ఇటీవల కాలంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. విద్యాసంస్థలు, బహిరంగ ప్రదేశాలు, ప్రముఖులను టార్గెట్ చేసుకొని కొంతమంది బెదిరింపులకు పాల్పడుతున్నారు. బాంబు బెదిరింపులు నిజమో, అబద్దమో తేల్చేందుకు పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు తలలు పట్టుకుంటున్నాయి.
తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోసహా పలువురు మంత్రులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మంగళవారం Shahidkhan10786@protonmail.com. అనే ఈమెయిల్ ద్వారా బెదిరింపు వచ్చినట్లు అధికారులు తెలిపారు. బెదిరింపు మెయిల్ అందుకున్న వారిలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హోంమంత్రి జీ పరమేశ్వరతోపాటు పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు.
తమకు 2.5 మిలియన్ డాలర్లు(దాదాపు రూ. 20 కోట్లు) ఇవ్వకపోతే కర్ణాటక వ్యాప్తంగా బస్సులు, రైళ్లు దేవాలయాలు, హోటళ్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున్న పేలుళ్లు జరుపుతామని హెచ్చరించారు. దీనిపై బెంగళూరు సిటీ క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌లతో పాటు పోలీసు సిబ్బంది తనిఖీ చేపట్టారు.
‘సినిమా ట్రైలర్‌పై మీ అభిప్రాయం ఏమిటి? మీరు మాకు 2.5 మిలియన్ డాలర్లు అందించకపోతే, కర్ణాటక అంతటా బస్సులు, రైళ్లు, దేవాలయాలు, హోటళ్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో పెద్ద పేలుళ్లు జరుపుతాము. "మేము మీకు మరో ట్రైలర్ చూపించాలనుకుంటున్నాము. అంబారీ ఉత్సవ్ బస్సులో బాంబును పేల్చబోతున్నాం. అంబారీ ఉత్సవ్ బస్సు పేలుడు తర్వాత, మా డిమాండ్లను సోషల్ మీడియాలో లేవనెత్తుతాము. మీకు పంపిన మెయిల్ స్క్రీన్‌షాట్‌లను అప్‌లోడ్ చేస్తాం. మా నెక్ట్స్ పేలుడు గురించి త్వరలోనే ట్వీట్ చేస్తాం.’ అని మెయిల్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment