శ్రీకాకుళంలో హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేస్తున్న దృశ్యం
సాక్షి, శ్రీకాకుళం: ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిపైనే సిక్కోలు పరిస్థితి ఆధారపడింది. రాష్ట్రంలో కరో నా కేసులు అమాంతం పెరగడానికి కారణం ఢిల్లీ తబ్లిగీ జమాత్ ప్రార్థనలే అన్న సంగతి అందరికీ తె లిసిందే. అయితే ఆ ప్రార్థనలకు మన జిల్లా నుంచి ఎవ్వరూ హాజరు కాలేదు. కానీ ఆ సమయంలోనే ఢిల్లీ ప్రయాణాలు చేసిన వారు ఉన్నారు. వారిపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఏ మాత్రం అ లసత్వం వహించినా చైన్‌లా కరోనా వ్యాపించే అవకాశం ఉంది. దాన్ని అడ్డుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఒక్కొక్కరిగా గుర్తిస్తున్నారు. వెంటవెంటనే శాంపిల్స్ తీసి ల్యాబ్‌కు పంపిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా నుంచి 50వరకు శాంపిల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. వాటి ఫలితాలు ఏం వస్తాయోనన్న టెన్షన్ జిల్లా వాసులకు పట్టుకుంది.
మొ న్నటి వరకు విదేశాల నుంచి వచ్చిన వారితోనే క రోనా వ్యాపిస్తుందని భయం ఉండేది. దాన్ని దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాంగం అప్రమత్త మైంది. విదేశాల నుంచి వచ్చిన వారందరినీ క్వా రంటైన్‌లో పెట్టింది. జిల్లాకు 1455 మంది విదేశాల నుంచి రాగా ఇప్పటివరకు 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారు 1217 మంది ఉన్నారు. 14 రోజుల లోపు క్వారంటైన్‌లో ఉన్న వారు 228 మంది మాత్రమే. ఇప్పటివరకు వారిలో కరోనా లక్షణాలు పెద్దగా కనిపించలేదు. దీంతో విదేశాల నుంచి వచ్చిన వారిపై కాస్త భయం తగ్గింది. అనుకోకుండా ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింంది. మన జిల్లాలో ఇంతవరకు ఒక్క పాజిటివ్ లేదు.
తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి మన జిల్లా నుంచి ముస్లింలెవరూ హాజరు కాలేదు. కాకపోతే ఆ కార్యక్రమానికి వెళ్లి తిరిగిన వచ్చిన వివిధ ప్రాంతాల వారితో రైళ్లలో ప్రయాణించే వా రు, ఆ సమయంలో వివిధ అవసరాల కోసం ఢిల్లీ లో ఉన్న వారు మన జిల్లాలో ఉన్నట్టు ప్రాథమిక సమాచారం. ఢిల్లీ సెల్ టవర్స్ సిగ్నల్ ఆధారంగా ఫోన్ నంబర్లు సేకరించి వారిని సంప్రదిస్తున్నారు. ఇదే సమయంలో ఢిల్లీ టవర్‌తో సంబంధం ఉన్న సెల్ నంబర్లకు జిల్లా నుంచి వెళ్లిన ఫోన్ కాల్స్ ఆధారంగా గుర్తిస్తున్నారు. మొత్తానికి దొరికిన వారికి సంబంధించి శాంపిల్స్ తీస్తున్నారు. అటు ఢిల్లీ ప్రయాణికులు, ఇటు కరోనా లక్షణాల అనుమానితులకు సంబంధించి 95 శాంపిల్స్ తీసి పంపించగా వా టిలో ఇప్పటివరకు 49 నెగిటివ్ వచ్చాయి. మరో 46 శాంపిల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. వాటిపైనే ఇప్పుడందరిలో ఉత్కంఠ నెలకొంది.
ఢిల్లీ నుంచి వచ్చిన వారిపై ఆరా
పొందూరు: మండలానికి ఢిల్లీ నుంచి వచ్చిన వారిని తహసీల్దార్ తామరాపల్లి తాడివలస పీహెచ్‌సీ డాక్టర్ సాగరికతో కలిసి పరిశీలించారు. రైల్వే డిపార్ట్‌మెంట్ ఇచ్చిన సమాచారం మేరకు 10 మంది ఢిల్లీ నుంచి వచ్చారని తెలిసిందని అన్నారు. వారిలో ఐదుగురు మాత్రమే మండలంలో ఉండగా మిగిలిన వారు రాలేదని చెప్పారు. ముగ్గురిని క్వా రంటైన్‌కు పంపించామని, ఇద్దరిని హోమ్ క్వారెంటైన్‌లో ఉంచామని తెలిపారు. వారిలో ఇద్దరికి పరీక్షలు జరిపించగా సాధారణ దగ్గు మాత్రమే ఉందని చెప్పారు.
లాక్‌డౌన్‌కు సహకరించండి
కాశీబుగ్గ: ప్రజలంతా ఇళ్లకే పరిమితమై లాక్‌డౌన్‌కు సహకరించాలని కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి కోరారు. శుక్రవారం కాశీబుగ్గలో సీఐ వేణుగోపాలరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. డివిజన్ పరిధిలోని 12 మండలాలకు ఢిల్లీ నుంచి వచ్చిన వారు 70 మందిని గుర్తించి జిల్లా కేంద్రంలోని క్వారంటైన్ సెంటర్‌కు తరలించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment