ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద గత పది రోజులుగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు అనూహ్యంగా రైతు సంఘాల మద్దతు లభించింది. ఈ మేరకు రెజ్లర్లకు మద్దతుగా పెద్ద సంఖ్యలో రైతులు తరలివస్తారని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. దీంతో ఆదివారం దేశ రాజధానిలో వేలాదిమంది రైతులు ఆ రెజ్లర్ల నిరసనకు సంఘీభాం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీలోకి ప్రవేశించేందుకు యత్నిస్తున్న రైతుల బృందాన్ని టిక్రి సరిహద్దుల వద్దే ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు.
జంతర్ మంతర్ వద్ద భారీగా పోలీసులు మోహరించడమే గాక భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతేగాదు ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా తనిఖీలు, పెట్రోలింగ్‌ను పెంచారు. అలాగే చట్టాలను ఉల్లంఘించిన వారిని అదుపులోకి తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఢిల్లీని కలిపే హర్యానా, పంజాబ్, హిమాచల్, జమ్మూ కాశ్మీర్‌లను కలిపే 44వ నెంబరు జాతీయ రహదారి చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఆయా ప్రదేశాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అల్లర్లు చెలరేగకుండా భారీగా బలగాలు మోహరించారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉండగా భారత రెజ్లర్లు తమకు న్యాయం జరిగేంత వరకు వెనుదిరిగేదే లేదని తెగేసి చెప్పారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌ను డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌గా తొలగించి కటకటాల వెనక్కినెట్టే వరకు వదిలేది లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వారికి భారీగా రైతు సంఘాల నుంచి ఊహించని రీతీలో మద్దతు లభించింది. కాగా, వారంతా కేంద్రం రద్దు చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు జరిగిన ఆందోళనకు నాయకత్వం వహించిన రైతు సంఘాలు కావడం గమనార్హం.
VIDEO | A group of farmers trying to enter Delhi to join wrestlers' protest at Jantar Mantar stopped by police at Tikri Border. pic.twitter.com/3L8WyKWgQu
— Press Trust of India (@PTI_News) May 7, 2023
(చదవండి: పెళ్లి పూర్తయ్యే టైంలో సినిమాని తలపించే సీన్..అర్థాంతరంగా పెళ్లిని ఆపేసిన వరుడు)
Comments
Please login to add a commentAdd a comment