రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్ తదితరులు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే సుప్రీం కోర్టు జోక్యంతోనే బీజేపీ నేత శరణ్‌సింగ్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అయినప్పటికీ భారత రెజ్లర్లు జంతర్‌మంతర్ వద్ద తమ నిరసనను యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రియాంక గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ..న్యాయం మీ అంగీకారం కోసం ఎదురుచూస్తోందని ట్వీట్ చేశారు.
ఈ మేరకు ప్రియాంక గాంధీ.. శరణ్ సింగ్ ఒక మీడియా సమావేశంలో మాట్లాడిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ప్రధాని మోదీ కోరితే తాను రాజీనమా చేస్తానని శరణ్ సింగ్ చెప్పారు. కాబట్టి మోదీ ఇప్పుడైన ఆ ఎంపీని రాజీనామా చేయాలని ఆదేశించండి అని ప్రియాంక్ గాంధీ అన్నారు. మీరు అందుకు అంగీకారం తెలిపండి అని ప్రియాంక్ గాంధీ మోదీని కోరారు. ఇదిలా ఉండగా బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ జంతర్‌మంతర్ నుంచి నిరసనలు చేసిన ఏ ఒక్కరు ఇప్పటి వరకు న్యాయం పొందలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు కావాలంటే కోర్టు తలుపులు తట్టాలని అన్నారు.
90% మంది అథ్లెట్లు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాని విశ్వసిస్తున్నారు. హర్యానాలోని కొన్ని కుటుంబాలకు చెందినవారు ఆరోపణలు చేస్తున్నారని, వారంతా ఒకే ప్రాంతానికి(హర్యానాకి) చెందని వారని అన్నారు. హర్యానా నియోజకవర్గం కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ దీపేందర్ హుడా దీనికి కారణమని ఆయనే వెనకుండి నడిపిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ఈ రెజ్లర్లు రోజుకో డిమాండ్‌తో ముందుకు వస్తున్నారంటూ విమర్శించారు. మొదట ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్నారు. తర్వాత పదవికి రాజీనామా, జైలుకి పంపించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ తాను పదవికి రాజీనామ చేస్తే రెజ్లర్లు చేసిన ఆరోపణలను అంగీకరించినట్లు అవుతుందన్నారు. అందువల్ల తానను చేయనని కరాకండీగా చెప్పారు.
అయినా తాను ప్రజల వల్ల తన నియోజకవర్గానికి ఎంపీ అయ్యానని, వినేష్ ఫోగట్ వల్లకాదని అన్నారు. కేవలం ఆ ఒక్క రాష్టానికి చెందిన కొన్ని కుటుంబాల అమ్మాయిలు మాత్రమే ఎందుకు నిరసనలు చేస్తున్నారని నిలదీశారు. మిగతా.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఇతర రాష్ట్రాల ఆటగాళ్లు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. హర్యానాకు చెందిన 90 శాతం మంది ఆటగాళ్లు తనతోనే ఉన్నారని శరణ్ సింగ్ చెప్పారు. కాగా, రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత శరణ్‌సింగ్‌పై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.
(చదవండి: మన్ కీ బాత్ మొత్తం ఎపిసోడ్‌లకు రూ. 830 కోట్లు! ట్వీట్ దుమారం)
Comments
Please login to add a commentAdd a comment