పోల్ కోడ్ ఉల్లంఘన కేసులో మోడీకి క్లీన్‌చిట్ | Narendra Modi gets clean chit from Gujarat Police in poll code violation case | Sakshi
Sakshi News home page

పోల్ కోడ్ ఉల్లంఘన కేసులో మోడీకి క్లీన్‌చిట్

Published Sat, Aug 9 2014 1:29 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM

పోల్ కోడ్ ఉల్లంఘన  కేసులో మోడీకి క్లీన్‌చిట్ - Sakshi

పోల్ కోడ్ ఉల్లంఘన కేసులో మోడీకి క్లీన్‌చిట్

అహ్మదాబాద్: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో  ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణలపై ప్రధాని నరేంద్రమోడీకి శుక్రవారం గుజరాత్ పోలీసులు క్లీన్‌చిట్ ఇచ్చారు. గాంధీనగర్‌లో ఓటేశాక విలేకరుల సమావేశంలో పార్టీ గుర్తు అయిన కమలాన్ని కనిపించేలా మోడీ ప్రదర్శించారు. దీంతో కేసు నమోదు చేయాల్సిందిగా ఈసీ  పోలీసులను ఆదేశించింది.

ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 126(1)(ఏ), 126(1)(బీ)ల ప్రకారం నమోదైన ఆ కేసులో నేరం రుజువైతే గరిష్టంగా రెండేళ్ల వరకు జైలుశిక్ష పడుతుంది. అయితే, ఈ కేసును మూసేస్తున్నట్లు, సంబంధిత క్లోజర్ రిపోర్ట్‌ను కేసును విచారిస్తున్న మెట్రోపాలిటన్ కోర్టుకు సమర్పించినట్లు గుజరాత్ క్రైం బ్రాంచ్‌కు చెం దిన ఉన్నతాధికారి ఒకరు శుక్రవారం స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement