join
-
వైఎస్ఆర్ సీపీ పార్టీలో శైలజానాథ్
-
బిగ్‌బాస్‌లోకి గ్లామర్ బ్యూటీ 'వైల్డ్ కార్డ్' ఎంట్రీ.. రికార్డ్స్ బ్రేక్ గ్యారెంటీ (ఫోటోలు)
-
జనసేనకు ఝలక్..
-
కాంగ్రెస్ లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే
-
కాంగ్రెస్ గూటికి అరికెపూడి
-
ప్రేమతోనే కాంగ్రెస్‌లో చేరుతున్నా..
బంజారాహిల్స్ (హైదరాబాద్): అవకాశవాద రాజకీయాల కోసం తాను బీఆర్ ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు వస్తున్న విమర్శలు సరికావని ఎంపీ కె.కేశవరావు పేర్కొన్నారు. తన వయసు 85 ఏళ్లు అని.. 55 ఏళ్లు కాంగ్రెస్‌లో కొన సాగానని, 13 ఏళ్లు బీఆర్ఎస్లో ఉన్నానని చెప్పారు. తనకు రాజకీయ జీవితం ఇచ్చిన కాంగ్రెస్‌పై ప్రేమతోనే మళ్లీ చేరుతున్నానన్నారు. ఇది తనకు తీర్థయాత్ర తర్వాత సొంతింటికి వస్తున్నట్టుగా ఉందన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్లో మొదటిసారి రాజ్యసభ సభ్యుడిగా కాంగ్రెస్ ఓటు వేయడం వల్లే గెలిచానని, తర్వాత కేసీఆర్ తనకు మరో చాన్స్ ఇచ్చారని కేకే చెప్పారు. తన మాటకు చాలా విలువ ఇచ్చారని పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణను దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారని.. రాష్ట్ర సాధనలో, పునర్నిర్మాణంలో ఆయన పాత్ర ఎంతో ఉందని వ్యాఖ్యానించారు. అయితే బీఆర్ఎస్ను కుటుంబ పాలన నడిపిస్తోందని ప్రజలు అనుకుంటూ ఉండేవారని.. ఆ సమయంలో బాల్క సుమన్, తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి నేతలు పార్టీని నడిపిస్తే బాగుండేదని తాను అనుకున్నానని చెప్పారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్)ను విలీనం చేస్తానని సోనియాగాంధీకి కేసీఆర్ హామీ ఇచ్చి మాట తప్పారని పేర్కొ న్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కష్టకాలంలో ఉందని, అందుకే తాను ఆ పార్టీలో చేరుతున్నానని చెప్పారు. బీజేపీని ఎదుర్కోవాలంటే ఇలాంటి నిర్ణయం తప్పదన్నారు. తాను గురువారం కేసీఆర్‌ను కలిశాననని, తాను పార్టీని వీడుతుండటం పట్ల ఆయన బాధపడ్డారని కేకే చెప్పారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ తనను తిట్టారని కొందరు తన దృష్టికి తీసుకువచ్చా రని.. దీనిని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని వ్యాఖ్యానించారు. అభివృద్ధి కొనసాగించడానికే అధికార పార్టీలోకి..: విజయలక్ష్మి గ్రేటర్ హైదరాబాద్‌లో జరుగుతున్న అభివృద్ధిని ఇలాగే కొనసాగించడా నికి తాను అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా నని హైదరాబాద్ మేయ ర్ గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఏమేం అభివృద్ధి పనులు కావా లో త్వరలోనే సీఎంతో మాట్లాడి చెబుతాన న్నారు. తనతో పాటు 150 మంది కార్పొరేటర్ల సమన్వయంతో అభివృద్ధి చేయాలన్నదే లక్ష్య మని చెప్పారు. కొందరు బీఆర్ఎస్ నేతలు తన సోదరుడు, బీఆర్ఎస్ నేత విప్లవ్కుమార్ను తెరపైకి తీసుకొచ్చి తమ కుటుంబంలో కలహా లు రేపుతున్నారని ఆరోపించారు. కాగా.. సీఎం రేవంత్‌రెడ్డి శనివారం విజయలక్ష్మి నివాసానికి రానున్నట్టు తెలిసింది. సీఎం ఆమెకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నట్టు సమాచారం. -
11 లేదా 12న కాంగ్రెస్‌లోకి పట్నం దంపతులు!
తాండూరు (వికారాబాద్): కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరేందుకు పట్నం దంపతులు సిద్ధమవుతున్నారు. సతీసమేతంగా గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసిన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్కు ప్రయతి్నస్తున్నారు. ఈ నెల 11 లేదా 12 తేదీల్లో అధికారికంగా హస్తం పారీ్టలో చేరనున్నట్లు సమాచారం. మూడు దశాబ్దాల పాటు ప్రాంతీయ పార్టీల్లో కొనసాగుతూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తన ప్రాబల్యం చూపుతున్న మహేందర్‌రెడ్డి తొలిసారి జాతీయ పారీ్టకి జై కొట్టారు. తన సతీమణి, వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతకు కాంగ్రెస్ తరఫున చేవెళ్ల ఎంపీ టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో బీఆర్ఎస్ను వీడారు. మహేందర్‌రెడ్డి చేరికపై ఆయన మద్దతుదారులు హర్షం వ్యక్తం చేస్తుండగా..కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై తాండూరు ఎమ్మెల్యే బి.మనోహర్‌రెడ్డి స్పందిస్తూ అధిష్టానం చేరికలను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో తాను చెప్పేదేమీ లేదన్నారు. మరోవైపు ఏఐసీసీ సభ్యుడు రమేశ్ మహరాజ్...పట్నం చేరికపై గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు భారీ షాక్
సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. జిల్లాకు చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరిలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి, పీసీపీ ఉపాధ్యక్షుడు సంభాని చంద్రశేఖర్.. తెలంగాణ ఉద్యమ విద్యార్థి నేత ప్రస్తుత పీసీసి ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి కృష్ణ, సీనియర్ రాజకీయ నేత అబ్బయ్య దంపతులు, డా. రామచంద్రు నాయక్, వారితో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. చదవండి: సీబీఐ, ఈడీ విచారణకు కేసీఆర్ సిద్ధమా?.. రేవంత్ సవాల్ -
బీఆర్ఎస్లోకి రాకేశ్‌రెడ్డి, గట్టు శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కష్టపడి సాధించుకున్న తెలంగాణను మనమే పాలించుకుందామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన పథకం అందని ఇల్లు లేదని, ముఖ్యమంత్రిని తమ ఇంటి పెద్దగా యువత భావిస్తోందని వ్యాఖ్యానించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీజేపీ నాయకులు ఏనుగు రాకేశ్‌రెడ్డి, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, వెంకటేశ్ తదితరులు శనివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని, ప్రతీ ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని కేటీఆర్ అన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని, ప్రపంచ స్థాయి కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు, నీళ్లు వంటి కనీస అవసరాలు కూడా తీర్చలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే వరంగల్‌లో మెట్రోను పరుగులు పెట్టిస్తామని కేటీఆర్ హామీఇచ్చారు. రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాత కేసీఆర్ అయితే, భవిష్యత్ తెలంగాణ నిర్మాత కేటీఆర్ అని కొనియాడారు. రాష్ట్రంలో హ్యాట్రిక్ సాధించేందుకు తమ వంతు కృషి చేస్తామని పార్టీలో చేరిన నేతలు ప్రకటించారు. -
వారంతా కాంగ్రెస్ నిరంకుశంపై పోరాడిన వాళ్లే..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నిరంకుశ విధానాలపై పోరాడిన వాళ్లంతా ఇప్పుడు బీఆర్ఎస్లో చేరుతు న్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వాఖ్యానించారు. బీఆర్ఎస్ విధానాలకు ఆకర్షితులై వారంతా పార్టీలో చేరుతున్నారన్నారు. శనివారం తెలంగాణ భవన్లో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సమక్షంలో చెరుకు సుధాకర్‌తోపాటు పలువురు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ విధానాలకు వ్యతిరే కంగా 46 రోజులు పోరాటం చేసి జైలు శిక్ష అనుభ వించిన నాయకులు చెరుకు సుధాకర్ బీఆర్ఎస్లో చేరడం శుభ పరిణామమన్నారు. జిట్టా బాలకృష్ణ, ఏపూరి సోమన్న, హర్దీప్రెడ్డి లాంటి వాళ్లు బీఆర్ ఎస్‌లో చేరడం గొప్ప విషయమని, ఇది తనకెంతో సంతోషం కలిగించిందని చెప్పారు. ‘అదృష్టం ఉంటేనే ఇంట్లో ఆడపిల్లలు పుడతారు. ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తాం. మనింటి అమ్మాయిని వేరే వాళ్లకు ఇవ్వాలంటే ఎంత ఆలోచిస్తామో, రాష్ట్రాన్ని ఒకరి చేతిలో పెట్టాలంటే కూడా ఎంతో ఆలోచించాలి. ఇంత గొప్పగా సాధించుకున్న రాష్ట్రాన్ని, అభివృద్ధి చేసుకున్న రాష్ట్రాన్ని ఎవరి చేతిలో ఉంచాలో ప్రజలు కూడా ఆలోచించాలి’ అని కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ప్రతి ఓటరు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. కేసీఆర్‌కు హ్యాట్రిక్ సీఎంగా అవకాశమివ్వాలని విన్నవించారు. ‘ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పన్నెండుకు 12 అసెంబ్లీ స్థానాల్లో మళ్లీ గెలవాలి. ఈ చేరికలతో నకిరేకల్‌లో లింగయ్య, ఆలేరులో సునీత గెలుపు ఖాయమ య్యాయి. అందరికీ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు. ఈసారి దసరాకు ఊళ్లలో అభివృద్ధిపైనే చర్చ జరగాలి’ అని కేటీఆర్ చెప్పారు. దూకుడుగా పని చేస్తాను: చెరుకు సుధాకర్ ‘తెలంగాణ ఉద్యమాన్ని గరిష్ట స్థాయిలో నడిపాను. జైలు జీవితాన్ని కూడా గడిపాను. నా ఆలోచన విధానానికి పదును పెట్టింది తెలంగాణ భవన్. పార్లమెంటరీ రాజకీయాలను అవగాహన చేయించిన వ్యక్తి కేసీఆర్. తెలంగాణ ప్రజల గుండెచప్పుడుగా బీఆర్ఎస్ కొనసాగాలి. తెలంగాణ ప్రజలకు అనేక పాఠాలు, వ్యతిరేకులకు గుణపాఠాలు చెప్పిన వ్యక్తి కేసీఆర్. భవిష్యత్తు రాజకీయ ప్రస్థానంలో తెలంగాణ ప్రజల ఆయువు పట్టుగా పార్టీ నిలవాలి. ప్రజలకు మరింత చేరువై అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలి. తెలంగాణ ప్రజల ఆశయా లు, ఆకాంక్షల సాధన కోసం గతంలో మాదిరిగానే దూకుడుగా పని చేస్తాను’ అని చెరుకు సుధాకర్ చెప్పారు. రాహుల్, రేవంత్ డీఎన్ఏలు మ్యాచ్ కావట్లేదు: మంత్రి హరీశ్‌రావు చెరుకు సుధాకర్ కరుడుగట్టిన ఉద్యమవాది అని, తెలంగాణ ఉద్యమంలో మొదటగా జైలుకెళ్లిన వ్యక్తి ఆయనే అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి ఒకవైపు, తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయని కిషన్‌రెడ్డి మరోవైపు ఉన్నారని పేర్కొన్నారు. కానీ కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపి రాష్ట్రాన్ని సాధించారని చెప్పారు. బీజేపీతో పోరాటం తమ డీఎన్ఏలో ఉందని రాహుల్ గాంధీ అన్నారని, మరి రేవంత్ రెడ్డి డీఎన్ఏలో ఏముందో చెప్పాలన్నారు. రాహుల్, రేవంత్ రెడ్డి డీఎన్ఏలు సరిపోలడం లేదని, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌కు 35–40 స్థానాల్లో పోటీచేసేందుకు అభ్యర్థులు కరువయ్యారని, సోనియమ్మ ను బలి దేవత అన్న రేవంత్ ఇప్పుడు నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. రాహుల్ కుటుంబ పాలన గురించి మాట్లాడటం సిగ్గుచేటని, కాంగ్రెస్‌కు లెహర్ లేదని జహర్ మాత్రమే ఉందన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఎకరాకు 13 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొంటున్నారని, కానీ రాష్ట్రంలో ప్రతి గింజనూ సీఎం కేసీఆర్ కొనుగోలు చేశారని చెప్పారు. పనితనం తప్ప, పగతనం లేని నాయకుడు కేసీఆర్ అని, కేసీఆర్‌కు ఎప్పుడూ పని మీదే ధ్యాస ఉంటుందని హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో కరువు లేదు, కర్ఫ్యూ లేదని, కాంగ్రెస్ అంటే మాటలు, మంటలు, ముఠాలు అని అభివర్ణించారు. -
బీఆర్ఎస్కు ఎమ్మెల్యే బాపూరావు గుడ్‌బై
సాక్షి, హైదరాబాద్, ఆదిలాబాద్: బీఆర్ఎస్కి బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు గుడ్‌బై చెప్పారు. త్వరలో కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. బోథ్ టికెట్ కోసం దరఖాస్తు సమర్పించారు. బీఆర్ఎస్ అధిష్టానం ఈసారి బోథ్ నియోజకవర్గం టికెట్‌ను బాపూరావుకు కాకుండా జెడ్పీటీసీ అనిల్‌జాదవ్‌కు టికెట్ కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో రేవంత్‌ను కలి సిన బాపూరావు పలు అంశాలపై చర్చలు జరిపా రు. బోథ్‌లో తనకు కాంగ్రెస్ టికెట్ ఇస్తే విజయం సాధిస్తానని స్పష్టం చేసినట్టు తెలిసింది. కాంగ్రెస్‌లో ఎప్పుడు చేరుతున్నారని ఎమ్మెల్యే రాథోడ్ బాపూ రావును ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా, త్వరలోనే చేరుతానని తెలిపారు. కాగా, బీఆర్ఎస్, బీజేపీల నుంచి కాంగ్రెస్‌లోకి చేరికల పరంపర కొనసాగు తోంది. జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, ఇతర నేతలు రేవంత్ నివాసంలో కాంగ్రెస్‌లో చేరారు. అలాగే గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డి సమక్షంలో పలు వురు నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కల్వకుర్తి, కొడంగల్ నియోజకవ ర్గాలకు చెందిన మాజీ ఎంపీపీలు రాంరెడ్డి, సాంబయ్య గౌడ్, సర్పంచ్ లక్ష్మణ్ నాయక్, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్‌లో చేరారు. షాద్ నగర్ నియోజకవర్గానికి చెందిన సర్పంచ్‌లు ప్రతాప్, మంజుల, బాల్ రాజు, గోపాల్, రాములు, యాదయ్య, జహంగీర్, కౌన్సిలర్లు, ఇతర నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరారు. -
నేడు కేసీఆర్‌తో పొన్నాల భేటీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య భారత్ రాష్ట్ర సమితిలో చేరేందుకు అంగీకరించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో ఆదివారం ఉదయం జరిగే భేటీ తర్వాత పొన్నాల తన నిర్ణయాన్ని ప్రకటించను న్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పార్టీ నేతలతో కలిసి శనివారం పొన్నాల నివాసానికి వెళ్లారు. పొన్నాల రాజకీయ అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడుతుందని, బీఆర్ఎస్లో సముచిత స్థానం కల్పించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 16న జనగామలో జరిగే బహిరంగ సభ వేదికపైపార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. కేటీఆర్ ఆహ్వానాన్ని స్వాగతిస్తూ సీఎంతో భేటీ తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని పొన్నాల సమాధానం ఇచ్చారు. సీనియర్లను రేవంత్ అవమానించారు: కేటీఆర్ కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించిన సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్యను బీఆర్ఎస్లోకి ఆహ్వానించినట్టు ఆయనతో భేటీ అనంతరం కేటీఆర్ విలేకరులకు తెలిపారు. ఆయన పార్టీలోకి వస్తే కె.కేశవరావు, డి.శ్రీనివాస్ తరహాలో సరైన స్థానం కల్పించి గౌరవిస్తామన్నారు. పీవీ నర్సింహారావు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన పొన్నాల లక్ష్మయ్య వంటి సీనియర్ నాయకులను రేవంత్‌రెడ్డి అవమానించారని విమర్శించారు. ఎన్నో పార్టీలు మారిన రేవంత్‌రెడ్డి.. ఇతరులు తమకు గౌరవం దక్కక పార్టీ బయటకు వెళ్తుంటే తప్పు పడుతు న్నారని విమర్శించారు. చచ్చే ముందు పార్టీ మారటం ఏమిటని కాంగ్రెస్ నేతలు చిల్లరగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టిస్తున్నారు: పొన్నాల రేవంత్‌రెడ్డి తన స్థాయిని మరిచి తాము పార్టీకి, ప్రాంతానికి చేసిన సేవలను కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తూ కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టిస్తున్నారని పొన్నాల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత రేవంత్ ఎమ్మెల్యేగా ఓడి పోయారు. ఆయన ఎంపీగా ప్రాతినిథ్యం వహి స్తున్న మల్కాజిగిరి పరిధిలో గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క కార్పొరేటర్‌ను కూడా గెలవలేదు. 2014, 2018లో పొన్నాల లక్ష్మయ్య ఒక్కడే ఓడిపోయాడా? జానారెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఓడిపోలేదా?..’ అని పొన్నాల ప్రశ్నించారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ నేతలు వాసుదేవరెడ్డి, దాసోజు శ్రవణ్, రాజారాం యాదవ్ తదితరులున్నారు. -
కాంగ్రెస్‌లోకి సోయం బాపూరావు?
సాక్షి, ఆదిలాబాద్: బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే ప్రచారం సాగుతోంది. ఇటీవల ఢిల్లీలో ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో పార్టీ పెద్దల సమక్షంలో స్వయంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నోటి నుంచి సోయం బాపూరావు చేరిక ప్రస్తావన వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సోయం పేరును ప్రకటిస్తారని అంటున్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా భైంసా పర్యటనలో ఉన్న ఆయనను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించింది. రేవంత్ నోటి వెంట మీ పేరు వచ్చిందని సోయంను అడగ్గా.. అభిమానంతో ఆయన చెప్పి ఉండొచ్చని బదులిచ్చారు. కాంగ్రెస్‌లో చేరిక విషయంలో అన్ని ఊహాగానాలేనంటూ కొట్టిపారేశారు. నాలుగు నెలల క్రితం కూడా సోయం కాంగ్రెస్‌లో చేరుతు న్నారని జోరుగా ప్రచారం జరగగా, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన బహిరంగంగా ఖండించారు. తాజాగా మళ్లీ ఈ ప్రచారం జరుగుతుండటం గమనార్హం. బీజేపీ ఎంపీలందరూ వచ్చే శాసనసభ ఎన్నికల బరిలో ఉండాలని అధిష్టానం ఆదేశించినప్పటికీ ఆయన దరఖాస్తు ప్రక్రియకు దూరంగా ఉన్నారు. తనయుడు వెంకటేశ్‌ను బోథ్ నుంచి దరఖాస్తు చేయించారు. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్‌తో సోయంకు సత్సంబంధాలు ఉన్నాయనే ప్రచారం ఉంది. బోథ్ నియోజకవర్గంలో ఆదివాసీ ఓట్లు అధికంగా ఉన్నాయి. దీంతో బలమైన ఆదివాసీ నేత సోయంను ఇక్కడి నుంచి బరిలోకి దించాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన అనిల్ జాదవ్ లంబాడా సామాజిక వర్గానికి చెందినవారు. కాంగ్రెస్, బీజేపీ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ తర్వాత జరుగుతున్న రాజకీయ సమీకరణాలపై అందరి దృష్టి నెలకొంది. -
చంద్రబాబుకు భారీ షాక్
-
సోనియా సమక్షంలో కాంగ్రెస్ లోకి తుమ్మల
-
ఈ నెల 18న కాంగ్రెస్ లో చేరుతున్నాను
-
ఎన్డీయే కూటమిలో చేరిన మరో కీలక పార్టీ..
పాట్నా: 2024 ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. దేశంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇటు ప్రతిపక్ష కూటమి ఏర్పాటు దిశగా పలు ప్రతిపక్ష పార్టీలు సన్నాహాలు చేస్తుండగా.. అటు ఎన్డీయే కూడా తన బలాన్ని పెంచుకునే దిశగా పావులు కదుపుతోంది. ఉత్తరప్రదేశ్‌లో బీసీ సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ ఎన్డీయేలో కలిసిన మరుసటి రోజే బిహార్‌లో మరో పార్టీ బీజేపీతో చేతులు కలిపింది. చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జన్‌శక్తి పార్టీ ఎన్డీయే కూటమిలో చేరింది. బిహార్‌లో చిరాగ్ పాశ్వాన్ లోక్ జన్‌శక్తి పార్టీ ఎన్డీయేలో కలుస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్ స్పష్టం చేశారు. ఈ రోజు కేంద్ర హో మంత్రి అమిత్ షా తో జరిగిన సమావేశం అనంతరం ఆయన వెల్లడించారు. ఎన్డీయే కుటుంబంలో చేరుతున్న చిరాగ్ పాశ్వాన్‌ను బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్వాగతం పలికారు. జులై 18న ఎన్డీయే కూటమి ఢిల్లీలో నిర్వహిస్తున్న సమావేశానికి ముందు చిరాగ్ పాశ్వాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. श्री @iChiragPaswan जी से दिल्ली में भेंट हुई। उन्होंने माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व वाले NDA गठबंधन में शामिल होने का निर्णय लिया है। मैं उनका NDA परिवार में स्वागत करता हूँ। pic.twitter.com/vwU67B6w6H — Jagat Prakash Nadda (@JPNadda) July 17, 2023 లోక్ జన్‌శక్తి పార్టీని బిహార్‌లో రామ్ విలాస్ పాశ్వాన్ స్థాపించారు. ఆయన ఆరు సార్లు లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించారు. అనంతరం బీజేపీ కూటమి తరపున రాజ్య సభకు కూడా ఎన్నికయ్యారు. ఇప్పుడు తండ్రి బాటలోనే చిరాగ్ కూడా బీజేపీ కూటమిలో చేరారు. ఇదీ చదవండి: Rajbhar Joins In NDA: ఎస్పీకి దెబ్బ మీద దెబ్బ.. ఎన్డీయే కూటమిలో చేరిన ఎస్బీస్పీ.. -
ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. 30 సెకన్లలో రూ.5 లక్షల లోన్!
ఇప్పటికే మన దేశంలో చాలా సంస్థలు బ్యాంకులతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుని.. కస్టమర్లకు లోన్స్ ఇస్తున్న సంగతి తెలిసింది. ఇందులో బజాజ్, టాటా క్యాపిటల్ మొదలైన సంస్థలు అతి తక్కువ సమయంలోనే పర్సనల్ లోన్స్ అందిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం 'ఫ్లిప్‌కార్ట్' (Flipkart) ప్రవేశించింది. ఇందులో భాగంగానే యాక్సిస్ బ్యాంకుతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఫ్లిప్‌కార్ట్ కుదుర్చుకున్న ఈ భాగస్వామ్యం వల్ల సుమారు 450 మిలియన్ కస్టమర్లు అదనపు సౌలభ్యం పొందే అవకాశం ఉంది. కేవలం 30 సెకన్లలోపు రూ. 5 లక్షల పర్సనల్ లోన్ పొందవచ్చని చెబుతున్నారు. లోన్ తిరిగి చెల్లించడానికి కాల వ్యవధి 6 నుంచి 36 నెలల వరకు ఉంటుంది. కావున ఇది తప్పకుండా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాము. ప్రముఖ బ్యాంకుల సహకారంతో ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే 'బై నౌ పే లేటర్' (BNPL), ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్లు (EMI) అండ్ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు వంటివి అందిస్తున్నట్లు సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధీరజ్ అనెజా వెల్లడించారు. కాగా ఇప్పుడు తాజాగా యాక్సిస్ బ్యాంక్ సహకారంతో పర్సనల్ లోన్ విభాగంలో కూడా అడుగుపెట్టడం చాలా సంతోషముగా ఉందన్నారు. (ఇదీ చదవండి: అగ్ర రాజ్యంలో వైన్ బిజినెస్ - కోట్లు సంపాదిస్తున్న భారతీయ మహిళ) ఫ్లిప్‌కార్ట్ ద్వారా పర్సనల్ లోన్ తీసుకోవాలనుకునే వారు పాన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వంటి ప్రాథమిక వివరాలను అందించాల్సి ఉంటుంది. ఈ వివరాలు అందించిన తరువాత యాక్సిస్ బ్యాంక్ మీకు ఎంత లోన్ అందించాలి, ఎంత లోన్ తీసుకోవడానికి అర్హులు అని నిర్ధారిస్తుంది. ఆ తరువాత మీరు తిరిగి చెల్లించే అర్హతను బట్టి లోన్ మొత్తంతో పాటు.. రీపేమెంట్ పద్దతిని కూడా ఎంచుకోవచ్చు. ఇలాంటి సౌలభ్యం కేవలం ఫ్లిప్‌కార్ట్ మాత్రమే కాకుండా ఇతర సంస్థలు కూడా కోకొల్లలుగా అందిస్తున్నాయి. పర్సనల్ లోన్ కావాలనుకునే వారు వాటిని గురించి కూడా ఆరా తీయవచ్చు. -
త్వరలో కాంగ్రెస్ గూటికి జూపల్లి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి
-
రెజ్లర్లకు అండగా రైతు సంఘాలు.. భారీగా పోలీసులు మోహరింపు
ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద గత పది రోజులుగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు అనూహ్యంగా రైతు సంఘాల మద్దతు లభించింది. ఈ మేరకు రెజ్లర్లకు మద్దతుగా పెద్ద సంఖ్యలో రైతులు తరలివస్తారని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. దీంతో ఆదివారం దేశ రాజధానిలో వేలాదిమంది రైతులు ఆ రెజ్లర్ల నిరసనకు సంఘీభాం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీలోకి ప్రవేశించేందుకు యత్నిస్తున్న రైతుల బృందాన్ని టిక్రి సరిహద్దుల వద్దే ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. జంతర్ మంతర్ వద్ద భారీగా పోలీసులు మోహరించడమే గాక భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతేగాదు ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా తనిఖీలు, పెట్రోలింగ్‌ను పెంచారు. అలాగే చట్టాలను ఉల్లంఘించిన వారిని అదుపులోకి తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఢిల్లీని కలిపే హర్యానా, పంజాబ్, హిమాచల్, జమ్మూ కాశ్మీర్లను కలిపే 44వ నెంబరు జాతీయ రహదారి చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆయా ప్రదేశాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అల్లర్లు చెలరేగకుండా భారీగా బలగాలు మోహరించారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉండగా భారత రెజ్లర్లు తమకు న్యాయం జరిగేంత వరకు వెనుదిరిగేదే లేదని తెగేసి చెప్పారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌ను డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌గా తొలగించి కటకటాల వెనక్కినెట్టే వరకు వదిలేది లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వారికి భారీగా రైతు సంఘాల నుంచి ఊహించని రీతీలో మద్దతు లభించింది. కాగా, వారంతా కేంద్రం రద్దు చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు జరిగిన ఆందోళనకు నాయకత్వం వహించిన రైతు సంఘాలు కావడం గమనార్హం. VIDEO | A group of farmers trying to enter Delhi to join wrestlers' protest at Jantar Mantar stopped by police at Tikri Border. pic.twitter.com/3L8WyKWgQu — Press Trust of India (@PTI_News) May 7, 2023 (చదవండి: పెళ్లి పూర్తయ్యే టైంలో సినిమాని తలపించే సీన్..అర్థాంతరంగా పెళ్లిని ఆపేసిన వరుడు) -
ఆపరేషన్ ఆకర్షకు స్పీడు పెంచిన తెలంగాణ బీజేపీ
-
పార్టీ మారనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి
-
చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ..వైఎస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ నేతలు
-
కుప్పంలో వైఎస్సార్సీపీలోకి టీడీపీ కుటుంబాలు
చిత్తూరు: కుప్పం నియోజకవర్గం, రామకుప్పం మండలంలోని బల్ల పంచాయతీకి చెందిన 15 టీడీపీ కుటుంబాలు ఆదివారం స్థానిక సర్పంచ్ విజయ్ థామస్, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ విజలాపురం బాబురెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త, చిత్తూరు ఎమ్మెల్సీ భరత్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ భరత్ వారికి వైఎస్సార్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం.. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన వారు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ గెలుపునకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కుప్పం ఏఎంసీ చైర్మన్ విద్యాసాగర్, రెస్కో డైరెక్టర్ థామస్, మైనారిటీ నేతలు అల్లాభక్షు, షేక్ అహ్మద్, మాజీ సర్పంచ్ గోవిందప్ప తదితరులు పాల్గొన్నారు. చదవండి: పేదల కల నెరవేరుస్తున్న సీఎం జగన్ -
ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్.. కీలక ఎన్నికకు ముందు బీజేపీలో చేరిన కౌన్సిలర్..
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ తగిలింది. ఢిల్లీ బవానా వార్డు కౌన్సిలర్ పవన్ సెహ్రావత్ శుక్రవారం బీజేపీలో చేరారు. కమలం పార్టీ కార్యాలయంలో ఆయన ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. బీజేపీ ఢిల్లీ వర్కింగ్ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్వేదా, ప్రధాన కార్యదర్శి హర్ష్ మల్హోత్రా పవన్‌కు ఘన స్వాగతం పలికారు. అయితే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు ముందే ఆప్ కౌన్సిలర్ పార్టీని వీడటం గమనార్హం. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని, ఇది తనకు చాలా ఇబ్బందికరంగా ఉందని పవన్ ఆరోపించారు. ఢిల్లీ మేయర్ ఎన్నిక సందర్భంగా సభలో రచ్చ చేయాలని తనకు పార్టీ సూచించిందని పేర్కొన్నారు. ఇవన్నీ నచ్చకే తాను ఆప్‌ను వీడుతున్నట్లు చెప్పారు. Delhi | Aam Aadmi Party's Bawana councillor, Pawan Sehrawat, joins BJP pic.twitter.com/IYUFhxkEzV — ANI (@ANI) February 24, 2023 స్టాండింగ్ కమిటీ ఎన్నిక.. ఆరుగురు సభ్యులుండే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలను మేయర్ షెల్లీ ఒబెరాయ్ గురువారం నిర్వహించారు. అయితే ఓటింగ్‌కు మొబెైల్ ఫోన్లను అనుమతించడాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. కమలం, ఆప్ పార్టీ కౌన్సిలర్లు బాహాబాహీకి దిగారు. దీంతో 47 మంది ఓటు వేసిన అనంతరం ఓటింగ్‌ను అర్థాంతరంగా నిలివేశారు మేయర్. శుక్రవారం మళ్లీ ఈ ఎన్నిక నిర్వహించనున్నారు. పలుమార్ల వాయిదా అనంతరం బుధవారం జరిగిన మేయర్ ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నిక రోజు కూడా సభలో బీజేపీ, ఆప్ కౌన్సిలర్లు రచ్చ రచ్చ చేశారు. ఒకరిపై ఒకరు వాటర్ బాటిళ్లు విసురుకున్నారు. చదవండి: పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్ల జైలు శిక్ష.. రూ. కోటి జరిమానా! -
కెఎస్ఆర్ లైవ్ షో : వలసలపై కేసీఆర్ రివర్స్ అటాక్
-
వైఎస్సార్ సీపీలోకి పలువురు టీడీపీ నాయకులు
ఒంగోలు సబర్బన్/ఒంగోలు: టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి వలసలు జోరందుకున్నాయి. ఒంగోలు నగరంలోని మూడో డివిజన్ నుంచి టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో శనివారం వైఎస్సార్ సీపీలో చేరారు. నగరంలోని 49వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి టీడీపీ నాయకులకు వైఎస్సార్ సీపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. చదవండి: ఇది టీడీపీ, జనసేనకు జీర్ణించుకోలేని అంశమే టీడీపీ బూత్ కమిటీ కన్వీనర్, ఒంగోలు నగర కార్యనిర్వాహక కార్యదర్శి రేల రాజేంద్ర, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్ ఆధ్వర్యంలో మరికొంతమంది వైఎస్సార్ సీపీలో చేరారు. వీరితో పాటు 3వ డివిజన్ టీడీపీ ప్రధాన కార్యదర్శి కాకర్లమూడి ఎలియాజర్, ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్ రంజిత్ కుమార్ కూడా బాలినేని సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా రేవల రాజేంద్ర మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంక్షేమంపై చూపుతున్న శ్రద్ధ ప్రతి ఒక్కరినీ వైఎస్సార్ సీపీవైపు ఆకర్షితులను చేస్తోందని తెలిపారు. ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డిపై అభిమానంతో ఆయనతో కలిసి పయనిద్దామనే ఆలోచనతో పార్టీలో చేరామన్నారు. అనంతరం వైఎస్సార్ సీపీ యువ నాయకుడు బాలినేని ప్రణీత్‌రెడ్డిని బాలినేని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో గుండు మధు, పార్టీ నాయకులు ఎందేటి రంగారావు, మహబూబ్‌బాషా, షేక్ హబీబ్, మురళి, తదితరులు పాల్గొన్నారు. -
మాస్టర్ ప్లాన్‌తో ముందుకెళ్తున్న కేజ్రీవాల్.. కాంగ్రెస్‌కు షాక్
గాంధీనగర్: ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పంజాబ్‌లో సీఎం భగవంత్ మాన్ నేతృత్వంలో ఆమ్ సర్కార్ పాలన సాగిస్తోంది. కాగా, ఈ ఏడాది చివరలో జరగబోయే గుజరాత్ ఎన్నికలపై ఆప్ దృష్టి సారించింది. అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేజ్రీవాల్, భగవంత్ మాన్ ఇప్పటికే అహ్మదాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించి తమ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని గుజరాతీలకు కోరారు. ఇదిలా ఉండగా.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఇంద్రనీల్ రాజ్‌గురు గురువారం ఆప్ తీర్థం పుచ్చుకున్నారు. కేజ్రీవాల్‌ను కలిసి అనంతరం ఆయన ఆప్‌లో చేరారు. ఈ సందర్భంగా ఇంద్రనీల్ మాట్లాడుతూ.. ప్రజల అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ అని ప్రశంసించారు. దేశ ప్రజలను మభ్యపెడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. అలాగే, బీజేపీకి పోటీగా ఎదగడంతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని విమర్శలు గుప్పించారు. గుజరాత్లో బీజేపీని ఓడించేందుకు, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆప్ సరైన పార్టీ అని అన్నారు. అందుకే తాను ఆప్‌లో చేరినట్టు స్పష్టం చేశారు. కాగా, 2012లో రాజ్‌కోట్ ఈస్ట్ నుంచి ఇంద్రనీల్ రాజ్‌గురు.. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2017లో రాజ్‌కోట్ వెస్ట్ నుంచి సీఎం విజయ్ రూపానీపై పోటీ చేసి ఆయన ఓటమిని చవిచూశారు. ఇక, సీనియర్ నేత ఇంద్రనీల్.. ఆప్‌లో చేరడంతో పార్టీకి మరింత బలం చేకూరిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. इंद्रनिल राजगुरु जी एवं वसरामभाई सागठिया जी का मैं आम आदमी पार्टी में स्वागत करता हूँ। हम सबको मिलकर गुजरात के लोगों की हर उम्मीद को पूरा करना है। pic.twitter.com/JX8TNTfEjF — Arvind Kejriwal (@ArvindKejriwal) April 14, 2022 -
అమ్మాయిల ఐఐఠీవి
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో విద్యార్థినుల చేరికలు పెద్ద ఎత్తున పెరిగాయి. 2014–15లో దేశవ్యాప్తంగా ఐఐటీల్లో విద్యార్థినుల సంఖ్య 9,450 మాత్రమే కాగా 2020–21 నాటికి 20,228కి చేరుకుంది. దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమెటిక్స్ (స్టెమ్) విభాగాలలో యువతుల భాగస్వామ్యం 2017 నాటికి 14 శాతం ఉందని.. దీన్ని మరింత పెంచాలన్న నిపుణుల సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో విద్యార్థినుల చేరికలు పెరిగాయి. 2018 నుంచి అదనపు కోటా ఈ నేపథ్యంలో కమిటీ సిఫార్సుల మేరకు 2018–19లో కేంద్ర ప్రభుత్వం ఐఐటీల్లో విద్యార్థినులకు 14 శాతం మేర ప్రత్యేక కోటా సీట్లను అందుబాటులోకి తెచ్చింది. ఇతర వర్గాల కేటాయింపులకు భంగం కలగ కుండా సూపర్ న్యూమరరీ కోటా కింద అదనంగా ఆ సీట్లను సిద్ధం చేసింది. అదనపు సీట్లను 2019–20లో 17 శాతానికి, 2020–21లో 20 శాతానికి పెంచింది. ఫలితంగా దేశవ్యాప్తంగా ఐఐటీల్లో అమ్మాయిల చేరికలు గతంలో కన్నా రెట్టింపు అయ్యాయి. గతంలో ఐఐటీల్లో 9,450 మాత్రమే ఉన్న విద్యార్థినుల సంఖ్య 2019–20 నాటికి 18,456కి పెరిగింది. 2020–21లో ఇది మరింత పెరిగి 20,228 మంది చేరడం గమనార్హం. ప్రత్యేక కోటా వల్ల ఐఐటీల్లో యువతుల చేరికలు 2018 నాటికి 18 శాతానికి పెరిగినట్లు వెల్లడైంది. ఐఐటీల్లో ఈ అదనపు కోటాను 8 ఏళ్ల పాటు కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. ఇంటర్లో రాణిస్తున్నా.. మండి ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ తిమోతి ఎ.గోన్సాల్వేస్ నేతృత్వంలో అధ్యయనం నిర్వహించిన ప్రత్యేక కమిటీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధిస్తున్న బాలికల శాతం 11 నుంచి 12.5 శాతం మాత్రమే ఉందని పేర్కొంది. ఐఐటీ పరీక్షకు ప్రత్యేక తర్ఫీదు వారికి అందుబాటులో ఉండటం లేదని తెలిపింది. ఇంటర్లో విద్యార్థినులు మంచి ఫలితాలను సాధిస్తున్నా జేఈఈ, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో వెనుకంజ వేయటానికి కారణాలను కమిటీ లోతుగా విశ్లేషించింది. -
యూపీ కాంగ్రెస్ లీడర్లు.. టీఎంసీలోకి
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్‌ను పక్క రాష్ట్రాల్లోకి విస్తరించాలని చూస్తున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన కార్యాచరణను ముమ్మరం చేశారు. ప్రధానంగా యూపీలో పాగా వేయాలని చూస్తున్న టీఎంసీలోకి తాజాగా ఇద్దరు కాంగ్రెస్ సీనియర్ లీడర్లు జాయిన్ అయ్యారు. యూపీకి చెందిన సోమవారం మమతా బెనర్జీ ఆధ్వర్యంలో టీఎంసీలోకి చేరారు. వీరిలో రాజేష్‌పతి త్రిపాఠి, లలితేష్పతి త్రిపాఠిలు ఉన్నారు. యూపీ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీగా రాజేష్‌పతి త్రిపాఠి పనిచేయగా, లలితేష్పతి త్రిపాఠి యూపీ కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడిగాను, మాజీ శాసన సభ్యుడిగాను పనిచేశారు.ఈ సందర్భంగా టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. టీఎంసీ పట్ల ప్రజలలో విశ్వసనీయత పెరిగిందని అన్నారు. టీఎంసీ విధానాల పట్ల ఆకర్శించబడి.. ఇతర పార్టీల నాయకులు తమ పార్టీలో చేరటానికి మక్కువ చూపిస్తున్నారని అన్నారు. ఇక టీఎంసీ తీర్థం పుచ్చుకున్న వారిద్దరూ మాట్లాడుతూ.. బీజేపీని అధికారంలోంచి దింపడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. దీనిలో భాగంగానే టీఎంసీలో చేరినట్లు తెలిపారు. చదవండి: రాయలసీమకు చంద్రబాబు చేసిందేమిటి? : మంత్రి అనిల్ -
నేడు బీఎస్పీలో చేరనున్న ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
నల్లగొండ: బహుజన సమాజ్‌పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నల్లగొండలో బహిరంగ సభ జరగనుంది. అందుకు జిల్లా పార్టీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర ప్రాంతాలనుంచి బహుజన సమాజ్‌పార్టీ కార్యకర్తలు, స్వేరోలు, ప్రవీణ్‌కుమార్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం ఉంది. నల్లగొండలోని ఎన్జీ కాలేజీ మైదానంలో సాయంత్రం 4గంటలకు సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. సభాస్థలిలో కూడా ప్రవీణ్‌కుమార్, ముఖ్య అతిథులతో కూడిన ఫొటోలతో భారీ కట్అవుట్లను ఏర్పాటు చేస్తున్నారు. రాజకీయ పార్టీలకు భిన్నంగా కార్యకర్తలు కూర్చునే విధంగా కుర్చీలను ఏర్పాటు చేస్తున్నారు. బహుజన సమాజ్‌పార్టీ జిల్లా ఇన్చార్జ్, ఆర్ఎస్పీ రాజకీయ సంకల్ప సభకు కన్వీనర్ పూదరి సైదులు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభకు ముఖ్య అతిథిగా బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు రాంజీగౌతమ్ హాజరవుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర , తెలంగాణ జిల్లాల ఇన్‌చార్జ్‌లు, జిల్లాకు చెందిన బీఎస్పీ నేతలు కూడా హాజరుకానున్నారు. బీఎస్పీలో చేరనున్న ప్రవీణ్‌కుమార్... నల్లగొండలో జరిగే బహిరంగ సభలో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ బీఎస్పీలో అధికారికంగా చేరుతున్నారు. ప్రస్తుతం ఆయన గురుకుల కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సొంతంగా పార్టీ పెడతరా లేదా ఇతర అధికార పార్టీలో చేరుతారన్న వదంతులు వచ్చాయి. కానీ, ఆయన బీఎస్పీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగానే ఆదివారం నల్లగొండలో జరిగే బహిరంగ సభలో బీఎస్పీలో చేరి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించనున్నారు. 4 గంటలకు బహిరంగ సభ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం 4గంటలకు ఎన్‌జీకళాశాల మైదానంలో బహిరంగ సభ జరుగునుంది. పోలీసులు కూడా సభాస్థలితో పాటు పార్కింగ్ తదితర వాటిని ఏర్పాట్లు చేశారు. అయితే బహిరంగ సభ రోజు ఉదయం డాన్‌బోస్కో నుంచి నల్లగొండ టౌన్లోకి 1000 మందితో ఫిట్ ఇండియా 5కే రన్ నిర్వహించనున్నారు. ఇదంతా స్వేరోల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం మర్నిగూడ బైపాస్ నుంచి ర్యాలీ మధ్యాహ్నం 2:30 గంటలకు నల్లగొండ పట్టణ సమీపంలోని అద్దెంకి బైపాస్ వద్ద ముఖ్య అతిథులకు కార్యకర్తలంతా స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి డప్పు కళాకారులు , కోలాట కళాకారులతో ర్యాలీ ప్రారంభం కానుంది. రెండు గంటలపాటు ర్యాలీ నిర్వహించనున్నారు. తర్వాత 4గంటలకు ఎన్జీ కాలేజీ సభ స్థలి చేరుకుంటారు. కార్యకర్తలు స్వచ్ఛందంగా.. బహిరంగ సభకు ఎలాంటి వాహనాలు ఏర్పాటు చేయడం లేదు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అభిమానులు, స్వేరో కార్యకర్తలంతా స్వచ్ఛందంగానే సభకు హాజరవుతారని జిల్లా ఇన్చార్జి సైదులు తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ సభను నిర్వహించబోతున్నాం. శానిటైజర్ , మాస్కులు తప్పనిసరి , సమావేశం పూర్తయిన తర్వాత కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా సభ జరగనుంది. -
టీఆర్ఎస్లో చేరిన ఎల్. రమణ
సాక్షి, హైదరాబాద్: టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్. రమణ టీఆర్ఎస్లోకి చేరారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం అందజేశారు. కాగా, టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ పార్టీకి గుడ్‌బై చెప్తూ టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు తన రాజీనామా లేఖను జూలై 9 న శుక్రవారం మీడియాకు విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువగా రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే భావనతో టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నానని లేఖలో పేర్కొన్నారు. -
తెలంగాణ: టీడీపీకి భారీ షాక్
-
కారెక్కనున్న రమణ?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోనుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం. తెలంగాణ తెలుగుదేశం శాసనసభాపక్షం(టీడీఎల్పీ) ఇటీవలే అధికార టీఆర్ఎస్ పక్షంలో విలీనం కాగా, ఎల్.రమణ కూడా గుడ్‌బై చెబితే రాష్ట్రంలో టీడీపీ పూర్తిగా కనుమరుగైనట్టేనని చెప్పవచ్చు. టీఆర్ఎస్లో చేరికకు సంబంధించి పార్టీ నేతలు కొందరు రమణతో కొంతకాలంగా మంతనాలు సాగిస్తున్నారు. అయితే, తాజాగా ఈ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. దీనిపై రెండు మూడురోజుల్లోనే పూర్తి స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అధినేత కేసీఆర్ పచ్చజెండా టీఆర్ఎస్లో రమణ చేరికకు సంబంధించి గతంలో తెలుగుదేశం పార్టీలో కీలకనేతగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌రావు మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. పార్టీలోకి రావాల్సిందిగా ఎల్.రమణకు గతంలోనూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ నుంచి ప్రతిపాదన వెళ్లింది. అయితే తాజాగా మరోసారి రమణను టీఆర్ఎస్ గూటికి చేర్చే బాధ్యతను ఎర్రబెల్లి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావుతో రమణ మాట్లాడినట్లు తెలిసింది. దీంతో పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు త్వరలో జరిగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనకు రమణ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం పొరుగు రాష్ట్రంలో ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌రావు రెండు మూడురోజుల్లో హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత రమణ చేరిక ప్రక్రియ ఊపందుకోనుంది. రమణ చేరికకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కూడా పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. కలిసిరానున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఎమ్మెల్యే కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఈ నెల 3న ఖాళీ అయినా.. కరోనా పరిస్థితుల్లో ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఖాళీ అయ్యే స్థానాల్లో పద్మశాలి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పిస్తామని గతంలో కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ సామాజికవర్గం నుంచి ఎమ్మెల్సీ పదవిని ఆశించిన మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ ఇటీవల తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా నియమి తులయ్యారు. మరో నేత, మాజీ ఎంపీ గుండు సుధారాణి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఇదే సామాజికవర్గానికి చెందిన ఎల్.రమణను పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్సీ పదవిని అప్పగిస్తే బహుళ ప్రయోజనాలు ఉంటాయని టీఆర్ఎస్ భావిస్తున్నట్లు సమాచారం. చదవండి: ఊపిరి ఉన్నంతవరకూ కేసీఆర్ వెంటే.. -
వైఎస్సార్సీపీలో భారీ చేరికలు
రాజాం/రణస్థలం: స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సార్సీపీలోకి చేరికలు జోరందుకున్నాయి. ముఖ్యంగా టీడీపీ నుంచి నాయకులు, కార్యకర్తలు వెల్లువలా వస్తున్నారు. సంతకవిటి మండలం గుళ్ళసీతారాంపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రావు రవీంద్రతోపాటు మరో 300 కుటుంబాలు ఆదివారం పార్టీలో చేరాయి. రాజాంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కంబాల జోగులు కండువా కప్పి వీరిని పార్టీలోకి ఆహ్వానించారు.. ఇంకా పైడిభీమవరం పంచాయతీలోని వరిశాం గ్రామంలో మాజీ సర్పంచ్ లంకలపల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో ముక్కుపాలవలస, దేవునిపాలవలస, పైడిభీమవరం, వరిశాం గ్రామాలకు చెందిన 150 టీడీపీ కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. టీడీపీ నాయకుడు చుక్క అచ్చిరెడ్డితోపాటు 10 కుటుంబాలు, టీడీపీ ఎంపీటీసీ మాజీ సభ్యుడు మైలపల్లి వెంకటేష్‌తోపాటు అల్లివలస గ్రామానికి చెందిన 125 మంది మొత్తం 285 టీడీపీ కుటుంబాలకు ఎమ్మెల్యే కిరణ్‌కుమార్ పార్టీ కండువా వేసి సాదరంగా వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు. -
పిఠాపురంలో వైఎస్ఆర్సీపీలోకి చేరికలు
-
జంగారెడ్డిగూడెంలో టీడీపీకి షాక్!
సాక్షి, జంగారెడ్డిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం లో టీడీపీకి షాక్ తగిలింది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి మూడు వందల మంది కార్యకర్తలు గురువారం వైఎస్సార్ సీపీలోకి చేరారు. చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు వందనపు సాయి బాలపద్మ, పొల్నాటి బాబ్జి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎలీజా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలకు ఆకర్షితులై వందలాదిగా వైఎస్సార్సీపీలోకి చేరుతున్నారని తెలిపారు. ఆరు నెలల కాలంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్ పాలన చేశారని పేర్కొన్నారు. ఎంతో మంది నాయకులు అవకాశాలు ఉంటేనే సేవ చేస్తారని.. కానీ సీఎం జగన్ అవకాశం కల్పించుకుని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపటినప్పటి నుండి రోజుకోక పథకం ప్రవేశపెడుతున్నారన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసోపేత నిర్ణయాలు తీసుకుని చరిత్ర సృష్టిస్తున్నారన్నారు. మహిళల కోసం మద్యపాన నిషేధం తో పాటు, బీసీ మహిళలకు చేయూతనిచ్చే పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. జంగారెడ్డిగూడెం ను గ్రీన్ సిటిగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం వంద పడకల ప్రభుత్వాసుపత్రి ఆధునీకరణ కోసం తొమ్మిది కోట్ల రూపాయలు విడుదల చేశామని వెల్లడించారు. ఆరు కోట్ల రూపాయలతో డ్రైయిన్ల నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే ఎలీజా పేర్కొన్నారు. -
నాలుగో సింహం అవుతా..!
సాక్షి, హైదరాబాద్: పెద్దయ్యాక ఏమవుతారు..? విద్యార్థులను ఈ ప్రశ్న అడిగితే ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెబుతారు. అయితే చాలా మంది విద్యార్థులు మాత్రం పోలీస్ అవుతామని చెబుతున్నారు. ఇందుకోసం చిన్నప్పటి నుంచే కృషి చేస్తామని కూడా అంటున్నారు. రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులపై ఇటీవల జరిపిన సర్వేలో పలు అంశాలు వెల్లడయ్యాయి. వీరిలో దాదాపు 27 శాతం మంది బాలురు, 12 శాతం మంది బాలికలు పోలీస్ శాఖపై తమ ఆసక్తిని వెలిబుచ్చారు. 20 శాతం మంది బాలికలు అగ్రికల్చరర్, ఫుడ్ సంబంధిత రంగాల్లో భవిష్యత్తు కోరుకుంటున్నారు. విద్యార్ధి దశ నుంచే భవిష్యత్తుపై అవగాహన ఏర్పరచడంతో పాటు భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకుని అందుకు అనుగుణంగా పాఠశాల విద్య స్థాయి నుంచే కృషి చేసేలా విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ (సైకోమెట్రిక్ టెస్టు) రూపొందించారు. దాన్ని మై చాయిస్ మై ఫ్యూచర్ పేరుతో రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో అమల్లోకి తెచ్చి విద్యార్థుల అభిరుచులు, ఆసక్తులను తెలుసుకుంది. సర్వేలో వెల్లడైన అంశాలను క్రోఢీకరించి రూపొందించిన నివేదికను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. విద్యార్థుల వ్యక్తిత్వంపై నాలుగు కేటగిరీలు, కెరీర్ సంబంధ అంశాల్లో 8 కేటగిరీల్లో మొత్తం 72 ప్రశ్నలతో ఈ సర్వే సాగింది. 27 జిల్లాల్లో 194 మోడల్ స్కూళ్లలోని 18 వేల మంది విద్యార్థులు, 200 మంది టీచర్లతో ఈ సర్వే నిర్వహించారు. సర్వేలో వెల్లడైన ప్రధాన అంశాలు ఇవే.. విద్యార్థుల్లో ఎక్కువ మంది 7 రంగాలపైనే ఎక్కువ దృష్టిసారిస్తున్నట్లు సర్వేలో తేలింది. పోలీస్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మెడిసిన్ అండ్ హెల్త్‌కేర్, స్పోర్ట్స్, డిఫెన్స్, గవర్నమెంట్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రంగాలపైనే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. సర్వేలో పాల్గొన్న విద్యార్థుల్లో బాలికలు ఎక్కువ మంది అగ్రికల్చర్ అండ్ ఫుడ్, హ్యూమన్ సర్వీసెస్, ఎంటర్టైన్మెంట్, హాస్పిటాలిటీ, టూరిజం, ఎడ్యుకేషన్, ట్రైనింగ్ రంగాలపై ఆసక్తి కనబరిచారు. బాలురలో పోలీసు, హ్యూమన్ సర్వీస్, ఎంటర్టైన్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, హాస్పిటాలిటీ, టూరిజం రంగాలపై ఆసక్తి ప్రదర్శించారు. -
వైఎస్సార్సీపీలో చేరిన సన్యాసిపాత్రుడు
-
కాషాయం గూటికి వీరేందర్!
సాక్షి, రంగారెడ్డి: టీడీపీ నేత, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు తూళ్ల వీరేందర్‌గౌడ్ బీజేపీ గూటికి చేరడం ఖాయమైంది. ఈనెల 3న భారతీయ జనతా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో కాషాయం కండువా కప్పుకునేందుకు ముహూర్తం దాదాపుగా ఖరారైంది. టీడీపీకి, ఆ పార్టీ పదవులకు వీరేందర్ సోమవారం రాజీనామా చేశారు. ఈమేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి రాజీనామా లేఖను పంపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన తండ్రి టీడీపీ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి దేవేందర్ గౌడ్ కూడా బీజేపీలోకి వెళ్తారని మొదట ప్రచారం జరిగినా వివిధ కారణాలతో ఆ ఆలోచన విరమించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరేందర్‌గౌడ్ ఒక్కరే టీడీపికి గుడ్ బై చెప్పడంతో కాషాయదళంలో చేరికపై స్పష్టత వచ్చింది. అంతేకాకుండా దేవేందర్ పెద్ద కుమారుడు, దేవేందర్ ఫౌండేషన్ ట్రస్టీ విజయేందర్ కూడా అదే రోజు కాషాయ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. బీజేవైఎం రాష్ట్ర బాధ్యతలు! 2014 ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలైన వీరేందర్.. గతేడాది డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఉప్పల్ సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగినా విజయతీరాలకు చేరుకోలేదు. ఆయన అప్పటి నుంచే పార్టీని వీడుతారనే సంకేతాలు వెలువడ్డాయి. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను తన తండ్రితోపాటు ఢిల్లీలో కలిసినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ పెద్దలతో చర్చలు జరిగినట్టు సమాచారం. పార్టీలో తగిన ప్రాధాన్యత కల్పిస్తామనే హామీ తాజాగా ఇవ్వడంతో టీడీపీకి రాజీనామా చేసినట్లు వివిధ పార్టీల నేతలు మాట్లాడుకుంటున్నారు. ఆయనకు బీజేవైఎం రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తామన్న భరోసా లభించినట్లు తెలిసింది. దీనికితోడు వచ్చే ఎన్నికల్లో నగర శివారులోని అసెంబ్లీ నియోజవకవర్గం నుంచి అవకాశం కల్పించేందుకు సానుకూలత వ్యక్తం చేసినట్లు అభిగ్న వర్గాల సమాచారం. తనతోపాటు టీడీపీ కార్యకర్తలు, అభిమానులను కూడా ఆ పార్టీలోకి తీసుకెళ్లేందుకు అడుగులు వేస్తున్నారు. నేడు, రేపు వారితో ప్రత్యేకంగా భేటీ అయి చర్చించనున్నారు. సోదరుడికి మహేశ్వరంపై హామీ? తన తండ్రి పేరిట స్థాపించిన ఫౌండేషన్ ద్వారా విస్తృతంగా సేవా కార్యక్రమాలు దేవేందర్‌గౌడ్ టీడీపీలోనే కొనసాగే అవకా శాలు కనిపిస్తున్నాయి. వయసు పైబడటం, అదేవిధంగా అనారోగ్యం తోడు కావ డంతో క్రియాశీల రాజకీయాలు నెరిపే పరిస్థితి కనిపించడం లేదు. పైగా 2008లో టీడీపీని వీడిన ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు లక్ష్యంతో నవ తెలంగాణ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఈ పార్టీని.. సినీనటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేశారు. వివిధ కారణాలతో ఆ పార్టీకి కూడా గుడ్‌బై చెప్పి 2012లో తిరిగి తన మాతృపార్టీ అయిన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ వెంటనే రాజ్యసభ సభ్యుడిగా నియమితులైన ఆయన 2018 ఏప్రిల్ వరకు ఆ పదవిలో కొనసాగారు. ఈ పరిణామాలకు తోడు ఆరోగ్యం సహకరించకపోవడంతో మరో సారి పార్టీ మారడం వృథా అని దేవేందర్ భావించినట్లు తెలుస్తోంది. దేవేందర్ పెద్ద కుమారుడు విజయేందర్ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే తన సోదరుడు వీరేందర్తో కలిసి ఆయన కాషాయ కండువా కప్పుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మహేశ్వరం అసెంబ్లీ టికెట్‌పై దృష్టిసారించినట్లు చర్చ జరుగుతోంది. దీంతో ఆ మేరకు పార్టీ అధిష్టానం నుంచి హామీ లభించిడంతో కాశాయం కండువా కప్పుకోనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. -
నేటి నుంచి పరిచయం
అరసవల్లి: అవినీతి, అక్రమాలు లేకుండా పారదర్శక పాలన అందించాలనే ధ్యేయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో గురువారం నుంచి గ్రామ వలంటీర్ల వ్యవస్థ అమల్లోకి వచ్చింది. దీంతో గ్రామీణ పాలనలో వలంటీర్లు కీలక పాత్ర పోషించనున్నారు. నేరుగా లబ్ధిదారు ని ఇంటి ముంగిటకే ప్రభుత్వ పథకాలను చేర్చే విధంగా వలంటీర్లు పనిచేయనున్నా రు. ఈ మేరకు గురువారం నుంచి వలం టీర్లు విధుల్లోకి చేరారు. జిల్లాలో మొత్తం 38 మండలాల్లో 1141 పంచాయతీల్లో 13427 మంది గ్రామవలంటీర్లు నియమితులైతే.. ఓ 15 మందిS మాత్రమే శిక్షణలకు హాజరుకాకపోవడంతో నియామక పత్రాలను అధికారులు ఇవ్వలేదు. దీంతో 13,412 మంది వరకు వలంటీర్లు గురువారం నాటి విధుల్లోకి వచ్చారు. దాదాపుగా అన్ని మండలాల నుంచి ఈమేరకు వలంటీర్లు చేరికపై జెడ్పీ అధికారులు ఎప్పటికప్పుడు వివరాలను తెప్పించుకున్నారు. జెడ్పీ సీఈఓ బి.చక్రధరరావు, డిప్యూటీ సీఈవో ప్రభావతి తదితరుల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతుం ది. వలంటీర్లకు ప్రత్యేకంగా విధి విధానాలతో పాటు ప్రతి నెలా చేపట్టాల్సిన ముఖ్య విధులను షెడ్యూల్‌గా ప్రకటించింది. ఈ మేరకు ఉన్నతాధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు. వలంటీర్ల విధుల షెడ్యూల్ ఇదే.. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయిలో నిజమైన అర్హులకు నేరుగా డోర్ డెలివరీ చేయడానికి గ్రామ వలంటీర్ల వ్యవస్థను గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు ప్రారంభిం చారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలకు తావి వ్వకుండా పాలన సాగాలన్న ఏకైక లక్ష్యంతో ప్రారంభమైన గ్రామ వలంటీర్లుకు ప్రత్యేక విధి విధానాలను కూడా రాష్ట్ర సర్కార్ స్పష్టం చేసింది. ఈ క్రమంలో విధులను కూడా ప్రతి నెలా క్రమం తప్పకుండా వలంటీర్లు అంతా ఆచరణలో పెట్టాల్సి ఉంటుంది. విధి నిర్వహణలో ఎక్కడైనా నిర్లక్ష్యం కన్పించినా వారిని తొలిగించి, ఆ స్థానంలో కొత్త వలంటీర్లను నియమించుకునే అధికారం ఎంపిడివో, జెడ్పీ సీఈఓ, జిల్లా పంచాయతీ అధికారులతో కూడిన కమిటీకి ఉంది. -ఆగస్టు 15న విధుల్లో చేరిన వలంటీర్లు, తమకు కేటాయించిన 50 ఇళ్లు, ఇతరత్రా వివరాలను పంచాయతీ కార్యదర్శి నుంచి సేకరించాలి. -ఆగస్టు 16 నుంచి 23 వరకు కేటాయించిన ఇళ్లల్లో కుటుంబాలను పరిచయం చేసుకోవాలి. -ఆగస్టు 26 నుంచి 30వ తేది వరకు పరిధిలోని 50 ఇళ్లల్లో ఇళ్ల స్థలాలు లేని వారి కోసం సర్వే చేసి లబ్ధిదారులను గుర్తించాలి. -సెప్టెంబర్ 1 నుంచి 10వ తేది వరకు పరిధిలోని ఇళ్లల్లోని అర్హులకు సామాజిక భద్రతా పింఛన్లు, రేషన్ సరుకులు (ప్యాకెట్ల రూపంలో) డోర్ డెలివరీ చేయాలి. -పైలెట్ ప్రాజెక్టుగా మన జిల్లా నుంచే సన్న బియ్యం రేషన్ బియ్యంగా ప్యాకెట్ల రూపంలో వచ్చే నెల 1 నుంచి అందజేయడం ప్రారంభం కానుంది. -సెప్టెంబర్ 11 నుంచి 15వ తేది నుంచి వివిధ రకాల పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, రైతు భరోసా లబ్ధిదారులను వలం టీర్లు స్వయంగా గుర్తిస్తారు. -ఎవరికైనా అందకపోతే వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తారు. -మత్స్యకారులు, రజకులు, ఆటోడ్రైవర్లు, దర్జీలు, నాయీ బ్రాహ్మణులకు సంబంధించిన పథకాలను అర్హులకు కూడా వలంటీర్లు గుర్తిస్తారు. -సెప్టెంబర్ 15 నుంచి 30 వరకు గ్రామవలంటీర్లకు శిక్షణ ఉంటుంది. -సెప్టెంబర్ 29న గ్రామ సచివాలయాల ఉద్యోగులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు జారీ. -అక్టోబర్ 2 నాటికి గ్రామ సచివాలయాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత వలంటీర్లు అంతా సచివాలయాలకు వెళ్లాలి. -తమ పరిధిలోని అర్హులకు సంబంధించిన పనులను, వినతులను గ్రామ సచివాలయాల్లో అధికారులకు చేరవేసే బాధ్యతలు కూడా వలంటీర్ల మీదే ఉంటుంది. -దరఖాస్తు అందిన వెంటనే 72 గంటల్లోనే పరిష్కారమయ్యేందుకు సచివాలయాలు పనిచేయాల్సి ఉంటుంది. ఇందుకోసం కూడా వలంటీర్లు కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. షెడ్యూల్‌ను ప్రతి నెలా విధిగా పాటించాలి.. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గురువారం నుంచి వలంటీర్లు విధులను నిర్వర్తించాలి. అలాగే ప్రతి నెలా దీన్నే షెడ్యూల్‌గా పాటించాలి. వలంటీర్ల పనితనంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు. రాష్ట్ర ప్రభుత్వం ఏ లక్ష్యంతో ఈ వ్యవస్థను అమలు చేస్తుందో ఆ లక్ష్యం నెరవేరేలా వలంటీర్లంతా పనిచేయాలి. ప్రతి నెలా వలంటీర్ల పనితనంను మండల అధికా రులు పర్యవేక్షిస్తుంటారు. – రవికుమార్, డీపీఓ, శ్రీకాకుళం గ్రామ సచివాలయాలకు అనుసంధాన కర్తలుగా... గ్రామ సచివాలయాలన్నీ ఈ ఏడాది అక్డోబర్ 2 నుంచి రాష్ట్రంలో అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు గ్రామ వలం టీర్లు అంతా ఈ సచి వాలయాలకు ప్రజలకు మధ్య అనుసంధాన కర్తలుగా పనిచేయాల్సి ఉంటుంది, అలాగే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం విధులు నిర్వర్తించాలి. ముఖ్యంగా కేటాయించిన 50 ఇళ్ల డేటాను కచ్చితంగా ప్రతి ఒక్క వలంటీర్ సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం షెడ్యూల్లో కొన్ని రోజులు కేటాయించారు. – బి.చక్రధరరావు, జెడ్పీ సీఈఓ -
సేవకు సంసిద్ధం
సాక్షి , కడప : వలంటీర్లు సేవకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజలకు అందించడానికి సమాయత్తమవుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రామాలలో వలంటీర్ల వ్యవస్థ ద్వారా పథకాల ఫలాలతోపాటు రేషన్ సరకులను ఇంటింటికీ చేరవేయాలని సంకల్పించిన సంగతి తెలిసిందే. ఈనెల 15నుంచి వీరంతా విధులలోకి రానున్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ పనిచేయనున్నారు. ఇప్పటికే ఇంటర్వ్యూలు పూర్తి చేసుకున్నారు. నియామక పత్రాలు అందుకున్నారు. మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. జిల్లాలో తొమ్మిది లక్షల మేర కుటుంబాలకు సంబంధించి 15,040 మంది వలంటీర్ల నియామకం చేపట్టారు. ప్రజాసాధికారిక సర్వే తరహాలో ముందుగా వలంటీర్ బయో మెట్రిక్ మిషన్ ద్వారా కుటుంబ వివరాలు సేకరించి పెట్టుకుంటారు. తదనంతరం ఇల్లు, రేషన్, పెన్షన్, స్థలం, నీరు, విద్యుత్, ఇతర కార్డు ఏదైనా అంతా వలంటీర్ ద్వారానే జరగాల్సి ఉంది. సచివాలయ వ్యవస్థ అక్టోబరు నుంచి అమలులోకి వస్తే వలంటీర్ ద్వారా ప్రజల సమస్యలకు సంబంధించి 72 గంటల్లోనే సమస్యను పరిష్కారం చూపేలా ప్రభుత్వం సిద్దమైంది. రేషన్ చేర్చడం మొదలుకొని ప్రతి సేవలోనూ వీరు కీలకంగా వ్యవహారించనున్నారు. వలంటీర్ల వ్యవస్థతో గ్రామాల్లో పూర్తి స్థాయిలో అన్ని సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం కానుంది. వలంటీర్‌కు ప్రభుత్వం రూ.5 వేలు గౌరవ వేతనం అందిస్తుంది. సేవాభావంతో పనిచేసేలా వీరికి దిశా నిర్దేశం చేశారు. మరో పది రోజుల్లో ప్రజల్లోకి వలంటీర్ల వ్యవస్థ రానుంది. జిల్లా సమాచారం జిల్లాలో మొత్తం మండలాలు - 50 రెవెన్యూ గ్రామాలు - 4,032 మున్సిపాలిటీలు- 08 కార్పొరేషన్ - 01 మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో పనిచేయనున్న వలంటీర్లు- 4483 గ్రామాల్లో సేవలు అందించనున్న వలంటీర్లు- 10,557 -
టీడీపీకి కావ్య కృష్ణారెడ్డి గుడ్‌బై
కావలి: టీడీపీ సీనియర్ నాయకుడు కావ్య కృష్ణారెడ్డి(దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి) బుధవారం ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. కావలిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీలో తనకు తీవ్ర అవమానాలు జరిగాయని, కానీ వాటిని తాను ఏ రోజూ బయట చెప్పలేదన్నారు. తన ఆత్మీయులు ఉదయగిరి, కావలి నియోజకవర్గాల్లో ఉన్నారని, వారందరి అభిప్రాయం మేరకు తాను వైఎస్సార్సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. గురువారం నెల్లూరుకు రానున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతానని ప్రకటించారు. టీడీపీ ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్థి బొల్లినేని వెంకటరామారావును ఓడించి తీరుతానని, ఉదయగిరి ఎమ్మెల్యేగా మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అలాగే కావలి ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని చారిత్రాత్మకమైన మెజార్టీతో గెలిపించడానికి కృషి చేస్తానని అన్నారు. ప్రధానంగా నెల్లూరు ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. కేవలం ఆరు రోజులు మాత్రమే ఉండడంతో ఉదయగిరి, కావలి నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలో, వార్డుల్లో తన ఆత్మీయులు స్వచ్ఛందంగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడి ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల తన తండ్రి మరణించినందున తాను ప్రతి ఇంటికి రాలేకపోతున్నానని, కానీ ప్రతి గ్రామం, వార్డులకు వచ్చి వైఎస్సార్సీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తానని తెలిపారు. తన సొంత మండలమైన జలదంకిలో ఆదాల, మేకపాటిలకు భారీ మెజారిటీ తీసుకొస్తానని తెలిపారు. ఎంపీ వేమిరెడ్డి చర్చలు ఇటీవల కావ్య కృష్ణారెడ్డి తండ్రి మరణించిన నేపథ్యంలో ఆయనను పరామర్శించడానికి కావలిలోని కృష్ణారెడ్డి నివాసానికి వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనతో వేమిరెడ్డి రాజకీయ చర్చలు జరిపారు. అంతకుముందు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, నెల్లూరు ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి చర్చలు జరిపారు. -
బాబును ఓడించడానికి ప్రజలి కిసిగా ఎదురు చూస్తున్నరు
-
వైఎస్ఆర్సీపీలో చేరనున్న సీసీసీ వెట్వర్క్ ఎండీ పంతం కొండలరావు
-
చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీలోకి భారీగా చేరికలు
-
నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీలోకి కొనాసాగుతున్న వలసలు
-
వైఎస్సార్సీపీలో చేరిన ద్రోణంరాజు శ్రీనివాస్
-
ముహూర్తమెప్పుడో..?
సాక్షి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలు అధికారికంగా గులాబీ తీర్థం ఎప్పుడు పుచ్చుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే టీఆర్ఎస్ కండువా కప్పుకోవాలని నిర్ణయించుకున్న వారి చేరికపై ఇంకా ముహూర్తం కుదరని పరిస్థితి నెలకొంది. డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున సత్తుపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొం దిన సండ్ర వెంకటవీరయ్య, కాంగ్రెస్ పార్టీ తరఫున పినపాక నియోజకవర్గం నుంచి గెలుపొందిన రేగా కాంతారావు వారం రోజుల క్రితం తాము టీఆర్ఎస్లో చేరుతున్నామని, కార్యకర్త లతో సంప్రదింపులు జరిపి తేదీ ఖరారు చేస్తామని, టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకోవడంతోపాటు నియోజకవర్గాల అభివృద్ధిని కాంక్షించి ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. అయితే నిర్ణయం ప్రకటించిన వెంటనే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని మద్దతుదారులతో సమావేశమై.. పార్టీ మారేందుకు తీసుకున్న నిర్ణయంపై ముఖ్య నాయకులకు వివరించి.. వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. దీంతో పినపాక నియోజకవర్గంలోనూ.. అటు సత్తుపల్లి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేల నిర్ణయానికి పార్టీ ముఖ్య నేతలు మద్దతు తెలిపారు. ఇక పార్టీలో చేరడమే తరువాయి అని.. అధికార పార్టీలో అంతర్భాగం అవుతున్నామని భావించిన ముఖ్య నేతలు, పార్టీ కార్యకర్తలు మాత్రం ఇంకా ఆ సమయం ఎప్పుడొస్తుందోనని వేచి చూస్తున్నారు. వేడెక్కుతున్న రాజకీయం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి వాతావరణం వేడెక్కుతున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పక్షాలు ఎన్నికల కోసం సన్నాహక సమావేశాలతో కార్యకర్తలను కార్యోన్ముఖులను చేసేందుకు నడుం బిగించాయి. ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ను గెలిపించడమే లక్ష్యంగా.. కార్యకర్తల్లో ఉత్తేజం నింపడంతోపాటు జిల్లాలో నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితులను కార్యకర్తలకు వివరించాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు ఈనెల 16వ తేదీన ఖమ్మం, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఆ సమావేశాలకు టీఆర్ఎస్లో చేరుతామని నిర్ణయం తీసుకున్న ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరవుతారా?లేదా? అనే అంశంపై జిల్లా రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పినపాక నియోజకవర్గం ఉండడంతో 16వ తేదీ ఉదయం మహబూబాబాద్‌లో, మధ్యాహ్నం ఖమ్మంలో కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగే లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో పార్టీ మారేందుకు నిర్ణయించుకున్న ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, సండ్ర వెంకటవీరయ్య హాజరుపై రసవత్తరమైన చర్చ జరుగుతోంది. పార్టీలో అధికారికంగా అప్పటికీ చేరని పక్షంలో వారు నేరుగా సమావేశాల్లో పాల్గొనకుండా.. తమ మద్దతుదారులను తరలించడంపై దృష్టి సారిస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుండగా.. పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి వారిని టీఆర్ఎస్ నేతలుగానే పార్టీ, కార్యకర్తలు భావించే అవకాశం ఉన్నందున నేరుగా సమావేశాలకు వచ్చి మద్దతు పలికే అవకాశం సైతం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈనెల 16వ తేదీలోపు రేగా, సండ్రలు అధికారికంగా గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్తం ఖరారయ్యే అవకాశం కనుచూపు మేరలో కనిపించడం లేదని.. అయితే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యాక వీరి చేరికలపై ముహూర్తం ఖరారు కానున్నట్లు పార్టీ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్, టీడీపీలను వీడిన రేగా కాంతారావు, సండ్ర వెంకటవీరయ్యలను టీఆర్ఎస్లోకి అధికారికంగా ఎప్పుడు ఆహ్వానించాలనే అంశంపై పలు అంశాలు ముడిపడి ఉన్నాయని, ఇందులో కొన్ని సాంకేతిక అంశాలు సైతం ఉండడంతో వారి చేరికపై కొంత సమయం పట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే వీరిద్దరూ కేటీఆర్ సభల్లో పాల్గొనే అంశం మాత్రం టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం మేరకే ఉంటుందని, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇద్దరు నేతలు పరిచయం కావడానికి వేదికయ్యే అవకాశం ఉండడంతో పార్టీ అధిష్టానం ఇందుకు సమ్మతించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీలో బారీగా చేరికలు
-
వైఎస్ఆర్సీపీలో చేరిన టీడీపీ, కాంగ్రెస్ నేతలు
-
సిరిసేన పార్టీతో రాజపక్స తెగదెంపులు
కొలంబో: శ్రీలంకలో నాటకీయ పరిణామాల మధ్య ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మహింద రాజపక్స(72) అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు హ్యాండిచ్చారు. సిరిసేనకు చెందిన శ్రీలంక ఫ్రీడం పార్టీ(ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ)తో తన 50 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుని కొత్తగా ఏర్పాటైన శ్రీలంక పీపుల్స్ పార్టీలో చేరారు. గత ఏడాది ఏర్పాటైన ఈ పార్టీ ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన స్థానిక ఎన్నికల్లో అనూహ్యంగా మూడింట రెండొంతుల స్థానాలను గెలుచుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో రాజపక్స ఎస్ఎల్పీపీ సభ్యత్వం తీసుకున్నారు. దీంతో జనవరి 5న జరిగే ఎన్నికల్లో రాజపక్స ఎస్ఎల్పీపీ నుంచి బరిలోకి దిగుతారని భావిస్తున్నారు. సిరిసేన ఉత్తర్వులను అమలు చేయొద్దు చట్ట సభ్యుల అధికారాలను హస్తగతం చేసుకున్న అధ్యక్షుడు సిరిసేన జారీ చేసే ఎలాంటి ఉత్తర్వులను కూడా అమలు చేయవద్దని పార్లమెంట్ స్పీకర్ కరు జయసూర్య అధికార యంత్రాంగాన్ని కోరారు. -
కాంగ్రెస్‌కు ‘మోదీ’ ప్రచారం
రాయ్‌పూర్: ప్రధాని మోదీ వేషధారణలో ఉన్న ఈ వ్యక్తి పేరు అభినందన్ పాఠక్. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఈయన గతంలో ఎన్డీయే భాగస్వామ్య రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాలో ఉండేవారు. అయితే 2014 ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీలు అమలవ్వక పోవడంతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరి వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఛత్తీస్‌గఢ్‌లో ప్రచారానికి వెళ్లినప్పుడు పాఠక్‌తో ఇలా ఫొటో తీసుకుని ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫొటోకు సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన ప్రచారం వచ్చింది. -
వైఎస్ఆర్సీపీలో చేరిన అనంతపురం జిల్లా టీడీపీ నేతలు
-
వైఎస్ఆర్సీపీలోకి విజయవాడ మైనారిటీ సెల్ అధ్యక్షుడు
-
కాంగ్రెస్‌లో చేరనున్న బాలూనాయక్
-
పార్టీ మారే యోచనలో డీఎస్
-
నేడు వైఎస్ఆర్సీపీలోకి మాజీ మంత్రి ఆనం
-
నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీలో చేరికలు
-
జగన్ సమక్షంలో చేరిన ‘లింగారెడ్డి’
ఏలూరు టౌన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్రతో ప్రజల్లో వస్తోన్న అనూహ్య స్పందన చూసి రాజకీయ పార్టీల నేతలు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్లలో పాదయాత్ర చేస్తోన్న వైఎస్ జగన్ సమక్షంలో ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం ఉలవపాడుకు చెందిన కాంగ్రెస్ నాయకులు లింగారెడ్డి మధుసూధనరెడ్డి శుక్రవారం వైఎస్సార్ సీపీలో చేరారు. ప్రకాశం జిల్లా మహీధర్‌రెడ్డి అనుచరుడిగా కాంగ్రెస్‌లో కీలకనేతగా ఎదిగిన మధుసూధనరెడ్డి వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు సంతోషంగా జీవించాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు. తూర్పుగోదావరి జిల్లా నాయకుల చేరిక అలాగే వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పి.గన్నవరం వైఎస్సార్ సీపీ నాయకులు కొండేటి చిట్టబ్బాయి, సీఏసీ సభ్యులు కుడిపూడి చిట్టబ్బాయి, మిదిగుండి మోహన్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది నాయకులు పార్టీలో చేరారు. వారిలో వార లక్ష్మీనరసింహం, మాజీ ఎంపీటీసీ బొక్క ఏడుకొండలు, బొబ్బిలి దుర్గారావు, దామిశెట్టి అంజిబాబు, మాజీ సర్పంచ్ కడలి రామకృష్ణ, మట్టపర్తి నవీన్ తదితరులు ఉన్నారు. -
నేడు వైఎస్సార్సీపీలోకి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి
భీమవరం టౌన్: ప్రజాసంకల్పయాత్రలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలతో మమేకమవుతున్న తీరు మనస్సును హత్తుకోవడంతో వైఎస్సార్ సీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం నాగులపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కె.లక్ష్మీరెడ్డి తెలిపారు. భీమవరంలో డాక్టర్ ఎం.బాపిరాజు నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లాతో తనకెంతో అనుబంధం ఉందని, ఇక్కడ స్నేహితులు, ఆత్మీయులు ఎందరో ఉన్నారన్నారు. 1995–98లో జిల్లాలో పనిచేశానని, 2012లో సీనియర్ ఎస్పీగా మహబూబ్‌నగర్‌లో పదవీ విరమణ చేశానన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల కోసం ఎంతో శ్రమిస్తున్నాడని, ఆయన ఆత్మస్థైర్యాన్ని చూసి ఎంతో మంది ఆయన అడుగులో అడుగు వేస్తున్నారన్నారు. ఆదివారం వైఎస్ జగన్ సమక్షంలో తానుపార్టీలో చేరుతున్నట్టు చెప్పారు. రాష్ట్రమంతా పర్యటిస్తూ ప్రజల కష్టాలు తెలుసుకుని పరిష్కారాలు చూపుతున్న జగన్మోహన్రెడ్డి ప్రజల హృదయాల్ని గెలుచుకుంటున్నారన్నారు. తాను పార్టీలో ఏ పదవి ఆశించి చేరడం లేదన్నారు. విశ్రాంత జీవితం గడుపుతున్న తనకు జగన్ పాదయాత్ర స్ఫూర్తి కలిగించిందన్నారు. తన సేవలను పార్టీ ఏ విధంగా వినియోగించుకుంటే ఆ విధంగా సహకరిస్తామన్నారు. రిటైర్డ్ రిజిస్ట్రార్, నెల్లూరు వీపీఆర్ ఫౌండేషన్ సీఈఓ ప్రొఫెసర్ వి.నారాయణరెడ్డి, ఏలూరు సీనియర్ న్యాయవాది బీవీ కృష్ణారెడ్డి, కడప జిల్లా రాజంపేటకు చెందిన గురుప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. -
హస్తినలో నాగం మకాం
ఢిల్లీ : హస్తినలో బీజేపీ మాజీ నేత నాగం జనార్దన్ రెడ్డి మకాం వేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో శుక్రవారం భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇటీవలే బీజేపీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. నాగం కాంగ్రెస్‌లో చేరడానికి ఆసక్తి కనబరుస్తుండటంతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి. నాగం రాకను కాంగ్రెస్‌లోని పలువర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. నాగంను పార్టీలోకి చేర్చుకోవద్దంటూ రాహుల్ గాంధీకి ఇటీవలే కొందరు నాయకులు ఫిర్యాదులు కూడా చేసిన సంగతి తెల్సిందే. బీజేపీకి రాజీనామా చేసిన నాగం జనార్దనరెడ్డిని పార్టీలో చేర్చుకునే విషయంలో కాంగ్రెస్ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. నాగంను చేర్చుకోవడం ద్వారా తెలంగాణలో గుర్తింపు పొందిన నేత కాంగ్రెస్‌లో చేరారన్న భావన ప్రజల్లో కల్పించాలని పీసీసీ నాయకత్వం ఆలోచిస్తుండగా, పాలమూరు జిల్లాకు చెందిన నేతలు మాత్రం ఆయన చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మాజీ మంత్రి డీకే అరుణ, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డిలు నాగం రాకను వ్యతిరేకిస్తూనే, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డిపై ఆరోపణలు గుప్పిస్తుండడం పార్టీలో చర్చకు దారి తీస్తోంది. తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నాగం జనార్దనరెడ్డికి తనదైన గుర్తింపు ఉంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆయన గత ఎన్నికలకు ముందే తెలంగాణ విషయంలో టీడీపీతో విభేదించి రాజీనామా చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా దామోదర్ రెడ్డిపై గెలిచిన అనంతరం బీజేపీలో చేరారు. 2014 ఎన్నికలలో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. నాగం జనార్దనరెడ్డి కుమారుడు కూడా నాగర్‌కర్నూలు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత బీజేపీలో చేరిన ఆయనకు పార్టీలో ఎటువంటి కీలకమైన పదవులు దక్కక పోవడంతో అసంతృప్తితో ఉన్నారు. ఆ పార్టీలో తగిన గుర్తింపులేదనే అభిప్రాయంతో ఆయన ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరితే బాగుంటుందనే ఆలోచనతో కొంతకాలం క్రితం పావులు కదిపారు. తనతోపాటు కుమారుని రాజకీయ భవిష్యత్తు కోసం ఆ పార్టీ నాయకత్వాన్ని సంప్రదించారు. -
యువతకు అండగా కాంగ్రెస్
యాదగిరిగుట్ట : యువతకు కాంగ్రెస్ అండగా ఉంటుందని ఏఐసీసీ సభ్యులు, డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. యాదగిరిగుట్ట మండలం బాహుపేటలో వివిధ పార్టీలకు చెందిన యువకులు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుందన్నారు. యువనేత రాహుల్‌గాంధీ నేతృత్వంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు, నిరుద్యోగ భృతిని అందించే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇమ్మడి మాధవిరాంరెడ్డి, కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా ఉపాధ్యాక్షుడు చీర శ్రీశైలం, పార్టీ మండల అధ్యక్షుడు బీర్ల అయిలయ్య, పాలసంఘం చైర్మన్ భాస్కర్‌రెడ్డి, యాదాద్రి దేవస్థానం మాజీ ధర్మకర్త పెల్లిమెల్లి శ్రీధర్‌గౌడ్, మండల వర్కింగ్ ప్రసిడెంట్ కానుగు బాలరాజు, గ్రామశాఖ అధ్యక్షులు శంకర్, ప్రభాకర్ తదితరులున్నారు. -
ఫేస్‌బుక్‌లోనూ రజనీ.. ఫస్ట్‌పోస్ట్ తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ : సాధారణంగానే తన అభిమానులకు చేరువగా ఉండే దక్షిణాది ప్రముఖ నటుడు, పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారబోతున్న రజనీకాంత్ ఫేస్బుక్లో చేరారు. త్వరలో తన పార్టీని ప్రకటించి తమిళనాట రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్న ఆయన మరో సామాజిక మాధ్యమంలోకి అడుగుపెట్టారు. నేటి రాజకీయాలను సోషల్ మీడియా ఎంతగా ప్రభావితం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్షణాల్లో దేనికి సంబంధించిన విషయాన్నయినా తెలుసుకునేందుకుగానీ, తెలియపరిచేందుకుగానీ, మీడియా కంటే కూడా శరవేగంగా పనిచేస్తున్న ఆయుధం సోషల్ మీడియా. బహుశా దీనిని గుర్తించే రజనీ నాలుగు రోజుల కిందట ఇన్‌స్టాగ్రమ్‌లో తాజాగా ఫేస్బుక్లో ఖాతా తెరిచారు. అందులో వనక్కం (నమస్కారం) అనే ఒకే ఒక మాటను తొలి పోస్ట్‌గా చేశారు. 22గంటల కిందటే సోషల్ మీడియాలో అడుగుపెట్టిన ఆయనకు అప్పుడే లక్షన్నరమందికి పైగా ఫాలోవర్స్ పెరిగారు. ఇక నాలుగు రోజుల కిందట ఇన్‌స్టాగ్రమ్‌లో చేరిన ఆయన తన 2016నాటి కబాలి చిత్రంలోని పోస్టర్‌ను పెట్టిన విషయం తెలిసిందే. అందులో ప్రతి ఒక్క తన అభిమానికి తాను దగ్గరవుతున్నాననే విషయం చెప్పండంటూ విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా.. వర్చువల్ వరల్డ్‌లోకి స్వాగతం తలైవా అంటూ ఓ అభిమాని రజనీ ఫేస్బుక్ పేజీకి కామెంట్ పెట్టగా.. రజనీకాంత్‌ను ఎట్టకేలకు ఫేస్బుక్ చేర్చుకుంది అంటూ మరో అభిమాని జోక్ చేశాడు. నాలుగేళ్ల కిందటే ఆయన ట్విటర్ ఖాతాను తెరిచి మైండ్ బ్లోయింగ్ అయ్యే రేంజ్లో ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. -
వైఎస్సార్ సీపీలో భారీగా చేరిక
నెహ్రూనగర్(గుంటూరు): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోసాలను ప్రజలు గుర్తెరిగి రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అదివారం పశ్చిమ నియోజకవర్గం శ్రీనివాసరావుపేటకు చెందిన షేక్ సుభాని, అతని అనుచరులు, వెయ్యి మందికి పైగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ నగర అ«ధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి సమక్షంలో చేరారు. నేతలు కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్రంపై నోరు మెదిపితే ఎక్కడ కేసుల్లో ఇరుక్కుంటామని భయంలో చంద్రబాబు ఉన్నారన్నారు. విజయవాడ నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలన మరలా రావాలంటే వైఎస్సార్ సీపీతోనే సాధ్యమన్నారు. రాష్ట్రంలో టీడీపీ ఆరాచక పాలన కొనసాగిస్తుందని పార్టీ నగర అ«ధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆతుకూరి ఆంజనేయులు, రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్‌బాబు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గులాం రసూల్, రాష్ట్ర కార్యదర్శులు ధామస్నాయుడు, రాతంశెట్టి రామాంజనేయులు, ఈచంపాటి వెంకటకృష్ణ(ఆచారి), రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ జానీ, నగర మైనార్టీ సెల్ అధ్యక్షులు గౌస్, జిల్లా కార్యదర్శి మార్కు కొండారెడ్డి, సత్యనారాయణ, సయ్యద్‌బాబు, దాసరి కిరణ్, పల్లపు శివ, గనిక ఝాన్సీ, అభియాదవ్, పెయింటర్ రమణ, తదితరులు పాల్గొన్నారు. 150 కుటుంబాలు చేరిక.. నూజెండ్ల: టీడీపీ కంచుకోటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాగా వేయడం శుభపరిణామమని ఆ పార్టీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పరిశీలకులు రావి వెంకటరమణ అన్నారు. మండలంలోని పాతనాగిరెడ్డిపల్లి, కొత్తనాగిరెడ్డిపల్లి గ్రామాల్లో టీడీపీకి చెందిన 150 కుటుంబాల వారు ఆదివారం నియోజకవర్గ ఇన్చార్జి బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వారిని మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, జిల్లా నేతలు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో మాజీ సర్పంచ్ వంకాయలపాటి బాలకోటయ్య, దిరిశాల కొండలు, పరిమి అంజయ్య, వంకాయలపాటి శ్రీను, చింతలచెర్వు బాబు, లేళ్ల అంజయ్య తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు నూతలపాటి హనుమయ్య, పాణ్యం హనిమిరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్రకార్యదర్శి దూపాటి రాజారావు మండల కన్వీరర్ బత్తుల వెంకటేశ్వర్లు యాదవ్, కొమిరిశెట్టి రామారావు, గంధం బాలిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మూలె వెంకటేశ్వరరెడ్డి, ఎంపీటీసీలు ముప్పరాజు వెంకటేశ్వర్లు ఉన్నారు. -
బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయం : లక్ష్మణ్
హైదరాబాద్ : మహిళలను వివస్త్రను చేసి బతుకమ్మ ఆడించిన నిజాంను తెలంగాణ సీఎం కేసీఆర్ పొగుడుతున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ మండిపడ్డారు. లక్ష్మణ్ ఆధ్వర్యంలో పలువురు ఆదిలాబాద్ ,తాండూరుకి చెందిన జడ్పీటీసీ, సర్పంచ్‌లు, కార్యకర్తలు శుక్రవారం పార్టీలో చేరారు. విలేకరులతో మాట్లాడుతూ..కేసీఆర్ అవినీతిని ఎండగట్టాలంటే బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. 19 రాష్ట్రాల్లో ఏవిధంగా అధికారంలోకి వచ్చామో తెలంగాణలో కూడా అదేవిధంగా అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. రోజూవారీ ప్రక్రియగా బీజేపీలో అనేక మంది చేరుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చి దోచుకుంది దాచుకుంది తప్ప చేసిందేమీ లేదన్నారు. అమిత్ షా, మోదీ ఇద్దరూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని నమ్మే తమ పార్టీ వైపు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. దళారి వ్యవస్థ మోదీ ప్రభుత్వంలో లేదని, మోదీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ అందరి చూపు తమ పార్టీ వైపు చూసేలా చేస్తున్నారని అన్నారు. మహిళల ఆత్మ గౌరవం కాపాడేందుకు మరుగుదొడ్ల నిర్మాణం మోదీ చేపట్టారని తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల వైఫల్యాలను ఎండగట్టేందుకు బీజేపీనే ప్రత్యామ్నాయమని, ఇప్పుడున్న పార్టీలన్నీ కేవలం ప్రచారం కోసమే చూస్తున్నాయని దుయ్యబట్టారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వ్యక్తిగత దూషణలకు దిగుతూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో భూ కుంభకోణాలు అధికమైపోయాయని, ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. బీసీ సంగ్రామ సభ జరపబోతున్నామని, అంతే కాకుండా నిరుద్యోగ, రైతు, మహిళల సమస్యలపై భవిష్యత్‌లో పోరాడుతామని తెలిపారు. రాబోయే రోజుల్లో చాపకింద నీరులా చేరి ఈ రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు ఎండగట్టి అధికారంలో వచ్చే విధంగా పోరాడుతామని చెప్పారు. -
ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి షాక్
-
వాళ్లు కాంగ్రెస్‌లో చేరడం శుభపరిణామం: ఉత్తమ్
హైదరాబాద్ : వివిధ వృత్తుల నుంచి పలువురు ప్రముఖులు కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభపరిణామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రిటర్డ్ దూరదర్శన్ జాయింట్ డైరెక్టర్ సుజాత్ అలీ ఆధ్వర్యంలో క్రీడాకారులుగా పనిచేసి రిటెర్డ్ అయినవాళ్లు, డాక్టర్లుగా పనిచేసిన వారు, సోషల్ వర్కర్లు, రిటైర్డ్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ తదితరులు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీకి 133 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. సెక్యులరిజం, సోషల్ జస్టిస్‌ను కాంగ్రెస్ పాటిస్తోందని వ్యాఖ్యానించారు. 2019లో ఢిల్లీలో, తెలంగాణలో కాంగ్రెస్ పక్కాగా విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. 70 ఏళ్ల స్వతంత్ర్యంలో ఏం తింటున్నావ్...లాంటి ప్రశ్నలు తాను వినలేదని, కానీ ఇప్పుడు వినాల్సి వస్తుందన్నారు. అందరికి సమాన ప్రాధాన్యత ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీనేనని చెప్పారు. టీఆర్ఎస్ సర్కార్ వచ్చిన నాలుగు నెలల్లో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామన్నారు కానీ 40 నెలలు అయినా అమలు కాలేదని ఎద్దేవా చేశారు. 12 శాతం రిజర్వేషన్ పై సీఎం కేసీఆర్ మాట నిలబెట్టుకోవాలి..లేదంటే ముస్లింలను ఓట్లు అడిగే హక్కు కేసీఆర్‌కు లేదన్నారు. ఓల్డ్ సిటీలో ఎందుకు మెట్రో పనులు మొదలు కాలేదని ప్రశ్నించారు. ఇది ఓల్డ్ సిటీ పై వివక్ష చూపడం కాదా..? అని అన్నారు. దళితులకు, గిరిజనులకు ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఎంతమంది ముస్లింలకు డబుల్ బెడ్ రూములు కట్టించి ఇచ్చారని ప్రశ్నించారు. తుగ్లక్ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. -
వైఎస్సార్ సీపీలో 100 కుటుంబాలు చేరిక
-
YSRCPలోకి జోరుగా వలసలు
-
'చంద్రబాబు మహిళలను మోసం చేశారు'
-
పన్నులు పెంచితేనే పనులు జరుగుతాయి
-
YSRCPలోకి కొనసాగుతున్న వలసలు
-
వైఎస్ఆర్ సీపీలో 50 కుటుంబాల చేరిక
జి.సిగడాం: సీతారాంపురం గ్రామానికి చెం దిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నా యకులు వైఎస్ఆర్ సీపీలో చేరారు. జైదం సత్యారావు, ఇజ్జి రమణ, ప లిశెట్టి సూర్యారావు,డి, తారకేశ్వరరావు, శిర్రా లక్షన్న, గొలుశెట్టి ఆశ్వరరావు, పలిశెట్టి అప్పన్న, పలిశెట్టి చెంచయ్య, ఆరెల్ల వెంకన్న, పంది రిపల్లి సత్యారావు, జైదం రామకృష్ణ, సాలిపల్లి సూర్యనారాయణ, ఇజ్జి ముకందరావు, జైదం శ్రీనివాసరావు, సాలిపల్లి సత్యారావు, పి.వెంకన్న బో ల్లిశెట్టి గొవిందరావు, పలిశెట్టి గొవిం దరావు, జైదం అప్పారావు, కేతం పా పారావు, సాలిపల్లి సింహాద్రి, జైదం మంగరావు, జైదం రమణ, జైదం సూర్యనారాయణ, పందిరిపల్లి తవి టయ్య, కేతం శ్రీనివాసరావులతోపా టు 50 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్నా యి. వైఎస్ఆర్ సీపీ ఎచ్చెర్ల ని యోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠం నాయుడు, మండల పార్టీ అ ధ్యక్షులు మీసాల వెంకటరమణ సమక్షంలో వీరు సోమవారం పార్టీలో చే రారు. ఎన్నికల ముందు హామీలిచ్చి అధికారం దక్కాక మాటలు మర్చిపోయారని, అందుకే ఆ పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలోకి వచ్చామని వారు తెలిపారు. కార్యక్రమంలో సర్పం చ్‌లు బత్తుల సన్యాసిరావు, మండల అధికార ప్రతినిధి అబోతుల జగన్నా థం, ఏర్నేన శ్రీరాములు,బత్తుల చం ద్రశేఖర్, బాలి అప్పలసూరి, నల్లి తవిటినాయుడు,అదినారాయణ, తొత్తడి రామారావు, వడిశ మహేశ్వరరావు పాటు పలువురు పాల్గొన్నారు. -
వర్క్ ఇన్స్పెక్టర్ల నియామకం
అనంతపురం టౌన్ : గృహ నిర్మాణ సంస్థలో జిల్లా వ్యాప్తంగా 42 మంది వర్క్ ఇన్స్పెక్టర్లను నియమించారు. జిల్లాకు ఎన్టీఆర్ రూరల్, హౌసింగ్ ఫర్ ఆల్ కింద ఇళ్లు మంజూరైనా క్షేత్రస్థాయిలో పురోగతి లేని నేపథ్యంలో వర్క్ఇన్స్పెక్టర్ల కొరత.. మందకొడిగా సాగుతున్న నిర్మాణాలపై డిసెంబర్ 9న ‘నిర్మాణమెలా?’ శీర్షికతో సాక్షి ప్రచురించిన కథనంపై స్పందించిన కలెక్టర్ కోన శశిధర్ హౌసింగ్ అధికారులతో సమీక్ష చేశారు. ఓ ప్రైవేట్ ఏజెన్సీతో నియామకాలు చేపట్టాలని చూసినా అది సాధ్యం కాలేదు. జిల్లాలో నెలకొన్న పరిస్థితి మేనేజింగ్ డైరెక్టర్ దృష్టికి వెళ్లింది. అక్కడి నుంచి సానుకూలంగా నిర్ణయం రావడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రశాంతి జిల్లా సమాఖ్య ద్వారా ఔట్సోర్సింగ్ కింద 42 మంది వర్క్ ఇన్స్పెక్టర్లను తీసుకున్నారు. శుక్రవారం వీరంతా విధుల్లో చేరారు. మరో 28 మందిని కూడా త్వరలోనే తీసుకోనున్నట్లు తెలుస్తోంది. -
వైఎస్ఆర్ సీపీలోకి బీజేపీ, టీడీపీ నేతలు
-
వైఎస్ఆర్ సీపీలోకి బీజేపీ, టీడీపీ నేతలు
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు బీజేపీ, టీడీపీ నేతలు శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ నేతలు మచ్చా గంగాధర్, రవికిరణ్ వర్మతో పాటు.. టీడీపీ నేతలు కొల్లి శివ, ప్రసాద్, సుమారు 200 మంది కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరంతా వైఎస్ఆర్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. -
YSRCPలో చేరిన ఖమ్మంజిల్లా టీఆర్ఎస్ నేతలు
-
టీడీపీ కంచుకోట కూలిపోయింది
టీడీపీకి గుడ్‌బై చెప్పిన మర్రిపూడి వాసులు పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీలో చేరిక కండువాలు కప్పి ఆహ్వానించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు రంగంపేట/పెద్దాపురం : టీడీపీ కంచుకోట కూలిపోయింది. ఆవిర్భావం నుంచీ తెలుగుదేశానికే మద్దతుగా నిలిచిన రంగంపేట మండలం మర్రిపూడిలో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ గ్రామానికి చెందిన టీడీపీ కీలక నాయకుడు రిమ్మలపూడి వెంకటేశ్వరరావు(అబ్బు)తో పాటు 500 మందికి పైగా కార్యకర్తలు ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యాన చేరిన వారికి పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పార్టీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ నల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కంచుకోట కూలడం మర్రిపూడి నుంచే ఆరంభమైందని అన్నారు. ఎమ్మెల్యే పదవులు శాశ్వతం కాదని, మళ్లీ ఎన్నికల్లో ఉంటామో, లేదో తెలియని పదవులు ఎప్పుడూ తమవెంటే ఉంటాయనుకుని అహంభావంతో పాలన సాగిస్తున్న టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వచ్చాయని చెప్పారు. భవిష్యత్తులో టీడీపీకి గడ్డుకాలం తప్పదన్నారు. నమ్మి వచ్చిన కార్యకర్తలకు సమన్యాయం చేయగలిగిన నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. అటువంటి నాయకుడిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న టీడీపీకి ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని కన్నబాబు అన్నారు. కార్యకర్తకు ఏ కష్టమొచ్చినా అండగా ఉంటామని, మర్రిపూడి అబ్బును మండలం నుంచే కాకుండా జిల్లా స్థాయి నాయకుడిగా చూస్తారని చెప్పారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ భవిష్యత్తులో వైఎస్సార్ స్వర్ణయుగం రానున్నదన్నారు. ప్రభుత్వ పాలనను, చంద్రబాబు అవినీతిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ, పార్టీలో కష్టపడి పని చేస్తున్న వ్యక్తులను లెక్క చేయకుండా.. మద్యం దుకాణాల్లో మామూళ్లే నయమంటూ పాలన సాగిస్తున్న ఎమ్మెల్యేకు ప్రజలు భవిష్యత్తులో బుద్ధి చెప్పడం తథ్యమన్నారు. ‘రాము ట్యాక్స్’ పేరిట సాగుతున్న మామూళ్ల దందా ఎవరికి తెలియని బాగోతమని ప్రశ్నించారు. రెండున్నరేళ్ల పాలనలో చాగల్నాడు ఎత్తిపోతల పథకం ద్వారా చుక్క నీరు తెప్పించలేని ఎమ్మెల్యే ఎంత అసమర్థుడో ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. దీనిపై ప్రశ్నించిన నాయకులకు చంద్రబాబుతో మాట్లాడానని చెప్పుకుంటున్న ఆయన.. దమ్ముంటే ఇద్దరి సంభాషణనూ మీడియా ముందు వెల్లడించాలని డిమాండ్ చేశారు. అవినీతి ఎమ్మెల్యే పాలనకు విసుగు చెందే మర్రిపూడి గ్రామమంతా ఏకమై వైఎస్సార్ సీపీలో చేరారని, పార్టీపై, తనపై వారికున్న అభిమానానికి కృతజ్ఞుడినని అన్నారు. నమ్మి వచ్చిన ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటానన్నారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, చిర్ల వీర్రాఘవరెడ్డిలు మాట్లాడుతూ, రాష్ట్రంలో అవినీతి పాలన చూడలేకే కంచుకోటలాంటి గ్రామంలో టీడీపీ క్యాడర్ వైఎస్సార్సీపీలో చేరుతోందన్నారు. అనంతరం రిమ్మలపూడి వెంకటేశ్వరరావు (అబ్బు), మాజీ సర్పంచ్‌లు రిమ్మలపూడి కృష్ణమూర్తి, మోర్త వెంకన్న, పిల్లి తాతారావు, కోరా సూర్యనారాయణమూర్తి, మాజీ ఎంపీటీసీ సభ్యులు పెంకే శ్రీనివాసరావు, పుట్టా యువరాజు, మందపల్లి జ్యోతి ఏసయ్య, మేడిద రాజు, మాజీ ఉప సర్పంచ్ మోదుకూరి బంగార్రాజు, టీడీపీ మాజీ అధ్యక్షుడు పుట్టా గోపాలుడు, విద్యాకమిటీ చైర్మన్ వేగి రాంబాబు, వార్డు సభ్యులు, కాకతీయ యూత్, కాపునాడు యూత్, అల్లూరి సీతారామరాజు యూత్, బలిజ యూత్, అంబేద్కర్ యూత్, జగజ్జీవనరామ్ యూత్, ఎంఆర్పీఎస్, రైతు–కూలీ సంఘ సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు సుమారు 500 మందికి పైగా వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి కురసాల కన్నబాబు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జంగా సుబ్బారెడ్డి, వేము చిరంజీవి, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొల్లాటి ఇజ్రాయేల్, మహిళా విభాగం కార్యదర్శి ఎరకారెడ్డి సత్య, రాష్ట్ర యూత్ కార్యదర్శి ఎన్డీఆర్, రైతు విభాగం సహాయ కార్యదర్శి సత్తి సుబ్బారెడ్డి, లంక చంద్రన్న, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సత్తి వీర్రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు అడబాల వెంకటేశ్వర్లు, పాలాటి నాగేశ్వరరావు, పేపకాయల రాంబాబు, కనుమూరి వెంకటపతి, కనుమూరి సాయిరాజు, నక్కా అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
చిత్తూరు టీడీపీకి షాక్