
ఢిల్లీ: కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత్‌లో యూపీఐ లావాదేవీలు 210 లక్షల కోట్లకు చేరాయి. ఇందులో భాగంగా భీమ్-యూపీఐ లావాదేవీలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు ప్రకటించింది. ప్రతి రెండు వేల రూపాయల లోపు లావాదేవీలకు 0.15శాతం ఇన్సెంటివ్ అందించనుంది. దీంతో పాటు చిరు వ్యాపారుల్ని ప్రోత్సహించేందుకు రూ.1500 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ సందర్భంగా కేంద్ర కేబినెట్ నిర్ణయాలను కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. యూపీఐ లావాదేవీలు రూ. 210 లక్షల కోట్లకు చేరుకున్నాయి. రూ. 2 వేలు కంటే తక్కువ విలువ కలిగిన లావాదేవీలకు ఎలాంటి ఛార్జీ లేవు. అయితే ప్రస్తుత యూపీఐ విధానంలో కస్టమర్ బ్యాంక్, ఫిన్‌టెక్ సంస్థ, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్, యాప్ సంస్థ ద్వారా 4 అంచెల్లో లావాదేవీలు పెరుగుతున్నాయి. తద్వారా లావాదేవీల్లో చార్జీలను భరించాల్సి వస్తోంది. రూ.1,500 కోట్లు ఇన్సెంటివ్ రూపంలో చిన్న లావాదేవీలకు ఛార్జీలు విధించడంలేదు’అని తెలిపారు. దీంతో పాటు పలు కీలక నిర్ణయ తీసుకుంది. వాటిల్లో
అసోంలో బ్రౌన్‌ఫీల్డ్ అమ్మోనియా యూరియా ఫ్యాక్టరీకి ఆమోదం
రూ.10,601 కోట్లతో అమ్మోనియా కాంప్లెక్స్ ఏర్పాటు
రూ.2,790 కోట్లతో దేశంలో పాడిపరిశ్రమ అభివృద్ధికి పచ్చజెండా
గోకుల్ మిషన్‌కు రూ.3,400 కోట్లు కేటాయింపు
రూ.4,500 కోట్లతో మహారాష్ట్రలో గ్రీన్‌ఫీల్డ్ హైవేకు ఆమోదం
📡 𝐋𝐈𝐕𝐄 NOW 📡
Cabinet Briefing by Union Minister @AshwiniVaishnaw
📍National Media Centre, New Delhi
Watch live on #PIB's📺
▶️Facebook: https://t.co/ykJcYlNrjj
▶️YouTube: https://t.co/mg8QxoZ6iC https://t.co/KR5nK7NkSN— PIB India (@PIB_India) March 19, 2025