాన్ని ప్రస్తుతానికి పెండింగ్‌లో పెట్టారని తెలిసింది. అయితే జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ శుక్రవారం ఢిల్లీలో కాషాయ కండువా కప్పుకోవడంతో.. ఆ స్థానంలో బీజేపీ ఎంపీగా ఆయనే బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఇక ఎక్కువ అభ్యర్థులు పోటీ పడుతున్న మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ సహా ఇతర స్థానాలపై మరోసారి చర్చించిన తర్వాతే బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కారు దిగనున్న మరో ఎంపీ! ఖమ్మం నుంచి బరిలో దిగేందుకు మరో బీఆర్ఎస్ ఎంపీ కాషాయ కండువా కప్పుకొనే అవకాశం ఉందని, ఆయనతో పాటు మరో ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు సైతం బీజేపీలో చేరేందుకు సిద్ధమౌతున్నారని సమాచారం. -
కాంగ్రెస్‌తో పొత్తుకు టీఎంసీ చెల్లు.. అసలు కారణాలేంటి?
కోల్‌కతా: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ప్రకటించారు. సీట్ల పంపకంలో ప్రతిపాదనలన్నింటినీ కాంగ్రెస్ తిరస్కరించిందని పేర్కొన్న దీది.. బెంగాల్‌లోని 42 స్థానాల్లో తృణమూల్ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించడానికి ఒక రోజు ముందు ఈ ప్రకటన వచ్చింది. దీంతో కొద్దిరోజులుగా మమతా బెనర్జీ, కాంగ్రెస్ మధ్య స్నేహం బీటలు వారినట్లయింది. పరస్పర ఆరోపణలు.. అయితే.. రాష్ట్రంలో కాంగ్రెస్, తృణమూల్ మధ్య విభేదం ఇదే మొదటిసారి కాదు. గత రెండు నెలలుగా జరుగుతున్న పరస్పర ఆరోపణల తర్వాత మమతా బెనర్జీ నుంచి నేడు ఈ ప్రకటన వచ్చింది. ఇండియా కూటమితో సీట్ల పంపకంపై విభేదాలు అప్పుడప్పుడు బహిరంగంగానే బయటకొచ్చాయి. మమతా బెనర్జీని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌదరి తీవ్రంగా విమర్శించేవారు. ఆమెపై ఈ మధ్య విమర్శల స్థాయిని పెంచారు. ఒకానొక సందర్భంలో ఆమెను అవకాశవాది, దలాల్ అని దుయ్యబట్టారు. నిజానికి, జాతీయ స్థాయిలో మమతా బెనర్జీతో కాంగ్రెస్ పొత్తు రాష్ట్ర కాంగ్రెస్ నేతలను ఎప్పుడూ కలవరపెడుతోంది. సోనియా గాంధీతో మమతా బెనర్జీ మంచి సాన్నిహిత్యాన్ని కలిగి ఉండగా.. అధిర్ చౌదరి, అబ్దుల్ మన్నన్ నేతృత్వంలోని బెంగాల్ కాంగ్రెస్ వర్గం.. మమతపై విమర్శలకు దిగేది. తృణమూల్ తమ నాయకులను దూరం చేస్తోందని కాంగ్రెస్ రాష్ట్ర వర్గం ఎప్పుడూ ఆరోపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పతనానికి తృణమూల్ ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు. నిజానికి తృణమూల్‌తో పొత్తు పెట్టుకోవడానికి అధిర్ రంజన్ చౌదరి మొదట్లో సానుకూలంగా లేరు, వామపక్షాలతో కలిసి వెళ్లాలని భావించారు. గతంలో చేతులు కలిపారు.. కానీ.. గతంలోనే కాంగ్రెస్, టీఎంసీ చేతులు కలిపారు. ఈ రెండు పార్టీలు గతంలో 2001 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో, 2009 లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నాయి. ముఖ్యంగా 2011లో టీఎంసీ, కాంగ్రెస్ కూటమి.. బెంగాల్లో 34 సంవత్సరాల తర్వాత సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి దారితీసింది. అయితే, ఈసారి లోక్‌సభ ఎన్నికలకు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అసమ్మతికి మొదటి సంకేతం.. బెంగాల్‌లోని 42 సీట్లలో రెండింటిలో పోటీ చేయాలని కాంగ్రెస్‌ను తృణమూల్ కాంగ్రెస్ కోరింది. కనీసం 8-10 సీట్లు కావాలని కాంగ్రెస్ పట్టుబడింది. తృణమూల్ అభ్యర్థనను తిరస్కరించడం రెండు పార్టీల మధ్య అసమ్మతికి మొదటి సంకేతం. ఈ రెండు స్థానాల్లో.. అధిర్ రంజన్ కంచుకోట బెర్హంపూర్, 2019లో కాంగ్రెస్ గెలిచిన మాల్దా సౌత్‌లు ఉన్నాయి. టీఎంసీ సీట్ల షేరింగ్ ఫార్ములా 2019 లోక్‌సభ ఎన్నికలు, 2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పార్టీల పనితీరు ఆధారంగా సీట్ల షేరింగ్ ఫార్ములా ఉండాలని మమతా బెనర్జీ కోరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఐదు శాతం కంటే తక్కువ ఓట్లను సాధించిందని, ఒక్క సీటు కూడా గెలవలేకపోయిందని తృణమూల్ పేర్కొంది. కాంగ్రెస్ "పెద్దన్న" అధికారాన్ని విడనాడాలని, ప్రాంతీయ పార్టీలు తమ బలమైన స్థానాల్లో ఎన్నికలను ఎదుర్కోవాలని టీఎంసీ అధిష్టానం ప్రతిపాదించింది. మోగిన ప్రమాద ఘంటికలు.. అయితే.. గత వారం తృణమూల్ నేతలతో జరిగిన సమావేశం అనంతరం అధిర్ రంజన్ చౌదరి బెర్హంపూర్తో సహా మొత్తం 42 స్థానాల్లో పార్టీ పోటీ చేయాలని నిర్ణయించారు. ఇది కాంగ్రెస్‌లో ప్రమాద ఘంటికలు మోగించింది. మమతా బెనర్జీ సహాయం లేకుండానే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఈ పరిణామాల తర్వాత మమతా బెనర్జీని రాహుల్ గాంధీ శాంతింపజేయడానికి ప్రయత్నించారు. కొన్ని సార్లు స్థానిక నాయకులు తెలియక ఏదో మాట్లాడుతారు.. అవన్ని పట్టించుకోవద్దు అని చెప్పారు. మమతా బెనర్జీ తనకు మంచి సన్నిహితురాలని చెప్పుకొచ్చారు. మళ్లీ చిగురించలేని స్థాయికి.. అయితే.. ఈ పరిణామాల అనంతరం ఇండియా కూటమికి మమతా బెనర్జీ స్వస్తి పలికారు. దీంతో జనవరి 25న పశ్చిమ బెంగాల్లో అడుగుపెట్టనున్న రాహుల్ గాంధీ నేతృత్వంలోని 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'లో తృణమూల్ కాంగ్రెస్ చేరే అవకాశం లేదు. మమతా బెనర్జీ ప్రకటన తర్వాత సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ స్పందించారు. టీఎంసీ లేని ఇండియా కూటమిని ఊహించలేమని చెప్పారు. అయితే.. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, తృణమూల్ స్నేహం మళ్లీ చిగురించలేని స్థితికి చేరిందని తెలుస్తోంది. ఇదీ చదవండి: ఇండియా కూటమికి డబుల్ షాక్! -
కాంగ్రెస్ వాళ్లు ఇప్పుడే ఉలిక్కి పడుతున్నారు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడటం ఇంకా మొదలుపెట్టక ముందే కాంగ్రెస్ వాళ్లు ఉలిక్కి పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. మరి కేసీఆర్ అసెంబ్లీకి వస్తే పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఉహించుకోవాలన్నారు. లోక్‌సభ నియోజకవర్గాల పార్టీ సన్నాహక సమావేశాల్లో భాగంగా సోమవారం తెలంగాణ భవన్లో నల్లగొండ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి అనేక కారణాలున్నాయన్నారు. ‘అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ వాళ్లు కూడా కలగనలేదు. అందుకే ఇష్టమొచ్చినట్టు హామీ లు గుప్పించారు. ఇప్పుడు హామీలకు కాంగ్రెస్ పంగనామాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు రేవంత్‌రెడ్డి అడ్డమైన మాటలు చెప్పా రు. కార్యకర్తలు ఉదాసీన వైఖరిని వీడాలి. ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడారో, ఇప్పుడేం చేస్తున్నారో ప్రజలకు విడమరచి చెప్పాలి’అని పేర్కొన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం వల్ల కూడా ఇలాంటి ఫలితాలు వచ్చినట్లు కార్యకర్తలు చెబుతున్నారన్నారు. సోషల్ మీడియాలో జరిగిన అసత్య ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టడంలో విఫలమయ్యామని, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని కేటీఆర్ వివరించారు. ఓటమిపై అనుమానం రాలేదు ‘నల్లగొండలో ఎన్నికల ప్రచార సరళి మనకు అనుకూలంగా ఉన్నట్టే అనిపించింది. ఎక్కడా ఓటమిపై అనుమానం రాలేదు. కానీ ఎన్నికల ఫలితాలు మరోలా వచ్చాయి. కేవలం సూర్యాపేటలో మాత్రమే గెలిచాం’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత నవంబర్ లోనే కరెంటు బిల్లులు కట్టవద్దని చెప్పారు. నల్లగొండ ప్రజలు బిల్లులు కట్టకుండా కోమటిరెడ్డికే పంపాలి. సాగర్ ఆయకట్టుకు కాంగ్రెస్ పాలనలో మొదటిసారి క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి దాపురించింది. కృష్ణా రివర్ బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించి తెలంగాణ జుట్టును కాంగ్రెస్ కేంద్రం చేతిలో పెడుతోంది. కరెంటు కోతలు అప్పుడే మొదలయ్యాయి. వీటన్నింటిని ప్రజల్లోకి తీసుకెళ్తే బాధ్యతను నాయకులు, కార్యకర్తలు సమర్థవంతంగా నిర్వహించాలి’అని సూచించారు. కాంగ్రెస్, బీజేపీ అక్రమ సంబంధం నల్లగొండ మున్సిపాలిటీ అవిశ్వాసంలో బయటపడిందని వ్యాఖ్యానించారు. రేవంత్ భుజం మీద తుపాకీ పెట్టి బీఆర్ఎస్ను కాలుస్తానని మోదీ అంటున్నారని, మైనారిటీ సోదరులకు కాంగ్రెస్, బీజేపీ అక్రమ సంబంధం గురించి వివరించాలన్నారు. కేసీఆర్‌పై ప్రజల్లో సానుభూతి వెల్లువలా ఉందని, ఈ పరిస్థితిని పార్లమెంటు ఎన్నికల్లో సానుకూలంగా మలచుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌కు ఇప్పటికే అనేక వర్గాలు దూరం అయ్యాయని, నల్లగొండ పార్లమెంటు ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి బీఆర్ఎస్ను గెలిపించుకోవాలన్నారు. కష్టపడ్డ వారికే గుర్తింపు: హరీశ్‌రావు 17 లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి నిర్వహించిన 16 సమావేశాల్లో 112 గంటల పాటు చర్చ జరిగిందని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. కార్యకర్తలు మంచి సూచనలు చేశారని, పార్టీకి ద్రో హం చేసిన వారిపై చర్యల కోసం డిమాండ్లు వచ్చాయన్నారు. పార్టీ సంస్థాగత బలోపేతంపై సూచనలు వచ్చాయని, గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ముందుకు సాగుదామని చెప్పారు. కష్టపడ్డ వారికే పార్టీలో గుర్తింపు ఉంటుందని, ఉద్యమకారులకు సముచిత స్థానం ఇస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎండ్రకాయల పార్టీ అని, ఒకరి కాలు ఇంకొకరు పట్టి లాగుతుంటారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను మరో 20 రోజుల్లో నెరవేర్చాలని, లేకపోతే ఎన్నికల కోడ్ వస్తుందని చెప్పారు. మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ బీఆర్ఎస్ పేరిట దేశమంతా తిరిగితే బలోపేతం అవుతారని మోదీ భయపడి కాంగ్రెస్‌కు సహకరించారని, రాహుల్‌ను ఎదుర్కోవడం కన్నా కేసీఆర్‌ను ఎదుర్కోవడం కష్ట మని భావించారన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ఎండగడదామన్నారు. ‘లోక్‌సభ’కు సన్నద్ధం ♦ సన్నాహక సమావేశాల్లో పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం ♦ 10 నుంచి 12 ఎంపీ సీట్లు గెలుపు లక్ష్యంగా... అసెంబ్లీ ఎన్నికల్లో ♦ ఓటమికి గల కారణాలపై విశ్లేషణ ♦ జరిగిన పొరపాట్లు పునరావృత కానివ్వమని భరోసా సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ సెగ్మెంట్ల సన్నాహక సమావేశాలతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోష్ నింపారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో నైరాశ్యంలో ఉన్నవారిలో ఆత్మ విశ్వాసం పెంచేందుకు ఈ సమావేశాలు దోహదపడ్డాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల్లో ఓటమి నుంచి తేరుకోక ముందే పార్టీ అధినేత కేసీఆర్ తుంటి ఎముక విరిగి ఆస్పత్రి పాలు కావడంతో పార్టీ యంత్రాంగంలో ఒక్కసారిగా నైరాశ్యం ఆవరించింది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్ జనవరి 3న తెలంగాణభవన్‌లో లోక్‌సభ నియోజకవర్గాల ఎన్నికల సన్నాహక సమావేశాలకు శ్రీకారం చుట్టారు. ఆదిలాబాద్ సెగ్మెంట్‌తో మొదలైన సమావేశాలు సోమవారం నల్లగొండతో ముగిశాయి. రోజుకో లోక్‌సభ నియోజకవర్గం చొప్పున 16 రోజులు జరిగిన సమావేశాల్లో (హైదరాబాద్, సికింద్రాబాద్ సమావేశాలు ఒకేరోజు జరిగాయి) దాదాపు 112 గంటల పాటు చర్చ జరిగింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన 500 నుంచి 800 వరకు వివిధ స్థాయిల్లోని నాయకులు ప్రతిరోజు తెలంగాణభవన్‌కు వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన సమావేశాల్లో వచ్చే లోక్‌సభ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమికి గల కారణాలను విశ్లేషిం చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు వెలిబుచ్చిన అభిప్రాయాలను నివేదిక రూపంలో ఏరోజుకారోజు పార్టీ అధినేత కేసీఆర్‌కు నివేదించారు. ప్రస్తుతం బీఆర్ఎస్కు 9 మంది ఎంపీలు ఉండగా, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 10 నుంచి 12 లోక్‌సభ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా పార్టీ సన్నాహాక సమావేశాలు జరిగాయి. ఆదిలాబాద్ నుంచి నల్లగొండ వరకు తొలిరోజే ఆదిలాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ నుంచే పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓటమికి గల కారణాలను నిర్భయంగా పార్టీ అగ్రనేతల సమక్షంలో వెల్లడించారు. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నాయకుల పరిస్థితి, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు దక్కిన పదవుల గురించి నిక్కచ్చిగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అన్ని పార్టీల వారు బీఆర్ఎస్లోకి వచ్చి చేరడం మొదట్లో బాగున్నా, తర్వాత విభేదాలు పెరిగాయని, ఇవి కాంగ్రెస్, బీజేపీలకు కలిసి వచ్చాయని పలు నియోజకవర్గాల నాయకులు విశ్లేషిం చారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు గట్టిగా ఉన్న చోట బీఆర్ఎస్ గెలిచిన విషయాలను సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి, కరీంనగర్, ఆదిలాబాద్ సమావేశాల్లో పార్టీ నాయకులు విశ్లేషిం చారు. బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపురావు వంటి బీజేపీ ఎంపీలు, బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు పోటీ చేసిన చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించడాన్ని ప్రస్తావించారు. ఎమ్మెల్యేల తీరుపై కూడా బహిరంగంగానే వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా పార్టీ శ్రేణుల అభిప్రాయాలను కేటీఆర్, హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, కేశవరావు, మధుసూదనాచారి వంటి సీనియర్లు ఓపిగ్గా వింటూ, అలా మరోసారి జరగకుండా చూస్తామని హామీ ఇచ్చి పార్టీ యంత్రాంగంలో ధైర్యం నింపారు. -
Mahua Moitra: కష్టాల్లో ఫైర్ బ్రాండ్
తొలిసారి చట్టసభల్లో అడుగుపెట్టినవారికి గుర్తింపు రావటం అంత సులభం కాదు. ప్రసంగించే అవకాశం లభించటం, దాన్ని సద్వినియోగం చేసుకోవటం చాలా అరుదు. మహిళా ఎంపీల విషయంలో దాదాపు అసాధ్యం. కానీ రాజకీయ రంగప్రవేశం చేసిన కొద్దికాలంలోనే తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఎన్నికై లోక్‌సభలో ప్రవేశించిన మహువా మొయిత్రా చాలా త్వరగానే ‘వార్తల్లో వ్యక్తి’ అయ్యారు. తీరా నాలుగేళ్లయ్యే సరికల్లా వివాదంలో చిక్కుకున్నారు. ఏం జరిగిందో అందరూ గ్రహించే లోగానే ఉరుము లేని పిడుగులా, ఊహించని ఉత్పాతంలా వచ్చిపడిన వివాదం చివరికామె పార్లమెంటు సభ్యత్వానికి కూడా ఎసరుపెట్టేలా పరిణమించింది. సభ్యుల నైతిక వర్తనను నియంత్రించే లోక్‌సభ ఎథిక్స్ కమిటీ ఆమెను సభ నుంచి బహిష్కరించాలని స్పీకర్‌ను కోరుతూ గురువారం నివేదికను ఆమోదించింది. ఇందుకు ప్రధానంగా అనైతిక వర్తన, తీవ్ర తప్పిదాలకు పాల్పడటం కారణాలుగా చూపింది. అంతేకాదు... ఈ విషయంలో సంస్థాగత విచారణ, చట్టపరంగా గట్టి చర్యలు అవసరమని సిఫార్సు చేసింది. పార్లమెంటు సభ్యులు సభలో ప్రశ్నలు వేయటానికి వినియోగించే ఎన్ఐసీ వెబ్సైట్ లాగిన్, పాస్వర్డ్ ఆమె తన స్నేహితుడైన దుబాయ్ రియలెస్టేట్ వ్యాపారి దర్శన్ హీరానందానీకి ఇచ్చారనీ, ఆయన నుంచి కోటి రూపాయల ముడుపులు తీసుకుని ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ సంస్థలపై ప్రశ్నలు సంధించారనీ మొయిత్రాపై వచ్చిన ఆరోపణలు. ఆ ప్రశ్నలు అదానీ సంస్థల ప్రయోజనాలు దెబ్బతీసేంత తీవ్రమైనవా? అందువల్ల హీరానందానీకి ఒరిగేదేమిటి? ముడుపుల సంగతిని మొయిత్రా తోసి పుచ్చారు. లాగిన్, పాస్వర్డ్ ఇచ్చినట్టు అంగీకరించారు. అందుకుగల కారణాలు చెప్పారు. ఇదంతా దేశభద్రతకు ముప్పు తెచ్చే చర్య అనీ, లంచం తీసుకుని ప్రశ్నలేయటం అనైతికమనీ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే గత నెలలో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు. కమిటీ విచారణ తీరుతెన్నులను ప్రశ్నిస్తూ ఇప్పటికే మొయిత్రా ఓం బిర్లాకు లేఖ రాశారు. కమిటీ తనను ప్రశ్నించిన తీరు ‘వస్త్రాపహరణం’ మాదిరిగా వున్నదంటూ దుయ్యబట్టారు. మొయిత్రా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ వలె ఆంగ్ల భాషాప్రావీణ్యం వుండటం వల్లనే త్వరగా ఆమెకు పేరుప్రతిష్టలు సాధ్యమైనాయని అనుకోవటానికి లేదు. ప్రసంగించదల్చుకున్న అంశంపై పట్టు సంపాదించటం ఒక్కటే మొయిత్రా ప్రత్యేకతని చెప్పడానికి కూడా లేదు. విషయ పరిజ్ఞానంతోపాటు విస్ఫులింగాలు విరజిమ్మే స్వభావం, నిర్భీతిగా పాలక పక్షాన్ని నిలదీసే తత్వం ఆమెకొక విశిష్టతను తీసుకొచ్చాయి. అంతకుముందు మూడేళ్లు ఆమె తృణమూల్ ఎమ్మెల్యేగా పనిచేశారు. కానీ మొయిత్రా గురించి దేశానికంతకూ తెలిసింది ఈ నాలుగేళ్ల కాలంలోనే. సభలోనే కాదు... వెలుపల కూడా ఆమె ప్రధాని నరేంద్ర మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా నిప్పులు చిమ్ముతారు. మూకుమ్మడి అత్యాచారం కేసులో యావజ్జీవ శిక్షపడిన గుజరాత్ దోషులకు క్షమాభిక్ష పెట్టడాన్ని సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎథిక్స్ కమిటీ విచారణలో నిర్ధారించిన అంశాలేమిటో, అవి ఏరకంగా తీవ్రమైన స్వభావంతో కూడుకున్నవో ఇంకా తెలియాల్సి వుంది. ఎన్ఐసీ లాగిన్, పాస్వర్డ్ ఇవ్వటం విషయంలో ఇంతవరకూ ఎలాంటి నిబంధనలూ లేవు. అయినా సరైంది కాదనుకుంటే ఆమెను మందలించవచ్చు. కమిటీలోని విపక్ష సభ్యులు చెబుతున్న ప్రకారం 800 మంది ఎంపీల్లో అనేకులు సగటున కనీసం ఇద్దరు ముగ్గురికి ఇలా ఇస్తారు. కంప్యూ టర్ల వాడకం, సాంకేతిక పరిజ్ఞానం లేకపోవటం ఇందుకు కారణం. ఈ విషయంలో స్పీకర్ ఏం నిర్ణయిస్తారన్నది చూడాలి. ఆ సంగతలా వుంచితే ఫిర్యాదు, విచారణ వగైరాలన్నీ ఆదరా బాదరాగా సాగినట్టు కనబడుతోంది. అక్టోబర్ 26న కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ నెల 2న జరిగిన రెండో సమావేశం మధ్యలోనే ముగిసింది. అడిగినవాటికి జవాబివ్వకుండా ఆమె దుర్భాషలాడారని కమిటీ ఛైర్మన్ వినోద్ కుమార్ సోంకార్ ఆరోపిస్తే... ఫిర్యాదుతో సంబంధం లేని ప్రశ్నలతో తన వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా వేధించారన్నది మొయిత్రా ఆరోపణ. దుబాయ్ వెళ్తే ఏ హోటల్లో దిగుతారు... మీతో ఎవరుంటారు... మీరు మీ మిత్రులతో మాట్లాడుతున్నట్టు వారి భార్యలకు తెలుసా అని అడిగారని కూడా ఆమె ఆరోపించారు. దీనికి నిరసనగా ఆమె, విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. కమిటీ విచారణ గోప్యం కనుక ఆరోపణలు, ప్రత్యారోపణల్లో నిజానిజాలేమిటో తెలియదు. అయితే ఈ మొత్తం వ్యవహారం మన పార్లమెంటరీ వ్యవస్థ ఔన్నత్యాన్ని దెబ్బతీస్తుందన్నది మాత్రం వాస్తవం. అసలు దూబే ఫిర్యాదుకు మొయిత్రా మాజీ సహచరుడు దేహద్రాయ్ లేఖ ఆధారమన్న సంగతి కమిటీకి తెలుసా? కమిటీకిచ్చిన అఫిడవిట్లో మొయిత్రాకు ముడుపులు చెల్లించానని హీరానందానీ అంగీకరించారా? లేదని విపక్ష సభ్యులు చెబుతున్నారు. విడిపోయిన జంట పరస్పరం ఆరోపించుకోవటం సర్వసాధారణం. ఇప్పటికే పెంపుడు కుక్క విషయంలో వారిద్దరూ కేసులు పెట్టుకున్నారు. కనుక దేహద్రాయ్ ఫిర్యాదు అంశంలో దూబే, ఎథిక్స్ కమిటీ ఆచితూచి అడుగు లేయాల్సింది. మహిళ గనుకే ఇలా చేశారన్న అపవాదు రానీయకుండా చూసుకోవాల్సింది. ఈ వ్యవహారంలో వ్యక్తిగతం, రాజకీయం కలగాపులగం చేశారన్న అప్రదిష్ట కలగడమూ మంచిది కాదు. ఏదేమైనా వ్యవస్థను ఢీకొట్టేవారు నిరంతరం అత్యంత జాగురూకతతో మెలగాలని మొయిత్రా ఇప్పటికే గుర్తించి వుంటారు. ఈ వివాదంలో పార్లమెంటరీ వ్యవస్థ ఔన్నత్యానికి అనుగుణమైన నిర్ణయం వెలువడాలని అందరూ కోరుకుంటారు. ఇదీ చదవండి: అమలు గ్యారంటీ -
ఎన్నికల్లో విజయమే లక్ష్యం
న్యూఢిల్లీ: రానున్న మూడు ప్రధాన రాష్ట్రాల అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వ్యూహాలు ఎజెండాగా మంగళవారం న్యూఢిల్లీలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరిగింది. భేటీని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, అరుణ్ జైట్లీ, 14 రాష్ట్రాల బీజేపీ సీఎంలు పాల్గొన్నారు. దళితులు, వెనకబడిన వర్గాల మద్దతు, ఎన్ఆర్సీ, జాతీయ భద్రత, వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగింది. దళితులు, అణగారిన వర్గాలు సహా సమాజంలోని దాదాపు అన్ని వర్గాలు లబ్ధి పొందిన తన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇతర నిర్ణయాలను వారికి ప్రధాని మోదీ వివరించారు. వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ఆదేశించారు. ‘2014 కన్నా ఎక్కువ మెజారిటీని 2019లో సాధించాలని, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లోనూ విజయం సాధించాలని లక్ష్యంగా నిర్ధారించుకున్నాం’ అని భేటీ వివరాలను వెల్లడిస్తూ చత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ మీడియాకు తెలిపారు. స్వచ్ఛ భారత్ లక్ష్యాలను కాలపరిమితితో పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇటీవల మరణించిన మాజీ ప్రధాని వాజ్‌పేయికి నివాళులర్పిస్తూ భేటీలో తీర్మానం చేశారు. -
ఈవీఎంలు ఎక్కడ రిపేరు చేస్తున్నారు?
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం (ఈవీఎం)లను ఎక్కడ రిపేరు చేయిస్తున్నారో తెలుపాలని ప్రతిపక్షపార్టీలు, జాతీయ ఎన్నికల కమిషన్‌ను నిలదీశాయి. సోమవారం ఎన్నికల కమిషన్ నిర్వహించిన సీఈసీ సమావేశంలో పాల్గొన్న వివిధ పార్టీల నేతలు ఈవీఎంల ట్యాంపరింగ్‌ను ప్రశ్నించారు. ప్రతిసారీ ఓట్లన్నీ ఒకే పార్టీకి ఎలా వెళ్తున్నాయని, వాటి రిపేరు చేసే సంస్థ పేరు, అడ్రస్ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నిరోజుల ఈవీఎంలను ఉపయోగిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ మినహా కాంగ్రెస్, తృణముల్ కాంగ్రెస్, మాయవతి బహుజన సమజ్వాదీ పార్టీ, సీపీఐ, సీపీఎం, శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్‌లతో సుమారు 51 పార్టీల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్ నేత ఒకరు మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఈవీఎంలు ఉపయోగించడం వల్ల ప్రజల తీర్పు వెలవడటం లేదన్నారు. ‘చాలా సందర్భాల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు. ఏ పార్టీకి ఓటేసిన ఒకే పార్టీకి ఓట్లు వెళ్లాయి. ఈవీఎంలను ఎవరు రిపేరు చేస్తారు? ఎన్ని రోజుల ఈవీఎంలను ఉపయోగిస్తున్నారు? అనే విషయం మాకు తెలియాలి. అలాగే ఓటరు రశీదు పరికరాలు (వీవీ ప్యాట్లు) ఉపయోగించాలని డిమాండ్ చేస్తున్నాం.’అని తెలిపారు. తృణముల్ కాంగ్రెస్ నేత ఒకరు మాట్లాడుతూ.. మాకు ఈవీఎంలపై నమ్మకం లేదని, బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈవీఎంలకు ‘వీవీ ప్యాట్’ (ఓటర్ వెరిఫైడ్ పేపర్ అడిట్ ట్రైయిల్) అనుసంధానించి ప్రతి ఓటరు పేపర్ రశీదుతో ఒక శాతం ఓట్లను క్రాస్ చెక్ చేస్తామని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. అయితే ప్రతిపక్షాలు 30 శాతం ఓట్లను క్రాస్‌చెక్ చేయాలని సూచించాయి. దేశంలో జరిగిన గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీకి మెజార్టీ రావడాన్ని ప్రతిపక్షపార్టీలు సందేహించాయి. ఈవీఎంల ట్యాంపరింగ్‌తోనే బీజేపీ అధికారం దక్కించుకుందని ఆరోపించాయి. అలాంటిదేం జరిగలేదని ఎన్నికల కమిషన్ వివరణ ఇచ్చినప్పటికి వారు నమ్మలేదు. -
‘లోక్‌సభ, 4 అసెంబ్లీలకు అయితే ఓకే’
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించాల్సి వస్తే.. అందుకు సిద్ధంగానే ఉన్నామని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. డిసెంబర్లో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభకు ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన సామర్థ్యం తమకుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ బుధవారం తెలిపారు. లోక్‌సభ ఎన్నికలను ముందస్తుగా నిర్వహించనున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ ఎన్నికలకు అవసరమైన అన్ని ఈవీఎంలు సెప్టెంబర్ చివరి నాటికి, వీవీప్యాట్లు నవంబర్ చివరి నాటికి సిద్ధంగా ఉంటాయని రావత్ తెలిపారు. మిజోరం అసెంబ్లీ ఈ డిసెంబర్ 15 నాటికి, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ అసెంబ్లీలు వరుసగా వచ్చే సంవత్సరం జనవరి 5, జనవరి 7, జనవరి 20 నాటికి ముగుస్తాయి. ఈ నెలలోనే జమిలిపై నివేదిక లోకసభ, అన్ని అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన న్యాయ ప్రక్రియను లా కమిషన్ ఈ నెలలోనే కేంద్రానికి సిఫారసు చేయనుంది. కమిషన్‌లోని ఉన్నతాధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. ‘మేం ఏకకాల ఎన్నికలకు మద్దతు తెలుపుతామా లేదా అని మమ్మల్ని అడగలేదు. అందుకు సంబంధించిన మార్గా న్ని సూచించే పనిని మాత్రమే మాకు అప్పజెప్పారు’ అని ఆ అధికారి చెప్పారు. ఏకకాలం లో ఎన్నికలు నిర్వహించేందుకు రాజ్యాంగానికి, ప్రజా ప్రతినిధుల చట్టానికి చేయాల్సిన సవరణలను కమిషన్ సిఫారసు చేయనుంది. ఆ సిఫారసులను కేంద్రం తప్పనిసరిగా పాటించకపోవచ్చనీ, అయితే రాజకీయ పార్టీ లు, భాగస్వామ్య పక్షాల మధ్య చర్చ జరుగుతుందని అధికారి అన్నారు. రాజ్యాంగానికి కనీసం రెండు సవరణలైనా చేసి, మెజారిటీ రాష్ట్రాలు కూడా సవరణలను ఆమోదిస్తేనే ఏకకాల ఎన్నికలను నిర్వహించడం సాధ్యమవుతుందని కమిషన్ ఇప్పటికే చెప్పింది. -
స్త్రీలోక సంచారం
►వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహల్ గాంధీ మళ్లీ అమేధీ నుంచే పోటీ చెయ్యొచ్చని తెలుస్తోంది కానీ, ఆయన తల్లి, యు.పి.ఎ. చైర్పర్సన్ సోనియా గాంధీ అసలు ఈసారి ఎన్నికల్లో నిలబడతారా అనే సందేహాలు మొదలయ్యాయి. ఒకవేళ సోనియా 2019 ఎన్నికలకు దూరంగా ఉంటే కనుక ప్రస్తుతం ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలి లోక్‌సభ స్థానం నుంచి ఆమె కూతురు ప్రియాంకా గాంధీ పోటీ చేసే అవకాశాలు ఉన్నప్పటికీ.. రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రియాంక ఆసక్తి చూపుతారా అనేది మరో ప్రశ్న. ►వంట చెయ్యడం రాదని, ఇంటి పనులు సరిగా చెయ్యడం లేదని భర్త భార్యను తిట్టడం ఆమెను అవమానించడం అవదని 17 ఏళ్ల నాటి ఒక గృహిణి ఆత్మహత్య కేసులో ముంబై హైకోర్టు తీర్పు చెబుతూ, ఆ భర్తని, అత్తమామల్ని కింది కోర్టు నిర్దోషులుగా విడుదల చేయడాన్ని సమర్థించింది. 2001 జూన్ 5 నాటి ఆ ఆత్మహత్య అనంతరం భర్త విజయ్ షిండేపై భార్య పుట్టింటి వారు కేసు పెడుతూ.. వంట బాగోలేదనీ, ఇంటిని శుభ్రంగా ఉంచడం లేదని అల్లుడు, అత్తమామలు తమ కూతుర్ని తరచు తిడుతున్న కారణంగానే ఆమె అంత తీవ్రమైన నిర్ణయం తీసుకుందని చేసిన ఆరోపణలపై ఇన్నేళ్లపాటు జరిగిన వాదోపవాదాలలో విజయ్‌కి వేరొక స్త్రీతో సంబంధం ఉందన్న కోణం కూడా ఉంది. ►రోగుల సేవలకు మరింతగా బాధ్యులను చేయడానికి, వృత్తిపరమైన అవకతవకల్ని నివారించడానికి ప్రభుత్వ ఆసుపత్రులలో పని చేసే నర్సులకు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ సెప్టెంబరులో ‘నర్సింగ్ యునీక్ ఐ.డి. (ఎన్.యు.ఐ.డి) లను ఇవ్వబోతోంది. నేషనల్ నర్సింగ్ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర ఆరోగ్య శాఖలోని అత్యున్నతస్థాయి అధికారుల సమావేశంలో తీసుకున్న ఈ కార్డుల జారీ ప్రయోజనాల గురించి నేషనల్ నర్సింగ్ కౌన్సిల్ అధ్యక్షులు టి. దిలీప్ కుమార్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డికి వివరించిన అనంతరం దీనికి సంబంధించిన స్పష్టమైన ప్రకటన వెలువడింది. ►జపాన్ గ్రాఫిక్ డిజైనర్ తనాగో అకీకో డిజైన్ చేసిన ఫ్యాన్ హ్యాండ్‌బ్యాగ్ నమూనా టోక్యో సృజనాత్మక ఆవిష్కరణల ప్రదర్శనలో మహిళలను అమితంగా ఆకట్టుకుంటోంది. హ్యాండ్‌బ్యాగ్ వెలుపల అమర్చిన ఫ్యాను.. బయటి వాతావరణంలోని వేడిమిలో సంభవిస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు పసిగట్టి ఆ సమాచారాన్ని అందిస్తుందని అకీకో చెబుతున్న పాయింట్ కన్నా కూడా.. బ్యాగ్ డిజైనే ప్రదర్శనకు వస్తున్న మగువల్ని ఎక్కుగా ఆకర్షిస్తోంది. ►భర్త అడుగుజాడల్లో నడవటం అటుంచి, భర్త అడుగుజాడల్ని ఎప్పటికప్పుడు తుడిచేస్తుండే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలనియా మళ్లీ మరొకసారి.. భర్త వ్యక్తం చేసిన అభిప్రాయాలకు పూర్తి భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు. అమెరికన్ ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ ప్లేయర్ లెబ్రాన్ జేమ్స్ సి.ఎన్.ఎన్. టీవీ ఇంటర్వ్యూలో ‘మనల్ని విడదీసేందుకు ప్రయత్నిస్తున్న మనిషి’ అని తనను విమర్శించడంపై ట్రంప్ స్పందిస్తూ, ‘బుద్ధిమాంద్యపు వ్యాఖ్యాత డాన్ లెమన్.. లెబ్రాన్ జేమ్స్‌ని ఇంటర్వ్యూ చేయడం చూశాను. లెబ్రాన్ ఏబ్రాసీ ముఖాన్ని అందంగా చూపించడానికి అతడు చాలా ప్రయత్నించినట్లు ఉన్నాడు’ అని అన్న కొద్ది గంటల్లోనే... ‘భావి తరాలకు ఉపయోగపడేలా జేమ్స్ అనేక మంచి పనులు చేస్తున్నాడు’ అని మెలనియా ఒక ప్రకటన విడుదల చేసినట్లు సి.ఎన్.ఎన్. వెల్లడించింది. ►ముజఫర్రూర్లోని బాలికల ప్రభుత్వ ఆశ్రయ గృహంలో 34 మంది మైనర్ బాలికలపై అమానుషమైన అనేక లైంగిక అకృత్యాలు జరిగినట్లుగా వస్తున్న వార్తలపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతీ మలీవాల్ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌కు లేఖ రాశారు. బాధిత బాలికలు మొదట ఇచ్చిన వాంగ్మూలాలను మార్చుకునేలా వారిపై ఒత్తిడి వచ్చే అవకాశాలు ఉన్నందున వారికి గట్టి భద్రతను కల్పించాలని ఆ లేఖలో ప్రధానంగా విజ్ఞప్తి చేయడంతో పాటు.. వారిని స్కూళ్లకు, కౌనెల్సింగ్కు పంపే విషయమై శ్రద్ధ వహించాలని స్వాతి కోరారు. ►ఈ ఏడాది డిసెంబరులో జరుగునున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహకంగా.. నలభై రోజుల ‘రాజస్థాన్ గౌరవ యాత్ర’ ప్రారంభించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధర రాజే తొలి రోజు బహిరంగ సభలో.. తన ప్రభుత్వం మహిళలకు, యువతకు, రైతులకు ప్రాధాన్యం ఇస్తుందని ప్రకటించారు. అలాగే, ‘మేము మీతో ఉన్నాం : బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు’ అనే నినాదంతో రాజే మహిళలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ► ‘మీటూ’ ఉద్యమానికి దారి తీసిన ‘కాస్టింగ్ కౌచ్’ దారుణాల గురించి విన్నాక హాలీవుడ్ మీద తనకు గౌరవం పోయిందని అంటూ.. హాలీవుడ్ తన పాపాలకు పశ్చాత్తాపం చెంది, పూర్తిగా ప్రక్షాళన చెందాకే అటువైపు చూసేందుకు సాహసిస్తానని బ్రిటిష్ టీవీ ప్రెజెంటర్, నటి, మోడల్ జమీలా అలియా జమీల్ ‘గార్డియన్’కి ఇచ్చిన తాజాగా ఇంటర్వ్యూలో చెప్పారు. ‘అవసరమైతే నా కెరీర్నైనా నాశనం చేసుకుంటాను కానీ, హాలీవుడ్‌కి వెళ్లి నేను నాశనం కాను’ అని కూడా ఆమె అన్నారు! -
ఈసారి ఓటు ఎలా?
వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. ఈవీఎం లను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉన్నందున 2019 ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్లనే ఉపయోగించాలని కాంగ్రెస్, తృణమూల్ సహా 17 ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈవీఎం లను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదని, పైగా వీవీప్యాట్ (ఓటరు ఏ పార్టీకి ఓటు వేసిందీ తెలియపరుస్తూ రసీదు ఇచ్చే మిషన్)ల అనుసంధానంతో ఈవీఎంలు మరింత భద్రంగా, కచ్చితంగా పనిచేస్తాయని ఎన్నికల సంఘం పదే పదే స్పష్టం చేస్తున్నా విపక్షాలు నమ్మడం లేదు. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడానికి ఈవీఎంలే కారణమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. గతే డాది ఉత్తరప్రదేశ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక ఈవీఎంలో ఏ పార్టీకి ఓటేసినా బీజేపీకే పడటాన్ని సాక్ష్యంగా చూపుతోంది. 2017లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని ఆప్ ఆరోపించింది. ‘ఈవీఎంల స్థానం లో బ్యాలెట్ పేపర్లు పెట్టాలన్నది మా డిమాండ్. పార్టీలన్నీ ఒక్కటై దీన్ని సాధించాలి’అని తృణమూల్ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ప్లీనరీలో కాంగ్రెస్ తీర్మానం... ఈవీఎంలను తొలగించాలంటూ ఈ ఏడాది మార్చి లో జరిగిన 84వ ప్లీనరీలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ తీర్మానాన్ని ఆమోదించింది. ఈవీఎంలను వాడు తున్నప్పటి నుంచి ఎన్నికల ఫలితాలు ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వస్తున్నాయని, ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే ఇలా జరుగుతోందని ఆ పార్టీ వాదిస్తోంది. వచ్చే సోమవారం అన్ని పార్టీలు సమావేశమై దీనిపై చర్చిం చనున్నాయి. పార్లమెంటులో ఈవీఎంలపై చర్చకు డిమాండ్ చేయాలని నిర్ణయించాయి. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కలసి ఈవీఎంలపై వినతిపత్రం సమర్పించనున్నాయి. మరోవైపు అన్ని పార్టీలు కాదంటే ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్లను ప్రవేశపట్టే విషయం ఆలోచిస్తామని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈవీఎంలతో లాభాలివీ... ♦ ఈవీఎంల వల్ల కాగితం ఆదా అవుతుంది. ♦ ఈవీఎంలను భద్రపరచడం, పంపిణీ చేయడంలోనూ సమస్యలను అధిగమించవచ్చు. ♦ ఈవీఎంల వాడకంతో చెల్లని ఓటంటూ ఉండదు. ♦ ఈవీఎంల ద్వారా గంటకు 240 ఓట్లు వేయొచ్చు. కానీ బ్యాలెట్ బాక్స్‌లలో ఇది సాధ్యం కాదు. ♦ కేవలం 6 వోల్ట్ల బ్యాటరీతోనే ఈవీఎంలు పనిచేస్తాయి కనుక మారుమూల గ్రామాల్లోనూ ఈవీఎంలను వాడటం తేలిక. బ్యాలెట్ పేపర్‌తో కష్టాలు... ♦ బ్యాలెట్ విధానంలో దొంగ ఓట్లు వేసే అవకాశం ఎక్కువ. రాజకీయ ప్రాబల్యంగల వారు రిగ్గింగ్‌కి పాల్పడటం, ప్రత్యర్థులకు ఓట్లు పడ్డాయనుకున్న చోట్ల బ్యాలెట్ బాక్సుల్లో ఇంక్ పోయడం లాంటి వాటికి అవకాశం ఉంది. ♦ ఓటరు ఎంచుకున్న అభ్యర్థి గుర్తుపైన ముద్ర పడకున్నా, లేక పడిన ముద్ర పూర్తిగా కనిపించకపోయినా ఆ ఓటు చెల్లకపోవచ్చు. ♦ బ్యాలెట్ బాక్స్‌లను సురక్షిత ప్రదేశానికి తరలించడం కషం. దీనికి పెట్టాల్సిన ఖర్చు అధికం. ♦ ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటింగ్‌కు ఈవీ ఎంలతో 2 నుంచి 3 గంటలు పడితే, బ్యాలెట్ పేపర్‌తో 30 నుంచి 40 గంటలు పడుతుంది. ♦ 2014 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 9,30,000 పోలిం గ్ స్టేషన్లలో 14 లక్షల ఈవీఎంలను ఉపయోగించారు. 81.7 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2019 ఎన్నికల్లో దాదాపు 87.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇంత భారీ సంఖ్యలో ప్రజలు ఓట్లు వినియోగించాలంటే బ్యాలెట్కన్నా ఈవీఎంలే నయమనే వాదనా ఉంది. మన బ్యాలెట్ కథా కమామిషు! ఎన్నికల నిర్వహణకు ఒక రూపు రేఖ తీసుకువచ్చిన ఘనత తొలి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుకుమార్‌సేన్ దే. ఆయన దేశంలో ఎన్నికల ప్రక్రియకు తొలిసారిగా వేసిన బాట మరువలేనిది. తొలి ఎన్నికల్లో ప్రతి అభ్యర్థికీ వేర్వేరు రంగుల్లో ఉన్న ఒక్కో బ్యాలెట్ బాక్స్‌ని కేటాయించారు. ఆ బాక్స్‌పై వారి పేరు, ఎన్నికల గుర్తును పెయింట్ చేశారు. ప్రతి పోలింగ్ బూత్‌లో ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉన్నారో, అన్ని బాక్స్‌లు ఉంచారు. ఓటర్లు తమకు ఇచ్చిన బ్యాలెట్ పేపర్‌ను వారికి నచ్చిన అభ్యర్థి బ్యాలెట్ బాక్స్‌లో వేస్తే సరిపోతుంది. 1957లో కూడా ఇదే ప్రక్రియను అనుసరించారు. 1962లో జరిగిన మూడో సార్వత్రిక ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థులు, వారి ఎన్నికల గుర్తులన్నీ ఒకే బ్యాలెట్ పేపర్‌పై ముద్రించి, తమకు నచ్చిన అభ్యర్థిపై ముద్ర వేసే పద్ధతిని ప్రవేశపెట్టారు. తొలి ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ 25, 1951 నుంచి 1952 మార్చి 27 వరకు మొత్తం నాలుగు నెలలపాటు జరిగింది. ఒకసారి ఓటు వేసిన వాళ్లు మళ్లీ ఓటు వెయ్యకుండా చూపుడు వేలి మీద ఇంకు గుర్తు వేయడం కూడా తొలి ఎన్నికల్లోనే ప్రవేశపెట్టారు. తొలి సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 62 కోట్ల బ్యాలెట్ పేపర్లను ముద్రించారు. ఇక ప్రతి అభ్యర్థికి ఒక్కో బ్యాలెట్ బాక్స్ తయారీని ప్రఖ్యాత గోద్రేజ్ కంపెనీ చేపట్టింది. ముంబైలోని విఖ్రోలి సబర్బన్ ప్రాంతంలో వాటి తయారీ జరిగింది. రోజుకు 15 వేలకుపైగా బ్యాలెట్ బాక్స్‌ల చొప్పున 2.1 కోట్లకుపైగా స్టీల్ బ్యాలెట్ బాక్స్‌లను తయారు చేసి అనుకున్న సమయానికి అందించడంలో గోద్రేజ్ కంపెనీ సఫలమైంది. నేపాల్, ఇండోనేసియా, సూడాన్ వంటి దేశాలు భారత్ ఎన్నికల నిర్వహణను పరిశీలించడానికి తమ ప్రతినిధుల్ని పంపించాయి. విదేశీ మీడియా కూడా భారత్‌లో తొలి ఎన్నికల నిర్వహణను ప్రశంసించింది. ఇలా అభ్యర్థికొక బ్యాలెట్ బాక్స్‌లతో మొదలైన ప్రయాణం ఈవీఎంల వరకు చేరుకొని, ఇప్పుడు మళ్లీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న చర్చకు దారి తీస్తోంది. ఈవీఎంలపై అనుమానాలివీ.. ♦ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ట్యాంపరింగ్ (ఏ బటన్ నొక్కినా ఒకే పార్టీకి ఓటు పడేలా) చేయొచ్చన్న ఆరోపణ ఉంది. 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఎస్పీ, ఆప్ పార్టీలు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగినట్లు ఆరోపించాయి. ♦ ఈవీఎంలతో అవకతవకలకు అవకాశం లేదని కచ్చితంగా చెప్పడానికి లేదు. పూర్తిగా జోక్యానికి వీల్లేని యంత్రమనేది ప్రపంచంలో లేనేలేదనీ, మనం గమనించలేనంత చిన్న పరికరం సాయంతో ఈవీఎంల పనితీరును ప్రభావితం చేయవచ్చని శాస్త్రవేత్త, సామాజిక కార్యకర్త గౌతమ్ రజా పేర్కొన్నారు. ♦ ఈవీఎంల వాడకంలోనూ బూత్‌ల ఆక్రమణ జరిగే అవకాశం లేకపోలేదు. యంత్రాలతో చేసే తప్పుడు పనులకు కండబలం అవసరం లేదు. అది ఎవరి కంట్లో పడదు కాబట్టి మరింత ప్రమాదమనే అభిప్రాయం వినబడుతోంది. ♦ అర్హత లేని సిబ్బంది యంత్రాల నిర్వహణ బాధ్యతలు చేపట్టినట్లు ఉత్తరాఖండ్ ఎన్నికలకు సంబంధించి సమాచార హక్కు చట్టం కింద వెల్లడైంది. ♦ నెదర్లాండ్స్‌లో 2000 సంవత్సరంలో ఈవీఎంల వాడకంలో సమస్యలు ఎదురవడంతో తిరిగి బ్యాలెట్ ఓటింగ్‌నే అనుసరించారు. ♦ ఈవీఎంలతో ట్యాంపరింగ్‌కు అవకాశమున్నందున ప్రపంచ దేశాలు పేపర్ బ్యాలెట్ వైపునకు మళ్లుతున్నాయని, భారత్ కూడా దీన్ని అనుసరించాలని సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్ సూచిస్తున్నారు. బ్యాలెట్‌కు బ్లాక్‌చెయిన్..! ఈవీఎంల వాడకం ద్వారా ఎన్నికల ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉందని రాజ కీయ పార్టీలు, నిపుణులు చెబుతుండటంతో ఇకపై ఓటింగ్ కోసం బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఉపయోగించాలని సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ విధానంలో ఓటరు వివరాలు, ఓటింగ్ వివ రాలు సంకేతభాషలో నిక్షిప్తమవుతాయి కాబట్టి ఇతరులెవరూ వాటిని చూడటం లేదా మార్పుచేర్పులు చేయడం సాధ్యం కాదు. నెట్‌వర్క్‌లో ఉన్నవారిలో అంటే.. వ్యవహారం నడిపిన వారందరూ అంగీకరిస్తేనే మార్పులు సాధ్యమవుతాయి. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని సురక్షితమైన ఓటింగ్‌కు కొత్త మార్గంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. మీ వివరాలతో ఎన్నికల నిర్వహణ సంస్థ వద్ద పేరు నమోదు చేసుకోవాలి. తరువాతి దశలో ఈ వివరాలను గోప్యంగా ఉంచుతూనే మీకు ఓ డిజిటల్ గుర్తింపు సంఖ్య, పాస్వర్డ్ లభిస్తాయి. స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్లతో డిజిటల్ బ్యాలెట్ బాక్స్‌లో ఓటు వేయవచ్చు. ఓట్లు లెక్కకట్టేందుకు ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నా లజీ వాడితే ఎవరికి ఓటు పడిందో తెలుస్తుందిగానీ.. ఓటేసిన వారి వివరాలు ఏమాత్రం తెలియవు. సియర్రా లియోన్ అనే చిన్న దేశం ఈ ఏడాది మార్చిలో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని ఉపయోగించి ఎన్నికలు నిర్వహించగా దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా త్వరలో ఈ టెక్నాలజీని వాడతామని ప్రకటించాయి. ఈవీఎంలను తీసేసే ప్రసక్తి లేదు: ఈసీ ఈవీఎంలలో ఎలాంటి లోపాలు లేవని, వాటిని ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని కేంద్ర ఎన్నికల కమిషనర్ రావత్ స్పష్టం చేశారు. వీవీప్యాట్లతో ఈవీఎంల పనితీరు మరింత పారదర్శకంగా, కచ్చితంగా మారిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ బ్యాలెట్ పేపర్ వైపు వెళ్లే ప్రసక్తే లేదని ఆయన పునరుద్ఘాటించారు. ఈవీఎంలలో లోపాలు లేవని, దానిని ఉపయోగిస్తున్న తీరుపైనే ఓటర్లకు అనుమానాలున్నాయని, ఎన్నికల సంఘం వాటిని నివృత్తి చేయాల్సి ఉందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వంటి సంస్థల ప్రతినిధులు, నిపుణులు అంటున్నారు. ఇటీవల ఎన్నికల్లో ఉపయోగించిన వీవీప్యాట్ల పనితీరుపైనా కొందరు ఓటర్లు అనుమానాలు వ్యక్తం చేశారని, ఎన్నికల సంఘం వారి అనుమానాలు తీరేలా యంత్రాలను మెరుగుపరచాలని వారు సూచిస్తున్నారు. -
50 ర్యాలీలు..100 స్థానాలు
న్యూఢిల్లీ/లక్నో: 2019 లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది ఫిబ్రవరికల్లా ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా 100 పార్లమెంట్ నియోజకవర్గాలను చుట్టివచ్చేలా 50 ర్యాలీల్లో పాల్గొననున్నారు. ఎన్నికల ప్రకటన వెలువడే సమయానికి మోదీ, అగ్రనేతలు అమిత్‌షా, రాజ్‌నాథ్, గడ్కరీతో కలిపి మొత్తంగా 200 ర్యాలీలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో ర్యాలీ రెండు మూడు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో జరిగేలా ప్రణాళిక రూపొందించారు. దీంతో ఎన్నికల ప్రకటనకు ముందే దేశవ్యాప్తంగా ఉన్న కనీసం 400 నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులను అప్రమత్తం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్‌గఢ్‌లలో జరిగే బహిరంగ సభల్లోనూ మోదీ పాల్గొననున్నారు. నేటి నుంచి యూపీలో ప్రధాని పర్యటన ప్రధాని మోదీ యూపీలోని సొంత నియోజకవర్గం వారణాసితోపాటు ఆజంగఢ్, మిర్జాపూర్లలో శని, ఆదివారాల్లో పర్యటించనున్నారు. శనివారం వారణాసిలోని కచ్నార్లో జరిగే ర్యాలీలో ప్రసంగించి, బీజేపీ కార్యకర్తలతో సమావేశమవుతారు. ఆజంగఢ్‌లో రూ.23వేల కోట్లతో నిర్మించనున్న లక్నో–ఘాజీపూర్ ఆరు లైన్ల ఎక్స్‌ప్రెస్ హైవేకు శంకుస్థాపన చేసి, అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆదివారం మిర్జాపూర్‌లో బన్సాగర్ కెనాల్ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు. -
దక్షిణ పర్యటనకు అమిత్ షా
తిరువనంతపురం : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తన పర్యటనను ముమ్మరం చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రణళికలను సమీక్షించేందుకు అమిత్ షా మంగళవారం కేరళలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా కార్యకర్తలతో, రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కె. రాజశేఖరన్‌ను అనూహ్యంగా మిజోరం గవర్నర్‌గా నియమించడంతో రాష్ట్రానికి నూతన అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. గతంలో కేవలం ఆరు శాతమే ఉన్న బీజేపీ ఓట్లశాతం 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 14 శాతానికి పెరిగింది. 2019 లోక్‌సభ ఎన్నికలలోపు రాష్ట్రంలో మరింత బలపడాలని కమళదళం ప్రయత్నిస్తోంది. ప్రధాన మిత్రపక్షమైన భారత్ ధర్మ జనసేనాతో (బీడీజేఎస్) కలిసి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయనుంది. మాజీ కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత రాజ్‌గోపాల్ ఒక్కరు మాత్రమే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరుఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో ప్రధానంగా సీపీఎం నేతృత్వంలోని (ఎల్డీఎఫ్), కాంగ్రెస్ నేతృత్వంలోని(యూడీఎఫ్) బలంగా ఉన్న నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఏవిధమైన వ్యూహం అమలు చేస్తుందో వేచి చూడాలి. -
ఎన్నికల తరువాతే మహాకూటమి?
కర్ణాటకలో జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కిందటి నెల అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన మహాగఠబంధన్ (మహాకూటమి) వచ్చే లోక్‌సభ ఎన్నికల ముందు సాధ్యమయ్యేది కాదని స్పష్టమౌతోంది. ఇటీవల ఎన్సీపీ నేత శరద్ పవార్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా బీజేపీయేతర రాజకీయపార్టీల మధ్య పార్లమెంటు ఎన్నికల్లో జాతీయస్థాయిలో సీట్ల సర్దుబాటు ఉండదని తేల్చిచెప్పారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ ప్రతి రాష్ట్రంలో ఎన్డీఏకు వ్యతిరేకంగా ఒకే అభ్యర్థిని నిలపాలన్న ప్రతిపాదన మొదట పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ చేయగా, బెంగళూరులో హెచ్డీ కుమారస్వామి ప్రమాణానికి హాజరైన ప్రతిపక్షాల నేతలు దీనికి మద్దతు పలికారు. అయితే, బీజేపీయేతర పార్టీల మహాకూటమి సాధారణ ఎన్నికల తర్వాత మాత్రమే ఏర్పడుతుందని ఈ పార్టీల నేతల తాజా ప్రకటనలు సూచిస్తున్నాయి. యూపీ, బిహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమి ళనాడు, కర్ణాటక, ఒడిశా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలదే ఆధిపత్యం. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లోని బడా ప్రాంతీయ పార్టీలే మిగిలిన బీజేపీయేతర పార్టీలకు కొద్దోగొప్పో లోక్‌సభ సీట్లు కేటాయించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తమ బలానికి అనుగుణంగా తగినన్ని సీట్లు ఇవ్వకపోతే మిగిలిన పక్షాలు ఎన్నికల ముందు సీట్ల సర్దుబాటుకు అంగీకరించవు. అలాగే, గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెసే పెద్ద పార్టీ కావడంతో ఇతర ప్రతిపక్షాలతో సీట్ల సర్దుబాటుకు అవకాశం లేదు. కేరళలోని రెండు ప్రధాన కూటము(ఎల్డీఎఫ్, యూడీఎఫ్)ల మధ్య పోరు తప్పదు. బీజేపీ ఈ రాష్ట్రంలో మూడో పక్షంగా మిగిలిపోయింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు మెజారిటీ రానిపక్షంలో జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలన్నీ ఎన్నికల ఫలితాలు వచ్చాకే చేతులు కలుపుతాయి. పార్లమెంటు ఎన్నికలకు ముందు రాష్ట్రాలవారీగా మాత్రమే బీజేపీయేతర పార్టీల మధ్య ఓ మోస్తరు సీట్ల సర్దుబాటుకు అవకాశముంటుంది. ఇదే విషయం పవార్, సూర్జేవాలా చెప్పారు. మహాకూటమి సాధ్యం కాదన్న పవార్! వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాల మధ్య జాతీయస్థాయిలో పొత్తు ఉండదని, మహాకూటమి ఎన్నికలకు ముందు ఆచరణసాధ్యం కాదని శరద్‌పవార్ ఇటీవల తేల్చిచెప్పారు. అన్ని రాష్ట్రాల్లోనూ నంబర్‌వన్ ప్రతిపక్ష పార్టీయే సీట్లు కేటాయిస్తుందని ఆయన అన్నారు. పొత్తులు రాష్ట్రాలవారీగా పార్టీల మధ్య కుదురుతాయనీ, అన్ని రాష్ట్రాల్లో అనుసరించడానికి వీలైన ఒకే తరహా పొత్తుల నమూనా ఏదీ ఉండదని కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా అభిప్రాయపడ్డారు. బిహార్‌లో ప్రతిపక్షాల మధ్య కుదిరే పొత్తు యూపీలో పనిచేయదని ఆయన అన్నారు. మమతా బెనర్జీ సహా అనేక మంది ప్రాంతీయపక్షాల నేతలు మహాకూటమికి నాయకత్వం వహించాలని ఉవ్విళ్లూరుతున్న కారణంగా కాంగ్రెస్ వైఖరి మారిందని భావిస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేయడానికి మమత, మాయావతి, అఖిలేశ్ వంటి నేతలు సిద్ధంగా లేకపోవడంతో అనేక రాష్ట్రాల్లో ఎన్నికల పొత్తు కాంగ్రెస్‌కు సాధ్యం కాదనీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ప్రకటించాకే ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడే అవకాశముందని ఈ జాతీయపార్టీ అభిప్రాయపడుతోంది. కుమారస్వామి ప్రమాణానికి బెంగళూరు వచ్చిన పార్టీల నేతలందరూ ఎన్నికల్లో కలిసి పోటీచేయాల్సిన అవసరం లేదని జేడీఎస్ నేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ చెప్పారు. ఈ పార్టీలన్నీ అన్ని రాష్ట్రాల్లో చేతులు కలుపుతాయని ఆశించవద్దని ఆయన అన్నారు. ఎన్నికల ముందు సీట్ల సర్దుబాటుపై కీచులాడుకోకుండా ఫలితాలు వెలవడ్డాకే ఎన్డీఏ మెజారిటీ కోల్పోయేపక్షంలో ప్రతిపక్షాలు చేతులు కలపడం మేలనే అభిప్రాయం అనేక మంది ప్రతిపక్షనేతల్లో బలపడుతోంది. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ మధ్యే పొత్తు? ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రధాన ప్రాంతీయపార్టీలైన ఎస్పీ, బీఎస్పీ ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై ఒక అవగాహనకు వచ్చాయని తెలుస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 80 సీట్లకుగాను బీఎస్పీ ఎక్కువ సీట్లకు, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ అత్యధిక స్థానాలకు పోటీచేసేలా రెండు పార్టీల నేతలు మాయావతి, అఖిలేశ్ యాదవ్ సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. రాష్ట్రంలో పెద్దగా బలంలేని, తన ఓట్లు మిత్రపక్షాలకు బదిలీ చేయలేని కాంగ్రెస్‌కు రెండు సీట్లకు మించి ఇచ్చేది లేదని అఖిలేశ్ అన్నారని కూడా వార్తలొచ్చాయి. నెహ్రూ–గాంధీ కుటుంబానికి సొంత రాష్ట్రంగా చెప్పే యూపీలో కనీసం 20 సీట్లకైనా పోటీచేయకపోతే పరువు పోతుందనే భావన కాంగ్రెస్‌లో ఉంది. ఈ లెక్కన ఎస్పీ, బీఎస్పీ మధ్య మాత్రమే సీట్ల సర్దుబాటు కుదురుతుంది. బిహార్‌లో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీయే కాంగ్రెస్ వంటి చిన్న పార్టీలకు సీట్లు ఇచ్చే స్థితిలో ఉంది. ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుకు అవకాశమున్న మరో పెద్ద రాష్ట్రం మహారాష్ట్ర. ఇక్కడ దాదాపు సమాన బలం ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీ కూడా కలిసి పోటీచేసే అవకాశాలున్నాయి. కర్ణాటకలో కూడా సంకీర్ణ భాగస్వామ్యపక్షాలైన కాంగ్రెస్, జేడీఎస్ 28 లోక్‌సభ సీట్లను పంచుకుంటాయనడంలో సందేహం లేదు. పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడులో పాలక ప్రాంతీయపక్షాలైన తృణమూల్, బీజేడీ, ఏఐఏడీఎంకే మిగిలిన మిత్రపక్షాలకు ఎవరికి ఎన్ని సీట్లో నిర్ణయిస్తాయి. తమిళనాట ప్రధానప్రతిపక్షమైన డీఎంకే నాయకత్వాన కాంగ్రెస్ వంటి పార్టీలు కలిసి పోటీచేస్తాయి. తెలుగు రాష్ట్రాల్లోని పాలక ప్రాంతీయపక్షాలు బీజేపీకి వ్యతిరేకమని ప్రకటించినా లోక్‌సభ సీట్లు ఇతర చిన్న పార్టీలకు ఎంత వరకు కేటాయిస్తాయో అప్పుడే చెప్పడం కష్టం. -
ముందస్తు ఎన్నికలు రాకపోవచ్చు: ఖర్గే
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అధికార బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లకపోవచ్చని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. దీనిపై బీజేపీ వైఖరిపై పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాకే స్పష్టత వస్తుందన్నారు. ‘కొన్ని రాష్ట్రాల్లో నవంబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది. దీని ప్రకారం నవంబర్, డిసెంబర్లలో లోక్‌సభ ఎన్నికలు జరిపేందుకు బీజేపీ యోచన చేస్తుండవచ్చు. పూర్తికాలం పని చేసిన మహారాష్ట్ర వంటి అసెంబ్లీలకు సాధారణ ఎన్నికలు జరిపితే వచ్చే లాభ, నష్టాలపైనా బీజేపీ లెక్కలు వేసుకుంటోంది. ప్రస్తుత రాజకీయ సమీకరణాలను బట్టి, ఆ పార్టీ ముందుగానే ఎన్నికలకు మొగ్గు చూపకపోవచ్చు’ అని ఖర్గే అభిప్రాయపడ్డారు. అయితే, ఆ పార్టీ తమ శ్రేణులకు ఇస్తున్న సంకేతాలను బట్టి ఈ వర్షాకాల సమావేశాలే పార్లమెంట్ ఆఖరి సమావేశాలు అనిపిస్తోంది’ అని అన్నారు. -
ఐపీఎల్-12వ సీజన్ మార్చిలోనే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 (ఐపీఎల్ ) సంబరం అయిపోయింది. కానీ, ప్రేక్షకులు మాత్రం అప్పుడే వచ్చే ఐపీఎల్ గురించి చర్చలు మొదలుపెట్టారు. ఈసారి ఐపీఎల్-12వ సీజన్ ముందుగానే జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే అభిమానులు ఎంతగానో ఎదురుచూసే వరల్డ్ కప్ కూడా 2019లోనే జరగనుంది. వచ్చే ఏడాది వరల్డ్ కప్‌తో పాటు.. సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మార్చిలోనే ఐపీఎల్‌ను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్ కప్ మే 30 నుంచి ప్రారంభమవుతుంది. ఇండియా ప్లేయర్స్ నిబంధనల ప్రకారం ఒక టోర్ని అయిపోయినత తర్వాత మరో టోర్నీలో మ్యాచ్ ఆడటానికి కనీసం 15 రోజుల విరామం ఉండాలి. దీనిలో భాగంగానే ఐపీఎల్-12వ సీజన్ త్వరగానే నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇంగ్లాండ్‌లోని వేల్స్ వేదికగా 2019 మే 30 నుంచి జూలై 14 వరకు వరల్డ్ కప్ జరగనుంది. అయితే ప్రతి సంవత్సరం ఐపీఎల్ ఏప్రిల్ మొదటి లేదా రెండో వారంలో ప్రారంభమై మే నెల చివరి వారంలో ముగుస్తుంది. కానీ, ఈసారి మాత్రం ఐపీఎల్ మే మూడో వారంలోనే ముగించాలి. అలా అయితేనే ఇండియన్ ప్లేయర్స్‌కు వరల్డ్ కప్‌లో ఆడేందుకు 15 రోజుల గ్యాప్ లభిస్తుంది. ఈ విధంగా చూస్తే 2019లో మార్చి 29న ఐపీఎల్ -12వ సీజన్ ప్రారంభమతుందని సమాచారం. అంతేకాక ఐపీఎల్-12ను విదేశాల్లో నిర్వహించే అవకాశం ఉందన్నారు. ఎలక్షన్ సమయంలో మ్యాచ్‌లు నిర్వహిస్తే భద్రత కష్టమవతుంది. గతంలో కూడా 2009లో ఎన్నికల సమయంలో ఐపీఎల్‌ను సౌతాఫ్రికాలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఐపీఎల్-11వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కప్ కైవసం చేసుకున్న విషయం విదితమే. -
సంచలనం: జస్టిస్ కర్ణన్ రాజకీయ పార్టీ
కోల్‌కత: హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్ మరో సంచలనానికి తెరలేపారు. 2019 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ పెడుతున్నట్లు బుధవారం ప్రకటించారు. దేశంలోని 543 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తామని ఆయన తెలిపారు. ‘ఆంటీ కరప్షన్ డైనమిక్ పార్టీ’ (ఏసీడీపీ) పేరుతో పార్టీని రిజిస్టర్ చేయించబోతున్నట్లు కర్ణన్ సహాయకుడు ఆంథోని డబ్ల్యూ లిజారో వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నుంచి కర్ణన్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దిగుతారని ఆయన తెలిపారు. దేశం నుంచి అవినీతిని సమూలంగా తరిమికొట్టడమే తమ పార్టీ సిద్ధాంతమని కర్ణన్ ఉద్ఘాటించారు. వారణాసి మినహా మిగతా అన్ని స్థానాల నుంచి మహిళలు మాత్రమే తమ పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగుతారని కర్ణన్ ప్రకటించారు. తమ పార్టీ తరపున ఎన్నికల పోటీలో పాల్గొనే అభ్యర్థులకు ఎన్నికల వ్యయంగా లక్ష రూపాయలు కర్ణన్ అందిస్తారని లిజారో తెలిపారు. కోల్‌కతా హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారన్న అభియోగంపై గతేడాది మే 9న జస్టిస్ కర్ణన్‌కు సుప్రీంకోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. దీంతో పశ్చిమబెంగాల్ నుంచి కోయంబత్తూరుకు పరారైన కర్ణన్‌ను జూన్ 20న సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. 6 నెలల జైలు జీవితం అనంతరం గత డిసెంబరు 20న కర్ణన్ విడుదలయ్యారు. కాగా, పదవిలో ఉండగా అరెస్టయిన తొలి హైకోర్టు జడ్జిగా ఆయన రికార్డులకెక్కారు. మద్రాస్ హైకోర్టు జడ్జిగానూ ఆయన పనిచేశారు. -
2019 సమరానికి ఉత్సాహంగా...
ఉత్తరాది పార్టీగా బీజేపీపై ఉన్న ముద్రను కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో ప్రధాని మోదీ– బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు చెరిపివేయగలిగారు. వారిద్దరి ఎత్తుగడలు, వ్యూహాలు కర్ణాటకలో ఫలించిన నేపథ్యంలో.. డిసెంబర్లో జరిగే నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో పోరాటానికి కమలం పార్టీ ఉత్సాహంగా సిద్ధమవుతోంది. అలాగే 2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించాలని పట్టుదలతో ఉన్న బీజేపీకి కన్నడ శాసనసభ ఫలితాలు ఉత్తేజాన్నిచ్చాయి. నిజానికి నాలుగేళ్లుగా కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదాన్ని నిజం చేస్తూ అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వరుస విజయాలు సాధించడంతో కాంగ్రెస్ బక్కచిక్కిపోయింది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ప్రతిపక్షాలకు నాయకత్వం వహించే సామర్థ్యం ఆ పార్టీకి లేదని ఇప్పటికే స్పష్టమైంది. ఫ్రంట్ ప్రయత్నాలు ఫలించేనా... మరోవైపు, ప్రధాన ప్రాంతీయ పార్టీలన్ని బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలు ఏడాదిలో ఫలించకపోవచ్చు. ఫెడరల్ ఫ్రంట్ పేరిట మూడో జాతీయ ప్రత్యామ్నాయం ఏర్పాటుకు తగిన సమయం, అవకాశాలు కనిపించడం లేదు. కర్ణాటకలో జేడీఎస్ కాంగ్రెస్‌తో చేతులు కలిపే అవకాశాలున్నాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఫెడరల్ ఫ్రంట్‌కు ఆస్కారం లేదు. పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోకడల వల్ల అక్కడ బీజేపీయేతర పార్టీలతో తృణమూల్‌కు పొత్తు కుదిరే అవకాశం లేదని బెంగాల్ పంచాయతీ ఎన్నికలు నిరూపించాయి. వామపక్షాలు బలంగా ఉన్న కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపురలో కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తులకు అవకాశం లేకపోవడం బీజేపీకి కలిసొచ్చే అంశం. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, అందరికీ వికాసం వంటి హామీలతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. మరి వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ఎన్నికల నినాదాలతో ముందుకు సాగాలో బీజేపీ నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఆర్థికంగా అద్భుత విజయాలు లేకపోవడంతో.. మతపరమైన ఎజెండాతోనే బీజేపీ ముందుకెళ్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయోధ్య వంటి అంశాలపై పోరాడుతుందని అంచనా వేస్తున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కేసీఆర్ ఫ్రంట్ సక్సెస్ కాదు: కారత్
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలంటే రాష్ట్రాల వారీగా ఆ పార్టీ వ్యతిరేక ఓట్లను ఏకం చేయాలని, బీజేపీ, కాంగ్రెసేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలు ఫలించబోవని సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ అన్నారు. పార్టీ పత్రిక పీపుల్స్ డెమొక్రసీలో ఆయన సంపాదకీయం రాస్తూ.. ‘ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపాదించిన బీజేపీ, కాంగ్రెసేతర ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలు విఫలమవుతాయి. డీఎంకే, ఆర్జేడీ వంటి కొన్ని ప్రాంతీయ పార్టీలు సొంత రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో కొనసాగుతున్నాయి. విధానాలు, స్థానిక ప్రయోజనాల దృష్ట్యా ప్రాంతీయ పార్టీల మధ్య అనేక వైరుధ్యాలు ఉండడం ఫ్రంట్ ఏర్పాటుకు అడ్డంకిగా మారనున్నాయి. అందువల్ల యూపీలో అనుసరించినట్లు బీజేపీ వ్యతిరేక ఓట్లను ఏకం చేస్తేనే ఆ పార్టీని ఓడించగలం’ అని పేర్కొన్నారు. -
బీజేపీని హెచ్చరించిన శివసేన!
ముంబై: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ స్థానాలు వందకు పైగా తగ్గిపోతాయని శివసేన నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల యూపీ, బిహార్ ఉప ఎన్నికల ఫలితాలతో పోల్చి వచ్చే లోక్‌సభ ఎన్నికల పరిణామాలపై శివసేన పత్రిక సామ్నా ఓ కథనాన్ని ప్రచురించింది. బీజేపీ నేతలకు ఈ కథనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 100 నుంచి 110 స్థానాలు కోల్పోనుందన్నది శివసేన అభిప్రాయం. త్రిపురలో కమ్యూనిస్ట్ కంచుకోటను బద్దలుకొట్టిన తర్వాత బీజేపీ ప్రాబల్యం దేశంలో మరింత పెరిగిపోయిందని ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. కానీ యూపీలో సీఎం, డిప్యూటీ సీఎంల రాజీనామాలతో ఖాళీ అయిన గోరఖ్‌పూర్, ఫూల్పుర్ లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి బీజేపీకి షాకివ్వడం శివసేనకు హాట్ టాపిక్‌గా. 2014లో కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక 23 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కేవలం 4 సీట్లు మాత్రమే బీజేపీ నెగ్గి, 19 స్థానాల్లో ఓటమి చవిచూసింది. త్రిపురలో విజయం అనంతరం దేశ వ్యాప్తంగా బీజేపీ హవా నడుస్తుందని, ప్రజలు ఎన్డీఏ పాలనకు పట్టం కట్టారని చెప్పి ఆ పార్టీ నేతలు.. కీలకమైన యూపీ రెండు లోక్‌సభ స్థానాల్లో ఓటమి తర్వాత ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. కానీ బీజేపీ మాత్రం ఓట్ల శాతం తగ్గడం, ఎస్పీ-బీఎస్పీలు కలిసి బరిలోకి దిగడం కొంప ముంచిందంటూ వేరే సాకులు చెబుతున్నారని సంపాదకీయం ద్వారా శివసేన తమ అభిప్రాయాన్ని, 2019 లోక్‌సభ ఎన్నికలపై జోస్యం చెప్పింది. అత్యధిక లోక్‌సభ స్థానాలుండే యూపీ, బిహార్ లాంటి రాష్ట్రాల్లో ఓటు బ్యాంకు తగ్గితే బీజేపీ సీట్లు కూడా తగ్గుతాయని హెచ్చరించింది. బిహార్‌లో ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ జైలుకు వెళ్లిన నేపథ్యాన్ని ఉపయోగించుకుని నితీశ్, బీజేపీలు ఓటర్లను ఆకర్షించుకోలేక పోడం ఎన్డీఏ పాలనకు ఆ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పుగా భావించవచ్చునని శివసేన నేతలు చెబుతున్నారు. -
ఎంపీలు.. మీ ప్రోగ్రెస్ చెప్పండి?!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అప్పుడే 2019 లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఈ నాలుగేళ్ల కాలంలో నియోజకవర్గాల్లో సాధించిన ప్రగతిని వివరించాలంటూ ప్రధాని మోదీ పార్టీలకు సూచించారు. ప్రజలకు అందించిన మౌలిక సదుపాయాల కల్పన, కీలకమైన విజయాలు, సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి చేసిన కృషిపై ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలని ఆయన ఎంపీలకు తెలిపారు. కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టులపై ప్రజలనుంచి అభిప్రాయాలను సేకరించాలని సహచర మంత్రులకు మోదీ సూచించారు. ఇదిలావుండగా.. ఇప్పటికే 250 మంది బీజేపీ ఎంపీల నమో యాప్‌ను తమ స్మార్ట్ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకున్నట్లు తెలిసింది. -
2024 నుంచి జమిలి ఎన్నికలు
నీతి ఆయోగ్ సూచన న్యూఢిల్లీ: లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు 2024 నుంచి ఒకేసారి ఎన్నికలు జరపాలని నీతి ఆయోగ్ సూచించింది. పరిపాలనకు ఎన్నికల ప్రచారంతో ఇబ్బంది కలగకుండా దేశంలో అన్ని ఎన్నికలను ఒకేసారి స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించాలని తన మూడేళ్ల కార్యాచరణ ఎజెండా(2017–2020) ముసాయిదాలో పేర్కొంది. ‘దేశ ప్రయోజనాల కోసం 2024 నుంచి రెండు దశల్లో జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించాలి. ఈ ప్రతిపాదన అమలు చేయడానికి కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువును గరిష్టంగా ఒకసారి తగ్గించడం చేయడంగానీ, పొడిగించడం గానీ అవసరమవుతుంది. ఈ సూచనను పరిశీలించడానికి ఎన్నికల సంఘం నోడల్ సంస్థగా ఉండాలి. రోడ్ మ్యాప్ కోసం రాజ్యంగ నిపుణులు, మేధావులు, ప్రభుత్వాధికారులు, పార్టీల ప్రతినిధులతో వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసి, ఆరు నెలల్లోగా ఒక నివేదికను ఖరారు చేయాలి. రాజ్యాంగ, చట్ట సవరణలు, జమిలి ఎన్నికలకు మారడానికి ఆచరణసాధ్యమైన విధానం వంటి వాటిని పరిశీలించి, వచ్చే ఏడాది మార్చినాటికి బ్లూ–ప్రింట్‌ను సిద్ధం చేయాలి’ అని సూచించింది. ‘నీతి’ మూడేళ్ల ముసాయిదా ప్రణాళికను గత నెల 23న నీతి ఆయోగ్ పాలకమండలి సభ్యులకు అందజేయడం తెలిసిందే. లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలు చెబుతున్న నేపథ్యంలో ‘నీతి’ సూచన ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వ సేవలు ఔట్‌సోర్సింగ్‌కు న్యూఢిల్లీ: ప్రభుత్వ సర్వీసుల్లో ఔట్ సోర్సింగ్స్ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. తద్వారా ‘ప్రైవేట్’ మేధస్సును పాలనకు వినియోగించుకోవచ్చని అభిప్రాయపడింది. పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం పైనే ఆధారపడడాన్ని తగ్గించాల్సి ఉందని పేర్కొంది. బ్యూరోక్రసీలోనూ పోటీతత్వాన్ని నెలకొల్పాలని తన మూడేళ్ల కార్యాచరణ ఎజెండా ముసాయిదాలో సూచించింది. 2018–19లో పాలనలో ఎక్కువ శాతం డిజిటలైజ్ చేయాలని చెప్పింది. సివిల్ సర్వీస్ అధికారులనూ ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని.. బాగా పనిచేసిన వారికి అవార్డులు ఇవ్వాలని, అలాగే పనిలో సత్తా చూపించని వారిని మందలించాల్సిన అవసరం ఉందని చెప్పింది. నీతి ఆయోగ్ ఈ నివేదికను ఏప్రిల్ 23నే సభ్యులకు పంపింది. ‘న్యాయ పనితీరు సూచీ’ కావాలి న్యూఢిల్లీ: విచారణలో జాప్యం, పెండింగ్ కేసుల సమస్య పరిష్కారం కోసం ‘న్యాయవ్యవస్థ పనితీరు సూచీ’(జ్యుడీషియన్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్)ని ప్రవేశపెట్టాలని నీతి ఆయోగ్ సూచించింది. కింది కోర్టుల్లో జాప్యం తగ్గించి, వాటి పనితీరును తెలుసుకోవడానికి ఈ సూచీ హైకోర్టులకు, హైకోర్టు చీఫ్ జస్టిస్‌లకు దోహదపడుతుందని పేర్కొంది. ‘దీని కోసం వివిధ కేసుల పరిష్కారానికి వివిధ కాలపరిమితులు కావాలి. వార్షిక పనితీరు మదింపు వల్ల తాము ఎక్కడ విఫలమయ్యామో, సమస్య పరిష్కారానికి ఏం చేయాలో హైకోర్టు, జిల్లాల కోర్టుల జడ్జీలకు తెలుస్తుంది’ అని తెలిపింది. అవినీతి కేసులు పేరుకుపోయాయని, వాటిని కోర్టులు నిర్దిష్ట కాలవ్యవధితో పరిష్కరించాలని సూచించింది. -
జమిలి ఎన్నికల చర్చ
దాదాపు ఏణ్ణర్ధం నుంచి అప్పుడప్పుడు వినిపిస్తున్న జమిలి ఎన్నికల ప్రస్తావన మరోసారి తెరపైకి వచ్చింది. ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ పార్లమెంటుకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్ని కలపై ప్రారంభమైన నిర్మాణాత్మక చర్చను కొనసాగించాలని ముఖ్యమంత్రులను కోరారు. ఒకేసారి ఎన్నికల నిర్వహణ మనకు కొత్తేమీ కాదు. దేశంలో 1967 వరకూ ఆ పద్ధతే అమల్లో ఉంది. అంటే 1952, 1957, 1962, 1967ల్లో లోక్‌సభకూ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకూ ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి. అంతవరకూ ఏ ఎన్నిక జరిగినా తిరుగులేని విజయం సాధిస్తూ వచ్చిన కాంగ్రెస్ తొలిసారి 1967 లోక్‌సభ ఎన్నికల్లో బలహీనపడటంతోపాటు కొన్ని రాష్ట్రాల్లో బాగా దెబ్బతింది. అలాంటి చోట చిన్న పార్టీలు విజయం సాధించి కూటములుగా ఏర్పడి సంకీర్ణ ప్రభుత్వాలు నెలకొల్పాయి. ఆ ప్రభుత్వాలు ఎన్నాళ్లో మనుగడ సాధించలేకపోయాయి. మరో పక్క ఇందిరాగాంధీ 1971లో లోక్‌సభను రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు సిద్ధపడ్డారు. ఫలితంగా జమిలి ఎన్నికల సంప్రదాయానికి గండిపడింది. అప్పటినుంచీ దేశంలో ఇంచుమించు ఏడాదికో, రెండేళ్లకో ఏదో ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వస్తూనే ఉన్నాయి. జమిలి ఎన్నికలు పోయి ఇలా వేరు ఎన్నికలు రావడంలో నిజంగా సమస్య లున్నాయా? ఉంటే ఎవరికున్నట్టు? వాజపేయి నేతృత్వంలో 1999లో ఎన్డీఏ ప్రభుత్వం ఉండగా లా కమిషన్ సమ ర్పించిన 170వ నివేదిక ఎన్నికల సంస్కరణలపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిం చింది. అందులో జమిలి ఎన్నికల అవసరాన్ని చర్చించింది. 2012లో బీజేపీ సీనియర్ నేత ఎల్కే అడ్వాణి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి ఈ అంశంపై లేఖ రాశారు. నిరుడు సెప్టెంబర్‌లో ప్రణబ్ ముఖర్జీయే ఏకకాలంలో ఎన్నికలపై అన్ని పార్టీలూ ఏకాభిప్రా యానికి రావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం సరేసరి. అది సందర్భం వచ్చిన ప్పుడల్లా ఈ ప్రతిపాదన గురించి చెబుతూనే వస్తోంది. పార్లమెంటరీ స్థాయీ సంఘం కూడా జమిలి ఎన్నికలకే ఓటేసింది. చాలా పార్టీలు కూడా ఈ ప్రతిపాదన సహేతుకమై నదని అంటున్నాయి. కాకపోతే ఆచరణ సాధ్యంకాదని పెదవి విరుస్తున్నాయి. ఎందుకంటే అందుకోసం కొన్ని అసెంబ్లీల గడువు కాలాన్ని పెంచాల్సి ఉంటుంది. మరికొన్నిటికి కోత వేయాల్సివస్తుంది. ఇలా ఇంతమంది ఇన్ని రకాలుగా చెబుతున్నారు... కోరుకుంటున్నారు గనుక అది మంచిదే కావొచ్చునని భావించనవసరం లేదు. నిజమే–జమిలి విధానం వల్ల ఎన్నికల వ్యయం గణనీయంగా తగ్గిపోతుంది. ఆర్ధిక ఇబ్బందులతో సతమతమయ్యే మన దేశంలో ఈ ఇది చెప్పుకోదగ్గ ఆదాయే. కొంత మేర నల్ల డబ్బు ప్రభావమూ తగ్గొచ్చు. దీన్ని సమర్ధించేవారు చెబుతున్న బలమైన కారణం మరొకటుంది. అది ప్రభుత్వ విధానాలకు సంబంధించింది. తరచు ఎన్నిక లుండటం వల్ల ప్రభుత్వ విధానాలకూ, కార్యక్రమాలకూ గండిపడుతున్నదని జమిలి ఎన్నికల సమర్ధకులు చెప్పే మాట. ఏ ఏ సందర్భాల్లో గండి పడిందో ఇలాంటివారు నిర్దిష్టమైన ఉదాహరణలిస్తే అందులోని లాభనష్టాలపై చర్చించవచ్చు. చిల్లర వర్త కంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) అనుమతించడానికి సంబంధించిన బిల్లుపై 2012లో దేశవ్యాప్తంగా నిరసనలొచ్చినా, రాజ్యసభలో అప్పట్లో యూపీఏ ప్రభుత్వం మైనారిటీలో ఉన్నా ఆ బిల్లు సునాయాసంగా నెగ్గింది. ఆ బిల్లును వ్యతి రేకిస్తున్నానని చెప్పిన టీడీపీ ఆఖరి నిమిషంలో తన ఎంపీలను సభకు గైర్హాజరయ్యేలా చేసి కాంగ్రెస్‌కు తోడ్పడింది. బీఎస్పీ, ఎస్పీలు సైతం ఆ పనే చేశాయి. కనుక ప్రభు త్వాలకు జీవన్మరణ సమస్యగా మారిన కీలక సంస్కరణలేవీ ఎన్నికల కారణంగా ఎప్పుడూ ఆగలేదు. ఎన్నో వైవిధ్యతలున్న దేశంలో జమిలి ఎన్నికలతో ఏకరూపత సాధించాలను కోవడంలోని తర్కమేమిటో బోధపడదు. వేర్వేరు ఎన్నికలుండటంవల్ల ప్రజా స్వామ్యం, ఫెడరలిజంలు పరిఢవిల్లుతాయి... పరిపుష్టమవుతాయే తప్ప బలహీనప డవు. రాష్ట్రాల ఎన్నికల్లో ప్రాంతీయ ఆకాంక్షలు, సమస్యలు ఎజెండాలోకి వస్తాయి. అభివృద్ధికి సంబంధించి వేర్వేరు రాష్ట్రాల ప్రజలు వేర్వేరు మార్గాలు ఎంచుకుంటారు. ఒక రాష్ట్రంలో ఎంతో ప్రజాదరణ పొందిన పార్టీ మరోచోట ఎవరికీ తెలియక పోవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108 వంటివి ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లేవు. మరోపక్క విపక్షాల ఏలుబడిలోని చాలా రాష్ట్రాలు ఆ పథకాలను అమలు చేసి అనంతర కాలంలో ప్రజాదరణ పొందాయి. జమిలి ఎన్నికల్లో ప్రాంతీయ ఆకాంక్షలు, సమస్యలు మరుగునపడతాయి. సృజనాత్మకత, ప్రజా సంక్షేమ పథకాల అమలులో పోటీ తగ్గుతాయి. జాతీయ అంశాలే ప్రధానమవుతాయి. ఇది ఫెడరలిజం స్ఫూర్తికి హాని కలిగిస్తుంది. 1999 మొదలుకొని జరిగిన జమిలి ఎన్నికల ఫలితాలకు సంబంధించిన డేటాను గమనిస్తే కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ ఒకే పార్టీకి ఓటేసే అవకాశాలు 77 శాతం ఉంటాయని తేలిందని ఒక పరిశోధన తేల్చిచెప్పింది. ఒకేసారి ఎన్నికలకు వెళ్లాలన్న విధానం అటు పౌరులకు, ఇటు ప్రభు త్వాలకు కూడా గుదిబండగా మారుతుంది. ఒక అంశంపై అధికార పక్షం స్వేచ్ఛగా ప్రజల తీర్పు కోరడానికి సిద్ధపడటం అసాధ్యమవుతుంది. అటు ప్రజలు సైతం అలా డిమాండ్ చేసే హక్కు కోల్పోతారు. నిజానికి అభివృద్ధి చెందిన అమెరికా, జర్మనీ తది తర దేశాల్లో కూడా జమిలి ఎన్నికల విధానం అమల్లో లేదు. పైగా అధికార పక్షం మైనా రిటీలో పడితే ఏం చేయాలో జమిలి ఎన్నికలు కోరేవారు చెప్పడంలేదు. ప్రస్తుత ఎన్నికల విధానంలో సమస్యలున్న మాట వాస్తవం. ముఖ్యంగా ఎన్ని కల వ్యయం, నల్ల డబ్బు చలామణి అంతకంతకూ పెరుగుతున్నాయి. వీటి కట్టడికి ఏం చేయాలో, ఎన్నికలు జరిగే తీరును ప్రక్షాళన చేసేందుకు ఇంకేమి చర్యలు అవసరమో ఎన్నికల సంఘం చర్చించాలి. పార్టీలకు ఎన్నికల నిధుల్ని ప్రభుత్వం సమకూర్చడంతో సహా అనేక ప్రతిపాదనలు ముందుకొస్తున్నాయి. పార్టీలన్నీ చిత్త శుద్ధితో వ్యవహరిస్తే ఈ అంశాల్లో ఏకాభిప్రాయం కష్టం కాదు. ప్రభుత్వాలు ప్రజాకంటకంగా మారిన ప్పుడు పౌరులకు ‘రీకాల్’ చేసే హక్కుండాలని వాదనలు వినిపిస్తున్నవేళ... అందుకు అసలే అవకాశమీయని జమిలి ఎన్నికలు ప్రధాన చర్చగా మారడం వింత కలిగిస్తుంది. -
దేశమంతా ఒకసారే...
-
దేశమంతా ఒకసారే ఓట్ల పండగ
-
దేశమంతా ఒకసారే ఓట్ల పండగ
లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలపై చర్చ కొనసాగాలి ♦ నవ భారత నిర్మాణం కోసం టీమిండియాగా ముందుకెళ్దాం ♦ జీఎస్టీపై ఏకాభిప్రాయం సహకార సమాఖ్య స్ఫూర్తికి తార్కాణం ♦ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో మోదీ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనపై నిర్మాణాత్మకచర్చ ప్రారంభమైందని.. ఈ చర్చను కొనసాగించాలని ప్రధాని నరేంద్ర మోదీ.. రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. ఆర్థిక సంవత్సరాన్ని ప్రస్తుతమున్న ఏప్రిల్–మార్చ్ నుంచి జనవరి–డిసెంబర్‌కు మార్చే అంశంపైనా చర్చ జరగాలన్నారు. రాష్ట్రాలు ఈ దిశగా చొరవతీసుకోవాలని ప్రధాని కోరారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఆదివారం జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మూడో సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. ఆర్థిక, రాజకీయ వ్యవహారాలను సరిగా నిర్వహించకపోవటం వల్లే దేశం తీవ్రంగా నష్టపోయిందన్నారు. ‘సరైన సమయపాలన లేని కారణంగా ఎన్నో గొప్ప పథకాలు, నిర్ణయాలు.. అనుకున్న ఫలితాలనివ్వకుండా వ్యర్థమయ్యాయి. మంచి ఫలితాలు రావాలంటే దృఢచిత్తంతో నిర్ణయాలు తీసుకోవటాన్ని అలవర్చుకోవాలి’ అని తెలిపారు. నవభారత నిర్మాణంలో కేంద్ర, రాష్ట్రాలు కలసి టీమిండియా స్ఫూర్తితో ముందుకెళదామని పిలుపునిచ్చారు. ‘ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా దేశాన్ని పరివర్తనం చేసేందుకు జరుగుతున్న చర్చలో టీమిండియా ఇక్కడ సమావేశమైంది. మనం కోరుకుంటున్న నవభారత (2022–దేశ స్వాతంత్య్రానికి 75 ఏళ్లు పూర్తవుతాయి) నిర్మాణం లక్ష్యాలను చేరుకోవటం మనందరి సంయుక్త బాధ్యత. లక్ష్యాల సాధనలో క్రియాశీలMంగా పనిచేద్దాం’ అని స్పష్టం చేశారు. నీతి ఆయోగ్ చర్చిస్తున్న దీర్ఘ, మధ్య, స్వల్పకాలిక కార్యాచరణ వల్ల రాష్ట్రాలకు మేలు జరుగుతుందన్నారు. వ్యవసాయాధారంగా ‘బడ్జెట్’ మార్పు బడ్జెట్ తేదీల మార్పు గురించి స్పందిస్తూ.. దేశంలో వ్యవసాయ ఆదాయం కీలకమైన మన దేశంలో.. దీనికి అనుగుణంగానే బడ్జెట్ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ఫిబ్రవరి 1నే బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు ప్రధాని తెలిపారు. ‘రైతులను, వ్యవసాయాన్ని దృష్టిలో ఉంచుకునే జనవరి–డిసెంబర్ ఆర్థిక సంవత్సరంపైనా ఆలోచన చేయాలి’ అని మోదీ సీఎంలను కోరారు. 15 ఏళ్ల దీర్ఘకాళిక ప్రణాళిక, ఏడేళ్ల మధ్యకాలిక వ్యూహం, మూడేళ్ల స్వల్పకాలిక కార్యాచరణ అజెండాగా నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేస్తుందన్నారు.ఈ సమావేశంలో మూడేళ్ల ప్రణాళిక ముసాయిదా కాపీలను సీఎంలకు అందించారు. వీటిపై రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకున్నాక తుది ప్రణాళికను ఖరారు చేయనున్నట్లు ప్రధాని వెల్లడించారు. బడ్జెట్, ప్రణాళికల ఆమోదానికి రాష్ట్రాలు నీతి ఆయోగ్‌కు రావాల్సిన పనిలేదని ఈ సంస్థ ప్రభుత్వ సమాచారంపై ఆధారపడకుండా నిపుణులతో బృందాన్ని ఏర్పాటు చేసుకుందన్నారు. పలువురు సీఎంలు లేవనెత్తిన ప్రాంతీయ అసమానతలపై జాతీయస్థాయిలో చర్చ జరగాలని తెలిపారు. మౌలికవసతుల లేమి కారణంగానే దేశం వెనుకబాటుకు గురైందని.. రోడ్లు, పోర్టులు, విద్యుత్, రైళ్లు వంటి వాటిపై మూలధన వ్యయాన్ని వేగవంతం చేయటం ద్వారా పురోగతి సాధ్యమవుతుందన్నారు. ఈ భేటీలో 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. పశ్చిమబెంగాల్, మేఘాలయా, ఢిల్లీ రాష్ట్రాల సీఎంలు మమత బెనర్జీ, ముకుల్ సంగ్మా, కేజ్రీవాల్ ఈ సమావేశానికి రాలేకపోయినా.. ప్రతినిధులను పంపించారు. విభేదాలు పక్కనపెట్టి ఏకమైన సీఎంలు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయంతోనే కొత్త పరోక్ష పన్నుల విధానం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)పై ముందడుగు పడిందన్న మోదీ.. సహకార సమాఖ్య వ్యవస్థకు ఇదో గొప్ప ఉదాహరణ అని ప్రశంసించారు. ‘జీఎస్టీ ఒకే దేశం, ఒకే ఆశ, ఒకే సంకల్పం అనే స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. రాష్ట్రాలకు మేలు చేస్తుంది. దీనిపై ఏకాభిప్రాయం రావటం చరిత్రాత్మకం. రాజకీయ, సిద్ధాంతపరమైన విభేదాలను పక్కనపెట్టి దేశం కోసం అందరు సీఎంలు ఏకతాటిపైకి రావటం గొప్ప పరిణామం’ అని ప్రధాని తెలిపారు. ప్రభుత్వ ఈ–మార్కెట్‌ప్లేస్ పోర్టల్‌ను వినియోగించటం ద్వారా అవినీతిని అరికట్టవచ్చని, ప్రభుత్వ సేకరణలో పారదర్శకత పెరుగుతుందన్నారు. భీమ్, ఆధార్ సాంకేతికతల ద్వారా రాష్ట్రాలకు భారీగా లాభం చేకూరుతుందని మోదీ తెలిపారు. జీఎస్టీని జూలై 1నుంచి అమలుచేయాల్సి ఉన్నందున.. రాష్ట్రాలు వేగంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. 300 పాయింట్లతో ప్రణాళిక దేశ ఆర్థికాభివృద్ధికి సంబంధించి 300 ప్రత్యేకమైన పాయింట్లపై నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో చర్చ జరిగింది. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా ఈ పాయింట్లపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో వచ్చే 15 ఏళ్ల దీర్ఘకాలిక ప్రణాళిక, ఏడేళ్ల వ్యూహం, మూడేళ్ల కార్యాచరణ ప్రణాళికపై చర్చ జరిగినట్లు నీతి ఆయోగ్ అధికారిక ప్రకటనలో తెలిపింది. విద్య, వైద్యం, మౌలికవసతుల రంగాల్లో మార్పులపైనే ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.రాష్ట్రాలు ఇచ్చిన ఇన్పుట్స్ ఆధారంగా రూపొందించిన ఈ ప్రణాళికలకు సంబంధించి ముసాయిదా రూపొందించారు. కేంద్రం, రాష్ట్రాల ఆర్థిక అంచనాలకు స్థిరత్వం ఇచ్చేలా వీటిని రూపొందించారు. ఈ విజన్‌ను ముందుకు తీసుకెళ్లటంలో రాష్ట్రాలు సూచనలు చేయాలని పనగారియా కోరారు. వచ్చే 15 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ మూడురెట్లు అభివృద్ధి చెందుతుందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా తెలిపారు.2030 కల్లా మన జీడీపీ 7.25 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందన్నారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ మాట్లాడుతూ.. వ్యవసాయం, పేదరిక నిర్మూలన, వైద్యం, విద్య, డిజిటల్ చెల్లింపులు, కోస్తా–ద్వీపాల అభివృద్ధి, పెట్టుబడుల ఉపసంహరణ తదితర అంశాలపైనా ప్రణాళికల్లో పేర్కొన్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, స్వచ్ఛ్ భారత్, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ చెల్లింపుల అంశాలపై ముఖ్యమంత్రుల సబ్‌కమిటీలు చేసిన పనిని ఆయన ప్రశంసించారు. వెనుకబడిన జిల్లాలు, ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రాల జీఎస్టీ చట్టాన్ని త్వరగా ఆమోదించి పంపించాలని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా.. సీఎంలను కోరారు. నీటిపారుదల, సాంకేతికత విస్తరణ, మార్కెట్ సంస్కరణలు, ఈ–నామ్, పశువుల ఉత్పత్తి పెంపు వంటి అంశాలపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ సమావేశంలో మాట్లాడారు. రైతుల ఆదాయం రెట్టింపుచేయటంలో తీసుకోవాల్సిన చర్యలపై నీతి ఆయోగ్ సభ్యుడు (వ్యవసాయం) రమేశ్ చంద్ వివరించారు. అందరూ సుముఖంగానే! సాక్షి, న్యూఢిల్లీ: ఒకేసారి పార్లమెంటు, అసెంబ్లీలకు ఎన్నికలు జరపటంపై ఆసక్తితో ఉన్న ప్రధా ని.. ఆదివారం నీతి ఆయోగ్ సమావేశంలోనూ ఈ అంశాన్ని లేవనెత్తారు. భోజన విరామంలో నూ పలువురు సీఎంల వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించి వారి స్పందన తెలుసుకున్నట్టు తెలిసింది. ఈ అంశంపై ఎవరి నుంచి వ్యతిరేకత రాలేదని, అందరూ సానుకూలంగానే ఉన్నారని సమాచారం. అయితే కొన్ని రాష్ట్రాలకు ఇటీవలే ఎన్నికలు జరగడం, మరికొన్ని రాష్ట్రాలకు త్వరలో ఎన్నికలు జరగనుండడంతో ఈ అంశంపై అన్ని పార్టీల ఏకాభిప్రాయం రావాల్సిన అవసరం ఉంది. అయితే దేశవ్యాప్తంగా ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండడంతో దీనిపై సానుకూలత రావొచ్చని భావిస్తున్నారు. -
కేంద్రంలో మళ్లీ మేమే!
♦ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ♦ రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం మేమే ♦ ముగిసిన పార్టీ శిక్షణా తరగతులు సాక్షి, హైదరాబాద్: దేశ ప్రజలంతా ప్రధాని మోదీ నాయకత్వానికి పూర్తి మద్దతు పలుకు తున్నారని, 2019లో జరిగే పార్లమెంటు ఎన్నిక ల్లోనూ బీజేపీ అధికారం దక్కించుకోవడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ఆదివారం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం అన్నోజిగూడలో జరిగిన పార్టీ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజల ఆకాం క్షను నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఉద్యమంలో పనిచేసిన నాయకులు, ప్రజాసంఘాలు, సామాన్య ప్రజ లు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, వచ్చే ఎన్నిక ల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమన్నారు. సబ్బం డ వర్గాలు ఉద్యమాలు చేసి తెచ్చుకున్న తెలం గాణలో విపక్షాల గొంతు నొక్కడమే కాకుండా ప్రజాసంఘాలను వేధిస్తూ ప్రభుత్వం ఏకపక్షంగా వ్య వహరిస్తోంద న్నారు. ధర్నా చౌక్‌ను సైతం ఎత్తివేస్తూ సామాన్యుల హక్కులను కాలరా స్తోందన్నారు. టీఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అధికారంలోకి వచ్చాక మర్చిపో యిందని, అప్రజా స్వామికంగా వ్యవహరిస్తోందని దుయ్యబ ట్టారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కుంచించు కుపోయిందని, రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని పేర్కొన్నా రు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. కమ్యూనిజానికి కాలం చెల్లింది.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు మాట్లాడుతూ.. కమ్యూనిజానికి కాలం చెల్లిందని, కులాల పంచాయతీని యూనివర్సి టీల్లోకి తేవడం దారుణమని అన్నారు. కామ్రే డ్లు స్వప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని, అంబేడ్కర్ ఆశయ సాధన కోసం కాదని విమర్శించారు. ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని కార్యకర్తలకు సూచించారు. బీజేపీ శాసనసభా పక్షనేత కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. సుపరిపాలన, అవినీతిరహిత పాలన మోదీ ద్వారానే సాధ్యమన్నారు. కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా ఖర్చు చేయడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు నాగం జనార్దన్ రెడ్డి, మంత్రి శ్రీనివాస్, పేరాల శేఖర్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, గుండ్ల బాలరాజు, రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వచ్చిన సుమారు 300 మంది నాయకులు పాల్గొన్నారు. హైదరాబాద్ దళిత వాడలకు అమిత్‌షా కేంద్రం దళితుల అభివృద్ధి, వారి అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్ర మాలను వివరించేందుకు ఈ నెల 6–14 తేదీల మధ్య సామాజిక సమరసత కార్యక్ర మాన్ని బీజేపీ దేశవ్యాప్తంగా చేపట్టనుంది. బీజేపీ వ్యవస్థాపక దినోత్సవమైన ఈ నెల 6 నుంచి అంబేడ్కర్ జయంతి రోజైన 14వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 7వ తేదీన పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హైదరాబాద్ రాను న్నారు. హైదరాబాద్ లోక్‌సభ పరిధిలోని దళితవాడల్లో ఆయన ఆ రోజంతా గడపను న్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజక వర్గాల్లో నిర్వహించే ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలు పాల్గొననున్నారు. బూత్ కమిటీలను వెంటనే నియమించండి రాష్ట్రంలో వీలైనంత త్వరగా మండల, పోలింగ్ బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకులను ఆదేశించింది. బూత్ కమిటీలను ఏర్పాటు చేసుకోవడం ద్వారానే లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పార్టీ బలోపేతం కాగలదని సూచించింది. ఆదేశించారు. రాష్ట్రస్థాయి పార్టీ శిక్షణ శిబిరంలో అధిష్టానం దూత, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సావధాన్‌సింగ్ ఈ మేరకు నాయకులకు దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. -
ఒకేసారి ఎన్నికలపై చర్చ మంచిదే
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఒకేసారి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరపాలని, డబ్బు ప్రభావం లేకుండా ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ భావిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. ఈ అంశంపై దేశవ్యాప్త చర్చ మొదలు కావడం మంచి పరిణామమని పేర్కొన్నారు. కేంద్రం ప్రతీ కార్యక్రమం పేదల కోసమే చేపడుతోందని, పార్టీ సిద్ధాంతకర్త పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ కోరుకున్న అంత్యోదయ పథకం కింద నిరుపేదలకు మేలు జరగాలన్న ఆలోచనతో ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. కేంద్రం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ, కార్మిక విధానాలపై కార్మిక సంఘాల నాయకులకు ఈనెల 30 నుంచి వచ్చేనెల 3వ తేదీ వరకు నోయిడాలోని వీవీ గిరి నేషనల్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న 40 మంది రాష్ట్ర నాయకుల బృందంతో పార్టీ కార్యాలయంలో లక్ష్మణ్ సమావేశమయ్యారు. యువతకు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మహిళల కోసం ప్రత్యేకంగా ఉద్యోగాల అన్వేషణ కోసం కాకుండా సొంతంగా పరిశ్రమలు స్థాపించి, మరికొందరికి ఉద్యోగ కల్పన చేసే స్థాయికి ఎదగాలని స్టార్టప్ అండ్ స్టాండప్ ఇండియా పథకాలను తీసుకువచ్చిందని వివరించారు. యువత వృత్తి నైపుణ్యాలను పెంచేందుకు స్కిల్ ఇండియాను తీసుకొచ్చినట్లు తెలిపారు. అవినీతిరహిత సమాజ నిర్మాణానికి యువత కదలాలని, ఇందుకు విద్యావిధానంలో మార్పు రావాలని అన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటరమణి, నాయకులు టి.కాంతారావు, టి.రాజశేఖరరెడ్డి, వి.ఆర్.యాదవ్, వీవీ గిరి నేషనల్ ఇన్స్టిట్యూట్ సభ్యుడు టి.కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర పథకాలపై హర్షం రైతులకు పంట రుణాలపై వడ్డీ రద్దు నిర్ణయంతోపాటు, సీనియర్ సిటిజన్ల కోసం వరిష్ట బీమా పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టడంపై బీజేపీ ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి హర్షం ప్రకటించారు. ప్రధాని మోదీ రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారనడానికి ఇది నిదర్శనమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేసి ద్వైపాక్షిక సంబంధాలపై మాట్లాడటం భారత్‌తో సంబంధాలు కొనసాగిస్తామని చెప్పడంగొప్ప పరిణామమని తెలిపారు. -
బీజేపీకే ఓటు వేస్తాం
న్యూఢిల్లీ: ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే బీజేపీకి ఓటేస్తామని 74 శాతం మంది చెప్పినట్లు మైఓట్.టుడే సంస్థ ప్రకటించింది. తాము నిర్వహించిన సోషల్ మీడియా పోల్‌లో ఈ విషయం వెల్లడైందని పేర్కొంది. 10 శాతం మంది ఆప్‌కు, 9 శాతం కాంగ్రెస్, 6 శాతం ఇతరుల వైపు మొగ్గుచూపారని తెలిపింది. మొత్తం 55,940 మంది ట్వీటర్, ఎంవీటీ(మైఓట్.టుడే) యాప్‌లో తమ అభిప్రాయాల్ని తెలిపారని, 2,40,000 మంది ఈ పోల్‌ను చూశారని ఆ సంస్థ ప్రకటించుకుంది. 23 శాతం మంది ఓటేయగా, వారిలో 80 శాతం దేశంలోని టాప్ 50 నగరాలకు చెందినవారిని పేర్కొంది. -
రాజకీయ నిష్ర్కమణ ఉండబోదు
మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ సాక్షి, బెంగళూరు: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, అదే సందర్భంలో రాజకీయాల నుంచి నిష్ర్కమణ ఉండబోదని జేడీఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధానమంత్రి హెచ్.డి.దేవెగౌడ పేర్కొన్నారు. శనివారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేసేది అధికారం కోసమని, అయితే రాజకీయాల్లో తాను కొనసాగాలనుకుంటున్నది మాత్రం పార్టీని పటిష్టం చేసుకొనేందుకు అని దేవెగౌడ తెలిపారు. 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని, ఆ సమయంలో రాష్ట్ర ప్రజలు ఏ తీర్పు చెబుతారన్న ఇప్పుడే అంచనా వేయలేమని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు హెచ్.డి.కుమారస్వామి సైతం 2018లో పార్టీ అధికారంలోకి రాకపోతే రాజకీయాల నుంచి వైదొలగుతానని ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా దేవేగౌడ గుర్తు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హెచ్.డి.కుమారస్వామి సారధ్యంలో జేడీఎస్ పార్టీ ఎలాంటి పొత్తులు లేకుండానే 40స్థానాలు సాధించిందని, ఇదే సందర్భంలో ఓ జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ ఎన్ని స్థానాలు కైవసం చేసుకోగలిగిందే మీకు తెలిసిందే కదా! అని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న మహదాయి నదీజలాల పోరాటం, ఎత్తినహొళె అమలుకోసం జరుగుతున్న ఉద్యమాలను చూస్తుంటే రాష్ట్రంలో ప్రస్తుతం ఓ ప్రాంతీయ పార్టీ అవసరం ఎంతైనా ఉందన్న విషయం అర్థమవుతోందని అన్నారు. కళసా బండూరి పథకం అమలు కోసం ప్రధాని నరేంద్రమోదీ జోక్యం చేసుకోవాలని కోరినా ఆయన స్పందించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. రానున్న ఐదురాష్ట్రాల ఎన్నికల్లో సైతం జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల పొత్తుతోనే ఎన్నికల బరిలో దిగనున్నాయని హెచ్.డి.దేవేగౌడ తెలిపారు. -
దేశంలో ఏడో అత్యధిక మెజార్టీ
-
దేశంలో ఏడో అత్యధిక మెజార్టీ
వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ రికార్డు మెజార్టీతో విజయం సాధించారు. దేశంలో ఇప్పటి వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించిన ఏడో వ్యక్తిగా ఘనతకెక్కారు. దయాకర్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణపై 4,59,092 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించిన విజేతలు ప్రీతమ్ ముండే (బీజేపీ) మహారాష్ట్రలోని బీద్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి గోపీనాథ్ ముండే కుమార్తె ప్రీతమ్ ముండే 6.92 లక్షల ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు. దేశంలో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. అనిల్ బసు (సీపీఎం) 2004లో పశ్చిమబెంగాల్లోని అరమ్గఢ్ నియోజకవర్గం నుంచి అనిల్ బసు 5.92 లక్షల మెజార్టీతో గెలుపొందారు. పీవీ నరసింహారావు (కాంగ్రెస్) 1991లో నంద్యాల నుంచి అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు 5.80 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నరేంద్ర మోదీ (బీజేపీ) 2014 ఎన్నికల్లో గుజరాత్‌లోని వడోదర నుంచి నరేంద్ర మోదీ 5.7 లక్షల ఓట్ల మెజార్టీతో విజయబావుటా ఎగురవేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2011లో కడప లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు 5.45 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రాంవిలాస్ పాశ్వాన్ 1989లో ఉత్తరప్రదేశ్‌లోని హజీపూర్ నుంచి రాం విలాస్ పాశ్వాన్ (జనతా దళ్) 5.04 లక్షల మెజార్టీతో నెగ్గారు. పసునూరి దయాకర్ వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ 4.59 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. -
‘వరంగల్’ అభ్యర్థిపై కాంగ్రెస్ సర్వే
- రేసులో దామోదర, మల్లు, సర్వే, రాజయ్య - ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిపైనా చర్చ సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలకు పార్టీ అభ్యర్థి ఎంపిక కోసం కాంగ్రెస్ అధిష్టానవర్గం రహస్యంగా సర్వే నిర్వహిస్తోంది. వరంగల్ ఎంపీగా ఉన్న కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో గెలవడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతో పాటు, అధిష్టానవర్గ మెప్పును పొందాలని టీపీసీసీ ముఖ్యనేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ఉప ఎన్నికలో బరిలోకి దింపే అభ్యర్థి ఎంపికను అటు పార్టీ అధిష్టానం, ఇటు టీపీసీసీ సీరియస్‌గా తీసుకుంటున్నాయి. ఎస్సీ రిజర్వుడు స్థానమైన ఇక్కడ పార్టీ సీనియర్లలో ఒకరిని రంగంలోకి దించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఏఐసీసీ వర్గాలు ఇప్పటికే రహస్యంగా ఒక సర్వేను చేసినట్టుగా పార్టీ సీనియర్లు వెల్లడించారు. పార్టీ బలాబలాలు, పార్టీ నేతల మధ్య సమన్వయం, అభ్యర్థులపైనా సర్వే జరుగుతోంది. సీనియర్ నేతలు దామోదర రాజనర్సింహ, మల్లు భట్టివిక్రమార్క, సర్వే సత్యనారాయణ, వివేక్‌తో పాటు సిరిసిల్ల రాజయ్య, అద్దంకి దయాకర్, మరికొందరు స్థానిక నేతల పేర్లనూ పరిశీలిస్తున్నట్లు సమాచారం. రాజనర్సింహ లేదా భట్టివిక్రమార్క పేర్లు ప్రధానంగా చర్చకు వస్తున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వీరితో పాటు జేఏసీలో కీలకంగా వ్యవహరించిన తటస్థుల పేర్లు కూడా పార్టీలో అంతర్గతంగా చర్చకు వస్తున్నట్టు తెలుస్తోంది. అయితే జేఏసీ నేతలు ఎవరెవరు అనేది నిర్దిష్టంగా వెల్లడికాలేదు. మరోవైపు ఈ వరంగల్ లోక్‌సభ స్థానంలో ప్రతిపక్షాలన్నీ కలసి ఉమ్మడి అభ్యర్థిని నిలబెడితే ఎలా ఉంటుందనే చర్చ కూడా టీపీసీసీలో జరుగుతోంది. ఇప్పటికే వామపక్షాలన్నీ కలసి ఉమ్మడి అభ్యర్థిని నిలపాలని నిర్ణయించాయి. కానీ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతే అభ్యర్థి ఎంపికపై చర్చించాలని కాంగ్రెస్ ముఖ్యులు భావిస్తున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ఉమ్మడి అభ్యర్థి ప్రతిపాదన తదితర అంశాలను అధిష్టానవర్గానికి నివేదించనున్నట్టుగా తెలుస్తోంది. -
ఇందిర జాడలో మోదీ నీడ
ప్రధాని ఇందిర లోక్‌సభ ఎన్నికలలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు నిర్ధారించి తీర్పు ఇవ్వడంతో ఆమె ఎమర్జెన్సీ ప్రకటించారు. మరోసారి ఎమర్జెన్సీ విధించే భయాలకు సంబంధించి ఇప్పుడు సరిగ్గా అలాంటి కోర్టు తీర్పు, ఎన్నిక రద్దు కారణం కాకపోవచ్చు. కానీ గుజరాత్ మారణకాండ (2002)కు కారకులైన వారి మీద నమోదైన కేసులలో కొన్ని ఈనాటికీ అత్యున్నత న్యాయస్థానం తీర్పు కోసం ఎదురుచూస్తున్న (ఎమికస్ క్యూరీ రాజు రామచంద్రన్ ప్రకటించిన ట్టుగా) సంగతి వాస్తవం. అందుకే ఆ కోణం నుంచి అద్వానీ ఎమర్జెన్సీ ప్రమాదాన్ని ఊహించారా? దేశంలో ప్రజాస్వామ్యాన్ని అణచివేసే శక్తులు బలంగా ఉన్నాయి. మళ్లీ అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) ప్రకటించే అవకాశం ఉంది. పార్లమెంటు, ఇతర రాజ్యాంగ వ్యవస్థల హక్కులను హరించే ప్రమాదం ఉంది. రాజ్యాంగ పరమైన, న్యాయపరమైన రక్షణ వ్యవస్థలను కూడా లెక్క చేయకుండా ప్రజా స్వామ్యాన్ని అణగదొక్కే శక్తులు ఇప్పుడూ ఉన్నాయి. గత ఎమర్జెన్సీ కాలం (1975-77) తరువాత పౌర హక్కులకు మళ్లీ గ్రహణం పట్టించడానికో లేదా నాశనం చేయడానికో ప్రయత్నించబోమన్న భరోసా ఇచ్చేందుకు ఎలాంటి ప్రయత్నాలూ జరిగినట్టు దాఖలా లేదు. ప్రజల ప్రాథమిక సత్వాలను అణచ డం అంత తేలిక కాదు, కానీ మళ్లీ అలాంటి రోజులు రావని మాత్రం నేను చెప్పలేను. ఎల్.కె. అద్వానీ (బీజేపీ అగ్రనేత, మాజీ ఉపప్రధాని, 19-6-2015) జూన్ 25, 1975-పౌరులకు రాజ్యాంగం ఇచ్చిన సప్త స్వాతంత్య్రాలనూ, పౌర హక్కులనూ కాలరాసి, నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశాన్ని అంధ కారంలోకి నెట్టిన దుర్దినం. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారి అర్ధంత రంగా ఆమె ఆత్యయిక పరిస్థితిని ప్రకటించిన రోజు. ప్రజాస్వామ్య వాదులనూ, పౌర హక్కుల నేతలనూ, విపక్ష నాయకులనూ వేల సంఖ్యలో అరెస్ట్ చేసి జైళ్లకు పంపిన రోజు అదే. దాదాపు 22 మాసాలు సాగిన ఈ ‘పంబల దొరతనం’లో బీట్ కానిస్టేబుళ్లే పత్రికా స్వేచ్ఛను శాసించే సెన్సార్ అధికారులయ్యారు. అలాంటి దుర్దినాలను అద్వానీ, ఆయనతో పాటు ఆయన పార్టీ (అప్పుడు భారతీయ జనసంఘ్) ఇతర నేతలూ చవిచూశారు. ఆ రోజులను తలుచుకుంటూ, ప్రస్తుత ప్రధానీ తన పార్టీకే చెందిన నరేంద్ర మోదీ పాలనకు కూడా వర్తించే విధంగా అద్వానీ ఎమర్జెన్సీ నలభై ఏళ్ల సందర్భంగా ఎందుకు అలా వ్యాఖ్యానించవలసి వచ్చింది? అద్వానీ వ్యాఖ్యల వెనుక మతలబు? ప్రధాని పదవికి అర్హత ఉన్నప్పటికీ బీజేపీలోని మోదీ-అమిత్‌షా వర్గం; భారత ఐక్యతను చెదరగొట్టడానికి ‘హిందుత్వ’ చాటున శాసిస్తున్న ఆరెస్సెస్ పరివార్లు తనను తప్పించినందుకే అద్వానీ ఇలా ఎదురుదాడికి దిగారా? గుజరాత్లో మైనారిటీల మీద జరిగిన మారణకాండకు కారకులైన శక్తుల మీద సుప్రీంకోర్టు ఇంకా తుది తీర్పు వెలువరించవలసి ఉంది. కానీ అందుకు కారకులైన కొన్ని శక్తులు ఇప్పుడు దేశ పాలనాధికారాన్ని చేపట్టాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఎమర్జెన్సీ రాగల ప్రమాదాన్ని గుర్తించి అద్వానీ ముం దస్తు హెచ్చరికలు చేయవలసి వచ్చిందా? ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయనడానికి అద్వానీ ఊహిస్తున్న, దర్శిస్తున్న కారణాలను ప్రజలు తెలుసుకోవలసి ఉంటుంది. కేంద్రంలో బీజేపీ-ఎన్డీఏ అధికారం చేపట్టినది మొదలు ఈ ఏడాది కాలంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఎన్నికల ప్రణాళికలో వారు చేసిన వాగ్దానాలకు గానీ, ఇచ్చిన భరోసాలకు గానీ పూర్తి విరుద్ధంగానే ఉన్నాయి. ప్రభుత్వ చర్యలన్నీ విరుద్ధ పంథాలోనే సాగుతున్నాయి. దీనికితోడు భార తీయ సమాజాన్ని చీలికల బాట పట్టించే మార్గాలను ప్రభుత్వం అన్వే షిస్తున్నది. ఆర్థిక విధానాల విషయంలో ప్రజాస్వామ్య, సైద్ధాంతిక దృక్పధం, విలువలూ లేకపోవడంతో కేంద్రం పెడమార్గాలు తొక్కుతోంది. మళ్లీ వాటిని సమర్థించుకోవడానికి నిరంకుశ ధోరణులను ఆశ్రయిస్తూ, అలాంటి ధోరణు లకే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆసరా ఇస్తున్నారు. అందువల్లనే రానున్న పరిణామాలను ఊహించి పార్టీ కార్యకర్తలనూ, దేశ ప్రజలనూ అద్వానీ అప్ర మత్తం చేయదలిచారా? దేశ ఆర్థికవ్యవస్థ దిశనూ, విదేశాంగ విధానం దిశనూ సర్వతంత్ర, స్వతంత్రంగా తీర్చిదిద్దడంలో, కాంగ్రెస్-యూపీఏ పాలనకు భిన్నంగా నిర్వహించడంలో బీజేపీ విఫలమైంది. అవే విదేశీ బడా గుత్త వర్గాలకూ, దేశీయ సంపన్న వర్గాలకూ జోహుకుం అంటున్న తీరులో కేంద్రం నడుస్తున్నందుకే అద్వానీ అలాంటి హెచ్చరిక చేశారా? ఒక రంగమని కాదు; న్యాయస్థానాల స్వతంత్ర ప్రతిపత్తి విషయంలో, సమాచార హక్కు చట్టాన్ని అమలు చేయడంలో, పౌర హక్కులను గౌరవిం చడంలో, పారిశ్రామిక కార్మిక చట్టాలను, వ్యవసాయ కార్మికుల ప్రయోజనా లను కాపాడే చట్టాలను అమలు చేయడంలో బీజేపీ ప్రభుత్వం ఘర్షణాత్మక వైఖరికి పాల్పడుతున్నది. దీనితో ఉత్పన్నమయ్యే అశాంతిని పరిష్కరించే దారి లేక, ప్రభుత్వం నిర్బంధాలకు పచ్చజెండా ఊపక తప్పదని అద్వానీ భావించి, ఎమర్జెన్సీ ప్రమాదం గురించిన ప్రకటన చేశారా? న్యాయ వ్యవస్థతో పేచీతోనే... గత ఎమర్జెన్సీకి కారణం- అలహాబాద్ హైకోర్టు తీర్పు. ప్రధాని ఇందిర లోక్ సభ ఎన్నికలలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు నిర్ధారించి తీర్పు ఇవ్వడంతో ఆమె ఎమర్జెన్సీ ప్రకటించారు. మరోసారి ఎమర్జెన్సీ విధించే భయాలకు సంబంధించి ఇప్పుడు సరిగ్గా అలాంటి కోర్టు తీర్పు, ఎన్నిక రద్దు కారణం కాకపోవచ్చు. కానీ గుజరాత్ మారణకాండ (2002)కు కారకులైన వారి మీద నమోదైన కేసులలో కొన్ని ఈనాటికీ అత్యున్నత న్యాయస్థానం తీర్పు కోసం ఎదురుచూస్తున్న (ఎమికస్ క్యూరీ రాజు రామచంద్రన్ ప్రకటిం చినట్టుగా) సంగతి వాస్తవం. అందుకే ఆ కోణం నుంచి అద్వానీ ఎమర్జెన్సీ ప్రమాదాన్ని ఊహించారా? ఇదికాకపోతే, కేంద్రమంత్రులు సుష్మా స్వరాజ్, అరుణ్‌జైట్లీ, నితిన్ గడ్కారీ ప్రభృతుల మీద సమర్థించుకోలేని ఆరోపణలు ముమ్మరించడంతో బీజేపీ అగ్రనేత నోటి నుంచి ఈ ప్రమాద హెచ్చరిక వెలు వడిందా? లలిత్ మోదీ వ్యవహారంలో ప్రధాని సహా కీలక వ్యక్తులు ఆరోప ణలను ఎదుర్కొనవలసి వచ్చింది. ఇదంతా ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే, గత ఎమర్జెన్సీలో కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయ వ్యవస్థను క్రమంగా ఎలా భ్రష్టు పట్టించిందో గుర్తు చేయడానికే. తనకు లొంగిరాని న్యాయమూర్తుల స్వేచ్ఛకు ఎలా సంకెళ్లు వేసిందో, అనుకూలురు-ప్రతి కూలురు అన్న అధర్మ త్రాసులో ఉంచి న్యాయమూర్తుల పదోన్నతులను శాసించి న్యాయ వ్యవస్థను అదుపులో ఉంచుకోవడానికి నాటి ప్రభుత్వం ఏ విధంగా ప్రయత్నించిందో అందరికీ తెలుసు. మెజారిటీ జ్యూడీషియరీని తనకు అనుకూల వ్యవస్థగా మార్చుకోవడానికి నాటి ప్రభుత్వం అనుసరిం చని మార్గమంటూలేదు. అనుభవజ్ఞులైన న్యాయమూర్తులను అణగదొక్కి, కిందిస్థాయిలో ఉన్న న్యాయమూర్తులకు పదోన్నతులు కల్పించిన దుర్ముహూ ర్తాలు అప్పుడే కనిపిస్తాయి. అప్పుడు హెబియస్ కార్పస్ రిట్‌ను సైతం పాల కులు నిర్వీర్యం చేశారు. అయితే సుప్రీంకోర్టులో తన పదోన్నతిని కూడా గడ్డి పోచలా భావించి జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా వేయి మంది డిటెన్యూలకు ఒక్క కలం పోటుతో స్వేచ్ఛ కల్పించారు. బెయిల్ సౌకర్యం కల్పించారు. కానీ ఖన్నాకు అమెరికాలో స్తూపం నిర్మించారు గానీ, ఇక్కడ అలాంటి సాహసం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు కూడా మంచీచెడులతో నిమిత్తం లేకుండా పాత ప్రభుత్వాలు చేసిన చట్టాలను మార్చడానికి మోదీ ప్రభుత్వం తన వంతు పని మొదలు పెట్టింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ (ఐసీహెచ్ఆర్) వంటి సంస్థలకు, కేంద్ర సర్వీసులకు నియమించే అధిపతుల విషయంలో యోగ్యతలకన్నా, ఇతరత్రా కారణాలకే బీజేపీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నది. యూపీఏ బాటలోనే కేంద్ర గూఢ చారి, నిఘా సంస్థలను రాజకీయ కక్షలు సాధించుకోవడానికీ, స్వప్రయోజ నాలకు దుర్వినియోగం చేస్తున్నారు. ఇవన్నీ గమనించిన తరువాతనే పార్టీలో సీనియర్ నేతగా, మాజీ పాలకునిగా అద్వానీ దేశంలో మరోసారి ఎమర్జెన్సీ విధించే అవకాశాల గురించి హెచ్చరించి ఉండాలి! దేశంలో తాజాగా ముంచుకొస్తున్న, ముదురుతున్న సమస్య ఒకటి ఉంది. ఇంతకు ముందు న్యాయమూర్తుల నియామకం కోసం స్వతంత్రంగా వ్యవహరించే సంఘాన్ని (కొలీజియం) తొలగించి కేంద్రమే ఆ బాధ్యతను స్వీకరించాలని నిర్ణయించింది. రాజకీయ పాలనా వ్యవస్థ ఏలుబడిలో ఉండే విధంగా జాతీయ స్థాయి న్యాయమూర్తుల నియామక సంఘం ఏర్పాటు చేయడానికి వీలుగా మోదీ ప్రభుత్వం చట్టం చేసింది. ఈ విషయంలో ఇరు వైపులా కూడా తప్పొప్పులకు అవకాశాలు లేకపోలేదు. కానీ ఈ పద్ధతి వల్ల న్యాయమూర్తులు స్వతంత్రంగా తీర్పులు వెలువరించలేని దుర్దశకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని గ్రహించాలి. జస్టిస్ ఖన్నా, ప్రొఫెసర్ జైన్లు ఒక సం దర్భంగా పేర్కొన్నట్టు, ‘దేశాన్ని పాలించవలసింది చట్టానికి బద్ధమై ఉండే ప్రభుత్వమే కానీ, అధికారంలో కూర్చునే వ్యక్తులు కాదని గుర్తుంచుకోవాలి. సవరణల ముసుగులో వ్యవహారాలు నడిపే పార్లమెంట్ కూడా ఇందుకు సమర్థురాలు కాదు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలను నిరంకుశ వ్యవస్థలుగా మార్చడానికీ, లోక్‌సభ, రాజ్యసభలను వంశపారంపర్య సభ్యసంస్థలుగా మార్చగల లేదా, వాటిని రద్దు చేయగల శక్తి కూడా పార్లమెంట్‌కు లేదు.’ (వ్యాసకర్త మొబైల్: 9848318414) - ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు -
సోనియా! సోనియా...రాహుల్ ఎక్కడ?
న్యూఢిల్లీ: గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంతో నాయకత్వ కాడిని కిందపడేసి రాహుల్ పై భారంవేసి స్వీయ ప్రవాస జీవితంలోకి సోనియా గాంధీ వెళ్లిపోయారు. ఇలాంటి సంక్షోభ సమయంలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించి పార్టీకి పునర్జీవం పోయాల్సిన పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సెలవుల పేరిట అడ్రస్ లేకుండా గల్లంతయ్యారు. పార్లమెంట్‌లోనూ, వెలుపల పార్టీకి సారథ్యం వహించేందుకు సరైన నాయకుడెవరంటూ పార్టీ తల్లడిల్లుతున్న సమయంలో హఠాత్తుగా సోనియా గాంధీ మళ్లీ కార్యరంగంలోకి దూకారు. కిందపడేసిన కాడిని భుజానేసుకొని పద..పదండంటూ పార్టీ నేతలను వెంబడేసుకొని పాదయాత్రలు ప్రారంభించారు. బొగ్గు కేటాయింపుల కేసులో మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు కోర్టు సమన్లు జారీ చేయడంతో సోనియాలో మళ్లీ కదలిక వచ్చింది. ఇంతకాలం తమ తరఫున ప్రధాని పాత్రను పోషించిన మన్మోహన్‌కు అండగా నిలవాలని తలచిన తక్షణమే పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి మన్మోహన్ సింగ్ నివాసం వరకు ర్యాలీని నిర్వహించి మన్మోహన్‌కు సంఘీభావం ప్రకటించారు. పార్లమెంట్లో భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న సోనియా గాంధీ ఆ బిల్లుకు వ్యతిరేకంగా మళ్లీ వీధుల్లోకి వచ్చారు. ఏకంగా సారూప్యతగల లౌకిక పార్టీలను కలుపుకొని రాష్ర్టపతి భవన్‌కు పాదయాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా నడుస్తున్న ఎన్ఎస్యూఐ కార్యకర్తలు అత్యంత ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొనడం విశేషం. పతానవస్థలోవున్న పార్టీని ముందుకు నడిపించడం సోనియాకు కొత్తేమి కాదు. 2003లో జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి పార్టీని అనతికాలంలోనే మేల్కొలిపారు. లౌకిక పార్టీలతో జతకట్టి 2004లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. పార్లమెంట్ సమావేశాల కీలక ఘట్టంలో పార్టీని ముందుండి నడిపించాల్సిన రాహుల్ గాంధీ కనిపించక కలవరపడుతున్న పార్టీకి మళ్లీ సోనియా గాంధీ పెద్ద దిక్కవడం పట్ల పార్టీ సీనియర్ నేతలతోపాటు జూనియర్ నేతలు సంతోషిస్తున్నారు. సోనియా....సోనియా... మీరే దిక్కు మొక్కు...అంటూ పలవరిస్తున్నారు. ఈ విషయం తెలిస్తే రాహుల్ గాంధీ పార్టీ జన జీవన స్రవంతిలోకి వస్తారా లేక ప్రస్తుతం ఎక్కడున్నారో అక్కడే ఉండిపోతారా ? అన్నది సగటు కాంగ్రెస్‌వాది ప్రశ్న. -
ఎంపీసీసీ అధ్యక్షుడిగా అశోక్ చవాన్
- లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర - కార్పొరేషన్ విజయంలోనూ ముఖ్య భూమిక - సరైన వ్యక్తిగా భావించిన అధిష్టానం - ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడిగా సంజయ్ నిరుపం సాక్షి, ముంబై: మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్షునిగా మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఎంపికయ్యారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా ఏఐసీసీ మహారాష్ట్రలో పార్టీ ప్రక్షాళన చేయాలని భావిస్తున్న అధిష్టానం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఎంపీసీసీ అధ్యక్షునిగా అనేక మంది పేర్లు ముందుకు వచ్చినప్పటికీ ఇటీవలి అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరువు కాపాడిన అశోక్ చవాన్‌కు పట్టం కట్టాలని భావించింది. మరోవైపు ఉత్తర భారతీయ ఓటర్లను దృష్టిలో ఉంచుకుని ముంబై కాంగ్రెస్ అధ్యక్షునిగా కాంగ్రెస్ మాజీ పార్లమెంట్ సభ్యుడు సంజయ్ నిరూపంను ఎంపిక చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో చవాన్ కీలక పాత్ర అనేక సంవత్సరాలుగా పెట్టని కోటగా ఉన్న మహారాష్ట్ర కాంగ్రెస్‌కు ఇటీవలి ఎన్నికల్లో కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ హవా కొనసాగడంతో లోకసభ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది. మరాఠ్వాడా, నాందేడ్ జిల్లాలో అశోక్ చవాన్‌కు ఉన్న గుర్తింపు, చేసిన అభివృద్ధి పనుల ద్వారా ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. లోకసభ ఎన్నికలకు ముందు 2012 అక్టోబరులో జరిగిన నాందేడ్ - వాఘాలా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయన సత్తా చాటారు. కార్పొరేషన్ అవతరించిన తర్వాత మొదటి ఎన్నికలు మినహా వరుసగా మూడు సార్లు కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించారు. తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన చవాన్ మోదీ హవాను తట్టుకొని విజయం సాధించారు. మరో పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయంలో కీలక పాత్ర పోషించారు. చవాన్‌ను సమర్థుడిగాభావించిన అధిష్టానం కాగా కొంత కాలంగా ఎంపీసీసీ, ముంబై రీజినల్ కాంగ్రెస్ కమిటీ (ఎమ్మార్సీసీ) ప్రక్షాళన చేయాలని చూస్తున్న అధిష్టానం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఆదర్శ్ కుంభకోణం, పెయిడ్ న్యూస్ ఆరోపణలతో వివాదాల్లోకెక్కిన చవాన్‌కు ఎంపీసీసీ పగ్గాలు ఇవ్వడానికి తర్జనభర్జన పడిన అధిష్టానం ఎట్టకేలకు చవాన్‌కు అధికారం అప్పగించాలని నిర్ణయించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన శంకర్రావ్చవాన్ నుంచి రాజకీయ వారసత్వం పొందిన ఆయన కుమారుడు అశోక్ చవాన్ కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఎన్సీపీ, బీజేపీ, శివసేనను ఎదుర్కొనేందుకు చవాన్ సమర్థుడని అధిష్టానం భావించింది. కాగా, ముంబై కాంగ్రెస్ అధ్యక్షునిగా సంజయ్ నిరుపంకు పార్టీ పగ్గాలు కట్టబెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మరాఠీ ఓటర్లు, శివసేన, ఎమ్మెన్నెస్‌ల మద్య చీలిపోయే అవకాశముండటంతో ఉత్తరభారతీయుల ఓటర్లను ఆకట్టుకోవడానికి ఉత్తర భారతీయుడైన సంజయ్ నిరూపం సరైన వాడని భావించింది. -
మోదీ త్రీడీ ప్రచారానికి రూ. 61 కోట్లు
న్యూఢిల్లీ: గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తమ ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగిన నరేంద్ర మోదీ త్రీడీ ఎన్నికల ప్రచారానికి రూ. 61 కోట్లకు పైగా ఖర్చయిందని బీజేపీ తెలిపింది. దృశ్య, శ్రవణ మీడియా ప్రచారం కోసం మరో రూ. 304 కోట్లు ఖర్చు పెట్టినట్లు ఇటీవల ఎన్నికల సంఘానికి అందించిన వ్యయాల నివేదికలో వెల్లడించింది. గత ఏడాది సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల కోసం మొత్తం రూ. 714 కోట్లు ఖర్చుచేసినట్లు తెలిపింది. మోదీ ఎన్నికల్లో ఒక ప్రాంతం నుంచి చేసిన ప్రసంగాలను త్రీడీ తెరల ద్వారా వివిధ ప్రాంతాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయడం తెలిసిందే. బీజేపీ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. మోడీ వినూత్నంగా చేపట్టిన త్రీడీ సభల కోసం రూ. 51.36 కోట్లు ఖర్చు పెట్టారు. మరో రూ. 10 కోట్లను లెసైన్స్ ఫీజు కింద చెల్లించారు. పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ప్రకటనలు, ఎస్సెమ్మెస్‌లు తదితరాల కోసం రూ. 304 కోట్లు వెచ్చించారు. మోదీ, రాజ్‌నాథ్, వెంకయ్యనాయుడు, అమిత్ షా తదితర పార్టీ మఖ్య ప్రచారకర్తల ప్రయాణాల కోసం రూ. 77.83 కోట్లు ఖర్చు చేశారు. -
‘ఢిల్లీకి పూర్తి హోదా’ ప్రకటన చేస్తారా..
సాక్షి, న్యూఢిల్లీ: గత లోక్‌సభ ఎన్నికల సమయంలో ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని బీజేపీ నిలబెట్టుకోవాలని ఆమ్ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రకటన నేడో,రేపో అన్నట్లు ఉండటంతో రాష్ట్రంలో రాజకీయ పార్టీల ప్రచారం ఊపందుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర బీజేపీ నేతలకు మరింత ఉత్సాహం కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం రామ్‌లీలా మైదాన్‌లో ర్యాలీ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. కాగా, దీనిపై కేజ్రీవాల్ శుక్రవారం ట్విటర్లో స్పందించారు. ఈ ర్యాలీలో నరేంద్రమోదీ ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా ఇస్తానని ప్రకటన చేస్తారా అని ప్రశ్నించారు. ‘ రేపు మోదీజీ ఢిల్లీవాసులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆయన ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కల్పిస్తానని అప్పట్లో హామీ ఇచ్చారు. ఆయన రేపు దానిని ప్రకటిస్తారా? లేక ఈ విషయంలో కూడా ఆ పార్టీ యూటర్న్ తీసుకుంటుందా? అని కేజ్రీవాల్ ట్విటర్‌పై ప్రశ్నించారు. విద్యుత్తు చార్జీలను 30 శాతం తగ్గిస్తామని ఎన్నికలకు ముందు బీజేపీ ప్రకటించింది. ప్రధాని మోదీ దానిపై కూడా ఒక ప్రకటన చేస్తారని ఢిల్లీవాసులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారని కేజ్రీవాల్ మరో ట్వీట్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ప్రధాని మొట్ట మొదటిసారి శనివారం ఢిల్లీవాసులను ఉద్ధేశించి ప్రసంగించనున్నారని, ఆయననుంచి ఏం ఆశిస్తున్నారో ఢిల్లీవాసులు తమకు ట్వీట్ ద్వారా తెలియచేయాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ట్వీట్ చేసింది. ప్రతిదానిపై ఆర్డినెన్స్ తెచ్చే మోడీ సర్కారు ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని ఆప్ నేత మనీష్ సిసోడియా డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఢిల్లీకి పూర్తి రాష్ట్రహోదా ఇస్తామని బీజేపీ వాగ్దానం చేసినప్పటికీ, కేంద్రం పూర్తి రాష్ట్ర హోదా ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా లేదని వస్తోన్న వార్తల నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ సవాలు విసిరారని భావిస్తున్నారు. ఢిల్లీకి పూర్తిరాష్ట్ర హోదా కల్పిస్తే ఢిల్లీ ప్రభుత్వానికి ఢిల్లీ పోలీసుపై అధికారాన్ని, ఢిల్లీలో భూమిపై అధికారాన్ని బదిలీచేయాల్సి ఉంటుందని, దానికి కేంద్రం ససేమిరా సుముఖంగా లేదని ఒక ఆంగ్ల దినపత్రిక గురువారం ప్రచురించింది. ఇదిలా ఉండగా, ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోద ా కల్పించడంపై రామ్‌లీలామైదాన్ ర్యాలీలో మోదీ ప్రకటన చేయాలని ఢిల్లీ బీజేపీకి చెందిన సీనియర్ నేతలు కోరుతున్నారని తెలుస్తోంది. కాగా, కేజ్రీవాల్ ట్వీట్‌కు బీజేపీ కూడా కూడా ప్రతిస్పందించింది. ఢిల్లీలో మోదీ ర్యాలీ గురించి కేజ్రీవాల్ ఆందోళన చెందుతున్నట్లుగా ఉందని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర ట్వీట్ చేశారు. -
ఉద్యోగాలిస్తానని.. చీపుర్లు చేతికిచ్చాడు!
మోదీపై రాహుల్ విసుర్లు చాయిబసా(జార్ఖండ్): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆయన ప్రతిష్టాత్మక పథకం స్వచ్ఛభారత్ లక్ష్యంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జార్ఖండ్‌లో తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ‘లోక్‌సభ ఎన్నికల సమయంలో అందరికీ ఉద్యోగాలిస్తానంటూ హామీలిచ్చి.. ఇప్పుడు వీధులూడ్చండి అంటూ చీపురుకట్టలు చేతికిస్తున్నాడ’ని మోదీని ఎద్దేవా చేశారు. ‘ఎన్నికల సమయంలో మీ కోసం నేను ఉద్యోగాలు కల్పిస్తా.. ఫ్యాక్టరీలు, రోడ్లు, విమానాశ్రయాలు నిర్మిస్తా అని చెప్పి.. అధికారంలోకి రాగానే మీరు వీధులూడ్చండి, నేను ఆస్ట్రేలియా వెళ్తున్నానని చెప్పి వెళ్లిపోయారు’ అని పశ్చిమ సింగ్బూమ్ జిల్లాలో జరిగిన ఒక ఎన్నికల సభలో రాహుల్ వ్యాఖ్యానించారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను కలుపుకుపోవాలనేది కాంగ్రెస్ వైఖరి కాగా.. అధికారమే పరమావధిగా మోదీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మోదీని 10 మంది పారిశ్రామిక వేత్తల ప్రధానిగా రాహుల్ అభివర్ణించారు. సమాచార హక్కు చట్టం, ఉపాధి హామీ చట్టం, భూసేకరణ చట్టాలను రూపొందించి కాంగ్రెస్ ప్రజల సాధికారత కోసం కృషి చేసిందన్నారు. పారిశ్రామికవేత్తల కోసం ఇప్పుడు భూసేకరణ చట్టంలో సవరణలు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ‘మనకు కావాల్సింది అభివృద్ధి సాధించే ప్రభుత్వమే కానీ వీధులు శుభ్రపరిచేవారి ప్రభుత్వం కాద’ని వ్యాఖ్యానించారు. -
తాజా ఎన్నికలపై కమలం దృష్టి
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఏర్పాటుపై ఒకవైపు గందరగోళ పరిస్థితులు నెలకొనగా, మరోవైపు ఢిల్లీ విధానసభకు తాజా ఎన్నికలపై బీజేపీ రాష్ర్ట శాఖ దృష్టి సారించింది. వచ్చే ఏడాది జనవరిలో విధానసభ ఎన్నికలు జరిగే అవకాశముంది. మొన్నటికి మొన్న లోక్‌సభ ఎన్నికల్లో తిరుగులేని విజయం, ఆ తర్వాత మహారాష్ర్ట, హర్యానా శాసనసభలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఆ పార్టీ నాయకులకు ఎనలేని ధీమానిచ్చాయి. ఒకవేళ ఢిల్లీ విధానసభకు ఎన్నికలు జరిగితే తగినంత మెజారిటీ దక్కుతుందనే ధీమాతో తమ పార్టీ అధిష్టానం ఉందని బీజేపీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాజా ఎన్నికలకు సన్నద్ధమవ్వాలంటూ రాష్ర్ట శాఖ నాయకులకు అధిష్టానం పెద్దలు సూచించారు. ‘పెట్రోల్ ధరలను ఇటీవల తగ్గించడం, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల చేపట్టిన పలు కార్యక్రమాలతోపాటు ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పొరుగు దేశమైన పాకిస్థాన్ విషయంలో వ్యవహరించిన తీరు దేశవాసులపై ఎనలేని ప్రభావం చూపాయి. ఓట్ల కోసం మేము ప్రజల్లోకి వెళ్లినపుడు ఇది ఎంతగానో ఉపయుక్తమవుతుంది’ అని పేరు చెప్పేందుకు ఇష్టపడని నాయకుడొకరు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేంద్రంలో తామే అధికారంలోనే ఉన్నామని, శాసనసభ ఎన్నికల్లో చక్కని ఫలితాలొచ్చాయని అన్నారు. జాతిజనుల మనోగమనానికి ఇది సూచిక అని, దీని ప్రభావం ఢిల్లీ విధానసభ ఎన్నికలపైనా తప్పనిసరిగా ఉంటుందని అన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జాతీయ రాజధానిలో ఎన్నికలు జరిగే అవకాశముందన్నారు. కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, ఎల్జేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు. ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజులపాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభ లోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికారిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. -
ఎమ్మెన్నెస్ గుర్తింపు రద్దయ్యేనా?
సాక్షి, ముంబై: అటు లోక్‌సభ, ఇటు శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో ఆ పార్టీ గుర్తింపు రద్దయ్యే పరిస్థితి నెలకొంది. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క అభ్యర్థిని కూడా ఆ పార్టీ గెలిపించుకోలేక పోయింది. తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేవలం ఒక్క అభ్యర్థే విజయం సాధించాడు. దీంతో ఆ పార్టీని ఓటర్లు పూర్తిగా తిరస్కరించారనే విషయం స్పష్టమైంది. ఇప్పటికే పరాజయంతో కుమిలిపోతున్న ఆ పార్టీ నాయకులకు ఎన్నికల కమిషన్ జారీచేసిన పార్టీ గుర్తింపు (ఇంజన్) రద్దయ్యే ప్రమాదంకూడా ఉంది. శాసనసభ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయానికి ప్రతిఫలంగా ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే భారీ మూల్యం చెల్లించుకోకతప్పేలా లేదు. పార్టీ ఆవిర్భావం తర్వాత 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 13 సీట్లు వచ్చాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం కొత్త పార్టీకి నిర్దేశించినరీతిలో ఓట్లు రావాలి. కనీసం ఇద్దరు ఎమ్మెల్యేలను గెలిపించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆరు శాతం ఓట్లు కచ్చితంగా రావాలి. అయితే మొన్న జరిగిన లోక్‌సభ, తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో అది సాధ్యం కాలేదు. దీంతో ఎన్నికల కమిషన్ ఆ పార్టీ గుర్తును రద్దు చేసే అవకాశముంది. 2009లో జరిగిన ఎన్నికల్లో 13 మంది ఎమ్మెల్యేలు గెలవడంతో ప్రాంతీయ పార్టీగా ఎమ్మెన్నెస్‌కు గుర్తింపు లభించింది. రైల్వే ఇంజన్ గుర్తు అధికారికంగా లభించింది. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుకే పరిమితం కావడంతో ఆ ఇంజన్ గుర్తును తిరిగి తీసుకునే అవకాశాలున్నాయి. -
జర జాగ్రత్త..!
ముంబై: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు ఇంకా మూడు రోజుల గడువు మాత్రమే ఉంది. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల వ్యూహాల్లో ప్రచారం చేస్తున్నారు. తమ అభ్యర్థిని గెలిపించాలనే అభిప్రాయంతో పార్టీల కార్యకర్తలు కూడా ప్రచార జోరును పెంచారు. అయితే అభ్యర్థిగానీ, ఆయన మద్దతుదారులుగానీ పోలింగ్ రోజున అప్రమత్తంగా లేకపోతే ఇన్నిరోజుల శ్రమ అంతా వృథా అవుతుంది. ఒకవేళ గెలిచే అకాశమున్నా కార్యకర్తలు చేసే చిన్న చిన్న పోరపాట్లు అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీసే ఆస్కారముంది. అందుకే పోలింగ్ రోజున అభ్యర్థులు, కార్యకర్తలు ఎలా మెలగాలి? ఏం చేస్తే తప్పుల్లో చిక్కుకుంటారనే విషయంలో అవగాహనను కలిగి ఉండాలి. ఆయా విషయాలపై కథనం... పోలింగ్ స్టేషన్లో.. పోలింగ్ స్టేషన్లో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, అసిస్టెంట్ పీవోలు, సిబ్బంది అయా పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల ఏజెంట్లు మాత్రమే ఉంటారు. మిగిలిన వారిని లోపలికి రానివ్వరు. ఓటు వేయడానికి వచ్చిన వారికి అనుమతి ఉంటుంది. ఐదుగురు చొప్పున పోలింగ్ కేంద్రంలోకి అనుమతి ఇస్తారు. పోలింగ్ సమయం ముగిసే సరికి పోలింగ్ కేంద్రంలో ఓటర్లు ఉంటే వారికి ఓటు వేసేందుకు అనుమతి ఇస్తారు. గొడవ పడ్డారో అంతే సంగతులు.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎంతో సహనం అవసరం. ప్రత్యర్థులు రెచ్చగొట్టారని వివాదాలకు దిగితే ఇబ్బందే. గొలుపోటములు ఎలా ఉన్నా ప్రశాంతంగా లేకుంటే చిక్కులు తప్పవు. ప్రత్యర్థులు ఏదైనా రెచ్చగొడితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లాలి. గుర్తింపు కార్డు తప్పనిసరి ఓటు హక్కు ఉన్న వారు ఏదైనా గుర్తింపు కార్డు తీసుకుని పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లెసైన్స్, పాస్కార్డు, నివాస ధృవీకరణ పత్రం, పట్టాదారు పాసు పుస్తకం, విద్యార్హతల మెమో కార్డు తీసుకుని వెళ్లే గుర్తింపుతో వెంటనే ఓటు వేయడానికి వీలు ఉంటుంది. ఓటర్లను తరలించడం నేరం పోలింగ్ రోజున ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు వాహనాల్లో తరలించడం కూడా ఎన్నికల నియమావళి ప్రకారం నేరమే. పోలింగ్ రోజున దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను ఆటోలు, కార్లు, ద్విచక్రవాహనాలపై తరలించి తమకు అనుకూలంగా ఓటు వేయించుకునే ప్రయత్నాలు చేయడం నేరం. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా వారు స్వచ్ఛందంగానే రావాల్సి ఉంటుంది. వారిని ఎటువంటి ప్రలోభాలకు గురిచేసినా ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుంది. వాటిపై కేసులు కూడా నమోదు చేస్తారు. మహిళలు, పురుషులకు వేర్వేరు లైన్లు మహిళలు, పురుష ఓటర్లుకు వేర్వేరుగా ఓటు వేయడానికి లైన్లు ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. నిఘా నేత్రాలుంటాయ్.. ఎన్నికల సమయంలో అభ్యర్థులపై నిఘా ఉంటుంది. ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది నిఘాను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలి. పోలింగ్ రోజున ఓటర్లను తరలిం చడం, మద్యం, డబ్బులు పంపిణీ చేయడం తదితర ప్రలోభాలపై నాఘా ఉంటుంది. ఇటువంటి విషయాల్లో ఆధారాలు ఉంటే కేసలు కూడా నమోదు చేస్తారు. అభ్యర్థులు ఇందుకు సంబంధించిన నియమ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. అధికారులతో అప్రమత్తం.. ఎన్నికల విధుల్లో ఉండే అధికారులతో అభ్యర్థులు, వారి అనుచరులు జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో దురుసుగా వ్యవహరించకూడదు. ఓటు వేయకుండా ఓటర్లను అడ్డుకోవడం వంటి చర్యలు చేయకూడదు. ఇటువంటివి చేస్తే కేసుల్లో చిక్కుకుం టారు. అటువంటి వారిని పోలీసులు బైండోవర్ చేస్తారు. అంతే కాకుండా కేసులు నమోదయ్యి, విచారణలో నేర నిర్థారణ జరిగితే జైలు, జరిమానా తప్పదు. పార్టీ కండువాలకు అనుమతిలేదు అభ్యర్థులు పార్టీ, ఎన్నికల గుర్తుల బ్యాడ్జీలు ధరించి పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లకూడదు. కండువాలు, బ్యాడ్జీలతో లోనికి వస్తే ఎన్నికల నియామవళిని అతిక్రమించినట్లు భావించి, అధికారులు చర్యలు తీసుకుంటారు. పోలింగ్ ఏజెంట్లకు పాస్‌లు జారీ చేస్తారు. ఆ పాస్‌ల ఆధారంగా పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతి ఉంటుంది. 200 మీటర్ల దూరంలోనే ప్రచారం పోలింగ్ కేంద్రం సమీపంలో ప్రచారం చేయడానికి వీలులేదు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో మాత్రమే అభ్యర్థి ప్రచారానికి అనుమతి ఉంటుంది. వంద మీటర్ల వరకు ఉండే లక్ష్మణ రేఖ దాటి లోపలికి వస్తే పోలీసులు కేసు నమోదు చేస్తారు. రూ.250 జరిమానా కూడా విధించవచ్చు. -
కరియప్ప చేరికతో కాంగ్రెస్‌లో లుకలుకలు
సింధనూరు టౌన్ : గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున తెర వెనుక ప్రచారం చేసిన ప్రముఖ నాయకుడు కే.కరియప్ప ఇటీవల బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ.పరమేశ్వర్ల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడంతో స్థానికంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే బాదర్లి హంపనగౌడ వర్గం జీర్ణించుకోలేక పోతోంది. మాజీ కాంగ్రెస్ ఎంపీ కే.విరుపాక్షప్ప బంధువైన కరియప్ప గత అసెంబ్లీ ఎన్నికల వరకు విరుపాక్షప్ప వెంటే ఉన్నారు. అయితే ఎన్నికల్లో ఓటమి అనంతరం సంభవించిన పరిణామాలు, స్థానికంగా మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలకు ముందు బీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ ఎంపీ కే.విరుపాక్షప్ప బీజేపీలో చేరారు. అప్పుడు కరియప్ప మాత్రం తటస్తంగా ఉన్నాడు. అయితే తెర వెనుక కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేపట్టారు. క్రమంగా విరుపాక్షప్పకు దూరమైన కరియప్ప ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కరియప్పను భవిష్యత్తులో కురుబ సమాజ నాయకుడిగా పార్టీ గుర్తిస్తే విరుపాక్షప్పకే నష్టమనే వదంతులు వినిపిస్తున్నాయి. అంతకు ముందు బీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన కే.విరుపాక్షప్ప గత లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నించగా అప్పట్లో విరుపాక్షప్ప చేరికను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే హంపనగౌడ వర్గం సీఎం, కేపీసీసీ అధ్యక్షులకు మొర పెట్టుకున్నారు. దీంతో నిరాశ చెందిన విరుపాక్షప్ప చివరకు బీజేపీలో చేరిపోయాడు. లోక్‌సభ ఎన్నికల్లో ఆయన బంధువు కాంగ్రెస్ అభ్యర్థి బసవరాజ్ హిట్నాళ్ తరఫున ప్రచారం చేయకుండా బీజేపీ బలపరిచిన అభ్యర్థి కరడి సంగణ్ణకే మద్దతు తెలిపి గెలిపించారు. అదే సమయంలో కరియప్ప కాంగ్రెస్ అభ్యర్థి తరఫున తెర వెనుక ప్రచారం చేసి పార్టీ అగ్రనాయకత్వంతో సంబంధాలు పెంచుకున్నారు. దీంతో పార్టీ అగ్రనాయకత్వం సమక్షంలో పార్టీలో చేరిపోయారు. అయితే ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే వర్గంలోని కొందరు నగరసభ సభ్యులు రాజీనామా చేస్తామని తమ అసంతృప్తి వ్యక్తం చేయగా, మరికొందరు నోరు మెదపడం లేదు. అగ్ర నాయకత్వం సమక్షంలో పార్టీలో చేరినా రాబోయే రోజుల్లో స్థానిక నాయకులతో పొసుగుతారో లేక సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటారో వేచి చూడాలి. -
రాహుల్‌తో ప్రచారంపై విముఖత
సాక్షి, ముంబై: గత లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయాన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఏఐసీసీ ఉపాధ్యాక్షుడు రాహుల్ గాంధీని ప్రచారం చేయడానికి ఆహ్వానించకపోవడమే మంచిదని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు. ఆయన ప్రచారంచేసిన నియోజకవర్గాలలో ఓటమ తథ్యమని అనేక మంది కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. వీరికితోడు కాంగ్రెస్ మిత్రపక్షమైన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ కూడా ఆయనతో దూరంగా ఉండాలని భావిస్తున్నారు. అంతేకాకుండా రాహుల్‌తో ఎలాంటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనకూడదని పవార్ భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అనేక ఎన్నికల్లో ఫ్లాప్ అయిన రాహుల్ గాంధీ నేతృత్వంపై సీనియర్ నాయకులకు నమ్మకం పోయింది. ఎప్పుడు ఎలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేస్తారో, దాని పరిణామాలు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల తరువాత రాహుల్ ప్రతిష్ట మరింత దిగజారిపోయింది. ఆయనను లక్ష్యంగా చేసుకుని సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో రాహుల్ వద్దు బాబోయ్ అనే మాటలు కాంగ్రెస్‌లో వినిపిస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్సీపీ కూడా రాహుల్ గాంధీకి నాలుగు అడుగులు దూరంగానే ఉండాలని భావిస్తోంది. రాహుల్ సామర్థ్యంపై పవార్‌కు ముందునుంచి అనుమానాలున్నాయి. గత నాలుగైదు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో జీర్ణించుకుపోయిన పవార్‌కు రాహుల్ పని విధానం ఏమాత్రం రుచించడం లేదు. ఈ విషయాన్ని పవార్ అనేసార్లు బహిరంగంగానే వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌తో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు నిరాకరించారు. కేవలం ముంబైలో సోనియా గాంధీ నిర్వహించే బహిరంగ సభలో మాత్రమే పవార్ పాల్గొంటారని ఎన్సీపీ నేతలు చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా సోనియా సభలోనే పవార్ పాల్గొన్నారు. రాజకీయాల్లో పవార్‌కు ఉన్న అనుభవం, ప్రతిష్టతో పోలిస్తే రాహుల్ ఎందులోనూ సరితూగరని, దీంతో రాహుల్ సభలో పాల్గొనడం పవార్ ప్రతిష్టకు సరికాదంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రచార వేదికను రాహుల్‌తో షేర్ చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు ఎన్సీపీ నాయకుడొకరు చెప్పారు. కేవలం సమావేశాల్లో మాత్రమే రాహుల్‌తో కలిసి చర్చిస్తారని స్పష్టం చేశారు. -
బైపోల్లో బీజేపీ బోల్తా
-
కమిలిన కమలం
ఉప ఎన్నికల ఫలితాల్లో చతికిలపడ్డ బీజేపీ 24 సిట్టింగ్ అసెంబ్లీ స్థానాలకుగాను 10 సీట్లలోనే గెలుపు యూపీలో సమాజ్‌వాదీ, రాజస్థాన్‌లో కాంగ్రెస్ హవా గుజరాత్లో కమలనాథులకు ఊరట మోదీ స్థానం వడోదరలో బీజేపీకి భారీగా తగ్గిన మెజారిటీ 3 లోక్‌సభ స్థానాల్లో ఒక్కోటి చొప్పున దక్కించుకున్న బీజేపీ, సమాజ్‌వాదీ, టీఆర్ఎస్ ఫలితాలు వెలువడిన 32 అసెంబ్లీ స్థానాలకు బీజేపీకి 12, ఎస్పీకి 8, కాంగ్రెస్‌కు 7 ఒక్కో అసెంబ్లీ స్థానం చొప్పున దక్కించుకున్న టీడీపీ, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, ఏఐయూడీఎఫ్ సిక్కింలోని ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపు 20న వెలువడనున్న ఆంటాగఢ్ అసెంబ్లీ స్థానం ఫలితాలు సీనియర్లను పక్కనపెట్టిన ఫలితమే: బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా ఉప ఎన్నికల ఫలితాల్లో చతికిలపడ్డ బీజేపీ న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో దేశాన్ని ఒక ఊపు ఊపి సంచలనం సృష్టించిన కమలనాథులకు ఊహించని షాక్ ఇది. అధికారం చేపట్టిన తర్వాత అతికొద్ది కాలంలోనే జరిగిన ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ చతికిలపడింది. ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభావం కూడా కనిపించలేదని స్పష్టమవుతోంది. ప్రధానంగా లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చిన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్‌లలో మొన్నటివరకు తమ చేతిలో ఉన్న 24 అసెంబ్లీ సీట్లలో(1 మిత్రపక్షం) 14 సీట్లను బీజేపీ ఇప్పుడు కోల్పోయింది. 20న ఆంటాగఢ్ ఫలితాలు.. సోమవారం ఫలితాలు వెలువడిన 9 రాష్ట్రాల్లోని 32 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 12 గెలుచుకోగా.. కాంగ్రెస్ ఏడు, సమాజ్‌వాదీ పార్టీ 8, టీడీపీ, ఏఐయూడీఎఫ్, టీఎంసీ, సీపీఎంలు ఒక్కో స్థానం చొప్పున దక్కించుకున్నాయి. సిక్కింలోని ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. మూడు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ, ఎస్పీలు ఒక్కోటి చొప్పున దక్కించుకున్నాయి. ఆ పార్టీల స్థానాలు ఆ పార్టీలకే దక్కాయి. ఛత్తీస్‌గఢ్‌లోని ఆంటాగఢ్ స్థానం ఫలితాలు ఈ నెల 20న వెలువడతాయి. ఎన్నికల ఫలితాలు మోదీకి పరీక్ష కాదని బీజేపీ పేర్కొంటున్నప్పటికీ, ప్రతికూల ఫలితాలపై సమీక్ష చేయాల్సిన అవసరం ఉందంటున్నాయి. యూపీ, రాజస్థాన్‌లో ఫలితాలు బీజేపీని నిరుత్సాహానికి గురిచేయగా, గుజరాత్లో ఆరు స్థానాల్లో గెలవడం, బెంగాల్లో ఖాతా తెరుచుకోవడం కొంత ఊరటనిచ్చింది. యూపీలో దూసుకెళ్లిన సమాజ్‌వాదీ పార్టీ... యూపీలో సమాజ్‌వాదీ పార్టీ దూసుకెళ్లింది. సార్వత్రిక ఎన్నికల్లో 73 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న బీజేపీకి అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలు ప్రతికూలంగా రావడం కమలనాథులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉప ఎన్నిక జరిగిన 11 స్థానాల్లో 10 స్థానాలు బీజేపీ అభ్యర్థులు, 1 బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్ ఖాళీ చేసినవే. ఈ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ మూడు స్థానాల్లోనే విజయం సాధించింది. మిగిలిన 8 అసెంబ్లీ స్థానాలు ఎస్పీ ఖాతాలోకి వెళ్లాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ప్రాతినిధ్యం వహించి రాజీనామా చేసిన మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఎస్పీ అభ్యర్థి తేజ్‌ప్రతాప్ సత్తాచాటుకున్నారు. నోయిడా, సహరన్‌పుర్, తూర్పు లక్నో అసెంబ్లీ స్థానాల్లో కమలం వికసించగా, బిజ్నోర్, ఠాకుర్ద్వారా, నిఘాసన్, హమీర్పుర్, చర్ఖారి, సిరాథు,బల్హా, రొహానియా అసెంబ్లీల్లో ఎస్పీ అభ్యర్థులు గెలిచారు. గుజరాత్లో బీజేపీకి ఊరట..గుజరాత్లో అధికారంలో ఉన్న బీజేపీకి కాంగ్రెస్ గట్టిపోటీనిచ్చింది. అక్కడ క్లీన్‌స్వీప్ చేయాలనుకున్న బీజేపీ కలలు కల్లలయ్యాయి. 9 అసెంబ్లీను గెలిపించి ప్రధాని మోదీకి జన్మదిన కానుక ఇవ్వడానికి ఆ రాష్ట్ర సీఎం ఆనంది చేసిన హామీ చావుతప్పి కన్నులొట్టపోయినట్టుగా మారింది. ఫలితాలు మాత్రం బీజేపీకి కొంత ఊరటనిచ్చాయి. వడోదర లోక్‌సభతో పాటు, మనినగర్, టంకారా, తేలాజా, ఆనంద్, మటర్, లిమ్ఖేడా అసెంబ్లీను బీజేపీ అభ్యర్థులు కైవసం చేసుకోగా, దీసా, ఖంభాలియా, మంగ్రోల్లలో కాంగ్రెస్ గెలిచింది.. మోదీ ఖాళీ చేసిన వ డోదరలో బీజేపీ అభ్యర్థి రంజన్‌బెన్ భట్.. కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్రపై 3.29 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. గతంలో ఈ స్థానాన్ని మోదీ 5.7 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ హవా..రాజస్థాన్‌లోని అధికారంలో ఉన్న బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది. నాలుగు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఒక్క స్థానం (దక్షిణ కోటా నియోజకవర్గం)లో గెలుపొందగా, మిగిలిన మూడు స్థానాలు.. సూరజ్గర్హ, వుయీర్, నసీరాబాద్ అసెంబ్లీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. ఈశాన్యంలోనూ కమలానికి ప్రతికూల ఫలితాలొచ్చాయి. త్రిపురలోని మను అసెంబ్లీ స్థానాన్ని సీపీఎం కైవసం చేసుకోగా, సిక్కింలోని రామ్గంగ్-యాన్గంగ్ అసెంబ్లీ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. అస్సాంలో సిలిచర్‌లో బీజేపీ, లఖీపుర్లో కాంగ్రెస్, జమునాముఖ్లో ఏఐయూడీఎఫ్ గెలిచాయి. పశ్చిమబెంగాల్లో ఖాతా తెరిచిన బీజేపీ బెంగాల్‌లోని చౌరంగి నియోజకవర్గంలో బీజేపీ గెలుపొందగా, దక్షిణ బషీర్హాట్ స్థానం టీఎంసీకి దక్కింది. ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ అసెంబ్లీ స్థానంలో టీడీపీ అభ్యర్థిని తంగిరాల సౌమ్య గెలుపొందారు. తెలంగాణలోని మెదక్ లోక్‌సభ స్థానాన్ని టీఆర్ఎస్ అభ్యర్థి కె.ప్రభాకర్‌రెడ్డి కైవసం చేసుకున్నారు. -
సిబ్బంది లేక ఇబ్బందులు
సాక్షి, ముంబై: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల పనులకు హాజరైన మహానగర పాలక సంస్థ (బీఎంసీ) సిబ్బంది ఇప్పట్లో విధుల్లోకి చేరే అవకాశాలు కనిపించడం లేదు. త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల తరువాతే వీరంతా తమతమ కుర్చీల్లోకి వచ్చే సూచనలు ఉన్నాయి. సిబ్బంది లేకపోవడంతో వివిధ పనుల నిమిత్తం బీఎంసీ కార్యాలయాలకు వచ్చే సామాన్య జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో పనులు జరకపోవడంతో పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎన్నికల పనులకు వెళ్లిన అనేక మంది సిబ్బందిని ఇంతవరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తిరిగి బీఎంసీకి పంపించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఉద్యోగులంతా ఇప్పటికీ కమిషన్ కార్యాలయంలోనే విధులు నిర్వర్తిస్తున్నారని బీఎంసీ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్‌లో రాష్ట్రవ్యాప్తంగా మూడు దశల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కోసం వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి వేలాది మంది సిబ్బందిని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకుంది. బీఎంసీ నుంచి అధికారులు, గుమాస్తాలు, అకౌంటెంట్ల వంటి అనేక మంది ఉద్యోగులు ఎన్నికల పనులకు వెళ్లారు. ఇందులో కొందరిని తిరిగి పంపించిన్పటికీ గణేశ్ ఉత్సవాల సమయం కావడంతో అనేక మంది స్వగ్రామాలకు తరలివెళ్లారు. దీంతో బీఎంసీ కార్యాలయాలన్నీ ఉద్యోగులు లేక ఖాళీగా కనిపిస్తున్నాయి. వీరంతా తిరిగి వచ్చే సరికి అసెంబ్లీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చే సూచనలు ఉన్నాయి. దీంతో ఉద్యోగులంతా తిరిగి ఎన్నికల పనుల్లో నిమగ్నం కావాల్సిందే. బీఎంసీ కార్యాలయాల్లో పనులు నిర్దేశించిన సమయానికి పూర్తి కావడం లేదు. వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు వెళితే వారిని సాధారణ రోజుల్లోనే చెప్పులరిగేలా తిప్పించుకుంటున్నారని ముంబైకర్లు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు ఉద్యోగులు పూర్తి సంఖ్యలో లేకపోవడంతో పనులను మరింత ఆలస్యం చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఈ తిప్పలు అసెంబ్లీ ఎన్నికల తంతు పూర్తయ్యేంత వరకు తప్పకపోవచ్చని ముంబై సెంట్రల్వాసి ఒకరు అన్నారు. బీఎంసీ వర్సెస్ ఉత్సవ మండళ్లు ముదురుతున్న గుంతల వివాదం గత ఏడాది తవ్విన గుంతలను పూడ్చివేయాలంటూ మహానగర పాలక సంస్థ (బీఎంసీ) జారీ చేసిన నోటీసులను అనేక సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్ల నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం ముదురుతోంది. తొలుత రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని, ఆ తరువాతే మండళ్ల నుంచి జరిమానా వసూలు చేయాలని నిర్వాహకులు బీఎంసీని డిమాండ్ చేస్తున్నారు. గత సంవత్సరం జరిగిన గణేశ్ ఉత్సవాల్లో మండపాలు ఏర్పాటు చేసేందుకు సార్వజనిక మండళ్ల ప్రతినిధులు రోడ్లు, ఫుట్‌పాత్‌లపై గుంతలు తవ్వించారు. చవితి వేడుకలు ముగిసిన తరువాత కూడా వాటిని అలాగే వదిలేశారు. గుంతలను ఇంతవరకు పూడ్చలేదు కాబట్టి నిమజ్జనం పూర్తయ్యేంతలోపు జరిమానా చెల్లించాలని మండళ్లకు బీఎంసీ నోటీసులు జారీచేసింది. ఇలా జరిమానా వసూలు చేయడం సరైన పద్ధతి కాదని, తాము ఒక్క పైసా కూడా చెల్లించబోమని మండళ్లు తెగేసి చెప్పాయి. మండళ్లు గుంతలు తవ్వినందుకు రూ.75 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు జరిమానా చెల్లించాలని బీఎంసీ ఆదేశించింది. రోడ్లపై ఏర్పడిన గుంతలతో పోలిస్తే తాము తవ్విన గుంతలు చాలా చిన్నవని, ఉత్సవాలు పూర్తికాగానే సిమెంట్‌తో పూడ్చివేశామని మండళ్ల నిర్వాహకులు వాదిస్తున్నారు. బీఎంసీ మాత్రం గుంతలకు జరిమానా చెల్లించాల్సిందేనని పట్టుబడుతోంది. లేకుంటే ఈ ఏడాది ఉత్సవాలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వబోమని మొదట హెచ్చరించింది. తదనంతరం ఈ నిబంధనను ఉపసంహరించుకుని నిమజ్జనం ముగిసేలోపు జరిమానా చెల్లించాలని సూచించింది. జరిమానా చెల్లించేందుకు మండళ్లు నిరాకరిస్తున్నాయి. చిన్న గుంతలకే వేలల్లో జరిమానా విధిస్తామంటే.. నగర రహదారులపై ఉన్న పెద్ద పెద్ద గుంతల సంగతేమిటని ప్రశ్నిస్తున్నాయి. జరిమానా వివాదంపై బృహన్ ముంబై సార్వజనిక గణేశ్ ఉత్సవ సమన్వయ సమితి సభ్యులపై చర్చిస్తామని బీఎంసీ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రితో ఈ విషయం చర్చించామని, జరిమానా చెల్లించనవసరం లేదని ఆయన తమకు హామీ ఇచ్చారని సమితి సభ్యుడు గిరీశ్ బాలావల్కర్ అన్నారు. నిమజ్జనాలకు ముందే జరిమానా చెల్లించాల్సిందేనని బీఎంసీ పట్టుబట్టడంతో ఈ వివాదం ముదురుతోంది. -
ఉపఎన్నికల్లో బీజేపీకి షాక్
నాలుగు రాష్ట్రాల్లో బీజేపీకి దక్కింది ఏడే.. బీహార్‌లో లౌకికవాద కూటమి ప్రయోగం సక్సెస్ బెంగళూరు: మూడు నెలల క్రితం లోక్‌సభ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన బీజేపీకి నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాలు మాత్రం నిరాశనే మిగిల్చాయి. ఈ నెల 21న బీహార్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో 18 అసెంబ్లీ సీట్లకు ఉపఎన్నికలు జరగగా.. సోమవారం ప్రకటించిన ఫలితాల్లో బీజేపీ కూటమి 8 సీట్లలో విజయం సాధించింది. బీహార్‌లో దూసుకెళ్తామని భావించిన ఆ పార్టీకి ఆర్జేడీ, జేడీ (యు), కాంగ్రెస్ పార్టీలతో కూడిన లౌకికవాద కూటమి గట్టి షాకిచ్చింది. ఆ రాష్ట్రంలో పది స్థానాలకు ఎన్నికలు జరగగా రెండు సిట్టింగ్ స్థానాలు కోల్పోయిన బీజేపీ నాలుగు స్థానాలతో సరిపెట్టుకుంది. లౌకికవాద కూటమికి 6 (ఆర్జేడీ 3, జేడీ (యు) 2, కాంగ్రెస్ 1) స్థానాలు దక్కాయి. కంచుకోట మధ్యప్రదేశ్‌లో క్లీన్‌స్వీప్ చేస్తామని భావించిన బీజేపీకి నిరాశే మిగిలింది. ఇక్కడ మూడు స్థానాల్లో ఎన్నిక జరగ్గా.. ఊహించని రీతిలో కాంగ్రెస్ ఒక సీటు గెలుచుకుంది. ఇక పంజాబ్‌లో రెండు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ ఒక సీటు గెలుచుకోగా.. కాంగ్రెస్ మరో సీటులో విజయం సాధించింది. కర్ణాటకలోని మూడు శాసనసభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలు దక్కించుకుంది. బీజేపీకి దక్కింది ఒక్కటే. మోడీ పాలనపై అసంతృప్తికి సూచిక.. అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాలు ప్రధాని నరేంద్రమోడీ పాలనపై అసంతృప్తికి సూచన అని జేడీ (యు) నేత నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. బీజేపీ మతవాద ఎజెండాను నిలువరించడానికి లెఫ్ట్ పార్టీలను కూడా కలుపుకొనిపోయే దిశగా యోచిస్తున్నామని ఆయన తెలిపారు. కర్ణాటక ఫలితాలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించడం ద్వారా నరేంద్ర మోడీ విజయం తాత్కాలికమని వెల్లడైందన్నారు. కాగా, ఈ ఫలితాలు మోడీ పాలనకు ప్రతీక అనడాన్ని బీజేపీ ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ ఖండించారు. -
ప్రత్యేక రాష్ట్రమే పరిష్కారం
నాగపూర్: అన్ని విధాలా వెనుకబడ్డ విదర్భ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక రాష్ట్రం తప్ప ప్రత్యామ్నాయం లేదని రాష్ట్ర ఉపాధి హామీ పథకం, నీటి సంరక్షణ శాఖ మంత్రి నితిన్ రావుత్ మంగళవారం స్పష్టీకరించారు. విదర్భ డిమాండ్‌కు రావుత్ బహిరంగంగా మద్దతు తెలపడం ఇదే తొలిసారి. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వ మంత్రి ఒకరు విదర్భకు మద్దతు తెలపడం కూడా ఇదే మొదటిసారి కావడం విశేషం. ‘గత వారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాగపూర్‌లో మెట్రోరైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినప్పుడు ఉద్దేశపూర్వకంగానే విదర్భ అంశాన్ని పక్కన బెట్టడం నిరాశకు గురిచేసింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు గురించి ఆయన ప్రకటన చేస్తారని నేను భావించాను’ అని నాగపూర్ ఇన్చార్జి మంత్రి కూడా అయిన రావుత్ అన్నారు. ప్రత్యేక విదర్భకు అనుకూలమని పేర్కొంటూ భువనేశ్వర్‌లో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో బీజేపీ తీర్మానం చేసిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా బీజేపీ నాయకులు ప్రత్యేక రాష్ట్రం గురించి హామీ ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చాక ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం అన్యాయమని అన్నారు. విదర్భను ప్రత్యేక రాష్ట్రంగా చేయడంతోపాటు ఎనిమిది కొత్త జిల్లాలను కూడా ఏర్పాటు చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. పుసాద్, అచల్పూర్, చిమూర్, అష్టి, బ్రహ్మపురి, అమేరీ, ఖామ్గావ్, కటోల్ ప్రాంతాలను జిల్లాలుగా మార్చాలని డిమాండ్లు ఉన్నాయి. అయితే నాగపూర్‌లో భారీ ఎత్తున గొలుసు దొంగతనాలు జరుగుతుండడంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు అన్నిచర్యలూ తీసుకుంటామని నితిన్ రావుత్ హామీ ఇచ్చారు. -
ఇప్పుడు ఎన్నికలు జరిగినా కమల వికాసమే
న్యూఢిల్లీ: లోక్‌సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార బీజేపీ 314 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని ఓ సర్వేలో వెల్లడైంది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన సీట్ల కంటే ఇవి 32 స్థానాలు ఎక్కువ కావడం గమనార్హం. నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారం చేపట్టి మూడు నెలలు పూర్తికానున్న నేపథ్యంలో ఇండియా టుడే గ్రూపు-హన్సా రిసెర్చ్ సంస్థలు సంయుక్తంగా ‘మూడ్ ఆఫ్ నేషన్’ పేరుతో అభిప్రాయ సేకరణ చేశాయి. 29 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 108 లోక్‌సభ స్థానాల్లో 12,430 మంది నుంచి అభిప్రాయాలు సేకరించాయి. ఈ నెల 3 నుంచి 14వ తేదీ మధ్యలో జరిగిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 48 శాతం మంది మళ్లీ బీజేపీకి ఓటు వేస్తామని చెప్పగా... 57 శాతం మంది ప్రధాని పదవికి మోడీ తగిన వ్యక్తి అని అభిప్రాయపడ్డారు. ప్రజాదరణ విషయంలో మోడీ కంటే బీజేపీ ఇప్పటికీ వెనుకబడే ఉండటం గమనార్హం. మరోసారి ఓటు వేసే అవకాశం వస్తే 29 శాతం మంది ముస్లింలు బీజేపీకి ఓటేస్తామని చెప్పగా.. కాంగ్రెస్‌కు ఓటేస్తామని చెప్పినవారు 24 శాతం మందే. -
ఓటమికి రాహుల్ బాధ్యుడు కాదు: ఆంటోనీ
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పరాజయానికి రాహుల్‌గాంధీ బాధ్యుడు కాదంటూ తమ పార్టీ ఉపాధ్యక్షుడికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎ.కె. ఆంటోనీ బాసటగా నిలిచారు. రాబోయే రోజుల్లో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ నేతృత్వంలో పార్టీ మళ్లీ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జెండావందనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ ఓటమి కారణాల పరిశోధనపై తన నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ రూపొందించిన నివేదికను ఆంటోనీ...గురువారం సోనియాకు సమర్పించారు. ఈ కమిటీ రాహుల్ నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తిందని వచ్చిన వార్తలను ఆంటోనీ ఖండించారు. పార్టీని బలహీనం చేయడానికి ఎవరో దుర్మార్గులు కావాలని పుకార్లు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ ఘోర పరాజయానికి కారణాలు వేరే ఉన్నాయని చెప్పిన ఆయన.. ఆ కారణాలు ఏంటో బహిర్గత పరచలేదు. అయితే ప్రస్తుత నాయకత్వంలోనే కష్టకాలాన్ని అధిగమించి, పార్టీని పటిష్టపరిచి, పునర్వైభవం అందిపుచ్చుకుంటామని ఆంటోనీ ధీమా వ్యక్తం చేశారు. ప్రియాంకా గాంధీ ప్రధాన పాత్రపై మాట్లాడుతూ, ఆ విషయంలో ఇప్పటికే ప్రియాంక స్పష్టతనిచ్చారని, దానిపై తానింక చెప్పేది ఏమీ లేదన్నారు. పార్టీ సంస్థాగత మార్పులపై తుది నిర్ణయం సోనియాదేనని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. కమిటీలో మరో సభ్యుడు ముకుల్ వాస్నిక్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 500 మంది నేతల అభిప్రాయాలు తీసుకున్నామని, వారిలో ఏ ఒక్కరు కూడా సోనియా, రాహుల్ నేతృత్వంపై ప్రశ్నలు లేవనెత్తలేదని తెలిపారు. ఆంటోనీ నేతృత్వంలోని ఆ కమిటీలో ముకుల్ వాస్నిక్, ఆర్సీ కుంతియా, అవినాశ్ పాండే సభ్యులన్న విషయం తెలిసిందే. ఓటమిలో మీడియాకు పాత్ర ఉంది తమ పార్టీ పరాజయంలో మీడియాకు కూడా పాత్ర ఉందని రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ అన్నారు. ఆంటోనీ కమిటీ సమర్పించిన నివేదికలో.. మీడియా బీజేపీకి వత్తాసుపలికి, కాంగ్రెస్‌కు తక్కువగా కవరేజి ఇచ్చిందని పేర్కొన్నట్లు సమాచారం. మీడియాపై నిందలెలా వేస్తారని ఆజాద్‌ను ప్రశ్నించగా తమ ఓటమిలో మీడియా కూడా భాగస్వామి అన్నారు. గతంలో తాను మంత్రిగా ఉన్నపుడు గంటసేపు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే ఒక్క నిమిషం కూడా చానళ్లు ప్రసారం చేయలేదన్నారు. -
పోల్ కోడ్ ఉల్లంఘన కేసులో మోడీకి క్లీన్చిట్
అహ్మదాబాద్: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణలపై ప్రధాని నరేంద్రమోడీకి శుక్రవారం గుజరాత్ పోలీసులు క్లీన్చిట్ ఇచ్చారు. గాంధీనగర్‌లో ఓటేశాక విలేకరుల సమావేశంలో పార్టీ గుర్తు అయిన కమలాన్ని కనిపించేలా మోడీ ప్రదర్శించారు. దీంతో కేసు నమోదు చేయాల్సిందిగా ఈసీ పోలీసులను ఆదేశించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 126(1)(ఏ), 126(1)(బీ)ల ప్రకారం నమోదైన ఆ కేసులో నేరం రుజువైతే గరిష్టంగా రెండేళ్ల వరకు జైలుశిక్ష పడుతుంది. అయితే, ఈ కేసును మూసేస్తున్నట్లు, సంబంధిత క్లోజర్ రిపోర్ట్‌ను కేసును విచారిస్తున్న మెట్రోపాలిటన్ కోర్టుకు సమర్పించినట్లు గుజరాత్ క్రైం బ్రాంచ్‌కు చెం దిన ఉన్నతాధికారి ఒకరు శుక్రవారం స్పష్టం చేశారు. -
'కాంగ్రెస్ ఇంకా గుణపాఠం నేర్చుకోలేదు'
న్యూఢిల్లీ: సభలో లో కాంగ్రెస్ పార్టీ ప్రవర్తన తీరు బాధ కలిగిస్తోందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. గత లోకసభ ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ గుణపాఠం నేర్చుకోలేదని వెంకయ్య విమర్శించారు. సభా కార్యక్రమాలను సజావుగా సాగనివ్వకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుతగులుతోందని వెంకయ్య ఆరోపించారు. స్పీకర్ పై ఆరోపణలు చేయడం సమంజసం కాదు. ఒత్తిడికి గురిచేయాలని ఉద్దేశం చేసే చీప్ ట్రిక్కులు సరికావని ఆయన అన్నారు. బుధవారం ఉదయం ప్రారంభమైన సభలో మత హింస బిల్లుకు ప్రతిపక్ష పార్టీలు అడ్డుతగలడంతో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వెల్ లోకి వచ్చి నిరసన తెలిపారు. పరిస్థితులు అదుపుతప్పడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను వాయిదా వేశారు. -
కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు
మహారాష్ట్రలో నారాయణ్ రాణే, అస్సాంలో హిమంత శర్మ రాజీనామా ముంబై/గువాహటి: లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటికే చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీకి తాజాగా రెండు రాష్ట్రాల్లో స్వపక్ష నేతలు పెద్ద షాకిచ్చారు. ఆ పార్టీ పాలనలోని మహారాష్ట్ర, అస్సాంలలో ఇద్దరు అసమ్మతి సీనియర్ మంత్రులు ముఖ్యమంత్రులపై తిరుగుబాటు చేశారు. మహారాష్ట్ర పరిశ్రమల మంత్రి నారాయణ్ రాణే, అస్సాం ఆరోగ్య, విద్యా మంత్రి హిమంత బిశ్వాస్ శర్మలు తమ సీఎంల పనితీరుపై అసంతృప్తితో సోమవారం మంత్రి పదవులకు రాజీనామా చేశారు. కొన్ని నెలల కింద కూడా రాజీనామా చేసిన వీరు.. అప్పుడు అధిష్టానంఒత్తిడితో ఉపసంహరించుకున్నారు. అయితే ఈసారి ఉపసంహరించుకోనని, శర్మ స్పష్టం చేశారు. నారాయణ్ రాణే ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌ను కలుసుకుని రాజీనామా అందజేశారు. తర్వాత విలేకర్లతో మాట్లాడుతూ.. ‘2005లో కాంగ్రెస్‌లో చేరినప్పుడు తనను ఆరు నెలల్లో ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చిన అధిష్టానం తొమ్మిదేళ్లవుతున్నా దాన్ని నెరవేర్చలేదంటూ మండిపడ్డారు. తాను పార్టీని వీడనని స్పష్టం చేశారు. మరోపక్క తనకు మద్దతిస్తున్న 38 మంది ఎమ్మెల్యేలతో కలసి గవర్నర్ వద్దకు వెళ్లానని, సీఎం గొగోయ్ నాయకత్వంపై అవిశ్వాసం వ్యక్తం చేశానని హిమంత శర్మ తెలిపారు. తాము పార్టీ కోసం పోరాడుతున్నామని, గొగోయ్ సారథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తే ఘోరంగా దెబ్బతింటుందన్నారు. -
సోషల్ మీడియాపై సీపీఐ దృష్టి
ముంబై : సోషల్ మీడియాపై కార్యకర్తలకు అవగాహన కల్పించేందుకు సీపీఐ కసరత్తు చేస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో సోషల్ మీడియా చూపిన ప్రభావాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు పార్టీ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి బాలచంద్ర కాంగో బుధవారం ఇక్కడ తెలిపారు. ఇందులో భాగంగా ముంబైలో ఈ నెల 25న సోషల్‌మీడియా కార్యకర్తల కోసం రాష్ట్రస్థాయి వర్క్‌షాపును నిర్వహించనున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాతో యువత ప్రభావితమవుతోందని, అందుకే ఆధునిక ఆలోచనలతో కూడిన పార్టీ కార్యక్రమాలను ఈ మీడియా ద్వారా తెలియజేయనున్నట్లు చెప్పారు. గత ఐదేళ్లుగా సామాజిక మార్పులో సోషల్ మీడియా కీలక భూమిక పోషించిందని అన్నారు. కొన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ముందుకుసాగుతున్నారని తెలిపారు. పార్టీ పనివిధానం, సిద్ధాంతాలను ప్రజలకు తెలియజేయడంలో సరైన కార్యాచరణ లేక తమ నాయకత్వం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నదని అన్నారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర శాఖ ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ తదితర సోషల్ మీడియా సైట్లను ప్రారంభించిందని చెప్పారు. యూ ట్యూబ్‌లో చానెల్ కూడా ప్రారంభించామని చెప్పారు. 25న నిర్వహించనున్న వర్క్‌షాపులో సోషల్ మీడియాను పార్టీ కార్యక్రమాలకు వేదికగా ఎలా వినియోగించుకోవాలనే అంశాలపై కార్యకర్తలకు శిక్షణ ఇప్పించనున్నట్లు ఆయన వెల్లడించారు. -
ఓటమి సాధారణమే
లోక్‌సభ ఎన్నికలపై సీఎం సిద్ధు పరమేశ్వరతో కలిసి ఢిల్లీలో ఆంటోనితో భేటీ పార్టీ బలోపేతమే లక్ష్యం : పరమేశ్వర సీఎం రేసులో లేను : దేశ్‌పాండే సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ పార్టీలకు గెలుపోటములు సర్వ సాధారణమేనని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పారు. ఇటీవల ఎన్నికల్లో పార్టీ ఓటమిపై అధిష్టానానికి వివరణ ఇవ్వడానికి బుధవారం ఢిల్లీ వెళ్లిన ఆయన, కేపీసీసీ చీఫ్ పరమేశ్వరతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కర్ణాటక మాత్రమే కాకుండా, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పార్టీ ఓటమిపై కేంద్ర మాజీ మంత్రి ఏకే. ఆంటోనీ నాయకత్వంలో ఏర్పడిన కమిటీతో సమావేశమవడానికి పరమేశ్వరతో కలసి ఆయన వెళ్లారు. ఆంటోనీతో జరిగిన సమావేశంలో ఎన్నికల్లో ఓటమిపై విశ్లేషించడంతో పాటు పార్టీని బలోపేతం చేసే విషయమై చర్చించినట్లు విలేకరులకు పరమేశ్వర తెలిపారు. కాగా ఎన్నికల్లో పార్టీ ఓటమికి సీఎం వైఖరే కారణమని గత వారాంతంలో ఇక్కడ జరిగిన ఆత్మావలోకన సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పరోక్షంగా ఆరోపించడంతో వారిద్దరి ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ పదవి ఉంటుందో, ఊడుతుందో అని అదే సమావేశంలో సీఎం వేదాంత ధోరణిలో మాట్లాడడం చర్చనీయాంశమైంది. నాయకత్వ మార్పు దిశగా కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోందా అనే సందేహాలూ తలెత్తాయి. సీఎంకు దేశ్‌పాండే బాసట శాసన సభ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఉన్నత విద్యా శాఖ మంత్రి ఆర్వీ. దేశ్‌పాండే ముఖ్యమంత్రికి మద్దతుగా మాట్లాడారు. శాసన సభ వెలుపల ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం సీఎంను ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశించిందని, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి ఆయనే కారణమంటూ పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు ఆరోపించారని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు. ముఖ్యమంత్రి చక్కగా పని చేస్తున్నారని కితాబునిస్తూ, ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా ఉన్నారని తెలిపారు. అల్ప సంఖ్యాకులు, వెనుకబడిన తరగుతులు, దళితులతో కూడిన ‘అహింద’ ప్రభుత్వాన్ని సిద్ధరామయ్య నడుపుతున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు పస లేనివని కొట్టి పారేశారు. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఇటీవల శాసన మండలికి ఐదుగురిని నామినేట్ చేసిన విషయంలో సీఎం ‘కోటరీ’ పాత్ర ఉందని వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ, పార్టీ అధిష్టానం అనుమతితోనే ఈ ఎంపికలు జరిగాయని వివరించారు. రాష్ర్ట మంత్రి వర్గంలో చర్చించిన తర్వాతే పేర్లను ఖరారు చేశారని తెలిపారు. కాగా తాను ముఖ్యమంత్రి పదవిని కోరుకోవడం లేదని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
ప్రజలను తప్పుదారి పట్టించిన మోడీ: కాంగ్రెస్
చండీగఢ్: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రజలను ప్రధాని నరేంద్ర మోడీ తప్పుదారి పట్టించారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే అన్ని సమస్యలను పరిష్కరించేస్తామన్నట్టుగా మోడీ ప్రచారం చేశారని చెప్పారు. మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి నెల రోజులు కూడా గడవకముందే పెట్రోల్, డీజిల్ ధరలు, రైల్వే చార్జీలు పెంచేశారని గుర్తు చేశారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినా ఒక్క నిత్యావసర వస్తువు ధర కూడా దిగిరాలేదని వెల్లడించారు. దీని గురించి మోడీ ఎక్కడా మాట్లాడడం లేదని అన్నారు. తాము అధికారంలోకి వస్తే చైనా తోక కత్తిరిస్తామని చెప్పిన ఎన్డీఏ ఇప్పుడు... అరుణాచల్ ప్రదేశ్ ను చైనా తన అధికార పటంలో చూపించినా నోరు మెదపడం లేదని షకీల్ అహ్మద్ ఎద్దేవా చేశారు. -
నిరాశొద్దు..
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చవి చూసినంత మాత్రాన నిరాశ, నిస్పృహలకు లోను కావద్దని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ఓటమిపై ఇక్కడి ప్యాలెస్ గ్రౌండ్లో శనివారం ప్రారంభమైన రెండు రోజుల ఆత్మావలోకనం సభలో ప్రసంగించిన నాయకులంతా కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నించారు. ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొందని, ఈ ఓటమి తాత్కాలికమేనని అన్నారు. సభను ప్రారంభించిన అనంతరం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ కర్ణాటక, మహారాష్ట్రల్లో మత సామరస్యాన్ని దెబ్బ తీయడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్లు కుట్ర పన్నాయని ఆరోపించారు. ఆ కుట్రలను భగ్నం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. బీజేపీ వారు సోషల్ సైట్లను విస్తృతంగా ఉపయోగించుకోవడం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీనికి ప్రతిగా మన కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలను అప్రమత్తం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. పాదయాత్రల ద్వారా ప్రజలకు దగ్గర కావాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడితే, ప్రజాందోళనలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. సవాలుగా స్వీకరించాలి లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిని సవాలుగా స్వీకరించాలని కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాలను చురుకుగా చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యతనివ్వాలని, పార్టీ కోసం శ్రమిస్తున్న కార్యకర్తలకు సరైన పదవులు ఇవ్వాలని నొక్కి చెప్పారు. ఎన్నో ఆశలు రేపి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ గత నెలగా ప్రజలకు ఉపయోగపడే ఒక్క కార్యక్రమాన్నీ చేపట్టలేదని విమర్శించారు. నిత్యావసర సరుకుల ధరలను తగ్గించే ప్రయత్నాలు చేయలేదని ఆరోపించారు. ఆయన నుంచి ఉత్తమ పాలనను ఆశించలేమని అన్నారు. ఈ సభలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లిఖార్జున ఖర్గే, కేంద్ర మాజీ మంత్రులు వీరప్ప మొయిలీ, కేహెచ్. మునియప్ప, జనార్దన పూజారి సహా రాష్ర్ట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పరమేశ్వరకు మద్దతుగా ధర్నా పరమేశ్వరకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తుమకూరు జిల్లా కొరటగెరె నియోజక వర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇక్కడి క్వీన్స్ రోడ్డులోని కేపీసీసీ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. 30 ఏళ్లుగా పార్టీకి సేవలు అందిస్తున్న పరమేశ్వరకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడానికి ఆయనే కారణమంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ ప్రస్తుతం కొరటగెరె నియోజక వర్గంలో ఒక్క పనీ జరగడం లేదని వారు ఆరోపించారు. కాగా గత శాసన సభ ఎన్నికల్లో పరమేశ్వర ఈ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇటీవల శాసన మండలికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
భూసేకరణ చట్టాన్ని మార్చాలి
న్యూఢిల్లీ: గత యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన భూసేకరణ చట్టం సరిగా లేదని పలు రాష్ట్రాలు విమర్శించాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ చట్టాన్ని హడావుడిగా తీసుకువచ్చారని ధ్వజమెత్తాయి. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల రెవెన్యూ మంత్రులతో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా భూసేకరణ చట్టంలోని నిబంధనలు చిన్న ప్రాజెక్టులకు కూడా అవాంతరాలు కల్పించేలా ఉన్నాయని బీజేపీ పాలిత రాష్ట్రాల మంత్రులు దుయ్యబట్టారు. అలాగే కాంగ్రెస్ నేతృత్వంలోని హర్యానా, కర్ణాటక, కేరళ మంత్రులతోపాటు, అన్నాడీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, బీజేడీ మంత్రులు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీనిలో మార్పులు చేయాలని వారు డిమాండ్ చేశారు. కాగా, ఈ చట్టంలోని కొన్ని నిబంధనలను కేంద్రం సవరించే అవకాశముందని తెలుస్తోంది. భూసేకరణ విషయంలో తమ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను కాపాడుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు. రైతులకు నష్టపరిహారం, పునరావాసం అంశాల్లో రాజీపడబోమని పేర్కొన్నారు. -
బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి నియామకంపై ఉత్కంఠ ఇంకెన్నాళ్లో?
లోక్‌సభ ఎన్నికల తర్వాత అప్పటిదాకా బీజేపీ రాష్ర్ట శాఖ అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించిన డాక్టర్ హర్షవర్ధన్‌ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి పదవి వరించింది. దీంతో బాధ్యతల నిర్వహణలో ఆయన తలమునకలైపోయారు. ఆ తర్వాత బీజేపీ అధిష్టానం ఆయన స్థానంలో మరొకరిని నియమించలేదు. ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తుండడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నూతన సారథి కోసం ఎదురుచూస్తున్నారు. న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖకు నూతన సారథి ఎవరనే విషయంలో ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. శాసనసభ ఎన్నికలు ఏ సమయంలోనైనా జరిగే అవకాశాలు మెండుగా ఉండడంతో కచ్చితంగా వీలైనంత త్వరగా కొత్త అధ్యక్షుడిని నియమిస్తే బాగుంటుందని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఎన్నికలకు సన్నద్ధమవడం సులభమవుతుందంటున్నారు. లోక్‌సభ ఎన్నికల పరాజయం తర్వాత పూర్వవైభవం కోసం ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుండగా, మరోవైపు నగరంలో తమ పట్టును పెంచుకునేందుకు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శ్రమిస్తోంది. బీజేపీ రాష్ర్ట శాఖ అధ్యక్ష పదవిలో ఉన్నప్పటికీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి బాధ్యతల్లో డాక్టర్ హర ్షవర్ధన్ తలమునకలయ్యారని, అందువల్ల రాష్ట్ర శాఖ వ్యవహారాలపై ఆయన అంతగా దృష్టి సారించలేరని ఆ పార్టీకి చెందిన నాయకులు అంటున్నారు. ఈ విషయమై ఆ పార్టీ నాయకుడొకరు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా డాక్టర్ హర ్షవర్ధన్ తన పనిలో తాను నిమగ్నమయ్యారన్నారు. అందువల్ల పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించడానికి అంత సమయం ఆయనకు ఉండదన్నారు. దీంతో ఎటువంటి భారీ కార్యక్రమాన్ని చేపట్టలేని పరిస్థితి కొనసాగుతోందన్నారు. కనీసం సభ్యత్వ కార్యక్రమం కూడా చేపట్టలేకపోతున్నామన్నారు. బీజేపీ సాధారణంగా ఆరు సంవత్సరాలకొకసారి సభ్యత్వ కార్యక్రమం చేపడుతుంది. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం నేపథ్యంలో ఈసారి ఐదు సంవత్సరాలకే నిర్వహిస్తోంది. ఈ నెల 15వ తేదీ నుంచే ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నెలాఖరుదాకా కొనసాగనుంది. అయితే తొలి నాలుగు రోజుల్లో ఆశించిన మేర స్పందన రాలేదు. ఇది ఆ పార్టీని కొంత నిరుత్సాహానికి గురిచేసింది. రాష్ట్ర శాఖకు సరైన నాయకత్వం లేకపోవడమే ఇందుకు కారణమని ఆ పార్టీ నాయకుడొకరు వాపోయారు. మరోవైపు ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తమకు కలిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు యత్నిస్తున్నాయి. మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన మేర ఫలితాలు రాకపోవడంతో ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు ప్రతిరోజూ మొహల్లా సభలను నిర్వహిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి విద్యుత్ సంక్షోభం అనుకోని అవకాశంగా మారింది. ఈ సమస్యపై ప్రతిరోజూ ఆందోళనలకు దిగడం ద్వారా ప్రజల్లో పట్టు పెంచుకునేందుకు యత్నిస్తోంది. తద్వారా శాసనసభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు నానాతంటాలు పడుతోంది. మరోవైపు ఈ సంక్షోభం బీజేపీకి శాపంగా పరిణమించింది. సరైన నాయకత్వం లేకపోవడంతో ఈ సమస్యపై తమ వైఖరేమిటనే విషయాన్ని బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వివరించలేని పరిస్థితి కొనసాగుతోంది. చివరికి ఈ-రిక్షాల విషయంలో కూడా వారు పెదవి విప్పలేకపోతున్నారు. ఇందుకు కేంద్ర రవాణా శాఖ మంత్రి, ఆ పార్టీ నాయకుడు నితిన్ గడ్కరీ వీటి క్రమబద్ధీకరణకు సంబంధించి ఎటువంటి స్పష్టమైన ప్రకటన చేయకపోవడమే. ఒకవేళ ఎన్నికలు ముంచుకొస్తే ఆప్‌కు గట్టి పట్టు కలిగిన ప్రాంతాల్లో బీజేపీ తన ప్రచార పర్వాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ-రిక్షాలకు క్రమబద్ధీకరణకు సంబంధించి స్పష్టమైన హామీ లభించినట్టయితే దానిద్వారా బీజేపీ ఆ వర్గాల మద్దతు పొందే అవకాశం లభిస్తుంది. అందుకోసం కూడా విస్తృత మైన ప్రచారం నిర్వహించాల్సి ఉంటుంది. ఎన్నికలకు మేం సిద్ధంగానే ఉన్నాం: బీజేపీ నేత రమేశ్ న్యూఢిల్లీ: జాతీయ రాజధానిలో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై ఒకవైపు అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో తమ పార్టీ ఎన్నికలకు సన్నద్ధంగానే ఉందని బీజేపీ నాయకుడు రమేశ్ బిధూరీ పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలొక్కటే తమకు మిగిలి ఉన్న అవకాశమన్నారు. ‘ఎన్నికలకు మా పార్టీ అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది. ఈసారి మాకు తిరుగులేని మెజారిటీ వస్తుందనే ధీమా ఉంది’ అని బీజేపీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఈ దక్షిణ ఢిల్లీ ఎంపీ పేర్కొన్నారు. ఎన్నికలకు మీ పార్టీ సిద్ధమేనా అని ప్రశ్నించగా ఈ విషయమై అధిష్టానం త్వరలో ఓ నిర్ణయానికి వస్తుందన్నారు. భారీ పగటికలలు కంటూ శాసనసభ ఎన్నికల బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం చేపట్టినప్పటికీ 49 రోజుల పాలనాకాలంలో దాని లోపాలన్నీ బయటపడ్డాయన్నారు. అందువల్లనే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఇబ్బందికరమైన ఫలితాలను చవిచూడక తప్పలేదన్నారు. కాగా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నగరంలోని మొత్తం 70 సెగ్మెంట్లకు గాను 60 స్థానాల్లో బీజేపీ ముందున్న సంగతి విదితమే. లోక్‌సభ ఎన్నికలకు ముందు డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి అధికారం చేపట్టేందుకు తగినంత మెజారిటీ రాని సంగతి విదితమే. ఆ ఎన్నికల్లో బీజేపీకి 33.07 శాతం ఓట్లు రాగా ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అది 46.10 శాతానికి పెరిగింది. ఇక ఆప్ ఓటు శాతం 32.90 నుంచి 29.49 శాతానికి పడిపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీకి 24.50 శాతం వాటా దక్కింది. ఇది లోక్‌సభ ఎన్నికలకొచ్చేసరికి 15.10 శాతానికి పడిపోయింది. వాస్తవానికి ప్రస్తుతం ఎన్నికల బరిలోకి దిగడం ఏ పార్టీకీ ఇష్టం లేకపోయినప్పటికీ అంతకుమించి మరో మార్గం కనిపించని పరిస్థితి కొనసాగుతోంది. -
తలకాయలు మార్చినా తలరాతలు మారేనా?
ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో ఘోరపరాజయం తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీల్లో అంతర్మథనం మొదలైంది. అనేకరకాల సమీక్షల తర్వాత ఇరుపార్టీల అధిష్టానాలు.. రాష్ట్రంలో ఆ పార్టీ అధ్యక్షులను, కీలక పదవుల్లో ఉన్న నాయకులను మార్చాలని నిర్ణయించాయి. ఈ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు కూడా ప్రారంభించినట్లు వివిధ పత్రికలు, టీవీ చానళ్లలో కథనాలు వస్తున్నాయి. మహారాష్ట కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రేతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌ను మార్చాలని కాంగ్రెస్ పార్టీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు కొందరు సీనియర్ నేతలు చెబుతున్నారు. ఇక ఎన్సీపీలో కూడా ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు భాస్కర్ జాదవ్‌ను మార్చనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రకమైన మార్పులు ప్రజాస్వామ్య కూటమిలోని భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్, ఎన్సీపీలకు మళ్లీ అధికారాన్ని కట్టబెడతాయా? అనే ప్రశ్నకు రాజకీయ విశ్లేషకుల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తలకాయలు మార్చినంత మాత్రనా ఇరుపార్టీల తలరాతలు మారే అవకాశం లేదని కొందరు చెబుతుండగా నాయకత్వ మార్పు కొంతమేరకైనా ప్రజలపై ప్రభావం చూపుతుందని మరికొందరంటున్నారు. సోనియాను కలిసిన నారాయణ్ రాణే... లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కేవలం రెండంటే రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని కోరుతూ ఆ పార్టీ నేత నారాయణ్ రాణే, అధినేత్రి సోనియా గాంధీని కలిసినట్లు తెలిసింది. దీంతో రాణేను పార్టీ అధినాయకత్వమే పిలిపించిందా? లేక రాణే స్వయంగా వెళ్లి అధిష్టానాన్ని కలిశారా? అనే విషయంలో ఎటువంటి స్పష్టత లేకున్నా మొత్తానికి పార్టీ పదవులతోపాటు ముఖ్యమంత్రి పదవిలో కొత్తవారిని కూర్చోబెట్టాలనే నిర్ణయానికి అధిష్టానం వచ్చిందనే సమాచారం బయటకు వచ్చింది. ముఖ్యమంత్రి పదవిని షోలాపూర్ నేత, మాజీ హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేకు ఇవ్వనున్నట్లు కొందరు చెప్పుకుంటున్నారు. ఇక ఎంసీసీసీ అధ్యక్ష పదవిని మాజీ ముఖ్యమంత్రి అశోక్‌రావ్ చవాన్‌కు అప్పగించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే అయితే పెయిడ్ న్యూస్ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చవాన్ దాని నుంచి బయటపడితేగానీ ఏ నిర్ణయం తీసుకోలేమనే నిర్ణయంలో అధిష్టానం ఉన్నట్లు ఆ పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. ఫలిస్తే సరే.. మరి వికటిస్తే.. పార్టీ అధిష్టానం చేస్తున్న కసరత్తు ఫలిస్తే సరే... మరి వికటిస్తే పరిస్థితి ఏంటని ఆ పార్టీ సీనియర్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కొత్తగా ఎంపికచేసేవారి విషయంలో అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలని, ఎంపిక చేసే ముందు కూడా పర్యవసానాలు ఎలా ఉంటాయనే విషయమై ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు. కీలక పదవుల బాధ్యతలను కొత్తవారికి అప్పగించినప్పుడు వారి మద్దతుదారుల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకపోయినా వారి ప్రత్యర్థుల నుంచి ఎదురయ్యే ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలంటున్నారు. వ్యక్తులకే కాకుండా ప్రాంతాలవారీగా కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇలా అన్ని విషయాల్లో సమతూకం పాటించినప్పుడే మార్పులు సత్ఫలితాలనిస్తాయని చెబుతున్నారు. జాదవ్ స్థానంలో ఎవరో? కాంగ్రెస్ మిత్రపక్షమైన ఎన్సీపీలో కూడా ప్రక్షాళన జరిగే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. పార్టీ రాష్ట్రాధ్యక్షుడు భాస్కర్ జాధవ్‌ను మార్చనున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇటీవల పదాధికారులతో శరద్‌పవార్ నిర్వహించిన సమావేశంలో ఈ విషయమై అభిప్రాయాలు కూడా సేకరించినట్లు చెప్పుకుంటున్నారు. భాస్కర్ జాదవ్‌కు మంత్రి మండలిలో చోటిచ్చి పార్టీ అధ్యక్ష బాధ్యతలను సునీల్ తట్కరే కు అప్పగించాలనే డిమాండ్లు ఊపందుకుంటున్న నేపథ్యంలో అధిష్టానం కూడా ఆ దిశగానే యోచిస్తున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్‌లో మార్పుల జరిగిన తర్వాత వాటికి అనుగుణంగా పార్టీలో మార్పులు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఠాక్రేలకు భుజ్‌బల్ చురకలు మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే, శివసేన కార్యాధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేలకు ఎన్సీపీ నేత, ప్రజాపనుల శాఖమంత్రి ఛగన్ భుజ్‌బల్ చురకలించారు. ‘ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నవారందరికీ శుభాకాంక్షలు’ అంటూ పరోక్షంగా ఠాక్రేలిద్దరిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజ్‌ఠాక్రే, ఉద్ధవ్ఠాక్రేలు ముఖ్యమంత్రులు కావాలంటూ ఇరు పార్టీల కార్యకర్తలు కోరుకుంటున్నట్లు ఇటీవల వార్తాపత్రికల్లో కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే. వీటిపై స్పందించిన భుజ్‌బల్ ఈ రకమైన వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు. -
7 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు!
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జూలై 7 నుంచి ప్రారంభమై ఒక నెల పాటు జరిగే అవకాశముంది. ఇవి ఆగస్ట్ 6 వరకు కొనసాగొచ్చని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. బుధవారం జరిగే కేబినెట్ భేటీలో షెడ్యూలు ఖరారు అంశం పరిశీలనకు రావొచ్చన్నాయి. తొలి వారం సమావేశాల్లో ప్రీ-బడ్జెట్ ఎకనామిక్ సర్వే, రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్లను ప్రవేశపెట్టే అవకాశముంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు తెచ్చిన ఓట్సాన్ అకౌంట్ గడువు జూలై నెలాఖరుతో ముగియనుండడంతో ఆలోపు ఈ బడ్జెట్లను ఆమోదించాల్సి ఉంది. -
వడోదరాలో మోడీ ఎన్నికల వ్యయం రూ. 50 లక్షలు
వడోదరా: గుజరాత్‌లోని వడోదరా స్థానం నుంచి కూడా లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారానికి సుమారు రూ. 50 లక్షలు ఖర్చు చేసినట్లు అధికారులు తేల్చారు. వడోదరాలో మోడీ మొత్తం ఎన్నికల వ్యయం రూ. 50,03,598గా లెక్కగట్టారు. ఇందుకు సంబంధించిన లెక్కలను మోడీ ప్రచార వ్యయం ఇన్చార్జి, వడోదరా మేయర్ భరత్ షా శుక్రవారం స్థానిక ఎన్నికల కమిషన్ కార్యాలయానికి సమర్పించారు. దీని ప్రకారం మోడీ ఏప్రిల్ 9న నామినేషన్ దాఖలు చేసే సందర్భంగా నిర్వహించిన సభతోపాటు మే 16న విజయోత్సవ సభ (వడోదరాలో 5.70 లక్షల ఓట్ల మెజారిటీతో మోడీ గెలిచారు) నిర్వహణకు రూ. 25.80 లక్షలు ఖర్చు అయింది. కేంద్ర ఎన్నికల కమిషన్ అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని పెద్ద రాష్ట్రాల్లో రూ. 40 లక్షల నుంచి రూ. 70 లక్షలకు, చిన్న రాష్ట్రాల్లో రూ. 22 లక్షల నుంచి రూ. 54 లక్షలకు పెంచడం తెలిసిందే. -
అంతా రహస్యమే
సాక్షి, చెన్నై: డీఎండీకే అధినేత విజయకాంత్ మంగళవారం మలేషియా వెళ్లారు. ఆయన పర్యటన అత్యంత రహస్యంగా సాగడం చర్చనీయూంశమైంది. దీని వెనుక ఆంతర్యమేమిటోనని పలువురు చెవులు కొరుక్కున్నారు. అయితే తనయుడు షణ్ముగ పాండియన్ శతాబ్దం చిత్రం షూటింగ్ కోసమే ఆయన వెళ్లినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల మంతనాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో డీఎండీకే అధినేత విజయకాంత్ గతంలో మలేషియాకు చెక్కేశారు. బీజేపీతో కలసి పనిచేయడం లక్ష్యంగా అక్కడున్న తన సన్నిహితులతో మంతనాల నిమిత్తం ఆయన వెళ్లినట్టు అప్పట్లో ప్రచారం సాగింది. అలాగే మలేషియా వేదికగా రాజకీయ పందేరాలు సాగినట్టు తమిళ మీడియా కోడై కూసింది. మలేషియా నుంచి వచ్చీరాగానే బీజేపీతో పొత్తుకు ఆయన జై.. కొట్టడం మీడియా కథనాలకు బలం చేకూరినట్టయింది. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సమయంలో తన మలేషియా పర్యటనపై సాగుతున్న ప్రచారానికి ముగింపు పలుకుతూ విజయకాంత్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడి చిత్ర షూటింగ్ నిమిత్తం మలేషియా వెళ్లినట్టు వివరణ ఇచ్చుకున్నారు. తాను ఈ చిత్రంలో కనిపించబోతున్నట్టు ప్రకటించి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. అదే సమయంలో ఎన్నికల బిజీలో షూటింగ్‌లు ఏమిటో... అన్న అంశంపై చర్చకూడా సాగింది. ఎన్ని వివరణలు ఇచ్చుకున్నా చివరకు లోక్‌సభ ఎన్నికల్లో విజయకాంత్ పార్టీ డిపాజిట్లు గల్లంతయ్యాయి. కేంద్రంలో తమ పార్టీకి మంత్రి పదవి దక్కుతుందని ఎదురు చూసినా ఫలితం శూన్యం. చివరకు పార్టీ వర్గాలతో ఓటమిపై సమీక్షలు ముగించడంతోపాటు వలసలు బయలు దేరకుండా ముందు జాగ్రత్త చర్యగా నేతలకు ఉపదేశాలు ఇచ్చిన విజయకాంత్ హఠత్తుగా మంగళవారం మలేషియాకు చెక్కేశారు. మలేషియా పయనం : తన మలేషియా పర్యటన వివరాల్ని అత్యంత గోప్యంగా విజయకాంత్ ఉంచడం చర్చనీయాంశంగా మారింది. వీఐపీలు వస్తున్న సమయంలో మీనంబాక్కం విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేయడం సహజం. అయితే ఈ సారి అలాంటి ఏర్పాట్లు కూడా లేదు. అలాగే విదేశాలకు వెళ్లే ప్రయాణికులు మూడు గంటలు ముందుగానే విమానాశ్రయం చేరుకోవాల్సి ఉంటుంది. బోర్డింగ్ పాస్ తీసుకున్న అనంతరం అర గంట ముందుగా విమానంలోకి పంపుతారు. ఇందుకు భిన్నంగా విజయకాంత్ అత్యంత రహస్యంగా విమానాశ్రయానికి రావడం గమనార్హం. 11.30 గంటలకు విమానం బయలు దేరాల్సి ఉండగా, సరిగ్గా 11.05కు ఆయన విమానాశ్రయూనికి చేరుకున్నారు. అప్పటికే అక్కడి అధికారులు ఆయనకు బోర్డింగ్ పాస్ సిద్ధం చేయడంతో మీడియా కంట పడకుండా మలేషియాకు చెక్కేశారు. ఆయన వెంట సతీమని ప్రేమలత కూడా వెళ్లారు. షూటింగ్ నిమిత్తమే: విజయకాంత్ రహస్య పయనం మీడియాల్లో హల్చల్ చేయడంతో డీఎండీకే వర్గాలు మేల్కొన్నాయి. తమ అధినేత విజయకాంత్ కేవలం షూటింగ్ నిమిత్తం మలేషియా వెళ్లారని వివరణ ఇచ్చే పనిలో పడ్డారు. తమ నేత వారసుడు షణ్ముగ పాండియన్ హీరోగా శతాబ్దం పేరుతో సినిమా రూపుదిద్దుకుంటున్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఆ చిత్రంలో విజయకాంత్ అతిథి పాత్రలో కనిపించనున్నారని, ఆ చిత్ర షూటింగ్ మలేషియా, కౌలాలంపూర్ల్లో జరగనున్నదని, అందు వల్లే ఆయన విదేశీ పయనాన్ని రహస్యంగా ఉంచుకున్నట్టు చెబుతున్నారు. పది, పదిహేను రోజులు ఈ షూటింగ్ ఉంటుందని, ఆ తర్వాత ఆయన ఇక్కడికి రావొచ్చని వెల్లడించారు. -
ఓటమికి హైకమాండే కారణం: అంతులే
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధిష్టానంపై విమర్శలు గుప్పిస్తున్న సీనియర్ నాయకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి హైకమాండే కారణమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఏఆర్ అంతులే విమర్శించారు. పార్టీ పరిస్థితి ఇలా ఉందంటే దానికి అధిష్టాన పెద్దలే కారకులని ఆయన దుయ్యబట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారకులెవరని ప్రశ్నించగా ఆయనీవిధంగా స్పందించారు. 206 ఎంపీ స్థానాల నుంచి కాంగ్రెస్ 44 స్థానాలకు పడిపోయింది. మహారాష్ట్రలో 48 లోక్‌సభ స్థానాలుండగా 2 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. సొంత రాష్ట్రంలో పార్టీ ఓటమిపై మాట్లాడేందుకు అంతులే నిరాకరించారు. -
తమిళనాడు గవర్నర్‌గా జశ్వంత్‌సింగ్!
జైపూర్: సీనియర్ నేత జశ్వంత్సింగ్కు గవర్నర్ పదవి కట్టబెట్టే అవకాశాలున్నాయనే వార్తల నేపథ్యంలో.. ఆయన తిరిగి బీజేపీ గూటికి చేరనున్నారనే ఊహాగానాలు మరోమారు పతాక శీర్షికలకెక్కా యి. బీజేపీ బహిష్కృత నేత జశ్వంత్‌ను తమిళనాడు గవర్నర్‌గా నియమించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల సమాచారం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొణిజేటి రోశయ్య ప్రస్తుతం తమిళనాడు గవర్నర్‌గా ఉన్నారు. దీనిపై వ్యాఖ్యానించేందుకు సింగ్ అందుబాటులో లేనప్పటికీ.. ఆయన సన్నిహితులు మాత్రం తమ నేత బీజేపీలోకి తిరిగివెళ్లేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఆయనకు బర్మేర్ టికెట్‌ను బీజేపీ నిరాకరించింది. దీంతో అక్క డి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడంతో పార్టీ ఆయనపై బహిష్కరణ వేటు వేసింది. -
త్వరలో బోర్డులు, కార్పొరేషన్లకు నియామకాలు
5న కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడి సాక్షి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో త్వరలో రాష్ట్రంలోని బోర్డులు, కార్పొరేషన్ల నియామకాలను చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. మైసూరు పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల పూర్తై నేపథ్యంలో ఇక కార్పొరేషన్ బోర్డుల నియామకాలను ఆలస్యం చేయబోమని స్పష్టం చేశారు. ఈ నెల 23 నుంచి శాసనసభ సమావేశాలు ప్రా రంభం కానున్న నేపథ్యంలో ఈ నెల 5న బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశాన్ని నిర్వహించడానికి నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలతో వారి వారి నియోజకవర్గాల్లోని సమస్యలపై చర్చించనున్నట్లు వెల్లడించారు. ఇక కన్నడ మాధ్యమ పాఠశాలల్లో ఒకే ఒక విద్యార్థి ఉన్నా కూడా అలాంటి పాఠశాలల ను మూయబోమని తెలిపారు. ఒక విద్యార్థి ఉన్నా కూడా పాఠశాలలను న డపాల్సిందేనని తమ ప్రభుత్వం భావి స్తోందని, అయితే ఈ విషయంపై మంత్రి వర్గ సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కన్నడ క్రియా సమితి కార్యకర్త మల్లేష్ రాష్ట్రంలో కన్నడ మాధ్యమ పాఠశాలలను ఎట్టి పరిస్థితుల్లోనూ మూసివేయకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రిని కలిసి విన్నవించారు. ఈ విషయంపై స్పందిస్తూ సిద్ధరామయ్యపై వ్యాఖ్యలు చేశారు. -
ఆ అవసరం లేదు!
సాక్షి, ముంబై: వచ్చే శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వం మార్చాల్సిన అవసరం లేదని మాజీ కేంద్ర మంత్రి సుశీల్‌కుమార్ షిండే అభిప్రాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాత షిండే మొదటిసారిగా షోలాపూర్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శాసనసభ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో నేతృత్వం మారిస్తే పార్టీకి మరింత నష్టం తప్పదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పరాజయాన్ని చవిచూసిననంత మాత్రాన శాసనసభ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి ఎదురవుతుందని భావించడం సరైన అభిప్రాయం కాదన్నారు. శాసనసభ ఎన్నికల్లో 1974 నుంచి శాసనసభ, రాజ్యసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేశానని, పోటీచేసిన ప్రతిసారీ తనను విజయం వరించిందన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభంజనం ఉన్నప్పటికీ షోలాపూర్ వాసులు తనకు భారీగా ఓట్లు వేశారు. మోడీ ప్రమాణ స్వీకారోత్సవం గురించి మాట్లాడుతూ... ఆ రోజు జరిగిన ఉత్సవానికి సార్క్ దేశాల ప్రముఖులను ఆహ్వానించడం గర్వించదగ్గ విషయమన్నారు. ఇలా ఆహ్వానించడంవల్ల వివిధ దేశాలతో భారత్ సంబంధాలు మరింత బలపడతాయని, అంతర్జాతీయ స్థాయిలో మన భారత్ పేరు మార్మోగుతుందన్నారు. అలా ఆహ్వానించడం ఆయన గొప్పతనమని కొనియాడారు. మోడీ ప్రమాణస్వీకార ముహూర్తాన్ని ఆలస్యంగా వెల్లడించడంతోనే తాను కార్యక్రమానికి హాజరు కాలేకపోయానని, అయితే మోడీని అభినందించి, శుభాకాంక్షలు తెలిపానన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు తలెత్తిన పరిస్థితిపై మాట్లాడుతూ... ‘లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ వర్గీయుల నుంచి ముప్పు పొంచి ఉందని నాకు ముందే సమాచారం అందింది. దీంతో అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపి ఒకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశాను. చిన్న చిన్న సభలు, సమావేశాలు నిర్వహించాను. 40 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఎన్నికల సమయంలో రెండు రోజులకు మించి ఎప్పుడూ బస చేయలేదు. కానీ మొదటిసారి 12 రోజులు షోలాపూర్ నియోజకవర్గంలోనే మకాం వేశాను. అయినప్పటికీ పార్టీ వర్గీయులు మోసం చేయడంవల్ల మొదటిసారి పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింద’ని షిండే ఆవేదన వ్యక్తం చేశారు. -
నేడే విస్తరణ
సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో దారుణ పరాజయం అనంతరం అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిసారించిన ఎన్సీపీ, కాంగ్రెస్‌లు ముందుగా రాష్ట్ర మంత్రి మండలిని విస్తరించాలని నిర్ణయం తీసుకున్నాయి. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం మంత్రిమండలిని విస్తరించి, గురువారం ఉదయం కొత్త మంత్రులతో రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిసిన అనంతరం మంత్రిమండలిని విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైద్యవిద్యాశాఖ మంత్రి విజయ్‌కుమార్ గావిత్‌ను పార్టీ నుంచి తొలగించడంతో ఆయన స్థానం, ఎన్సీపీ కోటాలోని ఓ కేబినెట్ పదవి ఖాళీగా ఉన్నాయి. దీంతోపాటు ఆరోగ్య, సాంస్కృతికశాఖ మంత్రి ఫౌజియాఖాన్ (ఎమ్మెల్సీ) పదవీకాలం కూడా ముగిసింది. దీంతో వీటిని భర్తీ చేయడం కోసం మంత్రిమండలిని విస్తరించనున్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ అభ్యర్థికి ఫౌజియాఖాన్ సహకరించలేదన్న ఆరోపణల నేపథ్యంలో ఆమెకు మరోసారి మంత్రిపదవి దక్కే అవకాశాలు సన్నగిల్లాయి. గావిత్ స్థానంలో మహారాష్ట్ర ఎన్సీపీ కార్యాధ్యక్షులు జితేంద్ర అవాడ్‌కు వైద్యవిద్యాశాఖ మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. ఈ పదవి కోసం రేసులో శరద్గావిత్ పేరు కూడా వినిపిస్తోంది. ఫౌజియాఖాన్ స్థానం కోసం జితేంద్ర అవాడ్తోపాటు ప్రకాష్ సోలంకే, ధనంజయ్ ముండే, సమీర్ భుజ్‌బల్, పంకజ్ భుజ్బల్లతోపాటు పలువురు రేసులో ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ కోటాలోని మూడు మంత్రి పదవులను కూడా భర్తీ చేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది. దీంతో కాంగ్రెస్‌లో కూడా మంత్రి పదవులపై ఆసక్తికనబరుస్తున్న నాయకులలో ఎంపీసీసీ అధ్యక్షులు మాణిక్‌రావ్ ఠాక్రేతోపాటు వసంత్ పురకే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసమే... అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగైదు నెలల్లో జరగనున్నాయి. ఇటీవలే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రజాస్వామ్య కూటమికి చెందిన కాంగ్రెస్, ఎన్సీపీలు ఘోరపరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. సుశీల్‌కుమార్ షిండే, మిలింద్ దేవరా, ప్రియాదత్ ఇలా అనేక మంది దిగ్గజ నాయకులు ఓటమి పాలయ్యారు. దీంతో కాంగ్రెస్‌కు మరాఠ్వాడాలోని కేవలం రెండు స్థానాలు లభించగా ఎన్సీపీకి పశ్చిమ మహారాష్ట్రలోని నాలుగు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నంలో భాగంగానే ఈ మంత్రి మండలి విస్తరణ జరుగుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లో పాత ముఖాలే.. మంత్రివర్గ విస్తరణలో ఎన్సీపీ నుంచి కేబినెట్ పదవిని కొత్త వ్యక్తికి కట్టబెట్టాలని చూస్తుండగా కాంగ్రెస్ మాత్రం పాతవారితోనే విస్తరణ తంతు ముగించాలనుకుంటున్నట్లు సమాచారం. -
సుష్మాస్వరాజ్: అద్భుతమైన వక్త
న్యూఢిల్లీ: సుష్మాస్వరాజ్(62).. అద్భుతమైన వక్త. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా ప్రసంగించగల వాగ్ధాటి ఆమె సొంతం. లోక్‌సభ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా, ఆ తరువాత ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించడాన్ని గట్టిగా వ్యతిరేకించిన వారిలో ఒకరు. అద్వానీకి అనుంగు శిష్యురాలు. అయితే, పార్టీలో ఆమెకున్న పట్టు, పరిపాలనలోని శక్తి సామర్ధ్యాలు సుషాస్వరాజ్కు మంత్రివర్గంలో స్థానం కల్పించక తప్పని పరిస్థితి కల్పించాయి. ఆర్ఎస్ఎస్ అగ్రనాయకత్వంలోనూ ఆమెపై మంచి అభిప్రాయమే ఉంది. ఇటలీలో జన్మించిన సోనియాగాంధీ ఈ దేశ ప్రధాని అయితే, గుండు కొట్టించుకుంటానంటూ 2004లో ఆమె చేసిన ప్రతిజ్ఞ అప్పట్లో సంచలనం సృష్టించడంతో పాటు, జాతీయ వాదుల్లో ఆమెపై అభిమానం పెంపొందింపజేసింది. 1999 ఎన్నికల్లో బళ్లారి స్థానంలో సోనియాగాంధీపై పోటీ చేసిన సమయంలో కన్నడ భాష కూడా నేర్చుకున్నారు. సుష్మాస్వరాజ్ 7 సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో ఆమె విదిశ నుంచి విజయం సాధించారు. సుష్మా ఆర్ఎస్ఎస్ కార్యకర్త కూతురు. విద్యార్థి దశలోనే ఏబీవీపీలో పనిచేశారు. 1977లో హ ర్యానా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 25 ఏళ్ల వయసులోనే దేవీలాల్ మంత్రివర్గంలో చేరి అత్యంత చిన్నవయసులో మంత్రి అయిన ఘనత సాధించారు. 27 ఏళ్ల వయసులోనే జనతాపార్టీ హర్యానా అధ్యక్షురాలయ్యారు. 1998లో ఢిల్లీకి మొదటి మహిళా సీఎం అయ్యారు. -
మనకు 6 బెర్తులు
సాక్షి ముంబైః ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ టీమ్‌లో రాష్ట్రానికి చెందిన ఆరుగురికి చోటుదక్కింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం నుంచి కొనసాగిన ఉత్కంఠతకు సోమవారం తెరదింపుతూ రాష్ట్రానికి చెందిన ఆరుగురు ఎంపీలు కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో శివసేనకు చెందిన ఒకే ఎంపీ ఉండగా బీజేపీ సభ్యులు ఐదుగురు ఉన్నారు. కేబినేట్ హోదా దక్కించుకున్నవారిలో బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, బీజేపీ సీనియర్ నాయకుడు గోపీనాథ్ ముండే ఉన్నారు. మరోవైపు స్వతంత్రహోదాలో మంత్రి పదవి దక్కించుకున్న వారిలో బీజేపీ ఎంపీలు ప్రకాష్ జావ్డేకర్, పీయుష్ గోయల్ ఉన్నారు. శివసేన సీనియర్ నాయకుడు అనంత్ గీతేకు కేబినేట్ హాదా కల్పించారు. జాల్నా బీజేపీ ఎంపీ రావుసాహెచ్ దాన్వే కూడా మంత్రిగా ప్రమాణం చేశారు. దీంతో బీజేపీ, శివసేన కార్యకర్తలు ముంబైలో సోమవారం భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఎవరికి ఏ శాఖలు...? రాష్ట్రానికి చెందిన ఆరుగురు ఎంపీలకు మంత్రులుగా అవకాశం వచ్చినా, ఎవరికి ఏయే శాఖలు కేటాయించనున్నారనే విషయంపై సస్పెన్స్ వీడలేదు. సీనియర్ నాయకుడు గోపీనాథ్ ముండేకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పదవి లభించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. లేదంటే గ్రామీణాభివృద్ధిశాఖ ఇచ్చేఅవకాశం ఉంది. ముండేకు వ్యవసాయ శాఖ మంత్రి పదవి లభించే అవకాశాలే అధికమని బీజేపీ నాయకులు అంటున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ కూడా ఎన్నికల ప్రచారంలో పలుమార్లు ఈ విషయం తెలిపారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన అనంతరం రైతుల సమస్యలు పరిష్కరించేందుకుగా ముండేకు వ్యవసాయశాఖ మంత్రి పదవిని కట్టబెడతామన్నారు. ఈ విషయంపై ముండే మాత్రం ఏమీ చెప్పడంలేదు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తానని అంటున్నారు. ఇది ఉండగా మరోవైపు బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీకి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి లేదా రైల్వేశాఖ ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. మౌలిక సదుపాయాల రంగంపై ఆయనకు ఆసక్తి అధికమని చెబుతారు. గతంలోనూ ఆయన రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. ఇక పీయుష్ గోయల్, ప్రకాష్ జావ్డేకర్కు ఏయే శాఖలు దక్కుతానేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు శివసేన నాయకుడు ఆనంత్ గీతేకు కూడా ఏ శాఖను కేటాయించనున్నారనేది ఆసక్తికరంగా మారింది. మిత్రపక్షాల్లో అసంతృప్తి...? పదవుల కేటాయింపుపై బీజేపీ మిత్రపక్షాలు శివసేన, ఆర్పీఐ, స్వాభిమానీ శేత్కారి పార్టీల్లో కొంత అసంతృప్తి నెలకొందని తెలుస్తోంది. శివసేన కనీసం ఒక కేబినేట్, రెండు సహాయమంత్రి పదవులు లభిస్తాయని ఆశలు పెట్టుకుంది. ఈ పార్టీ సీనియర్ నాయకుడు మనోహర్ జోషికి లోక్‌సభ స్పీకర్ పదవి దక్కుతోందని వార్తలు వచ్చాయి. అయితే చివరికి రాయ్‌గఢ్ ప్రాంతానికి చెందిన ఎంపీ ఆనంత్ గీతేకు మాత్రమే మంత్రి పదవి దక్కింది. ఆయనకు కేబినేట్ హోదా ఇవ్వడంతో పార్టీకి కొంత ఊరట దక్కింది. మరోవైపు రామ్‌దాస్ ఆఠవలే, రాజు శెట్టి కూడా అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. దీంతో రామ్‌దాస్ ఆఠవలే ప్రమాణ స్వీకార వేడుకలకు కూడా వెళ్లలేదని తెలిసింది. మలివిడత మంత్రి మండలి విస్తరణలో తమకు అవకాశం కల్పిస్తారన్న నమ్మకం శివసేన, ఆర్పీఐ, స్వాభిమానీ శేత్కారి పార్టీల్లో కనిపిస్తోంది.