ఉత్తరప్రదేశ్ లోకాయుక్తగా జస్టీస్ వీరేంద్ర సింగ్ ప్రమాణస్వీకారం అనూహ్యంగా వాయిదాపడింది.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ లోకాయుక్తగా జస్టీస్ వీరేంద్ర సింగ్ ప్రమాణస్వీకారం అనూహ్యంగా వాయిదాపడింది. ఈ నెల 20లోగా లోకాయుక్త పదవీ ప్రమాణం చేయాలన్ని సుప్రీంకోర్టు.. సదరు తేదీకి ఒకరోజు ముందు కార్యక్రమాన్ని వాయిదా వేయాల్సిందిగా యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు ఎలాంటి చర్యలు ఉండరాదంటూ విచారణను జనవరి 6కు వాయిదా వేసింది.
దేశచరిత్రలోనే మొదటిసారి సుప్రీంకోర్టు తనకున్న విశేష అధికారాలను వినియోగించుకుని యూపీకి జస్టీస్ వీరేంద్ర సింగ్ ను లోకాయుక్తగా నియమించిన సంగతి తెలిసిందే.