న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విదేశాలకు వెళ్లేందుకు ఢిల్లీ కోర్టు అనుమతిచ్చింది. కాప్ 28 లోకల్ క్లైమేట్ యాక్షన్ సదస్సులో పాల్గొనేందుకుగాను డిప్యూటీ సీఎం హోదాలో శివకుమార్ దుబాయ్ వెళ్లనున్నారు. ఈనెల 29 నుంచి డిసెంబర్ 3 వరకు దుబాయ్‌లో ఉండేందుకు డీకేకు కోర్టు అనుమతిచ్చింది.
డీకే విదేశాలకు వెళ్లేందుకు అనుమతిచ్చే సందర్భంలో కోర్టు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘సాధారణంగా ఒక పౌరుడు విదేశాలకు వెళ్లడం అనేది అతని ప్రాథమిక హక్కులో భాగం. అయితే ఇది పరిమితులు లేని హక్కు కాదు. కేసుల్లో నిందితులు విదేశాలకు పారిపోకుండా చూసేందుకు ఈ హక్కుపై పరిమితులు విధించవచ్చు. అయితే ఇక్కడ అనుమతి అడుగున్నది 8 సార్లు ఎమ్మెల్యే, ప్రస్తుత డిప్యూటీ సీఎం శివకుమార్ అయినందున అనుమతిస్తున్నాం. ఎందుకంటే ఇంత బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆయన పారిపోయే అవకాశాలు తక్కువ’అని కోర్టు పేర్కొంది.
అయితే డీకే దుబాయ్ వెళ్లేందుకు అనుమతిచ్చిన కోర్టు కొన్ని షరతులు పెట్టింది. 5 లక్షల రూపాయల డిపాజిట్‌తో పాటు ప్రయాణానికి సంబంధిచిన పూర్తివివరాలు, అక్కడ వాడే మొబైల్ నెంబర్ అందించాలని ఆదేశించింది. మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన డీకే శివకుమార్‌కు 2019 అక్టోబర్ 23న కోర్టు ఈడీ కేసులో బెయిల్ ఇచ్చింది. అప్పటి నుంచి ఆయన బెయిల్‌పైనే ఉన్నారు.
ఇదీచదవండి..వర్షంలో శరద్‌పవార్ స్పీచ్..సెంటిమెంట్ ఏంటంటే..
Comments
Please login to add a commentAdd a comment