అరసవల్లి: అవినీతి, అక్రమాలు లేకుండా పారదర్శక పాలన అందించాలనే ధ్యేయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో గురువారం నుంచి గ్రామ వలంటీర్ల వ్యవస్థ అమల్లోకి వచ్చింది. దీంతో గ్రామీణ పాలనలో వలంటీర్లు కీలక పాత్ర పోషించనున్నారు. నేరుగా లబ్ధిదారు ని ఇంటి ముంగిటకే ప్రభుత్వ పథకాలను చేర్చే విధంగా వలంటీర్లు పనిచేయనున్నా రు. ఈ మేరకు గురువారం నుంచి వలం టీర్లు విధుల్లోకి చేరారు. జిల్లాలో మొత్తం 38 మండలాల్లో 1141 పంచాయతీల్లో 13427 మంది గ్రామవలంటీర్లు నియమితులైతే.. ఓ 15 మందిS మాత్రమే శిక్షణలకు హాజరుకాకపోవడంతో నియామక పత్రాలను అధికారులు ఇవ్వలేదు. దీంతో 13,412 మంది వరకు వలంటీర్లు గురువారం నాటి విధుల్లోకి వచ్చారు. దాదాపుగా అన్ని మండలాల నుంచి ఈమేరకు వలంటీర్లు చేరికపై జెడ్పీ అధికారులు ఎప్పటికప్పుడు వివరాలను తెప్పించుకున్నారు. జెడ్పీ సీఈఓ బి.చక్రధరరావు, డిప్యూటీ సీఈవో ప్రభావతి తదితరుల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతుం ది. వలంటీర్లకు ప్రత్యేకంగా విధి విధానాలతో పాటు ప్రతి నెలా చేపట్టాల్సిన ముఖ్య విధులను షెడ్యూల్‌గా ప్రకటించింది. ఈ మేరకు ఉన్నతాధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు.
వలంటీర్ల విధుల షెడ్యూల్ ఇదే..
రాష్ట్ర ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయిలో నిజమైన అర్హులకు నేరుగా డోర్ డెలివరీ చేయడానికి గ్రామ వలంటీర్ల వ్యవస్థను గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు ప్రారంభిం చారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలకు తావి వ్వకుండా పాలన సాగాలన్న ఏకైక లక్ష్యంతో ప్రారంభమైన గ్రామ వలంటీర్లుకు ప్రత్యేక విధి విధానాలను కూడా రాష్ట్ర సర్కార్ స్పష్టం చేసింది. ఈ క్రమంలో విధులను కూడా ప్రతి నెలా క్రమం తప్పకుండా వలంటీర్లు అంతా ఆచరణలో పెట్టాల్సి ఉంటుంది. విధి నిర్వహణలో ఎక్కడైనా నిర్లక్ష్యం కన్పించినా వారిని తొలిగించి, ఆ స్థానంలో కొత్త వలంటీర్లను నియమించుకునే అధికారం ఎంపిడివో, జెడ్పీ సీఈఓ, జిల్లా పంచాయతీ అధికారులతో కూడిన కమిటీకి ఉంది.
-ఆగస్టు 15న విధుల్లో చేరిన వలంటీర్లు, తమకు కేటాయించిన 50 ఇళ్లు, ఇతరత్రా వివరాలను పంచాయతీ కార్యదర్శి నుంచి సేకరించాలి.
-ఆగస్టు 16 నుంచి 23 వరకు కేటాయించిన ఇళ్లల్లో కుటుంబాలను పరిచయం చేసుకోవాలి.
-ఆగస్టు 26 నుంచి 30వ తేది వరకు పరిధిలోని 50 ఇళ్లల్లో ఇళ్ల స్థలాలు లేని వారి కోసం సర్వే చేసి లబ్ధిదారులను గుర్తించాలి.
-సెప్టెంబర్ 1 నుంచి 10వ తేది వరకు పరిధిలోని ఇళ్లల్లోని అర్హులకు సామాజిక భద్రతా పింఛన్లు, రేషన్ సరుకులు (ప్యాకెట్ల రూపంలో) డోర్ డెలివరీ చేయాలి.
-పైలెట్ ప్రాజెక్టుగా మన జిల్లా నుంచే సన్న బియ్యం రేషన్ బియ్యంగా ప్యాకెట్ల రూపంలో వచ్చే నెల 1 నుంచి అందజేయడం ప్రారంభం కానుంది.
-సెప్టెంబర్ 11 నుంచి 15వ తేది నుంచి వివిధ రకాల పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, రైతు భరోసా లబ్ధిదారులను వలం టీర్లు స్వయంగా గుర్తిస్తారు.
-ఎవరికైనా అందకపోతే వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తారు.
-మత్స్యకారులు, రజకులు, ఆటోడ్రైవర్లు, దర్జీలు, నాయీ బ్రాహ్మణులకు సంబంధించిన పథకాలను అర్హులకు కూడా వలంటీర్లు గుర్తిస్తారు.
-సెప్టెంబర్ 15 నుంచి 30 వరకు గ్రామవలంటీర్లకు శిక్షణ ఉంటుంది.
-సెప్టెంబర్ 29న గ్రామ సచివాలయాల ఉద్యోగులకు అపాయింట్‌మెంట్ ఆర్డర్లు జారీ.
-అక్టోబర్ 2 నాటికి గ్రామ సచివాలయాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత వలంటీర్లు అంతా సచివాలయాలకు వెళ్లాలి.
-తమ పరిధిలోని అర్హులకు సంబంధించిన పనులను, వినతులను గ్రామ సచివాలయాల్లో అధికారులకు చేరవేసే బాధ్యతలు కూడా వలంటీర్ల మీదే ఉంటుంది.
-దరఖాస్తు అందిన వెంటనే 72 గంటల్లోనే పరిష్కారమయ్యేందుకు సచివాలయాలు పనిచేయాల్సి ఉంటుంది. ఇందుకోసం కూడా వలంటీర్లు కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.
షెడ్యూల్‌ను ప్రతి నెలా విధిగా పాటించాలి..
ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గురువారం నుంచి వలంటీర్లు విధులను నిర్వర్తించాలి. అలాగే ప్రతి నెలా దీన్నే షెడ్యూల్‌గా పాటించాలి. వలంటీర్ల పనితనంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు. రాష్ట్ర ప్రభుత్వం ఏ లక్ష్యంతో ఈ వ్యవస్థను అమలు చేస్తుందో ఆ లక్ష్యం నెరవేరేలా వలంటీర్లంతా పనిచేయాలి. ప్రతి నెలా వలంటీర్ల పనితనంను మండల అధికా రులు పర్యవేక్షిస్తుంటారు.
– రవికుమార్, డీపీఓ, శ్రీకాకుళం
గ్రామ సచివాలయాలకు అనుసంధాన కర్తలుగా...
గ్రామ సచివాలయాలన్నీ ఈ ఏడాది అక్డోబర్ 2 నుంచి రాష్ట్రంలో అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు గ్రామ వలం టీర్లు అంతా ఈ సచి వాలయాలకు ప్రజలకు మధ్య అనుసంధాన కర్తలుగా పనిచేయాల్సి ఉంటుంది, అలాగే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం విధులు నిర్వర్తించాలి. ముఖ్యంగా కేటాయించిన 50 ఇళ్ల డేటాను కచ్చితంగా ప్రతి ఒక్క వలంటీర్ సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం షెడ్యూల్‌లో కొన్ని రోజులు కేటాయించారు.
– బి.చక్రధరరావు, జెడ్పీ సీఈఓ
Comments
Please login to add a commentAdd a comment