Delhi court
-
బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్రకు కోర్టు సమన్లు
బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర వల్ల మోసపోయానంటూ ఒక వ్యాపారి చేసిన ఫిర్యాదుతో ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. గరం ధరమ్ ధాబా ఫ్రాంచైజీ కేసుకు సంబంధించి ధర్మేంద్రతో పాటు మరో ఇద్దరికి ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు సమన్లు జారీ చేసింది. ‘గరం ధరమ్ ధాబా’ ఫ్రాంచైజీలో పెట్టుబడులు పెట్టించి తనను తప్పుదోవ పట్టించారని ఢిల్లీ వ్యాపారవేత్త సుశీల్ కుమార్ చేసిన ఫిర్యాదు మేరకు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ఫస్ట్ క్లాస్) యశ్దీప్ చాహల్ సమన్లు జారీ చేశారు.2018 ఏప్రిల్ నెలలో, ఉత్తరప్రదేశ్‌లోని NH-24/NH-9లో గరం ధరమ్ ధాబా ఫ్రాంచైజీ ఇస్తామని ధర్మేంద్ర తనను సంప్రదించినట్లు సుశీల్ కుమార్ తెలిపారు. ఆయన మాటలు నమ్మి తాను రూ.63లక్షల వరకు పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు. ఢిల్లీ, హర్యానా వటి నగరాల్లో ఈ రెస్టారెంట్ బ్రాంచ్‌లు సుమారుగా రూ. 70 నుంచి 80 లక్షల వరకు నెలవారీ టర్నోవర్‌ను ఆర్జిస్తున్నాయని ఆశ చూపించడంతో తాను కూడా ఫ్రాంచైజీలో పెట్టుబడి పెట్టడానికి ఆకర్షితుడయ్యానని తెలిపారు. ఆ సమయంలో ఒప్పంద పత్రంపై సంతకాలు కూడా చేశారన్నారు. ఈ ప్రక్రియ ముగుసిన తర్వాత ధర్మేంద్ర నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం తాను మోసపోయానని గ్రహించి కోర్టును ఆశ్రయించినట్లు సుశీల్ పేర్కొన్నారు. ప్రస్తుతం తన ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదని ఆయన వాపోయారు.‘గరం ధరమ్ ధాబా’ ఫ్రాంచైజీ కేసులో భాగంగా ధర్మేంద్రతో పాటు మరో ఇద్దరికి సమన్లు జారీ అయ్యాయి. 420, 120B సెక్షన్ల కింద వారికి సమన్లు పంపినట్లు తెలుస్తోంది. అయితే, ఈ కేసు 2025 ఫిబ్రవరి 20 విచారణ జరగనుందని కోర్టు వాయిదా వేసింది. -
ఢిల్లీ వక్ఫ్ బోర్డు కేసు: ఆప్ నేత అమానతుల్లా ఖాన్‌కు బెయిల్
ఢిల్లీ: ఢిల్లీ వక్ఫ్ బోర్డు మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు అమానతుల్లా ఖాన్‌కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అమానతుల్లా ఖాన్, ఇతరులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవడానికి కోర్టు నిరాకరించింది. వెంటనే అమానతుల్లాను జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.ఇక..ఆయనపై విచారణ జరపడానికి అవసరమైన అనుమతి లభించలేదని పేర్కొంది. సప్లిమెంటరీ చార్జిషీట్లో పేరున్న మరియం సిద్ధిఖీపై కేసును కొనసాగించడానికి ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. అమానతుల్లా ఖాన్‌కు వ్యతిరేకంగా తగిన సాక్ష్యాలు ఉన్నాయని కోర్టు అంగీకరించగా, అవసరమైన అనుమతులు లేకుండా విచారణ కొనసాగదని కోర్టు తెలిపింది. అవసరమైన అనుమతి పొందిన తర్వాత, ఛార్జ్ షీట్‌ను పరిగణలోకి తీసుకోవచ్చని పేర్కొంది. -
జాబ్స్ కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్, ఇద్దరు కుమారులకు కోర్టు సమన్లు
న్యూఢిల్లీ: ఆర్జేడీ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన ఇద్దరు కుమారులు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, ఇతరులకు ఢిల్లీ కోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. ల్యాండ్ ఫర్ జాబ్(ఉద్యోగ కుంభకోణం) కేసులో అక్టోబర్ 7న తమ ఎదుట హాజరుకావాలని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ విశాల్ గోగ్నే ఉత్తర్వులు జారీ చేశారు.అయితే ఈ కేసులో నిందితుడిగా లేనటువంటి లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌కు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రమేయాన్ని తోసిపుచ్చలేమని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది.నిందితులపై దాఖలైన సప్లిమెంటరీ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఈ ఆదేశాలు జారీ చేశారు.చదవండి: Kolkata: వెనక్కి తగ్గని వైద్యులు.. ఆగని నిరసనలకాగా 2004 నుంచి 2009 వరకు లాలూ ప్రసాద్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయన కుటుంబ సభ్యులకు భూమి బదాయింపునకు బదులుగా ఎలాంటి ప్రకటన విడుదల చేయకుండా కొందరు వ్యక్తులకు పలు రైల్వే జోన్లలో ఉద్యోగాలు ఇచ్చినట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేస్తుంది.ఈ కేసులో లాలూ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, కుమార్తె మిసా భారతికి ఢిల్లీ కోర్టు మార్చి 2023లో బెయిల్ మంజూరు చేసింది. ఇక లాలూ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు, 38 మంది అభ్యర్థులతో సహా 77 మందిపై సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను జూన్‌లో సీబీఐ దాఖలు చేసింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ కూడా ఆగస్ట్ 6న తుది నివేదికను కోర్టుకు సమర్పించింది. -
జగదీశ్ టైట్లర్‌పై హత్యాభియోగం
న్యూఢిల్లీ: 1984నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ నేత జగదీశ్ టైట్లర్‌పై ఢిల్లీ కోర్టు హత్య తదితర అభియోగాలు మోపింది. ఢిల్లీలోని పాల్ బంగాశ్ ప్రాంతంలో ముగ్గురువ్యక్తుల హత్యకు సంబంధించిన కేసుపై స్పెషల్ కోర్టు ఆగస్ట్ 30న విచారణ జరిపింది. ఆయనపై అభియోగాలు మోపేందుకు తగు ఆధారాలున్నట్లు స్పష్టం చేసింది. శుక్రవారం టైట్లర్‌పై హత్యతోపాటు దొంగతనం, చట్ట విరుద్ధంగా గుమికూడటం, కొట్టాట, వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచడం వంటి అభియోగాలు మోపుతూ తీర్పు వెలువరించింది. ఈ కేసులో సీబీఐ గతేడాది మే 20వ తేదీన టైట్లర్‌పై చార్జిషీటు నమోదు చేసింది. 1984 నవంబర్ ఒకటో తేదీన ఢిల్లీలోని పాల్ బంగాశ్ గురుద్వారా వద్దకు తెల్ల అంబాసిడర్లో వచ్చిన టైట్లర్..సిక్కులను చంపండి..వాళ్లు మా అమ్మ(అప్పటి ప్రధాని ఇందిర)ను చంపారు’అంటూ అనుచరులను రెచ్చగొట్టారని చార్జిషీటులో పేర్కొంది. దీంతో, టైట్లర్ అనుచరుల దాడిలో ముగ్గురు సిక్కులు ప్రాణాలు కోల్పోయారంది. 1984లో అప్పటి ప్రధాని ఇందిర హత్యానంతరం ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో సిక్కులపై దాడులు జరగడం తెలిసిందే. -
లిక్కర్ కేసు: కోర్టుకు హాజరైన కవిత
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై విచారణ సెప్టెంబర్ 25కు వాయిదా పడింది. బుధవారం(సెప్టెంబర్11) ఈ విషయమై ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా విచారణ జరిపారు. ఈ విచారణ కోసం లిక్కర్ కేసు నిందితులు ఎమ్మెల్సీ కవిత, మనీష్ సిసోడియా ఇతర నిందితులు వర్చువల్‌గా హాజరయ్యారు.లిక్కర్ కేసులో ఈడీ, సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఎమ్మెల్సీ కవితకు ఇటీవలే సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికీ జైలులోనే ఉన్నారు. ఈయన బెయిల్ పిటిషన్ ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. సీబీఐ కేసులో బెయిల్ కోసం కేజ్రీవాల్ ఎదురుచూస్తున్నారు. ఇదీ చదవండి.. వాల్మీకి స్కామ్‌లో మేం చెప్పిందే జరిగింది: కేటీఆర్ -
లాండ్ ఫర్ జాబ్ స్కాంలో లాలూకు షాక్
ఢిల్లీ: ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు మరో షాక్ తగిలింది. లాలూతో పాటు ఆయన తనయుడు తేజస్వి, మరో ఎనిమిది మందిపై ఈ కేసులో సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలైంది. ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రౌస్ అవెన్యూ కోర్టులో 96 పేజీల డాక్యుమెంట్లను సమర్పించింది. ఢిల్లీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌పై ఆగస్టు 13న వాదనలు వినిపించేందుకు లిస్ట్ చేశారు.Enforcement Directorate filed Ist supplementary charge sheet against RJD leader Tejaswhi Yadav and other accused in land for job scam case in the Rouse Avenue Court. Supplementary Charge sheet has named 11 accused. It also has 96 relied-upon documents.The court listed the…— ANI (@ANI) August 6, 2024కాగా, జనవరిలో సైతం ఈడీ బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, ఆమె కుమార్తెలు ఎంపీ మిసా భారతి, హేమా యాదవ్‌తో పాటు వ్యాపారవేత్త అమిత్ కత్యాల్, మాజీ రైల్వే ఉద్యోగి హృదయానంద్ చౌదరిలను నిందితులుగా పేర్కొంటూ ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 2004 నుంచి 2009 వరకు లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో పలువురు అభ్యర్థుల వద్ద భూమిని లంచంగా తీసుకొని రైల్వే ఉద్యోగాల ఇప్పించారనే ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ కేసులో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. -
దేశం విడిచి పారిపోయిన పూజా ఖేద్కర్?
న్యూఢిల్లీ: వరుస వివాదాలతో వార్తల్లోకి ఎక్కిన ఏఐఎస్ మాజీ ప్రొబెషనరీ అధికారిణి పరారీలో ఉన్నారా?. ఆమె కోసం పోలీసులు గాలింపు చేపట్టారా?. ఢిల్లీ కోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించడం వెంటనే.. ఆమె దేశం విడిచి పారిపోయారా?. ముందస్తు బెయిల్ విషయంలో పూజా ఖేద్కర్‌కు గురువారం చుక్కెదురైంది. ఓబీసీ కోటా, అలాగే దివ్యాంగుల కోటా విషయంలో ఆమె మోసం చేశారని, ఈ అంశాల్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకున్న యూపీఎస్సీ ఆమెను సర్వీస్ నుంచి డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనపై అభియోగాల దృష్ట్యా అరెస్ట్ తప్పదని ఆమె భావించారు. వెంటనే తన లాయర్ ద్వారా ఢిల్లీ పాటియాలా హౌజ్ కోర్టులో ఒక పిటిషన్ వేశారు. కానీ, కోర్టు అందుకు నిరాకరించింది. పూజాను కస్టోడియల్ విచారణ జరిపితేనే వాస్తవాలు బయటకు వస్తాయని బెయిల్ తిరస్కరణ సందర్భంగా న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అయితే.. జులై 31న అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ నిర్ణయం ప్రకటించిన నాటి నుంచి ఆమె ఫోన్ స్విచ్చాఫ్ వస్తోంది. అంతకు ముందు ముస్సోరీలోని అకాడమీ ఎదుటా హాజరై ఆమె తన వివరణ ఇచ్చుకోలేదు. దీంతో యూపీఎస్సీ ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే.. నోటీసులకు స్పందించేందుకు ఆగష్టు 4వ తేదీ వరకు ఆమె గడువు కోరారు. కానీ, యూపీఎస్సీ మాత్రం జులై 30 దాకా అవకాశం ఇచ్చింది. అయినా ఆమె గైర్హాజరయ్యారు. దీంతో ఆమె దుబాయ్‌కి వెళ్లిపోయి ఉండొచ్చని జాతీయ మీడియా కథనాలు ఇస్తోంది. దీనిపై పూజా తరఫు స్పందన రావాల్సి ఉంది. మరోవైపు.. పుణే పోలీసులు సైతం ఆమె పరారైన విషయాన్ని ధృవీకరించాల్సి ఉంది. -
మేధా పాట్కర్‌కు 5 నెలల జైలు
న్యూఢిల్లీ: సామాజిక వేత్త, నర్మదా బచావో ఉద్యమకారిణి మేధా పాట్కర్‌కు ఢిల్లీ కోర్టు సోమవారం ఐదు నెలల సాధారణ కారాగార శిక్ష విధించింది. గుజరాత్‌లోని ఒక ఎన్జీవోకు సారథి, ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా 23 ఏళ్ల క్రితం పాట్కర్‌పై వేసిన కేసులో ఆమెను దోషిగా తేలుస్తూ గత నెల ఏడో తేదీన ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ తీర్పు చెప్పారు. అయితే శిక్ష ఖరారును రిజర్వ్‌చేసి సోమవారం తీర్పును వెలువరించారు. పరువునష్టం కింద సక్సేనాకు రూ.10 లక్షల జరిమానా చెల్లించాలని పాట్కర్‌ను కోర్టు ఆదేశించింది. తీర్పును పాట్కర్ పై కోర్టులో సవాల్ చేసుకునేందుకు అవకాశం కలి్పస్తూ నెలరోజులపాటు శిక్ష అమలును నిలిపివేస్తూ న్యాయమూర్తి రాఘవ్ శర్మ ఉత్తర్వులిచ్చారు. అయితే శిక్ష ప్రస్తుతానికి నిలుపుదల చేసిన నేపథ్యంలో తనకు బెయిల్ ఇవ్వాలని పాట్కర్ కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ఆనాడు సక్సేనాను పిరికిపంద అంటూ పాట్కర్ దూషించిన అంశం కోర్టులో రుజువుకావడంతో ఆమెను దోషిగా తేల్చారు. హవాలా లావాదేవీల్లో సక్సేనా హస్తముందంటూ పాట్కర్ చేసిన ఆరోపణల్లో నిజంలేదని, పాట్కర్ కారణంగా ఆయన పరువుకు నష్టం కలిగిందని కోర్టు అభిప్రాయపడిన విషయం విదితమే. 2000 సంవత్సరంలో అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేసే ‘కౌన్సిల్ ఫర్ సివిల్ లిబరీ్టస్’ అనే స్వచ్ఛంద సంస్థకు వీకే సక్సేనా అధ్యక్షునిగా ఉండేవారు. తనకు, నర్మదా బచావో ఆందోళన్ ఉద్యమానికి వ్యతిరేకంగా సక్సేనా ప్రకటనలు ఇచ్చారని ఆయనపై పాట్కర్ తొలిసారిగా ఫిర్యాదుచేశారు. -
సిసోడియా అమాయకుడు, ఆయన్ను నిందించలేదు: కోర్టులో కేజ్రీవాల్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ బుధవారం సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం తిహార్ జైల్లో ఆయనను విచారించి వాంగ్మూలం నమోదు చేసుకున్నాయి. బుధవారం ట్రయల్ కోర్టులో ప్రవేశపెట్టాయి. తిహార్ జైలు నుంచి కేజ్రీవాల్‌ను ఉదయం కోర్టు ముందు హాజరుపర్చారు అధికారులు. ఆయనను కస్టడీకి కోరుతూ కోర్టుకు సీబీఐ దరఖాస్తు చేసుకుంది.విచారణ సందర్భంగా ప్రస్తుతం రద్దు చేసిన మద్యం పాలసీ కింద నగరంలో మద్యం దుకాణాల ప్రైవేటీకరణకు మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియానే సిఫార్సు చేశారని సీఎం కేజ్రీవాల్ తమ విచారణలో చెప్పినట్లు సీబీఐ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టుకు తెలియజేశారు.అయితే సీబీఐ ఆరోపణలు కేజ్రీవాల్ ఖండించారు. మనీష్ సిసోడియా దోషి అని తాను ఎలాంటి ప్రకటన చేయలేదని పేర్కొన్నారు. సిసోడియా పూర్తిగా అమాయకుడని, తమ పరువు తీయడమే దర్యాప్తు సంస్థల లక్ష్యమని విమర్శించారు. వాస్తవాలను వక్రీకరించి, అసంబద్ధమైన ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు.కేజ్రీవాల్ తిరస్కరణను తిప్పికొట్టిన సీబీఐ.. తాము వాస్తవాలను మాట్లాడుతున్నట్లు కోర్టుకు తెలిపింది. అయితే సీబీఐ వాదనలపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. కేజ్రీవాల్ ప్రకటనను తాము చదివామని ఆయన ఆ విధంగా చెప్పలేదని కోర్టు పేర్కొంది.ప్రైవేటీకరణ తన ఆలోచన కాదని కేజ్రీవాల్ పేర్కొన్నారని, దానిని సీబీఐ తప్పుగా గ్రహించిందని కోర్టు తెలిపింది. ఇదిలా ఉండగా మద్యం కుంభకోణం కేసులో సిసోడియాను గతేడాది ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్ట్ చేసింది. అనంతరం మార్చి 9, 2023న మనీలాండరింకేసులో ఈడీ అదుపులోకి తీసుకుంది. -
Delhi Court: కేజ్రీవాల్‌కు బెయిల్
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ అభియోగాలపై అరెస్టయిన ఆమ్ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు గురువారం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ వెకేషన్ స్పెషల్ జడ్జి నియయ్ బిందు ఆదేశాలు జారీ చేశారు. బెయిల్ ఆదేశాలను 48 గంటల పాటు నిలిపి ఉంచాలన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభ్యర్థనను జడ్జి తిరస్కరించారు. బెయిల్ ఉత్తర్వులను పైకోర్టులో సవాల్ చేస్తామని, అందుకోసం 48 గంటలు ఆదేశాలను నిలిపి ఉంచాలని ఈడీ అభ్యరి్థంచింది. కానీ జడ్జి నియయ్ బిందు ఇందుకు సమ్మతించలేదు. దర్యాప్తునకు ఆటంకం కలి్పంచకూడదని, సాక్షులను ప్రభావితం చేయరాదని కేజ్రీవాల్‌కు కోర్టు షరతులు విధించింది. అలాగే అవసరమైనపుడల్లా కోర్టు ఎదుట హాజరుకావాలని, దర్యాప్తునకు సహకరించాలని షరతులు పెట్టింది. కేజ్రీవాల్‌కు రెగ్యులర్ బెయిల్ రావడం ఆప్‌కు, ఇండియా కూటమి మిత్రపక్షాలకు ప్రధానికి వ్యతిరేకంగా ఒక అస్త్రం దొరికినట్లే. కేజ్రీవాల్ న్యాయవాదులు శుక్రవారం కోర్టులో పూచీకత్తును సమరి్పస్తే అదేరోజు తీహార్ జైలు నుంచి ఢిల్లీ సీఎం బయటకు వస్తారు. ఢిల్లీ మద్యం పాలసీలో కొందరు మద్యం వ్యాపారులకు మేలు చేకూర్చేలా ఉద్దేశపూర్వకంగా నిబంధనలకు చేర్చారని, ఈ కుట్రలో కేజ్రీవాల్ భాగస్వామి అని ఆరోపిస్తూ ఈడీ మార్చి 21న ఢిల్లీ సీఎంను అరెస్టు చేసింది. మద్యం వ్యాపారుల నుంచి అందుకున్న ముడుపులను గోవా ఎన్నికల్లో ఆప్ ప్రచారానికి వినియోగించారని, ఆప్ జాతీయ కనీ్వనర్‌గా కేజ్రీవాల్ వ్యక్తిగతంగా, పరోక్షంగా మనీలాండరింగ్‌కు పాల్పడినట్లేనని ఈడీ వాదించింది. ఈ ఆరోపణలను ఖండించిన కేజ్రీవాల్ ఒక్క పైసాను కూడా ఈడీ పట్టుకోలేదని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం సుప్రీంకోర్టు మే 10 తేదీన కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. ఎన్నికలు ముగిశాక కేజ్రీవాల్ జూన్ 2న తీహార్ జైలులో లొంగిపోయారు. ఈడీది అంతులేని దర్యాప్తు మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఎలాంటి నగదును స్వా«దీనం చేసుకోలేదని, కేజ్రీవాల్‌పై అభియోగాలను నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని ఆయన న్యాయవాది వాదించారు. ఈడీ పక్షాన హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎస్.వి.రాజు కేజ్రీవాల్‌కు బెయిల్‌ను వ్యతిరేకించారు. ఈడీ ఊహాజనిత దర్యాప్తును చేయడం లేదని, లంచాలుగా ఇచి్చన కరెన్సీ నోట్ల ఫోటోలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. గోవాలో కేజ్రీవాల్ బసచేసిన సెవన్ స్టార్ హోటల్ గదికి చెల్లింపులు జరపడానికి ముడుపుల డబ్బునే వాడారని ఆరోపించారు. తన మొబైల్ ఫోన్ పాస్ట్‌వర్డ్‌ను కేజ్రీవాల్ ఇవ్వడం లేదని, దీనిబట్టి మద్యం కుంభకోణంలో ఆయన పాత్ర ఉందని భావించవచ్చని రాజు వాదించారు. కేజ్రీవాల్ మొబైల్ ఫోన్‌ను ఓపెన్ చేస్తే మరింతమంది ప్రమేయం బయపడుతుందన్నారు. ‘కేజ్రీవాల్ వ్యక్తిగతంగా ఎలాంటి నేరానికి పాల్పడకపోయినా.. ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) సెక్షన్ 70 ప్రకారం ఆమ్ఆద్మీ పార్టీ వ్యహారాలకు ఆయనే బాధ్యుడు కాబట్టి ఆప్ నేరాలకు కూడా జాతీయ కనీ్వరర్గా ఢిల్లీ సీఎం దోషిగా బాధ్యుడవుతాడు’ అని రాజు పేర్కొన్నారు. కేజ్రీవాల్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి.. ఈడీ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ‘ఈడీ స్వంతత్ర సంస్థా? లేక రాజకీయ బాసులు చెప్పినట్లు ఆడుతోందా? అని విక్రమ్ చౌదరి ప్రశ్నించారు. ఊహాజనిత అంశాల ఆధారంగానే ఈడీ తుది నిర్ణయాలకు వస్తోందన్నారు. ఆప్‌కు రూ. 45 కోట్లు ముడుపులు ముట్టాయనడానికి ఈడీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. ఇంకా అరెస్టులు కొనసాగిస్తున్నారు. మరోవైపు రూ. 100 కోట్లు ముడుపులుగా అందాయంటారు. ఈడీ ఇంకా ఆధారాలు సేకరిస్తూనే ఉంటే.. ఇది అంతులేని దర్యాప్తే అవుతుంది. కాబట్టి ఇతరులకు ఇచి్చనట్లే కేజ్రీవాల్‌కు స్వేచ్ఛనివ్వాలని విక్రమ్ చౌదరి కోర్టుకు విన్నవించారు. మనీలాండరింగ్ కేసులో పరిణామక్రమం.. జూలై 2022: ఢిల్లీ ఎక్సైజ్ విధానంలో రూపకల్పన, అమలులో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై సీబీఐ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశం. ఆగస్ట్ 2022: సీబీఐ, ఈడీ కేసులు నమోదు. అక్టోబర్ 30, 2023: మనీ లాండరింగ్ కేసులో నవంబరు 2న విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్‌కు ఈడీ తొలి సమన్లు. ఏప్రిల్ 27: చట్టవిరుద్ధ అరెస్టు.. స్వేచ్ఛాయుత ఎన్నికలు, సమాఖ్య వ్యవస్థ అనే ప్రజాస్వామ్య మూలస్తంభాలపై దాడి అని సుప్రీంకోర్టుకు తెలిపిన కేజ్రీవాల్. ఏప్రిల్ 29: ఈడీ పలుమార్లు సమన్లు జారీచేసినా స్టేట్మెంట్ రికార్డు చేయడానికి కేజ్రీవాల్ విచారణకు హాజరుకాకపోవడాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు. మే 10: లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు. జూన్ 2న లొంగిపోవాలని ఆదేశం. మే 30: అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్‌ను కోరుతూ ఢిల్లీ కోర్టుకు కేజ్రీవాల్. జూన్ 5: మధ్యంతర బెయిల్ తిరస్కరణ. జూన్ 20: రెగ్యులర్ బెయిల్ మంజూరు. -
Delhi Liquor Case: సీఎం కేజ్రీవాల్‌కు భారీ ఊరట.. బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్‌కే కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. కాగా లిక్కర్ కేసులో సాధారణ బెయిల్ కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు గురువారం విచారణ జరిపి తీర్పును రిజర్వు చేసింది. అనంతరం కోర్టు వెకేషన్ బెంచ్ జడ్జి న్యాయ బిందు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.బెయిల్ మంజూరు సందర్భంగా.. లక్ష రూపాయల పూచీకత్తు బాండ్ సమర్పించాలని కోర్టు షరతు విధించింది. అయితే అప్పీల్‌కు వెళ్లేంత వరకు తీర్పును 48 గంటలపాటు సస్పెండ్ చేయాలని ఈడీ కోరిన్పటికీ కోర్టు తిరస్కరించింది. ఇక బెయిల్ లభించడంతో కేజ్రీవాల్ శుక్రవారం తిహార్ జైలు నుంచి బయటకు రానున్నారు. మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో సుప్రీంకోర్టు లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు మద్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల తర్వాత జూన్ రెండున కేజ్రీవాల్ మళ్లీ తిహార్ జైల్లో లోంగిపోయారు. కింది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా నేడు ఆయనకు బెయిల్ మంజూరైంది. -
కేజ్రీవాల్ రూ.100 కోట్లు డిమాండ్ చేసినట్లు ఆధారాలున్నాయి: ఈడీ
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు జూలై 3 వరకు పొడిగించింది. లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్.. సాధారణ బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు బుధవారం విచారించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంను కోర్టు ముందు హాజరుపరిచారు.ఈ సందర్బంగా కేజ్రీవాల్‌పై దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కీలక ఆరోపణలు చేసింది. లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్ రూ.100 కోట్లు డిమాండ్ చేసినట్లు తమ ఆధారాలు ఉన్నాయని ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోర్టుకు తెలిపారు. అరెస్టుకు ముందే ఆధారాలు సేకరించినట్లుగా పేర్కొన్నారు.‘ఈ కేసులో మనీలాండరింగ్ నేరంపై కోర్టు విచారణ చేపట్టింది. మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి మనీష్ సిసోడియా సహా సహ నిందితుల బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడం ద్వారా అక్రమంగా మనీలాండరింగ్ జరిగినట్లు కోర్టు విశ్వసిస్తోంది’ ఆయన పేర్కొన్నారు.పీఎంఎల్ఏ కింద దాఖలు చేసిన ఛార్జిషీట్లలో కేజ్రీవాల్ పేరు లేదని ఆయన తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదించారు. అంతేగాక సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో సైతం కేజ్రీవాల్‌ను నిందితుడిగా పేర్కొనలేదన్న విషయాన్ని ప్రస్తావించారు.ఇక కేజ్రీవాల్ కింది కోర్టులో బెయిల్ పిటిషన్ వేయవచ్చని మే 10న సుప్రీం కోర్టు తమ ఆదేశాల్లో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. మొత్తం కేసు ఆగస్టు 2022లో ప్రారంభమవ్వగా.. ఎన్నికలకు ముందు 2024 మార్చిలో కేజ్రీవాల్ అరెస్టు చేశారని అన్నారు. ఆయన అరెస్టు సమయం వెనుక దురుద్దేశం ఉందన్నారు.మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో కింది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. -
ల్యాండ్ ఫర్ జాబ్ : లాలూ ప్రసాద్ యాదవ్‌కు మరో ఎదురు దెబ్బ
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో లాలూపై సీబీఐ మరో ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఆ ఛార్జ్ షీట్లో లాలూతో పాటు మరో 71 మందిని చేర్చింది. సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగానే ఆ ఛార్జ్ షీట్లపై విచారణ చేపట్టాలా? వద్దా? అనే అంశంపై న్యాయమూర్తి జులై 6న తేల్చనున్నారు.గత మే 29న ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో కంక్లూజీవ్ ఛార్జ్ షీట్ దాఖలు చేయడంలో జాప్యం చేసినందుకు ఢిల్లీ కోర్టు న్యాయమూర్తి సీబీఐని నిలదీశారు. ఛార్జిషీటు దాఖలు చేసేందుకు ప్రతి తేదీకి మరింత సమయం కావాలని సీబీఐ కోరడంపై న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. జూన్ 7లోగా తుది నివేదికను దాఖలు చేయాలని దర్యాప్తు సంస్థను ఆదేశించారు. ఢిల్లీ కోర్టు ఆదేశాలకు అనుగుణంగా తాజాగా కోర్టు ఛార్జ్ షీట్‌ను దాఖలు చేసింది.ఉద్యోగాలే లేవు.. అయినప్పటికీ లాలూ ప్రసాద్ యాదవ్ 2004 నుంచి 2009 వరకు రైల్వేమంత్రిగా పని చేశారు. ఆ సమయంలో జోనల్ రైల్వేలలో ఉద్యోగాలపై అధికారిక నోటిఫికేషన్ ఇవ్వలేదు. అయినప్పటికీ పాట్నా, ముంబై, జబల్పూర్, కోల్‌కతా, జైపూర్, హాజీపూర్‌లలో ఉన్న వివిధ జోనల్ రైల్వేలలో లాలూ ప్రసాద్ యాదవ్ నియమించారు. ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం, సహచరుల పేరుతో భూములను తీసుకున్నట్లుగా ఆరోపణలున్నాయి.కంక్లూజీవ్ ఛార్జ్ షీట్ అంటే?ఒక వ్యక్తికు సంబంధించిన ఏదైనా కేసును దర్యాప్తు సంస్థలు పూర్తి విచారణ చేపట్టిన అనంతరం.. సదరు వ్యక్తి నేరం చేశారని నిర్ధారిస్తూ అభియోగాలు మోపుతూ కోర్టు దాఖలు చేసే దానిని కంక్లూజీవ్ ఛార్జ్ షీట్ అంటారు. -
కేజ్రీవాల్‌కు మరో షాక్
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్.. మధ్యంతర బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. కాగా వైద్య పరీక్షలు నిర్వహించుకునేందుకు ఏడు రోజుల పాటు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కేజ్రీవాల్ ఈ పిటిషన్ వేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. కేజ్రీవాల్‌కు వైద్య పరీక్షలు నిర్వహించాలని తీహార్ జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 7కు వాయిదా వేసింది. -
జులై 3దాకా తీహార్ జైల్లోనే కవిత!
న్యూఢిల్లీ, సాక్షి: మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది స్పెషల్ కోర్టు. ఈడీ కేసులో జులై 3వ తేదీదాకా కస్టడీ పొడిగిస్తున్నట్లు సోమవారం ఉదయం ఆదేశాలిచ్చింది. దీంతో బెయిల్ వచ్చేదాకా ఆమె తీహార్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.లిక్కర్ కేసులో జ్యుడీషియల్ రిమాండ్ ముగియడంతో ఈ ఉదయం స్పెషల్ కోర్టుకు తీసుకొచ్చారు తీహార్ జైలు అధికారులు. ఈ సందర్భంగా కవితపై దాఖలైన ఈడీ చార్జిషీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు ఆ అభియోగ పత్రాలను కవిత తరఫు న్యాయవాదికి అందజేసింది. ఆ వెంటనే ఈడీ కేసులో కస్టడీని మరో నెల రోజుల పాటు పొడిగిస్తున్నట్లు జడ్జి కావేరీ బవేజా వెల్లడించారు. ఇక.. కోర్టుకు వచ్చిన కవితను భర్త అనిల్, ఇద్దరు కొడుకులను కలిసేందుకు అనుమతిచ్చారు స్పెషల్ కోర్టు జడ్జి. అనంతరం కవితను తీహార్ జైలుకు తరలించారు. కవితపై ఈడీ చార్జ్‌షీట్‌లో కీలక అంశాలులిక్కర్ కేసులో కవిత పై ఈడీ అభియోగాలను పరిగణనలోకి తీసుకున్న స్పెషల్ కోర్టుఈడి మనీలాండరింగ్ కేసులో కవితను నిందితురాలిగా చేర్చిన స్పెషల్ కోర్టురూ. 1100 కోట్ల నేరం జరిగిందని చార్జ్‌షీట్‌లో పేర్కొన్న ఈడీరూ. 192 కోట్ల లాభాలను ఇండో స్పిరిట్స్ పొందింది100 కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారుకవిత డిజిటల్ ఆధారాలు ధ్వంసం చేసినట్లు పేర్కొన్న ఈడీసీబీఐ కేసులోనూ కస్టడీ పొడిగింపుమరొకవైపు సీబీఐ కేసులో సైతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది కోర్టు. సీబీఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీని జూన్ 7 వరకు పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఈ క్రమంలో కవిత పై చార్జ్ షీట్‌ను జూన్ 7న సీబీఐ దాఖలు చేయనుంది. సీబీఐ కేసులో భాగంగా నేటి మధ్యాహ్నం కవితను వర్చువల్‌గా కోర్టు ముందు హాజరుపరిచారు జైలు అధికారులు. -
లిక్కర్ కేసు: కవితకు మరో షాక్
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితపై దాఖలైన ఛార్జ్‌షీట్‌ను ఢిల్లీ రౌస్ఎవెన్యూ కోర్టు బుధవారం(మే29) పరిగణలోకి తీసుకుంది. ఇప్పటికే ఈ విషయమై వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. జూన్3న ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న నిందితులందరూ కోర్టుకు రావాలని వారెంట్లు జారీ చేసింది. దీంతో కవితను ఈడీ అధికారులు అదే రోజు కోర్టు ముందు హాజరుపర్చనున్నారు. కాగా, ఈ కేసులో బెయిల్ కోరుతూ ఢిల్లీ హైకోర్టులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. -
‘ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర’.. ఆప్ మంత్రి అతిషికి ఢిల్లీ హైకోర్టు సమన్లు
దేశ రాజధాని ఢిల్లీలో మంత్రుల కొనుగోలుకు కుట్ర జరుగుతుందంటూ ఆప్ మంత్రి అతిషి చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జూన్ 29న తమ ఎదుట హాజరు కావాలని అతిషిని ఆదేశించింది. బీజేపీ వేసిన పరువు నష్టం దావా పిటిషన్‌పై స్పందనలో భాగంగా కోార్టు ఈ విధంగా స్పందించింది.కాగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత మంత్రి అతిషి ఆప్‌ర్టీని, ప్రభుత్వాన్ని ఢిల్లీలో సమర్ధవంతంగా ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఇటీవల బీజేపీ ఆరోపణలు గుప్పించారు. ఆప్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ. 25 కోట్లు వలగా వేస్తూ వారిని కొనేందుకు కాషాయ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దీనికి తోడు తన రాజకీయ భవిష్యత్తు అంధకారంగా మారకుండా ఉండేందుకు పార్టీ మారాలని బీజేపీ తనకు ఆఫర్ చేసిందని అతిషి ఆరోపించారు. ‘బీజేపీ సన్నిహితుల ద్వారా నన్ను సంపద్రించింది. వారు నన్ను బీజేపీలో చేరమని అడిగారు. ఇది నా రాజకీయ జీవితాన్ని కాపాడుతుందని చెప్పారు. ఒకవేళ నేను సానకటీ మారకపోతే, నెల రజుల లోపల ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) నన్ను అరెస్టు చేస్తుందని బెదిరించారు వారు బెదిరించారు’ అని పేర్కొంది.అతిషితో పాటు, ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంలో తమ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రతిపక్ష బీజేపీ ప్రయత్నించిందని కేజ్రీవాల్ సైతం ఆరోపించారు. ఈ ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది. వీటిని తప్పుడు, నిరాధారమైనవిగాపేర్కొంది. ఒకవేళ కేజ్రీవాల్, అతిషి ఆరోపణలు నిజమైతే వాటికి సాక్షాలు చూపించాలని డిమాండ్ చేసింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే బీజేపీ పోలీసులను ఆశ్రయించగా.. ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలపై ఢిల్లీ పోలాసులు నోటీసులు జారీ చేశారు.ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఢిల్లీ కోర్టులో పరువు నష్టం దావా కేసు వేసింది. అతిషి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. దీనికి న్యాయస్థానం స్పందిస్తూ.. అతిషికి నోటీసులు జారీ చేసింది. జూన్ 29న మ ఎదుట హాజరు కావాలని తెలిపింది. -
పరువు నష్టం కేసు.. మేధాపాట్కర్ను దోషిగా తేల్చిన కోర్టు
న్యూఢిల్లీ: ‘నర్మదా బచావో’ ఆందోళన్ ఉద్యమానికి నాయకత్వం వహించిన మేధాపాట్కర్ను పరువు నష్టం కేసులో ఢిల్లీ కోర్టు దోషిగా తేల్చింది. ఈకేసులో ఆమెకు రెండేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదంటే రెండూ విధించే అవకాశం ఉంది. పాట్కర్ దోషిగా తేలిన పరువు నష్టం కేసును ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గతంలో ఫైల్ చేశారు. అప్పట్లో సక్సేనా అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేసే ఎన్జీవో నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్‌కు నేతృత్వం వహించేవారు. పాట్కర్ గుజరాత్లో ‘నర్మదా బచావో’ ఆందోళన్‌కు నాయకత్వం వహించేవారు.ఈ క్రమంలోనే పాట్కర్, సక్సేనా ఒకరిపై ఒకరు తరచూ కోర్టులకెక్కేవారు. తనపై పాట్కర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని సక్సేనా క్రిమినల్ డిఫమేషన్ కేసు దాఖలు చేశారు. ఈ కేసులోనే ప్రస్తుతం ఢిల్లీ సాకేత్ కోర్టు పాట్కర్‌ను దోషిగా తేల్చింది. -
ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యు కోర్టు మరోసారి పొడిగించింది. ఆమె కస్టడీని ఆరు రోజులపాటు(మే 20) వరకు పొడిగిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. తదుపరి విచారణను మే 20కు వాయిదా వేసింది.లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కవిత ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఆమె కస్టడీ మంగళవారంతో ముగియడంతో నేడు రౌస్ అవెన్యూ కోర్టులో వర్చువల్‌గా హాజరుపరిచారు. 14 రోజుల పాటు కవిత జ్యుడీషియల్ కస్టడి పొడిగించాలని ఈడీ కోర్టును కోరింది. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, చార్జ్ షీట్ ఫైల్ చేసినట్లుగా కోర్టుకు తెలిపింది.8 వేల పేజీలతో సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేశామని ఈడీ చెప్పింది. దీనిపై స్పందించిన కోర్టు మే 20న ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్ పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారిస్తామని తెలిపింది. ఈ క్రమంలో కవిత జ్యుడీషియల్ కస్టడీని ఈనెల 20 వరకు పొడిగిస్తున్నట్లు స్పెషల్ కోర్టు జడ్జి వెల్లడించారు. కాగా సీబీఐ కేసులోనూ గతంలో కవితకు మే 20 వరకు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆమె ప్రస్తుతం తిహార్ జైల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కవిత పాత్రను ప్రస్తావిస్తూ ఇటీవల ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. మరోవైపు ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24న విచారణ చేపట్టనుంది. -
Delhi court: బ్రిజ్ భూషణ్‌పై అభియోగాలు నమోదు చేయండి
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపులు, ఇతర అభియోగాలను నమోదు చేయాల్సిందిగా ఢిల్లీ కోర్టు పోలీసులను ఆదేశించింది. తమను వేధించారంటూ ఐదుగురు మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణల్లో బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా తగు ఆధారాలున్నట్లు కోర్టు తెలిపింది. కేసులు నమోదు చేయాల్సిందిగా అడిషనల్ చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్(ఏసీఎంఎం) ప్రియాంకా రాజ్‌పుత్ ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో సహ నిందితుడు, డబ్ల్యూఎఫ్ఐ మాజీ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్‌పైనా అభియోగాలు నమోదు చేయాలని పేర్కొన్నారు. బ్రిజ్ భూషణ్‌పై ఆరో మహిళా మైనర్ రెజ్లర్ చేసిన ఆరోపణలకు తగు ఆధారాలు లేనందున ఆమె పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తెలిపారు. కోర్టు ఈనెల 21న అధికారికంగా అభియోగాలను నమోదు చేయనుంది. -
లిక్కర్ కేసు: మనీష్ సిసోడియాకు మళ్లీ చుక్కెదురు
న్యూఢిల్లీ: లిక్కర్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు కేసు విచారిస్తున్న రౌస్ ఎవెన్యూ కోర్టు నిరాకరించింది. సిసోడియాకు బెయిల్ ఇవ్వకూడదని సీబీఐ,ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కోర్టులో వాదనలు వినిపించాయి. దీంతో కోర్టు సిసోడియాకు బెయిల్ నిరాకరించింది. కాగా, లిక్కర్ స్కామ్ కేసులో సిసోడియాను సీబీఐ గతేడాది ఫిబ్రవరి26న అరెస్టు చేసింది. అప్పటి నుంచి సిసోడియా జైలులోనే ఉంటున్నారు. సీబీఐతో పాటు ఈడీ పెట్టిన కేసుల్లో సిసోడియా రెగ్యులర్ బెయిల్ కోర్టు డిస్మిస్ చేయడం ఇది రెండవసారి. గతేడాది సిసోడియా వేసిన బెయిల్ పిటిషన్లను ట్రయల్‌కోర్టుతో పాటు హైకోర్టు,సుప్రీంకోర్టు డిస్మిస్ చేసిన విషయం తెలిసిందే. -
కవిత బెయిల్‌పై మే మొదటి వారంలో తీర్పు
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై బుధవారం రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టులో వాదనలు ముగిశాయి. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సీబీఐ కేసులో మే 2న తీర్పు వెల్లడించనుంది. అదే విధంగా ఈడీ కేసులో బెయిల్‌పై మే6న తీర్పు వెల్లడిస్తామని కోర్టు పేర్కొంది. కాగా మే7తో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియనుంది.ఈడీ వాదనలుపీఎంఎల్ఏ చట్టం సెక్షన్ 19 కింద కవితను చట్టబద్దంగా అరెస్ట్ చేశాంఅక్రమంగా అరెస్ట్ చేశారనే ఆరోపణల్లో వాస్తవం లేదుఈ కేసులో క్విడ్ ప్రో కో జరిగింది.రూ. 581 కోట్ల రూపాయలు హోల్ సేల్ వ్యాపారులు సంపాదించారు.అయిదు నుంచి 12 శాతానికి కమీషన్ పెంచారు.దానివల్ల ప్రభుత్వానికి, ప్రజలకి నష్టం జరిగింది.ఈ పాలసీలో ఇండో స్పిరిట్‌కు మేజర్ షేర్ దక్కింది. దీని ద్వారా ఈ అక్రమాలకు పాల్పడ్డారు.పాత పాలసీని పక్కన పెట్టి అక్రమ సంపాదన కోసం కొత్త పాలసీ తెచ్చారు.విజయ్ నాయర్, మనీష్ సిసోడియా ద్వారా బుచ్చిబాబు, అరుణ్ పిళ్లై కథ నడిపారు.విజయ్ నాయర్ మద్యం వ్యాపారులతో సమావేశాలు ఏర్పాటు చేశారు.అసాధారణ లాభాలు గడించారు.బలవంతంగా మహదేవ్ డిస్ట్రిబ్యూటర్ నుంచి పక్కకు తప్పించారు.ఈ కేసులో మనీష్ సిసోడియా, కేజ్రీవాల్‌కు బెయిల్ దక్కలేదు.ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయల లంచం అందింది.మాగుంట శ్రీనివాసులురెడ్డి కీలక స్టేట్మెంట్ ఇచ్చారు.అరవింద్ కేజ్రీవాల్‌ను మాగుంట శ్రీనివాసులురెడ్డి మద్యం వ్యాపారం కోసం ఢిల్లీ సెక్రటేరియట్ కలిశారు. కవిత ను కలవాలని కేజ్రీవాల్ చెప్పారని మాగుంట చెప్పారు.కవితను కలిసినప్పుడు 100 కోట్లు ఆప్ కి ఇస్తే ఢిల్లీ మద్యం వ్యాపారం ఇస్తారని ఆమె చెప్పింది.అందులో 25 కోట్లు కవిత మనిషి బుచ్చిబాబుకు మాగుంట చెల్లించారు.ఎల్ 1 లైసెన్స్‌లో మేజర్ షేర్ దక్కించుకేందుకు కవిత ప్రయత్నించారు.అయితే, సమీర్ మహేంద్రకు 33, మాగుంట 33, కవిత 33 శాతం వాటాలను పొందారు.బుచ్చిబాబు, మాగుంట రాఘవ వాట్సాప్ మెసేజ్‌లో ఈ సాక్షాలు దొరికాయి.మాగుంట రాఘవ అప్రూవర్ గా మారి అన్ని విషయాలను ధృవీకరించారు.ఒకసారి 15 కోట్లు, మరోసారి 10 కోట్లు బుచ్చిబాబుకు, అభిషేక్ బోయినపల్లి కి మాగుంట సిబ్బంది ఇచ్చారుఅనుకూలంగా లిక్కర్ పాలసీ తయారీ కోసం ఈ లంచాలు ఇచ్చారుకోర్టు అనుమతి తోనే నిందితులు అప్రూవర్ గా మారారుఅప్రూవర్ను ప్రలోభ పెట్టారని అనుమానిస్తే అంటే కోర్టు నిర్ణయాన్ని తప్పు పట్టడమే. అప్రూవర్లపై చేస్తున్న ఆరోపణలు ప్రచారం కోసం చేస్తున్న రాజకీయ వాదనలే తప్పు వాటిలో పస లేదు.ఎవరు ఎవరికి ఎలక్టొరల్ బాండ్స్ ఇచ్చారనేది ఈ కేసులో అనవసరం.చట్టం ప్రకారమే ఈ కేసు ముందుకి వెళ్ళాలి.అనేక సార్లు అరుణ్ పిళ్లై స్వచ్ఛందంగా వాంగ్మూలం ఇచ్చారు.ఈడీ బెదరించిందని ఎప్పుడూ చెప్పలేదు.కవితకు నోటీసు ఇచ్చిన తర్వాతే అరుణ్ పిళ్లై తన వాంగ్మూలం ఉపసంహరించుకున్నారుకవిత ఒత్తిడితోనే ఆరు నెలల తర్వాత అరుణ్ పిళ్లై వాంగ్మూలం వెనక్కి తీసుకున్నారు ఈడీ బెదిరిస్తే , అప్పుడే వెనక్కి తీసుకోకుండా ఆరు నెలలు తర్వాత వాంగ్మూలం వెనక్కి తీసుకుంటారా ?కవిత, కేజ్రీవాల్, మనీష్ సిసోడియా మధ్య రాజకీయ అవగాహన ఉందని బుచ్చి బాబు స్టేట్మెంట్ ఇచ్చారుదీని ద్వారా విజయ్ నాయర్ తో కలిసి లిక్కర్ పాలసీ తయారు చేశారుపబ్లిక్ లోకి రాకముందే లిక్కర్ పాలసీ వీరికి వచ్చిందికవిత చెప్పిన అంశాలే మద్యం పాలసీలో పెట్టారుకవిత బంధువు మేకా శరణ్ ను ఇండో స్పిరిట్ లో ఉద్యోగిగా పెట్టారుఉద్యోగానికి హాజరు కాకుండా జీతం తీసుకున్నారువిచారణ కోసం పిలిస్తే ఏడెనిమిది రోజుల పాటు మిస్ అయ్యాడుఈ కేసుకు సంబంధించి అనేక మంది వాంగ్మూలాలు ఇచ్చారుహవాలా ఆపరేటర్స్ వాంగ్మూంలాలు ఇచ్చారుకవిత ఇచ్చిన 9 ఫోన్లలో డేటా డిలీట్ చేశారుఎందుకు డిలీట్ చేశారంటే కవిత సమాధానం చెప్పలేదుతన ఫోన్లను పని మనుషులకు ఇచ్చారని కవిత పొంతన లేని సమాధానాలు చెపుతున్నారుపని మనుషులు డేటా ఎందుకు డిలీట్ చేస్తారు?ఫోన్లు ఇవ్వాలని కోరిన వెంటనే డేటా ఫార్మాట్ చేశారుసాక్ష్యాలు ధ్వంసం చేశారు, సాక్షులను బెదిరించారుకాగా మంగళవారం మధ్యాహ్నం సైతం ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. అనంతరం న్యాయమూర్తి విచారణ నేటికివాయిదా వేశారు. మరోవైపు లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించిన విషయం తెలిసిందే. మరో 14 రోజులపాటు పొడిగిస్తూ మంగళవారం న్యాయమూర్తి కావేరి బవేజా ఆదేశాలు జారీ చేశారు. మే 7న ఉదయం ఆమెను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు.బెయిల్ పిటిషన్‌పై మంగళవారం నాటి వాదనలు..ఈడీ తరఫున న్యాయవాది జొహెబ్ హొస్సేన్ వాదనలు వినిపిస్తూ కీలకపాత్ర పోషించిన కవితకు బెయిలు నిరాకరించాలని కోరారు. కవిత అరెస్టు విషయంలో చట్టవిరుద్ధంగా, కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని స్పష్టంచేశారు. కవితను అరెస్టు చేయబోమని ఎక్కడా అండర్‌టేకింగ్ ఇవ్వలేదని, సమన్లు ఇవ్వబోమని మాత్రమే చెప్పామన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు.డీ తరఫున న్యాయవాది జొహెబ్ హొస్సేన్ వాదనలు వినిపిస్తూ కీలకపాత్ర పోషించిన కవితకు బెయిలు నిరాకరించాలని కోరారు. కవిత అరెస్టు విషయంలో చట్టవిరుద్ధంగా, కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని స్పష్టంచేశారు. కవితను అరెస్టు చేయబోమని ఎక్కడా అండర్‌టేకింగ్ ఇవ్వలేదని, సమన్లు ఇవ్వబోమని మాత్రమే చెప్పామన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు.ఈడీ పరిధి దేశమంతా ఉంటుందని, అందుకే కవిత అరెస్టు విషయంలో ట్రాన్సిట్ ఆర్డర్ అవసరం రాలేదన్నారు. అరెస్టు ప్రక్రియ చట్టబద్ధంగానే జరిగిందని, సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ ఉపసంహరణే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ కేసులో పలువురి వాంగ్మూలాల ఆధారంగానే కవిత పాత్రపై స్పష్టత వచ్చిదని ఆ తర్వాతే అరెస్టు చేశామన్నారు. ఇండో స్పిరిట్స్‌లో 33.5 శాతం వాటాను తన ప్రాక్సీ అరుణ్ పిళ్లై ద్వారా కవిత కలిగి ఉన్నారని జొహెబ్ హొస్సేన్ చెప్పారు. హోల్‌సేలర్లకు కమీషన్లు పెంచుతూ మద్యం విధానంలో మార్పులు చేసి సౌత్‌గ్రూప్‌నకు అనుకూలంగా మారేలా ఒప్పందం జరిగిందని, కుంభకోణంలో రూ.100 కోట్లు లావాదేవాలు జరిగాయన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆమె ఆదేశాల మేరకే రూ.25 కోట్లు ఇచ్చారని, ఈ మేరకు వారిద్దరూ వాంగ్మూలం ఇచ్చారని పేర్కొన్నారు.ఈ కుంభకోణానికి సంబంధించి ఆప్ నేత కేజ్రీవాల్, కవిత మధ్య కుదరిన ఒప్పందం మేరకే రూ.100 కోట్లు ఆమ్ ఆద్మీ పారీ్టకి ఇచ్చారని మరో నిందితుడు దినేష్ ఆరోరా తన వాంగ్మూలంలో చెప్పారన్నారు. నగదు లావాదేవీలకు సంబంధించి కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఫోన్ చాట్లోనూ సమాచారం లభ్యమైందని పేర్కొన్నారు. ఆర్థిక నేరాల్లో నగదుకు సంబంధించి ఆధారాలు దొరకడం చాలా కష్టమన్నారు. నిందితుల వాంగ్మూలాలు, సాక్ష్యాల ఆధారంగా కోర్టులు తీర్పులిచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ఈ కేసులో సూత్రధారి, పాత్రధారి అయిన కవితకు సంబంధించి పలు సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని కోర్టుకు తెలిపారు. వాదనల తర్వాత కోర్టు బెయిల్ పిటిషన్‌పై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. సిబిఐ కేసులో మే 2న, ఈడీ కేసులో మే 6న తీర్పు వెల్లడిస్తామని చెప్పింది. మే 7న కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియనుంది. -
CBI: కవిత రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారణ కోసం అయిదు రోజుల కస్టడీ కోరుతూ సీబీఐ రౌస్ అవెన్యూ కోర్టులో రిమాండ్ పత్రాలను సమర్పించింది. కవిత రిమాండ్ రిపోర్టులో సీబీఐ అధికారులు పలు సంచలన విషయాలు పొందుపర్చారు. కవితే రూ. 100 కోట్లు చెల్లించినట్లు పేర్కొంది. కవితకు చెందిన జాగృతి సంస్థకు శరత్ చంద్రారెడ్డి రూ.80 లక్షల ముడుపులు చెల్లించినట్లు అభియోగం మోపింది. డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని తెలిపింది. ల్యాండ్ డీల్ చేసుకోకపోతే తెలంగాణలో బిజినెస్ ఎలా చేస్తావో చూస్తానని శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని పేర్కొంది. అసలు భూమే లేకుండా వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించినట్లు పేర్కొంది. నకిలీ భూ విక్రయం పేరుతో శరత్ చంద్రారెడ్డి నుంచి రూ. 14 కోట్లు కవిత తీసుకున్నారని రిపోర్టు రిపోర్టులో వెల్లడించింది. మహబూబ్‌నగర్‌లో వ్యవసాయ భూమి ఉందని, దాన్ని కొనుగోలు చేసినట్లు రూ. 14 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారు. అసలు ఆ భూమి సంగతి, దాని ధర ఎంతో తెలియనందువల్ల తను రూ.14కోట్లు ఇవ్వలేనని అన్నారు శరత్. మొత్తం డబ్బులు ఇవ్వకపోతే తెలంగాణలో అరబిందో ఫార్మా బిజినెస్ ఉండదని కవిత బెదిరించినట్లు పేర్కొంది. చదవండి: కవితకు రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురు ఒక్కో రిటైల్ జోన్‌కు రూ.5 కోట్ల చొప్పున 5 రిటైల్ జోన్లకు రూ.25 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారని సీబీఐ చెబుతోంది. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని కూడా కవిత రూ. 50 కోట్లు డిమాండ్ చేశారని, తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆయన రూ.25కోట్లు చెల్లించారని తెలిపింది. కేజ్రీవాల్ అనుచరుడు విజయనాయర్‌కు కవితే రూ.100కోట్లు చెల్లించారని చెప్పింది. ఇండోస్పిరిట్లో కవిత 65 శాతం వాటా పొందారని, గోవాకు రూ.44.45 కోట్లు హవాలా మార్గంలో బదిలీ చేశారని సీబీఐ పేర్కొంది. ఈ డబ్బును కవిత పీఏ అశోక్ కౌశిక్ హవాలా డీలర్లకు చేర్చాడని, ఈ విషయాలన్నింటిపైనా కవిత సరైన సమాధానాలు చెప్పడం లేదని తెలిపింది. ఆమెను 5 రోజులు కస్టడీలోకి తీసుకొని మరిన్ని విషయాలను రాబట్టాలని ప్రత్యేక కోర్టును కోరింది సీబీఐ. కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే ఆమెను అరెస్టు చేయగా జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. లిక్కర్ కేసులో గతంలోనూ సీబీఐ ఆమెను హైదరాబాద్‌లో ఆమెనుప్రశ్నించింది. ఆ తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతితో ఈ నెల 6న తీహార్ జైలులో మరోసారి ప్రశ్నించింది. ఈ క్రమంలోనే అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరిచింది. విచారణ నిమిత్తం కవితను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై కాసేపట్లో న్యాయస్థానం తీర్పు వెల్లడించనుంది. మరోవైపు సీబీఐ ప్రశ్నించడం, అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. -
సీబీఐ ఇంటరాగేషన్.. కవిత పిటిషన్‌పై నేడు విచారణ
ఢిల్లీ, సాక్షి: లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన తనను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ ఇంటరాగేషన్ చేయడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కోర్టు కవితను తీహార్ జైల్లోనే విచారించేందుకు సీబీఐకు ఏప్రిల్ 5వ తేదీన ప్రత్యేక న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అయితే.. ఆమెను సీబీఐ ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని కవిత తరఫు న్యాయవాది నితీష్ రాణా కోర్టులో మెన్షన్ చేశారు. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు సీబీఐ సమయం కోరడంతో.. గడువు ఇస్తూ పిటిషన్‌పై విచారణ ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. లిక్కర్ కేసులో మార్చి 15వ తేదీన అరెస్టైన కవిత.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న ఒక వ్యక్తిని ప్రశ్నించాలంటే కోర్టు అనుమతి అవసరం. అలా తీహార్ జైల్లో ఉన్న కవితను కోర్టు అనుమతితో సీబీఐ బృందం ప్రశ్నించాలనుకుంది. ఇప్పటికే.. శనివారం తీహార్ జైలుకు వెళ్లిన దర్యాప్తు సంస్థ అధికారులు కవితను ప్రశ్నించినట్లు సమాచారం. -
మళ్లీ తీహార్ జైలుకే కవిత
సాక్షి, న్యూఢిల్లీ: జ్యుడీషియల్ కస్టడీ పూర్తి కానుండటంతో మంగళవారం ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తీహార్ జైలు అధికారులు న్యాయమూర్తి కావేరి బవేజా ముందు హాజరుపరిచారు. కవితకు ఈనెల 23 వరకు జ్యూడిషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. మళ్లీ కవితను తీహార్ జైలుకు ఈడీ అధికారులు తరలించనున్నారు. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో కోర్టు ముందుకు కవితను ఈడీ అధికారులు హాజరుపర్చిచారు. కవిత బయట ఉంటే కేసు దర్యాప్తు ప్రభావితం అవుతుందని జ్యుడీషియల్ కస్టడి పొడిగించాలని ఈడీ కోరింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని, కవిత జ్యుడీషియల్ కస్టడీ 14 పొడిగించాలని కోర్టును ఈడీ కోరింది. కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగించడానికి ఈడీ వద్ద కొత్తగా ఏమి లేవని కవిత తరపు న్యాయవాది రానా పేర్కొన్నారు. 2022 నుంచి కేసు దర్యాప్తు సాగుతుందని, కవిత ప్రభావితం చేసే వ్యక్తి అని మొదటి నుంచి కానీ అలాంటిది ఏమి లేదన్నారు రానా.. కవితను మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది కోరగా, కవితను కోర్టులో నేరుగా మాట్లాడేందుకు జడ్జి కావేరి బవేజా నిరాకరించారు. నేరుగా నిందితురాలు మాట్లాడేందుకు హక్కు కలిగి ఉంటారని కవిత తరపు న్యాయవాది తెలుపగా, అప్లికేషన్ వేసుకోవాలంటూ జడ్జి కావేరి బవేజా సూచించారు. కవితను కోర్టులో భర్త, మామ కలిసేందుకు కవిత న్యాయవాదులు అప్లికేషన్ ఇచ్చారు. అంతకుముందు మధ్యంతర బెయిల్‌ను కోర్టు నిరాకరించడంతో రెగ్యులర్ బెయిల్ కోసం కవిత వేసిన పిటిషన్‌ను త్వరగా విచారించాలని ఆమె తరఫు న్యాయవాదులు జడ్జిని కోరారు. దీంతో గత విచారణ సమయంలో రెగ్యులర్ బెయిల్‌పై ఈ నెల 20న విచారిస్తానన్న న్యాయమూర్తి.. తాజాగా ఈ నెల 16న విచారణ చేపడతానని పేర్కొన్నారు. కాగా, కవితను విచారించాలని కోర్టులో ఇప్పటికే సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌పై ఎల్లుండి విచారణ జరగనుంది. మార్చి 15వ తేదీన ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేయగా, మార్చి 16న ఆమెను కోర్టు ముందు హాజరు పర్చారు. మార్చి 23 వరకు కవితకు ఈడీ కస్టడీ, అనంతరం మరో మూడు రోజులు కవితకు ఈడి కస్టడీని కోర్టు పొడిగించింది. 26వ తేదీన కవితకు 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు విధించింది. కాగా, ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్ జరిగిందన్న కేసులో ప్రమేయమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసింది. ఈ కేసులో సాక్ష్యాలు నాశనం చేయడంతోపాటు సాక్షులను ప్రభావితం చేయడంలో కవిత ప్రమేయం ప్రాథమికంగా కనిపిస్తోందని... ఆమెను బలిపశువుగా మార్చే యత్నం జరుగుతోందనేందుకు వీల్లేదని వ్యాఖ్యానించింది. కవిత నిస్సందేహంగా పలుకుబడిగల మహిళ అయినందున బెయిల్ ఇస్తే మరోసారి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందిన పేర్కొంది. అందువల్ల ఆమెకు మధ్యంతర బెయిల్ నిరాకరిస్తున్నట్లు స్పష్టం చేసింది. మైనర్ కుమారుడి వార్షిక పరీక్షల నేపథ్యంలో తల్లిగా తన పర్యవేక్షణ అవసరమైనందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా సోమవారం ఈ మేరకు తీర్పు వెలువరించారు. బెయిల్ నిరాకరణకు కారణాలను 21 పేజీల తీర్పులో పేర్కొన్నారు. చిన్న కుమారుడికి బంధువుల అండ ఉందిగా ‘‘పిటిషనర్ (కవిత) 16 ఏళ్ల మైనర్ కుమారుడికి ఇప్పటికే 50 శాతం పరీక్షలు పూర్తయ్యాయని న్యాయవాదులు తెలిపారు. కానీ కుమారుడి చదువు, మధ్యంతర బెయిల్ కోరిన రోజుల సంఖ్య, ఇతర కుటుంబ సభ్యుల వివరాలు పొంతన లేకుండా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మైనర్ కుమారుడు అన్నయ్య, తండ్రి, అత్తలను కలిగి ఉన్నాడు. వారంతా అతనికి తగిన మద్దతు ఇవ్వలేరనడానికి ఎలాంటి కారణం కనిపించట్లేదు. చిన్న కుమారుడి పరీక్షల వేళ తల్లి నైతిక మద్దతు ఎంతో అవసరమని న్యాయవాదులు చెబుతున్నారు. కానీ 19 ఏళ్ల వయసున్న కవిత పెద్ద కుమారుడు స్పెయిన్‌లో చదువుతున్నాడు. భౌతికంగా తల్లిదండ్రులు దగ్గర లేకున్నా విదేశాల్లో అతను చదువుకోగలుతున్నప్పుడు బంధువుల సమక్షంలో ఉంటున్న చిన్న కుమారుడు పరీక్షలు రాయలేడనడం సమంజసంగా కనిపించట్లేదు. పిల్లల పరీక్షల ఆందోళన పరిష్కరించడానికి తల్లి తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదనడం మధ్యంతర బెయిల్ మంజూరుకు తగిన కారణంగా కనిపించట్లేదు. కవిత కేసు పరిష్కారం విషయంలో మైనర్ తండ్రి బిజీగా ఉన్నారన్న కారణం సైతం ఆమోదయోగ్యం లేదు. అందుకే మైనర్ కుమారుడికి అతని అత్తలు తగిన మద్దతు ఇవ్వాల్సిందిగా కోర్టు సూచిస్తోంది. కేసులో ప్రాథమికంగా ప్రమేయం కనిపిస్తోంది. ‘‘మాజీ ఎంపీగా, ప్రస్తుత ఎమ్మెల్సీగా, ఉన్నత విద్యావంతురాలిగా కవిత సమాజంలో పలుకుబడి గలవారని నిస్సందేహంగా చెప్పొచ్చు. అంతేకానీ ఈ కేసులో ఓ నిస్సహాయ మహిళను బలిపశువును చేస్తున్నారని ఏ ప్రమాణాల ప్రకారమూ చెప్పేందుకు వీలు కనిపించట్లేదు. నేరాల విషయంలో కవిత చురుకైన ప్రమేయం, సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నంతోపాటు ఉద్దేశపూర్వకంగా సాక్ష్యాలు ధ్వంసం చేస్తారనే విషయంలో కోర్టు ముందుంచిన అంశాలను పరిశీలిస్తే కవిత ప్రమేయం ప్రాథమికంగా కనిపిస్తోంది. అందువల్ల మహిళ కాబట్టి పీఎంఎల్ఏ చట్టం సెక్షన్ 45 (1) ప్రకారం విచక్షణకు ఆమె అర్హురాలు కాదు. ఈ పరిశీలనలతో బెయిల్ దరఖాస్తు తిరస్కరిస్తున్నా’’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.