Delhi police
-
గ్యాంగ్స్టర్ల స్థావరాలపై ఢిల్లీ పోలీసుల దాడులు
న్యూఢిల్లీ: గ్యాంగ్స్టర్ల అరాచకాలను అరికట్టేందుకు ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, కౌశల్ చౌదరి గ్యాంగ్, హిమాన్షు భావు గ్యాంగ్, కాలా జాతేడి, హషీమ్ బాబా, చేను గ్యాంగ్, గోగి గ్యాంగ్, నీరజ్ బవానియా, టిల్లూ తాజ్‌పురియా గ్యాంగ్‌లతో సంబంధమున్న వాంటెడ్ నేరస్థుల రహస్య స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు.ఢిల్లీలోని ఔటర్ ఢిల్లీ, ద్వారకా ఏరియా, ఈశాన్య ఢిల్లీ, నరేలా, కంఝవాలా, సంగమ్ విహార్ తదితర ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసు బృందాలు దాడులు నిర్వహించాయి. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్, క్రైమ్ బ్రాంచ్ బృందం, ప్రత్యేక పోలీసు సిబ్బంది సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. గ్యాంగ్స్టర్లతో సంబంధం ఉన్న పలువురు షూటర్లు, హెంచ్మెన్లను అదుపులోకి తీసుకున్నారు.ఢిల్లీలోని గ్యాంగ్స్టర్లు ఇటీవలి కాలంలో తమ అనుచరుల ద్వారా కాల్పులు, హత్యా ఘటనలకు పాల్పడుతున్నారు. 2024 అక్టోబరులో ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన ఏడుగురు షూటర్లను అరెస్టు చేసింది. వీరిని పంజాబ్, ఆ చుట్టుపక్కల రాష్ట్రాలలో అరెస్టు చేశారు. వారి నుంచి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.బాబా సిద్ధిఖీ కేసులో అరెస్టయిన షూటర్లను స్పెషల్ సెల్ విచారిస్తోంది. జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌పై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఎ) రూ.10 లక్షల రివార్డును ప్రకటించింది. 2022లో నమోదైన రెండు ఎన్ఐఏ కేసుల్లో అతనిపై ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఇది కూడా చదవండి: ‘నేటి పిల్లలే రేపటి సూపర్ మోడల్స్’.. 200 మంది పేరెంట్స్‌కు రూ. 5 కోట్ల టోకరా -
‘నేటి పిల్లలే రేపటి సూపర్ మోడల్స్’.. 200 మంది పేరెంట్స్‌కు రూ. 5 కోట్ల టోకరా
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని ద్వారకకు చెందిన 34 ఏళ్ల మహిళ తన తీరిక సమయంలో ఫేస్‌బుక్‌ను స్క్రోలింగ్ చేసింది. ఒక ప్రకటన ఆమె దృష్టిని ఆకర్షించింది. ఆ యాడ్‌లో లాట్స్ స్టార్ కిడ్స్ సంస్థ పిల్లలకు మోడలింగ్ అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొంది.దీనితో పాటు మోడలింగ్‌లో శిక్షణ కూడా ఇస్తామని తెలిపింది. తన కుమార్తెకు ఇది మంచి అవకాశం అవుతుందని ఆమె భావించింది. వెంటనే సదరు మహిళ ఆ యాడ్‌పై క్లిక్ చేసింది. అది ఆమెను ‘టెలిగ్రామ్’కు తీసుకువెళ్లింది. ఈ సంస్థను ఇదేవిధంగా చాలా మంది తల్లిదండ్రులు సంప్రదించారు. తమపిల్లలను మోడల్స్‌గా మార్చాలనే తాపత్రయంలో ఆ సంస్థ అడిగినంత ఫీజు చెల్లించారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం ఆ సంస్థ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన చిన్నారులకు మోడలింగ్ అసైన్మెంట్లు ఇవ్వనున్నట్లు హామీనిచ్చింది. ఎంతకాలం గడిచినా లాట్స్ స్టార్ కిడ్స్ సంస్థ చిన్నారులకు మోడలింగ్ అవకాశాలు కల్పించలేదు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్లు చేపట్టి ఈ సంస్థ గుట్టును రట్టు చేశారు. ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్టు చేశారు. ఈ సంస్థ ముఠా సభ్యులు 197 మంది తల్లిదండ్రుల నుంచి రూ.4.7 కోట్లకు పైగా మొత్తాన్ని వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. పిల్లలను మోడల్స్‌గా తీర్చిదిద్దాలనుకునే తల్లిదండ్రులను టార్గెట్‌గా చేసుకుని, వీరు భారీ ఎత్తున మోసానికి పాల్పడ్డారు.ఈ స్కామర్లు మోడలింగ్ చేస్తున్న పిల్లల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి, ఇతర తల్లిదండ్రులను ఆకర్షిస్తారు. తరువాత వారిని టెలిగ్రామ్ గ్రూప్‌లో చేర్చి, పిల్లలకు మోడలింగ్‌లో అవకాశాలు ఇప్పిస్తామంటూ తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేస్తారు. ఇందుకు ఆన్లైన్ వేదికను ఉపయోగించుకుంటారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. తల్లిదండ్రులు ఇలాంటి ఉచ్చులో చిక్కుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చదవండి: రైలులో పాము కాటు.. ప్రయాణికుల తొక్కిసలాట -
Supreme Court: కాలుష్యాన్ని ఏ మతమూ ప్రోత్సహించదు
న్యూఢిల్లీ: కాలుష్యాన్ని సృష్టించే ఏ రకమైన కార్యకలాపాలనూ ఏ మతమూ ప్రోత్సహించబోదని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఏడాదంతా బాణసంచాను ఢిల్లీ పరిధిలో నిషేధించాలా వద్దా అనే అంశంపై 15 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఢిల్లీలో బాణసంచా తయారీ, విక్రయాలపై నిషేధం అమల్లో ఉన్నాసరే దీపావళి వేళ ఢిల్లీ వ్యాప్తంగా విపరీతంగా బాణసంచా కాల్చడంతో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. సంబంధిత కేసును సోమవారం సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్ల ధర్మాసనం విచారించింది. ‘‘కాలుష్యరహిత వాతావరణంలో జీవించడం అనేది ప్రతి ఒక్క పౌరుడి ప్రాథమిక హక్కు. దీనిని రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్ రక్షణ కల్పిస్తోంది. కాలుష్యకారక ఏ పనినీ ఏ మతమూ ప్రోత్సహించదు. సరదాగా బాణసంచా కాల్చినాసరే తోటి పౌరుల ఆరోగ్యకర జీవన హక్కుకు భంగం వాటిల్లినట్లే’’ అని వ్యాఖ్యానించింది. సంవత్సరం పొడవునా ఢిల్లీలో బాణసంచాపై నిషేధం అంశంపై ప్రభుత్వానికి కోర్టు సూచన చేసింది. ‘‘ సంబంధిత అన్ని వర్గాలతో సంప్రతింపులు జరపండి. ఆ తర్వాత నవంబర్ 25వ తేదీలోపు మీ నిర్ణయాన్ని తెలియజేయండి’’ అని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మీ రాష్ట్రాల్లోనూ బాణసంచా తయారీ, నిల్వ, అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధించడంపై స్పందన తెలియజేయాలని ఢిల్లీ పొరుగు రాష్ట్రాలనూ కోర్టు కోరింది. ఢిల్లీ పోలీసులకు చీవాట్లునిషేధం ఉన్నాసరే ఊపిరాడనంతగా బాణసంచా కాల్చుతుంటే చూస్తూ ఊరుకున్నారని ఢిల్లీ పోలీసులపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘ నిషేధించాలంటూ గతంలో మేం ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ పోలీసులు బేఖాతరు చేశారని స్పష్టమైంది. గతంలో బాణసంచా తయారీ, నిల్వ, అమ్మకం అనుమతులు తీసుకున్న సంస్థలకు మా ఉత్తర్వుల కాపీలు అందినట్లు కనపించట్లేదు. మొదట ఢిల్లీ పోలీసులు చేయాల్సిన పని లైసెన్స్ దారులు టపాకాయలు విక్రయించకుండా అడ్డుకో వాలి. అమ్మకాలను ఆపేశారని, నిషేధం అమల్లోకి వచ్చిందని, ఆన్లైన్ వేదికలపై విక్రయాలు, డెలివరీ సౌకర్యాలను స్తంభింపజేసేలా సంబంధిత వర్గాల కు ఢిల్లీ పోలీసు కమిషనర్ తక్షణం సమా చారం ఇవ్వాలి. ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయండి. క్షేత్రస్థాయిలో నిషేధాన్ని అమలు చేయా ల్సిన బాధ్యత స్థానిక పోలీస్స్టేషన్లదే. అక్టోబర్ 14వ తేదీదాకా మా ఉత్తర్వులు ఎవరికీ అందకుండా ఢిల్లీ ప్రభుత్వం చేసిన ఆలస్యం చూస్తుంటే మాకే ఆశ్చర్యంవేస్తోంది’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.సాకులు చెప్పిన పోలీసులుదీనిపై ఢిల్లీ పోలీసులు తప్పును ఆప్ సర్కార్‌పై నెట్టే ప్రయత్నంచేశారు. ఢిల్లీపోలీసుల తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీ వాదించారు. ‘‘ మాకు ఉత్తర్వులు రాలేదు. దసరా అయి పోయిన రెండ్రోజుల తర్వాత ఆప్ సర్కార్ ఆదేశా లు జారీచేసింది. ఆదేశాలు వచ్చాకే మేం నిషేధం అమలుకు ప్రయత్నించాం’’ అని భాటీ అన్నారు. దీపావళి, ఆ తర్వాతి రోజు ఢిల్లీలో వా యునాణ్యత దారుణంగా పడిపోవడంతో సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ఆదేశాలు అమలుకా కపోవడంపై కోర్టు ధిక్కరణగా భావించింది. -
అదుపుతప్పి ఇద్దరిని ఢీకొన్న బస్సు.. కానిస్టేబుల్, మరో వ్యక్తి మృతి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి రింగ్ రోడ్‌లోని మొనాస్టరీ మార్కెట్ సమీపంలో ఒక డీటీసీ బస్సు అదుపుతప్పింది. ఈ ఘటనలో సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌తో పాటు మరో వ్యక్తి మృతి చెందాడు. డీటీసీ బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బస్సు డ్రైవర్‌ను ఘాజీపూర్ నివాసి వినోద్ కుమార్ (57)గా గుర్తించారు. సదరు డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో రింగ్ రోడ్డులోని మఠం మీదుగా వేగంగా వచ్చిన ఈ డీటీసీ బస్సు ఒక ఇనుప స్తంభాన్ని ఢీకొని, అక్కడే ఉన్న ఒక వ్యక్తిని కూడా ఢీకొంది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. #WATCH दिल्ली: रिंग रोड पर मोनेस्ट्री मार्केट के पास एक अनियंत्रित डीटीसी बस ने एक व्यक्ति और पीएस सिविल लाइंस के एक पुलिस कांस्टेबल को टक्कर मार दी और डिवाइडर से टकरा गई। दुर्भाग्य से, दोनों की मृत्यु हो गई है। दोनों को मृत घोषित कर दिया गया। डीटीसी बस का ड्राइवर विनोद कुमार… pic.twitter.com/R6MdWM9Gny— ANI_HindiNews (@AHindinews) November 4, 2024ఈ ప్రమాదం తరువాత కూడా బస్సు డ్రైవర్ వినోద్ బస్సును 100 మీటర్లు ముందుకు పోనిచ్చి, బారికేడ్ వద్దనున్న కానిస్టేబుల్ విక్టర్‌ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు విక్టర్(27) నాగాలాండ్ నివాసి. ప్రమాదం జరిగిన సమయంలో విక్టర్ నైట్ పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్ విక్టర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. #WATCH दिल्ली: एफएसएल टीम मोनेस्ट्री मार्केट, रिंग रोड के बाहर मौजूद है, जहां एक अनियंत्रित डीटीसी बस की चपेट में आने से एक व्यक्ति और पीएस सिविल लाइंस के एक पुलिस कांस्टेबल की मौत हो गई।डीटीसी बस का ड्राइवर विनोद कुमार (57) निवासी गाजीपुर पुलिस हिरासत में है। बस खराब स्थिति… pic.twitter.com/tJNWZBuaMl— ANI_HindiNews (@AHindinews) November 4, 2024ఇది కూడా చదవండి: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో సూపర్ యాప్ -
‘నా ఫోన్ దొరికింది’.. భారత్‌లోని ఫ్రెంచ్ రాయబారి
ఢిల్లీ : భారత్‌లో ఫ్రెంచ్ రాయబారి థియరీ మాథౌ మొబైల్ ఫోన్ దొంగతనం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. థియరీ మాథౌ ఫోన్ దొంగతనం చేసిన నలుగురు యువకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.దీపావళి పండుగ నేపథ్యంలో ఫ్రెంచ్ రాయబారి థియరీ మాథౌ అక్టోబర్ 20 తన కుటుంబ సభ్యులతో కలిసి ఓల్డ్ ఢిల్లీలోని చాందినీ చౌక్ లో షాపింగ్ చేశారు. ఆ సమయంలో 20 నుంచి 25ఏళ్ల మధ్యన ఉన్న దొంగలు తమ చేతి వాటం ప్రదర్శించారు.షాపింగ్ చేస్తున్న థియరీ మాథౌ జేబులో ఉన్న ఫోన్‌ను కాజేశారు. ఫోన్ మాయ మవ్వడంతో మాథౌ ఆన్లైన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాయబార కార్యాలయం అధికారులు సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాటి నుంచి కేసు దర్యాప్తు చేస్తున్నారు.దర్యాప్తులో భాగంగా మాథౌ షాపింగ్ చేస్తున్న ప్రదేశంలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఫోన్ నెంబర్ ఆధారంగా మాథౌ ఫోన్ ట్రేస్ చేశారు. నిన్న, ఇవాళ రెండ్రోజుల వ్యవధిలో ఫోన్ దొంగతనం చేసిన యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం థియరీ మాథౌకు ఫోన్‌ను అందించారు. దీంతో మాథౌకు సంతోషం వ్యక్తం చేశారు. -
ఢిల్లీ బర్గర్ కింగ్ హత్య కేసు: ‘లేడీ డాన్’ అరెస్ట్
ఢిల్లీ: ఢిల్లీలోని రాజౌరి గార్డెన్ ప్రాంతంలో ఉన్న బర్గర్ కింగ్ అవుట్‌లెట్‌లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన ఈ ఏడాది జూన్‌లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు గ్యాంగ్‌స్టర్ హిమాన్షు భావు గర్ల్ ఫ్రెండ్ అన్ను ధంకర్(19)ను ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం ఆమెను అరెస్ట్ చేసే సమయంలో నేపాల్ పారిపోవడానికి ప్లాన్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హిమాన్షు భావు ఆదేశాల మేరకు ఆమె దుబాయ్ మీదుగా అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమైనట్లు పేర్కొన్నారు. హిమాన్షు భావు గ్యాంగ్‌లోని సభ్యులు అన్ను ధంకర్ ‘‘లేడీ డాన్’’గా పిలుస్తారని పేర్కొన్నారు.హిమాన్షు భావు ఆదేశాల మేరకు ఆమె అమెరికా పరారు కాలనఇక.. జూన్ 18న పశ్చిమ ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్‌లోని బర్గర్ కింగ్ అవుట్‌లెట్‌లో అమన్ జూన్ (26) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి హత్య చేశారు. ఈ హత్య తామే చేశామని గ్యాంగ్‌స్ట్‌ర్ హిమాన్షు భావు ప్రకటించించారు. శక్తి దాదా హత్యకు ప్రతీకారంగా అమన్ జాన్‌ను హత్య చేసినట్లు తెలిపాడు. అతని స్నేహితులు.. ఆశిష్, వికాస్, బిజేందర్ అనే ముగ్గురు వ్యక్తులు ఈ హత్యలో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. అందులో ఇద్దరు షూటర్లు ఉన్నట్లు గుర్తించారు. అమన్ హత్య అనంతరం కత్రా రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరా ఫుటేజీలో ధంకర్ చివరిసారిగా కనిపించినట్లు పోలీసులు తెలిపారు.నిందితురాలు అన్ను నకిలీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌ను ఉపయోగించి అమన్‌తో స్నేహం చేసింది. జూన్ 18న అతడిని బర్గర్ కింగ్ అవుట్లెట్కు పిలింపించింది. ఆమె కోసం అమన్ వేచిచూస్తుండగా.. ఆశిష్ , వికాస్ లోపలికి వెళ్లి అమన్‌పై 39 రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. బిజేందర్ అనే మరో వ్యక్తి బైక్‌పై వచ్చి బయట వేచి ఉన్నాడు. కాల్పుల అనంతరం ముగ్గురు పరారయ్యారు. -
ఢిల్లీ పేలుడు: ఖలిస్తానీ హస్తంపై టెలిగ్రామ్‌కు లేఖ
ఢిల్లీ ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ స్కూల్ వద్ద ఆదివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. అయితే.. ఈ ఘటనకు నాటు బాంబే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ), సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)ల బృందాలు విచారణ చేపట్టాయి.ఖలిస్థాన్ అనుకూల వేర్పాటువాదులను భారత ఏజెంట్లు లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపిస్తూ.. ప్రతీకారంగా ఈ పేలుడు జరిగిందని టెలిగ్రామ్‌లో ఓ పోస్ట్ వెలుగులోకి వచ్చింది. ‘జస్టిస్ లీగ్ ఇండియా’ పేరుతో ఓ టెలిగ్రామ్ ఛానెల్ ఈ పోస్ట్‌ను పెట్టినట్లు పోలీసులు గురించారు. దీంతో ఈ దాడికి ఖలిస్థాన్ వేర్పాటువాదులు పాల్పడి ఉంటారని దర్యాప్తు సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అందులో భాగంగానే ఈ ఘటనకు ఖలిస్తాన్ వేర్పాటవాదులకు ఉన్న లింక్‌ను పరిశీలిస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. తాజాగా ‘జస్టిస్ లీగ్ ఇండియా’ పేరుతో ఉన్న టెలిగ్రామ్ ఛానెల్‌కు సంబంధించిన వివరాలను ఇవ్వాలని దర్యాప్తు బృందం లేఖలో కోరింది. అయితే.. టెలిగ్రామ్ నుంచి దర్యాప్తు సంస్థలకు ఇంకా ఎంటువంటి స్పందన రాలేదని అధికారులు తెలిపారు.ఇక.. ఈ పేలుడు తీవ్రతకు స్కూలు ప్రహరీ, ఆ సమీపంలోని దుకాణాల అద్దాలు, ఒక కారు దెబ్బతిన్నాయి. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. మరోవైపు.. పండగ సీజన్లో ఇప్పటికే రాజధానిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లున్నాయి. ఘటన నేపథ్యంలో మరింత అప్రమత్తత ప్రకటించారు. -
డ్యాన్స్ చేస్తుండగా ఆగిన కానిస్టేబుల్ గుండె
గుండె ఆగిపోయి.. హఠాత్తుగా చనిపోతున్న ఘటనలు తరచూ చూస్తున్నదే. అయితే అలాంటి మరణాల వెనుక.. వైద్యపరంగా ఆరోగ్య సమస్యలూ ఉండొచ్చనే అభిప్రాయమూ నిపుణుల నుంచి వ్యక్తం అవుతోంది. తాజాగా ఢిల్లీలో ఓ యువ పోలీస్ కానిస్టేబుల్ డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు. ఢిల్లీ రూప్‌నగర్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రవికుమార్.. స్టేషన్ హౌస్ అధికారి (ఎస్‌హెచ్‌వో) బదిలీ కావడంతో నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా రవికుమార్ పలు పాటలకు ఉత్సాహంగా డ్యాన్స్ చేశాడు. ఈ క్రమంలో ఆయనకు ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. దీంతో.. అతడి సహచరులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. రవికుమార్ చనిపోయినట్లు ప్రకటించారు. దీంతో అప్పటివరకు తమతో సరదాగా ఉన్న కానిస్టేబుల్ మృతిచెందడంతో ఆయన మిత్రులు షాక్‌కు గురయ్యారు. హెడ్ కానిస్టేబుల్ డ్యాన్స్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్‌పత్‌కు చెందిన రవికుమార్ 2010లో ఢిల్లీ పోలీస్ విభాగంలో చేరాడు. అతడి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. 45 రోజుల క్రితమే రవికుమార్ యాంజియోగ్రఫీ పరీక్ష చేయించుకున్నట్లు తెలుస్తోంది. Delhi Police Head Constable Dies of Heart Attack During Farewell PartyDelhi Police Head Constable Ravi Kumar, posted at Roop Nagar police station in North District, died of a heart attack on Wednesday evening. Kumar was attending a farewell party at the police station when he… pic.twitter.com/rfXSKGdcpa— Atulkrishan (@iAtulKrishan1) August 29, 2024 -
మహిళా రెజ్లర్లకు భద్రత కల్పించండి: కోర్టు
న్యూఢిల్లీ: ముప్పున్న మహిళా రెజ్లర్లకు భద్రతను ఉపసంహరించడం తగదని పేర్కొన్న కోర్టు తక్షణమే భద్రత కల్పించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ముగ్గురు రెజ్లర్లు గతంలో చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఇదివరకే ఢిల్లీ పోలీసులు చార్జిషీట్ నమోదు చేశారు.కేసు విచారణలో ఉంది. కాగా... కేంద్రంలో అధికారపక్షం నేత అయిన బ్రిజ్‌భూషణ్ నుంచి హాని ఉంటుందని గతంలో ఆ ముగ్గురు రెజ్లర్లకు ఢిల్లీ పోలీసులు భద్రత కల్పించారు. కానీ ఇప్పుడు ఉన్నపళంగా పోలీసు భద్రతను ఉపసంహరించడం ఏంటని అడిషనల్ చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ ప్రియాంక రాజ్‌పుత్ ఢిల్లీ పోలీసులను తలంటారు.వెంటనే భద్రతను పునరుద్ధరించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. రెజ్లర్ల భద్రతపై స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ‘ఎక్స్’ వేదికగా అభ్యంతరం వ్యక్తం చేసింది. బ్రిజ్‌భూషణ్‌పై పోరాడుతున్న రెజ్లర్లకు భద్రతను తొలగించారని వినేశ్ పోస్ట్ చేసింది. -
పాపులారిటీ కోసం పాకులాట.. ‘స్పైడర్ మ్యాన్’ అరెస్ట్
సోషల్ మీడియాలో తొందరగా పాపులరిటీ సంపాదించేందుకు కొందరు పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తుంటారు. చేయకూడని పనులు చేసి చిక్కుల్లో పడుతున్నారు. రకరకాల రీల్స్ చేస్తూజనాల చేత తిట్లు తింటున్నారు. ప్రమాదకర స్టంట్లతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అయితే ఇలాంటివి మానుకోవాలని అధికారులు చెబుతున్నా, కఠిన చర్యలు తీసుకుంటున్నా కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు.తాజాగా ఓ వ్యక్తి తన ప్రమాదకర స్టంట్తో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి కటకటాల పాలయ్యాడు. పట్టుమని 20 ఏళ్లు కూడా నిండని ఆదిత్య అనే వ్యక్తి మరో యువకుడితో కలిసి ఢిల్లీ రోడ్డుపై డేంజరస్ స్టంట్లు చేశాడు. ద్వారక ప్రాంతంలో గౌరవ్ సింగ్ (19) డ్రైవింగ్ చేస్తుండగా.. స్పైడర్ మ్యాన్ వేషం ధరించిన ఆదిత్య కారు బానెట్‌పై నిలబడి ప్రమాదకర స్టంట్లు వేశాడు.దీనిని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో సోషల్ మీడియాలో అనేక మంది ఫిర్యాదు చేశారు. చివరికి సమాచారం అందుకున్న ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు.. యువకులపై చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఇద్దరినీ కస్టడీలోకి తీసుకున్నారు. Delhi | On receiving a complaint on social media about a car seen on Dwarka roads with a person dressed as Spiderman on its bonnet, the Delhi Traffic Police took action. The person in the Spiderman costume was identified as Aditya (20) residing in Najafgarh. The driver of the… pic.twitter.com/UtMqwYqcuK— ANI (@ANI) July 24, 2024ప్రమాదకర డ్రైవింగ్, పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోవడం, సీటు బెల్టు ధరించకపోవడం వంటి చర్యలకు పాల్పడినందుకు జైలు శిక్షతో పాటు రూ. 26 వేల జరిమానా విధించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. అయితే ఆదిత్య గతంలోనూ స్పైడర్ మ్యాన్ దుస్తుల్లో ప్రమాదకర స్టంట్లకు పాల్పడి కటకటాల పాలైనట్లు తెలుస్తోంది. -
కెప్టెన్ అన్షుమన్ సతీమణిపై వివాదాస్పద పోస్టు.. నెటిజన్‌పై కేసు
న్యూఢిల్లీ: కీర్తి చక్ర అవార్డు గ్రహీత దివంగత కెప్టెన్ అన్షుమన్‌సింగ్ సతీమణి స్మృతిసింగ్‌పై వివాదాస్పద పోస్టు పెట్టినందుకుగాను ఢిల్లీ పోలీసులు ఓ నెటిజన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) ఫిర్యాదు మేరకు నిందితునిపై ఇటీవలే అమలులోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్ 2024)సెక్షన్ 79, ఐటీ చట్టం సెక్షన్ 67 కింద కేసులు పెట్టారు. స్మృతిసింగ్‌పై సోషల్‌మీడియాలో వివాదాస్పద పోస్టు పెట్టిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని ఎన్సీడబ్ల్యూ ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు ఒక లేఖ కూడా రాసింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.గతేడాది సైన్యంలో విధి నిర్వహణలో ఉండగా సియాచిన్‌లో జరిగిన ఒక అగ్నిప్రమాదంలో అన్షుమన్ ప్రాణాలు కోల్పోయారు. చనిపోయే ముందు తన సహచరులను కాపాడినందుకుగాను అన్షుమన్‌కు కేంద్ర ప్రభుత్వం కీర్తి చక్ర పతకం ప్రకటించింది. ఈ పతకాన్ని ఈ మధ్యే జులై 5న రాష్ట్రపతి చేతుల మీదుగా అన్షుమన్ సతీమణి, మాతృమూర్తులు అందుకున్నారు. కాగా అన్షుమన్‌కు వివాహం జరిగిన తర్వాత కేవలం 5 నెలలకే ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేసింది. -
అమరవీరుల జవాన్ల కుటుంబాలనూ వదలని సోషల్ మీడియా భూతం
సోషల్ మీడియా భూతం అమరవీరుల జవాన్ల కుటుంబాలనూ వదలడం లేదు. దేశం కోసం ప్రాణాల్పించిన జవాన్లు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా పోస్ట్‌లు పెడుతున్నారు.ఇటీవల అమరుడైన కెప్టెన్ అన్షుమాన్ సింగ్‌కు కేంద్ర ప్రభుత్వం కీర్తచక్ర అవార్డ్‌ను ప్రకటించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్షుమాన్ సింగ్ సతీమణి స్మృతికి అవార్డ్‌ను అందించారు. ఆ వీడియోపై కొందరు దుర్మార్గులు ట్రోలింగ్‌కు దిగారు. ఆమె చాలా అందంగా ఉందంటూ అసభ్యకరంగా ఉందంటూ కామెంట్లు పెట్టారు.ఈ అంశంపై నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (ఎన్సీడబ్ల్యూ) స్పందించింది. సోషల్ మీడియాలో అనుచిత కామెంట్లు చేస్తున్న వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. -
భారత్ విక్టరీ.. వాహనదారుల కోసం పోలీసుల సరికొత్త ఐడియా..
ఢిల్లీ: టీ20 వరల్డ్‌కప్‌లో విజేత నిలిచిన భారత జట్టును ప్రతీ ఒక్కరూ అభినందిస్తున్నారు. టీమిండియా విజయం పట్ల అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే భారత జట్టుకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఇదే సమయంలో టీమిండియా విజయంపై ఢిల్లీ పోలీసులు సరికొత్తగా ట్వీట్ చేశారు. టీమ్ విజయానికి ట్రాఫిక్ సిగ్నల్స్‌కు లింక్ పెడుతూ ప్రతీ ఒక్కరిని ఆలోచించే విధంగా పోస్ట్‌ను ట్విట్టర్లో పోస్టు చేశారు. We all waited 16 years 9 months 5 days (52,70,40,000 seconds) for India to win another #T20WorldCupLet's be a little patient at traffic signals too. Good moments are worth the wait. What say? Hearty congratulations, #TeamIndia💙 #INDvsSA#INDvSA— Delhi Police (@DelhiPolice) June 29, 2024కాగా, ఢిల్లీ పోలీసులు ట్విట్టర్ వేదికగా.. ‘మనమంతా భారత జట్టు మరో టీ20 వరల్డ్ కప్ గెలుపు కోసం 16 ఏండ్ల 9 నెలల 5 రోజులు (52 కోట్ల 70 లక్షల 40 వేల సెకన్లు) వేచిచూశాం. అదేవిధంగా ట్రాఫిక్ సిగల్స్ వద్ద కూడా ఓపికతో ఉందాం. మంచి క్షణాలు వేచి ఉండాల్సినవి. మరి మీరేమంటారు? టీమ్ఇండియాకు హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ ఢిల్లీ పోలీసులు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. The Dream Come True Number Plate!#UnStoppables#IndVsSA#WorldChampions pic.twitter.com/xMHfQjsnCc— Mumbai Traffic Police (@MTPHereToHelp) June 29, 2024 -
స్వాతి మలివాల్ కేసు: బిభవ్‌పై 201 సెక్షన్ నమోదు
ఢిలీ: తనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్‌కుమార్ దాడి చేశారని గత నెలలో ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. ఈ కేసులో బిభవ్ కుమార్‌పై కేసు నమోదు కాగా.. పోలీసులు మే 18 అరెస్ట్ చేశారు. అయితే తాజాగా బిభవ్‌కుమార్ నమోదైన కేసులో 201 సెక్షన్‌ను చేర్చారు. 201 సెక్షన్ అంటే.. ఆధారాలు మాయం చేసి.. తప్పుడు సమాచారం ఇవ్వటం. బిభవ్ కుమార్ ఈ కేసుకు సంబంధించి ఆధారాలు మాయం చేసి.. తప్పుడు సమాచారం అందించిస్తున్నట్లు మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్నారు.బిభవ్ కుమార్‌ను దర్యాప్తు చేసిన పోలీసులు.. ఆయన తన ఫోన్‌ను ఫార్మాట్ చేసినట్లు గుర్తించారు. ఆయన ముంబైలో ఫోన్ ఫార్మాట్ చేసినట్లు అనుమానం రావటంతో ఇప్పటికే పోలీసులు రెండుసార్లు ముంబైకి తీసుకువెళ్లి దర్యాప్తు చేశారు. ముంబైలో ఏ ప్రాంతంలో ఫార్మాట్ చేశారు?. ఫోన్లోని డేటాను ఎవరికి షేర్ చేశారు? అన్న విషయాలు మాత్రం బిభవ్ వెల్లడించలేదని పోలీసులు తెలిపారు. ఇక.. కస్టడీలో ఉన్న ఆయన దర్యాప్తు సమయంలో అస్సలు సహకరించలేదని ఓ పోలీసు అధికారి తెలిపారు.సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి నుంచి మూడు సీసీటీవీ కెమెరాల డీవీఆర్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. బిభవ్ సీసీటీవీ కెమెరాలను ట్యాంపర్ చేశారని పోలీసుల అనుమానం వ్యకం చేశారు. దీంతో డీవీఆర్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. వీటికి సంబంధించిన రిపోర్టులు ఇంకా వెల్లడికాలేదని తెలిపారు. మే 18 అరెస్ట్ అయిన బిభవ్ కుమార్ ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నారు.మే 13న ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లితే.. అక్కడ కేజ్రీవాల్ సహాయకుడు తనపై దారుణంగా దాడి చేశారని బయటపెట్టారు. అయితే వాటిని ఆప్.. బీజేపీ కుట్రలో భాగంగానే స్వాతి మలివాల్ బిభవ్‌పై దాడి ఆరోపణలను చేస్తోందని విమర్శలు చేసింది. -
‘దాడి సమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారు’
ఢిల్లీ: తనపై దాడి జరిగిన సమయంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ అన్నారు. ఆమె జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. దాడికి సంబంధిచి పలు విషయాలు పంచుకున్నారు.‘‘ మే 13న సీఎం ఆరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన పీఏ బిభవ్ కుమార్ నాపై దాడి చేస్తున్నప్పుడు నేను అరుస్తునే ఉన్నారు. కానీ, నన్న రక్షించడానికి ఎవరూ ముందుకు రాలేదు. దాడి జరిగిన సమయంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం ఇంట్లోనే ఉన్నారు. ఈ దాడి విషయలో నేను ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేను. నేను 9 గంటలకు సీఎం నివాసానికి వెళ్లితే డ్రాయింగ్ రూంలో నన్ను వేచి ఉండాలని ఇంటి సిబ్బంది తెలిపింది. కేజ్రీవాల్ ఇంట్లోనే కూర్చొని ఉన్నారు. సీఎం నన్ను కలవడానికి వస్తారని సిబ్బంది చెప్పింది. ఒక్కసారిగా బిభవ్ నేను ఉన్న గదిలోకి దూసుకువచ్చారు. ఏం అయింది? కేజ్రీవాల్ వస్తున్నారు. ఏం అయింది? అని ఆయన్ను అడిగాను. అంతలోనే ఆయన నాపై దాడి చేయటం మొదలు పెట్టాడు. ఏడెనిమిది సార్లు నా చెంప మీద కొట్టారు. నేను ఆయన్ను వెనక్కి నెట్టేయాలని ప్రయత్నం చేశాను. తన కాలుతో నన్ను లాగి మధ్యలో ఉన్న టెబుల్‌కు నా తలను బాదారు’’ అని స్వాతి మలివాల్ తెలిపారు.‘‘బిభవ్ కుమార్ వేరే వాళ్ల సూచన మేరకే నాపై దాడి చేశారు. దాడి కేసులో నేను ఢిల్లీ పోలీసులకు సంపూర్ణంగా సహకరిస్తా. ఈ విషయంలో నేను ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వను. నాపై దాడి జరుగుతున్న సమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారు. నేను బాధతో ఎంత అరిచినా నన్ను ఎవరూ పట్టించుకోలేదు. నాపై జరిగిన దాడిలో విషయంలో నేను గళం ఎత్తుతాను.దాని వల్ల నా కెరీర్‌కు ఇబ్బందైనా వదిలిపెట్టను. సత్యానికి, నిజమైన ఫిర్యాదులకు మద్దతుగా ఉండాలని చెప్పే నేను నా విషయంలో అంతే ధైర్యంగా ఉండి పోరాడుతాను’’ అని స్వాతి మలివాల్ అన్నారు. ఈ కేసులో అరెస్టైన బిభవ్ కుమార్ ఫోన్ ఫార్మాట్, సీఎం నివాసం వద్ద ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజీలపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ దాడికి సంబంధించి స్వాతి మలివాల్ వెనక బీజేపీ కుట్ర ఉందని ఆప్ తీవ్ర విమర్శలు చేస్తోంది. -
స్వాతి మలివాల్ కేసు: సీఎం నివాసంలో సీసీటీవీ ఫుటేజీ స్వాధీనం
ఢిల్లీ: ఆప్ రాజ్యసభ స్వాతి మలివాల్‌పై దాడి జరిగిన కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలోని సీసీటీవీ కెమెరాలకు సంబంధించి డిజిటల్ వీడియో రికార్డ్ (డీవీఆర్)లను పోలీసులు స్వాధీనం చేసకున్నారు. ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఆదివారం వెల్లడించింది. కాగా.. లోక్‌సభ ఎన్నికల ముందు పార్టీ ప్రతిష్టను దెబ్బతీయాలని పోలిసులు ప్రయత్నం చేస్తున్నారని ఆప్ ఆరోపించింది. దర్యాప్తుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు కట్టకథలు అల్లుతోందని ఆప్ ఆరోపణుల చేసింది. ఇక.. ఢిల్లీ పోలీసులు నుంచి ఎటువంటి సత్వరమైన స్పందన లేదని పేర్కొంది. ‘‘పోలీసులు శనివారమే కేజ్రీవాల్ నివాసంలోని సీసీటీవీ కెమెరాల డీవీఆర్‌లను స్వాధీనం చేసుకున్నారు. మళ్ల ఆదివారం కూడా సీఎం నివాసంలోని మిగతా చోట్ల ఉన్న సీసీటీవీ కెమెరాల డీవీఆర్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ తొలగించారని పోలీసులు చెబుతున్నారు. కానీ, అప్పటికే పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కావాలనే వాటిపై కట్టుకథలు అల్లుతున్నారు’’ అని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ అన్నారు. అదే విధంగా సీఎం నివాసంలోని సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణను పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్ ఆధీనంలో ఉంటుందని సౌరభ్ భరద్వాజ్ తెలిపారు.ఈ కేసుకు సంబంధించిన ఆయలు పలు ప్రశ్నలు సంధించారు. ‘‘మే 13న స్వాతి మలివాల్ నుంచి పోలీసులకు కాల్ వచ్చింది. అయితే కొద్దిసేటికే ఈ విషయం మీడియాకు వ్యాపించింది. సెక్షన్ 354(బీ)కి కేసు నమోదైంది. ఓ మహిళకు సంబంధించిన సున్నితమైన విషయం. కానీ, కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ బయటకు వచ్చింది. బిభవ్‌కుమార్ నిందితుడు అయితే ఆప్ వద్ద ఎఫ్ఐఆర్ కాపీ లేదు’ అని సౌరభ్ భరద్వాజ్ అన్నారు. -
స్వాతి మలివాల్ కేసులో సాక్ష్యాలు మాయం?!
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్‌పై జరిగిన దాడి కేసులో ఢిల్లీ పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు నిందితుడు బిభవ్ కుమార్ రిమాండ్ నోట్‌ను విడుదల చేశారు. ఈ కేసులో సాక్షాలు మాయమైట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. దాడి జరిగిన రోజు (మే13)న సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో సీసీటీవీ ఫుటేజీని నిందితుడు బిభవ్‌కుమార్ ట్యాంపర్ చేశారని వెల్లడించారు. ‘‘విచారణకు సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ సహకరించడం లేదు. బిభవ్ కుమార్ తన ఫోన్ పాస్ వర్డ్ చెప్పడం లేదు. ఆయన ఫోన్‌ను ముంబైలో ఫార్మాట్ చేశారు. కేజ్రీవాల్ నివాసంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న సీసీటీవీ ఫుటేజీ బ్లాంక్‌గా ఉంది. దాడి జరిగిన వీడియోను తొలగించారు. సీసీటీవీ పుటేజీకి సంబంధించిన డిజిటల్ వీడియో రికార్డర్‌ను ఇచ్చేందుకు కేజ్రీవాల్ నిరాకరిస్తున్నారు’’ అని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.‘‘ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఉన్న సీసీటీవీ కెమెరాలు బ్లాంక్‌గా ఉన్నాయి. మే 23( సోమవారం) రోజు సీసీటీవీ ఫుటేజీని స్కాన్ చేసేందుకు వీలుగా డిజిటిల్ వీడియో రికార్డర్‌ను మాకు అందజేయలేదు.ముఖ్యమంత్రి నివాసంలో ఉన్న సీసీటీవీ కెమెరాల నిర్వహణ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కిందకు వస్తుంది. ఆ విభాగానికి చెందని ఓ జూనియర్ ఇంజనీర్ ఇచ్చిన పెన్ డ్రైవ్‌ను పరిశీలించాము. కానీ అందులో ఒక వీడియో బ్లాంక్‌గా వస్తోంది. జూనియర్ ఇంజనీర్ వద్ద డీవీఆర్ యాక్సెస్ లేదు’ అని దర్యాపు చేసిన ఢిల్లీపోలీసులు రిమాండ్ నోట్లో వెల్లడించారు. ఇక.. స్వాతి మలివాల్‌పై దాడి కేసులో సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్‌కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి.. ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. -
కేజ్రీవాల్ అనుచరుడు బిభవ్ అరెస్ట్
న్యూఢిల్లీ: ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో అరవింద్ కేజ్రీవాల్ అనుచరుడు బిభవ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. సోమవారం కేజ్రీవాల్ నివాసానికి వెళ్లిన తనపై విభవ్ దాడికి పాల్పడ్డాడని స్వాతి మలివాల్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.ఢిల్లీ సీఎం నివాసం నుంచే అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నేరుగా సివిల్ లైన్ పోలీస్ స్టేషన్‌కు ఇంటరాగేషన్ కోసం తరలించారు. అంతకు ముందు సీఎం కేజ్రీవాల్ నివాసంలో సీన్ రీ కన్స్ట్రక్షన్ నిర్వహించారు పోలీసులు. అయితే.. ఈ కేసులో పూర్తిగా సహకరిస్తామని అధికారులకు తాము మెయిల్ పంపించామని, అయినా కూడా పోలీసుల నుంచి బదులేం లేదని విభవ్ లాయర్ మీడియాకు వెల్లడించారు. -
మలివాల్ వాంగ్మూలం నమోదు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలో కలిసేందుకు వెళ్లిన సందర్భంగా ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశారని ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ ఆరోపించిన ఉదంతంలో పోలీసులు ముందడుగు వేశారు. ఈ విషయంలో ఇంతవరకు స్వాతి పోలీసులకు ఫిర్యాదుచేయలేదు. అయినాసరే పోలీసులే గురువారం స్వయంగా ఆమె ఇంటికి వెళ్లిమరీ ఆమె వాంగ్మూలాన్ని రికార్డుచేశారు. సోమవారం కేజ్రీవాల్ నివాసానికి వెళ్లినప్పుడు జరిగిన ఘటన వివరాలను ఇద్దరు సభ్యుల ఢిల్లీ పోలీసు బృందానికి స్వాతి వివరించింది. నాలుగున్నర గంటలపాటు అదనపు పోలీసు కమిషనర్ పీఎస్ కుషా్వహా బృందం స్వాతి ఇంట్లో వివరాలు సేకరించింది. వాంగ్మూలం నమోదు పూర్తయిన నేపథ్యంలో బిభవ్‌పై పోలీసులు గురువారం ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. సోమవారం దాడి ఘటన జరిగిన వెంటనే స్వాతి సివిల్ లైన్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తనపై జరిగిన దాడి విషయాన్ని చెప్పి వచ్చారుగానీ ఫిర్యాదుచేయలేదు. దీంతో ఇన్నిరోజులైనా పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. దీంతో ఈ విషయాన్ని సూమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్ శుక్రవారం తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని బిభవ్ కుమార్‌కు సమన్లు జారీచేసింది. కేజ్రీవాల్ మౌనమేల?: బీజేపీ సొంత ఇంట్లో జరిగిన ఘటనపై సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారని బీజేపీ ప్రశ్నించింది. లక్నోలో పత్రికా సమావేశం సందర్భంగా కేజ్రీవాల్‌ను మీడియా ప్రశ్నించగా ఆయన సమాధానం చెప్పలేదు. దీంతో బీజేపీ విమర్శించింది. ‘‘ ఆయన మౌనం కూడా ఎంతో చెప్తోంది. జైలు నుంచి విడుదలయ్యాక సీఎంగా కంటే గూండాలా వ్యవహరిస్తున్నారు’’ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆరోపించారు. బీజేపీ రాజకీయాలు ఆపాలి: స్వాతి దాడి ఉదంతాన్ని రాజకీయం చేయడం మానుకోవాలని బీజేపీకి స్వాతి మలివాల్ హితవు పలికారు. ‘‘ ఆరోజు నా విషయంలో జరిగింది నిజంగా బాధాకరం. అందుకే పోలీసులకు వాంగ్మూలం ఇచ్చా. సరైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా. ఇందులో బీజేపీకి ఏం సంబంధం. వ్యక్తిత్వ హననం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనను రాజకీయంచేయొద్దని బీజేపీ నేతలకు ప్రత్యేకంగా విన్నవిస్తున్నా’’ అని స్వాతి ‘ఎక్స్’లో హిందీలో పోస్ట్‌చేశారు. -
NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్‌కు సుప్రీం కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: న్యూస్‌క్లిక్ పోర్టల్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ అరెస్ట్ చెల్లదని, ఆయన్ని తక్షణమే విడుదల చేయాలని సుప్రీం కోర్టు బుధవారం ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ఈ న్యూస్ పోర్టల్‌కు విదేశీ నిధులు అందుతున్నాయంటూ.. ఉగ్రవాద నిరోధక చట్టం కింద కిందటి ఏడాది అక్టోబర్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. అరెస్టుకు సరైన కారణాలు చెబుతూ రిమాండ్ కాపీని సమర్పించడంలో ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారు. దీంతో.. రిమాండ్ కాపీ తమకు అందకపోవడంతో ఈ అరెస్ట్ చెల్లదని, వెంటనే ఆయన్ని రిలీజ్ చేయాలని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా పంకజ్ బన్సాల్ కేసును కోర్టు ప్రస్తావించింది. అరెస్టుకు గల కారణాలేంటో నిందితులకు కూడా రాతపూర్వకంగా పోలీసులు తెలియజేయాల్సి ఉంటుందని పంకజ్ బన్సాల్ కేసులో సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఇప్పుడు ఈ కేసులోనూ అదే వర్తిస్తుంది అని బెంచ్ స్పష్టం చేసింది. చైనా అనుకూల ప్రచారానికి నిధులు అందుకున్నారనే ఆరోపణలు రావడంతో ఉపా చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. అక్టోబర్ 3వ తేదీన న్యూస్‌క్లిక్‌పోర్టల్‌లో పని చేసే జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు చేశారు. డిజిటల్ పరికరాలు, పలు డాక్యుమెంట్లను సీజ్ చేశారు. అదే రోజు ప్రబీర్ పుర్కాయస్థతో పాటు ఆ సంస్థ హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిని అరెస్టు చేసినట్టు ఢిల్లీ పోలీస్ అధికార ప్రతినిధి సుమన్ నల్వా వెల్లడించారు. ‘న్యూస్‌క్లిక్’ సంస్థకు చైనా నుంచి నిధులు అందుతున్నాయంటూ గత ఏడాది ఆగస్టులో ‘న్యూయార్క్ టైమ్స్’లో కథనం ప్రచురితమైంది. చైనా ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే అమెరికా మిలియనీర్ నెవిల్ రాయ్‌సింగం నుంచి గ్లోబల్ నెట్‌వర్క్‌లో భాగంగా ఉన్న న్యూస్‌క్లిక్ నిధులు పొందినట్టు ఆ కథనంలో పేర్కొంది. దీంతో చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA)లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు దిల్లీ పోలీసులు.ఈ క్రమంలోనే న్యూస్‌క్లిక్ ఆఫీస్‌తో పాటు ఆ సంస్థలో పనిచేసే జర్నలిస్టుల ఇళ్లు సహా మొత్తం 30 చోట్ల సోదాలు జరిపి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. పోలీసుల తీరుపై ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఇంకోవైపు.. ‘న్యూస్‌క్లిక్’పై దాడులను విపక్ష కూటమి ‘ఇండియా’ నేతలు తీవ్రంగా ఖండించారు. వాస్తవాలు మాట్లాడేవారి గళాన్ని అణచివేసేందుకే కేంద్రం సోదాలు చేపట్టిందని విమర్శించారు. బిహార్‌లో కులగణనలో బయటపడిన విషయాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కేంద్రం న్యూస్‌క్లిక్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందని విపక్షాలు ఆ సమయంలో మండిపడ్డాయి. -
తిహార్ జైలుకు బాంబు బెదిరింపు..
న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో దేశంలో బాంబు బెదిరింపులు కలవరపెడుతున్నాయి. పాఠశాలలు, బస్టాండ్లు, ఎయిర్‌పోర్టులు, హాస్పిటల్స్ ప్రముఖుల నివాసాలు.. ఇలా ప్రతిచోటా బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. తాజాగా ఢిల్లీలోని తీహార్ జైలుకు బాంబు బెదిరింపు మెయిల్ అందింది.దీంతో జైలు అధికారులు ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేశారు. జైలులోని ప్రముఖ రాజకీయ నాయకులతోపాటు కొందరు ఉన్నతస్థాయి ఖైదీలు ఉన్న సెల్లో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, బాంబు డిటెక్షన్ టీమ్, పోలీసులు సోదాలు జరుపుతున్నాయి. ఇప్పటి వరకు అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులను అధికారులు గుర్తించలేదు. కాగా ఇటీవల ఢిల్లీలోని పాఠశాలలు, ఆసుపత్రులు, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్(ఐజీఐఏ) విమానాశ్రయానికి కూడా ఇలాంటి హెచ్చరికలు అందిన విషయం తెలిసిందే -
షా డీప్‌ఫేక్ ప్రసంగం వీడియో సృష్టికర్త అరెస్టు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగ వీడియోను డీప్‌ఫేక్‌గా సృష్టించిన వ్యక్తిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. అమిత్ షా వీడియోను ఏఐసీసీ సోషల్ మీడియా విభాగం జాతీయ సమన్వయకర్త అరుణ్‌రెడ్డి డీప్‌ఫేక్ చేశారని పోలీసులు నిర్ధారించారు. దీని వెనక కాంగ్రెస్ ప్రముఖుల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ చేపట్టారు.సృష్టించి.. సర్క్యులేట్ చేసి..మెదక్‌లో ఏప్రిల్ 23న నిర్వహించిన సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ మళ్లీ అధికారంలోకి వస్తే మతప్రాతిపదికన అమలవుతున్న ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు. కానీ ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను అరుణ్‌రెడ్డి ఎడిట్ చేసి తాము అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఎత్తేస్తామని షా అన్నట్లుగా యాడ్ చేశారని ఢిల్లీ పోలీసులు చెప్పారు. అనంతరం ఆ వీడియోను ఏఐసీసీ, ఎన్ఎస్యూఐ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని వాట్సాప్ గ్రూపుల్లో అరుణ్‌రెడ్డి పోస్ట్ చేశారని పేర్కొన్నారు.కేంద్ర హోంశాఖ ఫిర్యాదుతో..షా డీప్‌ఫేక్ వీడియోను వీక్షించిన నెటిజన్లు బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే దీనిపై ఏఐసీసీ అధ్యక్షు డు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సహా మరికొందరు పార్టీ నేత లు స్పందించారు. బీజేపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని వారు బహిరంగ సభల్లో చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర హోంశాఖ ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) ద్వారా ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై గత నెల 28న ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నేడు మరో అరెస్టుకు అవకాశం..వీడియో సృష్టికర్త అరుణ్‌రెడ్డి కాగా దాన్ని వైరల్ చేసింది మాత్రం తెలంగాణకు చెందిన వ్యక్తేనంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్’ ఇప్పటికే ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు నివేదించింది. దీంతో ఇందుకు సంబంధించిన ఆధారాలను ఆదివారంలోగా తమకు సమర్పించాలని ‘ఎక్స్’తోపాటు ‘ఫేస్బుక్’ను పోలీసులు కోరారు. ఆదివారంలోగా ఆ డీప్‌ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో తొలిసారి పోస్ట్ చేసిన వ్యక్తిని గుర్తించి అరెస్టు చేయనున్నారు. -
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
వడపావ్ అమ్ముతున్న యువతిని అరెస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను పోలీసులు ఖండించారు. వడాపావ్ గర్ల్‌గా ఫేమస్ అయిన చంద్రిక దీక్షిత్‌ను అరెస్టు చేయలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అంతేగాక ఆమెపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని స్పష్టం చేశారు.చంద్రిక దీక్షిత్ అనే యువతి కొంతకాలంగా ఢిల్లీలోని మంగోల్‌పురి ప్రాంతంలో వడపామ్ ఫుడ్ స్టాల్ నడిపిస్తోంది. రాను రాను ఆమె ‘వడపామ్ గర్ల్’గా పేరొందింది. ఆమెకు ఇన్‌స్టాలో 30 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇటీవల ఈ యువతి ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. స్టాల్ దగ్గర యువతి విందు ఏర్పాటు చేయగా.. స్థానికులతో వివాదం జరిగినట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది. స్టాల్‌ను తొలగించాలని ఆదేశించిన మున్సిపల్ అధికారులతో ఆమె గొడవకు దిగింది. ఆ వీడియో వైరల్ అయ్యింది.అయితే, చంద్రిక ఫుడ్ స్టాల్‌ను స్థానిక మున్సిపాలిటీ అనుమతి లేకుండా నిర్వహిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం వల్ల ఆమె స్టాల్ వద్దకు జనాలు భారీగా వస్తున్నారని. దీని వల్ల స్థానికంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్న చుట్టుపక్కల వారు తమకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దీంతో పోలీస్ సిబ్బంది వెళ్లి ప్రశ్నించగా ఆమె దురుసుగా ప్రవర్తించిందని, ఈ నేపథ్యంలో ఆ ఫుడ్ స్టాల్ ను సీజ్ చేసి, ఆమెను పోలీస్ స్టేషన్ తరలించినట్లు పేర్కొన్నారు. అయితే, ఆమెను అరెస్ట్ చేయలేదని, తనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని తెలిపారు. -
అమిత్ షా ఫేక్ వీడియో: పోలీసు నోటీసులకు సీఎం రేవంత్ రిప్లై..
ఢిల్లీ: రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారనే ఆరోపణలతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. తాజాగా ఆ నోటీసులపై సీఎం రేవంత్‌రెడ్డి తరఫున న్యాయవాది సౌమ్య గుప్త వివరణ ఇచ్చారు.‘‘కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో షేర్ చేయడానికి నాకు సంబంధం లేదు. ఐఎన్సి తెలంగాణ ట్విటర్ ఖాతాకి నేను ఓనర్ కాదు. ఆ ఖాతాను నేను నిర్వహించడం లేదు. నేను కేవలం రెండు ట్విటర్ ఖాతాలను (సీఎంఓ తెలంగాణా, నా వ్యక్తిగత ఖాతా) మాత్రమే వినియోగిస్తున్నాను’’ అని న్యాయవాది సౌమ్య గుప్త ద్వారా ఢిల్లీ పోలీసులకు రేవంత్‌రెడ్డి సమాధానం పంపారు. రేవంత్ రెడ్డి సమాధానాన్ని ఢిల్లీ పోలీసులకు ఆయన తరపు న్యాయవాది సౌమ్య గుప్త అందజేసినట్లు తెలిపారు.మరోవైపు.. ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్ గీతా ఫోన్ సీజ్ చేశారు. తెలంగాణలోని సికింద్రాబాద్ శాంతినగర్‌కు చెందిన గీతకి ఢిల్లీ పోలీసులు సీఆర్పీసీ 41ఏ నోటీసు ఇచ్చారు. ఈ నెల 5వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపారు.తెలంగాణలో ఇటీవల ఓ సభలో పాల్గొని అమిత్ షా ప్రసంగిస్తూ.. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగవిరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన ఆ హక్కులను వారికే కల్పిస్తామని చెప్పారు. అమిత్ షా మాటలను కొంతమంది వక్రీకరించారు. రిజర్వేషన్లు అన్నింటినీ పూర్తిగా రద్దు చేస్తామని అమిత్ షా అన్నట్లుగా వీడియోను ఎడిట్ చేశారని బీజేపీ ఆరోపణలు చేసింది.మరోవైపు.. ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ ఓ ప్రచార సభలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఆరోపించారు. అమిత్ షా వీడియోను వక్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారని బీజేపీ ఇచ్చిన ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసు కేసు నమోదు చేసుకోని సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మరికొందరికి వివరణ ఇవ్వాలని నోటీసులు పంపారు. -
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు