lokayukta
-
లోకేశ్‌కు షాక్ ఇచ్చిన లోకాయుక్త
బనశంకరి: ప్రభుత్వ ఉద్యోగం మాటున అవినీతి రుచిమరిగిన అధికారులకు లోకాయుక్త షాక్ ఇచ్చింది. రవాణాశాఖ జాయింట్ డైరెక్టర్‌తో పాటు 8 మంది అధికారుల ఇళ్లు, ఆఫీసులు, వారి బంధుమిత్రుల ఇళ్లలో ముమ్మర సోదాలు నిర్వహించింది. ఈ దాడుల్లో భారీగా అక్రమ సంపాదన బయటపడింది. బెంగళూరు, చిక్కమగళూరు, బీదర్, బెళగావి, తుమకూరు, గదగ్, బళ్లారి, రాయచూరు జిల్లాల్లో బుధవారం ఉదయం నుంచి ఒకేసారి దాడులు మొదలయ్యాయి. పెద్దసంఖ్యలో లోకాయుక్త పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. వార్డెన్ లోకేశ్ లీలలు బళ్లారి తాలూకా వెనుకబడిన వర్గాల శాఖ తాలూకా అధికారి ఆర్‌హెచ్ లోకేశ్ ఇంట్లో సోదాలు జరిగాయి. రూ.2 కోట్లకు పైగా విలువ చేసే రెండు ఇళ్లను గుర్తించారు. కుడితిని గ్రామానికి చెందినవారు. బీసీఎం హాస్టల్లో చదువుకుని వార్డెన్‌గా ఉద్యోగం సంపాదించారు. ఉద్యోగానికి, సంపాదించిన ఆస్తులకు పొంతన లేదు. కురుగోడు వద్ద 4 ఎకరాల తోట ఉంది. ఇతడి పుట్టినరోజుకు బీసీఎం హాస్టల్ విద్యార్థులు భారీ పూలమాల వేసి సంబరాలు చేశారు. అలా చేయకపోతే వేధింపులకు పాల్పడేవాడని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలోనూ చురుగ్గా ఉన్నాడు. ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండా విదేశీ పర్యటన చేశారు. లోకాయుక్త దాడి గురించి ముందే తెలిసిందే ఏమోగానీ అజ్ఞాతంలోకి జారుకున్నాడు. గదగ్, బెళగావిలో.. గదగ్–బేటగేరి నగరసభ కార్యనిర్వాహక ఇంజనీర్ హుచ్చేశ్బండి వడ్డర్ నివాసం, కార్యాలయం, ఫాం హౌస్‌పై అధికారులు దాడిచేశారు. గదగ, గజేంద్రగడ, బాగల్‌కోటే తో పాటు ఐదుచోట్ల సోదాలు సాగాయి. ఆస్తిపాస్తుల పత్రాలు, ఫైళ్లను పరిశీలన చేపట్టారు. బెళగావి జిల్లా ఖానాపుర తహశీల్దార్ ప్రకాశ్ గైక్వాడ్ ఆఫీసు, బెళగావి నగర లక్ష్మీటెక్లోని ఇల్లు, నిప్పాణి నివాసం తో పాటు 6 చోట్ల దాడిచేశారు. పెద్దమొత్తంలో ఆస్తుల పత్రాలు లభించాయి. రిటైర్డు అధికారికి షాక్ లంచాలతో అక్రమాస్తులు సంపాదించుకుని రిటైరయ్యాను అని ధీమాగా ఉన్న తుమకూరు రిటైర్డు ఆర్టీఓ ఎస్.రాజు ఇంట్లో గాలింపు జరిపారు. ఎస్పీ హనుమంతరాయప్ప ఆధ్వర్యంలో సోదాలు జరిపి పెద్దమొత్తంలో ఆస్తుల వివరాలను సేకరించారు. వస్తు సామగ్రి లెక్కింపుమొత్తం దాడుల్లో అధికారుల నుంచి స్వాధీనం చేసుకున్న నగదు, బంగారు–వెండి ఆభరణాలు, విలాసవంతమైన వస్తువులు, ఆస్తిపాస్తుల పత్రాలు, ఫైళ్లు, బ్యాంకు పాస్‌బుక్కులు, లాకర్ల సమాచారాన్ని పరిశీలన చేపట్టారు. కాగా, లోకాయుక్త గత మూడు నెలల నుంచి తరచుగా దాడులు చేస్తుండడంతో లంచగొండి ఉద్యోగుల్లో భయం ఆవహించింది.దాడులు ఎవరిపై.. ఎక్కడెక్కడ.. ⇒ శోభా – జాయింట్ కమిషనర్ రవాణాశాఖ, బెంగళూరు ⇒ డాక్టర్ ఎస్ఎన్.ఉమేశ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ అధికారి, కడూరు, చిక్కమగళూరు జిల్లా ⇒ రవీంద్ర, ఇన్స్పెక్టర్ చిన్ననీటి పారుదల శాఖ అంతర్జల అభివృద్ధి ఉప విభాగం, బసవ కళ్యాణ, బీదర్ జిల్లా ⇒ ప్రకాశ్ శ్రీధర్ గైక్వాడ్, తహశీల్దార్, ఖానాపుర– బెళగావి జిల్లా ⇒ హుచ్చేశ్, అసిస్టెంట్ కార్యనిర్వాహక ఇంజనీర్ (ఇన్చార్జ్) బేటగేరి పురసభ, గదగ్ ⇒ ఆర్‌హెచ్ లోకేశ్, వెనుకబడిన వర్గా శాఖ సంక్షేమ అధికారి, బళ్లారి ⇒ హులి రాజ, గిల్లేసుగూరు కేంద్రం జూనియర్ ఇంజనీర్, రాయచూరు ⇒ ఎస్.రాజు, రిటైర్డు ఆర్టీఓ, రవాణాశాఖ తుమకూరు -
మాజీ సీజేఐపై ఆరోపణలు.. పిటిషన్‌ను కొట్టేసిన లోక్‌పాల్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయ మూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్‌పై అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసును లోక్‌పాల్ కొట్టివేసింది. తన న్యాయ పరిధికి మించిన అంశమని ఒక ఉత్తర్వులో పేర్కొంది. ఓ రాజకీయ పార్టీని, ఓ రాజకీయ నేతను కాపాడేందుకు తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ గతేడాది అక్టోబర్ 18వ తేదీన అప్పటి సీజేఐ జస్టిస్ చంద్రచూడ్‌పై ఫిర్యాదు అందింది. గతేడాది నవంబర్ 10వ తేదీన పదవి నుంచి ఆయన రిటైరయ్యారు. లోక్‌పాల్, లోకాయుక్త చట్టంలోని సెక్షన్–14 ప్రకారం సిట్టింగ్ సీజేఐ, సుప్రీంకోర్టు జడ్జీలు తమ న్యాయపరిధిలోకి రారని, ఈ అంశాన్ని పరిశీలించరాదని నిర్ణయించుకున్నామని లోకా యుక్త ఈ నెల 3న జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. చట్ట ప్రకారం ఇతర మార్గాలను అనుసరించే స్వేచ్ఛ పిటిషనర్‌కు ఉందని తెలిపింది. -
లోకాయుక్త బిల్లు.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త చట్టానికి సవరణలు తీసుకొస్తూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతిపాదనలు పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగాలేవని పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్‌రావు అభిప్రాయపడ్డారు. సీఎం పేరుతో మంత్రి నారా లోకేశ్ లోకాయుక్త చట్ట సవరణ బిల్లు ఆమోదం కోసం శుక్రవారం ‘మండలి’లో ప్రవేశపెట్టగా, దానిపై కొద్దిసేపు చర్చ జరిగింది. బిల్లులో సవరణలపై లోకేశ్ వివరిస్తూ.. లోకాయుక్త, సభ్యుల నియామక కమిటీలో సీఎం చైర్మన్‌గా, అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు, హోంమంత్రి లేదా సీఎం నామినేట్ చేసే మంత్రి సభ్యులుగా ఉంటారని.. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత లేనిపక్షంలో మిగతా నలుగురు సభ్యులతో లోకాయుక్త కమిటీ సమావేశం ఏర్పాటుకు ఈ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. దీనిపై లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ.. ‘ప్రజాస్వామ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ జోడు గుర్రాల్లా వెళ్లాలని ఓ రాజనీతిశాస్త్ర అధ్యాపకుడిగా నేను భావిస్తున్నా. బిల్లు సారాంశం నాకు అర్థమైనంత వరకు.. ప్రతిపక్ష నాయకుడు లేరు కాబట్టి ఆయనను మినహాయిస్తూ, మిగిలిన నలుగురితో చేయాలని అనుకుంటున్నట్లుగా ఉంది. నిజానికి.. ప్రతిపక్ష నాయకుడు లేకపోయినా, ప్రతిపక్షం ఉంది. ప్రతిపక్షం నుంచి ఎవరైనా ఒక సభ్యుడు ఉండేలా కమిటీ ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. దానికి ప్రతిపక్ష హోదా అక్కరలేదు. ప్రతిపక్ష పార్టీ అక్కడ ఉంది. ఆ పార్టీని ఎవరో ఒక సభ్యుడిని నామినేట్ చేయమని అడగొచ్చు. మీ ప్రతిపాదనలు ప్రజాస్వామ్య స్పిరిట్ కాదు’ అంటూ మాట్లాడారు. ఈ సమయంలో పలువురు టీడీపీ సభ్యులు పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయగా.. లక్ష్మణరావు స్పందిస్తూ.. ‘వాదనలు చేయాలంటే చాలా చెయ్యొచ్చు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య సూత్రం చెబుతున్నా. ఆచరిస్తే ఆచరించండి లేకపోతే లేద’ని తెలిపారు.ప్రజాస్వామ్యయుతంగానే ముందుకు..లక్ష్మణరావు చేసిన సూచనపై లోకేశ్ స్పందిస్తూ.. ‘ప్రతిపక్ష నేత లేనిపక్షంలో అని బిల్లులో పేర్కొన్నాం.. అంతేగానీ ఏమీ తీసివేయడంలేదు. ఆయన లేనిపక్షంలో నలుగురుతో జరుగుతుందని మాత్రమే బిల్లులో పేర్కొన్నాం’.. అని చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగానే లోకాయుక్తను తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందన్నారు. మాజీ సీఎం జగన్ రెండు సమావేశాల నుంచి సభకు రాని పరిస్థితి అని.. అన్నీ పరిగణనలోకి తీసుకునే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. చర్చ అనంతరం, సభ మూజువాణితో బిల్లు ఆమోదం పొందినట్లు మండలి చైర్మన్ ప్రకటించారు.మరో ఏడు బిల్లులు కూడా.. జ్యుడీషియల్ ప్రివ్యూకు రద్దుఇప్పటికే అసెంబ్లీ ఆమోదం పొందిన లాండ్ గ్రాబింగ్ సవరణ బిల్లు, పీడీ యాక్ట్ సవరణ బిల్లు, దేవదాయశాఖ పాలక మండలి కమిటీ అదనపు సభ్యుల నియామకం సవరణ బిల్లు, జ్యుడీషియల్ ప్రివ్యూకు సంబంధించిన బిల్లులతో పాటు మున్సిపల్ చట్ట సవరణ బిల్లు, జీఎస్టీ చట్ట సవరణ బిల్లు, వ్యాట్ చట్ట సవరణ బిల్లులు కూడా శుక్రవారం మండలిలో ఆమోదం పొందాయి. -
అమరావతికి తరలించడం సమంజసమేనా?
ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రభుత్వ చర్యలూ, దాని ప్రాధాన్యతలపై సహజంగానే ప్రజలకు ఆసక్తి ఉంటుంది. కర్నూలు నుంచి న్యాయ సంస్థలు– ‘లోకాయుక్త’ మానవ హక్కుల కమిషన్, సీబీఐ కోర్టు, ఉన్నత ‘లా’ విద్యాసంస్థలు వంటి వాటిని అక్కడ నుంచి ‘అమరావతి’కి తరలిస్తున్నట్టు, స్థానికులు ఆందోళన చేస్తున్నట్టుగా వచ్చిన వార్తల నేపథ్యంలో... గత పదేళ్ల పరిణామాల సమీక్ష తప్పడం లేదు.ఈ విషయంలో మొదట ఒకమాట అనుకుని అప్పుడు ముందుకు వెళ్ళడం బాగుంటుంది. ఉమ్మడి రాష్ట్రం ఎందుకు రెండుగా విభజించబడింది అనే విషయంలో పదేళ్ళ తర్వాత అయినా మనకు స్పష్టత అవసరం. ఇక్కడ రాష్ట్రాల్లో అయినా అక్కడ ఢిల్లీలో అయినా ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వంలోకి ప్రవేశించే ‘లెజిస్లేచర్’ కాకుండా, శాశ్వతమైన ‘ఎగ్జిక్యూటివ్’ అనే శక్తిమంతమైన వ్యవస్థ మరొకటి ఉంది. ఈ రెండింటిపై ‘జ్యుడిషియరీ’ ఉంది. ప్రభుత్వాలు ఉనికిలో లేని విరామాల మధ్య కూడా వాళ్ళు అధికారంలో ఉంటారు. అప్పటి ముఖ్యమంత్రి కె. కిరణ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేస్తే, 2014 ఫిబ్రవరి 20 నుంచి జూన్ 8 వరకు రాష్ట్రం ‘గవర్నర్ పాలన’లో ఉంది. దేశ ప్రాదేశిక భద్రత విషయమై గురుతరమైన బాధ్యత ఈ వ్యవస్థలకు ఉంటుంది. పరిపాలనలో కేంద్ర– రాష్ట్ర సంబంధాలు ఢిల్లీలో ‘హోమ్’శాఖ వద్ద ఎందుకు ఉంటాయో మనకు అర్థం కావాలి. అలాగే, 2014 మొదట్లో ‘యూపీఏ–2’ ప్రభుత్వంలో ఢిల్లీలో రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలయినప్పుడు; అధికారుల కమిటీ కాకుండా, ప్రభుత్వం మంత్రులతో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికి కేంద్ర రక్షణశాఖ మంత్రి ఎందుకు అధ్యక్షుడుగా ఉన్నారో మనకు అర్థం కావాలి. అటువంటి గ్రహింపుతో మొత్తంగా భారత ప్రభుత్వం సమగ్రమైన తూర్పు దృష్టి (లుక్ ఈస్ట్) ‘డ్రైవ్’ అంతా కేవలం ఆగ్నేయ ఆసియా వైపు ఎందుకు ఉందో కూడా మనకు తెలియాలి. కీలకమైన కేంద్ర మంత్రిత్వశాఖలు ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రీతిగా ఎందుకు తమ కార్యకలాపాల వేగాన్ని పెంచుతున్నాయో మనకు తెలియాలి. గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విశాఖపట్టణం రాష్ట్ర రాజధాని ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. అది రాష్ట్ర పరిధిలోని అంశం. దానితో పనిలేకుండా కేంద్రం 2022 అక్టోబర్ నాటికి కాకినాడ వద్ద ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్’ సౌత్ ఇండియా కేంపస్ తెచ్చింది. మార్చి 2024 నాటికి బాపట్ల సమీపాన ‘ఇండియన్ ఎయిర్ ఫోర్స్’ దళాల కోసం ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ఏర్పడింది. ‘డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గ నైజేషన్’ (డీఆర్డీఓ) రూ. 100 కోట్లతో ‘మిస్సైల్ టెస్ట్ రేంజ్ సెంటర్’ మచిలీ పట్టణం సమీపాన నాగాయలంక దగ్గరలోని గుల్లలమోద వద్ద నిర్మి స్తున్నది. గత ప్రభుత్వంలో జరిగిన పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా బాపట్ల–బందరు రెండూ కూడా విజయవాడ, గుంటూరు నగరాలతో సంబంధం లేని సొంత కలెక్టరేట్లతో జిల్లా కేంద్రాలుగా మారాయి.చదవండి: శ్రీబాగ్ ఒడంబడిక అమలే కీలకం!కేంద్ర ఆర్థికశాఖ అనంతపురం జిల్లాలో ‘నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్’ వంటి దేశంలోనే అత్యున్నత స్థాయి శిక్షణా సంస్థను 2022 నాటికి బెంగళూరు సమీపాన ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించింది. అదే కాలానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా అనంతపురం జిల్లా నుంచి పుట్టపర్తి ప్రాంతాన్ని వేరుచేసి; సత్యసాయి జిల్లా పేరుతో కొత్తగా మరో జిల్లా ఏర్పాటు చేయడంతో ఇప్పుడు ఈ సంస్థ ఆ కొత్త జిల్లాలో ఉంది. మరి వీటిలో దేన్నైనా ఇది ఇక్కడ కాదు, అని మరొకచోటికి తరలించే ప్రయత్నం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ; లేదా ‘కూటమి’లో భాగస్వామి అయిన బీజేపీ నడుపుతున్న కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఎందుకు అనడం లేదనే సందేహం మనకు రావాలి. అప్పుడు ఐదేళ్ళ ప్రభుత్వాల అవసరాల కంటే, విస్తృతమైన దేశప్రయోజనాల కోసం కేంద్రంలో – రక్షణ, వాణిజ్యం, ఉపరితల రవాణా, రైల్వే, స్పేస్ సైన్స్, వంటి కొన్ని మంత్రిత్వశాఖల్లో– ‘ఏపీ’ కోసం ఒక ప్రత్యేకమైన ‘ప్లానింగ్’ ఎందుకు జరుగుతున్నది? అనే ప్రశ్న వైపుకు అవి మనల్ని మన రాష్ట్రం ‘జాగ్రఫీ’ వైపుకు తీసుకువెళతాయి.చదవండి: వాగ్దానాలు గాలికి వదిలినట్లేనా?అయితే, జరిగినవి ఏవీ గత పదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం మనపట్ల ప్రేమతో చేయలేదు. ‘మెతుకు ముట్టుకుంటే అన్నం సోకు తెలుస్తుంది’ అన్నట్టుగా, రాష్ట్ర విభజన జరిగి ఆ ‘షాక్’ నుంచి ఇంకా మనం కోలుకోక ముందే 2014 మధ్యలోనే బందరు వద్ద భూమి కూడా ఎంపిక చేసిన ‘మెరైన్ పోలీస్ అకాడమీ’ని ఇక్కణ్ణించి ఉత్తరాదికి వారు తరలించారు. అదే ఏడాది డిసెంబరులో ‘ఏపీ’కి కూడా మరొక ‘అకాడమీ’ ఇస్తున్నాం అన్నారు. ఇప్పటికి అటువంటిది ఏమీ లేదు. జరుగుతున్నవి అన్నీ ఇటీవల కొత్తగా వాడుకలోకి వచ్చిన ‘జియో – పాలి టిక్స్’లో భాగంగా దేశ ప్రాదేశిక అవసరాల మేరకు ‘బ్యురోక్రసీ’ స్థాయిలో జరుగుతున్న విధాన నిర్ణయాలు. ఇంతటి సమగ్రమైన వైశాల్యంతో మారిన కొత్త ‘మ్యాప్’లోని రాష్ట్రాన్ని అధికారంలో ఉన్న ప్రభుత్వం చూడగలిగినప్పుడే, ఇక్కడ అది అమలు చేయాల్సిన స్వల్పకాలిక – దీర్ఘకాలిక ‘ప్లానింగ్’ ఎలా ఉండాల్సిందీ దానికి అర్థమవుతుంది. అప్పుడు ఈ మొత్తంలో – ‘రాజధాని’ అనే అంశానికి ఉన్న జాగా ఎంతో కూడా మనకు అర్థమవుతుంది.- జాన్సన్ చోరగుడి అభివృద్ధి– సామాజిక అంశాల వ్యాఖ్యాత -
విచారణకు రావాలి.. సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు
బెంగళూరు: మైసూర్ అర్బన్ డెవెలప్మెంట్ అథారిటీ (MUDA) కుంభకోణం కేసు కర్ణాటకలో రాజకీయంగా సంచలనం సృష్టించింది. అయితే.. తాజాగా ముఖ్యమంత్రి సిద్దరామయ్యను లోకాయుక్త పోలీసులు విచారణకు పిలిచారు.అందులో భాగంగా ఆయనకు లోకాయుక్త పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇక..బుధవారం (నవంబర్ 6) ఉదయం సీఎం సిద్ధరామయ్య తమ ముందు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో కోరినట్లు లోకాయుక్త సీనియర్ అధికారి తెలిపారు. మరోవైపు.. ఈ విషయంపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు.‘‘ముడాకు సంబంధించి మైసూర్ లోకాయుక్త పోలీసులు నోటీసు జారీ చేశారు. నవంబర్ 6న మైసూర్ లోకాయుక్తకు వెళ్లుతా’ అని అన్నారు. ఇక.. ఇదే కేసులో ఇటీవల సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి లోకాయుక్త ప్రశ్నించిన విషయం తెలిసిందే.సిద్ధరామయ్య భార్య పార్వతి సోదరులు మల్లికార్జున స్వామి, దేవరాజు స్వామి కొంత భూమి కొనుగోలు చేసి ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఈ భూమి వివాదంలో ఉండటంతో మైసూరులోని లోకాయుక్త పోలీసులు సెప్టెంబర్ 27న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.Haveri: Karnataka CM Siddaramaiah says, "Yes, Mysore Lokayukta has issued a notice regarding MUDA. I will go to Mysore Lokayukta on 6th November." pic.twitter.com/cWNydSusOR— ANI (@ANI) November 4, 2024ఏమిటీ ముడా భూవివాదం?సిటీ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్ బోర్డ్‌గా 1904లో ఏర్పాటై తదనంతరకాలంలో మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా)గా అవతరించిన సంస్థ ఇప్పుడు భూకేటాయింపుల వివాదంలో కేంద్రబిందువుగా నిలిచింది. కెసెరె గ్రామంలో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి 3 ఎకరాల 16 గుంటల భూమి ఉంది.ఈ గ్రామంలో దేవనార్ 3ఫేజ్ లేఅవుట్ కోసం ముడా ఈ భూమిని సేకరించింది. నష్టపరిహారంగా 2021లో మైసూర్‌లోని విజయనగర మూడో, నాలుగో ఫేజ్ లేఅవుట్లలో 38,284 చదరపు అడుగుల విస్తీర్ణంలో 14 ప్లాట్లను కేటాయించింది. అయితే పార్వతి నుంచి తీసుకున్న భూముల కంటే కేటాయించిన ప్లాట్ల విలువ రూ.45 కోట్లు ఎక్కువ అని ఆర్టీఐ కార్యకర్త అబ్రహాం లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదుచేయడంతో కేటాయింపుల అంశం వార్తల్లోకెక్కింది.కెసెరె భూమిని పార్వతికి ఆమె సోదరుడు మల్లిఖార్జున స్వామి 2010 అక్టోబర్‌లో బహుమతిగా ఇచ్చాడు. ప్రభుత్వం సేకరించాక 2014 జూన్‌లో నష్టపరిహారం కోసం పార్వతి దరఖాస్తు చేసుకున్నారు. ప్లాట్ల కేటాయింపుపై సిద్ధూ గతంలోనే స్పష్టతనిచ్చారు.‘‘2014లో నేను సీఎంగా ఉన్నపుడు పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటే సీఎంగా ఉన్నంతకాలం ఆ పరిహారం ఇవ్వడం కష్టమని అధికారులు చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్నపుడు 2021లో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ఈ ప్లాట్లను కేటాయించారు’’ అని సిద్దూ అన్నారు.అయితే గతంలో ముడా 50: 50 పేరిట ఒక పథకాన్ని అమలుచేసింది. నిరుపయోగ భూమి తీసుకుంటే వేరే చోట ‘అభివృద్ధి చేసిన’ స్థలాన్ని కేటాయిస్తారు. ప్రతీ కేటాయింపు ముడా బోర్డు దృష్టికి తేవాలి. అయితే కొందరు ముడా అధికారులతో చేతులు కలిపి, బోర్డు దృష్టికి రాకుండా, పథకంలోని లోపాలను వాడుకుని సిద్ధరామయ్య కుటుంబం ఎక్కువ ప్లాట్లను రాయించుకుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. లోపాలున్న పథకాన్ని 2023 అక్టోబర్‌లో రద్దుచేశారు.అయితే తన భూమికి ఎక్కువ విలువ ఉంటుందని రూ.62 కోట్ల నష్టపరిహారం కావాలని సిద్ధరామయ్య ఈఏడాది జూలై నాలుగున డిమాండ్ చేయడం విశేషం. అయితే అసలు ఈ భూమి పార్వతి సోదరుడు మల్లికార్జున స్వామిది కాదని, అక్రమంగా ఫోర్జరీ పత్రాలు సృష్టించి 2004లో తన పేరిట రాయించుకున్నాడని ఆరోపణలున్నాయి. -
సిద్ధూపై ఈడీ కేసు
న్యూఢిల్లీ/బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) ప్లాట్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని లోకాయుక్త నమోదు చేసిన ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) ఆధారంగా ఈ చర్యకు దిగింది. సిద్ధరామయ్య, భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి తదితరులపై కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు నమోదు చేసింది. పార్వతి నుంచి 3.16 ఎకరాలను సేకరించిన ముడా ప్రతిగా 50:50 నిష్పత్తిలో ఖరీదైన ప్రాంతంలో ఆమెకు 14 ప్లాట్లను కేటాయించింది. దీంట్లో అవినీతి, అధికార దురి్వనియోగం జరిగినట్టు ఆరోపణలున్నాయి. ఈ కేసులో సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ థావర్‌చంద్ గెçహ్లాట్ అనుమతి మంజూరు చేశారు. దీన్ని సిద్ధూ హైకోర్టులో సవాల్ చేసినా చుక్కెదురైంది. అనంతరం బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు ఆయనపై లోకాయుక్త పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాని ఆధారంగా సిద్ధరామయ్య తదితరులపై ఈడీ సోమవారం కేసు నమోదు చేసింది. విచారణకు రావాలంటూ ఆయనకు సమన్లు జారీ చేసే వీలుంది. అలాగే ఆస్తులను కూడా అటాచ్ చేయవచ్చు. 14 ప్లాట్లను వెనక్కి ఇచ్చేస్తా ముడా కమిషనర్‌కు పార్వతి లేఖ మైసూరు: భూపరిహారంగా ముడా తనకు కేటాయించిన 14 ప్లాట్లను వెనక్కి ఇచ్చేందుకు కర్నాటక సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి ముందుకు వచ్చారు. ఈ మేరకు ముడా కమిషనర్‌కు సోమవారం ఆమె లేఖ రాశారు. మైసూరు కేసరే గ్రామంలో తనకు చెందిన 3.16 ఎకరాల భూమిని ముడా తీసుకొని.. విజయనగర లేఔట్ ఫేజ్–3, ఫేజ్–4లో తనకు 14 ప్లాట్లను కేటాయించిందని ఆమె వివరించారు. ‘సేల్ డీడ్‌ను రద్దు చేయడం ద్వారా నేనీ 14 ప్లాట్లను తిరిగి ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ముడా ఈ ప్లాట్లను స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నాను. ఈ దిశగా సాధ్యమైనంత త్వరగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని పార్వతి ముడా కమిషనర్‌ను కోరారు. ముడా కేటాయింపుల్లో సిద్ధరామయ్యపై దర్యాప్తునకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం, లోకాయుక్త పోలీసుల కేసు నమోదు, తాజాగా సోమవారం ఈడీ కేసు నమోదు నేపథ్యంలో.. ప్లాట్లను తిరిగి ఇచ్చేయాలని పార్వతి నిర్ణయం తీసుకున్నారు. -
ముడా కుంభకోణం.. సీఎం సిద్దరామయ్యపై ఎఫ్ఐఆర్ నమోదు
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో మైసూర్ అర్బర్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) భూ కుంభకోణం వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై లోకాయుక్త పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో సిద్ధరామయ్యను మొదటి ముద్దాయిగా పేర్కొనగా.. ఆయన సతీమణి పార్వతి, బావమరిది మల్లికార్జున్ స్వామి, దేవరాజ్, మల్లికార్జున స్వామిలను వరుస నిందితులుగా చేర్చింది.మూడా భూ కుంభకోణానికి సంబంధించి సిద్ధరామయ్యపై కేసు నమోదు చేయాలని ట్రయల్ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే లోకాయుక్త పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. మరోవైపు ముడా భూ కుంభకోణం కేసులో సీఎం సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ అనుమతివ్వడాన్ని బుధవారం హైకోర్టు సమర్ధించిన విషయం తెలిసిందే. ఈ అనుమతిని సవాల్ చేస్తూ సీఎం వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ.. గవర్నర్ చర్యలుచట్ట ప్రకారం ఉన్నాయని తెలిపింది. చదవండి: రాహుల్ ధైర్యవంతుడు, నిజాయితీ కలిగిన నేత: సైఫ్ ప్రశంసలు -
సీఎం సార్.. కర్మ సిద్ధాంతం అంటే ఇదే కదా
బెంగళూరు: కర్ణాటకలో మైసూర్ నగరాభివృద్ధి సంస్థ (ముడా) స్కాంలో సీఎం సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇళ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించిన ముడా స్కాంలో సిద్ధరామయ్య అవకతవకు పాల్పడ్డారని, ఆయన వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.ఈ తరుణంలో సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేయాలని జనతాదళ్ (సెక్యులర్) అధినేత హెచ్డీ కుమారస్వామి డిమాండ్ చేశారు. అదే సమయంలో తన మిత్రపక్షమైన బీజేపీపై సైతం విమర్శలు గుప్పించారు. సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. ఆయన ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్లో మంత్రా అని ప్రశ్నించారు. Mr. @siddaramaiah..Ughe Ughe to your 'Sidvilasa'Then: To escape from scams, you build a 'samadhi' for Lokayukta and formed ACB!Now: The same Lokayukta is a place you found to get rid of 'Mudahagaran'!!Isn't it Karma Mr siddaramaiah?ACB was also dismissed by the High Court…— ಹೆಚ್.ಡಿ.ಕುಮಾರಸ್ವಾಮಿ | H.D.Kumaraswamy (@hd_kumaraswamy) September 27, 2024మోదీ కేబినెట్లో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి.. ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య స్వయం ప్రతిపత్తి వ్యవస్థ లోకాయుక్తపై ఆంక్షలు విధించి..అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ)ని ఏర్పాటు చేసే ప్రయత్నాలను ఆయన ఎత్తి చూపారు.కర్మ సిద్ధాంతం అంటే ఇదేగతంలో లోకాయుక్తాకు బదులు ఏసీబీని ఏర్పాటు చేయాలని సీఎం సిద్ధరామయ్య అనుకున్నారు. కానీ 2022లో హైకోర్టు రాష్ట్రంలో లోకాయుక్త లేదంటే ఏసీబీ ఏదో ఒకటి ఉండాలని తీర్పు ఇచ్చింది. దీనిపై కుమారస్వామి స్పందిస్తూ.. ఇది కర్మ కాదా..సిద్ధరామయ్య. లోకాయుక్త వద్దనుకున్నారు. ఇప్పుడు మీరు వద్దనుకున్న లోకాయుక్త ఆధ్వర్యంలో ముడా స్కామ్‌లో విచారణ ఎదుర్కోనున్నారు అంటూ సెటైర్లు వేశారు. చదవండి : ముడా స్కామ్‌లో సీఎం సిద్ధరామయ్యాకు చిక్కులు -
విచారణ చేపట్టండి
బెంగళూరు: మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) స్థలాల పంపిణీలో అక్రమాలు జరిగాయన్న ఉదంతంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందుకు రంగం సిద్ధమైంది. సిద్ధరామయ్యను విచారించాలని లోకాయక్త పోలీసులకు బుధవారం బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆదేశాలిచి్చంది. దీంతో సిద్ధూపై ఎఫ్ఐఆర్ నమోదుచేసి కేసు విచారణను లోకాయుక్త పోలీసులు మొదలుపెట్టనున్నారు. సిద్ధూ భార్యకు ప్రభుత్వ వెంచర్లలో 14 ప్లాట్లను అక్రమంగా కేటాయించారన్న ఫిర్యాదుల మేరకు సిద్ధూపై విచారణకు కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోత్ అనుమతి ఇవ్వడాన్ని సిద్ధూ కర్ణాటక హైకోర్టులో సవాల్ చేయడం, ఆయన పిటిషన్‌ను కోర్టు కొట్టేయడం తెల్సిందే. ఈ నేపథ్యంలో బుధవారం బెంగళూరు ప్రత్యేక కోర్టు జడ్జి సంతోశ్ గజానన్ భట్ ఆదేశాలిచ్చారు. ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ ఇచి్చన ఫిర్యాదు మేరకు మాజీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలు/ఎంపీల సంబంధిత కేసులను విచారించే ఈ కోర్టు తదుపరి చర్యలకు ఆదేశాలిచి్చంది. మూడు నెలల్లోగా అంటే డిసెంబర్ 24వ తేదీకల్లా సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికను సమరి్పంచాలని జడ్జి సూచించారు. ముఖ్యమంత్రిపై ఉన్న ఫిర్యాదులపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని స్పెషల్ కోర్టుకు ఆగస్ట్ 19న తాము ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు తాజాగా ఉపసంహరించుకోవడంతో స్పెషల్ కోర్టు బుధవారం ఆదేశాలు ఇవ్వడానికి వీలు కల్గింది. ఈ కేసులో సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతి, పార్వతి సోదరుడు మల్లికార్జున స్వామి, స్వామికి ఈ భూమిని అమ్మిన దేవరాజులను ప్రతివాదులుగా కోర్టు చేర్చింది. విచారణను ఎదుర్కోవడానికి సిద్ధం దర్యాప్తు మొదలుపెట్టాలని లోకాయుక్తకు ఆదేశాలు రావడంపై సిద్ధరామయ్య స్పందించారు. ‘‘ ఎలాంటి దర్యాప్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని గతంలోనే చెప్పా. ఎలాంటి దర్యాప్తునకు నేను భయపడను. చట్టప్రకారం పోరాటానికి నేను సిద్ధం. కోర్టు ఉత్తర్వుల కాపీలో ఏముందో చదివాక మళ్లీ మాట్లాడతా’’ అని సిద్ధరామయ్య అన్నారు. -
విచారణకు భయపడను: సీఎం సిద్ధరామయ్య
బెంగళూరు:మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) స్కామ్‌లో విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. విచారణకు భయపడటం లేదన్నారు.ఈ విషయమై సిద్ధరామయ్య బుధవారం(సెప్టెంబర్25) సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు. ముడా స్కామ్‌పై బెంగళూరు ప్రత్యేక కోర్టు బుధవారం విచారణకు ఆదేశించింది. కర్ణాటక లోకాయుక్త ఆధ్వర్యంలో దర్యాప్తునకు అనుమతించింది.మూడు నెలల్లో ముడా స్కామ్‌పై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని మైసూర్ పోలీసులను ఆదేశించింది.ఈ కేసులో సిద్ధరామయ్యకు మంగళవారం హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ముడా స్కామ్‌లో తనను విచారించేందుకుగాను గవర్నర్ అనుమతి మంజూరు చేయడంపై సీఎం హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. -
‘అది దేవుడి నిర్ణయమే’: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
బెంగళూరు : అక్రమాస్తుల కేసులో కోర్టు నిర్ణయాన్ని దేవుడి నిర్ణయంగా భావిస్తా. నేను కోర్టు తీర్పు, దేవుణ్ణి నమ్ముతాను’ అని కర్ణాటక డిప్యూటీ సీఎం, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్రమాస్తుల కేసులో డీకే శివకుమార్‌కు ఊరట లభించింది. డీకే శివకుమార్ విచారణను కొనసాగించాలంటూ సీబీఐ, బీజేపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్లు కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ రెండు పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు బుధవారం కొట్టి వేసింది.కోర్టు తీర్పు వెలువరించిన తరుణంలో సకలేశ్పురలోని యెత్తినహోల్ ఇంటిగ్రేటెడ్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టును పరిశీలించిన సందర్భంగా అక్రమాస్తుల కేసుకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నలకు శివకుమార్ పై విధంగా వ్యాఖ్యానించారు. 2013-2018 కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డీకే శివ కుమార్ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన ఆదాయానికి మించిన ఆస్తుల్ని కూడబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ ఆరోపణల నేపథ్యంలో ఆయనపై సెప్టెంబరు 2020న సీబీఐ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. విచారణ ప్రారంభించింది. దర్యాప్తు కొనసాగుతుండగానే ఆ కేసు సీబీఐ నుంచి ఈ ఏడాది ఫిభ్రవరిలో లోకాయుక్త పోలీసులకు బదిలీ అయ్యింది. ఈ కేసు విచారణలో భాగంగా డీకే శివకుమార్ గత వారం లోకాయుక్త పోలీసుల ముందు హాజరయ్యారు. సుప్రీంలోనూ ఎదురుదెబ్బ అక్రమాస్తుల కేసులో సీబీఐ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను సవాల్ చేస్తూ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గత నెలలో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ వ్యవహారంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. సిద్ధరామయ్యకు ఏం జరగదు అక్రమాస్తుల కేసుతో పాటు మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూకేటాయింపుల కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య,ఆయన భార్య పార్వతిలపై వస్తున్న ఆరోపణలపై డీకే శివకుమార్ స్పందించారు. సీఎంకి ఏం కాదు.‘కొందరు ముఖ్యమంత్రిపై ఎందుకు విరుచుకుపడుతున్నారో నాకు తెలియదు. ఆయనకు ఏం కాదు. ముడా వ్యవహారంలో ఆయనకు ప్రమేయం లేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు డీకే శివకుమార్. -
బంగ్లాలు, కోట్లాది ఆస్తులు!
కర్ణాటక: ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ ప్రజలకు సేవ చేయడానికి బదులు అడ్డదారుల్లో ఆస్తులు సంపాదించినవారిపై లోకాయుక్త ముమ్మర దాడులు చేసింది. బెంగళూరు, మైసూరు, బీదర్, బళ్లారి, విజయనగరతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 63కు పైగా ప్రాంతాల్లో 13 మంది అధికారులు, ఉద్యోగుల ఆఫీసులు, ఇళ్లు, వారి బంధువుల ఇళ్లలో మంగళవారం తెల్లవారుజాము నుంచి సోదాలు జరిపింది. ఇందులో కోట్లాది విలువ చేసే నగదు, బంగారం, స్థిరాస్తుల పత్రాలను స్వాధీనం చేసుకుంది. లెక్చరర్ వ్యాపారాలు మైసూరు నంజనగూడు ప్రభుత్వకాలేజీ లెక్చరర్ మహదేవస్వామికి చెందిన మైసూరు గురుకుల లేఔట్ నివాసంతో పాటు 12 చోట్ల దాడులు చేశారు. పేరుకే ఆయన అధ్యాపకుడు, కానీ ఎంఎస్ గ్రూప్ కంపెనీ నిర్వహిస్తున్నారు. భారీగా అక్రమాస్తులు పోగేసినట్లు తెలిసి సోదాలు చేపట్టారు. మైసూరులోని ఇళ్లు, కార్యాలయం, పాఠశాల, వాణిజ్య కట్టడాల్లో గాలింపు జరిపారు. ఒక విద్యాసంస్థ, స్టీల్, వస్త్ర దుకాణాలు గుర్తించారు. ఆయన కార్ల పార్కింగ్ కోసమే విశాలమైన స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఘనాపాఠి తిమ్మరాజ కేఆర్ఐడీఎల్ సూపరిన్టెండెంట్ ఇంజనీర్ తిమ్మరాజప్ప బంగ్లా చూసి లోకాయుక్త అధికారులు షాక్ తిన్నారు. కోలారు, బెంగళూరు, బెళగావితో పాటు 8 చోట్ల దాడులు చేశారు. కోలారు జిల్లా కేజీఎఫ్ తాలూకాలోని సొంతూరు మహదేవపురలో బృహత్ బంగ్లా కట్టుకున్నారు. బెంగళూరులోనూ తిమ్మరాజప్ప 7 ప్రాంతాల్లో ఇళ్లు, ఫ్లాట్లు ఉన్నాయి. కోట్లాది రూపాయల విలువచేసే నివాసం, ఆస్తులు, భూములు రికార్డులు లభ్యమయ్యాయి. విజయేంద్ర బావమరిదిపై... బళ్లారి గనులు, భూ విజ్ఞానశాఖ చంద్రశేఖర్, అటవీశాఖ డీఆర్‌ఎఫ్‌ఓ మారుతి ఇళ్లలో తనిఖీలు చేశారు. చంద్రశేఖర్ బళ్లారిలో పనిచేస్తుండగా ఇల్లు హోసపేటెలో ఉంది. బీదర్‌లో పశువైద్య యూనివర్శిటీ ఉద్యోగి సునీల్‌కుమార్ నివాసం, వాణిజ్య కాంప్లెక్స్‌లో సోదాలు జరుగుతున్నాయి. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీవై. విజయేంద్ర భార్య సోదరుడు, యాదగిరి డీహెచ్ఓ డాక్టర్ ప్రభులింగ మానకర్ కలబురిగి నివాసంలోను సోదాలు చేపట్టారు. అందరి ఆస్తుల వివరాలు, బ్యాంకు ఖాతాలు, లాకర్లు తదితరాల తనిఖీ కొనసాగుతోంది. బెంగళూరులో ముగ్గురు.. బెంగళూరులో మూడుచోట్ల... బెస్కాం జాగృతి దళం అధికారి టీఎన్.సుధాకర్‌రెడ్డి, సహకార సంఘం సీఈఓ హెచ్ఎస్.కృష్ణమూర్తి, జయనగర బెస్కాం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హెచ్డీ. చెన్నకేశవల ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేశారు. చెన్నకేశవకు చెందిన అమృతహళ్లి ఇంటిలో రూ.6 లక్షలు నగదు, 3 కిలోల బంగారు నగలు, 28 కేజీల వెండి, రూ.25 లక్షల విలువచేసే వజ్రాభరణాలు, రూ.5 లక్షలు విలువైన 7 పురాతన వస్తువులు లభించాయి. వీటన్నింటి ప్రాథమిక విలువ రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా. ఈయన కరెంటు కనెక్షన్ ఇవ్వాలంటే లక్షలాది రూపాయల ముడుపులు తీసుకుంటారని ఆరోపణలున్నాయి. ఇటీవల ఫిర్యాదులు కూడా అందాయి. మొదటి భార్య భవనం చిక్కబళ్లాపురం: రామనగర జిల్లాలో వ్యవసాయశాఖ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేసే మునేగౌడపై లోకాయుక్త దాడులు చేసింది. ఇక్కడ నంది క్రాస్‌లో ఉన్న మొదటి భార్య ఉండే విలాసవంతమైన బంగ్లాలో సోదాలు చేశారు. పాలిహౌస్‌ల కొనుగోలులో భారీగా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. రామనగర, బెంగళూరు, సొంతూరు శిడ్లఘట్ట, చిక్కబళ్లాపురంలోనూ బంధువుల ఇళ్లలో సోదాలు జరిపారు. బంగారం, నగదు, ఆస్తిపత్రాలు లభించాయి. చిక్కబళ్లాపురం లోకాయుక్త ఎస్పీ రామ్, డీఎస్పీ వీరేంద్రకుమార్, ఇన్స్పెక్టర్లు శివప్రసాద్, మోహన్ పాల్గొన్నారు. -
కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఊరట
CMDRF Scam Pinarayi Vijayan: ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధి (సీఎండీఆర్ఎఫ్) దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణల కేసులో కేరళ సీఎం పినరయి విజయన్ ప్రభుత్వానికి ఊరట లభించింది. గతంలో ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలను సమర్థిస్తూ లోకాయుక్త సోమవారం తీర్పు చెప్పింది. ఈ సందర్భంగా పినరయి విజయన్‌తో పాటు 18 మంది మాజీ కేబినెట్ మంత్రులపై వేసిన పిటిషన్‌ను లోకాయుక్త తిరస్కరించింది. బంధుప్రీతి లేదా అవినీతి జరిగిందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని లోకాయుక్త జస్టిస్ సిరియాక్ జోసెఫ్, అప్ లోకాయుక్తలు జస్టిస్ హరూన్ అల్ రషీద్, జస్టిస్ బాబు మాథ్యూ పి జోసెఫ్‌లతో కూడిన లోకాయుక్త బెంచ్ పేర్కొంది. సీఎండీఆర్‌ఎఫ్‌లోని నిధులను దుర్వినియోగం చేశారంటూ 2018లో సీఎంతో పాలు పలువురు మంత్రులపై కేసు నమోదైంది. నిబంధనలకు విరుద్ధంగా ఎన్సీపీ మాజీ చీఫ్ ఉజ్వూర్ విజయన్ కుటుంబానికి రూ.25 లక్షలు, దివంగత ఎమ్మెల్యే రామచంద్రన్ నాయర్ కుటుంబానికి రూ.9 లక్షలు, ప్రమాదంలో మరణించిన పోలీసు అధికారి కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందించారని ఆరోపిస్తూ అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు ఆర్ఎస్ శశికుమార్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సిరియాక్ జోసెఫ్, జస్టిస్ హరున్ ఉల్ రషీద్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ వ్యాజ్యాన్ని విచారించింది. అయితే సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో ధర్మాసనం ఏకగ్రీవ నిర్ణయానికి రాలేకపోయింది. దీంతో మార్చి 2023లో, ఈ కేసును పెద్ద బెంచ్‌కు రిఫర్ చేసింది. ఇది ఊహించిందే, హైకోర్టుకెళతా ఇది ఇలా ఉంటే తాజా నిర్ణయాన్ని కేరళ హైకోర్టులో సవాల్ చేస్తానని పిటిషన్ ఆర్ఎస్ శశికుమార్ తెలిపారు. తీర్పు ఊహించినదేనని, దీనికి వ్యతిరేకంగా అప్పీల్ చేస్తానని చెప్పారు. లోకాయుక్తలో గతంలో రెండు వేలుండే కేసులు ఇపుడు 200కి తగ్గాయని పేర్కొన్నారు. ఈ సంస్థపై ప్రజలకు నమ్మకం పోయిందనడానికి ఇదే నిదర్శనమని ఆయన ఆరోపించారు -
స్టే ఉండగా.. పీటీ వారెంట్ ఎలా జారీ చేస్తారు?
సాక్షి, చైన్నె: పరప్పన అగ్రహార జైలులో లగ్జరీ జీవితం గడపిన వ్యవహారంలో దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ, ఈమె వదినమ్మ ఇలవరసిపై పీటీ వారెంట్ జారీ అయ్యింది. బెంగళూరు లోకాయుక్త మంగళవారం ఈ ఉత్తర్వులు ఇచ్చారు. అదే సమయంలో స్టే ఉండగా ఎలా..? వారెంట్‌జారీ చేస్తారని చిన్నమ్మ తరపు న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. వివరాలు.. అక్రమాస్తుల కేసులో చిన్నమ్మ శశికళ, ఆమె వదినమ్మ ఇలవరసి బెంగళూరు పరప్పన అగ్రహార చెరలో జైలు శిక్షను అనుభవించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో వీరు ఆ జైల్లో లగ్జరీ జీవితాన్ని గడిపినట్టు వెలుగులోకి వచ్చింది. జైలు నుంచి తరచూ బయటకు షాపింగ్‌కు వెళ్లడం వంటి దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీ ద్వారా వెలుగులోకి వచ్చాయి. జైళ్ల శాఖలో పనిచేస్తున్న అధికారులు అవినీతికి మరిగి, లంచం పుచ్చుకుని చిన్నమ్మ, వదినమ్మకు లగ్జరీ జీవితం గడిపే అవకాశం కల్పించినట్లు విచారణలో తేలింది. ఈ వ్యవహారంపై నియమించిన కమిటీ ఇచ్చిన సిఫార్సు మేరకు బెంగళూరు ఏసీబీ అధికారులు శశికళ, ఇలవరసిని కూడా టార్గెట్ చేశారు. విచారణకు హాజరుకాకపోవడంతో.. ఈకేసులో తొలి నిందితుడిగా అక్కడి జైళ్ల శాఖ పర్యవేక్షణాధికారి కృష్ణకుమార్, పరప్పన అగ్రహార జైలు అధికారులు అనిత, సురేష్ నాగరాజ్‌కు సంబంధించిన కేసు లోకాయుక్త కోర్టులో విచారణకు వచ్చింది. కేసు తొలి నిందితులిగా జైలు పర్యవేక్షణాధికారి కృష్ణకుమార్, పరస్పన అగ్రహార అధికారులు అనిత, సురేష్ నాగరాజ్‌ను రెండు, మూడు, నాలుగో నిందితులుగా పేర్కొన్నారు. అలాగే, ఐదు, ఆరో నిందితులుగా శశికళ, ఇలవరసి ఉన్నారు. ఈ కేసు బెంగళూరు లోకాయుక్తలో విచారణలో ఉంది. ఈ విచారణకు నేరుగా హాజరు కావడం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ గతంలో కోర్టును ఆశ్రయించారు. మినహాయింపు పొందారు. అయితే, అవసరమైనప్పుడు విచారణకు హాజరు కావాలని కోర్టు ఇది వరకు సూంచింది. ఆ మేరకు పలుమార్లు విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ అయ్యాయి. అయితే, విచారణకు ఈ ఇద్దరు వెళ్లలేదు. దీంతో లోకాయక్త కోర్టు కన్నెర్ర చేసింది. ఈ ఇద్దరికీ పిటీ వారెంట్ జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ అక్టోబరు 6వ తేదీకి వాయిదా పడింది. కాగా చిన్నమ్మను అరెస్టు చేస్తారేమో అన్న బెంగ ఆమె మద్దతు దారులలో నెలకొంది. అయితే కోర్టు విచారణకు హాజరు కావడంలో కోర్టు మినహాయింపు ఉన్నా.. ఎలా వారెంట్ జారీ చేస్తారని, దీనిపై న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని చిన్నమ్మ న్యాయవాదులు వెల్లడించారు. -
ఆమె నెల జీతం 30వేలు.. 7 లగ్జరీ కార్లు, 30 లక్షల టీవీ ఇంకా..
భోపాల్: హేమా మీనా.. ఈమె ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగి. నెలకు జీతం రూ. 30వేలు. కానీ, మీనా ఆస్తులు చిట్టా చూసి అధికారులు షాకయ్యారు. 7 లగ్జరీ కార్లు, రూ.30 లక్షల విలువ చేసే 98 ఇంచెస్ అత్యాధునిక టీవీ, విలాసవంతమైన భవనాన్ని అధికారులు గుర్తించారు. దీంతో, రంగంలోకి దిగిన అధికారులు సోదాలు నిర్వహించగా ఆమె ఆస్తుల వివరాలు చూసి నివ్వెరపోయారు. ఈ నేపథ్యంలో హేమపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్లో కాంట్రాక్టు ఇన్‌ఛార్జి అసిస్టెంట్ ఇంజినీర్‌గా హేమా మీనా పనిచేస్తోంది. కాగా, ఆమె భారీగా ఆస్తులు సంపాదించినట్టు గుర్తించిన లోకాయుక్త అధికారులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో భోపాల్‌లోని హేమా మీనా నివాసంలో లోకాయుక్త అధికారులు గురువారం ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు. ఇప్పటి వరకు రూ.7 కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయి. అంతేకాకుండా సుమారు 20 వాహనాలు హేమా మీనా కొనుగోలు చేసినట్లు అధికారులు తమ విచారణలో గుర్తించారు. అందులో ట్రాక్టర్లు, వరి నాట్లు యంత్రాలు, హార్వెస్టర్లు, అనేక వ్యవసాయ పరికరాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. కాంట్రాక్ట్ ఉద్యోగి అయిన హేమా మీనా నెల జీతం కేవలం రూ.30 వేలు మాత్రమే. ఆమె జీతంతో పోలిస్తే ఆస్తుల విలువ 232 శాతం ఎక్కువ. సోదాల సందర్బంగా 7 లగ్జరీ కార్లు, విలువైన గిర్ జాతికి చెందిన రెండు డజన్ల పశువులతోపాటు రూ.30 లక్షల విలువ చేసే 98 ఇంచెస్ అత్యాధునిక టీవీని అధికారులు గుర్తించారు. హేమా తన తండ్రి పేరుమీద 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్థలం కొనుగోలు చేసి అందులో రూ.కోటి వెచ్చించి విలాసవంతమైన ఇంటిని నిర్మించినట్లు గుర్తించారు. వీటితోపాటు ఇతర ప్రాంతాల్లో స్థలాలు కూడా కొనుగోలు చేసినట్లు తేల్చారు. ఆమె నివాస ప్రాంగణంలో 100 కుక్కలు, పూర్తి వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్, మొబైల్ జామర్లు, ఇతర విలువైన వస్తువులు కూడా అధికారుల సోదాల్లో బయటపడ్డాయి. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన పలు ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. మరిన్ని ఆస్తుల వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక, ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఇది కూడా చదవండి: బెంగాల్, తమిళనాడు సర్కార్‌కు బిగ్ షాక్ -
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్షప్ప అరెస్ట్
తుమకూరు: కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్(కేఎస్డీఎల్)కు సంబంధించిన లంచం కేసులో బీజేపీ ఎమ్మెల్యే ఎం.విరూపాక్షప్పను ఎట్టకేలకు లోకాయుక్త పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అంతకుముందు, ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది. తుమకూరు నుంచి బెంగళూరు వస్తుండగా మార్గమధ్యంలోనే విరూపాక్షను అదుపులోకి తీసుకున్నట్లు లోకాయుక్త ఐజీ తెలిపారు. విరూపాక్ష కుమారుడు ప్రశాంత్ మార్చి 2న ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.40 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. విరూపాక్ష నివాసంపై జరిపిన దాడుల్లో మరో రూ.8.23 కోట్లు దొరికాయి. అనంతరం కోర్టు ప్రభుత్వ రంగ కేఎస్‌డీఎల్‌కు చైర్మన్‌గా కూడా ఉన్న విరూపాక్షకు బెయిలిచ్చింది. అయితే, ప్రధాన ముద్దాయిగా ఉన్న విరూపాక్షప్ప కేసు విచారణలో సహకరించడం లేదంటూ లోకాయుక్త పిటిషన్ వేయగా కోర్టు బెయిల్‌ను రద్దు చేసింది. అసెంబ్లీ ఎన్నికల వేళ చోటుచేసుకున్న ఈ పరిణామం బీజేపీకి ఇబ్బందికరంగా మారింది. -
బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్ కోసం ఏడు బృందాలు
బెంగళూరు: కన్నడనాట రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ముడుపుల వ్యవహారం.. అధికార బీజేపీకి తలనొప్పిగా మారింది. ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే మాడాళ్విరూపాక్షప్ప తనయుడు ప్రశాంత్ ఈ కేసులో అరెస్ట్ కాగా, ఈ స్కాంకు సంబంధించి ప్రధాన సూత్రధారి పరారీలో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షప్ప కోసం గాలింపు చేపట్టారు పోలీసులు. కర్ణాటక లోకాయుక్త డిప్యూటీ సూపరిడెంట్స్ నేతృత్వంలో ఏడు బృందాలను ఏర్పాటు చేసింది. ముడుపుల వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న చన్నగిరి ఎమ్మెల్యే విరూపాక్షప్ప కోసం గాలింపు చేపట్టాలని, అరెస్ట్ చేయాలని ఆదేశించింది. ఇప్పటికే విరూపాక్షప్ప కోసం ఆయా బృందాలు రాష్ట్రాన్ని జల్లెడ పట్టడం ప్రారంభించాయి. ప్రధానంగా బెంగళూరు, దావణగెరెలో గాలింపు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో.. పరారీలో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షప్ప కు లోకాయుక్త అధికారులు సీఆర్పీసి– 41 ఏ కింద నోటీస్ జారీచేశారు. సోమవారం తమ ఎదుట విచారణకు హాజరుకావాలని లేఖలో పేర్కొన్నారు. బెంగళూరు, దావణగెరెలోని విరూపాక్షప్ప నివాసాలతో పాటు అధికారిక నివాసం, చన్నగిరిలోని కార్యాలయంతో పాటు ఆయనకు సంబంధించిన కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్(కేఎస్డీఎల్) కార్యాలయం వద్ద కూడా నోటీసులు అంటించారు. విరూపాక్షప్ప తనయుడు ప్రశాంత్.. సబ్బులు, డిటర్జెంట్ల తయారీకి అవసరమైన ముడి సరుకుల డీల్‌ను క్లియర్ చేయడానికి రూ. 40 లక్షల లంచం రెడ్‌హ్యాండెడ్‌గా దొరకడం, ఆ మరుసటిరోజు జరిగిన సోదాల్లో ఇంట్లో రూ. 6 కోట్లకు మించిన నగదు లభ్యం కావడం, అలాగే ప్రైవేట్ కార్యాయలంలో మరో రూ. 2 కోట్లు లభించడం.. మొత్తంగా ముడుపుల వ్యవహారం బయటపడింది. ఆ వెంటనే కేఎస్డీఎల్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన విరూపాక్షప్ప.. అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ముడుపుల స్కాంలో బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్షప్పనే ప్రధాన సూత్రధారిగా నిర్ధారించుకున్న అధికారులు.. ఆయన కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు తనయుడు ప్రశాంత్‌ను, మరో నలుగురు జ్యూడిషియల్ కస్టడీ కింద జైలుకు తరలించారు. సరిగ్గా ఎన్నికల ముందు జరిగిన ఈ పరిణామం అధికార బీజేపీని ఇరకాటంలో పడేసినట్లయ్యింది. కాంగ్రెస్ ఈ పరిణామంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ.. రాష్ట్రవ్యాప్త నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చేపట్టింది. అయితే కర్ణాటక ప్రభుత్వం మాత్రం పార్టీనే(బీజేపీ) ఈ వ్యవహారం చూసుకుంటుందని చెబుతోంది. -
బీజేపీ ఎమ్మెల్యే ఇంట్లో రూ.6 కోట్లు సీజ్.. కీలక పదవికి రాజీనామా
బెంగళూరు: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మదల్ విరూపాక్షప్ప కీలక పదవికి రాజీనామా చేశారు. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్(కేఎస్డీఎల్) ఛైర్మన్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వానికి చెందిన ఈ సంస్థ మైసూర్ శాండిల్ సబ్బులతో పాటు ఇతర ఉత్పత్తులను తయారు చేస్తుంది. విరూపాక్షప్ప దేవనగెరె జిల్లా చిన్నగిరి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన కుమారుడు ప్రశాంత్ మదల్ బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి బోర్డులో చీఫ్ అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. అయితే తండ్రి తరఫున ఇతడు లంచాలు తీసుకుంటాని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే కేఎస్డీఎల్ కార్యాలయంలో రూ.40లక్షలు తీసుకుంటున్న ప్రశాంత్‌ను లోకాయుక్త అధికారులు గురువారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కార్యాలయంలోనే రూ.1.7కోట్ల నగదును గుర్తించారు. అనంతరం విరూపాక్షప్ప ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి మొత్తం రూ.6కోట్లు సీజ్ చేశారు. అవినీతి డబ్బుతో కుమారుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటంతో విరూపాక్షప్ప కేఎస్డీఎల్ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. అయితే లోకాయుక్తకు పట్టుబడ్డ డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన కుటుంబంపై కుట్ర జరగుతోందని ఆయన ఆరోపించారు. కాగా.. ప్రశాంత్ అవినీతికి పాల్పడుతూ లంచాలు తీసుకుంటున్నాడని లోకాయుక్తకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో వారు గురువారం చాక్యచక్యంగా అతడ్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కాంగ్రెస్ విమర్శలు.. అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడు అవినీతికి పాల్పడుతున్నట్ల రుజువుకావడంతో ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శలకు ఎక్కుపెట్టింది. బీజేపీ భ్రష్ట జనతా పార్టీ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ధ్వజమెత్తారు. చివరకు మైసూర్ శాండిల్ సబ్బు అందమైన సువాసనను కూడా 40శాతం కమిషన్ సర్కారు కలుషితం చేసిందని మండిపడ్డారు. చదవండి: కేంద్రంపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు.. పెగాసెస్‌పై కామెంట్స్ ఇవే.. -
లోకాయుక్తకు పట్టుబడిన అధికారిణి
సాక్షి, కర్ణాటక: పెట్రోల్ బంక్ రెన్యూవల్‌కు అవసరమైన ధ్రువీకరణపత్రం మంజూరుకు లంచం తీసుకుంటూ తూనికలు, కొలతల అధికారిణి ఎస్.మాలాకిరణ్ లోకాయుక్తకు చిక్కారు. వివరాలు... చిక్కబళ్లాపురం జిల్లా శిడ్లఘట్ట రోడ్డులో బసవేశ్వర పెట్రోల్ బంక్ ఉంది. బంక్ రెన్యూవల్‌కు అవసరమైన పత్రం కోసం యజమాని తూనికలు, కొలతల అధికారి కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు అధికారిని మాలకిరణ్ రూ.8వేలు డిమాండ్ చేశారు. ఏపీఎంసీ ఆవరణలోని కార్యాలయంలో నగదు తీసుకుంటుండగా లోకాయుక్త అధికారులు దాడి చేశారు. నగదను స్వాధీనం చేసుకొని మాలకిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరు పరచగా 14 రోజులపాటు రిమాండ్‌కు ఆదేశించారు. మరో వైపు బెంగళూరులోని మాలకిరణ్ నివాసంలో సోదాలు చేస్తున్నారు. -
యడియూరప్పకు షాక్.. కేసు నమోదు
బెంగళూరు: బీజేపీ అగ్రనేత, కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పకు షాక్ తగిలింది. ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులపై లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు, బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్రలపై లోకాయుక్త కేసు నమోదు చేసింది. 2019లో పనిచేసిన బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్(బీడీఏ)పైనా ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం కేసు నమోదైంది. బీడీఏ కాంట్రాక్టులు కట్టబెట్టినందుకు వీరంతా లంచాలు తీసుకున్నారంటూ సామాజిక కార్యకర్త టీజే అబ్రహాం చేసిన ఫిర్యాదు మేరకు అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కింది కోర్టు అబ్రహాం వేసిన పిటిషన్‌ను తిరస్కరించినప్పటికీ.. హైకోర్టు మాత్రం స్వీకరించింది. పిటిషన్ ను విచారించిన హైకోర్టు యడ్డీ, ఆయన కుమారుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో లోకాయుక్త కేసు నమోదు చేసింది. మరోవైపు, తమపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని యడియూరప్ప వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: ఆప్‌లో చేరిక కన్నడ సినీ నటి -
ప్రాంతానికో ఉప లోకాయుక్త
బి.కొత్తకోట: రాష్ట్ర లోకాయుక్తలో 5 వేలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఏపీ లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి చెప్పారు. వీటిని పరిష్కరించి ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు వీలుగా ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు మూడు ఉప లోకాయుక్తలను నియమించాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశామని తెలిపారు. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్ వచ్చిన ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో మూడేళ్లు లోకాయుక్త నియామకం జరగలేదని, దీనితో కేసుల సంఖ్య పెరిగిందని చెప్పారు. పైసా ఖర్చు లేకుండా, న్యాయవాది అవసరం లేకుండా ఫిర్యాదులకు న్యాయం చేస్తామని.. దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బోగస్ ఫిర్యాదులకు ఆధార్‌తో చెక్.. బోగస్ ఫిర్యాదుల వల్ల తమ విలువైన సమయం వృథా అవుతోందని, వీటిని నివారించేందుకు ఫిర్యాదుదారు ఫొటో, ఆధార్ నంబర్ జత చేసేలా నిబంధన విధించాలని ఆలోచిస్తున్నామని జస్టిస్ లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో ప్రతిభ చూపిన వారికి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకం రూ.50 లక్షలకు మించకూడదనే నిబంధన ఉందని, ఒకరికి ఎక్కువ, మరొకరికి తక్కువ ఇచ్చే పద్ధతి పాటించకుండా అందరినీ సమంగా చూసే విధంగా నిబంధనలు పాటించాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చామని తెలిపారు. పంచాయతీల పరిధిలోని ప్రభుత్వ భూములు, ఆస్తుల రక్షణ బాధ్యత రెవెన్యూ శాఖకు ఉందని, దీనిపై 2011లో జారీ అయిన జీవో అమలుకావడం లేదని పేర్కొన్నారు. దీనిపై జిల్లా, డివిజన్ స్థాయి అధికారిక కమిటీలు సమావేశాలు, సమీక్షలు జరిపి ఆస్తులను కాపాడాలని కలెక్టర్లకు లేఖలు రాశామన్నారు. హార్సిలీహిల్స్ సహకార గృహ నిర్మాణ సంఘానికి ప్రభుత్వం విక్రయించిన భూమి ఏ స్థితిలో ఉంది, భూమి కేటాయింపు, ఆక్రమణలపై సమగ్ర విచారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టు భూ పరిహారం, నిర్వాసితులకు అందాల్సిన ఆర్థిక సహాయంపై బోగస్ లబ్ధిదారులు పుట్టుకొచ్చినట్టు ఫిర్యాదులు అందాయని, దీనిపై పోలవరంలో క్యాంపు ఏర్పాటు చేసి విచారణ చేపడతామని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ ఆలయాలకు చెందిన భూములు అన్యాక్రాంతమైనట్టు ఆ శాఖ కమిషనర్ నివేదిక ఇచ్చారని, దీనిపై చర్యలకు ఆదేశిస్తామని చెప్పారు. లోకాయుక్తకు చేసే ఫిర్యాదుల విషయంలో దళారులను అశ్రయించవద్దని కోరారు. -
ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త ఇప్పుడు కర్నూలులోనే...
ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త కార్యాలయాన్ని తెలంగాణ నుంచి కర్నూలు నగరానికి మార్చారు. ఏడాది క్రితం ఏపీ మానవహక్కుల కమిషన్, లోకాయుక్తలను ఏర్పాటు చేశారు. మానవహక్కుల కమిషన్ ప్రారంభం నుంచీ కర్నూలులో కార్యకలాపాలు చేపట్టింది. అయితే లోకాయుక్తను మాత్రం భవనం, ఇతర సౌకర్యాల కొరత వల్ల... ఏడాదిపాటు తెలంగాణ లోకాయుక్త కార్యాలయంలోనే కొనసాగించి... చివరికి మార్చి 18న కర్నూలుకు మార్చారు. లోకాయుక్త చట్టం ప్రకారం... ప్రభుత్వంలోని కిందిస్థాయి అటెండర్ నుంచి అత్యున్నత స్థాయి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకూ అన్ని స్థాయిల్లో జరిగే అవినీతిని ప్రశ్నిస్తూ పిటిషన్ వేయడానికి అవకాశం ఉంది. ఇలాగే... గ్రామస్థాయి ఎంపీటీసీలు, సర్పంచ్ల నుంచి ఇతర మండలస్థాయి ప్రజాప్రతినిధులు, జిల్లాస్థాయి ప్రజాప్రతి నిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అక్రమాల వరకూ ఆధారాలతో లోకాయుక్తలో పిటిషన్లు వేయ వచ్చు. అయితే ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తూ పిటిషన్లు వేయడానికి లోకాయుక్త చట్టం ఒప్పుకోదు. ఇది రాష్ట్ర స్థాయి చట్టం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1985–1986ల మధ్య మొదటి సారి లోకాయుక్తను ఏర్పాటు చేశారు. ఆనాటి లోకాయుక్త చట్టమే నేటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. లోకాయుక్త కార్యాలయంలో లభించే సంబంధిత ఫార్మాట్లో వివరాలు భర్తీ చేసి, ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు జతచేసి, విజ్ఞాపన పత్రాన్ని కూడా చేర్చి కేవలం రూ. 150 ఫీజు చెల్లించి అప్లికేషన్ సమర్పించాలి. ఈ అప్లికేషన్‌ను ఒక అడ్వకేట్‌తో సర్టిఫై చేయించాలి. లోకాయుక్తకు ఛైర్మన్‌గా పదవీ విరమణ పొందిన హైకోర్ట్ జడ్జీలను నియమిస్తున్నారు. రిజిస్ట్రార్లుగా జిల్లా జడ్జీలు పనిచేస్తు న్నారు. సివిల్, క్రిమినల్ కోర్టులకున్న అధికారాలన్నీ లోకాయుక్తకు ఉన్నాయి. లోకాయుక్తకు పిటీషన్లు పోస్టు ద్వారా కూడా పంపవచ్చు. ప్రస్తుత లోకాయుక్త చిరునామా: ఏపీ లోకాయుక్త, 96/3/721241, సంతోష్ నగర్, మెయిన్‌రోడ్, మహేంద్ర షోరూమ్ పక్కన, కర్నూలు–518006. – కె. ధనలక్ష్మి, సెక్రెటరీ, లీగల్ సర్వీసెస్ రైట్స్ ప్రొటెక్షన్ -
బిగ్ బీ ప్రతీక్ష కాంపౌండ్ వాల్ని ఎందుకు కూల్చరు....?
జుహూలోని అమితాబ్ బచ్చన్‌కు చెందిన ప్రతీక్షా బంగ్లాలో కొంత భాగాన్ని కూల్చివేయడంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) వైఫల్యంపై కాంగ్రెస్ మహారాష్ట్ర లోకాయుక్తకు ఫిర్యాదు చేసింది. అయితే జులైలో ఈ భాగాన్ని గుర్తించాలని రోడ్డు సర్వే అధికారులను కోరినప్పటికీ బీఎంసీ చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు లోకాయుక్త జస్టిస్ వీఎం కనడే రోడ్డు విస్తరణ కోసం భూమిని సేకరించేందుకు తీసుకున్న చర్యల వివరాలతో కూడిన నివేదికను నాలుగు వారాల్లోగా సమర్పించాలని బీఎంసీని ఆదేశించారు. (చదవండి: టిక్‌టాక్ పిచ్చి.. డాక్టర్ వికృత చేష్టలు.. ఆపరేషన్ మధ్యలోనే వదిలేసి..) అయితే ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) చట్టంలోని సెక్షన్ 299 కింద తాము బచ్చన్‌కు నోటీసులు పంపించాం అని విచారణ సందర్భంగా బీఎంసీ పేర్కొంది. కాకపోతే అతని నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతోనే ఆలస్యమైందని వివరణ ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ కార్పొరేటర్ తులిప్ మిరాండా ఇది చాలా అన్యాయం, నిబంధనలకు విరుద్ధం అని విరుచుకుపడ్డారు. అంతేకాదు తాను తంలో బీఎంసీకి సంబంధించిన కే-వెస్ట్ వార్డుతో సమస్యను లేవనెత్తడమే కాక రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలని కోరిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఇప్పటి వరకు అన్ని ఇతర ఆస్తులు కొనుగోలు చేశారు. కానీ బచ్చన్ ఆస్తి కొనుగోలులో ఉద్దేశపూర్వక జాప్యం కనిపిస్తోందంటూ మిరాండా విమర్శించారు. అయితే గతంలో 2017లో బీఎంసీ రోడ్డు విస్తరణ పనుల గురించి బచ్చన్ తోపాటు అదే ప్రాంతంలోనే ఉంటున్న మరో ఏడుగురు తెలియజేసిన సంగతి తెలిసిందే.ఈ మేరకు ప్రతీక్ష నుండి ఇస్కాన్ టెంపుల్ వరకు వెళ్లే మార్గంలోని ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించేందుకు పౌరసరఫరాల సంస్థ ఈ నిర్మాణాల కాంపౌండ్ భాగాన్ని తీసుకుని సంత్ జ్ఞానేశ్వర్ రోడ్డును 40 అడుగుల నుంచి 60 అడుగులకు విస్తరిస్తామని అధికారులు తెలిపారు. అయితే 2019లో బీఎంసీ బచ్చన్ బంగ్లాకు ఆనుకుని ఉన్న భవనాల సరిహద్దు గోడను కూల్చివేసింది. అయితే ప్రతీక్ష కాంపౌండ్ మాత్రం అటకెక్కింది. (చదవండి: చదువుల తల్లికి కోర్టు అండ.. అడ్మిషన్ ఫీజు అందించిన వైనం) -
నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు: ఏపీ హైకోర్టు
అమరావతి: కర్నూలులో మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త ఏర్పాటుపై దాఖలైన పిటిషన్లపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. క్యాబినెట్ మంత్రులతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని.. పార్టీలుగా చేసి అందరికీ నోటీసులు జారీ చేయాలని పిటిషనర్ కోరారు. కాగా పిటిషనర్ వాదనను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. చదవండి: కూన రవిపై ప్రివిలేజ్ కమిటీ ఆగ్రహం క్యాబినెట్ మంత్రులకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు తేల్చి చెప్పింది. మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త ఏర్పాటుపై దాఖలైన పిటిషన్లు అన్ని కలిపి వింటామన్న హైకోర్టు.. కోర్టు ఇచ్చే తుది తీర్పునకు అనుగుణంగానే కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపింది. కాగా తదుపరి విచారణ 5 వారాలకు వాయిదా వేసింది. చదవండి: ఏపీలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ -
న్యాయ రాజధానిలో ‘లోకాయుక్త’ ప్రారంభం
కర్నూలు (సెంట్రల్): లోకాయుక్త కార్యాలయాన్ని శనివారం కర్నూలులో ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలోని మూడో గదిలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని లోకాయుక్త జస్టిస్ లక్ష్మణరెడ్డి ప్రారంభించి.. తన చాంబర్లో ఆశీనులయ్యారు. ఈ సందర్భంగా లోకాయుక్త జస్టిస్ లక్ష్మణరెడ్డికి కలెక్టర్ పి.కోటేశ్వరరావు, డీఐజీ వెంకట్రామిరెడ్డి, ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి, జేసీలు ఎస్.రామ్సుందర్రెడ్డి, ఎంకేవీ శ్రీనివాసులు, డీఆర్వో బి.పుల్లయ్య తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జస్టిస్ లక్ష్మణరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాయలసీమ ప్రజలు లోకాయుక్త గురించి అవగాహన పెంచుకోవాల్సిన అవసరముందన్నారు. చదవండి: Andhra Pradesh: పేద విద్యార్థులకు... టాప్ వర్సిటీల్లో సీట్లు ప్రజలు తమకు అన్యాయం జరిగినప్పుడు పోస్టు, మెయిల్ ద్వారా గానీ, లేదంటే వాట్సాప్, ఫోన్ ద్వారా తమ సమస్యను చెబితే చాలన్నారు. వాటిని విచారించి న్యాయం చేస్తామని తెలిపారు. గతంలో హైదరాబాద్‌లో లోకాయుక్త కార్యాలయముండేదని గుర్తు చేశారు. ఆ సమయంలో ఏపీలోని కోస్తాంధ్ర నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. అక్కడి ప్రజలు తమకు చిన్న సమస్య వచ్చినా కూడా లోకాయుక్తను ఆశ్రయించేవారన్నారు. రాయలసీమ ప్రాంత ప్రజలకు దీని గురించి సరైన అవగాహన లేకపోవడంతో.. ఫిర్యాదులు పెద్దగా వచ్చేవి కాదన్నారు. రాయలసీమ ప్రజలు కూడా లోకాయుక్త గురించి తెలుసుకొని న్యాయం పొందాలని కోరారు. చదవండి: పంటలకు ‘ధ్రువీకరణ’ ధీమా మొదటి రోజే ఫిర్యాదు.. కర్నూలులో కార్యాలయం ప్రారంభమైన మొదటి రోజే లోకాయుక్తకు ఒక ఫిర్యాదు అందింది. కోడుమూరు మండలం పులకుర్తికి చెందిన వరలక్ష్మమ్మ అనే వృద్ధురాలి నుంచి జస్టిస్ లక్ష్మణరెడ్డి ఫిర్యాదును నేరుగా స్వీకరించారు. తమ గ్రామంలో దేవుడి మాన్యం ఆక్రమణలపై ఆమె ఫిర్యాదు చేసింది. కార్యక్రమంలో లోకాయుక్త రిజిస్ట్రార్ విజయలక్ష్మి, సెక్రటరీ అమరేందర్‌రెడ్డి, డిప్యూటీ రిజిస్ట్రార్ పోలయ్య, ఆర్డీవో హరిప్రసాదు, కల్లూరు తహసీల్దార్ రమేష్‌బాబు, దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషునాయుడు పాల్గొన్నారు. -
నిమ్స్ ఆసుపత్రికి లోకాయుక్త నోటీసులు
లక్డీకాపూల్: నిమ్స్ ఆస్పత్రికి తెలంగాణ లోకాయుక్త నోటీసులు జారీ చేసింది. వార్షిక ఆదాయ వ్యయాలపై లెక్కలు సరిగా లేవని, ఆడిటింగ్‌కు సహకరించడం లేదని ఆడిట్ శాఖ ఈమేరకు లోకాయుక్తకు ఫిర్యాదు చేసింది. దీంతో నిమ్స్ లెక్కలపై డొల్లతనం బయటపడుతోంది. ♦ నిమ్స్‌లో ఆదాయం-వ్యయాలపై యాజ మాన్యం ఆజమాయిషీ ఉండడం లేదు. దీంతో చెల్లింపులు అడ్డగోలుగా జరుగుతున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ మేరకు ఒక అధికారికి ఒకే నెలలో రెండుమార్లు వేతనం జమ అయినట్లు తెలుస్తోంది. ♦ లాగే ఓ కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన రూ.5 లక్షలు రెండుమార్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ♦ మ్యాన్‌పవర్ ఏజెన్సీలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా సరిగా ఉండడం లేదు. ఇప్పటికి నాలుగుసారు ఈ–టెండర్లు పిలవడం..రద్దు చేయడం ద్వారా వృథా ఖర్చులు పెంచుతున్నారు. ♦ ఇక వార్షిక గణాంకాలను సక్రమంగా నిర్వహించని కారణంగా టీడీఎస్ రూపంలో నిమ్స్ ఖజానాకు గండి పడుతోంది. సరైన లెక్కలు చూపిస్తే.. ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్లో 10 శాతం నిధులు టీడీఎస్ రూపంలో మిగిలే అవకాశం ఉంది. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. ♦ ఆస్పత్రికి ఏటా రూ.250 నుంచి 280 కోట్ల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయిస్తుంది. ఈ నిధుల ఖర్చుపై నియంత్రణ లేదు. ఆజమాయిషీ..రోజు వారి లెక్కలు చూసే నాథుడే లేడు. ♦ క్రమం తప్పకుండా లెక్కలు చూపితే.. టీడీఎస్ చెల్లించాల్సిన అవసరం ఉండదని, వాస్తవానికి ఆస్పత్రులకు టీడీఎస్ నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందని, నిమ్స్‌లో మాత్రం టీడీఎస్ చెల్లిస్తున్నారని ఓ సీనియర్ అధికారి వాపోయారు. ♦ ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆడిట్ శాఖ లెక్కల విషయంలో నిమ్స్ అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా పరిగణించింది. ఆడిట్ నిర్వహణకు అధికారులు సహకరించడం లేదని ఆడిట్ అధికారిగా వ్యవహరిస్తున్న పి.కోటేశ్వరరావు యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు. దానిపై ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆయన (ఫిర్యాదు నెం.1771/14/బి1) లోకాయుక్తను ఆశ్రయించారు. దీంతో వచ్చే నెల 17వ తేదీ ఉదయం 11 గంటలకు జమాఖర్చుల నివేదికతో హాజరు కావాల్సిందిగా నిమ్స్ యాజమాన్యానికి లోకాయుక్త నోటీసు(నెం.1771/2014/బి1/లోక్/5571/2021) జారీ చేసింది. ఆడిట్ అధికారుల వైఫల్యమా? ఇదిలా ఉండగా ఆడిట్ అధికారుల వైఫల్యం కారణంగానే నిమ్స్ లెక్కల వ్యవహారం అస్తవ్యస్థంగా తయారైందని ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్ విభాగానికి చెందిన ఓ అధికారి ఆరోపించారు. ఆడిట్ చేసేందుకు ముందుకు రాకుండా నిమ్స్ లెక్కలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని, ఇది ఎంత వరకు న్యాయమని ఆ అధికారి నిలదీయడం గమనార్హం. -
లోకాయుక్త కార్యాలయాన్ని ఏపీకి తీసుకొస్తున్నాం
సాక్షి, అమరావతి: హైదరాబాద్‌లో ఉన్న లోకా యుక్త కార్యాలయాన్ని ఏపీకి తరలించేందుకు చర్యలు చేపట్టామని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హై కోర్టుకు నివేదించింది. ఈ విషయంలో పలు నిబం ధనలకు సవరణలు కూడా చేశామని అడ్వొకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరామ్ వివరించారు. పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతానని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్ర ధాన కార్యదర్శి, జీఏడీ ముఖ్య కార్యదర్శి, లోకా యుక్త రిజిస్ట్రార్లకు నోటీసులిచ్చింది. తదుపరి విచారణను ఆగస్టు 31కి వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలోనే పెట్టాలని లేదు.. ఏపీలోకాయుక్త కార్యాలయం హైదరాబాద్‌లో ఉండటంతో, అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేయడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటూ ఈ అంశాన్ని హైకోర్టు సుమోటో పిల్‌గా విచారణకు తీసుకుంది. దీనిని సీజే ధర్మాసనం మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. లోకాయుక్త కార్యాలయాన్నిఏపీకి తీసుకొస్తున్నామని వివరించారు. సీజే స్పందిస్తూ.. లోకాయుక్త కార్యాలయాన్ని విజయవాడలోనే పెట్టాలని ఏమీ లేదని వ్యాఖ్యానించారు. ధర్మాసనం విచారణను ఆగస్టు 31కి వాయిదా వేసింది. -
‘లోకాయుక్త’ను ఏపీకి తరలించాలి
సాక్షి, అమరావతి: హైదరాబాద్‌లో ఉన్న రాష్ట్ర లోకాయుక్త కార్యాలయాన్ని విజయవాడకు తరలించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. లోకాయుక్త కార్యాలయాన్ని విజయవాడ ఆర్ అండ్ బీ భవనంలో ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాది వై.సోమరాజు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీఏడీ ముఖ్యకార్యదర్శి, లోకాయుక్త రిజిస్ట్రార్ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ‘2019 మేలో లోకాయుక్త, ఉప లోకాయుక్త డిప్యూటీ రిజిస్ట్రార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఉద్యోగులు, పోస్టుల విభజన చేపట్టాలని కోరారు. విజయవాడ ఆర్ అండ్ బీ భవనంలో కార్యాలయాన్ని కేటాయించాలని కోరారు. ప్రభుత్వం ఈ అభ్యర్థనను ఆమోదించింది. ఆర్ అండ్ బీ భవనంలో గదులు కూడా కేటాయించింది. విజయవాడలో లోకాయుక్త, ఉప లోకాయుక్త కార్యాలయం నిర్మాణంలో ఉందని, ఇది పూర్తయ్యే వరకు లోకాయుక్త, ఉప లోకాయుక్త కార్యాలయం హైదరాబాద్ నుంచి పనిచేస్తుందంటూ ప్రభుత్వం 2019 సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చింది. అప్పటి నుంచి లోకాయుక్త హైదరాబాద్ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తోంది. లోకాయుక్త ముందు ఫిర్యాదులు దాఖలు చేయడానికి హైదరాబాద్ వెళ్లాల్సి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫిర్యాదుదారులే న్యాయవాది సాయం లేకుండా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. రాష్ట్ర విభజన తరువాత ప్రభుత్వ కార్యాలయాలన్నీ కృష్ణా, గుంటూరు జిల్లాలకు తరలి వచ్చాయి. హైకోర్టు కూడా అమరావతి నుంచి కార్యకలాపాలు నిర్వర్తిస్తోంది. లోకాయుక్త కార్యాలయం విజయవాడలో ఉంటే ఫిర్యాదుదారులకు, అధికారులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని హైదరాబాద్‌లో ఉన్న లోకాయుక్త కార్యాలయాన్ని విజయవాడకు తరలించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించండి.’అని సోమరాజు తన పిటిషన్లో కోర్టును కోరారు. -
కేరళ మంత్రి రాజీనామా
తిరువనంతపురం: లోకాయుక్త నుంచి నెపోటిజం, అధికార దుర్వినియోగం వంటి అభియోగాలను ఎదుర్కొన్న కేరళ ఉన్నత విద్యా మంత్రి కేటీ జలీల్ మంగళవారం రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి పంపించారు. అనంతరం అది గవర్నర్‌ను చేరగా, గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ దాన్ని ఆమోదించారని ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పింది. తన రక్తం తాగుతున్న కొందరు వ్యక్తులు ఇప్పుడు సంతోషంగా ఉండి ఉంటారంటూ జలీల్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. రెండేళ్ల పాటు మీడియా దాడికి గురయ్యాయనని పేర్కొన్నారు. చదవండి: బీజేపీ నేతలపై ఈసీ వేటు -
ఒడిశా అసెంబ్లీలో స్పీకర్ పైకి చెప్పులు
భువనేశ్వర్: ఒడిశా అసెంబ్లీ శనివారం రణరంగంగా మారింది. చర్చ జరపకుండా ఒడిశా లోకాయుక్త సవరణ బిల్లును సభ ఆమోదించడంపై బీజేపీ సభ్యులు మండిపడ్డారు. తమకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వని స్పీకర్ పాత్రోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోడియం వైపు చెప్పులు, కాగితం ఉండలు, మైక్రోఫోన్లను విసిరారు. దాంతో సభను స్పీకర్ వాయిదా వేశారు. ముగ్గురు బీజేపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు. సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని, తక్షణమే వారు సభను వీడి వెళ్లాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలను, షెడ్యూల్ కన్నా ఐదు రోజుల ముందే, నిరవధికంగా వాయిదా వేశారు. మధ్యాహ్న భోజన విరామానికి ముందు, ఎలాంటి చర్చ జరపకుండానే లోకాయుక్త సవరణ బిల్లును ఆమోదించడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. మరోవైపు, మైనింగ్ కార్యకలాపాల్లో అవినీతిపై చర్చ జరపాలన్న తమ డిమాండ్‌ను స్పీకర్ తోసిపుచ్చడంతో కాంగ్రెస్ సభ్యులు కూడా వారితో జత కలిశారు. బీజేపీ సభ్యులు మైక్రోఫోన్లను లాగి, తమ ముందున్న కాగితాలను ఉండలుగా చుట్టి స్పీకర్ పోడియం వైపు విసిరారు. చివరకు స్లిప్పర్లను కూడా విసిరారు. అవి స్పీకర్ పోడియం దగ్గరలో పడ్డాయి. గందరగోళం నెలకొని, సభ అదుపు తప్పిన పరిస్థితులో స్పీకర్ పాత్రో సభను వాయిదా వేశారు. లంచ్ అనంతరం తిరిగి సమావేశమైన తరువాత, అసెంబ్లీలో బీజేపీ ఉపనాయకుడు బీసీ సేథీ, పార్టీ విప్ మోహన్ మాఝీ, ఎమ్మెల్యే జేఎన్ మిశ్రాలను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అనంతరం, వారు అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నా జరిపారు. ఆర్థిక మంత్రి నిరంజన్ పూజారి కాగ్ నివేదికను సభలో ప్రవేశపెట్టిన అనంతరం, సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఒడిశా అసెంబ్లీలో బీజేపీకి 22 మంది ఎమ్మెల్యేలున్నారు. ‘మా వాళ్లు తప్పేం చేయలేదు. మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో అలా చేశారు’ అని బీజేపీ నేత పీకే నాయక్ పేర్కొన్నారు. -
నిమ్మగడ్డ ఇంటి అద్దెపై లోకాయుక్తలో ఫిర్యాదు
సాక్షి, అమరావతి: ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ హైదరాబాద్‌లో నివాసముంటూ ప్రతి నెలా ఇంటి అద్దె పొందుతున్న అంశంపై లోకాయుక్తలోనూ ఫిర్యాదు చేసినట్టు యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ కాంపెయిన్ ప్రతినిధి జంపాన శ్రీనివాసగౌడ్ సోమవారం తెలిపారు. గతంలో ఇదే అంశంపై ఫోరం ప్రతినిధులు గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. (చదవండి: సర్పంచ్ అభ్యర్థి భర్త అపహరణ) స్వతంత్ర సర్పంచ్ పైనా ‘పచ్చ’మార్కు! -
దివాకర్ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కొత్త ట్విస్ట్
-
దివాకర్ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, అనంతపురం : దివాకర్ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దివాకర్ ట్రావెల్స్ అక్రమాలపై కర్ణాటక లోకాయుక్తను ఆశ్రయించారు. జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు చవ్వా గోపాల్‌రెడ్డి ఫోర్జరీలపై లోకాయుక్తకు ఆధారాలు సమర్పించారు. జేసీకి సహకరించిన కర్ణాటక రవాణా శాఖ అధికారుల పాత్రపైనా ఫిర్యాదు చేశారు. ( డబ్బు తీసుకుంటే ఆస్పత్రి సీజ్ చేస్తా ) కర్ణాటక డీజీపీ, పలువురు మంత్రులకు వీరిపై ఫిర్యాదు చేశారు. కాగా, 2017లో బీఎస్-3 వాహనాలను సుప్రీంకోర్టు నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే దివాకర్ ట్రావెల్స్ నిషేధిత వాహనాలను నకిలీ పత్రాలతో రిజిస్టర్ చేయించింది. స్ర్కాప్ కింద కొనుగోలు చేసిన 33 బస్సులు, లారీలను కర్ణాటకలో నడుపుతోంది. -
హక్కులంటే వ్యక్తిగత తగాదాలు కాదు
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగంలో పొందుపర్చిన ప్రాథమిక హక్కులే మానవ హక్కులని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దూరదృష్టితో రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లోనే ప్రాథమిక హక్కుల రూపంలో మానవ హక్కులను పొందుపర్చారని ఆయన చెప్పారు. చాలామందికి మానవ హక్కులంటే ఏమిటో అవగాహన తక్కువగా ఉందని, వ్యక్తిగత తగాదాలు, అధికారులు పనులు చేయకపోవడం, ఇతరత్రా సమస్యలతో కమిషన్‌కు పలువురు అర్జీలతో రావడం సబబుకాదని చెప్పారు. మానవ హక్కులపై అన్ని స్థాయిల్లోనూ అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తామన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో అధికారులతో సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్ర మానవహక్కుల కమిషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణమూర్తి అధ్యక్షతన శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఆదిలాబాద్ జిల్లాలోని కుగ్రామంలో జన్మించిన తాను గ్రామపెద్దకు భయపడేవాడినని, అయితే తాను పదోతరగతి ఉత్తీర్ణుడైనప్పుడు ఆ గ్రామపెద్ద వచ్చి భుజం తట్టి తనను ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. అందరూ ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకోవాలని జస్టిస్ చంద్రయ్య హితవు చెప్పారు. రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త 2 పదవులూ బీసీలకు ఇవ్వడంపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సీఎం కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. జనాభా నిష్పత్తి ప్రకారం న్యాయమూర్తుల పోస్టులు భర్తీ చేసేలా స్వతంత్ర జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హక్కుల ఉల్లంఘనల కేసుల్లో కమిషన్ సత్వర న్యాయం అందించాలని తెలంగాణ జనస మితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కోరారు. మానవహక్కుల రక్షణకు కమిషన్ సుమో టోగా కేసుల్ని స్వీకరించి న్యాయం చేయాలని సభాధ్యక్షు డు సత్యనారాయణమూర్తి కోరారు. హక్కుల రక్ష ణకు కృషి చేస్తానని రాష్ట్ర మానవహక్కుల కమిషన్ నాన్ జ్యుడీషియల్ మెంబర్ మహ్మద్ ఇర్ఫాన్ మెయినుద్దీన్ చెప్పారు. అనంతరం జస్టిస్ చంద్రయ్యను కృష్ణయ్య, కోదండరాం సన్మానించారు. -
లోకయుక్తగా జస్టిస్ సివి రాములు ప్రమాణ స్వీకారం
-
లోకాయుక్తగా జస్టిస్ సీవీ రాములు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర లోకాయుక్తగా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చింతపంటి వెంకట రాములు, రాష్ట్ర మానవ హక్కుల సంఘం (హెచ్ఆర్సీ) చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ గుండా చంద్రయ్య నియమితులయ్యారు. అలాగే ఉప లోకాయుక్తగా జిల్లా, సెషన్స్ రిటైర్డ్ జడ్జి వొలిమినేని నిరంజన్‌రావు, హెచ్ఆర్సీ సభ్యులుగా జిల్లా, సెషన్స్ రిటైర్డ్ జడ్జి నడిపల్లి ఆనందరావు(జ్యుడీషియల్), ముహమ్మద్ ఇర్ఫాన్ మొయినొద్దీన్ (నాన్ జ్యుడీషియల్) నియమితులయ్యారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో లోకాయుక్త, హెచ్ఆర్సీ చైర్మన్ ఎంపిక కమిటీలు గురువారం ప్రగతి భవన్లో సమావేశమై ఈ మేరకు వారి ఎంపికను ఖరారు చేశాయి. ఆ వెంటనే వారిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి లోకాయుక్త, ఉప లోకాయుక్త ఐదేళ్లపాటు, హెచ్ఆర్సీ చైర్మన్, సభ్యులిద్దరూ మూడేళ్లపాటు పదవుల్లో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన లోకాయుక్త, హెచ్ఆర్సీ ఎంపిక కమిటీల సమావేశంలో రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలిలో విపక్ష నేత సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ పాల్గొన్నారు. శాసనసభలో విపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ లండన్ పర్యటనలో ఉండటంతో ఆయన తరఫున ఎంఐఎం సీనియర్ శాసనసభ్యుడు సయ్యద్ పాషా ఖాద్రీ హాజరయ్యారు. జస్టిస్ సీవీ రాములు, జస్టిస్ చంద్రయ్య నేపథ్యాలివీ జస్టిస్ సీవీ రాములు (రాష్ట్ర లోకాయుక్త) నిజామాబాద్ జిల్లా బోధన్ సమీపంలోని అచ్చన్నపల్లి గ్రామంలో 1949 ఫిబ్రవరి 20న జన్మించారు. బోధన్‌లోని శంకర్‌నగర్‌లో ప్రాథమిక విద్య అనంతరం నిజామాబాద్‌లోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదివారు. 1978లో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. అదే ఏడాది న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యాక సీనియర్ న్యాయవాది సి.ఆనంద్ దగ్గర జూనియర్‌గా చేశారు. ఉమ్మడి ఏపీలో 24ఏళ్ల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి, ఆర్టీసీకి 13 ఏళ్లకు పాటు స్టాండింగ్ కౌన్సిల్‌గా పని చేశారు. 2002 డిసెంబర్ 2న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తర్వాత పూర్తిస్థాయి న్యాయమూర్తిగా పలు తీర్పులు చెప్పారు. జస్టిస్ జి.చంద్రయ్య (హెచ్చార్సీ చైర్మన్) ఆదిలాబాద్ జిల్లా జొన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామంలో 1954 మే 10న జన్మించారు. స్వగ్రామంలో మూడో తరగతి వరకు చదివారు. తపలాపూర్‌లో పదో తరగతి చదివాక ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఇంటర్, బీఏ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశారు. 1980 నవంబర్ 6న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సాంఘిక సంక్షేమ, మున్సిపల్ శాఖలకు ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 2005 మే 26న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తర్వా త శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. న్యాయమూర్తిగా తన పరిధిలోని అనేక అంశాలపై కక్షిదారులకు ఉపయుక్తంగా ఉండేలా మానవీయ కోణంలో పలు తీర్పులు చెప్పారు. 2016 మే 9న పదవీ విరమణ చేశారు. వొలిమినేని నిరంజన్‌రావ్ (రాష్ట్రఉప లోకాయుక్త) జిల్లా జడ్జిగా పలు జిల్లాల్లో పనిచేశారు. సీనియర్ జిల్లా జడ్జిగా ఉండగా రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శిగా సమర్ధంగా విధులు నిర్వహించారు. దీంతో పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ప్రభుత్వం ఆయన సేవలను కొనసాగించింది. ఇటీవలే ఆయన న్యాయ శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. ఆయన పనితీరు, సమర్థతను సీఎం కేసీఆర్ సైతం పలుమార్లు అభినందించారు. -
లోకాయుక్తగా జస్టిస్ పుర్కర్!
సాక్షి, హైదరాబాద్: లోకాయుక్తగా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ విలాస్ వి అఫ్జల్ పుర్కర్, ఉప లోకాయుక్తగా జిల్లా రిటైర్డ్ జడ్జి నిరంజన్ రావు, రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రయ్యను రాష్ట్ర ప్రభుత్వం నియమించనున్నట్లు తెలిసింది. వీరి ఎంపిక లాంఛనమేనని చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని ఎంపిక కమిటీలు గురువారం ప్రగతి భవన్లో సమావేశమై లోకాయుక్త, ఉప లోకాయుక్త, హెచ్ఆర్సీ చైర్మన్, సభ్యుల ఎంపికపై నిర్ణయం తీసుకోనున్నాయి. -
ఆ పోస్టులను భర్తీ చేయాల్సిందే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర లోకాయుక్త, ఉప లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) చైర్మన్, సభ్యుల పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయకపోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. హెచ్ఆర్సీ, లోకాయు క్తల పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నా, వాటి భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని ఆక్షేపించింది. హక్కుల కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకాలతోపాటు లోకాయుక్త, ఉప లోకాయుక్త పోస్టులను భర్తీ చేసి తీరాల్సిందేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం శుక్రవారం ప్రభుత్వాని కి తేల్చి చెప్పింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఖమ్మం జిల్లా, లెనిన్ నగర్‌కు చెందిన వెంకన్న ఈ పిల్ దాఖలు చేశారు. -
చంద్రబాబుపై లోకాయుక్తకు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: గత ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ పాలనలో విచ్చలవిడిగా అవినీతి జరిగిందని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు డేరంగుల ఉదయకిరణ్ విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై ఆయన గురువారం లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గత టీడీపీ పాలనలో ఇసుక మాఫియా, రాజధాని, పోలవరం ప్రాజెక్టుల్లో అక్రమాలపై ఫిర్యాదు చేశారు. ప్రజాధనాన్ని లూటీ చేసిన చంద్రబాబు, మంత్రులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఉదయ్‌కిరణ్ డిమాండ్ చేశారు. వారి అక్రమ సంపాదనను ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. -
లోకాయుక్తగా జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి ప్రమాణం
సాక్షి, అమరావతి : రాష్ట్ర లోకాయుక్తగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించారు. అనంతరం జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డిని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మఠం వెంకటరమణ, టెండర్ల న్యాయ పరిశీలన జడ్జి జస్టిస్ బి.శివశంకరరావు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, పలువురు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు, న్యాయవాదులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సంభాషిస్తున్న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కార్యక్రమం అనంతరం జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి లోకాయుక్తగా తన విధులు మొదలెట్టారు. తాజా ఫిర్యాదులపై విచారణ జరిపి.. అధికారుల నుంచి నివేదికలు కోరారు. మొన్నటి వరకు హైదరాబాద్‌లో కొనసాగిన ఏపీ లోకాయుక్త కార్యాలయం ఇటీవల విజయవాడలోని ఆర్ అండ్ బీ భవనానికి మారింది. లోకాయుక్త ఉద్యోగుల విభజన మాత్రం ఇంకా పూర్తికాలేదు. ఆర్ అండ్ బీ భవనంలో కార్యాలయం సిద్ధమై.. ఉద్యోగుల విభజన పూర్తయ్యేంత వరకూ హైదరాబాద్‌లోని లోకాయుక్త కార్యాలయం నుంచే జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి విధులు నిర్వర్తిస్తారు. -
లోకాయుక్తగా జస్టిస్ లక్ష్మణరెడ్డి ప్రమాణం
-
లోకాయుక్తగా జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి ప్రమాణ స్వీకారం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి పదవీ స్వీకార ప్రమాణం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం ఉదయం 11 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆయనచే ప్రమాణ స్వీకారం చేశారు. ఐదేళ్ల పాటు లక్ష్మణ్‌రెడ్డి ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అవినీతి నిరోధానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం లోకాయుక్తగా జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డిని నియమించిన విషయం తెలిసిందే. జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి గతంలో ఏపీ ఉమ్మడి హైకోర్టు జడ్జిగా పనిచేశారు. లోకాయుక్త నియామకంతో పెండింగ్ కేసుల పరిష్కారం వేగవంతం కానున్నాయి. బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన లోకాయుక్తకు వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. -
అవినీతిపై ఆయుధం.. లోకాయుక్త
సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో/మంగళగిరి: అవినీతిపై ప్రజా ఆయుధంగా లోకాయుక్త వ్యవస్థ తోడ్పడుతుందని ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి అన్నారు. జనచైతన్య వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆయనకు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అవినీతిపై సాక్ష్యాలుంటే లోకాయుక్తకు ఫిర్యాదు చేయాలని, న్యాయం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ అవినీతి రహిత, పారదర్శక పాలన అందించాలని బలంగా కోరుకుంటున్నారని, లోకాయుక్త నియామకం ద్వారా ఆయన ఆకాంక్ష నెరవేరుతుందన్నారు. కార్యక్రమంలో మానసిక నిపుణుడు డా. ఇండ్ల రామసుబ్బారెడ్డి, సెంట్రల్ కస్టమ్స్ జాయింట్ కమిషనర్ శ్రీకాంత్, జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ సీఎస్ రాజు, జనచైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ జి విజయసారథి పాల్గొన్నారు. సీఎంను కలిసిన జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మంగళగరి పట్టణంలోని లక్ష్మీనృసింహస్వామిని జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి.. కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. (టీడీపీ) తదితరులు -
జస్టిస్ శివశంకరరావు బాధ్యతల స్వీకరణ
సాక్షి; అమరావతి: ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి. శివశంకరరావు అన్నారు. టెండర్ల ప్రక్రియ న్యాయ పరిశీలన కమిటీ చైర్మన్‌గా శనివారం సచివాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టెండర్ల విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ మౌలిక సదుపాయాల (న్యాయ పరిశీలన ద్వారా పారదర్శకత) చట్టాన్ని తెచ్చి, దీన్ని అమలు చేయడానికి ఒక న్యాయమూర్తిని నియమించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. విదేశాల్లో కూడా ఈ తరహా విధానం ఎక్కడా లేదని వెల్లడించారు. లోకకళ్యాణం కోసం మనమంతా జీవించాలని, ప్రజా సేవకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కోరారు. హక్కుల కోసం పోరాడేవారు బాధ్యతగా ఉండాలని.. కర్మబద్దంగా.. ధర్మబద్దంగా అందరూ పని చేయాలని ఆయన అన్నారు. బాధ్యతలు చేపట్టడానికి ముందు తాడేపల్లి కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని జస్టిస్ శివశంకరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం జగన్‌ను కలిసిన లక్ష్మణ్‌రెడ్డి తాడేపల్లి కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పి. లక్ష్మణ్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర లోకాయుక్తగా ఆయన రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఐదేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. -
15న ఏపీ లోకాయుక్తగా జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి ప్రమాణం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా నియమితులైన జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి ఈనెల 15న ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారోత్సవం జరుగనుంది.రాష్ట్రంలో అవినీతి నిరోధానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం ఏపీ లోకాయుక్తగా జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డిని నియమించింది. జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి గతంలో ఏపీ ఉమ్మడి హైకోర్టు జడ్జిగా పనిచేశారు. లోకాయుక్త నియామకంతో పెండింగ్ కేసుల పరిష్కారం వేగవంతం కానున్నాయి. ఐదేళ్ల పాటు లక్ష్మణ్‌రెడ్డి ఈ పదవిలో కొనసాగనున్నారు. -
ఏపీ లోకాయుక్తగా జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి నియామకం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అవినీతి నిరోధానికి తీసుకుంటున్నచర్యల్లో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏపీ లోకాయుక్తగా జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డిని నియమించింది. ఐదేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి గతంలో ఏపీ ఉమ్మడి హైకోర్టు జడ్జిగా పనిచేశారు. లోకాయుక్త నియామకంతో పెండింగ్ కేసుల పరిష్కారం వేగవంతం కానున్నాయి. ఇటీవల తీసుకొచ్చిన లోకాయుక్త సవరణ చట్టం ప్రకారం హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి లేదా విశ్రాంత న్యాయమూర్తిని లోకాయుక్తగా నియమించుకునే వెసులు బాటు ప్రభుత్వానికి ఉంది. లక్ష్మణ్‌రెడ్డిని లోకాయుక్తగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఏపీ లోకాయుక్తగా జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అవినీతి నిరోధానికి తీసు కుంటున్న చర్యల్లో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం.. లోకాయుక్త నియామకానికి చర్యలు ప్రారం భించింది. రాష్ట్ర లోకాయుక్తగా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డిని నియమించాలని నిర్ణయించింది. ఇటీవల తీసుకొచ్చిన లోకాయుక్త సవరణ చట్టం ప్రకారం హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి లేదా విశ్రాంత న్యాయమూర్తిని లోకాయుక్తగా నియమించుకునే వెసులు బాటు ప్రభుత్వానికి ఉంది. లోకాయుక్త నియామకం విషయంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదిం చాల్సి ఉంటుంది. ఇటీవల లోకాయుక్త నియామక ఫైలును పరిశీలించిన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్.. లక్ష్మణ్‌రెడ్డి నియామకానికి ఆమోదముద్ర వేశారు. తర్వాత ప్రభుత్వం కూడా ఆయన నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో ఉత్తర్వులు వెలువ డనున్నాయి. లోకాయుక్త పరిధి.. ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, పార్లమెంటరీ కార్య దర్శులపై వచ్చే ఫిర్యాదులను విచారించే పరిధి లోకాయుక్తకు ఉంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, చీఫ్ విప్‌లతో పాటు.. ప్రజా వ్యవహారాలకు సంబంధించి ప్రభుత్వం నియమించే ఏ అధికారిపైనైనా కూడా ఫిర్యాదు చేయ వచ్చు. జెడ్పీ, మండల పరిషత్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లు, సభ్యులు, సర్పంచ్, ఉప సర్పంచ్, మేయర్, డిప్యూటీ మేయర్, వార్డు సభ్యులు, మునిసిపాలిటీ చైర్పర్సన్, ఇతర సభ్యులు తదితరులపై వచ్చే ఫిర్యాదుల న్నింటిపై లోకాయుక్త విచారణ జరపవచ్చు. న్యాయమూర్తులు, జ్యుడీషియల్ సర్వీసు సభ్యులు.. లోకాయుక్త పరిధిలోకి రారు. రాష్ట్రంలోనే ఏదైనా కోర్టు అధికారి, ఉద్యోగి కూడా లోకాయుక్త పరిధిలోకి రారు. ఏపీ అకౌంటెంట్ జనరల్, ఏపీపీఎస్సీ చైర్మన్, సభ్యులు, ఎన్నికల అధికారులు స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్, ఏపీఏటీ చైర్మన్, ఇతర సభ్యులను విచారించే పరిధి లోకాయుక్తకు ఉండదు. అవినీతి, అధికార దుర్వినియోగం తదితరాల విషయంలో ఏ వ్యక్తి అయినా లోకాయుక్తను ఆశ్రయించవచ్చు. ఫిర్యాదుదారు తన పూర్తి వివరాలతో ఫారమ్ 1, 2ను పూర్తిచేసి.. లోకాయుక్త రిజిస్ట్రార్ పేరిట రూ.150 ఫీజు చెల్లించాలి. తప్పుడు ఫిర్యాదు ఇచ్చినట్లు తేలితే ఫిర్యాదుదారుని ప్రాసిక్యూషన్ చేయవచ్చు. గరిష్టంగా ఏడాది జైలు శిక్ష కూడా విధించవచ్చు. -
నికార్సయిన చర్య
విపక్షంలో ఉన్నప్పుడు ఒకవిధంగా, అధికారంలో ఉన్నప్పుడు మరొకలా మాట్లాడటమే రివాజుగా మారిన వర్తమాన కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరి ప్రశంసలూ అందుకొనే రీతిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో లోకాయుక్త నియామకం వీలయ్యేవిధంగా తీసుకొచ్చిన లోకాయుక్త సవరణ చట్టం–2019 అమలుకు గురువారం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం ఇందుకు తాజా ఉదాహరణ. అధికారంలోకొచ్చిన నెలరోజుల వ్యవధిలోనే లోకాయుక్త సవరణ బిల్లు ఆమోదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పుడు ఆ చట్టం అమలును నోటిఫై చేసింది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారికి చిత్తశుద్ధి, సంకల్ప దీక్ష ఉంటే పను లు ఎంత చకచకా జరిగిపోతాయో చెప్పడానికి లోకాయుక్త సవరణ చట్టం మరో ఉదాహరణ. తాను అధికారంలోకొస్తే పారదర్శక పాలనను అందిస్తానని, ప్రజలకు జవాబుదారీగా ఉంటానని ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. పారదర్శకమైన, నీతిమంతమైన పాలన అందిస్తానని ప్రమాణస్వీకారం రోజునే చెప్పారు. అధికారం ఒళ్లో వాలిన మరుక్షణమే వాగ్దా నాలన్నిటినీ గాలికొదిలే దుష్ట సంస్కృతే అన్నిచోట్లా రాజ్యమేలుతున్న కాలంలో ఆయన తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను అదే వేదికపై చూపుతూ దీన్ని తాను ఖురాన్‌లా, బైబిల్లా, భగవద్గీతలా భావిస్తానని...అందులోని ప్రతి ఒక్క వాగ్దానాన్నీ నెరవేర్చడానికి త్రికరణ శుద్ధిగా కృషి చేస్తానని ప్రకటించారు. అంతక్రితం అయిదేళ్లూ రాష్ట్రాన్ని మహమ్మారిలా చుట్టుముట్టిన అవినీతిని అంతం చేయడానికి తీసుకోబోయే చర్యలేమిటో కూడా ఆరోజే వెల్లడించారు. టెండర్ల విధానంలో పార దర్శకత ప్రవేశపెడతామని, అవినీతికి కాస్తయినా చోటీయనివిధంగా రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఇప్పుడు అమల్లోకి తీసుకొచ్చిన లోకాయుక్త సవరణ చట్టం ఆ వరసలో తదుపరి చర్యగా భావించాలి. మన దేశంలో రాజకీయ అవినీతి ఎంతగా ఊడలు వేసిందో కనబడుతూనే ఉంది. ఎన్నడో 1966లో తొలిసారి మొరార్జీ దేశాయ్ నాయకత్వంలోని పాలనా సంస్కరణల సంఘం(ఏఆర్సీ) తాత్కాలిక నివేదికలో లోక్‌పాల్, లోకాయుక్తల ప్రస్తావన చేసింది. ఈ రెండు వ్యవస్థలూ అందు బాటులోకొస్తే ప్రజా సమస్యలు చాలావరకూ తీరుతాయని భావించింది. కానీ ఆ తర్వాత మరో అయిదారేళ్లకుగానీ తొలి లోకాయుక్త వ్యవస్థ ఆవిర్భవించలేదు. ఆ పని మహారాష్ట్ర చేసింది. చిత్ర మేమంటే...అనంతరకాలంలో మొరార్జీ దేశాయ్ ప్రధానిగా పనిచేసినా జాతీయ స్థాయిలో ఆయన లోక్‌పాల్ వ్యవస్థ తీసుకురాలేకపోయారు. మొన్న మార్చిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకిచంద్ర ఘోష్‌ను తొలి లోక్‌పాల్‌గా నియమించారు. అవినీతి అంతం విషయంలో మన రాజకీయ నాయకత్వం ఎలా నత్త నడక నడుస్తుందో చెప్పడానికి ఇదో ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్‌లో నిక్షేపంలా ఉండే లోకాయుక్త వ్యవస్థకు చంద్రబాబు తన హయాంలో తూట్లు పొడిచారు. ప్రస్తుత హైకోర్టు న్యాయమూర్తి లేదా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి లోకాయుక్త పదవికి అర్హులన్న ఆ చట్టంలోని నిబంధన అడ్డు పెట్టుకుని ఆ రెండు కేటగిరీల్లోనివారూ లభ్యం కావడంలేదని సాకు చెప్పి లోకాయుక్త నియామకం జోలికే బాబు పోలేదు. ఏ చట్టమైనా, నిబంధనైనా పనులు సజావుగా, సక్రమంగా సాగడానికే తప్ప వాటికి నిలువుగా, అడ్డంగా అడ్డుపడటానికి కాదు. అమలులో సమస్యలుంటే వాటిని అధిగమించడానికి ఏం చేయాలో ఆలోచించాలి. తనకు తోచకపోతే నిపుణుల సలహా తీసుకోవాలి. కానీ బాబు ఈ రెండూ చేయలేదు. ఇదే అదునని ఎడాపెడా నొల్లుకున్నారు. కుమారుడు లోకేష్‌ను కూడా తోడు తెచ్చుకున్నారు. వెరసి ఆంధ్రప్రదేశ్ అప్పట్లో అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అదే సమయంలో ఆయన సూక్తిముత్యాలు వల్లించడానికి ఎక్కడా వెరవలేదు. నిప్పులాంటివాడినని చెప్పుకోవడం ఆపలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన లోకాయుక్త సవరణ చట్టం అవినీతిపై బ్రహ్మాస్త్రమే. ఎక్కడ అక్రమాలు జరిగాయని భావించినా, ప్రజాధనం దుర్వినియోగమైందనుకున్నా లోకాయుక్త తనంత తానే దర్యాప్తు చేస్తుంది. ఎవరి ఫిర్యాదులనైనా విచారణకు స్వీకరిస్తుంది. అవినీతి, అక్రమాలపై వివిధ మాధ్యమాల్లో వచ్చే ఆరోపణలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఆఖరికి ఊరూ పేరూ లేకుండా రాసే ఉత్తరాలకు సైతం విలువనిచ్చి విచారణ జరిపిస్తుంది. సారాంశంలో ఇది పాలనా వ్యవస్థలోని ఏ ఒక్కరూ అవినీతికి పాల్పడకుండా కట్టడి చేస్తుంది. అలాగే బాధ్యతారహితంగా నోటికొచ్చినట్టు మాట్లాడే రాజకీయ నాయకులకు, గాలి వార్తలు పోగేసే మాధ్యమాలకు కూడా క్రమశిక్షణ నేర్పుతుంది. ఇష్టానుసారం ఏదంటే అది ఆరోపణ చేయడంకాక, చేసినవాటికి సాక్ష్యాధారాలు సమర్పించాల్సి వస్తుంది. లోకాయుక్త సవరణ చట్టం అమలైతే ఏమవుతుందో అందరికన్నా బాబుకు బాగా తెలుసు. అందుకే కాబోలు సంబంధిత బిల్లుపై శాసనసభలో చర్చ జరుగుతున్నప్పుడు అసంబద్ధమైన అంశాలను లేవనెత్తడానికి ఆయన విఫలయత్నం చేశారు. చివరకు తన పాచిక పారడంలేదని గ్రహించాక, సభలో ఉంటే ఎక్కడ మాట్లాడక తప్పని స్థితి ఏర్పడుతుందోనని జడిసి వాకౌట్ అస్త్రాన్ని ప్రయోగించి నిష్క్రమించారు. అంతక్రితం శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటుతోసహా అట్టడుగు వర్గాలకు, మహిళలకు లబ్ధి చేకూర్చే వివిధ చరిత్రాత్మక బిల్లుల విషయంలోనూ ఆయన ప్రవర్తన డిటోయే. అవినీతిని అంతం చేయడానికి మాటలు చాలవు. చేతలు అవసరం. ఒక్క రూపాయి ప్రజాధనం కూడా దుర్వినియోగం కానీయరాదన్న సత్సంకల్పం పాలకులకు ఉన్నప్పుడే ఆ ఆదర్శం అట్టడుగు స్థాయి వరకూ విస్తరిస్తుంది. కనుకనే లోకాయుక్త సవరణ చట్టం నోటిఫై చేయడం ప్రశంసించదగ్గ చర్య. ఇక నియామకం ప్రక్రియ కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తయి రెప్పవాల్చని నిఘాతో అది కర్తవ్య నిర్వహణకు పూనుకుంటుందని ఆశించాలి. -
అవినీతిపై బ్రహ్మాస్త్రం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో అవినీతికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా వైఎస్ జగన్ సర్కారు లోకాయుక్త ఏర్పాటుకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం ఏర్పాటైన రెండు నెలల్లోనే లోకాయుక్త నియామకానికి వీలుగా శాసనసభ, శాసన మండలిలో చట్ట సవరణ చేసి గురువారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. స్వతంత్ర ప్రతిపత్తిగల రాజ్యాంగ బద్ధమైన లోకాయుక్త ఉంటే తాను, తన కిచెన్ కేబినెట్ సభ్యులు సాగించే అవినీతి బట్టబయలయ్యే ప్రమాదం ఉందనే భయంతోనే ఇదివరకటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిదేళ్లపాటు ఆ నియామకాన్ని గాలికి వదిలేశారు. ఎక్కడ అక్రమాలు జరిగినా, ప్రజాధనం దుర్వినియోగమైనా తనంతట తానుగా (సుమోటో) దర్యాప్తు చేసే అధికారం లోకాయుక్తకు ఉంటుంది. అవినీతి, అక్రమాలకు సంబంధించి పత్రికల్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో వచ్చే వార్తలను, ఆకాశ రామన్న ఉత్తరాలను కూడా పరిగణనలోకి తీసుకుని విచారణ జరిపించే విస్తృతాధికారం లోకాయుక్తకు ఉంటుంది. అందువల్లే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోకాయుక్త ఉండరాదనే ఉద్దేశంతో వ్యవహరించారు. భయంతోనే నాడు బాబు వెనుకంజ అవినీతి రహిత, పారదర్శక పాలన అందిస్తానని ఎన్నికల ముందు చెప్పినట్లుగానే వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆచరించి చూపుతున్నారు. తన మాటను విశ్వసించి అఖండ విజయం అందించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని, ప్రతి రూపాయి ప్రజా ధనాన్ని పారదర్శకంగా, జవాబుదారీగా ఖర్చు చేయాలని అంకిత భావంతో పని చేస్తున్నారు. అధికారంలోకి రాగానే లోకాయుక్త నియామకం కోసం చట్ట సవరణ చేయడం, రూ.వంద కోట్లు దాటిన ప్రతి పనికి సంబంధించిన టెండర్లను న్యాయ సమీక్ష తర్వాత సవరణలు చేసి నిర్వహించాలని అసెంబ్లీలో సాహసోపేత బిల్లును ఆమోదించడం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనాలు. హైకోర్టు సిట్టింగ్ జడ్డి, రిటైర్డు ప్రధాన న్యాయమూర్తి దొరకడం లేదనే సాకుతోనే చంద్రబాబు సర్కారు లోకాయుక్తను నియమించకుండా వదిలేసింది. గతంలో కర్ణాటక రాష్ట్రంలో ఇనుప ఖనిజ లైసెన్సుల జారీలో, తవ్వకాల్లో జరిగిన అక్రమాలను అక్కడి లోకాయుక్త ఎండగట్టింది. దీనిని సుమోటోగా తీసుకుని దర్యాప్తు జరిపి నిగ్గుతేల్చింది. ఈ దృష్ట్యా లోకాయుక్తను నియమిస్తే ఎప్పటికైనా తనకూ ఇదే గతి పడుతుందని భయంతోనే చంద్రబాబు ఆ పని చేయలేదని అప్పట్లో అధికార వర్గాలు బహిరంగంగానే వ్యాఖ్యానించాయి. రెండు నెలల్లోనే ఆచరణ మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి జూన్ 8న మంత్రివర్గం ఏర్పాటు చేశారు. తర్వాత నెల రోజులకే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త సవరణ బిల్లును శాసనసభ, శాసనమండలిలో పెట్టారు. దీనిని ఆమోదించి ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త సవరణ చట్టం – 2019 తెచ్చారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా హైకోర్టు రిటైర్డు చీఫ్ జస్టిస్లను లోకాయుక్తగా నియమించాలని గతంలో చట్టం ఉండేది. వీరు తగు సంఖ్యలో అందుబాటులో లేనందున హైకోర్టు రిటైర్డు జడ్జిలను లోకాయుక్తగా నియమించడానికి వీలు కల్పిస్తూ చట్ట సవరణ చేశారు. తక్షణమే ఈ చట్టం అమల్లోకి వచ్చినట్లు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారమే గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీంతో ప్రభుత్వం లోకాయుక్త నియామకానికి నోటిఫికేషన్ ఏ క్షణమైనా జారీ చేసే అవకాశం ఉంది. -
లోకాయుక్త సవరణ బిల్లుకు ఆమోదం
సాక్షి, అమరావతి: విపక్షం నిరసనలు, వాకౌట్ మధ్య ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త సవరణ బిల్లు – 2019ను శాసనసభ శుక్రవారం ఆమోదించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దూరదృష్టి, పారదర్శక పాలనకు ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులే నిదర్శనమని అధికారపక్ష సభ్యులు ప్రశంసించారు. లోకాయుక్త, న్యాయ పరిశీలన బిల్లుల ద్వారా ముఖ్యమంత్రి దేశానికే ట్రెండ్ సెట్టర్‌లా చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. లోకాయుక్త సవరణ బిల్లును ముఖ్యమంత్రి తరఫున డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఆర్థిక, శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బిల్లును ప్రతిపాదించగా సభ్యుల హర్షధ్వానాల మధ్య సభ ఆమోదించింది. బిల్లు గురించి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సభ్యులకు వివరించారు. సుపరిపాలన దిశగా ఆదర్శవంతమైన బిల్లులు.. ఒకవైపు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం అద్భుతమైన చట్టాలు తెస్తూ మరోవైపు అవినీతి నిర్మూలన, సుపరిపాలన కోసం ముఖ్యమంత్రి ఆదర్శవంతమైన బిల్లులు ప్రవేశపెడుతున్నారని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తెలిపారు. ‘గత ప్రభుత్వం కనీసం సమాచార ప్రధాన కమిషనర్‌ను కూడా నియమించలేదు. ఇటీవల వరకు కమీషనర్లను సైతం నియమించలేదు. గిరిజన సలహా మండలి లేదు. చివరివరకు మైనారిటీలకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు’ అని పేర్కొన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల కొరత ఉన్నందున వీరి స్థానంలో హైకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులను లోకాయుక్తగా నియమించుకోవడం కోసం చట్ట సవరణ అవసరమన్నారు. రిటైర్డ్ న్యాయమూర్తులు అందుబాటులో ఉన్నందున లోకాయుక్త నియామకానికి ఇబ్బంది ఉండదనే సదుద్దేశంతో చట్ట సవరణ చేస్తున్నామని వివరించారు. ‘లోకాయుక్త కేవలం అవినీతి కేసులను విచారించడానికి మాత్రమే కాదు. పరిపాలనలో అధికారుల తప్పిదాలు, నిర్లక్ష్యం లాంటివి కూడా విచారిస్తారు’ అని తెలిపారు. చంద్రబాబు అధికారంలో ఉన్నన్నాళ్లూ ఏమీ చేయకుండా రహస్య జీవోలతో కాలం గడిపారని విమర్శించారు. ఐదేళ్లుగా జరిగిన లోటుపాట్లపై లోకాయుక్త విచారిస్తుందన్నారు. కర్ణాటకలో లోకాయుక్త పలు కుంభకోణాలను నిగ్గు తేల్చిందని గుర్తు చేశారు. -
ఇది ఇక్కడితో ఆగిపోదు: సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: దేశ చరిత్రలోనే పారదర్శకతకు ఆంధ్రప్రదేశ్ వేదిక కానుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అవినీతిని నిర్మూలించి ప్రతి పనిలోనూ పారదర్శకత తీసుకురావాలన్నదే తమ ఉద్దేశమని ఆయన తెలిపారు. అవినీతిని నిరోధించడానికి, మరింత మెరుగైన పరిపాలన అందించడానికి ముందస్తు న్యాయ సమీక్ష బిల్లు తీసుకువస్తున్నట్లు చెప్పారు. ఈ బిల్లుపై శుక్రవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘ఈ రోజు ఓ చారిత్రాత్మకమైన బిల్లును తీసుకువచ్చాం. దేశ చరిత్రలోనే పారదర్శకత ఏపీ నుంచి మొదలు అవుతోంది. వ్యవస్థలో మార్పు తీసుకు రావడానికి ఈ బిల్లు ఏ రకంగా ఉపయోగపడుతుందనేది సభ్యులు ఇప్పటికే సభలో చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో ఎక్కడ చూసిన అవినీతి కనిపిస్తోంది. వ్యవస్థలో మార్పు రావాలంటే ముందుగా ఎవరైనా ప్రారంభిస్తేనే వస్తుంది. ముందస్తు న్యాయసమీక్ష అనేది ఇప్పటివరకూ దేశ చరిత్రలో ఎక్కడ జరుగలేదు. అది మన రాష్ట్రం నుంచే మొదలవుతుంది. పారదర్శకత అన్న పదానికి అర్థం ఇక్కడి నుంచి మొదలైతే దేశం మొత్తం వ్యాపిస్తుంది. దేశంలో ఎప్పుడు జరగని విధంగా.. అవినీతిని అంతమొందించేందుకు, వ్యవస్థలోకి పారదర్శకతను తీసుకురావాలని అడుగులు వేస్తున్నాం. చాలాసార్లు అవినీతికి వ్యతిరేకంగా నాయకులు మాట్లాడారు. నిజంగా ఏం చేస్తే అవినీతి లేకుండా చేస్తామన్నది ఎప్పుడు జరుగలేదు. నిజంగా పారదర్శకత అన్నదానికి అర్థం తెచ్చేందుకు ఈ బిల్లు తెచ్చాం. గత ఐదేళ్ల చంద్రబాబు పాలన గమనిస్తే..మనం కూర్చున్న ఈ బిల్డింగ్ గమనిస్తే స్కామ్ కనిపిస్తుంది. తాత్కాలిక భవనం కట్టడానికే అడుగుకు రూ.10 వేలు ఖర్చు అయిన పరిస్థితి చూశాం. ఏదీ తీసుకున్నా కూడా స్కామ్‌లమయమే. ఇలాంటి పరిస్థితి పూర్తిగా మారాలంటే ఈ బిల్లు ఏ రకంగా ఉపయోగపడుతుందన్నది నాకంటే ముందు మాట్లాడిన వారు చెప్పారు. ఈ బిల్లు ద్వారా రూ.100కోట్లు, దానికి పైబడిన ప్రతి టెండర్ ప్రభుత్వ టెండర్ ఏదైనా జడ్జి పరిధిలోకి వస్తుంది. టెండర్ల పరిశీలనకు హైకోర్టు జడ్జి లేదా రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు అవుతుంది. నియమించిన జడ్జి ఒక్కసారి బాధ్యతలు తీసుకున్న తరువాత ప్రభుత్వం పిలిచే ఏ టెండర్ అయినా సరే ఆ జడ్జి వద్దకు పంపిస్తాం. ఆ జడ్జి ఆ టెండర్ డాక్యుమెంట్ పబ్లిక్ డొమైన్లో వారం రోజుల పాటు పెడతాం. నేరుగా జడ్జికే సలహాలు, సూచనలు ఇవ్వవచ్చు. ఆ జడ్జి వద్ద టెక్నికల్‌గా తోడుగా ఉండేందుకు ఎవరినైనా కోరవచ్చు. జడ్జి వీళ్లు ఎవరూ వద్దు, ఫలాని వారు కావాలని కోరితే వారిని ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. జడ్జి టెండర్‌కు సంబంధించిన సలహాలు తన వద్ద ఉన్న టెక్నికల్ టీమ్‌తో చర్చిస్తారు. ఆ తరువాత జడ్జి సంబంధిత శాఖను పిలిచి తాను ఏదైతే సబబు అనుకుంటారో..వాటిని సూచిస్తూ మార్పులు చేస్తారు. అదే మార్పులు తూచా తప్పకుండా చేసిన తరువాతే టెండర్ డాక్యుమెంట్ పూర్తి చేస్తాం. ఇంత నిజాయితీగా, పారదర్శకంగా ఒక వ్యవస్థను తయారు చేయడం దేశ చరిత్రలో ఇప్పటివరకూ ఎక్కడా జరుగలేదు. ఏపీ నుంచే ఇది మొదలవుతుంది. ఇంత పారదర్శకంగా, నిజాయితీగా ఒక వ్యవస్థను సృష్టించి, వ్యవస్థ ద్వారా పారదర్శకత ఒక స్థాయి నుంచి మరోస్థాయికి తీసుకు వెళ్లడం బహుశా రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనే ఎక్కడా జరగలేదు. దీనివల్ల పూర్తిగా నమ్మకం, విశ్వాసం పెరుగుతాయి. ఇది ఇక్కడితో ఆగిపోదు, మిగిలిన రాష్ట్రాలు కూడా దీన్ని అనుసరిస్తాయి. ఇక్కడ మనం బీజం వేశాం. ఈ బీజం మహా వృక్షం అవుతుంది. దేశానికి దశ, దిశా చూపించే గొప్ప బిల్లు అవుతుందని గర్వంగా కూడా చెబుతున్నాను. ఇక లోకాయుక్తా బిల్లును కూడా ఇవాళ తీసుకువచ్చాం. గతంలో ఈ బిల్లు ఎందుకు లేదు అంటే దానికి సమాధానం లేదు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఏపీలో లోకాయుక్తా అన్నది లేనే లేదు. అవినీతి లేకుండా ఉండాలని గత ప్రభుత్వం అనుకుని ఉంటే ఇది జరిగేది కాదు. కానీ ఆ ఆలోచన వారికి లేదు. చిన్న చిన్న మార్పులు చేస్తే ఇది జరిగి ఉండేది. లోకాయుక్తలో ఒక సిట్టింగ్ జడ్జి గాని, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఉంటేకాని లోకాయుక్తను నియమించలేమన్న నిబంధనను కాస్త మార్పు చేసి ఉంటే అయిదేళ్ల క్రితమే లోకాయుక్త వచ్చి ఉండేది. కానీ లోకాయుక్త అన్నది రానేరాకుండా, గత అయిదేళ్లుగా పెండింగ్‌లో పెట్టారంటే ఈ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారంలోకి వచ్చిన 45రోజుల్లోనే పారదర్శకత, వ్యవస్థలో మార్పు కోసం ఇలాంటి గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం గర్వంగా ఉంది.’ అని అన్నారు. కాగా లోకాయుక్తా, ముందస్తు న్యాయ సమీక్ష బిల్లులకు ఆమోదం అనంతరం శానససభ సోమవారానికి వాయిదా పడింది. -
ఈ బిల్లు సీఎం జగన్ దార్శనికతకు నిదర్శనం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త సవరణ బిల్లుకు శాసనసభ శుక్రవారం ఆమోదం తెలిపింది. దీంతోపాటు వేతన సవరణ బిల్లుకు కూడా అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అంతకుముందు లోకాయుక్త సవరణ బిల్లుపై ప్రభుత్వ విప్, వైఎస్సార్సీపీ సభ్యుడు కాపు రామచంద్రారెడ్డి చర్చను ప్రారంభిస్తూ.. ఒకవైపు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం చట్టాలు తీసుకొస్తూనే.. మరోవైపు అవినీతి నిరోధించడానికి, పరిపాలనను మరింత మెరుగ్గా అందించడానికి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బిల్లులు తీసుకువస్తున్నారని, ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త సవరణ బిల్లు, జ్యుడీషియల్ కమిషన్ బిల్లులను తీసుకువస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త సవరణ బిల్లు సీఎం వైఎస్ జగన్ దార్శనికతకు ఒక నిదర్శనమని, అవినీతి రహిత మెరుగైన పరిపాలన విషయంలో సీఎం వైఎస్ జగన్ ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిపోతారని కొనియాడారు. గత చంద్రబాబు ప్రభుత్వం కనీసం సమాచార కమిషనర్లను కూడా నియమించలేదని, ట్రైబల్ వెల్ఫేర్ కమిటీని కూడా వేయలేదని తప్పుబట్టారు. లోకాయుక్త కమిషన్‌ను ఏర్పాటు చేయలంటే ప్రస్తుతం హైకోర్టు చీఫ్ జస్టిస్ లేదా హైకోర్టు జస్టిస్‌ను నియమించాలని, అయితే, దేశంలో న్యాయమూర్తుల కొరత ఉండటంతో ఇది సమస్యగా మారిందన్నారు. దేశంలో మొత్తం 1079 మంది న్యాయమూర్తుల అవసరం ఉండగా.. ప్రస్తుతం 534 మంది న్యాయమూర్తులు, 132 మంది అదనపు న్యాయమూర్తులు మాత్రమే అందుబాటులో ఉన్నారని తెలిపారు. 239 న్యాయమూర్తుల పోస్టులు, 174 అదనపు న్యాయమూర్తుల పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయన్నారు. ఏపీ విషయానికొస్తే.. రాష్ట్రంలో 28 మంది న్యాయమూర్తులు, తొమ్మిది మంది అదనపు న్యాయమూర్తులు అవసరముండగా.. 13మంది న్యాయమూర్తులు మాత్రమే అందుబాటులో ఉన్నారని, 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు న్యాయమూర్తులు లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను లోకాయుక్తగా నియమించడమంటే ప్రాక్టికల్‌గా సాధ్యం కాదని, అందుకే హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ లేదా, హైకోర్టు రిటైర్డ్ జస్టిస్‌ను లోకాయుక్తగా నియమించవచ్చునని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం లోకాయక్త చట్టంలో సవరణ తీసుకొచ్చిందని, దేశంలో, రాష్ట్రంలో పలువురు రిటైర్డ్ న్యాయమూర్తులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. ఈ మేరకు చట్టంలో సవరణ తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో లోకాయుక్త నియామకానికి సీఎం వైఎస్ జగన్ మార్గం సుగమం చేశారని అన్నారు. లోకాయుక్త కేవలం అవినీతి కేసులనే కాకుండా.. పరిపాలనలో అధికారుల తప్పిదాలు, నిర్లక్ష్యం.. చేయాల్సిన పనులు చేయకపోవడం, చేయకూడని పనులు చేయడం వంటివి విచారిస్తుందని తెలిపారు. లోకాయుక్త వ్యవస్థను బలపరచడం ద్వారా పరిపాలనను మరింత మెరుగు చేయవచ్చునని, మరింత పారదర్శకత తీసుకురావచ్చునని కాపు రామచంద్రారెడ్డి వివరించారు. -
జస్టిస్ సుభాషణ్ రెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుభాషణ్ రెడ్డి (76) బుధవారం అనారోగ్యంతో కన్నుమూశారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రి (ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ)లో చికిత్స పొందుతూ ఆయన ఇవాళ ఉదయం మరణించారు. గత నెలరోజులుగా జస్టిస్ సుభాషణ్ రెడ్డి ఏఐజీలో చికిత్స పొందుతున్నారు. లోకాయుక్త చైర్మన్‌గా పనిచేసిన ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. మరోవైపు జస్టిస్ సుభాషణ్ రెడ్డి భౌతికకాయాన్ని అవంతినగర్లోని ఆయన నివాసానికి తరలించారు. ఇవాళ సాయంత్రం మహాప్రస్థానంలో కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. జస్టిస్ సుభాషణ్ రెడ్డికి ముగ్గురు కుమారులు. ఇద్దరు న్యాయవాద వృత్తిలో ఉన్నారు. మరొకరు ఇంజనీరు. జస్టిస్ సుభాషణ్ రెడ్డి 1942 మార్చి 2న హైదరాబాద్‌లో జన్మించారు. హైదరాబాద్ సుల్తాన్ బజార్, చాదర్‌ఘాట్ పాఠాశాలల్లో చదువుకున్న ఆయన ఆ తర్వాత ఉస్మానియాలో లా పూర్తి చేశారు. 1966 ఆ ప్రాంతంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించిన సుభాషణ్ రెడ్డి1991, నవంబర్ 25న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2001, సెప్టెంబర్ 12న మద్రాస్ హైకోర్టులో చీఫ్ జస్టిస్ అయ్యారు. మూడేళ్ల అనంతరం కేరళ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2005, మార్చి 2న రిటైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్‌కు తొలి ఛైర్మన్‌గా ఆయన సేవలు అందించారు. సీఎం కేసీఆర్ సంతాపం జస్టిస్ సుభాషణ్ రెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. జస్టిస్ సుభాషణ్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.అధికార లాంఛనాలతో జస్టిస్ జస్టిస్ సుభాషణ్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. జస్టిస్ సుభాషణ్ రెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి జస్టిస్ సుభాషణ్ రెడ్డి మృతిపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. తెలుగువారు గర్వించదగ్గ న్యాయకోవిదుడు: అల్లోల జస్టిస్ సుభాషణ్ రెడ్డి మృతి పట్ల న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా, తమిళనాడు,కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా, లోకయుక్తగా సుభాషణ్ రెడ్డి ఎనలేని సేవలు అందించారని ఆయన కొనియాడారు. సామాన్య ప్రజల హక్కుల పరిరక్షణకు కృషి చేసిన ఆయన సామాజిక స్పృహ గల న్యాయమూర్తిగా పేరు తెచ్చుకున్నారన్నారు. జస్టిస్ సుభాషణ్ రెడ్డి కుటుంబ సభ్యులకు మంత్రి అల్లోల తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలుగువారందరూ గర్వించదగిన న్యాయకోవిదుడు సుభాషణ్ రెడ్డి మరణం తీరని లోటు అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
ఇంతకు ‘లోక్‌పాల్’ వస్తుందా?
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌పాల్, లోకాయుక్త బిల్లును భారత పార్లమెంట్ ఆమోదించి ఐదేళ్ల అనంతరం నరేంద్ర మోదీ ప్రభుత్వం తొలి లోక్‌పాల్‌గా సుప్రీం కోర్టు మాజీ జడ్జి జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్‌ను ఆదివారం నియమిస్తూ రాష్ట్రపతికి సిఫార్సు చేసిన విషయం తెల్సిందే. ఇంకా ఈ లోక్‌పాల్ కమిటీలోకి ఎనిమిది మంది సభ్యులను తీసుకోవాల్సి ఉంది. కమిటీలో షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, బీసీలు, మైనారిటీలు, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంది. ఈ బిల్లును పార్లమెంట్ ఆమోదించిన నేపథ్యంలోనే దేశంలో నల్ల డబ్బును నిర్మూలిస్తానని, అవినీతిని అంతం చేస్తానని తెగ ప్రచారం చేయడం ద్వారా నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చారు. కేంద్ర స్థాయిలో వెంటనే లోక్‌పాల్‌ను నియమిస్తారని సామాజిక కార్యకర్తలు ఆశించారు. తొలి లోక్‌పాల్‌ను నియమించడానికి నరేంద్ర మోదీకి ఐదేళ్లు పట్టింది. అదీ నాడు లోక్‌పాల్ కోసం ఉద్యమించిన అన్నా హజారే, లోక్‌పాల్‌ను నియమించాలంటూ మళ్లీ నిరశనకు దిగడం, మరోపక్క ఫిబ్రవరి నెలలోగా లోక్‌పాల్‌ను నియమించాలంటూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేయడం పరిణామాల మధ్య మోదీ నాయకత్వంలోని ఎంపిక కమిటీ ఎట్టకేలకు తొలి లోక్‌పాల్‌ను సిఫార్సు చేసింది. అదీ పార్లమెంట్ ఎన్నికల షెడ్యూలు ప్రకటించాక. మిగతా ఎనిమిది మంది సభ్యుల నియామకం ఎన్నికల్లోగా జరుగుతుందన్న నమ్మకం లేదు. సుప్రీం కోర్టు విధించిన గడువుకాలం ముగిసిన తర్వాత లోక్‌పాల్‌ను ఖరారు చేసినందున ఆయన నియామకం చెల్లుతుందన్న గ్యారంటీ లేదు. అవినీతి జరగకుండా చూసేందుకు ‘నేను కాపలాదారుడిని’ అని ప్రచారం చేసుకుంటున్న మోదీకి, మరింత ఎన్నికల ప్రచారం కోసం లోక్‌పాల్ నియామకం పనికి వస్తుందేమో! ఎంపిక కమిటీలో ప్రతిపక్షం మాటకు ఏం మాత్రం విలువ లేనప్పుడు లోక్‌పాల్ కమిటీ వల్ల ప్రభుత్వంలో అవినీతిని అరికట్టవచ్చని భావించడం అత్యాశే కావచ్చు! గుజరాత్ ముఖ్యమంత్రిగా లోక్‌పాల్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన నరేంద్ర మోదీ ‘లోక్‌పాల్ వ్యవస్థను తీసుకొస్తారనుకోవడం పొరపాటే కావచ్చు! 1968లోనే లోక్‌పాల్ గురించి చర్చ ప్రభుత్వ స్థాయిలో అవినీతిని అరికట్టేందుకు ఓ వ్యవస్థ కావాలంటూ 1968లో పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేయడంతో నాలుగవ లోక్‌సభలో లోక్‌పాల్ వ్యవస్థ గురించి మొదటిసారి చర్చకు వచ్చింది. లోక్‌పాల్ వ్యవస్థకు భయపడడం వల్ల ప్రధాని సహా కేబినెట్ మంత్రులు తమ విధులను సక్రమంగా నిర్వహించలేరన్న వాదనతో దాన్ని వాయిదా వేశారు. ఆ తర్వాత అనేక సార్లు ఈ ప్రతిపాదన వచ్చినా అదే వాదనతో దాన్ని పక్కన పెడుతూ వచ్చారు. దేశంలో అవినీతి అరికట్టేందుకు లోక్‌పాల్ వ్యవస్థ కావాలంటూ 2011లో అన్నా హజారే, నేటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, ఇతర సామాజిక కార్యకర్తలు ఉద్యమించడంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో లోక్‌పాల్ బిల్లుకు అంగీకరించింది. బిల్లును తీసుకరావడానకి రెండేళ్లు పట్టింది. 2013లో తీసుకొచ్చినప్పటికీ బిల్లులో మార్పులు, చేర్పుల కోసం పార్లమెంట్ సెలెక్ట్ కమిటీలు, స్థాయి సంఘాల చుట్టూ తిప్పడంతో 2014, జనవరి 1వ తేదీన చట్టరూపం దాల్చింది. లోక్‌పాల్ నియామకంపై జరుగుతున్న జాప్యానికి మూడున్నర ఏళ్లపాటు మౌనం వహించిన రాహుల్ గాంధీ 2018, జనవరి నెల నుంచి నరేంద్ర మోదీపై దాడి చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి అవకాశం దొరికినప్పుడల్లా ఈ విషయమై నిలదీస్తూ వచ్చారు. -
ఆరో రోజుకు హజారే దీక్ష
రాలెగావ్ సిద్ధి (మహారాష్ట్ర): లోక్‌పాల్, లోకాయుక్తాల నియామకాలు చేపట్టాలని, రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సామాజిక కార్యకర్త అన్నా హజారే చేపట్టిన దీక్ష సోమవారం ఆరో రోజుకు చేరింది. దీక్ష కారణంగా అన్నాహజారే 4.25 కేజీల బరువు తగ్గారని, బీపీ పెరిగిందని డాక్టర్ ధనంజయ్ పొటే తెలిపారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ అన్నా హజారే ప్రాణాలను కాపాడాలని శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్ఎన్ఎస్) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఎమ్ఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే,, సామాజిక కార్యకర్త రాజేంద్ర సింగ్ సోమవారం హజారేను కలిశారు. ‘హజారే 2013లో చేసిన దీక్ష కారణంగానే బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చింది. హజారే వల్లే కేజ్రీవాల్ ఎవరో దేశానికి తెలిసింది. అలాంటి వ్యక్తి కనీసం ధర్నాకు మద్దతు తెలియజేయలేదు’ అని ఠాక్రే అన్నారు. -
పద్మభూషణ్ వెనక్కిచ్చేస్తా: హజారే
రాలేగావ్‌సిద్ధి: కేంద్ర ప్రభుత్వం తన డిమాండ్లను నెరవేర్చకపోతే ఇచ్చిన పద్మభూషణ్ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేస్తానని సామాజిక కార్యకర్త అన్నాహజారే హెచ్చరించారు. రాలేగావ్ సిద్ధిలో చేపట్టిన ఆమరణ దీక్ష ఆదివారం నాటికి ఐదోరోజుకు చేరింది. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ..మోదీ ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే 1992లో ఇచ్చిన పద్మభూషణ్ పురస్కారాన్ని వాపసు చేస్తానని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. తక్షణమే లోక్‌పాల్, లోకాయుక్తలను ఏర్పాటు చేయడంతో పాటు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని కోరారు. ఎన్నికల సంస్కరణలు చే పట్టాలని డిమాండ్ చేశారు. కాగా, హజారేకు డాక్టర్ ధనంజయ పొటే ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ ఐదురోజుల్లోనూ ఆయన 3.8 కేజీల బరువు తగ్గిపోయినట్లు తెలిపారు. హజారే ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ రాలేగావ్ సిద్ధి గ్రామప్రజలు అహ్మద్‌నగర్–పుణె జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో బైఠాయించారు. దీంతో ఆరు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. -
నిరహార దీక్ష చేపట్టిన అన్నా హజారే
రాలేగావ్ సిద్ధి(మహారాష్ట్ర): సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి దీక్షకు దిగారు. లోక్‌పాల్ బిల్లు, లోకాయుక్త చట్టం నియామకాల్లో కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ బుధవారం ఆయన నిరహార దీక్ష చేపట్టారు. తొలుత ఆయన తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలోని పద్మావతి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆ తర్వాత విద్యార్థులు, యువకులు, రైతులతో కలిసి అక్కడికి సమీపంలోని యాదవ్‌బాబా ఆలయానికి వెళ్లిన హజారే అక్కడే దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రిని లోకాయుక్త పరిధిలోకి తేవాలని మహారాష్ట్ర క్యాబినేట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. అయినప్పటికీ తన దీక్ష కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలో రాకముందు లోక్‌పాల్, లోకాయుక్త, రైతు సమస్యలపై ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు దీక్ష కొనసాగిస్తానని తెలిపారు. కాగా, తాను దీక్ష ప్రారంభించనున్న విషయాన్ని సోమవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు రాసిన లేఖలో హజారే పేర్కొన్న సంగతి తెలిసిందే. -
‘అక్టోబర్ 2 నుంచి ఆమరణ నిరాహార దీక్ష’
న్యూఢిల్లీ : అవినీతి నిర్మూలన లక్ష్యంగా ఉద్యమిస్తున్న సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. దీని గురించి ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ లేఖలో అన్నా.. ప్రధాని చాలా పెద్ద పెద్ద హామీలు ఇస్తారు.. కానీ చేతల్లో మాత్రం శూన్యమంటూ ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచాయి. కానీ ఇప్పటివరకూ లోక్‌పాల్, లోకాయుక్తను నియమించలేదన్నారు. అందుకు నిరసనగా కేంద్రంలో లోక్‌పాల్, రాష్ర్టాల్లో లోకాయుక్త తీసుకురావాలన్న డిమాండ్‌పై గాంధీ జయంతి(అక్టోబర్ 2) నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని అన్నా హజారే ప్రకటించారు. అంతేకాక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులకు మేలు చేసే వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్(సీఏసీపీ)కి స్వయం ప్రతిపత్తి కల్పిస్తానని హమీ ఇచ్చింది. కానీ ఇంత వరకూ అందుకు సంబంధించి ఎటువంటి చర్య తీసుకోలేదని ఆరోపించారు. సీఏసీపీకి స్వయం ప్రతిపత్తి కల్పిస్తే ఆ కమిషనే వివిధ వ్యవసాయ ఉత్పత్తుల ధరలను నిర్ణయిస్తుందని గుర్తు చేశారు. కనీస మద్దతు ధర లేకనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. లోక్‌పాల్, లోకాయుక్త డిమాండ్లపై ఈ ఏడాది మార్చిలో ఢిల్లీలోని చరిత్రాత్మక రామ్ లీలా మైదానంలో అన్నా హజారే నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. -
లోకాయుక్తకు కత్తిపోట్లు
-
బెంగళూరు షాక్.. లోకాయుక్తకు కత్తిపోట్లు
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో ఓవ్యక్తి ఏకంగా ఆ రాష్ట్ర లోకాయుక్తను కత్తితో పలుమార్లు పొడిచేసి కలకలం సృష్టించాడు. నేరుగా బెంగళూరులోని లోకాయుక్త ఆఫీసుకు వెళ్లి అక్కడ లోకాయుక్తగా పనిచేస్తున్న జస్టిస్ పీ విశ్వనాథ శెట్టి(74)పై కత్తితో పలుమార్లు దాడి చేశాడు. ఈ ఘటనతో ఉలిక్కిపడిన భద్రతా సిబ్బంది అప్రమత్తమై అతడిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. పలు కత్తిపోట్లకు గురైన లోకాయుక్త జస్టిస్ విశ్వనాథశెట్టిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. దాడికి పాల్పడిన వ్యక్తిని తేజస్ శర్మ అనే వ్యక్తిగా గుర్తించారు. ఈ మేరకు కర్ణాటక హోమంత్రి రామలింగ రెడ్డి ప్రకటన చేశారు. పోలీసుల వివరాల ప్రకారం ఓ ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తి తన ఫిర్యాదుపై అలసత్వం ప్రదర్శించారనే ఆగ్రహంతో ఏకంగా జస్టిస్ శెట్టిపై కత్తితో దాడికి పాల్పడినట్లు తెలిసింది. ఈ ఘటన జరిగిన వెంటనే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య నేరుగా ఆస్పత్రికి వెళ్లి జస్టిస్ శెట్టిని పరామర్శించారు. ఈ ఘటనపై కాంగ్రెస్‌పార్టీ నేత బ్రిజేశ్ కలప్పా స్పందిస్తూ లోకాయుక్తను ఎవరైనా కలుసుకోవచ్చని అన్నారు. ఏదైనా ఒక అవినీతి అంశానికి సంబంధించి ఆధారాలుంటే వాటిని తీసుకొని సామాన్యుడు సైతం లోకాయుక్తను కలిసేందుకు అవకాశం ఉందని, కనీసం ఒక ఆయుధం కలిగిన భద్రతా సిబ్బంది కూడా అక్కడ లేరని చెప్పారు. బహుశా దాడికి పాల్పడిన వ్యక్తి మతిస్థిమితం సరిగా లేని వ్యక్తి అయ్యుంటాడని అనుమానం వ్యక్తం చేశారు. ’పలు చోట్ల సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. మెటల్ డిటెక్టర్ కూడా ఉంది. ఎంతోమందిని గమనిస్తునే ఉంటారు.. అలాంటిది అక్కడ భద్రతా మొత్తానికే లేదని కూడా అనలేం’ అని ఆయన మరో అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే, మాజీ లోకాయుక్త సంతోష్ హెగ్దే దీనిపై స్పందిస్తూ కచ్చితంగా ఈ దాడి వెనుక కుట్ర కోణం ఉండి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. -
లోకాయుక్త, అధికార భాష చట్టాలకు సవరణ బిల్లులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రెండు కీలకమైన బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టింది. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా లోకాయుక్త ఏర్పాటు, రాష్ట్రంలో ఉర్దూను రెండో అధికార భాషగా ప్రకటించేందుకు అవసరమైన బిల్లును మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రవేశపెట్టారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ముందు రాష్ట్రంలో తెలుగు అధికార భాషగా ఉండింది. తెలంగాణలో ఖమ్మం జిల్లాలో మినహా మిగిలిన జిల్లాల్లో ఉర్దూ రెండో అధికార భాషగా అమలైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016 అక్టోబరులో పది జిల్లాలను 31 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించాం. ఉర్దూ మాట్లాడే వారి జనాభా 31 జిల్లాల్లోనూ ఉంది. రాష్ట్రం మొత్తం జనాభాలో ఉర్దూ మాట్లాడేవారి జనాభా 12.69 శాతం ఉంది. తెలంగాణ అధికార భాషల చట్టంను సవరించి రాష్ట్రం మొత్తానికి ఉర్దూను రెండో భాషగా ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది’ అని ప్రభుత్వం ఈ సందర్భంగా ప్రకటన జారీ చేసింది. అలాగే లోకాయుక్త సవరణ బిల్లు విషయంలోనూ మరో ప్రకటన జారీ చేసింది. ‘తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా లోక్‌పాల్, లోకాయుక్త చట్టం నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించాము. రాష్ట్రానికి విడిగా లోకాయుక్త, ఉప లోకాయుక్త సంస్థను స్థాపించేందుకు తెలంగాణ లోకాయుక్త చట్టంలో కొన్ని సవరణలు చేసేందుకు ఈ బిల్లు ఉద్దేశించినది’అని పేర్కొన్నారు. -
లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి పదవీ విరమణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీలకు లోకాయుక్తగా వ్యవహరిస్తున్న విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.సుభాషణ్ రెడ్డి బుధవారం పదవీ విరమణ చేశారు. లోకాయుక్త కార్యాలయ ప్రాంగణంలో ఆయనకు సన్మానం చేశారు. కార్యక్రమంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ ఎ.గోపాల్‌రెడ్డి, జస్టిస్ పి.స్వరూప్‌రెడ్డి, జస్టిస్ జి.చంద్రయ్య, ఉపలోకాయుక్త గంగిరెడ్డి పాల్గొన్నారు. మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పోస్టు ఎంత ఆత్మ సంతృప్తి కలిగించిందో.. లోకాయుక్త పోస్టు కూడా అంతే సంతృప్తి కలిగించిందని జస్టిస్ సుభాషణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ పోస్టుల ద్వారా అనేక మంది పేదలకు న్యాయం చేసే అవకాశం కలిగిందన్నారు. పెన్షన్లు, రేషన్ కార్డులు వంటివి అందక ఇబ్బందిపడే పేద ప్రజలకు న్యాయం జరిగేలా చూశానని, ఇది ఎంతో ఆనందం కలిగించిందని ఆయన చెప్పారు. పేదలకు న్యాయం చేసేందుకు ఒక్కోసారి చట్ట పరిధి దాటి కూడా వ్యవహరించాల్సి వచ్చిందన్నారు. తన సిబ్బంది సహాయ సహకారాలు అందించారని, లోకాయుక్తలో భర్తీ చేసిన పోస్టుల విషయంలో ఎక్కడా పక్షపాతానికి తావివ్వలేదని పేర్కొన్నారు. ఏ వృత్తిలోనైనా కష్టపడితేనే ఫలితం దక్కుతుందని పేర్కొన్నారు. జస్టిస్ సుభాషణ్‌రెడ్డి గొప్ప మానవతావాదని ఉపలోకాయుక్త గంగిరెడ్డి కొనిడాయారు. విధి నిర్వహణలో సుభాషణ్‌రెడ్డి ఎంతో మందికి ఆదర్శప్రాయులని తెలిపారు. అనంతరం జస్టిస్ సుభాషణ్‌రెడ్డి దంపతులను ఘనంగా సన్మానించారు. లోకాయుక్తగా జస్టిస్ సుభాషణ్‌రెడ్డి పదవీ విరమణ చేసిన నేపథ్యంలో కొత్త లోకాయుక్త నియామకానికి ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. అప్పటి వరకు ఉప లోకాయుక్త గంగిరెడ్డి లోకాయుక్తగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. -
‘ట్రాక్టర్ల పంపిణీ’ అక్రమాలపై నివేదిక ఇవ్వండి
- జీవన్‌రెడ్డి ఫిర్యాదుపై స్పందించిన లోకాయుక్త - విచారణ నవంబర్ 23కి వాయిదా సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా జరుగుతోన్న ట్రాక్టర్ల పంపిణీలో అక్రమాలపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని లోకాయుక్త ఆదేశించింది. ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే లబ్ధి పొందుతున్నారని, అర్హులకు ట్రాక్టర్లు అందడం లేదంటూ జీవన్‌రెడ్డి చేసిన ఫిర్యాదుపై లోకాయుక్త స్పందించింది. ట్రాక్టర్లు ఎవరెవరికి ఇవ్వాలో మంత్రులే జాబితాలు సిద్ధం చేసి పంపుతున్నారని, దీంతో టీఆర్ఎస్ నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి ఆ మేర ట్రాక్టర్లు పంపిణీ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న లోకాయుక్త ఈ మొత్తం వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 23కి వాయిదా వేసింది. -
ఎన్జీఓ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడిపై విచారణ
కర్నూలు(అగ్రికల్చర్): నాన్ గజిటెడ్ ఆఫీసర్స్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు వీసీహెచ్ వెంగళరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి విచారణ జరిపారు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే రామచంద్రరావు.. వెంగళరెడ్డిపై వివిధ ఆరోపణలతో గతంలో లోకాయుక్తను ఆశ్రయించారు. ఈ మేరకు లోకాయుక్త సమగ్రంగా విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. కలెక్టర్.. ప్రత్యేక కలెక్టర్‌ను విచారణ అధికారిగా నియమించారు. ఇందులో భాగంగా ఫిర్యాదు దారుడయిన రామచంద్రరావును సోమవారం విచారించారు. ఆయన తన దగ్గర ఉన్న ఆధారాలను విచారణ అధికారికి సమర్పించారు. అనంతరం ఆరోపణలపై వెంగళరెడ్డిని విచారించారు. ఆరోపణలకు సంబంధించి ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు. -
పదవులకు వన్నె తెచ్చేలా పనిచేయాలి
లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: అంకితభావంతో పనిచేసి చేపట్టిన పదవులకు వన్నెతెచ్చేలా పనిచేయాలని ఉమ్మడి రాష్ట్రాల లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తిగా, తమిళనాడు, కేరళ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా, ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రాల లోకాయుక్తగా ప్రజలకు సత్వర న్యాయం అందించే దిశగా శాయశక్తులా కృషి చేశానని, ఆయా పదవులకు న్యాయం చేసేలా...వన్నెతెచ్చేలా పనిచేశానని వివరించారు. జస్టిస్ సుభాషణ్‌రెడ్డి 74వ జన్మదినోత్సవం సందర్భంగా లోకాయుక్త సిబ్బంది కార్యాలయ ఆవరణలో గురువారం పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ సుభాషణ్‌రెడ్డి మాట్లాడుతూ...పాలనా యంత్రాంగం తప్పులను సరిదిద్ది, ప్రజలకు సుపరిపాలన అందేలా చూడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. లోకాయుక్తగా నాలుగున్నరేళ్ల పనితీరు తనకు సంతృప్తిని కల్గించిందన్నారు. తమిళనాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుభాషణ్‌రెడ్డి పనిచేసినప్పుడు రికార్డు స్థాయిలో కేసులను పరిష్కరించారని తమిళనాడు పూర్వ న్యాయమూర్తులు జస్టిస్ గోవిందరాజన్, జస్టిస్ కన్నదాసన్ వివరించారు. కార్యక్రమంలో ఉపలోకాయుక్త గంగిరెడ్డి, పూర్వ ఉపలోకాయుక్త కృష్ణాజీరావు, రిజిస్ట్రార్ జగన్నాథరెడ్డి, డైరెక్టర్ (లీగల్) నవమోహన్‌రావు, దర్యాప్తు విభాగం డైరెక్టర్ నరసింహారెడ్డి, డిప్యూటీ రిజిస్ట్రార్ శేఖర్‌రెడ్డి, అధికారులు మురళీకృష్ణ, తాజుద్దీన్, అమరేందర్‌రెడ్డి, సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నాన్నా అనకుండానే..
బెంగళూరు : కర్ణాటకలోని దొడ్డబళ్లాపురంలో రోడ్డుప్రమాదంలో దుర్మరణం పాలైన మైసూరు లోకాయుక్త ఎస్పీ రవికుమార్ (36) అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. బెంగళూరు నుంచి మైసూరుకు తిరిగివెళ్తూ ఆయన ప్రయాణిస్తున్న కారు రామోహళ్లి వద్ద బోల్తా పడడంతో దుర్మరణం పాలయ్యారు. గురువారం రవికుమార్ భౌతికకాయాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు. కడసారి చూసేందుకు బంధువులే కాకుండా పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు, జనం తరలివచ్చారు. సాసలు గ్రామంలో చిన్ననాటి స్నేహితులు రవిని తలుచుకుని కన్నీటిపర్యంతమయ్యారు. కుటుంబ సభ్యులను సముదాయించడం ఎవరితరం కాలేదు. నిరుపేద కుటుంబం నుంచి ఉన్నతస్థాయికి మూడేళ్ల క్రితం రవికుమార్‌కు అనిత అనే యువతితో వివాహం జరుగగా 10 రోజుల క్రితమే వారికి ఆడపాప జన్మించింది. పురిటి బిడ్డ కన్నతండ్రిని కళ్లుతెరిచి చూసే లోపే శాశ్వతంగా తండ్రి దూరమవడం అందరినీ కంటతడి పెట్టించింది. రవికుమార్ తల్లిదండ్రులు తీవ్ర శోకంలో మునిగిపోయారు. నిరుపేద రైతు కుటుంబానికి చెందిన రవికుమార్ పట్టుదలతో చదివి పోలీసు అధికారిగా ఉద్యోగంలో చేరారు. స్వశక్తితో జీవితంలో ఉన్నతస్థానానికి చేరుకుంటున్న తరుణంలో విధికి కన్నుకుట్టింది. ఆయనకు ఇద్దరు అన్నలు ఉండగా ఒకరు టీచరు, మరొకరు రైతు. భార్య అనిత గృహిణి. భర్త లేడనే చేదు నిజం నమ్మలేక ఆమె షాక్‌కు గురైంది. పాప పుట్టాక భర్త ఒక్కసారి చూసి వెళ్లారు. త్వరలోనే వస్తానంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని బంధువులు విలపించారు. తిరిగిచూడని మంత్రులు.. భగ్గుమన్న స్థానికులు మధ్యాహ్నం ఒంటిగంట అయినా ఒక్క మంత్రి కూడా రవికుమార్‌కు నివాళులర్పించడానికి రాకపోవడం పట్ల గ్రామస్తులు ఆగ్రహించారు. ఒక ఉన్నతాధికారి విధినిర్వహణలో మరణిస్తే కనీసం నివాళులర్పించలేరా? అని ప్రశ్నించారు. హోం మినిస్టర్ పరమేశ్వర్, జిల్లా ఇన్చార్జి మంత్రి కృష్ణభైరేగౌడ తక్షణం రావాలని డిమాండు చేస్తూ గంటపాటు రవికుమార్ భౌతికకాయంతో ధర్నా చేపట్టారు. అనంతరం అక్కడకు చేరుకున్న స్థానిక ఎమ్మెల్యే వెంకట రమణయ్య మాట్లాడుతూ మంత్రులు రాలేని పరిస్థితిలో ఉన్నారని వివరణ ఇచ్చి శాంతింపజేశారు. జిల్లా కలెక్టర్ పాలయ్య, ఏసీ జగదీష్, తహసీల్దార్ మోహన్, బెంగళూరు ఐజీ సీమంత్‌కుమార్‌సింగ్, మైసూరు ఐజీ నితిన్‌కుమార్, ఉన్నతాధికారులు రవికుమార్‌ను కడసారి దర్శించి నివాళులర్పించారు. -
రోడ్డు ప్రమాదంలో లోకాయుక్తా ఎస్పీ మృతి
బెంగుళూరు: బెంగుళూరు-మైసూరు రహదారిపై బుధవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న లోకాయుక్తా ఎస్పీ, కారు డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లోకాయుక్తా మైసూర్ విభాగానికి చెందిన ఎస్పీ రవికుమార్ బుధవారం బెంగుళూరు వెళ్లారు. అనంతరం రాత్రి మైసూరుకు తిరిగి వెళ్తుండగా రామోహళ్లి సమీపంలో డివైడర్‌ను ఢీ కొట్టింది. ఆ తర్వాత ఎదురుగా వస్తున్న టిప్పర్, ఆటోలను ఢీ కొట్టడంతో కారు నుజ్జుయింది. కారులో ప్రయాణిస్తున్న ఎస్పీ రవికుమార్, కారు డ్రైవర్ కిరణ్‌లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసుకున్న కంబళగూడు పోలీసులు మృతదేహాలను స్ధానిక రాజరాజేశ్వరి ఆసుపత్రికి తరలించారు. -
లోకాయుక్తకి చిక్కిన ఉన్నతాధికారి
తికమ్‌గర్ (మధ్యప్రదేశ్) : మధ్యప్రదేశ్‌లోని కో ఆపరేటివ్ కౌన్సిల్‌లోని ఓ ఉన్నతాధికారి ఇంటిపై శుక్రవారం లోకాయుక్త మెరుపు దాడి చేసింది. తికమ్గర్లోని ఇంటితోపాటూ ఆఫీస్‌పై ఏకకాలంలో దాడులు నిర్వహించిన అధికారులకు దాదాపు రూ. 9 కోట్ల విలువ చేసే ఆస్తులను గుర్తించారు. ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. -
ప్రజలకు సత్వర న్యాయం అందాలి
సాక్షి, హైదరాబాద్: ప్రజలందరికీ కూడూ, గూడూ, గుడ్డతోపాటు సత్వర న్యాయం అందినప్పుడే భారత రాజ్యాంగ లక్ష్యం నెరవేరుతుందని ఉమ్మడి రాష్ట్రాల లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోకాయుక్త కార్యాలయం ఆవరణలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. జనాభాకు తగ్గట్టుగా న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు లేకపోవడంతో ప్రజలకు సత్వర న్యాయం అందడం లేదన్నారు. లోకాయుక్తగా తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో దాదాపు 20 వేల కేసులు దాఖలయ్యాయని, ఇందులో మెజారిటీ కేసులను పరిష్కరించామని అన్నారు. ప్రజలకు ఉపశమనం లభిస్తుండడంతోనే ఎక్కువ సంఖ్యలో న్యాయం కోసం లోకాయుక్తను ఆశ్రయిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపలోకాయుక్త టి.గంగిరెడ్డి, రిజిస్ట్రార్ జగన్నాథరెడ్డి, డైరెక్టర్ (దర్యాప్తు) నరసింహారెడ్డి, డైరెక్టర్ (లీగల్) నవమోహనరావు, అధికారులు శేఖర్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి, తాజుద్దీన్, సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ గొప్ప పథకం ఆరోగ్యశ్రీ పథకం పేద ప్రజలకు గొప్ప వరమని, కార్పొరేట్ ఆసుపత్రులవైపు కన్నెత్తిæకూడా చూడలేని నిరుపేదలు ఆ ఆసుపత్రుల్లో దర్జాగా వైద్యం పొందుతున్నారని జస్టిస్ సుభాషణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు పేదలకు మేలు చేస్తున్నాయని అన్నారు. భూసేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం 2013లో తెచ్చిన చట్టం అమలులో ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ కోసం ఇటీవల మరో చట్టం తెచ్చిందని, ఉమ్మడి జాబితాలోని అంశాల్లో రాష్ట్రాలు కూడా చట్టాలు చేసుకునే వెసులుబాటు రాజ్యాంగం కల్పించిందని, అయితే రాష్ట్రాలు చేసిన చట్టాలకు రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరని తెలిపారు. -
5,282 కేసులు పరిష్కరించాం
► ఈ ఏడాది మరింత సమర్థవంతంగా పనిచేస్తాం ► ఉమ్మడి రాష్ట్రాల లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: అధికార యంత్రాంగం నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం, అవినీతిపై దాఖలైన 5282 కేసులను పరిష్కరించి ప్రజలకు న్యాయం అందించామని ఉమ్మడి రాష్ట్రాల లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి అన్నారు. శనివారం లోకాయుక్త కార్యాలయం ఆవరణలో ఈ ఏడాదిలో తన కార్యాలయం పనితీరుపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇక్కడ దాఖలయ్యే కేసులు లోకాయుక్త పరిశీలనకు నెల తర్వాత వచ్చే వని, తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత వెంటనే తన ముందుకు వచ్చేలా నిబంధ నలను సరళతరం చేశానని వివరించారు. లోకాయుక్త కార్యాలయంపై ప్రజలకు విశ్వాసం ఏర్పడిందని, కేసుల సంఖ్య గణనీయంగా పెరగడమే ఇందుకు నిదర్శనమన్నారు. నూతన సంవత్సరంలో మరింత సమర్థవం తంగా పనిచేసేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. తమ సిబ్బంది పూర్తిగా సహకరించడం వల్లనే ప్రజలకు వీలైనంత త్వరగా న్యాయం అందించగలుగుతున్నామ న్నారు. తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంట్‌ను సిబ్బందికి అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ జగన్నాథరెడ్డి, దర్యాప్తు విభాగం డైరెక్టర్ నరసింహారెడ్డి, ఉన్నతాధికారులు శేఖర్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి, తాజుద్దీన్తదితరులు పాల్గొన్నారు. -
‘ఆరాధన’ ఘటనపై నివేదిక ఇవ్వండి
నార్త్‌జోన్ డీసీపీకి లోకాయుక్త ఆదేశం సాక్షి, హైదరాబాద్: బలవంతంగా ఉపవాస దీక్ష చేయించి చిన్నారి ఆరాధన మృతికి కారణమైన ఘటనపై దర్యాప్తు చేసి ఈ నెల 24లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని నార్త్‌జోన్ డీసీపీని ఉమ్మడి రాష్ట్రాల లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి గురువారం ఆదేశిం చారు. ఆరాధనతో 68 రోజులు ఉపవాస దీక్ష చేయించి ఆమె మృతికి కారణమైన తల్లిదండ్రులు లక్ష్మీచంద్ సమ్‌దారియా, మనిషాలతోపాటు ఉపవాస దీక్షను ప్రోత్సహించిన వారందరిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధా రావు దాఖలు చేసిన పిటిషన్‌ను లోకాయుక్త విచారణకు స్వీకరించింది. -
'ఆరాధన కేసులో ఈ నెల 24లోపు నివేదిక ఇవ్వాలి'
హైదరాబాద్: ఉపవాస దీక్షతో మృతిచెందిన ఆరాధన కేసు వ్యవహారంపై గురువారం లోకయుక్తలో ఫిర్యాదు నమోదైంది. నగరానికి చెందిన ఓ వ్యాపారికి ఇటీవలి కాలంలో తరచూ నష్టాలు వస్తుండటంతో.. కుటుంబ సభ్యుల బలవంతంతో ఆయన పదమూడేళ్ల కూతురు ఆరాధన 68 రోజుల పాటు ఉపవాస దీక్ష చేసి డీహైడ్రేషన్‌కు గురై ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ అంశంలో జోక్యం చేసుకున్న బాలల హక్కుల సంఘం లోకయుక్తలో ఫిర్యాదు చేసింది. ఆరాధన మృతికి కారకులైనవారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. ఈ వ్యవహారంపై సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి ఈ నెల 24 లోపు సమగ్ర నివేదికం అందించాలని నార్త్‌జోన్ డీసీపీకి లోకయుక్త ఆదేశాలు జారీ చేసింది. -
ఏఎన్‌యూ అక్రమాలపై లోకాయుక్తకు ఫిర్యాదు
* నిధుల వినియోగం, పనుల కేటాయింపులపై ఆరోపణలు * ఫిర్యాదు దాఖలు చేసిన గుంటూరు వాసి * నవంబర్ 22న హాజరు కావాలని ఏఎన్‌యూ రిజిస్ట్రార్‌కు లోకాయుక్త సూచన ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గతంలో జరిగిన పలు ఆర్థికపరమైన లావాదేవీలు, ఉద్యోగులకు చెల్లింపులు, వివిధ పరికరాల కొనుగోలు, నిర్మాణ పనులకు అధికంగా చెల్లింపులు చేశారనే అంశాలపై గుంటూరుకు చెందిన కేవీఆర్ శివరాంప్రసాద్ లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. యూనివర్సిటీకి ప్రహరీ నిర్మాణానికి ఓ కాంట్రాక్టర్ రూ.76 లక్షలకు పనులు చేసేందుకు సిద్ధంగా ఉంటే వర్సిటీ అధికారులు మరో కాంట్రాక్టర్‌కు అదే పనిని కోటి రూపాయలకు పైగా ఇచ్చి చేయించారని, దూరవిద్యా కేంద్రంలో కొన్ని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, రోజువారీ వేతన ఉద్యోగుల నియామకం ఉన్నతాధికారుల అనుమతులతో జరగలేదని, కాంట్రాక్ట్ తదితర ఉద్యోగులను మూడు నెలల కాల వ్యవధితో నియమించుకుని వారికి నాలుగు కోట్ల రూపాయలకు పైగా చెల్లింపులు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్యోగుల సర్వీస్ రిజిస్ట్రర్‌ను సక్రమంగా నిర్వహించటం లేదని, పీఆర్సీ బకాయిల చెల్లింపులో కోట్ల రూపాయలు గోల్మాల్ జరిగాయని ఫిర్యాదులో ఆరోపించారు. పర్చేజింగ్ కమిటీ నిబంధనలు, అనుమతులు పొందకుండానే కొన్ని కొనుగోళ్లు చేశారని, టెండర్లు లేకుండానే ఆస్ట్రేలియా నుంచి రూ.25.46 లక్షల విలువ చేసే పరికరం కొనుగోలు చేశారని, 2012–13లో కమ్యూనిటీ రేడియో స్టేషన్‌కు సంబంధించి రూ.18.45 లక్షల పనులకు టెండర్లు పిలవలేదని పేర్కొన్నారు. యూనివర్సిటీకి చెందిన కొందరు అధ్యాపకులు రూ.4.16 కోట్ల యూజీసీ నిధులను అడ్వాన్స్‌ల రూపంలో తీసుకుని వాటికి లెక్కలు చేపలేదని, కార్ అలవెన్స్‌ల రూపంలో రూ.1.48 కోట్లను నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించిన లోకాయుక్త ఈ ఏడాది నవంబర్ 22వ తేదీ∙హైదరాబాద్‌లోని లోకాయుక్త కార్యాలయంలో హాజరుకావాలని యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు లేఖ పంపింది. -
భూసేకరణ చట్టం ద్వారానే సేకరించండి
-ఏపీ సర్కారుకు లోకాయుక్త ఆదేశం సాక్షి, హైదరాబాద్ రాజధాని నిర్మాణం కోసం అవసరమయ్యే భూమిని బలవంతంగా సేకరించరాదని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం మాత్రమే సేకరించాలని లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఏపీ సర్కారుకు ఉత్తర్వులు జారీచేశారు. రాజధాని నిర్మాణం కోసం సారవంతమైన భూములను రైతులను బెదిరించి బలవంతంగా సేకరిస్తున్నారంటూ హైకోర్టు న్యాయవాది రాజ్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సుభాషణ్‌రెడ్డి సోమవారం మరోసారి విచారించారు. మా పొట్టకొట్టి కట్టేది ప్రజా రాజధాని అవుతుందా’’ అంటూ రైతుల అభిప్రాయాలతో గతంలో సాక్షి ప్రచురించిన కథనాన్ని ఈ సందర్భంగా ఆయన లోకాయుక్త దృష్టికి తెచ్చారు. ల్యాండ్ పూలింగ్ కింద స్వచ్ఛందంగా ఇచ్చే రైతుల నుంచి మాత్రమే భూములను సేకరిస్తున్నామని, ఇందుకు సిద్దంగాలేని రైతుల నుంచి భూసేకరణచట్టం ప్రకారం భూమిని సేకరిస్తామని అధికారులు నివేదిక సమర్పించారు. ఈ నివేదికను పరిగణలోకి తీసుకున్న లోకాయుక్త...ఈ పిటిషన్‌పై విచారణను ముగించారు. -
లోకాయుక్త ఫిర్యాదుపై ఆర్డీఓ విచారణ
సాలూరు : మండలంలోని శివరాంపురం గ్రామ సహాయకుడు(తలయారీ) ప్రభుత్వం భూమిని అమ్మేసుకున్నాడని లోకాయుక్తకు ఫిర్యాదు అందడంతో పార్వతీపురం ఆర్డీఓ ఆర్.గోవిందరావు శుక్రవారం విచారణ జరిపారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన విచారణలో తలయారీ, గ్రామస్తులతో మాట్లాడారు. తలయారీ వెలగాడ సింహాచలం 1984లో ప్రభుత్వ భూమిని ఇతరులకు అమ్మేశాడని అదే గ్రామానికి చెందిన వెలగాడ సుందరరావు అనే వ్యక్తి లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్డీఓ విచారణ జరిపారు. అయితే తాను ఉద్యోగంలో చేరింది 1985లోనని తన తాతల నుంచి సంక్రమించినట్టుగా క్రయపత్రాలున్నాయని, వాటి ఆధారంగా భూమిని అమ్మానని సింహాచలం చెబుతున్నాడు. విచారణ అంశాలను లోకాయుక్తకు పంపనున్నట్లు ఆర్డీఓ తెలిపారు. -
కేటీపీపీ సీఈకి లోకాయుక్త నోటీసులు
వరంగల్ జిల్లా గణపురం మండలం చెల్పూరు శివారులోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ) సీఈ శివకుమార్‌కు లోకాయుక్త నోటీసులు జారీ చేసింది. కేటీపీపీలో ఉద్యోగ నియామకాల్లో, క్యాజువల్ లేబర్ ఎంపికలో అధికారులు అవినీతికి పాల్పడ్డారని స్థానిక నిరుద్యోగులు లోకాయుక్తకు జూన్ 17వ తేదీన ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన లోకాయుక్తా సంబంధిత అధికారులకు నోటీసులు పంపించింది. కేటీపీపీ అధికారుల వింత నిర్ణయాల మూలంగా ప్లాంట్‌లో స్థానికేతరులకు ఉద్యోగాలు లభించాయి. ఇటీవల చేపట్టిన 420 జేపీఏ(జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్) ఉద్యోగ నియూమకాల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. దీనిపై సీఈకి నోటీసులు జారీ చేసిన లోకాయుక్త.. 24న తమ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. -
భాస్కర్రావ్కు ఇక్కట్లు
బెంగళూరు: నివృత్త లోకాయుక్త భాస్కర్‌రావ్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి హోంశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు సమాచారం. భాస్కర్‌రావ్ కుమారుడైన అశ్విన్రావ్ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లోకాయుక్త జాయింట్ కమిషనర్ రియాజ్ సహకారంతో అక్రమాలకు పాల్పడిన కేసులను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (ఎస్ఐటీ) దర్యాప్తు చేస్తోంది. ఈ కేసుకు సంబంధించి భాస్కర్‌రావ్ నుంచి కొంత సమాచారం తీసుకున్నా అయన్ను నిందితుడి స్థానంలో ఉంచి విచారణ చేయడానికి గవర్నర్ అనుమతి అవసరం. ఈ నేపథ్యంలో పరిస్థితని వివరిస్తూ సీఐటీ ప్రభుత్వానికి లేఖ రాసింది. సదరు లేఖ ప్రభుత్వం నుంచి రాజ్‌భవన్‌కు చేరడంతో గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా భాస్కర్‌రావ్‌ను విచారించడానికి మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత అనుమతించినట్లు సమాచారం. దీంతో ఇప్పటి వరకూ సాక్షి స్థానంలో ఉన్న భాస్కర్‌రావ్‌ను సీఐటీ సంస్థ విచారించి అటు పై అరెస్టు చేయడానికి సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఇంజనీర్ కృష్ణమూర్తిని డబ్బులు డిమాండ్ చేసిన కేసులో భాస్కర్రావ్కు సంబంధం ఉందని తేలడంతో ఆయన్ను అరెస్టు చేయడానికి ఎస్ఐటీ అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
సరోజినీ ఘటనపై దర్యాప్తు ముమ్మరం
హైదరాబాద్ : సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో శస్త్రచికిత్సలు వికటించిన ఘటనపై లోకాయుక్తా శనివారం విచారణ ముమ్మరం చేసింది. లోకాయుక్తా పరిశోధనాధికారి నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన విచారణకు డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ హెల్త్ వైద్యులు హాజరయ్యారు. లోపం ఎక్కడుందన్న దానిపై విచారణ జరిపారు. అయితే తాము ఎలాంటి తప్పు చేయలేదని వైద్యులు స్పష్టం చేస్తూ, తమపై క్రిమినల్ కేసులను నమోదు చేయటాన్ని వైద్యులు బృందం ఖండించింది. కాగా కంటిచూపు మందగించడంతో దానిని మెరుగుపర్చుకోవడం కోసం సరోజినీ ఆస్పత్రిలో గత నెల 30న 21 మంది క్యాటరాక్ట్ శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. అయితే వారిలో 13 మంది ఇన్ఫెక్షన్ బారినపడగా.. ఏడుగురికి కంటిచూపు పోయిన విషయం తెలిసిందే. అయితే సెలైన్‌లో బ్యాక్టీరియా ఉండటం వల్లే ఈ ఘటనకు కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి సెలైన్లు చాలా ప్రభుత్వ ఆస్పత్రులకు పంపిణీ చేశారని, వాటిన్నింటినీ తిరిగి స్వాధీనం చేసుకోవాలన్నారు. సెలైన్ల పంపిణీపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని డాక్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. నిపుణులైన వైద్యులే శస్త్రచికిత్సలు చేశారని తెలిపారు. ఇక లోకాయుక్త డిప్యూటీ డెరైక్టర్ తాజుద్దీన్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నర్సయ్యలతో కూడిన బృందం నిన్న సాయంత్రం సరోజినీ ఆస్పత్రిలో విచారణ జరిపి, బాధితుల నుంచి వివరాలు సేకరించింది. ఈ బృందం ఇవాళ ఉదయం మరోసారి ఆస్పత్రిలో పర్యటించింది. ఆస్పత్రిలో ప్రతి ఒక్కరి నుంచి విచారణ బృందం వివరాలు సేకరించింది. రోగులతో పాటు డాక్టర్లను, నర్సులను విచారణ చేశారు. ఆపరేషన్ థియేటర్‌ను క్షుణ్ణంగా పరిశీలించింది. అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసి కంటి ఆస్పత్రుల రీజనల్ కమిటీ కూడా విచారణ జరిపింది. ఈ ఘటనపై ఆ కమిటీ సాయంత్రం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ సందర్భంగా ఐ ఆస్పత్రి రీజనల్ కమిటీ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సెలైన్‌లో ఫంగస్ ఉందన్నారు. అలాగే ఈ కేసును సుమోటోగా స్వీకరించిన హెచ్చార్సీ... పూర్తి వ్యవహారంపై ఈనెల 21లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, సరోజినీ ఆస్పత్రి సూపరింటెండెంట్లను ఆదేశించింది. -
రంగంలోకి లోకాయుక్త
విజయనగరం కంటోన్మెంట్: విజయనగరం జిల్లాలో అధికారం అండతో ఇష్టానుసారం వ్యవహరించి...అర్హులకు దగ్గాల్సిన పోస్టుల్ని అమ్ముకున్న వైనంపై లోకాయుక్త దృష్టిసారించింది. ఈ మేరకు గజపతినగరం ఎమ్మెల్యే లేఖలపై స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు వచ్చేనెల 28న లోకాయుక్త కు హాజరు కావాలని ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్, ఎమ్మెల్యే రాసిన లేఖల ప్రకారం పోస్టుల పందేరం చేసిన కాంట్రాక్టర్ స్వామినాయుడుకు నోటీసులు జారీ చేసింది. షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల్లో ఎమ్మెల్యే జోక్యం ఈపీడీసీఎల్ పరిధిలోని సబ్స్టేషన్లలో షిఫ్ట్‌ఆపరేటర్ల పోస్టుల్లో డబ్బులిచ్చినవారినే గజపతినగరం ఎమ్మెల్యే కేఏ నాయుడు నియమించుకునేలా సిఫార్సుల లేఖలిచ్చారని గజపతినగరం మండలం లోగిశ గ్రామానికి చెందిన టీడీపీ మాజీ పరిశీలకుడు సామంతుల పైడిరాజు మార్చి 23న లోకాయుక్తను ఆశ్రయించారు. కాంట్రాక్టర్ స్వామినాయుడు, ఎస్ఈ తదితరులందరికీ సిఫార్సు లేఖలిచ్చారని రంగంలోకి లోకాయుక్త ఫిర్యాదులో పేర్కొన్నారు. కాంట్రాక్టర్ స్వామినాయుడు నిబంధనలనకు విరుద్ధంగా వ్యవహరించారనీ, ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకున్న నిరుద్యోగులను పట్టించుకోలేదని చెప్పారు. పత్రికా ప్రకటనలు గానీ, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను కానీ పట్టించుకోకుండా కేవలం ఎమ్మెల్యే లేఖలనే ఆధారంగా చేసుకుని అర్హులకు అన్యాయం చేశారని ఫిర్యాదు చేయడంతో లోకాయుక్త దీనిని విచారణకు తీసుకుంది. సాక్షి కథనాల ఆధారంగా ఫిర్యాదు ఎమ్మెల్యే కేఏ నాయుడు తన సిఫార్సు లేఖలతో నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారని తన అధికారంతో ఏ పోస్టుల్నీ వదలడం లేదనీ సాక్షి దినపత్రికలో ఈ అంశంపై వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. జనవరి 29న ‘పైరవీలే పరమావధి’ అంటూ ఎమ్మెల్యే రాసిచ్చిన పైరవీ లేఖలతో ప్రచురణ అయింది. అనంతరం ‘ఎమ్మెల్యే అభ్యర్ధా? అయితే ఓకే! ’ అంటూ మరో శీర్షికతో సాక్షి దినపత్రిక ప్రధాన సంచికలో కూడా కథనం ప్రచురితమైంది. ఈ కథనాలపై వివిధ పార్టీలు, వైఎస్సార్ సీపీ కూడా ధర్నాలు చేపట్టాయి. ఈ కథనాలను ఆధారంగా చేసుకుని సామంతుల పైడిరాజు లోకాయుక్తకు ఫైల్ చేశారు. విచారణకు స్వీకరించిన లోకాయుక్త విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడే ప్రారంభమైంది. ఎమ్మెల్యే కె.ఎ.నాయుడి చర్యల వల్ల నిరుద్యోగులు బలైపోయారు. తాను సూచించిన వారికే ఉద్యోగాలివ్వాలని పైరవీల లేఖలు రాశారు. స్థానికులకు కాకుండా ఇతర నియోజకవర్గాలు, మండలాలకు చెందిన అనర్హులకు పోస్టులను కేటాయించారు. దీనిపై లోకాయుక్తను ఆశ్రయించాను. ఎమ్మెల్యే అక్రమాలపై మేం చేసే అసలు పోరాటం ఇప్పుడే ప్రారంభమైంది. లోకాయుక్త న్యాయ స్థానంలో అర్హులకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నాం. - సామంతుల పైడిరాజు, లోగిశ, గజపతినగరం -
నీరు-చెట్టు అక్రమాలపై కదిలిన లోకాయుక్త
తలమంచిలో పనులను తనిఖీ చేసిన డీడీ తలమంచి(కొడవలూరు): మండలంలోని తలమంచిలో నీరు-చెట్టు పనుల్లో జరిగిన అక్రమాలపై లోకాయుక్త విచారణ మొదలుపెట్టింది. గ్రామంలో గతేడాది నీరు-చెట్టు పథకం కింద జరిగిన పనులను లోకాయుక్త డిప్యూటీ డెరైక్టర్ వి.గంగరాజు సోమవారం క్షుణ్ణంగా పరిశీలించారు. పంచాయతీ పరిధిలో గతేడాది నీరుచెట్టు పథకం కింద 12 చోట్ల కాలువల పూడిక తీత పనులకు రూ.12.50 లక్షలు మంజూరయ్యాయి. ఈ పనులన్నింటినీ గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు జొన్నా శివకుమార్ చేపట్టారని, అయితే పనులు చేయకుండానే బిల్లులు స్వాహా చేశారని గ్రామానికే చెందిన పిట్టి సూర్యనారాయణ అనే రైతు మూడ్నెల్ల క్రితం లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును విచారణకు స్వీకరించింది. లోకాయుక్త ఇన్వెస్టిగేషన్ విభాగం డిప్యూటీ డెరైక్టర్ గ్రామానికి వచ్చారు. అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్న 12 పనులను పరిశీలించారు. ఫిర్యాదుదారైన సూర్యనారాయణను పిలిచి విచారించారు. ఫిర్యాదుదారు కాలువ పనుల్లో జరిగిన అక్రమాలను డీడీకి వివరించారు. అసలు కాలువల్లో పూడిక తీయకుండానే బిల్లులు స్వాహా చేశారని చెప్పారు. మొదటి పంట సమయంలో పూడిక తీయక సాగు నీరందని పరిస్థితి నెలకొనగా, రైతులే స్వచ్ఛందంగా కాలువలు పూడిక తీసుకొన్నారని తెలిపారు. నీరుచెట్టు కింద పనులు చేసినట్టు చూపిన కాలువలనే మళ్లీ ఎఫ్డీఆర్(ఫ్లడ్ డామేజ్ రిపేర్స్)కింద చేపట్టారని చెప్పారు. ఈ పనులు కూడా అత్యంత అధ్వానంగా జరిగాయని వివరించారు. అనంతరం డీడీ మాట్లాడుతూ గ్రామంలో నీరు-చెట్టు పనుల్లో భారీగా అవినీతి జరిగినట్టు ఫిర్యాదు అందినందున విచారణకు స్వీకరించడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఫిర్యాదుదారు చేసిన ఆరోపణలు వాస్తవమా కాదా అని తనిఖీ చేశామన్నారు. తదుపరి విచారణలో ఇరిగేషన్ అధికారుల నుంచి ఆ పనులకు సంబంధించిన ఎస్టిమేషన్, మంజూరు, ఎంబుక్, బిల్లుల చెల్లింపుల వివరాలను ఇరిగేషన్ అధికారుల నుంచి తెప్పిస్తామన్నారు.