శ్రీకాకుళంలో సర్వే చేస్తున్న వలంటీర్లు, ప్రభుత్వ సిబ్బంది
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో ఇప్పటివరకు పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. అలాగని ప్రభుత్వం, అధికారులు తేలికగా తీసుకోవడం లేదు. నిర్లక్ష్యానికి తావివ్వకుండా మరింత లోతుగా పరిశీలన చేస్తున్నారు. ప్రయాణాల చరిత్ర ఆ«ధారంగా ట్రాక్ చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ క్యూఆర్ కోడ్ ఇస్తున్నారు. ప్రతి పది మందికీ ఒక కోవిడ్ ఆఫీసర్‌ను నియమించారు. వారిని పర్యవేక్షించేందుకు మండలానికో స్పెషల్ ఆఫీసర్‌ను ఏర్పా టు చేయగా, జిల్లా స్థాయిలో కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు.
విదేశాల నుంచి 1445 మంది రాక
కరోనా ప్రభావం పెరిగిన నేపథ్యంలో విదేశాల నుంచి జిల్లాకు 1445 మంది వచ్చారు. వారందర్నీ ప్రత్యే క క్వారంటైన్‌లోనూ, హోమ్ క్వారంటైన్‌లో పెట్టా రు. లక్షణాలు ఉన్న వారికి ఎప్పటికప్పుడు శాంపి ల్స్ తీసి పరీక్షలు చేశారు. ఇంతవరకైతే విదేశాల నుంచి వచ్చిన వారెవరికీ పాజిటివ్ రాలేదు. దా దాపు శాంపిల్స్ అన్నీ నెగిటివ్ ఫలితాలొచ్చా యి. విదేశాల నుంచి వచ్చిన వారిలో అంతా దాదాపు 14 రోజులకు పైగా క్వారంటైన్ పూర్తి చేసుకున్నారు. దీంతో వారి ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం కని్పంచడం లేదు.
ప్రయాణ చరిత్ర ఆధారంగా..
విదేశాల నుంచి వచ్చిన వారినే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుంచి విమానాలు, రైళ్ల ద్వారా జిల్లాకు వచ్చిన వారి వివరాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. విమానయాన, రైల్వే శాఖ వచ్చిన వివరాలు ఆధారంగా సంబంధిత వ్యక్తులను గుర్తిస్తున్నారు. కొందర్ని ఫోన్‌లో ఆరా తీయగా, మరికొందర్ని చిరునామాల ఆ«ధారంగా చేసుకుని గుర్తిస్తున్నారు. పోలీసు, రెవెన్యూ, వలంటీర్లు, మెడికల్ సిబ్బంది ద్వారా ఇంటింటికీ వెళ్లి గుర్తింపు కార్యక్రమం చేపడుతున్నారు. జిల్లా ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి నేతృత్వంలో పోలీసు సిబ్బంది కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని గుర్తించడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. మొ త్తానికి ఫిబ్రవరి నెల నుంచి ట్రావెల్ హిస్టరీ చూస్తున్నారు. ఏ ఒక్కర్నీ విడిచి పెట్టడం లేదు.
లాక్‌డౌన్ తర్వాత జిల్లాలోకి 5009 మంది
లాక్‌డౌన్ అమలు తర్వాత జిల్లాలోకి 5009 మంది వచ్చినట్టు సమాచారం. వేర్వేరు మార్గాల ద్వారా వారంతా జిల్లాలోకి ప్రవేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాల నుంచి వచ్చిన సమాచారంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. వీరిలో ముంబై నుంచి 600 మంది, ఢిల్లీ నుంచి 400 మంది వచ్చిన వారు ఉన్నారు. మిగతా రాష్ట్రాలు, మిగతా జిల్లాల నుంచి కూడా వచ్చారు. వారందర్నీ అధికారులు ఇ ప్పటికే గుర్తించారు. వారికి ప్రత్యేక క్యూఆర్ కోడ్ కేటాయించారు. ఇలా వచ్చిన 10 మందికి ఒక కోవి డ్ ఆఫీసర్‌ను నియమించి ఎప్పటికప్పుడు వారి కదలికలను గమనిస్తున్నారు. కేటాయించిన 10మంది వద్దకు ప్రతి రోజూ కోవిడ్ ఆఫీసర్ వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. వారి వద్దకు వెళ్లాలంటే తప్పనిసరిగా స్కాన్ చేయాలి.
అక్కడ చేసిన స్కాన్ జిల్లా అధికా రుల వద్ద అప్‌డేట్ అవుతుంది. దీంతో కోవిడ్ ఆఫీ సర్లు వారికి కేటాయించిన 10మంది వద్దకు వెళ్తున్నారో లేదో ఇట్టే తెలిసిపోతుంది. మరోవైపు ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు వేలల్లో ఉండటంతో వారందరి కోసం వలంటీర్లు, ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు ఇంటింటికీ వెళ్లి ఆరా తీస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులు తెలుసు కుంటున్నారు. కరోనా అనుమానిత లక్షణాలు గానీ, ఇతర ఆరోగ్య సమస్యలు గానీ కనిపిస్తే వెంటనే నోట్ చేస్తున్నారు.
నోట్ చేసినవన్నీ వైద్యాధికారుల లాగిన్‌లోకి వచ్చేస్తున్నాయి. వాటి ఆధారంగా త దుపరి చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో శాంపిల్స్ సేకరణలో కూడా జోరు పెంచారు. సో మవారం ఒక్కరోజే 135 శాంపిల్స్ తీశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మంగళవారం కూడా పెద్ద సంఖ్యలో శాంపిల్స్ తీశారు. ఇకపై శాంపిల్స్ ఫలితాలు కూడా వేగంగా రానున్నాయి. ఇంతవరకు కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలకు పరీక్షల కోసం పంపించారు. తాజాగా విశాఖపట్నంలో కూ డా టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభం కావడంతో సుదూర ప్రాంతమైన కాకినాడకు కాకుండా విశాఖపట్నంకు పంపిస్తున్నారు. దీంతో ఫలితాల వెల్లడి కూడా వేగవంతం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment