న్యూఢిల్లీ: ట్విటర్ అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్‌కు ఢిల్లీ పోలీసులు ఇచ్చిన సమాధానం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. పర్‌ఫెక్ట్ రిప్లై ఇచ్చారంటూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. అసలేం జరిగిందంటే.. పోలీసు జాగిలాలు (కుక్కలు) ఉంటాయని మనకు తెలుసు, మరి పోలీసు మార్జాలాలు (పిల్లులు) కూడా ఉంటాయా? అని తన కుమారుడు లిటిల్ ఎక్స్ అడిగాడంటూ మస్క్ గురువారం ట్వీట్ చేశారు.
Hi @elonmusk, please tell Lil X that there are no police cats because they might get booked for feline-y and 'purr'petration. https://t.co/W8CMMvYi9I
— Delhi Police (@DelhiPolice) June 2, 2023
ఇదీ చదవండి: మస్క్‌కు మరో ఝలక్: కీలక ఎగ్జిక్యూటివ్ గుడ్‌బై
ఈ ట్వీట్‌పై ఢిల్లీ పోలీసు శాఖ శుక్రవారం స్పందించింది. ‘‘హాయ్ ఎలాన్ మస్‌్క! పోలీసు పిల్లులు ఉండవు. ఎందుకంటే నేరాలు ఘోరాలు చేసినందుకు వాటిని ఎప్పుడో అరెస్టు చేసేశాం. ఈ సంగతి మీ లిటిల్ ఎక్స్‌కు చెప్పండి’’అని ట్వీట్ చేసింది. భలేగా స్పందించారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Delhi Police gives ‘purr-fect’ reply to Elon Musk’s tweet on ‘police cats’ pic.twitter.com/csIQ9p4hgy
— Talli Jatt (@tallijatt) June 2, 2023
Comments
Please login to add a commentAdd a comment