సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, బెట్టింగ్‌లు నిర్వహించకుండా జంతుహింస నిరోధక చట్టాలను సమర్ధవంతంగా అమలు చేయాలని తూరు, పశ్చిమ గోదావరి, కష్ణా జిల్లాల ఎస్పీలను లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి శుక్రవారం ఆదేశించారు.
హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, బెట్టింగ్‌లు నిర్వహించకుండా జంతుహింస నిరోధక చట్టాలను సమర్ధవంతంగా అమలు చేయాలని తూర్పు, పశ్చిమ గోదావరి, కష్ణా జిల్లాల ఎస్పీలను లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి శుక్రవారం ఆదేశించారు. దీనిపై ఈనెల 27 లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కోడిపందాలు, బెట్టింగ్‌లు బహిరంగంగా జరుగుతున్నా పోలీసులు చర్యలు చేపట్టడం లేదంటూ హైకోర్టు న్యాయవాది జి.రోనాల్డ్‌రాజ్, పీడీ రాయులు దాఖలు చేసిన పిటిషన్‌ను లోకాయుక్త విచారణకు స్వీకరించి ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
పందేల ద్వారా ఏటా రూ.300 కోట్లు చేతులు మారుతున్నాయని, ఈ వైనాన్ని మీడియా ప్రత్యక్షంగా చూపుతున్నా పోలీసులు స్పందించడం లేదని పిటిషనర్లు తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొంటూ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని చెప్పారు. ఎక్కువ సమయం లేనందున అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని లోకాయుక్తను కోరారు.