
సాక్షి, హైదరాబాద్: గత ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ పాలనలో విచ్చలవిడిగా అవినీతి జరిగిందని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు డేరంగుల ఉదయకిరణ్ విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై ఆయన గురువారం లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గత టీడీపీ పాలనలో ఇసుక మాఫియా, రాజధాని, పోలవరం ప్రాజెక్టుల్లో అక్రమాలపై ఫిర్యాదు చేశారు. ప్రజాధనాన్ని లూటీ చేసిన చంద్రబాబు, మంత్రులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఉదయ్‌కిరణ్ డిమాండ్ చేశారు. వారి అక్రమ సంపాదనను ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment