tablic jamath
-
తబ్లిగీ జమాత్‌పై దేశవ్యాప్తంగా ఈడీ సోదాలు
-
తబ్లిగీ జమాత్‌పై దేశవ్యాప్తంగా ఈడీ దాడులు
సాక్షి, హైదరాబాద్: కరోనాకు ముందు దేశవ్యాప్తంగా కలకలం రేపిన తబ్లిగీ జమాత్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దేశవ్యాప్తంగా ఆకస్మిక దాడులు చేసింది. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, కేరళలలో బుధవారం ఏకకాలంలో దాడులు చేసింది. హైదరాబాద్‌లోని మల్లేపల్లితో పాటు పాతబస్తీలోని మరో మూడు ప్రాంతాల్లో ఉన్న తబ్లిగీ జమాత్ కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. ఈ ఏడాది మార్చిలో ఢిల్లీ పోలీసులు మర్కజ్ చీఫ్ మౌలానాపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఈడీ రంగ ప్రవేశం చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో ప్రపంచ దేశాల నుంచి తబ్లిగీ జమాత్‌కు విరాళాల రూపంలో వచ్చిన నిధులు నిబంధనలకు విరుద్ధంగా సొంత ఖాతాలకు బదిలీ చేశారని ఈడీ గుర్తించింది. దీంతో పీఎంఎల్ఏ (ప్రీవెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్) కింద మౌలానా సాద్‌తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసింది. మనీలాండరింగ్‌తో పాటు హవాలా ద్వారా డబ్బుల లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది. కేసు దర్యాప్తులో భాగంగానే దేశవ్యాప్తంగా ఈ దాడులు నిర్వహించింది. -
తబ్లిగీ జమాత్ : 60 మంది మలేషియన్లకు జరిమానా
ఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉదృతికి ఢిల్లీలో జరిగిన నిజాముద్దీన్ మర్కజ్ తబ్లిగీ జమాత్ సమావేశం ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం తర్వాతనే భారత్‌లో ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగిపోయాయి. తాజాగా ఈ సమావేశంలో పాల్గొన్న 60 మంది మలేషియన్లు దేశం విడిచి వెళ్లే ముందు ఒక్కొక్కరు రూ. 7 వేలు జరిమానా చెల్లించాలంటూ ఢిల్లీ హైకోర్టు గురువారం స్పష్టం చేసింది. (కరోనా : దేశంలో సామాజిక వ్యాప్తి దశకు చేరుకోలేదు) కాగా కరోనా నేపథ్యంలో వీసా నిబంధనలతో పాటు భారత ప్రభుత్వం మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు గానూ విదేశీయులపై కేసులు నమోదయ్యయి. తబ్లిగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్న 36 దేశాలకు చెందిన 956 మంది విదేశీ పౌరులపై ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు 48 వేర్వేరు చార్జిషీట్లతో పాటు 11 అనుబంధ చార్జిషీట్లను దాఖలు చేసింది. వీరిలో మలేషియాకు చెందిన 122 మంది కూడా ఉన్నారు. కాగా మంగళవారం 122 మంది మలేషియన్ పౌరులకు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిలో భాగంగా కోర్టు ముందుగా 60 మంది మలేషియన్లకు రూ. 7వేల జరిమానా విధించింది. -
తబ్లిగీ జమాత్ సభ్యులకు కేంద్రం షాక్!
న్యూఢిల్లీ: నిబంధనలకు విరుద్ధంగా భారత్‌లో ప్రవేశించిన దాదాపు 960 మంది తబ్లిగీ జమాత్ విదేశీ సభ్యులకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ షాకినట్లు తెలుస్తోంది. పదేళ్లపాటు దేశంలోకి సదరు వ్యక్తుల ప్రయాణాలపై నిషేధం విధించి.. బ్లాక్‌లిస్టులో పెట్టినట్లు సమాచారం. వీరిలో నలుగురు అమెరికన్లు, తొమ్మిది మంది బ్రిటిషర్లు, ఆరుగురు చైనీయులు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా ప్రాణాంతక కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి వేలాది మంది హాజరుకావడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. వీరిలో అత్యధికులకు మహమ్మారి సోకడం సహా వారంతా వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన నేపథ్యంలో.. తబ్లిగీల ద్వారా దేశంలోని పలు ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి చెందిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. (వైరల్: జమాతే సభ్యులపై డాక్టర్ అనుచిత వ్యాఖ్యలు) ఈ నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్న కారణంతో తబ్లిగీ చీఫ్ మౌలానా సాద్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం విదితమే. అదే విధంగా దాదాపు 67 దేశాల నుంచి టూరిస్టు వీసా మీద భారత్‌కు వచ్చి మతపరమైన సమావేశంలో పాల్గొని వీసా నిబంధలను ఉల్లంఘించిన విదేశీయులపై కూడా కేసులు నమోదయ్యాయి. అంతేగాక గల్ఫ్ దేశాల నుంచి ఢిల్లీలోని తబ్లిగీ జమాత్ పెద్దల ఖాతాల్లోకి కోట్లాది రూపాయల నిధులు మళ్లించినట్లు ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో మౌలానాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో మౌలానాకు అత్యంత సన్నిహితులు, ముఖ్య అనుచరులుగా భావిస్తున్న ఐదుగురి పాస్‌పోర్టులను సీజ్ చేసి విచారణ వేగవంతం చేశారు.(తబ్లీగ్ జమాత్ చీఫ్‌పై సీబీఐ దర్యాప్తు) -
జమాతే సభ్యులపై డాక్టర్ అనుచిత వ్యాఖ్యలు
-
‘వారిని ఆస్పత్రుల్లో కాదు.. అడవుల్లో పడేయాలి’
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ సీనియర్ వైద్యురాలు తబ్లిగీ జమాతే సభ్యులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ మత ప్రార్థనల్లో పాల్గొన్నవారిని టెర్రరిస్టులతో పోల్చారు. వారిని ఆస్పత్రులకు కాకుండా నేరుగా జైలుకు తరలించాలని లేదంటే.. అడవుల్లోకి పంపేయాలని అసహనం వ్యక్తం చేశారు. కాన్పూర్‌లోని గణేష్ శంకర్ విద్యార్థి మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఆర్తిలాల్ చందని చేసిన వివక్షాపూరిత వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెత్త ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు నెలల కిందటి ఈ వీడియో వైరల్ అయింది. ఇదిలాఉండగా.. ముస్లిం మత ప్రార్థనల్లో పాల్గొన్న వారికి గణేష్ శంకర్ విద్యార్థి మెడికల్ కాలేజీలో ఏప్రిల్‌లొ క్వారైంటన్ సౌకర్యం కల్పించారు. ఈక్రమంలో జమాతే సభ్యులు తమతో అసభ్యంగా ప్రవర్తించారని, ఆస్పత్రిలో ఎక్కడపడితే అక్కడే ఉమ్మివేశారని అప్పట్లో కాలేజీ యాజమాన్యం ఆరోపించింది. భౌతికదూరం పాటించలేదని పేర్కొంది. కాగా, తాజాగా విడుదలైన 5 నిముషాల వీడియోపై ఆర్తి స్పందించారు. తబ్లిగీ సోదరులపై తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. తన వీడియోను మార్ఫింగ్ చేశారని చెప్పారు. తాను ఏ వర్గాన్ని కించపర్చలేదని పేర్కొన్నారు. ఇంకా ఆ వర్గం మంచి కోసం తాను ఎప్పుడూ పనిచేస్తామనని చెప్పుకొచ్చారు. కాగా, ఆర్తి వ్యాఖ్యలపై మాజీ ఎంపీ, సీపీఐ(ఎం) నేత సుభాషిణి అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్రపజాస్వామిక, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
తబ్లీగ్ జమాత్ చీఫ్‌పై సీబీఐ దర్యాప్తు
న్యూఢిల్లీ: తబ్లీగ్ జమాత్ చీఫ్, నిజాముద్దీన్ మర్కజ్‌కు చెందిన మౌలానా సాద్‌కు హవాలా మార్గంలో విదేశాల నుంచి వచ్చిన విరాళాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు కొనసాగిస్తోంది. నిజాముద్దీన్‌లో తబ్లీగ్ జమాత్ సమావేశం నిర్వహించి కరోనా వ్యాప్తికి కారణమైన మౌలానా సాద్ పై ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనంతరం హవాలా మార్గంలో మౌలానాకు విదేశాల నుంచి విరాళాలు వచ్చాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేసింది. దీంతో తాజాగా రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు, ఈడీ, ఐటీ విభాగాల నుంచి మౌలానాకు అందిన విదేశీ విరాళాలపై సమాచారాన్ని సేకరించారు. తబ్లీగ్ జమాత్ విదేశీ విరాళాల వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న మౌలానా సన్నిహితుడైన ముర్సలీన్‌ను మే 16న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారించారు. చదవండి: 82 మంది విదేశీయులపై చార్జీషీటు దాఖలు జమాత్ ట్రస్టుకు విదేశీ విరాళాలు హవాలా మార్గంలో స్వీకరించి మనీలాండరింగ్ కు పాల్పడ్డారని ఈడీ దర్యాప్తులో తేలడంతో సీబీఐ రంగంలోకి దిగి మౌలానా సాద్ పై దర్యాప్తు సాగిస్తోంది. మర్కజ్ ట్రస్ట్‌తోపాటు మౌలానా సాద్‌పై సీబీఐ చర్యలు తీసుకోనుంది. అంతకుముందు మర్కజ్ విరాళాలపై కీలక పత్రాలను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా.. మార్చి 13 తరువాత మార్కాజ్ లోపల ఉన్న వేలాది మంది భారతీయులను, విదేశీయులను దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ధిక్కరించడానికి మౌలానా సాద్ ప్రోత్సహించారని ఆరోపణలున్నాయి. కోవిడ్ -19 పాజిటివ్ వచ్చిన 4,300 మంది వ్యక్తులు మర్కజ్లో జరిగిన కార్యక్రమానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం కలిగి ఉన్నారని కేంద్ర ప్రభుత్వం సమర్పించిన గణాంకాలు సూచిస్తున్నాయి. చదవండి: ఎన్ 95 మాస్క్‌ల పేరుతో భారీ మోసం -
82 మంది విదేశీయులపై చార్జీషీటు దాఖలు
న్యూఢిల్లీ : ఢిల్లీకి చెందిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు 82 మంది విదేశీయులపై మంగళవారం చార్జీషీట్ దాఖలు చేసింది. దేశవ్యాప్తంగా కరోనా విజృంభించడంలో ప్రముఖ పాత్ర పోషించిన నిజాముద్దీన్‌లోని తబ్లిగి జమాత్‌తో వీరికి సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో 20 చార్జీషీట్లు దాఖలు చేసినట్లు క్రైమ్ బ్రాంచ్ స్పష్టం చేసింది. ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టులో మెజిస్ట్రేట్ సేమా జైల్ ఎదుట చార్జీషీట్లు దాఖలు చేశామని, మొత్తం 20 చార్జీషీట్లను 15449 పేజీలతో రూపొందించినట్లు తెలిపారు. చార్జీషీట్ దాఖలైన వారిలో 14 మంది ఫిజి దేశం నుంచి, 10 మంది సౌదీ అరేబియా, 8 మంది అల్జేరియా, బ్రెజిల్, చైనా నుంచి ఏడుగురు, సుడాన్, ఫిలిప్పీన్స్ నుంచి ఆరుగురు, ఐదుగురు యూఎస్ఏ, నలుగురు అప్ఘనిస్తాన్, ఇద్దరు చొప్పున ఆస్ట్రేలియా, కజకిస్తాన్, మొరాకొ, యూకే నుంచి ఉండగా, ఈజిప్ట్, రష్యా, బెల్జియం, జోర్డాన్, ఫ్రాన్స్, ట్యూనిషియా నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. వీసా నిబంధలను ఉల్లఘించడంపై వీరిపై చార్జీషీట్ దాఖలు చేశామని అధికారులు పేర్కొన్నారు. మర్కజ్ సమావేశానికి హాజరయ్యారా లేదా అనే దానిపై ఇప్పటికే వారిని ప్రశ్నించినట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. (కరోనా : రాజకీయ సంక్షోభం తప్పదా..!) -
తబ్లిగీ జమాత్ చీఫ్‌కు మరో షాక్!
న్యూఢిల్లీ: తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ కంధల్వి, ఆయన అనుచరుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మౌలానాకు అత్యంత సన్నిహితులు, ముఖ్య అనుచరులుగా భావిస్తున్న ఐదుగురి పాస్‌పోర్టులను ఢిల్లీ క్రైంబ్రాంచ్ సీజ్ చేశారు. ముఫ్తి షాజాద్, జిషాన్, ముర్సాలిన్ సైఫీ, మహ్మద్ సల్మాన్, యూనస్‌లు దేశం విడిచి వీల్లేకుండా కట్టడి చేశారు. అదే విధంగా నిబంధనలకు విరుద్ధంగా తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైన 916 మంది విదేశీయులపై త్వరలోనే చార్జిషీట్ నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. వీరంతా టూరిస్టు వీసా మీద భారత్‌కు వచ్చి మతపరమైన సమావేశంలో పాల్గొని వీసా నిబంధలను ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఈ క్రమంలో 67 దేశాల నుంచి వచ్చిన విదేశీయుల వ్యవహారాలపై దర్యాప్తు చేపట్టామని.. వీరందరినీ వివిధ ప్రాంతాల్లో క్వారంటైన్ సెంటర్లలో పెట్టినట్లు తెలిపారు.(60 మంది తబ్లిగీ సభ్యుల అరెస్ట్) కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి వేలాది మంది హాజరుకావడం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. తబ్లిగీల ద్వారా అనేక ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి చెందిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్న కారణంతో తబ్లిగీ చీఫ్ మౌలానాపై కేసు నమోదు చేశారు. అదే విధంగా గల్ఫ్ దేశాల నుంచి ఢిల్లీలోని తబ్లీగ్ జమాత్ పెద్దల ఖాతాల్లోకి కోట్లాది రూపాయల నిధులు వచ్చినట్లు ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసుల విచారణలో తేలడం సంచలనం సృష్టించింది. దీంతో మౌలానాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో ఆయనకు సహకరించిన ముర్సాలిన్ సైఫీని ఈడీ అధికారులు విచారించగా.. తాజాగా అతనితో పాటు మరో నలుగురి పాస్‌పోర్టులను ఢిల్లీ పోలీసులు సీజ్ చేశారు. -
మత వివక్ష ఆరోపణలను భారత్ తిప్పికొట్టాలి
భారతీయ సమాజం, రాజకీయ వ్యవస్థలోని కొన్ని విభాగాలు ఇస్లామోఫోబియా సంకేతాలను ప్రదర్శిస్తున్నాయని, ప్రత్యేకించి కరోనా వైరస్ వ్యాధి (కోవిడ్ –19) వ్యాప్తి తర్వాత, ఇస్లామిక్ దేశాలైన సౌదీ అరేబియా, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి కొన్ని దేశాలలో ఆందోళన నెలకొనివుంది. ప్రధాని నరేంద్రమోదీ ఈ అభియోగాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. అందరినీ లక్ష్యంగా చేసుకున్న ఈ వైరస్‌ను ఎదుర్కోవడంలో ఐక్యత, సోదరభావం ఉండాల్సిన అవసరాన్ని ఏప్రిల్ 19న చేసిన తన ట్వీట్లో మోదీ నొక్కి చెప్పారు. తబ్లిగీ జమాత్ చర్యలకు ముస్లింలందరినీ బాధ్యులుగా చేయడం తప్పని ఆయన అన్నారు. ఇదే అభిప్రాయాన్ని సీనియర్ భారతీయ జనతా పార్టీ ప్రతినిధి ఒకరు కూడా వ్యక్తం చేశారు. గతంలోలాగే ఈ సంవత్సరం కూడా మోదీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర మాసం దయ, సామరస్యం, కరుణలను సమృద్ధిగా తేవాలని ఆయన ట్వీట్ చేశారు. సమానత్వం, సోదరభావం, దాతృత్వ విలువల గురించిన ప్రవక్త సందేశాన్ని రెండు సంవత్సరాల క్రితం మోదీ గుర్తు చేసుకున్నారు. 2016లో ప్రపంచ సూఫీ ఫోరమ్‌లో ప్రసంగించిన మోదీ, ‘‘ఒక గొప్ప మతం యొక్క దృఢమైన పునాదులపై నిలిచివున్న ఇస్లామిక్ నాగరికత యొక్క గొప్ప వైవిధ్యాన్ని’’ గురించి మాట్లాడారు. అదే ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ, ‘‘ఈ సూఫీ మత స్ఫూర్తి, తమ దేశంపై వారికున్న ప్రేమ, గౌరవాలే భారతదేశ ముస్లింలను నిర్వచిస్తా’యని అన్నారు. ‘అవి మన దేశపు చిరకాల సంస్కృతియైన శాంతి, వైవిధ్యం, సమానత్వాలను ప్రతిబింబిస్తాయి...’ కదిలించే ఈ మాటలు ఇస్లామోఫోబియానో, ముస్లిం వ్యతిరేక పక్షపాతాన్నో ఎత్తి చూపవు. అయితే మరెందుకు ఉమ్మా యొక్క ఇస్లామిక్ విభాగాలు భారతదేశ ధోరణుల వల్ల ఇబ్బంది పడుతున్నాయి? గత విధానాలను ఆధారంగా చేసుకొని, పరస్పర విరోధులుగా ఉన్న పశ్చిమ ఆసియా దేశాలతో సంబంధాలను బలోపేతం చేసిన మోదీ మొదటి పదవీకాలంలో ఇది కనిపించలేదు. అందువల్ల, భారత ముస్లింలపై ప్రభావం చూపుతున్న లేదా ప్రభావితం చేసే ఈ రెండవసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వ విధానాలను, చర్యలను; ఈ అంశాలను పాకిస్తాన్ ఎలా ఉపయోగించుకోవాలని చూస్తూవుందో కూడా పరిశీలించాల్సి వుంది. నాలుగు పరిణామాలు విశిష్టంగా కనిపిస్తున్నాయి: జమ్మూ కశ్మీర్లో రాజ్యాంగపరమైన మార్పులు, పౌరసత్వం (సవరణ) చట్టం లేదా సీఏఏ, దీన్ని నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్íసీ)కు ముందస్తు చర్యగా ముస్లింలు భయపడటం, ఢిల్లీ అల్లర్లు, తబ్లిగీ జమాత్ సమావేశాలకు ప్రతి స్పందనలు.జమ్మూ కశ్మీర్లో జరిగిన రాజ్యాంగపరమైన మార్పులు భారతదేశ రాజకీయ, దేశ అధికార పరిధిలోని విషయాలుగా అరబ్ దేశాలలో చూడబడ్డాయి. భారతదేశం అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తోందంటూ పాకిస్తాన్ చేసిన ఆరోపణలు, ఐక్యరాజ్యసమితి తీర్మానాలు, కశ్మీర్ లోయలోని జనాభా స్థితిగతుల నిర్మాణాన్ని మార్చాలని, మానవ హక్కులను పట్టించుకోవటం లేదని చేస్తున్న ఆరోపణలకు ప్రతిస్పందన లేదు. మోదీ ప్రభుత్వానికీ, దాని సైద్ధాంతిక హిందుత్వ మూలాలకూ వ్యతిరేకంగా పాకిస్తాన్ చేస్తోన్న తీవ్ర విమర్శ కూడా విస్మరించబడింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గాన్లలోని మత రాజకీయాల పరిపాలనను పరిగణనలోకి తీసుకుంటే, సీఏఏ నుండి ముస్లింలను మినహాయించడం సహజంగానే వివక్షాపూరి తంగానూ, కొన్నిసార్లు హింసాయుతంగానూ అనిపిస్తుంది. భారతీయ ముస్లింలపై సీఏఏ ఎటువంటి ప్రభావం చూపలేదని మోదీ ప్రభుత్వం సరిగ్గానే నొక్కి చెప్పింది. ఏదేమైనా, ఇది ఎన్ఆర్సీకి ముందస్తు చర్య అనీ, ఇది తమలో చాలామందిని విస్థాపనకు గురిచేస్తుందనీ భావించిన అనేకమంది ముస్లింలు భయపడ్డారు. తదనంతరం కొనసాగిన సుదీర్ఘ ఆందోళనలు గల్ఫ్ దేశాలతో సహా ముస్లిం ప్రపంచంలో గుర్తించబడ్డాయి. పాకిస్తాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, జాతీయతను మంజూరుచేయడంలో మతం ఒక కారకంగా మారడం కారణంగా అంతర్జాతీయ ఉదారవాద అభిప్రాయం మరింత దూరమైనప్పటికీ గల్ఫ్ దేశాలు శత్రువులుగా మారలేదు. అయితే, మలేసియా, టర్కీలు మాత్రం మారాయి. ఢిల్లీ అల్లర్లు, కొన్ని సందర్భాల్లో కోవిడ్ –19 వ్యాప్తికి దోహదపడిన తబ్లిగీ జమాత్ చర్యలకు వ్యతిరేకంగా చెలరేగిన ప్రతిచర్యలు గల్ఫ్ దేశాలలోని కొన్ని వర్గాల అభిప్రాయాలను మార్చివేశాయి. తబ్లిగీ జమాత్ ప్రవర్తన నేపథ్యంలో ముస్లింలను పూర్తిగా సాధారణీకరిస్తూ వారికి వ్యతిరేకంగా నిందార్హమైన వ్యాఖ్యలు వచ్చాయి. ముస్లింలను దేశ బహిష్కారం చేయాలనే బాధ్యతారహిత డిమాండ్లు, కొన్ని గల్ఫ్ దేశాల్లో ఆందోళన, ఆగ్రహాలకు కారణమయ్యాయి. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న కొంతమంది భారతీయులు సామాజిక మాధ్యమాల్లో చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు దానికి మరింత ఆజ్యం పోశాయి. ఇది సరిగ్గా పాకిస్తాన్‌కు కొన్ని నకిలీ సామాజిక మాధ్యమాల అకౌంట్ల ద్వారా భారత్ వ్యతిరేక జ్వాలను ఎగదోసేలా మంచి అవకాశం ఇచ్చినట్లయింది. అలాగే మోదీ ప్రభుత్వం పట్ల తనకున్న నేరారోపణ చిట్టాలను తవ్వేందుకు పనికొచ్చింది. ఇప్పుడు దాని స్పష్టమైన ప్రయత్నం ఏమంటే– ఇస్లామోఫోబియాను అధికారికంగా ప్రోత్సహించిందని ఇండియాకు వ్యతిరేకంగా అత్యున్నత స్థాయిలో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) చేత ఆక్షేపణ జారీ చేయించడం. కొన్ని రోజుల క్రితం ఓఐసీ దేశాలకు ఇచ్చిన నాలుగు పేజీల లేఖలో– ముస్లింల పట్ల ద్వేషం అనే కీలక భూమికపైనే బీజేపీ అధికారంలోకి రావడమూ, అనంతరం బలపడటమూ జరిగిందని పాకిస్తాన్ నొక్కిచెప్పింది. ఈ ఇస్లామోఫోబియా ఆరోపణలను కరాఖండిగా ఎదుర్కోవాలి. మత రాజ్యాలైన ఇస్లామిక్ దేశాలు ప్రాథమికంగా వివక్షాపూరితమైనవి అన్నది నిజం. అవి కూడా వీగర్ ముస్లింల పట్ల చైనా అణచివేత ధోరణిని నిందించడం లేదు. పాఠశాల చర్చా కార్యక్రమాల్లో ఈ అంశాలు మెరుస్తాయేమోగానీ ప్రపంచ దౌత్యంలో ఇవి పని చేయవు. అక్కడ మార్కులు కొట్టేయడం కన్నా, తమ దేశ ప్రయోజనాలను కాపాడుకోవడం ముఖ్యం. కాబట్టి ఇప్పుడు చేయవలసింది ఏమంటే– స్వీయ రక్షణలో పడకుండా, భారత్ తన రాజ్యాంగ స్ఫూర్తి నుంచి ఎంత మాత్రమూ దూరం జరిగిపోవడం లేదనీ, దేశ ఐక్యతను దెబ్బతీసేవారు ఎవరైనా, పార్టీలకు అతీతంగా వారి పట్ల తగిన చర్యలు తీసుకుంటున్నామనీ ఇస్లామిక్ దేశాలకు నమ్మకం కలిగించాలి. అలాగే ప్రపంచ ఉదారవాదుల అభిప్రాయాల పట్ల తిరస్కార భావం ప్రదర్శించకుండా, వారితో చర్చించడం కూడా ముఖ్యం. వ్యాసకర్త: వివేక్ కట్జూ, మాజీ దౌత్యవేత్త -
కుట్రతోనే తబ్లీగీలు రాష్ట్రంలోకి ప్రవేశించారు
బెంగుళూరు : తబ్లీగి జమాత్, అజ్మీర్ దర్గాకు వెళ్లి వచ్చినవారి నుంచే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందిందని కర్ణాటక బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ రవికుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దొంగల్లాగా రాష్ట్రంలో ప్రవేశించి కరోనా వ్యాప్తికి కారకులయ్యారని దుయ్యబట్టారు. రాజస్తాన్‌లోని అజ్మీర్‌లోని దర్గాకు హాజరైన దాదాపు 1900 మంది, తబ్లీగికి వెళ్లొచ్చిన 500 మంది ద్వారానే కర్ణాటకలో సెకండరీ కాంటాక్ట్ ద్వారా వైరస్ వ్యాప్తికి కారకులయ్యారని ఆరోపించారు. మేధావులుగా పిలువబడే సమాజ పెద్దలు తబ్లీగీల చర్యలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. అంతేకాకుండా ఆశా వర్కర్లపై జరుగుతున్న దాడులను ఖండించిన రవికుమార్.. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. అయితే ఒక మతానికి కరోనాను అంటగడుతూ, వారి వల్లే ఇలా జరిగిందని దూషించడం ఎంత మాత్రం సమంజసం కాదని ప్రధాని మోదీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై రవికుమార్ స్పందిస్తూ.. పార్టీ వైఖరి, వ్యక్తిగత అభిప్రాయాలు వేర్వేరని పేర్కొన్నారు. ఇప్పటివరకు కర్ణాటకలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 862కి చేరగా, 31 మంది మరణించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం 9 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంది. (మా షాపులో ముస్లింలెవరు పనిచేయడం లేదు!) -
ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు..
చెన్నై : ముస్లింలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు ఒక బేకరి యజమాని అరెస్టు చేసిన ఘటన చెన్నెలోని టీనగర్లో చోటుచేసుకుంది. తమ షాపులో ముస్లింలెవరు పని చేయడం లేదని, అన్ని జైన మతస్తులు తయారు చేసిన స్వీట్లే ఉన్నాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. వివరాల్లోకి వెళితే.. చెన్నైకి చెందిన ఒక వ్యక్తి టీనగర్లో జైన్ బేకరీస్ అండ్ కన్ఫెక్షనరీస్ పేరుతో బేకరీ షాపును నిర్వహిస్తున్నాడు. కరోనా నేపథ్యంలో దేశంలో కేసులు పెరగడానికి తబ్లీగి జమాత్ సమావేశం ఒక కారణమన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఘటనతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ సమావేశానికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో ముస్లింలు హజరయ్యారు. దీంతో ముస్లింలు నిర్వహించే షాపుల నుంచి వస్తువులను కొనడానికి ప్రజలు భయపడుతున్నారు. (మంచిర్యాల జిల్లాలో కరోనా కలకలం..) ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న సదరు యజమాని బేకరీ షాపు బాగా నడవాలంటే తమ షాపులో ముస్లింలెవరు పని చేయడం లేదంటూ ఒక అడ్వర్టైజ్మెంట్ను తయారు చేయించి వాట్సప్ ద్వారా వినియోగదారులకు షేర్ చేశాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో విషయం తెలుసుకున్న పోలీసులు సదరు యజమానిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై సెక్షన్ 153( రెచ్చగొట్టే వ్యాఖ్యలు), 153ఏ, 505( మతానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు), సెక్షన్ 295 ఏ కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు దేశంలో 62939 మందికి కరోనా సోకగా.. 2109 మంది మరణించారు. 19,359 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 41472 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి. (దేశంలో కరోనా విలయం.. మరో 3,277) -
తబ్లిగి జమాత్ సభ్యుల విడుదలకు ఏర్పాట్లు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో క్వారంటైన్ గడువును పూర్తిచేసిన 4000 మంది తబ్లిగి జమాత్ సభ్యులను విడుదల చేయాలని ఢిల్లీ ప్రభుత్వం బుధవారం ఆదేశించింది. క్వారంటైన్ ముగిసిన తబ్లిగి సభ్యులను క్వారంటైన్ కేంద్రాల నుంచి విడుదల చేయాలని, మర్కజ్ ఘటనలో ప్రమేయం కలిగి విచారణను ఎదుర్కోవాల్సిన వారిని ఢిల్లీ పోలీసుల కస్టడీకి తరలించాలని ఢిల్లీ హోంమంత్రి సత్యేందర్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. మర్కజ్ ఘటనతో సంబంధం లేని ఇతరులందరినీ వారి స్వరాష్ట్రాలకు పంపించాలని, ఈ ఏర్పాట్ల నిమిత్తం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల రెసిడెంట్ కమిషనర్లతో సంప్రదింపులు జరపాలని హోం శాఖను కోరామని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశ రాజధానిలో 4000 మంది తబ్లిగి సభ్యులు క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నారు. వీరిలో 900 మంది ఢిల్లీ వాసులు కాగా మిగిలిన వారిలో అత్యధికులు తమిళనాడు, తెలంగాణకు చెందిన వారని అధికారులు తెలిపారు. వీరిని స్వస్ధలాలకు పంపేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో ఢిల్లీ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. వేలాది మంది తబ్లిగి జమాత్ సభ్యులు ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో మర్కజ్‌కు హాజరైన అనంతరం పలువురు సభ్యులకు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఈ ప్రాంతం కరోనా హాట్‌స్పాట్‌గా మారిన సంగతి తెలిసిందే. వీరిలో కొందరు ఆరోగ్య కార్యకర్తల పట్ల దురుసుగా ప్రవర్తించడం కలకలం రేపింది. చదవండి : బాయ్స్ లాకర్ రూం: షాకింగ్‌గా ఉంది.. -
జమాతే ప్రార్థనలు: మొత్తం సంఖ్య ఎంతో తెలుసా!
న్యూఢిల్లీ: తబ్లిగీ జమాతే ప్రార్థనల్లో పాల్గొన్నవారి మొత్తం సంఖ్య 16,500 వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్లో మార్చి 13 నుంచి 24 వరకు జరిగిన ఈ ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి వైరస్ సోకిన సంగతి తెలిసిందే. దాంతో వారు దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించడంతో మరికొంత మంది వైరస్ బారినపడ్డారు. ఇక జమాతే హెడ్ క్వార్టర్స్ మర్కజ్ మసీదును ఆయా తేదీల్లో సందర్శించిన వారిని సెల్‌ఫోన్ డేటా ఆధారంగా గుర్తించామని జమాతే విచారణలో భాగమైన ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. ప్రార్థనల్లో పాల్గొన్న 16,500 మందిని గుర్తించడానికి భారీ కసరత్తు చేశామని తెలిపారు. (చదవండి: 30% కేసులకు మర్కజ్ లింక్) ప్రార్థనల్లో పాల్గొన్నవారితో కాంటాక్ట్ అయిన 15 వేల మంది వివరాలు సేకరించడానికి బాగా శ్రమించాల్సి వచ్చిందన్నారు. వారందరినీ ట్రేస్ చేయడానికి అన్ని రకాల పోలీసుల సేవలను వినియోగించుకున్నామని చెప్పారు. ఇక మార్చి 24న నుంచి అమల్లో కొచ్చిన లాక్‌డౌన్‌తో కొందరు మర్కజ్‌లోనే చిక్కుకుపోవడంతో.. మార్చి 29 నుంచి 31 వరకు ఢిల్లీ పోలీసులు అక్కడున్న 2300 మందిని ఖాళీ చేయించారు. ఇక దేశంలోని మొత్తం కరోనా కేసుల్లో 30 శాంత కేసులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మర్కజ్‌తో ముడిపడి ఉన్నవే కావడం గమనార్హం. కాగా, తబ్లిగీ జమాతే కార్యక్రమాన్ని లాక్డౌన్ నిబంధనలకు విరుద్దంగా నిర్వహించడంపై జమాతే చీఫ్ మౌలానా సాద్‌పై కేసు నమోదైన విషయం విదితమే. ఇప్పటికే సాద్‌పై ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1897 కింద కేసులు నమోదు చేయడంతో పాటు.. ఆ సమ్మేళనానికి విదేశాల నుంచి మనీలాండరింగ్ నిబంధనలు ఉల్లంఘించి హవాలా ద్వారా విరాళాలు సేకరించారని ఆరోపిస్తూ ఈడీ అధికారులు కూడా కేసులు నమోదు చేశారు. (చదవండి: తబ్లిగీ జమాత్ చీఫ్‌కు ఐదోసారి నోటీసులు) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1351281875.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
తప్పే: తబ్లిగీ జమాత్‌పై యోగీ ఫైర్!
లక్నో : గత మార్చిలో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ విరుచుకుపడ్డారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరగటానికి జామాతే కారణమంటూ మండిపడ్డారు. శనివారం జరిగిన ‘ఈ ఎజెండా ఆజ్‌తక్’ అనే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ తబ్లిగీ జమాత్ చేసిన పనిని ఖండిస్తున్నా. తబ్లిగీ సభ్యులు ఈ విధంగా ప్రవర్తించకుండా ఉండిఉంటే లాక్డౌన్ మొదటి దశలోనే కరోనాను కట్టడి చేసేవాళ్లం. తబ్లిగీ జమాత్ చేసింది నేరం.. సభ్యులు కచ్చితంగా శిక్షింపబడాలి. రాష్ట్రంలో దాదాపు 3,000 మంది తబ్లిగీ జమాత్ సదస్సుతో సంబంధం ఉన్నవారు ఉన్నారు. రోగం తెచ్చుకోవటం నేరం కాదు. కానీ, దాన్ని దాచిపెట్టడం కచ్చితంగా నేరమే. చట్టాన్ని అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటా’’మని అన్నారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటివరకు 2,328మంది కరోనా వైరస్ బారినపడగా, 654మంది కోలుకున్నారు. దాదాపు 42మంది మృత్యువాత పడ్డారు. చదవండి : తబ్లిగీ సభ్యులపై పొగడ్తలు: అధికారికి నోటీసులు -
తబ్లిగీ సభ్యులపై పొగడ్తలు: అధికారికి నోటీసులు
సాక్షి, బెంగళూరు : తబ్లిగీ జమాత్‌కు చెందిన సభ్యులను పొగుడుతూ కామెంట్లు చేసిన ఓ ఐఏఎస్ అధికారికి ప్రభుత్వం షోకాజు నోటీసులు జారీ చేసింది. ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. మహ్మద్ మోహ్సిన్ అనే ఐఏఎస్ అధికారి కర్ణాటక బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సెక్రటరీగా పనిచేస్తున్నారు. గత నెల 27న తన ట్విటర్ ఖాతాతో తబ్లిగీ సభ్యులపై స్పందిస్తూ.. ‘‘ ఒక్క ఢిల్లీలోనే మూడు వందలకుపైగా తబ్లిగీ హీరోలు దేశానికి సేవ చేయటానికి తమ ప్లాస్మాను దానం చేస్తున్నారు. దీని గురించి ఏమంటారు.. గోదీ మీడియా? తబ్లిగీ హీరోలు చేస్తున్న మంచి పనులను వారు ప్రజలకు చూపించరు’’ అని కామెంట్ చేశారు.(తబ్లిగీ జమాత్ చీఫ్‌కు ఐదోసారి నోటీసులు) ఈ ట్వీట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడి మీడియా సైతం ఈ ట్వీటును హైలెట్ చేసింది. దీంతో స్పందించిన ప్రభుత్వం సదరు అధికారికి షోకాజు నోటీసులు జారీ చేసింది. ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ 1968ను అతిక్రమించినందుకు గానూ ఐదు రోజుల్లో రాత పూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ( 24 గంటలు..77 మరణాలు) -
తబ్లిగీ జమాత్ చీఫ్‌కు ఐదోసారి నోటీసులు
న్యూఢిల్లీ : తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ నుంచి సరైన సమాధానం రానుందున ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు ఐదోసారి నోటీసులు జారీ చేశారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో తబ్లిగీ జమాత్ కార్యక్రమాన్ని లాక్ డౌన్ నిబంధనలకు విరుద్దంగా నిర్వహించడంపై మౌలానా సాద్‌పై కేసు నమోదైన విషయం విదితమే. ఇప్పటికే సాద్‌పై ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1897 కింద కేసులు నమోదు చేయడంతో పాటు.. తబ్లీగ్ జమాత్‌కు విదేశాల నుంచి మనీలాండరింగ్ నిబంధనలు ఉల్లంఘించి హవాలా ద్వారా విరాళాలు సేకరించారని ఆరోపిస్తూ ఈడీ అధికారులు కూడా కేసులు నమోదు చేశారు. గల్ఫ్ దేశాల నుంచి ఢిల్లీలోని తబ్లీగ్ జమాత్ పెద్దల ఖాతాల్లోకి కోట్లాదిరూపాయల నిధులు వచ్చాయని ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసుల దర్యాప్తులో తేలడం సంచలనం రేపింది. నిజాముద్దీన్ మర్కజ్ చీఫ్ మౌలానా సాద్ తోపాటు అతని సన్నిహితుల ఖాతాల్లోకి గల్ఫ్ దేశాల నుంచి నిధులు వచ్చాయని తేలింది. జమాత్ చీఫ్ మౌలానా సాద్, అతని సన్నిహితుల బ్యాంకు ఖాతాల్లోకి వచ్చిన కోట్లాదిరూపాయల నగదు వివరాలను ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు సమాచారం అందించారు. మౌలానా సాద్ తోపాటు అతని ముగ్గురు కుమారులు, మేనల్లుడి ఖాతాల్లోకి గల్ఫ్ డబ్బు వచ్చిందని సమాచారం. వీరిని ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు ఇప్పటికే విచారించినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు పంపిన నోటీసులకు మౌలానా సాద్ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో మరోసారి నోటీసులు జారీ చేశారు. -
24 గంటలు..77 మరణాలు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి స్త్వైర విహారం చేస్తోంది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్నప్పటికీ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు.. కేవలం 24 గంటల్లో ఏకంగా 77 మంది కరోనా కాటుతో మృత్యువాత పడ్డారు. అలాగే కొత్తగా 1,755 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటిదాకా మొత్తం మరణాల సంఖ్య 1,152కు, పాజిటివ్ కేసుల సంఖ్య 35,365కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 25,148 కాగా.. 9,064 మంది(25.63 శాతం) బాధితులు చికిత్సతో కోలుకున్నారు. మొత్తం బాధితుల్లో 111 మంది విదేశీయులు సైతం ఉన్నారు. స్వదేశంలో పీపీఈ కిట్ల తయారీ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి వ్యక్తిగత రక్షణ పరికరాల(పీపీఈ) పంపిణీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. 2.22 కోట్ల పీపీఈ కిట్ల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చామని, ఇందులో 1.43 కోట్ల కిట్లను భారత్‌లోని స్వదేశీ సంస్థలే తయారు చేస్తున్నాయని పేర్కొంది. గతంలో పీపీఈ కిట్ల కోసం విదేశాలలపై ఆధారపడాల్సి వచ్చేదని, ఇప్పుడు వీటిని తయారు చేసే సంస్థలు భారత్‌లో 111 ఉన్నాయని కేంద్ర సాధికార సంఘం–3 చైర్మన్ పి.డి.వాఘేలా తెలిపారు. దేశంలో ప్రస్తుతం 19,398 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని, మరో 60,884 వెంటిలేటర్లకు ఆర్డర్ ఇచ్చామని, వీటిలో 59,884 వెంటిలేటర్లు మనదేశంలోనే తయారవుతున్నాయని చెప్పారు. అలాగే 2.49 కోట్ల ఎన్–95/ఎన్–99 మాస్కులకు ఆర్డర్ ఇచ్చామని, ఇందులో 1.49 కోట్ల మాస్కులను స్వదేశీ సంస్థల నుంచే కొంటున్నామని పేర్కొన్నారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రల ఉత్పత్తిని నెలకు 12.23 కోట్ల నుంచి 30 కోట్లకు పెంచామన్నారు. ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటీబీపీ) దళంలో ఐదుగురు జవాన్లకు కరోనా వైరస్ సోకినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆ 12 మంది తాత్కాలిక జైలుకు ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్పూర్లో క్వారంటైన్ పూర్తి చేసుకున్న 12 మంది తబ్లిగీ జమాత్ సభ్యులను అధికారులు తాత్కాలిక జైలుకు తరలించారు. వీరిలో 9 మంది థాయ్‌లాండ్ దేశస్తులు. వీరంతా ఓ మసీదులో ఉండగా, ఏప్రిల్ 2న అదుపులోకి తీసుకున్నారు. నాందేడ్ గురుద్వారా మూసివేత మహారాష్ట్రలోని ప్రఖ్యాత నాందేడ్ హుజూర్ సాహిబ్ గురుద్వారాను అధికారులు శుక్రవారం మూసివేశారు. ఈ గురుద్వారాను దర్శించుకుని పంజాబ్‌లోని తమ స్వస్థలాలకు చేరుకున్న భక్తుల్లో తాజాగా 91 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్రలో జోన్ల వారీగా ‘లాక్డౌన్’ ఎత్తివేత ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే మే 3వ తేదీ తర్వాత తమ రాష్ట్రంలో లాక్డౌన్ నిబంధనలను జోన్లవారీగా ఎత్తివేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే శుక్రవారం చెప్పారు. ఈ విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తామని, తొందరపాటుకు తావులేదని అన్నారు. ముంబై, పుణే, నాగపూర్, ఔరంగాబాద్ వంటి రెడ్జోన్లలో లాక్డౌన్ ఎత్తివేతపై ఎవరికీ ఆసక్తి లేదని వ్యాఖ్యానించారు. మిగతా ప్రాంతాల్లో నిబంధనల సడలింపుపై ప్రణాళిక రూపొందిస్తున్నామని అన్నారు. నిబంధనలు సడలించిన ప్రాంతాల్లో విచ్చలవిడిగా సంచరించడం తగదని, అలాచేస్తే అక్కడ మరింత కఠినమైన నిబంధనలను అమలు చేయక తప్పదని హెచ్చరించారు. ఏ దేశానికిపైనా నిజమైన సంపద ఆ దేశ ప్రజల ఆరోగ్యమేనని స్పష్టం చేశారు. -
ప్లాస్మా దానం: ప్రభుత్వానికి ఒవైసీ లేఖ
సాక్షి, హైదరాబాద్ : తబ్లిగీ జమాత్‌లో పాల్గొని కరోనా సోకి, దాని నుంచి కోలుకున్న ముస్లిం సోదరులు కోవిడ్‌తో పోరాడుతున్న ఇతరులకు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు వస్తున్నారు. కరోనా సోకి అనంతరం కోలుకున్న ఢిల్లీకి చెందిన 300 మంది ముస్లింలు, ఇప్పటికీ కరోనాతో పోరాడుతున్న ఇతరులకు తమ ప్లాస్మాను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణ ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. కరోనా వైరస్ సోకి కోలుకున్న 32 మందిని ప్లాస్మా దానం చేయాల్సిందిగా తాను స్వయంగా కోరినట్లు తెలిపారు. దానికి వారు సుముఖత వ్యక్తం చేశారని, వారి వివరాలను ప్రభుత్వానికి అందచేస్తున్నా అని ఒవైసీ పేర్కొన్నారు. (కరోనా: ‘ప్లాస్మా థెరపి’ అంటే ఏమిటీ?) వైరస్ నుంచి కొలుకున్న 32 మంది వైరస్ బాధితుకుల ప్లాస్మా దానం చేస్తారని వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు లేఖ రాశారు. కాగా మార్చిలో జరిగిన తబ్లిగీ సదస్సు భారీ స్థాయిలో వ్యతిరేకతను మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. తబ్లిగీలో పాల్గొన్న ముస్లింలు దేశద్రోహులంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా వెలిశాయి. ఈ నేపథ్యంలో జమాత్ చీఫ్ మౌలానా సైతం ప్లాస్మా దాన కార్యక్రమానికి కరోనా నుంచి కోలుకున్న ముస్లింలు ముందుకు రావాలంటూ రంజాన్ సందర్భంగా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. (ముస్లింలకు అసదుద్దీన్ విజ్ఞప్తి) -
ప్లాస్మా దానం చేస్తున్న తబ్లిగీలు
న్యూఢిల్లీ: ఢిల్లీలో తబ్లిగీ జమాత్‌లో పాల్గొని కరోనా సోకి, అనంతరం దాని నుంచి కోలుకున్న ముస్లిం సోదరులు కోవిడ్‌తో పోరాడుతున్న ఇతరులకు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు వచ్చారు. మార్చిలో జరిగిన తబ్లిగీ సదస్సు భారీ స్థాయిలో వ్యతిరేకతను మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. తబ్లిగీలో పాల్గొన్న ముస్లింలు దేశద్రోహులంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా వెలిశాయి. ఈ నేపథ్యంలో తబ్లిగీ కారణంగా కరోనా సోకి అనంతరం కోలుకున్న 300 మంది ముస్లింలు, ఇప్పటికీ కరోనాతో పోరాడుతున్న ఇతరులకు తమ ప్లాస్మాను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. జమాత్ చీఫ్ మౌలానా సైతం ఈ దాన కార్యక్రమానికి కరోనా నుంచి కోలుకున్న ముస్లింలు ముందుకు రావాలంటూ రంజాన్ సందర్భంగా పిలుపునిచ్చారు. -
ప్లాస్మా దానం చేయండి: తబ్లిగీ నేత
సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణాంతకమైన కరోనా వైరస్ బారినపడి కోలుకున్న వారు ప్లాస్మాను దానం చేయాలని తబ్లిగి జమాత్ చీఫ్ మౌలానా సాద్ కందల్వీ తన అనుచరులను కోరారు. కరోనాతో పోరాటం చేసేవారికి రక్తంలోని ప్లాస్మా ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ లేఖను విడుదల చేశారు. తనతోపాటు మర్కజ్ ప్రార్థనలకు హాజరైన కొంతమంది స్వీయ నిర్భందంలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా స్వీయ నిర్భందంలో ఉన్న వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా నెగటివ్ వచ్చిందని మౌలానా సాద్ తెలిపారు. ఇక పాజిటివ్‌గా వచ్చిన వారికి కూడా సరైన చికిత్స అందించగా వారు కోలుకున్నారని ఆయన వెల్లడించారు. (తబ్లిగీ నేతపై ఈడీ కేసు) కరోనా నుంచి కోలుకున్నవారు తమవంతు సాయంగా ప్రస్తుతం వైరస్ బారినపడి పోరాడుతున్న వారికి.. రక్తంలోని ప్లాస్మాను దానం చేయాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా వచ్చే రంజాన్ మాసంలో ముస్లింలు ఇంటి వద్దనే ఉండి సామాజిక దూరం పాటిస్తూ ప్రార్థనలు చేయాలని కోరారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లిగి జమాత్‌కు హాజరైన వారిలో ఎక్కువ మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీ పోలీసులు ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేయడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేయడంతో విచారణకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ మౌలానా ఢిల్లీ పోలీసులకు లేఖ రాశారు. (కొత్తగా 1,300 కరోనా కేసులు, 50మంది మృతి) కాగా దేశంలో ఇప్పటివరకూ మొత్తం 19,984 పాటిజివ్ కేసులు నమోదు కాగా, 640 మంది మృతి చెందారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 15,474 ఉన్నాయి. ఇక 3,870 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. (పరమౌషధం కానున్న ప్లాస్మా!) -
30% కేసులకు మర్కజ్ లింక్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటి వరకు నమోదైన 14,792 కరోనా పాజిటివ్ కేసుల్లో మర్కజ్ ఘటనతో సంబంధమున్నవే 4 వేల పైచిలుకు ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. మొత్తం 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇలాంటి కేసులున్నట్లు పేర్కొంది. కోవిడ్ పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వివరించారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో మార్చిలో జరిగిన మత పరమైన కార్యక్రమంతో సంబంధమున్న 4,291 కేసుల్లో అత్యధికంగా తమిళనాడు(84%), తెలంగాణ (79%), ఢిల్లీ(63%), ఉత్తరప్రదేశ్(59%), ఆంధ్రప్రదేశ్(61%)ల్లోనే ఉన్నాయని వివరించారు. మొత్తం కేసుల్లో ఇవి 29.8% వరకు ఉన్నట్లు తెలిపారు. తక్కువ సంఖ్యలో నమోదైన రాష్ట్రాల్లోనూ మర్కజ్ ఘటనతో లింకులున్న కేసులున్నాయన్నారు. అస్సాంలో నమోదైన 35 కేసుల్లో 32, అండమాన్ దీవుల్లోని 12 కేసుల్లో 10 ఈ కార్యక్రమంతో సంబంధమున్నట్లు తేలిందని చెప్పారు. ఇక గడిచిన 14 రోజుల్లో ఒక్క కేసు కూడా నమోదుకాని 47 జిల్లాల్లో ఏపీలోని విశాఖపట్టణం ఉంది. కరోనాతో మరణించిన వారి సంఖ్య శనివారానికి 488కి, పాజిటివ్ కేసులు 14,792కి చేరుకున్నాయి. దేశం మొత్తమ్మీద యాక్టివ్ కేసులు 11,906 కాగా 1,992 మంది ఇప్పటి వరకు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు కొత్తగా 991 నమోదు కాగా, 43 మంది మరణించారని ఆరోగ్య శాఖ పేర్కొంది. వీరిలో అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 12 మంది మృతి చెందారు. ఆ తర్వాత మహారాష్ట్రలో ఏడుగురు, ఢిల్లీలో నలుగురు, గుజరాత్లో ముగ్గురు, జమ్మూకశ్మీర్, బిహార్లలో ఒక్కొక్కరు చొప్పున చనిపోయినట్లు తెలిపింది. మరణాల రేటు 3.3 శాతం దేశంలో కోవిడ్ మరణాల రేటు 3.3%గా ఉందని లవ్ అగర్వాల్ చెప్పారు. ఇందులో 0–45 ఏళ్ల గ్రూపులో 14.4%, 45–60 ఏళ్ల వారు 10.3%, 60–75 ఏళ్ల వారు 33.1%, 75 ఆపైన వయస్సు వారిలో 42.2% అని తెలిపారు. మొత్తంగా కోవిడ్‌తో మృతి చెందిన వారిలో 75.3% మంది 60 ఏళ్లు, ఆపై వారేనన్నారు. 83% మరణాలకు ఇతర ఆరోగ్య సమస్యలూ కారణం. మహారాష్ట్రలో అత్యధికం కరోనా సంబంధిత మరణాలు ఇప్పటిదాకా 488 కాగా, మహారాష్ట్రలో∙201 మరణాలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్ (69), ఢిల్లీ (42), గుజరాత్ (48) ఉన్నాయి. తమిళనాడులో 15 మంది, పంజాబ్‌లో 13 మంది, ఉత్తరప్రదేశ్‌లో 14 మంది, కర్ణాటకలో 13 మంది చనిపోయారు. కరోనా పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో 3,323 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఢిల్లీ (1,707), తమిళనాడు (1,323), మధ్యప్రదేశ్ (1,310) ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో 100 లోపే కరోనా కేసులు నమోదయ్యాయి. ► రాజస్తాన్‌లోని కోటాలో చిక్కుకుపోయిన 3 వేల మంది విద్యార్థులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పంపిన 100 బస్సుల్లో వారి స్వస్థలాకు తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. ► కంటైన్మెంట్ ఏరియాగా ప్రకటించిన జహంగీర్‌పూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన 26 మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని ఢిల్లీ సీఎం తెలిపారు. ► రాష్ట్రంలోని 12 లక్షల మంది భవన నిర్మాణ నిర్మాణ కార్మికులకు రూ.2వేల చొప్పున అందజేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని రాష్ట్రాల్లోనూ అత్యవసర సహాయ కేంద్రాలు లాక్డౌన్ కారణంగా తలెత్తే ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అన్ని జిల్లాల్లో అత్యవసర సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశాయని హోంశాఖ జాయింట్ సెక్రటరీ శ్రీవాస్తవ తెలిపారు. హోం శాఖ ఏర్పాటు చేసిన 1930, 944 హెల్ప్‌లైన్ నంబర్లు నిరంతరం పనిచేస్తున్నాయన్నారు. గర్భిణులు, వృద్ధులు, ప్రత్యేక అంగవికలురకు అత్యవసర సేవలందించేందుకు 112 నంబర్ అందుబాటులో ఉందని, 112 మొబైల్ యాప్ ద్వారా ఫోన్ కాల్ లొకేషన్ గుర్తించవచ్చని వివరించారు. లాక్‌డౌన్‌పై అమిత్ షా సమీక్ష దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్, అత్యవసర వస్తువుల అందుబాటుపై హోం మంత్రి అమిత్ షా శనివారం సమీక్ష జరిపారు. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులకు సాయపడేందుకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. -
తబ్లిగీ : రోహింగ్యాల వేటలో పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : ఢిల్లీలోని నిజాముద్దీన్ జరిగిన మత ప్రార్థనలలో విదేశాల నుంచి వచ్చిన మత ప్రచారకులతోపాటు రోహింగ్యాలు కూడా పాల్గొన్నారని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కేంద్రం హెచ్చరికలతో హైదరాబాద్ పరిధిలోని రోహింగ్యాల వివరాలను రాష్ట్ర పోలీసులు సేకరిస్తున్నారు. నగరంలోని మూడు కమిషనరేట్ పరిధిలో దాదాపు 6040 మంది రోహింగ్యాల ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 5 వేల మంది రోహింగ్యాలు, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1000 మంది.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 40 మంది రోహింగ్యాలు ఉన్నట్లు నివేదికలో తేలింది. వీరిలో చాలామంది ఢిల్లీలోని నిజాముద్దీన్, హరియాణాలోని మేవాట్‌లో జరిగిన మత ప్రార్థనలలో పాల్గొన్నారని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. (ఆ రోహింగ్యాలు ఎక్కడ?) ఆయా రాష్ట్రాల్లో క్యాంపుల్లో తలదాచుకుంటోన్న రోహింగ్యాల ఆచూకీని గుర్తించి, వారికి పరీక్షలు నిర్వహించాలని అన్ని రాష్ట్రాల డీజీపీలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ క్యాంపు నుంచి వెళ్లిన రోహింగ్యాల కుటుంబ సభ్యుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. మూడు కమిషనరేట్ పరిధిలో ఉన్న రోహింగ్యాలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మర్కజ్ యాత్రకు ఎవరైనా వెళ్ళారా? వారు మళ్లీ తిరిగి వచ్చారా?అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారుంటే స్వచ్చందంగా వైద్య పరీక్షలు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎవరూ కూడా స్వచ్చందంగా బయటకు రాకపోవడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1331278836.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
తబ్లిగీ కేసులు అనడంపై అభ్యంతరం
న్యూఢిల్లీ: కోవిడ్–19 కారణంగా మరణించిన కొన్ని కేసులను తబ్లిగీ జమాత్, మసీదు, మర్కజ్ కేసులుగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వర్ణించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఈ మాటలు వాడకుండా ఢిల్లీ ముఖ్యమంత్రిని తక్షణం నియంత్రించాలని లాయర్లు ఫోజియా రహమాన్, ఖయ్యాముద్దీన్‌ల ద్వారా ఎం.ఎం.కశ్యప్ అనే న్యాయవాది పిటిషన్‌ను దాఖలు చేశారు. మార్చిలో ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో తబ్లిగీ జమాత్ జరిగిన తర్వాత కేజ్రీవాల్ ట్విట్టర్లో ఉద్దేశపూర్వకంగానే పలు కోవిడ్ కేసులను మసీదు మర్కజ్ కేసులుగా పేర్కొన్నారని ఆరోపించారు. సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యలతో సమాజంలో ఒక మతం పట్ల వ్యతిరేకత, ద్వేషం పెరిగిందన్నారు. ఈ పిటిషన్ 20న విచారణకు రానుంది. -
ఆ రోహింగ్యాలు ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ తబ్లిగీ జమాత్‌కు సంబంధించి రోజుకో ఉదంతం బయటపడుతోంది. మొన్న ఢిల్లీ ప్రార్థనలు, నిన్న యూపీలోని దేవ్‌బంద్‌కు తబ్లిగీ జమాత్‌కు లింకులు బయటపడిన సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీలోని నిజాముద్దీన్, హరియాణాలోని మేవాట్‌లో జరిగిన మత ప్రార్థనలలో విదేశాల నుంచి వచ్చిన మత ప్రచారకులతోపాటు మన దేశంలో అక్రమంగా వలస ఉంటున్న రోహింగ్యాలు కూడా పాల్గొన్నారని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. వీరిలో చాలామంది క్యాంపులకు చేరుకోలేదని సమాచారం. దీంతో ఆయా రాష్ట్రాల్లో క్యాంపుల్లో తలదాచుకుంటోన్న రోహింగ్యాల ఆచూకీని గుర్తించి, వారికి పరీక్షలు నిర్వహించాలని అన్ని రాష్ట్రాల డీజీపీలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీచేసింది. దీంతో పోలీసులకు కొత్త చిక్కు వచ్చి పడింది. దీంతో ఇప్పటికే మర్కజ్ వెళ్లినవారిని, తరువాత దేవ్‌బంద్‌కు వెళ్లిన వారిని గుర్తించేందుకు నానాతిప్పలు పడ్డ పోలీసులు.. ఇప్పుడు రోహింగ్యాల వేటలో పడ్డారు. అందుకే వెళ్లారా..? ఢిల్లీలో జరిగే తబ్లిగీ మత ప్రార్థనలకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పలువురు హాజరవుతారు. ఈ ప్రార్థనలకు హైదరాబాద్, తెలంగాణలో ఉంటున్న రోహింగ్యాలు కూడా వెళ్తుంటారు. మొన్న మార్చి రెండో వారంలో జరిగిన మత ప్రార్థనలకు వీరు సైతం హాజరయ్యారు. రోహింగ్యాలు అధికంగా ఉండే నగర శివార్లలోని పోలీసు అధికారులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు. ఢిల్లీలో జరిగే మత ప్రార్థనలకు రోహింగ్యాలు హాజరవడంలో వింతేమీ లేదన్నారు. అయితే, తెలంగాణ నుంచి వెళ్లిన రోహింగ్యాలంతా హరియాణాలోని మేవాట్‌లో జరిగిన జమాత్‌లో పాల్గొన్నారని సమాచారం. రోహింగ్యాలు వలస జీవులు. చాలా కుటుంబాలు పేదరికంలో ఉంటాయి. రంజాన్ సమీపిస్తోన్న నేపథ్యంలో మేవాట్‌కు వచ్చే భక్తుల నుంచి విరాళాలు ఆశించి వీరంతా వెళ్లి ఉంటారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. వీరు మేవాట్తోపాటు, నిజాముద్దీన్‌లో జరిగిన ప్రార్థనలకు సైతం హాజరయ్యారని కేంద్ర నిఘా వర్గాలు చెబుతున్నాయి. మేవాట్‌కు నిజాముద్దీన్‌కు మధ్య దూరం కేవలం 90 కిలోమీటర్లే కావడంతో రెండు చోట్లా వీరు ప్రార్థనల్లో పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు. ఒకవేళ వీరికి కరోనా సోకి ఉంటే వీరి ద్వారా ఇతర ప్రాంతాలకు వ్యాపించే ప్రమాదం ఉండటంతో వారిని గుర్తించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలను హెచ్చరించింది. దక్షిణాదిన తెలంగాణలోనే అధికం మనదేశంలో దాదాపు 40,000 మంది రోహింగ్యాలు ఉన్నారని ఐక్యరాజ్యసమితి లెక్కలు చెబుతున్నాయి. కానీ, అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా అధికంగానే ఉంటుంది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వీరు అధికంగా మన దేశంలోని అస్సాం, బెంగాల్, ఢిల్లీ, కశ్మీర్, దక్షిణాదిన తెలంగాణలో ఆశ్రయం పొందుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిసరాల్లో కొంతమంది మాత్రమే క్యాంపుల్లో ఉంటున్నారు. వీరిని గుర్తించడం సులువే. కానీ, చాలామంది పాతబస్తీ, బాలాపూర్ తదితర ప్రాంతాల్లో చెరువులు, కుంటలు ఆక్రమించి శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటివారిలో ఎవరెవరు వెళ్లారన్న విషయం గుర్తించడం చాలా కష్టం. ఇప్పటివరకు అందిన సమా చారం మేరకు నల్లగొండలో 14 మంది, హైదరాబాద్ క్యాంపుల్లో ఉంటున్న ఐదుగురి ఆచూకీ తెలియలేదు. ఈ సంఖ్య మరింత అధికంగానే ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోనూ ఓ రోహింగ్యా క్యాంపు నడుస్తోంది. అందులో కూడా ఎవరైనా మిస్సయ్యారా? అన్న విషయంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారని సమాచారం. -
‘సహనంతోనే సమస్యలు అధిగమిస్తాం’
సాక్షి, న్యూఢిల్లీ : నిజాముద్దీన్ తబ్లిగి జమాత్ మర్కత్ చీఫ్ మౌలానా సాద్ శుక్రవారం ఆడియో సందేశం విడుదల చేశారు. ‘ప్రస్తుత విపత్కర పరిస్ధితుల్లో మీరు సహనంగా ఉండాల్సిన అవసరం ఉంది..సహనంతోనే మీరు మీ సమస్యలను అధిగమిస్తార’ని ఈ ఆడియో క్లిప్‌లో మౌలానా బిగ్గరగా చెబుతుండటం వినిపించింది. కాగా ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగి జమాత్ మర్కజ్ అనంతరం కోవిడ్-19 కేసులు దేశవ్యాప్తంగా పెరిగాయని కేంద్రం పేర్కొన్న సంగతి తెలిసిందే. మౌలానా సాద్ ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్న విషయం తెలిసిందే. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 13,387కు చేరగా మృతుల సంఖ్య 437కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1007 కేసులు నమోదవగా, 23 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. ఇక మహమ్మారి బారి నుంచి కోలుకుని 1749 మంది డిశ్చార్జి అయ్యారు. చదవండి : తబ్లిగీ నేతపై ఈడీ కేసు -
తబ్లిగీ నేతపై ఈడీ కేసు
న్యూఢిల్లీ: తబ్లిగీ జమాత్ నేత మౌలానా సాద్ కంధాల్వీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసింది. ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ మేరకు కంధాల్వీతోపాటు అతనితో సంబంధమున్న ట్రస్టులు, మరికొందరు వ్యక్తులపైనా ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు (ఈసీఐఆర్) నమోదు చేసినట్లు గురువారం అధికారులు వెల్లడించారు. గత కొంతకాలంగా తబ్లిగీ జమాత్, ఆ సంస్థ ఆఫీస్ బేరర్లు నిర్వహించిన లావాదేవీలు, వారి ఆర్థిక వ్యవహారాలపై బ్యాంకులు, నిఘా విభాగాలు ఇచ్చిన సమాచారాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. త్వరలో కంధాల్వీకి సమన్లు జారీ చేసి, విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం సాద్ సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నారు. -
బయటకొచ్చినందునే బతికిపోయారు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఢిల్లీలో తబ్లిగీ జమాతేకు వెళ్లిన వారు, విదేశాల నుంచి వచ్చిన ప్రవాసాంధ్రులు స్వచ్ఛందంగా బయటకు రండి. కరోనా బారి నుంచి బయటపడండి. మీ కుటుంబాన్ని రక్షించుకోండి. ఇరుగుపొరుగు వారినీ ఇబ్బందులకు గురిచేయకండి అని ప్రభుత్వం పదే పదే చెప్పినా చెవికెక్కించుకోని వారి వల్ల కుటుంబాలకు కుంటుంబాలే తల్లడిల్లుతున్నాయి. ముందుగా ప్రభుత్వానికి సమాచారమిచ్చి ఆసుపత్రిలో చేరిన వారు కరోనా బారి నుంచి తప్పించుకోవడమే కాకుండా వారి కుటుంబాలకు కూడా ఏ మాత్రం ఇబ్బందులు లేకుండా బయటపడ్డారు. విజయవాడ, గుంటూరు నగరాల్లో చోటుచేసుకున్న సంఘటనలివి. కరోనా మహమ్మారి ఏ విధంగా కమ్మేస్తుందో చెప్పడానికి ఉదాహరణలివి. ►గుంటూరులోని కుమ్మరి బజార్‌కు చెందిన వ్యక్తి ఒకరు ఢిల్లీకి వెళ్లారు. ఆ విషయాన్ని బయటకు పొక్కనీయలేదు. దీంతో అయిదుగురు కుటుంబసభ్యులు, పొరుగింటి వారు ఇద్దరు కరోనా బారినపడ్డారు. ఆ ఇద్దరి నుంచి ఆ కుటుంబాలకు చెందిన 11 మందికి తాజాగా పాజిటివ్ వచ్చింది. విజయవాడ విద్యాధరపురంలోనూ... విద్యాధరపురం ప్రాంతానికి చెందిన వ్యక్తి ఒకరు ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాతేకు వెళ్లారు. ఆ మత కార్యక్రమంలో పాల్గొన్న వారెవరైనా తక్షణం పరీక్షలు చేయించుకోండని ప్రభుత్వం పదేపదే హెచ్చరించింది. ఆ మాటలను చెవికెక్కించుకోనందున ఆ వ్యక్తి తల్లి మరణించింది. అనారోగ్యం పాలైన తండ్రిని ఆసుపత్రిలో చేర్చగా కరోనా సోకిందని వైద్యులు నిర్ధరించారు. ఈ జబ్బు ఎలా వచ్చిందని ఆరా తీయగా అసలు విషయం వెల్లడైంది. ఢిల్లీలో మత కార్యక్రమానికి వెళ్లి వచ్చిన కుటుంబసభ్యుడు ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు. దీంతో అతని భార్య, సోదరుడు, ఆయన భార్య, వారి సమీప బంధువు కరోనా బారిన పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురిలో ఇద్దరు మృతి చెందారు కూడా. వారితో కలిసినందున మరో ముగ్గురికి కూడా పాజిటివ్ వచ్చిందని నిర్ధారణైంది. చదవండి: లాక్డౌన్: అయ్యా..బాబూ.. ఆదుకోండయ్యా! ముందుగానే మేల్కొన్నందున... ► పారిస్ నుంచి విజయవాడకు వచ్చిన విద్యార్థి నాలుగు రోజులు ఐసొలేషన్‌లో ఉన్నారు. కరోనా లక్షణాలేమో అనే అనుమానంతో ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. 14 రోజులు చికిత్స పొంది డిశ్ఛార్జి అయ్యారు. కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారెవరికీ సమస్య రాలేదు. ► వాషింగ్టన్ నుంచి విజయవాడ గాయత్రి నగర్‌కు చేరుకున్న మరో విద్యార్థి ఒకరోజు ఇంట్లో ఉండి అనుమానంతో ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చింది. సకాలంలో వైద్యం పొంది ఎవరికీ ఇబ్బంది కలగలేదు. ► స్వీడన్ నుంచి నగరంలోని అయోధ్యనగర్‌కు వచ్చిన ఉద్యోగికి కూడా పాజిటివ్ వచ్చింది. ఇబ్బంది నుంచి బయటపడ్డారు. దాచేస్తే జబ్బు దాగదు: సీపీ కరోనా జబ్బును దాచేస్తే దాగదని, దాని బారిన పడకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటే మార్గమని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు, గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకరరావు అన్నారు. విదేశాల నుంచి వచ్చిన విద్యార్థులు, ఉద్యోగులు అనుమానం రాగానే ఆసుపత్రికి వెళ్లి జబ్బు నుంచి బయటపడటమే కాకుండా కుటుంబసభ్యులతో సహా మరెవరికి సమస్య రాకుండా మేలు చేశారన్నారు. ఢిల్లీకి వెళ్లిన సంగతిని దాచినందున కుటుంబాలతో పాటు ఇరుగుపొరుగు వారికి తెచ్చారని, ఇది ఆందోళన కలిగిస్తోందన్నారు. కరోనా రక్కసికి బలికాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త ఒక్కటే మార్గమని, అలాంటి వారే సమాజ శ్రేయోభిలాషులని వారు అభిప్రాయపడ్డారు. చదవండి: వాహ్.. కలెక్టర్ సాబ్ -
24 గంటల్లో 1035 కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ప్రకోపానికి జనం బలవుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో ఏకంగా 1,035 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కాటుతో తాజాగా 40 మంది కన్నుమూశారు. దీంతో మృతుల సంఖ్య 242కు, పాజిటివ్ కేసుల సంఖ్య 7,529కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించింది. యాక్టివ్ కరోనా కేసులు 6,634 కాగా, 652 మంది బాధితులు చికిత్సతో పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రాల వారీగా గణాంకాలను పరిశీలిస్తే..కరోనా దేశవ్యాప్తంగా 261 మంది మృతి చెందినట్లు. 8,016 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు స్పష్టమవుతోంది. నియంత్రణ చర్యలు లేకుంటే.. కరోనా కట్టడికి ప్రభుత్వం ముందుగానే చర్యలు ప్రారంభించిందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియాతో అన్నారు. లాక్డౌన్, ఇతర నియంత్రణ చర్యలు చేపట్టకపోతే కరోనా కేసుల సంఖ్య ఇప్పటికే 2.08 లక్షలకు, ఈనెల 15 నాటికి ఏకంగా 8.2 లక్షలకు చేరేదని అన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల కేసుల సంఖ్య ఇప్పటిదాకా 7,447కే పరిమితమైందన్నారు. 586 ఆసుపత్రుల్లో వైద్య సేవలు దేశవ్యాప్తంగా 586 ఆసుపత్రుల్లో కరోనా వైరస్ బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నట్లు లవ్ అగర్వాల్ వెల్లడించారు. ఈ హాస్పిటళ్లలో లక్షకుపైగా ఐసోలేషన్ పడకలు, 11,836 ఐసీయూ పడకలను కేటాయించినట్లు తెలిపారు. దేశంలో ప్రస్తుతం యాంటీ మలేరియా ఔషధం హైడ్రాక్సీ క్లోరోక్విన్ కొరత లేదని స్పష్టం చేశారు. కాగా, ఢిల్లీ స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్(డీఎస్‌సీఐ)లో సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ఆసుపత్రిలో ఒక డాక్టర్, 9 మంది పారామెడికల్ సిబ్బందితోపాటు 11 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు, ఇతర రోగులను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేర్చారు. మొత్తం ఆసుపత్రిని శానిటైజ్ చేశారు. దేశంలో 80 శాతం కరోనా పాజిటివ్ కేసులు 17 రాష్ట్రాల్లోని 71 జిల్లాల్లోనే నమోదయ్యాయని ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ తెలిపారు. కరోనా వైరస్ కట్టడిలో కువైట్‌కు భారత్ అన్ని విధాలా సహకారం అందిస్తోందని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చెప్పారు. లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన కేంద్రమంత్రులు సోమవారం నుంచి విధుల్లో చేరనున్నారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు వారు విధులు పున:ప్రారంభించనున్నారు. వైద్య బృందంపై దాడి కరోనా వైరస్ లక్షణాలున్న వ్యక్తిని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా కొందరు దుండగులు వైద్య సిబ్బందిపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్‌లో జరిగింది. ఈ వ్యవహారంతో సంబంధమున్న ఓ ఇమామ్‌తో సహా నలుగురిని అరెస్టు చేసి, జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు చెప్పారు. తబ్లిగీల ఆచూకీ చెప్తే 5,000 రివార్డు తబ్లిగీ జమాత్ సభ్యుల ఆచూకీ కనిపెట్టడంలో సహకరించిన వారికి రివార్డు ఇస్తామని ఉత్తరప్రదేశ్ పోలీసు శాఖ ప్రకటించింది. గత నెలలో ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన మత సమ్మేళనంలో పాల్గొని, తిరిగి వచ్చిన వారిలో కొందరు ఇప్పటికీ ఆజ్ఞాతంలోనే ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రావడం లేదని అంటున్నారు. వీరి ఆచూకీ చెప్పినవారికి రూ.5,000 రివార్డు అందజేస్తామని తాజాగా ప్రకటించారు. మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ 30దాకా లాక్‌డౌన్‌ను 30వ తేదీ వరకు కొనసాగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని మోదీతో వీడియో కాన్ఫెరెన్స్ అనంతరం ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 14 తరువాత కొన్ని ప్రాంతాల్లో ఆంక్షల సడలింపు ఉంటుందని, వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మరింత కఠిన ఆంక్షలు ఉంటాయన్నారు. కర్ణాటకలో కూడా లాక్డౌన్ మరో రెండు వారాలు కొనసాగుతుందని, సంబంధిత విధివిధానాలను కేంద్రం ప్రకటిస్తుందని సీఎం యడ్యూరప్ప శనివారం చెప్పారు. -
కరోనా: ప్రయాణ చరిత్ర పరిశీలన
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో ఇప్పటివరకు పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. అలాగని ప్రభుత్వం, అధికారులు తేలికగా తీసుకోవడం లేదు. నిర్లక్ష్యానికి తావివ్వకుండా మరింత లోతుగా పరిశీలన చేస్తున్నారు. ప్రయాణాల చరిత్ర ఆ«ధారంగా ట్రాక్ చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ క్యూఆర్ కోడ్ ఇస్తున్నారు. ప్రతి పది మందికీ ఒక కోవిడ్ ఆఫీసర్‌ను నియమించారు. వారిని పర్యవేక్షించేందుకు మండలానికో స్పెషల్ ఆఫీసర్‌ను ఏర్పా టు చేయగా, జిల్లా స్థాయిలో కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. విదేశాల నుంచి 1445 మంది రాక కరోనా ప్రభావం పెరిగిన నేపథ్యంలో విదేశాల నుంచి జిల్లాకు 1445 మంది వచ్చారు. వారందర్నీ ప్రత్యే క క్వారంటైన్‌లోనూ, హోమ్ క్వారంటైన్లో పెట్టా రు. లక్షణాలు ఉన్న వారికి ఎప్పటికప్పుడు శాంపి ల్స్ తీసి పరీక్షలు చేశారు. ఇంతవరకైతే విదేశాల నుంచి వచ్చిన వారెవరికీ పాజిటివ్ రాలేదు. దా దాపు శాంపిల్స్ అన్నీ నెగిటివ్ ఫలితాలొచ్చా యి. విదేశాల నుంచి వచ్చిన వారిలో అంతా దాదాపు 14 రోజులకు పైగా క్వారంటైన్ పూర్తి చేసుకున్నారు. దీంతో వారి ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం కని్పంచడం లేదు. ప్రయాణ చరిత్ర ఆధారంగా.. విదేశాల నుంచి వచ్చిన వారినే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుంచి విమానాలు, రైళ్ల ద్వారా జిల్లాకు వచ్చిన వారి వివరాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. విమానయాన, రైల్వే శాఖ వచ్చిన వివరాలు ఆధారంగా సంబంధిత వ్యక్తులను గుర్తిస్తున్నారు. కొందర్ని ఫోన్లో ఆరా తీయగా, మరికొందర్ని చిరునామాల ఆ«ధారంగా చేసుకుని గుర్తిస్తున్నారు. పోలీసు, రెవెన్యూ, వలంటీర్లు, మెడికల్ సిబ్బంది ద్వారా ఇంటింటికీ వెళ్లి గుర్తింపు కార్యక్రమం చేపడుతున్నారు. జిల్లా ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి నేతృత్వంలో పోలీసు సిబ్బంది కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని గుర్తించడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. మొ త్తానికి ఫిబ్రవరి నెల నుంచి ట్రావెల్ హిస్టరీ చూస్తున్నారు. ఏ ఒక్కర్నీ విడిచి పెట్టడం లేదు. లాక్డౌన్ తర్వాత జిల్లాలోకి 5009 మంది లాక్డౌన్ అమలు తర్వాత జిల్లాలోకి 5009 మంది వచ్చినట్టు సమాచారం. వేర్వేరు మార్గాల ద్వారా వారంతా జిల్లాలోకి ప్రవేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాల నుంచి వచ్చిన సమాచారంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. వీరిలో ముంబై నుంచి 600 మంది, ఢిల్లీ నుంచి 400 మంది వచ్చిన వారు ఉన్నారు. మిగతా రాష్ట్రాలు, మిగతా జిల్లాల నుంచి కూడా వచ్చారు. వారందర్నీ అధికారులు ఇ ప్పటికే గుర్తించారు. వారికి ప్రత్యేక క్యూఆర్ కోడ్ కేటాయించారు. ఇలా వచ్చిన 10 మందికి ఒక కోవి డ్ ఆఫీసర్‌ను నియమించి ఎప్పటికప్పుడు వారి కదలికలను గమనిస్తున్నారు. కేటాయించిన 10మంది వద్దకు ప్రతి రోజూ కోవిడ్ ఆఫీసర్ వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. వారి వద్దకు వెళ్లాలంటే తప్పనిసరిగా స్కాన్ చేయాలి. అక్కడ చేసిన స్కాన్ జిల్లా అధికా రుల వద్ద అప్డేట్ అవుతుంది. దీంతో కోవిడ్ ఆఫీ సర్లు వారికి కేటాయించిన 10మంది వద్దకు వెళ్తున్నారో లేదో ఇట్టే తెలిసిపోతుంది. మరోవైపు ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు వేలల్లో ఉండటంతో వారందరి కోసం వలంటీర్లు, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి ఆరా తీస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులు తెలుసు కుంటున్నారు. కరోనా అనుమానిత లక్షణాలు గానీ, ఇతర ఆరోగ్య సమస్యలు గానీ కనిపిస్తే వెంటనే నోట్ చేస్తున్నారు. నోట్ చేసినవన్నీ వైద్యాధికారుల లాగిన్లోకి వచ్చేస్తున్నాయి. వాటి ఆధారంగా త దుపరి చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో శాంపిల్స్ సేకరణలో కూడా జోరు పెంచారు. సో మవారం ఒక్కరోజే 135 శాంపిల్స్ తీశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మంగళవారం కూడా పెద్ద సంఖ్యలో శాంపిల్స్ తీశారు. ఇకపై శాంపిల్స్ ఫలితాలు కూడా వేగంగా రానున్నాయి. ఇంతవరకు కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలకు పరీక్షల కోసం పంపించారు. తాజాగా విశాఖపట్నంలో కూ డా టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభం కావడంతో సుదూర ప్రాంతమైన కాకినాడకు కాకుండా విశాఖపట్నంకు పంపిస్తున్నారు. దీంతో ఫలితాల వెల్లడి కూడా వేగవంతం కానుంది. -
‘తబ్లిగీ జమాత్ కేసులపై స్పష్టత లేదు’
కోల్‌కతా: మహమ్మారి కరోనా విజృంభణతో ప్రజలు బెంబేలెత్తిపోతున్న వేళ నిజాముద్దీన్ ఘటనపై రాజకీయ పార్టీలు పరస్పరం విమర్శలకు దిగుతున్నాయి. బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ నేతలు, ప్రతిపక్ష బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో వాగ్యుద్ధానికి తెరలేపారు. ఓటు బ్యాంకును కాపాడుకునేందుకే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తబ్లిగీ జమాత్‌కు వెళ్లిన వారి వివరాలు ఇచ్చేందుకు నిరాకరించారని బీజేపీ మండిపడగా.. నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్నారంటూ టీఎంసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా దేశ రాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో తబ్లిగీ జమాత్‌కు హాజరైన వారిలో అత్యధిక మందికి కరోనా సోకిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ కార్యక్రమానికి హాజరైన వారందరి సమాచారం అందించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వారిని గుర్తించి వెంటనే క్వారంటైన్‌కు తరలించాలని పేర్కొంది.(కరోనా కలకలం: అసోం ఎమ్మెల్యే అరెస్టు) ఈ నేపథ్యంలో తబ్లిగీ జమాత్ కేసులపై మీడియా అడిగిన ప్రశ్నలకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమధానం దాటవేశారు. అటువంటి ప్రశ్నలు(కమ్యూనల్ క్వశ్చన్లు) అడగకూడదని సూచించారు. ఈ విషయంపై స్పందించిన బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాలవీయ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. ‘‘జమాత్ కేసులు దేశంలో ప్రకంపనలు సృష్టించాయి. కానీ బెంగాల్లో ఎన్ని కొత్త కరోనా కేసులు నమోదయ్యాయోనన్న విషయంపై స్పష్టత లేదు. ఎంత మందిని గుర్తించారు. ఎంత మందికి పరీక్షలు నిర్వహించారు. వాటి ఫలితాలేమిటి? ఇంతవరకు అప్డేట్ లేదు. ఓటు బ్యాంకు కోసమే ఆమె ఇదంతా చేస్తున్నారా’’ అని మమతా బెనర్జీ తీరును ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. Mamata Banerjee when asked for an update on Tablighi cases said, “Don’t ask communal questions.” Jamaat cases have exploded across, but no clarity on the latest numbers in Bengal. How many of them traced and tested. Results? No update at all! Has she made this about vote bank? — Amit Malviya (@amitmalviya) April 7, 2020 -
కరోనా: ‘వైరస్ సోకకున్నా ఇంజక్షన్లు వేస్తున్నారు’
గువాహటి: ఓవైపు కరోనా మహమ్మారి కోరలు చాస్తూ ప్రజలను బెంబేలెత్తిస్తుంటే.. కొంతమంది ప్రజాప్రతినిధులు వివాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. ప్రజలకు ధైర్యం చెప్సాల్సింది పోయి సున్నితమైన అంశాలను స్పృశిస్తూ భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీ అని తేడా లేకుండా పరస్పర ఆరోపణలతో ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. దేశ రాజధానిలోని నిజాముద్దీన్ ప్రాంతంలో తబ్లిగీ జమాత్‌కు హాజరైన వారిలో ఎక్కువ మందికి కోవిడ్-19 సోకినట్లు వెల్లడైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మత ప్రార్థనలకు హాజరైన వారు వైద్యులకు సహకరించడం లేదంటూ ఓ వర్గం ప్రచారం చేస్తుండగా.. మరోవైపు కరోనా సోకని వారికి డాక్టర్లు బలవంతంగా చికిత్స చేస్తున్నారంటూ మరో వర్గం విరుచుకుపడుతోంది. (కరోనా : బీజేపీ నేత ఫైరింగ్ వీడియో వైరల్) తాజాగా అసోం ఎమ్మెల్యే అమినుల్ ఇస్లాం సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. క్వారంటైన్ సెంటర్లు అక్రమ వలసదారులను బంధించే నిర్బంధ గృహాల కంటే అధ్వాన్నంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇవి కరోనా రోగులకు ప్రమాదకరంగా పరిణమించాయని ఆందోళన వ్యక్తం చేశారు. అదే విధంగా ముస్లింలకు వ్యతిరేకంగా అసోం బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని.. అందుకే క్వారంటైన్ సెంటర్లలో వారిని వైద్యులు వేధిస్తున్నారని ఆరోపించారు. నిజాముద్దీన్‌కు వెళ్లి వచ్చిన వారిలో ఆరోగ్యవంతులను కూడా అదుపులోకి తీసుకుని వారిని కరోనా పేషెంట్లుగా చిత్రీకరించేందుకు ఇంజక్షన్లు వేస్తున్నారని ఆరోపణలు చేశారు. (కరోనాపై పోరు: డాక్టర్ కన్నీటిపర్యంతం) ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. సోమవారం అమీనుల్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో మంగళవారం ఆయనను అరెస్టు చేసినట్లు అసోం పోలీస్ చీఫ్ భాస్కర్ జ్యోతి మహంతా వెల్లడించారు. ఈ విషయాన్ని అసెంబ్లీ స్పీకర్ దృష్టికి తీసుకవెళ్లామని పేర్కొన్నారు. కాగా ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ పార్టీకి చెందిన అమీనుల్.. ధింగ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలతో ఆయన వార్తల్లో నిలిచారు. కాగా వివిధ రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కరోనా బాధితులు ఉన్నట్లుగా వార్తలు వెలువడిన తరుణంలో.. తొలుత అసోంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వారి ద్వారా శనివారం నాటికి దాదాపు 25 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 26 కేసులు నమోదయ్యాయి. ఇక తాజా సమాచారం ప్రకారం అమీనుల్ ఇస్లాంపై దేశ ద్రోహం కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. -
రిమ్స్ వైద్యుడిపై పోలీసులకు ఫిర్యాదు
సాక్షి, ఆదిలాబాద్ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యహరించిన రిమ్స్ వైద్యుడిపై ఆస్పత్రి డైరెక్టర్ బలరాం నాయక్ ఫిర్యాదు చేశారు. మర్కజ్ సన్నహక సమావేశానికి వెళ్లొచ్చి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఓ వైద్యుడు విధులకు హాజరయ్యాడు. సమాచారం గోప్యంగా ఉంచి.. నిబంధనలకు వ్యతిరేకంగా విధులు నిర్వహించిన డాక్టర్‌పై సెక్షన్ 176, 188, 270, 271 ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం వైద్యుడు క్వారంటైన్లో చికిత్స పొందుతున్నాడు. (ఫేక్ న్యూస్ పోస్ట్ చేసిన కిరణ్ బేడీ.. నెటిజన్ల మండిపాటు) -
పరీక్షలు చేయించుకోకపోతే.. హత్యాయత్నం కేసు..
కాన్పూర్/గువాహటి: తబ్లిగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొని, కరోనా వైరస్ పరీక్ష చేయించుకోకుండా మొండికేస్తున్న వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయడంతోపాటు కఠినమైన జాతీయ భద్రతా చట్టాన్ని(ఎన్ఎస్ఏ) సైతం ప్రయోగిస్తామని ప్రభుత్వ వర్గాలు హెచ్చరించాయి. దేశంలో ఇప్పటికే బయటపడ్డ 4,069 కరోనా పాజిటివ్ కేసుల్లో కనీసం 1,445 కేసులు తబ్లిగీ జమాత్‌కు సంబంధించినవేనని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. తబ్లిగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో చాలామంది కరోనా పరీక్షలు చేయించుకోవడం లేదు. వారు ఇప్పటికైనా ముందుకు రావాలని, ఇదే చివరి అవకాశమని ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లా మేజిస్ట్రేట్ చెప్పారు. పరీక్షల కోసం రాకపోతే హత్యాయత్నం కేసు నమోదు చేస్తామని, వారిపై జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగిస్తామని తేల్చిచెప్పారు. తబ్లిగీ జమాత్ సభ్యులతోపాటు వారిని కలిసినవారికి కూడా ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. ఎన్ఎస్ఏ ప్రకారం.. ఒక వ్యక్తిని 12 నెలల వరకు నిర్బంధించవచ్చు. తబ్లిగీ జమాత్ సభ్యులు సహకరించకపోతే కఠిన చర్యలు తప్పవని ఉత్తరాఖండ్ డీజీపీ అనిల్‌కుమార్ రాతూరీ స్పష్టం చేశారు. 25,500 మంది తబ్లిగీ సభ్యుల క్వారంటైన్ ఇప్పటిదాకా 25,500 మందికిపైగా తబ్లిగీ జమాత్ సభ్యులను, వారితో సంబంధం ఉన్నవారిని క్వారంటైన్‌కు తరలించినట్లు హోంశాఖ సీనియర్ జాయింట్ సెక్రెటరీ పుణ్యసలీల శ్రీవాస్తవ వెల్లడించారు. హరియాణాలో ఐదు గ్రామాలను పూర్తిగా దిగ్బంధించి, అక్కడి ప్రజలందరినీ క్వారంటైన్ చేశామన్నారు. తబ్లిగీకి చెందిన విదేశీ సభ్యులు ఆయా గ్రామాల్లో తలదాచుకున్నారని పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన 2,083 మంది విదేశీయుల్లో ఇప్పటివరకు 1,750 మందిని బ్లాక్‌లిస్టులో చేర్చామన్నారు. -
కరోనా: తొలగిన ఢిల్లీ టెన్షన్
సాక్షి, శ్రీకాకుళం: జిల్లా అధికారులు, ప్రజలకు కరోనా వ్యాధికి సంబంధించి ఢిల్లీ నుంచి ప్రయాణించిన వారి విషయంలో ఉత్కంఠ తొలగిపోయింది. దేశవ్యాప్తంగా ఢిల్లీ మత ప్రచార సభలో పాల్గొన్న వారికి ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నందున జిల్లా మొత్తం ఆందోళనకు గురైంది. జిల్లా నుంచి ఎవరూ ఆ సభకు హాజరు కానప్పటికీ వారు వచ్చిన రైళ్లలో జిల్లాకు చెందిన సుమారు 76 మంది ప్రయాణించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో జిల్లా అధికారులు ప్రయాణించిన 76 మందిని గుర్తించారు. వీరందరికీ దశల వారీగా పరీక్షలు జరపగా అందరికీ నెగిటివ్ రిపోర్టు రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం సా యంత్రానికి 135 మందికి సంబంధించిన నమూనాలు పంపించగా 102 రిపోర్టులు నెగెటివ్‌గా తేలా యి. 33 రిపోర్టులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో దాదాపు 15 నమూనాలు ఆదివారం సాయంత్రం పంపించారు. జిల్లా వాసులు ఏప్రిల్ 30వ తేదీ వరకు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు, వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు పాజిటివ్ కేసులు నమోదు కాలేదన్న ధీమా వద్దని ఇదే పంథాను కొనసాగించి జిల్లాలో వ్యాధి ప్రవేశించకుండా చూడాలని వారంటున్నారు. కూరగాయలు, నిత్యావసర సరుకులు కూడా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వస్తుండటం వల్ల వాటిని కూడా పూర్తిగా కడిగి, ఎండలో ఉంచిన తర్వాతనే వినియోగించాలని సూచిస్తున్నారు. మార్కెట్‌కు వెళ్లి వచ్చిన తర్వాత ఇంటి బయటే స్నానం చేసి సబ్బును రెండు సార్లు రాసుకోవాలని చెబుతున్నారు. వ్రస్తాలను కూడా స్నానానికి ముందే తడిపివేయాలని, పసుపు, వేప రాసుకోవడం ద్వారా క్రిమికీటకాలను దూరంగా ఉంచవచ్చని ఆయుర్వేద, ప్రకృతి వైద్య నిపుణులు చెబుతున్నారు. జిల్లాకు చెందిన 350 మందికి పైగా మత్స్యకారులు, ఇతరులు పడవల ద్వారా జిల్లాకు చేరుకున్నారని, వారిపై దృష్టిసారించి పరీక్షలు జరపాలని ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులకు సమాచారమందింది. వారిని గుర్తించే పనిలో ప్రస్తుతం అధికారులు ఉన్నారు. మంగళవారం సాయంత్రం సరికి 350 మందిని గుర్తించి వారికి క్వారంటైన్ కేంద్రాలకు తరలించి పరీక్షలు జరిపించాలని అధికారులు నిర్ణయించారు. వారం రోజులుగా ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చిన వివరాలు తెలిస్తే, చుట్టుపక్కల వారు జిల్లాలొ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు, 104 కు తెలియజేయాలని జిల్లా అధికారులు ప్రజలను కోరుతున్నారు. -
ఒక్కరోజులో... 505 కేసులు, 7 మరణాలు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా 505 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఏడుగురు మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,577, మొత్తం మరణాల సంఖ్య 83కి చేరిందని వెల్లడించింది. కానీ, రాష్ట్రాల వారీగా గణాంకాలు చూస్తే కరోనా వల్ల దేశవ్యాప్తంగా 110 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య 3,959కు చేరినట్లు స్పష్టమవుతోంది. వీరిలో 306 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొంది, ఆరోగ్యవంతులుగా మారి, ఇళ్లకు చేరారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల గణాంకాలను మదింపు చేయడంలో జరుగుతున్న జాప్యం వల్లే లెక్కల్లో వ్యత్యాసం కనిపిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. 4.1 రోజుల్లో కేసులు రెట్టింపు దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రెట్టింపు కావడానికి ప్రస్తుతం 4.1 రోజులు పడుతోంది. ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్‌కు సంబంధించిన కేసులు గనుక లేకపోయినట్లయితే, ఇందుకు 7.4 రోజులు పట్టేదని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ ఆదివారం తెలిపారు. దేశంలో 274 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయని పేర్కొన్నారు. కరోనా విషయంలో తాజా పరిస్థితిపై కేంద్ర కేబినెట్ సెక్రెటరీ రాజీవ్ గౌబా ఆదివారం అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఆరోగ్య శాఖ కార్యదర్శులు, జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు, ఎస్పీలతో చర్చించారని వివరించారు. కరోనా నేపథ్యంలో ఆధునిక రక్షణ పరికరాలను రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అగ్రస్థానంలో మహారాష్ట్ర మృతుల విషయంలో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా 24 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివ్ కేసుల్లో ఢిల్లీ మొదటిస్థానం. ఇక్కడ 503 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని భారత వైద్య పరిశోధనా మండలి స్పష్టం చేసింది. ఢిల్లీలో 8 మంది మలేషియన్ల పట్టివేత ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో తబ్లిగీ జమాత్‌కు హాజరై, సొంత దేశం మలేషియాకు తిరిగి వెళ్లేందుకు ప్రయత్నించిన 8 మంది మలేషియన్లను ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఇండియాలో చిక్కుకుపోయిన తమ దేశ పౌరులను సొంత దేశానికి తీసుకెళ్లడానికి మలేషియన్ హైకమిషన్ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. ఈ విమానం ఆదివారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరింది. అయితే, తబ్లిగీ జమాత్‌కు హాజరైనవారు కూడా ఈ విమానంలో మలేషియాకు తిరిగి వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఇప్పటిదాకా ఢిల్లీలోనే తలదాచుకున్నారు. వ్యక్తిగత రక్షణ పరికరాలు అందరికీ అక్కర్లేదు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారు, ఆసుపత్రుల్లో రోగులకు వైద్య సేవలందించేవారు మినహా ఇతరులు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్(పీపీఈ) ఉపయోగించా ల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. ఆయన ఆదివారం హరియాణా రాష్ట్రం ఝాజర్‌లోని ఎయిమ్స్‌లోని కరోనా చికిత్సా కేంద్రాన్ని సందర్శించారు. -
ప్రాణం తీసిన 'తబ్లిగి జమాత్' వివాదం
లక్నో : దేశంలో కరోనా కేసులు పెరిగిపోవడానికి తబ్లిగి-జమాత్ సమావేశమే ప్రధాన కారణమని ఆరోపించిన యువకుడిని కాల్చి చంపిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ఒక టీషాప్ వద్దకు ఒక వ్యక్తి వచ్చి కరోనా కేసులు పెరిగిపోవడానికి ప్రధాన కారణం తబ్లిగి జమాత్ సమావేశమేనని చెప్పుకొచ్చాడు. దీంతో పక్కనే ఉన్న వ్యక్తి జోక్యం చేసుకొని అనవసరంగా ఈ విషయాన్ని రాద్ధాంతం చేయద్దొని పేర్కొన్నాడు. ఇద్దరి మధ్య కాసేపు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇంతలో నిందితుడు తన వెంట తెచ్చుకున్న తుపాకీతో ఆ వ్యక్తిని కాల్చాడు. దీంతో బాధితుడు అక్కడికక్కడే కుప్పకూలాడు. నిందితుడు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేయగా పక్కన ఉన్నవారు అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు. పోలీసులు అతని మీద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కాగా మృతి చెందిన బాధితుని కుటుంబసభ్యులకు రూ. 5లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు యూపీ ప్రభుత్వం పేర్కొంది. (కరోనా : ఆరు నిమిషాల వ్యవధిలోనే) మరోవైపు ఈ ఘటన ఆదివారం ఉదయం 9.30గంటల ప్రాంతంలో చోటుచేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ విషయమై ప్రజలు ఎవరు భయపడాల్సిన పని లేదని, అనవసరంగా మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రాణాలు తీసుకోవద్దని, ప్రజలంతా శాంతియుతంగా ఉండాలంటూ ప్రయాగ్‌రాజ్ ఎస్పీ విజ్ఞప్తి చేశారు. కాగా ఇప్పటివరకు యూపీలో 227 కరోనా పాటిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా కేసులు ఒక్కవారంలోనే అమాంతంగా పెరిగిపోవడంలో ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్లో జరిగిన తబ్లిగి-జమాత్ సమావేశం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదపు అన్ని రాష్ట్రాల నుంచే గాక విదేశాల నుంచి ముస్లింలు పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు. దేశంలోని దాదాపు 17 రాష్ట్రాల్లో మర్కజ్ సమావేశం కరోనా కేసులు రెట్టింపయ్యేలా చేసింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3వేలకు పైగా కరోనా కేసులు దాటగా, మృతుల సంఖ్య 79కి చేరుకుంది -
ఆందోళన వద్దు
న్యూఢిల్లీ: దేశంలో వెలుగుచూసిన కోవిడ్–19 నిర్థారిత కేసుల్లో 30 శాతం వరకు ఒక ప్రాంతానికి సంబంధించినవే కాబట్టి, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తబ్లిగీలో పాల్గొని వ్యాధి బారిన పడిన వారిని, వారి ద్వారా సోకిన 22 వేల మందిని క్వారంటైన్లో ఉంచగా మిగతా వారిని కూడా గుర్తించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తబ్లిగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్న వారి కారణంగా 17 రాష్ట్రాల్లో 1,023 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయన్నారు. మొత్తం నిర్ధారిత కేసుల్లో ఇవి 30 శాతం వరకు ఉంటాయని పేర్కొన్నారు. తబ్లిగీలో పాల్గొని వ్యాధి బారిన పడిన వారిని, వారి ద్వారా సోకిన ఇతరులను గుర్తించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశామన్నారు. తబ్లిగీ జమాత్ సభ్యులతోపాటు వారితో సంబంధం ఉన్న తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన 22 వేల మందిని ఇప్పటివరకు క్వారంటైన్‌కు తరలించామన్నారు. ‘గత 24 గంటల్లో 601 కొత్త కేసులతోపాటు 12 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో బాధితుల సంఖ్య 3,072కు, మృతుల సంఖ్య 75కు చేరుకుంది. కేరళ, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 58 మందిæ బాధితుల పరిస్థితి విషమంగా ఉండగా, ఈ వ్యాధి నుంచి 183 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు’అని తెలిపారు. దేశంలోని 211 జిల్లాల్లో కరోనా కేసులు నమోదయ్యాయనీ, దీనిని కట్టడి చేయకుంటే మరింతగా విస్తరించే ప్రమాదముందన్నారు. బాధితుల్లో అత్యధికంగా 42 శాతం 21–40 ఏళ్లలోపు వారు కాగా, 33 శాతం 41–60, 17 శాతం 60 ఏళ్లకుపైబడినవారు, 9శాతం 0–20 ఏళ్లలోపు వారేనని ఆయన వివరించారు. ‘రోజుకు 10వేల చొప్పున నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్రతి 25 పరీక్షల్లో ఒక పాజిటివ్ కేసు బయట పడుతుండగా ప్రతి 30 పాజిటివ్ కేసుల్లో ఒక్కరు కంటే తక్కువగా మాత్రమే చనిపోతున్నారు’అని వెల్లడించారు. అదేవిధంగా, ఈ వ్యాధి బాధితుల్లో వైరస్‌పై యుద్ధంలో గెలుపు కోసం లాక్డౌన్ నిబంధనలను, ముఖ్యంగా వ్యక్తిగత దూరాన్ని పాటించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇంట్లోనే ఫేస్ మాస్కులు తయారు చేసుకుని ధరించాలంటూ ఇచ్చిన సలహా.. ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రతా చర్యలను పాటించేందుకేనని వివరించారు. పీటీఐ అంచనా ప్రకారం.. దేశవ్యాప్తంగా కోవిడ్ కారణంగా 94 మంది చనిపోగా శనివారం సాయంత్రానికి నిర్ధారిత కేసుల సంఖ్య 3,473గా ఉంది. ఇందులో 275 మంది కోలుకుని, ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రాల వివరాలతో పోలిస్తే కేంద్రం వెలువరించిన గణాంకాలు వెనకబడి ఉండటానికి.. విధానపరమైన ప్రక్రియలో ఆలస్యమే కారణమని భావిస్తున్నారు. ఇలా ఉండగా, దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు సంబంధించిన అన్ని అంశాలపై హోం శాఖ ఆధ్వర్యంలోని కంట్రోల్ రూం ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని హోం శాఖ జాయింట్ సెక్రటరీ పుణ్యసలిల శ్రీవాస్తవ మీడియాకు తెలిపారు. ఇందుకోసం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్), కేంద్ర సాయుధ బలగాల(సీఏపీఎఫ్)కు చెందిన 200 మంది సిబ్బంది పని చేస్తున్నారన్నారు. కోవిడ్‌తో మహారాష్ట్రలో 19, గుజరాత్ 10, మధ్యప్రదేశ్, ఢిల్లీలో ఆరుగురు చొప్పున, పంజాబ్‌లో ఐదుగురు మరణించారన్నారు. నిర్థారిత కేసులు మహారాష్ట్రలో 490,∙ఢిల్లీ 445, తమిళనాడు 411, కేరళ 295, రాజస్తాన్ 220, ఉత్తరప్రదేశ్ 174 ఉన్నాయి. -
మృతులంతా మర్కజ్ వెళ్లొచ్చిన వాళ్లే..!
సాక్షి, హైదరాబాద్ : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టినా.. ఢిల్లీ మర్కజ్ మత ప్రార్థనలు దేశాన్ని కుదిపేశాయి. గత వారం వరకు పరిస్థితి సాధారణంగానే ఉన్నా.. మర్కజ్‌కు హాజరైన వారికి కరోనా వైరస్ సోకడంతో వాతావరణం ఒక్కసారిగా మారింది. ప్రజల్లో ఆందోళన పెరిగిపోయింది. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా గడిచిన నాలుగురోజుల్లో సంభవించిన మరణాల్లో ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారే అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన 11 మరణాల్లో ఇద్దరు మినహా మిగతావారంతా అక్కడికి వెళ్లివచ్చిన వారేకావడం పరిస్థితి తీవ్రతకు అర్థం పడతోంది. ఇక దేశ వ్యాప్తంగా నమోదవుతున్న మరణాల్లోనూ వారి సంఖ్యే ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు తెలంగాణలో తాజాగా నమోదైన కేసులన్నీ ఢిల్లీ నుంచి వచ్చిన వారు, వారితో కాంటాక్ట్ అయిన వారే అత్యధికంగా ఉన్నారు. తాజాగా ఆదిలాబాద్, నిజామాబాద్‌లో శనివారం కొత్తగా వెలుగుచూసిన కరోనా పాజిటివ్ కేసుల కూడా ఢిల్లీ బాధితులే. ఇక ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం మరణించిన కరోనా బాధితుడు కూడా ఢిల్లీ వచ్చిన వారే కావడం గమనార్హం. రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల్లో సింహ భాగం మర్కజ్ నుంచి వచ్చిన వారే ఉన్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తం అయ్యాయి. మత ప్రార్థనలకు వెళ్లిన వారిని నిర్బంధ కేంద్రాలకు పంపే చర్యలను వేగవంతం చేశాయి. (‘తబ్లిగీ’కి వెళ్లిన వారిలో 9,000 మంది క్వారంటైన్ ) ఇక తెలంగాణలో ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారు 1,030 మంది ఉన్నారని వైద్య ఆరోగ్యశాఖ ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. వారిలో దాదాపు 900 మందిని ఇప్పటివరకు గుర్తించి తమ అధీనంలోకి తీసుకున్నారు. వారి కుటుంబసభ్యులను, వారితో కాంటాక్ట్ అయినవారిని కూడా కొందరిని గుర్తించారు. బుధవారం 300 మందికి పరీక్షలు నిర్వహించగా, 30 మందికి పాజిటివ్‌గా తేలింది. శుక్రవారం పరీక్షల్లో 75 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం సంఖ్య 229కి చేరింది. -
ఢిల్లీ మసీదుల్లో భారీ సంఖ్యలో విదేశీయులు
న్యూఢిల్లీ : గత నెలలో ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్‌లో పాల్గొని లాక్డౌన్ కారణంగా అక్కడే ఉండిపోయిన 2,300 మందిని క్వారంటైన్‌కు తరలించే ప్రయత్నాలు దాదాపు పూర్తి కావస్తున్నాయి. ఈ నేపథ్యంలో 800 మందికి పైగా విదేశీ తబ్లిగీ జమాత్ కార్యకర్తలు వెలుగులోకి వచ్చారు. పోలీసులు, ఆరోగ్య సిబ్బంది రాజధాని నలువైపుల్లోని వివిధ మసీదుల్లో రహస్యంగా తలదాచుకుంటున్న వీరిని గుర్తించారు. మొదట 187మంది విదేశీ జమాత్ కార్యకర్తలు, 24 మంది దేశీయులను గుర్తించేందుకు పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అయితే పోలీసుల అంచనాలను తలక్రిందులు చేస్తూ భారీ సంఖ్యలో విదేశీ కార్యకర్తలు బయటపడటం గమనార్హం. అధికారులు వీరిని హుటాహుటిన క్వారంటైన్‌కు తరలించారు. మరో రెండు రోజుల్లో వీరందరికీ కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. దీనిపై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘‘ ఇక్కడో భయంకరమైన విషయం ఏంటంటే 800 మంది విదేశీయుల్లో చాలా మందికి కరోనా పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వారు చాలా మందికి వైరస్‌ను అంటించి ఉంటార’’ ని అభిప్రాయపడ్డారు. ( తబ్లిగీ: కీలకంగా వ్యవహరించిన ఏపీ పోలీసులు ) కాగా, నిజాముద్దీన్ మర్కజ్లో జరిగిన తబ్లిగీ జమాత్ సమావేశాలకు హాజరైన వారిలో అత్యధికులు ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి హాజరైన సుమారు 9,000 మందిని క్వారంటైన్లో ఉంచినట్లు కేంద్ర హోం శాఖ గురువారం ప్రకటించింది. అయితే తాజా సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం 13,702 మంది తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైనట్లు తెలుస్తోంది. -
కరోనా: వారిపైనే సిక్కోలు దృష్టి
సాక్షి, శ్రీకాకుళం: ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిపైనే సిక్కోలు పరిస్థితి ఆధారపడింది. రాష్ట్రంలో కరో నా కేసులు అమాంతం పెరగడానికి కారణం ఢిల్లీ తబ్లిగీ జమాత్ ప్రార్థనలే అన్న సంగతి అందరికీ తె లిసిందే. అయితే ఆ ప్రార్థనలకు మన జిల్లా నుంచి ఎవ్వరూ హాజరు కాలేదు. కానీ ఆ సమయంలోనే ఢిల్లీ ప్రయాణాలు చేసిన వారు ఉన్నారు. వారిపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఏ మాత్రం అ లసత్వం వహించినా చైన్‌లా కరోనా వ్యాపించే అవకాశం ఉంది. దాన్ని అడ్డుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఒక్కొక్కరిగా గుర్తిస్తున్నారు. వెంటవెంటనే శాంపిల్స్ తీసి ల్యాబ్‌కు పంపిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా నుంచి 50వరకు శాంపిల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. వాటి ఫలితాలు ఏం వస్తాయోనన్న టెన్షన్ జిల్లా వాసులకు పట్టుకుంది. మొ న్నటి వరకు విదేశాల నుంచి వచ్చిన వారితోనే క రోనా వ్యాపిస్తుందని భయం ఉండేది. దాన్ని దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాంగం అప్రమత్త మైంది. విదేశాల నుంచి వచ్చిన వారందరినీ క్వా రంటైన్‌లో పెట్టింది. జిల్లాకు 1455 మంది విదేశాల నుంచి రాగా ఇప్పటివరకు 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారు 1217 మంది ఉన్నారు. 14 రోజుల లోపు క్వారంటైన్లో ఉన్న వారు 228 మంది మాత్రమే. ఇప్పటివరకు వారిలో కరోనా లక్షణాలు పెద్దగా కనిపించలేదు. దీంతో విదేశాల నుంచి వచ్చిన వారిపై కాస్త భయం తగ్గింది. అనుకోకుండా ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింంది. మన జిల్లాలో ఇంతవరకు ఒక్క పాజిటివ్ లేదు. తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి మన జిల్లా నుంచి ముస్లింలెవరూ హాజరు కాలేదు. కాకపోతే ఆ కార్యక్రమానికి వెళ్లి తిరిగిన వచ్చిన వివిధ ప్రాంతాల వారితో రైళ్లలో ప్రయాణించే వా రు, ఆ సమయంలో వివిధ అవసరాల కోసం ఢిల్లీ లో ఉన్న వారు మన జిల్లాలో ఉన్నట్టు ప్రాథమిక సమాచారం. ఢిల్లీ సెల్ టవర్స్ సిగ్నల్ ఆధారంగా ఫోన్ నంబర్లు సేకరించి వారిని సంప్రదిస్తున్నారు. ఇదే సమయంలో ఢిల్లీ టవర్‌తో సంబంధం ఉన్న సెల్ నంబర్లకు జిల్లా నుంచి వెళ్లిన ఫోన్ కాల్స్ ఆధారంగా గుర్తిస్తున్నారు. మొత్తానికి దొరికిన వారికి సంబంధించి శాంపిల్స్ తీస్తున్నారు. అటు ఢిల్లీ ప్రయాణికులు, ఇటు కరోనా లక్షణాల అనుమానితులకు సంబంధించి 95 శాంపిల్స్ తీసి పంపించగా వా టిలో ఇప్పటివరకు 49 నెగిటివ్ వచ్చాయి. మరో 46 శాంపిల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. వాటిపైనే ఇప్పుడందరిలో ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ నుంచి వచ్చిన వారిపై ఆరా పొందూరు: మండలానికి ఢిల్లీ నుంచి వచ్చిన వారిని తహసీల్దార్ తామరాపల్లి తాడివలస పీహెచ్సీ డాక్టర్ సాగరికతో కలిసి పరిశీలించారు. రైల్వే డిపార్ట్మెంట్ ఇచ్చిన సమాచారం మేరకు 10 మంది ఢిల్లీ నుంచి వచ్చారని తెలిసిందని అన్నారు. వారిలో ఐదుగురు మాత్రమే మండలంలో ఉండగా మిగిలిన వారు రాలేదని చెప్పారు. ముగ్గురిని క్వా రంటైన్‌కు పంపించామని, ఇద్దరిని హోమ్ క్వారెంటైన్లో ఉంచామని తెలిపారు. వారిలో ఇద్దరికి పరీక్షలు జరిపించగా సాధారణ దగ్గు మాత్రమే ఉందని చెప్పారు. లాక్‌డౌన్‌కు సహకరించండి కాశీబుగ్గ: ప్రజలంతా ఇళ్లకే పరిమితమై లాక్‌డౌన్‌కు సహకరించాలని కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి కోరారు. శుక్రవారం కాశీబుగ్గలో సీఐ వేణుగోపాలరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. డివిజన్ పరిధిలోని 12 మండలాలకు ఢిల్లీ నుంచి వచ్చిన వారు 70 మందిని గుర్తించి జిల్లా కేంద్రంలోని క్వారంటైన్ సెంటర్‌కు తరలించామన్నారు. -
యూపీలో నర్సులపై వెకిలి వేషాలు
న్యూఢిల్లీ/ఘజియాబాద్: బ్లాక్ లిస్ట్‌లో చేర్చి, టూరిస్ట్ వీసాలను రద్దు చేసిన 960 మంది తబ్లిగీ జమాత్‌కు చెందిన విదేశీ కార్యకర్తల్లో నలుగురు అమెరికన్లు, తొమ్మిది మంది బ్రిటిషర్లు, ఆరుగురు చైనీయులు ఉన్నారని కేంద్ర హోం శాఖ శుక్రవారం వెల్లడించింది. వారితో పాటు, ప్రస్తుతం భారత్‌లోని పలు రాష్ట్రాల్లో ఉన్న తబ్లిగీ విదేశీ కార్యకర్తల్లో 379 మంది ఇండోనేసియన్లు, 110 మంది బంగ్లాదేశీయులు, 63 మంది మయన్మార్ వారు, 33 మంది శ్రీలంక వారు ఉన్నారని పేర్కొంది. కిర్గిస్తాన్(77), మలేసియా(75), థాయిలాండ్(65), ఇరాన్(24), వియత్నాం(12), సౌదీ అరేబియా(9), ఫ్రాన్స్(3)లకు చెందిన విదేశీ తబ్లిగీ కార్యకర్తల వీసాలను కూడా రద్దు చేశామంది. ఆ 960 మందిలో కజకిస్తాన్, కెన్యా, మడగాస్కర్, మాలి, ఫిలిప్పైన్స్, ఖతార్, రష్యా తదితర దేశాల వారు కూడా ఉన్నారని తెలిపింది. టూరిస్ట్ వీసాపై వచ్చిన వీరిని ఇప్పుడు ఆయా దేశాలకు తిరిగి పంపే ఆలోచన లేదని, వారిపై ఫారినర్స్ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్‌ల కింద వీసా నిబంధనలను ఉల్లంఘించిన నేరాల కింద చర్యలు తీసుకోనున్నామని హోంశాఖ జాయింట్ సెక్రటరీ పున్య సలిల శ్రీవాస్తవ స్పష్టం చేశారు. ‘వారిపై చర్యలు ప్రారంభమైన ప్రస్తుత సమయంలో వారిని వెనక్కు పంపే ప్రశ్నే లేదు. ఎప్పుడు పంపిస్తామన్నది నిబంధనలకు లోబడి నిర్ణయిస్తాం’ అన్నారు. తబ్లిగీ జమాత్ కార్యక్రమాల్లో పాల్గొని తమ దేశాలకు వెళ్లిన 360 మంది విదేశీయులను బ్లాక్ లిస్ట్ చేసే కార్యక్రమం ప్రారంభించామని వెల్లడించింది. వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించామని శ్రీవాస్తవ తెలిపారు. కరోనా వైరస్‌కు సంబంధించి కొత్తగా 1930 అనే టోల్‌ఫ్రీ నెంబర్‌ను కూడా ప్రారంభించామన్నారు. కేంద్ర హోంశాఖ వెబ్సైట్లో రాష్ట్రాల హెల్ప్‌లైన్ నెంబర్లు కూడా ఉన్నాయన్నారు. ► కరోనా, లాక్‌డౌన్‌కు సంబంధించి ఢిల్లీ ప్రజలు తమ సమస్యలు తెలిపేందుకు వాట్సాప్ హెల్ప్‌లైన్ నెంబర్ 8800007722ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ► ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు శుక్రవారం రాజస్తాన్‌లోని టోంక్ జిల్లాలో పర్యటించారు. కరోనా వ్యాప్తిపై సర్వే నిర్వహించారు. యూపీలో నర్సులపై వెకిలి వేషాలు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఒక ఆసుపత్రిలో నర్సులపై తప్పుగా ప్రవర్తించిన ఆరుగురు తబ్లిగీ జమాత్ సభ్యులపై రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఎస్ఏ కింద కేసు నమోదు చేసింది. వారిపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కూడా కేసు పెట్టారు. నర్సులపై అభ్యంతర కర వ్యాఖ్యలు చేసినట్లు వారిపై అభియోగాలు నమోదయ్యాయి. ప్యాంటు వేసుకోకుండా ఆసుపత్రుల్లో తిరిగారని, వెకిలి వ్యాఖ్యలు చేస్తూ, బూతు పాటలు పాడుతూ, వెకిలి చర్యలకు పాల్పడ్డారని, భౌతిక దూరం పాటించలేదని, తామిచ్చే ఔషధాలను తీసుకునేందుకు నిరాకరించారని ఆ ఆరుగురిపై నర్సులు ఫిర్యాదు చేశారు. దేశ భద్రతకు, శాంతి భద్రతలకు ప్రమాదమని భావిస్తే ఎన్ఎస్ఏ కింద ఎవరినైనా ఎలాంటి అభియోగాలు లేకుండానే, సంవత్సరం పాటు నిర్బంధంలోకి తీసుకోవచ్చు. కనౌజ్‌లోని జామామసీదులో శుక్రవారం ప్రార్థనలు చేసేందుకు గుమికూడటాన్ని నిరోధించేందుకు ప్రయత్నించిన పోలీసులపై పలువురు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. ► మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కోవిడ్–19 బాధితుల కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగును క్వారంటైన్ చేసేందుకు వెళ్లిన వైద్య సిబ్బందిపై దాడి చేసిన నలుగురిపై జాతీయ భద్రత చట్టం(ఎన్ఎస్ఏ) కింద కేసు నమోదు చేశారు. కోవిడ్‌పై పోరుకు ఆ ఘటనలతో విఘాతం ఆనంద్ విహార్ వద్ద భారీ సంఖ్యలో వలస కార్మికులు గుమికూడటం, నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్ యావత్ దేశం కరోనా కట్టడికి చేస్తోన్న ప్రయత్నాలకు విఘాతం కలిగించాయని రాష్ట్రపతి కోవింద్ పేర్కొన్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో రాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. -
తబ్లిగీ: కీలకంగా వ్యవహరించిన ఏపీ పోలీసులు
హైదరాబాద్: దేశ రాజధానిలోని నిజాముద్దీన్ మర్కజ్లో జరిగిన తబ్లిగీ జమాత్ సమావేశాలకు హాజరైన వారిలో అత్యధికులు ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడటం కలకలం రేపుతోంది. ఈ కార్యక్రమానికి హాజరైన సుమారు 9,000 మందిని క్వారంటైన్లో ఉంచినట్లు కేంద్ర హోం శాఖ గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం మొత్తం 13,702 మంది తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైనట్లు తెలుస్తోంది. మొబైల్ టవర్ సిగ్నల్స్ విశ్లేషణ ద్వారా సమావేశానికి హాజరైన వారి లెక్కలను అంచనా వేయడంలో ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారులు కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. అయితే ఢిల్లీకి వెళ్లిన వారి సంఖ్య భారీగా ఉండటం... వివిధ రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో... వారందరినీ గుర్తించడం అధికారులకు సవాలుగా పరిణమించింది. ఇక ప్రస్తుతం గుర్తించిన 13,702 మందిలో దాదాపు 7930 మందిపై కరోనా తీవ్ర ప్రభావం చూపనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తబ్లిగీ జమాత్‌కు హాజరైన వారి కారణంగా ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బిహార్, జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధిక మంది కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. కాబట్టి ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని... ఢిల్లీకి వెళ్లిన వారు బాధ్యతగా వ్యవహరించి వైద్య పరీక్షల కోసం ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. (తబ్లిగ్ జమాత్ : ఆడియో విడుదల) కాగా గుంటూరులోని ఓ నియోజవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి సమీప బంధువుకు కరోనా సోకడంతో స్థానిక పోలీసులు అప్రమత్తమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీ కార్యక్రమానికి హాజరైన ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కూడా మహమ్మారి బారిన పడినట్లు గుర్తించారు. దీంతో పాలనా యంత్రాంగాలు అప్రమత్తమై వెంటనే రంగంలోకి దిగాయి. కేంద్ర సంస్థలతో సమన్వయమై తబ్లిగ్ జమాత్‌కు హాజరైన వారి వివరాలు సేకరిస్తున్నాయి. ఇక రాష్ట్రంలో కోవిడ్–19ను సమగ్ర వ్యూహంతో ఎదుర్కొంటున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తెలిపిన విషయం తెలిసిందే. తబ్లీగ్ జమాతేకు ఏపీ నుంచి వెళ్లినవారు 1085 వీరిలో రాష్ట్రంలో ఉన్నవాళ్లు వాళ్లు 946 ఇందులో 881 మందికి పరీక్షలు పూర్తి వీరిలో 108 మందికి కరోనా వైరస్ పాజిటివ్ జమాతేకు వెళ్లిన వారి కుటుంబ సభ్యులు వారితో, కాంటాక్ట్ అయినవారు 613 మందికి పరీక్షలు వీరిలో 32 మంది పాజిటివ్ మొత్తం 161 పాజిటివ్ కేసుల్లో 140 మంది ఢిల్లీ జమాతే సదస్సుకు వెళ్లినవారు, వారిలో కాంటాక్ట్ అయినవారే -
తబ్లిగి జమాత్‌పై కేంద్రం సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో దేశ రాజధానిలో మర్కజ్ నిర్వహించిన ఘటనపై ప్రభుత్వం తబ్లిగీ జమత్, నిజాముద్దీన్‌లపై కఠిన చర్యలు చేపట్టింది. ప్రార్ధనలకు హాజరైన 960 మంది విదేశీయులను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చడంతో పాటు వారి టూరిస్ట్ వీసాలను రద్దు చేసింది. విదేశీయుల చట్టం 1946, విపత్తు నిర్వహణ చట్టం-2005 నిబంధనలను ఉల్లంఘించిన 960 మంది విదేశీయులపై చట్టబద్ధ చర్యలు చేపట్టాలని ఢిల్లీ పోలీసులు, డీజీపీని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. దక్షిణ ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో తబ్లిగ్ జమత్ సమ్మేళనం నిర్వహించిన తర్వాత ఈ ప్రాంతం కరోనా హాట్‌స్పాట్‌గా మారిన క్రమంలో హోంశాఖ ఈ చర్యలు చేపట్టింది. కాగా 9000 మంది తబ్లిగి జమత్ సభ్యులు, వారితో సన్నిహితంగా మెలిగిన వారిని ఇప్పటివరకూ క్వారంటైన్‌కు తరలించామని హోం శాఖ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో 2000 మంది తబ్లిగి జమత్ సభ్యుల్లో 1804 మందిని క్వారంటైన్‌కు తరలించామని, వారిలో 334 మంది వైరస్ అనుమానితులను ఆస్పత్రులకు తరలించామని హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య శ్రీవాస్తవ వెల్లడించారు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2000 దాటగా 53 మంది మరణించారు. చదవండి : ‘తబ్లిగి’తో 400 పాజిటివ్ కేసులు -
అందుకు ఇది సమయం కాదు: రహమాన్
ముంబై: మహమ్మారి కరోనాను అరికట్టేందుకు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి ధన్యవాదాలు చెబుతున్నానని సంగీత దిగ్గజం ఏఆర్ రహమాన్ అన్నారు. అంటువ్యాధిని కట్టడి చేసేందుకు తమ జీవితాలు ప్రమాదంలో పడుతున్నా లెక్కచేయ కృషి చేస్తున్న తీరును అభినందించాలన్నారు. ప్రాణాంతక వైరస్‌తో పోరాడాల్సిన ప్రస్తుత తరుణంలో భేషజాలకు వెళ్లకుండా అంతా కలిసికట్టుగా ఉండాలని సూచించారు. కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నామని.. ఇటువంటి సమయంలో మానవత్వాన్ని పరిమళింపజేయాలని సూచించారు. ‘‘దేవుడు మీ హృదయంలోనే ఉన్నాడు. కాబట్టి మతపరమైన పవిత్ర స్థలాల్లో గుమిగూడటానికి ఇది సమయం కాదు. ప్రభుత్వం సూచనలను పాటించండి. స్వీయ నిర్బంధంలోకి వెళ్తే మరికొన్నేళ్లు మీరు బతుకవచ్చు. వైరస్‌ను వ్యాప్తి చేయకండి. సాటి మనుషులకు హాని కలిగించకండి. మీకు వైరస్ సోకదని అనుకుంటే పెద్ద పొరపాటే. వదంతులు వ్యాప్తి చేసి భయాలను పెంచకండి. దయచేసి జాగరూకతతో మెలగండి. లక్షలాది మంది ప్రాణాలు మన చేతిలో ఉన్నాయి’’అని రహమాన్ ఓ నోట్‌ను ట్విటర్లో షేర్ చేశారు.(తబ్లిగ్ జమాత్ : ఆడియో విడుదల) కాగా దేశ రాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ మసీదు ఘటన దేశ వ్యాప్తంగా అలజడి సృష్టిస్తున్న విషయం తెలిసిందే. గత నెల 13 నుంచి 15 వరకు తబ్లిగి జమాత్ అక్కడ నిర్వహించిన మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్న పలువురికి కరోనా వైరస్ సోకింది. అయితే వారంతా ప్రస్తుతం సొంత రాష్ట్రాలకు వెళ్లడంతో వారి ఆచూకీని కనుగొనేందుకు ప్రభుత్వాలు పటిష్ట చర్యలు చేపడుతున్నాయి. దీంతో కార్యక్రమ నిర్వాహకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రహమాన్ పై విధంగా ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. This message is to thank the doctors, nurses and all the staff working in hospitals and clinics all around India, for their bravery and selflessness... pic.twitter.com/fjBOzKfqjy — A.R.Rahman (@arrahman) April 1, 2020 -
తబ్లిగ్ జమాత్ : ఆడియో విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ మసీదు దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. మర్కజ్లో గత నెల 13 నుంచి 15 వరకు నిర్వహించిన మతపరమైన ప్రార్థనాల్లో పాల్గొన్న వారికి కరోనా వైరస్ సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మతపరమైన ప్రార్థనలు నిర్వహించిన మౌలానా సాద్‌పై ఢిల్లీ పోలీసు కమిషనర్ ఎస్. ఎన్. శ్రీవాత్సవ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ‘తబ్లిగ్ జమాత్’ మతపరమైన ప్రార్థన కార్యక్రమాన్ని నిర్వహించిన మౌలానా సాద్ కంధల్వి ఓ ఆడియోను విడుదల చేశారు. (తబ్లిగి జమాత్ : ఈశాన్యానికి విషపు వైరస్) తాను వైద్యుల సలహా మేరకు ఐసోలేషన్‌లో ఉన్నానని తెలిపారు. ఈ మేరకు ‘‘తబ్లిగ్ జమాత్’ కి హాజరైన వారు వైద్యుల సూచనల మేరకు ఇంట్లోనే ఉండాలి. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటించాలి. అధికారులకు సహకరించాలి’ ఆయన కోరారు. మరోవైపు నిజాముద్దీన్ మర్కజ్‌పై లోతైన దర్యాప్తు చేపట్టినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. భారత్‌లో ఇప్పటి వరకు 1980 మంది కరోనా వైరస్ బారినపడగా, 59 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 144 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. (‘ఇలా చేస్తే కరోనా నుంచి కోలుకోవచ్చు’) -
మర్కజ్ : ఈశాన్యానికి పాకిన విషపు వైరస్
డిస్పూర్ : ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల పెరుగుదల తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మొన్నటి వరకు ప్రశాంతంగా హిమాలయ రాష్ట్రాల్లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున కరోనా కేసులు పెరిగాయి. అస్సాంలో బుధవారం వరకు కేవలం ఒక్క కరోనా కేసు మాత్రమే ఉండగా.. తాజాగా ఆ సంఖ్య 16కి చేరింది. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్‌లోనూ తొలి పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. కాగా వీరంతా ఢిల్లీలో జరిగిన తబ్లిగి జమాత్‌కు హాజరై తిరిగి వచ్చిన వారే కావడం గమనార్హం. దీంతో నిజాముద్దీన్‌లోని మర్కజ్ ప్రకంపనలు ఈశాన్య భారతాన్నీ తాకాయి. ఒక్క అస్సాం నుంచే మర్కజ్‌కు 547కు మంది హాజరైట్లు ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. వీరిలో చాలామందిని గుర్తించి నిర్బంధం కేంద్రానికి తరలించామని, ఇంకా 117 మంది ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. 196 మంది నమూనాలను పరీక్షా కేంద్రాలకు పంపినట్లు అధికారులు తెలిపారు. కాగా ఇప్పటికే మణిపూర్, మిజోరంలో ఒక్కో కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూసిన విషయం తెలిసిదే. అయితే ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లిన వారికి కరోనా సోకడంతో ఆయా ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. మరోవైపు ఇప్పటి వరకు ఈశాన్య ప్రాంతంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 20కి చేరింది. (‘ఆపరేషన్ మర్కజ్’) కాగా ఢిల్లీలో జరిగిన తబ్లిగి జమాత్‌కు హాజరై కరోనాతో తిరిగి స్వస్థలాలకు వెళ్లిన వారి వల్ల దేశంలో ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో 335, కేరళ 280 కేసులు నమోదయ్యాయి. ఇక తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య 234కి చేరింది. వీటిలో 110 కేసులు ఢిల్లీలోని తబ్లిగి జమాత్‌కు హాజరైనవారికి సంబంధించినవే కావడం గమనార్హం. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ తబ్లిక్ తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే. మర్జజ్కు వెళ్లివచ్చిన వారితో పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తం అయ్యాయి. -
‘ఆపరేషన్ మర్కజ్’
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ హాట్‌స్పాట్‌గా మారిన ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లిగి జమాత్‌కు హాజరై, స్వస్థలాలకు తిరిగివెళ్లిన వారి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జల్లెడ పడుతున్నాయి. వారిలో ఇప్పటివరకు వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో దాదాపు 6 వేల మందిని అధికారులు గుర్తించారు. వారిలో 5 వేల మందిని క్వారంటైన్ చేశారు. వివిధ రాష్ట్రాల్లోని మిగతా సుమారు 2 వేల మంది కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఆ 2 వేల మందిలో గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలవారే అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, తబ్లిగి జమాత్ సదస్సుకు హాజరై స్వస్థలాలకు వెళ్లిన వారు.. ఆ తరువాత ఎవరెవరిని కలిశారో యుద్ధ ప్రాతిపదికన ఆరా తీయాలని కేంద్రం రాష్ట్రాలను మరోసారి ఆదేశించింది. తబ్లిగి జమాత్‌లో పాల్గొన్న వారిలో చాలామంది వైరస్ బారిన పడుతున్న నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలను మరోసారి అప్రమత్తం చేసింది. కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా బుధవారం అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తబ్లిగి జమాత్ మర్కజ్‌కు హాజరైన వారు ఆ తరువాత ఎవరెవరని కలిశారన్న విషయం గుర్తించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలని ఆయన కోరారు. తబ్లిగి జమాత్‌లో పాల్గొన్న విదేశీయులు వీసా నిబంధనలను ఉల్లంఘించినట్టు తేలిందని, వీసా నిబంధనలను ఉల్లంఘించిన విదేశీయులపైన, నిర్వాహకులపైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరారు. వారం రోజుల్లోగా రాష్ట్రాలు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజనను అమలు చేయాలని కోరారు. ఈ పథకం కింద రూ. 27,500 కోట్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నారు. సరుకులను ఎలాంటి అడ్డంకులు లేకుండా రాష్ట్రాల మధ్య రవాణా జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఈ సందర్భంగా అంతా భౌతికదూరం పాటించేలా చూడాలని రాష్ట్రాలను కోరారు. కరోనాపై పోరుకు భారీ నష్టం కరోనా కట్టడికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు ఢిల్లీలో జరిగిన తబ్లిగి జమాత్ సమావేశం భారీ నష్టం చేకూర్చిందని జాతీయ మైనారిటీ కమిషన్ ఆవేదన వ్యక్తం చేసింది. మదర్సాలు, ఇతర మత ప్రదేశాలు లాక్‌డౌన్‌ను కచ్చితంగా అమలు చేసేలా చూడాలని రాష్ట్రాలను కోరింది. నిజాముద్దీన్ ఘటన లాక్‌డౌన్‌ను ఉల్లంఘించడమే కాకుండా, సహ పౌరుల ప్రాణాలను పణంగా పెట్టడమేనని ఎన్సీఎం చీఫ్ సయ్యద్ ఘయోరుల్ హసన్ రిజ్వీ పేర్కొన్నారు. ఉల్లంఘనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. లాక్‌డౌన్‌ను కచ్చితంగా అమలు చేసేందుకు మత పెద్దల సహకారం తీసుకోవాలన్నారు. జమాత్‌కు హాజరైనవారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపించుకోవాలని కోరారు. ► కరోనా హాట్‌స్పాట్స్, క్వారంటైన్ కేంద్రాలు, బహిరంగ ప్రదేశాలను వైరస్ రహితంగా చేసేందుకు ఫైర్ సర్వీస్ సిబ్బంది సేవలను ఉపయోగించుకోవాలని ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ అధికారులను ఆదేశించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇతర ఉన్నతాధికారులతో బుధవారం ఆయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ► తబ్లిగి జమాత్ మర్కజ్ నుంచి గత 36 గంటల్లో 2,361 మందిని తరలించామని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తెలిపారు. వారిలో 617 మందిని ఆసుపత్రులకు, మిగతావారిని క్వారంటైన్ కేంద్రాలకు పంపించామన్నారు. ► రాజస్తాన్‌లోని అజ్మీర్ జిల్లాలో ఉన్న సర్వార్ పట్టణంలోని ఒక దర్గాలో మంగళవారం జరిగిన మతపరమైన కార్యక్రమానికి 100 మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. వారిని పంపించేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. -
వారి వివరాలు సేకరించండి: కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్ ప్రార్థనల్లో పాల్గొని తిరిగొచ్చిన వారిలో చాలా మందికి కరోనా వైరస్ సోకడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కారదర్శులు, డీజీపీలతో కేంద్ర కేబినెట్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తబ్లిగి జమాత్ కార్యక్రమానికి హాజరైన వారి వివరాలన్నింటినీ సేకరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విదేశీయుల వివరాలు సేకరించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వీసా నిబంధనలు ఉల్లంఘించి మత కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని తీవ్రంగా పరిగణించాలన్నారు.(మర్కజ్ @1,030) ఇక కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా సామాజిక దూరాన్ని పాటిస్తూనే.. రవాణా వాహనాలను ఎటువంటి ఆటంకాలు లేకుండా రాష్ట్రాల మధ్య, రాష్ట్రాల్లో లోపల కూడ అనుమతించాలని ఆదేశించారు. నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని పేర్కొన్నారు. వచ్చే వారంలో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనను దశల వారీగా అమలు చేయాలని సూచించారు. -
అల్లా... శాంతిని ప్రసాదించు
* వేడుకున్న ముస్లింలు * ముగిసిన ఇస్లామిక్ సమ్మేళనం సాక్షి, హైదరాబాద్: ‘అల్లా.. సమాజంలో స్వార్థంతో పాపాలు పెరిగిపోతున్నాయి. రక్తపాతం కొనసాగుతోంది. శాంతిని ప్రసాదించు. సర్వ మానవాళిని కరుణించు. సన్మార్గంలో నడిచేలా దయ చూపు’ అంటూ లక్షలాది మంది ముస్లింలు దేవుడిని వేడుకున్నారు. తబ్లిక్ జమాత్ ఆధ్వర్యంలో పహాడీ షరీఫ్‌లో మూడు రోజుల పాటు జరిగిన ప్రపంచ స్థాయి ఇస్లామిక్ (ఇజ్తేమా) సమ్మేళనం సోమవారం ముగిసింది. ఈ సందర్భంగా మౌలానా ఖాసీం ఖురేషీ సుదీర్ఘంగా దువా (అల్లాను వేడుకోలు) నిర్వహించారు. సర్వ మానవాళి పాపాలు క్షమించాలని, సుఖశాంతులతో సుభిక్షంగా ఉండేలా చూడాలని అల్లాను వేడుకున్నారు. ఉదయం ఫజర్ నమాజ్ అనంతరం ఇస్లాం పండితులు మౌలానా అస్లాం, మౌలానా ముస్తాక్, మౌలానా ఖాసీం ఖురేషిలు ప్రసంగించారు. ఇస్లాం మంచిని ప్రబోధిస్తూ శాంతిని కాంక్షిస్తుందన్నారు. దేవుడి వరం మానవ జన్మ అని, దానిని సార్థకం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మహ్మద్ ప్రవక్త అనుసరించిన మార్గంలో జీవన గమనాన్ని సాగించాలన్నారు. మంచి మార్గంలో నడిచినప్పుడే ఇతరులకు ఆదర్శంగా మారుతారన్నారు. ఆధ్యాత్మిక చింతన, సహనం, మంచితనంతో దేనినైనా జయించవచ్చన్నారు. ప్రతి ఒక్కరికీ ఆత్మశుద్ధి అవసరమని, అప్పుడే దేవుడి కృప వెన్నంటి ఉంటుదన్నారు. కాగా, మూడు రోజుల పాటు జరిగిన సమ్మేళనానికి సుమారు నాలుగు లక్షల మందికి పైగా హాజరయ్యారు. ముగింపు సందర్భంగా ఇస్లామిక్ పండితులు భవిష్యత్తు కార్యచరణపై ప్రత్యేక భేటి నిర్వహించారు.