న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయ మూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్‌పై అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసును లోక్‌పాల్ కొట్టివేసింది. తన న్యాయ పరిధికి మించిన అంశమని ఒక ఉత్తర్వులో పేర్కొంది. ఓ రాజకీయ పార్టీని, ఓ రాజకీయ నేతను కాపాడేందుకు తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ గతేడాది అక్టోబర్ 18వ తేదీన అప్పటి సీజేఐ జస్టిస్ చంద్రచూడ్‌పై ఫిర్యాదు అందింది.
గతేడాది నవంబర్ 10వ తేదీన పదవి నుంచి ఆయన రిటైరయ్యారు. లోక్‌పాల్, లోకాయుక్త చట్టంలోని సెక్షన్–14 ప్రకారం సిట్టింగ్ సీజేఐ, సుప్రీంకోర్టు జడ్జీలు తమ న్యాయపరిధిలోకి రారని, ఈ అంశాన్ని పరిశీలించరాదని నిర్ణయించుకున్నామని లోకా యుక్త ఈ నెల 3న జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. చట్ట ప్రకారం ఇతర మార్గాలను అనుసరించే స్వేచ్ఛ పిటిషనర్‌కు ఉందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment