DK Shivakumar
-
పార్లమెంట్‌ను కుదిపేసిన డీకే శివకుమార్ వ్యాఖ్యలు
బెంగళూరు/న్యూఢిల్లీ: రిజర్వేషన్లపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు.. సోమవారం పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేశాయి. డీకేఎస్ వ్యాఖ్యలతో రాజ్యాంగాన్నే మార్చేయాలన్న కాంగ్రెస్ మనస్తత్వం బయటపడిందని బీజేపీ విమర్శించగా.. ప్రతిపక్ష కాంగ్రెస్ గట్టి కౌంటరే ఇచ్చింది. ఈ క్రమంలో రాజ్యసభ 2గం.దాకా కార్యకలాపాలకు దూరంగా ఉండగా, లోక్‌సభ పదే పదే వాయిదా పడుతూ వచ్చింది.కర్ణాటక ప్రభుత్వం మైనారిటీ కోటా కింద కాంట్రాక్టులలో నాలుగు శాతం ముస్లింలకు కేటాయించడంపై బీజేపీ, కాంగ్రెస్‌లు విమర్శలతో పార్లమెంట్‌ను వేడెక్కించాయి. ప్రత్యేకించి ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం శివకుమార్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇది రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు జేపీ నడ్డా అన్నారు. ‘‘మతం పేరుతో రిజర్వేషన్లను రాజ్యాంగం అనుమతించలేదు. మైనార్టీలను కాంగ్రెస్ మభ్యపెడుతోంది. ఇలాంటి చట్టాలను(కర్ణాటక తెచ్చిన చట్టం గురించి ప్రస్తావిస్తూ..), విధానాలను ఉపసంహరించుకోవాలి. బీఆర్ అంబేద్కర్ మార్గదర్శకత్వంలో రూపొందించిన రాజ్యాంగాన్ని ఎవరూ మార్చలేరు’’ అని నడ్డా అన్నారు.అయితే.. నడ్డా వ్యాఖ్యలకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగాన్ని మారుస్తానని డీకే శివకుమార్ అనలేదని.. ఆ మాటకి వస్తే బీజేపీ నేతలే రాజ్యాంగంపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారని అన్నారు. అంతేకాదు.. గతంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ భారత రాజ్యాంగాన్ని మారుస్తానని బహిరంగంగా వ్యాఖ్యానించారని గుర్తు చేశారు.ఈ అంశం ఇటు లోక్‌సభలోనూ దుమారం రేపగా.. సభ పదే పదే వాయిదా పడుతూ వచ్చింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజ్జు డీకేఎస్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇది రాజ్యాంగంపై జరుగుతున్న దాడిగా ఆయన అభివర్ణించారు. ఈ క్రమంలో.. కాంగ్రెస్ ఎంపీలు కౌంటర్లతో సభ హీటెక్కింది. మతపరమైన రిజర్వేషన్లు.. ప్రత్యేకించి ముస్లింల కోసం రాజ్యాంగానికి కొన్ని మార్పులు అవసరం అని శివకుమార్ అన్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాను అనలేదని తాజాగా నడ్డా విమర్శల నేపథ్యంలో శివకుమార్ స్పందించారు. బీజేపీ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోంది. నేను JP నడ్డా కంటే ఎక్కువ సెన్సిబుల్, సీనియర్ పొలిటీషియన్ అని అన్నారు. నేను గత 36 ఏళ్లుగా అసెంబ్లీలో ఉన్నాను. నాకు ప్రాథమిక ఇంగితజ్ఞానం ఉంది. వివిధ నిర్ణయాల (కోర్టు ద్వారా) తర్వాత మార్పులు ఉంటాయని క్యాజువల్‌గా చెప్పాను. రాజ్యాంగాన్ని మార్చబోతున్నామని నేను ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. మాది జాతీయ పార్టీ. మా పార్టీ ఈ దేశానికి రాజ్యాంగాన్ని తీసుకువచ్చింది అని అన్నారాయన. -
డీకేకు షాక్!.. సీఎం పదవిపై సిద్దరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు
బెంగళూరు: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, మరో ఐదేళ్లపాటు తానే సీఎం పదవిలో కొనసాగుతానని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్య కర్తలను హామీ కమిటీ చైర్మన్లు, సభ్యులుగా నియమించడం ద్వారా ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అవమానించిందని బీజేపీ ఆరోపించింది. ఇలాంటి నిర్ణయాలతో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు సంకేతాలిస్తోందని ప్రతిపక్షనేత ఆర్.అశోక ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెంటనే స్పందించారు. ‘మేం ఎక్కడికీ పోం. మేం మళ్లీ గెలుస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు.ఇక, ఇటీవల అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగిన చన్నపట్న, షిగ్గావ్, సండూర్లలో బీజేపీ ఓటమిని సీఎం గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు దమ్ముందా అంటూ తమకు సవాల్ విసిరారని, ఆ తరువాత ఫలితాలనూ చూశారని ఎద్దేవా చేశారు. మళ్లీ తాము అధికారంలోకి వస్తామని, తదుపరి ముఖ్యమంత్రిగా తానే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తనకు మధ్య జరుగుతున్న ఆధిపత్యపోరు నేపథ్యంలో సిద్ధరామయ్య వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.కాగా, ప్రభుత్వ హామీల అమలు కోసం ప్రభుత్వం అన్ని జిల్లాల్లో కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలకు చైర్మన్లు, సభ్యులుగా కాంగ్రెస్ తమ పార్టీ వారిని నియమించింది. దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ కమిటీలను రద్దు చేయాలని కోరుతూ గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్‌ను బుధవారం కలిసి బీజేపీ.. వినతిపత్రం సమర్పించింది. ఇది శాసనసభ్యుల హక్కుల ఉల్లంఘనని బీజేపీ ఆందోళనకు దిగింది. అసెంబ్లీలో రెండో రోజు నిరసనను కొనసాగించింది. దీంతో మధ్యాహ్న భోజనం తరువాత అసెంబ్లీలో గందరగోళం ఏర్పడింది.అయితే ఎమ్మెల్యేలను అగౌరవ పరిచే పనిని తాను చేయబోనని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలనలో పార్టీ కార్యకర్తల భాగస్వామ్యం ముందు నుంచి ఉన్నదేనని, గతంలో బీజేపీ కూడా ఇలాగే చేసిందని చెప్పారు. బోర్డులు, కార్పొరేషన్లకు చైర్మన్లుగా పార్టీ కార్యకర్తలను చేయడం దుర్వినియోగం కాదా అని ప్రశ్నించారు. మహారాష్ట్రలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను మంత్రుల వ్యక్తిగత సహాయకులుగా చేశారని గుర్తు చేశారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేల నినాదాలతో సభా కార్యకలాపాలు మరింత గందరగోళంగా మారాయి. అయితే కాంగ్రెస్ కార్యకర్తలను కమిటీ చైర్మన్లను చేయడానికి తాము వ్యతిరేకం కాదని, వారికి కార్యాలయం ఇవ్వడం, నెలకు రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చు చేయడంపైనే తమ అభ్యంతరమని ప్రతిపక్ష నేత అశోక తెలిపారు. -
ఇలాగే ఉంటే నటీనటులకు నట్లు, బోల్టులు బిగిస్తాం: డిప్యూటీ సీఎం
బెంగళూరులో జరుగుతున్న చలన చిత్రోత్సవంలో అనేక మంది శాండల్‌వుడ్ నటీనటులు పాల్గొనకపోవడంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా విధానసౌధలో జరిగిన కార్యక్రమంలో ఇండస్ట్రీ ప్రముఖలపై ఆయన భగ్గుమన్నారు. కన్నడ భూమి, భాష గురించి నటీనటులు స్పందించకుంటే మీ నట్లు బోల్ట్లను టైట్ చేస్తామని సినీ ప్రముఖులను హెచ్చరించారు. దీంతో నెట్టింట పెద్ద దుమారం రేగింది. అయితే, తన వ్యాఖ్యలను కొంత సమయం తర్వాత డీకే సమర్థించుకున్నారు. 'సినిమా ప్రముఖులు ఏమికావాలంటే అది చేసుకోనీ, నాకు తెలియదు. నా మాటల్లో నిజాలున్నాయి. ధర్నాలు చేసినా ఫర్వాలేదు. రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎవరూ మద్దతు ఇవ్వడం లేదు. మన నీరు, మన హక్కు పోరాటంలో సినిమా వాళ్లెవరూ పాల్గొనలేదు' అని ఆయన ఆరోపించారు. మేకెదాటు పాదయాత్రలో ప్రేమ్, దునియా విజయ్, సాధుకోకిల పాల్గొన్న సమయంలో బీజేపీ ప్రభుత్వం కేసులు వేసిందని డీకే శివకుమార్ ఆరోపించారు. కాగా, కుంభమేళాలో స్నానం చేయడంపై సొంత పార్టీ నాయకులు విమర్శించారని ప్రశ్నించగా, అక్కడి నీటికి కులం, మతం ఉందా, ఏ పార్టీకై నా చెందిందా అని మండిపడ్డారు.అధికార దర్పం: ఫిల్మ్ చాంబర్డిప్యూటీ సీఎం ప్రకటనను కర్ణాటక ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు నరసింహలు ఖండించారు. అయన అధికార దర్పంతో అలా మాట్లాడి ఉండవచ్చని అన్నారు. బెంగళూరులో జరుగుతున్న అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో కన్నడ కళాకారులందరూ పాల్గొనవలసి ఉంది. ఆహ్వానం అందని కారణంగా కొందరు పాల్గొనలేదని చెప్పారు.మీకు సాధ్యమా: అశోక్సినిమా రంగం, నటులపై డీకే శివకుమార్ మాటలను బీజేపీ పక్ష నాయకుడు ఆర్ అశోక్ ఖండించారు. మీరు చెప్పేది సాధ్యమా, ముందు మీ మంత్రి రాజణ్ణకు నట్లు బోల్టులను బిగించాలని హేళన చేశారు. కిచ్చ సుదీప్, కేజీఎఫ్ యశ్, దర్శన్ నట్లు బోల్టులను బిర్రు చేయడం మీకు సాధ్యమా అంటూ ప్రశ్నించారు. కన్నడ సినిమా రంగాన్ని అవమానించారని, క్షమాపణలు చెప్పాలని డీకే శివకుమార్‌ను అశోక్ డిమాండ్ చేశారు. -
‘డీకే.. మరో ఏక్నాథ్ షిండే’
బెంగళూరు: కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్.. శివరాత్రికి కోయంబత్తూరులో సద్గురు(జగ్గీ వాసుదేవ్) ఏర్పాటు చేసిన ఈవెంట్ కు హాజరైన సంగతి తెలిసిందే. ఇది అటు జాతీయ కాంగ్రెస్ కు, ఇటు కర్ణాకట కాంగ్రెస్ లో సైతం హీట్ పుట్టించింది. దీనిపై కాంగ్రెస్ నేతలు కొందరు ఇప్పటికే తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యతిరేకించే రాహుల్ గాంధీ అంటే డీకేకు గౌరవం లేదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే డీకే.. బీజేపీలో చేరడానికి సన్నాహాలు ఏమైనా చేస్తున్నారా అనే వాదన కూడా వినిపించింది. ఆ ఈవెంట్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరు కావడంతో దీనికి మరింత బలపడింది.అయితే తాజాగా కర్ణాటక బీజేపీ.. డీకే శివకుమార్ మరో మహారాష్ట్ర ఏక్ నాథ్ షిండే కానున్నారంటూ వ్యాఖ్యానించడం కూడా కాంగ్రెస్ లో మరింత అలజడి రేపింది. మహారాష్ట్రలో శివసేన పార్టీని చీల్చి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఏక్ నాథ్ షిండే సహకరించిన విషయాన్ని ఆర్ అశోక ప్రస్తావించారు. అదే బాటలో డీకే శివకుమార్ కూడా నడిచి కాంగ్రెస్ ను చీల్చుతారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ బలమైన నేతగా ఉన్న డీకే.. ఆ పార్టీని కూల్చడం జరుగుతుందంటూ వ్యాఖ్యానించారు.దీనిపై డీకే శివకుమార్ స్పందించారు.. ఇది బీజేపీ గేమ్ ప్లాన్ అంటూ మండిపడ్డారు. తాను కాంగ్రెస్ వాదినని, ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ను వీడనని స్పష్టం చేశారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ గెలుపునకు కృషి చేస్తానని డీకే పేర్కొన్నారు. -
దేవుడే దిగి వచ్చినా.. డీకేఎస్ వ్యాఖ్యలపై దుమారం
బెంగళూరు: కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. భగవంతుడే స్వయంగా వచ్చినా బెంగళూరు నగరం బాగుచేయలేడంటూ వ్యాఖ్యానించారాయన. దీంతో ఇటు నగరవాసులు.. అటు రాజకీయ వర్గాలు ఆయనపై మండిపడుతున్నాయి. ‘బెంగళూరు నగరాన్ని రాత్రికి రాత్రే మార్చేయలేం. ఈ మహా నగరం ఏ రెండేళ్లకో, మూడేళ్లకో మారదు. ఒకవేళ దేవుడే తల్చుకున్నా(Even God) అది సాధ్యపడదు. నగరాన్ని బాగు చేయాలంటే.. ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో అది జరగాల్సిందే తప్ప మరో మార్గం లేదు’’ అని శివకుమార్ ఓ వర్క్‌షాప్‌లో వ్యాఖ్యానించారు. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా బెంగళూరులో ట్రాఫిక్‌జామ్(Bengaluru Traffic Troubles) వాహనదారులకు నిత్యం నరకం చూపిస్తుంటుంది. ఈ మధ్యకాలంలో అది మరీ పెరిగిపోవడంతో.. పలువురు మేధావులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో స్వయానా డిప్యూటీ సీఎం నెగెటివ్ కామెంట్లు చేయడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి రాగానే ట్రాఫిక్ సమస్య నుంచి గట్టెక్కించేందుకు ప్రాజెక్టులను ప్రకటించారే తప్ప.. వాటిని ఆచరణలోకి తీసుకురావడంలో మాత్రం అలసత్వం ప్రదర్శిస్తున్నారంటూ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ప్రముఖ ఆర్థిక వేత్త, ఆరిన్ కాపిటల్ చైర్మన్ మోహన్‌దాస్ పై(Mohan Das Pai) డీకేఎస్ స్టేట్మెంట్పై ఫైర్ అయ్యారు. ‘‘శివకుమార్గారూ.. మీరు మంత్రి అయ్యి రెండేళ్లు కావొస్తోంది. ఒక బలమైన నేతగా మీకు ఆహ్వానం పలికాం. కానీ, మా బతుకులు మరింత హీనంగా తయారవుతున్నాయి’ అంటూ ఎక్స్ ఖాతాలో ఆయనొక సందేశం ఉంచారు. అలాగే.. బెంగళూరులో ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కించే ప్రాజెక్టులెన్నో నిలిచిపోయాయని అంటున్నారాయన. ఫుట్‌పాత్‌ల పరిస్థితి దారుణంగా ఉందని, ప్రజా రవాణా వ్యవస్థ కూడా సరిపడా లేదని తెలిపారు. యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపట్టాలని, నగరానికి సుమారు 5,000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు అవసరమని, మెట్రో రైలును విస్తరించాల్సిన అవసరం ఉందని మోహన్‌దాస్ అభిప్రాయపడ్డారు.Minister @DKShivakumar it has been 2 years since you became our Minister! We applauded and welcomed you as a strong Minister.But our lives have become much worse!Big projects announced!Will take very long and delayed as govt has not completed any project in city on time! Why… https://t.co/32Kqkzrviv— Mohandas Pai (@TVMohandasPai) February 20, 2025ఇక రాజకీయంగానూ డీకే శివకుమార్ వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి. ‘‘బ్రాండ్ బెంగళూరు’’ అంటూ నినాదం ఇచ్చిన వ్యక్తి.. ఇవాళ దేవుడు కూడా సరి చేయలేడంటూ వ్యాఖ్యానించడం దురదృష్టకరమని బీజేపీ అంటోంది. ప్రజలకు సేవ చేసే అవకాశం దేవుడు ఇసతే.. ఈ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందని బీజేపీ నేత మోహన్ కృష్ణ విమర్శించారు. అయితే విమర్శల నేపథ్యంలో డీకే శివకుమార్ స్పందించారు. బెంగళూరు సమస్యలను పరిష్కరించే బాధ్యతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే నగరంలో కొత్త రోడ్ల నిర్మాణం, ట్రాఫిక్ సమస్యను తప్పించే ప్రణాళికతో కూడిన హ్యాండ్‌బుక్‌ను రిలీజ్ చేశామని అంటున్నారు. -
కుంభమేళాపై డీకేఎస్ కీలకవ్యాఖ్యలు
బెంగళూరు:కుంభమేళాకు వెళ్లడంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(డీకేఎస్) కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కుంభమేళాకు వెళ్లి పవిత్ర స్నానమాచరించడం అనేది తన వ్యక్తిగత విషయమని చెప్పారు. ఈ మేరకు ఆయన బుధవారం(ఫిబ్రవరి5) మీడియాతో మాట్లాడారు. కుంభమేళాకు వెళ్తానని తాను చెప్పడంపై కర్ణాటక ప్రతిపక్షనేత ఆర్.అశోక్ చేసిన విమర్శలకు శివకుమార్ ఘాటుగా స్పందించారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే కుంభమేళాపై చేసిన వ్యాఖ్యలకు తన కుంభమేళా పర్యటనకు లింకు పెట్టడంపై శివకుమార్ మండిపడ్డారు. అశోక్ కాదు ప్రధాని మోదీ, అమిత్ షా ఈ విషయంపై మాట్లాడితేనే తాను సమాధానం చెప్తానన్నారు.గంగా,కావేరీ,కృష్ణా నదులు ఎవరికీ చెందినవి కాదని, నీటికి రంగు రుచి ఉండదన్నారు. అశోక్ తనపై కాదని, ప్రధాని కుంభమేళాకు వెళ్లి స్నానం చేసిన అంశంపై విమర్శలు చేయాలని సూచించారు. -
నా చివరి శ్వాస వరకు సిద్ధరామయ్య కోసం నిలబడతా: డీకే శివకుమార్
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. తాను చనిపోయే వరకు సిద్ధరామయ్య కోసం ఒక రాయిలా పనిచేస్తానని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘సిద్ధరామయ్యకు నా చివరి శ్వాస వరకూ రాయిలా అండగా ఉంటాను. నేను ఎక్కడ ఉన్నా నిబద్ధతతో పనిచేస్తాను. కాంగ్రెస్ శక్తి అంటే దేశ శక్తి. దేశ చరిత్రలో కాంగ్రెస్ త్యాగలే ఎక్కువ. ఈ పార్టీ అధికారంలో ఉందంటే అన్ని వర్గాలకూ అధికారం దక్కినట్లే. కాంగ్రెస్ అధికారంలో ఉంటే సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. ప్రజల కష్టాలకు స్పందిస్తుంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో ప్రతిపక్షాలను ఉద్దేశించి కౌంటరిచ్చారు. ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ..‘25 ఏళ్ల తర్వాత హాసన లోక్‌సభ నియోజకవర్గాన్ని గెలచుకున్న కాంగ్రెస్ 2028లోనూ ఇక్కడి అన్ని స్థానాలను గెలుచుకుంటుంది. ఈ జిల్లాలో మహిళలకు జరిగిన అన్యాయాన్ని చూసి బాధపడని దేవేగౌడ.. తన మనవడి కోసం చెన్నపట్టణకు వచ్చి కన్నీరు పెట్టారు. నందిని పాలను అమూల్ బ్రాండ్‌లో విలీనం చేయాలని ఎన్డీఏ ప్రయత్నించిందని ఆరోపించారు. రాష్ట్ర బ్రాండ్‌ను మేము ఢిల్లీలో ఆవిష్కరించామని గుర్తుచేశారు. కర్ణాటక ప్రజలు కాంగగ్రెస్ వైపు నిలబడ్డారు. 2028 ఎన్నికల్లో కూడా ఇదే ఫలితం పునరావృతం అవుతుందని కామెంట్స్ చేశారు. -
కాంగ్రెస్ గ్యారెంటీలపై సొంత ఎమ్మెల్యే నుంచే వ్యతిరేకత!
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు.. సొంత ప్రభుత్వాన్నే ఇరకాటంలో పడేశారు. ఎన్నికల హామీల్లో కొన్నింటిని రద్దు చేయాలంటూ సదరు ఎమ్మెల్యే చేసిన బహిరంగ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలను కర్ణాటక కాంగ్రెస్ తీవ్రంగా పరిగణించింది. ఆ ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటించారు.విజయనగర ఎమ్మెల్యే హెచఆర్ గవియప్ప.. తాజాగా ఓ పబ్లిక్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఎన్నికల హామీల వల్ల జనాలకు ఇళ్ల సదుపాయం కల్పించలేకపోతున్నామని, కాబట్టి వాటిలో కొన్నింటిని రద్దుచేయాలని సీఎం సిద్ధరామయ్యను పబ్లిక్‌గా కోరారాయన.ఉచిత పథకాల వల్ల ఇళ్ల నిర్మాణ పథకం సజావుగా ముందుకు సాగడం లేదు. ఈ వేదిక నుంచి ముఖ్యమంత్రిగారికి విజ్ఞప్తి చేసేది ఒక్కటే. రెండు నుంచి 3 గ్యారెంటీ స్కీంలను తీసేయాలని కోరుతున్నా. అవి లేకపోయినా పెద్దగా ఫర్వాలేదు. తద్వారా కొందరికైనా ఇళ్లను నిర్మించి ఇవ్వగలం. ఇక నిర్ణయం సీఎంకే వదిలేస్తున్నా. ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటా అని అన్నారు.ಗ್ಯಾರಂಟಿ ಯೋಜನೆಗಳಿಗೆ ಕಾಂಗ್ರೆಸ್ ಶಾಸಕರಿಂದಲೇ ವಿರೋಧ - ಒಂದೆರಡು ಗ್ಯಾರಂಟಿ ಸ್ಕೀಂ ತೆಗೆಯುವಂತೆ ಸಿಎಂಗೆ ಮನವಿ ಮಾಡ್ತೀವಿ ಎಂದ ಶಾಸಕ ಗವಿಯಪ್ಪ#CongressGuarantee #Congress #Gaviyappa #Bellary pic.twitter.com/3fsw27C1HD— soumya Sanatani (Modi Ka Parivar) (@NaikSoumya_) November 26, 2024అయితే .. ఎమ్మెల్యే వాదనను డీకే శివకుమార్ కొట్టిపారేశారు. ఎన్నికల హామీల అమలులో వెనకడుగు వేయబోయేది లేదని స్పష్టం చేశారాయన. ఆయన ఇలా చేయాల్సింది కాదు. ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేస్తాం. ఎలాంటి పథకాన్ని ఆపే ప్రసక్తే లేదు. మేం కర్ణాటక ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం. దానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడిన సహించేది లేదు అని శివకుమార్ పేర్కొన్నారు.గవియప్ప సొంత ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో తన నియోజకవర్గానికి నిధుల విషయంలో పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నారంటూ ఆరోపించారాయన. అయితే.. ఆ ఆరోపణలను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సిరాజ్ షేక్ ఖండించారు. అంతేకాదు.. ఆరెస్సెస్‌తో ఉన్న అనుబంధమే గవియప్పతో అలా మాట్లాడిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. -
ఫ్రీ బస్సుకు మంగళం ? డీకే శివకుమార్ సంచలన కామెంట్స్
-
ఉచిత బస్సును సమీక్షిస్తాం: శివకుమార్
బెంగళూరు: కర్నాటక మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని సమీక్షిస్తామని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు. టికెట్లు కొనుక్కొని ప్రయాణించేందుకు పలువురు మహిళలు ముందుకు వస్తున్నందున ఈ పథకాన్ని సమీక్షిస్తామని తెలిపారు. కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఐరావత క్లబ్ క్లాస్ 2.0 బస్సులను బుధవారం ప్రవేశపెట్టాక శివకుమార్ మాట్లాడారు. ‘సోషల్ మీడియా ద్వారా, ఈ–మెయిళ్ల ద్వారా చాలామంది మహిళలు టికెట్లకు డబ్బులు చెల్లించి ప్రయాణిస్తామని మమ్మల్ని సంప్రదిస్తున్నారు. దీనిపై చర్చిస్తాం’ అని శివకుమార్ తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించే శక్తి పథకం కాంగ్రెస్ కన్నడనాట ఇచ్చిన ఐదు ప్రధాన హామీల్లో ఒకటనే విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కిందటేడాది జూన్ 11న శక్తి పథకాన్ని ప్రారంభించింది. ఈనెల 18 నాటికి 311 కోట్ల ఉచిత ప్రయాణాలు జరగ్గా.. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 7,507 కోట్లను దీనిపై వెచ్చించింది. ‘‘ 5 నుంచి 10 శాతం మంది మహిళలు టికెట్లకు డబ్బు చెల్లించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నా.. కండక్టర్లు తీసుకోవడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. రవాణా మంత్రి రామలింగా రెడ్డితో దీనిపై చర్చిస్తాను’’ అని శివకుమార్ వివరించారు. -
‘అది దేవుడి నిర్ణయమే’: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
బెంగళూరు : అక్రమాస్తుల కేసులో కోర్టు నిర్ణయాన్ని దేవుడి నిర్ణయంగా భావిస్తా. నేను కోర్టు తీర్పు, దేవుణ్ణి నమ్ముతాను’ అని కర్ణాటక డిప్యూటీ సీఎం, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్రమాస్తుల కేసులో డీకే శివకుమార్‌కు ఊరట లభించింది. డీకే శివకుమార్ విచారణను కొనసాగించాలంటూ సీబీఐ, బీజేపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్లు కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ రెండు పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు బుధవారం కొట్టి వేసింది.కోర్టు తీర్పు వెలువరించిన తరుణంలో సకలేశ్పురలోని యెత్తినహోల్ ఇంటిగ్రేటెడ్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టును పరిశీలించిన సందర్భంగా అక్రమాస్తుల కేసుకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నలకు శివకుమార్ పై విధంగా వ్యాఖ్యానించారు. 2013-2018 కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డీకే శివ కుమార్ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన ఆదాయానికి మించిన ఆస్తుల్ని కూడబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ ఆరోపణల నేపథ్యంలో ఆయనపై సెప్టెంబరు 2020న సీబీఐ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. విచారణ ప్రారంభించింది. దర్యాప్తు కొనసాగుతుండగానే ఆ కేసు సీబీఐ నుంచి ఈ ఏడాది ఫిభ్రవరిలో లోకాయుక్త పోలీసులకు బదిలీ అయ్యింది. ఈ కేసు విచారణలో భాగంగా డీకే శివకుమార్ గత వారం లోకాయుక్త పోలీసుల ముందు హాజరయ్యారు. సుప్రీంలోనూ ఎదురుదెబ్బ అక్రమాస్తుల కేసులో సీబీఐ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను సవాల్ చేస్తూ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గత నెలలో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ వ్యవహారంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. సిద్ధరామయ్యకు ఏం జరగదు అక్రమాస్తుల కేసుతో పాటు మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూకేటాయింపుల కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య,ఆయన భార్య పార్వతిలపై వస్తున్న ఆరోపణలపై డీకే శివకుమార్ స్పందించారు. సీఎంకి ఏం కాదు.‘కొందరు ముఖ్యమంత్రిపై ఎందుకు విరుచుకుపడుతున్నారో నాకు తెలియదు. ఆయనకు ఏం కాదు. ముడా వ్యవహారంలో ఆయనకు ప్రమేయం లేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు డీకే శివకుమార్. -
దర్శన్ జైలు రాచమర్యాదల్లో డీకేఎస్ హ్యాండ్: బీజేపీ
బెంగళూరు: అభిమాని హత్య కేసులో బెంగళూరు జైల్లో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్.. వీఐపీ ట్రీట్మెంట్తో మరోసారి హాట్ టాపిక్‌గా మారాడు. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ దుమారం రేపింది. ‘‘దర్శన్ అనుచరుడు ఒకరు వచ్చి తనను సాయం కోరాడంటూ గతంలో డిప్యూటీ సీఎం(డీకే శివకుమార్) చెప్పారు. నాలుగైదు రోజుల కిందట.. పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో తనిఖీలు జరిగి కొందరు ఖైదీల నుంచి ఫోన్లు సీజ్ చేసినట్లు ప్రకటించారు. మరి ఇప్పుడు దర్శన్ కాల్ మాట్లాడేందుకు ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది?.. ఈ ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. ఈ వ్యవహారంలో డీకే శివకుమార్ హస్తం కూడా ఉందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బ తిన్నాయనడానికి జైళ్ల పరిస్థితులే నిదర్శనం’’ అని బీజేపీ ఎమ్మెల్యే అశోక ఆరోపించారు.ఇదీ చదవండి: డీకే శివకుమార్‌తో దర్శన్ భార్య భేటీఇక.. ఈ వ్యవహారంపై జేడీఎస్ అధినేత, కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి సైతం స్పందించారు. పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో ఖైదీలకు ఫైవ్ స్టార్ హోటల్ ట్రీట్మెంట్ అందుతుందనే చర్చ ఈనాటిదేం కాదు. కొన్నేళ్లుగా ఆ చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఈ అంశంపై సంబంధిత శాఖ ఎలా స్పందిస్తుందో చూడాలి అని అన్నారు. పనిలో పనిగా సిద్ధరామయ్య సర్కార్ పని తీరుపైనా ఆయన విమర్శలు గుప్పించారు.మరోవైపు.. విమర్శల నేపథ్యంలో దర్శన్ వీఐపీ ట్రీట్మెంట్ ఎపిసోడ్‌పై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ఈ వ్యవహారంలో జైలు అధికారులదే తప్పని, కొందరు అధికారులు ఉదాసీనంగా వ్యవహరించిన మాట వాస్తవమేనని, ఇప్పటికే చర్యలు తీసుకున్నామని ప్రకటించారాయన.జైలు గదిలో ఉండాల్సిన కన్నడ నటుడు దర్శన్ తూగుదీపకు.. రాచమర్యాదల అంశం చివరకు తొమ్మిది మంది జైలు అధికారులపై సస్పెన్షన్ వేటుకు దారితీసింది. స్వేచ్ఛగా జైల్లో తిరుగుతూ, సిగరెట్లు కాలుస్తూ, వీడియో కాల్ మాట్లాడినట్లు ఫొటో, వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవడంతో కర్ణాటక పోలీసు శాఖ క్రమశిక్షణా చర్యలకు దిగింది. జైల్లో ఉన్న రౌడీషీటర్ వేలు ఈ ఫొటోను రహస్యంగా సెల్ఫోన్లో తీసి బయట ఉన్న తన భార్య సెల్‌ఫోన్‌కు పంపించడంతో ఇది వెలుగు చూసింది. జైలు చీఫ్ సూపరింటెండెంట్, జైలు సూపరింటెండెంట్సహా 9 మందిని సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి జి.పరమేశ్వర సోమవారం ప్రకటించారు. ‘‘చీఫ్ సూపరింటెండెంట్ స్థాయిలో తప్పిదం జరిగింది. అసలు ఫోన్లు, కురీ్చలు, సిగరెట్లు, టీ, కాఫీలు ఎవరు సమకూర్చారో దర్యాప్తుచేస్తున్నాం. సీనియర్ ఐపీఎస్‌తో విచారణ జరిపిస్తున్నాం. దర్శన్‌ను వేరే జైలుకు తరలించే అంశాన్నీ పరిశీలిస్తున్నాం’అని మంత్రి చెప్పారు. ‘‘ఆగస్ట్ 22న ఈ ఘటన జరిగింది. ఇలాంటి ఘటనలు పునరావృతంకాకుండా, జైల్లో ఫోన్లను గుర్తించే కృత్రిమ మేథ పరికరాలను బిగిస్తాం’’అని అదనపు డైరెక్టర్ జనరల్(జైళ్లు) మాలిని కృష్ణమూర్తి చెప్పారు.జూన్ 9న సుమనహళ్లి వద్ద కాల్వలో రేణుకాస్వామి మృతదేహం లభ్యమైన కేసులో దర్శన్, అతని సన్నిహిత నటి పవిత్రా గౌడ సహా 17 మందిని పోలీసులు అరెస్ట్‌చేసి విచారణఖైదీలుగా కారాగారానికి పంపడం తెల్సిందే. -
ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర: డీకే శివకుమార్
బెంగుళూరు: గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ ఆరోపించారు. శుక్రవారం(ఆగస్టు) ఈ విషయమై ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ ఒత్తిళ్లకు తలొగ్గి ప్రభుత్వం పంపిన బిల్లులను గవర్నర్ వెనక్కి పంపారని విమర్శించారు. బీజేపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎందుకని ప్రశ్నించారు. బిల్లులకు సంబంధించి గవర్నర్‌కు ఏవైనా అనుమానాలుంటే ప్రభుత్వం సమాధానమిస్తుందని పేర్కొన్నారు. ముడా స్కామ్‌లో సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతివ్వడాన్ని శివకుమార్ తప్పుబట్టారు.ఈ విషయంలో సీఎంకు పార్టీ సభ్యులంతా అండగా నిలుస్తారన్నారు. ప్రజల కోసం పని చేస్తున్న ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ,జేడీఎస్‌లు ప్రయత్నిస్తున్నాయని, వారి ప్రయత్నాలు ఫలించవన్నారు. -
పరోక్షంగా మీరు సీఎం కావడానికి.. లైన్ క్లియర్ చేస్తుందేమోననిపిస్తుంది సార్!
-
దర్శకుడితో హీరోయిన్ పెళ్లి..హాజరైన డీకే శివకుమార్ (ఫొటోలు)
-
యంగ్ హీరోయిన్ పెళ్లి వేడుక.. హాజరైన ఉప ముఖ్యమంత్రి
కన్నడ నటి సోనాలి, ప్రముఖ దర్శకుడు తరుణ్ సుధీర్‌ని పెళ్లి చేసుకోనుంది. ఆదివారం ఈ వేడుక జరగనుంది. దీనికంటే ముందు వెడ్డింగ్ రిసెప్షన్ జరగ్గా.. ఈ కార్యక్రమానికి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోల్ని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. అలానే కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతూ ఆశీర్వదించారు.(ఇదీ చదవండి: చైతూ-శోభిత లవ్ స్టోరీ.. సీక్రెట్ బయటపెట్టిన శోభిత చెల్లి!)బాల నటుడిగా కన్నడ సినీ ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించిన తరుణ్ సుధీర్.. ఆ తర్వాత రైటర్, డైరెక్టర్‌గా పలు సినిమాలు తీశాడు. ప్రస్తుతం జైల్లో ఉన్న స్టార్ హీరో దర్శన్‌తో 'రాబర్ట్', 'కాటేరా' చిత్రాలు తెరకెక్కించారు. ఇక 'రాబర్ట్' చేస్తున్న టైంలో ఇందులో ఓ హీరోయిన్గా నటించిన సోనాలితో ప్రేమలో పడ్డాడు.అప్పటినుంచి తమ ప్రేమని రహస్యంగా ఉంచిన తరుణ్-సోనాలి.. కొన్నిరోజుల క్రితం నిశ్చితార్థం చేసుకుని తమ రిలేషన్‌ని అధికారికం చేశారు. ప్రస్తుతం బెంగళూరులో వీళ్ల పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే శనివారం జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్‌కి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హాజరు కావడం విశేషం.(ఇదీ చదవండి: స్టార్ షట్లర్ శ్రీకాంత్‌తో ఆర్జీవీ మేనకోడలు నిశ్చితార్థం) View this post on Instagram A post shared by DK Shivakumar (@dkshivakumar_official) -
Darshan Case: డీకే శివకుమార్‌తో దర్శన్ భార్య భేటీ
దొడ్డబళ్లాపురం: సినీ హీరో దర్శన్ కేసు విషయంలో తాను ఎలాంటి జోక్యం చేసుకోనని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. రేణుకాస్వామి హత్య కేసు విచారణలో పోలీసులకు పూర్తి స్వాతంత్య్రం ఇచ్చామన్నారు. రామనగరలో ఒక కార్యక్రమంలో మాట్లాడిన డీకే.. దర్శన్‌కు అన్యాయం జరగి ఉంటే న్యాయం చేస్తానని చెప్పారు. దీనిపై బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ తాను కెంపేగౌడ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో దర్శన్ భార్య విజయలక్ష్మి వచ్చి కలిశారన్నారు. ఇక్కడకు కాదు, ఇంటికి వచ్చి కలవాలని ఆమెకు చెప్పానన్నారు. దర్శన్ కేసు గురించి మాట్లాడతారని అనుకున్నా, అయితే వారు వారి కుమారుని స్కూలు అడ్మిషన్ గురించి వచ్చారని డీకే చెప్పడం విశేషం. నివాసంలో సమావేశం దర్శన్ భార్య విజయలక్షి్మ, తమ్ముడు దినకర్, ప్రముఖ డైరెక్టర్ ప్రేమ్‌లు డీసీఎం డీకేశిని నివాసంలో కలివారు. తరువాత ప్రేమ్ విలేకరులతో మాట్లాడుతూ దర్శన్ గురించి చర్చించలేదని, తనయుడు స్కూలు అడ్మిషన్ గురించి ప్రస్తావించానమన్నారు. ఇక విజయలక్షి్మ, దినకర్ ఏం మాట్లాడారో తనకు తెలీదన్నారు. జూన్ 10 నుంచి దర్శన్ హత్య కేసులో అరెస్టయి జైలు పాలయ్యాడు. అసలు ఆ విషయం గురించే మాట్లాడలేదని వారు చెప్పడం గమనార్హం. -
ఇది అన్యాయం: డీకే శివకుమార్
న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో సీబీఐ కేసును కొట్టేయాలంటూ ఆయన వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది.ఈ పరిణామంపై బెంగళూరులో డీకేఎస్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఇది కచ్చితంగా ఎదురుదెబ్బే. ఏం చేయమంటారు?. పైగా ఇది అన్యాయం’’ అని అన్నారాయన. నాపై సీబీఐ కేసు.. దర్యాప్తు రాజకీయ ప్రతీకార చర్య అని ప్రతీ ఒక్కరికీ తెలుసు. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కేసు దర్యాప్తు కోసం సీబీఐకి అన్ని అనుమతులు ఇచ్చింది. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీబీఐకి ఇచ్చిన అనుమతుల్ని వెనక్కి తీసుకుని, లోకాయుక్తాకు ఆ కేసు అప్పగించింది. అయినా కూడా సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇది ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించిన అంశం. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించా. కానీ, వాళ్లు(సుప్రీం ధర్మాసనం) కుదరదని చెప్పారు అని డీకే శివకుమార్ అన్నారు. అయితే న్యాయపరంగా ఉన్న అన్నిమార్గాలను పరిశీలించి.. మరోసారి అప్పీల్ చేస్తానని చెప్పారాయన.ఇదిలా ఉంటే.. ఇవాళ సుప్రీం కోర్టులో డీకేఎస్ పిటిషన్‌ను జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ద్విసభ్య ధర్మాసం విచారణ చేపట్టింది. అయితే.. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని, ఇందులో జోక్యం చేసుకునేందుకు ఏ కారణం కనిపించడం లేదని బెంచ్ వ్యాఖ్యానిస్తూ ఆ పిటిషన్‌ను తిరస్కరించింది.2013-18 కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. మంత్రి హోదాలో డీకే శివకుమార్ అక్రమాస్తులు కూడబెట్టారన్నది ప్రధాన అభియోగం. 2020లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పజెప్పింది. దర్యాప్తు జరిపిన సీబీఐ దాని విలువ రూ.74 కోట్ల రూపాయలపైమాటేనని అభియోగాలు నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్ను ఆయన కర్ణాటక హైకోర్టులో సవాల్ చేయగా.. కోర్టు సైతం దర్యాప్తు సంస్థకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. -
సీఎంకు చేతబడి..!
-
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
బెంగళూరు: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తన దురుసుతనాన్ని మరోసారి బయట పెట్టుకున్నారు. కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హవేరి ప్రాంతానికి డీకే వెళ్లారు. అక్కడ కారు దిగగానే ఒక్కసారిగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు చుట్టుముట్టారు.దీంతో ఆగ్రహానికి గురైన డీకే శివకుమార్ ఒక వ్యక్తిపై చేయి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్నికల వేళ ఈ వీడియో కాంగ్రెస్ పార్టీని కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. గతంలోనూ డీకే పార్టీ కార్యకర్తలపై చేయి చేసుకున్న సందర్భాలున్నాయి. — BJP Karnataka (@BJP4Karnataka) May 5, 2024 -
‘‘జేడీఎస్‌తో ఇంకా పొత్తెందుకు’’ బీజేపీకి డీకే శికుమార్ ప్రశ్న
బెంగళూరు: సంచలనం రేపిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ వీడియోల వ్యవహారంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. సెక్స్ స్కాండల్ వెలుగు చూసిన తర్వాత కూడా జేడీఎస్‌తో బీజేపీ ఇంకా ఎందుకు పొత్తులో ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవణ్ణపై కర్ణాటక ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశ్నపై డీకే మండిపడ్డారు. ‘జేడీఎస్ కాంగ్రెస్‌తో పొత్తులో లేదు. బీజేపీ పొత్తులో ఉందో లేదో అమిత్ షా చెప్పాలి’అని డీకే డిమాండ్ చేశారు. ప్రజ్వల్ రేవణ్ణ వీడియోల గురించి అతని డ్రైవర్ కార్తిక్ గౌడ తొలుత బీజేపీ నేతలకే సమాచారమిచ్చాడన్నారు. -
Bengaluru: డీకే శివకుమార్‌పై ‘ఈసీ’కి బీజేపీ ఫిర్యాదు
బెంగళూరు: మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎన్నికల నియమావళి)ను ఉల్లంఘించారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌పై బీజేపీ ఎన్నికల కమిషన్(ఈసీ)కి ఫిర్యాదు చేసింది. కర్ణాటక అసెంబ్లీ విధాన సౌధలోని డీకే శివకుమార్ ఆఫీసును పార్టీ కార్యక్రమాలకు వాడుతున్నారని ఫిర్యాదులో బీజేపీ పేర్కొంది. ‘విధాన సౌధలోని తన ఆఫీసును కాంగ్రెస్ ఆఫీసులా డీకే శివకుమార్ భావిస్తున్నారు. శనివారం(మార్చ్ 30) ఆయన తన విధాన సౌధ ఆఫీసులో నజ్మా నజీర్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే కార్యక్రమం పెట్టుకున్నారు. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను పూర్తిగా ఉల్లంఘించడమే’ అని డీకే శివకుమార్‌పై ఫిర్యాదు చేసిన బీజేపీ ఎమ్మెల్యే సురేష్‌కుమార్ తెలిపారు. ఈ విషయంలో డీకే శివకుమార్‌పై కఠిన చర్యలు తీసుకుని గట్టి సందేశం పంపాలని ఎన్నికల కమిషన్‌ను ఈ సందర్భంగా సురేష్ కుమార్ కోరారు. ఇదీ చదవండి.. ఇండియా ర్యాలీలో టీఎంసీ ఎంపీ కీలక ప్రకటన -
ఇది బీజేపీ పొలిటికల్ గేమ్!.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
కర్ణాటక రాజధాని బెంగళూరులో గత కొన్ని రోజులుగా నీటి సంక్షోభం ఏర్పడింది. కొన్ని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించాయి. ఈ తరుణంలో బెంగళూరులో నీటి ఎద్దడి లేదని ఉప ముఖ్యమంత్రి 'డీకే శివకుమార్' కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో నీటి సంక్షోభం లేదు. దాదాపు 7000 బోర్వెల్లు ఎండిపోయినప్పటికీ.. నీటి కొరత ఉండకూడదని తగిన ఏర్పాట్లు చేస్తున్నాము. ఇప్పటికే ట్యాంకర్లను స్వాధీనం చేసుకున్నాం. నీటి వనరులను గుర్తించాం.. నీటి సరఫరా జరిగేలా చూస్తామని డీకే శివకుమార్ అన్నారు. నీటి కొరత రాకుండా ఉండటానికి నగరంలో కార్ వాషింగ్, గార్డెనింగ్, నిర్మాణం, నిర్వహణ కోసం తాగునీటిని ఉపయోగించడాన్ని పూర్తిగా నిషేదించారు. తాగునీరు, రోజువారీ పనుల కోసం ప్రైవేట్ ట్యాంకర్లపై ఆధారపడిన నివాసితుల కోసం.. జిల్లా యంత్రాంగం ప్రైవేట్ ట్యాంకర్లకు రేట్లను ఫిక్స్ చేసింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 'పొలిటికల్ గేమ్' ఆడుతోందని డీకే శివకుమార్ నిందించారు. రాష్ట్రంలో తీవ్రమైన నీటి కొరత ఉన్నప్పటికీ పొరుగున ఉన్న తమిళనాడుకు కావేరీ నది నీటిని కాంగ్రెస్ ప్రభుత్వం రహస్యంగా విడుదల చేస్తోందన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. రామనగర జిల్లాలోని కనకపుర తాలూకాలోని మేకేదాటు వద్ద కావేరి నదికి అడ్డంగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ 'వాక్ ఫర్ మేకేదాటు ప్రాజెక్ట్' నిర్వహించింది తానేనని శివకుమార్ బీజేపీ నేతలకు గుర్తు చేయాలని కోరారు. ఆ ప్రాజెక్టు సాకారం అయ్యేలా చూసేందుకే పాదయాత్ర నిర్వహించిన విషయం కూడా గుర్తు చేశారు. మేకేదాటు ప్రాజెక్టును చేపట్టేందుకు రాష్ట్రానికి అనుమతి వచ్చేలా చూడాలని బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులను ఆయన కోరారు. -
డీకే శివకుమార్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి
-
బీఆర్ఎస్కు బిగ్ షాక్!.. డీకే శివకుమార్‌తో మల్లారెడ్డి మంతనాలు
సాక్షి, బెంగుళూరు: మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడంతో బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేగుతోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో మల్లారెడ్డి.. ఆయన అల్లుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. బెంగళూరులోని ఓ హోటల్లో డీకే శివకుమార్‌తో మంతనాలు జరిపారు. రేపు ప్రియాంక గాంధీని కలిసేందుకు మల్లారెడ్డి కుటుంబ సభ్యులు అపాయింట్మెంట్ కోరారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయని మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీకి చెందిన భవనాలను అధికారులు కూల్చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం జరిగింది. తప్పుడు ప్రచారమంటూ తీవ్రంగా ఖండించిన మల్లారెడ్డి.. తాను కాంగ్రెస్‌లోకి వెళ్లడం లేదంటూ, బీఆర్ఎస్లోనే ఉంటానని స్పష్టం చేశారు. ఇంతలోనే హఠాత్ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో మల్లారెడ్డి, ఆయన అల్లుడు భేటీ కావడం, మంతనాలు జరపడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ప్రియాంక గాంధీ సమక్షంలో మల్లారెడ్డి కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: పొలిటికల్ హైడ్రామా.. BRSకు షాకిచ్చిన ఆరూరి రమేష్ -
బెంగళూరు గొంతెండుతోంది
‘‘అవడానికి మాదో లగ్జరీ అపార్ట్మెంట్. కానీ ఏం లాభం? నెల రోజులుగా చుక్క నీటికీ దిక్కు లేక అల్లాడుతున్నాం! 24 గంటలూ రావాల్సిన నల్లా నీళ్లు ఏ రాత్రి వేళో వస్తున్నాయి. అవీ మురికిమయం! స్నానపానాలకే కాదు, చివరికి టాయ్‌లెట్ అవసరాలకు కూడా నీరు లేదు. సరిగా నీళ్లు కూడా పోయక ఏ ఫ్లాట్‌లో చూసినా టాయ్లెట్లు భరించలేనంతగా కంపు కొడుతున్నాయి. దాంతో రెసిడెంట్లు మూకుమ్మడిగా ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. అలా వెళ్లలేనివాళ్లం విధిలేక పక్కనే ఉన్న ఫోరం సౌత్ మాల్‌లోకి వెళ్లి టాయ్‌లెట్ అవసరాలు తీర్చుకుంటున్నాం!’’ – రెడిట్‌లో ఓ బెంగళూరు వాసి పెట్టిన పోస్టిది! అలాంటిదేమీ లేదంటూ సదరు అపార్ట్మెంట్ అసోసియేషన్ ఖండించినా ఈ పోస్టు ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దీనికి బెంగళూరు టెకీల నుంచి విపరీతమైన స్పందన వెల్లువెత్తుతోంది. తమ నీటి కష్టాలకు అంతు లేదంటూ వర్ణిస్తూ వారు పెడుతున్న పోస్టులతో ఇంటర్నెట్ హోరెత్తిపోతోంది... దేశ ఐటీ రాజధాని బెంగళూరు గొంతెండిపోతోంది. తీవ్ర నీటి కొరతతో అల్లాడుతోంది. గుక్కెడు తాగునీటి కోసం జనం అలో లక్ష్మణా అంటూ అలమటిస్తున్నారు. నగరవ్యాప్తంగా బోర్లన్నీ చుక్క నీరైనా లేకుండా ఎండిపోయాయి. నగరంలో ఏటా వేసవిలో నీటి కొరత మామూలే అయినా ఈసారి మాత్రం సమస్య చాలా దారుణంగా ఉంది. ఇంకా వేసవి మొదలైనా కాకముందే నీటి కొరత తారస్థాయికి చేరింది. కోట్లు పెట్టి లగ్జరీ అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్లు కూడా కనీసం స్నానానికైనా నీళ్లు లేక లబోదిబోమంటున్నారు. సమర్థమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లేవీ చేయలేక ప్రభుత్వ యంత్రాంగం కూడా ప్రస్తుతానికి చేష్టలుడిగింది. రాష్ట్రవ్యాప్తంగా నీటి ఎద్దడి నెలకొని ఉందంటూ ప్రకటించింది! నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఇప్పటికే తాలూకా స్థాయిలో కంట్రోల్ రూములు, హెల్ప్లైన్లు ఏర్పాటు చేసింది. బెంగళూరులో నీటి సమస్య నివారణకు ఎంతదూరమైనా వెళ్తామంటూ ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ చేసిన ప్రకటనలు ఇప్పటికైతే కార్యరూపం దాల్చలేదు. పరిస్థితి పూర్తిగా చేయి దాటకుండా చూసేందుకు నగరంలో నీటి వాడకంపై రాష్ట్ర జల బోర్డు కఠిన ఆంక్షలు విధించింది. కార్లు కడిగేందుకు, మొక్కలకు, మెయింటెన్స్, నిర్మాణ పనులకు తాగునీటి వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఉల్లంఘిస్తే రూ.5,000 జరిమానా తప్పదని హెచ్చరించింది. బెంగళూరులోనే గాక కర్ణాటకవ్యాప్తంగా నీటి ఎద్దడి ఆందోళనకర స్థాయిలోనే ఉంది. గత సీజన్లో వర్షాభావమే ఈ దుస్థితికి కారణమన్న ప్రభుత్వ ప్రకటనపై జనం మండిపడుతున్నారు. ఇంతటి సమస్య తప్పదని ముందే తెలిసి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లేవీ చేయలేదంటూ దుయ్యబడుతున్నారు. ‘‘నిజానికి మూడు నెలలుగా నీటి సమస్య వెంటాడుతోంది. నెల నుంచి పరిస్థితి మరీ విషమించింది’’ అంటూ వాపోతున్నారు. ట్యాంకర్ల రేట్లు చుక్కల్లోకి... ► బెంగళూరులో ఏకంగా 60 శాతం జనం నీటి కోసం వాటర్ ట్యాంక్‌ల మీదే ఆధారపడ్డారు! అదను చూసి ప్రైవేట్ ట్యాంకర్లు రేట్లు ఎడాపెడా పెంచేశాయి. ► మామూలు రోజుల్లోనే 6,000 లీటర్ల ట్యాంకర్‌కు రూ.600, 8,000 లీటర్లకు రూ.800, 12 వేల లీటర్ల ట్యాంకరైతే రూ.1,000 చార్జి చేస్తారు. ► ఈ రేట్లకు జీఎస్టీ అదనం. పైగా దూరం 5 కి.మీ. దాటితే మరో రూ.200 దాకా పెరుగుతుంది. ► ఇప్పుడు ప్రైవేట్ ట్యాంకర్లు రెట్టింపు, అంతకుమించి వసూలు చేస్తున్నాయంటూ జనం గగ్గోలు పెడుతున్నారు. ► దాంతో ట్యాంకర్ల రేట్లకు పరిమితి విధిస్తామన్న ప్రభుత్వ ప్రకటన ఎక్కడా పెద్దగా అమలు కావడం లేదు. ► ఇవేం ధరలంటూ గట్టిగా నిలదీస్తే ట్యాంకర్వాలాలు ఆ కాలనీల ముఖం కూడా చూడటం లేదు. ► మున్సిపాలిటీ నల్లాల వద్ద క్యూ లైన్లు కిలోమీటర్లు దాటేస్తున్నాయి. అక్కడా ఒక్క బిందెకు మించి ఇవ్వడం లేదు! ► ఆర్వో ప్లాంట్ల ముందు కూడా ఒక్కరికి ఒక్క క్యానే అంటూ బోర్డులు దర్శనమిస్తున్నాయి! ► చాలా ప్లాంట్లు ‘నో వాటర్’ అంటూ బోర్డులు పెట్టి బ్లాకులో అడ్డగోలు రేట్లకు అమ్ముకుంటున్నాయి. ► నీటి ఎద్దడి దెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలు ఆన్లైన్ బాట పడుతున్నాయి. ఆన్లైన్ క్లాసులతో పని కానిస్తున్నాయి. ఎందుకింత సమస్య... ► 2023లో కర్ణాటకవ్యాప్తంగా నెలకొన్న వర్షా భావ పరిస్థితులు ప్రస్తుత నీటి సమస్యకు ప్రధాన కారణాల్లో ఒకటి. ► రాష్టంలో ఎక్కడ చూసినా భూగర్భ జలాలు అడుగంటాయి. కావేరీ బేసిన్‌లోని రిజర్వాయర్లన్నీ దాదాపుగా వట్టిపోయాయి. ► కర్ణాటకలోని 16 పెద్ద రిజర్వాయర్లలో 2023లో ఇదే సమయానికి సగం వరకున్న నీటిమట్టం ఈసారి 29 శాతానికి పడిపోయింది. ► బెంగళూరులో ఎక్కడ చూసినా బోర్లే దర్శనమిస్తుంటాయి. భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేయడం నగరంలో నీటి ఎద్దడికి ప్రధాన కారణం. ► రియల్టీ బూమ్ నేపథ్యంలో రెండు దశాబ్దాలుగా నగరంలోని చెరువులు, నీటి ఆవాసాలన్నీ కాలనీలు, అపార్ట్మెంట్లుగా మారిపోయాయి. ఆ దెబ్బకు స్థానిక నీటి వనరులు పూర్తిగా కనుమరుగయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సీఎం సిద్ధరామయ్య, మంత్రులకు బాంబు బెదిరింపులు
ఇటీవల కాలంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. విద్యాసంస్థలు, బహిరంగ ప్రదేశాలు, ప్రముఖులను టార్గెట్ చేసుకొని కొంతమంది బెదిరింపులకు పాల్పడుతున్నారు. బాంబు బెదిరింపులు నిజమో, అబద్దమో తేల్చేందుకు పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు తలలు పట్టుకుంటున్నాయి. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోసహా పలువురు మంత్రులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మంగళవారం Shahidkhan10786@protonmail.com. అనే ఈమెయిల్ ద్వారా బెదిరింపు వచ్చినట్లు అధికారులు తెలిపారు. బెదిరింపు మెయిల్ అందుకున్న వారిలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హోంమంత్రి జీ పరమేశ్వరతోపాటు పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. తమకు 2.5 మిలియన్ డాలర్లు(దాదాపు రూ. 20 కోట్లు) ఇవ్వకపోతే కర్ణాటక వ్యాప్తంగా బస్సులు, రైళ్లు దేవాలయాలు, హోటళ్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున్న పేలుళ్లు జరుపుతామని హెచ్చరించారు. దీనిపై బెంగళూరు సిటీ క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లతో పాటు పోలీసు సిబ్బంది తనిఖీ చేపట్టారు. ‘సినిమా ట్రైలర్‌పై మీ అభిప్రాయం ఏమిటి? మీరు మాకు 2.5 మిలియన్ డాలర్లు అందించకపోతే, కర్ణాటక అంతటా బస్సులు, రైళ్లు, దేవాలయాలు, హోటళ్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో పెద్ద పేలుళ్లు జరుపుతాము. "మేము మీకు మరో ట్రైలర్ చూపించాలనుకుంటున్నాము. అంబారీ ఉత్సవ్ బస్సులో బాంబును పేల్చబోతున్నాం. అంబారీ ఉత్సవ్ బస్సు పేలుడు తర్వాత, మా డిమాండ్లను సోషల్ మీడియాలో లేవనెత్తుతాము. మీకు పంపిన మెయిల్ స్క్రీన్షాట్లను అప్లోడ్ చేస్తాం. మా నెక్ట్స్ పేలుడు గురించి త్వరలోనే ట్వీట్ చేస్తాం.’ అని మెయిల్లో పేర్కొన్నారు. -
Bengaluru: బెదిరింపులకు భయపడం: డీకే శివకుమార్
బెంగళూరు: తన తమ్ముడు డీకే సురేష్‌ను కాల్చి చంపాలని బీఏపీ నేత ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. డీకే సురేష్ ఇలాంటి బెదిరింపులకు భయపడే వ్యక్తి కాదని, ఇలాంటివి తాము గతంలో చాలా చూశామన్నారు. వాటన్నింటని సెటిల్ చేశామని చెప్పారు. కేంద్ర బడ్జెట్లో దక్షిణాదికి నిధులు సరిగా దక్కకపోవడంపై డీకే సురేష్ మాట్లాడుతూ దేశాన్ని ఉత్తర, దక్షిణ భారత దేశాలుగా విభజించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు దుమారాన్ని రేపాలయి. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఈశ్వరప్ప.. డీకే సురేష్, ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి లాంటి వాళ్లను కాల్చి చంపేందుకు చట్టం చేయాల్సిందిగా ప్రధాని మోదీకి చెబుతానన్నారు. అయితే, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే డీకే సురేష్ వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వ్యాఖ్యలను సమర్థించదని తేల్చి చెప్పారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ ఈశ్వరప్పకు కొట్టడం, తిట్టడం, కాల్చడం తప్ప ఏమీ తెలియదన్నారు. ఈశ్వరప్పపై చట్టపరమైన చర్యలుంటాయని చెప్పారు. కాగా, డీకే సురేష్‌ను కాల్చి చంపాలన్నందుకు ఈశ్వరప్పపై బెంగళూరులో ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై ఈశ్వరప్ప స్పందిస్తూ జాతీయవాదం, హిందుత్వ అంశాల్లో తనపై వందల ఎఫ్ఐఆర్లు నమోదైనా భయపడనని స్పష్టం చేశారు. ఇదీ చదవండి.. ముగిసిన 17వ లోక్‌సభ.. పార్లమెంట్ నిరవధిక వాయిదా -
రోజుకో మలుపు తిరుగుతున్న డీకే శివకుమార్ సీబీఐ కేసు
బెంగళూరు: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అక్రమాస్తుల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేసు విచారణ కోసం గత బీజేపీ ప్రభుత్వ హయాంలో సీబీఐకి ఇచ్చిన సమ్మతిని సీఎం సిధ్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు ఇప్పటికే ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఇలా ఉపసంహరించుకోవడం చెల్లదని సీబీఐ తాజాగా హై కోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ కేసు వ్యవహారం మరింత రసకందాయంలో పడింది. సీబీఐ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారించనుంది. ఈ విచారణలో కోర్టు తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం డీకే సీబీఐకి హైకోర్టులో తమ ప్రభుత్వం సరైన సమాధానం ఇస్తుందని తెలిపారు. కాగా, డీకే శివకుమార్ అక్రమాస్తుల కేసులో సిద్ధరామయ్య ప్రభుత్వం సమ్మతి ఉపసంహరించుకోవడం అనైతికం అని ప్రతిపక్ష బీజేపీ,జేడీఎస్‌లు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ విమర్శలకు సీఎం సిధ్దరామయ్య ఏ మాత్రం వెరవడం లేదు. అడ్వకేట్ జనరల్ అభిప్రాయం రాకముందే డీకే శివకుమార్ కేసు విచారణ కోసం గత బీజేపీ ప్రభుత్వం సమ్మతి ఇచ్చిందని, ఇది చెల్లనందునే తాము సమ్మతి ఉపసంహరించుకున్నామని సిధ్ద రామయ్య సమర్ధించుకుంటున్నారు. అయితే డీకే కేసులో సమ్మతి ఇచ్చిన మాజీ సీఎం యడ్యూరప్ప మాట్లాడుతూ అసలు ప్రభుత్వం ఒకసారి సమ్మతి ఇచ్చి విచారణ ప్రారంభం అయిన తర్వాత దానిని ఉపసంహరించుకోవడం చట్ట ప్రకారం కుదరదన్నారు. ఈ విషయంలో సీఎం సిద్ధరామయ్య క్షమించరాని నేరం చేశారని ఆరోపిస్తున్నారు. ఇదీచదవండి..రామ జమ్మభూమి-బాబ్రీ మసీద్ వివాదం: మాజీ పిటిషనర్ ఇక్బాల్‌కు ఆహ్వానం -
బెంగళూరు విమానాశ్రయం సాక్షిగా బయటపడిన కాంగ్రెస్-టిడిపి బంధం
-
DK Shivakumar Meets CBN Photos: పవన్.. మళ్లీ కరివేపాకయ్యాడుగా! (ఫొటో స్టోరీ)
-
అందుకేనట బాబు రహస్య మంతనాలు!
అక్క ఆరాటమే తప్ప బావ బతకడు అన్నట్లు తయారైంది చంద్రబాబు పరిస్థితి.. చచ్చిన తెలుగుదేశాన్ని లేపి.. మళ్ళీ నాగినీ డాన్స్ అందించడానికి అయన ఎన్ని విధాలా నాగస్వరం ఊదుతున్నా అయన బుగ్గలు నెప్పెడుతున్నాయి తప్ప పాము లేవడం లేదు.. దీంతో కొన్నాళ్ళు పవన్ కళ్యాణ్‌ను వాడుకుని పార్టీకి బలం చేకూరుద్దామని ప్రయత్నించారు. అబ్బే.. కుదరలేదు. గజ్జి తగ్గడానికి మందు రాస్తే ఆ గజ్జి చేతికి అంటుకుంది తప్ప గజ్జి మానలేదు. చంద్రబాబుతో అంటకాగిన కొద్దీ పవన్ కళ్యాణ్ బలహీనం అయ్యాడు కానీ టీడీపీకి లాభం రాలేదు... పైగా కాపులు ఇప్పుడు చంద్రబాబును, పవన్ కళ్యాణ్‌ను కలిపి జాయింటుగా టార్గెట్ చేసి తిడుతున్నారు. దీంతో ఆ పీకే అచ్చిరాలేదని వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(PK ) ను తెచ్చారు. రోగిలో చలనం లేనపుడు, అవయవాలన్నీ చచ్చుబడిపోయినపుడు ఎంత పెద్ద డాక్టర్ మాత్రం ఏమి చేస్తాడు.... ఆయన కూడా చెక్ చేసి.. కష్టం. ఇంకొన్నాళ్లే బతుకుతాడు.. దగ్గరోళ్ళు ఉంటె పిలుచుకోండి.. కడసారి చూపులు చూసుకోండి అని చెప్పేసినట్లు ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పేశాడు. దీంతో. ఇక చంద్రబాబుకు మిగిలింది దింపుడు కల్లం ఆశ మాత్రమే మిగిలింది.. దీంతో ఇప్పుడు తాజాగా మంచి సక్సెస్ రికార్డ్‌తో దూసుకుపోతున్న కర్ణాటక కాంగ్రస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. Chance encounter between #TDP chief and #AndhraPradesh former CM #ChandrababuNaidu and KPCC chief and #Karnataka Deputy CM, #DKShivakumar at HAL airport Bengaluru, DK was heading for the Congress formation day in Nagpur, while #Chandrababu to attend a party meeting in city. pic.twitter.com/fG9umaE7md — Surya Reddy (@jsuryareddy) December 28, 2023 కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించడం దగ్గర్నుంచి తెలంగాణాలో అసలు రేసులోనే లేని కాంగ్రెసును అధికార పీఠం ఎక్కించిన ఎపిసోడ్ తాలూకు క్రెడిట్ మొత్తం డీకే శివకుమార్ కు దక్కింది. దీంతో ఆయన్ను ప్రసన్నం చేసుకుని కొన్ని ఎత్తులు.. పొత్తులు.. జిత్తులను ప్లాన్ చేసే నిమిత్తము ఆయన్ను కలిసినట్లు తెలుస్తోంది. అటు ఎన్నికల సమయం ముంచుకొస్తోంది.. ఎటు చూసినా కారుచీకటి. గెలిచే సీట్ ఎక్కడా కానరావడం లేదు.. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు సైతం కుప్పంలో పోటీకి భయపడి రెండోచోట పోటీ చేస్తారని అంటున్నారు. అంటే టీడీపీ శిబిరం బయటకు బిల్డప్పులు బాగానే కొడుతున్నా లోలోన ఓటమి భయం వెన్నాడుతోంది. దీంతో అటు లోకేష్ కూడా రెండు చోట్ల పోటీకి తయారవుతున్నారు. ఇక జగన్ కాదని వదిలేసిన వంశీ, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలాంటి వాళ్ళే ఇప్పుడు బాబుకు దిక్కవుతున్నారు. దీంతో దిక్కుతోచని అయన ఏకంగా కాంగ్రెస్ నాయకులతోనే పొత్తులగురించి చర్చించే స్థాయికి దిగిపోయారు.. వాస్తవానికి 2019లో కూడా ఎన్డీయేను వదిలేసి కాంగ్రెస్ కూటమిలో చేరి దేశమంతా తిరిగి ప్రచారం చేసినా కాంగ్రెస్ బతికిబట్టగట్టలేదు సరికగా తాను వంద తిట్లు తిట్టినా మోడీ మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు సైతం చంద్రబాబు మళ్ళీ కాంగ్రెస్ పంచన చేరేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు. -సిమ్మాదిరప్పన్న -
TS:ఖర్గేతో డీకే శివకుమార్ కీలక భేటీ... సీఎం ఫైనల్ అయ్యే ఛాన్స్ !
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ సీఎం ఎంపికపై ఏఐసీసీ చీఫ్ ఖర్గే నివాసలంలో కీలక భేటీ జరుగుతోంది. ఈ భేటీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. తెలంగాణ ఎన్నికల ముఖ్య పరిశీలకుడు డీకే శివకుమార్, పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ ఠాక్రే ఏఐసీసీ చీఫ్ ఇంటికి వెళ్లారు. హైదరాబాద్ నుంచి తీసుకువచ్చిన ఎమ్మెల్యేల అభిప్రాయాలతో పాటు ఉత్తమ్, భట్టిలతో జరిగిన సమావేశ వివరాలపై డీకే ఏఐసీసీ చీఫ్‌కు నివేదిక అందించారు. సీఎం ఎంపికపై ఖర్గే నివాసానికి వెళ్లే ముందు డీకేఎస్ మీడయాతో మాట్లాడారు. ‘తెలంగాణ సీఎల్పీ నేతను హై కమాండ్ నిర్ణయిస్తుంది. ఫైనల్‌గా హై కమాండ్ సరైన నిర్ణయం తీసుకుంటుంది’ అని డీకే శివకుమార్ చెప్పారు. అంతకముందు హైదరాబాద్ నుంచి ఇవాళే ఢిల్లీకి వచ్చిన భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో డీకే శివకుమార్, ఠాక్రేలు విడివిడిగా భేటీ అయ్యారు. సీఎం ఎంపికపై వారిరువురి అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. కాగా, ఉదయం ఇండియా కూటమి సమావేశానికి వెళ్లేముందు ఏఐసీసీ చీఫ్ ఖర్గే మీడియాతో మాట్లాడుతూ ఎప్పటిలోగా సీఎం ఎంపిక ఉంటుందనేదానిపై క్లారిటీ ఇచ్చారు. సాయంత్రంలోగా సీఎం పేరును ప్రకటిస్తామని తెలిపారు. ఇదీచదవండి..సీం ఎవరు..? సాయంత్రానికి సస్పెన్స్‌కు తెర! -
ఇంకా కొలిక్కిరాని తెలంగాణ సీఎం ఎంపిక
-
TS: సీఎం ఎవరు..?ఏఐసీసీ చీఫ్ ఖర్గే కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ సీఎం ఎవరు? కొత్త మంత్రులు ఎవరనేదానిపై ఉత్కంఠకు ఇవాళ తెరపడే ఛాన్సుంది. పార్లమెంట్‌లోని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఛాంబర్లో ఇండియా కూటమి సమావేశానికి వెళ్తూ ఖర్గే ఈ విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం ఎవరనేది సాయంత్రానికల్లా వెల్లడిస్తామని చెప్పారు. కాగా, సీఎం అభ్యర్థిని నిర్ణయించేందుకుగాను ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో చర్చించడానికి సోమవారమే డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్లారు. ఇవాళ ఆయన ఖర్గేతో సమావేశమై చర్చించిన అనంతరం నిర్ణయం వెలువడే ఛాన్సుంది. మరోవైపు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొద్దిసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. ఖర్గేతో డీకేఎస్ భేటీకి ముందు భట్టి, ఉత్తమ్‌లు డీకేఎస్‌తో సమావేశమై సీఎం, మంత్రివర్గ కూర్పుపై తమ వాదనలు బలంగా వినిపించనున్నట్లు తెలుస్తోంది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన ఎంపీ పదవికి ఇవాళే రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఇదీచదవండి..సీం ఎవరు..? సాయంత్రానికి సస్పెన్స్‌కు తెర! -
TS: సీల్డ్ కవర్‌తో హైదరాబాద్‌కు డీకే శివకుమార్ !
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ సీఎం ఎవరనే సస్పెన్స్‌కు ఇవాళ సాయంత్రానికి తెరపడనున్నట్లు తెలుస్తోంది. సోమవారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో భేటీ తర్వాత ఢిల్లీ వెళ్లిన ఏఐసీసీ ముఖ్య పరిశీలకుడు డీకే శివకుమార్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో భేటీ కానున్నారు. సీఎం, మంత్రుల జాబితాపై ఖర్గేతో చర్చించి ఫైనల్ చేయనున్నారు. అనంతరం డీకేఎస్‌తో పాటు మిగిలిన పరిశీలకులు సీల్డ్ కవర్‌తో మధ్యాహ్నమే హైదరాబాద్ బయలుదేరనున్నారు. డీకే శివకుమార్ నేరుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బస చేసిన ఎల్లా హోటల్‌కు వెళ్లి వారతో సమావేశమవుతారు. అక్కడ సీల్డ్ కవర్లో ఉన్న సీఎం పేరును ప్రకటిస్తారు. అనంతరం ముఖ్యమైన పోర్ట్‌ఫోలియోలకు మంత్రులెవరనేది కూడా వెల్లడిస్తారు. మొత్తానికి సీఎం పదవి చేపట్టనుందెవరనేది సాయంత్రానికి తేలిపోయే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం ప్రమాణ స్వీకారం ఎప్పుడుంటుందనేదానిపై పేరు ప్రకటించిన తర్వాతే క్లారిటీ వచ్చే ఛాన్సుంది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 సీట్లు గెలిచి మ్యాజిక్ ఫిగర్ సాధించిన విషయం తెలిసిందే. లెజిస్లేచర్ పార్టీ లీడర్ (సీఎల్పీ) నేతను ఎన్నుకోవడానికి గెలిచిన ఎమ్మెల్యేలంతా గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో సోమవారం సమావేశమయ్యారు. అయితే ఈ విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో సీఎం ఎంపిక బాధ్యతను అధిష్టానానికి అప్పగిస్తూ ఎమ్మెల్యేలు ఏకవ్యాఖ్య తీర్మానం చేసి పంపించారు. తర్వాత డీకే శివకుమార్ సహా ఏఐసీసీ పరిశీలకులు ఢిల్లీ వెళ్లారు. ఇదీచదవండి..గ్రేటర్ హైదరాబాద్‌లో మంత్రి పదవి వరించేదెవరిని... -
నేడు సీఎల్పీ భేటీ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. నూతన ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా సోమవారం పార్టీ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశాన్ని నిర్వహించనుంది. హైదరాబాద్‌లోని ఎల్లా హోటల్ వేదికగా ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీలో సీఎం ఎంపికపై కొత్త ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పర్యవేక్షణలో, ఇతర ఏఐసీసీ ముఖ్యుల సమక్షంలో ఈ సమావేశం జరగనుంది. దీనికోసం కాంగ్రెస్ కొత్త ఎమ్మెల్యేలంతా ఆదివారం రాత్రే హైదరాబాద్‌కు చేరుకున్నారు. భేటీ తర్వాత అధిష్టానం పరిధిలోకి.. పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించాక సీఎం ఎంపిక, మంత్రివర్గ కూర్పు అంశం అధిష్టానం పెద్దల చేతికి వెళ్లనుంది. డీకే బృందం ఎమ్మెల్యేలతో భేటీ పూర్తికాగానే ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం. అక్కడ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాందీలతో సమాలోచనలు జరిపి సీఎం ఎవరన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. తర్వాత సీఎం రేసులో ఉన్న ఇతర నేతలను ఢిల్లీకి పిలిపించి బుజ్జగించి, ఏకాభిప్రాయం సాధించే అవకాశం ఉందని తెలిసింది. తర్వాత మరోమారు ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి లాంఛనంగా సీఎల్పీ నాయకుడి ఎంపికను పూర్తి చేయనున్నారు. ఈ నెల 9వ తేదీకల్లా ఈ ప్రక్రియ అంతా పూర్తిచేసి ఎల్బీ స్టేడియం వేదికగా ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించవచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సోమ, మంగళవారాల్లోనే ప్రమాణ స్వీకారం? ఎక్కువ రోజులు పొడిగించకుండా సోమవారం లేదా మంగళవారమే సీఎంతోపాటు ఒకరిద్దరు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశాలు కూడా ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సోమవారం సీఎల్పీ భేటీ తర్వాత డీకే శివకుమార్, ఇతర పెద్దలు ఇక్కడి నుంచే ఢిల్లీ పెద్దలతో మాట్లాడి, నేరుగా గవర్నర్‌ను కలసి రాజ్‌భవన్‌లోనే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేస్తారనే చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే ఈనెల 9 నాటికి మంత్రివర్గాన్ని కూర్చి పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ సభలో మంత్రుల ప్రమాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలీసుల పేరిట లేఖ ఫేక్ సీఎంగా రేవంత్‌రెడ్డి సోమవారం ప్రమాణస్వీకారం చేస్తారని, ఆ కార్యక్రమానికి రాహుల్, ప్రియాంక వచ్చే అవకాశం ఉందని, ఇందుకోసం తగిన భద్రత ఏర్పాటు చేయాలంటూ పోలీసు ఉన్నతాధికారుల పేరిట ఓ లేఖ వైరల్‌గా మారింది. అయితే అది ఫేక్ అని టీపీసీసీ వర్గాలు ప్రకటించాయి. గవర్నర్‌ను కలసిన కాంగ్రెస్ నేతలు ఫలితాల అనంతరం హైదరాబాద్‌లోని ఎల్లా హోటల్లో సమావేశమైన కాంగ్రెస్ నేతలు.. రాత్రి 9 గంటల సమయంలో రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ తమిళిసైను కలిశారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ పరిశీలకులు దీపాదాస్మున్షీ, కేజీ జార్జ్ తదితరులు రాజ్‌భవన్‌కు వెళ్లిన బృందంలో ఉన్నారు. తమకు 65 మంది సభ్యుల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ వారు గవర్నర్‌కు లేఖ అందజేశారు. తర్వాత రాజ్‌భవన్ ఎదుట డీకే శివకుమార్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. సీఎంపై సోమవారమే స్పష్టత: ఉత్తమ్ గవర్నర్‌ను కలవడానికి ముందు ఎల్లా హోటల్ వద్ద ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మా ట్లాడారు. సోమవారం సీఎల్పీ సమావేశం జరగనుందని, సీఎం ఎవరన్నదానిపై స్పష్టత వస్తుందని చెప్పారు. ఈ విషయంలో తన అభిప్రాయాన్ని సమావేశంలోనే వెల్లడిస్తానని, బయ ట చెప్పనని వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం ప్రజల విజయమని అభివర్ణించారు. -
సీఎం ఎవరనేది అప్పుడే తేలుస్తాం: డీకే శివకుమార్
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) సమావవేశంలో సోమవారం సీఎం అభ్యర్థిని ఎన్నుకుంటామని డీకే శివకుమార్ తెలిపారు. గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరాతమన్నారు. గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాలో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలతో సమావేశం అనంతరం బయటికి వచ్చిన డీకే మీడియాతో మాట్లాడారు. హోటల్ నుంచి గవర్నర్‌ను కలవడానికి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, పార్టీ ఇంఛార్జ్ థాక్రే, డీకే శివకుమార్, ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెళ్లారు. సీఎం ఎవరన్నది ఫైనల్ కాలేదు : ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం ఎవరన్నది ఫైనల్ కాలేదని, ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్న తర్వాతే సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తామని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సీఎం ఎవరనేది ఏఐసీసీలో ఇంకా నిర్ణయం కాలేదన్నారు. సీఎల్పీ సమావేశం సోమవారం ఉదయం 9.30 గంటలకు జరగనుంది. ఈ సమావేశంలో సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తారా.. లేదంటే నిర్ణయం మళ్లీ వాయిదా పడుతుందా అనేదానిపై క్లారిటీ లేదు. -
డీకే శివకుమార్ ఫస్ట్ రియాక్షన్
-
గెలుపు దిశగా కాంగ్రెస్.. పక్కా ప్లాన్‌తో రెడీగా డీకే శివకుమార్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో దూసుకెళ్తోంది. మరోవైపు.. కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ నడుస్తోంది. ఇక, బీఆర్ఎస్ మంత్రులు, కీలక నేతలు పలుచోట్ల వెనుకంజలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే.. గెలుపొందిన అభ్యర్థులను కర్ణాటకకు తరలించనున్నారు. రిసోర్టు రాజకీయం కొనసాగే అవకాశం ఉంది. ఇక, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్లాన్ రచిస్తున్నారు. ట్రబుల్ షూటర్ డీకే.. శనివారం రాత్రే హైదరాబాద్‌కు చేరుకున్నారు. కర్ణాటకకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్‌కు చేరుకొని ఎన్నికల ఫలితాలను విక్షిస్తున్నారు. #WATCH | On being asked if party MLAs will be shifted to Bengaluru as buses stationed outside Hyderabad's Taj Krishna, Congress leader & Karnataka minister Rahim Khan says, "If that situation comes, then party high command will decide." pic.twitter.com/nrAXP5MgQr — ANI (@ANI) December 3, 2023 మరోవైపు.. కాంగ్రెస్ నేతలు తాజ్‌కృష్ణలో రూమ్స్‌ను బుక్ చేసుకున్నారు. దాదాపు 100 గదులను రిజ్వర్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు వెలువడిన వెంటనే కాంగ్రెస్ అభ్యర్థులను తాజ్‌కృష్ణకు తరలించి.. అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల్లో కర్ణాటకకు తరలించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ఇతర పార్టీల్లోకి జంప్ కాకుండా హస్తం పార్టీ ముందస్తుగానే ప్లాన్ చేసింది. Telangana | Luxury buses have been stationed at Hyderabad's Taj Krishna. pic.twitter.com/1hJsAsfJrd — ANI (@ANI) December 3, 2023 -
డీకే శివకుమార్ బిగ్ స్కెచ్.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు షిఫ్ట్..!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఎగ్జిట్‌పోల్స్ అన్నీ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపడంతో ఆ పార్టీ ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. తమ పార్టీ తరపున గెలిచే ఎమ్మెల్యేలు చేయి జారిపోకుండా అన్ని చర్యలు తీసుకుంటోంది. ఫలితాల్లో పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటితే ఎలాంటి సమస్యలు ఉండవు కానీ అలాకాని పక్షంలో ఎమ్మెల్యేల హార్స్ ట్రేడింగ్ జరిగే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ అధినాయకత్వం ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు పెద్ద స్కెచ్‌నే వేసింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కొందరు సీఎం కేసీఆర్‌కు టచ్‌లో ఉన్నారన్న ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలను కేసీఆర్ ఎగరేసుకుపోకుండా ఉండేందుకు క్యాంపు రాజకీయాలు నడపడంలో దిట్ట అయిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను రంగంలోకి దిగారు. కౌంటింగ్‌కు ఒక రోజు ముందే శనివారం సాయంత్రమే డీకే సహా ఆరుగురు కర్ణాటక మంత్రులు హైదరాబాద్ రానున్నట్లు సమాచారం. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అభ్యర్థులంతా హైదరాబాద్‌లోని హోటల్ తాజ్ కృష్ణాకు రావాలని డీకే అండ్ కో ఇప్పటికే అభ్యర్థులను కోరినట్లు తెలిసింది. అభ్యర్థులతో డీకే ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు సమాచాం. ఫలితాల వెల్లడి తర్వాత గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రత్యేక విమానాల్లో డీకే బ్యాచ్ బెంగళూరు షిఫ్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా,శనివారం ఉదయం తెలంగాణఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌ను కలిసిన పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు కూడా గెలవబోయే కాంగ్రెస్ అభ్యర్థుల విషయమై ఒక స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. తమ పార్టీ చీఫ్ పోలింగ్ ఏజెంట్‌కే ఎమ్మెల్యేల గెలుపు ధృవీకరణ పత్రాలు అందజేయాలని కోరారు. దీనినిబట్టి పోటీచేసిన అభ్యర్థులు లోకల్‌గా అందుబాటులో ఉండరని తేలిపోయింది. ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత ఓ జాతీయ టీవీ ఛానల్‌తో మాట్లాడిన డీకే శివకుమార్ సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్ ఇప్పటికే మా అభ్యర్థుల్లో కొంత మందికి టచ్‌లోకి వచ్చారని చెప్పారు. అయితే ఈసారి కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కోవడం అంత ఈజీ కాదని డీకే స్పష్టం చేశారు.2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకంగా లెజిస్లేచర్ పార్టీని విలీనం చేసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. ఇదీచదవండి..తెలంగాణ ఎన్నికలు 2023.. నేటి సమగ్ర సమాచారం -
డీకే శివకుమార్ కేసులో కోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విదేశాలకు వెళ్లేందుకు ఢిల్లీ కోర్టు అనుమతిచ్చింది. కాప్ 28 లోకల్ క్లైమేట్ యాక్షన్ సదస్సులో పాల్గొనేందుకుగాను డిప్యూటీ సీఎం హోదాలో శివకుమార్ దుబాయ్ వెళ్లనున్నారు. ఈనెల 29 నుంచి డిసెంబర్ 3 వరకు దుబాయ్‌లో ఉండేందుకు డీకేకు కోర్టు అనుమతిచ్చింది. డీకే విదేశాలకు వెళ్లేందుకు అనుమతిచ్చే సందర్భంలో కోర్టు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘సాధారణంగా ఒక పౌరుడు విదేశాలకు వెళ్లడం అనేది అతని ప్రాథమిక హక్కులో భాగం. అయితే ఇది పరిమితులు లేని హక్కు కాదు. కేసుల్లో నిందితులు విదేశాలకు పారిపోకుండా చూసేందుకు ఈ హక్కుపై పరిమితులు విధించవచ్చు. అయితే ఇక్కడ అనుమతి అడుగున్నది 8 సార్లు ఎమ్మెల్యే, ప్రస్తుత డిప్యూటీ సీఎం శివకుమార్ అయినందున అనుమతిస్తున్నాం. ఎందుకంటే ఇంత బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆయన పారిపోయే అవకాశాలు తక్కువ’అని కోర్టు పేర్కొంది. అయితే డీకే దుబాయ్ వెళ్లేందుకు అనుమతిచ్చిన కోర్టు కొన్ని షరతులు పెట్టింది. 5 లక్షల రూపాయల డిపాజిట్‌తో పాటు ప్రయాణానికి సంబంధిచిన పూర్తివివరాలు, అక్కడ వాడే మొబైల్ నెంబర్ అందించాలని ఆదేశించింది. మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన డీకే శివకుమార్‌కు 2019 అక్టోబర్ 23న కోర్టు ఈడీ కేసులో బెయిల్ ఇచ్చింది. అప్పటి నుంచి ఆయన బెయిల్‌పైనే ఉన్నారు. ఇదీచదవండి..వర్షంలో శరద్‌పవార్ స్పీచ్..సెంటిమెంట్ ఏంటంటే.. -
డీకే శివకుమార్ సీబీఐ కేసుపై సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు
బెంగళూరు: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అక్రమాస్తుల కేసుపై ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య స్పందించారు. డీకే కేసులో సీబీఐ విచారణ జరిపేందుకు గతంలో బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన అనుమతి(కన్సెంట్) అక్రమమని చెప్పారు. తాము ఆ అనుమతిని ఉపసంహరించుకుంటామని చెప్పారు. ‘సాధారణంగా సీబీఐ కేసుల్లో ఎమ్మెల్యేలకు స్పీకర్, మంత్రులకు గవర్నర్ విచారణ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. డీకే కేసులో కేలం గవర్నర్ మాత్రమే అనుమతి ఇచ్చారు. స్పీకర్ పర్మిషన్ ఇవ్వలేదు. డీకే ఎమ్మెల్యే కూడా. ఆయనపై సీబీఐ విచారణజరపాలంటే స్పీకర్ అనుమతి కావాలి. స్పీకర్ అనుమతివ్వనందున సీబీఐ విచారణకు బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన అనుమతి అక్రమం’ అని సిద్ధరామయ్య తెలిపారు. ‘అయితే డీకే అక్రమాస్తుల కేసులో గత ప్రభుత్వం సీబీఐకి ఇచ్చిన అనుమతిపై ప్రస్తుతం హై కోర్టులో ఉన్న కేసు గురించి నేను మాట్లాడను. ప్రభుత్వం మాత్రం అనుమతి ఉపసంహరిస్తుంది. ఆ అనుమతి కేవలం అప్పటి ముఖ్యమంత్రి యడ్యూరప్ప మౌఖిక ఆదేశాల మేరకు ఇచ్చింది’ అని సిద్ధరామయ్య అన్నారు. 2013 నుంచి2018 వరకు సిద్ధరామయ్య ప్రభుత్వంలో డీకే విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ టర్ములో ఆయన అక్రమంగా 75 కోట్ల రూపాయల అక్రమాస్తులు పోగేశారని సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో విచారణకుగాను తరువాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం సీబీఐకి కన్సెంట్ ఇచ్చింది. పబ్లిక్ సర్వెంట్లను విచారించాలంటే సీబీఐకి ప్రభుత్వ కన్సెంట్ తప్పనిసరి. తాను మంత్రిగా ఉన్నప్పటి అక్రమాస్తుల కేసులో కేవలం గవర్నర్ మాత్రమే కన్సెంట్ ఇచ్చారని, స్పీకర్ కన్సెంట్ ఇవ్వలేదని పేర్కొంటూ కేసు విచారణను కొట్టి వేయాలని డీకే ఇప్పటికే హైకోర్టులో కేసు వేశారు. ఇదీచదవండి..చైనా కొత్త వైరస్ కేసులతో ప్రమాదం లేదు : భారత ఆరోగ్య శాఖ -
ఎన్నికలు కరెంట్ పైనే..
హుస్నాబాద్/చిగురుమామిడి/ అక్కన్నపేట/కోహెడ: కరెంటు సరఫరా ప్రధాన ఎజెండాగానే ఈ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయని, మూడు గంటలు కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ కావాలో, 24 గంటలు కరెంట్ ఇచ్చే కేసీఆర్ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అనబేరి చౌరస్తా నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న మన తెలంగాణకు వచ్చి మా రాష్ట్రంలో 5 గంటల కరెంట్ ఇస్తున్నామంటూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ లొల్లి చేస్తున్నాడని ధ్వజమెత్తారు. కాంగ్రెసోళ్లకి కరెంట్‌పై ఎంత అవగాహన ఉందో డీకే మాటలను బట్డి అర్ధం చేసుకోవచ్చని అన్నారు. కాంగెస్ నేతలు తెలంగాణలో ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హైదరాబాద్‌కు వచ్చి మంచి ముచ్చట చెప్పారని హరీశ్ వ్యాఖ్యానించారు. బోర్ బావుల వద్ద మోటార్లు బిగించిన రాష్ట్రాలకు కేంద్ర నిధులు ఇచ్చామని, తెలంగాణలో మీటర్లు బిగించడం లేదని, అందుకే రూ.35వేల కోట్ల రూపాయల నిధులను ఆపామని ఆమె చెప్పారని వివరించారు. బోరు బావుల వద్ద మీటర్లు బిగించమని కేసీఆర్ తెగేసి చెప్పారని గుర్తు చేశారు. కేసీఆర్‌కు రూ.35వేల కోట్ల కంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 69లక్షల మంది రైతులే ముఖ్యమని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను బట్టి అర్ధం చేసుకోవచ్చన్నారు. కర్ణాటకలో ప్రజలు అవస్థలు పడుతున్నారు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో హుస్నాబాద్ అభ్యర్థి సతీశ్‌కుమార్, బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి, మాజీ మంత్రి పెద్దిరెడ్డితో కలిసి మంత్రి హరీశ్ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్ణాటకలో ఐదు గ్యారంటీలంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బోల్తా పడిందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు మనకు కూడా 6 గ్యారంటీలని వస్తున్నారని, వారి మాటలు విని ఆగం కావద్దని హెచ్చరించారు. అక్కడి ప్రభుత్వం అన్ని ధరలు పెంచడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. నీతి లేని కాంగ్రెస్‌ను నమ్మొద్దని హెచ్చరించారు. -
Karnataka: మాజీ మంత్రి శ్రీరాములు కాంగ్రెస్‌లో చేరుతున్నారా?
బెంగళూరు: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బి.శ్రీరాములు.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను సోమవారం బెంగళూరులోని ఆయన నివాసంలో కలిశారు. దీంతో శ్రీరాములు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కుమారుడు విజయేంద్రను పార్టీ ఇటీవల నియమించింది. దీంతో ఈ పదవిని ఆశించిన శ్రీరాములుకు భంగపాటు ఎదురైంది. ఈ నేపథ్యంలో ఆయన పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే శ్రీరాములు తన కుమార్తె వివాహానికి ఆహ్వానించేందుకు డీకే నివాసానికి వెళ్లినట్లు సమాచారం. శ్రీరాములు బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో 2021 ఆగస్టు నుండి 2023 మే వరకు రాష్ట్ర రవాణా, గిరిజన సంక్షేమ శాఖలకు మంత్రిగా పనిచేశారు. అంతకుముందు 2020 అక్టోబర్ నుండి 2021 జూలై వరకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. శ్రీరాములు ప్రస్తుతం చిత్రదుర్గ జిల్లాలోని బళ్లారి రూరల్ మొలకల్మూరు నియోజకవర్గం నుంచి రాష్ట్ర శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
కేసీఆర్‌ను ఫాంహౌస్‌కు పరిమితం చేద్దాం
కోదాడ: పదేళ్లుగా సచివాలయానికి రాకుండా ఫాంహౌస్ నుంచే పాలన సాగించిన సీఎం కె.చంద్రశేఖర్‌రావును డిసెంబర్ తరువాత శాశ్వతంగా ఫాంహౌస్‌కే పరిమితం చేద్దామని కర్ణాటక రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కోదాడలో నిర్వహించిన రోడ్ షో, రంగా థియేటర్ సెంటర్లో జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వంగా పేరున్న కేసీఆర్ సర్కారును ఇంటికి పంపడానికి ప్రజలు నవంబర్ 30వ తేదీ కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ‘డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం ఇ చ్చిన ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ జన్మదినం. ఆ రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆమెకు పుట్టినరోజు కానుకగా ఇవ్వబోతున్నాం’అని పేర్కొన్నారు. 60 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు నేటికీ చెక్కు చెదరలేదని, సాగర్ ఆయకట్టు ప్రాంతంగా ఉన్న కోదాడకు రావడం, ఇక్కడ రైతులను కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు గ్యారంటీలను టీఆర్ఎస్ నాయకులు వచ్చి చూడాలని సూచించారు. రూ.లక్షన్నర కోట్ల అప్పులు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ మూడేళ్లకే కూలిపోవడానికి సిద్ధంగా ఉందన్నారు. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ కోట్లాది రూపాయలు దోచుకున్నారని శివకుమార్ ఆరోపించారు. జాతీయస్థాయిలో పేరున్న ఉత్తమ్‌ను హుజూర్‌నగర్‌లో, ఆయన సతీమణి పద్మావతిని కోదాడలో గెలిపించుకుంటే ఈ ప్రాంతం అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏపీ కాంగ్రెస్ నేతలు రఘువీరారెడ్డి, రుద్రరాజు, సీపీఐ నేత పల్లా వెంకట్‌రెడ్డి, కోదాడ కాంగ్రెస్ అభ్యర్థి నలమాద పద్మావతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు పాల్గొన్నారు. -
మున్ముందు మంచి అవకాశాలు
కొడంగల్: ఈ ఎన్నికలు కేసీఆర్‌కు, కొడంగల్ ప్రజల ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్, కేటీఆర్‌ను బంగాళాఖాతంలో కలిపేలా తీర్పు ఇవ్వాలని కోరారు. సోమవారం పెద్దసంఖ్యలో కార్యకర్తలు, అభిమానులతో తరలివెళ్లిన రేవంత్, కొడంగల్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేశారు. మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, పీసీసీ సభ్యుడు మహ్మద్ యూసుఫ్‌తో కలసి రిటర్నింగ్ అధికారి లింగ్యానాయక్‌కు నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి తనది మాత్ర మే కాదని, కొడంగల్‌లోని ప్రతి బిడ్డా తనను తాను పీసీసీ అధ్యక్షుడిగా భావించాలని పిలుపునిచ్చారు. మీ ఆశీర్వాదంతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని, కొడంగల్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ ప్రాంతం పేరు నిలబెట్టానని అన్నారు. సోనియా మనకు మంచి అవకాశాలు ఇస్తున్నారని, ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే గొప్ప అవకాశం కొడంగల్ ప్రజలకు వచ్చిందని చెప్పారు. భవిష్యత్తులోనూ మంచి అవకాశాలు రావచ్చు అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చే బాధ్యత మీదేనని అన్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు వచ్చిన మెజార్టీకన్నా ఎక్కువ మెజార్టీ అందించి చూపించాలని కోరారు. రెండేళ్లలో దశ, దిశ మారుస్తాం రాష్ట్రంలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ల మాదిరిగా కొడంగల్‌ను ఎందుకు అభివృద్ధి చేయలేదని కేసీఆర్‌ను రేవంత్ నిలదీశారు. దత్తత కాదు.. ధైర్యం ఉంటే కొడంగల్‌లో పోటీ చేయాలని సవాల్ విసిరినా స్వీకరించలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రెండేళ్లలో రాష్ట్రం దశ, దిశ మారుతుందని చెప్పారు. హెలీకాప్టర్ ద్వారా కొడంగల్‌కు చేరుకున్న ఆయన ముందుగా గాడిబాయి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన నివాసంలో సర్వమత ప్రార్థనలు చేశారు. కేసుల్లేవు..ఎఫ్‌ఐఆర్‌లున్నాయి రిటర్నింగ్ అధికారికి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో రేవంత్‌రెడ్డి తన ఆస్తులు అప్పులతో పాటు తనపై ఉన్న కేసుల వివరాలను వెల్లడించారు. క్రిమినల్ కేసులు లేవని, రాష్ట్రంలోని పలు పీఎస్‌లలో తనపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని పేర్కొన్నారు. 2022– 23 ఆర్థిక సంవత్సరానికి తన ఆదాయం రూ.13,76,700, తన సతీమణి గీతారెడ్డి ఆదాయం రూ.11,13,490 అని తెలిపారు. వ్యవసాయం ద్వారా రూ.3,15,000 ఆదాయం వస్తుందని వివరించారు. సెక్రటేరియేట్ బ్రాంచ్‌లో రూ.3,08,954 డిపాజిట్, ఢిల్లీ పార్లమెంట్ ఎస్బీఐ బ్రాంచ్‌లో రూ.17,17,461 డిపాజిట్ ఉన్నట్లు తెలిపారు. హోండా సిటీ కారు, మెర్సిడెస్ బెంజ్ కారు, 1,235 గ్రాముల బంగారం, 9,700 గ్రాముల వెండి ఉన్నట్లు వెల్లడించారు. -
డీకే సీఎం అయితే మద్దతిస్తాం: కుమార
బనశంకరి: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు జేడీయస్లోని 19 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తామని ఆ పార్టీ మాజీ సీఎం హెచ్డీ.కుమారస్వామి ఆఫర్ ఇచ్చారు. కాంగ్రెస్ పరిస్థితి చూస్తే ఎంతమంది సీఎం అవుతారో తెలియదని వ్యంగ్యమాడారు. శనివారం నగరంలోని పార్టీ ఆఫీసులో రాష్ట్రంలో కరువు పరిస్థితిపై సమీక్ష చేసి మాట్లాడారు. కాంగ్రెస్ పరిస్థితి చూస్తే తాత్కాలిక ముఖ్యమంత్రి ప్రభుత్వమని పిలవవచ్చునని ఆరోపించారు. కరువు నుంచి రైతులను కాపాడాలని డిమాండ్ చేశారు. సీఎం అవుతానన్న మంత్రి ప్రియాంక ఖర్గే కలబురిగి ప్రజలకు చేసింది ఏమిటి అన్నారు. గృహలక్ష్మీ పథకంలో ఎంతమందికి డబ్బు ఇచ్చారని ప్రశ్నించారు. -
డీకే శివకుమార్.. ఇదేనా మీ నీతి: కేటీఆర్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు మంత్రి కేటీఆర్ కౌంటరిచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కర్ణాటక అడ్డాగా మారిందన్నారు. హైదరాబాద్‌కు వచ్చే కంపెనీలకు లేఖలు రాసి శివకుమార్ వాటిని బెంగళూరు తీసుకెళ్తున్నారని ఆరోపించారు. కాగా, కేటీఆర్ శనివారం జలవిహార్‌లో తెలంగాణ న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ..‘ఫాక్స్ కాన్ కంపెనీకి గత నెలలో కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ లేఖ రాశారు. ఎంతో కష్టపడి మనం ఆ కంపెనీని తెలంగాణకు తీసుకొచ్చాం. ఫాక్స్ కాన్ సీఈవో కూడా ఇక్కడ కంపెనీ పెట్టీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కంపెనీ ప్రారంభానికి కొద్ది రోజుల సమయం ఉంది. కానీ, శివకుమార్ ఫాక్స్ కాన్ సీఈవోకి లేఖ రాసి ఆ కంపెనీ బెంగుళూరుకు మార్చండి అంటూ చెప్పాడు. సరే, కంపెనీ విషయంలో ఆశ పడుతున్నాడు అనుకోవచ్చు. కానీ, ఇంకా కొన్ని కామెంట్స్ చేశారాయన. త్వరలో తెలంగాణలో ఫ్రెండ్లీ ప్రభుత్వం వస్తుంది. అక్కడ ఉన్న ప్రముఖ కంపెనీలన్నీ బెంగళూరుకు మార్చేస్తాం అని లేఖలో రాసుకొచ్చారు. ఇది కాంగ్రెస్ పార్టీ, కర్ణాటక ప్రభుత్వం చేసే కుటిల ప్రయత్నం. తెలంగాణలో కేసీఆర్ లేకపోయినా, బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రాకపోతే జరిగేది ఇదే. ఫ్రెండ్లీ గవర్నమెంట్ వచ్చాక ఇక్కడ కంపెనీలను అక్కడికి తీసుకువెళ్తారు. ఇక్కడ కాంగ్రెస్ నేతలకు బెంగుళూరు అడ్డాగా మారింది. ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూ వచ్చే ఉద్యోగాలు కూడా బెంగుళూరుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇదేనా మీ నీతి, నిజాయితీ’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: మైనంపల్లి హన్మంతరావు ఓ రౌడీ: మంత్రి మల్లారెడ్డి -
కాంగ్రెస్‌ను నమ్మి ఓటేస్తే మోసపోతారు
నర్సాపూర్: కాంగ్రెస్ నేతల మాటలు నమ్మి ఓటేస్తే మోసపోతారని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల శంఖారావం సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న కర్ణాటకలో రోజుకు ఐదు గంటలే విద్యుత్ ఇస్తున్నామని, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇక్కడ ఎన్నికల ప్రచార సభలో చెప్పారని హరీశ్‌రావు గుర్తు చేశారు. శివకుమార్ వాస్తవాన్ని చెప్పారంటూ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. మన రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి ఆ పార్టీకి ఓటేస్తే ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోసం గోసపడిన రోజులు మళ్లీ వస్తాయని ప్రజలను హెచ్చరించారు. డీకే శివకుమార్ మాటలను రాష్ట్రంలోని రైతులు అర్థం చేసుకుని కాంగ్రెస్‌ను తెలంగాణలో సమాధి చేయాలని హరీశ్‌రావు హితవు పలికారు. ఉమ్మడి రాష్ట్రంలో అనేక కష్టాలతో బతికామని, ఇప్పుడిప్పుడే మన బతుకులు ఒక స్థాయిలో బాగు పడుతున్నాయని పేర్కొన్నారు. కేసీఆర్‌తోనే మన బతుకులు మరింత బాగు పడతాయని అన్నారు. కాగా, రైతుబంధు కింద ఆర్థిక సహాయం ఆపాలని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని మంత్రి ఆరోపించారు. యాసంగికి రైతుబంధు కావాలా.. వద్దా? అని రైతులను ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. మూడు గంటల కరెంటు చాలని అంటున్నారని, అలాంటి వారికి ఓటెయ్యవద్దని చెప్పారు. ఈ సభలో నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, నర్సాపూర్ ఎన్నికల ఇన్చార్జి వెంకటరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మాటకు మాట
-
కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు ఖాయం: డీకే
వికారాబాద్, తాండూరు: సోనియా గాంధీ పుట్టిన రోజు.. తెలంగాణ ఏర్పాటును ప్రకటించిన రోజు డిసెంబర్ 9న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేపట్టిన రెండో విడత బస్సుయాత్రలో భాగంగా శనివారం తాండూరు, పరిగి, చేవెళ్లలో నిర్వహించిన రోడ్‌షోకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తాండూరులో మాట్లాడుతూ.. కర్ణాటకలో ఇచ్చిన అన్ని గ్యారంటీ ల హామీని గెలిచిన నెలలోపే అమలు చేశామని.. తెలంగాణలోనూ అదేవిధంగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. కర్ణాటకలో పథకాలు అమలు కావట్లేదని విమర్శిస్తున్న సీఎం కేసీఆర్ అక్కడ బంధువులుంటే తెలుసుకోవాలని.. లేదంటే మేమే బస్సు పెట్టి తీసుకెళ్లి మా పథకాల అమలు తీరును చూపుతామని చెప్పారు. గతంలో వైఎస్సార్ హయాంలో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన మాదిరిగానే స్థలం ఉన్న వారికి రూ.5లక్షలతో ఇళ్లు నిర్మించి ఇస్తామని ఆయన హామీనిచ్చారు. యువతకు రూ.5లక్షలతో విద్యాభరోసా, రూ.15వేలతో రైతు భరోసా, మహిళలకు మహాలక్ష్మి స్కీంలో ప్రతీ నెల రూ.2,500 నగదు, రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ అందజేస్తామని వివరించారు. కర్ణాటక రాష్ట్రంలో 1.10కోట్ల మందికి గృహలక్ష్మి పథకం అ మలు చేశామని.. మహిళలకు ఉచిత రవాణా సౌక ర్యం కల్పిస్తున్నామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నామని తెలంగాణలోనూ అలా నే అమలు చేసి తీరుతామని డీకే శివకుమార్ తెలిపారు. కర్ణాటకలో రైతులకు అయిదు గంటల పాటు నాణ్యమైన కరెంటును ఉచితంగా ఇస్తున్నామని డీకే చెప్పారు. రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ రుణా న్ని ప్రజలు తీర్చుకోవాలని కోరారు. తాండూరు కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్‌రెడ్డిని 25వేల మెజారిటీ తగ్గకుండా గెలిపించాలని ఆయన కోరారు. కేసీఆర్ దోచుకున్న లక్ష కోట్లు కక్కిస్తాం ‘ఓడిపోతే ఫౌం హౌస్‌లో పడుకుంటా అని చిలక పలుకులు పలుకుతున్న సీఎం కేసీఆర్‌ను ఓడిపోయినా వదిలిపెట్టం. పదేళ్లలో దోచుకున్న లక్ష కోట్లు కక్కిస్తాం’అని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. తండ్రీకొడుకులు హైదరాబాద్ చుట్టూ పది వేల ఎకరాలు కబ్జా చేసిండ్రు.. ఆ భూమిని ప్రభుత్వం స్వాదీనం చేసుకుని వారిని జైలుకు పంపడం ఖాయ మన్నారు. బీఆర్ఎస్ ఓటమి.. కాంగ్రెస్ గెలుపు డిసైండ్ అయిందని అందుకే సీఎం రెస్ట్ తీసుకుంటానని ముందే చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. రైతులకు ఎనిమిది గంటలకు మించి కరెంటు వస్త లేదని కేసీఆర్ చెప్పేదంతా బూటకమేనన్నారు. రియల్ ఎస్టేట్, ఓఆర్ఆర్, అంతర్జాతీయ విమానా శ్రయం, మెట్రో తదితరాలన్నీ కాంగ్రెస్ హయాంలో జరిగినవేననీ గుర్తు చేశారు. కాంగ్రెస్ వండిపెడితే మీరు దొంగల్లా దోచుకుంటున్నారని విమర్శించా రు. వైఎస్సార్ ఇచ్చిన 4శాతం రిజర్వేషన్‌తో మైనార్టిలకు మేలు జరిగిందని.. బీఆర్ఎస్ మైనార్టిలకు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కిందని రేవంత్ విమర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ తాండూర్ అభ్యర్థి బుయ్యని మనోహర్‌రెడ్డి, మాజీ మంత్రులు గడ్డం ప్రసాద్ కుమార్, పుష్పలీల, డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. హజా కోసం ప్రసంగం ఆపిన రేవంత్ రేవంత్‌రెడ్డి మైనార్టిల సంక్షేమంపై మాట్లాడుతున్న సమయంలో హజా(నమాజ్) రావడంతో ఆయన ప్రసంగం ఆపేశారు. హజా పూర్తయ్యాక తిరిగి కొనసాగించారు. ఒక్కసారిగా ప్రసంగం ఆపేయడంతో అందరూ ఏమైందోనని చర్చించుకున్నారు. అనువాదంలో ఆపసోపాలు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆంగ్లంలో ప్రసంగించగా.. డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి తెలుగులో అనువాదం చేశారు. ఈ క్రమంలో పలు చోట్ల శివకుమార్ మాట్లాడింది కాకుండా మరోలా చెప్పడం.. లేదంటే మాట్లాడిన దానికంటే ఎక్కువ చేసి చెప్పడం చర్చనీయాంశమైంది. డిసెంబర్ 9న, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం అని డీకే చెబితే.. రేవంత్‌రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని, సమయంతో సహా చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. సీఎం ఎవరనే విషయాన్ని ఈయనే డిసైడ్ చేశారన్న వ్యాఖ్యలు వినిపించాయి. -
డీకేపై విచారణ 3 నెలల్లో పూర్తిచేయండి
బనశంకరి: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ దర్యాప్తును సవాలు చేస్తూ కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు గురువారం కొట్టేసింది. ఇప్పటి వరకు ఉన్న స్టేను ఎత్తివేస్తూ దర్యాప్తు మూడునెలల్లో పూర్తిచేయాలని సీబీఐను ఆదేశించింది. దర్యాప్తు చాలావరకు పూర్తయిందని, అందుకే ఈ దశలో కోర్టు జోక్యం చేసుకోలేదని న్యాయమూర్తి జస్టిస్ కె.నటరాజన్ స్పష్టం చేశారు. 2014–18 మధ్య డీకే ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని 2018లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ ఏడాది ప్రత్యేక కేసు నమోదు చేసింది. అంతకుముందు రెండు మూడుసార్లు డీకే, ఆయన సన్నిహితుల నివాసాలు, ఆఫీసుల్లో ముమ్మరంగా సోదాలు జరిపి నగదు, రికార్డులను స్వా«దీనం చేసుకుంది. కర్ణాటక శాసనసభ ఎన్నికల నేపథ్యంలో డీకే కొన్ని నెలల కిందట హైకోర్టును ఆశ్రయించి సీబీఐ దర్యాప్తుపై స్టే తెచ్చుకున్నారు. గత సోదాల సమయంలో రూ.200 కోట్లకుపైగా అక్రమాస్తులు వెలుగు చూశాయని సీబీఐ తరఫు న్యాయవాదులు వాదించారు. కేసుపై స్టే ఎత్తివేయాలని అభ్యర్థించారు. హైకోర్టు తీర్పును డీకే సుప్రీంకోర్టులో సవాల్ చేసే అవకాశముందని తెలిసింది. రాజకీయ దురుద్దేశంతోనే: డీకే రాజకీయ దురుద్దేశంతో గతంలో బీఎస్ యడియూరప్ప ప్రభుత్వం తన కేసును సీబీఐకి అప్పగించిందని డీకే శివకుమార్ ఆరోపించారు. తీర్పు తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. సీబీఐ తనను, కుటుంబాన్ని కనీసం ఒక్కరోజు కూడా విచారణకు రావాలని పిలవలేదన్నారు. మరి 90 శాతం దర్యాప్తు ఎలా పూర్తి చేశారోనని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. కోర్టులపై తనకు నమ్మకం ఉందని, పోరాటం చేస్తానని చెప్పారు. తనను జైలుకు పంపిస్తామన్న రాష్ట్ర బీజేపీ, జేడీఎస్ నాయకుల మాటలను ప్రస్తావిస్తూ.. దమ్ముంటే త్వరగా ఆ పనిచేయాలని సవాల్ విసిరారు. -
అక్రమార్కుల కేసులో డీకే శివకుమార్ కు షాక్
-
అక్రమ ఆస్తుల కేసులో డీకేఎస్‌కు ఎదురుదెబ్బ
సాక్షి, బెంగళూరు: కర్ణాటక పీసీసీ చీఫ్, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదు అయిన అక్రమ ఆస్తుల కేసు కొట్టేయాలని ఆయన వేసిన పిటిషన్‌ను హైకోర్టు గురువారం కొట్టేసింది. అంతేకాదు సీబీఐ విచారణ నిలుపుదల పేరిట గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్వర్వుల్ని ఎత్తేస్తూ.. మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేసి పూర్తి నివేదిక సమర్పించాలని కోర్టు దర్యాప్తు సంస్థను ఆదేశించింది. ఆదాయానికి మించిన ఆస్తుల్ని కలిగి ఉన్నారంటూ డీకే శివకుమార్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కేసు నమోదు చేసింది. గతంలో సమన్లు ఇచ్చి ఆయన్ని విచారించింది కూడా. ఈ క్రమంలో శివకుమార్ కుటుంబ సభ్యులపైనా కేసులు నమోదు అయ్యాయి. అయితే కర్ణాటక ఎన్నికల సమయంలో(ఫిబ్రవరిలో) శివకుమార్ అభ్యర్థన పిటిషన్ ఆధారంగా హైకోర్టు సీబీఐ విచారణపై స్టే విధించింది. ఈ స్టేపై సీబీఐ సుప్రీం కోర్టుకు వెళ్లగా.. జోక్యం చేసుకునేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. తాజాగా కేసు కొట్టేయాలని ఆయన వేసిన అభ్యర్థనను తోసిపుచ్చుతూ.. సీబీఐ దర్యాప్తునకు మార్గం సుగమం చేసింది హైకోర్టు. In a setback to Karnataka Deputy CM #DKShivakumar, #KarnatakaHC has refused to quash a corruption case registered against him by the #CBI for allegedly possessing assets worth ₹74.93 crore disproportionate to his known sources of income | @Kpsagri reportshttps://t.co/jw0MOK5o6I — The Hindu-Bengaluru (@THBengaluru) October 19, 2023 -
దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఇలా..
హైదరాబాద్: రెండు రోజుల పాటు జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రత్యేక పార్లమెంట్ సెషన్ల గురించి ప్రస్తావిస్తూ ఎటువంటి ఎజెండా లేకుండా పిలుపునివ్వడం చూస్తుంటే దేశంలో చట్టం పనితీరు ఎలా ఉందో అర్ధమవుతుందని అన్నారు. హైదరాబాద్ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు ముగిసిన తర్వాత కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ త్వరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో గెలవడమే మా ప్రధాన ఎజెండా అని తద్వారా ఇండియా కూటమిని గెలిపించుకోవడమే మా ముందున్న లక్ష్యమని అది తప్ప మాకు వేరే ఏ ఎజెండా లేదని అన్నారు. ఇక సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు జరగనున్న ప్రత్యేక పార్లమెంట్ సెషన్ల గురించి స్పందించారు. ఎటువంటి ఎజెండా లేకుండా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం దేశ చరిత్రలోనే తొలిసారి జరుగుతోందని దీన్ని బట్టే దేశంలో చట్టాల పరిస్థితి ఏమిటనేది అర్ధం చేసుకోవచ్చని ఇది చాలా దురదృష్టకరమని అన్నారు. రెండు రోజులపాటు జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల్లో వచ్చే ఎన్నికలకు సంబంధించి కొన్ని తీర్మానాలు చేశారు. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉండటాన్ని స్వాగతిస్తూనే దీన్ని ప్రధాన మంత్రి తోపాటు బీజేపీ శ్రేణులు కూడా జీరించుకోలేకపోతున్నాయని రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దేశాన్ని విభజన రాజకీయాలు, విద్వేష పాలన నుండి విముక్తి కలిగించడానికి సైద్ధాంతిక సిద్ధపాటుతో ఇండియా కూటమి ముందుకొచ్చిందని చెబుతూ సామాజిక సమానత్వాన్ని సాధించి న్యాయాన్ని బలపరిచి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, ప్రజా సమస్యలపై స్పందిస్తూ, సున్నితమైన, పారదర్శకమైన, జవాబుదారీగా ఉండే కేంద్ర ప్రభుత్వాన్ని అందించాలని కమిటీ తీర్మానించింది. ఈ సందర్బంగా అటవీరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల గురించి కూడా కమిటీ చర్చించింది. ✅ Telangana implements... Nation follows 🇮🇳 🔹Karnataka Deputy CM DK Shiva Kumar all praise for the best practices adopted in #Telangana 🔹Dy. CM was in #Hyderabad as a part of the Solid Waste Management study tour 🔹 Shiva Kumar said generating energy out of waste at… pic.twitter.com/xNanN6gzU3 — Mission Telangana (@MissionTG) September 17, 2023 ఇది కూడా చదవండి: న్యాయ వ్యవస్థ ప్రగతికైనా, వినాశనానికైనా నిజాయతీయే కీలకం -
Chandrababu : చేతులు కలపడమే తరువాయి.?
చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు ప్రయాణంలో స్పష్టత వస్తున్నట్టు సంకేతాలందుతున్నాయి. ఇక తన ప్రయాణం కాంగ్రెస్‌తోనే కొనసాగించాలని బాబు నిర్ణయించుకున్నట్టు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. బీజేపీతో ఇప్పటికే పూర్తిగా తెగతెంపులు చేసుకున్న చంద్రబాబు.. ప్రధాని మోదీని, హోంమంత్రి అమిత్‌షాను టార్గెట్ చేసుకుని 2019లో చేసిన యాంటీ బీజేపీ క్యాంపెయిన్ ఇంకా ప్రజల మదిలో చెదిరిపోలేదు. గత నాలుగున్నరేళ్లుగా పైకి బీజేపీతో దగ్గరవుదామని ప్రయత్నిస్తున్నా.. లోలోన మాత్రం కాంగ్రెస్‌తో నడుపుతున్న రాయబారాలు బహిర్గతమవుతున్నాయి. సీన్ 1 : 2019 ఎన్నికలు - జాతీయ రాజకీయాలు ఎన్నికల్లో యాంటీ బీజేపీ స్టాండ్ తీసుకున్న చంద్రబాబు.. దేశవ్యాప్తంగా విపక్షాలను ఏకం చేసే పనిలో పడ్డారు. ఉదయం తూర్పున బెంగాల్లో మమతో ఒక భేటీ జరిగితే, మధ్యాహ్నానికల్లా ముంబైలో శరద్ పవార్‌తో మరో భేటీ నిర్వహించారు. ఢిల్లీలో కేజ్రీవాల్‌ను కలిస్తే.. అంతే వేగంగా కేరళలో కమ్యూనిస్టులతో భేటీ అయ్యారు. చంద్రబాబు స్పీడ్ చూసి నేషనల్ మీడియా కూడా అవాక్కయిన సందర్భాలు 2019లో ఎన్నో ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులయితే సరే సరి. రాహుల్‌తో 10 జన్‌పథ్‌లో నిర్వహించిన మీటింగ్‌కు ఎల్లో మీడియా ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అంతెందుకు కర్ణాటకలో కుమారస్వామి ప్రమాణస్వీకారంలో సభ మీద రాహుల్‌తో చట్టాపట్టాల్ వేసుకున్నవి కూడా ఇంకా ఇప్పుడే చూసినట్టు ఉంది. (కర్ణాటక రాజకీయాల సందర్భంగా చంద్రబాబు తిప్పిన యూపీఏ చక్రం) సీన్ 2 : 2019 ఫలితాలు - తదనంతర పరిణామాలు ఎన్నికలు ముగిసాయి. ప్రజా తీర్పు వెల్లడయింది. సైకిల్ కొట్టుకుపోయింది. చంద్రబాబులో నిర్వేదం ఏర్పడింది. ఇంతా చేసినా.. ప్రజలెందుకు తరిమికొట్టారన్న ఆత్మవిమర్శ మాత్రం చేసుకోలేకపోయారు. తనను ఓడించి ప్రజలు ద్రోహం చేశారంటూ నిందించడం మొదలెట్టారు. అదే సెల్ఫ్ డబ్బా.. ఈ రోడ్డు నేనేశా.. ఈ భవనం నేను కట్టా.. ఈ కాలువ నేను తవ్వించా.. ఎంత సేపు నేను అనే సోత్కర్ష నుంచి బయటకు రాలేకపోయారు. చివరికి భ్రమలనే నిజమనే స్థాయికి చేరిపోయారు. ఈ సమయంలో ఎల్లో మీడియా వల్ల ఆయనకు నిజంగానే అన్యాయం జరిగింది. ఉదాహారణకు హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసింది కాంగ్రెస్ హయాంలో అని తెలిసినా.. చంద్రబాబే .. చంద్రబాబే అని ప్రచారం చేసి అదే నిజమని ప్రజల్ని నమ్మించే స్థాయికి చేరారు. అంతెందుకు హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్టును దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మిస్తే.. ఆ క్రెడిట్ చంద్రబాబుకు ఇచ్చేశారు. ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తే.. పెద్దలా గద్దలా అంటూ ఈనాడులో విమర్శలు చేసి... ఇప్పుడు జన జీవన నాడిగా మారిన తర్వాత చంద్రబాబుకు క్రెడిట్ ఇస్తున్నారు. ఇలా మారని భ్రమలతో ఆయన వ్యక్తిత్వ పరంగా మరింత దిగజారారు. (జపాన్ సహకారంతో టెక్నాలజీ పార్కును శంకుస్థాపన చేస్తున్న నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, ఆ సందర్భంగా మీడియాలో వచ్చిన వార్తలు) (శంషాబాద్ ఎయిర్‌పోర్టును, PV నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించి పూర్తి చేసిన డా.వైఎస్సార్) సీన్ 3 : పార్టీ నిర్మాణంలో ఎన్నో లోపాలు తానొక విజనరీ నాయకుడినని, విజన్ 2020 తర్వాత విజన్ 2047 తెచ్చానని చెప్పుకునే చంద్రబాబు.. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో తెలుగుదేశం పార్టీని ఒక నిష్క్రియాత్మకమైన వ్యవస్థగా మార్చారు. ఏ పార్టీలోనయినా పిరమిడ్ లెవల్ ఉంటుంది. అంటే ఒక నాయకుడి తర్వాత అంతటి బాధ్యతలు నిర్వహించగలిగే సత్తా ఉన్నా ఇద్దరో, ముగ్గురో ఉంటారు. మేనేజ్మెంట్ పాఠాలను వల్లె వేసే చంద్రబాబుకు ఈ విషయాలన్నీ తెలియవని కాదు. తెలుగుదేశం పార్టీలో తీసుకునే ఏ నిర్ణయమైనా చంద్రబాబుకు తప్ప మూడో కంటికి తెలియదు. తన వారసుడిగా లోకేష్‌ను ప్రొజెక్ట్ చేయాలని చూసినా.. ఎమ్మెల్యేగా గెలవలేని ప్రతిభాసామర్థ్యాలు లోకేష్‌వి. ఇక పవన్‌కళ్యాణ్‌కు ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా.. ఏ ఎజెండాలో సక్సెస్ అయిన దాఖలాలు లేవు. (తన పొలిటికల్ పార్ట్నర్ పవన్‌కళ్యాణ్‌తో చంద్రబాబు ) సీన్ 4 : కిం కర్తవ్యం.. కాంగ్రెసే శరణ్యం ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబుకు ఉన్న ఏకైక మార్గం కాంగ్రెస్. అందుకే తన శిష్యుడు రేవంత్ రెడ్డిని నమ్ముకున్నారు. చంద్రబాబును కాపాడేందుకు ఇప్పటికే రేవంత్‌రెడ్డి రాయబారం నడుపుతున్నారు. బాబును కాపాడేందుకు ఏం చేయాలన్న దానిపై రేవంత్‌రెడ్డి కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించి ‘ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సమగ్ర కథనాన్ని ప్రచురించింది. తాను అరెస్ట్ అవుతానంటూ చెప్పుకొచ్చిన చంద్రబాబుతో డీకే శివకుమార్‌తో రేవంత్ ఫోన్ చేయించినట్టు కథనంలో పేర్కొంది. బాబు తరఫున ఏసీబీ కోర్టులో వాదించిన న్యాయవాది సిద్దార్థ్ లూథ్రాకు డీకేతో మంచి సంబంధాలున్నాయి. డీకేకు ఆయన అన్ని విషయాల్లో తోడుగా ఉంటారు. డీకే సిఫారసుతోనే బాబు కేసులో లూథ్రా రంగంలోకి దిగారు. అయితే కేసు పక్కాగా ఉండడం, ఆధారాలు బలంగా ఉండడంతో లూథ్రా కాస్తా నిర్వేదంలో పడిపోయారు. (చంద్రబాబును రక్షించేందుకు బెంగళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో రేవంత్ మంతనాలు) సీన్ 5 : ఇండియా కూటమి వైపు సైకిల్ తాజా పరిణామాలతో రేపో, మాపో ఇండియా కూటమి దిశగా సైకిల్ వెళ్తోందని తేలిపోయింది. ఇంతవరకు ఏ ఎన్నికల్లోనూ ఒంటరిగా అధికారంలోకి వచ్చిన చరిత్ర చంద్రబాబుకు లేదు. ఇప్పుడు కూడా పవన్‌తో పొత్తు ప్రకటించేశారు. బీజేపీ ఈ పరిణామాలపై గుర్రుగా ఉంది. ఇక మిగిలింది కాంగ్రెస్. రాహుల్‌తో తనకు చక్కటి సమన్వయం, అంతకు మించిన పరిచయం ఉన్నాయి. అంతా అనుకున్నట్టు జరిగితే.. కాంగ్రెస్ నుంచి ఓ స్టెప్పు ముందుకు పడవచ్చు. జైల్లో ఉన్న చంద్రబాబును ములాఖత్‌లో రాహుల్‌గాంధీ కలవొచ్చు. లేదా తన ప్రతినిధిగా డీకే శివకుమార్ గానీ, కపిల్‌సిబల్‌ను కానీ పంపించవచ్చు. ఇటు ఢిల్లీలో కూడా లోకేష్ ఓ చీకటి వేళ ఒకరిద్దరు కాంగ్రెస్ అగ్రనాయకులతో భేటీ కావొచ్చు. ఇప్పటికే రఘురామకృష్ణరాజుతో కలిసి ఈ ప్రయత్నాల్లో ఉన్నారు. (ఢిల్లీలో రఘురామకృష్ణరాజుతో కలిసి ఎడతెగని ప్రయత్నాలు చేస్తోన్న లోకేష్) సీన్ 6 : కథ సశేషం.. మిగిలింది ఉత్కంఠభరితం ఎన్నికలు వడివడిగా వస్తున్నాయి. పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. రంగులు మార్చడంలో ఊసరవెల్లిని మించిన చరిత్ర చంద్రబాబుది. ఇదీ వైఎస్సార్సిపి మొదటి నుంచి చెబుతున్న విషయం. ఇప్పుడు పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి కూడా ఇదే విషయాన్ని పంచుకున్నారు. ఈ రాజకీయ ముఖచిత్రం త్వరలోనే సుస్పష్టంగా ఆవిష్కృతం కానుంది. దానికి ప్రజలే సాక్షి. Only the I.N.D.I.A. Alliance members are supporting Sri. Chandrababu @ncbn through phone calls to his son. This proves that TDP is part of the I.N.D.I.A. Alliance and that they have the same strategy, come together for power and loot the State while you can. TDP is incapable of… — Vijayasai Reddy V (@VSReddy_MP) September 16, 2023 -
కాంగ్రెస్ నేతపై ప్రశంసలు కురిపించిన బీజేపీ ఎమ్మెల్యే
బెంగళూరు: ఒక్కసారిగా పదవి పోతే రాజకీయ నాయకులు నిరాశలో కుంగిపోతుంటారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన తర్వాత బీజేపీ నేతల పరిస్థితి అచ్చం ఇలాగే ఉంది. తమ ఉనికిని చాటుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. ఇదే క్రమంలో బీజేపీ నేత ఎస్.డీ.సోమశేఖర్ కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ పై ప్రశంసలు కురిపించారు. ఆయనను తన రాజకీయ గురువుగా చెబుతూ కాంగ్రెస్ తలుపు తట్టే ప్రయత్నం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఎస్.డీ.సోమశేఖర్ గౌడ మాట్లాడుతూ.. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన రాజకీయ గురువు అని సహకార శాఖలో నేను ఏదైనా సాధించానంటే అది అయన చలవేనని అన్నారు.అయన నాకు చాలా సహాయం చేశారు. మొదట్లో నాకు జేపీ నగర్ బ్లాకు ఇవ్వలేదు. అలాంటి సమయంలో ఫీకే శివకుమార్ నన్ను జేపీనగర్ జాయింట్ సెక్రెటరీగా నియమించారు. అక్కడి నుండి ఆయన నాకు అనేక సందర్భాల్లో అండగా నిలిచారు. ఉత్తరహళ్లి నియోజకవర్గం అభ్యర్థిగా నా పేరును ఆయనే ప్రతిపాదించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడో నెలలోనే ఆయన కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపించడం చూస్తే ఆయన మళ్ళీ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకునే ఉద్దేశ్యంలో ఉన్నట్టు స్పష్టమవుతోంది. 2019లో కాంగ్రెస్ పార్టీని నిలువునా ముంచి యాడ్యూరప్ప ప్రభుత్వానికి అండగా నిలిచిన 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో సోమశేఖర్ కూడా ఒకరు. కాంగ్రెస్ నాయకుడిని పొగుడుతూ బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందిస్తూ.. బహుశా ఆయన ఎదో అసంతృప్తితో ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారు. ఆయనతో మాట్లాడితే సమస్య సర్దుకుంటుంది అని అన్నారు. ఇది కూడా చదవండి: బీజేపీ తొలి జాబితా విడుదల.. అత్యధికులు వారే.. -
Karnataka: కేసులు మాఫీ.. సీఎం, డిప్యూటీ సీఎంలకు ఊరట
కర్ణాటక: మేకెదాటు పాదయాత్ర సమయంలో కాంగ్రెస్ సీనియర్లు సిద్దరామయ్య, డీకే శివకుమార్, డీకే.సురేశ్‌లకు ఊరట కల్పిస్తూ, వారిపై నమోదైన కోవిడ్ మార్గదర్శకాల ఉల్లంఘన కేసులు ఎత్తివేయాలని కేబినెట్లో తీర్మానించారు. గతేడాది జనవరిలో మేకెదాటు ప్రాజెక్టు నిర్మాణం కోరుతూ డీకే ఆధ్వర్యంలో మేకెదాటు నుంచి బెంగళూరుకు పాదయాత్ర నిర్వహించడం తెలిసిందే. ఈ సమయంలో కోవిడ్ థర్డ్ వేవ్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. గురువారం విధానసౌధలో మంత్రిమండలి సమావేశం అనంతరం మంత్రి హెచ్‌కే పాటిల్ వివరాలను వెల్లడించారు. రామనగరలో వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 9 క్రిమినల్ కేసులను ఎత్తివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. పాదయాత్రలో కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా వందలాది మందితో ర్యాలీలు చేయడంతో బొమ్మై సర్కారు కేసులు నమోదుచేసింది. పలు ముఖ్యమైన తీర్మానాలు.. ► వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎంహెచ్.నాగేశ్, గత జాయింట్ డైరెక్టర్లకు నిధుల దుర్వినియోగం కేసులో సెషన్స్‌కోర్టు 5 ఏళ్లు జైలుశిక్ష విధించడంతో వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని తీర్మానం. ► బెంగళూరులో ఏరోస్పేస్ రక్షణ కేంద్రం ఏర్పాటుకు రూ.391 కోట్లకు పాలనాత్మక ఆమోదం. ఇందిరానగర సీవీ.రామన్ ఆసుపత్రి వైద్యురాలు ఎస్డీ.నాగమణి లోకాయుక్తకు పట్టుబడగా తప్పనిసరి రిటైర్మెంటుకు తీర్మానం. రామనగర మహిళా వైద్యురాలు డాక్టర్ ఉషా కదరమండలగికి ఇదే నిర్ణయం. ► హువినహడగలి నియోజకవర్గం విద్యాశాఖాదికారి ఎన్ఎస్. హళ్లిగుడిపై ఆరోపణలు ఉన్నందున సేవల నుంచి సస్పెండ్. ఆస్పత్రులకు నిధులు.. ►బెళగావి మెడికల్ కాలేజీలో 325 పడకల సూపర్ స్పెషాలిటి ఆసుపత్రికి రూ.187 కోట్ల మంజూరు ► కరావళి అభివృద్ధి ప్రాధికార పేరును కరావళి ప్రాదేశికాభివృద్ధి మండలి అని పేరు మార్పు ► ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ నియోజకవర్గాల్లో 20 సంచార ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు. రూ. 47 కోట్లతో ఐదు జిల్లా ఆసుపత్రులైన మైసూరు, చిత్రదుర్గ, సీవీ రామన్నగర, వెన్లాక్ ఆసుపత్రి, కేసీ.జనరల్ ఆసుపత్రుల్లో 15 ఎంఆర్ఐ స్కానింగ్ సేవలు. కొత్తగా సైబర్ భద్రతా చట్టం ► కర్ణాటక సైబర్ భద్రతా చట్టం 2023 –24 కు అనుమతి. రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ నేరాల కట్టడి నేపథ్యంలో సైబర్ భద్రతకు చట్టం ఆమోదం● సమగ్ర శిశు అభివృద్ధి పథకంలో పామాయిల్‌కు బదులుగా సన్ ఫ్లవర్ నూనె పంపిణీ. ► బీబీఎంపీ చట్టాన్ని ఇతర మహానగర పాలికె, నగర సభ, పురసభల్లో అమలుకు పరిశీలన, అలాగే అక్రమ కట్టడాలు, బయలు భూమిపై పన్ను విధింపు పరిశీలనకు మంత్రి వర్గ ఉపసమితి ఏర్పాటు. -
కర్ణాటకలో బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది
-
మాట్లాడుతూ ఏడ్చేసిన DK శివకుమార్
-
మీ అందరికి సాష్టాంగ నమస్కారం
-
సీఎం పదవిపై డీకే శివకుమార్ సంచలన నిర్ణయం
-
సిద్ధరామయ్య ప్రభుత్వంలో ముసలం.. డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు..
బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కొన్నిప్రాజెక్టుల విషయంలో సీఎం సిద్ధరామయ్య వెనకంజ వేశారు.. కానీ తానైతే ముందుకు వెళ్లేవాడినని వ్యాఖ్యానించారు. దీంతో కర్ణాటకాలో ప్రభుత్వం ఏర్పడి ప్రశాంతంగా సాగుతుందని భావిస్తున్న తరుణంలో డీకే శివకుమార్ వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి. కెంపెగడౌ జన్మదినం సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన డీకే.. రాష్ట్రంలో ఫ్లై ఓవర్లు, టన్నెల్స్‌ను నిర్మించాలని చాలా వినతులు వస్తున్నట్లు చెప్పారు. 2017లో కర్ణాటకాలో సీఎం సిద్ధరామయ్య కాలంలో బెంగళూరులో స్టీల్ ఫ్లైఓవర్ నిర్మించడంపై నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం ఆ ప్రాజెక్టుపై వెనక్కి తగ్గింది. ఈ అంశంపై డీకే శివకుమార్ మాట్లాడుతూ.. 'సీఎం భయపడ్డారు కానీ నీనైతే ప్రాజెక్టుని పూర్తి చేసేవాడిని' అని అన్నారు. అయితే.. డీకే మాట్లాడే సందర్భంలో సీఎం సిద్ధరామయ్య లేకపోవడం గమనార్హం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కర్ణాటకాలో కాంగ్రెస్‌కు అపూర్వ విజయం వరించింది. ఆ తర్వాత సీఎం పీఠం విషయంలో డీకే శివకుమార్, సిద్ధరామయ్య మధ్య పెద్ద కథే నడిచింది. చివరికి కేంద్రం బుజ్జగింపుతో డీకే వెనక్కి తగ్గగా సిద్ధరామయ్య సీఎం పదవిని స్వీకరించారు. డీకే శివకుమార్ ఉపముఖ్యమంత్రి పదవిని చేప్టటారు. అయితే.. తాజాగా డీకే వ్యాఖ్యలతో కర్ణాటక రాజకీయంలో మరోసారి ఇరువురి నాయకుల మధ్య అంతర్గతంగా పోటీ కొనసాగుతోందా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఇదీ చదవండి: అక్కడ కాంగ్రెస్ దూకుడు.. బీజేపీ వెనుకంజ! -
బెంగళూరులో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
-
రాహుల్‌తో జూమ్ మీటింగ్.. పొంగులేటి చేరికకు డేట్ ఫిక్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో అతిత్వరలో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఖమ్మం జిల్లా కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 22వ తేదీన ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా ఆయన కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీతో జూమ్ మీటింగ్‌లో మాట్లాడినట్లు సమాచారం. రాహుల్ గాంధీతో జూమ్ మీటింగ్‌లోనే పొంగులేటి చేరిక తేదీ ఫిక్స్ అయ్యింది. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సైతం పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇక అదేతేదీన పొంగులేటితో పాటు జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి సైతం కాంగ్రెస్‌లో చేరనున్నారు. విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ ఈ నెల 21వ తేదీన ఢిల్లీకి చేరుకుంటారు. అదే తేదీన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సైతం ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక జూపల్లి, పొంగులేటి చేరిక తర్వాత ఖమ్మం, పాలమూరుల్లో కాంగ్రెస్ పార్టీ భారీగా బహిరంగ సభ నిర్వహించే యోచనలో ఉంది. ఇదీ చదవండి: బీఆర్ఎస్లో కూచుకుళ్ల అసంతృప్తికి కారణం అదే -
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ కీలక నేతలకు సమన్లు
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ కీలక నేతలకు మరో షాక్ తలిగింది. బీజేపీ వేసిన పరువు నష్టం దావా కేసులో బుధవారం కాంగ్రెస్ నేతలకు సమన్లు జారీ అయ్యాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లకు సైతం సమన్లు జారీ అయిన జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఓ పేపర్ ప్రకటనే ఇందుకు కారణమైంది. మే 5వ తేదీన పబ్లిష్ అయిన పత్రికల్లో కాంగ్రెస్ పార్టీ ఓ యాడ్ ఇచ్చింది. బీజేపీని 40 శాతం అవినీతి పార్టీగా ఎద్దేవా చేస్తూ.. అందులో గత నాలుగేళ్లలో బీజేపీ లక్షన్నర కోట్ల డబ్బు దోచుకుందని ఆరోపించింది. ఈ ప్రకటన ఆధారంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కేశవప్రసాద్ మే 9వ తేదీన ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్.. రాహుల్ గాంధీతో పాటు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లకు సైతం సమన్లు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ చేసిన మోదీ వ్యాఖ్యలు.. పరువు నష్టం దావాకి దారి తీయగా, ఈ ఏడాది మొదట్లో ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది సూరత్ కోర్టు. ఆ శిక్ష కారణంగానే ఆయన తన పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది కూడా. ఇదీ చదవండి: సీడబ్ల్యూసీకి కొత్త టీం! -
విద్వేషాలను రెచ్చగొట్టేవారికి చెక్... మినిష్టర్ వినూత్న ఆలోచన
కర్ణాటక : ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టకుండా "పీస్ఫుల్ కర్నాటక" పేరుతో ఒక హెల్ప్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, హోంమంత్రి డి పరమేశ్వర, ఐటీ & గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ప్రియాంక్ ఖర్గేలకు విజ్ఞప్తి చేశారు వాణిజ్యం & పరిశ్రమలు, మౌలికసదుపాయాల శాఖల మంత్రి ఎంబి పాటిల్. తేజస్వి యాదవ్ వ్యాఖ్యలు... అంతకుముందు బెంగళూరు సౌత్ ఎంపీ, భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య పార్టీ కార్యకర్తలపై దాడులు జరగకుండా రక్షణ కల్పించే ఉద్దేశ్యంతో బీజేపీ ఒక హెల్ప్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తుందని, రాష్ట్రంలో ఎక్కడైనా కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేస్తే వెంటనే హెల్ప్ లైన్ ను ఆశ్రయించాలని కోరారు. తేజస్వి చేసిన ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ మినిష్టర్ కూడా అంతే దీటుగా స్పందించారు. మినిష్టర్ పాటిల్ కౌంటర్... ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, హోంమంత్రి డి పరమేశ్వర, మంత్రి ప్రియాంక్ ఖర్గే గార్లకు మనవి. ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టకుండా చూసేందుకు వీలుగా "పీస్ఫుల్ కర్నాటక" పేరుతో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసే విషయాన్ని పరిగణలోకి తీసుకోగలరు.తద్వారా ఎక్కడైనా ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే వెంటనే ట్రాక్ చేయడానికి వీలుగా ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధి, పురోగతి సాధించి బ్రాండ్ కర్నాటకను రక్షించుకోవడమే మా ఎజెండా అని పాటిల్ ట్వీట్ చేశారు. -
చేతులు కలిపారా ?
కర్ణాటక ఫార్ములాను రాజస్తాన్‌లో కూడా కాంగ్రెస్ హైకమాండ్ ప్రయోగించింది. ఉప్పు నిప్పుగా ఉన్న ఇద్దరు కీలక నేతలు అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్‌ను ఒక్కటి చేసింది. రాహుల్ గాంధీతో జరిగిన భేటీలో ఇరువురు నేతలు కలిసి పనిచేయడానికి ఒప్పించింది. మరి గెహ్లాట్, పైలెట్ చేతులు కలిపినట్టేనా ? ఎన్నికల్లో కలసికట్టుగా పని చేస్తారా ? ఆచరణలో ఇది ఎంతవరకు సాధ్యమనే ప్రశ్నలైతే వినిపిస్తున్నాయి. కర్ణాటకలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య విభేదాలను పరిష్కరించి ఎన్నికల్లో విజయ ఢంకా మోగించిన కాంగ్రెస్ పార్టీ అదే ఫార్ములాను రాజస్తాన్‌లోనూ ప్రయోగించింది. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ల మధ్య రాజీ కుదర్చడానికి స్వయంగా రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో గెహ్లాట్, పైలెట్లు రాహుల్‌తో చర్చించాక ఇరువురు నేతలు కలిపి పని చేస్తారని కాంగ్రెస్ హైకమాండ్ చేసిన ప్రకటనపై రాష్ట్ర నేతల్లో విశ్వాసం కలగడం లేదు. ఎందుకంటే బీజేపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ కోసం సచిన్ పైలెట్ రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టిన గడువు బుధవారంతో ముగుస్తుంది. ఈ లోగా అధ్యక్షుడు ఖర్గే లేదంటే సీఎం నుంచి ఏదో ఒక ప్రకటన రాకపోతే సచిన్ పైలెట్ వ్యూహం ఎలా మార్చుకుంటారోనన్న ప్రశ్నలైతే వినిపిస్తున్నాయి. రాహుల్‌తో భేటీలో ఈ సమస్యలకైతే సామరస్యపూర్వక పరిష్కారం లభించలేదు. ఖర్గే వ్యూహం ఏంటి? ఈ ఏడాది నవంబర్లోనే ఎన్నికలు ఉండడంతో ఇరువురు నేతల మధ్య పూర్తి స్థాయి అవగాహన కుదర్చడానికి సమయం అంతగా లేదు. చాలా తక్కువ సమయంలో ఇద్దరికీ సంతృప్తికరమైన చర్యలు ఎలా చేపడతారన్నది మరో పెద్ద సవాల్‌గా ఉంది. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వ ప్రతిష్ట గత కొన్ని నెలలుగా మసకబారుతోంది. ఈ విషయంలో సీఎంకు అధ్యక్షుడు ఖర్గే ఘాటైన హెచ్చరికలు పంపినట్టు సమాచారం. కర్ణాటక తరహా ఫలితాలు రావాలంటే జూలై నాటికే 60% అభ్యర్థుల్ని ప్రకటించాలని అధ్యక్షుడు ఖర్గే గట్టిగా కసరత్తు చేస్తున్నారు. అది జరగాలంటే పైలెట్‌కు పీసీసీ అధ్యక్ష పదవి లేదంటే ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుంది. పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చి పైలెట్ అనుచరులకే అధికంగా సీట్లు ఇస్తే అధికార వ్యతిరేకత నుంచి కూడా బయటపడవచ్చునని ఖర్గే భావిస్తున్నారు. దీనిపై ఖర్గే, హైకమాండ్ ఒక మాట మీదకొస్తే పైలెట్‌ను పీసీసీ చీఫ్‌గా అంగీకరించడమో లేదంటే తానే సీఎం పదవికి రాజీనామా చేయడమో గెçహ్లాట్కు అనివార్యంగా మారుతుంది. ఈ నేపథ్యంలో మంగళవారం గెహ్లాట్ తన అనుచరులతో మాట్లాడుతూ అందరూ సహనంగా ఉండాలని పిలుపునిచ్చారు. పైలెట్‌కు పార్టీలో ఏ పదవి ఇవ్వాలో హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు. తనకు పదవి ముఖ్యం కాదని, ఎన్నికల్లో గెలుపు కోసం హైకమాండ్ ఏం చెబితే అదే చేస్తానని వ్యాఖ్యానించడం కొసమెరుపు మొత్తమ్మీద సచిన్ పైలెట్ తండ్రి, దివంగత రాజేశ్ పైలెట్ వర్ధంతి జూన్ 11 లోపు పైలెట్‌కు పార్టీలో కీలక పదవి ఇచ్చే అవకాశాలైతే అధికంగా కనిపిస్తున్నాయి. చిక్కుముళ్లు ఎలా విప్పుతారో..! అశోక్, పైలెట్ మధ్య విడదీయలేని చిక్కుముళ్లు ఎన్నో ఉన్నాయి. వసుంధరా రాజె ప్రభుత్వ హయాంలో అవినీతిపై విచారణ జరపాలని పైలెట్ డిమాండ్ చేస్తున్నప్పటికీ సీఎం గెహ్లాట్‌పై ఆయన వ్యక్తిగతంగా దూషణలకు దిగడంతో గెహ్లాట్ దీనిపై రాజీకి వచ్చే అవకాశాలు లేవని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా పలు మార్పులు చేపట్టాలని అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భావించారు. కానీ పైలెట్‌ను విశ్వాసంలోకి తీసుకోకుండా ఇవి చెయ్యడం అంత సులభం కాదు. సోమవారం ఖర్గే నివాసంలో జరిగిన సమావేశంలో కూడా ఇరువురు నాయకుల మధ్య ఉన్న కీలక సమస్యలకు పరిష్కారం దొరకలేదు. రాహుల్, ఖర్గేలు తొలుత గెహ్లాట్‌తో చర్చించారు. అనంతరం సచిన్ పైలెట్‌తో చర్చలు జరిపారు. గంటల కొద్దీ సమావేశం జరిగినప్పటికీ గెహ్లాట్, పైలెట్ కలిసికట్టుగా పని చేస్తామని బహిరంగంగా చెప్పకపోవడం గమనార్హం. డిమాండ్లపై పట్టు వీడని పైలెట్ సచిన్ పైలెట్ గత కొద్ది నెలలుగా చేస్తున్న డిమాండ్లపై వెనక్కి తగ్గే అవకాశాలు లేవు. వసుంధరా రాజె ప్రభుత్వ అవినీతిపై విచారణ, రాజస్తాన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (ఆర్పీఎస్సి) తిరిగి ఏర్పాటు చేసి కొత్త నియామకాలు చేపట్టడం పేపర్ల లీకేజీ వల్ల పరీక్షలు రద్దు ప్రభావం పడిన విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించడమనే మూడు డిమాండ్లపై సచిన్ పట్టు వీడడం లేదు. రాహుల్‌తో సమావేశానంతరం అశోక్ గెహ్లాట్ పార్టీ హైకమాండ్ కీలకమని, పార్టీ పెద్దలు ఎవరికి ఏ పదవి ఇస్తారో ముందుగానే స్పష్టమైన హామీలు ఇవ్వరంటూ చేసిన వ్యాఖ్యలు కూడా భవిష్యత్‌లో జరిగే సమావేశాల్లో ప్రతిబంధకంగా మారే అవకాశాలున్నాయి. - సాక్షి నేషనల్ డెస్క్ -
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కలిసిన వైఎస్ షర్మిల
-
YS Sharmila: డీకే శివకుమార్‌తో వైఎస్ షర్మిల భేటీ
బెంగళూరు: వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కలిశారు. సోమవారం ఉదయం బెంగళూరు వెళ్లిన ఆమె.. ఆయన నివాసంలోనే మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో ఘన విజయం దిశగా కాంగ్రెస్ పార్టీని నడిపించినందుకుగానూ శివకుమార్‌ను పుష్ఫ గుచ్చం ఇచ్చి వైఎస్ షర్మిల అభినందించినట్లు సమాచారం. అయితే ఈ భేటీ సారాంశంపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌ను విలీనం చేయాలంటూ సోనియా గాంధీ నుంచి షర్మిలకు ప్రతిపాదన వచ్చిందన్న ఊహాగానాలు ఆ మధ్య వినిపించాయి. అయితే వాటిని ఆమె కొట్టిపారేశారు. కర్ణాటకలో తిరుగులేని విజయాన్ని అందించనప్పటికీ డిప్యూటీ సీఎం పోస్టుతో పాటు పీసీసీ చీఫ్ పదవిలో కొనసాగడంతోనే సరిపెట్టుకున్నారాయన. ఇక తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు సంఘటితం కావాలంటూ ప్రతిపక్షాలకు షర్మిల పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె డీకే శివకుమార్‌తో భేటీ కావడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఇదీ చదవండి: కాంగ్రెస్ కుంపటిపై హస్తినలో హీట్ -
కీలక శాఖలన్నీ సిద్దూ వద్దే.. డీకేకు రెండు శాఖలు?
బెంగళూరు: కర్ణాటకలో శనివారం 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడంతో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యింది. గత వారమే సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో పాటు మరో 8 మంది మంతత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. తాజాగా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిచే గవర్నర్ తావర్‌చంద్ గెహ్లత్ శనివారం రాజ్భన్లో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేబినెట్ మొత్తం 34 మందితో పూర్తిగా ఉంది. కాగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పటికీ వారికి శాఖల కేటాయింపులను అధికారికంగా ప్రకటించలేదు. అయితే కీలక శాఖలన్నీ సిద్ధరామయ్య తనవద్దే ఉంచుకున్నట్లు తెలుస్తోంది. ఆర్థికశాఖ, కేబినెట్ వ్యవహారాలు, బ్యూరోక్రసీ, ఇంటలిజెన్స్ వంటి శాఖలను సిద్దూ నిర్వహించనున్నట్లు సమాచారం. ఇక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు నీటిపారుదల శాఖతోపాటు బెంగళూరు నగర అభివృద్ధిని అప్పగించినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. జీ పరమేశ్వరకు హోంమంతత్రిత్వ శాఖ కేటాయించే అవకాశం ఉంది. కేజే జార్జ్‌కు న్యాయ శాఖ, చెలువరాయస్వామికి వ్యవసాయం, మునియప్పకు ఆహారం, పౌర సరాఫరాలు, సతీష్ జారికిహోళికి పబ్లిక్ వర్క్స్, బైరతి సురేష్‌కు పట్టణాభివృద్ధి శాఖ, ఎంబీ పాటిల్ పరిశ్రమల బాధ్యతలు, నాగేంద్రకు యూత్& స్పోర్ట్స్, వెంకటేష్‌కు పశుపోషణ, తిమ్మపూర్ ఎక్సైజ్, రామలింగారెడ్డి రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు కేటాయించే ఛాన్స్ ఉంది. అయితే మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే అంటూ ఓ ప్రకటన సోషల్ మీడియాలోవైరల్గా మారింది. చదవండి: ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేస్తే.. కాంగ్రెస్ బూడిదవుతుంది: బీజేపీ హెచ్చరిక శనివారం ప్రమాణ స్వీకారం చేసిన వారిలో మాజీ సీఎం ఆర్. గుండురావు తనయుడు దినేశ్ గుండు రావు, మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కుమారుడు మధు బంగారప్ప, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర ఖండ్రేతో పాటు కృష్ణభైరేగౌడ, రహీంఖాన్, సంతోశ్‌లాడ్, కేఎన్ రాజణ్ణ, కే వెంకటేశ్, హెచ్.సి.మహదేవప్ప, భైరతి సురేశ్, శివరాజ్ తంగడిగి, ఆర్బీ .తిమ్మాపుర్, బి.నాగేంద్ర, డి.సుధాకర్, లక్ష్మీ హెబ్బాళ్కర్, చలువరాయస్వామి, మంకుళ్ వైద్య, ఎంసీ .సుధాకర్, హెచ్.కె.పాటిల్, శరణ్‌ప్రకాశ్ పాటిల్, శివానందపాటిల్, ఎస్.ఎస్.మల్లికార్జున, శరణబసప్ప దర్శనాపూర్ ఉన్నారు. మొత్తం కేబినెట్లో ఒకే ఒక్క మహిళకు చోటు దక్కింది. బెళగావి రూరల్ నుంచి రెండోసారి ఎన్నికైన లక్ష్మీ హెబ్బాళ్కర్‌ను మంతత్రి వర్గంలోకి తీసుకున్నారు. ఈమె పేరును డీకే ప్రతిపాదించారు. మంత్రివర్గంలో అయిదుగురు వక్కలిగ వర్గం.. ఏడుగురు లింగాయత్ వర్గానికి చెందిన నేతలు ఉన్నారు. అయిదుగురు రెడ్డీ, ఆరుగురు ఎస్సీ, ముగ్గురు ముస్లిం మైనార్టీ, ముగ్గురు ఎస్టీ, ఆరుగురు ఓబీసీ , ఒక బ్రహ్మాణ, ఒక మరాఠా, ఒక క్రిస్టియన్, ఒక జైన్ మంత్రి ఉన్నారు. చదవండి: మీడియా ముందుకు ముగ్గురు సీఎంలు.. ఏమన్నారంటే? Live ನೂತನ ಸಚಿವರ ಪ್ರಮಾಣ ವಚನ ಸ್ವೀಕಾರ ಸಮಾರಂಭ https://t.co/y1KDAW2Byl — Karnataka Congress (@INCKarnataka) May 27, 2023 -
సిద్దిరామయ్య క్యాబినెట్...24 మంది ప్రమాణస్వీకారం
-
మెట్టు మొక్కి సభలోకి అడుగుపెట్టిన డీకే శివకుమార్..
-
మాస్‌కి మాస్.. క్లాస్‌కి క్లాస్..ఆయనో సంచలనం
కర్ణాటక కాంగ్రెస్‌లో ఆయనో సంచలనం. పార్టీలో ఎక్కడ సంక్షోభం వచ్చినా పరిష్కరించగల నేర్పరి. నవయువకుడిగా రాజకీయ రంగంలోకి వచ్చారు.. ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. పీసీసీ చీఫ్‌గా కర్ణాటకలో కాంగ్రెస్‌కు అపూర్వ విజయాన్ని అందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపించారు. మాస్‌కి మాస్.. క్లాస్‌కి క్లాస్.. ఆయనే డీకే. శివకుమార్. దొడ్డనహళ్ళి కెంపెగౌడ శివకుమార్ కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాల్లో ఒక సంచలనం. 61 ఏళ్ళ శివకుమార్ కర్ణాటక పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ, ట్రబుల్ షూటర్‌గా కాంగ్రెస్‌లో పేరు తెచ్చుకున్నారు. 2002లో మహారాష్ట్రలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి విలాసరావు దేశ్‌ముఖ్ ప్రభుత్వాన్ని కాపాడటంలో, 2017లో గుజరాత్లో అహ్మద్‌పటేల్ రాజ్యసభకు ఎన్నిక కావడంలో కీలక పాత్ర పోషించారు. తనకున్న చాతుర్యంతో, పార్టీలో ఎంతటి సమస్యనైనా పరిష్కరించగలరనే ప్రశంసలందుకున్నారు. 2018లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాక జనతాదళ్, కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించారు. జనతాదళ్ ఎస్ నేత కుమారస్వామి ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రిగా, సిద్ధరామయ్య ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు నిర్వహించారు. కనకపుర నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వక్కలిగ సామాజిక వర్గానికి చెందిన శివకుమార్ 1980లో విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. 1989లో 27 ఏళ్ళ వయసులో తొలిసారి మైసూరు జిల్లాలోని సాతనూరు నియోజకవర్గం నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత మరో మూడు సార్లు అక్కడి నుంచే గెలిచారు. 2008 నుంచి వరుసగా నాలుగుసార్లు కనకపుర నుంచి ఎన్నికవుతూ వస్తున్నారు. పార్టీలో ట్రబుల్ షూటర్‌గా ఎంత పేరు తెచ్చుకున్నారో మంత్రిగా పనిచేసినపుడు అవినీతి ఆరోపణల్ని కూడా అదే రేంజ్లో ఎదుర్కొన్నారు. ఆయన మీద ఉన్న అవినీతి ఆరోపణలు, అక్రమ సంపద కేసులతోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శివకుమార్‌ను టార్గెట్ చేసింది. బీజేపీలో చేరమని చేసిన ఒత్తిడి ఫలించకపోవడంతో సీబీఐ, ఈడీ కేసులతో శివకుమార్‌ను ఉక్కిరి బిక్కిరి చేసింది. జైలులో పెట్టినప్పటికీ చలించకుండా కాంగ్రెస్ పార్టీలో స్థిరంగా కొనసాగారు. బెంగళూరు శివార్లలోని తన ఫామ్ హౌజ్ కాంగ్రెస్ పార్టీలోని పలు రాజకీయ సంక్షోభాలను నివారించింది. విలాసరావ్ దేశ్‌ముఖ్ నాయకత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడేందుకు అక్కడి ఎమ్మెల్యేల కోసం శివకుమార్ ఫామ్‌హౌజ్‌లోనే క్యాంప్ నిర్వహించారు. అదేవిధంగా గుజరాత్లో కాంగ్రెస్ కీలక నేత అహ్మద్ పటేల్ రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించే క్రమంలో అక్కడి ఎమ్మెల్యేలను కూడా ఫామ్ హౌజ్‌కు తీసుకువచ్చారు. తనకున్న రాజకీయ చాతుర్యంతో, ట్రబుల్ షూటర్ పేరుతో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సన్నిహితుల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్నారు. దేశంలో ధనిక రాజకీయ నేతల్లో ఒకరుగా గుర్తింపు తెచ్చుకున్న డీకే శివకుమార్..తనకున్న ఆస్తులు 840 కోట్ల రూపాయలుగా 2018 ఎన్నికల నామినేషన్ సందర్భంగా ఇచ్చిన డిక్లరేషన్‌లో తెలియచేశారు. తాజా ఎన్నికల నామినేషన్ సందర్భంగా ఆస్తుల విలువను 1139 కోట్లుగా వెల్లడించారు. శివకుమార్ మీద మనీ లాండరింగ్ కేసులు, ఆదాయపన్ను ఎగవేత కేసులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. -
డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం
-
కర్ణాటకలో కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్.. ప్రమాణ స్వీకారం (ఫొటోలు)
-
సిద్దూ, డీకేఎస్ అండ్ కో ప్రమాణం రేపే
బెంగళూరు/ఢిల్లీ: కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రేపు(శనివారం, మే 20) ప్రమాణం చేయనున్నారు. ఇదే వేదికగా పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా, మరో 28 మంత్రులు సైతం ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక కేబినెట్ కూర్పు కోసం సిద్ధూ, డీకేఎస్‌లు కలిసి ఇవాళ మరోసారి హస్తినకు వెళ్లారు. ఈ క్రమంలో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు ముఖ్యనేతలను కలిశారు. అనంతరం కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోనూ భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఈ భేటీ జరిగనట్లు తెలుస్తోంది. ‘‘మంత్రి వర్గ జాబితాను కాబోయే సీఎం, డిప్యూటీ సీఎంలు పార్టీ సెక్రటరీ ఇంఛార్జితో చర్చించాక సిద్ధం చేశారని, దీనికి పార్టీ అధ్యక్షుడి ఆమోదం లభించడమే తరువాయి’’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే(మల్లికార్జున ఖర్గే తనయుడు) పేర్కొన్నారు. ఇప్పటికే కేబినెట్ లిస్ట్‌కు ఆమోద ముద్ర పడినట్లు తెలుస్తోంది. బెంగళూరులోని శ్రీ కంఠీరవ అవుట్డోర్ స్టేడియంలో శనివారం ముఖ్యమంత్రి, కేబినెట్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ ఆంక్షలను, మళ్లింపును ప్రకటించారు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు. -
అదే జరిగితే.. డీకేఎస్ సీఎం కావడం ఖాయం!
ఢిల్లీ: కర్ణాటక సీఎం ఎంపిక కోసం కాంగ్రెస్ పవర్ షేరింగ్ ఫార్ములా.. అంటే చెరో రెండున్నరేళ్లు(50:50 నిష్పత్తిలో) లేదంటే ఒకరు మూడు, మరొకరు రెండు ఏళ్లు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడం. ఆ గ్యాప్‌లో మరొకరికి డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైన పోర్ట్‌పోలియోలు అప్పజెప్పడం.. కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే రూపొందించిన పవర్ షేరింగ్ ఫార్ములా ఇదేనంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. కాంగ్రెస్ సీఎం అయ్యే అవకాశం ఇంకా డీకే శివకుమార్‌కు దూరం కాలేదా?. ఆ ఛాన్స్ ఇంకా ఉందా? అంటే.. అవుననే అంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. పైకి పవర్ షేరింగ్ ఫార్ములాకు డీకేఎస్ అంగీకరించలేదని ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ఆయన్ని షరతుల మీద అందుకు ఒప్పించే డిప్యూటీ సీఎం పదవి(పీసీసీ చీఫ్, 6 పోర్ట్పోలియోలుకూడా) కాంగ్రెస్ హైకమాండ్ కట్టబెడుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ హైకమాండ్.. డీకే శివకుమార్‌కు ఇచ్చిన టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఇక వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ 25 దక్కించుకోగా.. కాంగ్రెస్ ఒక్క స్థానానికే పరిమితం అయ్యింది. దీంతో.. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం కోసం కృషి చేసి మెరుగైన ఫలితం ఇస్తే డీకే శివకుమార్‌ను కర్ణాటక సీఎం కుర్చీలో.. అదీ మిగతా రెండున్నరేళ్లు/ మూడేళ్ల కాలానికి కూర్చోబెడతామని కాంగ్రెస్ హైకమాండ్ తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. దీనికి శివకుమార్ సైతం అంగీకరించినట్లు సమాచారం. అయితే ఈ ఫార్ములాపై ఆయన ఏమన్నారంటే.. ‘‘పవర్ షేరింగ్ ఫార్ములాను నేను వెల్లడించలేను. మేమంతా కలిసి జరిపిన చర్చలను నేను బహిర్గతం చేయదలచుకోలేదు. ఏదో ఒక సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు దీనికి సమాధానం ఇస్తారు. ప్రస్తుతానికి నేను బాధపడటం లేదు. ప్రయాణం ఇంకా మిగిలి ఉంది అని వ్యాఖ్యానించారు. ‘‘పార్టీ ప్రయోజనాల దృష్ట్యా రాజీపడ్డాను. కర్ణాటక ప్రజలకు మా నిబద్ధత నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. త్వరలో పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి పార్టీ హైకమాండ్ నిర్ణయానికి తలవంచాల్సిందే. పార్టీ ప్రయోజనాల కోసమే ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తున్నా అని డీకేఎస్ చెబుతున్నారు. -
ఈ నిర్ణయం కోర్టు తీర్పులాంటిది: డీకేఎస్
ఢిల్లీ: కర్ణాటక ఉపముఖ్యమంత్రి పదవికి కాంగ్రెస్ అధిష్టానం తనను ఎంపిక చేయడంపై డీకే శివకుమార్‌ను స్పందించారు. అధిష్టాన నిర్ణయం కోర్టు తీర్పులాంటిదని, కాబట్టి దానిని అంగీకరించక తప్పదని వ్యాఖ్యానించారు. ‘‘నిర్ణయాన్ని పూర్తిగా హైకమాండ్‌కు వదిలేశాం. అధిష్టానమే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని హైకమాండ్ భావించింది. కాబట్టి హైకమాండ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా’’ అని శివకుమార్ ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఐదు రోజుల సస్పెన్స్ తర్వాత.. కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్యను, ఏకైక డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్‌ను అధిష్టానం ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల వరకు శివకుమార్‌ను పీసీసీ చీఫ్‌గా కొనసాగించనున్నట్లు వెల్లడించింది. ఇదీ చదవండి: శివకుమార్‌ను ఒప్పించడంలో సోనియా కీ రోల్ -
కర్ణాటక సీఎం పీఠంపై వీడిన సస్పెన్స్
-
కర్ణాటక సీఎం పంచాయితీ...ఎందుకిలా..? ఢిల్లీకి వెళ్లడంతోనే ఈ చిక్కులు
ఎస్.రాజమహేంద్రారెడ్డి: ఏ రాజకీయ పార్టీకైనా ఎన్నికల్లో గెలవడమే అతిపెద్ద సవాల్. ది గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌కు మాత్రం ఎన్నికల్లో నెగ్గడం దైవాదీనం, నెగ్గాక ముఖ్యమంత్రిని ఎంపిక చేయడమే అతిపెద్ద సవాల్. ప్రస్తుత కర్ణాటక సంక్షోభమే ఇందుకు ఉదాహరణ. ఐదేళ్లు పాలించిన బీజేపీని కాదని, కింగ్‌మేకర్ అనుకున్న జేడీ(ఎస్)కు అవకాశం లేకుండా చేసి, కర్ణాటక ఓటర్లు అందించిన ఘన విజయాన్ని సగర్వంగా భుజాలకెత్తుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎంపికలో తడబాటుకు గురవుతోంది. ఎన్నో చేదు అనుభవాలు, మరెన్నో గుణపాఠాల నుంచి నేర్చుకున్నది ఏమీ లేదని ఆ పార్టీ మరోసారి రుజువు చేసింది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం నుంచి శాసనసభాపక్ష నాయకుడు సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్లను ‘దోస్త్ మేరా దోస్త్’ దాకా తీసుకొచ్చి ఎన్నికల ముందు హిట్ కొట్టిన కాంగ్రెస్ హైకమాండ్, సీఎం పదవి విషయానికొచ్చేసరికి ఇద్దరి మధ్య సఖ్యత కుదర్చడానికి మల్లగుల్లాలు పడుతోంది. ఎందుకిలా? ఒకేమాట.. కలలో మాట ఎన్నికల ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాటే గాందీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ల మాటగా చెల్లింది. దాంతో ఎందుకిలా అని అడిగేవాళ్లు గానీ, అలకపాన్పు ఎక్కే వాళ్లు గానీ ఎవరూ కనిపించలేదు. లేదా ఎవరూ అందుకు సాహసించలేదు. సిద్ధరామయ్య, శివకుమార్‌లు సైతం ఖర్గే మాట జవదాటకుండా పార్టీ విజయానికి కృషి చేశారు. గెలిచాక మళ్లీ షరా మామూలే! సిద్ధరామయ్య, శివకుమార్‌లు ఎవరి గూట్లోకి వారు వెళ్లిపోయి, సై అంటే సై అనే స్థాయిలో ఢీకొంటున్నారు. సీఎం రేసులోనూ అదే వైఖరి. ఎన్నికల ఫలితాలు వెలువడి నాలుగు రోజులైనా ఎటూ తేల్చుకోలేని స్థితిలో అధిష్టానం ఊగిసలాడుతోందంటే ఏమనుకోవాలి? పార్టీలోని పెద్దలు ఒకేమాట మీద నిలబడలేకపోవడం కారణం కాదా? రాహుల్ గాందీ, ప్రియాంకా గాందీలు సిద్ధరామయ్య వైపు, మల్లికార్జున ఖర్గే శివకుమార్ వైపు మొగ్గు చూపుతున్నారని అభిజ్ఞ వర్గాల భోగట్టా. ఎన్నికల ముందు లాగా హైకమాండ్ ఒకేమాట మీద ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు. సిద్ధరామయ్య, శివకుమార్‌లు మా అంటే కాసేపు అలకపాన్పు ఎక్కి, ఆ తర్వాత సర్దుకునేవారు. అందుకే సీఎం పీఠంపై పీటముడి గతంలో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సిద్ధరామయ్య అనుభవానికి పెద్దపీట వేయడంలో తప్పులేదు గానీ, పార్టీ విజయం కోసం అహర్నిశలూ చెమటోడ్చడమే కాకుండా ఆర్థిక వనరులు సైతం సమకూర్చిన శివకుమార్‌ను ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకోమనడం అభిమానులకు రుచించలేదు. అందుకే ముఖ్యమంత్రి పీఠంపై పీటముడి పడింది. ఢిల్లీ వేదికగా ప్రత్యర్థులిద్దరూ బుధవారం మొత్తం లాబీయింగ్‌లో తలమునకలై ఉన్నారు. క్షణానికో సీన్ మారింది. సిద్ధరామయ్యే సీఎం అంటూ లేఖ సైతం సిద్ధమయ్యింది. శివకుమార్ ససేమిరా అనడంతో ఆ లేఖ బుట్టదాఖలయ్యింది. బెంగళూరు కంఠీరవ స్టేడియంలో గురువారం జరగాల్సిన ప్రమాణ స్వీకార ఏర్పాట్లను ప్రస్తుతానికి నిలిపేశారు. సీఎం పోస్టు కోసం కోట్లాట ఈ స్థాయికి చేరుకుందంటే ముగింపు ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. అసలు హైకమాండ్ దాకా వెళ్లకుండా కాంగ్రెస్ శాసనసభాపక్ష(సీఎల్పి) సమావేశంలోనే సీఎం అభ్యర్థిని ఎన్నుకొని ఉంటే ఎలాంటి వివాదానికి తావు ఉండేది కాదు. హైకమాండ్ చేతికి మట్టి అంటకుండా ఉండేది. అలా చేస్తే అది కాంగ్రెస్ సంస్కృతి ఎందుకవుతుంది? తెగేదాకా లాగి రెండు కుంపట్లు పెట్టుకుంటే ప్రతిపక్షం దాన్ని సొమ్ము చేసుకోవడం ఖాయం. అదే పరిస్థితి వస్తే ఈ ఇద్దరినీ కాదని మూడో వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం తప్ప కాంగ్రెస్‌కు మరో గత్యంతరం లేదు. కాంగ్రెస్ నేర్చుకున్నదేమీ లేదు రాజస్తాన్‌లో 2018లో అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ మధ్య మొదలైన సీఎం పీఠం లొల్లి ఐదేళ్లయినా ఇంకా ఓ కొలిక్కిరాలేదు. ఈ అనుభవం నుంచి కాంగ్రెస్ నేర్చుకున్నదేమీ లేదు. పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని గెలిపించిన సచిన్ పైలట్‌ను పక్కనపెట్టి (కొన్ని రోజులు డిప్యూటీ సీఎం పదవి ఎరవేసి), అనుభవాన్ని సాకుగా చూపి గహ్లోత్‌ను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారు. అప్పటినుంచి రాజస్తాన్ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతూనే ఉంది. రాష్ట్రంలో ఈ ఏడాది డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో గెలుస్తామన్న ఆశలు సన్నగిల్లాయి. ఇదంతా ఎందుకంటే.. డీకే శివకుమార్ మరో సచిన్ పైలట్ అయితే, కర్ణాటక మరో రాజస్తాన్ అవుతుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. -
Karnataka: కొనసాగుతున్న కర్నాటకం.. పట్టు వీడని సిద్ధూ, డీకే
న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి ఎంపిక వ్యవహారం కాంగ్రెస్ అధిష్టానానికి చుక్కలు చూపుతోంది. మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఎవరి పట్టు మీద వారే ఉండటంతో పీటముడి మరింత బిగుసుకుంటోంది. ఈ విషయమై హస్తినలో సోమ, మంగళవారాల్లో అధిష్టానం చర్చోపచర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. దాంతో బుధవారం నిర్ణయం తీసుకుంటామని ప్రకటించడం తెలిసిందే. కానీ ఇద్దరు నేతల్లో ఎవరూ వెనక్కు తగ్గేందుకు సిద్ధంగా లేకపోవడంతో చివరికి అధిష్టానం ఏమీ తేల్చలేకపోయింది. నిర్ణయానికి మరో రెండు మూడు రోజులు పట్టవచ్చని కాంగ్రెస్ కర్ణాటక వ్యవహారాల ఇన్చార్జి రణ్‌దీప్ సుర్జేవాలా మీడియాకు చెప్పారు. ఆలోపు కాంగ్రెస్ నేతలెవరూ దీనిపై తప్పుడు ప్రకటనలు చేయొద్దని ఆదేశించారు. లేదంటే క్రమశిక్షరాహిత్యంగా పరిగణించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కర్ణాటకలో కాంగ్రెస్ చేతిలో ఓటమిని జీర్ణించుకోలేని బీజేపీ సీఎం ఎంపికపై తప్పుడు ప్రచారాలకు పాల్పడుతోందని ఆరోపించారు. సీఎంను కూడా ఎన్నుకోలేకపోతున్నారన్న విమర్శలను తిప్పికొట్టారు. అస్సాం వంటి రాష్ట్రాల్లో సీఎం ఎంపికకు బీజేపీ ఎన్ని రోజులు తీసుకుందో అందరికీ తెలుసన్నారు. ఎవరిని సీఎం చేయాలో కూడా తేల్చుకోలేని అయోమయంలో కాంగ్రెస్ పెద్దలున్నారంటూ కర్ణాటక తాజా మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై, ఇతర బీజేపీ నేతలు అంతకుముందు చురకలు వేశారు. రోజంతా చర్చలే చర్చలు బుధవారం ఉదయం రాహుల్‌గాంధీ తొలుత సిద్ధరామయ్య, తర్వాత డీకేతో సమావేశమయ్యారు. 10, జన్‌పథ్ నివాసంలో వారితో చెరో అరగంటకు పైగా చర్చలు జరిపారు. తర్వాత సిద్ధరామయ్యనే సీఎం చేయాలని అధిష్టానం నిర్ణయించినట్టు చెబుతున్నారు. ఈ మేరకు లేఖ కూడా సిద్ధమైనట్టు సమాచారం. బెంగళూరు కంఠీరవ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం సిద్ధరామయ్య ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. సిద్ధరామయ్యే సీఎం అంటూ చానళ్లలో వార్తలు రావడంతో ఆయన సొంతూళ్లో, బెంగళూరులోని నివాసం వద్ద సంబరాలు మొదలయ్యాయి. దాంతో భగ్గుమన్న డీకే సరాసరి వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. అనంతరం బెంగళూరులో ప్రమాణోత్సవ ఏర్పాట్లు నిలిచిపోయాయి. నిర్ణయానికి మరో రెండు మూడు రోజులు పట్టొచ్చన్న ప్రకటన వెలువడింది. తర్వాత ప్రతిష్టంభనకు తెర దించే ప్రయత్నాలను అధిష్టానం ముమ్మరం చేసింది. వాటిలో భాగంగా ఆదివారం నాటి కర్ణాటక సీఎల్పీ భేటీకి అధిష్టానం పరిశీలకునిగా వెళ్లిన సుశీల్‌కుమార్ షిండేతో ఖర్గే తన నివాసంలో భేటీ అయ్యారు. బుధవారం హస్తినలో చోటుచేసుకున్న కర్ణాటక రాజకీయ పరిణామాలు... ♦ ఉదయం 8.46: సీఎం రేసులో ముందున్న సిద్ధరామయ్య ♦ 11.30: సిద్ధరామయ్యతోరాహుల్ భేటీ ♦ మధ్యాహ్నం 12.20: డీకే శివకుమార్‌తో రాహుల్ సమావేశం ♦ 1.27: బెంగళూరు కంఠీరవ స్టేడియంలో ప్రమాణస్వీకార ఏర్పాట్లు షురూ ♦1.54: సిద్ధరామయ్యను సీఎంగా పేర్కొంటూ లేఖ ప్రతి కూడా సిద్ధం ♦ 2.14: కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో శివకుమార్ భేటీ ♦ 4.16: షేరింగ్ ఫార్ములాకు, డిప్యూటీ సీఎం పదవికి డీకే ససేమిరా ♦ సాయంత్రం 4.30: బెంగళూరులో నిలిచిపోయిన ప్రమాణస్వీకార ఏర్పాట్లు ♦ 5.25: ఎమ్మెల్యేలు, మద్దతుదారులతో ఢిల్లీలోని సోదరుడు సురేశ్ నివాసంలో డీకే మంతనాలు -
డీకే శివకుమార్‌కు రెండు ఆఫర్లు ఇచ్చిన హైకమాండ్!
ఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనేదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఫలితాలు వెలువడి నాలుగురోజులు గడుస్తున్నా.. అన్నీ తెలిసి కూడా ఇప్పుడు మల్లగుల్లాలు పడడం కాంగ్రెస్ హైకమాండ్ వంతు అవుతోంది. కాబోయే సీఎం సిద్ధరామయ్యేనంటూ ఈ ఉదయం విస్తృతంగా ప్రచారం జరగ్గా.. ఇంకా నిర్ణయమే జరగలేదంటూ చల్లగా కబురు చెప్పారు ఆ పార్టీ సీనియర్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా. అయితే చర్చోపచర్చల్లో.. సీఎం కుర్చీకి బదులుగా డీకే శివకుమార్ ముందు పార్టీ రెండు ఆఫర్లను ఉంచిందని తెలుస్తోంది. కర్ణాటక ముఖ్యమంత్రి పోస్ట్‌కు బదులుగా తను పడిన కష్టానికి డీకే శివకుమార్‌కు.. రెండు ఆఫర్లు ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో జరిగిన రెండు గంటల భేటీలో వీటి మీదే చర్చ జరిగినట్లు పార్గీ వర్గాలు చెబుతున్నాయి. అందులో.. మొదటిది.. మరెవరికీ డిప్యూటీ సీఎం పదవి ఇవ్వకుండా కేవలం డీకే శివకుమార్ ఒక్కడికి మాత్రమే డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం. దాంతో పాటు ఇప్పుడున్న పీసీసీ చీఫ్ కొనసాగించడం. అదనంగా.. ఆరు పోర్ట్‌పోలియోలు(అదీ కోరుకున్న శాఖలు) కట్టబెట్టాలని ఒక ప్రతిపాదన డీకేఎస్ ముందు ఉంచాయి. ఒకే పదవి నిబంధనను పక్కనపెట్టి మరీ సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు రాహుల్ గాంధీ ఈ ప్రతిపాదన తెచ్చినట్లు తెలుస్తోంది. కానీ, డీకే శివకుమార్ ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారట. ఇక రెండోది.. శివకుమార్, సిద్ధరామయ్యల మధ్య పవర్ షేరింగ్. దీనిప్రకారం.. సిద్ధరామయ్య తొలుత సీఎం అవుతారు. రెండేళ్లపాటు పదవి చేపడతారు. ఆపై మిగిలిన మూడేళ్ల కాలానికి సీఎంగా డీకే శివకుమార్ కొనసాగుతారు. అయితే ఈ ప్రతిపాదనను శివకుమార్ మాత్రమే కాదు.. సిద్ధరామయ్య కూడా తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. గత నాలుగేళ్లుగా తన పనితీరును ప్రామాణికంగా తీసుకోవాలని డీకే శివకుమార్.. ఖర్గే, రాహుల్ వద్ద ప్రస్తావించారు. ఎమ్మెల్యేలు పార్టీని వీడి ప్రభుత్వాన్ని కూలదోసినా.. పార్టీని తాను పునర్మించానని, అలాగే పార్టీకి భారీ విజయం కట్టబెట్టానని ఆయన వారివురు వద్ద పేర్కొన్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి పదవి తప్ప మరొకటి తాను ఆశించడం లేదని, ఒకవేళ ఆ పదవి ఇవ్వకున్నా సాధారణ ఎమ్మెల్యేగా తాను ఉండిపోతానని ఆయన వాళ్లతో చెప్పినట్లు తెలుస్తోంది. కర్ణాటకలో సీఎం ఎంపిక కాంగ్రెస్‌కు ఇప్పుడు పెద్ద పరీక్షగా మారింది. ఎందుకంటే.. ఏమాత్రం తేడా జరిగినా మరో రాజస్థాన్‌లా(అశోక్ గెహ్లట్ వర్సెస్ సచిన్ పైలట్) మారే ప్రమాదం ఉంది. అది మరీ దిగజారితే మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటుతో కమల్ నాథ్ ప్రభుత్వం కుప్పకూలినట్లు కుప్పకూలే ప్రమాదమూ లేకపోలేదు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు సీఎం ఎంపికలో తీసుకోబోయే నిర్ణయం.. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం కచ్చితంగా చూపెడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదీ చదవండి: బీజేపీకి కొత్త టెన్షన్.. వచ్చే వారంలో ఏం జరుగనుంది? -
కర్ణాటక సీఎంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు: సూర్జేవాలా
సాక్షి, ఢిల్లీ: కర్ణాటకలో అధికార బీజేపీకి షాకిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే, కాంగ్రెస్ తరఫున సీఎం ఎవరు? అన్న దానిపై తీవ్ర చర్చ నడుస్తోంది. కర్ణాటక సీఎం రేసులో మాజీ సీఎం సిద్దరామయ్య, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ పరిశీలకుడు రణ్‌దీప్ సూర్జేవాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక సీఎం ఎంపికపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో చర్చలు జరుగుతున్నాయి. నేడో, రేపో నిర్ణయం తీసుకుంటాం. మరో 48-72 గంటల్లో కర్ణాటకలో కొత్త క్యాబినెట్ ఏర్పాటు చేస్తాం. కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారం తేదీ కూడా తప్పు. దీనిపై ఫేక్ ప్రచారం చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేశారు. #WATCH | Delibrations are currently underway by party president Mallikarjun Kharge. Whenever Congress makes a decision we will inform you. In the next 48-72 hours, we will have a new cabinet in Karnataka: Randeep Surjewala, Karnataka in-charge, Congress pic.twitter.com/fas1Bpu3J3 — ANI (@ANI) May 17, 2023 ఇదిలా ఉండగా.. కర్ణాటకలో సిద్దరామయ్య అనుచరులు, మద్దతుదారులు కాబోయే ముఖ్యమంత్రి ఆయనే అంటూ నినాదాలు చేస్తున్నారు. సిద్దరామయ్య పోస్టర్లకు పాలాభిషేకం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. #WATCH | Supporters of Congress leader Siddaramaiah pour milk on his poster and chant slogans for him outside his residence in Bengaluru, even as the suspense over #KarnatakaCMRace continues. pic.twitter.com/HQG0gzsb1G — ANI (@ANI) May 17, 2023 ఇది కూడా చదవండి: ముహూర్తం ఫిక్స్.. కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరంటే? -
రాహుల్ నివాసం వద్ద డీకేఎస్ మద్దతుదారుల నినాదాలు
ఢిల్లీ: మూడు రోజుల చర్చల తర్వాత.. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పేరును కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసిందనే ప్రచారం ఊపందుకుంది. ఈలోపు సాయంత్రం ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఆ పేరును అధికారికంగా ప్రకటించడమే తరువాయి అంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఈ లోపు.. హస్తినలో ఇవాళ హాట్ హాట్ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీఎం పదవిని ఆశించిన డీకే శివకుమార్ తన సోదరుడితో కలిసి కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీతో భేటీ అవ్వగా.. ఆయన మద్దతుదారులు నివాసం బయట నిరసనకు దిగారు. డీకే శివకుమార్‌కే ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలంటూ ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు వాళ్లు. దత్త పుత్రుడు కావాలా? అసలు పుత్రుడు కావాలా? అంటూ డీకేఎస్‌ను సీఎం చేయాలంటూ నినాదాలు చేశారు వాళ్లు. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసి సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి రావడానికి డీకేఎస్ కారణమని, ఆయనకు కాకుండా సీఎం పోస్ట్ ఎవరికి ఇచ్చినా ఆ నిర్ణయం చారిత్రక తప్పిదమే అవుతుందని వ్యాఖ్యానించారు వాళ్లు. ఒకపక్క సీఎంగా సిద్ధరామయ్య పేరు దాదాపు ఖరారు కావడంతో బెంగళూరులోని ఆయన నివాసం బయట ఫొటోకు పాలాభిషేకం చేశారు మద్దతుదారులు. దీనికి ప్రతిగానే డీకేఎస్ అనుచరగణం ఇలా రాహుల్ నివాసం బయట గుమిగూడినట్లు తెలుస్తోంది. రాహుల్‌తో భేటీ అనంతరం డీకే సోదరులు నేరుగా ఖర్గే నివాసానికి వెళ్లారు. #WATCH | Supporters of Congress leader Siddaramaiah pour milk on his poster and chant slogans for him outside his residence in Bengaluru, even as the suspense over #KarnatakaCMRace continues. pic.twitter.com/HQG0gzsb1G — ANI (@ANI) May 17, 2023 #WATCH | Karnataka Congress president DK Shivakumar leaves from 10, Janpath after meeting party leader Rahul Gandhi, as Karnataka CM decision remains pending pic.twitter.com/BvTTJG4T8T — ANI (@ANI) May 17, 2023 ఇదీ చదవండి: జస్ట్ 16 ఓట్ల ఆధిక్యంతో నెగ్గిన బీజేపీ అభ్యర్థి -
ముహూర్తం ఫిక్స్.. కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరంటే?
సాక్షి, ఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు వెలువడి నాలుగు రోజులు గడిచినా కానీ, సీఎం ఎవరన్నదానిపై కాంగ్రెస్ పార్టీ ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోయింది. అయితే, ఎట్టకేలకు బుధవారం.. ఉత్కంఠకు తెరపడింది. సిద్ధూకు ఒకే అన్న కాంగ్రెస్ అధిష్టానం.. మరికాసేపట్లో ప్రకటన వెలువరించే అవకాశం ఉంది. కాగా, ముందుగా ఢిల్లీ వెళ్లిన సిద్ధరామయ్య.. ఖర్గేతో మంగళవారం ఓ దఫా చర్చలు జరిపారు. నిన్న ఉదయం కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా ఢిల్లీ వెళ్లి ఖర్గేతో సమావేశమై చర్చలు జరిపారు. నిన్న మల్లికార్జున్ ఖర్గే నివాసంలో నిరంతరం సమావేశాలు, చర్చలు జరిగినా ఎలాంటి నిర్ణయానికి రాలేకపోయారు. కాగా, రాహుల్ గాంధీతో సిద్దరామయ్య బుధవారం సమావేశమయ్యారు. అరగంట పాటు రాహుల్‌తో చర్చించారు. సిద్ధరామయ్య వైపే కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్లు మధ్యాహ్ననికి క్లారిటీ రాగా, సాయంత్రానికి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రొటేషన్ సీఎం ఫార్ములాను కాంగ్రెస్ హైకమాండ్ సూచిస్తోంది. డీకే శివకుమార్‌కు డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం ఉంది. రాహుల్‌గాంధీని డీకే శివకుమార్ కూడా కలిశారు. కర్ణాటక సీఎం అభ్యర్థిపై అధిష్టాన నిర్ణయాన్ని డీకేకి రాహుల్ తెలిపారు. చదవండి: కాషాయ పార్టీకి షాకిచ్చిన ఆ ఓటర్లు.. కాంగ్రెస్‌కు కలిసొచ్చిన అంశాలు ఇవే! రేపు(గురువారం) సాయంత్రం బెంగుళూరులో సీఎల్పీ భేటీ జరగనుంది. కర్ణాటకలో సిద్ధరామయ్య ఇంటి దగ్గర భద్రత పెంచారు. రేపు ప్రమాణస్వీకారం ఉంటుందని సిద్ధూ అనుచరులు అంటున్నారు. -
రాహుల్ గాంధీని కలవనున్న డీకే. శివకుమార్, సిద్ధరామయ్య
-
పిల్లలకు ఏమివ్వాలో తల్లికి తెలుసు: డీకే.శివకుమార్
కర్ణాటక: కాంగ్రెస్ పార్టీ తనకు తల్లి లాంటిది. పిల్లలకు ఏమి ఇవ్వాలనేది తల్లికి తెలుసని కేపీసీసీ అధ్యక్షుడు డీకే.శివకుమార్ అన్నారు. నూతన సీఎం ఎంపికపై చర్చించేందుకు హైకమాండ్ పిలుపు మేరకు ఢిల్లీకి వెళ్లే ముందు ఆయన బెంగళూరులోని సదాశివనగర తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ... తాను తన దేవుడిని కలిసేందుకు దేవాలయానికి వెళ్తున్నానని, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి తనను ఒక్కడినే ఢిల్లీకి రావాలని తెలిపారని, తన ఆరోగ్యం కుదుటపడిందని, ప్రజల ఆశీర్వాదంతో గెలుపు సాధించామని, వారు తమపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటామన్నారు. హైకమాండ్‌ను ముఖ్యమంత్రి స్థానం కోరుతారా అన్న ప్రశ్నకు తాను తన కర్తవ్యాన్ని నిర్వర్తించాను. 135 స్థానాలను గెలిపించి ఇచ్చాను అంతే అని ఆయన సమాధానమిచ్చారు. తాను వెన్నుపోటు పొడవను, బ్లాక్ మెయిల్ చేయనని డీకేశి అన్నారు. తమది ఐకమత్యం కలిగిన ఇల్లు అని, తమ సంఖ్య 135 ఏ ఒక్కరిని విడగొట్టే పని చేయనని చెప్పారు. -
ఖర్గేతో ముగిసిన డీకేఎస్, సిద్ధూ భేటీ.. సీఎం ప్రకటనపై ఉత్కంఠ
ఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగే ఛాన్స్ కనిపిస్తోంది. తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా.. సీఎం ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్ చర్చోపచర్చలు జరుపుతోంది. ఈ క్రమంలో డీకే శివకుమార్, సిద్ధరామయ్యలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఇవాళ వరుసగా భేటీ అయ్యారు. తొలుత డీకే శివకుమార్, ఆపై సిద్ధరామయ్య ఖర్గేతో ఆయన నివాసంలో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఇద్దరూ చెరో గంటకుపైనే ఖర్గేతో చర్చించారు. ఈ క్రమంలో ఇద్దరూ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. అయితే.. ఇద్దరితో సమాలోచనల సారాంశాన్ని సోనియా గాంధీ, రాహుల్ గాంధీతోనూ చర్చించాలని ఖర్గే భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఖర్గేతో భేటీ అనంతరం.. పార్టీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ నివాసానికి వెళ్లారు సిద్ధారామయ్య. ఇప్పటికే ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించిన పార్టీ పరిశీలకులు.. హైకమాండ్‌కు ఆ నివేదికను అందించారు. ఆపై ఇద్దరు అభ్యర్థులతో ఖర్గే విడివిడిగా భేటీ అయ్యారు. ఎమ్మెలఏల మద్దతు తనకే ఉందని సిద్ధరామయ్య, ఖర్గేతో చెప్పినట్లు తెలుస్తోంది. ఇక డీకే శివకుమార్ సోలోగా తాను పార్టీకి భారీ విజయాన్ని కట్టబెట్టినట్లు చెప్పినట్లు సమాచారం. కుదిరితే రేపు లేకుంటే ఎల్లుండి బెంగళూరులో కర్ణాటకకు కాబోయే సీఎం ఎవరనేదానిపై పార్టీ అధ్యక్షుడు ఖర్గే స్వయంగా ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. #UPDATE | #WATCH | Karnataka Congress president DK Shivakumar leaves from the residence of the party's national president Mallikarjun Kharge, in Delhi. pic.twitter.com/FqUPpf77Da — ANI (@ANI) May 16, 2023 #UPDATE | #WATCH | Congress leader Siddaramaiah leaves from the residence of party president Mallikarjun Kharge, in Delhi. pic.twitter.com/dwE9uDKq8z — ANI (@ANI) May 16, 2023 -
Karnataka: రాజీనామా వార్తలపై డీకేఎస్ సీరియస్
సాక్షి, ఢిల్లీ: ముఖ్యమంత్రి పదవి విషయంలో తేడాలు జరిగితే కాంగ్రెస్‌కు డీకే శివకుమార్ రాజీనామా చేస్తారనే ప్రచారం ఒకటి కన్నడ మీడియా ఛానెల్స్ ద్వారా చక్కర్లు కొడుతోంది. అయితే ఆ ప్రచారంపై డీకేఎస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే పరువు నష్టం దావా వేస్తానని మీడియా ప్రతినిధులకు వార్నింగ్ ఇచ్చారాయన. పార్టీ(కాంగ్రెస్‌ను ఉద్దేశించి..) నాకు తల్లిలాంటిది. పార్టీకి రాజీనామా చేస్తున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేనెందుకు రాజీనామా చేస్తా. అలాంటి ప్రచారం చేసేవాళ్లపై దావా వేస్తా జాగ్రత్త. 135 ఎమ్మెల్యే మద్దతు నాకు ఉంది అని ఢిల్లీలో తనని పలకరించిన మీడియా ప్రతినిధులతో తెలిపారాయన. ఢిల్లీలో కన్నడ సీఎం ఎంపిక ఎపిసోడ్ క్లైమాక్స్‌కు చేరుకుంది. ఉదయం నుంచి కీలక నేతలు చర్చోపచర్చలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌లు కర్ణాటక ముఖ్యమంత్రి ఎంపికపై చర్చించారు. ఇక సీఎం రేసులో ఉన్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు వేర్వేరుగా ఈ సాయంత్రం ఖర్గేతో భేటీ కానున్నారు. తొలుత ఐదు గంటల ప్రాంతంలో డీకే శివకుమార్, ఆపై ఆరు గంటలకు సిద్ధరామయ్య ఖర్గేతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అటుపై ఇద్దరూ రాహుల్ గాంధీతోనూ భేటీ కావొచ్చని తెలుస్తోంది. అంతా సజావుగా జరిగితే.. ఇవాళ రాత్రికే కర్ణాటక సీఎం ఎవరూ అనేదానిపై ఒక ప్రకటన వెలువడొచ్చని, ఉత్కంఠ వీడొచ్చని అటు కాంగ్రెస్ శ్రేణులు ఇటు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇదీ చదవండి: సీఎం ఎంపిక కోసం వాళ్ల లాబీయింగ్? -
ఇంకా ఖరారు కాని కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి
ఇంకా ఖరారు కాని కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి -
ఢిల్లీకి చేరుకున్న డీకే శివకుమార్.. సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలు..
న్యూఢిల్లీ: కర్ణాటక సీఎం పదవి ఎవరికి దక్కుతుందా అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ విషయంపైనే అధిష్టానంతో చర్చలు జరిపేందుకు పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఢిల్లీ చేరుకున్నారు. హైకమాండ్ పిలుపు మేరకు హస్తిన వెళ్లారు. సిద్ధరామయ్య, డీకేలు సీఎం పదవి చెరో రెండేళ్లు చేపట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ ప్రతిపాదించిందని ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై స్పందిస్తూ డీకే కీలకవ్యాఖ్యలు చేశారు. ఇద్దరు పంచుకోవడానికి సీఎం పదవి ఏమీ వారసత్వ ఆస్తి కాదని పేర్కొన్నారు. అసలు ఇప్పటివరకు అలాంటి ప్రతిపాదనేమీ తమ ముందుకు రాలేదని చెప్పారు. అలాగే సిద్ధరామయ్యకు 80 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, దీంతో ఆయనకే అవకాశం లభిస్తుందని జరుగుతున్న ప్రచారంపైనా డీకే స్పందించారు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 135 అని, దీన్ని ఎవరు విడగొట్టలేరని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల మద్దతు గురించి అసలు అంత కచ్చితంగా సంఖ్య ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. ఈ సమయంలో డీకే పక్కనే ఉన్న మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ఎమ్మెల్యేల మద్దతుపై ఇంకా కౌంటింగ్ జరాగాల్సి ఉందని జోకులు పేల్చారు. మరోవైపు కర్ణాటక సీఎం ఎంపికపై చర్చించేందుకు ఢిల్లీలోని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ మంగళవారం ఉదయం బేటీ అయ్యారు. ఢిల్లీ చేరుకున్న డీకేతోనూ కాంగ్రెస్ అధిష్ఠానం చర్చలు జరపనుంది. ఇద్దరిని బుజ్జగించి సాయంత్రం వరకు సీఎం ఎవరనే విషయాన్ని తేల్చే అవకాశం ఉంది. కాగా.. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని డీకే అంతకుముందే స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యేలను విడగొట్టనని, వెన్నుపొటు పొడవనని స్పష్టం చేశారు. బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడబోనని తేల్చిచెప్పారు. చరిత్రలో తన గురించి తప్పుగా ఉండాలని కోరుకోవడం లేదని, చెడ్డపేరుతో వెళ్లాలనుకోట్లేదని చెప్పుకొచ్చారు. దీంతో హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా.. తిరుగుబాటు ఉండదనే సంకేతాలు ఇచ్చారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్‌కు 20 సీట్లు తేవడమే తమ ముందున్న తదుపరి సవాల్ అని డీకే తెలిపారు. చదవండి: నేను వెన్నుపోటు పొడవను.. డీకే శివకుమర్ కీలక వ్యాఖ్యలు.. -
నేను వెన్నుపోటు పొడవను.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు..
బెంగళూరు: కర్ణాటక సీఎంగా కాంగ్రెస్ అధిష్ఠానం ఎవరిని ఎంపిక చేస్తుందనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సమయంలో పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికి నచ్చినా నచ్చకపోయినా బాధ్యతయుతంగా ఉంటానని స్పష్టం చేశారు. తాము 135 సీట్లు గెలిచామని, ఎవరినీ విడగొట్టాలని అనుకోవడం లేదని చెప్పారు. సీఎం ఎంపిక విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు తాను కట్టుబడి ఉంటానని డీకే స్పష్టం చేశారు. వెన్నుపోటు పొడవనని, బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయనని గాంధీ కుటుంబం పట్ల తన విధేయతను చాటుకున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్‌కు 20 సీట్లు తేవడమే తము ముందున్న సవాల్ అని డీకే తెలిపారు. చరిత్రలో తన గురించి తప్పుగా ఉండాలని కోరుకోవడం లేదని, చెడ్డపేరుతో వెళ్లాలనుకోట్లేదని చెప్పుకొచ్చారు. సీఎం ఎంపికపై చర్చించేందుకు అధిష్ఠానం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లడానికి ముందు ఏఎన్ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శివకుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా.. తిరుగుబాటు ఉండదనే సంకేతాలు ఇచ్చారు. రెండున్నరేళ్లు వద్దు..! కాగా.. కర్ణాటక సీఎం కుర్చీ కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్యీ తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. అంతిమ నిర్ణయం ఏఐసీసీ అధ్యక్షుడిదేనని సీఎల్పీ ఇప్పటికే ఏకగ్రీవంగా తీర్మానించింది. అయితే సీఎంగా ఇద్దరికీ చెరో రెండేళ్లు ఇస్తామని హైకమండ్ చేసిన ప్రతిపాదనకు డికే ససేమిరా అన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ఢిల్లీలో రెండు రోజులుగా ఈ విషయంపై అదిష్ఠానం మంతనాలు జరుపుతోంది. సిద్ధరామయ్య కూడా ఢిల్లీలోనే ఉన్నారు. డీకే శివకుమార్‌ను కూడా సోమవారమే ఢిల్లీకి పిలిచినప్పటికీ అనారోగ్య కారణాల వల్ల ఆయన వెళ్లలేదు. ఒక రోజు ఆలస్యంగా మంగళవారం వెళ్తున్నారు. సాయంత్రంలోగా కర్ణాటక సీఎం ఎవరనే విషయంపై స్పష్టత అవకాశం ఉంది. నూతన సీఎం ప్రమాణస్వీకారం గురువారం జరగనుంది. మంత్రులు కూడా ఆరోజే ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జన్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు. మే 10 జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 135 సీట్లు కైవసం చేసుకుని తిరుగులేని మెజార్టీ సాధించింది. అధికార బీజేపీ కేవలం 66 స్థానాలకే పరిమితమైంది. జేడీఎస్ 19 సీట్లతో సరిపెట్టకుంది. ఇతరులు నాలుగు చోట్ల గెలిచారు. చదవండి: గహ్లోత్‌కు సచిన్ పైలట్ అల్టిమేటం -
Karnataka CM Race: సిద్ధూ వర్సెస్ డీకే
బెంగళూరు: కర్ణాటక నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం రేసులో ప్రధానంగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ముందంజలో ఉన్నారు. ముఖ్యమంత్రి పదవి కావాలన్న ఆకాంక్షను వారిద్దరూ ఏమాత్రం దాచుకోవడం లేదు. పరస్పరం గట్టిగా పోటీ పడుతున్నారు. అయితే, కాంగ్రెస్ అధిష్టానం మనసులో ఏమున్నదో అంతుబట్టడం లేదు. ఈ నేపథ్యంలో ఇద్దరు నాయకుల బలాలు, బలహీనతలు, వారికి ఉన్న అవకాశాలు ఏమిటో చూద్దాం.. సిద్ధరామయ్య బలాలు ► మాస్ లీడర్‌గా రాష్ట్రవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు. ► మెజార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు. ► 2013 నుంచి 2018 పూర్తిస్థాయిలో ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం. ► ఏకంగా 13 సార్లు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. పరిపాలనలో విశేష అనుభవం ఉంది. ► మైనార్టీలు, వెనుకబడిన తరగతులు, దళితుల్లో ఆదరణ. ► బీజేపీ, జేడీ(ఎస్)లను గట్టిగా ఎదుర్కొనే సామర్థ్యం. ► రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు కావడం. ► రాహుల్ గాంధీ నుంచి లభిస్తున్న అండదండలు. బలహీనతలు ► కాంగ్రెస్ పార్టీతో సంస్థాగతంగా పెద్దగా అనుబంధం లేకపోవడం. ► 2018లో ముఖ్యమంత్రిగా పనిచేస్తూ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్‌ను మళ్లీ గెలిపించలేకపోవడం. ► జేడీ(ఎస్) నుంచి వచ్చిన ఆయన్ను బయటి వ్యక్తిగానే ఓ వర్గం చూస్తుండటం. ► వయసు 75 ఏళ్లు. ► వృద్ధాప్యం సమీపిస్తుండడం. అవకాశాలు ► ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపే, అందిరినీ కలుపుకొనేపోయే తత్వం. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక ఎంపీ సీట్లు గెలవాలంటే సిద్ధూ వంటి అనుభవజ్ఞుడు కావాలని అధిష్టానం భావిస్తుండడం. ► డీకే శివకుమార్‌పై ఐటీ, ఈడీ, సీబీఐ కేసులు. ► తనకు ఇదే చివరి ఎన్నిక అని సిద్ధూ ప్రకటించినందున మరోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు ఇదే చివరి అవకాశం కావడం. డీకే శివకుమార్ బలాలు ► సుదీర్ఘమైన రాజకీయ అనుభవం. బలమైన సంస్థాగత సామర్థ్యాలు. ► అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఘన విజయం సాధించి పెట్టడం. ► పార్టీ నాయకత్వానికి విధేయుడిగా పేరు. ► కష్ట కాలంలో ట్రబుల్ షూటర్‌గా అందించిన సేవలు. ► పుష్కలమైన ఆర్థిక వనరులు కలిగిన నాయకుడు. ► బలమైన తన సొంత సామాజిక వర్గం ఒక్కళిగల మద్దతు. ► సోనియా కుటుంబంతో సాన్నిహిత్యం. ► వయసు కేవలం 61 ఏళ్లు. ఆరోగ్యం మెరుగ్గా ఉండడం. ► మంత్రిగా శాఖలను నిర్వర్తించిన అనుభవం. బలహీనతలు ► వెంటాడుతున్న ఐటీ, ఈడీ, సీబీఐ కేసులు. న్యాయ పోరాటం చేయాల్సి రావడం. ► తిహార్ జైలులో కొన్నిరోజులపాటు శిక్ష అనుభవించడం. ► రాష్ట్రమంతటా కాకుండా పాత మైసూర్కే తన ప్రాబల్యం పరిమితం కావడం. ► ఒక్కళిగలు మినహా ఇతర సామాజిక వర్గాల మద్దతు ఆశించిన స్థాయిలో లేకపోవడం. అవకాశాలు ► పాత మైసూర్లో కాంగ్రెస్‌కు ప్రజాదరణ దక్కడం వెనుక కృషి శివకుమార్‌దే. ► కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతుండడం. ఎస్ఎం కృష్ణ, వీరేంద్ర పాటిల్ పీసీసీ అధ్యక్షులుగా ఉంటూ ముఖ్యమంత్రులయ్యారు. ► కాంగ్రెస్‌లోని పాత తరం నాయకుల ఆశీస్సులు లభిస్తుండడం. -
ఢిల్లీలో పవర్ ప్లే.. పదవిపై పట్టువీడని ఇద్దరు నేతలు
న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక సీఎం అభ్యర్థిని తేల్చేందుకు కాంగ్రెస్ పెద్దలు హస్తినలో మల్లగుల్లాలు పడుతున్నారు. పదవి కోసం మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తీవ్రంగా తలపడుతుండటంతో రెండు రోజులుగా రాష్ట్రంలో రాజకీయం వేడెక్కడం తెలిసిందే. సీఎల్పీ భేటీలోనూ పీటముడి వీడకపోవడంతో సంప్రదింపుల కోసం వారిద్దరినీ అధిష్టానం హస్తినకు పిలిచింది. దాంతో సిద్ధరామయ్య సోమవారం సాయంత్రమే ఢిల్లీ చేరగా డీకే మాత్రం ‘ఆరోగ్య కారణాల’తో బెంగళూరుకే పరిమితమై మరింత సస్పెన్స్‌కు తెర తీశారు. ఢిల్లీ వెళ్తున్నట్టు మధ్యాహ్నం దాకా చెబుతూ వచ్చిన ఆయన చివరికి పర్యటనను రద్దు చేసుకున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య వెంటే ఉన్నారన్న వార్తలను మీడియా ప్రస్తావించగా, తాను మొత్తం 135 మంది ఎమ్మెల్యేలకూ నాయకుడినంటూ డీకే నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు సోమవారం ఉదయం బెంగళూరులో డీకే 61వ పుట్టినరోజు వేడుకల్లో సిద్ధరామయ్య కూడా పాల్గొన్నారు. ఆ వెంటనే ఒకరు హస్తినలో, మరొకరు బెంగళూరులో తమ ప్రయత్నాలకు పదును పెడుతూ రాజకీయ వేడిని మరింత పెంచుతున్నారు. అసెంబ్లీ పోరులో పార్టీని కలసికట్టుగా విజయ తీరాలకు చేర్చిన వీరిద్దరిలో ఎవరూ పట్టు వీడకపోవడం, వారి మద్దతుదారులైన ఎమ్మెల్యేలు, నేతలు రెండు శిబిరాలుగా చీలిన నేపథ్యంలో ఈ చిక్కుముడిని అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. అగ్ర నేతలు సోనియా, రాహుల్‌గాంధీలతో చర్చించి మంగళవారం సాయంత్రానికల్లాల సీఎం అభ్యర్థిని అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖరారు చేస్తారని చెబుతున్నారు. సీఎం అభ్యర్థి ఎంపికకు ఆదివారం రాత్రి పొద్దుపోయేదాకా ముగ్గురు అధిష్టానం ప్రతినిధుల పర్యవేక్షణలో జరిగిన సీఎల్పీ భేటీ ఎటూ తేల్చలేకపోవడం, నేతలతో, ఎమ్మెల్యేలతో దూతల విడివిడి చర్చలు, రహస్య బ్యాలెట్ వంటివి ఏ ఫలితమూ ఇవ్వకపోవడంతో అభ్యర్థి ఎంపిక అధికారాన్ని పార్టీ అధ్యక్షునికే కట్టబెడుతూ సీఎల్పీ తీర్మానం చేయడం తెలిసిందే. సీక్రెట్ బ్యాలెట్ బాక్సులతో ఢిల్లీ ప్రతినిధులు సోమవారం ఢిల్లీ చేరారు. ఖర్గేకు పరిస్థితి వివరించడంతో పాటు నివేదిక కూడా అందజేశారు. -
సిద్ధరామయ్యకు ఆల్ ది బెస్ట్: డీకే శివకుమార్
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం విషయంలో పీసీసీ చీఫ్ డీకే శివకుమార్(61) పార్టీ హైకమాండ్‌కు మరోసారి గట్టి సంకేతాలు పంపించారు. ఒంటరిగానే 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించానని చెబుతున్న ఆయన.. అవసరమైతే నిరసన తెలుపుతానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో సిద్ధరామయ్యకు ఆల్ ది బెస్ట్ అంటూ ఆయన వ్యాఖ్యానించడం కొసమెరుపు. తన నివాసంలో ప్రెస్మీట్లో మాట్లాడిన ఆయన.. కాసేపటికే మరోసారి మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌లో నాకంటూ ఓ వర్గం లేదు. ఎమ్మెల్యేలంతా నా వాళ్లే. ఒంటరిగా కాంగ్రెస్‌కు 135 సీట్లు తెచ్చిపెట్టా. పైగా కాంగ్రెస్ చీఫ్(మల్లికార్జున ఖర్గేను ఉద్దేశించి..) నావైపే ఉన్నారు. నా బలాన్ని ఎవరూ లాక్కోలేరు. అలాగే.. వేరే వాళ్ల బలంపై నేను మాట్లాడను. అవసరమైతే నిరసన తెలుపుతా అంటూ పేర్కొన్నారాయన. ఇక ఢిల్లీకి తాను వెళ్లబోవట్లేదని తేల్చి చెప్పిన శివకుమార్.. పనిలో పనిగా చివరిలో సిద్ధరామయ్యకు ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్ చేశారు. అంతేకాదు.. తిరుగుబాటు చేస్తారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. నేనేం తిరుగుబాటు చేయను. అలాగే బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడను. నేనేం బచ్చాగాడ్ని కాదు. నాకంటూ ఓ విజన్ నాకుంది. అలాగే పార్టీ పట్ల విధేయత కూడా ఉంది. ముందు పార్టీ అధిష్టానాన్ని నిర్ణయం తీసుకోనివ్వండి అని మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన. ఇదిలా ఉంటే.. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందంటూ హస్తిన పర్యటనకు వెళ్లిన సిద్ధరామయ్య(75), ఇవాళ రాత్రి పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ కీలక నేత రాహుల్ గాంధీతో భేటీ అవుతారనే ప్రచారం నడుస్తోంది. ఇదీ చదవండి: డీకే శివకుమార్‌తో నాకు మంచి దోస్తీ ఉంది! -
‘నేను ఒంటరిని.. పార్టీని గెలిపించుకున్నా!’
బెంగళూరు: పార్టీ అధ్యక్షుడిగా పార్టీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డానని, కర్ణాటకను కాంగ్రెస్‌కు ఇవ్వాలన్న లక్ష్యం సాధించానని, సీఎం ఎవరన్నదానిపై ఇక హైకమాండ్‌దే తుది నిర్ణయమని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ఒకవైపు సీఎం అభ్యర్థిపై పార్టీ హైకమాండ్ మల్లగుల్లాలు పడుతున్న వేళ.. సీనియర్ నేత సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్లడం తెలిసిందే. అయితే డీకే శివకుమార్ మాత్రం బెంగళూరులో ఉండిపోయారు. ఇవాళ తన పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యుల నడుమ తన ఫామ్‌హౌజ్‌లో చేసుకున్నారాయన. అనంతరం బెంగళూరులోని నివాసానికి చేరుకున్నారు. అక్కడ మద్దతుదారులతో భేటీ అయిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. కర్ణాటక పీసీసీ చీఫ్, సీఎం రేసులో ఉన్న డీకే శివకుమార్ తన ఇంట్లో మీడియా సమావేశం నిర్వహించారు.‘‘ ఇవాళ నా పుట్టినరోజు. వేడుకల్లో పాల్గొనేందుకు ఇక్కడే ఉండిపోయా. తర్వాత ఢిల్లీకి వెళ్తా. పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డా. 15 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినా ధైర్యం కోల్పోలేదు. కాంగ్రెస్ నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చాను. నా టార్గెట్ కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించడం. నా అధ్యక్షతన 135 స్థానాలు గెలిపించుకున్నా. గెలుపు కోసం నేతలంతా సహకరించారు. .. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా. సిద్ధరామయ్యతో ఎలాంటి విభేధాలు లేవు. నా బర్త్‌డే వేడుకల్లో కూడా ఆయన పాల్గొన్నారు. సీఎం ఎవరన్నదానిపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. నాకంటూ ఉన్న మద్దతు దారుల సంఖ్యను చెప్పను. ఎందుకంటే నేను ఒంటరిని.. ఒంటరిగానే పార్టీని గెలిపించుకున్నా. ఢిల్లీ వెళ్లి నా గురువును కలుస్తా. సీఎం అభ్యర్థి ఎవరు అనేదానిపై హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుంది. సోనియా, రాహుల, ఖర్గేలు సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు అని శివకుమార్ పేర్కొన్నారు. #WATCH | It's my birthday today, I'll meet my family. Afterwards,I'll leave for Delhi.Under my leadership,we've 135 MLAs, all in one voice said-matter (to appoint CM) is to be left to the party high command. My aim was to deliver Karnataka&I did it: K'taka Cong Pres DK Shivakumar pic.twitter.com/xlqvVCBLdv — ANI (@ANI) May 15, 2023 ఇదీ చదవండి: ఇంతకన్నా కానుక ఏముంటుంది?-డీకే శివకుమార్ -
కర్ణాటక లో కాంగ్రెస్ సందడి...
-
‘నేనే సీఎం అవుతానని ఆశిస్తున్నా’
సాక్షి, ఢిల్లీ/బెంగళూరు: కౌన్ బనేగా కర్ణాటక ముఖ్యమంత్రి?. దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణమైన మెజార్టీతో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ.. సీఎం ఎంపికలో మాత్రం తర్జన భర్జనలు పడుతోంది. సీఎం రేసులో ప్రయారిటీ క్యాండిడేట్లుగా ఉన్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లలో ఎవరిని సీఎం పీఠంపై కూర్చోబెట్టాలనేదానిపై చర్చలతో హస్తిన హీటెక్కిపోతోంది. రేపటి కల్లా పేరు ఖరారు చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో.. కొందరు ఎమ్మెల్యేలతో ఢిల్లీకి వెళ్లిన సీనియర్ నేత సిద్ధరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నేనే ముఖ్యమంత్రి అవుతానని ఆశిస్తున్నా. నిన్న(ఆదివారం) జరిగిన సీఎల్పీ భేటీలో మెజార్టీ ఎమ్మెల్యేలు నన్ను ముఖ్యమంత్రిగా కోరుకున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయానికే కట్టుబడి ఉంటా. డీకే శివకుమార్‌తో నాకు మంచి స్నేహం ఉంది’’ అని 75 ఏళ్ల సిద్ధరామయ్య పేర్కొన్నారు. మరో 24 గంటల్లో సీఎం ఎవరో తెలుస్తుందని వ్యాఖ్యానించారాయన. ఇక సిద్ధరామయ్య వెంట ఉన్న ఎమ్మెల్యేలలో దళిత, మైనార్టీ, ట్రైబల్, ఓబీసీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. అన్నీ వర్గాల ప్రజాప్రతినిధుల మద్దతు తనకు ఉందని అధిష్టానం బలనిరూపణ కోసమే ఆయన వెళ్లినట్లు తెలుస్తోంది. హైకమాండ్‌తో భేటీ అనంతరం ఆయన ఈ సాయంత్రం రాహుల్ గాంధీతో భేటీ కావొచ్చని తెలుస్తోంది. మరోవైపు కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్(62) కూడా నేడు ఢిల్లీకి వెళ్తారని ప్రచారం జరిగింది. కానీ, ఆయన బెంగళూరులోనే ఉండడం, తాను ఢిల్లీకి వెళ్లడం లేదని డీకే శివకుమార్ స్పష్టం చేయడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. ‘‘నేను ఢిల్లీ వెళ్లడం లేదు. నా పుట్టినరోజు వేడుకలు ఉన్నందున ఇంట్లోనే ఉంటున్నా. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా’’ అని పేర్కొన్నారాయన. అధిష్టానం నుంచి పిలుపు రానందు వల్లే ఆయన ఢిల్లీ పర్యటనకు దూరం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అధిష్టానం పిలిస్తే మాత్రం ఆయన ఢిల్లీకి వెళ్లొచ్చని సమాచారం. కర్ణాటక సీఎం కుర్చీ విషయంలో డీకే శివకుమార్ ఓ మెట్టు కిందకు దిగొద్దని నిశ్చయించుకున్నట్లు ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. డీకే శివకుమార్‌ను బుజ్జగించేందుకు ఏఐసీసీ పరిశీలకుడు, కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సింగ్ సూర్జేవాలా చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు తెలుస్తోంది. మూడు గంటలపాటు వీళ్లు భేటీ జరిగింది. చెరో రెండున్నరేళ్లు సీఎం పదవి ప్రతిపాదనను సైతం డీకే తిరస్కరించినట్లు సమాచారం. ఇస్తే సీఎం పదవి ఇవ్వండి.. లేకుంటే కేబినెట్లో స్థానం కూడా వద్దంటూ డీకే, సూర్జేవాలాకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో బుజ్జిగింపుల పర్వంతో కాంగ్రెస్ హైకమాండ్ ఇద్దరిలో ఎవరిని సీఎం చేస్తుందో చూడాలి. ఇదీ చదవండి: డీకేకు సీఎం పదవి దూరం.. కారణం అదేనా? -
వీడియో: కర్ణాటక సీఎం ఎవరు?.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
-
Karnataka: నేడూ సీఎల్పీ భేటీ?
బనశంకరి: ఆదివారం నాటి సీఎల్పీ సమావేశానికి చాలామంది ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. దాంతో నూతన సభ్యులందరి అభిప్రాయాలు తెలుసుకునేందుకు భేటీ సోమవారం కూడా కొనసాగుతుందని భావిస్తున్నారు. సిద్దరామయ్యకు 75 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా 40 మంది డీకే శివకుమార్ వెంట ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో వారిద్దరూ సీఎం పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకునేలా సూత్రంపైనా ఆదివారం భేటీలో చర్చించారు. సిద్ధరామయ్య, డీకే సోమవారం ఢిల్లీ వెళతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సోనియాగాంధీ, రాహుల్ సమక్షంలో సీఎం అంశం కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. -
క్లైమాక్స్ ఏంటి?.. సీఎం ఎవరు?.. నేడు ఢిల్లీకి సిద్దూ, డీకే?
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి ఎంపిక అంత తేలికగా ముగిసేలా కనిపించడంలేదు. సీఎం అభ్యర్థిని నిర్ణయించే అధికారాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకే నూతన ఎమ్మెల్యేలు కట్టబెట్టారు. ఆదివారం సాయంత్రం బెంగళూరులోని ఓ హోటల్లో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయానికి కారకులైన నాయకులు, కార్యకర్తలు, కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ తొలుత పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది. అనంతరం సీఎం ఎంపిక అధికాన్ని ఖర్గేకు అప్పగిస్తూ మాజీ సీఎం సిద్దరామయ్య ప్రవేశపెట్టిన ఏక వాక్య తీర్మానాన్ని కూడా ఎమ్మెల్యేలు ఆమోదించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. అధిష్టానం తరఫున ఖర్గే నియమించిన ముగ్గురు పరిశీలకులు సీఎం అభ్యర్థిపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకుంటారని చెప్పారు. ఆదివారం ఈ తతంగం పూర్తి చేసి సోమవారానికల్లా ఖర్గేకు వారు నివేదిక అందజేస్తారన్నారు. ఖర్గే నియమించిన పరిశీలకుల కమిటీలో మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌కుమార్ షిండే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జితేంద్ర సింగ్, ఏఐసీసీ మాజీ కార్యదర్శి దీపక్ బబారియా ఉన్నారు. వీరు, వేణుగోపాల్ అంతకుముందు సీఎం రేసులో ఉన్న సిద్దరామయ్య, డీకే శివకుమార్‌లతో వేర్వేరుగా భేటీ అయ్యారు. చదవండి: ఓవర్ టు రాజస్తాన్ కార్యకర్తల హడావుడి సీఎల్పీ భేటీ జరిగిన హోటల్ బయట కాంగ్రెస్ కార్యకర్తల హడావుడి కనిపించింది. సిద్దరామయ్య, శివకుమార్ వర్గీయులు బ్యానర్లు, జెండాలు చేతబూని తమ నేతే సీఎం అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు ఇద్దరు నేతలు తమకు మద్దతు తెలిపే ఎమ్మెల్యేలతో వేర్వేరుగా భేటీలు జరిపారు. రెండు వర్గాలు పోటాపోటీగా పోస్టర్లు వేశాయి. ఇద్దరు నేతల నివాసాల వద్ద కూడా పోస్టర్లు కనిపించాయి. ఎన్నికలకు ముందు పార్టీ నేతలను ఒకే తాటిపైకి తేవడంలో సఫలీకృతమైన కాంగ్రెస్ పార్టీ ఫలితాల తర్వాత అదే ఐక్యతను కొనసాగించడానికి ఇబ్బందులు పడుతోంది. కర్ణాటక అసెంబ్లీ గడువు ఈ నెల 24తో ముగియనుంది. తాజా ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజారిటీ సాధించిన కాంగ్రెస్ ఆలోపు ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంది. -
సీఎం ఈయనే.. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అభిమానుల పోస్టర్ వార్..
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అందరి దృష్టి సీఎం ఎంపికపైనే ఉంది. సీనియర్ లీడర్ సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌లలో అధిష్టానం ముఖ్యమంత్రిగా ఎవరిని ఖరారు చేస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ ఇద్దరి నేతల అభిమానులు మాత్రం పోస్టర్ల వార్‌కు దిగారు. తమ నేతనే సీఎంగా ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తూ డీకే ఫ్యాన్స్ ఆయన ఇంటి ముందు బ్యానర్లు ఏర్పాటు చేశారు. అటు సిద్ధరామయ్య మద్దతుదారులు కూడా తమ నేతనే సీఎంగా ప్రకటించాలని ఆయన నివాసం బయట పోస్టర్లు కట్టారు. దీంతో అధిష్టానం నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. #WATCH | Karnataka Congress President DK Shivakumar's supporters put up a poster outside his residence in Bengaluru, demanding DK Shivakumar to be declared as "CM" of the state. pic.twitter.com/N6hFXSntJy — ANI (@ANI) May 14, 2023 #WATCH | Supporters of senior Congress leader Siddaramaiah put up a poster outside Siddaramaiah's residence in Bengaluru, referring to him as "the next CM of Karnataka." pic.twitter.com/GDLIAQFbjs — ANI (@ANI) May 14, 2023 మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ.. పోస్టర్లు, బ్యానర్లు కట్టినంత మాత్రాన వారిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయరని పేర్కొన్నారు. అధిష్టానమే అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకుని సీఎం ఎవరనేదని ఖరారు చేస్తుందని వ్యాఖ్యానించారు. కాగా.. సీఎం ఎంపిక కోసం కర్ణాటక శాసనసభ పక్షం బెంగళూరులో సమావేశమైంది. ఈ భేటీకి ఏఐసీసీ పరీశీలకులుగా సుషీల్ కుమార్ షిండే, దీపక్ బవారియా, భన్వార్ జీతేంద్ర సింగ్ హాజరవుతున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణయాన్ని అధిష్టానానికి నివేదికలో సమర్పించనున్నారు. నివేదిక అందిన అనంతరం కర్ణాటక సీఎం ఎవరని అధిష్టానం ప్రకటించనుంది. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుంది. ఎన్నో త్యాగాలు చేశా.. సిద్ధ రామయ్యతో తనకు ఎలాంటి విభేదాలు లేవని డీకే శివకుమర్ మరోమారు స్పష్టం చేశారు. పార్టీ కోసం ఎన్నోసార్లు త్యాగం చేసి ఆయనకు మద్దతుగా నిలిచానని తెలిపారు. సిద్ధరామయ్యకు పూర్తి సహకారం అందించినట్లు సీఎల్పీ సమావేశానికి ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. చదవండి: కర్ణాటకలో కాంగ్రెస్ విజయదుందుభి.. 135 సీట్లతో భారీ మెజార్టీ -
కర్ణాటకలో కాంగ్రెస్ విజయదుందుభి.. 135 సీట్లతో భారీ మెజార్టీ
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఐదేళ్ల తర్వాత తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది. మొత్తం 224 స్థానాలకు గానూ మెజార్టీకి 113 సీట్లు అవసరం కాగా.. కాంగ్రెస్ 135 స్థానాలు కైవసం చేసుకుని తిరుగులేని విజయం సాధించింది. హస్తం పార్టీ దెబ్బకు 14 మంది బీజేపీ మంత్రులు పరాభవం చవిచూశారు. ఎన్నికల్లో విజయదుందుభి మోగించడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. బాణసంచా పేల్చి, మిఠాయిలు పంచి ఆనందం వ్యక్తం చేశాయి. మరోవైపు ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ ఘోర పరాభవం చవిచూసింది. ఆ పార్టీ కేవలం 66 స్థానాలకే పరిమితమైంది. కాగా.. కింగ్ మేకర్ అవుతుందని భావించిన జేడీఎస్ 19 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఇతరులు నాలుగు చోట్ల గెలిచారు. ఓటింగ్ శాతం ఎంతంటే.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 43 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీకి 36 శాతం, జేడీఎస్‌కు 13.3 శాతం ఓట్లు పోలయ్యాయి. మిగతా ఏ పార్టీలు అంతగా ప్రభావం చూపలేకపోయాయి. మరోవైపు కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. ఆదివారం బెంగళూరులో సీఎల్పీ సమావేశం నిర్వహించనుంది. సీఎం అభర్థిని ఖరారు చేసిన అనంతరం సాయంత్రం వెళ్లి గవర్నర్‌ను కలవనుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీ ఉందని లేఖ అందించనుంది. కాగా.. కర్ణాటక సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. రేసులో సీనియర్ లీడర్ సిద్ధ రామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఉన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం వీరిలో ఒక్కరిని ఖరారు చేయనుంది. సీఎం ఎవరనే విషయాన్ని సోనియా గాంధీ, రాహుల్ గాంధీలే నిర్ణయిస్తారని ఇద్దరు నేతలు చెబుతున్నారు. కొన్ని గంటల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కలిసొచ్చిన రాహుల్ భారత్ జోడో యాత్ర.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రభావం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా కన్పించింది. ఆయన యాత్ర సాగిన నియోజకవర్గాల్లో 73 శాతం సీట్లను కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసుకుంది. దక్షిణాదిలో వాడిపోయిన కమలం.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో దక్షిణాదిలో అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రాన్ని బీజేపీ కోల్పోయినట్లైంది. కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కమలం పార్టీ ఏ ప్రభుత్వంలోనూ భాగంగా లేదు. కర్ణాటక మినహా మిగతా రాష్ట్రాల్లో ఆ పార్టీ ప్రభావం అంతంతమాత్రంగానే ఉంది. మరోవైపు కర్ణాటక ఫలితాలు ఇచ్చిన జోష్‌తో తెంలగాణలోనూ అధికారంపై కాంగ్రెస్ గురిపెట్టింది. చదవండి: కాంగ్రెస్ విజయానికి కారణమైన 6 మంత్రాలివే.. -
అదిరిపోయిన ఎన్నికల ఫలితాలు.. ఏడ్చేసిన డీకే శివకుమార్
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయదుందుబి మోగించడంతో పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ భావోద్వేగానికి లోనయ్యారు. మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. కాంగ్రెస్‌కు విజయాన్నందించి తమపై విశ్వాసం ఉంచిన కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ విజయం కోసం శ్రమించిన ప్రతిఒక్కరిని అభినందించారు. కార్యకర్తల కష్టానికి తగిన ఫలితం దక్కిందన్నారు. కలసికట్టుగా పనిచేస్తే కాంగ్రెస్ కచ్చితంగా విజయం సాధిస్తుందని ఎన్నికలకు ముందే తాను చెప్పానని, అందరం సషష్టిగా కృషి చేయడం వల్లే అద్భుత ఫలితాలు వచ్చాయని డీకే చెప్పారు. సిద్ధరామయ్య సహా విజయానికి కృషి చేసిన కాంగ్రెస్ పార్టీలోని ప్రతి నాయకుడికి, కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే బీజేపీ తనపై తప్పుడు కేసులు మోపి జైల్లో పెట్టినప్పుడు సోనియా గాంధీ తనను చూసేందుకు వచ్చారని గుర్తు చేసుకుని డీకే ఏమోషనల్ అయ్యారు. తాను ఎలాంటి బెదిరింపులకు లొంగకుండా జైలుకెళ్లేందుకు సిద్ధపడ్డానని పేర్కొన్నారు. తనకు అండగా నిలిచిన గాంధీ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటకలో ఎలాగైనా కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తామని సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు చెప్పామని, ఇప్పుడు ప్రజల తీర్పు తమవైపే ఉండటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. #WATCH | Karnataka Congress President DK Shivakumar gets emotional on his party's comfortable victory in state Assembly elections pic.twitter.com/ANaqVMXgFr — ANI (@ANI) May 13, 2023 కాగా.. కనకపుర స్థానం నుంచి వరుసగా నాలుగోసారి గెలుపొందారు డీకే శివకుమార్. సీఎం పగ్గాలు ఆయన చేపడతారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. పూర్తి ఫలితాల తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు? Follow https://t.co/Fg8UHp5DxE for #KarnatakaElection #KarnatakaElectionResults #KarnatakaElections2023 latest updates — Sakshi TV Official (@sakshitvdigital) May 13, 2023 మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో మెజార్టీకి 113 స్థానాలు అవసరం. ప్రస్తుతం కాంగ్రెస్ 130 స్థానాలకుపైగా మెజార్టీతో దూసుకుపోతోంది. బీజేపీ కేవలం 65 స్థానాలకే పరిమితమైంది. జేడీఎస్ కేవలం 21 స్థానాల్లో ఆదిక్యం కనబరుస్తోంది. చదవండి: కాంగ్రెస్ విజయానికి కారణమైన 6 మంత్రాలివే.. -
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. కాంగ్రెస్ గెలుపు సంబరాలు (ఫొటోలు)
-
కాంగ్రెస్ ని గెలిపిస్తే వందేమాతరం,జై శ్రీరామ్ బ్యాన్ చేస్తారు...
-
Karnataka assembly election 2023: ‘సార్వత్రిక’ విజయానికి ఈ ఎన్నికలే సింహద్వారం
బెంగళూరు: కర్ణాటకలో శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని రాష్ట్రంలో ఆ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక పీసీసీ సారథి డీకే శివకుమార్ బల్లగుద్ది చెప్పారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన పలు విషయాలు చెప్పారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ► నా 35 ఏళ్ల రాజకీయ అనుభవం, సర్వే ఫలితాలను అనుసరించి చెప్తున్నా.. కన్నడ నాట ఈసారి 141 శాసనసభ స్థానాల్లో విజయఢంకా మోగిస్తాం ► దక్షిణభారతంలో మోదీమేనియా పనిచేయదు. ఇక్కడ స్థానిక, అభివృద్ధి అంశాలే ఎన్నికల్లో కీలకంగా నిలుస్తాయి ► ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల విజయానికి సింహద్వారంగా నిలుస్తుంది ► గెలిచాక పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయ్యేది సిద్దరామయ్యనా లేక నేనా అనేది అనవసర చర్చ. ఇక్కడ బీజేపీని ఓడించడమే అసలైన లక్ష్యం. ► రాష్ట్రం జ్ఞాన రాజధాని. బీజేపీవారు హిజాబ్, హలాల్ వంటి నాటకాలు ఆడుతున్నారు. కర్ణాటక ప్రజల్లో ఎంతో పరిణతి ఉంది. రాష్ట్రాభివృద్ధికి ఇలాంటివి కొత్త సమస్యలు తెస్తాయని జనం భయపడుతున్నారు ► బీజేపీ అగ్రనేతల మేజిక్ ఇక్కడ పనిచేయదు. తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్‌లలో మోదీ ఛరిష్మా పనిచేసిందా? ప్రజల కడుపు నింపితేనే, చక్కని పాలన అందిస్తేనే మీ గురించి జనం ఆలోచిస్తారు. ఈసారి ఇక్కడా జరిగేది అదే. -
‘సినిమావాళ్లు వస్తుంటారు.. పోతుంటారు’
బెంగళూరు: కన్నడ స్టార్ కిచ్చా సుదీప్.. బీజేపీకి మద్దతు ప్రకటించడం అక్కడి సీనీ, రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ ఈ పరిణామంపై స్పందించింది. రాజకీయాలు, సినిమాలు వేరని, అవి ఒకదానిపై మరొకటి ప్రభావం చూపెట్టబోవని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ చెబుతున్నారు. సుదీప్ బీజేపీకి మద్దతు ప్రకటించడం.. ఎన్నికల్లో ఏమేర ప్రభావం చూపెట్టే అవకాశం ఉందని గురువారం మీడియా నుంచి శివకుమార్‌కు ప్రశ్న ఎదురైంది. ‘‘అది ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించబోదని నేను భావిస్తున్నా. ఎంతో మంది సినిమావాళ్లు వచ్చారు, వెళ్లారు. సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు. అవి ఎలాంటి పరిణామాలు చూపించబోవు. సినిమా వాళ్ల సపోర్ట్‌తో గెలుస్తుందనుకోవడం బీజేపీ భ్రమ’’ అని శివకుమార్ చెప్పారు. ఇదిలా ఉంటే.. నటుడు సుదీప్ బుధవారం కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి తన మద్దతు ప్రకటించారు. తాను బీజేపీలో చేరబోనని, ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని, కేవలం బొమ్మైకి మద్దతు ఇచ్చేందుకు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ప్రకటించారు. నాకు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. డబ్బు కోసమో మరే అవసరం కోసమో ఇక్కడికి రాలేదు. కేవలం.. ఒకేఒక వ్యక్తి కోసం వచ్చా. సీఎం మామ(బొమ్మైని ఉద్దేశించి..)తో నాకు వ్యక్తిగతంగా అనుబంధం ఉంది. కేవలం ఆయనకు మద్దతు తెలిపేందుకే వచ్చా. ఆయన చెప్పిన అభ్యర్థిని నేను ప్రచారం చేస్తా. అంతేగానీ నేను రాజకీయాల్లోకి రాను. సినిమాలు తీయడమే నా అభిమానులకు ఇష్టం అంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో సుదీప్‌ను కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆయన నివాసంలో కలిశారు. దీంతో సుదీప్ కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు ప్రచారం జరిగింది. అయితే అది రాజకీయ భేటీ కాదని, కేవలం వ్యక్తిగత కారణాలతో కలిశారని సుదీప్ సన్నిహితులు ఆ సమయంలో వెల్లడించారు. అంతకు ముందు సిద్ధరామయ్యతో, జేడీఎస్ కుమారస్వామిని సైతం సుదీప్ పలుమార్లు కలిశారు. మరోవైపు బీజేపీకి సుదీప్ మద్దతు ఇచ్చే అంశాన్ని కన్నడ పార్టీలు, పలువురు సెలబ్రిటీలు జీర్ణించుకోలేకపోతున్నారు. తొలుత అది ఉత్త ప్రచారమై ఉంటుందన్న నటుడు ప్రకాష్ రాజ్.. సుదీప్ చేరికపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆపై ట్విటర్లో.. ‘‘డియర్ సుదీప్ గారూ.. అందరూ ఇష్టపడే ఆర్టిస్ట్ గా... మీరు ప్రజల గొంతుక అవుతారని అనుకున్నాను. కానీ మీరు రాజకీయ పార్టీతో మిమ్మల్ని మీరు రంగులు మార్చుకోవాలని ఎంచుకున్నారు. సరే.. ప్రతి పౌరుడు ఇకపై మిమ్మల్ని, మీ పార్టీని ప్రశ్నిస్తుంటాడు. సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి అంటూ ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్లు చేశారు. Dear Sudeep.. as an artist loved by everyone one.. I had expected you to be a voice of the people. But you have chosen to colour yourself with a political party .. WELL .. Get ready to answer ..every question a citizen will ask YOU and YOUR party .@KicchaSudeep #justasking — Prakash Raj (@prakashraaj) April 6, 2023 The weight you have to carry now .. ನೀವು ಈಗ ಹೊರಲೇಬೇಕಾದ ಬೇರೆ ಬಣ್ಣದ ಲೊಕದ ಭಾರ .. #justasking https://t.co/ygF75aEaJu — Prakash Raj (@prakashraaj) April 6, 2023 ఇక జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి స్పందిస్తూ.. బొమ్మైని గౌరవించడం వల్లే ఆయన తరపున ప్రచారం చేసేందుకు సుదీప్ అంగీకరించారు. అభివృద్ధి విషయంలో బీజేపీ విఫలమైంది. ఎన్నికల్లో గెలవడానికి సినిమా నటులను వాడుకోవాలని బీజేపీ యత్నిస్తోంది. అది వర్కవుట్ కాదు. సినిమా నటులను చూసేందుకు జనం వస్తుంటారు. సెలబ్రిటీలు అన్ని పార్టీలకు ప్రచారం చేస్తారు. అలాగే.. వాళ్లు ఏ పార్టీకి పరిమితం కాదు అని కుమారస్వామి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. కర్ణాటకలో సుదీప్‌కు మాస్ ఫాలోయింగ్ ఉంది. నాయక సామాజిక వర్గానికి చెందిన 51 ఏళ్ల సుదీప్ మద్దతుద్వారా తమ పార్టీ విజయావకాశాలు మెరుగుపడతాయని బీజేపీ ఆశిస్తోంది. కర్ణాటకలో షెడ్యూల్ కులాల కిందకు వచ్చే నాయక సామాజిక వర్గం.. కళ్యాణ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఉంది. ఆ వర్గం ఓటు బ్యాంకుతో పాటు సుదీప్‌కు ఉన్న ఫాలోయింగ్ కూడా తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. కాంగ్రెస్ రెండో జాబితా విడుదల బనశంకరి: కర్ణాటక అసెంబ్లీకి మే 10వ తేదీన జరగనున్న ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మరో 42 మంది అభ్యర్థులతో గురువారం రెండో జాబితా విడుదల చేసింది. పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్దరామయ్య వరుణ సీటుతోపాటు మరో చోటు నుంచి పోటీకి దిగుతారని భావిస్తున్న కోలారు స్థానం ఇందులో లేవు! ముగ్గురు సిట్టింగ్‌లకు టికెట్లు దక్కలేదు. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన ముగ్గురికీ చోటు దక్కింది. 124 మందితో కాంగ్రెస్ ఇప్పటికే తొలి జాబితా విడుదల చేయడం తెలిసిందే. -
అధిష్టానం ఆ పని చేయబోదు: సిద్ధరామయ్య
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతున్న వేళ.. మరోవైపు జాతీయ పార్టీలు రెండూ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై వేచిచూసే ధోరణినే అవలంభిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ నుంచి మాత్రం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల పేర్లు ప్రధానంగా తెర మీద వినిపిస్తున్నాయి. అయితే.. సీఎం ఎవరనే నిర్ణయం పార్టీ అధిష్టానం చేతులో కూడా ఉండదని అంటున్నారు కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య. కాంగ్రెస్‌కు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు చాలా కీలకం. అధికార రాష్ట్రాలను ఒక్కొక్కటిగా చేజార్చుకుంటూ పోతున్న హస్తానికి.. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు ఒక బూస్ట్‌గా పని చేయడానికైనా కన్నడనాట విజయం రుచిచూడాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే.. సీఎం అభ్యర్థి విషయంలో అక్కడ సిద్ధరామయ్యకు, పార్టీ చీఫ్ డీకే శివకుమార్ మధ్య గట్టి పోటీ నెలకొంది. పైగా ఈ ఇద్దరి మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న విభేదాల కారణంగా.. సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారు? ఆపై పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి సైతం నెలకొంది. ఈ క్రమంలో.. సీఎం అభ్యర్థిత్వంపై ఉన్న పోటీపై సిద్ధరామయ్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. నేను కూడా ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న వాడినే. అలాగే.. డీకే శివకుమార్ కూడా. కానీ, పార్టీ అధిష్టానం మాత్రం శివకుమార్‌కు సీఎం పదవి కట్టబెట్టదు.. బెట్టలేదు కూడా అని సిద్ధరామయ్య తేల్చారు. ఎందుకంటే.. ‘‘కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఎంపికలో అధిష్టానం జోక్యం చేసుకోదు. అది ఏనాడూ జరగబోదు కూడా. ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ సీఎం ఎంపిక ఉంటుంది. గెలిచిన ఎమ్మెల్యేల ఎంపిక చేసిన వ్యక్తే ముఖ్యమంత్రి అవుతాడు’’ అంటూ తెలిపారు. ఇక.. సీఎం పదవికి యువనాయకత్వాన్ని ఎందుకు అంగీకరించబోరన్న ప్రశ్నకూ.. ఆయన భిన్నంగా స్పందించారు. నాకిప్పుడు 75 ఏళ్లు. ఒకరకంగా ఇదే నా చివరి ఎన్నిక అంటూ దాటవేత సమాధానం ఇచ్చారు. 2020 జులైలో.. సిద్ధరామయ్య నమ్మకస్తుడిగా ఉన్న దినేష్ గుండును తప్పించి మరీ ట్రబుల్ షూటర్‌గా పేరున్న శివకుమార్‌కు పార్టీ పగ్గాలు అప్పజెప్పింది కాంగ్రెస్ అధిష్టానం. అప్పటి నుంచి సిద్ధరామయ్య-శివకుమార్‌ల వైరం మరింతగా ముదిరింది. అయితే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా ఒక్కటిగా కనిపించిన ఈ నేతలు.. అటుపై ఫిబ్రవరిలో విడివిడిగా బస్సు యాత్రలో నిర్వహించి ఎవరిదారి వారిదేనని చాటిచెప్పారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపిక సమయంలోనూ వీళ్ల విభేధాల ప్రభావం పడుతోంది. అయితే ఈ ఇద్దరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్న అంశం ఏదైనా ఉందా అంటే.. కర్ణాటక అసెంబ్లీలో హంగ్ ఫలితం, జేడీఎస్‌తో పొత్తూ ఈ రెండు ప్రచారాలను తోసిపుచ్చడం.. కాంగ్రెస్ ఘన విజయంతో తిరిగి కన్నడనాట అధికారంలో వస్తుందనే ధీమా వ్యక్తం చేయడం మాత్రమే. -
నేనెందుకు రాజీనామా చేయాలి? : సీఎం బొమ్మై
హుబ్లీ: రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతానికి మహారాష్ట్ర సర్కారు నుంచి నిధులు కేటాయిస్తే తానెందుకు రాజీనామా చేయాలని సీఎం బొమ్మై ప్రశ్నించారు. బెళగావిలో ఆయన మీడియాతో మాట్లాడారు. డీకే.శివకుమార్ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలోని సరిహద్దు గ్రామాలకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.54 కోట్లను విడుదల చేసిన అంశంపై కేపీసీసీ అధ్యక్షులు డీకే.శికుమార్ తన రాజీనామాకు డిమాండ్ చేసిన విషయంపై సీఎం పైవిధంగా స్పందించారు. తాము కూడా మహారాష్ట్రలోని పండరాపుర, తులజాపుర వెళ్లిన కర్ణాటక వారికి నిధులు విడుదల చేశామన్నారు. మహారాష్ట్ర సర్కారు ఏ నిధులు మంజూరు చేసిందో పరిశీలిస్తానన్నారు. మహారాష్ట్ర అభ్యంతరాలను ఏ విధంగా ఎదుర్కోవాలో సమీక్షిస్తానన్నారు. నేల, నీరు, భాష సరిహద్దు రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్ నేతలు అనవసరంగా రాష్ట్ర ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఆ తర్వాత ఆయన హుబ్లీకి వచ్చి స్వగ్రామంకమడొళ్లిలోని బంధువులను, స్నేహితులను కలిసి ఎంతో ఉద్వేగానికి గురయ్యారు. -
Bharat Jodo Yatra: అడుగులో అడుగేస్తూ..
పాండవపుర: కర్ణాటకలో కొనసాగుతున్న కాంగ్రెస్ భారత్ జోడోయాత్రలో గురువారం పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పాలుపంచుకున్నారు. కుమారుడు రాహుల్ గాంధీతో కలిసి అడుగులో అడుగువేస్తూ ముందుకు సాగారు. అనారోగ్యంలో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందిన సోనియా చాలారోజుల తర్వాత ప్రజలకు దర్శనమిచ్చారు. ఆమె గత ఏడాది కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఆ తర్వాత ప్రజల మధ్యకు రావడం ఇదే తొలిసారి. ఆమె చివరిసారిగా 2016 ఆగస్టులో వారణాసిలో ఓ రోడ్డుషోలో పాల్గొన్నారు. పార్టీ అధినేత్రి ఆగమనం పట్ల పాదయాత్రలో పార్టీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నినదాలు చేశారు. వారిలో ఉత్సాహం పరవళ్లు తొక్కింది. మాండ్యా జిల్లాలోని జక్కనహళ్లి, కరాడ్యా పట్టణాల మధ్య రాహుల్ వెంట కొన్ని కిలోమీటర్ల మేర సోనియా వడివడిగా అడుగులు వేశారు. ఈ అరుదైన ఘట్టానికి ప్రధాన స్రవంతి మీడియాతోపాటు సోషల్ మీడియాలోనూ మంచి స్పందన లభించింది. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా రాహుల్, సోనియాతో పాదయాత్రలో పాల్గొన్నారు. గతంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నామని, పెనుగాలులకు ఎదురొడ్డి నిలిచామని, సవాళ్లకు ఉన్న పరిమితులను బద్దలు కొడతామని రాహుల్ పేర్కొన్నారు. అందరం కలిసి దేశాన్ని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లాలన్నదే తమ ఆశయమని ట్వీట్ చేశారు. అన్ని సవాళ్లను అధిగమించి, దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొస్తామని వివరించారు. పాదయాత్రలో తన తల్లి సోనియా గాంధీ భుజాలపై తాను చేతులు వేసిన చిత్రాన్ని పోస్టు చేశారు. వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోను ట్విట్టర్లో కాంగ్రెస్ పార్టీ షేర్ చేసింది. వారికి ప్రేమే రక్షణ కవచమని పేర్కొంది. తల్లి పూజ్యనీయురాలు భారత్ జోడో యాత్రలో ఆసక్తికరమైన సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. సోనియా భుజాలపై చేతులు వేసి రాహుల్ నడవడం అందరి దృష్టిని ఆకర్శించింది. పాదయాత్రలో నడుస్తుండగా సోనియా బూట్ల లేసులు ఊడిపోయాయి. రాహుల్ వెంటనే కిందకు వంగి వాటిని గట్టిగా బిగించికట్టారు. ఈ చిత్రాన్ని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీనిపై పార్టీ సీనియర్ నేత శశి థరూర్ స్పందించారు. తల్లి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని, అమ్మంటే అమ్మే అని పేర్కొన్నారు. తల్లి పూజ్యనీయురాలు అంటూ సోషల్ మీడియాలోనూ నెటిజన్లు కామెంట్లు చేశారు. యాత్రలో సోనియాను చూసేందుకు జనం బారులుతీరారు. ఆమె వారివైపు చేతులు ఊపుతూ అభివాదం చేశారు. రాహుల్ సైతం ప్రజలతో కరచాలనం చేశారు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం సోనియా కేవలం 30 నిమిషాలపాటు యాత్రలో పాల్గొనాలి. కానీ, రెండు గంటలకుపైగానే భాగస్వాములు కావడం విశేషం. భారత్ జోడో యాత్రతో సోనియా మమేకమయ్యారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ట్వీట్‌చేశారు. యాత్ర ముగిశాక సోనియాగాంధీ గురువారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. -
నేషనల్ హెరాల్డ్ కేసులో డీకే సోదరులకు ఈడీ సమన్లు
బనశంకరి: నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, ఆయన సోదరుడు, బెంగళూరు రూరల్ ఎంపీ డీకే సురేశ్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆదివారం సమన్లు జారీ చేసింది. ఈ నెల 7వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు పిలిచారు. నేషనల్ హెరాల్డ్ పత్రికను కొనుగోలు చేసిన యంగ్ ఇండియా ట్రస్ట్‌కు డీకే సోదరులు చెక్ ఇచ్చినట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఈడీ సమన్లపై శివకుమార్ స్పందించారు. ఈడీకి తనపై చాలా ప్రేమ ఉందని, అందుకే పదేపదే సమన్లు పంపిస్తోందని అన్నారు. ఈ నెల 7వ తేదీన రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో తాను తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉందని, విచారణకు హాజరు కావడానికి మరో గడువు ఇవ్వాలని కోరుతూ ఈడీకి మెయిల్ చేశామని చెప్పారు. -
Karnataka: పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఇంట్లో సీబీఐ సోదాలు
సాక్షి, బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ నివాసం, ఆయనకు సంబంధించిన ఇతర ప్రాంతాల్లో సీబీఐ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. రామనగర జిల్లాలోని ఆయన స్వగ్రామంతోపాటు కనకపుర, దొడ్డనహళ్లి, సంతే కొడిహళ్లిలో ఈ సోదాలు జరిగాయి. శివకుమార్‌కు చెందిన ఆస్తులు, భూములు, వాటికి సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలించారు. కనకపుర తహసిల్దార్‌ను కలుసుకున్నారు. శివకుమార్ ఆస్తుల వివరాలపై ఆరా తీశారు. 2017లో శివకుమార్ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులు చేపట్టింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించింది. అనంతరం ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), తర్వాత సీబీఐ పరిధిలోకి వచ్చింది. శివకుమార్‌పై దర్యాప్తు కొనసాగించేందుకు 2019 సెప్టెంబర్ 25న కర్ణాటక ప్రభుత్వం సీబీఐకి అనుమతి మంజూరు చేసింది. మానసికంగా వేధిస్తున్నారు సీబీఐ దాడులపై డీకే శివకుమార్ స్పందించారు. దాడుల పేరుతో తనను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. ‘నేను చట్టాన్ని గౌరవిస్తాను. వాళ్లు అడిగిన పత్రాలు ఇప్పటికే ఇచ్చాను. అయినప్పటికీ వారు నా ఆస్తులను తనిఖీ చేశారు. ఎంతోమంది ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ నా కేసులో మాత్రమే సీబీఐకి అనుమతి లభించింది. సీబీఐ నాపై మాత్రమే ఎందుకు దర్యాప్తు చేస్తోంది?’ అని శివకుమార్ ప్రశ్నించారు. చదవండి: అక్టోబర్‌లో అమిత్ షా పర్యటన.. జమ్మూ కశ్మీర్లో జంట పేలుళ్ల కలకలం -
ఎక్కడికీ పారిపోలేదు.. రాజీనామా చేశా
బెంగళూరు: తాను ఎక్కడికి పారిపోలేదని, వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేశానని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మాజీ అధ్యక్షురాలు, నటి దివ్య స్పందన(రమ్య) తెలిపారు. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేయమని కాంగ్రెస్ తన కార్యకర్తలను ఆయన ఆదేశించారని ట్విటర్లో పేర్కొన్నారు. మోసం చేయలేదు ‘నేను బయటికి వచ్చాక నా విశ్వసనీయతను దెబ్బతీసేందుకు, ప్రత్యేకించి కన్నడ వార్తా ఛానళ్లలో ‘ఆమె కాంగ్రెస్ పార్టీని ఎనిమిది కోట్లకు మోసం చేసి పారిపోయింది’ అనే కథనాన్ని నాటారు. నేను పారిపోలేదు. నా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేశాను. నేను కచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఎనిమిది కోట్లకు మోసం చేయలేదు. నిశ్శబ్దంగా ఉండటమే నా తప్పయింద’ని దివ్య స్పందన ట్వీట్ చేశారు. అసలేంటి వివాదం? పోలీస్ సబ్-ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ స్కామ్‌పై డీకే శివకుమార్ చేసిన ప్రకటనతో వివాదం మొదలైంది. పోలీస్ సబ్-ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ స్కామ్‌లో బహిరంగ వేదికలపై తనను ప్రశ్నించకుండా రక్షణ కోరుతూ ఉన్నత విద్యాశాఖ మంత్రి సీఎన్ అశ్వత్‌నారాయణన్.. కాంగ్రెస్ నాయకుడు ఎంబీ పాటిల్‌ను కలిశారని శివకుమార్ వెల్లడించారు. దీనిపై రమ్య స్పందిస్తూ.. పార్టీలకు అతీతంగా నాయకులు కలుసుకోవడం తప్పేంటని ప్రశ్నించారు. నిబద్దత కలిగిన కాంగ్రెస్‌వాది అయిన ఎంబీ పాటిల్ గురించి శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగించాయని ట్వీట్ చేశారు. ఇన్నాళ్లు ఏమైపోయారు? ఈ నేపథ్యంలో ట్విటర్ వేదికగా శివకుమార్ మద్దతుదారులు రమ్యను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఇన్నాళ్లు ఏమైపోయారని, ఇప్పుడే మేల్కొన్నారా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. శివకుమార్ ఆదేశాలకు అనుగుణంగానే ఇదంతా జరుగుతోందని రమ్య ఆరోపించారు. ఈ వ్యవహారంపై స్పందించాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కోరారు. ముందే రాజీనామా నిర్ణయం నటి రమ్య 2012లో యూత్ కాంగ్రెస్ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2013లో ఆమె మాండ్య లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికల్లో గెలిచారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ వేవ్‌లో ఆమె ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షురాలిగా పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత ఆ పదవికి రాజీనామా చేశారు. అయితే ఎన్నికల ఫలితాలు రావడానికి ముందే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు రమ్య వెల్లడించారు. ఇటీవల తరచుగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నప్పటికీ.. రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. (చదవండి: మత మార్పిడుల నియంత్రణకు ఆర్డినెన్స్) -
మంత్రి ఈశ్వరప్ప కేసులో ట్విస్టులు.. ఎఫ్ఐఆర్పై మరో వివాదం
సాక్షి, బెంగళూరు: కర్నాకటలో కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య పెను దుమారం రేపుతోంది. ఈ కేసు విషయంలో ఇప్పటికే మంత్రి ఈశ్వరప్ప రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా, ఆత్మహత్య వివాదం మాత్రం ఇంకా ముగిసిపోలేదు. కాంట్రాక్టర్ ఆత్మహత్య విషయంలో కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ కేసులో మంత్రి ఈశ్వరప్ప రాజీనామా పరిష్కారం కాదన్నారు కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్. కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ అనుమానాస్పద మృతి కేసులో ఈశ్వరప్పపై కేసు నమోదు చేసి.. ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్‌ను ఈశ్వరప్ప 40 శాతం కమీషన్ అడిగినట్లు ఎఫ్ఐఆర్లో ఎక్కడుందని ప్రశ్నించారు. అవినీతి నిరోధక చట్టం కింద ఎందుకు కేసు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈశ్వరప్పపై కేసు నమోదు చేయాలన్నది కర్ణాటక ప్రజల డిమాండ్ అని శివకుమార్ అన్నారు. ఈశ్వరప్ప, అతని స్నేహితులు రమేశ్, బసవరాజ్‌ను కూడా అరెస్టు చేయాలని శివకుమార్ కోరారు. విచారణ ప్రారంభించకముందే ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. -
KS Eshwarappa Issue: అనని మాటలకు రాద్ధాంతం చేస్తున్నారు
Karnataka Assembly showdown: బీజేపీ నేత అత్సుత్సాహ ప్రకటన.. కర్ణాటక నాట రాజకీయ చిచ్చును రగిల్చింది. జాతీయ జెండా స్థానంలో ఏదో ఒకరోజు కాషాయపు జెండా ఎర్రకోటపై ఎగిరి తీరుతుందని బీజేపీ నేత, ఆ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కే.ఎస్.ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు ఊహించని పరిణామాలకు దారి తీస్తున్నాయి. ఈ క్రమంలో.. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, ప్రతిపక్ష కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. అసలు ఈశ్వరప్ప అలాంటి వ్యాఖ్యలే చేయలేదని వెనకేసుకొచ్చారు కర్ణాటక సీఎం. ‘ఈశ్వరప్ప.. ఎర్రకోట జెండాపైనా కాషాయపు జెండా ఎగురుతుందని ఏనాడూ అనలేదు. అదంతా అబద్ధం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన అర్థం పర్థం.. ఓ విలువంటూ లేనిది. కేవలం ఇగో, రాజకీయాల కోసం వాళ్లు అలా చేస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ చరిత్రలోనే ఇలాంటి పరిణామాలెన్నడూ జరగలేదు. ఇది కనీసం ప్రజా సమస్య కూడా కాదు. గతంలో ప్రజల కోసం రాజకీయ పోరాటాలు సాగేవి. ఇప్పుడు వీళ్లు చేస్తోంది అర్థం పర్థం లేనిది. ప్రతిపక్షాలు వాళ్లు ఏం చేయాలో మరిచిపోయినట్లు ఉన్నారు’’ అంటూ సీఎం బసవరాజ్ బొమ్మై శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈశ్వరప్ప తప్పుకోవాల్సిందే! సీఎం బసవరాజ్ బొమ్మై వ్యాఖ్యలకు కర్ణాటక కాంగ్ చీఫ్ డీకే శివకుమార్ స్పందించారు. ‘కాషాయపు జెండా వ్యాఖ్యలపై ఈశ్వరప్ప రాజీమానా చేయాల్సిందే. ఆయన్ని తొలగించేంత వరకు రాత్రింబవలు మా నిరసన కొనసాగుతూనే ఉంటాయి. అయినా పట్టించుకోకపోతే.. కోర్టుకు వెళ్తాం. అసెంబ్లీని స్తంభింపజేస్తాం. జాతీయ జెండాను అవమానపర్చడమే బీజేపీ ఒక ఎజెండాగా పెట్టుకుంది. రాజ్యాంగం గురించి.. జాతీయ జెండా గురించి ఏమాత్రం అవగాహన లేని వాళ్లు ఆ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ జెండాను, స్వాతంత్ర్యాన్ని దేశానికి అందించింది. వాళ్లేమో(బీజేపీ) ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు’ అంటూ శివకుమార్ స్పందించారు. Karnataka Minister KS Eshwarappa must resign (over his saffron flag remark). We'll continue overnight protests at Karnataka Assembly till he gets sacked from the Cabinet, otherwise, we'll go to the court & not allow the Assembly to function: Karnataka Congress chief DK Shivakumar pic.twitter.com/IhvLaT9g6g — ANI (@ANI) February 18, 2022 ఇదిలా ఉంటే.. జాతీయ జెండాను అవమానించేలా మాట్లాడిన ఈశ్వరప్ప.. దేశద్రోహం నేరానికి పాల్పడ్డారని, ఆయన్ని తక్షణమే కేబినెట్ నుంచి తప్పించి, దేశద్రోహం కేసు నమోదు చేయించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు కాంగ్ ఎమ్మెల్యేలు విధానసభలో ధర్నా చేస్తున్నారు. దీంతో అసెంబ్లీ సమావేశాలకు విఘాతం కలుగుతోంది. అంతేకాదు.. ఈశ్వరప్పకు వ్యతిరేకంగా రాత్రంతా విధానసభలోనే ధర్నా చేయాలని సీఎల్పీ నాయకుడు సిద్ధరామయ్య ఎమ్మెల్యేలకు సూచించడంతో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్ వసతి, భోజన ఏర్పాట్లను సిద్ధం చేయగా.. ఎమ్మెల్యేలు రాత్రంతా అసెంబ్లీలో ఉంటున్నారు. మరోవైపు ఈశ్వరప్పకు వ్యతిరేకంగా విధానపరిషత్‌లోనూ గందరగోళం నెలకొనటంతో సమావేశం వాయిదాపడుతోంది. దీంతో రంగంలోకి దిగిన అసెంబ్లీ స్పీకర్, మాజీ సీఎం బి.ఎస్.యడ్యూరప్ప సహా పలువురు సీనియర్ నేతలు రంగంలోకి దిగి కాంగ్రెస్‌తో చర్చలు జరిపినా.. లాభం లేకుండా పోతోంది. నేను దేశభక్తుడిని..: ఈశ్వరప్ప నేనే తప్పు చేయలేదు. నేను దేశభక్తున్ని, నేనెందుకు రాజీనామా చేయాలి? అని మంత్రి కే.ఎస్.ఈశ్వరప్ప అంటున్నారు. గురువారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన.. జాతీయ జెండాకు అవమానం చేసింది కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్ అని, ఆయనే రాజీనామా చేయాలన్నారు. ఎర్రకోటపై కాషాయ జెండాను రాబోయే 300–500 సంవత్సరాల్లో ఎగురవేయవచ్చని చెప్పాను అంతే. జాతీయ జెండాను అవమానించలేదు. నా మాటలకు కట్టుబడి ఉన్నా. కాంగ్రెస్ వారికి పని లేక అనవసరంగా వివాదాలు సృష్టించే పని చేస్తున్నారు అని పేర్కొన్నారు. మరోవైపు ఈశ్వరప్పకు వ్యతిరేకంగా పలుచోట్ల కాంగ్రెస్ నాయకులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. -
హిజాబ్ వివాదం విషపూరిత కుట్ర: శివకుమార్
మంగళూరు: కాలేజీల్లో హిజాబ్ ధరించడంపై జరుగుతున్న వివాదం యువత మనసులను విషపూరితం చేసే కుట్రలో భాగమని కాంగ్రెస్ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ అన్నారు. మంగళూరులోని జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వస్త్రధారణపై జరుగుతున్న వివాదాలు మన దేశాన్ని అవమానం పాల్జేచేసేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. నిరుద్యోగం, పెట్రో ధరల పెంపు వంటి ప్రధాన సమస్యలను పరిష్కరించడానికి బదులుగా హిజాబ్ ధరించడం వంటి సున్నితమైన విషయాలను స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీ నాయకులు వాడుకుంటున్నారని విమర్శించారు. విద్యార్థులు, ప్రజల్లో అశాంతి సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాషాయ పార్టీ ఆవిర్భావం నుంచి ఇదే పంథాను అనుసరిస్తోందని గుర్తు చేశారు. రాజ్యాంగంపై అందరికీ విశ్వాసం ఉందని, హిజాబ్ వివాదం త్వరలోనే సమసిపోతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కర్ణాటక కోస్తా ప్రాంతం తనదైన చరిత్ర, సంస్కృతి, మానవ వనరులను కలిగి ఉందని.. ఎడ్యుకేషన్ హబ్‌గా పేరుగాంచిందని శివకుమార్ తెలిపారు. హిజాబ్ వివాదానికి ఆజ్యం పోసి యువత మనసుల్లో విషం నింపే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: కర్ణాటకలో ‘హిజాబ్’పై అదే రగడ) -
సర్కారును మంత్రులే కూల్చేస్తారు: డీకే
సాక్షి, శివాజీనగర(కర్ణాటక): బీజేపీ సర్కారు బలహీనం కాగా, సీఎం బొమ్మై నిస్సహాయుడు అయ్యారు, మంత్రులే ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నా ఏమీ చేయలేకపోతున్నారు అని కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్ హేళన చేశారు. ఆయన సోమవారం బెళగావిలో విలేకరులతో మాట్లాడుతూ మంత్రి కే.ఎస్.ఈశ్వరప్ప ఏమో సీఎం మారతారని అంటారు, మరో మంత్రి మురుగేశ్ నిరాణి కొత్త సీఎం అవుతారంటారు. మంత్రుల వల్ల ఈ ప్రభుత్వం దానంతట అదే కూలిపోతుంది. ప్రతిపక్ష పార్టీల పాత్ర ఇందులో ఉండదు అని జోస్యం చెప్పారు. మాజీ సీఎం యడియూరప్పపై బీజేపీ ఐటీ దాడులు చేయించి, బలవంతంగా రాజీనామా చేయించడంతో ఆయన కన్నీరు కార్చారని చెప్పారు. బీజేపీలోకి చేరలేదని తనను తీహార్ జైలుకు పంపారని ఆరోపించారు. -
కర్ణాటక కాంగ్రెస్‌లో వీడియో కలకలం
బెంగుళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలోకి నెట్టే ఒక వీడియో బహిర్గతమైంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డి.కె. శివకుమార్ అవినీతిని ఆ పార్టీకే చెందిన ఇద్దరు ముఖ్య నేతలు చర్చించుకుంటున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కాంగ్రెస్ మాజీ ఎంపీ వి.ఎస్. ఉగ్రప్ప, మీడియా సమన్వయకర్త ఎంఏ సలీమ్ ఆ వీడియోలో డీకే శివకుమార్ అవినీతిపై చర్చించుకుంటున్నారు. శివకుమార్ రాష్ట్ర మంత్రిగా ఉన్న కాలంలో సాగునీటి ప్రాజెక్టులలో ఆయన అవినీతికి పాల్పడ్డారంటూ మాట్లాడుకుంటున్న వీడియో వైరల్ కావడంతో కాంగ్రెస్ అగ్రనాయకత్వం అప్రమత్తమైంది. ఎంఏ సలీంను పార్టీ నుంచి ఆరేళ్లపాటు సస్పెండ్ చేసింది. ఉగ్రప్పకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. మూడ్రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వీడియో క్లిప్పులో నాయకులు ప్రస్తావించిన అంశాలపై శివకుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వారి మాటల్లో వాస్తవాలు లేవన్నారు. 2018లో కాంగ్రెస్, జేడీ(ఎస్) సంకీర్ణ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న శివకుమార్ ఉన్నారు. ఆ కాలంలో డీకే అవినీతిపై ఆ ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు. ‘ప్రాజెక్టుల్లో మొదట్లో 8 శాతం వాటా ఉండేది. దాన్ని డీకే వచ్చి 12 శాతానికి పెంచారు. ఆయన సహచరుడే రూ.50–100 కోట్లు సంపాదించాడు. అలాంటప్పుడు డీకేకి ఎంత భారీ స్థాయిలో లంచాలు వచ్చి ఉంటాయో ఊహించుకోవచ్చు’ అని సలీం..ఉగ్రప్పకు చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. -
రాసలీలల సీడీ కేసు: రమేశ్‌ని అరెస్టు చేయాలి
బనశంకరి: మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళిని సీడీ కేసులో అరెస్టు చేయాలని కేపీసీసీ అధ్యక్షుడు డీకే.శివకుమార్ డిమాండ్ చేశారు. ఈ కేసులోనే హోంమంత్రి బసవరాజ బొమ్మై రాజీనామా చేయాలని, కేసు వెనుక ఉన్న అందరి పాత్రలు తేలేందుకు స్వతంత్ర సంస్థతో విచారణ జరపాలని విపక్ష నాయకుడు సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడారు. కేసులో అనేక అవకతవకలు జరిగాయని పలు ఉదాహరణలను వివరించారు. రేప్ కేసులో నిందితున్ని అరెస్టు చేయకపోవడం ఇక్కడ మాత్రమే చూస్తున్నామని, సిట్ అధిపతి సౌమేందు ముఖర్జీని సెలవుపై పంపించారని సిద్ధరామయ్య ఆరోపించారు. చదవండి: రాసలీలల సీడీ కేసు అవును.. ఆమె తెలుసు..! -
కొత్త ట్విస్ట్: ‘ఆ పని ఆయనే చేయమన్నాడు..’
బెంగళూరు: రాసలీలల కేసులో మరో కొత్త పరిణామం చోటుచేసుకుంది. ఆ కేసులో ఉన్న బాధిత యువతి సంచలన ఆరోపణలు చేసింది. ‘ఆ పని ఆయన ఒత్తిడి వల్లనే చేశాను’ అని బాధిత యువతి ఆరోపించారు. దీంతో కర్నాటకలో కలకలం రేపింది. ఆమె ఆరోపణలు చేసింది ఎవరిపైనే కాదు ట్రబుల్ షూటర్‌గా పేరొందిన కాంగ్రెస్ కర్నాటక రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివ కుమార్‌పై. ఆయన ఒత్తిడి మేరకు తమ కుమార్తె ఆ పని చేసిందని సోమవారం ఆ యువతి కుటుంబసభ్యులు ఆరోపించారు. రమేశ్ జర్కిహోలీని ఇరికించేందుకు శివకుమార్ కథ అంతా నడిపించాడని బాధిత యువతితో పాటు ఆమె ఇద్దరు సోదరులు, కుటుంబసభ్యులు ఆరోపణలు చేశారు. అలా చేస్తే కొంత ముట్టజెప్తామని చెప్పినట్లు వారు ఆరోపించారు. ఈ ఆరోపణలతో బీజేపీ కాంగ్రెస్ తీరుపై విరుచుకుపడింది. డీకే శివకుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విమర్శలు వచ్చిన తెల్లారి మంగళవారం డీకే శివకుమార్ స్పందించారు. ‘నేరం చేసి అడ్డంగా దొరికిన వ్యక్తి వెనుక ప్రభుత్వం ఉందనే విషయం అందరికీ తెలసు. నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారు’ అని శివకుమార్ మండిపడ్డారు. ‘ఈ పరిణామం జరిగినప్పటి నుంచి మీరు చూస్తునే ఉన్నారు. ప్రభుత్వం నిందితుడికి అండగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నా. ఆ కేసుతో నాకేం సంబంధం లేదు. చూద్దాం. విచారణ జరుగుతోంది కదా!’ అని శివకుమార్ పేర్కొన్నారు. ‘నేను వారిపై ఒత్తిడి చేశా అంటున్నారు దానికి సాక్ష్యాలు బహిర్గతం చేయండి’ అని సవాల్ విసిరారు. -
జార్కిహొళి చాలా డేంజర్.. నన్ను చంపినా చంపొచ్చు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి రాసలీలల కేసులో బాధిత యువతి సస్పెన్స్‌ను కొనసాగిస్తోంది. సోమవారం బెంగళూరులో కోర్టులో లొంగిపోతుందని ఆమె న్యాయవాది జగదీశ్ ఆదివారం చేసిన ప్రకటన ఉత్తుత్తిదేనని తేలింది. రమేశ్ జార్కిహొళిపై పలు ఆరోపణలను చేస్తూ తాజాగా యువతి కర్ణాటక హైకోర్టు సీజేకు రాసిన లేఖను ఆయన సోమవారం విడుదల చేశారు. లేఖలో ఏమి ఉందంటే? ‘‘రమేశ్ జార్కిహొళి ప్రమాదకర వ్యక్తి. సామాన్యులను బెదిరించడమే ఆయన పని. నాకు, నా కుటుంబానికి రక్షణ అవసరం. సిట్‌తో దర్యాప్తు చేయించాలి. జార్కిహొళిపై అత్యాచారం, బెదిరింపులు, మోసం సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ అరెస్టు చేయలేదు. నాకు అన్యాయమే జరిగింది. మీరు (హైకోర్టు సీజే) న్యాయం చేస్తారని ఆశిస్తున్నా. జార్కిహొళి ఏ సమయంలో అయినా నన్ను చంపేస్తాడు’’అని లేఖలో యువతి ఆరోపించింది. సిట్ అధికారులపై నాకు నమ్మకం లేదు. అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నా. జార్కిహోళి ఓ క్రిమినల్. ఆలస్యమైతే సాక్ష్యాలను తారుమారు చేస్తారని భయంగా ఉంది. నాకు బహిరంగ వార్నింగ్‌లు ఇచ్చారు. అందుకే విచారణకు హాజరయ్యేందుకు భయపడుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం జార్కిహొళికి అనుకూలంగా ఉంది. సాక్ష్యాలను తుడిచిపెట్టేందుకు నన్ను హత్య చేయించే అవకాశం లేకపోలేదు’అని ఆరోపణలు చేసింది. మరోవైపు ఆమె హైకోర్టులో హాజరు కావడానికి అనుమతి వచ్చిందని న్యాయవాది జగదీశ్ తెలిపారు. చదవండి: (రాసలీల కేసు: అజ్ఞాతం వీడనున్న యువతి?) సిట్ ముందుకు జార్కిహొళి రమేశ్ జార్కిహొళి సోమవారం సిట్ విచారణకు హాజరయ్యారు. విచారణకు రావడం ఇది మూడోసారి. ఆ యువతితో తనకు సంబంధమే లేదని చెప్పినట్లు తెలిసింది. సుమారు 4 గంటల పాటు విచారణ చేశారు. తన తరఫు న్యాయవాదులతో కలిసిన అనంతరం కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానని ఇందుకోసం నాలుగు రోజుల సమయం అవసరమని రమేశ్ జార్కిహొళి కోరారు. యువతికి సిట్ తాజా నోటీసులు సీడీలో ఉన్నట్లు భావిస్తున్న యువతికి సిట్ పోలీసులు సోమవారం మరోసారి నోటీసులు పంపించారు. మంగళవారం బెంగళూరులో కబ్బన్‌పార్కు పోలీసుల ఎదుటహాజరు కావాలని ఆదేశించారు. అయితే ఆ యువతికి పోలీసులు ఇప్పటివరకు ఆమెకు 8 సార్లు నోటీసులు పంపించినా ఆమె ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. మా కూతురితో కొందరి రాజకీయం తమ కూతురు ఒత్తిడిలో ఉందని, ప్రభుత్వంపై ఆమె చేస్తున్న ఆరోపణలను పట్టించుకోరాదని యువతి తల్లిదండ్రులు అన్నారు. ఆమెకు మానసిక కౌన్సిలింగ్ అవసరమని అన్నారు. ఆమె ఏ పరిస్థితుల్లో ఉందనేది తెలియదని, ఆమెను ముందు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. కేపీసీసీ నేత డీకే.శివకుమార్ చెప్పినట్లు నడుచుకుంటోందని యువతి సోదరుడు ఆరోపించారు. సీడీతో సంబంధం లేదు: డీకే బనశంకరి: సీడీ ఘటన తన కుట్రేనని సాక్ష్యాలు ఉంటే పోలీసులకు అందించాలని యువతి తల్లిదండ్రులపై కేపీసీసీ అధ్యక్షుడు డీకే.శివకుమార్ సవాల్‌చేశారు. సోమవారం రాయచూరు ముదగల్‌లో డీకేశి మాట్లాడుతూ తనకు సీడీలోని అమ్మాయితో ఎలాంటి సంబంధం లేదన్నారు. తమ అమ్మాయి వెనుక డీకే ఉన్నాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తుండడం తెలిసిందే. ఒత్తిడిలో వారు ఏదేదో మాట్లాడుతున్నారని డీకే అన్నారు. -
బతుకుతానో చస్తానో తెలియదు.. ఆ బాధ్యత ఆయనదే!
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో రాష్ట్ర మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి రాసలీలల సీడీ కేసులో బాధిత యువతి అజ్ఞాతంలో ఉంటూ వీడియోల ద్వారా తన వాదనలను వినిపిస్తోంది. తనకేదైనా అయి చనిపోతే అందుకు రమేశ్ జార్కిహొళిదే బాధ్యతని స్పష్టంచేసింది. శనివారం నాలుగో వీడియో విడుదల చేసింది. ‘బతుకుతానో చస్తానో తెలీదు. మీడియాకు ఒక్క విషయం చెప్పదల్చుకున్నాను. ఏదైనా సమాచారం లభిస్తే నిజానిజాలను పరిగణనలోకి తీసుకుని ప్రసారం చేయండి. మార్చి 2న రాసలీలల సీడీని ఎవరు విడుదల చేశారో నాకు తెలీదు. మీడియాలో రావడం చూసి నరేశ్ అన్న(విలేకరి)కి ఫోన్ కాల్ చేశాను’అని ఆమె వీడియోలో పేర్కొంది. కాంగ్రెస్ ముఖ్య నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌తో మాట్లాడాలని, అప్పుడే న్యాయం జరుగుతుందని నరేశ్ సూచించినట్లు తెలిపింది. శివకుమార్‌ను కలవాలని ఇంటికి వెళ్లగా ఆయన అందుబాటులో లేరన్నారు. రమేశ్ సర్కార్‌ను కూల్చుతానన్నాడు రమేశ్ జార్కిహోళి ఎంత ఖర్చు అయినా పర్వాలేదని, ఒక్కరోజులో ప్రభుత్వాన్ని కూల్చుతానని, అందరిని జైలుకు పంపిస్తానని వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయన మాటలకు అర్థమేమిటని అమ్మాయి ప్రశ్నించింది. తాను భద్రంగానే ఉన్నానని, కిడ్నాప్‌కు గురి కాలేదని, తన కుటుంబ సభ్యులను బెంగళూరుకు తీసుకెళ్లి రక్షణ కల్పించాలని మనవి చేసింది. ఒక బాధితురాలిగా తనకు న్యాయం జరగాలని, కానీ రేపటి రోజున తనను చంపినా చంపుతారని ఆందోళన వ్యక్తం చేసింది. తనను విపరీతంగా వేధింపులకు గురిచేస్తున్నారని, ఒకవేళ తాను చనిపోతే రమేశ్ జార్కిహొళి పేరు రాసిపెట్టి చనిపోతానని పేర్కొంది. అజ్ఞాతంలో ఉన్న బాధిత యువతి శనివారం రాత్రి కొత్తగా ఐదో వీడియోను విడుదల చేసింది. ‘నా తండ్రికి ఏమి తెలియదు, వారిని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వారి నోటి వెంట ఏవేవో మాట్లాడిస్తున్నారు’ అని పేర్కొంది. ఇదంతా ఆయన వల్లనే.. ఆడపిల్లలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని రాసలీలల సీడీ కేసులో బాధిత యువతి తల్లిదండ్రులు ఆరోపించారు. శనివారం బెంగళూరులో నాలుగు గంటల పాటు సిట్ విచారణలో పాల్గొన్న అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తన కుమార్తెను ఒత్తిడితో ఇరికిస్తున్నారని ఆరోపించారు. మా కుమార్తెకు ఏమైనా జరిగితే దానికి డీకే శివకుమార్ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. తమ కుమార్తెకు డబ్బులిచ్చి గోవాకు తరలించారని ఆరోపించారు. తన అక్కను అడ్డం పెట్టుకుని డీకే శివకుమార్ నీచమైన రాజకీయాలు చేస్తున్నారని యువతి సోదరుడు తెలిపారు. నాకు సంబంధం లేదు: డీకే వారి ఆరోపణలపై డీకే శివకుమార్ స్పందిస్తూ ‘అది వారి వ్యక్తిగత విషయం. నాకు దానికి సంబంధం లేదు. నిన్న ఒక్క మాట మాట్లాడుతున్నారు.. రేపు మరో మాట మాట్లాడుతారు’ అన్నారు. పాపం రమేశ్ జార్కిహొళి ఒత్తిడిలో ఉన్నారు. ఆయన ఏదేదో మాట్లాడుతున్నారు. నా దగ్గరికి ఏ యువతీ రాలేదు అని చెప్పారు. ప్రభుత్వంలో ఉండేది బీజేపీ వారే కావడంతో ఎలాంటి చర్యలు తీసుకున్నా నేను సిద్ధం అని చెప్పారు. -
రాసలీలల కేసు: మాస్టర్ మైండ్‌తో రింగ్ మాస్టర్
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో ట్రబుల్ షూటర్‌గా పేరుగాంచిన కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌పై రాసలీలల బాగోతంలో ఆరోపణలు వస్తున్నాయి. మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి వీడియో కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నరేశ్‌గౌడ, డీకే శివకుమార్‌తో ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వ్యాప్తి అయ్యింది. ఆ ఫోటోను కర్ణాటక బీజేపీ తన ట్విట్టర్లో పోస్టు చేసి ఒకే ఫ్రేమ్‌లో మాస్టర్ మైండ్– రింగ్ మాస్టర్ ఉండటం ఏమిటి అని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. దీనిపై నెటిజన్లు తలోరకంగా కామెంట్లు చేశారు. కాగా, నరేశ్‌గౌడ సిట్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. చదవండి: (అరచేతిలో స్వర్గం చూపించింది: ప్రియుడు) -
రాసలీలల వీడియో: వైరలవుతోన్న మెసేజ్‌లు
బెంగళూరు: కర్ణాటక జలవనరుల శాఖ మంత్రి రమేశ్ జర్కిహోలికి, యువతికి మధ్య జరిగిన రాసలీలల వీడియో కర్ణాటకలో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రమేశ్ జర్కిహోలి ఈ ఘటనకు నైతక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. తాజాగా మంత్రికి, యువతికి మధ్య జరిగిన మెసేజ్‌లు కొన్ని లీక్ అయ్యాయి. దీనిలో రమేశ్ జర్కిహోలి కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పను ఉద్దేశిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. యడ్డీ భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డాడంటూ యువతికి చేసిన మెసేజ్‌లో తెలిపారు జర్కిహోలి. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది.. యువతి: బెల్గాంలో కన్నడ, మరాఠీ ప్రజలు బాగా కొట్టుకుంటున్నారు కదా? మంత్రి: మరాఠీలు చాలా మంచి వారు. బెల్గాం కన్నడిగులకు ఏం పని లేదు. మంత్రి: సిద్దరామయ్య చాలా మంచి వాడు. యడియూరప్ప భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డాడు. యువతి: మీరు ఢిల్లీకి వెళ్తున్నారు.. సీఎం అవుతారా? మంత్రి: ప్రహ్లాద్ జోషి ముఖ్యమంత్రి అవుతారు... అంటూ సాగిన సంభాషణకు సంబంధించిన మెసేజ్‌లు ప్రస్తుతం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. యడ్డీ కేబినెట్లోని మినిస్టరే ఆయన పెద్ద అవినీతిపరుడని పేర్కోవడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఈ క్రమంలో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ డేకే శివకుమార్ ఈ మెసేజ్‌లపై స్పందిస్తూ.. ‘‘ఇది కేవలం సెక్స్ స్కాండల్ వీడియో మాత్రమే కాదు.. దీనిలో జర్కిహోలి.. ముఖ్యమంత్రి అవినీతి గురించి మాట్లాడారు. దీనికి యడ్డీ సమాధానం చెప్పాలి. వీటిని అబద్దం అని నిరూపించాలి. ఇప్పుడు బాల్ వారి కోర్టులో ఉంది. ప్రస్తుతం బీజేపీ ఈ అంశంలో ఎంతో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాం’’ అన్నారు. పౌరహక్కుల పోరాట సమితి అధ్యక్షుడు దినేశ్ కల్లహళ్లి మంత్రి రాసలీలలకు సంబంధించిన వీడియోలను బెంగళూరు నగర పోలీసు కమిషనర్ కమల్ పంత్‌కు అందజేసి.. జర్కిహోయడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో కర్ణాటక హోం మినిస్టర్ బసవరాజ్ బొమ్మై జర్కిహోలిపై వచ్చిన ఆరోపణల అంశంలో ఇప్పటికే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని తెలిపారు. చదవండి: సీఎం బంధువునని మేయర్ కాకుండా కుట్ర రాసలీలల వీడియో: మంత్రి రాజీనామా -
ఐశ్వర్య, అమర్త్య ఎంగేజ్మెంట్
-
డీకే శివకుమార్ నివాసంలో సీబీఐ సోదాలు
-
డీకే శివకుమార్ నివాసంలో సీబీఐ సోదాలు
బెంగళూరు: కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన ఇంటిపై సోమవారం ఉదయం ఆకస్మిక దాడులు చేసిన అధికారులు, కర్ణాటకలోని దొడ్డనహళ్లి, కనకాపుర, సదాశివ నగర్‌తో పాటు ముంబై తదితర 14 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. సుమారు 60 మంది అధికారులు ఇందులో పాల్గొన్నట్లు తెలుస్తోంది. డీకే శివ కుమార్‌తో పాటు ఆయన సోదరుడు డీకే సురేష్‌కు సంబంధించిన నివాసాల్లోనూ దాడులు కొనసాగుతున్నాయి.(చదవండి: డీకే రవి భార్యకు కాంగ్రెస్ బంపర్ ఆఫర్) కాగా రాజరాజేశ్వర నగర్, సిరా అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్న తరుణంలో కాంగ్రెష్ పార్టీ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ఇంటిపై సీబీఐ దాడులు నిర్వహించడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సన్నద్ధమవుతున్న వేళ తమను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే కేంద్రం కక్షపూరిత చర్యలకు దిగిందంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా.. ప్రధాని మోదీ, కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప చేతిలో తోలుబొమ్మగా మారిన సీబీఐ డీకే శివకుమార్ నివాసంలో సోదాలు చేస్తోందంటూ మండిపడ్డారు. ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు తమను ఏమీ చేయలేవన్నారు. కర్ణాటకలో బీజేపీ సర్కారు అవినీతిని సీబీఐ తొలుత బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య సైతం సీబీఐ దాడులను ఖండించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకే బీజేపీ ఇలాంటి చర్యలకు పూనుకుందంటూ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గతేడాది సెప్టెంబరులో డీకే శివకుమార్‌ను ఢిల్లీలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుమారు 50 రోజుల పాటు ఆయన జైలులోనే ఉన్నారు. అనేక అభ్యర్థనల అనంతరం బెయిలు మంజూరైన తర్వాత తీహార్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. -
కర్ణాటక కాంగ్రెస్ చీఫ్‌కు కరోనా పాజిటివ్
బెంగళూర్ : కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌కు కరోనా పాజిటివ్‌గా వెల్లడైందని మంగళవారం ఆయన స్వయంగా వెల్లడించారు. తాను ప్రస్తుతం బాగానే ఉన్నానని, ముందుజాగ్రత్తగా ఆస్పత్రిలో చేరానని ఆయన తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. జ్వరంతో బాధపడుతున్న తనకు కోవిడ్-19 టెస్ట్ నిర్వహించగా పాజిటివ్‌గా వచ్చిందని, ముందుజాగ్రత్తతో ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నానని చెప్పారు. మీ దీవెనలతో తాను ఆరోగ్యంగా తిరిగివస్తానని డీకే శివకుమార్ ట్వీట్ చేశారు. తనను ఇటీవల కలిసిన వారంతా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో వరదలు సంభవించిన ప్రాంతాల్లో తన పర్యటనను వాయిదా వేసుకున్నట్టు ఆయన శనివారం ట్వీట్ చేయడం గమనార్హం. బెలగావి, బాగల్కోట్ జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో తన పర్యటనను ఆరోగ్య కారణాలతో మూడు రోజులు వాయిదా వేస్తున్నట్టు శనివారం ఆయన ట్వీట్ చేశారు. ఇక డీకే శివకుమార్ త్వరగా కోలుకోవాలని కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత ఈశ్వర్ ఖాండ్రే, జేడీ(ఎస్) నేత హెచ్డీ కుమారస్వామి ట్వీట్ చేశారు. కాగా కరోనా వైరస్ బారినపడిన కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప (77), విపక్ష నేత సిద్ధరామయ్య (71)లు వైరస్ నుంచి కోలుకున్నారు. వీరితో పాటు ఆరోగ్య మంత్రి శ్రీరాములు సహా నలుగురు మంత్రులకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కోవిడ్-19 కేసులు అధికంగా నమోదైన రాష్ట్రాల్లో కర్ణాటక నాలుగో స్ధానంలో ఉంది. కర్ణాటకలో ఇప్పటివరకూ 2.91 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవగా, 81,000 యాక్టివ్ కేసులున్నాయి. మహమ్మారి బారినపడి 4810 మంది మరణించారు. చదవండి : ఎవరిని రక్షించేందుకు ఈ ప్రయత్నం? -
ఎవరిని రక్షించేందుకు ఈ ప్రయత్నం?
బెంగళూరు: కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి బంధువు నవీన్ ఫేస్బుక్లో చేసిన ఓ పోస్టు బెంగళూరులో ఎంతటి విధ్వంసం సృష్టించిందో తెలిసిన విషయమే. ఆగస్టు 11న జరిగిన ఈ హింసాకాండ కేసులో సీసీబీ(సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్) పోలీసులు గతవారం ఇద్దరు కాంగ్రెస్ నేతలు.. డీజే హళ్లి కార్పొరేటర్, మాజీ మేయర్ సంపత్‌రాజ్, పులకేశినగర వార్డు కార్పొరేటర్ అబ్దుల్ రాఖిద్ జాకీర్‌ను ప్రశ్నించారు. అయితే ఈ కేసులో కావాలని కాంగ్రెస్ నాయకులను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని గురువారం కాంగ్రెస్ చీఫ్ శివకుమార్.. బెంగళూరు కమిషనర్ కమల్ పంత్‌పై ఆరోపణలు గుప్పించారు. (రాజుకున్న రాజధాని) ముఖ్యమంత్రి యడియూరప్ప, బీజేపీ నేతలు రచించిన హింసాకాండలో కాంగ్రెస్ నాయకులను బలి చేస్తున్నారని మండిపడ్డారు. కమిషనర్‌ను బీజేపీ ఏజెంట్‌గా పరిగణించారు. ఈ వ్యాఖ్యలపై కర్ణాటక విద్యాశాఖ మంత్రి, బీజేపీ నేత కె.సుధాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఎంతో నిజాయితీగా జరుగుతున్న ఈ విచారణకు ఎందుకు భయపడుతున్నారని కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌ను నిలదీశారు. ఎవరిని రక్షించడానికి బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్‌పై మాటల దాడికి దిగారని సూటిగా ప్రశ్నించారు. కాగా బెంగళూరులో జరిగిన అల్లర్ల కేసులో ఇప్పటివరకు 415 మందిని అరెస్ట్ చేశారు. (ఏం చేశారు.. ఇద్దరు కార్పొరేటర్లు) -
స్థానికుల భయం: సైకిల్ మీద శవాన్ని..
బెంగళూరు : చనిపోయిన వ్యక్తిని శ్మశానానికి తరలించేందుకు స్థానికులు సహకరించకపోవటంతో మృతుడి కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. సైకిల్‌పైనే శవాన్ని కాటికి చేర్చింది. ఈ హృదయ విదారకర ఘటన కర్ణాటకలోని బెలగావి జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. బెలగావి జిల్లా కిత్తూరు తాలూకా ఎమ్కే హుబ్బలికి చెందిన ఓ వ్యక్తి కొద్దిరోజుల క్రితం చనిపోయాడు. ( గంటన్నర టెన్షన్ ) అతడు కరోనా వల్లే చనిపోయాడని భావించిన స్థానికులు అంత్యక్రియలకు దూరంగా ఉండిపోయారు. దీంతో మృతుడి కుటుంబం సైకిల్‌పైనే శవాన్ని శ్మశానానికి చేర్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ ఈ సోమవారం తన ట్విటర్ ఖాతాలో షేర్ చేయటంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ( ఏం చేస్తున్నావు? నేను చూసేశాను!) ಬೆಳಗಾವಿಯ ಕಿತ್ತೂರಿನ 70 ವರ್ಷದ ವೃದ್ಧನ ಶವವನ್ನು ಕುಟುಂಬ ಸದಸ್ಯರು ಮಳೆಯಲ್ಲಿ ನೆನೆಯುತ್ತಾ ಸೈಕಲ್ ನಲ್ಲಿ ಸಾಗಿಸಿದ್ದಾರೆ ಸಿಎಂ @BSYBJP ಅವರೇ ಎಲ್ಲಿದೆ ನಿಮ್ಮ ಸರ್ಕಾರ? ಅವರಿಗೆ ಏಕೆ ಆಂಬ್ಯುಲೆನ್ಸ್ ಒದಗಿಸಲಿಲ್ಲ? ಈ ಅಸಮರ್ಥ ಸರ್ಕಾರಕ್ಕೆ ಮಾನವೀಯತೆ ಇಲ್ಲವಾಗಿದ್ದು, ಪಿಡುಗು ಪರಿಸ್ಥಿತಿಯನ್ನು ನಿಭಾಯಿಸಲು ಸಂಪೂರ್ಣವಾಗಿ ವಿಫಲವಾಗಿದೆ pic.twitter.com/dZxCj9sO9P — DK Shivakumar (@DKShivakumar) August 17, 2020 -
అమర్త్య హెగ్డేతో డీకేశీ కుమార్తె నిశ్చితార్థం
బెంగళూరు: కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్య.. కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకులు, దివంగత వీజీ సిద్ధార్థ కుమారుడు అమర్త్య హెగ్డేను వివాహమాడనున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో సోమవారం వీరి నిశ్చితార్థం జరిగింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, వరుడి తాతయ్య ఎస్ఎం కృష్ణ నివాసంలో ఈ వేడకను నిర్వహించారు. కాగా డీకేశీ పెద్ద కుమార్తె అయిన ఐశ్వర్య (22) బిజినెస్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి తండ్రి వ్యాపారాలను చూసుకుంటున్నారు. ఇక అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించిన అమర్త్య సైతం వ్యాపార రంగంలో కొనసాగుతున్నారు. కాగా 2019 జూలైలో అదృశ్యమైన కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ.. ఆ తర్వాత కొద్ది రోజులకు నేత్రావతి నదిలో శవమై కనిపించారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు.. ఆర్థిక ఇబ్బందులతోనే సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తేల్చారు. ఇక ప్రస్తుతం వారి వ్యాపారాలను సిద్ధార్థ భార్య మళవిక నిర్వహిస్తున్నారు. కాగా సిద్ధార్థ, శివకుమార్ కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో మంచి స్నేహం ఉందని వారి సన్నిహితులు తెలిపారు. (వీజీ సిద్ధార్థ కుమారుడితో డీకే ఐశ్వర్య వివాహం!) -
కాంగ్రెస్ కార్యక్రమానికి అనుమతినివ్వని ప్రభుత్వం!
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ చేయాలనుకున్న ఒక కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతినివ్వలేదు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అధిష్టానం డీకే శివ కుమార్‌ను ఎంపిక చేసింది. దీనికి సంబంధించిన కార్యక్రమాన్నికార్యకర్తల నడుమ నిర్వహించుకోవడానికి ప్రభుత్వాన్ని అనుమతి కోరగా కరోనా కారణంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి వీలు లేదని తెలిపింది. దీని గురించి డీకే శివకుమార్ మాట్లాడుతూ, ‘రెండు నెలల క్రితమే మేం ఈ కార్యక్రమాన్ని చేయాలనుకున్నాం. అనుమతి కోరుతూ ఇప్పటి వరకు మూడు సార్లు అభ్యర్థించాను. మొదట మే 31న అనుకోగా, తరువాత జూన్ 7, జూన్14 తేదీలకు కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నాం. అయినప్పటికి కరోనా కారణంగా అనుమతినివ్వలేమని ప్రభుత్వం తెలిపింది. ఇది రాజకీయం చేయడం కాక మరేమిటి? బీజేపీ ర్యాలీలు చేయడానికి ఒడిశా, బెంగాల్ ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి. వారి పార్టీ వారు ఇలా చెయ్యొచా? వేరే రాష్ట్రాల్లో కూడా బీజేపీ కార్యక్రమాలు చేపట్టింది. విపత్తు నిర్వహణ మార్గదర్శకాలను ప్రభుత్వం తప్పుగా ఉపయోగిస్తోంది. మేం రాజకీయ నాయకులం, ఇలాంటి కార్యక్రమాలను నాలుగు గోడల మధ్య చేయాలేం’ అని శివకుమార్ పేర్కొన్నారు. (రెండో పెళ్లికి సిద్ధమైన సీఎం కుమార్తె) I condemn the decision of Karnataka government to deny the permission to conduct oath taking ceremony of @INCKarnataka President @DKShivakumar. This is politically motivated & intended towards hurting the opposition.#ಬಿಜೆಪಿ_ದುರಾಡಳಿತ — Siddaramaiah (@siddaramaiah) June 9, 2020 దీనిపై కాంగ్రెస్, నేత కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ట్విట్టర్ వేదికగా స్పందించారు. కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. దీనిపై కర్ణాటక కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ ఇలాంటి కక్ష సాధింపు రాజకీయాలను తమ పార్టీ ఖండిస్తుందని ట్విట్టర్ వేదికగా పేర్కొంది. జూన్ 14 న నిర్వహించాలనుకున్న ప్రతిజ్ఞ దినానికి అనుమతినివ్వకపోవడం శోచనీయమని పేర్కొంది. కర్ణాటక వ్యాపంగా 7,800 ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని 10 లక్షల కార్యకర్తల నడుమ సామాజిక దూరం పాటిస్తూ నిర్వహించాలని భావిస్తున్నట్లు పేర్కొంది. కర్ణాటకలో 2019లో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసి యడ్యూరప్ప నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పరిచిన సంగతి తెలిసిందే. (కోవిడ్-19 : భారీగా మెరుగుపడిన రికవరీ రేటు) On June 14th, 'PRATHIJNA DINA' was to be held at 7,800 locations across Karnataka with 10 lakh+ Congress Karyakartas attending it, with care taken w.r.t safety precautions for COVID & social distancing By denying permission to it again, BJP Govt is indulging in vendetta politics pic.twitter.com/lpna43Jubu — Karnataka Congress (@INCKarnataka) June 9, 2020 -
కాఫీ డే సిద్ధార్థ కోడలిగా డీకేశి కుమార్తె!
సాక్షి, బెంగళూరు : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్యను కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకులు వీజీ సిద్ధార్థ కుమారుడు అమర్త్య హెగ్డేకు ఇచ్చే వివాహం జరిపించాలని వారి కుటుంబ పెద్దలు నిర్ణయించారు. శివకుమార్ పెద్ద కుమార్తె అయిన ఐశ్వర్య (22) బిజినెస్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసి తన తండ్రి వ్యాపారాలను చూసుకుంటున్నారు. ఇక అమెరికాలో ఉన్నత చదువులు అభ్యసించిన అమర్త్య సైతం వ్యాపారంలో కొనసాగుతున్నారు. కాగా వీరిద్దరి పెళ్లిపై చర్చించేందుకు గత ఆదివారం సిద్ధార్థ ఇంటికి డీకేశి కుటుంబ సభ్యులు వెళ్లినట్టు అయన సన్నిహితుల ద్వారా తెలిసింది. (‘కాఫీ కింగ్’ విషాదాంతం) ఇక ఐశ్యర్య-అమర్త్య వివాహంపై శివకుమార్ మాట్లాడుతూ.. సిద్ధార్థ ఉన్నప్పుడు వీరి వివాహానికి సంబంధించి ఓ సారి ప్రస్తావన వచ్చిందని చెప్పారు. జూలై 31 నాటికి ఆయన మృతి చెందిన ఏడాది పూర్తి అవుతుందని.. ఆ తరువాత పెళ్లి తేదీల నిర్ణయంపై స్పష్టత వస్తుందని తెలిపారు. సిద్ధార్థకు శివకుమార్ మధ్య ఎప్పటి నుంచో మంచి స్నేహం ఉన్నట్లు వారి సన్నిహితుల ద్వారా తెలిసింది. కాగా కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ 2019 జులైలో అదృశ్యమయ్యారు. తర్వాత కొద్ది రోజులకు నేత్రావతి నదిలో ఆయన మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. ఆర్థికసమస్యలతోనే సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు తేల్చారు. ఆ తరువాత ఆయన వ్యాపారాలను సిద్ధార్థ బార్య మళవికా చూసుకుంటున్నారు. (ఐశ్వర్యను 7 గంటలపాటు ప్రశ్నించిన ఈడీ) -
కరోనా: ఆయన రాజీనామా చేయాల్సిందే!
బెంగళూరు: మానవాళి మనుగడకు ముప్పుగా మరణించిన కరోనా వైరస్(కోవిడ్-19)గురించి ప్రజలను అప్రమత్తం చేయాల్సిన మంత్రి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ప్రజలంతా కరోనా భయంతో విలవిల్లాడుతుంటే స్విమ్మింగ్‌పూల్‌లో జలకాలాడటం నైతికంగా దిగజారిపోవడమే అని విరుచుకుపడింది. మంత్రి సుధాకర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత, ట్రబుల్ షూటర్.. డికే శివకుమార్ ట్వీట్ చేశారు. ‘‘ప్రపంచమంతా ఆరోగ్య సంక్షోభంలో మునిగిపోయిన వేళ.. రాష్ట్ర కరోనా ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న మంత్రి డాక్టర్ సుధాకర్ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు. స్విమ్మింగ్‌పూల్‌లో సమయాన్ని గడుపుతున్నారు. నైతిక విలువలకు సంబంధించిన విషయం ఇది. ఆయనే స్వయంగా రాజీనామా సమర్పించాలి. ముఖ్యమంత్రి ఆయనను కేబినెట్ నుంచి తొలగించాలి’’అని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. (లాక్డౌన్: రేపు ప్రధాని మోదీ కీలక ప్రకటన) కాగా వైద్య విద్య మంత్రిగా వ్యవహరిస్తున్న కె. సుధాకర్ ప్రస్తుతం రాష్ట్ర కరోనా వివరాల వెల్లడి ఇన్చార్జిగా ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం తన పిల్లలతో స్విమ్మింగ్‌పూల్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోను సోమవారం ట్విటర్లో షేర్ చేశారు. ‘‘చాలా రోజుల తర్వాత పిల్లలతో కలిసి ఈతకొడుతున్నా. ఇక్కడ కూడా భౌతిక దూరం పాటిస్తున్నాం. హ హ’’అంటూ క్యాప్షన్ జతచేశారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసిన డీకే శివకుమార్ సుధాకర్ తీరుపై మండిపడ్డారు. కాగా కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చడంలో కీలకంగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ రెబల్స్‌లో సుధాకర్ కూడా ఒకరు. బీజేపీ సర్కారు ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఆయనను మంత్రిమండలిలోకి తీసుకున్నారు. కాగా దేశంలో మొదటి కరోనా మరణం కర్ణాటకలో సంభవించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటి వరకు అక్కడ 232 మంది కి కరోనా సోకగా.. ఆరు మరణాలు నమోదయ్యాయి. (వీడియో షేర్ చేసిన ప్రధాని.. నెటిజన్ల ఫైర్!) When the whole world is going through a health crisis, the Corona in-charge Minister Dr. Sudhakar is behaving irresponsibly by spending time in a swimming pool. It's a matter of moral & ethical standards. He must resign out of his own accord & CM should sack him from the cabinet pic.twitter.com/ZQlRzMoqrb — DK Shivakumar (@DKShivakumar) April 13, 2020 -
అధిష్టానానికి తలనొప్పిగా ఆ రాష్ట్ర వ్యవహారం
సాక్షి,బెంగళూరు: కేపీసీసీ అధ్యక్ష పీఠం కోసం నేతల మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్, మాజీ మంత్రి డీకే శివకుమార్‌కు కేపీసీసీ పదవి కేటాయిస్తారని అనుకుంటుండగా మాజీ సీఎం సిద్దరామయ్య సామాజిక అడ్డంకులను సాకుగా చూపించడంతో అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇటు సిద్ధును, అటు డీకేశిని కాదనలేక అధిష్టానం మదనపడుతోంది. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి వచ్చిన సిద్ధరామయ్యకు, డీకే శివకుమార్‌కు కేపీసీసీ చీఫ్ పదవి ఇస్తామని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా చెప్పడంతో అందుకు అంగీకరించిన సిద్ధు రాష్ట్రంలో సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని నలుగురికి కేపీసీసీ కార్యాధ్యక్ష పదవులు ఇవ్వాలని కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకురావడం ద్వారా తన మద్దతుదారులకు పదవులు ఇప్పించే పావులు కదుపుతున్నారు. దీంతో ఈ వ్యవహారం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. మైనార్టీ నాయకుడు, మాజీ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్‌ను లేదా యూటీ ఖాదర్, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన సతీశ్ జార్కిహోళి, లింగాయత్ వర్గానికి చెందిన ఈశ్వర్ ఖండ్రే, ఎస్సీ సామాజికి వర్గానికి చెందిన ఆంజనేయ లేదా ధృవనారాయణలను ఎంపిక చేయాలని డిమాండ్ పెట్టారు. అయితే నలుగురికి ఇవ్వడం కష్టమని, ఇద్దరికి మాత్రమే ఇస్తామని అధిష్టానం చెప్పినా సిద్ధరామయ్య నిరాకరించారు. నలుగురు కార్యాధ్యక్షుల నియామకానికి మాజీ కేంద్రమంత్రి మల్లికార్జున ఖర్గేతో పాటు మరికొందరు సీనియర్లు వ్యతిరేకించారు. పార్టీ బలోపేతానికి తన నిర్ణయం అధిష్టానం ముందు ఉంచానని, తుది నిర్ణయం రావాల్సి ఉందని సిద్ధు తన సహచరుల వద్ద చెప్పినట్లు సమాచారం. -
కాపీ పేస్ట్ వాదనలు వద్దు
న్యూఢిల్లీ : మనీ ల్యాండరింగ్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత డీ.కే.శివకుమార్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ పిటిషన్ విచారణను శుక్రవారం చేపట్టిన జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, ఎస్. రవీంద్రభట్ లతో కూడిన బెంచ్ ఈడీ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాపై తీవ్రస్థాయిలో విరుచుకుప డింది. కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లలో కాంగ్రెస్ నాయకుడు శివకుమార్‌కు బదులుగా, అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అని పేర్కొనడాన్ని దుయ్యబట్టింది. పి. చిదంబరం కేసుకు సంబంధించిన కోర్టు డాక్యుమెంట్లలో వాదనలను యధాతథంగా శివకుమార్ కేసులో కాపీ పేస్ట్ చేయడమేంటని నిలదీసింది. పౌరులను మీరు గౌరవించే పద్ధతి ఇదేనా అంటూ ప్రశ్నించింది. చిదంబరానికి సుప్రీంలో నిరాశ ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈడీ దాఖలు చేసిన ఈ కేసులో ఆయనపై ఉన్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని, అందులో చిదంబరం ప్రమేయం ఉన్నట్టుగా ప్రాథమిక ఆధారాలను బట్టి తెలుస్తోందని పేర్కొంది. చిదంబరానికి బెయిల్ ఇస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళతాయని వ్యాఖ్యానించింది. -
జైల్లో శివకుమార్‌తో కుమారస్వామి భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : తీహార్ జైలులో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేత డికె శివకుమార్‌ను జనతాదళ్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి కలిశారు. సుమారు 45 నిమిషాల పాటు వీరిద్దరూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య చాలా అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. వీరి సమావేశం అనంతరం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ అంశాలు, వ్యక్తిగత స్నేహాలు వేరని అన్నారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత భేటీ అని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ.. తాను లొంగబోయేది లేదని, తాను ఎలాంటి తప్పూ చేయనపుడు ఎందుకు తల వంచాలని డీకే శివకుమార్ తన వద్ద ప్రస్తావించినట్లు చెప్పారు. డీకే శివకుమార్ మానసికంగా దృఢంగా ఉన్నారని, రాజకీయ కక్ష సాధింపులపై తాము పోరాడతామని కుమారస్వామి స్పష్టం చేశారు. కర్ణాటక కాంగ్రెస్‌లో ట్రబుల్ షూటర్‌గా పేరున్న డీకే శివకుమార్ 600 కోట్ల మనీ లాండరింగ్ కేసులో గత రెండు నెలలుగా సీబీఐ, ఈడీ అధికారుల అదుపులో ఉన్నారు. విచారణ అనంతరం తీహార్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. -
తీహార్ జైలుకు కుమారస్వామి..
న్యూఢిల్లీ : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి సోమవారం తీహార్ జైలుకు వచ్చారు. అక్కడ జైలులో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్‌ను కుమారస్వామి కలిశారు. కర్ణాటకలోని రాజకీయ అంశాలపై కుమారస్వామి, శివకుమార్‌తో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన శివకుమార్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. కాగా, కాంగ్రెస్, జేడీఎస్‌ల సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో శివకుమార్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ట్రబుల్ షూటర్‌గా పేరుగాంచిన శివకుమార్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడేందకు చివరివరకు ప్రయత్నించాడు. కానీ, రెబల్ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. -
మేం పదేపదే చెప్తున్నాం.. ఇది కక్షసాధింపే!
సాక్షి, న్యూఢిల్లీ: తిహార్ జైల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌ను ఆ పార్టీ సీనియర్ నాయకులు పలువురు గురువారం కలిశారు. సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, ఆనంద్ శ్మ, డీకే సురేశ్ జైల్లో ఉన్న శివకుమార్‌ను కలిసి.. కాసేపు ముచ్చటించారు. తిహార్ జైల్లోనే ఉన్న కాంగ్రెస్ పార్టీ మరో సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని ఆయన తనయుడు కార్తీ చిదంబరం గురువారం కలిశారు. చిదంబరాన్ని కలిసిన అనంతరం జైలు బయట కార్తీ మీడియాతో మాట్లాడారు. ‘ఇది కక్షసాధింపు రాజకీయం తప్ప మరొకటి కాదని మేం పదేపదే చెప్తున్నాం. మంచి వక్తలై ఈ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఎండగడుతున్న నాయకుల్ని బోగస్ కేసులతో టార్గెట్ చేశారు. మా నాన్న, శివకుమార్ మీద ప్రస్తుతం ఎలాంటి విచారణ జరగడం లేదు. వారిని దోషులుగా ఏ కోర్టు నిర్ధారించలేదు. అయినా, జ్యుడీషియల్ కస్టడీ కింద వారిని జైల్లో ఉంచారు. ఇది దేశ రాజకీయ వాతావరణాన్ని విషతుల్యంచేసి భయానక వాతావరణాన్ని సృష్టించడమే’ అని కార్తీ మండిపడ్డారు. -
శివకుమార్ కస్టడీ పొడిగించిన కోర్టు
సాక్షి, బెంగళూరు/ న్యూఢిల్లీ: మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టయిన కర్ణాటక కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే డీకే శివకుమార్ జ్యుడీషియల్ కస్టడీని మరో 14 రోజులపాటు న్యాయస్థానం పొడిగించింది. శివకుమార్ నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున జుడిషియల్ కస్టడీకి పంపాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. దీనిపై మంగళవారం వాదోపవాదాలు విన్న అనంతరం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అజయ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. -
మరో 5 రోజులు డీకే రిమాండ్ కోరిన ఈడీ..
సాక్షి, న్యూఢిల్లీ : మనీల్యాండరింగ్ కేసులో అరెస్టైన సీనియర్ కాంగ్రెస్ నేత, కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్ రిమాండ్ శుక్రవారంతో ముగియడంతో ఈడీ అధికారులు ఆయనను రోజ్ అవెన్యూ కోర్టు ఎదుట హాజరుపరిచారు. కేసు విచారణలో తమ ప్రశ్నలకు డీకే శివకుమార్ బదులివ్వకుండా సమయం వృధా చేశారని ఆయనను మరో అయిదు రోజుల పాటు రిమాండ్‌కు అప్పగించాలని కోర్టును ఈడీ అధికారులు కోరారు. విచారణలో తాము అడిగిన ప్రశ్నలకు శివకుమార్ సూటిగా బదులివ్వలేదని, సంబంధం లేని సమాధానాలు ఇచ్చారని న్యాయస్ధానం దృష్టికి తీసుకువచ్చారు. తన బ్యాంకు ఖాతాల్లోని డిపాజిట్లు ఎలా సమకూరాయన్నది వెల్లడించలేదని, ఆయన ఆస్తుల్లో చాలావరకూ బినామీ ఆస్తులేనని ఈడీ పేర్కొంది. విచారణకు డీకే సహకరించలేదని, విచారణ సమయంలో పలుమార్లు విరామం పేరుతో సమయం వృధా చేశారని తెలిపింది. ఇతర నిందితులతో కలిసి ప్రశ్నించేందుకు ఆయనను మరో 5 రోజులు రిమాండ్‌కు తరలించాలని ఈడీ కోరింది. -
ఐశ్వర్యను 7 గంటలపాటు ప్రశ్నించిన ఈడీ
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్య గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. శివకుమార్ ఈడీ కస్టడీ మరో రోజులో ముగుస్తుందనగా ఈడీ అధికారులు ఐశ్వర్యను ప్రశ్నించారు. ఏడు గంటలుపైగా ఆమెను ఈడీ అధికారులు విచారించారు. బిజినెస్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేట్ చేసిన ఐశ్వర్య ఢిల్లీలోని ఈడీ ఆఫీస్కొచ్చారు. ఉదయం 10.30 గంటలకు వచ్చిన ఆమె రాత్రి 7.30 గంటలకు తిరిగి వెళ్లారు. ఐశ్వర్య పేరు మీదే ట్రస్ట్ ఫండ్ ఏర్పాటవడంతో పాటుగా 2013–18 మధ్య ఆమె ఆస్తిపాస్తులు విపరీతంగా పెరిగాయి. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఐశ్వర్యకు 108 కోట్లు ఉన్నట్టుగా ప్రకటించారు. 2013లో ఆమె ఆస్తుల విలువ రూ.1.09 కోట్లు మాత్రమే. కాగా, 9 రోజుల ఈడీ కస్టడీ ముగియడంతో నేడు శివకుమార్‌ను స్థానిక కోర్టులో హాజరుపరచనున్నారు. -
డీకే శివకుమార్‌కు మరో షాక్
బెంగళూరు : కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే మనీలాండరింగ్ కేసులో శివకుమార్‌ను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు.. తాజాగా ఆయన కుమార్తె ఐశ్వర్యకు సమన్లు జారీచేశారు. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈ నెల 12న విచారణకు హాజరు కావాలని ఐశ్వర్యకు సమన్లు జారీ చేసినట్టు సీనియర్ ఈడీ అధికారి ఒకరు తెలిపారు. శివకుమార్ ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్న సమయంలో ఈడీ అధికారులు.. ఆయన కుమార్తె నిర్వహిస్తున్న ఒక ట్రస్టుకు సంబంధించిన పత్రాలను కనుగొన్నారు. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు ఆమెకు సమన్లు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా 2017 జూలైలో శివకుమార్, ఆయన కుమార్తె కలిసి ఒక బిజినెస్ డీల్ కోసం సింగపూర్ వెళ్లడంపై ఈడీ అధికారులు దృష్టి పెట్టినట్టుగా సమాచారం. ఇప్పటికే ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసుకు సంబంధించి శివకుమార్‌కు సన్నిహితుడైన సచిన్ నారాయణ్ విచారించారు. కాగా, మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన శివకుమార్‌ను సెప్టెంబర్ 13 వరకు ఈడీ కస్టడీకి అనుమతిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. చదవండి : శివకుమార్‌కు 13 వరకు కస్టడీ -
డీకే శివకుమార్‌కు 10రోజుల కస్టడీ
బెంగళూరు : మనీ లాండరింగ్ కేసులో నిన్న సాయంత్రం అరెస్టయిన కర్ణాటక మాజీ మంత్రి , కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌ను 14 రోజులపాటు తమ కస్టడీకీ అప్పగించాలంటూ బుధవారం ఈడీ అధికారులు చేసిన విజ్ఞప్తిని ఢిల్లీ ట్రయల్ కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసుకు సంబంధించి శివకుమార్‌ను10 రోజుల(సెప్టెంబర్ 13 వరకు) కస్టడీకి మాత్రమే అనుమతినిస్తూ ఈడీకి ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, నిన్న రాత్రి అరెస్టయినప్పటి నుంచి చాతీ నొప్పి వచ్చి, బీపీ, షుగర్ లెవల్స్ పడిపోవడంతో బెంగుళూరులోని ఆర్ఎల్ఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తవడంతో ఈడీ అధికారులు శివకుమార్‌ను అక్కడి నుంచి నేరుగా కోర్టుకు తరలించారు. కాంగ్రెస్ ట్రబుల్ షూటర్‌గా పేరు పొందిన డీకే శివకుమార్ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఆగస్టు 30 నుంచి జరుగుతున్న విచారణ సెస్టెంబర్ 3తో ముగియడంతో అరెస్టు చేశారు. విచారణ సమయంలో ఆయన అంతగా సహకరించకపోవడంతో.. మరింత లోతుగా విచారించడానికే ఆయనను అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు స్పష్టం చేశారు. కాగా, శివకుమార్ అరెస్టును నిరసిస్తూ బుధవారం కర్నాటక కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చిన రాష్ట్ర వ్యాప్త బంద్ హింసాత్మకంగా మారింది. పలుచోట్ల ఆందోళనకారులు బస్సు అద్దాలను ద్వంసం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలను, కళాశాలలను బలవంతంగా మూసివేయించారు. రాజకీయ కక్షసాధింపుకు ఇదే ఉదాహరణ : రాహుల్ డీకే శివకుమార్ అరెస్టు వ్యవహారంపై ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విటర్లో స్పందించారు. ఈ అరెస్టు చర్య బీజేపీ రాజకీయకక్ష సాధింపు చర్యలకు ఉదాహరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. కావాలనే కొందరు వ్యక్తులను ఎంపిక చేసుకొని మరీ వారిపై సీబీఐ, ఈడీ వంటి సంస్థలను ఉపయోగిస్తూ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. -
డీకేశికి ట్రబుల్
సాక్షి బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్‌గా పేరుపొందిన మాజీ మంత్రి డీకే శివకుమార్ తానే సమస్యల్లో పడిపోయారు. పార్టీకి అనేక ఆపరేషన్లలో వెన్నుదన్నుగా ఉంటూ కీలక నేతగా చక్రం తిప్పుతున్న డీకేశితో పాటు కాంగ్రెస్‌పార్టీకి షాక్ తగిలింది. అక్రమ నగదు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆయనను ఢిల్లీలో అరెస్టు చేశారు. గత శుక్రవారం ప్రారంభమైన విచారణ ఆదివారం మినహా మంగళవారం వరకు కొనసాగింది. సుమారు 29 గంటల పాటు డీకేశిని ఈడీ విచారించింది. విచారణలో డీకే సహకరించలేదని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. కొంతకాలం క్రితం ఐటీ దాడుల్లో ఢిల్లీలోని ఆయన నివాసంలో రూ. 8.59 కోట్ల నగదు లభించడంతో డీకేశిపై ఐటీ శాఖ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ డీకేను విచారణ చేస్తూ వస్తోంది. ఢిల్లీలో ఈడీ ఆఫీసులో మధ్యాహ్న 12 గంటలకు ప్రారంభమైన డీకేశి విచారణ రాత్రి 8.30 గంటలసమయంలో అరెస్టుతో ముగిసింది. నాలుగురోజుల నుంచి ఆయనను ఈడీ విచారిస్తుండడం తెలిసిందే. కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన మంగళవారం ఈడీ విచారణకు హాజరయ్యే ముందు డీకే శివకుమార్ మాట్లాడుతూ నాలుగు రోజుల నుంచి విచారణకు హాజరవుతున్నట్లు, ఇంకా ఎన్ని రోజులు రావాలో తెలియదన్నారు. తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. డీకేశి అరెస్టు వార్తలను టీవీలో చూసిన ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈడీ ప్రధాన కార్యాలయం లోకనాయక భవనం ఎదుట ఆందోళనకు దిగారు. డీకేశి అరెస్టు నేపథ్యంలో బెంగళూరుతో పాటు మండ్య, హాసన్ తదితర ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. గొడవలు జరగకుండా నిఘా వేసింది. బుధవారం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆందోళనలు చేపట్టే అవకాశం ఉంది. -
‘టెన్షన్ ఎందుకు..నేనేం రేప్ చేయలేదు’
బెంగళూర్ : కర్ణాటక మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌కు మనీల్యాండరింగ్ కేసులో ఈడీ సమన్లు జారీ చేసింది. ఈడీ సమన్లపై డీకే స్పందిస్తూ తాను దీనిపై ఎలాంటి టెన్షన్ తీసుకోవడం లేదని, తాను ఎలాంటి పొరపాటూ చేయలేదని, తాను ఎవరి వద్దా డబ్బు తీసుకోలేదని, లైంగిక దాడి చేయలేదని పేర్కొన్నారు. తనను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని బీజేపీ సర్కార్‌పై ఆయన నిప్పులు చెరిగారు. రూ కోట్లలో పన్ను ఎగవేతలకు పాల్పడటంతో పాటు అక్రమ లావాదేవీలు సాగించారనే ఆరోపణలపై డీకే శివకుమార్ మరికొందరిపై గత ఏడాది సెప్టెంబర్‌లో ఈడీ మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో డీకేతో పాటు ఢిల్లీలోని కర్ణాటక భవన్‌కు చెందిన ఉద్యోగి సహా మరికొందరి పేర్లను ఈడీ చేర్చింది. గత రెండేళ్లుగా తన 84 ఏళ్ల తల్లికి చెందిన యావదాస్తినీ బినామీ ఆస్తులుగా దర్యాప్తు సంస్థలు అటాచ్ చేశాయని, తమ రక్తం మొత్తం పీల్చేశారని డీకే ఆందోళన వ్యక్తం చేశారు. -
‘ఏదో ఓ రోజు అందరం చావాల్సిందే’
బెంగళూరు: కన్నడ రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు తమ రాజీనామాలపై మంగళవారం తనకు వివరణ ఇవ్వాలని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ ఆదేశించగా, అందుకు తమకు నాలుగు వారాల సమయం కావాలని కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెబెల్స్‌ని బుజ్జగించడానికి రంగంలోకి దిగిన ట్రబుల్షూటర్ డీకే శివకుమార్ తొలిసారి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. మంగళవారం కూడా విశ్వాసపరీక్ష పూర్తయ్యేలా కనిపించకపోవడంతో శివకుమార్ అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శివకుమార్ బీజేపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి.. ‘నేను ఐదుగురు ఎమ్మెల్యేలను కూడా ఆపలేకతున్నానని భావిస్తున్నారా.. ప్రస్తుతం మీ పక్కన చేరిన ఎంటీబీ నాగరాజుకు టికెట్ ఇప్పించిందే నేనే. ఆ విషయం మర్చిపోకండి’ అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత శివకుమార్ వేదాంత ధోరణిలో మాట్లాడుతూ.. ‘ఈ రోజు నాకు వెన్నుపోటు పొడిచిన నా మిత్రులు.. రేపు బీజేపీకి కూడా వెన్నుపోటు పొడుస్తారు. ఏదో ఓ రోజు మనమంతా చావాల్సిన వాళ్లమే కదా. మధ్యలో వచ్చే ఈ టెన్షన్స్ను తట్టుకోవడానికి మహా అయితే రాత్రికి రెండు పెగ్గులు వేసి పడుకుంటాను అంతే. ఇంకేం చేస్తాను’ అన్నారు. రెబెల్ ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు శివకుమార్ ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘ఇద్దరు రెబెల్ ఎమ్మెల్యేలు తమను కలవాల్సిందిగా నన్ను కోరారు. దాంతో నేను, కుమార స్వామి ముంబై వెళ్దామని భావించాం. కానీ అధికారులు సీఎం ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదన్నారు. దాంతో నేను, మరి కొందరితో కలిసి ముంబై వెళ్లాను. రెబెల్ ఎమ్మెల్యేలున్న హోటల్లోనే ఓ గది బుక్ చేశాను. కానీ నన్ను హోటల్లోకి అనుమతించలేదు. కనీసం స్నానం కూడా చేయకుండా ఆదరాబాదరా ముంబై వెళ్లాను. కానీ ఎమ్మెల్యేలు నన్ను కలవలేదు. పైగా వారంతా నా మీద కేసు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇదంతా చూసి నేను షాక్ అయ్యాను’ అన్నారు. ‘ఈ ఎమ్మెల్యేలంతా లోక్‌సభ ఎన్నికలప్పుడు కూడా నాతో కలిసి పని చేశారు. నా అడుగుజాడల్లోనే నడుస్తామన్నారు. కానీ చివరకిలా చేశారు. ఓ 10 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ఛాంబర్లో కూర్చోవడం చూశాను. అప్పుడే అక్కడికి వెళ్లి వారి రాజీనామాలను చింపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ అలా చేయలేకపోయాను’ అని వాపోయారు శివకుమార్. అయితే ఏదేమైనా ఇవాళ బలపరీక్ష నిర్వహిస్తానని స్పీకర్ రమేష్ కుమార్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. సాయంత్రం 4 గంటలకల్లా చర్చ ముగించాలని స్పీకర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం అసెంబ్లీకి వచ్చిన సీఎం కుమార స్వామి తన ఛాంబర్‌లోనే ఉన్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత సీఎంకు మాట్లాడే అవకాశం ఇస్తానని స్పీకర్ వెల్లడించారు.