కవిత పిటిషన్‌కు ఢిల్లీ కోర్టు అనుమతి | Delhi Court permission To kavitha Petition Meeting Her Son And Mother | Sakshi
Sakshi News home page

కవిత పిటిషన్‌కు ఢిల్లీ కోర్టు అనుమతి

Published Tue, Mar 19 2024 5:05 PM | Last Updated on Tue, Mar 19 2024 5:11 PM

Delhi Court permission To kavitha Petition Meeting Her Son And Mother - Sakshi

ఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్టై ఏడూ రోజుల ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తన కొడుకు, తల్లిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆమె కోర్టులో పిటిషన్ వేసింది. అయితే.. ఈ మేరకు కవితకు అనుమతినిచ్చింది సెషన్స్ కోర్టు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతినిచ్చింది. ఈడీ కస్టడీలో ఉన్న కవితను 8 మంది కలవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. వారిలో తల్లి శోభా, పిల్లలు, కుటుంబ సభ్యులకు కోర్టు అనుమతి లభించింది.   

ఇక.. శనివారం మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావులు కవితను ఈడీ కార్యాలయంలో కలిసిన విషయం తెలిసిందే. వారు సుమారు గంటసేపు భేటీ అయి పలు అంశాలుపై చర్చించుకున్నట్లు తెలిసింది.అదేవిధంగా ఇవాళ.. ఈడీ కేసులో మహిళలను విచారించేందుకు మార్గదర్శకాలను జారీ చేయాలంటూ, అంతవరకు ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అరెస్ట్ చేయవద్దు అంటూ గతేడాది దాఖలైన పిటిషన్‌ను కవిత తరపు న్యాయవాది ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement