former Chief Justice of the Supreme Court
-
మాజీ సీజేఐపై ఆరోపణలు.. పిటిషన్‌ను కొట్టేసిన లోక్‌పాల్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయ మూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్‌పై అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసును లోక్‌పాల్ కొట్టివేసింది. తన న్యాయ పరిధికి మించిన అంశమని ఒక ఉత్తర్వులో పేర్కొంది. ఓ రాజకీయ పార్టీని, ఓ రాజకీయ నేతను కాపాడేందుకు తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ గతేడాది అక్టోబర్ 18వ తేదీన అప్పటి సీజేఐ జస్టిస్ చంద్రచూడ్‌పై ఫిర్యాదు అందింది. గతేడాది నవంబర్ 10వ తేదీన పదవి నుంచి ఆయన రిటైరయ్యారు. లోక్‌పాల్, లోకాయుక్త చట్టంలోని సెక్షన్–14 ప్రకారం సిట్టింగ్ సీజేఐ, సుప్రీంకోర్టు జడ్జీలు తమ న్యాయపరిధిలోకి రారని, ఈ అంశాన్ని పరిశీలించరాదని నిర్ణయించుకున్నామని లోకా యుక్త ఈ నెల 3న జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. చట్ట ప్రకారం ఇతర మార్గాలను అనుసరించే స్వేచ్ఛ పిటిషనర్‌కు ఉందని తెలిపింది. -
సోషల్ మీడియా దన్నుతో... తీర్పులను ప్రభావితం చేసే యత్నాలు
న్యూఢిల్లీ: కోర్టుల తీర్పులను ప్రభావితం చేయడానికి కొన్ని ఒత్తిడి గ్రూప్‌లు ప్రయత్నిస్తున్నాయని, అందుకు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ చెప్పారు. తీర్పులను ప్రభావితం చేయడం ద్వారా సొంత ప్రయోజనాలు సాధించుకోవాలని ఆశిస్తున్న ఇలాంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని న్యాయమూర్తులకు సూచించారు. ‘‘యూట్యూబ్‌లో 20 సెకండ్ల వీడియో చూసి ప్రజలు అభిప్రాయం ఏర్పర్చుకుంటున్న పరిస్థితి! వారిపై సోషల్ మీడియా విపరీతమైన ప్రభావం చూపుతోంది. అభిప్రాయాలను నిర్దేశిస్తోంది. ఇది ప్రమాదకర పరిణామం’’ అన్నారు. న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు, తీసుకున్న నిర్ణయాలకు ఆధారం ఏమిటన్నది తెలుసుకొనే అవకాశం, దానిపై అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు ప్రజలకు ఉన్నప్పటికీ అది జడ్జిలను టార్గెట్ చేసేలా ఉండకూడదని అభిప్రాయపడ్డారు. ప్రత్యేకంగా కొందరు జడ్జిలను లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు నిజంగా భావవ్యవస్థీకరణ స్వేచ్ఛ అంటే ఇదేనా? అనే ప్రశ్న తలెత్తుతుందని పేర్కొన్నారు. ఆదివారం ఎన్డీటీవీ ఆధ్వర్యంలో జరిగిన సంవిధాన్–75 సదస్సులో జస్టిస్ చంద్రచూడ్ ప్రసంగించారు. ఎలాంటి ఆంక్షలు, నిరోధకాలు, బాధ్యతలు లేకుండా ఇలా ప్రైవేట్ పౌరుడిగా ఉండడం చాలా అద్భుతంగా ఉందని వ్యాఖ్యానించారు. ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈ నెల 10న పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం కోసం అమల్లో ఉన్న కొలీజియం వ్యవస్థను జస్టిస్ చంద్రచూడ్ సమరి్థంచారు. న్యాయమూర్తులు సైతం నిరభ్యంతరంగా రాజకీయాల్లో చేరవచ్చని, రాజ్యాంగం అందుకు ఎలాంటి అడ్డుకట్టలు వేయడం లేదని పేర్కొన్నారు. క్రికెట్ తనకు చాలా ఇష్టమైన క్రీడ అని చెప్పారు. జస్ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీ తన అభిమాన క్రికెటర్లు అని వ్యాఖ్యానించారు. ఒకప్పటి క్రికెటర్లలో రాహుల్ ద్రవిడ్‌ను అభిమానిస్తానని తెలిపారు. -
‘పరిపూర్ణత్వానికి దగ్గరగా కొలీజియం’
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో జడ్జీల నియామకం కోసం ఉద్దేశించిన కొలీజియం వ్యవస్థ ప్రస్తుతం పరిపూర్ణత్వానికి(పర్ఫెక్ట్ మోడల్) దగ్గరగా ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ చెప్పారు. న్యాయ వ్యవస్థలో నియామకాలు, సంస్కరణలపై సీజేఏఆర్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కోర్టుల్లో జడ్జీల నియామకం కోసం పేర్లను ప్రతిపాదించడం వెనుక కఠినమైన ప్రక్రియ ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొలీజియం కంటే మెరుగైన వ్యవస్థ ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు. ప్రత్యామ్నాయం లేదు కాబట్టి కొలీజియంను కాపాడుకొనేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కొలీజియంపై కేంద్ర ప్రభుత్వం, న్యాయ వర్గాల మధ్య వివాదం రగులుతున్న నేపథ్యంలో జస్టిస్ యు.యు.లలిత్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
రాజ్యసభకు మాజీ సీజేఐ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌ని కేంద్రం రాజ్యసభకు నామినేట్ చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కేటీఎస్ తులసి రిటైర్మెంట్తో ఖాళీ అయిన స్థానంలో జస్టిస్ గొగోయ్‌ని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. గత ఏడాది నవంబర్ 9న సున్నితమైన అయోధ్య కేసులో తీర్పు ప్రకటించిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి జస్టిస్ గొగోయ్ నేతృత్వం వహించిన విషయం తెలిసిందే. అదే నెలలో ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. రఫేల్ ఫైటర్ జెట్స్ కేసును, శబరిమలలోకి మహిళల ప్రవేశానికి సంబంధించిన కేసును కూడా ఆయన విచారించారు. అయోధ్య కేసులో 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం మొత్తాన్ని రామాలయ నిర్మాణం కోసం వినియోగించాలని ఆయన తీర్పునిచ్చారు. మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోని మరో ప్రముఖ ప్రాంతంలో ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని ఆదేశించారు. సీజేఐగా పదవీకాలంలో లైంగిక వేధింపుల ఆరోపణ సహా పలు వివాదాలను ఆయన ఎదుర్కొన్నారు. రఫేల్ ఫైటర్ జెట్ డీల్‌లో మోదీ ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చిన ధర్మాసనానికి కూడా జస్టిస్ గొగొయే నేతృత్వం వహించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం సమాచార హక్కు చట్టం పరిధిలోకే వస్తుందని సంచలన తీర్పునిచ్చింది కూడా ఆయన నేతృత్వంలోని ధర్మాసనమే. ఎన్నార్సీ ప్రక్రియను సమీక్షించిన బెంచ్‌కు కూడా జస్టిస్ గొగోయ్ నేతృత్వం వహించారు. రాజ్యసభకు నామినేట్ అవుతున్న తొలి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆయనే కావడం విశేషం. మాజీ సీజేఐ రంగనాథ్ మిశ్రా కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు కానీ, ఆయన నామినేటెడ్ సభ్యుడు కాదు. కాంగ్రెస్ తరఫున ఎగువ సభకు ఎన్నికయ్యారు. -
మాజీ సీజేఐ కబీర్ కన్నుమూత
► రాష్ట్రపతి సహా ప్రముఖుల దిగ్భ్రాంతి ► తెలివైన న్యాయమూర్తిని కోల్పోయామన్న బార్‌కౌన్సిల్ కోల్‌కతా: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అల్తమస్ కబీర్ (68) ఆదివారం మధ్యాహ్నం కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈయన కిడ్నీ సంబంధింత వ్యాధితో చాలాకాలంగా బాధపడుతున్నారు. సెప్టెంబర్ 29, 2012 నుంచి జూలై 19, 2013 వరకు ఈయన అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఈయనకు భార్య, కూతురు, ఓ కుమారుడు ఉన్నారు. 1973లో కోల్‌కతాలో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించిన అల్తమస్ 1990లో కలకత్తా హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005 మార్చి 1న జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2005 సెప్టెంబర్ 9న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. న్యాయలోకం దిగ్భ్రాంతి అల్తమస్ కబీర్ హఠాన్మరణంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న జ్ఞాపకాలను ప్రణబ్ గుర్తుచేసుకున్నారు. ‘అల్తమస్ చాలా తెలివైన న్యాయమూర్తి, రెండు వైపుల వాదనలను చాలా ఓపికగా వినేవారు. అనవసర విషయాలు చర్చకు వచ్చినా ఏమాత్రం సహనం కోల్పోయేవారు కాదు. ఆయన మృతి న్యాయ వ్యవస్థకు తీరనిలోటు’ అని మాజీ అటార్నీ జనరల్ సోలీ సొరాబ్జీ తన సంతాప సందేశంలో తెలిపారు. ‘ఆయన మృతి దురదృష్టకరం, తీవ్రమైన లోటు. కేరీర్ చివర్లో కొన్ని వివాదాలొచ్చినా.. ఆయన గొప్ప ఆలోచనలున్న న్యాయమూర్తి. ఆయనలాంటి మరింతమంది న్యాయమూర్తులు రావాలని కోరుకుంటున్నాం’ అని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) అధ్యక్షుడు ఏఎస్ సూరి అభిప్రాయపడ్డారు. ఇద్దరు కేరళ జాలరులను ఇటలీ నేవీ అధికారులు కాల్చిచంపిన కేసు సమయంలో ధర్మాసనంలో కబీర్ సభ్యుడిగా ఉన్నారు. పార్టీనుంచి బహిష్కృతుడైన తర్వాత ఓ ఎంపీ పదవిలో కొనసాగొచ్చా అనే అంశంపై కబీర్ కీలక తీర్పునిచ్చారు. పార్టీతో సంబంధం లేకుండా ఎంపీగా ఉండొచ్చని, ఓటింగ్‌లోనూ పాల్గొనవచ్చని స్పష్టం చేశారు.