
బెంగళూరు:మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ముడా) స్కామ్‌లో విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. విచారణకు భయపడటం లేదన్నారు.ఈ విషయమై సిద్ధరామయ్య బుధవారం(సెప్టెంబర్25) సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు.
ముడా స్కామ్‌పై బెంగళూరు ప్రత్యేక కోర్టు బుధవారం విచారణకు ఆదేశించింది. కర్ణాటక లోకాయుక్త ఆధ్వర్యంలో దర్యాప్తునకు అనుమతించింది.మూడు నెలల్లో ముడా స్కామ్‌పై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని మైసూర్ పోలీసులను ఆదేశించింది.
ఈ కేసులో సిద్ధరామయ్యకు మంగళవారం హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ముడా స్కామ్‌లో తనను విచారించేందుకుగాను గవర్నర్ అనుమతి మంజూరు చేయడంపై సీఎం హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.