Allegation
-
పూనమ్ కౌర్ మరో సంచలన ట్వీట్.. ఆ వివాదం గురించేనా?
కొన్నిరోజుల క్రితం దర్శకుడు త్రివిక్రమ్‌ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసిన నటి పూనమ్ కౌర్.. తాజాగా మరో షాకింగ్ ట్వీట్ చేసింది. మరో సంచలన ట్వీట్‌తో ప్రకంపనలు సృష్టించింది. ఈసారి ఏకంగా టాలీవుడ్ హీరోపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. కోలీవుడ్‌లో ధనుశ్- నయనతార వివాదం కొనసాగుతున్న వేళ.. పూనమ్ కౌర్ ట్వీట్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.పూనమ్ తన ట్వీట్లో రాస్తూ..'నేను తెలుగులో చేసిన ఒక సోషియో ఫాంటసీ చిత్రంలో చేశా. నాతో పాటు ఓ అమ్మాయి కూడా నటించింది. ఆ తర్వాత తను హీరోయిన్గా కూడా చేసింది. అయితే కొన్నేళ్లుగా సినిమాలు చేయడం మానేసింది. అంతేకాదు ఎవరికీ కనిపించకుండా పోయింది. ఇటీవల తను ఓ డొమెస్టిక్ ఫ్లైట్‌లో కలిసింది. పెళ్లి షాపింగ్‌కు వచ్చానని.. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని అడిగింది. అంతేకాదు.. తాను యూఎస్ వెళ్లినప్పుడు అతను అదే ఫ్లైట్‌లో కనిపించాడని చెప్పింది. ఓ సినిమాలో ఇంటిమేట్ సీన్ టైమ్‌లో నాపై అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. అందువల్లే ఇండస్ట్రీ వదిలి యూఎస్ వెళ్లి చదువుకుంటున్నట్లు వివరించింది. అయినప్పటికీ ఆ హీరో వేధింపులు తగ్గలేదంటూ అమ్మాయి వివరించింది.' అని పూనమ్ తెలిపింది. దీంతో మరోసారి పూనమ్ కౌర్ ట్వీట్ సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.అందులో తన ట్వీట్లో తమిళనాడు అంటూ ప్రస్తావించింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో ధనుశ్-నయనతార మధ్య వార్ నడుస్తోంది. ఈ సమయంలో పూనమ్ కౌర్ ట్వీట్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఆ హీరో ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. !! ॐ नमो हनुमते भय भंजनाय सुखम् कुरु फट् स्वाहा ।। !!⠀ TAMILNADU#womensupportingwomen pic.twitter.com/QgYxjfYA7I— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) November 17, 2024 -
గో హంతకునిపై పోలీసుల కాల్పులు
ఉన్నావ్: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదేశాల మేరకు రాష్ట్రంలో గోహత్య కేసుల్లో నిందితులపై పోలీసులు వేగవంతమైన చర్యలు చేపడుతున్నారు. తాజాగా పోలీసులు ఉన్నావ్‌లో గో హంతకునిపై కాల్పులు జరిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.గోవులను వధించి, వాటి అవశేషాలను బహిరంగంగా పారవేసిన కేసులో నిందితునిగా ఉన్న వ్యక్తిపై పోలీసులు కాల్పులు జరిపారు. దీనిని గమనించిన నిందితుని సహచరుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కాల్పులలో గాయపడిన వ్యక్తిని మహతాబ్ ఆలం ఖురేషీగా పోలీసులు గుర్తించారు. నిందితుడిని పోలీసులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.అన్వర్ నగర్, కృష్ణ నగర్లలో గోవులను వధించారన్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గోహత్యపై విచారణ చేపట్టి, వారికి లభ్యమైన ఆవుల అవశేషాలను పాతిపెట్టారు. అయితే దీనిపై కలకలం చెలరేగడంతో పోలీసు అధికారి సోనమ్ సింగ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఈ నేపధ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు గోహత్య ఘటనలో ప్రమేయమున్న నిందితులపై కాల్పులు జరిపారు. ఇది కూడా చదవండి: మద్యం మాఫియా దాడి.. ఆరుగురు పోలీసులకు గాయాలు -
ప్రధాని మోదీ దగ్గర ఎన్ని జతల దుస్తులు ఉన్నాయి?
తన మాటల చతురతతోనే కాదు తన డ్రెస్సింగ్ స్టైల్‌తో ప్రధాని మోదీ అందరినీ ఆకట్టుకుంటారు. ఇంతకీ ప్రధాని మోదీ దగ్గర ఎన్ని జతల దుస్తులు ఉన్నాయి? ఈ ప్రశ్నకు ఆయన స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ఏమి సమాధానమిచ్చారు?తన రాజకీయ జీవితంలో తాను 250 జతల దుస్తులు కలిగి ఉన్నానని తనపై ఒకమారు ఆరోపణ వచ్చిందని మోదీ తెలిపారు. ఈ ఆరోపణను కాంగ్రెస్ నేత, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి అమర్‌సింగ్ చౌదరి చేశారని, ఓ బహిరంగ సభలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారని ప్రధాని మోదీ పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.ఆ సమయంలో తాను ప్రజలతో.. ‘250 కోట్లు దోచుకున్న ముఖ్యమంత్రి కావాలా? లేక 250 జతల బట్టలు ఉన్న ముఖ్యమంత్రి కావాలా?’ అని అడిగానని మోదీ గుర్తుచేసుకున్నారు. అప్పుడు గుజరాత్ ప్రజలు 250 జతల దుస్తులు కలిగిన ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని చెప్పారన్నారు. ప్రధాని మోదీ ఆ ఇంటర్వ్యూలో తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన సంఘటనను గుర్తుచేసుకున్నారు. నాడు చౌదరి ఆరోపణలను తాను అంగీకరించానని మోదీ తెలిపారు. అయితే ఆ మాజీ ముఖ్యమంత్రి తప్పుడు లెక్కలు చెప్పారని, ఆ రోజు జరిగిన బహిరంగ సభలో.. ఆయన చెప్పిన సంఖ్య(250)లో సున్నా తప్పు లేదా రెండు తప్పు అని తాను చెప్పానని మోదీ అన్నారు. అయినప్పటికీ ఆ ఆరోపణను స్వీకరిస్తున్నానని మోదీ పేర్కొన్నారు.ప్రధాని డ్రెస్సింగ్ స్టైల్‌పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటాయనే సంగతి అందరికీ తెలిసిందే. మోదీ నెలకు రూ.1.6 లక్షల జీతం తీసుకుంటూ, అత్యంత ఖరీదైన దుస్తులు ధరిస్తున్నారని ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. కాగా బ్రాండ్ మోదీ గురించి ప్రధానిని అడిగినప్పుడు, బ్రాండ్ అంటే ఏమిటో? అది ఎలా పనిచేస్తుందో తనకు తెలియదన్నారు. జనం మోదీ జీవితాన్ని, పని తీరును చూస్తున్నారన్నారు. ఒక రాష్ట్రానికి 13 ఏళ్లు సీఎంగా, 10 ఏళ్లు ప్రధానిగా పనిచేసిన వ్యక్తి.. వృద్ధురాలైన తన తల్లి చివరి రోజుల్లో ఉన్నప్పుడు తల్లితో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో గడపడానికి మించిన బ్రాండ్ ఏముంటుందని ప్రధాని మోదీ ప్రశ్నించారు. దీనిని చూసి తన జీవితం భిన్నమైనదని దేశం అర్థం చేసుకున్నదని మోదీ పేర్కొన్నారు. -
కోలీవుడ్‌లో సుచిత్ర ప్రకంపనలు.. నెట్టింట వైరలవుతోన్న ఫోటో!
కోలీవుడ్‌లో సుచీ లీక్స్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రముఖ తారలపై సింగర్ సుచిత్ర వివాదాస్పద వ్యాఖ్యలతో ఒక్కసారిగా కోలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ధనుశ్ జంటపై చేసిన ఆరోపణలు, త్రిషపై చేసిన కామెంట్స్ కోలీవుడ్‌ను షేక్ చేస్తున్నాయి. అంతే కాకుండా స్టార్ హీరో కమల్‌హాసన్ ట్రాన్స్‌జెండర్ ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. అంతేకాదు కమల్ బర్త్‌డే పార్టీల్లో అతిథులకు డ్రగ్స్ సరఫరా చేసేవారని సంచలన ఆరోపణలు చేసింది.అయితే సుచిత్ర చేసిన కామెంట్స్ తర్వాత కమల్ హాసన్‌కు సంబంధించిన ఓ పాత ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రముఖ డ్రగ్‌డీలర్ జాఫర్ సాదిక్‌తో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గతంలో రూ. 2 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేశారనే ఆరోపణలపై జాఫర్‌ను 2024 మార్చిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అరెస్టు చేసింది. అంతేకాదు.. జాఫర్ డీఎంకే పార్టీ మాజీ కార్యకర్త. అతను ఇండియా-ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ డ్రగ్స్ ట్రాఫికింగ్ నెట్వర్క్ డీలర్‌గా కొనసాగుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి.అయితే సింగర్ సుచిత్ర చేసిన ఆరోపణలపై ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేదు. కాగా.. గతంలో 2017లోనూ కోలీవుడ్‌ను ఊపేసిన అత్యంత వివాదాస్పద అంశంగా సుచీ లీక్స్ వైరల్ అయింది. సుచీ లీక్స్ పేరిట తన ఫేస్బుక్ ఖాతాలో చాలామంది ప్రముఖ నటీనటులకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫొటోలను విడుదల చేసి సుచిత్ర తీవ్ర దుమారం సృష్టించింది. ఇందులో ధనుష్, ఆండ్రియా, అమలాపాల్, త్రిష, హన్సిక, అమీ జాక్సన్, అనిరుధ్, సింగర్ చిన్మయి లాంటి వారి గురించి సంచలన విషయాలు బయటపెట్టింది.Suchitra Alleges Cocaine Served On Silver Plates At @ikamalhaasan Birthday Party, Netizens Dig Out Kamal's Pic With DrugKingpin #JafferSadiq @NIA_India 👇 pic.twitter.com/cURQc6Ty1K— Deepalakshmi 🚩 (@RSS_Activist) May 15, 2024 -
ల్యాండ్ టైటిలింగ్ చట్టం వస్తే కబ్జాలు సాధ్యం కాదని.. కుట్రకు తెరలేపిన భూబకాసురులు..
-
‘ఆ ఎమ్మెల్యే కామ పిశాచి’.. హైదరాబాద్‌లో ఫ్లెక్సీల కలకలం..
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో వెలసిన ఫ్లైక్సీలు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ భవన్, పలు మీడియా సంస్థల కార్యాలయాల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు పెట్టడంతో సంచలనంగా మారింది. దుర్గం చిన్నయ్య లాంటి కామ పిశాచి బారి నుంచి బెల్లంపల్లి ప్రజలను కాపాడండి అంటూ ఆరిజన్ డెయిరీ పేరుతో ఫ్లైక్సీలు ఏర్పాటు చేశారు. ‘‘కేసీఆర్, కేటీఆర్, మీడియా సంస్థలకు విన్నపం. మాకు న్యాయం చేయాలి’’ అని ప్లెక్సీలో ఉంది. ఎమ్మెల్యేపై ఓ మహిళా తీవ్ర ఆరోపణలు చేయడంతో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తమను నమ్మించి మోసం చేశారంటూ అరిజిన్ పాల సంస్థ భాగస్వామి శైలజ ఆరోపించారు. తమ డబ్బులు తీసుకొని, తిరిగి తమ మీదనే కేసులు బనాయించి రిమాండ్‌కు పంపించాడని తెలిపారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో తనకు ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఆడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆడియో -
రాచకొండ పోలీసులను బురిడీ కొట్టించిన సీఐ నాగేశ్వరరావు
-
ఈ–కామర్స్ అనుచిత విధానాలకు కళ్లెం
రాజ్యసభలో.. సాక్షి, న్యూఢిల్లీ: ఈ–కామర్స్ అనుచిత వ్యాపారం విధానంపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని సంబంధిత ప్రభుత్వ విభాగాలను కోరినట్లు కేంద్రం తెలిపింది. ఈ–కామర్స్ కంపెనీల అనుచిత వ్యాపార విధానాలకు కళ్లెం వేయడానికి వినియోగదారుల సంరక్షణ నిబంధనలను మరింత కఠినతరం చేయబోతున్నట్లు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రి సోమ్‌ప్రకాశ్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. వినియోగదారుల పరిరక్షణ (ఈ–కామర్స్) నిబంధనల సవరణకు ముందుగా వ్యాపారవర్గాల సలహాలు, సూచనలు కోరినట్లు చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద గత ఏడాది మే, జూన్ నెలల్లో వలస కార్మికులు, వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుక్కున్న వలస కార్మికులు, రేషన్‌కార్డులు లేనివారికి ఉచితంగా పంపిణీ చేసేందుకు 8 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను వివిధ రాష్ట్రాలకు కేటాయించినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీశాఖ సహాయమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి జవాబిచ్చారు. 2015–16 నుంచి కేంద్ర ప్రభుత్వం సేంద్రియ సాగును ప్రోత్సహిస్తోందని, పంట దిగుబడి నుంచి సర్టిఫికేషన్, మార్కెటింగ్ వరకు రైతులకు సహకరిస్తోందని ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో 6 వేల సముద్రపు పాచితెప్పలు, 1,200 ట్యూబ్‌నెట్‌లు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు రూ.1.86 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లబ్ధిదారులను గుర్తించిందని వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వేజోన్, రాయగఢ డివిజన్ పనులకు రూ.170 కోట్లు అవుతుందని అంచనా వేయగా, 2021–22 బడ్జెట్లో రూ.40 లక్షలు కేటాయించినట్లు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు జవాబుగా రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ చెప్పారు. లోక్‌సభలో.. సెప్టెంబర్ కల్లా మంగళగిరి ఎయిమ్స్ పూర్తి మంగళగిరి ఎయిమ్స్ సెప్టెంబర్‌కల్లా పూర్తవుతుందని కేంద్రం తెలిపింది. ఈ ఎయిమ్స్‌కు రూ.1,618 కోట్లు మంజూరుకాగా రూ.922.01 కోట్లు విడుదల చేశామని, రూ.880.15 కోట్లు ఖర్చయిందని వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతి పవార్ చెప్పారు. దేశంలో 26 మిలియన్ హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని పునరుద్ధరిస్తున్నట్లు వైఎస్సార్సీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్లుగా మలేరియా మరణాల్లేవని వైఎస్సార్సీపీ ఎంపీ ఎన్.రెడ్డెప్ప అడిగిన ప్రశ్నకు జవాబుగా కేంద్ర ఆరోగ్యమంత్రి మాన్సుఖ్ మాండవీయా చెప్పారు. ఆయుష్–64 సాంకేతికతను దేశవ్యాప్తంగా 37 సంస్థలకు బదిలీ చేసినట్లు వైఎస్సార్సీపీ ఎంపీలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, బెల్లాన చంద్రశేఖర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. కోవిడ్–19 నివారణ చర్యల్లో భాగంగా గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.459.78 కోట్లు విడుదల చేసినట్లు ఎంపీలు వంగా గీత, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. -
లైంగికంగా వేధించాడు: మహిళా ఐపీఎస్ ఫిర్యాదు
చెన్నై : స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్( లా అండ్ ఆర్డర్) తనను లైంగికంగా వేధించాడంటూ తమిళనాడుకు చెందిన మహిళా ఐపీఎస్ అధికారి చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. వివరాల ప్రకారం..విధుల్లో ఉన్న తనపై రాజేష్ దాస్ అనే స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ లైంగికంగా వేధించాడని, అసభ్యకరంగా ప్రవర్తించాడని మహిళా ఐపీఎస్ అధికారి ఫిర్యాదు చేసింది. ఇటీవల పలు జిల్లాల్లో ముఖ్యమంత్రి పళనిస్వామి పర్యటన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు బాధితురాలు పేర్కొంది. దీంతో పీఎం మోదీ రాష్ట్ర పర్యటనకు సంబంధించి చేపట్టిన భద్రతా సమావేశాల్లో సదరు డీజీపీని పాల్గొనకుండా సస్పెండ్ చేసినట్లు రాష్ట్ర హోం శాఖ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికలు రానున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ పుదుచ్చేరి, తమిళనాడులో పర్యటించనున్నారు. మరికొన్ని వారాల్లో దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదల కానుంది. ఇక బాధితురాలి ఫిర్యాదుతో ప్రణాళిక, అభివృద్ధి శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి జయశ్రీ రఘునందన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు స్వయంగా ఓ ఐపీఎస్ అధికారి లైంగిక వేధింపులకు గురికావడం చాలా బాధకరమైన ఘటన అని ప్రతిపక్ష నేత, డిఎంకె చీఫ్ ఎంకె స్టాలిన్ విమర్శించారు. నిందితుడిని కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఇది చాలా సిగ్గుచేటని పేర్కొన్నారు. అదే సమయంలో ఫిర్యాదు చేసిన మహిళా ఐపీఎస్ అధికారిని ధైర్యాన్ని ఆయన ప్రశంసించారు. చదవండి : (ఎంపీ ఆత్మహత్య: 15 పేజీల లేఖ, వైరలవుతోన్న వీడియో) (పెళ్లి పేరుతో రూ.11కోట్లకు నకిలీ ఐపీఎస్ మోసం) -
యూనిస్ సరదాగా చేశాడు
కరాచీ: యూనిస్‌ఖాన్ తన పీకపై కత్తి పెట్టాడంటూ పాకిస్తాన్ మాజీ బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ చేసిన ఆరోపణలపై స్పందించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిరాకరించింది. అయితే ఫ్లవర్ ఆరోపించినట్లుగా యూనిస్‌ఖాన్ కోపంతో అతని గొంతుపై కత్తి పెట్టలేదని బోర్డు అధికారి ఒకరు పేర్కొన్నారు. ‘గ్రాంట్ ప్రచారం చేస్తున్నట్లుగా అతన్ని గాయపరచడం యూనిస్‌ఖాన్ ఉద్దేశం కాదు. అందులో నిజం లేదు. యూనిస్ అల్పాహారం తీసుకునే సమయంలో ఈ ఘటన జరిగింది. అతను బ్రేక్‌ఫాస్ట్ చేస్తోన్న సమయంలో గ్రాంట్ ఏదో చెప్పబోతుండగా... యూనిస్ సరదాగా బటర్ తీసుకునే కత్తితో అతన్ని ఆపాడు. బ్రేక్‌ఫాస్ట్ టేబుల్‌పై ఆట గురించిన సలహాలు ఎందుకు? నన్ను ముందు ప్రశాంతంగా తిననివ్వండంటూ గ్రాంట్‌తో యూనిస్ అన్నాడు’ అని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. గ్రాంట్ ఆరోపణలపై స్పందించేందుకు యూనిస్‌ఖాన్ సుముఖంగా లేడని అన్నారు. -
జైల్లో లైంగికంగా వేధించారు
న్యూఢిల్లీ: తీహార్ జైల్లో తన పట్ల అమానుషంగా ప్రవర్తించారని, విపరీతంగా కొట్టారని, లైంగికంగా వేధించారని నిర్భయపై అత్యాచారం, హత్య కేసు దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ ఆరోపించారు. రాష్ట్రపతి కోవింద్ క్షమాభిక్ష ఇవ్వడంలో మనసు పెట్టి ఆలోచించలేదని అన్నారు. తన క్షమాభిక్ష పిటిషన్‌ను కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ ముఖేష్ సుప్రీంకోర్టుకెక్కారు. దీనిపై సుప్రీం కోర్టులో జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎ.ఎస్. బోపన్నలతో కూడిన బెంచ్ మంగళవారం విచారించింది. జైల్లో ముఖేష్‌ను కొట్టేవారని, లైంగికంగా వేధించారని అతని తరఫు లాయర్ అంజనా ప్రకాశ్ చెప్పారు. అందరూ కలిసి ఒక వ్యక్తి జీవితంతో చెలగాటమాడుతున్నారని, క్షమాభిక్ష అంశంలో రాష్ట్రపతి మనసుపెట్టి ఆలోచించలేదని వాదించారు. దీనిపై జస్టిస్ అశోక్ భూషణ్ స్పందించారు. రాష్ట్రపతి కోవింద్ అన్ని కోణాల నుంచి ఆలోచించలేదని, క్షమాభిక్ష సమయంలో కరుణ చూపలేదని మీరెలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. క్షమాభిక్ష పిటిషన్ సమయంలో కేంద్రం వాస్తవాలన్నీ రాష్ట్రపతికి సమర్పించలేదని, ఆయన క్షమాభిక్ష నిరాకరించడానికి ముందే ముఖేష్‌ని ఏకాకిని చేసి ఒక గదిలో బంధించారని, అది జైలు నిబంధనలకు విరుద్ధమని, ఆమె తన వాదనలు వినిపించారు. దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా జైల్లో ఉండే వారు అనుభవించే బాధలు క్షమాభిక్ష ఇవ్వడానికి ప్రాతిపదిక కాదన్నారు. కేంద్రం అన్ని డాక్యుమెంట్లు రాష్ట్రపతికి సమర్పించిందని, అంత ఘోరమైన నేరానికి పాల్పడిన వ్యక్తికి ఎవరైనా క్షమాభిక్ష ఇస్తారా అని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం బెంచ్ తీర్పుని బుధవారానికి వాయిదా వేసింది. -
‘రూ . 36 వేల కోట్లు మింగేశారు’
సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్ల కుంభకోణంపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మరోసారి మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. ఈ స్కాంలో రూ 36,000 కోట్లు ఖజానాకు నష్టం వాటిల్లిందని ఆరోపించారు. సైన్యం రక్షణ కేటాయింపులపై ప్రాధేయపడుతుంటే ప్రభుత్వం యుద్ధ విమానాల కొనుగోళ్లలో కుంభకోణానికి పాల్పడిందని దుయ్యబట్టారు. ఈ యుద్ధ విమానాలను తయారుచేసిన దాసాల్ట్ ఏవియేషన్ విమాన ఖరీదుపై భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అవాస్తవాలు చెప్పారని పేర్కొనడాన్ని రాహుల్ ప్రస్తావించారు. మోదీ ప్రభుత్వం ఒక్కో యుద్ధ విమానాన్ని రూ 1670 కోట్లకు కొనుగోలు చేసిందని, ఒక్కో ఎయిర్‌క్రాఫ్ట్‌పై రూ1100 కోట్ల చొప్పున 36,000 కోట్లు వృధా అయ్యాయని ఆరోపించారు. రక్షణ బడ్జెట్లో పది శాతం వాటాను పాలకులు జేబులో వేసుకున్నారని విమర్శించారు. రాఫెల్ యుద్ధవిమానాల కుంభకోణంలో ప్రధాని మోదీ మౌనాన్ని రాహుల్ ప్రశ్నించారు. Dassault called RM's lie and released prices paid per RAFALE plane in report: Qatar = 1319 Cr MODI = 1670 Cr MMS = 570 Cr 1100 Cr per plane or 36,000 Cr i.e 10 % of our Defence budget, in the pocket. Meanwhile, our Army begs our Govt. for money. pic.twitter.com/fE5tj4IaeN — Office of RG (@OfficeOfRG) 16 March 2018 -
కొనసాగిన ఆందోళనలు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై ప్రధాని మోదీ చేసిన కుట్ర ఆరోపణల నేపథ్యంలో వరుసగా మూడో రోజు కూడా లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ప్రారంభమైన కొద్ది నిమిషాలకే లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యులు మోదీ క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు ప్రారంభించారు. ఆ సమయంలో మోదీ సభలోనే ఉన్నారు. ఆందోళనలు తీవ్ర రూపం దాల్చటంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. సభ తిరిగి జీరో అవర్‌తో ప్రారంభమయింది. నిరసన కొనసాగించిన కాంగ్రెస్ ఎంపీలు వెల్‌లోకి దూసుకువచ్చి నినాదాలు చేశారు. తమ నేత మల్లికార్జున ఖర్గేకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేయగా స్పీకర్ స్పందించలేదు. తర్వాత కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే లేచి.. మన్మోహన్‌కు వ్యతిరేకంగా ఓ ఎంపీ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరగా స్పీకర్ అంగీకరించలేదు. దీంతో కాంగ్రెస్ సభ్యులువాకౌట్ చేశారు. ప్రధాని క్షమాపణ చెప్పరు: మోదీ ఆరోపణలకు నిరసనగా రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు ఆందోళన కొనసాగించారు. బుధవారం సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు ప్రధాని క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు ప్రారంభించారు. వెల్‌లోకి దూసుకొచ్చి గొడవ చేయటంతో చైర్మన్ వెంకయ్య నాయుడు స్పందించారు. సభ లోపల ఆరోపణలు చేయనందున ప్రధాని క్షమాపణలు చెప్పబోరని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సభ్యుల ఆందోళన తీవ్రతరం కావటంతో సభ గురువారానికి వాయిదా పడింది ► అటవీ చెట్ల జాబితా నుంచి వెదురును తొలగిస్తూ చేసిన చట్ట సవరణకు, దేశ భద్రత అవసరాల కోసం స్వాధీనం చేసుకునే స్థిరాస్తులకు ఇచ్చే పరిహారానికి సంబంధించిన స్థిరాస్తి బిల్లుల సవరణలకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. -
టాటా గ్రూపులో మరో రాజీనామా
ముంబై: ఇండియన్ హోటల్స్ (తాజ్) ఎండీ, సీఈవో రాకేష్ సర్నా తన పదవికి రాజీనామా చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు చెలరేగిన సుమారు రెండు సంవత్సరాల తర్వాత, మిస్త్రీ ఉద్వాసాన అనంతరం హోటల్ తాజ్ కు రాకేష్ సర్నా గుడ్ బై చెప్పారు. అయితే వ్యక్తిగత కారణాల రీత్యా ఐహెచ్‌సీఎల్ కంపెనీ మరియు దాని అనుబంధ సంస్థల డైరెక్టర్ పదవికి రిజైన్ చేశారని ఇండియన్ హోటల్స్ బిఎస్ఇకి ఇచ్చిన సమాచారంలో తెలిపింది. సర్నా తన మూడు సంవత్సరాల పదవీ కాలం పూర్తయిన తర్వాత పదవీ విరమణ చేసినట్లు టాటా సన్స్, ఇండియన్ హోటల్స్ కంపెనీల ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. సర్నా నిర్ణయానికి బోర్డు ఆమోదం తెలిపిందనీ, సెప్టెంబర్ 30 దాకా కొనసాగాలని కోరినట్టు చెప్పారు. ఈ ప్రతిపాదనకు ఆయన అంగీకరించినట్టు చంద్రశేఖరన్ తెలిపారు. కాగా 2015లో ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఇండియన్ హోటల్స్ కంపెనీ బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వతంత్ర విచారణ కమిటీ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. టాటా సన్స్ ఛైర్మన్ గా ఉద్వాసనకు గురైన టాటా మిస్త్రీ నియమించిన టాటా కుటుంబానికి చెందని వ్యక్తులలో ఈయన ప్రముఖులు. మిస్త్రీ ఉద్వాసన తరువాత ఈయన కూడా వైదొలగుతారని అప్పట్లో ఊహాగానాలు వెలువడ్డాయి. టాటా గ్రూప్ సన్స్ చైర్మన్ గా సైరస్ మిస్త్రీ గత ఏడాది అక్టోబర్ 24 న తొలగించింది. ఈ తొలగింపునకు దారి తీసిన కారణాల్లో ఇండియన్ హోటల్స్ కంపెనీ సీఈవో రాకేష్ సర్నా వచ్చిన ఈ లైంగిక వేధింపుల కేసు కూడా ఒకటై ఉండవచ్చునన్న వార్త గుప్పుమన్న సంగతి తెలిసిందే. -
కంటిచూపు కోసం వెళ్లి కన్నుమూశాడు
ఏలూరు సిటీ : కంటి చూపు బాగవుతుందని ఆసుపత్రికి వెళ్లిన ఓ వ్యక్తి విగతజీవిగా మారాడు. వైద్యుల నిర్లక్ష్యమే దీనికి కారణమని మృతుని బంధువులు ఆందోళన చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. టి.నరసాపురం మండలం తెడ్లం గ్రామానికి చెందిన డి.సుబ్బాచారి (55) కంటి శుక్లాల శస్త్రచికిత్స కోసం ఏలూరు ఆర్‌ఆర్‌పేటలోని ఏఏ కంటి ఆసుపత్రికి సోమవారం వచ్చాడు. అతనిని ఆపరేష¯ŒS థియేటర్లోకి తీసుకువెళ్లిన వైద్యులు 15 నిమిషాలకే అతను చనిపోయాడంటూ బయటకు తీసుకువచ్చారు. సుబ్బాచారి చనిపోయిన విషయాన్ని తెలసుకున్న ఏలూరులో పోలీస్ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న అతని కుమారులు డి.విజయరాజు, రాజేంద్రప్రసాద్, బంధువులు ఆసుపత్రికి చేరుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యమే సుబ్బాచారి మృతికి కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. దీంతో టూటౌ¯ŒS సీఐ బంగార్రాజు, నగర సీఐ ఎ¯ŒS.రాజశేఖర్, ఎస్సైలు దుర్గారావు, గంగాధర్ ఆసుపత్రి వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. సుబ్బాచారి కుమారులు మాట్లాడుతూ తమకే ఇలా వైద్యం చేస్తుంటే.. సామాన్యుల పరిస్థితి ఏమిటంటూ వైద్యులను నిలదీశారు. నిర్లక్ష్యంతో తమ తండ్రి ప్రాణాలతో చెలగాటమాడిన వైద్యులపై స్థానిక టూటౌ¯ŒS పోలీస్‌స్టేçÙ¯ŒSలో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన టూటౌ¯ŒS సీఐ యు.బంగార్రాజు దర్యాప్తు చేసి బాధ్యులకు శిక్షపడేలా చేస్తామని సుబ్బాచారి బంధువులకు హామీ ఇచ్చారు. -
ఆరోపణలు చేసేప్పుడు క్లారిటీ అవసరం: రిజిజు
షిల్లాంగ్: పెద్ద నోట్ల రద్దుపై ప్రభుత్వం మీద చేస్తున్న ఆరోపణల విషయంలో ముందుగా కాంగ్రెస్ పార్టీకి ఒక క్లారిటీ లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి తికమకకు గురికాకుండా ఒక స్పష్టతకు రావాల్సిన అవసరముందని మేఘాలయలో జరిగిన ఓ కార్యక్రమంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ఆయన పేర్కొన్నారు. ‘నోట్ల రద్దు విషయంపై కనీసం ఆర్థిక మంత్రికి కూడా చెప్పకుండా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటన చేశారని ఒకసారి.. ప్రకటనకు ముందే ప్రధాని నోట్లరద్దు విషయాన్ని లీక్ చేశారని ఇంకోసారి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు’ అని రిజిజు అన్నారు. ఏవైనా ఆరోపణలు చేసేటప్పుడు ఒక స్పష్టత అవసరమని ఆయన కాంగ్రెస్ నేతలకు సూచించారు. -
నేను వీకే సింగ్ బాధితుడిని
కేంద్ర మంత్రిపై ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ ఆరోపణ న్యూఢిల్లీ: భారత ఆర్మీ మాజీ చీఫ్, కేంద్ర మంత్రి వీకే సింగ్‌పై ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన పదోన్నతిని ఉద్దేశపూర్వకంగా ఆయన అడ్డుకోవాలని చూశారని దల్బీర్ వెల్లడించారు. ఆర్మీ కమాండర్ ఎంపికలో పక్షపాతం చూపారని మాజీ లెఫ్టినెంట్ జనరల్ రవి దస్తానే సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిల్‌కు స్పందిస్తూ వ్యక్తిగత హోదాలో దల్బీల్ తన అఫిడవిట్లో ఈ ఆరోపణలు చేశారు. ‘‘ఆర్మీ కమాండర్‌గా నా పదోన్నతిని అడ్డుకోవాలనే ఏకైక లక్ష్యంతో వీకే సింగ్ నన్నో బాధితుడిని చేయాలని చూశారు. ఆధారాలులేని, ఊహాజనిత, తప్పుడు ఆరోపణలు చేస్తూ నాకు(2012 మే 19) షోకాజ్ నోటీసిచ్చారు’’ అని అఫిడవిట్లో దల్బీర్ పేర్కొన్నారు. ఏ తప్పులేదని విచారణలో తేలినా, దుర్బుద్ధితోనే తనకు నోటీస్ ఇచ్చారని విమర్శించారు. కాగా, 2011 డిసెంబర్ 20 రాత్రి అస్సాంలోని జొర్హాట్ ఆపరేషన్‌కు సంబంధించి విఫలమయ్యారనే కారణంతో జనరల్ ఆఫీసర్ కమాండింగ్‌గా ఉన్న దల్బీర్సింగ్పై 2012లో అప్పటి ఆర్మీ చీఫ్ వీకే సింగ్ క్రమశిక్షణ, నిఘా(డీవీ) బ్యాన్ విధించారు. ముందస్తు వ్యూహం ప్రకారమే తనపై డీవీ బ్యాన్, షోకాజ్ నోటీస్ ఇచ్చారని అఫిడవిట్లో జనరల్ దల్బీర్ పేర్కొన్నారు. డీవీ బ్యాన్‌తో జీవోసీ-ఇన్-సీ ఈస్ట్రన్ కమాండ్ పదోన్నతి కోల్పోయానని చెప్పారు. జొర్హాట్ ఆపరేషన్ సమయంలో తాను వార్షిక సెలవులో ఉన్నానని స్పష్టంచేశారు. 2012 మే 31న వీకే సింగ్ రిటైరైన 15 రోజుల తర్వాత అప్పటి మేజర్ జనరల్ బిక్రమ్ సింగ్ తనపై ఉన్న డీవీ బ్యాన్‌ను సడలించడంతో జీవోసీ-ఇన్-సీ పదోన్నతికి అడ్డంకులు తొలగిపోయాయన్నారు. కాగా, ఆర్మీ కమాండర్‌గా పదోన్నతికి అర్హత ఉన్నా బిక్రమ్ సింగ్ తనను తిరస్కరించారని, దల్బీర్ సింగ్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని పిల్లో దస్తానే పేర్కొన్నారు. అయితే గతంలో సుప్రీం కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో దస్తానే విమర్శలను రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. అదే సమయంలో దల్బీర్ సింగ్‌పై డీవీ బ్యాన్ విషయంలో వీకే సింగ్ తీరును కూడా తప్పుబట్టింది. -
నేను వీకే సింగ్ బాధితుడిని
-
ఆర్టీఐ పత్రాలను ఫోర్జరీ చేశాడు!
న్యూఢిల్లీ: ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని సేకరించినట్లు చెప్తూ.. ఆయుష్ మంత్రిత్వశాఖ ముస్లింలకు ఉద్యోగాలను ఇవ్వలేదని చెప్పిన జర్నలిస్టును పోలీసులు అరెస్టు చేశారు. తాను ఆ విషయాన్ని ఆర్టీఐ నుంచి మాత్రమే తీసుకున్నట్లు శర్మ వివరించారు. గత ఏడాది మార్చినెలలో16 నుంచి 31 తేదిల మధ్య సమయంలో మిల్లీ గెజిట్ లో ఈ విషయాన్ని ప్రచురించారు. ఈ విషయంపై శర్మను విచారించిన కోట్లా ముబారక్పూర్ పోలీసుల దేశాన్ని, ఢిల్లీని వదలి వెళ్లకూడదనే కండీషన్ తో శర్మను విడిచిపెట్టారు. పోలీసులు మిల్లీ గెజిట్ మ్యాగజైన్ ఎడిటర్ డా.జర్ఫారుల్ ఇస్లాం ఖాన్ ను ఈ కేసులో సాక్షిగా పేర్కొన్నారు. -
మళ్ళీ 'బీఫ్ బిర్యానీ' గొడవ
అలీగఢ్: దేశంలో మరోసారి బీఫ్ వంటకాల వివాదం వెలుగుచూసింది. అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) క్యాంటీన్లో బీఫ్ బిర్యానీ వడ్డించారంటూ సోషల్ మీడియాలో ఫొటోలు కలకలం సృష్టించాయి. ఈ విద్యాసంస్థ తన స్వభావాన్ని బయటపెట్టేందుకు మరోసారి వివాదానికి తెర తీసిందంటూ ఆరోపణలు గుప్పుమన్నాయి. శుక్రవారం ఏఎంయూ మెడికల్ కాలేజీ క్యాంటీన్లో బీఫ్ బిర్యానీ వడ్డించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. వాట్సాప్ లో పోస్ట్ చేసిన ఫొటోలు తాజా వివాదానికి కారణమయ్యాయి. క్యాంటీన్లో వండినది ఆవు మాంసమే అయినా, గేదె మాంసంగా ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతోపాటు క్యాంటీన్ మెనూ కార్డులోని ఓ ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా వ్యాపించింది. అయితే బీఫ్ బిర్యానీ వడ్డన ఆరోపణను యూనివర్సిటీ ఖండించింది. తమ క్యాంటీన్లో అటువంటిదేమీ జరగలేదని తెలిపింది. -
ఎల్ఈడీ బల్బుల వ్యవహారంలో భారీ కుంభకోణం
సీపీఎం నేత బాబూరావు ఆరోపణ సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ర్టంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఎల్ఈడీ బల్బులు అమర్చే బాధ్యతను ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్‌కు కట్టబెడుతూ ప్రభుత్వం జీవో- 74ను జారీ చేయడం వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని రాజధాని ప్రాంత సీపీఎం సమన్వయ కమిటీ కన్వీనర్ సీహెచ్ బాబూరావు ఆరోపించారు. విజయవాడలో గురువారం ఆయన మాట్లాడుతూ ఒక కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టి దాని ద్వారా కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు జిల్లాల వారీగా సబ్ కాంట్రాక్టులు తీసుకుని అప్పనంగా స్థానిక సంస్థల నిధులు భోంచేసే వ్యూహం పన్నారని ఆరోపించారు. వాస్తవానికి ఎల్ఈడీ బల్బు 20వాట్స్ ఒక్కొక్కటి రూ.3,100 ఉంటే దాన్ని రూ.6,330 చొప్పున కాంట్రాక్టులో పేర్కొన్నారని, కృష్ణా జిల్లాలో మిక్ కంపెనీకి సబ్ కాం ట్రాక్టు ఇవ్వడం వెనుక ప్రజాప్రతినిధుల హస్తం ఉందన్నారు. కేవలం రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టి కార్పొరేషన్ నుంచి రూ.40 కోట్లకుపైగా రాబడిని దండుకునేలా కుట్ర ఉం దని ఆరోపించారు. అన్ని మున్సిపాలిటీలూ ప్రభుత్వం సూచించిన సంస్థతో ఎల్ఈడీ బల్బుల కాంట్రాక్టు కుదుర్చుకోవాలని మంత్రి నారాయణ ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. -
ఓ మంత్రి కొడుకూ భాగస్వామి
బెంగళూరు: లోకాయుక్తపై వస్తున్న అవి నీతి ఆరోపణలకు సంబంధించి జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అవినీతి కార్యకలాపాల్లో ఓ మంత్రి కుమారుడి హస్తం కూడా ఉందని, త్వరలోనే ఆ పేరును వెల్లడిస్తామని బెళగావిలోని సువర్ణసౌధలో బుధవారం ప్రకటించారు. లోకాయుక్తలో జరిగిన అవినీతి కార్యకలాపాల్లో ఓ మంత్రి కుమారుడి హస్తం సైతం ఉందన్న కుమారస్వామి, ఈ అంశంపై శాసనసభలో పూర్తి స్థాయి చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. చర్చ పూర్తయిన అనంతరం మంత్రి కుమారుడి పేరును ప్రకటిస్తామని తెలిపారు. అంతేకాక ఈ మొత్తం అవినీతి పర్వంలో రెవెన్యూ శాఖ మంత్రి పర్సనల్ సెక్రటరీ నాగరాజ్‌తోపాటు సీనియర్ ఐఏఎస్ అధికారులు సైతం భాగస్వాములయ్యారని ఆరోపించారు. ఈ అధికారులకు సంబంధించిన జాబితా కూడా తమ వద్ద ఉందని, జాబితాను స్పీకర్‌కు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. -
తలసాని పై మర్రి శశిధర్ రెడ్డి ఫిర్యాదు
-
నీచ రాజకీయం
అన్నదాత ఆత్మహత్యపై పరస్పర ఆరోపణల పర్వం దేశ రాజధాని నడిబొడ్డున.. వేలాది మంది చూస్తుండగా.. ఢిల్లీ ముఖ్యమంత్రి కళ్ల ఎదురుగా.. అన్నదాత ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటనకు బాధ్యులు ఎవరు? అన్న అంశంపై రాజకీయ పక్షాలన్నీ పరస్పర నిందారోపణలతో చావు రాజకీయాలకు తెరతీశాయి. రోడ్ల పైనా, విలేకరుల సమావేశాల్లో, పోలీసుల ఎఫ్ఐఆర్లో, చివరకు పార్లమెంటులోనూ పరస్పర ఆరోపణలు గుప్పించుకున్నారు. చివరకు అతడి ఆత్మహత్యపై దర్యాప్తు చేసే అధికారం ఎవరికి ఉంది అనే అంశాన్నీ వివాదం చేశారు. రైతు ఆత్మహత్యకు ఆమ్ ఆద్మీ పార్టీయే కారణమని ఆరోపిస్తూ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు గురువారం ఢిల్లీ పోలీసు కార్యాలయం, కేజ్రీవాల్ నివాసం ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు ఉభయసభల్లో.. గజేంద్రసింగ్ ఆత్మహత్యకు ఢిల్లీలోని ఆప్ సర్కారు, కేంద్రంలోని బీజేపీ సర్కారు బాధ్యత వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తే.. ఆ పాపం ఆప్‌దేనని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రత్యారోపణ చేశారు. ఆత్మహత్య చేసుకునేలా అక్కడున్న వాళ్లంతా చప్పట్లు కొడుతూ రెచ్చగొట్టారని పేర్కొన్నారు. కాంగ్రెస్ గత పాలన వల్లే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని బీజేపీ నేతలు ఎదురుదాడి చేశారు. ఆప్ స్పందిస్తూ.. రాజ్‌నాథ్ అబద్ధాలు చెప్తున్నారని, గజేంద్రను రక్షించటానికి పోలీసులు ప్రయత్నించలేదని, ప్రేక్షక పాత్ర పోషించారని ఢిల్లీ పోలీసులపై నిందమోపారు. వ్యవసాయ సంక్షోభంపై తన పది నెలల పాలనా కాలంతో పాటు.. గత ప్రభుత్వాల పాలనలోని లోటుపాట్లపైనా చర్చ అధ్యయనం జరగాలని.. ఉమ్మడిగా పరిష్కారం కనుగొనాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఆప్ నేతల వల్లే రైతు గజేంద్రసింగ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని.. రైతును కాపాడేందుకు తాము చేసిన ప్రయత్నాలకు ఆప్ నేతలు, కార్యకర్తలు అడ్డంకులు సృష్టించారని.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండే ఢిల్లీ పోలీసులు తమ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఘటనపై తాము దర్యాప్తు చేస్తున్నాం కాబట్టి.. దానిపై దర్యాప్తు జరిపే అధికారం జిల్లా మెజిస్ట్రేట్‌కు లేదని ఢిల్లీ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్వగ్రామంలో రైతు అంత్యక్రియలు దౌస(రాజస్థాన్): ఆప్ ర్యాలీలో ఆత్మహత్యకు పాల్పడిన రైతు గజేంద్రసింగ్ అంత్యక్రియలు గురువారం రాజస్థాన్‌లోని ఆయన స్వగ్రామం నంగల్ జామర్వాడలో ముగిశాయి. బీజేపీ, కాంగ్రెస్ నాయకులతోపాటు చుట్టుపక్కల గ్రామాల రైతులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ప్రేరేపించారు! గజేంద్ర కుటుంబీకుల ఆరోపణ దౌసా: గజేంద్ర సింగ్ ఆత్మహత్యపై అతని కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ విపరీత చర్య దిశగా అతన్ని ప్రేరేపించారని ఆరోపించారు. దీనికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌దే బాధ్యతన్నారు. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో మాట్లాడాకే గజేంద్ర సింగ్ ఆప్ ర్యాలీకి వెళ్లాడని అతని సోదరుడు విజేంద్ర సింగ్ గురువారం తెలిపాడు. దగ్గరి బంధువుల పెళ్లి ఉండగా ఎందుకు ఢిల్లీకి వెళుతున్నావని తాను అడిగానని, సిసోడియాతో మాట్లాడానని, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ఆయన ముందు పెడతానని’ చెప్పి బయలుదేరాడని వివరించాడు. తన సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడంటే నమ్మశక్యంగా లేదన్నాడు. గజేంద్ర ఉరి వేసుకోవడానికి ముందు చెట్టుపై నుంచి విసిరిన లేఖలోనూ తాను ఎదుర్కొంటున్న సమస్యల ప్రస్తావనే ఉంది తప్ప... ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఎక్కడా లేదని ఎత్తిచూపాడు. చేతిరాత గజేంద్రది కాదు: సోదరి గజేంద్ర రాసినట్లుగా చెబుతున్న లేఖలో చేతిరాత ఆయనది కాదని సోదరి రేఖ, కూతురు మేఘ అన్నారు. చేతిరాతపై ఆమె అనుమానం వ్యక్తం చేయడంలో ఈ లేఖను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. గజేంద్రకు రాజకీయాలపై విపరీతమైన ఆసక్తి ఉండేదని, 2008, 2013 ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ టికెట్‌పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడని, ఆప్‌లో చేరేందుకు ఇటీవల ఆసక్తి చూపాడని కుటుంబీకులు చెప్పారు. కేజ్రీవాల్ నివాసం వద్ద నిరసన రైతు ఆత్మహత్యకు ఆమ్ ఆద్మీ పార్టీయే కారణమని ఆరోపిస్తూ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు గురువారమిక్కడ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ర్యాలీ నిర్వాహకులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు ఢిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయం ఎదుట, కాంగ్రెస్ కార్యకర్తలు కేజ్రీవాల్ నివాసం ముందు ప్రదర్శనలు నిర్వహించారు. సీఎం పోస్టర్లు తగులబెట్టారు. పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కేన న్లు ప్రయోగించారు. -
పోల్ కోడ్ ఉల్లంఘన కేసులో మోడీకి క్లీన్చిట్
అహ్మదాబాద్: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణలపై ప్రధాని నరేంద్రమోడీకి శుక్రవారం గుజరాత్ పోలీసులు క్లీన్చిట్ ఇచ్చారు. గాంధీనగర్‌లో ఓటేశాక విలేకరుల సమావేశంలో పార్టీ గుర్తు అయిన కమలాన్ని కనిపించేలా మోడీ ప్రదర్శించారు. దీంతో కేసు నమోదు చేయాల్సిందిగా ఈసీ పోలీసులను ఆదేశించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 126(1)(ఏ), 126(1)(బీ)ల ప్రకారం నమోదైన ఆ కేసులో నేరం రుజువైతే గరిష్టంగా రెండేళ్ల వరకు జైలుశిక్ష పడుతుంది. అయితే, ఈ కేసును మూసేస్తున్నట్లు, సంబంధిత క్లోజర్ రిపోర్ట్‌ను కేసును విచారిస్తున్న మెట్రోపాలిటన్ కోర్టుకు సమర్పించినట్లు గుజరాత్ క్రైం బ్రాంచ్‌కు చెం దిన ఉన్నతాధికారి ఒకరు శుక్రవారం స్పష్టం చేశారు.