బెంగళూరు: లోకాయుక్తపై వస్తున్న అవి నీతి ఆరోపణలకు సంబంధించి జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అవినీతి కార్యకలాపాల్లో ఓ మంత్రి కుమారుడి హస్తం కూడా ఉందని, త్వరలోనే ఆ పేరును వెల్లడిస్తామని బెళగావిలోని సువర్ణసౌధలో బుధవారం ప్రకటించారు. లోకాయుక్తలో జరిగిన అవినీతి కార్యకలాపాల్లో ఓ మంత్రి కుమారుడి హస్తం సైతం ఉందన్న కుమారస్వామి, ఈ అంశంపై శాసనసభలో పూర్తి స్థాయి చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు.
చర్చ పూర్తయిన అనంతరం మంత్రి కుమారుడి పేరును ప్రకటిస్తామని తెలిపారు. అంతేకాక ఈ మొత్తం అవినీతి పర్వంలో రెవెన్యూ శాఖ మంత్రి పర్సనల్ సెక్రటరీ నాగరాజ్‌తోపాటు సీనియర్ ఐఏఎస్ అధికారులు సైతం భాగస్వాములయ్యారని ఆరోపించారు. ఈ అధికారులకు సంబంధించిన జాబితా కూడా తమ వద్ద ఉందని, జాబితాను స్పీకర్‌కు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
ఓ మంత్రి కొడుకూ భాగస్వామి
Published Thu, Jul 2 2015 1:41 AM | Last Updated on Sun, Sep 3 2017 4:41 AM
Advertisement
Advertisement