పోలీసులకు ఢిల్లీ కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపులు, ఇతర అభియోగాలను నమోదు చేయాల్సిందిగా ఢిల్లీ కోర్టు పోలీసులను ఆదేశించింది. తమను వేధించారంటూ ఐదుగురు మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణల్లో బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా తగు ఆధారాలున్నట్లు కోర్టు తెలిపింది.
కేసులు నమోదు చేయాల్సిందిగా అడిషనల్ చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్(ఏసీఎంఎం) ప్రియాంకా రాజ్‌పుత్ ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో సహ నిందితుడు, డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్‌పైనా అభియోగాలు నమోదు చేయాలని పేర్కొన్నారు. బ్రిజ్ భూషణ్‌పై ఆరో మహిళా మైనర్ రెజ్లర్ చేసిన ఆరోపణలకు తగు ఆధారాలు లేనందున ఆమె పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తెలిపారు. కోర్టు ఈనెల 21న అధికారికంగా అభియోగాలను నమోదు చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment