న్యూఢిల్లీ : ఢిల్లీకి చెందిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు 82 మంది విదేశీయులపై మంగళవారం చార్జీషీట్ దాఖలు చేసింది. దేశవ్యాప్తంగా కరోనా విజృంభించడంలో ప్రముఖ పాత్ర పోషించిన నిజాముద్దీన్‌లోని తబ్లిగి జమాత్‌తో వీరికి సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో 20 చార్జీషీట్‌లు దాఖలు చేసినట్లు క్రైమ్ బ్రాంచ్ స్పష్టం చేసింది. ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టులో మెజిస్ట్రేట్ సేమా జైల్ ఎదుట చార్జీషీట్‌లు దాఖలు చేశామని, మొత్తం 20 చార్జీషీట్లను 15449 పేజీలతో రూపొందించినట్లు తెలిపారు.
చార్జీషీట్ దాఖలైన వారిలో 14 మంది ఫిజి దేశం నుంచి, 10 మంది సౌదీ అరేబియా, 8 మంది అల్జేరియా, బ్రెజిల్, చైనా నుంచి ఏడుగురు, సుడాన్, ఫిలిప్పీన్స్ నుంచి ఆరుగురు, ఐదుగురు యూఎస్‌ఏ, నలుగురు అప్ఘనిస్తాన్, ఇద్దరు చొప్పున ఆస్ట్రేలియా, కజకిస్తాన్, మొరాకొ, యూకే నుంచి ఉండగా, ఈజిప్ట్, రష్యా, బెల్జియం, జోర్డాన్, ఫ్రాన్స్, ట్యూనిషియా నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. వీసా నిబంధలను ఉల్లఘించడంపై వీరిపై చార్జీషీట్ దాఖలు చేశామని అధికారులు పేర్కొన్నారు. మర్కజ్ సమావేశానికి హాజరయ్యారా లేదా అనే దానిపై ఇప్పటికే వారిని ప్రశ్నించినట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు.
(కరోనా : రాజకీయ సంక్షోభం తప్పదా..!)
Comments
Please login to add a commentAdd a comment