సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్ల కుంభకోణంపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మరోసారి మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. ఈ స్కాంలో రూ 36,000 కోట్లు ఖజానాకు నష్టం వాటిల్లిందని ఆరోపించారు. సైన్యం రక్షణ కేటాయింపులపై ప్రాధేయపడుతుంటే ప్రభుత్వం యుద్ధ విమానాల కొనుగోళ్లలో కుంభకోణానికి పాల్పడిందని దుయ్యబట్టారు. ఈ యుద్ధ విమానాలను తయారుచేసిన దాసాల్ట్ ఏవియేషన్ విమాన ఖరీదుపై భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అవాస్తవాలు చెప్పారని పేర్కొనడాన్ని రాహుల్ ప్రస్తావించారు.
మోదీ ప్రభుత్వం ఒక్కో యుద్ధ విమానాన్ని రూ 1670 కోట్లకు కొనుగోలు చేసిందని, ఒక్కో ఎయిర్‌క్రాఫ్ట్‌పై రూ1100 కోట్ల చొప్పున 36,000 కోట్లు వృధా అయ్యాయని ఆరోపించారు. రక్షణ బడ్జెట్‌లో పది శాతం వాటాను పాలకులు జేబులో వేసుకున్నారని విమర్శించారు. రాఫెల్ యుద్ధవిమానాల కుంభకోణంలో ప్రధాని మోదీ మౌనాన్ని రాహుల్ ప్రశ్నించారు.
Dassault called RM's lie and released prices paid per RAFALE plane in report:
— Office of RG (@OfficeOfRG) 16 March 2018
Qatar = 1319 Cr
MODI = 1670 Cr
MMS = 570 Cr
1100 Cr per plane or 36,000 Cr i.e 10 % of our Defence budget, in the pocket.
Meanwhile, our Army begs our Govt. for money. pic.twitter.com/fE5tj4IaeN
Comments
Please login to add a commentAdd a comment