Wrestling Federation of India
-
‘గదికి పిలిచి.. భుజాలపై చేతులు వేశాడు.. తండ్రిలాంటి వాడినంటూ..’
‘‘ఆరోజు మా అమ్మానాన్నలతో ఫోన్లో మాట్లాడిస్తానని నాకు మెసేజ్ వచ్చింది. అందుకే ఆయన గదికి వెళ్లాను. అపుడు సింగ్.. నిజంగానే మా పేరెంట్స్‌కు కాల్ చేసి.. వాళ్లతో మాట్లాడించాడు. నా మ్యాచ్ గురించి, మెడల్ గురించి నేను నా తల్లిదండ్రులకు చెప్పాను. అక్కడ ఊహించని ఘటన జరుగుతుందని నేను ఏమాత్రం అనుకోలేదు.అంతాబాగానే ఉంది.. ప్రమాదమేమీ లేదనిపించింది. అయితే, ఒక్కసారి కాల్ కట్ చేసిన తర్వాత.. అతడి ప్రవర్తన మారిపోయింది. నేను అతడి బెడ్‌మీద కూర్చుని ఉన్నపుడు నన్ను అసభ్యకరంగా తాకేందుకు ప్రయత్నించాడు. వెంటనే అతడిని వెనక్కి తోసి ఏడ్చేశాను. అతడు చేసే పనులకు బదులివ్వడానికి నేను సిద్ధంగా లేనని గ్రహించి ఒక అడుగు వెనక్కి వేశాడు.నా భుజాల చుట్టూ చేతులు వేసి.. ‘తండ్రి లాంటి వాడిని’ అంటూ ఏదో చెప్పబోయాడు. కానీ అతడి ఉద్దేశం ఏమిటో నాకు అర్థమైంది. ఏడుస్తూ.. అక్కడి నుంచి బయటకు పరిగెత్తి నా గదికి వెళ్లిపోయాను’’ అంటూ భారత స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. హోటల్ గదిలో లైంగిక వేధింపులుభారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్ తనతో ప్రవర్తించిన తీరును.. తన ఆటోబయోగ్రఫీ ‘విట్నెస్’లో ప్రస్తావించింది. కజక్‌స్తాన్‌లో 2021 నాటి ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్ సందర్భంగా హోటల్ గదిలో బ్రిజ్‌భూషణ్ తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని తెలిపింది.స్పెషల్ క్లాస్ అంటూ పిలిచేవాడుఅంతేకాదు.. బాల్యంలోనూ తనకు ఇలాంటి ఘటన ఎదురైందని సాక్షి మాలిక్ తన పుస్తకంలో పేర్కొంది. ‘‘చాలా ఏళ్ల క్రితం.. నా చిన్నపుడు కూడా ఇలాగే వేధింపుల బారినపడ్డాను. నా ట్యూషన్ టీచర్ నన్ను వేధిస్తూ ఉండేవాడు. వేళ కాని వేళ ఇంటికి ఫోన్ చేసి స్పెషల్ క్లాస్ అంటూ పిలిచేవాడు. అక్కడికి వెళ్లిన కాసేపటి తర్వాత ట్యూషన్ గురించి పక్కనపెట్టి నన్ను తాకాలని చూసేవాడు. అయితే, ఈ విషయాన్ని బయటకు చెబితే.. తప్పు నాదే అంటారేమోనన్న భయంతో మా ఇంట్లో వాళ్లకు చెప్పలేదు. అమ్మకు కూడా చెప్పే ధైర్యం లేకపోయింది. చాలా ఏళ్లు అతడి వేధింపులను మౌనంగానే భరించాను.కెరీర్ మీద ఫోకస్ పెట్టాలనిఅయితే, అమ్మ విషయం అర్థం చేసుకుంది. నాకు అండగా నిలబడింది. ట్యూషన్ టీచర్, సింగ్ లాంటి వాళ్ల గురించి మర్చిపోయి.. కెరీర్ మీద ఫోకస్ పెట్టాలని.. అలాంటి చెత్త మనుషుల గురించి భయపడాల్సిన పనిలేదని.. ధైర్యంగా ముందడుగు వేయాలని చెప్పింది. ఇలాంటి చేదు అనుభవాల తర్వాత కూడా నా తల్లిదండ్రులు అండగా నిలబడ్డారు కాబట్టే నేను ఇక్కడిదాకా చేరుకోగలిగాను’’ అని సాక్షి మాలిక్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు రాసుకొచ్చింది. కాగా కొన్నాళ్ల క్రితం.. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు నిరసనగా కొన్నాళ్ల ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిన విషయం తెలిసిందే.నాటి రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా సాక్షి మాలిక్ సహా వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా తదితరులు ఈ నిరసనల్లో ప్రముఖంగా పాల్గొన్నారు. అయితే, రెజ్లింగ్ సంఘం ఎన్నికల నుంచి బ్రిజ్‌భూషణ్ తప్పుకొన్నా.. అతడి అనుచరుడు సంజయ్ సింగ్‌ను గెలిపించుకున్నాడు. దీంతో ఆవేదన చెందిన సాక్షి మాలిక్ కుస్తీకి స్వస్తి పలికింది. కాగా 2016 రియో ఒలింపిక్స్‌లో సాక్షి కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే. చదవండి: ‘వారిద్దరి’ స్వార్థం చెడ్డ పేరు తెచ్చింది! -
ఒలింపిక్ పతక విజేతలకు షాకిచ్చిన రెజ్లింగ్ సమాఖ్య!
భారత స్టార్ రెజ్లర్లు సాక్షి మాలిక్, అమన్ సెహ్రావత్, గీతా ఫొగట్ కొత్త అవతారమెత్తారు. ఏకంగా రెజ్లింగ్ లీగ్ నిర్వహించే ఏర్పాట్లలో ఉన్నారు. భారత్‌లో రెజ్లింగ్ చాంపియన్స్ సూపర్ లీగ్ (డబ్ల్యూసీఎస్ఎల్) పేరిట పెద్ద ఎత్తున టోర్నమెంట్‌ను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఒలింపిక్ పతక విజేతలు సాక్షి మాలిక్, అమన్ సెహ్రావత్, ప్రపంచ చాంపియన్ప్ కాంస్య పతక విజేత గీతా ఫొగట్ ఈ మేరకు లీగ్‌పై ప్రకటన చేశారు.షాకిచ్చిన భారత రెజ్లింగ్ సమాఖ్యఅయితే ‘ఆదిలోనే హంసపాదు’లా భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) లీగ్‌కు మోకాలడ్డుతోంది. రెజ్లర్లు నిర్వహించాలనుకునే ఈ టోర్నీకి ఆమోదం ఇవ్వబోమని ప్రకటించింది. సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ కొన్ని నెలల క్రితం సాక్షి... బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగట్‌లతో కలిసి ఢిల్లీ రోడ్లపై నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల బజరంగ్, వినేశ్‌లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వినేశ్ హరియాణా అసెంబ్లీ ఎన్నికలో బరిలో కూడా నిలిచింది.రెజ్లర్ల ప్రయోజనాల కోసమే లీగ్కానీ రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాత్రం రాజకీయాల్లో చేరలేదు. ‘చాలా రోజులుగా ఈ లీగ్ కోసం నేను, సాక్షి సంప్రదింపులు జరుపుతున్నాం. త్వరలోనే లీగ్‌కు తుదిరూపు తీసుకొస్తాం. అంతా అనుకున్నట్లు జరిగితే అప్పుడు క్రీడాకారులు మాత్రమే నిర్వహించే తొలి లీగ్‌గా రెజ్లింగ్ లీగ్ ఘనతకెక్కుతుంది. అయితే ఇప్పటివరకు సమాఖ్యతో మాట్లాడలేదు. కానీ ప్రభుత్వం, సమాఖ్య మాకు మద్దతు ఇస్తే బాగుంటుంది. పూర్తిగా రెజ్లర్ల ప్రయోజనాల కోసమే లీగ్ నిర్వహించబోతున్నాం’ అని గీతా ఫొగట్ తెలిపింది.త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తాంఅదే విధంగా... ప్రపంచస్థాయి రెజ్లర్లు, కోచ్‌లు ఇందులో పాల్గొంటారని, దీని వల్ల దేశీయ రెజ్లర్లకు ఎంతో లబ్ధి చేకూరుతుందని, అంతర్జాతీయ స్థాయి రెజ్లర్లతో తలపడే అనుభవం వారికి లభిస్తుందని ఆమె చెప్పింది. ఇదివరకే కెరీర్‌కు వీడ్కోలు చెప్పిన సాక్షి మలిక్ మళ్లీ ఈ లీగ్‌తో రెజ్లింగ్‌కు దగ్గరవడం ఆనందంగా ఉందని చెప్పింది. అంకితభావం, నిబద్ధతతో లీగ్ విజయవంతం అయ్యేందుకు కృషి చేస్తామని తెలిపింది. వేదికలు, ప్రైజ్‌మనీ, విధివిధానాలు తదితర అంశాలన్నీ త్వరలోనే వెల్లడిస్తామని గీత పేర్కొంది.లీగ్‌కు గుర్తింపు లేదు కానీ డబ్ల్యూఎఫ్ఐ వాదన మరోలా ఉంది. ‘సమాఖ్య ఈ లీగ్‌కు ఆమోదం తెలపడం లేదు. మేం మూలనపడిన ప్రొ రెజ్లింగ్ లీగ్‌ను పునరుద్ధరించే పనిలో ఉన్నాం. త్వరలోనే పట్టాలెక్కిస్తాం. కావాలంటే రెజ్లర్లు వారి లీగ్ నిర్వహించుకోవచ్చు. క్రీడకు ప్రాచుర్యం తేవొచ్చు. అయితే మా లీగ్ వారి లీగ్‌తో కలువదు’ అని డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్ తెలిపారు. చదవండి: కొరియాను కొట్టేసి... ఫైనల్లో భారత్ -
Delhi court: బ్రిజ్ భూషణ్‌పై అభియోగాలు నమోదు చేయండి
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపులు, ఇతర అభియోగాలను నమోదు చేయాల్సిందిగా ఢిల్లీ కోర్టు పోలీసులను ఆదేశించింది. తమను వేధించారంటూ ఐదుగురు మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణల్లో బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా తగు ఆధారాలున్నట్లు కోర్టు తెలిపింది. కేసులు నమోదు చేయాల్సిందిగా అడిషనల్ చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్(ఏసీఎంఎం) ప్రియాంకా రాజ్‌పుత్ ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో సహ నిందితుడు, డబ్ల్యూఎఫ్ఐ మాజీ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్‌పైనా అభియోగాలు నమోదు చేయాలని పేర్కొన్నారు. బ్రిజ్ భూషణ్‌పై ఆరో మహిళా మైనర్ రెజ్లర్ చేసిన ఆరోపణలకు తగు ఆధారాలు లేనందున ఆమె పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తెలిపారు. కోర్టు ఈనెల 21న అధికారికంగా అభియోగాలను నమోదు చేయనుంది. -
భారత రెజ్లింగ్ సమాఖ్యపై నిషేధం ఎత్తివేత
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై విధించిన సస్పెన్షన్‌ను యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) మంగళవారం ఎత్తివేసింది. మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై న్యాయపోరాటం చేసిన రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్లపై ఎలాంటి వివక్ష చూపరాదని పేర్కొంది. అదే విధంగా.. కక్ష్యసాధింపు చర్యలు చేపట్టకుండా అందరు రెజర్లకు సమాన అవకాశాలు కల్పించాలని డబ్ల్యూఎఫ్ఐకి యూడబ్ల్యూడబ్ల్యూ సూచించింది. సస్పెన్షన్ తొలగిపోవడంతో పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్లంతా మన జెండా కిందే పోటీపడొచ్చు. పతకం గెలిస్తే పోడియంలో మన పతాకమే రెపరెపలాడతుంది. గడువులోగా డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల్ని నిర్వహించలేకపోవడంతో గత ఆగస్టులో సస్పెన్షన్ వేటు వేసింది. -
ఇది మహిళలందరి విజయం..మాకూ ధైర్యం: రెజ్లర్ వినేష్ ఫోగట్
బిల్కిస్ బానో కేసులో దోషుల క్షమాభిక్షను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రముఖ రెజ్లర్, ఒలింపిక్ మెడల్ విజేత వినేష్ ఫోగట్ (Vinesh Phogat) స్పందించారు. ఇది మహిళల విజయం అంటూ ఆమె ట్వీట్ చేశారు.ఈ పోరాటంలో విజయం సాధించిన బిల్కిస్ బానోకు అభినందనలు తెలిపారు. “బిల్కిస్ జీ, ఇది మన మహిళలదరి విజయం. మీరు సుదీర్ఘ పోరాటం చేశారు. మీ విశ్వాసం చూసి మాకూ ధైర్యం వచ్చింది” అని ఫోగట్ ట్విటర్లో పేర్కొంది. बिलकिस जी ये हम सब महिलाओं की जीत है। आपने लंबी लड़ाई लड़ी है। आपको देखकर हमें भी हिम्मत मिली है। 🙏 pic.twitter.com/zKWsPMjdhF — Vinesh Phogat (@Phogat_Vinesh) January 8, 2024 బీజేపీ ఎంపీ,మాజీ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు నిరసనగా మహిళా రెజ్లర్లు చేసిన చాలా పెద్ద పోరాటమే చేశారు. దాదాపు ఏడుగురుమహిళా రెజర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపించిన సుదీర్ఘ పోరాటం చేసిన వినేష్ ఫోగట్ ఒకరు. అయితే ఆ ఆరోపణలను సింగ్ ఖండిస్తూ వచ్చారు. (బిల్కిస్ బానో కేసు: ఎవరీ సంచలన మహిళా జడ్జి?) ఇది ఇలా ఉంటే ఇటీవల బ్రిజ్ భూషణ్ అనుచరుడు సంజయ్ సింగ్‌ను ఆ పదవిలో నియమించడం పెద్ద దుమారాన్ని రేపింది. దీంతో తమకు న్యాయం జరగలేదంటూ మహిళ రెజర్లు తీవ్ర అసంతృప్తిని ప్రకటించారు. ముఖ్యంగా ఈ పోరాటంలో మరో కీలక రెజ్లర్ సాక్షి మాలిక్ రిటైర్మెంట్ ప్రకటించింది. అలాగే వినేష్ ఫోగట్ ప్రతిష్టాత్మక అర్జున, ఖేల్ రత్న అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించారు. వీరికి మద్దతుగా రెజ్లర్ భజరంగ్ పూనియా కూడా తన అవార్డులను వెనక్కి ఇచ్చేసిన సంగతి తెలిసిందే. (హీరో అయితేనేం.. ఆ కూతురికి నాన్నేగా!) కాగా ఫోగట్ కామన్వెల్త్ , ఆసియా క్రీడలలో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్, అలాగే ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లలో అనేక ప తకాలు చాటుకుని భారతీయ సత్తా చాటిన ఏకైక భారతీయ మహిళా రెజ్లర్ కూడా. -
Wrestling Federation of India: సస్పెన్షన్‌ను పట్టించుకోం... కమిటీని గుర్తించం!
న్యూఢిల్లీ: ఇంత జరిగినా కూడా... భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) కొత్త అధ్యక్షుడు సంజయ్ సింగ్ తన వైఖరి మార్చుకోవడం లేదు. కేంద్ర క్రీడాశాఖ విధించిన సస్పెన్షన్‌ను పట్టించుకోమని, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) నియమించిన అడ్‌హక్ కమిటీని కూడా గుర్తించబోమని ధిక్కారపు ధోరణిని ప్రదర్శించారు. త్వరలోనే జాతీయ జూనియర్ రెజ్లింగ్ చాంపియన్íÙప్ పోటీలను నిర్వహించి తీరుతామని పేర్కొన్నారు. ‘మేం ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికయ్యాం. రిటరి్నంగ్ అధికారి దీన్ని ధ్రువీకరిస్తూ సంతకం చేశారు. అలాంటి కార్యవర్గాన్ని ఎందుకు విస్మరిస్తారు. అడ్‌హక్ కమిటీతో మాకు సంబంధం లేదు. మా సమాఖ్యను మేమే నడిపించుకుంటాం త్వరలోనే ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో పోటీల నిర్వహణపై నిర్ణయం కూడా తీసుకుంటాం’ అని సంజయ్ వెల్లడించారు. నియమావళిని అతిక్రమించలేదని ఇదివరకే క్రీడాశాఖకు సంజాయిషీ ఇచ్చామని, వారి స్పందన కోసం ఎదురు చూస్తున్నామన్నారు. -
సస్పెండ్ చేస్తే సరిపోతుందా?
డిసెంబరు 21న జరిగిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికల్లో, మొత్తం పురుషులతో కూడిన 15 మంది సభ్యుల సంఘాన్ని ఎన్నుకున్నారు. వీరిలో 13 మంది సమాఖ్య మాజీ అధ్యక్షుడు, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ సింగ్ విధేయులే. ఫలితాలు వెలువడిన తర్వాత విజేత ప్యానెల్ ప్రవర్తించిన తీరు, కొన్ని నెలల క్రితం బ్రిజ్ భూషణ్‌పై తీవ్రంగా పోరాడిన రెజ్లర్లనే కాకుండా, వారి సాహసోపేత పోరాటానికి మద్దతిచ్చిన వారిని కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. సామాజిక నిషేధాలను ధిక్కరించి క్రీడల్లో పాల్గొనేలా తమ కుమార్తెలను ప్రోత్సహిస్తున్నవారు ఈ సంక్లిష్ట స్థితిలో తీవ్రంగా ప్రభావితమయ్యారు. అయితే, ఈ కొత్త సమాఖ్యను క్రీడా మంత్రిత్వ శాఖ నాటకీయంగా సస్పెండ్ చేసింది. కానీ క్రీడల్లో మహిళల భద్రతపై ఇప్పటికే సన్నగిల్లిన ప్రజా విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఇది మాత్రమే సరిపోతుందా? భారత రెజ్లింగ్ సమాఖ్యకు బ్రిజ్ భూషణ్ సింగ్ విధేయులే ఎన్నిక కావడం, అనంతరం వారి ప్రవర్తనతో తీవ్ర వేదనకు గురైన ఒలింపి యన్ సాక్షి మాలిక్ రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. మరో ఒలింపి యన్ బజరంగ్ పునియా తన ప్రతిష్ఠాత్మక పద్మశ్రీని వెనక్కు ఇచ్చే స్తానని చెబుతూ ప్రధానికి లేఖ రాశాడు. అతని తర్వాత, మూడుసార్లు డెఫ్లింపిక్స్ (బధిరుల ఒలింపిక్స్) బంగారు పతక విజేత, ‘గూంగా పహిల్వాన్’గా ప్రసిద్ధి చెందిన రెజ్లర్ వీరేందర్ సింగ్ కూడా సంఘీ భావంగా తన పద్మశ్రీని వెనక్కు ఇచ్చేశాడు. మల్లయోధుల్లో ఈ తీవ్రమైన ప్రతిచర్యలను ప్రేరేపించినది ఫెడరేషన్ ఎన్నికల ఫలితం మాత్రమే కాదు. తన ఆశ్రితుడు, భారత రెజ్లింగ్ సమాఖ్య నూతన అధ్యక్షుడు అయిన సంజయ్ సింగ్‌తో కలిసి నిలబడి... తన మద్దతుదారులతో మెడలో భారీ పూలదండలు వేయించుకుని, విజయ చిహ్నాన్ని రెపరెపలాడించిన బ్రిజ్ భూషణ్ ప్రవర్తన రెజ్లర్లను తీవ్రంగా స్పందించేలా చేసింది. దీనికి తోడుగా, బ్రిజ్ భూషణ్ కుమారుడు ‘దబ్దబా థా... దబ్దబా రహేగా’ (ఆధిపత్యం వహించాం, ఆధిపత్యం వహిస్తాం) అని రాసివున్న ప్లకార్డును పట్టు కోవడం పుండు మీద కారం జల్లింది. ఈ మొత్తం పరిణామాలు, విజేతల అవాంఛనీయ ప్రవర్తన... క్రీడలకు, పౌర సమాజానికి ఇబ్బంది కలిగించే ధోరణిని సూచిస్తున్నాయి. దేశంలో క్రీడాకారిణుల భద్రతకు సంబంధించి ప్రత్యేకంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఊహించిన ఫలితమే! ఈ ఎన్నికలకు నిజమైన అర్థం ఏమిటి? మహా అయితే 50 మంది ఓటర్లతో కూడిన ఎలక్టోరల్ కాలేజీని నిర్వహించడం బ్రిజ్ భూషణ్‌కు కష్టమైన పనేం కాదు. పైగా అతను అధికార బీజేపీకి చెందిన శక్తిమంతమైన పార్లమెంటు సభ్యుడు. అందుకే ఈ ఎన్నికల ఫలితాలు ఊహించనివేం కాదు. కాకపోతే ఈ విజయానికి చెందిన వికార ప్రదర్శన, లైంగిక వేధింపుల కేసులకు సంబంధించి బ్రిజ్ భూషణ్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న మల్లయోధుల ప్రజా ఉద్య మానికి వ్యతిరేక క్లైమాక్స్‌గా వచ్చింది. జంతర్ మంతర్ వద్ద జరిగిన మల్లయోధుల ప్రత్యేక ఆందోళన చెరగని ముద్ర వేసింది. మహిళలపై లైంగిక వేధింపులు, కుస్తీ పోటీల్లోని ప్రబలమైన అనారోగ్యకర ధోరణి వంటి వాటిని ప్రధాన వేదికపైకి తీసుకురావడంలో ఇది విజయం సాధించింది. మొత్తం జాతి మనస్సాక్షిని కదిలించడంలో 2023లో అత్యంత అద్భుతమైన నిరసన ఉద్యమాలలో ఒకటిగా నిలిచింది. బజరంగ్ పునియాతో పాటు ఇద్దరు మహిళా రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్ చూపిన అద్భుతమైన సంకల్పం, మహిళా సంస్థల నుండి అపూర్వమైన సంఘీభావాన్ని ఆకర్షించింది. రైతు సంఘాలు, క్రీడాకారులు, ఖాప్ పంచాయితీలు, విద్యార్థులు సహా పలు రకాల సామాజిక సంస్థలు సంఘీభావంగా నిలిచాయి. నిరసనను అణచివేసేందుకు పాలక యంత్రాంగం ప్రదర్శించిన మొరటుదనం, పోలీసుల అణచివేత విఫలమవడంతో, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆందోళన చేస్తున్న రెజ్లర్లతో చర్చలు జరపవలసి వచ్చింది. బ్రిజ్ భూషణ్‌పై కోర్టులో ఛార్జిషీట్ సమర్పిస్తామనీ, అతని సన్నిహితులు రాబోయే ఎన్నికలలో భారత రెజ్లింగ్ సమాఖ్యను స్వాధీనం చేసుకోకుండా చేస్తామనీ హామీ ఇవ్వాల్సి వచ్చింది. కానీ రెండు అంశాలలోనూ మల్లయోధులు మోసపోయారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన నేరాల కింద విచారణ జరిపి దోషిగా తేలేందుకు సరిపడే స్థాయిలో బ్రిజ్భూషణ్సింగ్పై కేసు నమోదైంది. కానీ మైనర్ ఫిర్యాదుదారుల్లో ఒకరిని తన అభియోగాన్ని ఉపసంహరించుకునేలా ప్రభావితం చేశాడని అతడిపై ఆరోపణ వచ్చింది. అలా ఉపసంహరించుకోనట్లయితే పోక్సో చట్టం కింద కచ్చితంగా అతడు అరెస్టు అయ్యే అవకాశం ఉండేది. నిబంధనలను ఉల్లంఘించి... అదేవిధంగా, ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత వారి విజయ హాసాలను చూసినప్పుడు, బ్రిజ్ భూషణ్, అతని అనుచరుల ఉడుం పట్టు నుండి రెజ్లింగ్ సమాఖ్యను విడిపిస్తానన్న రెండవ హామీని కూడా ప్రభుత్వం వమ్ము చేసినట్లు తేలింది. జూనియర్ నేషనల్ రెజ్లింగ్ టోర్నమెంట్ వేదికగా ఉత్తరప్రదేశ్‌లోని గోండాలోని నందిని నగర్‌ను ఖాయం చేయడం కూడా వారి ఆహంకారానికి నిదర్శనం. ఇది బ్రిజ్ భూషణ్ సొంత నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ప్రదేశం. చాలా మంది అమ్మాయిలు అక్కడికి వెళ్లడానికి భయపడుతున్నట్టుగా సాక్షి మాలిక్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. బ్రిజ్ భూషణ్ తన సత్తాను బహిరంగంగా ప్రదర్శించడం, జాతీయ టోర్నమెంట్ల వేదికను నిర్ణయించడంలో నియమాలు, నిబంధనలను ఉల్లంఘించడంపై అవార్డులు గెలుచుకున్న క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు కొత్తగా ఎన్నికైన భారత రెజ్లింగ్ సమాఖ్యను సస్పెండ్ చేయాల్సిందిగా ఇది క్రీడా మంత్రిత్వ శాఖపై ఒత్తిడిని పెంచింది. భారత రెజ్లింగ్ ఫెడరేషన్ నూతన బాడీ ఆకస్మిక సస్పెన్షన్ కారణంగా, బహుశా తాత్కాలి కంగానైనా విజేతల ఆనందం ఆవిరైపోయినట్లు కనిపిస్తోంది. మరోవైపున బ్రిజ్ భూషణ్ శిబిరం ఈ ఎన్నికల ఫలితాలను కొత్తగా నిర్వచించడానికి ప్రయత్నించింది. తాము అమాయకులమని చేస్తూవచ్చిన వాదనలకు తగిన నిరూపణగా, ఇది కేవలం రాజకీయ ఉద్దేశ్యాలతో ప్రభావిత మైనదిగా చూపేందుకు వాళ్లు ప్రయత్నించారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలి ఏమైనా, సామాజిక నిషేధాలను ధిక్కరించి క్రీడల్లో పాల్గొనేలా తమ కుమార్తెలను ప్రోత్సహిస్తున్నవారు ప్రస్తుత సంక్లిష్ట స్థితిలో తీవ్రంగా ప్రభావితమయ్యారు. క్రీడల్లో మెరుగైన కెరీర్లు, ఉద్యో గావకాశాలు, వారు గెలిచిన పతకాలతో వచ్చే కీర్తిని చూసిన గ్రామీణ ప్రాంతాల్లోని చాలామంది తల్లిదండ్రులు తమ కుమార్తెలను క్రీడలను వృత్తిగా స్వీకరించేలా మొగ్గు చూపారు. కానీ ఇటీవలి నెలల్లో జరిగిన సంఘటనలు కచ్చితంగా వారి విశ్వాసాన్ని సడలించాయి. ఈ నేపథ్యంలో ఎన్నికైన సంఘాన్ని కేవలం సస్పెండ్ చేయడం క్రీడల్లో మహిళల భద్రతపై ఇప్పటికే సన్నగిల్లిన ప్రజా విశ్వాసాన్ని పున రుద్ధరించదు. కొనసాగుతున్న పోరు ఎలాంటి మలుపు తిరుగుతుందో నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. బ్రిజ్ భూషణ్‌పై బీజేపీ ఎటువంటి క్రమశిక్షణ చర్యా తీసుకోలేదనీ, సుప్రీం కోర్టు ఆదేశించే వరకూ ఢిల్లీ పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదనీ ప్రజలకు స్పష్టమైంది. న్యాయమైన విచారణ జరిగేలా, ఫిర్యాదుదారులపై ప్రభావం చూపకుండా నిరోధించడానికి నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీలో ఉంచడం అవసరం. అన్ని క్రీడా సమాఖ్యలు సమగ్రమైన, సంపూర్ణమైన పరివర్తనల దిశగా తీవ్రమైన చర్యలు తీసుకోవడం అవశ్యం. మహిళల ప్రవేశాన్ని నిరోధించకుండా ఉండేలా ఒక ప్రత్యేక క్రీడా విధానం కావాలి. ఇటువంటి సమూలమైన మార్పునకు విస్తృత ప్రాతిపదికన ప్రచారం అవసరం. ఇందులో భాగస్వాములందరూ మరింత ప్రజాస్వామ్య బద్ధంగా, పారదర్శకంగా, జవాబుదారీగా ఉండేలా చర్యలు తీసు కోవాలి. జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో మల్లయోధులు ప్రదర్శించిన స్ఫూర్తిని, బలాన్ని ఏకీకృతం చేయడం, మరింతగా విస్తరించడం అవసరం. – జగమతీ సాంగ్వాన్, వాలీబాల్ క్రీడాకారిణి, భీమ్ అవార్డు తొలి మహిళా గ్రహీత, ఐద్వా జాతీయ ఉపాధ్యక్షురాలు; – ఇంద్రజీత్ సింగ్, ఆల్ ఇండియా కిసాన్ సభ ఉపాధ్యక్షుడు -
పరువు కోసం కుస్తీ!
ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు... తక్షణమే సరిదిద్దకపోతే, ఆపైన అన్నీ తప్పులే జరుగుతాయట. ప్రాచుర్యంలో ఉన్న లోకోక్తి అది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) కథ సరిగ్గా అలానే ఉంది. సమాఖ్యలోని అవకతవకలు, మహిళా మల్లయోధులపై సమాఖ్య అధ్యక్షుడు, కోచ్‌ల లైంగిక వేధింపుల గురించి ఏడాది పైగా వివాదాలు రేగుతూనే ఉన్నాయి. అయినా, కంటితుడుపులకే తప్ప, కఠిన చర్యలకు దిగని కేంద్ర పాలకులు తాజాగా సమాఖ్యపై సస్పెన్షన్ వేటువేయక తప్పలేదు. వివాదాస్పద బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ సారథ్యంలో సమాఖ్య గబ్బుపడితే, తాజాగా ఆయన సహచరుడు సంజయ్ సింగ్ సారథ్యంలో ఏర్పడ్డ కొత్త కార్యవర్గం సైతం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, ఎన్నికైన మూణ్ణాళ్ళకే సస్పెన్షన్ వేటుకు గురైన దుఃస్థితి. ఆదివారం నాటి ఈ సస్పె న్షన్తో మన రెజ్లింగ్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. దేశానికి పేరు తెచ్చిపెట్టిన క్రీడాకారులెందరో ఉన్నప్పటికీ, మన కుస్తీ గోదా కథ ఆశించినంత గొప్పగా లేదని మరోమారు తేలిపోయింది. ఒలింపిక్ పతకాలు సాధించిన మన మల్లయోధులు సాక్షీ మాలిక్, బజరంగ్ పూనియా,ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతక విజేత వినేశ్ ఫోగట్‌లు సమాఖ్యలో అవతవకలపై గళం విప్పి మరి కొద్ది రోజుల్లో ఏడాది కావస్తోంది. ఈ పన్నెండు నెలల కాలంలో ర్యాలీలు, దేశ రాజధాని నడిబొడ్డున ఆటగాళ్ళ ధర్నాలు, వేధింపుల ఆరోపణలతో బ్రిజ్‌భూషణ్‌పై ఢిల్లీ పోలీసుల కేసులు, దర్యాప్తులు... ఇలా అనేక నాటకీయ ఘటనలు చూశాం. బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ తప్పనిసరై తన పదవికి దూరం జరిగాడు. అయితే, పేరుకు పదవిలో లేకపోయినా, వెనుక నుంచి చక్రం తిప్పుతున్నది అతగాడేనని సమాఖ్య కొత్త కార్యవర్గం తాజా ఎన్నికల్లోనూ తేలిపోయింది. బ్రిజ్‌భూషణ్‌కు దీర్ఘకాలంగా నమ్మిన బంటైన సంజయ్‌సింగ్ గత గురువారం డిసెంబర్ 21న జరిగిన ఎన్నికల్లో సమాఖ్య కొత్త అధ్యక్షుడ య్యారు. ఎన్నికలు జరిగిన 15 పదవుల్లో 13ను ఆ జట్టే గెలిచింది. పైగా, లైంగిక వేధింపులపై ఇంత రచ్చ జరుగుతున్నా ఎన్నికైనవారిలో కనీసం ఒక్క మహిళైనా లేకపోవడం మరీ విడ్డూరం. అయినా వ్యవస్థ మారకుండా పేరుకు వ్యక్తులు మారితే ప్రయోజనం ఏముంటుంది! పాత తానులోని ముక్కే అయిన కొత్త అధ్యక్షుడు వస్తూనే సమాఖ్య నిబంధనలకు విరుద్ధంగా ఈ నెల 28 నుంచి యూపీలో అండర్–15, అండర్–20 వారికి జాతీయ ఛాంపియన్షిప్స్ జరుగుతాయని ప్రకటించారు. సమాఖ్య సెక్రటరీ జనరల్‌ను సంప్రతించడం లాంటి నియమాలేవీ పాటించనేలేదు. పైగా, లైంగిక వేధింపులు జరిగినట్టు ఆరోపణలున్న ప్రాంగణంలోనే, అదే పాత కాపుల కను సన్నల్లోనే కొత్త కమిటీ సాగుతుండడం దిగ్భ్రాంతికరం. ఈ రాజ్యాంగ విరుద్ధ చర్య వివాదానికీ, ఫిర్యాదులకూ దారి తీసింది. మరోపక్క ఎన్ని పోరాటాలు చేసినా, ప్రభుత్వానికి మరెన్ని వినతులు ఇచ్చినా పాత కథే పునరావృతం కావడం ఆటగాళ్ళే కాదు, ఎవరూ జీర్ణించుకోలేని విషయం. రెజ్లర్ సాక్షీ మాలిక్ కుస్తీకి పూర్తిగా స్వస్తి చెబుతున్నట్టు కన్నీటి పర్యంతమవుతూ ప్రకటించారు. మరో రెజ్లర్ బజరంగ్ పునియా తన పద్మశ్రీ పతకాన్ని ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చేస్తున్నట్టు శుక్రవారం స్పష్టం చేశారు. ఈ పరిణామాలతో సర్కార్ ఒత్తిడిలో పడింది. హడావిడిగా కొత్త కమిటీపై సస్పెన్షన్ వేటు వేసింది. సమాఖ్య నిర్వహణకు తాత్కాలిక ప్యానెల్‌ను నియమించాల్సిందిగా భారత ఒలింపిక్ సంఘాన్ని (ఐఓఏ) కోరింది. రెజ్లింగ్ సమాఖ్యను సరిదిద్దేందుకు ఎప్పుడో చర్యలు చేపట్టాల్సిన సర్కార్ ఇప్పటికి గాఢనిద్ర నుంచి మేలుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఈ మాత్రమైనా కదలిక రావడం మంచిదే. కానీ, ఇది సరిపోతుందా అన్నది ప్రశ్న. దేశానికి పతకాలు పండిస్తున్న క్రీడాంశంలో, అందులోనూ అంతర్జా తీయంగా మన ప్రతిష్ఠను పెంచిన ఆటగాళ్ళ నిఖార్సయిన ఆందోళనలపై మన పాలకులు ఇన్నాళ్ళు కాలయాపన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? స్వపక్ష పార్లమెంట్ సభ్యుడే సమాఖ్య అధ్యక్షుడు కావడం, సార్వత్రిక ఎన్నికల బరిలో ఓట్లు – సీట్ల సంఖ్యను ప్రభావితం చేసే శక్తిమంతుడు కావడంతో బీజేపీ పెద్దలు ఇంతకాలం విషయం సాగదీశారనేది సుస్పష్టం. వినేశ్ ఫోగట్ అన్నట్టు... రెజ్లింగ్ సమాఖ్యలో పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఇక దేశంలో కుస్తీ క్రీడ ఆడపిల్లకు భద్రత లేని అంశంగా మిగిలిపోతుంది. కానీ, ‘బేటీ బచావో... బేటీ పఢావో’ అంటూ బీరాలు పలికే పాలకులకు ఇది పెద్దగా పట్టినట్టు లేదు. మన సొంతింటి రెజ్లింగ్ వ్యవహారం ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో దేశానికి అప్రతిష్ఠగా పరిణమించింది. నిజానికి, క్రీడా సంస్థలపై వివాదాలు కొత్త కావు. క్రీడాకారిణులపై లైంగిక వేధింపులు, ఆటగాళ్ళ ఎంపికలో అవినీతి, బంధుప్రీతి ఆరోపణలు తరచూ వినబడుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు తాత్కాలిక ఉపశమన చర్యలతోనే సరిపుచ్చుతున్నాయి తప్ప, సమూల ప్రక్షాళనకు సమకట్టడం లేదు. రాజకీయాలకు అతీతంగా సాగాల్సిన క్రీడాసంస్థల్ని అధికార పార్టీల జేబు సంస్థలుగా, వారసత్వపు గడీలుగా నడుపుతున్నారు. పెద్ద స్థానాల్లో ఉన్న ఒకప్పటి స్టార్ ఆట గాళ్ళు సైతం తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉండాల్సింది పోయి, తమకా పదవులిచ్చిన పార్టీల ప్రయోజనాలకు డూడూ బసవన్నలవుతున్నారు. ప్రజల్లో నమ్మకం పోగొట్టుకున్న, లోపభూయిష్ఠ మైన మన క్రీడా నిర్వహణలో తక్షణ సంస్కరణలు అవసరం. లేదంటే, తీరని నష్టం. పాలకులు స్వపక్షాభిమానం వదిలి, కఠిన కార్యాచరణకు పూనుకోనట్లయితే... మన క్రీడావీరుల కష్టానికీ, కన్నీళ్ళకూ విలువేముంది! రాజకీయం ఆట కావచ్చేమో కానీ, ఆటలు రాజకీయం కాకూడదు!! -
WFI: మంచో చెడో.. రిటైర్ అయ్యాను! డబ్ల్యూఎఫ్ఐ మంచికి నాంది
Sakshi Malik, Bajrang Punia Reaction On WFI Suspension: భారత రెజ్లింగ్ సమాఖ్యపై సస్పెన్షన్ విధించడాన్ని రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ స్వాగతించారు. ‘డబ్ల్యూఎఫ్ఐ మంచికి ఇది తొలి అడుగుగా భావిస్తున్నా. మేం ఎందుకిలా పోరాడుతున్నామనే విషయం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వానికి బోధపడుతుందని ఆశిస్తున్నా. మహిళా అధ్యక్షురాలుంటే దేశంలోని అమ్మాయిలకెంతో మేలు జరుగుతుంది’ అని ఆమె అన్నారు. వారి గౌరవం కంటే అవార్డు పెద్దది కాదు ఇక ‘పద్మశ్రీ’ని వెనక్కిచ్చిన టోక్యో ఒలింపిక్స్ పతక విజేత బజరంగ్ పూనియా మాట్లాడుతూ.. ‘ఇప్పటికే నా పురస్కారాన్ని తిరిగిచ్చేశాను. మళ్లీ ఆ అవార్డును స్వీకరించే యోచన లేదు. మాకు న్యాయం జరిగినపుడు ‘పద్మశ్రీ’ని తీసుకుంటా. మన అక్కాచెల్లెళ్లు, కుమార్తెల గౌరవం కంటే ఏ అవార్డు పెద్దది కాదు. ప్రస్తుతం సమాఖ్య వ్యవహారాల్ని అందరు గమనిస్తున్నారు’ అని అన్నారు. సంజయ్ సింగ్‌కు షాకిచ్చిన క్రీడా శాఖ కాగా భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ సాక్షి మాలిక్, వినేశ్ ఫొగట్ తదితర మహిళా రెజ్లర్లు ఢిల్లీలో నిరసన చేసిన విషయం తెలిసిందే. వీరికి మద్దతుగా బజరంగ్ పునియా, జితేందర్ సింగ్ వంటివారు ఆందోళనలో పాల్గొన్నారు. బ్రిజ్‌భూషణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నెలరోజులకు పైగా నిరసన కొనసాగించారు. ఈ క్రమంలో ప్రభుత్వ హామీతో ఆందోళన విరమించారు. ఇదిలా ఉంటే.. అనేక వాయిదాల అనంతరం ఇటీవలే భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు జరిగాయి. ఇందులో మాజీ రెజ్లర్ అనిత షెరాన్ ప్యానెల్‌పై.. బ్రిజ్‌భూషణ్ అనుచరుడు సంజయ్ సింగ్ ప్యానెల్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూఎఫ్ఐ కొత్త అధ్యక్షుడిగా సంజయ్ ఎన్నికను నిరసిస్తూ సాక్షి మాలిక్ ఆటకు స్వస్తి పలకగా.. బజరంగ్ పునియా, బధిర రెజ్లర్ వీరేందర్ సింగ్ ఆమెకు మద్దతుగా పద్మ శ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేశారు. ఈ పరిణామాల క్రమంలో డబ్ల్యూఎఫ్ఐ రాజ్యాంగాన్ని, నిబంధనలు ఉల్లంఘించారనే కారణంగా సంజయ్ సింగ్ ప్యానెల్‌పై కేంద్ర క్రీడా శాఖ వేటు వేయడం ఆసక్తికరంగా మారింది. బ్రిజ్ భూషణ్ జోక్యంతోనే సంజయ్ ఎవరినీ సంప్రదించకుండా ఇష్టారీతిన పోటీల నిర్వహణ అంశాన్ని ప్రకటించారని.. అందుకే డబ్ల్యూఎఫ్ఐపై సస్పెన్షన్ పడిందనే విమర్శలు వెల్లువెత్తాయి. మంచో.. చెడో.. రిటైర్ అయ్యాను.. నాకేం సంబంధం లేదు ఈ నేపథ్యంలో.. తాను రెజ్లింగ్ నుంచి రిటైర్ అయ్యానంటూ బ్రిజ్‌భూషణ్ సింగ్ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘నేను 12 ఏళ్ల పాటు సమాఖ్యకు సేవలందించాను. మంచో, చెడో ఏం చేశానో కాలమే సమాధానమిస్తుంది. ఇప్పుడైతే నేను రెజ్లింగ్ నుంచి రిటైర్ అయ్యాను. సమాఖ్యతో సంబంధాల్ని పూర్తిగా తెంచుకున్నాను. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల (లోక్‌సభ)పైనే దృష్టి పెట్టాను. డబ్ల్యూఎఫ్ఐలో ఏం జరిగినా అది కొత్త కార్యవర్గానికి చెందిన వ్యవహారమే తప్ప నాకు సంబంధించింది కాదు’’ అంటూ బ్రిజ్‌భూషణ్ ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సాక్షి మాలిక్, బజరంగ్ పునియా తదితరులు హర్షం వ్యక్తం చేశారు. చదవండి: Ind vs SA: షమీ ఉన్నా.. లేకపోయినా పెద్దగా తేడా ఉండదు: సౌతాఫ్రికా కెప్టెన్ -
WFI: కొంపముంచిన స్వామిభక్తి! కోర్టులోనే తేల్చుకుంటాం
WFI New President Sanjay Singh Comments: భారత రెజ్లింగ్ సమాఖ్యపై సస్పెన్షన్‌ను ఎత్తేయాలని డబ్ల్యూఎఫ్ఐ కొత్త అధ్యక్షుడు సంజయ్ సింగ్ కేంద్ర క్రీడా శాఖను కోరారు. తమకు సమయమిస్తే నిర్ణయాలు తీసుకోవడంలో నిబంధనల్ని అతిక్రమించలేదని నిరూపిస్తామనన్నారు. అలా కాదని సస్పెన్షన్‌ను కొనసాగిస్తే మాత్రం సహించబోమని.. కోర్టులోనే తేల్చుకుంటామని హెచ్చరించారు. వేటు వేసిన క్రీడా శాఖ కాగా భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఓ అడుగు ముందుకేస్తే... రెండడుగులు వెనక్కి అన్నట్లుంది వ్యవహారం. మహిళా రెజ్లర్ల పోరాటం, పోలీసు కేసులు, హైకోర్టు స్టేలను దాటుకొని ఎట్టకేలకు సమాఖ్యకు ఎన్నికలు జరిగి, కొత్త కార్యవర్గం ఏర్పాటైందన్న ముచ్చట మూణ్నాళ్ల ముచ్చటే అయింది. డబ్ల్యూఎఫ్ఐపై కేంద్ర క్రీడాశాఖ సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. ఏకపక్ష నిర్ణయాలు సహించేది లేదు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న బ్రిజ్‌భూషణ్‌కు విధేయుడైన సంజయ్ సింగ్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన ఇలా ఎన్నికయ్యారో లేదో అప్పుడే స్వామిభక్తి మొదలుపెట్టారు. అండర్–15, అండర్–20 జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్ పోటీలను బ్రిజ్‌భూషణ్ హవా నడిచే గోండా (యూపీ) పట్టణంలో నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ ఏకపక్ష విధానంపై కేంద్ర క్రీడాశాఖకు డబ్ల్యూఎఫ్ఐ కార్యదర్శి ప్రేమ్‌చంద్ ఫిర్యాదు చేయడంతో వెంటనే సమాఖ్యను సస్పెండ్ చేసింది. ‘కొత్త కార్యవర్గం ఏకపక్ష నిర్ణయంతో డబ్ల్యూఎఫ్ఐ నియమావళిని అతిక్రమించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో సస్పెన్షన్ వేటు వేశాం. ఇది అమల్లో ఉన్నంతవరకు సమాఖ్య రోజువారీ వ్యవహారాలను పర్యవేక్షించే అధికారం లేదు’ అని క్రీడాశాఖ వర్గాలు వెల్లడించాయి. జాతీయ స్థాయిలో నిర్వహించే ఏ జూనియర్, సబ్–జూనియర్, సీనియర్ టోర్నమెంట్ అయినా యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) నిబంధనల ప్రకారం ఎగ్జిక్యూటివ్ కమిటీలోనే చర్చించి నిర్ణయించాలి. కొంపముంచిన స్వామిభక్తి కానీ సంజయ్ మితిమీరిన స్వామిభక్తితో ఏకపక్ష నిర్ణయం తీసుకొని అడ్డంగా బుక్కయ్యారు. తాజా సస్పెన్షన్‌తో గోండాలో ఈనెల 28 నుంచి 30 వరకు జరగాల్సిన పోటీలు వాయిదా పడ్డాయి. అయితే, ఈ విషయంపై స్పందించిన సంజయ్ సింగ్.. ‘‘టోర్నీల నిర్వహణ విషయంలో డబ్ల్యూఎఫ్ఐ ‘నియామావళి’ ప్రకారమే నిర్ణయాలు తీసుకున్నాం. ఇది నా ఒక్కడి ఏకపక్ష నిర్ణయం కానేకాదు. 24 రాష్ట్ర సంఘాలను సంప్రదించిన మీదటే టోర్నీ ఆతిథ్య వేదికను ఖరారు చేశాం. అన్నింటికి ఈ–మెయిల్ సాక్ష్యాలున్నాయి. కావాలంటే వీటిని నిరూపిస్తాం’’ అని సవాల్ విసిరారు. చదవండి: PKL 2023: పవన్ పోరాటం వృథా -
రెజ్లింగ్ ఫెడరేషన్ బాధ్యతలు ఐఓఏకు అప్పగింత..
నూతనంగా ఎన్నికైన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పాలక వర్గాన్ని భారత క్రీడా మంత్రిత్వ శాఖ రద్దు చేసిన సంగతి తెలిసిందే. కొత్త అధ్యక్షుడు సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్ఐ నిబంధనలకు విరుద్ధంగా చేసిన ప్రకటనల వల్ల కేంద్ర క్రీడా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రెజ్లింగ్ ఫెడరేషన్‌ను చక్కదిద్దే బాధ్యతను ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్(ఐఓఏ)కు కేంద్రం అప్పగించింది. రెజ్లింగ్ ఫెడరేషన్ నిర్వహణకు తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేయాలని ఐఓఏకు క్రీడా శాఖ లేఖ రాసింది. రెజ్లర్ల సెలక్షన్ , ఫెడరేషన్ నిర్వహణ బాధ్యతలను చూడాలని ఐఓఏను కేంద్ర ప్రభుత్వం కోరింది. ఏంజరిగిందంటే? అధ్యక్షునిగా ఎన్నికైన అనంతరం సంజయ్ సింగ్.. అండర్-16, అండర్-20 రెజ్లింగ్ జాతీయ పోటీలు ఈ నెలాఖరులోపు ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో గల నందినగర్‌లో జరుగుతాయని ప్రకటించాడు. పోటీల్లో పాల్గొనేందుకు రెజ్లర్లకు సమయం ఇవ్వకుండా ప్రకటించడంపై క్రీడాకారుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ రెజ్లింగ్ పోటీలను నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో నిబంధనలకు విరుద్దంగా ప్రకటన చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్రం.. ప్యానెల్ మొత్తంపై వేటు వేసింది. అదే విధంగా బ్రిజ్ భూషణ్ సన్నిహితుడైన సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్ఐ ప్రెసిడింట్‌గా ఎంపిక కావడంపై రెజ్లర్ల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ ఆట నుంచి తప్పుకోగా.. బజరంగ్ పునియా తన పద్మ శ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేశాడు. ఈ నేపథ్యంలో క్రీడా శాఖ నిర్ణయం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. చదవండి: Govt Suspends WFI: క్రీడా శాఖ సంచలన నిర్ణయం.. కొత్తగా ఎన్నికైన డబ్ల్యూఎఫ్ఐ ప్యానెల్‌పై వేటు -
క్రీడా శాఖ సంచలన నిర్ణయం.. కొత్తగా ఎన్నికైన డబ్ల్యూఎఫ్ఐ ప్యానెల్‌పై వేటు
భారత క్రీడా మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఎన్నికైన భారత రెజ్లింగ్ సమాఖ్య పాలక వర్గాన్ని సస్పెండ్ చేసింది. డబ్ల్యూఎఫ్ఐ నూతన అధ్యక్షుడు సంజయ్ కుమార్ సింగ్ నిబంధనలకు విరుద్ధంగా చేసిన ప్రకటన వల్ల ఈ మేరకు వేటు వేసినట్లు తెలుస్తోంది. కాగా ఇటీవలే భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో మాజీ అధ్యక్షుడు, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న బ్రిజ్‌భూషణ్ తన పట్టు నిరూపించుకున్నాడు. బరిలో లేకపోయినా పట్టు నిరూపించుకున్న బ్రిజ్ భూషణ్ నేరుగా బరిలో నిలకపోయినా... 15 పదవుల్లో తన వర్గానికి చెందిన 13 మందిని గెలిపించుకున్నాడు. ఈ క్రమంలో బ్రిజ్ భూషణ్ ప్రధాన అనుచరుడిగా పేరొందిన, ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ సంఘం ఉపాధ్యక్షుడైన సంజయ్ సింగ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 2010 కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక విజేత అనిత షెరాన్‌పై 40–7 ఓట్ల తేడాతో గెలిచి నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు. అయితే, డబ్ల్యూఎఫ్ఐలో బ్రిజ్ భూషణ్ వర్గం ఎన్నికకావడాన్ని నిరసిస్తూ మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ ఆటకు స్వస్తి చెప్పగా.. బజరంగ్ పునియా తన పద్మ శ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేశాడు. రెజ్లర్ల నుంచి తీవ్ర నిరసన మరోవైపు.. సాక్షికి మద్దతుగా బధిర రెజ్లర్ వీరేందర్ సింగ్ సైతం పద్మ శ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇస్తానని తెలిపాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలపై చర్చ నడుస్తుండగా.. తాజాగా క్రీడా శాఖ నిర్ణయం హాట్ టాపిక్‌గా మారింది. కాగా డబ్ల్యూఎఫ్ఐ నూతన అధ్యక్షుడు సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. అండర్-16, అండర్-20 రెజ్లింగ్ జాతీయ పోటీలు ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో గల నందినగర్‌లో జరుగుతాయని ప్రకటించాడు. అయితే, ఈ క్రీడల్లో పాల్గొనే రెజ్లర్లకు ముందుగా సమాచారం ఇవ్వకుండానే ఇలాంటి ప్రకటన చేయడం డబ్ల్యూఎఫ్ఐ రాజ్యాంగానికి విరుద్ధం. ఈ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా కొత్తగా ఎన్నికైన డబ్ల్యూఎఫ్ఐపై నిషేధం విధిస్తూ క్రీడా శాఖా నిర్ణయం తీసుకుంది. అందుకే వేటు ‘‘డబ్ల్యూఎఫ్ఐ రాజ్యాంగంలోని క్లాజ్ 3(e) ప్రకారం.. సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ నేషనల్ చాంపియన్‌షిప్స్ ఎక్కడ నిర్వహించాలన్న అంశాన్ని ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయిస్తుంది. అంతకంటే ముందు సమావేశంలోని ఎజెండాలను పరిశీలిస్తుంది. డబ్ల్యూఎఫ్ఐ రాజ్యాంగంలోని ఆర్టికల్ 11 ప్రకారం.. మీటింగ్‌కు సంబంధించి కోరం కోసం ముందుగా నోటీసులు ఇవ్వాలి. ఇందుకు కనీసం 15 రోజుల నోటీస్ పీరియడ్ ఉంటుంది. మొత్తం ప్రతినిధుల్లో మూడొంతుల ఒకటి మేర కోరం ఉండాలి. అత్యవసరంగా సమావేశం నిర్వహించాలనుకుంటే కనీసం ఏడు రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి’’ . అయితే, ఈ నిబంధనలను సంజయ్ సింగ్ అతిక్రమించిన కారణంగా క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తోంది. చదవండి: Virat Kohli: అక్కడున్నది కోహ్లి.. రాత్రికిరాత్రే వెళ్లలేదు.. పక్కా ప్లాన్‌తోనే! -
నా సోదరి సాక్షిని చూసి గర్విస్తున్నా! చెప్పేదేమీ లేదన్న మంత్రి
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికల ఫలితాలపై నిరసనగా తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు స్టార్ రెజ్లర్లు. వీరికి బధిర రెజ్లర్ వీరేందర్ సింగ్ కూడా బాసటగా నిలిచాడు. తనకు లభించిన పౌరపురస్కారం ‘పద్మశ్రీ’ని తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేస్తానని ప్రకటించాడు. సాక్షిని చూసి గర్విస్తున్నా డెఫ్ ఒలింపిక్స్ (బధిర ఒలింపిక్స్)లో స్వర్ణ విజేతగా నిలిచిన వీరేందర్ ‘గుంగా పహిల్వాన్’గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘భారత మానస పుత్రిక, నా సోదరి సాక్షి మలిక్ కోసం నేను నా ‘పద్మ’ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేస్తా. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీజీ... సాక్షిని చూసి నేనెంతో గర్వపడుతున్నాను. దేశంలోని దిగ్గజ క్రీడాకారులంతా దీనిపై స్పందించాలని నేను కోరుకుంటున్నాను’ అని సోషల్ మీడియా ‘ఎక్స్’లో వీరేందర్ ట్వీట్ చేశాడు. స్పందించేందుకు నిరాకరించిన అనురాగ్ ఠాకూర్ మరోవైపు.. డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల ఫలితాలు, తదుపరి స్టార్ రెజ్లర్ల నిరసన నిర్ణయాలపై స్పందించేందుకు కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ నిరాకరించారు. బెంగళూరులోని ‘సాయ్’ సెంటర్లో ఆసియా క్రీడల్లో పతకాలు గెలిచిన అథ్లెట్లను అభినందించే కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ‘దీనిపై నేను ఇదివరకే చెప్పాల్సింది చెప్పా. ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేయను’ అని ఠాకూర్ అన్నారు. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడి ఎన్నికకు నిరసనగా కాగా డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై పలువురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలతో నిరసనలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కఠిన చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లభించలేదని.. అంతేగాక డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ అనుచరుడు సంజయ్ సింగ్ గెలవడం తమపై ప్రభావం చూపుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే.. ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్ కుస్తీకి స్వస్తి పలకగా.. మరో ఒలింపియన్ బజరంగ్ పునియా తన పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించాడు. చదవండి: నాకొద్దీ ‘పద్మశ్రీ’... అది అతడి వ్యక్తిగత నిర్ణయం.. ఏం జరుగుతోంది? -
నాకొద్దీ ‘పద్మశ్రీ’... అది అతడి వ్యక్తిగత నిర్ణయం.. ఏం జరుగుతోంది?
న్యూఢిల్లీ: దేశానికి పతకాలు తెచ్చిపెట్టిన భారత స్టార్ రెజ్లర్ల నుంచి మరో తీవ్రమైన నిర్ణయం వెలువడింది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికల ఫలితాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రెజ్లర్లు ఆటకు వీడ్కోలు పలకడం, ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలను వెనక్కి ఇచ్చేయడం చేస్తున్నారు. ఇది భారత క్రీడాలోకానికి మచ్చగా మిగలడం ఖాయం! డబ్ల్యూఎఫ్ఐలో తిష్ట వేసుక్కూర్చున్న వివాదాస్పద మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ చెరలోనే రెజ్లింగ్ సమాఖ్య కొనసాగనుండటం, ఆయన వీర విధేయుడు సంజయ్ సింగ్ ఎన్నికల్లో కొత్త అధ్యక్షుడిగా గెలవడంతో గురువారం రియో ఒలింపిక్స్ కాంస్య విజేత సాక్షి మలిక్ రిటైర్మెంట్ ప్రకటించింది. శుక్రవారం తాజాగా టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బజరంగ్ పూనియా భారత ప్రభుత్వం 2019లో ఇచ్చిన పౌర పురస్కారం ‘పద్మశ్రీ’ని వెనక్కి ఇచ్చేశాడు. రోడ్డుమీదే పురస్కారాన్ని ఉంచి బజరంగ్ పార్లమెంట్ వైపు వెళ్తుండగా కర్తవ్యపథ్ వద్ద ఢిల్లీ పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. దీంతో అక్కడి రోడ్డుమీదే పురస్కారాన్ని ఉంచి తన నిరసన లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి చేరేలా చూడాలని పోలీసు అధికారుల్ని బజరంగ్ వేడుకొని అక్కడి నుంచి నిష్క్రమించాడు. ‘ప్రధాని మోదీకి నేను పద్మశ్రీని తిరిగి ఇచ్చేస్తున్నా. ఈ లేఖే నా ఆవేదనగా భావించాలి’ అని సోషల్ మీడియా ‘ఎక్స్’లో పేర్కొన్నాడు. నిరసనగానే ఈ నిర్ణయం ఇక ఆ లేఖలో ఏముందంటే... ‘మోదీజీ మీరు బిజీగా ఉంటారని తెలుసు. అలాగే గత కొన్నాళ్లుగా మహిళా రెజ్లర్లు పడుతున్న పాట్లు, బ్రిజ్‌భూషణ్ నుంచి ఎదుర్కొంటున్న వేధింపులు మీకు తెలుసు. దీనిపై మేం రెండుసార్లు రోడెక్కి నిరసించాం. న్యాయం చేస్తామన్న ప్రభుత్వ హామీతో మా దీక్షను విరమించాం. ముందుగా అసలు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. తాత్సారం తర్వాతే కేసు నమోదు చేశారు. మొదట్లో బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా 19 మంది మహిళా రెజ్లర్లు స్టేట్మెంట్ ఇస్తే తదనంతరం ఈ సంఖ్య ఏడుగురికి పడిపోయింది. దీంతో అతని పలుకుబడి ఏ రకంగా శాసిస్తుందనేది అర్థమైంది. ఇప్పుడు మళ్లీ ఆయన వర్గమే రెజ్లింగ్ సమాఖ్యకు కొత్తగా ఎన్నికైంది. దీనికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని బజరంగ్ లేఖలో వివరించాడు. అది అతడి వ్యక్తిగత నిర్ణయం.. ఎన్నికల విషయంలో మరోవైపు బజరంగ్ ‘పద్మశ్రీ’ని తిరిగిస్తుంటే కేంద్ర క్రీడాశాఖ తేలిగ్గా తీసుకున్నట్లుంది. వెనక్కి ఇవ్వడమనేది అతని వ్యక్తిగత నిర్ణయమని తెలిపింది. రెజ్లింగ్ ఎన్నికల్ని ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించారని... అయినప్పటికీ బజరంగ్‌ను తన నిర్ణయం మార్చుకోవాలని కోరతామని క్రీడాశాఖ అధికారి ఒకరు తెలిపారు. -
40 రోజులు రోడ్లపై నిద్రించాం కానీ.. సాక్షి మాలిక్ సంచలన ప్రకటన
Sakshi Malik Gets Emotional Video Viral: భారత మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ సంచలన ప్రకటన చేసింది. ఆటకు తాను వీడ్కోలు పలుకనున్నట్లు తెలిపింది. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వంటి వ్యక్తి అనుచరుడి నేతృత్వంలో తాను పోటీల్లో పాల్గొనలేనని.. అంతకంటే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించడమే మేలు అని వెల్లడించింది. కాగా భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో సాక్షి మాలిక్, వినేశ్ ఫొగట్ తదితర మహిళా రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నెలరోజులకు పైగా నిరసన చేసిన విషయం తెలిసిందే. వీరికి బజరంగ్ పునియా, జితేందర్ వంటి పురుష రెజ్లర్లు మద్దతుగా నిలిచారు. అనితా షెరాన్‌కు తప్పని ఓటమి ఈ క్రమంలో.. అనేక పరిణామాల అనంతరం బ్రిజ్ భూషణ్ స్థానంలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరిగింది. ఢిల్లీలోని ఒలింపిక్ భవన్ వేదికగా గురువారం జరిగిన ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ వీర విధేయుడిగా పేరొందిన సంజయ్ కుమార్ సింగ్ గెలుపొందాడు. మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలిచిన మాజీ రెజ్లర్ అనితా షెరాన్‌పై విజయం సాధించాడు. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన సాక్షి మాలిక్ మీడియాతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. ‘‘దాదాపు నలభై రోజుల పాటు నిరసన చేస్తూ రోడ్లపై నిద్రించాం. దేశంలోని నలుమూలల నుంచి మాకు మద్దతుగా ఎంతో మంది వచ్చారు. కన్నీటి పర్యంతమైన సాక్షి ఒకవేళ బ్రిజ్ భూషణ్ వ్యాపార భాగస్వామి, అతడి అనుంగు అనుచరుడు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు అయితే, నేను రెజ్లింగ్‌నే వదిలేస్తా’’ అంటూ సాక్షి కన్నీళ్లు పెట్టుకుంది. ఇక బజరంగ్ పునియా మాట్లాడుతూ.. ‘‘బ్రిజ్ భూషణ్ విశ్వాసపాత్రులెవరూ డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల్లో పాల్గొనరంటూ ప్రభుత్వం మాకిచ్చిన మాటను దురదృష్టవశాత్తూ నిలబెట్టుకోలేకపోయింది’’ అని విచారం వ్యక్తం చేశాడు. బ్రిజ్ భూషణ్‌కు సన్నిహితుడు కాగా డబ్ల్యూఎఫ్ఐ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సంజయ్ కుమార్ సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన వ్యక్తి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో భాగమైన అతడు బ్రిజ్ భూషణ్‌కు అత్యంత సన్నిహితుడని సమాచారం. ఈ నేపథ్యంలో ఇకపై రెజ్లింగ్ సమాఖ్యలో విధివిధానాల రూపకల్పనపై అతడు కచ్చితంగా బ్రిజ్ భూషణ్ సూచనలు, సలహాలు తీసుకుంటాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే సాక్షి మాలిక్ వంటి వాళ్లు ఇలాంటి వ్యక్తి నేతృత్వంలో తాము ఆటను కొనసాగించలేమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. #WATCH | Delhi: Wrestler Sakshi Malik says "We slept for 40 days on the roads and a lot of people from several parts of the country came to support us. If Brij Bhushan Singh's business partner and a close aide is elected as the president of WFI, I quit wrestling..." pic.twitter.com/j1ENTRmyUN — ANI (@ANI) December 21, 2023 -
WFI: భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు.. బ్రిజ్‌భూషణ్ విధేయుడి గెలుపు
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఢిల్లీ వేదికగా ఒలింపిక్ భవన్లో ఈ ఎన్నికలు జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫలితాలు ఈరోజే(గురువారం) వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల సందర్భంగా నూతన అధ్యక్షుడిగా సంజయ్ కుమార్ సింగ్ ఎన్నికయ్యాడు. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వీర విధేయుడిగా పేరొందిన సంజయ్.. మాజీ రెజ్లర్ అనిత షెరాన్‌పై విజయం సాధించాడు. ఏం జరిగిందంటే? కాగా డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డబ్ల్యూఎఫ్ఐ వివాదాల్లో చిక్కుకుంది. బ్రిజ్‌భూషణ్ అధ్యక్ష పదవికి అనర్హుడని... అతడిని వెంటనే తప్పించాలంటూ రెజ్లర్లు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేశారు. ఈ క్రమంలో భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) డబ్ల్యూఎఫ్ఐ ప్యానెల్‌ను రద్దు చేసింది. అనంతరం డబ్ల్యూఎఫ్ఐ నిర్వహణ బాధ్యతను అడ్‌హక్ కమిటీకి అప్పగించింది. అయితే అడ్‌హక్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణకు అవాంతరాలు ఎదురయ్యాయి. నిజానికి షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది (2023) మే 7న డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలు జరగాల్సింది. అయితే అప్పుడు క్రీడా మంత్రిత్వ శాఖ ఎలక్షన్‌ను నిలిపి వేసింది. ఈ క్రమంలో చివరగా ఆగస్టు 12న ఎన్నికలు నిర్వహిస్తామని అడ్‌హక్ కమిటీ ప్రకటించింది. అయితే, ఓటు హక్కు కోసం పలు సంఘాలు కోర్టుకెక్కగా.. పంజాబ్-హర్యానా హైకోర్టు ఈ ఎన్నికలపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్నికలు మరోసారి వాయిదా పడగా... డిసెంబరు 21న ఎన్నికల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. అనిత్ వర్సెస్ సంజయ్ భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష పదవి కోసం 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ రెజ్లర్ అనిత షెరాన్, యూపీ రెజ్లింగ్ సమాఖ్య ఉపాధ్యక్షుడు సంజయ్ కుమార్ సింగ్ పోటీపడుతున్నారు. నిరసన దీక్షలో పాల్గొన్న రెజ్లర్లకు వెన్నుదన్నుగా నిలిచి మాట్లాడిన 38 ఏళ్ల అనిత.. వివాదాస్పద డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్‌భూషణ్ వీర విధేయుడుగా పేరొందిన సంజయ్ కుమార్ సింగ్‌లలో ఎవరు గెలుస్తారన్న అంశంపై ఆసక్తి నెలకొనగా చివరికి సంజయ్ పైచేయి సాధించాడు. -
భారత రెజ్లింగ్ సమాఖ్యకు (WFI) షాక్.. సభ్యత్వం రద్దు
విశ్వవేదికపై భారత్‌కు అవమానం జరిగింది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సమాఖ్య(UWW).. భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI) సభ్యత్వాన్ని రద్దు చేసింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించడంలో డబ్ల్యూఎఫ్ఐ విఫలమైనందుకు చర్యలు తీసుకున్నట్లు యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సమాఖ్య ప్రకటించింది. యూడబ్ల్యూడబ్ల్యూ తీసుకున్న ఈ నిర్ణయంతో త్వరలో (సెప్టెంబర్ 16 నుంచి) ప్రారంభంకానున్న ఒలింపిక్ క్వాలిఫైయింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ పోటీల్లో భారత అథ్లెట్లుగా తటస్థ అథ్లెట్లుగా (భారత్ ట్యాగ్‌లైన్ లేకుండా) బరిలోకి దిగాల్సి ఉంటుంది. కాగా, డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై స్టార్ మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో డబ్ల్యూఎఫ్ఐ వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. బ్రిజ్‌భూషణ్‌ను పదవి నుంచి తప్పించాలని రెజ్లర్లు తారాస్థాయిలో ఆందోళనలకు దిగడంతో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ డబ్ల్యూఎఫ్ఐ ప్యానెల్‌ను రద్దు చేసింది. ఆ తర్వాత డబ్ల్యూఎఫ్ఐ నిర్వహణ బాధ్యతను అడ్‌హక్ కమిటీకి అప్పగించింది. అయితే అడ్‌హక్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణకు వరుసగా అవాంతరాలు ఎదురవుతూ వచ్చాయి. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది (2023) మే 7న ఎలక్షన్స్ జరగాల్సి ఉండింది. అయితే అప్పుడు క్రీడా మంత్రిత్వ శాఖ ఎన్నికలను నిలిపి వేసింది. ఆతర్వాత చాలా తేదీలు మారుతూ వచ్చాయి. ఈ మధ్యలో ఓటు హక్కు కోసం పలు సంఘాలు కోర్టుకెక్కాయి. చివరగా ఆగస్టు 12న ఎన్నికలు నిర్వహిస్తామని అడ్‌హక్ కమిటీ ప్రకటించగా.. పంజాబ్-హర్యానా హైకోర్టు ఈ ఎన్నికలపై స్టే విధించింది. దీంతో ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. ఈ క్రమంలోనే యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సమాఖ్య.. భారత రెజ్లింగ్ సమాఖ్యపై వేటు వేసింది. -
భారత రెజ్లింగ్ ట్రయల్స్ 25, 26వ తేదీల్లో
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌లను ఖరారు చేసే ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్íÙప్లో పాల్గొనే భారత జట్లను ఈనెల 25, 26వ తేదీల్లో ఎంపిక చేయనున్నారు. పాటియాలాలో నిర్వహించే ఈ ట్రయల్స్ నుంచి ఎవరికీ మినహాయింపు లేదని... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలనుకుంటే అందరూ ఈ ట్రయల్స్‌కు హాజరు కావాల్సిందేనని భారత రెజ్లింగ్ సమాఖ్య వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న అడ్–హక్ ప్యానెల్ వెల్లడించింది. ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్ల ఎంపిక కోసం నిర్వహించిన ట్రయల్స్ నుంచి స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్‌లకు మినహాయింపు ఇవ్వడం వివాదాస్పదమైంది. సెపె్టంబర్ 16 నుంచి 24 వరకు బెల్గ్రేడ్లో ప్రపంచ చాంపియన్‌షిప్ జరగనుంది. ప్రపంచ చాంపియన్íÙప్లో ఆయా కేటగిరీల్లో టాప్–5లో నిలిచిన రెజ్లర్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. -
అనిత X సంజయ్
న్యూఢిల్లీ: ఇన్నాళ్లు రెజ్లర్ల ఆరోపణలు, నిరసనలతో తరచూ వార్తల్లోకెక్కిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఇప్పుడు ఎన్నికల హడావిడిలో ఉంది. 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ రెజ్లర్ అనిత షెరాన్ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేయగా, వివాదాస్పద డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్‌భూషణ్ తన వీర విధేయుడు సంజయ్ కుమార్ సింగ్‌ను బరిలో దించాడు. నామినేషన్ల దాఖలు గడువు ముగియడంతో అధ్యక్ష పోటీ ఇప్పుడు మాజీ రెజ్లర్ అనిత, బ్రిజ్‌భూషణ్ నమ్మిన బంటు సంజయ్‌ల మధ్యే నెలకొంది. నిరసన దీక్షలో పాల్గొన్న రెజ్లర్లకు వెన్నుదన్నుగా నిలిచి మాట్లాడిన 38 ఏళ్ల అనితకు రెజ్లర్ల మద్దతు ఉంది. ఇప్పటికే విడుదలైన ఎన్నికల షెడ్యూలు ప్రకారం ఈ నెల 12న ఓటింగ్, అదే రోజు ఫలితాలు విడుదలవుతాయి. -
వినేశ్ ఫొగాట్, భజరంగ్‌ల వ్యవహారంపై హైకోర్టుకు అంతిమ్ పంఘల్
ఒలింపిక్ పతక విజేత బజరంగ్, ఆసియా గేమ్స్ చాంపియన్ వినేశ్ ఫొగాట్ ట్రయల్స్ లేకుండానే ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు బెర్త్‌లు పొందిన సంగతి తెలిసిందే. పురుషుల 65 కేజీల కేటగిరీలో బజరంగ్... మహిళల 53 కేజీల విభాగంలో వినేశ్ చైనాలో జరిగే ఆసియా క్రీడల్లో పోటీ పడతారు. అయితే ఈ విభాగాల్లోనూ ట్రయల్స్ నిర్వహించి విజేతలను స్టాండ్‌బైగా అక్కడికి తీసుకెళ్తారు. ఈ విషయం పక్కనబెడితే.. వినేశ్ ఫొగాట్‌కు ఎలాంటి ట్రయల్స్ లేకుండానే నేరుగా ఆసియా గేమ్స్‌లో పాల్గొనడంపై యువ రెజ్లర్ అంతిమ్ పంఘల్ తప్పుబడుతూ హైకోర్టులో చాలెంజ్ చేశాడు. ఇదే విషయంపై అంతిమ్ పంఘల్ చిన్ననాటి కోచ్ వికాష్ భరద్వాజ్ మాట్లాడుతూ.. ''ట్రయల్స్ లేకుండానే వినేశ్, భజరంగ్‌లను ఆసియా గేమ్స్ ఆడనివ్వడంపై హైకోర్టుకు వెళ్తున్నాం. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం. డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేసిన ఆందోళనలో యువ రెజ్లర్లు కూడా ఉన్నారు. కానీ డబ్ల్యూఎఫ్ఐ కేవలం సీనియర్లకు మాత్రమే అవకాశమిచ్చి సాక్షి మాలిక్ లాంటి జూనియర్లకు ఆసియా గేమ్స్‌కు ఎందుకు ట్రయల్స్ లేకుండా పంపించడం లేదు. ఇది కరెక్ట్ కాదు. అందరికి ట్రయల్స్ నిర్వహించాల్సిందే. ఎవరిని డైరెక్ట్‌గా ఎంపిక చేయకూడదు. దీనిపై పోరాడుతాం'' అంటూ తెలిపారు. ఇక అంతిమ్ పంఘల్ ఆసియా గేమ్స్‌లో బాక్సింగ్ విభాగంలో 53 కేజీలో కేటగిరిలో పోటీ పడనుండగా.. రెజ్లర్లు భజరంగ్ పూనియా 65 కేజీలు.. వినేశ్ ఫొగాట్ 53 కేజీల విభాగంలో ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇక ఆసియా గేమ్స్ సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్జూ వేదికగా జరగనున్నాయి. చదవండి: DopingTest: రెండేళ్లలో 114 మంది క్రికెటర్లకు మాత్రమేనా.. WADA అసహనం -
లైంగిక వేధింపుల కేసు: బ్రిజ్‌భూషణ్‌కు బెయిల్
న్యూఢిల్లీ: రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు ఢిల్లీ కోర్టు రెండు రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వగా... డబ్ల్యూఎఫ్ఐ అడ్‌హక్ కమిటీ స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్‌లకు నేరుగా ఆసియా క్రీడల బెర్త్‌లు ఖరారు చేసింది. మరోవైపు ఈ ఇద్దరు రెజ్లర్లకు కమిటీ ఇచి్చన మినహాయింపుపై విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీం కోర్టు) డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జస్టిస్ అనిరుధ బోస్, జస్టిస్ ఎస్వీ భట్టిలతో కూడిన ద్విసభ్య బెంచ్ గతంలో గువాహటి హైకోర్టు విధించిన ‘స్టే’ను కొట్టివేసింది. వెంటనే ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టాల్సిందిగా డబ్ల్యూఎఫ్ఐని ఆదేశించింది. అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ హర్జీత్ సింగ్ రూ.. 25 వేల పూచీకత్తుపై బ్రిజ్‌భూషణ్‌కు, డబ్ల్యూఎఫ్ఐ సహాయక కార్యదర్శి వినోద్ తోమర్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసి విచారణను గురువారానికి వాయిదా వేశారు. -
'చుప్'.. మైక్ విరగ్గొట్టి రిపోర్టర్‌తో దురుసు ప్రవర్తన
మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(WFI) మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్ తన చర్యతో మరోసారి వార్తల్లోకెక్కారు. ప్రశ్న అడిగిన పాపానికి ఒక మహిళా జర్నలిస్టుతో దురుసుగా ప్రవర్తించడమే గాక మైక్‌ను విరగ్గొట్టడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్రిజ్‌భూషణ్ చర్యపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విషయంలోకి వెళితే.. ప్రముఖ న్యూస్ చానెల్‌కు చెందిన రిపోర్టర్.. ''రెజ్లర్లకు లైంగిక వేధింపులపై ఢిల్లీ పోలీసులు మీపై చార్జ్‌షీట్ దాఖలు చేశారు.. నేరం రుజువైతే ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నారా'' అంటూ ప్రశ్నించింది. రిపోర్టర్ ప్రశ్నపై ఆగ్రహం వ్యక్తం చేసిన బ్రిజ్‌భూషణ్.. ''నేనెందుకు రాజీనామా చేస్తాను.. నా రాజీనామా గురించి ఎందుకడుగుతున్నారు''' అంటూ అసహనం వ్యక్తం చేశారు. ''అనంతరం మీపై చార్జ్‌షీట్ లు ఫైల్ అయ్యాయి.. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది'' అని అడగ్గా.. బ్రిజ్‌భూషణ్ రిపోర్టర్‌వైపు ఉరిమి చూస్తూ ''చుప్(Shut Up)'' అంటూ కారు ఎక్కడానికి ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో రిపోర్టర్ తన ప్రశ్నకు జవాబు చెప్పాలంటూ మైక్‌ను కారు డోరులో పెట్టింది. దీంతో కోపంతో మైక్‌పై నుంచే డోర్‌ను గట్టిగా వేశాడు. దీంతో రిపోర్టర్ చేతికి గాయమవ్వగా.. మైక్ విరిగిపోయింది. అక్కడే ఉన్న ఒక వ్యక్తి ఇదంతా వీడియో తీసి ట్విటర్లో షేర్ చేయగా ట్రెండింగ్‌గా మారింది. #LIVE कैमरे पर एक महिला पत्रकार से पहलवानों के साथ उत्पीड़न का आरोपी भाजपाई सांसद धमका रहा है, उनका माइक तोड़ रहा है, क्या महिला बाल विकास मंत्री @smritiirani बता सकती है ये किसके शब्द है? किसके संस्कार है? pic.twitter.com/689KVkrBRg — Srinivas BV (@srinivasiyc) July 11, 2023 बृजभूषण का ऑन कैमरा जब एक महिला पत्रकार के साथ ऐसा व्यवहार है तो ऑफ कैमरा आप ख़ुद समझ लें. #BrijBhushanSharanSingh pic.twitter.com/UdvtUhTZSH — Vividha (@VividhaOfficial) July 11, 2023 ఇక మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ కేసులో ఢిల్లీ పోలీసులు ఢిల్లీ పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన వేధింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు. బ్రిజ్ భూషణ్ పై ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో సుమారు 108 మంది సాక్షులను విచారించినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకూ నమోదైన కేసుల్లో ఆయన శిక్షార్హుడేనని ఢిల్లీ పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జ్‌షీట్ (chargesheet)లో తెలిపారు. నేరం రుజువైతే ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు. కాగా ఢిల్లీ కోర్టు గత శుక్రవారం బ్రిజ్ భూషణ్ కు సమన్లు జారీ చేసింది. కేసును కొనసాగించేందుకు తగిన సాక్ష్యాలు ఉన్నాయని పేర్కొంది. జులై 18న కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. అయితే మహిళా రెజ్లర్లు తనపై చేసిన లైంగిక వేధింపు ఆరోపణలను బ్రిజ్ భూషణ్ పలుమార్లు ఖండించారు. చదవండి: Ashes 2023: 'అరె శాండ్‌పేపర్ మరిచిపోయా'.. ఆసీస్ ప్రధానికి రిషి సునాక్ కౌంటర్ Asia Cup 2023: 'జై షా పాకిస్తాన్ వెళ్లడమేంటి?.. దాయాదుల మ్యాచ్ అక్కడే' -
పక్కా ఆధారాలున్నాయి.. ఇక జైలుకే..
న్యూడిల్లి: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఆయనపై ఇప్పటికే చార్జి షీటు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు ఆయనను కటకటాల వెనక్కు పంపే ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. అందుకు తగిన ఆధారాలను కూడా సేకరించినట్లు చెబుతున్నారు. మైనర్ రెజ్లర్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో రెజ్లర్లు ఉధృత స్థాయిలో నిరసనలు తెలియజేయడంతో ఎంపీ బ్రిజ్ భూషణ్ పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు విచారణ వేగవంతం చేసి వెయ్యి పేజీల ఛార్జిషీటును నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారు సుమారు 100 మంది వాంగ్మూలాలను సేకరించినట్లు వారిలో 15 మంది ఇచ్చిన వాంగ్మూలాలు ఆయనకు ప్రతికూలంగా ఉన్నాయని తెలిపారు. ఈ సాక్ష్యాలను ఢిల్లీ కోర్టులో సమర్పించనున్నట్లు తెలిపిన ఢిల్లీ పోలీసులు నేరం రుజువు చేయడానికి ఈ సాక్ష్యాలు సరిపోతాయని తెలిపారు. ఒకవేళ నేరం రుజువైతే మాత్రం బ్రిజ్ భూషణ్ కు మూడేళ్ళ నుండి ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశముంటుందని అన్నారు. అసలే నేరారోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ కాస్తంత క్రమశిక్షణతో వ్యవహరించాల్సింది పోయి ఇటీవల ఒక విలేఖరిపైన అనుచితంగా వ్యవహరించడంతో మరింత అప్రతిష్ట మూటగట్టుకున్నారు. జూలై 18 కోర్టుకు హాజరు కావాల్సిందిగా సమన్లు కూడా అందుకున్న బ్రిజ్ భూషణ్ ఈ విషయంపై మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు. నేరుగా కోర్టులోనే మాట్లాడతానని అన్నారు. ఇది కూడా చదవండి: విరాళాల సేకరణలో బీజేపీ టాప్.. ఆరేళ్లలో వేల కోట్ల విరాళాలు -
ఇకపై రోడ్డెక్కం... కోర్టులోనే తేల్చుకుంటాం
న్యూఢిల్లీ: లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రెండుసార్లు నిరసన దీక్ష చేపట్టిన స్టార్ రెజ్లర్ల వైఖరి మారింది. తమకు న్యాయం దక్కేవరకు ఆయనపై పోరాటం కొనసాగుతుందని, అయితే అది కోర్టులోనే తేల్చుకుంటామని... ఇకపై రోడ్డెక్కబోమని రెజ్లర్లు ప్రకటించారు. ‘డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల ప్రక్రియ ముగిశాక మాకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని ప్రభుత్వం తెలిపింది. ఆ మేరకు మేం వేచిచూస్తాం. కానీ బ్రిజ్‌భూషణ్‌పై మా పోరాటాన్ని మాత్రం విరమించే ప్రసక్తేలేదు’ అని వినేశ్ ఫొగాట్ ట్వీట్ చేసింది. అనంతరం కొన్నాళ్లపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటామని వినేశ్తో పాటు సాక్షి మలిక్ తెలిపింది. డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలపై స్టే భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు చాలాసార్లు వాయిదా పడ్డాయి. తాజాగా ఇప్పుడు గువాహటి హైకోర్టు స్టేతో మరో వాయిదా తప్పేలాలేదు. అస్సాం సంఘం తమ సభ్యత్వాన్ని గుర్తించకపోవడం, ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం ఇవ్వకపోవడంతో హైకోర్టులో పిటీషన్ వేయగా వచ్చే నెల 11న జరగాల్సిన డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలపై కోర్టు స్టే విధించింది. -
జూలై 6న భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు జూలై 6వ తేదీన నిర్వహిస్తారు. అదే రోజున ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం నియమించిన ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ మహేశ్ మిట్టల్ కుమార్ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 23 నుంచి 25 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 28న వాటిని పరిశీలిస్తారు. జూలై 2న ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. -
WFI (రెజ్లింగ్ ఫెడరేషన్) ఎన్నికలకు ముహూర్తం ఖరారు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. ఈ ఎన్నికలు జులై 4న జరుగుతాయని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) సోమవారం ప్రకటించింది. జమ్మూ అండ్ కశ్మీర్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మహేశ్ మిట్టల్ కుమార్‌ను రిటర్నింగ్ అధికారిగా నియమించడంతో ఎన్నికల ప్రక్రియ మొదలైనట్లు IOA తెలిపింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న WFI అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఈ ఏడాది మార్చిలో పదవీకాలాన్ని ( 3 విడతలు, 12 సంవత్సరాలు) పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. WFI ముందుగా మే 7న ఎన్నికల తేదీని ప్రకటించింది. అయితే వివాదాల నేపథ్యంలో భారత క్రీడా మంత్రిత్వ శాఖ ఆ తేదీన ఎన్నిక నిర్వహించేందుకు ఒప్పుకోలేదు. ఎన్నికలను నిర్వహించడానికి ఇద్దరు సభ్యుల తాత్కాలిక కమిటీని నియమించి, నూతనంగా ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టింది. కాగా, గత కొద్ది వారాలుగా భారత రెజ్లర్లు WFI అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై లైంగిక ఆరోపణలు చేస్తూ నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో కేంద్రంతో పలు చర్చల అనంతరం రెజ్లర్లు ఓ మెట్టు దిగారు. జూన్ 15వ తేదీ వరకు ఆందోళనలను చేపట్టబోమని, అప్పటివరకు తమ నిరసన ప్రదర్శనలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కేంద్రం నుంచి రాతపూర్వక హామీ లభించినందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ విషయంలో కేంద్రం ముందు రెజ్లర్లు ఐదు డిమాండ్లు ఉంచారు. అవేంటంటే.. 1.భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష పదవిని మహిళకు అప్పగించాలి. 2.అయితే కొత్తగా ఏర్పాటు చేసిన సమాఖ్యలో బ్రిజ్ భూషణ్, ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఉండకూడదు. 3. రెజ్లింగ్ పాలక మండలికి నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి. 4. నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం రోజున జరిగిన ఉద్రిక్తతలలో రెజ్లర్లపై నమోదైన ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలి. 5.లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలి. చదవండి: డబ్ల్యూటీసీ ఓటమి ఎఫెక్ట్.. పుజారా, ఉమేశ్ యాదవ్‌లపై వేటు..? -
Wrestlers Protest: ఆరోపణలు రుజువైతే ఉరి వేసుకుంటా
న్యూఢిల్లీ: లైంగిక వేధింపులకు సంబంధించి భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై నమోదైన కేసు వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు స్పష్టతనిచ్చారు. దీనిపై విచారణ ఇంకా కొనసాగుతోందని వారు వెల్లడించారు. ‘మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణల విషయంలో బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదు’ అని పోలీసులు చెప్పినట్లుగా బుధవారం ఉదయం వార్తలు వచ్చాయి. దాంతో కాస్త గందరగోళం నెలకొంది. దాంతో పోలీసులు ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. ‘ఆ వార్తలు పూర్తిగా తప్పు. చాలా సున్నితమైన ఈ కేసు విషయంలో అంతే జాగ్రత్తగా విచారణ జరుపుతున్నాం. తాజా పరిస్థితిపై కోర్టుకు సమాచారం ఇస్తూనే ఉన్నాం. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతూనే ఉంది కాబట్టి నివేదిక కోర్టుకు సమర్పించక ముందు బహిరంగంగా వెల్లడి చేయడం సరైంది కాదు’ అని పోలీసులు స్పష్టం చేశారు. తాజా పరిణామాల్లో దేశంలోని వేర్వేరు రాజకీయ పార్టీలు రెజ్లర్లకు మద్దతు ప్రకటించాయి. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెజ్లర్లకు న్యాయం చేయాలంటూ స్వయంగా ప్లకార్డ్ పట్టి ర్యాలీలో పాల్గొనగా... బ్రిజ్‌భూషణ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బేటీ బచావా, బేటీ పడావో మాత్రమే కాదు...ఇకపై బీజేపీ నాయకుల నుంచి ఆడబిడ్డలను కాపాడుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ ‘బేటీ బీజేపీ కే నేతావోంసే బచావో’ అంటూ కొత్త నినాదాన్ని ఇచ్చింది. మరోవైపు మంగళవారం హరిద్వార్‌లో గంగలో పతకాలు వేయాలని సంకల్పించిన ఆ తర్వాత మనసు మార్చుకున్న రెజ్లర్లు స్వస్థలం హరియాణా చేరుకోగా, సాక్షి మలిక్ మాత్రం ఢిల్లీలోనే ఉండిపోయింది. తీవ్ర బాధలో ఉండటంతో పాటు మౌనంగా ఉండాలని ఒట్టేసుకోవడం వల్లే మంగళవారం వారు ఎవరితో మాట్లాడలేదని సన్నిహితులు వెల్లడించారు. తీవ్ర చర్యలకు పాల్పడవద్దు: ఠాకూర్ క్రీడల గొప్పతనాన్ని తగ్గించే ఎలాంటి తీవ్ర చర్యలకు పాల్పడవద్దని కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ రెజ్లర్లకు సూచించారు. విచారణ పూర్తయ్యే వరకు కాస్త ఓపిక పట్టమని ఆయన కోరారు. మరోవైపు ఆదివారం భారత రెజ్లర్ల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. రెజ్లర్లను పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన దృశ్యాలు కలిచివేసే విధంగా ఉన్నాయని ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఆరోపణలు రుజువైతే ఉరి వేసుకుంటా’ కేసుకు సంబంధించి తనపై ఆరోపణలు రుజువైతే ఉరి వేసుకుంటానని బ్రిజ్‌భూషణ్ సింగ్ మరోసారి చెప్పారు. ‘వారు నాపై ఆరోణలు చేసి నాలుగు నెలలైంది. ఒక్కదానినీ రుజువు చేయలేకపోయారు. నాకు ఉరిశిక్ష విధించాలని వారు కోరారు. గంగలో పతకాలు వేయడం ద్వారా నన్ను శిక్షించలేరు. సాక్ష్యాలుంటే కోర్టుకు ఇచ్చి నాకు ఉరిశిక్ష వేయించండి. నా బిడ్డల్లాంటివారైన రెజ్లర్లపై నాకు ఇప్పటికీ కోపం లేదు’ అని ఆయన అన్నారు. మరోవైపు బ్రిజ్‌భూషణ్‌పై కేసు నమోదు చేసిన మైనర్ రెజ్లర్ వివరాలు బహిర్గతం చేసిన ఆమె బంధువు ఒకరిపై కేసు నమోదు చేయాలని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్ స్వాతి మలివాల్ పోలీసులకు సూచించింది. -
అదీ.. వాళ్ల వైఖరి: బ్రిజ్ భూషణ్
ఢిల్లీ: ఆత్మగౌరవం కోసం ప్రాణాలైనా వదిలేస్తామని, ఆఫ్ట్రాల్ మెడల్స్ ఎంతని చెబుతూ.. తమ ఘనతలను గంగలో నిమజ్జనం చేసేందుకు భారత రెజ్లర్లు సిద్ధపడ్డారు. అయితే హరిద్వార్ వద్ద చివరి నిమిషంలో ఆ ప్రయత్నం ఆగిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై రెజ్లర్ల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్.. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలను పోలీసులు విచారిస్తున్నారు కదా! అని రెజ్లర్లకు గుర్తు చేశారాయన. ఈ విషయంపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్లు చేసిన ఆరోపణల్లో ఏమైనా నిజం ఉందని తేలితే.. అప్పుడు అరెస్ట్ జరుగుతుంది కదా పేర్కొన్నారాయన. ఇక గంగలో మెడల్స్‌ను విసిరేస్తామని రెజ్లర్లు హెచ్చరించడంపైనా ఆయన స్పందిస్తూ.. ‘‘హరిద్వార్‌కు వెళ్లారు. గంగలో పతకాలను నిమజ్జనం చేస్తామని ప్రకటించారు. కానీ, తర్వాత వాటిని తికాయత్‌కు(రైతు సంఘాల నేత) అప్పగించారు. ఇదేనా వాళ్ల వైఖరి.. ఇంతకన్నా మనం ఏం చేయగలం అంటూ పెదవి విరిచారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చాలా రోజులుగా రెజ్లర్లు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ సమయంలో ఆవైపుగా ర్యాలీ తీసేందుకు ప్రయత్నించడం, పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడం, కేసులు పెట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెజ్లర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో తాము సాధించిన మెడల్స్ ను మంగళవారం సాయంత్రం హరిద్వార్‌లోని గంగా నదిలో నిమజ్జనం చేస్తామని ప్రకటించారు. ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. బ్రిజ్ భూషణ్ పై చర్చలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తమను ‘మా బిడ్డలు’ అని అంటూ ఉంటారని, కానీ ఆయన కూడా తమ పట్ల ఎలాంటి శ్రద్ధ చూపించడం లేదని ఆరోపించారు. తమను అణచివేస్తున్న బ్రిజ్ భూషణ్‌ను నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి ఆహ్వానించారన్నారు. ఆయన తళతళ మెరిసే తెల్లని దుస్తుల్లో ఫొటోలకు పోజులిచ్చారని మండిపడ్డారు. ఆ కాంతిలో తాము వెలిసిపోయామని చెప్పారు. ఈ క్రమంలో గంగలో మెడల్స్‌ను నిమజ్జనం చేసేందుకు మంగళవారం సాయంత్రం హరిద్వార్ వద్దకు రెజ్లర్లు చేరుకోగా.. అక్కడ హైడ్రామా నెలకొంది. అడ్డుకునేందుకు బీజేపీ శ్రేణులు సైతం ప్రయత్నించాయి. అయితే రైతు సంఘం నేత నరేష్ తికాయత్ జోక్యంతో రెజ్లర్లు శాంతించి.. బ్రిజ్‌పై చర్యలకు కేంద్రానికి ఐదురోజుల గడువు విధించారు. -
'45 రోజుల్లో ఎన్నికలు నిర్వహించకపోతే వేటు తప్పదు'
స్విట్జర్లాండ్: భారత స్టార్ రెజ్లర్లపై పోలీసు చర్యను ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) తీవ్రంగా ఖండించింది. టాప్స్టార్లపై పోలీసు జులుంపై విచారం వ్యక్తం చేసింది. తమ సమాఖ్య కొన్ని నెలలుగా భారత్‌లోని రెజ్లర్ల నిరసన కార్యక్రమాలను నిశితంగా గమనిస్తోందని తెలిపింది. లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ను అరెస్టు చేయాలనే డిమాండ్‌తో ఒలింపిక్, ఆసియా క్రీడల పతక విజేతలు సాక్షి మలిక్, వినేశ్ ఫొగాట్, బజరంగ్ పూనియా తదితరులు చేస్తున్న నిరసన తమ దృష్టికి వచ్చిందని యూడబ్ల్యూడబ్ల్యూ ఈ సందర్భంగా తెలిపింది. గతంలో ప్రకటించినట్లుగా 45 రోజుల్లోగా డబ్ల్యూఎఫ్ఐకి ఎన్నికలు నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయకపోతే సస్పెన్షన్ వేటు తప్పదని ఈ సందర్భంగా ప్రపంచ సమాఖ్య హెచ్చరించింది. -
నార్కో టెస్ట్ చేయాలంటూ రెజ్లర్లు డిమాండ్.. బీజేపీ ఎంపీ స్పందన ఇదే
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్(డబ్ల్యూఎఫ్ఐ), బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ని లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లు జంతమంతర్ వద్ద నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హర్యానాలోని మెహమ్‌లో జరిగిన ఖాప్ పంచాయతీ సమావేశం బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నార్కో పరీక్ష చేయించుకునేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ విషయంపై బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సానుకూలంగా స్పందించారు. నార్కో టెస్ట్, పాలిగ్రాఫ్ టెస్ట్ లేదా లై డిటెక్టర్ తదితరాలు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఐతే అందుకు తనకు ఒక షరతు ఉందంటూ.. వినేష్ ఫోగట్, బజరంగ్పునియా కూడా ఆ పరీక్షలు చేయించుకోవాలన్నారు. రెజ్లర్లు ఇద్దరూ తమ పరీక్షను పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంటే ఇప్పుడూ కాల్ చేసి ప్రకటించండని చెప్పారు. ఆ వెంటనే తాను కూడా అందుకు సిద్ధంగా ఉండటమే గాదు చేయించుకుంటానని వాగ్దానం కూడా చేస్తున్నానని ఫేస్బుక్ పోస్ట్‌లో తెలిపారు. ఇదిలా ఉండగా డబ్ల్యూఎఫ్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని రెజ్లర్లు కావాలనే తనను ఇరికించారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయమై సుప్రీం కోర్టు జోక్యంతో ఢిల్లీ పోలీసులు ఆయనపై రెండు వేర్వేరు కేసులు నమోదు చేయడం జరిగింది. అయినా తాను 2014లో రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకున్నానని, కానీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా పట్టుపట్టడం వల్లే కొనసాగానని శరణ్ సింగ్ చెప్పుకొచ్చారు. కాగా, గోండాలో ఉన్న కైసర్‌గంజ్‌కు చెందిన బీజేపీ ఎంపీ శరణ్ సింగ్ తన లోక్‌సభ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలను కలవడమే గాక జూన్ 5న అయోధ్యలో నిర్వహించనున్న చేతన మహా ర్యాలీకి ప్రజల మద్దతును కోరడం విశేషం. రెజ్లర్ల విషయమే ఆయన్ను ప్రశ్నించగా..అబద్ధాలు చెప్పాలనుకుంటే వారు చెప్పగలరని, ఎవ్వరు వారిని ఆపలేరని బీజేపీ ఎంపీ శరణ్ సింగ్ విమర్శించారు. (చదవండి: కేంద్రంతో వివాదంలో మా మద్దతు మీకే) -
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్‌ను 21లోగా అరెస్ట్ చేయాలి
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ బాధిత మహిళా రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన నిరసన కీలక మలుపు తిరిగింది. ఆదివారం నిరసన దీక్షా శిబిరం వద్దకు భారతీయ కిసాన్ సంఘ్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్, ఖాప్ మహమ్ 24 నేత మెహర్ సింగ్, సంయుక్త కిసాన్ మోర్చాకు చెందిన దేవ్ సింగ్ సిర్సా తదితరులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి సంఘీభావం తెలిపారు. ‘ఇకపై ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరసనల్లో పాల్గొంటాం. రెజ్లర్లకు వెలుపలి నుంచి మద్దతు తెలుపుతామన్నారు. వారికేదైనా సమస్య వస్తే తోడుంటాం’అని రైతు సంఘాల నేతలు చెప్పారు. బాధిత రెజ్లర్ల డిమాండ్ల కోసం ఈ నెల 11–18 తేదీల మధ్య దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు. బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేసి, సమస్యను పరిష్కరించకుంటే ఈ నెల 21న సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇవి రాజకీయ నిరసనలు కావు..తమది రాజకీయేతర సంస్థ అని చెప్పారు. ఇలా ఉండగా, తమ నిరసనలు యథావిధిగా కొనసాగుతాయని రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తెలిపారు. ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు తరలిరావడంతో ఆదివారం జంతర్‌మంతర్ వద్ద భారీగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎఫ్)ను మోహరించారు. ఇలాఉండగా, నిరసనకు దిగిన రెజ్లర్లకు రైతు సంఘాలు మద్దతు తెలపడంపై డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ స్పందించారు. ఢిల్లీ పోలీసుల దర్యాప్తు పూర్తయ్యేదాకా వేచి చూడాలని కోరారు. ఒక్క ఆరోపణ రుజువైనా ఉరి వేసుకుంటానన్నానంటూ ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆరోపణలు రుజువైతే శిక్ష విధించండి. దోషిగా తేలితే నన్ను కొట్టి చంపండి’అని పేర్కొన్నారు. -
న్యాయ నిపుణులతో రెజ్లర్ల చర్చలు
న్యూఢిల్లీ: పోలీసుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతున్నప్పటికీ భారత స్టార్ రెజ్లర్లు తమ నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు కావడం, సుప్రీంకోర్టులో కేసు విచారణ ముగియడం... ఢిల్లీ న్యాయపరిధిలో తేల్చుకోవాలన్న కోర్టు సూచనపై రెజ్లర్లు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ‘శుక్రవారం రెండు కమిటీలు ఏర్పాటు చేశాం. ఖాప్ పంచాయత్, రైతులు, మహిళా సంఘాలకు చెందిన 31 మంది సభ్యులున్న ఒక కమిటీ, తొమ్మిది మంది సభ్యులుగా ఉన్న మరో కమిటీని ఏర్పాటు చేశాం. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ నిజం వైపు నిలబడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ముగ్గురు రెజ్లర్లకే ఈ పోరాటం పరిమితం కాదు. హైకోర్టుకు వెళ్లి మళ్లీ మా పోరాటం మొదలుపెట్టే అవకాశాలున్నాయి’ అని రెజ్లర్ బజరంగ్ పూనియా తెలిపాడు. దర్యాప్తుతోనే వాస్తవాలు: క్రీడల మంత్రి ఠాకూర్ ‘రెజ్లర్ల డిమాండ్లన్నీ తీరుతాయి. ముందయితే ఢిల్లీ పోలీసుల దర్యాప్తు జరగనివ్వండి. దీనిపై సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. విచారణలో పోలీసులు పాలకు పాలు, నీళ్లకు నీళ్లు తేటతెల్లం చేస్తే... న్యాయబద్ధంగా గట్టి చర్యలు తీసుకునేందుకు వీలవుతుంది’ అని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. గంగూలీ ఏమన్నాడంటే... భారత జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ ‘రెజ్లర్లు దేశానికెంతో చేశారు. అంతర్జాతీయ వేదికలపై పతకాలతో కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. వారి పోరాటం వాళ్లని చేసుకోనివ్వండి. ఈ వ్యవహారంపై నాకు పూర్తి వివరాలు తెలియదు. పత్రికల్లో చదివిందే! ఏదేమైనా ఈ వివాదం త్వరలోనే పరిష్కారం కావాలని ఆశిస్తున్నా’ అని అన్నాడు. -
రెజ్లర్ల దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో రెజ్లర్లు ఆందోళన చేస్తున్న దీక్షా స్థలి ఒక్కసారిగా ఉద్రిక్తతకు కేంద్ర బిందువైంది. రెజ్లర్లు, వారికి మద్దతుగా వచ్చిన ఆప్ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగడం, చివరకు తోపులాట, ఘర్షణకు దారితీసింది. బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. దీక్షా శిబిరం వద్ద వర్షాలతో రెజ్లర్లు వినియోగిస్తున్న పరుపులు తడిసి ముద్దయ్యాయి. వారికి సాయపడేందుకు కొన్ని చెక్క మంచాలను ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతి తన కార్యకర్తలతో తెప్పించారు. వాటిని రెజ్లర్లకు ఇచ్చేందుకు అనుమతించేది లేదని, జంతర్‌మంతర్‌ను శాశ్వత దీక్షాశిబిరంగా మార్చేందుకు అనుమతులు లేవని అక్కడే మొహరించిన పోలీసులు తెగేసి చెప్పారు. అయినా సరే కొన్ని మంచాలను రెజ్లర్లకు కార్యకర్తలు ఇవ్వడం, వాటిని రెజ్లర్లు శిబిరంలోకి తీసుకెళ్తుండటంతో పోలీసులు, ఆప్ కార్యకర్తలకు మధ్య గొడవ జరిగింది. తమకు సాయపడేందుకు వచ్చిన ఆప్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో రెజ్లర్లు వారితో వాదనకు దిగారు. దీంతో రెజ్లర్లు, కార్యకర్తలను నిలువరించేందుకు పెద్ద ఎత్తున పోలీసులు బలప్రయోగం చేశారు. ఇరువర్గాల వాదనలు చివరకు తోపులాటలు, ఘర్షణకు దారితీశాయి. ఈ ఘటనలో రాహుల్ యాదవ్, దుష్యంత్ ఫొగాట్‌సహా పలువురు రెజ్లర్లకు గాయాలయ్యాయి. వినేశ్ ఫొగాట్ కంటతడి నన్ను తిట్టారు. నేలకు పడేశారు. పురుష పోలీసులు తమతో అనుచితంగా ప్రవర్తించారు. ఒక్క మహిళా పోలీసు అయినా ఉన్నారా ఇక్కడ?. మమ్మల్ని చంపేద్దామనుకుంటున్నారా? చంపేయండి. ఇలాంటి రోజు కోసమేనా మేం దేశం కోసం పతకాలు సాధించింది? అంటూ ప్రముఖ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్ కన్నీరు పెట్టుకున్నారు. తాము సాధించిన పతకాలు, కేంద్రం ఇచ్చిన అవార్డులు, పద్మశ్రీ అన్నీ వెనక్కి ఇస్తామని రెజ్లర్లు హెచ్చరించారు. విపక్షాల తీవ్ర ఆగ్రహం రెజ్లర్లపై పోలీసుల దాడి దారుణమని విపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ‘ఆటగాళ్లపై పోలీసుల దాడి సిగ్గు చేటు. సమాఖ్య చీఫ్ శరణ్‌ను ఆ పదవి నుంచి మోదీ తొలగించాలి’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘కోర్టు పర్యవేక్షణలో ఘటనపై దర్యాప్తు జరగాలి. కనీసం ఘటనాస్థలికి వెళ్లి మోదీ రెజ్లర్లకు సంఘీభావం ప్రకటించాలి’ అని కాంగ్రెస్ డిమాండ్చేసింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తదితర నేతలూ పోలీసుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. -
ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో కేసు ముగిస్తున్నాం: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న రెజ్లర్ల డిమాండ్ నెరవేరడంతో కేసును ముగిస్తున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. సర్వోన్నత న్యాయస్థానం అదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు బ్రిజ్‌భూషణ్‌పై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. కానీ సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఆయనను అరెస్టు చేయలేకపోయామని తెలిపారు. సుప్రీంకోర్టు నిర్ణయం తమకు ఎదురుదెబ్బ కాదని, బ్రిజ్‌భూషణ్‌ను అరెస్టు చేసే వరకు తమ నిరసన కొనసాగుతుందని బజరంగ్, వినేశ్, సాక్షి స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలుంటే ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించిందని దీనిని కూడా పరిశీలిస్తామని వినేశ్ తెలిపింది. -
అతనికి ఎదురు నిలబడటం కష్టం! కేంద్ర క్రీడా మంత్రిపై ఆరోపణలు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా భారత్ రెజ్లర్లు జంతర్‌మంతర్ వద్ద నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు భారత ఏస్ రెజ్లర్ వినేష్ ఫోగట్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న శక్తిమంతమైన వ్యక్తికి చాలా కాలం పాటు వ్యతిరేకంగా నిలబడటం చాలా కష్టం అన్నారు. తాము నిరసన ప్రారంభించడానికి మూడు, నాలుగు నెలల ముందు ఆ అధికారిని కలిశామని చెప్పారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మహిళా అథ్లెట్లు లైంగిక వేధింపులకు గురవుతున్నారని, ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆవేదనకు గురవుతున్నామని ఆ అధికారికి వివరించి చెప్పామన్నారు. ఆ తర్వాత తాము నిరసనకు దిగిమని వెల్లడించింది వినేష్. ఈనేపథ్యంలోనే కేంద్ర క్రీడామంత్రి అనురాగ్ ఠాగూర్‌పై ఫోగట్ సంచలన వ్యాఖ్యలు చేశారు వినేష్. కమిటీ వేసి విషయాన్ని అణిచివేసేందుకు చూస్తున్నారని ఆరోపించారు. మేము ఆయనతో మాట్లాడాకే నిరసనకు దిగినట్లు చెప్పారు. ఆయన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఇదిలా ఉండగా రెజ్లర్ బజరంగ్ పునియా ఒలింపిక్స్ ఎంపికకు సంబంధించిన కొత్త నిబంధన విషయమై నిసనలు చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలను ఖండించారు. ఒలింపిక్స్ గురించి కాదని తాము లైంగిక వేధింపులకు వ్యతిరేకంగానే నిరసన చేస్తున్నామని అన్నారు. ఇదిలా ఉండగా, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మాత్రం తాను రాజీనామా చేస్తే ఆరోపణలను అంగీకరించినట్లువుతుందన్నారు. అందుకు స్పందించిన వినేష్ ఫోగట్ తమకు కావాల్సింది న్యాయం అన్నారు. అతేగాదు మా మన్ కీ బాత్ వినండి మోదీ అని వినేష్ కన్నీటి పర్యంతమయ్యారు. ఆఖరికి స్మృతి ఇరానీ కూడా మా గోడు వినడం లేదని ఆవేదనగా చెప్పారు. కాగా, ఇప్పటికే ఈ విషయమై బ్రిజ్ భూషణ్‌పై రెండు కేసులు నమోదు చేశారు పోలీసులు. (చదవండి: "న్యాయం మీ అంగీకారం కోసం వేచి ఉంది!": ప్రియాంక గాంధీ) -
Wrestlers Protest: బ్రిజ్‌భూషణ్‌ను అరెస్టు చేసే వరకు బరిలోకి దిగేది లేదు..
న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్ ను అరెస్టు చేసే వరకు... తాము విదేశీ టోర్నీల్లో పాల్గొనేది లేదని భారత స్టార్ రెజ్లర్లు బజరంగ్, వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్ తెలిపారు. ‘రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినా ఇంకా బ్రిజ్‌భూషణ్ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఫిర్యాదు చేసిన మహిళా రెజ్లర్ల నుంచి ఢిల్లీ పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేయలేదు. విచారణకు రావాలని ఇంకా బ్రిజ్ భూషణ్‌కు నోటీసులు కూడా జారీ చేయలేదు. కొన్నేళ్లుగా మా సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చేందుకు ప్రయత్నించాం. కానీ ఎవరూ పట్టించు కోలేదు. గత జనవరిలో కేంద్ర క్రీడల మంత్రి అను రాగ్ ఠాకూర్ పర్యవేక్షక కమిటీని నియమించి ఈ వివాదాన్ని ముగించాలని చూశారు. అంతే తప్ప ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఆసక్తి చూపలేదు’ అని వినేశ్ వ్యాఖ్యానించింది. జూన్ 1 నుంచి 4 వరకు కిర్గి స్తాన్‌లో జరిగే ర్యాంకింగ్ సిరీస్ టోరీ్నకి దూరంగా ఉన్నామని వినేశ్, బజరంగ్, సాక్షి తెలిపారు. -
మోదీ జీ "న్యాయం మీ అంగీకారం కోసం వేచి ఉంది!"
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్ తదితరులు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే సుప్రీం కోర్టు జోక్యంతోనే బీజేపీ నేత శరణ్‌సింగ్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అయినప్పటికీ భారత రెజ్లర్లు జంతర్‌మంతర్ వద్ద తమ నిరసనను యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రియాంక గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ..న్యాయం మీ అంగీకారం కోసం ఎదురుచూస్తోందని ట్వీట్ చేశారు. ఈ మేరకు ప్రియాంక గాంధీ.. శరణ్ సింగ్ ఒక మీడియా సమావేశంలో మాట్లాడిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ప్రధాని మోదీ కోరితే తాను రాజీనమా చేస్తానని శరణ్ సింగ్ చెప్పారు. కాబట్టి మోదీ ఇప్పుడైన ఆ ఎంపీని రాజీనామా చేయాలని ఆదేశించండి అని ప్రియాంక్ గాంధీ అన్నారు. మీరు అందుకు అంగీకారం తెలిపండి అని ప్రియాంక్ గాంధీ మోదీని కోరారు. ఇదిలా ఉండగా బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ జంతర్‌మంతర్ నుంచి నిరసనలు చేసిన ఏ ఒక్కరు ఇప్పటి వరకు న్యాయం పొందలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు కావాలంటే కోర్టు తలుపులు తట్టాలని అన్నారు. 90% మంది అథ్లెట్లు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాని విశ్వసిస్తున్నారు. హర్యానాలోని కొన్ని కుటుంబాలకు చెందినవారు ఆరోపణలు చేస్తున్నారని, వారంతా ఒకే ప్రాంతానికి(హర్యానాకి) చెందని వారని అన్నారు. హర్యానా నియోజకవర్గం కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ దీపేందర్ హుడా దీనికి కారణమని ఆయనే వెనకుండి నడిపిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ఈ రెజ్లర్లు రోజుకో డిమాండ్‌తో ముందుకు వస్తున్నారంటూ విమర్శించారు. మొదట ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు. తర్వాత పదవికి రాజీనామా, జైలుకి పంపించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ తాను పదవికి రాజీనామ చేస్తే రెజ్లర్లు చేసిన ఆరోపణలను అంగీకరించినట్లు అవుతుందన్నారు. అందువల్ల తానను చేయనని కరాకండీగా చెప్పారు. అయినా తాను ప్రజల వల్ల తన నియోజకవర్గానికి ఎంపీ అయ్యానని, వినేష్ ఫోగట్ వల్లకాదని అన్నారు. కేవలం ఆ ఒక్క రాష్టానికి చెందిన కొన్ని కుటుంబాల అమ్మాయిలు మాత్రమే ఎందుకు నిరసనలు చేస్తున్నారని నిలదీశారు. మిగతా.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఇతర రాష్ట్రాల ఆటగాళ్లు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. హర్యానాకు చెందిన 90 శాతం మంది ఆటగాళ్లు తనతోనే ఉన్నారని శరణ్ సింగ్ చెప్పారు. కాగా, రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత శరణ్‌సింగ్‌పై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. (చదవండి: మన్ కీ బాత్ మొత్తం ఎపిసోడ్లకు రూ. 830 కోట్లు! ట్వీట్ దుమారం) -
కొనసాగుతున్న రెజ్లర్ల నిరసన.. ప్రియాంక గాంధీ సంఘీభావం
న్యూఢిల్లీ: భారత్ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినా... తమ నిరసనను ముగించేందుకు రెజ్లర్లు ఇష్టపడటం లేదు. జంతర్‌మంతర్ వద్ద శనివారం కూడా ఈ నిరసన కొనసాగింది. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు రాజకీయ నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి ఆటగాళ్లకు తమ సంఘీభావం ప్రకటించారు. అయితే కొందరు బయటి వ్యక్తులు నిరసన వేదిక వద్ద వచ్చి దుష్ప్రచారం చేస్తున్నారని రెజ్లర్ బజరంగ్ పూనియా ఆరోపించాడు. తమ ఉద్యమం రెజ్లర్ల సమస్యలకే పరిమితమని, ఇతర రాజకీయ అంశాల జోలికి తాము వెళ్లడం లేదని అతను అన్నాడు. మరో వైపు తాజా అంశంపై ‘ఫొగాట్’ సోదరీమణుల మధ్య విభేదాలు తలెత్తాయి. నిరసనలోకి రాజకీయ నాయకులను రానివ్వొద్దంటూ బబిత ఫొగాట్ విమర్శించగా... మహిళా రెజ్లర్ల తరఫున నిలవడం ఇష్టం లేకపోతే, కనీసం నిరసనను బలహీనపర్చవద్దని వినేశ్ జవాబిచ్చింది. -
రెజ్లర్లపై లైంగిక ఆరోపణలు.. బ్రిజ్‌భూషణ్‌పై ‘ఎఫ్ఐఆర్’ నమోదు
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు స్పందించారు. శుక్రవారం సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా బ్రిజ్‌భూషణ్‌పై ‘ఎఫ్ఐఆర్’ నమోదు చేస్తామని ఇచి్చన హామీని పూర్తి చేశారు. బ్రిజ్‌భూషణ్‌పై కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్లో రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. మైనర్ రెజ్లర్ చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుంటూ ‘పోక్సో యాక్ట్’ ప్రకారం ఒక ఎఫ్ఐఆర్... ఇతర రెజ్లర్లు చేసిన ఫిర్యాదుల ప్రకారం మరో ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. రెండింటిపై సత్వర విచారణ చేపడతామని పోలీసులు చెప్పారు. ఈ అంశంపై మే 5న మరోసారి విచారిస్తామని, ఆలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిరసన చేస్తున్న రెజ్లర్లు, ఫిర్యాదు చేసిన వారి జాబితాలో ఉన్న ఒక మైనర్ రెజ్లర్ భద్రతకు సంబంధించి కూడా ఢిల్లీ పోలీసులు బాధ్యత తీసుకోవాలని కూడా సుప్రీం సూచించింది. ‘మైనర్ రెజ్లర్‌కు ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకుంటూ తగినంత భద్రత కల్పించాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను ఆదేశిస్తున్నాం. ఇతర రెజ్లర భద్రతను కూడా ఆయన సమీక్షించాలి. దర్యాప్తునకు సంబంధించిన డాక్యుమెంట్ల విషయంపై గోప్యత కూడా పాటించాలి’ అని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడా బెంచీ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు బజరంగ్, వినేశ్, సాక్షి తదితర రెజ్లర్లు జంతర్‌మంతర్ వద్ద తమ నిరసన కొనసాగిస్తున్నారు. బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులు నిర్ణయించడం పట్ల రెజ్లర్లు సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఎఫ్ఐఆర్ మాత్రమే కాదు, బ్రిజ్‌భూషణ్ అరెస్ట్ అయ్యే వరకు ఇది కొనసాగుతుందని బజరంగ్ స్పష్టం చేశాడు. ‘విజయం దిశగా ఇది మొదటి అడుగు మాత్రమే. అయితే మా నిరసన ఇకపైనా కొనసాగుతుంది. ఆయనను అన్ని పదవుల నుంచి తప్పించడంతో పాటు జైలుకు పంపాల్సిందే. లేదంటే విచారణను ప్రభావితం చేస్తాడు’ అని రెజ్లర్ సాక్షి మలిక్ పేర్కొంది. మీ ఇంటి ఆడపిల్లలైతే ఇలాగే చేస్తారా..? : రెజ్లర్ సాక్షి మాలిక్ ‘ఢిల్లీ పోలీసులు మా పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి నిరసన ముగించమని ఒత్తిడి తెస్తున్నారు. కరెంట్ కట్ చేసి గేట్లు మూసేశారు. భోజనం, నీళ్లు కూడా లోపలికి రానివ్వడం లేదు. నేను ఏసీపీతో మాట్లాడాను. ఏం చేస్తారో చేసుకోండి అని ఆయన జవాబిచ్చాడు. వారు ఏం చేసినా మా ఆందోళన కొనసాగిస్తాం. మీ ఇంటి ఆడపిల్లలైతే ఇలాగే చేస్తారా. బ్రిజ్‌భూషణ్ చట్టంకంటే పెద్దవాడిగా మారిపోయాడు’. సుప్రీం కోర్టు ఆదేశాలను నేను స్వాగతిస్తున్నా: బ్రిజ్‌భూషణ్ సింగ్ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం నాకూ మంచిదే. విచారణలో వారికి అన్ని విధాలా సహకరిస్తా. విచారణ కమిటీలు ఏర్పాటు చేసినప్పుడు కూడా నేను ప్రశి్నంచలేదు. రెజ్లర్లు మరికొంత సమయం ఆగాల్సింది. కానీ వారు కోర్టుకు వెళ్లారు. ఎవరి పట్లా తప్పుగా వ్యవహరించలేదు. నాకు నాపై నమ్మకముంది. -
#TopCricketers: 'గెలిస్తే చప్పట్లు కొట్టారు.. ఇప్పుడు మొహం చాటేశారు'
#WrestlersProtest.. లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చైర్మన్ బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని టాప్ రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆరు రోజుల నుంచిధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. మహిళా అథ్లెట్లతో బ్రిజ్ భూషణ్ ప్రవర్తన సరిగా లేదని రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తున్నప్పటికీ.. క్రికెటర్ల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాకపోవడం పట్ల రెజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ఛాంపియన్షిప్ పతక విజేత రెజ్లర్ వినేష్ ఫోగట్ మాట్లాడుతూ.. దేశంలోని అగ్రశ్రేణి క్రికెటర్లపై అసంతృప్తి వెల్లగక్కారు. ఒలింపిక్స్, కామన్వెల్త్ వంటి గేమ్స్‌లో అథ్లెట్లు సాధించిన విజయాలను ప్రశంసిస్తూ పోస్టులు పెట్టే క్రికెటర్లు.. ఈ విషయంపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించింది. ''దేశం మొత్తం క్రికెట్‌ను ఆరాధిస్తోంది. కానీ, ఒక్క క్రికెటర్ కూడా మా ఆందోళనపై మాట్లాడటం లేదు. పతకాలు గెలిచినప్పుడు చప్పట్లతో అభినందిస్తూ పోస్టులు పెట్టేవారు. కానీ ప్రస్తుతం ఒక పెద్ద ఆందోళన జరుగుతుంటే మాత్రం మొహం చాటేశారు. వ్యక్తిగతంగా ఇది నన్నెంతో బాధిస్తోంది. మీరు రెజ్లర్లకు అనుకూలంగా మాట్లాడమని మేం చెప్పట్లేదు. కనీసం న్యాయం జరగాలంటూ ఒక్క పోస్ట్ అయినా పెట్టమని అభ్యర్థిస్తున్నాం. క్రికెటర్ అయినా, బ్యాడ్మింటన్ క్రీడాకారులు అయినా, అథ్లెటిక్స్, బాక్సర్ అయినా ముందుకొచ్చి మాకు మద్దతు తెలపండి'' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అమెరికా లో ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’మూవ్‌మెంట్‌కు మన క్రికెటర్లు కొందరు మద్దతు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా వినేష్ ఫోగట్ గుర్తు చేసింది. ఆ మాత్రం మద్దతు పొందేందుకు మేం అర్హులం కామా..? అని నిలదీసింది. మా విషయంలో వారు ఎందుకు భయపడుతన్నారో అర్థం కావడం లేదని పేర్కొంది. క్రికెటర్లు వారి బ్రాండ్ ఒప్పందాలను ప్రభావితం చేస్తుందని భయపడుతున్నారో.. లేక వ్యవస్థను చూసి భయపడుతున్నారో తెలియట్లేదని వాపోయింది. అలా కాకుండా మాకు జరిగినదే అక్కడ కూడా ఏదైనా జరుగుతోందేమో..? అంటూ అనుమానం వ్యక్తం చేసింది. చదవండి: రెజ్లర్లు వీధుల్లోకి రావడం బాధించింది.. న్యాయం జరగాలి: హర్భజన్ -
Wrestlers Protest: మోదీ జీ.. మా ‘మన్‌కీ బాత్’ వినండి..!
న్యూఢిల్లీ: తమకు న్యాయం చేయాలంటూ దేశ రాజధానిలో నిరసన కొనసాగిస్తున్న భారత రెజ్లర్లు ఇప్పుడు ఈ విషయంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. తాము విజయం సాధించినప్పుడు ఫోటోలు దిగి ఉత్సాహపరచిన ప్రధాని తమ గోడును పట్టించుకోకపోవడంపై వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రధాని రేడియో కార్యక్రమం ‘మన్‌కీ బాత్’ (మనసులో మాట)ను ఉద్దేశించి రెజ్లర్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ప్రధాని బేటీ బచావో, బేటీ పడావో గురించి మాట్లాడుతారు. చదవండి: లైంగిక వేధింపుల ఆరోపణలు.. రెజ్లర్లకు చేదు అనుభవం! సరైన ఆధారాలు లేనందున.. అందరి మనసులో మాటను వింటారు. కానీ మా ‘మన్‌కీ బాత్’ను ఆయన వినలేరా. మేం విజయాలు సాధించినప్పుడు ఇంటికి పిలిచి గౌరవించడంతో పాటు మమ్మల్ని తన బిడ్డలంటూ చెప్పుకున్నారు. ఈ రోజు మా బాధ వినాలని ఆయనను అభ్యర్థిస్తున్నాం’ అని 2016 రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ వ్యాఖ్యానించింది. నాలుగు రోజులుగా తాము రోడ్లపై పడుకుంటున్నా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కనీసం పట్టించుకోవడం లేదని సాక్షి విమర్శించింది. ‘బహుశా నిజం ఏమిటో ప్రధానికి తెలియకపోవచ్చు. అందుకే వ్యక్తిగతంగా కలిసి సమస్యను చెప్పాలని కోరుకుంటున్నాం. అయితే ఆయనను కలిసే మార్గం ఏమిటో మాకు తెలియడం లేదు’ అని వినేశ్ ఫొగాట్ చెప్పింది. నిరసన కొనసాగిస్తున్న రెజ్లర్లు బుధవారం రోడ్డు పైనే తమ ప్రాక్టీస్‌ను ప్రారంభించారు. కోచ్ సుజీత్ మాన్ నేతృత్వంలో అక్కడే సాధన చేసిన వారు... తమకు మరో గత్యంతరం లేదని పేర్కొన్నారు. మరోవైపు బీజింగ్ ఒలింపిక్స్ స్వర్ణపతక విజేత, షూటర్ అభినవ్ బింద్రా సోషల్ మీడియా ద్వారా రెజ్లర్లకు తన మద్దతు ప్రకటించాడు. దేశానికే ప్రాతినిధ్యం వహించేందుకు ఎంతో కష్టపడే ఆటగాళ్లు ఇలా రోడ్లపై రావాల్సి రావడం చాలా బాధగా ఉందని అతను అన్నాడు. చదవండి: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులు.. స్పందించిన అత్యున్నత న్యాయస్థానం -
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులు.. స్పందించిన అత్యున్నత న్యాయస్థానం
న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ భారత అగ్రశ్రేణి రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం నోటీసు జారీ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం ఆటగాళ్లు చేసిన తీవ్రమైన ఆరోపణలను పేర్కొంటూ ఢిల్లీ పోలీసులు మరియు ఢిల్లీ ప్రభుత్వం నుండి ప్రతిస్పందన కోరింది. లైంగిక వేధింపులపై వీడియో రికార్డింగ్‌లు ఉన్నా, ఏడుగురు మహిళలు వేధింపులకు గురయ్యారన్నా ఆధారాలు ఉన్నా ఎందుకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదని పోలీసులను ప్రశ్నించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయనందుకు పోలీసులను సైతం ప్రాసిక్యూట్ చేయాలని సూచించింది. ఈ పిటిషన్‌పై శుక్రవారం మరోసారి విచారణ చేపట్టనున్నట్లు అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. బాధితుల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. -
సుప్రీంకోర్టులో తేల్చుకుంటాం!
న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని... వెంటనే ఆయనను అరెస్టు చేయాలని భారత స్టార్ రెజ్లర్లు సాక్షి మలిక్, వినేశ్ ఫొగాట్, బజరంగ్ పూనియా డిమాండ్ చేశారు. ఒకవేళ పోలీసులు బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయకపోతే న్యాయం కోసం సుప్రీంకోర్టుకు వెళ్తామని జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న ఈ స్టార్ రెజ్లర్లు స్పష్టం చేశారు. కొందరు మహిళా రెజ్లర్లను బ్రిజ్ భూషణ్ లైంగికంగా వేధించారని తాము చేస్తున్న ఆరోపణలు అవాస్తవం అని తేలితే తమపైనే కేసు నమోదు చేయాలని 2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గిన సాక్షి వ్యాఖ్యానించింది. మూడు నెలల క్రితం చేపట్టిన నిరసనను విరమించి తప్పు చేశామని... ఈ విషయంలో తమను కొందరు తప్పుదోవ పట్టించారని సాక్షి, వినేశ్, బజరంగ్ విచారం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కోసం మధ్యవర్తుల మాటలు వినబోమని, రెజ్లింగ్ శ్రేయోభిలాషుల సూచనలు స్వీకరిస్తామని చెప్పారు. బ్రిజ్ భూషణ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు కన్నౌట్ ప్లేస్ పోలీసు స్టేషన్‌కు తాము వెళ్లినా పోలీసులు ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించారని టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన బజరంగ్ పూనియా తెలిపాడు. ‘అంతర్జాతీయ టోర్నీల్లో దేశం కోసం పతకాలు సాధించినపుడు కేంద్ర ప్రభుత్వం సన్మానిస్తుంది. కానీ మా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తుంటే మాత్రం ఇదే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’ అని బజరంగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ నేతృత్వంలో కేంద్ర క్రీడా శాఖ నియమించిన పర్యవేక్షక కమిటీ మా పట్ల పక్షపాతంగా వ్యవహరించింది. కేవలం సుప్రీంకోర్టుకు మాత్రమే లైంగిక వేధింపులకు గురైన బాధితుల వివరాలు తెలుస్తాయి. బ్రిజ్ భూషణ్ బీజేపీ ఎంపీ కావడం, ఆ పార్టీనే కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఆయనపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నట్లు అనిపిస్తోంది’ అని ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ విజేత వినేశ్ వ్యాఖ్యానించింది. మరోవైపు మే 7వ తేదీన జరగాల్సిన డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలకు గుర్తింపు లేదని... భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటయ్యే అడ్‌హక్ కమిటీ ఆధ్వర్యంలో 45 రోజుల్లో ఎన్నికలు జరుగుతాయని కేంద్ర క్రీడా శాఖ ప్రకటించింది. మేరీకోమ్ సారథ్యంలోని పర్యవేక్షక కమిటీ తమ నివేదిక అందించిందని... నివేదికను పరిశీలిస్తున్నామని ఈ సందర్భంగా క్రీడా శాఖ వివరించింది. పర్యవేక్షక కమిటీ నివేదిక ప్రకారం డబ్ల్యూఎఫ్ఐలో పారదర్శకత కొరవడిందని... రెజ్లర్ల సమస్యలు వినేందుకు, పరిష్కరించేందుకు ఎలాంటి వ్యవస్థ లేదని తాము గుర్తించినట్లు తెలిపింది. విచా రణ పూర్తి చేసి నివేదిక అందించడంతో పర్యవేక్షక కమిటీ పని ముగిసిందని క్రీడా శాఖ తెలిపింది. -
రెజ్లింగ్ సమాఖ్య మాజీ చీఫ్‌పై లైంగిక ఆరోపణలు.. రోడ్డెక్కిన రెజ్లర్లు
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్లు బజరంగ్, వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్ మళ్లీ ధర్నాకు దిగారు. మేరీకోమ్ కమిటీ నివేదిక బహిర్గతం చేయాలని, లైంగిక వేధింపులకు గురైన మహిళా రెజ్లర్లకు న్యాయం చేయాలని ‘జంతర్ మంతర్’ వద్ద చేపట్టిన ధర్నాలో డిమాండ్ చేశారు. మాజీ భారత రెజ్లింగ్ సమాఖ్య చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ రెజ్లర్లపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ గత జనవరిలో రెజ్లర్లు కొన్ని రోజులపాటు ధర్నాకు దిగారు. కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ వారితో చర్చలు జరిపి మేరీకోమ్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీతో విచారణ జరిపింది. ఇటీవల కమిటీ నివేదిక క్రీడాశాఖకు సమర్పించినా దీన్ని బహిర్గతం చేయకపోవడం, చర్యలు తీసుకోకపోవడంతో రెజ్లర్లు మళ్లీ రోడ్డెక్కారు. -
లైంగిక వేధింపుల ఆరోపణలు.. రెజ్లర్లకు చేదు అనుభవం! సరైన ఆధారాలు లేనందున..
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలను నిరూపించడంలో భారత అగ్రశ్రేణి రెజ్లర్లు విఫలమయ్యారని తెలిసింది. ఈ కేసును విచారించేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ నేతృత్వంలో పర్యవేక్షణ కమిటీని నియమించింది. ఈ కమిటీ తమ నివేదికను క్రీడా శాఖకు సమర్పించింది. కొన్నేళ్లుగా బ్రిజ్ భూషణ్ రెజర్లను లైంగికంగా వేధిస్తున్నాడని, ఆయనను ఈ పదవి నుంచి తప్పించాలని ఆరోపిస్తూ జనవరిలో జంతర్‌మంతర్ వద్ద రెజ్లర్లు నిరసన చేపట్టారు. అయితే బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక ఆరోపణలు నిజమేనని నిరూపించేందుకు రెజ్లర్లు వినేశ్, సాక్షి, బజరంగ్ పర్యవేక్షణ కమిటీకి కచ్చితమైన ఆధారాలు సమర్పించలేదని సమాచారం. ఈ కేసుకు సంబంధించి పలువురిని పర్యవేక్షణ కమిటీ విచారించినా ఒక్కరు కూడా బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా చెప్పలేదని క్రీడా శాఖ వర్గాలు తెలిపాయి. చదవండి: అలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు.. క్రెడిట్ మొత్తం వాళ్లకే: హార్దిక్ -
రెజ్లర్ల ఉద్యమం.. పర్యవేక్షక కమిటీలోకి బబితా
మహిళా రెజ్లర్లపై భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపుల ఆరోపణల వివాదంపై మేరీకోమ్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటయిన సంగతి తెలిసిందే. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ తమ విచారణ కొనసాగిస్తున్నారు. అయితే కమిటీ ఏర్పాటుకు ముందు తమను సంప్రదించలేదని రెజ్లర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో తాజాగా పర్యవేక్షణ కమిటీలో కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక విజేత, రెజ్లర్ బబిత ఫొగట్‌ను ఆరో సభ్యురాలిగా చేర్చినట్టు కేంద్ర క్రీడాశాఖ మంగళవారం ప్రకటించింది. కాగా కమిటీలో మేరీకోమ్‌తో పాటు మాజీ రెజ్లర్ యోగేశ్వర్ దత్, మాజీ షట్లర్ తృప్తి ముర్గుండె, రాధిక శ్రీరామ్, రాజేశ్ రాజగోపాలన్‌లు ఉన్నారు. తాజాగా బబితా ఈ కమిటీలో ఆరో సభ్యురాలిగా చేరింది. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా బ్రిజ్‌భూషణ్ నియంతృత్వ ధోరణిని రెజ్లర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రస్తుతం డబ్ల్యూఎఫ్ఐ రోజువారి వ్యవహారాలను పర్యవేక్షక కమిటీనే చూస్తోంది. -
రెజ్లర్ల మీటూ ఉద్యమం.. క్రీడాశాఖ కీలక నిర్ణయం
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు వ్యతిరేకంగా రెజ్లర్ల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. డబ్ల్యూఎఫ్ఐ అదనపు కార్యదర్శి వినోద్ తోమర్‌పై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వేటువేసింది. రెజర్లతో చర్చించిన తర్వాత మంత్రిత్వ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌కు వినోద్ తోమర్ అత్యంత సన్నిహితుడు. రెజ్లింగ్ సమాఖ్య వ్యవహారాలను ఆయనే చూసుకునేవారు. ఈ నేపథ్యంలో వినోద్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక శనివారం కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో చర్చలు సఫలం కావడంతో రెజ్లర్లు ఆందోళన విరమించారు. సమస్యపై కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసేందుకు అంగీకరిస్తూ.. సమాఖ్య అధ్యక్షుడు, కార్యదర్శిని తాత్కాలికంగా తప్పిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటన చేయడంతో రెజ్లర్లు కాస్త శాంతించారు. కాగా ఇప్పటికే దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల కమిటీని ఐవోఏ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: 'టీమిండియా రైట్ ట్రాక్‌లోనే వెళ్తుందా?'.. మీకేమైనా అనుమానమా! రెజ్లర్ల మీటూ ఉద్యమం.. కీలక పరిణామం -
పట్టు విడువని రెజ్లర్లు.. చర్యలు చేపట్టిన కేంద్రం.. నిరసన విరమణ
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌ను తొలగించడం సహా డిమాండ్లన్నీ పరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో రెజర్లు శుక్రవారం అర్ధరాత్రి తర్వాత తమ ధర్నాను విరమించారు. ‘‘రెజ్లర్ల ఆరోపణలపై ఓవర్‌సైట్ కమిటీని ఏర్పాటు చేస్తాం. ఈ కమిటీ డబ్ల్యూఎఫ్ఐ, దాని చీఫ్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి నాలుగు వారాల్లో నివేదిక ఇస్తుంది. దాని ఆధారంగా చర్యలు ఉంటాయి’’ అని కేంద్ర క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఇదిలాఉండగా.. ‘దంగల్’లో దిగితే ప్రత్యర్థుల పట్టుపట్టే రెజ్లర్లు అదే జోరుతో ధర్నాతో హడలెత్తించి.. డిమాండ్లు సాధించుకున్నారు. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)లో ఏళ్ల తరబడి తిష్టవేసుకొని లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌ను గద్దె దించేదాకా ధర్నా విరమించబోమని స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్, రవి దహియా, బజరంగ్ పూనియా, దీపక్ పూనియా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తమ ప్రాణాలకు ముప్పున్నా వెరువమని, అన్నింటికి సిద్ధపడే న్యాయ పోరాటానికి దిగామని చెప్పారు. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిని తొలగించడంతో పాటు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని వారంతా పట్టుబట్టడంతో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. మరోవైపు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరపాలన్న రెజ్లర్ల డిమాండ్‌కు అనుగుణంగా ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష వ్యవహరించారు. అత్యవసర భేటీ నిర్వహించి ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసి న్యాయం చేస్తానని ఉష హామీ ఇచ్చారు. మేరీకోమ్ నేతృత్వంలో కమిటీ... లైంగిక ఆరోపణల వ్యవహారంపై దర్యాప్తు చేయాలన్న స్టార్ రెజ్లర్ల డిమాండ్‌పై భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) స్పందించింది. అథ్లెట్ దిగ్గజం పీటీ ఉష నేతృత్వంలోని ఐఓఏ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) సభ్యులు శుక్రవారం సాయంత్రం అత్యవసరంగా సమావేశమయ్యారు. ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉషతో పాటు ఈసీ సభ్యులైన మాజీ షూటర్ అభినవ్ బింద్రా, యోగేశ్వర్ దత్, సంయుక్త కార్యదర్శి కల్యాణ్ చౌబే, ప్రత్యేక ఆహ్వానితులుగా శివ కేశవన్ ఈ ఉన్నతస్థాయి భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా రెజ్లర్లు చేస్తున్నవి తీవ్రమైన ఆరోపణలు కావడంతో వీటిపై నిగ్గు తేల్చేందుకు దిగ్గజ మహిళా బాక్సర్ మేరీకోమ్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఐఓఏ ప్రకటించింది. ఏజీఎం తర్వాతే బ్రిజ్‌భూషణ్ స్పందన గోండా (ఉత్తర ప్రదేశ్): తీవ్రస్థాయిలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూ ఎఫ్ఐ చీఫ్ బ్రిజ్‌భూషణ్ త్వరలోనే ఈ వ్యవహారంపై స్పందిస్తారని ఆయన కుమారుడు, బీజేపీ ఎమ్మెల్యే ప్రతీక్ భూషణ్ సింగ్ శుక్రవారం మీడియాతో అన్నారు. ‘ఈ నెల 22న డబ్ల్యూఎఫ్ఐ వార్షిక సర్వసభ్య సమావేశం జరుగుతుంది. ఇది ముగియగానే అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ తనపై వచ్చిన ఆరోపణలపై లిఖితపూర్వక ప్రకటన విడుదల చేస్తారు’ అని అన్నారు. -
రెజ్లర్ల మీటూ ఉద్యమం.. కీలక పరిణామం
భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్ తమను లైంగికంగా వేధింపులకు గురి చేశారంటూ భారత రెజ్లర్లు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. డబ్ల్యూఎఫ్ఐ పదవి నుంచి ఆయనను తొలగించాలంటూ రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద మూడురోజులుగా ఆందోళన చేపట్టారు. గురువారం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో రెజ్లర్లు తమ ఆందోళనను మరింత ఉదృతం చేశారు. ఈ నేపథ్యంలో వినేశ్ పొగాట్, భజరంగ్ పూనియా సహా మిగతా రెజ్లర్లు శుక్రవారం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ)కు లేఖ రాశారు. తాజగా డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై భారత ఒలింపిక్ కమిటీ(ఐవోఏ) ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. ఈ కమిటీలో మేరీకోమ్ సహా డోలా బెనర్జీ, అలకనంద ఆశోక్, యోగేశ్వర్ దత్, సహదేవ్ యాదవ్‌లతో పాటు ఇద్దరు అడ్వకేట్లు ఉన్నారు. కాగా సభ్యుల్లో ఒకరైన సహదేవ్ యాదవ్ మాట్లాడుతూ.. మేము ఆందోళన చేస్తున్న రెజ్లర్ల వాదనలు వింటాం. అభియోగాలను పరిశీలించిన తర్వాత నిష్పక్షపాతంగా విచారణ జరిపి తగిన న్యాయం జరిగేలా చూస్తాం అని పేర్కొన్నారు. Indian Olympic Association (IOA) has formed a seven-member committee to probe the allegations of sexual harassment against WFI chief Brij Bhushan Sharan Singh. Members are Mary Kom, Dola Banerjee, Alaknanda Ashok, Yogeshwar Dutt, Sahdev Yadav and two advocates: IOA pic.twitter.com/BjuyEbUHZu — ANI (@ANI) January 20, 2023 చదవండి: రెజ్లర్ల మీటూ ఉద్యమం.. అథ్లెట్లకు షాక్?! ఐవోఏకు లేఖ.. పీటీ ఉష చెంతకు పంచాయతీ -
రెజ్లర్ల మీటూ ఉద్యమం.. అథ్లెట్లకు షాక్?!
ఢిల్లీ: అథ్లెట్లకు షాక్ ఇచ్చేందుకు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సిద్ధమైనట్లు తెలుస్తోంది. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌ను తొలగించాలంటూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లకు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ఒకవైపు చర్చలపై ఉత్కంఠ నెలకొన్న తరుణంలో.. వాళ్లపై పోలీస్ ఫిర్యాదుకు డబ్ల్యూఎఫ్ఐ సిద్ధమైంది. అయితే అందుకు ఈ నిరసనలతో సంబంధం లేకపోవడం గమనార్హం!. ఒక ఈవెంట్లో రెజ్లర్లను పాల్గొనకుండా ఆపేందుకు.. నిరసనలో పాల్గొంటున్న రెజ్లర్లు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారని రెజ్లింగ్ ఫెడరేషన్ ఓ నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో.. వాళ్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో ఈ నెల 20 నుంచి 23 తేదీల మధ్య సీనియర్ ఓపెన్ నేషనల్ ర్యాకింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరగాల్సి ఉంది. అయితే ఇందులో పాల్గొనాల్సిన రెజ్లర్లకు.. ఆ ఈవెంట్ రద్దు అయ్యిందని నిరసనలో పాల్గొంటున్న కొందరు అథ్లెట్లు చెప్పి మోసం చేశారని, తద్వారా వాళ్లను పోటీల్లో పాల్గొనకుండా చేయాలని ప్రయత్నించారని రెజ్లింగ్ ఫెడరేషన్ దర్యాప్తు ద్వారా నిర్ధారణకు వచ్చింది. అందుకే వాళ్లపై కేసు నమోదు చేయాలని భావిస్తోందట.! రెజ్లర్ల మీటూ ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉంది. తమ ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొంటూ.. నాలుగు డిమాండ్లతో ఇండియన్ ఒలింపిక్ అసోషియేషన్‌కు రెజ్లర్లు లేఖ సైతం రాశారు. ఈ క్రమంలో.. ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష నేతృత్వంలో భేటీ సాగింది. మరోవైపు ఆరోపణలను ఖండించిన డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్.. మీడియా ముందుకు వచ్చి అసలు విషయాన్ని వెల్లడిస్తానని చెప్పడం ఉత్కంఠకు తెర తీసింది. అయితే.. మీడియా ముందుకు రావొద్దని క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్.. ఫోన్ ద్వారా సూచించినట్లు నేషనల్ మీడియా ఛానెల్స్ ప్రముఖంగా ప్రచురించాయి. ఇంకోవైపు ఆందోళన చేస్తోన్న రెజ్లర్లు మరోసారి మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. -
ఐవోఏకు లేఖ.. పీటీ ఉష చెంతకు పంచాయతీ
ఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా భారత రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ఆందోళన మూడోరోజు కొనసాగింది. ఈ వ్యవహారంపై గురువారం కేంద్రంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఆందోళనను మరింత ఉదృతం చేసిన రెజ్లర్లు శుక్రవారం భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ) అధ్యక్షురాలు పీటీ ఉషకు లేఖ చేశారు. రెజ్లింగ్ సమాఖ్యలో జరుగుతున్న అవకతకవలు, తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రెజ్లర్లు పీటీ ఉషకు రాసిన లేఖలో ప్రధానంగా నాలుగు డిమాండ్లను నివేధించారు. కాగా ఐవోఏ ప్రెసిడెంట్ పీటీ ఉష ఈ వ్యవహారంపై స్పందించింది. ఈ అంశం తనకు బాధ కలిగించిందని.. బాగా డిస్టర్బ్ చేసిందన్నారు. రెజ్లర్లు రాసిన లేఖ తనకు అందిందని.. దీనిపై విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. ఐవోఏ ముందు రెజ్లర్లు ఉంచిన నాలుగు ప్రధాన డిమాండ్లు ► లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు జరిపేందుకు తక్షణమే కమిటీని ఏర్పాటు చేయాలి. ► డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్ష పదవికి బ్రిజ్‌భూషణ్ వెంటనే రాజీనామా చేయాలి. ► భారత రెజ్లింగ్ సమాఖ్యను రద్దు చేయాలి ► డబ్ల్యూఎఫ్ఐ కార్యకలాపాలను కొనసాగించేందుకు రెజ్లర్లను సంప్రదించి ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేయాలి @PMOIndia @AmitShah @ianuragthakur @PTUshaOfficial pic.twitter.com/PwhJjlawPg — Vinesh Phogat (@Phogat_Vinesh) January 20, 2023 రాజీనామా చేసే ప్రస్తకే లేదు: బ్రిజ్ భూషణ్ అంతకముందు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు.. ఎంపీ బ్రిజ్ భూషణ్ తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. ఇదంతా కేవలం రాజకీయ కుట్రలో భాగమే అని ఆరోపించిన ఆయన రాజీనామా చేసే ప్రస్తక్తే లేదని తేల్చి చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడినట్లు వస్తున్న వార్తలను బ్రిజ్ భూషణ్ కొట్టిపారేశారు.ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు ప్రెస్మీట్లో మాట్లాడనున్నట్లు తెలిపారు. హర్యానాకు చెందిన 300 మంది అథ్లెట్లు తమ వద్ద ఉన్నారని బ్రిజ్ మీడియాకు తెలిపారు. చదవండి: ‘సాయ్’ స్పందన సరిగా లేదు రెజ్లర్ల మీటూ ఉద్యమం..చర్చలు విఫలం!.. ఉత్కంఠ -
‘సాయ్’ స్పందన సరిగా లేదు
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నాడంటూ తాము చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని భారత టాప్ రెజ్లర్లంతా పునరుద్ఘాటించారు. బ్రిజ్‌భూషణ్‌ను తప్పించి ఆటను కాపాడాలంటూ బుధవారం అనూహ్యంగా నిరసనకు దిగిన రెజ్లర్లు రెండో రోజూ దానిని కొనసాగించారు. బజ్రంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్ తదితరులు ఇప్పటికే నిరసనలో పాల్గొంటుండగా గురువారం ఒలింపిక్ రజత పతక విజేత రవి దహియా, అన్షు మలిక్ కూడా వారికి సంఘీభావం ప్రకటించారు. రెజ్లర్ల ఆరోపణలకు స్పందిస్తూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) అధికారులు వారితో చర్చించేందుకు సిద్ధమయ్యారు. సుమారు గంట పాటు వారితో రెజ్లర్ల భేటీ సాగింది. అయితే దీనిపై ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు అండగా నిలుస్తామని అధికారులు చెబుతున్నా...వారి స్పందన సంతృప్తికరంగా లేదని, చర్యల విషయంలో ఎలాంటి హామీ ఇవ్వలేదని రెజ్లర్లు చెప్పారు. ‘లైంగిక వేధింపులకు గురైన మరికొందరు బాధితులు ఇవాళ మాతో చేరారు. వారి పేర్లు ప్రస్తుతానికి బహిరంగపర్చదల్చుకోలేదు. ఏదైనా పరిష్కారం వస్తుందని భావించాం. కానీ ప్రభుత్వ స్పందన చూస్తే అలా అనిపించడం లేదు. ఇక మేం చట్టపరంగా, న్యాయపరంగా తేల్చుకుంటాం. బ్రిజ్‌భూషణ్ రాజీనామా మాత్రమే కాదు... ఆయనపై కేసు నమోదు చేయించి జైలుకు కూడా పంపిస్తాం. మేమంతా ఒలింపిక్ విజేతలం, ప్రపంచ విజేతలం. అన్నీ నిజాలే చెబుతున్నాం. తగిన ఆధారాలూ ఉన్నాయి. మా ఆరోపణలపై సందేహాలు వద్దు’ అని వినేశ్ స్పష్టం చేసింది. బీజేపీకి చెందిన మరో అగ్రశ్రేణి రెజ్లర్ బబితా ఫొగాట్ కూడా ప్రభుత్వం తరఫున చర్చలకు ముందుకు వచ్చింది. కేంద్ర మంత్రిని కలిసిన రెజ్లర్లు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై తీవ్ర ఆరోపణలతో నిరసన తెలుపుతున్న రెజ్లర్లు గురువారం రాత్రి మరో కీలక అడుగు వేశారు. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కలిసి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి, రెజ్లర్ల మధ్య గంటకు పైగా చర్చలు కొనసాగాయి. చర్చల తుది ఫలితంపై స్పష్టత లేకున్నా... బ్రిజ్‌భూషణ్ రాజీనామాకే ఠాకూర్ కూడా మద్దతు పలికినట్లు తెలిసింది. 24 గంటల్లోగా ఆయన తన రాజీనామాను ప్రకటించాలని, లేదంటే తామే ఆయనను తొలగిస్తామని కూడా స్పష్టం చేసినట్లు రెజ్లింగ్ వర్గాల సమాచారం. -
ఇది న్యాయం కోసం దంగల్
ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడల లాంటి అంతర్జాతీయ వేదికలపై దేశానికి పతకాలు సాధించి వార్తల్లో వ్యక్తులుగా నిలవడం ఆ కుస్తీ ప్రవీణులకు అలవాటు. కానీ, ఇప్పుడు పూర్తి భిన్నమైన పరిస్థితుల్లో వారు, వారి ఆట వార్తల్లోకి ఎక్కాయి. భారత రెజ్లింగ్ సమాఖ్య పైన, దాని అధ్యక్షుడైన పాలక బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ వికృత వ్యవహారశైలి పైన ధ్వజమెత్తుతూ ఢిల్లీ నడిబొడ్డున బుధవారం నుంచి రెండు రోజులుగా 30 మందికి పైగా మహిళా రెజ్లర్లు నిరసనకు దిగేలా చేశాయి. అంతా కలిపి 200 మందికి పైగా అథ్లెట్లు నిరసనకు దిగడం, అనేక సంగతులు బయటపెట్టడం భారత క్రీడా చరిత్రలో మునుపెన్నడూ చూడని దృశ్యం. ముక్కున వేలేసుకొనేలా సందర్భం. కామన్వెల్త్ క్రీడోత్సవాల్లో మూడుసార్లు స్వర్ణాలు సాధించిన వినేశ్ ఫోగాట్ కన్నీరు పెట్టుకుంటూ మహిళా అథ్లెట్లు ఎదుర్కొంటున్న దారుణాల్ని వివరిస్తుంటే గుండె మండిపోతుంది. అన్షూ మలిక్ లాంటి వారు బయటపెట్టిన సంగతులు ఆవేదన రేపుతాయి. సాక్షీ మలిక్, బజ్రంగ్ పునియా – ఇలా స్త్రీ పురుష తేడా లేకుండా అందరూ జరుగుతున్న అన్యాయాలను కెమెరాల సాక్షిగా ఏకరవు పెట్టాల్సి వచ్చింది. మహిళా రెజ్లర్లుండే హోటల్లోనే బస చేయడం, వారు గది దాటి స్వేచ్ఛగా బయటకు రావడానికైనా వీల్లేకుండా తన గది తలుపులు సదా తీసి ఉంచి, తన రోజువారీ పనులు చేసుకోవడం– ఇదీ సమాఖ్య అధ్యక్షుడి తీరు. ఇది నియమానుసారమే కాదు నైతికంగానూ సరికాదు. బ్రిజ్ గత చరిత్రా గొప్పదేమీ కాదు. గతంలో ఆయన నేరసామ్రాజ్య నేత దావూద్ ఇబ్రహీమ్ బృందానికి సాయపడ్డారట. ఆ కేసులో తీవ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం కింద అరెస్టయ్యారు. దౌర్జన్యానికి మారుపేరై, ఇప్పటికి 6 సార్లు ఎంపీగా గెలిచారు. 2011 నుంచి పుష్కర కాలానికి పైగా కుర్చీలో ఉంటూ, కుస్తీ సమాఖ్యను సొంత జాగీరుగా మార్చుకొన్నారు. ఆటను అడ్డంపెట్టుకొని అవి నీతి, అక్రమాలు, వేదికపై ఆటగాళ్ళను చెంపదెబ్బ కొట్టిన దౌర్జన్యాలు, అథ్లెట్లతో అనుచితవర్తనలు... ఇలా ఈ రాజకీయవాది ఘనతల చిట్టా సుదీర్ఘమైనది. సొంత ఊరు లక్నోలో, స్వగృహానికి దగ్గర లోనే సదా మహిళా అథ్లెట్ల శిబిరం పెట్టి, తానూ హాజరయ్యే మనోడి గురించి ఎంత చెప్పినా తక్కువే. క్రీడావ్యవస్థలో ఇలాంటి దుష్టసంస్కృతి చిరకాలంగా ఉన్నదే. ఇటీవల ఏడు నెలల క్రితం కూడా అగ్రశ్రేణి భారత సైక్లింగ్ క్రీడాకారిణి ఒకరు తమ నేషనల్ టీమ్ కోచ్ నుంచి ఇలాంటి వేధింపులే ఎదుర్కొన్నారు. స్లొవేనియాలో క్రీడా శిక్షణా శిబిరంలో కోచ్ అనుచిత ప్రవర్తనపై ఆమె ఏకంగా ‘భారత క్రీడా ప్రాధికార సంస్థ’ (శాయ్)కు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. ఇటీవలే హర్యానాలో ఓ మహిళా కోచ్ స్వయానా ఆ రాష్ట్ర క్రీడా మంత్రి లైంగిక అత్యాచార పర్వాన్ని బట్టబయలు చేయడం గమనార్హం. ఇంకెన్నో వెలుగులోకి రాని ఫిర్యాదులున్నాయి. ఓ సినీ నటుడి అనుచిత ప్రవర్తనను ఒక హిందీ నటి బయటపెట్టే సరికి, తీగ లాగితే డొంకంతా కదిలినట్టు భారత్‌లో ‘మీ టూ’ ఉద్యమస్థాయికి చేరిన సంగతి 2018లో చూశాం. ఇప్పుడు కుస్తీ సమాఖ్య సారథి సహా కోచ్‌లపై లైంగిక వేధింపుల ఆరోపణ ఆట వెనుక దాగిన చీకటి కోణాన్ని బయటపెట్టింది. నాలుగు పర్యాయాలు ఒలింపిక్ పతకాలు తెచ్చిపెట్టిన కుస్తీలోనే ఇలాంటి దారుణమైన పరిస్థితి ఉందంటే, ఇతర క్రీడల్లో పరిస్థితిని ఇట్టే ఊహించుకోవచ్చు. 72 గంటల్లో సమాధానం చెప్పాలంటూ కుస్తీ సమాఖ్యకు క్రీడాశాఖ తాఖీదు ఇచ్చింది. కానీ, బ్రిజ్‌ను తొలగించాలి, అథ్లెట్లతో మర్యాదగా ప్రవర్తించాలి, సమాఖ్యను సమూలంగా మార్చాలి లాంటి ఆటగాళ్ళ కనీస డిమాండ్లు తీర్చలేనివేమీ కావు. ఆ మాటకొస్తే సమాఖ్యలో ఇష్టారాజ్యంగా నియమాలు మారుస్తున్నారనీ, తమపై అనవసరమైన అధిక నిఘా ఉంచుతున్నారనీ అథ్లెట్లు చేస్తున్న ఆరోపణలకు బ్రిజ్ బృందం జవాబివ్వాల్సి ఉంది. కానీ, వేధింపుల బాధితులు బాహాటంగా చెప్పాలనీ, సాక్ష్యాలతో నిరూపిస్తే ఉరిశిక్షకైనా సిద్ధమనీ ఆయన అనడం చట్టం ముందూ నిలవని బుకాయింపే. ఇదంతా కాంగ్రెస్ నిర్వాకమనే ఆరోపణ, యూపీ వర్సెస్ హర్యానా వాదన అలాంటివే. ఆరోపణలు హోరెత్తుతున్నా బ్రిజ్ రాజీనామా చేయకపోవడం విడ్డూరం. ఇక స్వయంగా క్రికెట రైన క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ రెండోరోజు రాత్రి దాకా నోరెందుకు విప్పలేకపోయారో అర్థం కాదు. ఇన్నేళ్ళుగా కుస్తీ సమాఖ్య సహా అనేక చోట్ల లైంగిక వేధింపుల విచారణ కమిటీలు పెట్టకున్నా ఎలా చూస్తూ కూర్చున్నారో తెలీదు. పాలకులు పతకాల విజేతలతో ఫోన్లో మాట్లాడుతూ, ఫోటోలకు పోజులిస్తే చాలదు. బేటీ బచావో... మాటల్లో కాదు, చేతల్లో చూపాలి. దేశవ్యాప్తంగా బ్రిజ్ కనుసన్నల్లో సాగుతున్న సమాఖ్య కార్యవర్గాలన్నిటినీ రద్దు చేయాలి. నిపుణులు సారథ్యం వహించాల్సిన క్రీడాసంస్థల్ని ఇకనైనా రాజకీయాలకూ, ఇలాంటి రాజకీయవాదులకూ దూరంగా ఉంచాలి. అథ్లెట్ల నిరసనకు తలొగ్గి, సమాఖ్యలో అక్రమాలను విచారించడానికి క్రీడాశాఖ త్రిసభ్య సంఘం వేసిందట. అయితే, అది చాలదు. వేధింపులతో వ్యవహారం బరి దాటి నేరాల గిరిలోకి చేరింది. దీనిపై సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరపించాల్సిందే, వ్యవస్థను సమూలంగా ప్రక్షాళించాల్సిందే. ధర్మం కోసం, న్యాయం కోసం... కడకు కనీసపాటి గౌరవం కోసం మహిళలు ఇవాళ్టికీ వీధికెక్కాల్సి వస్తోందంటే అది మన దేశానికే అవమానం. అంతర్జాతీయ బరిలో విజేతలైన ఈ వీరాంగనలు ఈ ఆత్మగౌరవ దంగల్లోనూ విజయం సాధించాలి. సమాజంలో పురుషోన్మాద దృక్పథాన్ని మార్చాలి. ఆటల గద్దెపై రాజకీయ గద్దలకు పని లేకుండా క్రీడాసంస్థలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు రావాలి. నిజా యతీ ఉంటే... ఎప్పుడో కాదు, ఇప్పుడే ఆ విధానపరమైన మార్పులకు పాలకులు నడుం బిగించాలి. -
రెజ్లర్ల మీటూ ఉద్యమం..చర్చలు విఫలం!.. ఉత్కంఠ
న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్‌పై మీటూ ఆరోపణల దరిమిలా.. ఆయన్ని గద్దె దించడమే ధ్యేయంగా రెజ్లర్ల నిరసన కొనసాగుతోంది. గురువారం సాయంత్రం ఫెడరేషన్ అధికారులతో, ప్రభుత్వ ప్రతినిధులతో క్రీడామంత్రిత్వ శాఖ కార్యాయలంలో చర్చలు జరిగినప్పటికీ.. అవి విఫలం అయినట్లు స్పష్టమవుతోంది. చర్చలు సంతృప్తికరంగా సాగలేదని, స్పష్టమైన హామీలు లభించలేదని, అలాగే.. ఫెడరేషన్ చీఫ్‌ను తొలగించడంపైనా ప్రభుత్వం తరపున ఎలాంటి హామీ రాలేదని రెజ్లర్లు మీడియాకు వెల్లడించారు. మా దగ్గర ఐదుగురి నుంచి ఆరుగురు అమ్మాయిలు ఇప్పటికిప్పుడు సాక్ష్యం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. అతను(బ్రిజ్ భూషణ్) జైలుకు వెళ్లాల్సిందే. మా డిమాండ్లు నెరవేరేంత వరకు రెజ్లింగ్ బరిలోకి దిగేది లేదు. ఒకవేళ ప్రభుత్వం గనుక స్పందించకుంటే.. పోలీసుల దగ్గరికి వెళ్లాల్సి ఉంటుందని రెజర్లు వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్‌లు, ఈ నిరసనలకు నేతృత్వం వహించిన బజరంగ్ పూనియాలు చెప్తున్నారు. ఇదిలా ఉంటే.. చర్చలు విఫలమైన నేపథ్యంలో రాత్రి పది గంటల సంమయంలో నేరుగా క్రీడాశాఖ మంత్రి అనురాగ్ థాకూర్‌తో రెజ్లర్లు భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. Allegations levelled by wrestlers are serious in nature. Taking swift action, Govt of India sent a notice to WFI and sought a reply within 72 hours. I will try to meet the wrestlers after I reach Delhi. We will talk & listen to them: Union Sports Min Anurag Thakur, in Chandigarh pic.twitter.com/mNmdPyIiVR — ANI (@ANI) January 19, 2023 ఇక జంతర్ మంతర్ వద్ద గురువారం నాడు(రెండోరోజు) కొనసాగిన ధర్నాలో 200 మంది రెజ్లర్లు పాల్గొన్నారు. ప్రధాని మోదీపై ఉన్న నమ్మకంతోనే తాము న్యాయపరమైన చర్యలకు దిగట్లేదని వాళ్లు ప్రకటించారు. అయితే.. బీజేపీ ఎంపీ, ఒలింపియన్ అయిన బబితా ఫోగట్ దౌత్యంతో ప్రభుత్వంతో చర్చలకు ముందుకు వచ్చారు రెజ్లర్లు. మరోవైపు కేంద్ర క్రీడా శాఖ బుధవారం ఈ ఆరోపణలపై 72 గంటల్లో స్పందించాలని డబ్ల్యూఎఫ్ఐకి అల్టిమేటం జారీ చేసింది కూడా. ఇదిలా ఉంటే.. బీజేపీ ఎంపీ అయిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్(66) .. తొలి నాళ్లలో రెజ్లరు కూడా. తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను తోసిపుచ్చిన ఆయన.. నిజమని తేలితే ఆత్మహత్య చేసుకుంటానంటూ అంటున్నారు. వినేశ్ ఫోగట్(28) ఆరోపణలతో ఈ వ్యవహారంపై తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. తనకు ఆ పరిస్థితి ఎదురు కాకున్నా.. నేషనల్ క్యాంప్‌లో ఉన్న సుమారు 20 మందికి అలాంటి వేధింపులు ఎదురు అవుతున్నాయని, కోచ్‌లతో పాటు డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ కూడా ఈ వేధింపుల పర్వంలో భాగం అయ్యారంటూ ఫోగట్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. వాళ్ల కుటుంబ నేపథ్యాల దృష్ట్యా భయంతో ముందుకు రావడం లేదని, అందుకే తాను పోరాటానికి ముందుకు వచ్చి న్యాయం కోరుతున్నానని వెల్లడించారామె. ఆమెకు మద్దతుగా పలువురు రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద నిరసనకు తోడయ్యారు. మరోవైపు ఢిల్లీ మహిళా కమిషన్ ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులను కోరింది. అదే సమయంలో క్రీడా మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేసింది. నేషనల్ సైక్లింగ్ టీం కోచ్‌ను లైంగిక ఆరోపణలతో తొలగించి నెలలు గడవకముందే.. రెజ్లింగ్‌లో ఇలాంటి ఆరోపణలు రావడంతో క్రీడా రంగం దిగ్భ్రాంతికి లోనవుతోంది. హాలీవుడ్ నుంచి మొదలైన మీటూ ఉద్యమం.. ఆ తర్వాత ప్రపంచమంతా విస్తరించింది. భారత్‌లో 2018లో కొందరు నటీమణులు.. తాము లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామంటూ మీడియా ముందుకు వచ్చారు. దీంతో అప్పటి నుంచి మన దేశంలోనూ తరచూ మీటూ ఘటనలు తెరపైకి వస్తున్నాయి. -
జంతర్ మంతర్ వద్ద బృందా కారత్కు చేదు అనుభవం
ఢిల్లీ: సీపీఐ(ఎం) నేత, ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్(75)కు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన వద్దకు గురువారం ఆమె చేరుకున్నారు. అయితే.. వేదిక ఎక్కి ప్రభుత్వ వ్యతిరేక గళం వినిపించాలన్న ఆమె ప్రయత్నానికి రెజ్లర్లు అడ్డు తగిలారు. రాజకీయ ఎజెండాగా ఈ వ్యవహారాన్ని మార్చేయడం సరికాదంటూ మైకులోనే చెబుతూ ఆమెను వేదికపైకి ఎక్కకుండా అడ్డుకున్నారు. ఒలింపిక్స్ మెడలిస్ట్ అయిన బజరంగ్ పూనియా.. ఈ నిరసనలకు నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే స్టేజ్‌పైకి బృందా కారత్ ఎక్కేందుకు యత్నించగా.. తమ పోరాటాన్ని రాజకీయం చేయొద్దంటూ పూనియా ఆమెకు విజ్ఞప్తి చేశారు. దయచేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. అదే సమయంలో మరికొందరు రెజ్లర్లు.. కారత్ను ఉద్దేశిస్తూ ‘భారత్ మాతా కీ జై’ నినాదాలు చేయడం గమనార్హం. కారత్‌తో పాటు మరికొందరు కమ్యూనిస్ట్ నేతలు ఆ సమయంలో వేదిక మీదకు వెళ్లకుండా నిలిచిపోయారు. ఆపై కాసేపటికే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. #WATCH | CPI(M) leader Brinda Karat asked to step down from the stage during wrestlers' protest against WFI at Jantar Mantar in Delhi. pic.twitter.com/sw8WMTdjsk — ANI (@ANI) January 19, 2023 రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ కైసర్‌గంజ్ ఎంపీ(ఉత్తర ప్రదేశ్) బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ నిరసనలు మొదలయ్యాయి. అవినీతి, మానసికంగా వేధింపులు, లైంగిక వేధింపుల పర్వం కొనసాగుతోందంటూ హస్తిన నడిబొడ్డున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కామన్ వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ వినేష్ ఫోగట్, మరో ఛాంపియన్ సాక్షి మాలిక్‌లు స్వయంగా ఆరోపించిన నేపథ్యంలో.. వ్యవహారం మరింత ముదిరింది. బ్రిజ్ భూషణ్, కోచ్‌లు.. మహిళా రెజర్లను లైంగికంగా వేధించారంటూ ఆరోపించారు వాళ్లు. ఇక ఈ ఆరోపణలను తోసిపుచ్చిన బ్రిజ్ భూషణ్.. తాను పదవి నుంచి దిగిపోవడానికి సిద్ధమంటూ ప్రకటించారు. ఆరోపణలు నిరూపిస్తే తల నరుక్కునేందుకు సిద్ధమంటూ ప్రకటించారు కూడా. జజరంగ్ పూనియా, సాక్షి మాలిక్‌లు వారం కిందట తనను కలిశారని, ఇద్దరూ ఎలాంటి సమస్యలు లేవని తనతో చెప్పారని, ఈ నిరసనల వెనుక తనను దించేసే కుట్ర జరుగుతోందని, ఓ బడా పారిశ్రామికవేత్త హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారాయన. మరోవైపు ఈ వ్యవహారంలో గురువారం కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. శాస్త్రి భవన్‌లోని కేంద్ర క్రీడా శాఖల మంత్రిత్వ శాఖ కార్యాలయంలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారులతో చర్చించడానికి రెజ్లర్లు ముందుకొచ్చారు. ఈ విషయాన్ని భజరంగ్ పూనియా సైతం ధృవీకరించారు. సమావేశం తర్వాత వివరాలను వెల్లడిస్తామని ఆయన అన్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ కృష్ణ పూనియా రెజ్లర్ల నిరసనకు మద్దతు ప్రకటించారు. రెజ్లర్లకు న్యాయం జరిగేలా చూడాలంటూ ఆమె ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. I request PM Modi to make sure that our wrestlers get justice. I will continue to stand with our athletes: Dr Krishna Poonia, Congress MLA & former gold-medal-winning track & field athlete, at Jantar Mantar in Delhi pic.twitter.com/GEVTLJFT2Z — ANI (@ANI) January 19, 2023 -
రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు లైంగికంగా వేధిస్తున్నాడు
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ భారత స్టార్ మహిళా రెజ్లర్లు రోడ్డెక్కారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ అయిన బ్రిజ్‌భూషణ్ సుదీర్ఘకాలంగా తమని లైంగికంగా వేధిస్తున్నారని స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, సంగీత ఫొగాట్, సాక్షి మలిక్ సహా 30 మంది రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నాకు దిగారు. ఆయన నియంతృత్వాన్ని, ఆగడాలను అరికట్టేందుకు ప్రధానమంత్రి, హోం మంత్రి జోక్యం చేసుకోవాలని... అధ్యక్ష పదవి నుంచి ఆయన్ని తప్పించేదాకా ధర్నా విరమించబోమని, పోటీల్లో పాల్గొనబోమని స్పష్టం చేశారు. రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్, ప్రపంచ చాంపియన్‌షిప్ పతక విజేత సరిత మోర్, సంగీతా ఫొగాట్, సత్యవర్త్ కడియాన్, జితేందర్, సుమిత్ మలిక్ తదితర రెజ్లర్లు ధర్నా చేశారు. దేశానికి పతకాలు తెచ్చిన మేటి రెజ్లర్లు రోడ్డెక్కి నినదిస్తుంటే అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ మాత్రం ఈ ఆరోపణల్లో నిజం లేదని తేలిగ్గా కొట్టిపారేశారు. ఏ ఒక్కరినైనా తాను లైంగికంగా వేధించానని నిరూపిస్తే ఉరేసుకొంటానని బ్రిజ్‌భూషణ్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికైన 66 ఏళ్ల బ్రిజ్‌భూషణ్ 2011 నుంచి డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా ఉన్నారు. చదవండి: IND VS NZ 1st ODI: గిల్ హల్చల్.. పోరాడి ఓడిన న్యూజిలాండ్ -
వీసా తిరస్కరణ.. వరల్డ్ చాంపియన్‌షిప్‌కు భారత రెజ్లర్లు దూరం
స్పెయిన్‌లోని పొంటెవెడ్రాలో జరగనున్న అండర్-23 వరల్డ్ రెజ్లింగ్ చాంపియనషిప్‌కు 21 మంది భారతీయ రెజ్లర్లు దూరమయ్యారు. వీసా గడువు ముగియడంతో స్పెయిన్ ఎంబసీ 21 మందికి వీసాలు ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలిసింది. కాగా భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) సోమవారం ప్రారంభమైన ఛాంపియన్షిప్ కోసం 30 మంది సభ్యుల జట్టును ఎంపిక చేసింది. అందులో కేవలం తొమ్మిది మందికి మాత్రమే వీసాలు మంజూరయ్యాయి. చాంపియన్‌షిప్‌కు మిస్ అయిన 21 మందిలో అండర్-20 మహిళా ప్రపంచ ఛాంపియన్ యాంటిమ్ పంఘల్ ఉండడం గమనార్హం. ''ఇంతకముందెన్నడూ ఇలా జరగలేదు. భారత ప్రభుత్వ క్లియరెన్స్‌తో పాటు ప్రపంచ పాలక సంస్థ (UWW) నుంచి ఆహ్వానం అందించినప్పటికి మా రెజ్లర్లకు వీసాలు నిరాకరించబడ్డాయి. సాధ్యమైనంత త్వరగా పాస్‌పోర్ట్‌లను విడుదల చేయమని అభ్యర్థన చేసిన తర్వాత లేఖలు తిరస్కరణకు గురయ్యాయి. ఇది నిజంగా విచిత్రం.'' అని భారత రెజ్లింగ్ సమాఖ్య సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ పీటీఐకి తెలిపారు. -
రిఫరీపై అమానుష దాడి.. భారత రెజ్లర్‌పై జీవితకాల నిషేధం
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే భారత పురుషుల రెజ్లింగ్ జట్టును ఎంపిక చేసేందుకు నిర్వహించిన ట్రయల్స్‌లో అనుచిత ఘటన చోటు చేసుకుంది. బౌట్లో అప్పటిదాకా గెలుపు ధీమాతో ఉన్న సర్వీసెస్ రెజ్లర్ సతేందర్ మలిక్ ఫలితం బౌట్ వెలుపలి జోక్యంతో మారింది. ప్రత్యర్థికి అనుకూలంగా పాయింట్లు ఇచ్చిన విధానంపై రిఫరీ జగ్బీర్ సింగ్‌ను సతేందర్ ప్రశ్నించాడు. ఇది సహించలేని రిఫరీ జగ్బీర్ సింగ్ రెజ్లర్ చెంప చెళ్లుమనిపించాడు. ఒక్కసారిగా రిఫరీ తనపై చేయి చేసుకోవడంతో సతేందర్ సహనం కోల్పోయి ఆ వెంటనే జగ్బీర్ సింగ్‌ను తిరిగి కొట్టాడు. మొత్తం ట్రయల్స్‌కే మచ్చ తెచ్చిన ఈ ఉదంతంపై భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) కఠిన నిర్ణయం తీసుకుంది. రిఫరీపై ఎలాంటి చర్య తీసుకోకున్నా... క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ లేని సతేందర్‌పై జీవితకాల నిషేధం విధి స్తున్నామని ప్రకటించింది. ఈ సంఘటన వీడియో పరిశీలిస్తే మాత్రం ముందుగా రిఫరీనే సతేందర్‌పై చేయి చేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అసలేం జరిగింది! ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో పోటీపడే రెజ్లర్ల కోసం ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. 125 కేజీల ఫైనల్ బౌట్లో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సతేందర్ మలిక్... మోహిత్‌తో తలపడి 3–0తో ముందంజలో నిలిచాడు. ఇంకో 18 సెకన్లలో బౌట్ ముగియనున్న దశలో మలిక్‌ను మోహిత్ మ్యాట్‌పై (టేక్‌డౌన్)పడగొట్టాడు. ఓ పట్టుపట్టి పక్కకు నెట్టేశాడు. బౌట్లో ఉన్న రిఫరీ వీరేందర్ మలిక్ ‘టేక్‌డౌన్’కు పాయింట్లు ఇవ్వకుండా... కేవలం నెట్టేసిన దానికి ఒక పాయింట్ ఇచ్చాడు. దీనిపై అసంతృప్తితో ఉన్న మోహిత్ ‘చాలెంజ్’కు వెళ్లాడు. ఈ అప్పీల్‌ను సీనియర్ రిఫరీ జగ్బీర్ సింగ్ టీవీ రిప్లేలో పరిశీలించారు. టేక్డౌన్ను పరిగణనలోకి తీసుకున్న జగ్బీర్ రెండు పాయింట్లు కేటాయించాడు. దీనివల్ల సతేందర్, మోహిత్ 3–3తో సమంగా నిలిచారు. రెజ్లింగ్ నిబంధనల ప్రకారం స్కోరు టై అయినపుడు ఆఖరి పాయింట్ ఎవరు చేస్తే వారినే విజేతగా ప్రకటిస్తారు. చివరి పాయింట్ మోహిత్ చేయడంతో అతన్నే విజేతగా ప్రకటించారు. అప్పీల్ (చాలెంజ్)తో తారుమారైన ఫలితాన్ని జీర్ణించుకోలేకపోయిన సతేందర్ పక్కనే 57 కేజీల ఫైనల్ బౌట్ వేదికపై నుంచి నడుచుకుంటూ వెళ్లి రిఫరీ జగ్బీర్ నుంచి వివరణ కోరే ప్రయత్నం చేశాడు. అయితే జగ్బీర్ నుంచి సమాధానం బదులు సతేందర్ చెంపదెబ్బ తిన్నాడు. సతేందర్ కూడా క్షణికావేశానికి లోనై జగ్బీర్ను రెండు దెబ్బలేశాడు. ఈ హఠాత్పరిణామానికి అక్కడున్న డబ్ల్యూఎఫ్ఐ ఉన్నతాధికారులు, రెజ్లర్లు, పలువురు అభిమానులు ఖిన్నులయ్యారు. ఈ గందరగోళంలో రవి దహియా, అమన్‌ల మధ్య జరుగుతున్న 57 కేజీల ఫైనల్ బౌట్‌ను నిలిపి వేశారు. వీఐపీ వేదికపై డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ ఈ బౌట్లను చూస్తున్నాడు. రెజ్లర్ అనుచిత ప్రవర్తనపై కన్నెర్ర చేసిన ఆయన ఇకపై బౌట్లో దిగకుండా కఠిన చర్య తీసుకున్నారు. చదవండి: ‘కామన్వెల్త్’కు వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్ -
Vinesh Phogat: ఇక రెజ్లింగ్‌కు తిరిగొస్తానో లేదో!
ఢిల్లీ: భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని సంతరించుకున్నాయి. ఇటీవలే టోక్యో ఒలింపిక్స్ నుంచి తిరిగి వచ్చిన ఆమెపై క్రమశిక్షణ చర్యల కింద రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్య్లూఎఫ్ఐ) తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన వినేశ్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు రాసిన కాలమ్‌లో..'ఇక రెజ్లింగ్‌కు తిరిగొస్తానో రానో' అంటూ కామెంట్ చేయడం ఆసక్తి కలిగించింది. ''భారత్‌లో ఎంత వేగంగా ఎదుగుతారో అంతే వేగంగా పతనమవుతారని నాకు తెలుసు. ఒక్క మెడల్ పోయిందంటే ఇక అంతే. పని ముగిసినట్లే. రెజ్లింగ్‌లోకి నేను ఎప్పుడు తిరిగి వస్తానో తెలియదు.. రాకపోవచ్చు కూడా. నా కాలు విరిగినప్పుడే బాగుంది. ఇప్పుడు నా శరీరం విరగలేదు కానీ.. మనసు మాత్రం కుంగిపోయింది.'' అని చెప్పుకొచ్చింది. ఒలింపిక్స్‌కు ముందు 2017లో కాంకషన్‌కు గురవడం, ఆ తర్వాత రెండుసార్లు కొవిడ్ బారిన పడి కోలుకున్న వినేశ్ తాజా వ్యాఖ్యలతో కెరీర్ ఇక ముగిసినట్టేనా అని కొంతమంది భావిస్తున్నారు. ఇక టోక్యో ఒలింపిక్స్ 53 కేజీల రెజ్లింగ్ కేటగిరిలో పోటీ పడిన ఆమె పతకం సాధిస్తుందని అంతా భావించారు. కానీ క్వార్టర్ఫైనల్లోనే ఓడిపోయి వినేశ్ ఇంటిదారి పట్టింది. -
వినేశ్ ఫొగాట్ సస్పెండ్
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ సందర్భంగా క్రమశిక్షణ రాహిత్యం, విపరీత ధోరణితో వ్యవహరించిన భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై సస్పెన్షన్ వేటు పడింది. అలాగే సంజాయిషీ కోరుతూ ఆమెతో పాటు మరో రెజ్లర్ సోనమ్ మాలిక్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. టోక్యో విశ్వక్రీడల్లో వినేశ్ క్వార్టర్ ఫైనల్లో ఓడింది. హంగేరి శిక్షణకు వెళ్లిన ఆమె అక్కడి నుంచే నేరుగా టోక్యోకు వచ్చింది. కానీ భారత జట్టు క్రీడాకారులు బస చేసిన క్రీడా గ్రామంలో ఉండకుండా వెలుపల తన హంగేరి కోచ్, సహాయకులతో బస చేసింది. భారత ఇతర మహిళా రెజ్లర్లు సోనమ్, సీమా, అన్షు భారత్ నుంచి టోక్యోకు రావడంతో వారి నుంచి తనకు కరోనా సోకే ప్రమాదం ఉండవచ్చని భావిస్తూ వినేశ్ వారితో కలిసి ఉండేందుకు, కలిసి ప్రాక్టీస్ చేసేందుకు నిరాకరించింది. ఒలింపిక్స్ రెజ్లింగ్ బౌట్లలో టీమిండియా అధికారిక ‘శివ్ నరేశ్’ టీమ్ జెర్సీలను కాదని వినేశ్ నైకీ జెర్సీలను ధరించి బరిలోకి దిగింది. ఆమె విపరీత పోకడ, క్రమశిక్షణ రాహిత్యం భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు ఆగ్రహం తెప్పించింది. దీంతో కఠిన చర్యలు చేపట్టింది. ‘ఫొగాట్ తన ప్రవర్తనతో తీవ్రస్థాయిలో క్రమశిక్షణను ఉల్లంఘించింది. అందుకే తాత్కాలిక నిషేధం విధించాం. ఇపుడామె ఎలాంటి రెజ్లింగ్ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు వీల్లేదు. ఆమెపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసు కూడా పంపాం. సంజాయిషీ ఇచ్చేందుకు ఈ నెల 16లోగా గడువిచ్చాం’ అని డబ్ల్యూఎఫ్ఐ అధికారి ఒకరు వెల్లడించారు. -
రెజ్లర్ సుమిత్‌పై రూ. 16 లక్షల జరిమానా!
న్యూఢిల్లీ: భారత హెవీవెయిట్ రెజ్లర్, టోక్యో ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్న సుమిత్ మలిక్ (125 కేజీలు) డోపింగ్ పరీక్షలో విఫలమవ్వడంతో భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) భారీ మూల్యం చెల్లించుకోనుంది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ఆధ్వర్యంలో జరిగిన వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో సుమిత్ డోపింగ్‌లో పట్టుబడటంతో అతనిపై తాత్కాలికంగా ఆరు నెలలపాటు నిషేధం విధించారు. దాంతో సుమిత్ టోక్యో ఒలింపిక్స్‌కు దూరమయ్యాడు. డోపింగ్‌లో పట్టుబడినందుకు సుమిత్ బదులుగా ఈ విభాగంలోనే మరో భారత రెజ్లర్‌ను పంపించే వీలు లేకుండాపోయింది. డోపింగ్‌లో దొరికిన రెజ్లింగ్ సమాఖ్యపై యూడబ్ల్యూడబ్ల్యూ రూ. 16 లక్షల జరిమానా విధిస్తుంది. ఈ మొత్తాన్ని డోపింగ్‌లో పట్టుబడ్డ రెజ్లర్ నుంచి వసూలు చేస్తారు. ఫలితంగా ఇప్పుడు సుమిత్ తన జేబు ద్వారా రూ. 16 లక్షలు భారత రెజ్లింగ్ సమాఖ్యకు చెల్లించాలి. ఒకవేళ జరిమానా మొత్తం చెల్లించకపోతే సుమిత్‌పై భారత రెజ్లింగ్ సమాఖ్య జీవితకాల నిషేధం విధించే అవకాశముంది. సుమిత్ ‘బి’ శాంపిల్ కూడా పాజిటివ్ వస్తే అతను రూ. 16 లక్షల జరిమానాతోపాటు టోక్యో ఒలింపిక్స్ సన్నాహాల కోసం హరియాణా ప్రభుత్వం నుంచి తీసుకున్న రూ. 5 లక్షలను తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. -
Wrestler Sushil Kumar: సుశీల్‌కు మొండిచేయి
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన ఏకైక భారత క్రీడాకారుడు, స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ మూడో ఒలింపిక్ పతకం సాధించాలనుకున్న ఆశలు ఆవిరయ్యాయి. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు చివరి టోర్నమెంట్ అయిన వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో పాల్గొనే భారత ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ జట్టును గురువారం ప్రకటించారు. ఈ టోర్నీ మే 6 నుంచి 9 వరకు బల్గేరియా రాజధాని సోఫియాలో జరుగుతుంది. ► 74 కేజీల విభాగంలో భారత్ తరఫున ఆసియా మాజీ చాంపియన్ అమిత్ ధన్కర్ బరిలోకి దిగనున్నాడు. మార్చి 16న నిర్వహించిన సెలక్షన్ ట్రయల్స్ టోర్నీకి పూర్తిస్థాయి ఫిట్నెస్ లేని కారణంగా సుశీల్ కుమార్ దూరంగా ఉన్నాడు. ఆ ట్రయల్స్ టోర్నీలో 74 కేజీల విభాగంలో సందీప్ సింగ్ మాన్ విజేతగా నిలువగా... అమిత్ ధన్కర్ రన్నరప్‌గా నిలిచాడు. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) నిబంధనల ప్రకారం ఒలింపిక్ బెర్త్ సాధించిన రెజ్లరే ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడు. చివరి క్వాలిఫయింగ్ టోర్నీకి సుశీల్ ఎంపిక కాకపోవడంతో అతనికి టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. 37 ఏళ్ల సుశీల్ కుమార్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం (66 కేజీలు), 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజత పతకం (66 కేజీలు) సాధించాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో సుశీల్‌కు పోటీపడే అవకాశం రాలేదు. ‘ప్రస్తుత కరోనా కల్లోల పరిస్థితుల్లో ప్రాణాలతో ఉండటమే ముఖ్యం. జట్టు ఎంపిక గురించి నేను డబ్ల్యూఎఫ్ఐతో ఇంకా మాట్లాడలేదు. త్వరలోనే ఈ విషయంపై వారితో చర్చిస్తాను’ అని సుశీల్ వ్యాఖ్యానించాడు. ► ట్రయల్స్ టోర్నీ విజేతగా నిలిచిన సందీప్ సింగ్‌ను కజకిస్తాన్‌లో జరిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీకి, ఆసియా చాంపియన్‌షిప్ పోటీలకు ఎంపిక చేశారు. అయితే ఈ రెండు టోర్నీలలో సందీప్ సింగ్ విఫలమయ్యాడు. దాంతో వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ కోసం సందీప్ సింగ్‌ను పక్కనబెట్టి సెలక్షన్ టోర్నీ రన్నరప్ అమిత్ ధనకర్‌కు ఎంపిక చేశారు. ►వాస్తవానికి వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ కోసం మళ్లీ ట్రయల్స్ నిర్వహించాలని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) భావించింది. అయితే దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా శిక్షణ శిబిరాలు మూతబడ్డాయి. దాంతో ట్రయల్స్ లేకుండానే తొలి ట్రయల్స్ టోర్నీ ఆధారంగా అమిత్‌కు అవకాశం ఇచ్చారు. ►74 కేజీల విభాగంలో మరో స్టార్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ట్రయల్స్ టోర్నీలో సెమీఫైనల్లో ఓడిపోవడంతో అతను కూడా టోక్యో ఒలింపిక్స్ అవకాశాలు కోల్పోయాడు. ►ఫ్రీస్టయిల్ విభాగంలో భారత్‌కు ఇప్పటికే మూడు ఒలింపిక్ బెర్త్‌లు (రవి–57 కేజలు; బజరంగ్–65 కేజీలు; దీపక్ పూనియా–86 కేజీలు) ఖరారయ్యాయి. మరో మూడు బెర్త్‌లు (74 కేజీలు, 97 కేజీలు, 125 కేజీలు) మిగిలి ఉన్నాయి. 97 కేజీల విభాగంలో సత్యవర్త్... 125 కేజీల విభాగంలో సుమిత్ వరల్డ్ క్వాలిఫయింగ్ టోర్నీ లో పోటీపడనున్నారు. ఈ టోర్నీలో ఫైనల్ చేరిన వారికి ఒలింపిక్ బెర్త్‌లు ఖాయమవుతాయి. ►వరల్డ్ క్వాలిఫయింగ్ టోర్నీలో పాల్గొనే భారత గ్రీకో రోమన్ పురుషుల జట్టును కూడా ప్రకటించారు. సచిన్ రాణా (60 కేజీలు), ఆశు (67 కేజీలు), గుర్ప్రీత్ సింగ్ (77 కేజీలు), సునీల్ (87 కేజీలు), దీపాంశు (97 కేజీలు), నవీన్ కుమార్ (130 కేజీలు) భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. ►మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో వరల్డ్ క్వాలిఫయింగ్ టోర్నీలో మూడు ఒలింపిక్ బెర్త్‌ల కోసం సీమా (50 కేజీలు)... నిషా (68 కేజీలు)... పూజా (76 కేజీలు) పోటీపడతారు. ఈ టోర్నీలో ఫైనల్ చేరిన వారికి ఒలింపిక్ బెర్త్‌లు లభిస్తాయి. -
‘ఖేల్‌రత్న’కు వినేశ్
న్యూఢిల్లీ: భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న’ బరిలో వరుసగా రెండో ఏడాది నిలవనుంది. వినేశ్ పేరును గతేడాదే ఈ అవార్డుకు నామినేట్ చేసినప్పటికీ బజరంగ్ పూనియాను అదృష్టం వరించింది. ఈ మూడేళ్లలో జకార్తా ఆసియా క్రీడల్లో స్వర్ణం, ప్రపంచ చాంపియన్‌షిప్ (2019)లో కాంస్యం, ఈ ఏడాది ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన వినేశ్... టోక్యో ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్న ఏకైక భారత మహిళా రెజ్లర్ కావడం విశేషం. దీంతో ఆమె పేరును భారత రెజ్లింగ్ సమాఖ్య ‘ఖేల్‌రత్న’ కోసం క్రీడా మంత్రిత్వ శాఖకు సిఫారసు చేయాలని నిర్ణయం తీసుకుంది. మరోవైపు రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ ‘అర్జున అవార్డు’ కోసం దరఖాస్తు చేసినట్లు సమాచారం. 2016లోనే కేంద్రం ఆమెను ‘ఖేల్‌రత్న’తో సత్కరించింది. ఇతర రెజ్లర్లు దీపక్ పూనియా, రాహుల్ అవారే, సందీప్ తోమర్ ‘అర్జున అవార్డు’ను ఆశిస్తున్నారు. ఈ మేరకు సమాఖ్యకు దరఖాస్తులు సమర్పించారు. -
రెజ్లర్లకూ కాంట్రాక్టులు
గొండా: భారత్‌లో క్రికెటర్లే కాదు... రెజ్లర్లూ కాంట్రాక్టు ‘పట్టే’శారు. ఇప్పటిదాకా గెలిచినపుడే పతకాలు, ప్రోత్సాహకాలు దక్కేవి. ఇకపై వార్షిక కాంట్రాక్టుల రూపంలో స్థిరమైన మొత్తాలను అందుకోనున్నారు. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) కొత్తగా ఈ కాంట్రాక్టు పద్ధతిని ప్రవేశపెట్టింది. ఇంటాబయటా పతకాలు సాధిస్తున్న రెజ్లర్లకు ‘ఎ’, ‘బి’ కాంట్రాక్టులు కట్టబెట్టింది. ఎ–గ్రేడ్‌లో రూ. 30 లక్షలు, బి–గ్రేడ్‌లో రూ. 20 లక్షలు వార్షిక ఫీజుగా చెల్లిస్తారు. సి, డి గ్రేడ్‌ల్లో ఉన్న రెజ్లర్లకు వరుసగా రూ. 10 లక్షలు, రూ. 5 లక్షలు చెల్లిస్తారు. ఏటా ఆయా రెజ్లర్ల ప్రదర్శనను సమీక్షించి గ్రేడ్లను మారుస్తారు. ఈ కాంట్రాక్టుల్లో యువ స్టార్ రెజ్లర్లకు పెద్దపీట వేశారు. బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్, పూజ ధండాలకు ‘ఎ’ గ్రేడ్ ఇవ్వగా... వెటరన్ రెజ్లర్, రెండు సార్లు ఒలింపిక్స్ పతక విజేత అయిన సుశీల్ కుమార్‌కు ‘బి’ గ్రేడ్ కాంట్రాక్టు ఇచ్చారు. ఇదే జాబితాలో రియో ఒలింపిక్స్ కాంస్య విజేత సాక్షి మలిక్ ఉంది. దేశంలో బీసీసీఐ తర్వాత కాంట్రాక్టు ఇస్తున్న రెండో క్రీడా సమాఖ్య డబ్ల్యూఎఫ్ఐనే! భారత ఒలింపిక్ సంఘం సభ్య సమాఖ్యల్లో కాంట్రాక్టులు చెల్లిస్తున్న ఏకైక క్రీడా సంఘంగా డబ్ల్యూఎఫ్ఐ ఘనతకెక్కనుంది. జూనియర్ రెజ్లర్లకు ఇదెంతో ప్రోత్సాహకరమని వినేశ్ ఫొగాట్ హర్షం వ్యక్తం చేసింది. -
వచ్చే నెల 2 నుంచి ప్రొ రెజ్లింగ్
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో వారుుదా పడిన ప్రొ రెజ్లింగ్ లీగ్ రెండో సీజన్‌ను జనవరి 2 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆర్గనైజర్లు తెలిపారు. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)తో కలిసి ప్రొ స్పోర్టిఫై సంస్థ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. నిజానికి ముందే అనుకున్న షెడ్యూలు ప్రకారం ఈ నెల 15 నుంచి ఈ సీజన్ ఆరంభం కావాలి. కానీ నగదు కొరత పరిస్థితుల దృష్ట్యా ఫ్రాంచైజీ యజమానులు వారుుదా వేయాలని కోరారు. ఢిల్లీ, ముంబై, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హరియాణా, జైపూర్‌లకు చెందిన ఆరు ఫ్రాంచైజీలు ఇందులో తలపడనున్నారుు. సుమారు 12 మందికి పైగా ఒలింపిక్ విజేతలు ఇందులో పాల్గొంటారని డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ తెలిపారు. భారత్ నుంచి యోగేశ్వర్ దత్, సాక్షిమలిక్, సందీప్ తోమర్ బరిలోకి దిగుతున్నారు. -
పద్మభూషణ్‌కు సుశీల్ పేరు సిఫారసు
న్యూఢిల్లీ: స్టార్ రెజ్లర్, రెండు ఒలింపిక్ పతకాల విజేత సుశీల్ కుమార్‌కు పద్మభూషణ్ అవార్డు ఇవ్వాలని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అలాగే సుశీల్ కోచ్ యశ్వీస్ సింగ్‌కు, మహిళా రెజ్లర్ అల్కా తోమర్‌కు పద్మశ్రీ అవార్డులు బహూకరించాలని కేంద్ర క్రీడల శాఖను కోరింది. సుశీల్ బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం, లండన్ గేమ్స్‌లో రజతం సాధించిన సంగతి తెలిసిందే. ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ ఈవెంట్లో రెండు పతకాలు గెలిచిన తొలి భారత క్రీడాకారుడిగా సుశీల్ చరిత్ర సృష్టించాడు. 15 సార్లు ప్రపంచ బిలియర్డ్స్, స్నూకర్ చాంపియన్ పంకజ్ అద్వానీ పేరును పద్మభూషణ్ అవార్డుకు ప్రతిపాదించారు. ఇటీవల ఖేల్ రత్న అవార్డు అందుకున్న షూర్ జూతూరాయ్తో పాటు టేబుల్ టెన్నిస్ ఆటగాడు ఆచంట శరత్ కమల్ పేర్లను పద్మశ్రీకి ప్రదిపాదించారు. -
రెజ్లింగ్ ట్రయిల్స్ నిర్వహించండి: సుశీల్ కుమార్
న్యూఢిల్లీ : రెజ్లర్ సుశీల్ కుమార్ శుక్రవారం కేంద్ర కీడ్రాశాఖ మంత్రి శర్బానంద్ సోనోవాల్‌కు లేఖ రాశాడు. రెజ్లింగ్ ట్రయిల్స్ నిర్వహించాలంటూ అతడు తన లేఖలో పేర్కొన్నాడు. కాగా రియో ఒలింపిక్స్‌కు క్రీడాకారుల అక్రిడిటేషన్ కోసం భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)కు వచ్చిన రెజ్లర్ల జాబితాలో సుశీల్ కుమార్ పేరు లేకపోవడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. 74 కేజీల విభాగంలో రియోకు ఎవరు వెళ్లాలనే విషయంపై సుశీల్, నర్సింగ్ల మధ్య వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఐఓఏకు వచ్చిన జాబితాలో సుశీల్ పేరు లేదు. అయితే ఈ జాబితాను తాము పంపలేదని, సుశీల్‌కు అవకాశం ఉందని భారత రెజ్లింగ్ సమాఖ్య పంపింది. ‘ఒలింపిక్స్‌కు అర్హత పొందిన రెజ్లర్ల పేర్లను ప్రపంచ రెజ్లింగ్ సంఘం ఐఓఏకు పంపుతుంది. కాగా రియో ఒలింపిక్స్ కు రెజ్లర్ సుశీల్ కుమార్ కు మొండిచేయి చూపారని వచ్చిన వార్తలను భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) తోసిపుచ్చింది. మరోవైపు ఈ వివాదంలో తాము జోక్యం చేసుకోమని క్రీడా శాఖ స్పష్టం చేసిన నేపథ్యంలో సుశీల్ కుమార్ రాసిన లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఈ లేఖపై మంత్రిత్వ శాఖ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. -
సుశీల్ ను తప్పించలేదు: డబ్ల్యూఎఫ్ఐ
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ కు రెజ్లర్ సుశీల్ కుమార్ కు మొండిచేయి చూపారని వచ్చిన వార్తలను భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) తోసిపుచ్చింది. ఒలింపిక్స్ ప్రాబబుల్స్ కు తాము ఎటువంటి జాబితా పంపించలేదని స్పష్టం చేసింది. రియో ఒలింపిక్స్ జాబితా నుంచి సుశీల్ కుమార్ ను తప్పించలేదని తెలిపింది. రియో ఒలింపిక్స్ ప్రాబబుల్స్ లో రెజ్లింగ్‌లో 74 కేజీల విభాగంలో సుశీల్ కు చోటు దక్కలేదని, నర్సింగ్ యాదవ్ వైపు రెజ్లింగ్ సమాఖ్య మొగ్గు చూపిందని ఇంతకుముందు వార్తలు వచ్చాయి. అయితే భారత్ ఒలింపిక్స్ సంఘానికి తాము ఎటువంటి జాబితా పంపించలేదని డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తెలిపారు. ఒలింపిక్స్ లో వివిధ కేటగిరీల్లో పోటీ పడే అవకాశమున్న క్రీడాకారుల పేర్ల జాబితాను అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ అనే సంస్థ పంపిస్తుంటుందని వివరణయిచ్చారు. సుశీల్ కుమార్ కు దారులు పూర్తిగా మూసుకుపోలేదన్నారు. భారత్ ఒలింపిక్స్ సంఘం ఎవరి పేరుకు ఖరారు చేస్తే వారే దేశం తరపున పోటీకి వెళతారని డబ్ల్యూఎఫ్ఐ సహ కార్యదర్శి వినోద్ తోమర్ తెలిపారు.