Payments
-
Central Cabinet Meeting : యూపీఐ లావాదేవీలపై కేంద్రం గుడ్ న్యూస్!
ఢిల్లీ: కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత్‌లో యూపీఐ లావాదేవీలు 210 లక్షల కోట్లకు చేరాయి. ఇందులో భాగంగా భీమ్-యూపీఐ లావాదేవీలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు ప్రకటించింది. ప్రతి రెండు వేల రూపాయల లోపు లావాదేవీలకు 0.15శాతం ఇన్సెంటివ్ అందించనుంది. దీంతో పాటు చిరు వ్యాపారుల్ని ప్రోత్సహించేందుకు రూ.1500 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.ఈ సందర్భంగా కేంద్ర కేబినెట్ నిర్ణయాలను కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. యూపీఐ లావాదేవీలు రూ. 210 లక్షల కోట్లకు చేరుకున్నాయి. రూ. 2 వేలు కంటే తక్కువ విలువ కలిగిన లావాదేవీలకు ఎలాంటి ఛార్జీ లేవు. అయితే ప్రస్తుత యూపీఐ విధానంలో కస్టమర్ బ్యాంక్, ఫిన్‌టెక్ సంస్థ, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్, యాప్ సంస్థ ద్వారా 4 అంచెల్లో లావాదేవీలు పెరుగుతున్నాయి. తద్వారా లావాదేవీల్లో చార్జీలను భరించాల్సి వస్తోంది. రూ.1,500 కోట్లు ఇన్సెంటివ్ రూపంలో చిన్న లావాదేవీలకు ఛార్జీలు విధించడంలేదు’అని తెలిపారు. దీంతో పాటు పలు కీలక నిర్ణయ తీసుకుంది. వాటిల్లో అసోంలో బ్రౌన్‌ఫీల్డ్ అమ్మోనియా యూరియా ఫ్యాక్టరీకి ఆమోదంరూ.10,601 కోట్లతో అమ్మోనియా కాంప్లెక్స్ ఏర్పాటురూ.2,790 కోట్లతో దేశంలో పాడిపరిశ్రమ అభివృద్ధికి పచ్చజెండాగోకుల్ మిషన్‌కు రూ.3,400 కోట్లు కేటాయింపురూ.4,500 కోట్లతో మహారాష్ట్రలో గ్రీన్‌ఫీల్డ్ హైవేకు ఆమోదం📡 𝐋𝐈𝐕𝐄 NOW 📡Cabinet Briefing by Union Minister @AshwiniVaishnaw📍National Media Centre, New DelhiWatch live on #PIB's📺▶️Facebook: https://t.co/ykJcYlNrjj▶️YouTube: https://t.co/mg8QxoZ6iC https://t.co/KR5nK7NkSN— PIB India (@PIB_India) March 19, 2025 -
డోజ్‌కు రీడ్ ఓన్లీ యాక్సెస్
వాషింగ్టన్: ప్రభుత్వ చెల్లింపుల వ్యవస్థలో ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్)కు ‘రీడ్ ఓన్లీ యాక్సెస్’మాత్రమే ఉందని అమెరికా ట్రెజరీ శాఖ తెలిపింది. ఫెడరల్ ప్రభుత్వ చెల్లింపు వ్యవస్థలో డోజ్ ప్రమేయం భద్రతకు ముప్పన్న కాంగ్రెస్ సభ్యుల ఆందోళనల నేపథ్యంలో మంగళవారం వారికి ఈ మేరకు లేఖ రాసింది. డోజ్‌కు అనుమతివ్వడం వల్ల సామాజిక భద్రత, మెడికేర్ వంటి చెల్లింపుల్లో ఆలస్యం, దారి మళ్లింపుల వంటివేవీ జరగవని పేర్కొంది. సున్నితమైన చెల్లింపు వ్యవస్థలకు డోజ్‌ను అనుమతిండాచన్ని నిరసిస్తూ వందలాది మంది మంగళవారం ట్రెజరీ భవనం ముందు ఆందోళనకు దిగారు. ‘మస్‌్కను బహిష్కరించాలి’, ‘ట్రంప్ డౌన్ డౌన్’, ‘డూ యువర్ జాబ్ కాంగ్రెస్’అంటూ నినాదాలు చేశారు. డజను మందికి పైగా డెమొక్రటిక్ చట్టసభ సభ్యులు వారికి సంఘీభావంగా మాట్లాడారు. -
1,673 కోట్ల యూపీఐ లావాదేవీలు
న్యూఢిల్లీ: ఇన్స్టంట్ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీల సంఖ్య డిసెంబర్లో 1,673 కోట్లు నమోదయ్యాయి. నవంబర్‌తో పోలిస్తే ఇవి 8 శాతం పెరిగాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తెలిపింది. నవంబర్‌లో యూపీఐ లావాదేవీల సంఖ్య 1,548 కోట్లుగా ఉంది. ఇక లావాదేవీల విలువ గత నెలలో రూ.23.25 లక్షల కోట్లకు చేరింది. నవంబర్‌లో ఇది రూ.21.55 లక్షల కోట్లు నమోదైంది. లావాదేవీల సంఖ్య డిసెంబర్లో సగటున రోజుకు 53.96 కోట్లు, నవంబర్‌లో 51.6 కోట్లుగా ఉంది. లావాదేవీల విలువ డిసెంబర్ నెలలో సగటున రోజుకు రూ.74,990 కోట్లు, నవంబర్‌లో రూ.71,840 కోట్లుగా ఉంది. ఇదీ చదవండి: భారత్ తయారీ రంగం డీలాదక్షిణాఫ్రికాలో వరుణ్ బెవరేజెస్ పెట్టుబడులున్యూఢిల్లీ: పానీయాల దిగ్గజం పెప్సీకో(Pepsico)కు ప్రధాన విభాగం వరుణ్ బెవరేజెస్ విదేశాల్లో పెట్టుబడులకు తెరతీసింది. దక్షిణాఫ్రికాలోని అనుబంధ సంస్థ బెవ్కోలో రూ.412 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. అక్కడ పెప్సీకో నుంచి లైసెన్స్ పొందిన ప్రొడక్టుల తయారీ, పంపిణీ చేపట్టే బెవ్కో సొంత బ్రాండ్ల నాన్ఆల్కహాలిక్ పానీయాలను సైతం విక్రయిస్తోంది. తాజా పెట్టుబడుల్లో భాగంగా బెవ్కో నుంచి 19.84 లక్షల సాధారణ షేర్లను వరుణ్ బెవరేజెస్ అందుకుంది. తద్వారా బెవ్కో మూలధనంలో 2.42 శాతం వాటాను పొందింది. దీంతో బెవ్కో ప్రస్తుత రుణ చెల్లింపులతోపాటు, బ్యాలన్స్‌షీట్ పటిష్టతకు వరుణ్ బెవరేజెస్ సహకరించింది. -
టెక్ దిగ్గజాలపై ఆ్రస్టేలియా కొరడా
కాన్బెర్రా: టెక్ దిగ్గజాలపై కొరడా ఝళిపించేందుకు ఆ్రస్టేలియా సిద్ధమైంది. వార్తలు ప్రచురించినందుకు స్థానిక మీడియాకు చెల్లింపులు చేసేందుకు ఉద్దేశించిన కఠిన చట్టం త్వరలో అమలవనుందని ప్రభుత్వం గురువారం తెలిపింది. 2025 జనవరి నుంచి ఇది అమలవుతుందని, ఫిబ్రవరిలో పార్లమెంట్ ఆమోదం తెలుపుతుందని పేర్కొంది. మెటా, గూగుల్ వంటి బడా కంపెనీలు తమ వేదికలపై ప్రచురించే వార్తలకుగాను ఫీజు చెల్లించాలంటూ 2021లో ఆ్రస్టేలియా ప్రభుత్వం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక చట్టం తీసుకువచ్చింది. తాజా నిర్ణయం ఈ చట్టానికి కొనసాగింపేనని చెబుతున్నారు. అయితే, ఆస్ట్రేలియా వార్తా సంస్థలతో ఉన్న చెల్లింపు ఒప్పందాలను పునరుద్ధరించబోమని ఇటీవల ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్‌ల యాజమాన్య సంస్థ మెటా చేసిన ప్రకటన ఆ్రస్టేలియా పార్లమెంట్‌తో ప్రతిష్టంభనకు కారణమైంది. గురువారం ఆ్రస్టేలియా ప్రభుత్వం ‘న్యూస్ బార్గెనింగ్ ఇన్సెంటివ్’పేరుతో ప్రకటించిన నూతన నిబంధనల ప్రకారం వార్షికాదాయం రూ.1,350 కోట్ల కలిగిన టెక్ కంపెనీలు మీడియా సంస్థలతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే భారీగా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఒక పరిశ్రమకు సబ్సిడీ ఇచ్చేందుకు మరో పరిశ్రమపై భారం మోపుతోందని మెటా దీనిపై వ్యాఖ్యానించింది. ‘డిజిటల్ వేదికలు ఆ్రస్టేలియా నుంచి భారీగా ఆర్థిక లబ్ధి పొందుతున్నాయి. ఇదే సమయంలో ఆస్ట్రేలియాలో నాణ్యమైన జర్నలిజం సేవలను పొందుతున్నందుకు తోడ్పాటు నివ్వాల్సిన సామాజిక, ఆర్థిక బాధ్యత వాటిపై ఉంది’అని ప్రభుత్వం అంటోంది. డిజిటల్ వేదికలు పెరిగిపోవడంతో సంప్రదాయ మీడియా సంస్థలు నష్టపోతున్నాయని, ఈ నేపథ్యంలోనే పబ్లిషర్లు, టెక్ కంపెనీల మధ్య సమతూకం పాటించేందుకు నిబంధనలు తెచి్చనట్లు అప్పట్లో ప్రభుత్వం తెలిపింది. ఆ మేరకు మెటా తదితర కంపెనీలు ఆస్ట్రేలియా మీడియా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆ ఒప్పందాల గడువు పూర్తి కావొచ్చింది. ఫేస్బుక్ కంటెంట్‌లో వార్తలు, రాజకీయ సంబంధ అంశాల వాటా 3 శాతం కంటే తక్కువగా ఉంటుందని మెటా అంటోంది. అందుకే, తిరిగి ఒప్పందాలను కుదుర్చుకోబోమని, బదులుగా వార్తల ట్యాబ్‌లను తొలగిస్తామని చెబుతోంది. ఈ చర్యతో ఆ్రస్టేలియా మీడియా సంస్థలు సుమారు రూ.1,700 కోట్ల మేర నష్టపోయే అవకాశముంది. దీనిపై ఆ్రస్టేలియా ప్రధాని ఆల్బనీస్ తీవ్రంగా స్పందించారు. ఆ్రస్టేలియా వినియోగదారుల పట్ల మెటా ప్రాథమిక బాధ్యతలను సైతం విస్మరిస్తోందంటూ మండిపడ్డారు. ఈ నిబంధనలన్నీ కేవలం ఆ్రస్టేలియా జర్నలిజానికి సాయం పడేందుకే తప్ప తాము ఆదా యం పెంచుకునేందుకు కాదని పేర్కొన్నారు. -
క్విక్ కామర్స్ ఈఎంఐ రూట్!
చెంగు చెంగున మార్కెట్లో దూసుకెళ్తున్న క్విక్ కామర్స్ కంపెనీలు... కస్టమర్లను తమ వైపు తిప్పుకునేందుకు వినూత్న మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తదితర ఈ–కామర్స్ సంస్థల రూట్లోనే కొంగొత్త పేమెంట్ పద్ధతులను ప్రవేశపెడుతున్నాయి. తద్వారా మార్కెట్‌ను మరింత ‘క్విక్’గా కొల్లగొట్టాలనేది స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో, జొమాటో బ్లింకిట్ తదితర దిగ్గజాల ప్లాన్!! పదే పది నిమిషాల్లో పక్కా డెలివరీ అంటూ దుమ్మురేపుతున్న క్విక్ కామ్ సంస్థలు.. ఈ–కామర్స్ దిగ్గజాలకు పక్కలో బల్లెంలా మారుతున్నాయి. ఇప్పుడు పేమెంట్ల విషయంలోనూ ‘నీవు నేర్పిన విద్యే..’ అన్న చందంగా తయారైంది వాటి వ్యూహం. రూ. 2,999 పైబడిన కొనుగోళ్లకు బ్లింకిట్ గత నెలలో నెలవారీ వాయిదా (ఈఎంఐ) ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. వాస్తవానికి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లలో తొలిసారి 2016లోనే ఫ్లిప్‌కార్ట్ ఈ ఆప్షన్‌ను ప్రవేశపెట్టగా... అమెజాన్ కూడా 2018లో దీన్ని అనుసరించింది. పలు డెబిట్ కార్డులతో పాటు, ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై కూడా ప్రస్తుతం ఈ ఫీచర్‌ను అమలు చేస్తున్నాయి. ‘ఈఎంఐ అవకాశం కలి్పంచడం వల్ల కస్టమర్ల కొనుగోలు శక్తి మరింత పెరుగుతుంది. ఆర్థికంగా కూడా వారికి వెసులుబాటు లభిస్తుంది’ అని బ్లింకిట్ సీఈఓ అల్బిందర్ ధిండ్సా పేర్కొన్నారు.ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి! మరోపక్క, దాదాపు దిగ్గజ క్విక్ కామర్స్ కంపెనీలన్నీ ఈఎంఐ ఆప్షన్‌తో పాటు తర్వాత చెల్లించే (బై నౌ, పే లేటర్) పేమెంట్ విధానాన్ని కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఇందుకోసం సింపుల్, పేయూకి చెందిన లేజీ పే వంటి కంపెనీలతో జట్టుకట్టాయి. ఫ్లిప్‌కార్ట్ 2017లో ఈ పే లేటర్ ఫీచర్ ద్వారా యూజర్లకు రూ. లక్ష వరకు ఇన్స్టంట్ రుణ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. నయా పైసా చెల్లించకుండా ఉత్పత్తులను కొనుగోలు చేసి, తర్వాత నెలలో పూర్తిగా చెల్లించడం, లేదంటే ఈఎంఐగా మార్చుకునే అవకాశాన్ని ఇది కలి్పస్తోంది. ఇక 2020లో ప్రవేశపెట్టిన ‘అమెజాన్ పే లేటర్’ కూడా బాగానే ‘‘క్లిక్’ అయింది. కాగా, ఈ పేమెంట్ ఆప్షన్లతో క్యూ–కామ్ సంస్థల సగటు ఆర్డర్ విలువ పెరగడంతో పాటు ఎక్కువ రేటు గల ఉత్పత్తి విభాగాల్లోకి కూడా విస్తరించేందుకు దోహదం చేస్తుందని పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కంపెనీలు గనుక కస్టమర్ల విశ్వాసాన్ని పొందగలిగితే, ఈకామర్స్ దిగ్గజాలకు సవాలుగా నిలవడం ఖాయమని కూడా వారు విశ్లేషిస్తున్నారు.40 బిలియన్ డాలర్లుభారత్ క్విక్ కామార్స్ మార్కెట్‌ను ప్రధానంగా మూడు కంపెనీలు (జొమాటో బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో) శాసిస్తున్నాయి. ప్రస్తుతం 6.1 బిలియన్ డాలర్లుగా ఉన్న మార్కెట్ పరిమాణం 2030 నాటికి 40 బిలియన్ డాలర్లకు ఎగబాకుతుందనేది డాటమ్ ఇంటెలిజెన్స్ నివేదిక అంచనా.75% స్మార్ట్ ఫోన్ కొనుగోళ్లు వాయిదాల్లోనే... ‘పే లేటర్, ఈఎంఐ ఫార్మాట్ల వల్ల క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు.. సంప్రదాయ ఈకామర్స్ దిగ్గజాలతో మరింతగా పోటీపడేందుకు వీలవుతుంది. ముఖ్యంగా పే లేటర్ సదుపాయం వల్ల యూజర్ల మెరుగైన షాపింగ్ అనుభూతికి తోడ్పడుతుంది. ఇక స్మార్ట్ ఫోన్లు, ఎల్రక్టానిక్ ఉత్పత్తులు, గృహోపకారణాల వంటి అధిక ధర కేటగిరీ కొనుగోళ్లలో ఈఎంఐ కీలక పాత్ర పోషిస్తుంది. ఈకామర్స్ మాదిరిగానే పోటాపోటీ ధరలతో పాటు అనువైన పేమెంట్ ఆప్షన్లను కూడా ఆఫర్ చేయడం ద్వారా క్యూకామ్ సంస్థలు కస్టమర్లను ఆకట్టుకోగలుగుతాయి’ అని డేటమ్ ఇంటెలిజెన్స్ విశ్లేషకుడు సతీష్ మీనా అభిప్రాయపడ్డారు. ఇప్పుడు దేశంలో 75 శాతం పైగా స్మార్ట్ ఫోన్లు ఈఎంఐ రూట్లోనే అమ్ముడవుతుండటం విశేషం! అయితే, ప్రస్తుతం క్విక్ కామ్ ప్లాట్‌ఫామ్స్‌లో జరుగుతున్న కొనుగోళ్లలో 85 శాతం మేర కిరాణా, నిత్యావసర ఉత్పత్తులేనని, ఈ పేమెంట్ ఆప్షన్లు తక్షణం వాటికి పెద్దగా ఉపయోగకరం కాదనేది మరో టాప్ కన్సల్టెన్సీ సంస్థ నిపుణుడి అభిప్రాయం. ‘రానురాను ప్రీమియం విభాగాల్లోకి విస్తరించే కొద్దీ పే లేటర్, ఈఎంఐ వంటి ఆప్షన్లు క్విక్ కామ్ డిమాండ్‌ను పెంచడానికి తోడ్పడతాయి. ఇది ఈకామర్స్ సంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ సవాలును ఎదుర్కోవాలంటే అవి మరిన్ని వినూత్న విధానాలను అనుసరించక తప్పదు’ అని వ్యాఖ్యానించారు.ఈఎంఐ అవకాశం కల్పించడం వల్ల కస్టమర్ల కొనుగోలు శక్తి మరింత పెరుగుతుంది. ఆర్థికంగా కూడా వారికి వెసులుబాటు లభిస్తుంది. – అల్బిందర్ ధిండ్సా, బ్లింకిట్ సీఈఓ -
చార్జీలు విధిస్తే .. వాడటం ఆపేస్తాం..
న్యూఢిల్లీ: చెల్లింపు లావాదేవీలకు యూపీఐని గణనీయంగా వాడుతున్నప్పటికీ చార్జీలు గానీ విధిస్తే మాత్రం దాన్ని వినియోగించడం ఆపేయాలని చాలా మంది భావిస్తున్నారు. లోకల్‌సర్కిల్స్ సర్వేలో పాల్గొన్న వారిలో 75 శాతం మంది యూజర్లు తమ అభిప్రాయం వెల్లడించారు. కేవలం 22% మందే ఫీజును చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. సర్వే ప్రకారం 38% మంది యూజర్లు తమ చెల్లింపుల్లో 50% లావాదేవీల కోసం డెబిట్, క్రెడిట్ లేదా ఇతరత్రా డిజిటల్ విధానాలు కాకుండా యూపీఐనే ఉపయోగిస్తున్నారు. జూలై 15 నుంచి సెప్టెంబర్ 20 మధ్య నిర్వహించిన సర్వేలో వేసిన ప్రశ్నలకు 308 జిల్లాల నుంచి 42,000 సమాధానాలు వచ్చాయి. యూపీఐ లావాదేవీలపై చార్జీల అంశంపై 15,598 సమాధానాలు వచ్చాయి. మర్చంట్ డిస్కౌంట్ రేట్లను వి« దించే ముందు ఈ అంశాలన్నింటినీ కేంద్ర ఆరి్థక శాఖ, ఆర్బీఐ పరిగణనలోకి తీసుకునేలా, ఈ సర్వే వివరాలను వాటి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు లోకల్‌సర్కిల్స్ తెలిపింది. ఎన్పీసీఐ లెక్కల ప్రకారం 2023–24లో యూపీఐ లావాదేవీలు 57% పెరిగాయి. తొలిసారిగా 100 బిలియన్లు దాటి 131 బిలియన్లకు చేరాయి. విలువపరంగా చూస్తే 44% ఎగిసి రూ. 199.89 లక్షల కోట్లకు చేరాయి. -
కస్టమర్లకు భారీ పరిహారం చెల్లిస్తున్న యాపిల్..
-
క్రెడిట్ కార్డు ద్వారా రెంట్ చెల్లిస్తున్నారా.. కొత్త చార్జీలు తెలుసుకోండి!
భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన 'హెచ్డీఎఫ్సీ' అద్దె చెల్లింపుల కోసం కొత్త ఫీజును ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్లు క్రెడో, చెక్, మొబిక్విక్, ఫ్రీఛార్జ్ వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా చెల్లించే అద్దె మీద 1 శాతం ఫీజు వసూలు చేయనుంది. దీనిని గరిష్టంగా రూ. 3వేలుకు పరిమితం చేశారు. ఈ విషయాన్ని బ్యాంక్ జూన్ 26న కస్టమర్లకు ఈమెయిల్ ద్వారా తెలియజేసింది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కంటే ముందు.. క్రెడిట్ కార్లు చెల్లింపులకు సంబంధించిన విధివిధానాలను ఇతర క్రెడిట్ కార్డు జారీదారులు, బ్యాంకులు కూడా ప్రకటించాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ రెండూ తమ క్రెడిట్ కార్డ్ ఆప్షన్లలో అద్దె చెల్లింపుల కోసం రివార్డ్ పాయింట్లను అందించడం ఆపివేసాయి.2024 ఫిబ్రవరి 1 నుంచి అమెజాన్ పే ఐసీఐసీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వంటి నిర్దిష్ట కార్డ్‌లు మినహా.. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చేసే అద్దె చెల్లింపులు, ఈ వాలెట్ లోడింగ్ లావాదేవీలకు ఎలాంటి రివార్డ్ పాయింట్లు లభించడం లేదు. కాగా ఇప్పుడు హెచ్డీఎఫ్సీ చెల్లింపులపైన అదనపు ఫీజు చెల్లింపులను ప్రారంభించింది. ఈ మార్పులు 2024 ఆగష్టు 1నుంచి అమలులోకి రానున్నాయి. -
పెరూలో యూపీఐ చెల్లింపులు..
న్యూఢిల్లీ: ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ తాజాగా సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ పెరూ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇందులో భా గంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) వంటి రియల్ టైమ్ చెల్లింపుల వ్యవస్థను పెరూలో అందుబాటులోకి తేనున్నాయి.ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే దక్షిణ అమెరికాలో దీన్ని ప్రవేశపెట్టిన తొలి దేశంగా పెరూ స్థానం సంపాదించనుంది. రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్‌ను ఆ దేశంలో స్థాపించడంతోపాటు వ్యక్తు లు, వ్యాపార సంస్థల మధ్య తక్షణ చెల్లింపులను అందించేందుకు సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ పెరూకు ఈ భాగస్వామ్యం దోహదం చేస్తుంది.ఇవి చదవండి: బ్యాంకు ఖాతాలో డబ్బు లేకపోయినా యూపీఐ చెల్లింపులు..! -
దండిగా ధాన్యం.. నిండుగా నిధులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం రైతులకు బాసటగా నిలుస్తోంది. ధాన్యం కొనుగోలులో సంపూర్ణ మద్దతు ధర అందించడంతో పాటు.. దేశంలోనే తొలిసారిగా రైతులకు గన్నీ, హమాలీ, రవాణా (జీఎల్టి) చార్జీల కింద టన్నుకు రూ.2523 అదనంగా చెల్లిస్తూ ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా ఖరీఫ్ 2023–24లో 4.97లక్షల మంది రైతుల నుంచి రూ.6,538 కోట్ల విలువైన 29.91లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. వీటిల్లో 4.36లక్షల మంది రైతులకు రూ.5700 కోట్ల మద్దతు ధర చెల్లించింది. మిగిలిన 61 వేల మంది రైతులకు రూ.838 కోట్లు అందించేందుకు వీలుగా నిధులను సమీకరించింది. ఆర్బీకేల్లో షెడ్యూల్ చేసిన వివరాల ప్రకారం వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో మద్దతు ధర మొత్తాన్ని జమ చేయనుంది. తద్వారా ఖరీఫ్ కొనుగోళ్లలో సంపూర్ణ చెల్లింపులను చేయనుంది. ఇక రబీ సేకరణకు సమాయత్తం ఖరీఫ్ ధాన్యం సేకరణ పూర్తవడంతో ఏప్రిల్ మొదటి వారం నుంచి రబీ కొనుగోళ్లకు పౌరసరఫరాల సంస్థ సమాయత్తం అవుతోంది. రబీ సీజన్లో 25లక్షల టన్నులకుపైగా ధాన్యం వస్తుందని అంచనా వేస్తోంది. ఈ మేరకు జిల్లాల వారీగా గోనె సంచులు, హమాలీలు, రవాణా సదుపాయాలను కల్పించేలా క్షేత్ర స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. గోదావరి జిల్లాల్లో రబీలో సాగు చేసే జయరకం (దుడ్డు బియ్యం)ధాన్యాన్ని సైతం మద్దతు ధరకు సేకరించనుంది. గతేడాది జయ రకం ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించగా కేవలం 90వేల టన్నులు మాత్రమే వచ్చి ంది. ఈసారి 3లక్షల టన్నులు సేకరించేలా ప్రణాళిక రూపొందించింది. అయితే జయరకం ధాన్యాన్ని ప్రభుత్వం స్వయంగా మద్దతు ధరకు కొనుగోలు చేస్తుండటం రైతులకు లాభసాటిగా మారింది. ఈ రకం ధాన్యం వినియోగం స్థానికంగా చాలా తక్కువ. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో దుడ్డు బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి అమ్ముకునే పరిస్థితి లేకపోవడంతో గతంలో ప్రైవేటు వ్యాపారులు ఇచ్చి న రేటు తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వ జోక్యంతో ప్రైవేటు వ్యాపారులు మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి దుడ్డు బియ్యాన్ని కొనుగోలు చేస్తుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 37.68 లక్షల మంది రైతులకు మద్దతు టీడీపీ ఐదేళ్లలో కేవలం 17.94లక్షల మంది రైతుల నుంచి రూ.40,236.91 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించింది. కానీ, సీఎం జగన్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఏకంగా 37.68 లక్షల మంది రైతుల నుంచి రూ.65,142.29 కోట్ల విలువైన 3.40 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం విశేషం. అంటే టీడీపీ హయాంలో కంటే 20లక్షల మంది రైతులకు అదనంగా సీఎం జగన్ ప్రభుత్వం మద్దతు ధర అందించింది. మొబైల్ బృందాలతో పరిశీలన.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధాన్యం కొనుగోళ్లలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. దళారీ, మిల్లర్ల వ్యవస్థకు చెక్‌పెడుతూ ఆర్బీకేల కేంద్రంగా ఈ–క్రాప్ డేటా ఆధారంగా ధాన్యం సేకరణ చేసి వాస్తవ రైతుకు సంపూర్ణ మద్దతు ధరను అందిచే పటిష్ట వ్యవస్థను తీసుకొచ్చారు. క్షేత్ర స్థాయికి ఆర్బీకే అసిస్టెంట్ వెళ్లి నాణ్యతను పరిశీలించడం, ఆన్లైన్లో ధాన్యం రైతు వివరాలు నమోదు, ట్రక్ షీట్ జనరేట్, చివరికి ధాన్యం తరలించాల్సిన మిల్లును కూడా ఆటోమేటిగ్గా ఎంపిక చేసే సాంకేతిక విధానాన్ని తీసుకొచ్చారు. లోడు పక్కదారి పట్టకుండా రవాణా వాహనాలకు జీపీఎస్‌ను సైతం అమర్చారు. మిల్లుల్లో ధాన్యం నాణ్యత సమస్యలను రైతులతో సంబంధం లేకుండా పరిష్కరించేందుకు కస్టోడియన్ అధికారులను నియమించారు. ప్రస్తుతం ఎన్నికల సమయం నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే మండలానికి ఒక ప్రత్యేక మొబైల్ బృందాన్ని ఏర్పాటు చేసి ధాన్యం రైతుల సమస్యలను పరిష్కరించేలా దృష్టి సారించారు. ప్రభుత్వ కాల్‌సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదులతో పాటు స్థానికంగా రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించనున్నారు. దిగుబడిలో 60 శాతం కొనుగోలు ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా బీపీటీ, నెల్లూరు, స్వర్ణ రకాలను పండిస్తున్నారు. వీటికి జాతీయ, అంతర్జాతీయంగా మంచి మార్కెట్ ఉంటుంది. ఇవి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు కాకుండా బయటకు వెళ్లిపోతాయి. మిగిలిన రకాల ధాన్యా న్ని ఆర్బీకేల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. ఇలా.. ఏపీలో ధాన్యం దిగుబడుల్లో రైతుల అవసరాలకు నిల్వ చేసిన తర్వాత 60 శాతం పైగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తోంది. బాబు హయాంలో బకాయిలే! గతంలో రైతులకు మద్దతు ధర పేరుతో దళారులకు, మిల్లర్లకు దోచిపెట్టేవారు. పేరుకే ప్రభుత్వం ధాన్యం సేకరణ చేసేది. కొనేదంతా మిల్లర్లు.. దళారులే. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని 75 కేజీల బస్తాకు మద్దతు ధర కంటే రూ.200 వరకు తగ్గించి ఇచ్చేవారు. ఇలా ఎకరానికి తక్కువలో తక్కువ 30 నుంచి 33 బస్తాల దిగుబడి వేసుకున్నా.. రూ.6వేలకు పైగా ప్రత్యక్షంగా రైతులు నష్టపోయేవారు. పైగా అప్పటి ఎన్నికల ముందు రైతులకు చెల్లించాల్సిన రూ.4వేల కోట్ల ధాన్యం డబ్బులను చంద్రబాబు ప్రచార పథకాలకు మళ్లించడంతో సమయానికి డబ్బులు అందక రైతులు అల్లాడిపోయారు. చివరికి చంద్రబాబు దిగిపోతూ ఇంకా రూ.960 కోట్లు బకాయిలు పెట్టారు. వీటిని కూడా సీఎం జగన్ ప్రభుత్వమే చెల్లించింది. -
విదేశీ చెల్లింపులకు డిజిటల్ కరెన్సీ!: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: విదేశీ చెల్లింపులకు వీలుగా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)ని మెరుగుపరచడంలో ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ పూర్థిస్థాయి దృష్టి సారించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆర్బీఐ పైలట్ ప్రాజెక్స్గా దీనిని ప్రారంభించిందని, అమలుకుగాను తొమ్మిది బ్యాంకులు - స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీలను ఎంచుకుందని అన్నారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ పేపర్ కరెన్సీ, నాణేల మాదిరిగానే అదే విలువలతో జారీ అవుతుందన్నారు. బ్యాంకుల వంటి ఫైనాన్షియల్ మీడియేటర్ల ద్వారా పంపిణీ జరుగుతుందని అన్నారు. భాగస్వామ్య బ్యాంకులు అందించే డిజిటల్ వాలెట్ ద్వారా వినియోగదారులు ఈ–రూపాయితో లావాదేవీలు చేయగలుగుతారని కూడా వెల్లడించారు. ‘‘విదేశీ చెల్లింపులలో డిజిటల్ కరెన్సీ సహాయపడుతుందని మేము గట్టిగా విశ్వసిస్తున్నాము. ఇది మరింత పారదర్శకత, లభ్యత సౌలభ్యతలను సమకూర్చుతుంది’’ అని హిందూ కళాశాల 125 సంవత్సరాలను పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో సీతారామన్ అన్నారు. ఇది తక్కువ ఖర్చుతో చెల్లింపులను వేగవంతం చేయడంలో సహాయపడుతుందని, దేశీయంగా, అంతర్జాతీయంగా జరిగే చెల్లింపుల విషయాల్లో వ్యయాలను తగ్గిస్తుందని వివరించారు. తయారీ, వ్యవసాయంపై దృష్టి.. భారతదేశాన్ని ‘వికసిత భారత్’గా మార్చడానికి ప్రాధాన్యతా రంగాల గురించి అడిగిన ప్రశ్నకు ఆర్థికమంత్రి సమాధానం చెబుతూ, తయారీ వ్యవసాయంపై దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. ‘‘వ్యవసాయం దాని ప్రాధాన్యతను పటిష్టం చేసుకుంది. కొన్ని విధానాలు, ఆధునికీకరణల ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి తగిన కృషి చేస్తున్నాము’’ అని మంత్రి అన్నారు. తయారీలో, పునరుత్పాదక శక్తి, సెమీ కండక్టర్, మెషిన్ లెర్నింగ్, ఎర్త్ సైన్సెస్, స్పేస్‌తో సహా 13 పురోగతి బాటలో ఉన్న రంగాలను ప్రభుత్వం గుర్తించిందని ఆమె చెప్పారు. సామాజిక పథకాల అమల్లో పురోగతి పేదలకు కనీస అవసరాలు అందించడానికి రూపొందించిన సామాజిక రంగ పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం సంతృప్తికరమైన స్థాయికి చేరుకుంటోందని ఆర్థికమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. భారతదేశం ఆర్థికంగా ’ఆత్మనిర్భర్’ (స్వయం సమృద్ధి) సాధించే సమయం ఆసన్నమైందని అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు సాగాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు. ఈ శక్తి సామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని వివరించారు. ఎటువంటి పురోగతి లేకుండా స్వాతంత్య్ర భారత్ 60 సంవత్సరాలు గడిపిందన్న ఆమె, ‘‘మేము వికసిత భారత్‌కు భౌతిక పునాదిని వేశాము. అందరికీ ప్రాథమిక అవసరాలను అందించడం ద్వారా ప్రజలను శక్తివంతం చేశాము’’ అన్ని అన్నారు. డీబీటీతో పారదర్శకత బోగస్, అవాంఛనీయ లబ్ధిదారులను తొలగించడం ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా ప్రభుత్వం రూ. 2.5 లక్షల కోట్లను ఆదా చేయగలిగిందని ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. డీబీటీ ద్వారా ప్రభుత్వ నిధుల బదిలీలో పారదర్శకతను మెరుగుపరచడమే కాకుండా సాంకేతికతను ఉపయోగించడం ద్వారా సామర్థ్యాన్ని మెరుగుపరిచిందని ఆమె అన్నారు. ప్రజలకు సామాజిక కార్యక్రమాలను అందించడంలో ప్రభుత్వానికి ఎటువంటి పక్షపాతం ఉండబోదని స్పష్టం చేశారు. ప్రధాని భారతదేశాన్ని యువత, మహిళలు, రైతులు పేదలు అనే నాలుగు గ్రూపులుగా వర్గీకరించడారని, మతాలు, కులాలతో సంబంధం లేకుండా ఈ సమూహాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. నూనె గింజలు, పప్పుధాన్యాలు మినహా వ్యవసాయానికి సంబంధించినంతవరకు భారతదేశం దాదాపు స్వయం సమృద్ధి సాధించిందని ఆమె అన్నారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాలు సమస్యలను ఎదుర్కొంటున్నందున ఆహారాన్ని వృథా చేయవద్దని ఆమె ఈ సందర్భంగా సూచించారు. రామ్ లల్లా ప్రాణ్ ప్రతిష్టతో నాగరికత విలువల పునరుద్ధరణ జనవరి 22న రామ్ లల్లా ప్రాణ్ ప్రతిష్ట వేడుకను ’నాగరికత గుర్తు’గా నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. నాగరికత విలువల పునరుద్ధరణకు సాక్ష్యంగా నిలిచిన ప్రస్తుత తరానికి ఈ వేడుకలు అదృష్ట తరుణమని ఆమె అన్నారు. నైపుణ్యాల అభివృద్ధితో పాటు నాగరికత– జాతీయత రెండింటికీ సంబంధించి విలువల పటిష్టతపై దృష్టి పెట్టాలని ఆమె విద్యార్థులను కోరారు. దేశం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటోందని విద్యార్థులకు గుర్తు చేస్తూ, ఓటు వేయడం పౌరుల హక్కు మాత్రమే కాదని, అది వారి కర్తవ్యం కూడా అని అన్నారు. మొదటి సారి ఓటరుగా ఉన్న వారిపై ఎక్కువ బాధ్యత ఉందని ఆమె అన్నారు. సోషల్ మీడియా సహా వివిధ మాధ్యమాల ద్వారా వ్యాప్తి చెందుతున్న ప్రతికూలతలను చూసి విద్యార్థులు తప్పుదారి పట్టవద్దని ఆమె కోరారు. ఎకానమీపై తప్పుడు ప్రచారం భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అని ఆర్థికమంత్రి పేర్కొంటూ, కంపెనీలు, స్టాక్ మార్కెట్ చాలా బాగా పని చేస్తున్నాయని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ బాగా లేదని, తీవ్ర ఒడిదుడుకులతో పయనిస్తోందన్న కథనాలు అవాస్తమమని అన్నారు. అలాంటి ప్రచారం చేస్తున్న వారు ఏ ప్రాతిపదికన ఈ విషయాన్ని చెబుతున్నారో చెప్పాలని తాను కోరుకుంటున్నట్లు వివరించారు. అయితే సమాధానం చెప్పడానికి వారు అందుబాటులో ఉండరని విమర్శించారు. తోచింది చెప్పిడం కొందరి పనిగా మారిందని అన్నారు. -
గూగుల్‌పే యూజర్లకు శుభవార్త.. అదేంటంటే?
'గూగుల్‌పే' (Google Pay) తాజాగా 'నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్' (NPCI)కు చెందిన 'ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్'తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. భారతదేశం వెలుపల ఉన్న భారతీయులు యూపీఐ చెల్లింపులు చెల్లించడానికి అనుకూలంగా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గూగుల్‌పే ఇప్పుడు ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్‌తో చేసుకున్న ఒప్పందం ఫలితంగా.. విదేశాలకు వెళ్లే ప్రజలు డబ్బు తీసుకెళ్లడం లేదా అంతర్జాతీయ గేట్‌వే చార్జీల భారం తగ్గిపోయింది. ఇది కేవలం వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని మాత్రమే కాకుండా.. సంస్థ తన ఉనికిని విస్తరించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: రూ.8300 కోట్ల సామ్రాజ్యంగా మారిన ఒక్క ఆలోచన.. ఇతర దేశాల్లో కూడా డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి రావడం వల్ల.. గూగుల్‌పే కస్టమర్లు అంతర్జాతీయ కరెన్సీ కోసం లేదా ఫారెక్స్ కార్డుల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. రెండు కంపెనీలు తీసుకున్న ఈ నిర్ణయం చాలా ఉపయోగకరంగా ఉంటుందని NPCL సీఈఓ రితేష్ శుక్లా పేర్కొన్నారు. -
బీమా ప్రీమియం చెల్లించేందుకు రుణాలు
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ స్టార్టప్ ‘ఫిన్‌కేస్’ బీమా ప్రీమియం చెల్లింపుల కోసం రుణ సాయాన్ని అందిస్తోంది. 2025 మార్చి నాటికి ఇలా 10 లక్షల మంది హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలుదారులకు రుణ సాయాన్ని సమకూర్చాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు తెలిపింది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను గడువులోపు చెల్లించడం తప్పనిసరి. పైగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను నెలవారీ లేదా త్రైమాసిక వాయిదాల్లో చెల్లించే అవకాశం ఉండదు. ఏడాదికి ఒకే ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. అంత ప్రీమియం ఒకేసారి చెల్లించడం చాలా మందికి భారంగా అనిపిస్తుంది. అలాంటి వారికి ఈ సంస్థ రుణ సదుపాయాన్ని అందిస్తోంది. అలాగే, ఆర్థిక ఆస్తులపైనా రుణాలను సమకూరుస్తుంటుంది. ఫిన్‌కేస్ అందించే రుణంతో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను చెల్లించి.. ఆ తర్వాత నెలవారీ ఈఎంఐ రూపంలో తిరిగి చెల్లిస్తే సరిపోతుంది. డిజిటల్ ఇన్సూరెన్స్‌లో వెటరన్ అయిన అలోక్ భటా్నగర్ను ఆపరేషన్స్ హెడ్‌గా నియమించుకుంది. కాగా, దేశంలో 51.4 కోట్ల మంది హెల్త్ ఇన్సూరెన్స్ రక్షణలో ఉన్నట్టు ఫిన్‌కేస్ తెలిపింది. ఇందులో కేవలం 10 కోట్లు మాత్రమే రిటైల్ హెల్త్ పాలసీలని (సొంతంగా తీసుకున్నవి) పేర్కొంది. -
యూపీఐ పేమెంట్లే మోసగాళ్ల టార్గెట్
సాక్షి, అమరావతి: దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాల్లో యూపీఐ మోసాలే అత్యధికంగా ఉంటున్నాయి. డిజిటలీకరణ పెరుగుతున్న కొద్దీ అధికమవుతున్న ఆర్థిక నేరాల్లో యూపీఐ మోసాలదే అగ్రస్థానం. ‘అనాటమీ ఆఫ్ ఫ్రాడ్స్–2023’ పేరిట కాన్పూర్ ఐఐటీ, డిజిటల్ బ్యూరో కన్సల్టెన్సీ ప్రక్సీస్ సంస్థ విడుదల చేసిన నివేదిక యూపీఐ మోసాల తీవ్రతను వెల్లడించింది. దేశంలో రోజుకు సగటున 23 వేల డిజిటల్ మోసాలు జరుగుతున్నాయని ఆ నివేదిక తెలిపింది. దేశంలో ఇంటర్నెట్ వినియోగదారులు పెరుగుతుండటాన్ని సైబర్ ముఠాలు అవకాశంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాయని ఆ నివేదిక చెప్పింది. ప్రస్తుతం దేశంలో 90.50 కోట్ల మందిగా ఉన్న ఇంటర్నెట్ వినియోగదారులు 2027నాటికి 100.14 కోట్లకు చేరతారని అంచనా వేసింది. 2019లో దేశంలో డిజిటల్ చెల్లింపులు 36 శాతం ఉండగా 2023 ఏప్రిల్ నాటికి 57 శాతానికి పెరిగాయి. 2027నాటికి డిజిటల్ చెల్లింపులు 74 శాతానికి చేరుతాయని అంచనా. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలు ప్రధానంగా యూపీఐ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు తగిన అవగాహన కల్పించాలని పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం.. అప్రమత్తతే రక్షా కవచం సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు అప్రమత్తతే రక్షా కవచం. వినియోగదారులు తగిన అవగాహన కలిగి ఉండాలని సీఐడీ ఎస్పీ (సైబర్ క్రైమ్ విభాగం) హర్షవర్ధన్ రాజు చెప్పారు. సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు ఆయన చేసిన సూచనలు ఇవీ... ► డిజిటల్ చెల్లింపులు చేసే డివైజ్‌ల ‘పిన్’ నంబర్ల గోప్యత పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. పిన్ నంబర్లుగానీ ఓటీపీ నంబర్లుగానీ ఎవరికి తెలియజేయకూడదు. దీర్ఘకాలంగా ఒకే పాస్‌వర్డ్‌ను కొనసాగించకూడదు. పాస్‌వర్డ్‌ను నియమిత కాలంలో మారుస్తూ ఉండాలి. ► ఫేక్ యూపీఐ సోషల్ మీడియా హ్యాండిల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చే అన్ని యూపీఐ హ్యాండిల్స్ విశ్వసనీయమైనవి కావనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తమ వినియోగదారుల యూపీఐ వివరాలను తెలపాలని ఆర్బీఐ గుర్తింపు పొందిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కోరవు. ఏదైనా ఆర్థిక సంస్థగానీ యాప్‌గానీ యూపీఐ వివరాలను కోరితే ఆ సంస్థ కచి్చతంగా మోసపూరితమైనదని గుర్తించి వెంటనే బ్లాక్ చేయాలి. ► పబ్లిక్ వైఫై, సురక్షితం కాని నెట్‌వర్క్‌ను ఉపయోగించి యూపీఐ చెల్లింపులు చేయకూడదు. ► మొబైల్ ఫోన్లలో ట్రాన్సాక్షన్ అలెర్ట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. మీ బ్యాంకు చెల్లింపులకు సంబంధించిన సమాచారం వెంటనే మీకు ఎస్ఎంఎస్ ద్వారా తెలిసే సౌలభ్యం ఉండాలి. మీ అనుమతిలేకుండా ఏదైనా చెల్లింపు జరిగితే వెంటనే గుర్తించి బ్యాంకును సంప్రదించి తగిన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ►సైబర్/యూపీఐ మోసానికి గురయ్యామని గుర్తిస్తే వెంటనే సంబంధిత బ్యాంకును సంప్రదించి ఆ అకౌంట్‌ను బ్లాక్ చేయించాలి. ఫిర్యాదు చేయాలి. సైబర్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయాలి. సైబర్ క్రైమ్ పోర్టల్ (నంబర్ 1930)కు గానీ ఏపీ సైబర్ మిత్ర (వాట్సాప్ నంబర్ 9121211100 )కుగానీ ఫిర్యాదు చేయాలి. భద్రతపై బ్యాంకుల దృష్టి సైబర్ మోసాలు పెరుగుతుండటంతో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సైబర్ భద్రతపై దృష్టిసారించాయి. సైబర్ భద్రత మౌలిక వసతులను పెంచుకునేందుకు నిధులు వెచి్చస్తున్నాయి. దేశంలో 43 ఆర్థిక సంస్థలు సైబర్ భద్రత కోసం నిధుల వెచ్చింపును భారీగా పెంచగా.. 17 శాతం ఆర్థిక సంస్థలు స్వల్పంగా పెంచాయి. కాగా 35 శాతం సంస్థలు సైబర్ భద్రత బడ్జెట్‌ను యథావిధిగా కొనసాగిస్తున్నాయి. 2 శాతం సంస్థలు సైబర్ భద్రత బడ్జెట్‌ను స్వల్పంగా తగ్గించగా 3 శాతం సంస్థలు బడ్జెట్‌ను భారీగా తగ్గించాయి. -
యూపీఐ కొత్త పుంతలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చెల్లింపులు భారత్‌లో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ ఏడాది నవంబర్‌లో 1,123.5 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. వీటి విలువ ఏకంగా రూ.17.4 లక్షల కోట్లను తాకింది. ఈ వేగాన్నిబట్టి చూస్తే డిసెంబర్ నెల యూపీఐ లావాదేవీల విలువ రూ.20 లక్షల కోట్ల మార్కును చేరే అవకాశం ఉంది. నూతన సంవత్సర వేడుకల కోసం చేసే చెల్లింపులు ఇందుకు దోహదం చేయనున్నాయి. డిసెంబర్ 1–18 తేదీల మధ్య 703 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. వీటి విలువ రూ.11 లక్షల కోట్లు. పండుగల సీజన్‌తో.. ఈ ఏడాది జూలై నుంచి సెపె్టంబర్ మధ్య యూపీఐ లావాదేవీల విలువ ప్రతి నెల రూ.15.3–15.8 లక్షల కోట్ల మధ్య నమోదైంది. పండుగల సీజన్ కారణంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో యూపీఐ లావాదేవీలతోపాటు విలువ కూడా అనూహ్యంగా పెరిగింది. గడిచిన రెండు మాసాల్లోనూ ప్రతి నెల విలువ రూ.17 లక్షల కోట్ల మార్కును తాకింది. 2023 అక్టోబర్‌లో 1,140.8 కోట్ల లావాదేవీలు జరగగా వీటి విలువ రూ.17.1 లక్షల కోట్లుగా ఉంది. ఇక 2022 డిసెంబర్లో రూ.12.8 లక్షల కోట్ల విలువైన 783 కోట్ల లావాదేవీలు జరిగాయి. అదే ఏడాది నవంబర్‌లో రూ.11.9 లక్షల కోట్ల విలువైన 731 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. తొలి స్థానంలో ఫోన్‌పే.. ప్రస్తుతం భారత్‌లో 516 బ్యాంకులు యూపీఐ సేవలను అందిస్తున్నాయి. థర్డ్ పార్టీ యాప్, డిజిటల్ పేమెంట్స్, ఫైనాన్షియల్ సర్వీసులు అందిస్తున్న ఫోన్‌పే నవంబర్ నెలలో రూ. 8,54,939 కోట్ల విలువైన 528 కోట్ల లావాదేవీలతో తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. లావాదేవీల విలువ పరంగా గూగుల్ పే, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, క్రెడ్, ఐసీఐసీఐ బ్యాంక్ యాప్స్, యెస్ బ్యాంక్ యాప్స్, భీమ్, అమెజాన్ పే, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ యాప్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్ యాప్స్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. చిన్న మొత్తాలే ఎక్కువ.. నవంబర్‌లో విలువ పరంగా వ్యక్తుల నుంచి వ్యక్తులకు జరిగిన లావాదేవీలు ఏకంగా 74.31 శాతం వాటా కైవసం చేసుకున్నాయి. వీటి విలువ రూ.12.9 లక్షల కోట్లకు చేరుకున్నాయి. వ్యక్తుల నుంచి వర్తకులకు జరిగిన లావాదేవీలు 25.69 శాతం వాటాతో రూ.4.46 లక్షల కోట్లు నమోదయ్యాయి. ఇక పరిమాణం పరంగా వ్యక్తుల నుంచి వర్తకులకు 58.62 శాతం వాటాతో 658.5 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. వ్యక్తుల నుంచి వ్యక్తులకు 41.38 శాతం వాటాతో 464.9 కోట్ల లావాదేవీలు జరిగాయి. పరిమాణం పరంగా వ్యక్తుల నుంచి వర్తకులకు చెల్లించిన మొత్తాల్లో రూ.500 లోపు లావాదేవీల సంఖ్య ఏకంగా 83.75 శాతం ఉంది. వ్యక్తుల నుంచి వ్యక్తులకు బదిలీ అయిన మొత్తాల్లో రూ.500 లోపు విలువ చేసే లావాదేవీల వాటా 54.85 శాతం నమోదైంది. దీనినిబట్టి చూస్తే చిన్న మొత్తాలే అధిక సంఖ్యలో చేతులు మారుతున్నాయి. -
యూపీఐతో ‘చెల్లింపు’.. ప్రత్యేక వాహనాల్లో తరలింపు!
‘‘హలో.. మన నియోజకవర్గ ఓటర్ల కోసం బస్సులు, జీపులు సిద్ధం చేశాం. ఆరాంఘర్ కూడలికి వస్తే రెడీగా ఉంటాయి. వచ్చేయండి, అక్కడే మీకు ఓటు డబ్బులు చెల్లిస్తాం!’’.. ‘‘మీ ఎకౌంట్‌కు గూగుల్ పే నుంచి డబ్బులు పంపాం. ముట్టినయా చూసి ఓకే మెసేజ్ పెట్టండి..’’ సాక్షి, హైదరాబాద్: మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం రాత్రిదాకా ఇదే తీరు. హైదరాబాద్‌లో, వివిధ పట్టణాల్లో ఉంటున్న తమ నియోజకవర్గ ఓటర్లను తరలించేందుకు ఆయా పార్టీ ల అభ్యర్థులు ప్రత్యేకంగా చేసిన ఏర్పాట్లు ఇవి. రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన లక్షల మంది ఓటర్లు గ్రేటర్ హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో ఉంటున్నారు. ఈసారి ఎన్నికల్లో గట్టి పోటీ కనిపిస్తుండటంతో అభ్యర్థులు ఈ ఓటర్లపై దృష్టిపెట్టారు. తమ నియోజకవర్గ ఓటర్లందరినీ రప్పించుకుని, తమకే ఓటు వేసేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఓట్ల కోసం యూపీఐ ద్వారా డబ్బులు జమ చేయడంతోపాటు స్వస్థలాలకు రవాణా సదుపాయాన్నీ ఏర్పాటు చేశారు. కొందరు అభ్యర్థులు మొత్తం సొమ్ము ముందే ట్రాన్స్ఫర్ చేయగా, మరికొందరు కొంత మొత్తాన్ని అడ్వాన్స్‌గా ఇచ్చి, ఓటు వేయటానికి వచ్చి నప్పుడు మిగతా సొమ్ము ఇస్తామని చెప్తున్నట్టు తెలిసింది. అభ్యర్థుల అనుచరులు, స్థానిక నేతలు దీనంతటినీ పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఓటర్లను తరలించుకుపోయేందుకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో వాహనాలను ఏర్పాటు చేశారు. కొందరు ఆర్టీ సీ, ప్రైవేటు బస్సులనూ బుక్ చేసినట్టు తెలిసింది. చాలా వరకు మినీ వ్యాన్లు, కార్లను సిద్ధం చేశారు. దావత్ ఇచ్చి.. స్లిప్పులు పంచి..! కొందరు అభ్యర్థులు హైదరాబాద్ నుంచి తమ ఓటర్లను తరలించడానికి ముందు మంగళవారం రాత్రే శివారు ప్రాంతాల్లోని ఫంక్షన్ హాళ్లలో దావత్‌లు ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఓటర్లను దావత్‌కు రప్పించి.. లిక్కర్, మాంసాహార భోజనం పెట్టారని సమాచారం. ఈ సమయంలో కొందరు నేరుగా ఓటర్లకే డబ్బులు ఇవ్వగా, మరికొందరు స్లిప్పులు రాసిచ్చి , సొంతూరికి వెళ్లాక ఓటేసే ముందు అది ఇచ్చి డబ్బులు తీసుకోవాలని చెప్పినట్టు తెలిసింది. బస్టాండ్లలో విపరీతమైన రద్దీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు హైదరాబాద్ నగరం నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ సొంతూర్లకు తరలివెళ్లారు. దీంతో బస్టాండ్లు, ఎల్బీనగర్, ఉప్పల్ కూడలి, ఆరాంఘర్ వంటి ప్రాంతాలు కిటకిటలాడాయి. దీనితో ఆర్టీసీ సుమారు 1,500కుపైగా అదనపు బస్సులను సిద్ధం చేసి ఆయా రూట్లకు నడిపింది. మరోవైపు భారీ సంఖ్యలో ప్రైవేటు వాహనాలు కూడా ప్రయాణికులను తరలించాయి. -
డబ్బులు ఊరికే వస్తాయి!
డబ్బులు ఊరకే రావు... బాగా పాపులర్ అయిన ఓ వాణిజ్య ప్రకటన. కానీ ప్రస్తుతం డబ్బులు ఊరకే వస్తున్నాయి! ప్రతి ఊరికీ వెళ్తున్నాయి!!రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన దాదాపు రెండు వారాల్లోనే కట్టలకు కట్టలు డబ్బు పట్టుబడటమే ఇందుకు నిదర్శనం. ఇంకా నామినేషన్లు కూడా మొదలు కాకముందే ఓట్ల కొనుగోలు కోసం ప్రజలకు పంపిణీ చేయడానికి డబ్బు పంపిణీ మొదలైంది. డబ్బుతోపాటు ఫ్రీబీస్ (ఉచిత బహుమతులు) సైతం పంపిణీ అవుతున్నాయి. దీంతో వాటిని అడ్డుకునేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది. డబ్బు మాదిరిగా ఇవి భారీ మొత్తాల్లో పట్టుబడకపోవడానికి ఏవి ఫ్రీబీస్.. ఏవి కావు అనే సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలో ఏవి ఉచితాలో పేర్కొంటూ వాణిజ్య పన్నుల శాఖ 26 అంశాలతో కూడిన జాబితాను జిల్లాల కలెక్టర్లు, పోలీసులు, ఎన్నికల అధికారులకు పంపింది. తనిఖీల్లో పట్టుబడే ఉచితాలపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆయా వస్తువులు రవాణా అవుతున్నా లేదా భారీ స్థాయిలో గోదాముల్లో నిల్వ ఉన్నా తమకు తెలియజేయాలని పేర్కొంది. యూపీఐ పేమెంట్లపైనా నిఘా.. డబ్బు పంపిణీ సైతం గతంలోలా నగదు రూపేణానే కాకుండా యూపీఐ (గూగుల్‌పే/ఫోన్‌పే/పేటీఎం) చెల్లింపుల ద్వారా కూడా భారీగా జరుగుతుండటంతో వాటిపైనా ఎన్నికల అధికారులు నిఘా వేశారు. ఆయా వివరాల కోసం ఆర్బీఐ, బ్యాంకు మేనేజర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒకే ఖాతా నుంచి ఎక్కువ లావాదేవీలు జరిగితే వివరాలు అందజేయాల్సిందిగా కోరుతున్నారు. ఇప్పటివరకు రూ.307 కోట్లు స్వాదీనం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 21వ తేదీ వరకు పట్టుకున్న నగదు, మద్యం, సరుకులు, ఫ్రీబీస్, తదితరాల మొత్తం విలువ రూ. 307 కోట్లు కాగా, వీటిల్లో ఫ్రీబీస్ విలువ రూ.26.93 కోట్లు. వివిధ మార్గాల ద్వారా నిఘా.. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఆన్లైన్ ద్వారా డబ్బు పంపిణీ చేపట్టినా అడ్డుకొనేందుకు నిఘా పెట్టాం. ఒకే ఖాతా నుంచి వందల మందికి ఒకే మొత్తంలో (ఉదాహరణకు రూ.500, 2,000, 5,000,10,000 చొç³్పున) గూగుల్‌పే/ఫోన్‌పే/పేటీఎం ద్వారా ట్రాన్స్ఫర్ జరుగుతోందో లేదో పరిశీలిస్తాం. ఒకే బ్యాంకు ఖాతాలో భారీగా నగదు జమ చేసినా పరిశీలిస్తాం. అనుమానాస్పద లావాదేవీలపై విచారణ చేపడతాం. – రోనాల్డ్‌రాస్, హైదరాబాద్ ఎన్నికల అధికారి జాబితాలోని ఫ్రీబీస్ ఇవే.. 1.సీలింగ్ ఫ్యాన్లు 2.ప్రెషర్ కుక్కర్లు 3. మిక్సర్లు, గ్రైండర్లు 4.చీరలు 5.కుట్టు మిషన్లు 6.స్టెయిన్లెస్ స్టీలు పాత్రలు 7.ఎల్రక్టానిక్ వస్తువులు/టీవీ సెట్స్ 8. గోడ గడియారాలు 9.క్రికెట్ కిట్స్ 10. జ్యువెలరీ ఐటమ్స్ 11.ఇతర క్రీడాపరికరాలు 12.బెడ్‌షీట్స్/టవల్స్ 13.గడియారాలు 14.సైకిళ్లు, బైక్‌లు 15.కాస్మెటిక్స్ 16. జిమ్ పరికరాలు 17. బంగారం లేదా వెండి పూత వస్తువులు (ఇమిటేషన్ జ్యువెలరీ) 18. కుంకుమ భరిణెలు 19. మొబైల్ ఫోన్లు 20. రెడీమేడ్ గార్మెంట్స్ 21.స్కూల్ బ్యాగ్స్ 22. టీషర్ట్స్ 23. టార్చిలైట్లు 24. టాయ్స్ 25. ట్రావెల్ బ్యాగ్స్/సూట్‌కేస్‌లు 26. గొడుగులు - చెరుపల్లి వెంకటేశ్ -
‘ఎక్స్’లో పోస్ట్ పెట్టాలంటే డబ్బులు కట్టాలి
వాషింగ్టన్: మైక్రోబ్లాగింగ్ సైట్ ‘ఎక్స్’(ట్విట్టర్) తన వినియోగదారులకు చేదువార్త చెప్పింది. ‘నాట్ ఎ బాట్’ అనే కొత్త సబ్ర్స్కిప్షన్ ప్లాన్‌ను అమల్లోకి తీసుకొచి్చంది. దీనిప్రకారం.. ‘ఎక్స్’లో కొత్త యూజర్లు పోస్ట్‌లు చేయాలన్నా, వేరొకరి ట్వీట్‌ను రీట్వీట్ చేయాలన్నా, రిప్లై ఇవ్వాలన్నా, లైక్ కొట్టాలన్నా, షేర్ చేయాలన్నా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సబ్ర్స్కిప్షన్ ఫీజు కింద ఏడాదికి ఒక డాలర్ చొప్పున ‘ఎక్స్’ యాజమాన్యం వసూలు చేయనుంది. -
ఫెరారీ కారు ఇలా కూడా కొనేయొచ్చు! అక్కడ మాత్రమే..
ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ 'ఫెరారీ' (Ferrari) తమ బ్రాండ్ కార్లను క్రిప్టోకరెన్సీ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చని ప్రకటించింది. యూరోపియన్ దేశాలలోని సంపన్న కస్టమర్ల అభ్యర్థమేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫెరారీ పేర్కొంది. ఫెరారీ చీఫ్ మార్కెటింగ్ అండ్ కమర్షియల్ ఆఫీసర్ 'ఎన్రికో గల్లీరా' (Enrico Galliera) దీని గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో క్రిప్టోకరెన్సీ ద్వారా విక్రయాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. క్రిప్టోకరెన్సీ ద్వారా కార్లను కొనుగోలు చేస్తే ధరల్లో ఏమార్పు ఉండదని, ఎలాంటి అధిక ఫీజులు ఉండవని స్పష్టం చేశారు. ఫెరారీ ఈ క్రిప్టోకరెన్సీ ద్వారా ఎన్ని కార్లను విక్రయించనుంది? నిర్దిష్ట సంఖ్య (లిమిట్) ఏమైనా ఉందా? అనేదానికి సంబంధించిన అధికారికి వివరాలు అధికారికంగా వెల్లడించలేదు. క్రిప్టోకరెన్సీ చెల్లింపుల ద్వారా విక్రయాలు ప్రారంభమైతే యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా మార్కెట్లలో విక్రయాలు భారీగా పేరే సూచనలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఇదీ చదవండి: ధనవంతుల జాబితాలో రైతు బిడ్డ - సంపద తెలిస్తే అవాక్కవుతారు! గతంలో బిట్‌కాయిన్ ద్వారా టెస్లా విక్రయాలు 2021లో టెస్లా కంపెనీ అధినేత 'ఎలాన్ మస్క్' (Elon Muck) బిట్‌కాయిన్ చెల్లింపుతో టెస్లా కార్లను కొనుగోలు చేయడానికి అవకాశం కల్పించాడు. కానీ కొన్ని కారణాల వల్ల అతి తక్కువ కాలంలోనే ఈ విధానానికి ముగింపు పలికేసాడు. అయితే ఇప్పుడు ఫెరారీ ఈ విధానానికి సుముఖత వ్యక్తం చేసింది. ఇది సజావుగా ముందుకు సాగుతుందా? ఏదైనా సమస్యలను ఎదుర్కుంటుందా? అనే వివరాలు భవిష్యత్తులో తెలుస్తాయి. -
వాట్సాప్ పేమెంట్స్ సేవల విస్తరణ
ముంబై: మెసేజింగ్ యాప్ వాట్సాప్ తాజాగా భారత మార్కెట్లో తమ చెల్లింపుల సేవలను మరింతగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా వ్యాపార సంస్థలకు కొనుగోలుదారులు చేసే పేమెంట్స్ ప్రక్రియను సులభతరం చేసింది. ‘వాట్సాప్ బిజినెస్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించే భారతీయ వ్యాపార సంస్థలన్నింటికీ మా పేమెంట్స్ సర్వీసును విస్తరిస్తున్నాం. కొనుగోలుదారులు తమకు కావాల్సిన ఉత్పత్తులను వాట్సాప్‌లోనే కార్ట్‌కి జోడించుకోవడంతో పాటు తమకు నచ్చిన పేమెంట్ విధానం ద్వారా .. అంటే వాట్సాప్ లేదా యూపీఐ యాప్‌లు, డెబిట్ .. క్రెడిట్ కార్డులతో కూడా చెల్లించవచ్చు. ఇందుకోసం ఇతర వెబ్‌సైట్‌కి గానీ, మరో యాప్‌కి గానీ వెళ్లనక్కర్లేదు. వ్యక్తిగతంగా వెళ్లి చెల్లించనక్కర్లేదు‘ అని సంస్థ తెలిపింది. ఈ ఫీచర్ ఇప్పటికే సింగపూర్, బ్రెజిల్లో చిన్న వ్యాపార సంస్థల కోసం కంపెనీ అమలు చేస్తోంది. వ్యాపార సంస్థలు, కొనుగోలుదారులు మెసేజింగ్ ఫీచర్‌ను సమర్ధంగా వినియోగించుకునే విషయంలో ప్రపంచానికి భారత్ సారథ్యం వహిస్తోందని బిజినెస్ మెసేజింగ్ సదస్సు ’కన్వర్సేషన్స్’ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న వాట్సాప్ మాతృసంస్థ మెటా వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. వాట్సాప్ ఫ్లోస్, వెరిఫైడ్ బ్యాడ్జ్ .. మెసేజింగ్ ఫార్మాట్లు, గ్రూప్ చాట్స్, బ్రాడ్కాస్ట్ చానల్స్ విషయంలో మెటా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ఆవిష్కరిస్తోందని జుకర్‌బర్గ్ చెప్పారు. ఇందులో భాగంగా వ్యాపార సంస్థల కోసం వాట్సాప్ ఫ్లోస్, మెటా వెరిఫైడ్ బ్యాడ్జ్‌లను విస్తృతంగా అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. రిజర్వేషన్ బుకింగ్, ఉత్పత్తులను ఆర్డర్ చేయడం, ఫ్లయిట్స్‌లో చెకిన్ చేయడం వంటి అంశాల్లో కస్టమర్లకు వెసులు బాటు కల్పించేలా వాట్సాప్ ఫ్లోస్‌ను వ్యాపార సంస్థలు ఉపయోగించుకోవచ్చు. మరోవైపు, మెటా వెరిఫైడ్ బ్యాడ్జ్‌లను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌లకు విస్తరిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
డాక్యుమెంట్లు తిరిగి ఇవ్వకపోతే రోజుకు రూ. 5 వేల పరిహారం
న్యూఢిల్లీ: రుణం పూర్తి చెల్లింపుల తర్వాత రుణానికి సంబంధించి తనఖాగా ఉంచిన ఒరిజినల్ స్థిర లేదా చర ఆస్తి పత్రాలు అన్నింటినీ రుణగ్రహీతకు 30 రోజుల లోపు తిరిగి ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) బ్యాంకులకు, ఫైనాన్స్ సంస్థలకు స్పష్టం చేసింది. ఏదైనా ఆలస్యం జరిగితే రోజుకు రూ. 5 వేలు పరిహారంగా చెల్లించాలని స్పష్టం చేసింది. అదేవిధంగా ఏదైనా రిజిస్ట్రీలో నమోదైన చార్జీలను అన్నింటినీ నిర్దేశిత 30 రోజుల్లో తీసివేయాలని కూడా ఒక నోటిఫికేషన్లో ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ తరహా పలు ఫిర్యాదుల నమోదు నేపథ్యంలో బ్యాంకింగ్ రెగ్యులేటర్ తాజా ఆదేశాలు ఇచి్చంది. డాక్యుమెంట్లు తిరిగి ఇవ్వడంలో నెల రోజులు దాటితే ఈ జాప్యానికి స్పష్టమైన కారణాలను రుణగ్రహీతకు తెలియజేయాల్సి ఉంటుందని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. డాక్యుమెంట్లను తిరిగి ఇవ్వడానికి సంబంధించిన విధివిధానాల వివరాలను బ్యాంకింగ్ లేదా ఆర్థిక సంస్థలు తమ తమ వెబ్సైట్లో ఉంచాలని సూచించింది. నష్టం జరిగితే.. మరో 30 రోజులు ఒరిజినల్ చర లేదా స్థిర ఆస్తి పత్రాలు కనబడకుండా పోవడం లేదా ఏదైనా నష్టం జరిగితే అటువంటి పత్రాల డూప్లికేట్ లేదా సరి్టఫైడ్ కాపీలను పొందడంలో రుణగ్రహీతకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పూర్తిగా సహాయపడాలని కూడా ఆర్బీఐ నిర్దేశించింది. ఇందుకు మరో 30 రోజుల సమయాన్ని తీసుకోవచ్చని పేర్కొంది. ఆ తర్వాతే (60 రోజుల తర్వాత) జాప్యానికి రోజుకు రూ.5 వేల పరిహారం నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. కాగా, ఈ పరిహారం... ఇతర ఏదైనా (వర్తించే) చట్టం ప్రకారం ఏదైనా ఇతర పరిహారం పొందేందుకు రుణగ్రహీత కు ఉండే హక్కులకు ఎటువంటి భంగం కలిగించబోదని ఆర్బీఐ స్పష్టం చేయడం గమనార్హం. 2023 డిసెంబరు 1 తర్వాత ఒరిజినల్ చర లేదా స్థిరాస్తి పత్రాలను విడుదల చేసే అన్ని కేసులకు ఈ తాజా ఆదేశాలు వర్తిస్తాయని ఆర్బీఐ తెలిపింది. -
స్పైస్‌జెట్‌కు డెడ్‌లైన్: కడతారా? జైలుకెడతారా అజయ్ సింగ్‌కు సుప్రీం వార్నింగ్
SpiceJet Vs Credit Suisse క్రెడిట్ సూయిస్ కేసులో విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు భారీ షాక్ తగిలింది.క్రెడిట్ సూయిస్ బకాయిల చెల్లింపు విషయంలో స్పైస్‌జెట్ ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్‌కు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.సుప్రీం ఆదేశాలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం హెచ్చరించింది. ఒప్పందం ప్రకారం మిలియన్ డాలర్ల బకాయిలను చెల్లింపులో స్పైస్‌జెట్ కావాలనే తాత్సారం చేస్తోందని, ఈ నేపథ్యంలో సింగ్ ,స్పైస్‌జెట్‌లపై ధిక్కార చర్యలను ప్రారంభించాలని కోరుతూ ఈ ఏడాది మార్చిలో క్రెడిట్ సూయిస్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు తాజా ఆదేశాలిచ్చింది. సెప్టెంబర్ 15లోగా క్రెడిట్ సూయిస్‌కి వాయిదాల రూపంలో 5 లక్షల డాలర్లను చెల్లించాలని, అలాగే డిఫాల్ట్ చేసిన మొత్తానికి 1 మిలియన్ డాలర్లు చెల్లించాలని స్పైస్‌జెట్ సుప్రీంకోర్టు ఆదేశించింది.లేని పక్షంలో 'కఠిన చర్యలు' తీసుకుంటామని స్పైస్‌జెట్‌ను సుప్రీంకోర్టు హెచ్చరించింది. బకాయిలు చెల్లించకపోతే అజయ్ సింగ్ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని సుప్రీం పేర్కొంది. (ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్: అదిరిపోయే సరికొత్త ఫీచర్లు) ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం క్రెడిట్ సూయిస్ బకాలయిలను క్రెడిట్ సూయిస్‌కి బకాయిలు చెల్లించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని చెల్లించని పక్షంలో సింగ్‌ను తీహార్ జైలుకు పంపుతామని కోర్టు పేర్కొంది. అంతేకాదు ప్రతి విచారణలోనూ కోర్టుకు హాజరు కావాలని సింగ్‌ను ఆదేశించింది. ఇక చాలు..మీరు సంస్థను మూసివేసినా ..బాధలేదు. కానీ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందే ఇక డిల్లీ-డాలీ బిజినెస్‌ను కట్టిపెట్టండి అంటూ కోర్టు ఆగ్రహ్యం వక్తం చేసింది. అనంతరం ఈ కేసును సెప్టెంబరు 22కి వాయిదా వేసింది. -
హెలో.. యూపీఐ - ఇక వాయిస్ ఆధారిత చెల్లింపులు
ముంబై: యూపీఐ వేదికగా వాయిస్ ఆధారిత పేమెంట్స్ సహా పలు కొత్త రకాల చెల్లింపు విధానాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఆవిష్కరించింది. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్ సందర్భంగా వీటిని ప్రకటించింది. ఇందులో హెలో!యూపీఐ అనే విధానంతో యాప్స్, టెలికం కాల్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాల ద్వారా వాయిస్ ఆధారిత యూపీఐ చెల్లింపులు చేయొచ్చు. ఇది హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంటుంది. త్వరలోనే ఇతర ప్రాంతీయ భాషల్లోనూ దీన్ని అందుబాటులోకి తేనున్నట్లు ఎన్పీసీఐ తెలిపింది. బ్యాంకులు మంజూరు చేసిన క్రెడిట్ లైన్‌ను యూపీఐ ద్వారా కూడా వినియోగించుకోవచ్చని పేర్కొంది. ఇక ఆఫ్లైన్లోనూ నగదును పంపించేందుకు, అందుకునేందుకు లైట్ ఎక్స్ సాధనం ఉపయోగపడగలదని ఎన్పీసీఐ తెలిపింది. అలాగే, యూపీఐ ట్యాప్ అండ్ పే విధానంతో ఎన్ఎఫ్సీ (నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్) ఆధారిత క్యూఆర్ కోడ్స్‌పై ట్యాప్ చేసి, చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేయొచ్చని వివరించింది. -
యూపీఐ ట్రాన్సక్షన్స్.. ఆగస్టులో అన్ని లక్షల కోట్లా?
ఆధునిక భారతదేశంలో జేబులో డబ్బుపెట్టుకునే వారి సంఖ్యకంటే కూడా యూపీఐ వినియోగించేవారి సంఖ్యే ఎక్కువగా ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చిల్లరకొట్టు దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు కూడా దాదాపు అన్నీ యూపీఐ పేమెంట్స్ జరుగుతున్నాయి. ప్రారంభం నుంచి అత్యధిక ప్రజాదరణ పొందిన ఈ విధానం గత నెలలో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2023 ఆగస్టు 30 నాటికి యూపీఐ లావాదేవీలు 10.24 బిలియన్లు దాటినట్లు సమాచారం. దీని విలువ సుమారు 15.18 లక్షల కోట్లు అని తెలుస్తోంది. ఈ ట్రాన్సక్షన్స్ జులై నెలలో 9.88 బిలియన్స్. అంటే జులై నెల కంటే కూడా ఆగష్టు నెలలో లావాదేవీలు చాలా ఎక్కువ జరిగినట్లు స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: చంద్రయాన్-3 సక్సెస్.. ఇస్రో ఉద్యోగుల జీతాలు ఎంతో తెలుసా? నేషనల్ పేమెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (NPCI) డేటా ప్రకారం, జూలైలో 9.88 బిలియన్ డాలర్లు, ఆగష్టులో 10 బిలియన్లు అని తెలుస్తోంది. రానున్న రోజుల్లో రోజుకి ఒక బిలియన్ లావాదేవీలను లక్ష్యంగా పెట్టుకుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో పండుగ సీజన్ కావున తప్పకుండా యూపీఐ లావాదేవీలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. -
ఫారిన్ టూర్.. ఫారెక్స్ కార్డ్ బెటర్
భారత్ నుంచి విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగార్థులు, పర్యాటకుల సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది. గతంతో పోలిస్తే విదేశీ ప్రయాణం ఎంతో సౌకర్యంగా మారింది. విమానాశ్రయాలు, విమాన సర్వీసుల నెట్వర్క్ విస్తృతం అయింది. ఎక్కడి నుంచి ఎక్కడికైనా వేగంగా, సులభంగా ప్రయాణించే వెసులుబాటు దక్కింది. మరి విదేశాలకు వెళ్లే వారు తమ వెంట ఆయా దేశానికి చెందిన కరెన్సీని కూడా తీసుకెళుతుంటారు. ఈ అవసరాన్ని తప్పించేదే ఫారెక్స్ కార్డ్. ఏ దేశానికి వెళితే ఆ దేశ కరెన్సీ రూపంలో ఈ కార్డ్ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. ఫారెక్స్ కార్డ్ ఉంటే కరెన్సీ నోట్లు పాకెట్లో లేకపోయినా ఇబ్బంది పడే పరిస్థితి రాదు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఇది చెల్లుతుంది. డెబిట్, క్రెడిట్ కార్డ్ కంటే ఫారెక్స్ కార్డ్ వల్ల ఎన్నో అనుకూలతలు ఉన్నాయి. ఈ ఫారెక్స్ కార్డుతో ప్రయోజనాలు? ఎలా పనిచేస్తుంది? ఇందులో ఎన్ని రకాలు? చార్జీలు తదితర విషయాలను తెలియజేసే కథనమే ఇది! ఫారెక్స్ కార్డ్ అంటే..? ఇదొక ప్రీపెయిడ్ కార్డ్. మీరు వెళ్లాలనుకునే దేశ కరెన్సీ మారకంలో డిపాజిట్ చేసుకుని, వినియోగించుకునే సాధనం. ఈ కార్డ్‌తో విదేశాల్లో చెల్లింపులు చేయడమే కాకుండా, ఏటీఎం నుంచి ఆ దేశ కరెన్సీని ఉపసంహరించుకోవచ్చు. ఈ కార్డ్ ఉంటే వెంట భౌతిక రూపంలో కరెన్సీని తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఫారెక్స్ కార్డుల్లో రకాలు... విదేశాలకు వెళ్లే వారికి క్రెడిట్, డెబిట్ కార్డ్‌లతో పోలిస్తే ఫారెక్స్ కార్డ్ ఎంతో ఉపయోగకరం అని చెప్పుకోవాలి. పర్యాటకుల అవసరాలకు అనుగుణంగా ఈ కార్డుల్లో పలు రకాలు ఉన్నాయి. సింగిల్ కరెన్సీ ఫారెక్స్ కార్డ్ ఇందులో ఒకటి. ఏదైనా ఒక దేశ కరెన్సీనే ఇందులో లోడ్ చేసుకోవచ్చు. మల్టీ కరెన్సీ ఫారెక్స్ కార్డ్ రెండో రకం. ఇందులో ఒకటికి మించిన దేశాల కరెన్సీలను లోడ్ చేసుకోవచ్చు. వివిధ దేశాలకు వెళ్లే వారికి మల్టీ కరెన్సీ ఫారెక్స్ కార్డ్ ఉపయోగకరం. దాదాపు ప్రముఖ బ్యాంకులన్నీ కూడా ఫారెక్స్ కార్డ్‌లను ఆఫర్ చేస్తున్నాయి. ప్రయోజనాలు/సదుపాయాలు విదేశాల్లో చెల్లింపులు సురక్షితంగా చేసేందుకు ఫారెక్స్ కార్డ్ అనుకూలం. క్రెడిట్ కార్డ్‌కు మాదిరే అన్ని రకాల సదుపాయాలు కూడా వీటిల్లో ఉంటాయి. ఇది ప్రీపెయిడ్ కార్డ్ కావడంతో, ముందుగానే బ్యాంక్ ఖాతా నుంచి లోడ్ చేసుకోవాలి. ఫలితంగా విదేశాల్లో వినియోగంపై స్వీయ నియంత్రణ ఉంటుంది. కావాల్సినంతే లోడ్ చేసుకోవచ్చు. అంతే మేర ఖర్చు చేసుకోవచ్చు. ఫారెక్స్ కార్డ్‌ను దాదాపు అన్ని చోట్లా ఆమోదిస్తారు కనుక సౌకర్యవంతగా ఉంటుంది. దీంతో ఏటీఎంలు లేదంటే ఇతర ప్రత్యామ్నాయ చెల్లింపుల సాధనాల కోసం చూసుకోవాల్సిన అవసరం రాదు. ముఖ్యంగా కరెన్సీని తీసుకెళ్లే అవసరాన్ని తప్పిస్తుంది. దీంతో నగదుతో పోలిస్తే సౌకర్యం, సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు కరెన్సీ విలువల్లో అస్థిరతల ప్రభావం కూడా ఉండదు. లోడ్ చేసిన రోజు విలువే స్థిరంగా కొనసాగుతుంది. దాంతో రోజువారీ కరెన్సీ మారకం హెచ్చుతగ్గుల సమస్య ఉండదు. క్రెడిట్, డెబిట్ కార్డు చార్జీలతో పోలిస్తే ఫారెక్స్ కార్డ్ చౌక ఆప్షన్. క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ను ఉపయోగించిన ప్రతి సందర్భంలోనూ కరెన్సీ మారకం చార్జీ పడుతుంది. ఎందుకంటే ఏ దేశంలో ఉంటే ఆ దేశ కరెన్సీలోకి రూపాయిలను మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ మారకం చార్జీని కరెన్సీ మార్కప్ చార్జీగా పేర్కొంటారు. కార్డ్, బ్యాంక్ ఆధారంగా ఈ చార్జీ 2–5 శాతం మధ్య ఉంటుంది. ఫారెక్స్ కార్డుల్లో ఎన్నో సదుపాయాలు ఉండడంతో, సంప్రదాయ చెల్లింపు సాధనాలతో పోలిస్తే ఇవి ఆకర్షణీయమైనవని చెప్పుకోవచ్చు. మల్టీ కరెన్సీ ఫారెక్స్ కార్డ్ ఉంటే, ఒకేసారి ఒక దేశం తర్వాత మరో దేశానికి వెళ్లేట్టు అయితే ఉపయోగకరంగా ఉంటుంది. కావాల్సిన ప్రతిసారీ బ్యాంకుల్లో కరెన్సీని మార్చుకోవడం కంటే ఫారెక్స్ కార్డు తీసుకెళ్లడమే సౌకర్యం. బ్యాంకులకు సైతం ఫారెక్స్ కార్డులతో తక్కువ వ్యయం అవుతుంది. దీంతో అవి ఫారెక్స్ కార్డుదారులకు ఆ ప్రయోజనాలను అందిస్తుంటాయి. భౌతిక కరెన్సీతో పోలిస్తే ఫారెక్స్ కార్డులో లోడ్ చేసుకోవడం వల్ల మరింత మెరుగైన మారకం రేటు సాధ్యపడుతుంది. ఈ కార్డ్ పొందేందుకు ఆయా బ్యాంక్ ఖాతాదారు కావాల్సిన అవసరం లేదు. ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది ప్రీపెయిడ్ కార్డ్ కనుక, బ్యాంక్‌లు సులభంగా మంజూరు చేస్తుంటాయి. మార్కెట్లో వివిధ బ్యాంకులు ఎన్నో ఫీచర్లతో వీటిని ఆఫర్ చేస్తున్నాయి. వీటి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత, తమకు అనుకూలమైనది తీసుకోవచ్చు. ఒకవేళ ఫారెక్స్ కార్డ్‌ను ఎక్కడైనా కోల్పోతే, వెంటనే బ్యాంక్ లేదా ఎన్బీ ఎఫ్సీకి కాల్ చేసి చెబితే మిగిలిన బ్యాలన్స్ దురి్వనియోగం కాకుండా ఫ్రీజ్ చేసేస్తారు. విదేశాల్లోని పీవోఎస్ మెషీన్ల వద్ద ఫారెక్స్ కార్డులను స్వైప్ చేస్తే ఎలాంటి చార్జీలు పడవు. కానీ అదే డెబిట్, క్రెడిట్ కార్డులను స్వైప్ చేసిన ప్రతిసారీ ఎంతో కొంత చార్జీ పడుతుంది. పైగా ఇతర సాధనాలతో పోలిస్తే ఫారెక్స్ కార్డులకు అంతర్జాతీయంగా ఎక్కువ ఆమోదం ఉంటుంది. అంతేకాదు విదేశాల్లో ఆన్లైన్ కొనుగోళ్లకు సైతం ఫారెక్స్ కార్డులతో చెల్లింపులు చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్‌పై విదేశాల్లో ఖర్చు చేస్తే సకాలంలో చెల్లింపులు చేయకపోతే, భారీ వడ్డీ, లేట్ పేమెంట్ ఫీజులు పడతాయి. ఫారెక్స్ కార్డ్ ప్రీపెయిడ్ కార్డ్ కావడంతో ఈ సమస్య ఉండదు. ► ఒకేసారి ఒకటికి మించిన దేశాలను పర్యటించే వారు, ఆయా దేశాల కరెన్సీని వెంట తీసుకెళ్లే ఇబ్బంది లేకుండా, మల్టీ కరెన్సీ ఫారెక్స్ కార్డ్ ఎంపిక చేసుకోవడం నయం. ► కార్డ్‌లో బ్యాలన్స్ మిగిలి ఉంటే, స్వదేశానికి వచి్చన తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి నగదుగా మార్చుకోవచ్చు. ► విదేశీ పర్యటన ముగించి స్వదేశానికి వచ్చిన తర్వాత.. తిరిగి విదేశానికి వెళ్లేంత వరకు కార్డ్‌ను డీయాక్టివేట్ చేసుకోవచ్చు. మళ్లీ విదేశీ యాత్రకు ముందు యాక్టివేట్ చేసుకోవచ్చు. దీంతో వినియోగం లేకపోయినా చార్జీలు, పెనాలీ్టలు పడవు. మెయింటెనెన్స్ చార్జీలు కూడా ఉండవు. ► ఫారెక్స్ కార్డ్‌లపై డీల్స్, డిస్కౌంట్లు వస్తుంటాయి. ► ఫారెక్స్ కార్డుల్లో చాలా వరకు లాక్డ్ ఇన్ ఎక్సే్ఛంజ్ రేట్ అనే ఫీచర్‌తో వస్తాయి. అంటే కరెన్సీ రేటులో అస్థిరతలను ఈ సదుపాయంతో అధిగమించొచ్చు. ఉదాహరణకు కార్డులో డాలర్లు లోడ్ చేసుకుంటే, ఆ రోజు ఉన్న విలువ ప్రకారమే లాక్ అవుతుంది. దాని విలువ బ్యాలన్స్ ముగిసే వరకు స్థిరంగా కొనసాగుతుంది. ► ఫారెక్స్ కార్డ్ లేకుండా వెళితే, విదేశాల్లో అవసరమైన చోట కరెన్సీని మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇందుకోసం శ్రమపడాల్సి రావచ్చు. ఫారెక్స్ కార్డ్ అయితే ఉన్న చోట నుంచే కోరుకున్న మారకం రేటులో లోడ్ చేసుకోవచ్చు. ► అంతర్జాతీయ ఈ కామర్స్ పోర్టళ్లపై ఫారెక్స్ కార్డ్‌తో చెల్లింపులు చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ వర్తకులు ఈ కార్డ్‌ను ఆమోదిస్తారు. విమాన టికెట్ బుకింగ్‌లు, హోటల్ బుకింగ్, డైనింగ్, ఆఫ్‌లైన్, ఆన్లైన్ షాపింగ్‌కు వాడుకోవచ్చు. ► ఫారెక్స్ కార్డ్‌తో ఏ దేశంలో ఏటీఎం నుంచి అయినా ఆ దేశ కరెన్సీని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఏటీఎం లొకేషన్ ఆధారంగా ఏ దేశంలో ఉన్నారనేది కార్డ్ నెట్వర్క్ గుర్తిస్తుంది. సంబంధిత దేశ కరెన్సీని అందిస్తుంది. ► ఫారెక్స్ కార్డ్‌లలో ఎంబెడెడ్ చిప్ టెక్నాలజీ ఉంటుంది. సున్నితమైన సమాచారం ఎన్క్రిపె్టడ్గా ఉండటంతో మోసాల రిస్క్ చాలా తక్కువ. ► ఇవి కనీసం ఐదేళ్ల ఎక్స్పైరీ తేదీతో వస్తాయి. ► ఒక దేశానికి వెళుతూ కొంత బ్యాలన్స్‌ను లోడ్ చేసుకున్న తర్వాత, చివరికి మిగులు ఉందనుకోండి.. ఆ తర్వాత ఆ బ్యాలన్స్‌ను ఏ దేశంలో అయినా వినియోగించుకోవచ్చు. ► మల్టీ కరెన్సీ ఫారెక్స్ కార్డ్‌ల్లో 16–22 దేశాల కరెన్సీలను లోడ్ చేసుకోవచ్చు. ఫీజులు/చార్జీలు.. కార్డ్ జారీ చేసే సంస్థ ఆధారంగా ఫీజులు, చార్జీలు వేర్వేరుగా ఉంటాయి. సింగిల్ కరెన్సీ కార్డ్‌తో పోలిస్తే మల్టీ కరెన్సీ కార్డ్ చార్జీలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. కార్డు కోసం దరఖాస్తు చేసినప్పుడు ఇష్యూయన్స్ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది రూ.100–500 మధ్య ఉంటుంది. రీలోడ్, రెన్యువల్ చార్జీలు కూడా చెల్లించుకోవాలి. కార్డులో కరెన్సీని లోడ్ చేసిన ప్రతిసారీ రీలోడ్ చార్జీ పడుతుంది. అదనపు కార్డ్ కావాలంటే యాడాన్ కార్డ్ తీసుకోవచ్చు. దీనికి విడిగా ఫీజు పడుతుంది. కార్డులో బ్యాలన్స్‌ను నగదు రూపంలో తీసుకున్న సందర్భంలోనూ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. విదేశాల్లో కార్డ్ నుంచి నగదు తీసుకున్న ప్రతి సారీ చార్జీ విధిస్తారు. కార్డ్ బ్యాలన్స్ చెక్ చేసుకున్నా కూడా చార్జీ పడుతుంది. మీరు చెల్లింపులు చేసిన కరెన్సీ, కార్డ్‌లో లోడ్ అయి ఉన్న కరెన్సీ వేర్వేరు అయితే అప్పుడు క్రాస్ కరెన్సీ చార్జీ చెల్లించాల్సి వస్తుంది. ఇది 3.5 శాతం వరకు ఉంటుంది. అదే మలి్టపుల్ కరెన్సీ కార్డులో ఈ సమస్య ఉండదు. కార్డ్‌ను కోల్పోయి, తిరిగి తీసుకుంటే అప్పుడు కూడా చార్జీ పడుతుంది. వీటిని గుర్తు పెట్టుకోవాలి.. ► ప్రతి లావాదేవీ అనంతరం కార్డ్ బ్యాలన్స్ చెక్ చేసుకోవాలి. ► ఫారెక్స్ కార్డ్ ఎక్కడైనా పొగొట్టుకుంటే లేదా చోరీకి గురైనా వెంటనే బ్యాకప్ కార్డ్ తీసుకోవాలి. ► ప్రతీ పర్యటనకు ముందు ఏటీఎంకు వెళ్లి పిన్ మార్చుకోవాలి. ► ఫారెక్స్ కార్డ్‌ను విదేశాల్లో ఇల్లు, కారు, రూమ్ రెంటల్స్‌కు వినియోగించుకోవద్దు. ► కార్డ్‌లో లోడ్ చేసిన కరెన్సీ కాకుండా, మరో కరెన్సీలో చెల్లింపులు చేయకుండా ఉండడమే మంచిది. దీనివల్ల అనవసర వ్యయాలను నివారించుకోవచ్చు. ► టోల్ చార్జీలు చెల్లించేందుకు సైతం ఫారెక్స్ కార్డ్‌ను వాడుకోవద్దు. ► కొన్ని బ్యాంక్‌లు తక్కువ మార్కప్, లోడింగ్ చార్జీతో క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నాయి. వీటిపై రివార్డులను పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఇవి కూడా ఆకర్షణీయంగానే కనిపిస్తాయి. కానీ, అన్నీ తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. దరఖాస్తుకు ముందు.. ఫారెక్స్ కార్డ్ తీసుకునే ముందు వివిధ బ్యాంకులు ఆఫర్ చేస్తున్న పలు రకాల కార్డ్‌లు, వాటిల్లోని ఫీచర్లను పూర్తిగా తెలుసుకోవాలి. చార్జీల గురించి అడిగి తెలుసుకోవాలి. బ్యాంక్‌లు, పెద్ద ఆరి్థక సంస్థలు, ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీల నుంచి ఈ కార్డ్ తీసుకోవచ్చు. బ్యాంకు శాఖకు వెళ్లి లేదంటే ఆన్లైన్ నుంచి అయినా కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దాదాపు అన్ని సంస్థలు ఒకటికి మించిన కార్డ్‌లను వివిధ రకాల ఫీచర్లతో ఆఫర్ చేస్తున్నాయి. కార్డ్ తీసుకునేందుకు కొన్ని రకాల డాక్యుమెంట్లను సమరి్పంచాల్సి ఉంటుంది. దరఖాస్తుతోపాటు పాస్‌పోర్ట్ కాపీ (స్వయంగా అటెస్ట్ చేసింది), వీసా కాపీ, ఎయిర్‌లైన్ టికెట్ కాపీ, పాన్ కార్డ్ కాపీ ఇవ్వాల్సి వస్తుంది. డెబిట్ కార్డ్ మాదిరే ఫారెక్స్ కార్డుకు అనుబంధంగా పిన్ వస్తుంది. దీన్ని మొదటిసారి మార్చుకోవాలి. కార్డు జారీ చేసిన బ్యాంక్ ఏటీఎంకు వెళ్లి బ్యాలన్స్ చెక్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి కూడా ఈ సదుపాయం ఉంది. ప్రతి లావాదేవీ అనంతరం వచ్చే ఎస్ఎంఎస్ను చూసి తెలుసుకోవచ్చు. -
ఎగుమతిదార్లకు ‘రేజర్‌పే’ ఖాతా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫిన్‌టెక్ కంపెనీ రేజర్‌పే తాజాగా మనీసేవర్ ఎక్స్పోర్ట్ అకౌంట్ సేవలను ప్రారంభించింది. ఎగుమతిదార్లు అంతర్జాతీయంగా జరిపే నగదు లావాదేవీల చార్జీలపై 50 శాతం వరకు పొదుపు చేయవచ్చని కంపెనీ తెలిపింది. ‘చిన్న, మధ్య తరహా ఎగుమతిదార్లు తమకు నచి్చన దేశంలో ఖాతాను తెరవడానికి, అలాగే రేజర్‌పే ప్లాట్‌ఫామ్ ద్వారా స్థానికంగా చెల్లింపులను స్వీకరించడానికి కంపెనీ సహాయం చేస్తుంది. తద్వారా చార్జ్బ్యాక్స్, ట్రాన్స్ఫర్ ఖర్చులను నివారించవచ్చు’ అని రేజర్‌పే వెల్లడించింది. మనీసేవర్ ఎక్స్పోర్ట్ అకౌంట్‌తో 160 దేశాల నుండి బ్యాంకుల ద్వారా నగదును స్వీకరించడానికి ఎగుమతిదారులకు వీలు కలుగుతుంది. అన్ని చెల్లింపులు ఎల్రక్టానిక్ ఫారెన్ ఇన్వార్డ్ రెమిటెన్స్ స్టేట్మెంట్తో వస్తాయని కంపెనీ తెలిపింది. ఇప్పటికే 10,000 పైచిలుకు మంది ఎగుమతిదార్లకు ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని రేజర్‌పే చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రాహుల్ కొఠారి చెప్పారు. -
టీసీఎస్: క్రెడిట్ కార్డు వినియోగదారులకు భారీ ఊరట
కొత్త టాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ (టీసీఎస్) రేటు అమలుపై కేంద్రం వినియోగదారులకు భారీ ఊరటనిచ్చింది. టీసీఎస్‌కు సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జులై 1 నుంచి అమల్లోకి రావాల్సిన టీసీఎస్ రేట్ల అమలును మరో 3 నెలలు వాయిదా వేసింది. అలాగే ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డులతో విదేశాల్లో చేసే వ్యయాలపై టీసీఎస్ లేదని పేర్కొంది. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ జూన్ 30, 2023న వివరణాత్మక మార్గదర్శకాలను విడుదల చేసింది. అలాగే ఎల్ఆర్ఎస్ పరిధి దాటితే చెల్లించాల్సిన కొత్త రేట్లు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. (ఆధార్-ప్యాన్ లింక్ చేశారుగా? ఐటీ శాఖ కీలక ప్రకటన) కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త సవరణ ప్రకారం తదుపరి ఆర్డర్ వరకు విదేశాల్లో ఉన్నప్పుడు అంతర్జాతీయ క్రెడిట్ కార్డ్ ద్వారా చేసే ఖర్చుపై టీసీఎస్ వర్తించదు. అలా అంతర్జాతీయ క్రెడిట్ కార్డ్‌ల వినియోగంపై వివాదానికి స్వస్తి పలికింది. అలాగే రిజర్వ్ బ్యాంక్ సరళీకృత చెల్లింపు పథకం (ఎన్ఆర్ఎస్) నిర్వహించే అన్ని లావాదేవీలకు టీసీఎస్ రేట్లలో ఎలాంటి మార్పు ఉండదు. విదేశీ టూర్ ప్యాకేజీలకూ ఏడాదికి రూ. 7 లక్షల వరకు ఎలాంటి టీసీఎస్ ఉండదు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎల్ఆర్ఎస్ కింద రూ. 7 లక్షలకు మించిన టీసీఎస్ చెల్లింపులు 30 సెప్టెంబర్ 2023 తరువాత చేస్తే (ఒక్క విద్య తప్ప, మిగతా ప్రయోజనంతో సంబంధం లేకుండా) 0.5 శాతం రేటు వర్తిస్తుంది. (గుడ్‌న్యూస్: ఇక బ్యాంకుల్లోనూ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్) ఎల్ఆర్ఎస్ కింద ఎవరైనా ఒక ఆర్థిక సంవత్సరంలో 2,50,000 డాలర్ల వరకు డబ్బులు విదేశాలకు పంపొచ్చు. ట్రావెల్, బిజినెస్ ట్రిప్స్, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లడం, మెడికల్ అవసరాలు, విద్యా, డొనేషన్, బహుమతులు, వలస పోవడం, బంధువుల మెయింటెనెన్స్ లాంటి చెల్లింపులు చేయవచ్చు. ఇంతకుమించి పంపాలంటే ఆర్బీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. (ధోనీ ఎంత పని చేశాడు: సత్య నాదెళ్ల ‘క్రష్’ కూడా అదేనట!) -
ఆకర్షణ కోల్పోతున్న డెబిట్ కార్డు.. దూసుకుపోతున్న క్రెడిట్ కార్డు!
న్యూఢిల్లీ: డెబిట్ కార్డ్ ఇప్పుడు తన ఆకర్షణ కోల్పోతోంది. దీని స్థానంలో క్రెడిట్ కార్డు ఆకర్షణీయంగా మారుతోంది. డెబిట్ కార్డు బదులు క్రెడిట్ కార్డుతో చెల్లింపుల లావాదేవీలు నిర్వహించడానికే ఎక్కువ మంది ప్రజలు మొగ్గు చూపిస్తున్నట్టు ఆర్బీఐ గణాంకాలు తెలియజేస్తున్నాయి. దశాబ్దం క్రితం డెబిట్ కార్డులే చెల్లింపుల్లో సింహ భాగం వాటా కలిగి ఉంటే, నేడు క్రెడిట్ కార్డులు ఎక్స్‌ప్రెస్ వేగంతో ఎక్కువ మంది వినియోగదారులను చేరుకుంటున్నాయి. కార్డుతో చెల్లించినప్పటికీ, 45 రోజుల వరకు ఆ బకాయి తీర్చేందుకు వ్యవధి ఉండడం, చెల్లింపులపై రివార్డులు ఆకర్షణీయమని చెప్పుకోవాలి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో డెబిట్ కార్డుల ద్వారా 22 కోట్ల మర్చంట్ (వర్తకులు) చెల్లింపులు నమోదు అయితే, అదే నెలలో క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపుల లావాదేవీలు 25 కోట్లుగా ఉన్నాయి. కానీ, విలువ పరంగా చూస్తే.. ఏప్రిల్ నెలలో క్రెడిట్ కార్డుల ద్వారా రూ.1.3 లక్షల కోట్ల విలువైన చెల్లింపుల జరిగితే, డెబిట్ కార్డుల లావాదేవీల విలువ ఇందులో సగానికంటే తక్కువ రూ.53,000 కోట్లుగానే ఉంది. ఇవన్నీ కూడా ఈ–కామర్స్, భౌతిక దుకాణాల్లో చేసిన లావాదేవీలు కావడం గమనార్హం. మరీ ముఖ్యంగా గడిచిన ఏడాది కాలంలో క్రెడిట్ కార్డుల స్వైప్ (చెల్లింపు)లు 20 శాతం పెరగ్గా, డెబిట్ కార్డు స్వైప్‌లు 31 శాతం క్షీణించాయి. ఫిన్‌టెక్‌ల మద్దతు స్టార్టప్‌లు, ఫిన్‌టెక్ సంస్థలు కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను తీసుకురావడానికి ప్రాధాన్యం చూపిస్తున్నాయి. మింత్రా కోటక్ మహీంద్రా బ్యాంకుతో, పేటీఎం ఎస్బీఐ కార్డ్‌తో కలసి ఇటీవలే క్రెడిట్ కార్డును తీసుకొచ్చాయి. పతంజలి ఆయుర్వేద్ సంస్థ ప్రభుత్వరంగ పీఎన్బీ బ్యాంక్‌తో కలసి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డు తీసుకురావడం గమనార్హం. ఇలా పెద్ద సంస్థలన్నీ ఇదే బాటలో నడుస్తున్నాయి. ‘‘వస్త్రాలను విక్రయించే పెద్ద మార్కెట్‌ప్లేస్‌కు అమ్మకాలపై ఎంతలేదన్నా 50–60 శాతం లాభాల మార్జిన్ ఉంటుంది. దీంతో అవి తమ కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డు కస్టమర్లకు 10 శాతం డిస్కౌంట్ ఇవ్వగలవు. తద్వారా కస్టమర్ల విశ్వసనీయతను చూరగొనవు’’అని ఓ ఫిన్‌టెక్ సంస్థ ఉన్నతోద్యోగి తెలిపారు. బ్యాంకులు క్రెడిట్ కార్డు మార్కెట్లో వాటా పెంచుకోవాలనే పట్టుదలతో ఉన్నాయి. కానీ, అది వాటికి పెద్ద సవాలుగా మారింది. బ్యాంకు శాఖ తరఫున ఒక్క క్రెడిట్ కార్డు కస్టమర్‌ను పొందేందుకు అవి రూ.2,000ను ఖర్చు చేయాల్సి వస్తోంది. దీనితో పోలిస్తే కో బ్రాండెడ్ ఒప్పందం ద్వారా అయితే తక్కువ ఖర్చులోనే ఎక్కువ కస్టమర్లను చేరుకోవడం వాటిని ఆ దిశగా దృష్టి సారించేలా చేస్తోంది. అందుకే అవి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు, ప్ర ముఖ ఫిన్‌టెక్‌లు, కన్జ్యూమర్ కంపెనీలతో టైఅప్ కోసం కృషి చేస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో, అమెజాన్ ఐసీఐసీఐ బ్యాంక్ సాయంతో కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను మార్కెట్ చేస్తుండడం గమనార్హం. పరిశ్రమ వ్యాప్తంగా క్రెడిట్ కార్డు యాక్టివిటీ రేటు 50 శాతంగా ఉంటే, అమెజాన్ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్‌కార్డులో ఇది 70 శాతంగా ఉన్నట్టు అమెజాన్ పే ఇండియా హోల్‌టైమ్ డైరెక్టర్ వికాస్ బన్సాల్ తెలిపారు. యూపీఐ ప్రభావం.. డెబిట్ కార్డుల వినియోగం తగ్గడానికి క్రెడిట్ కార్డులే కాకుండా, యూపీఐ చెల్లింపుల గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. దాదాపు అన్ని దుకాణాల్లోనూ యూపీఐ యాప్‌ల ద్వారా చెల్లింపులు చేసే సౌలభ్యం ఉండడంతో డెబిట్ కార్డు ప్రాధాన్యం తగ్గింది. మే నెలలో 536 కోట్ల యూపీఐ మర్చంట్ లావాదేవీలు నమోదయ్యాయి. ఏడాది క్రితం ఇదే నెలలో ఉన్న 254 కోట్ల లావాదేవీలతో పోలిస్తే రెట్టింపయ్యాయి. ఇప్పుడు అన్ని చెల్లింపుల సాధనాల్లోనూ యూపీఐ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత క్రెడిట్ కార్డు చెల్లింపులకే వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 8.5 కోట్ల క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఏడాది క్రితం వీటి సంఖ్య 7.5 కోట్లు. మూడేళ్ల క్రితం 5 కోట్ల కంటే తక్కువే ఉన్నాయి. ‘‘యూపీఐ మాదిరిగా కాకుండా క్రెడిట్ కార్డు అనేది మొత్తం ఎకోసిస్టమ్‌లో ఉన్న అందరికీ ఆదాయాన్నిచ్చే సాధనం. సాధారణంగా అధిక విలువ కొనుగోళ్లకు, వినియోగ చెల్లింపులకు దీన్ని స్వైప్ చేస్తుంటారు’’అని ఓ బ్యాంకర్ తెలిపారు. -
వారికి గుడ్‌న్యూస్ చెప్పిన ఎలాన్ మస్క్: ఇక డబ్బులే డబ్బులు!
సాక్షి,ముంబై: ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ గుడ్ న్యూస్ చెప్పారు. వెరిఫైడ్ కంటెంట్ క్రియేటర్స్‌కు డబ్బులు చెల్లించనున్నట్టు వెల్లడించారు. కంటెంట్‌లో డిస్ప్లే అయ్యే యాడ్స్ ఆధారంగా ఈ చెల్లింపులు చేయనున్నట్టు మస్క్ ట్విటర్ ద్వారా ప్రకటించారు. రానున్న కొద్ది వారాల్లో ఈ చెల్లింపులను మొదలు పెడతామని మస్క్ తెలిపారు. అయితే ధృవీకరించబడిన వినియోగదారులను మాత్రమే పరిగణనలోకి తీసుకోనున్నామని మస్క్ స్పష్టం చేశారు. ఈ చెల్లింపుల నిమిత్తం సుమారు రూ. 41.2 కోట్లు (5 మిలియన్ డాలర్లు) కేటాయించినట్టు తెలిపారు. మస్క్ తాజా నిర్ణయం ప్రకారం యూట్యూబర్స్ మాదిరిగా ట్వీపుల్ కూడా తమ కంటెంట్‌లో రిప్లై సెక్షన్లో డిస్ప్లే అయ్యే యాడ్స్ ప్రకారం డబ్బులు సంపాదించవచ్చు. (1200 లోన్‌తో మొదలై.. రూ 2.58 లక్షల కోట్లకు) కాగా గత ఏడాది అక్టోబర్‌లో ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుండి, ప్రకటనదారులనుంచి పెనుసవాళ్లను ఎదుర్కొంటోంది ట్విటర్. మరోవైపు ట్విటర్ సీఈవోగా అడ్వర్టైజింగ్ ప్రొఫెషనల్ లిండా యాకారినో పదవి చేపట్టిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం ప్రకటనల పరిశ్రమలో ఆమెకున్న విస్తృతమైన నేపథ్యం , సరికొత్త వ్యూహాలతో భారీ ఆదాయ సమకూరనుందని అంచనా. (డిజిటల్ చెల్లింపుల్లో ఇండియా రికార్డ్: విశేషం ఏమిటంటే!) In a few weeks, X/Twitter will start paying creators for ads served in their replies. First block payment totals $5M. Note, the creator must be verified and only ads served to verified users count. — Elon Musk (@elonmusk) June 9, 2023 -
ఒడిశా విషాదం:పేటీఎం కీలక నిర్ణయం..నెటిజన్ల ప్రశంసలు
డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం ఒడిశా రైలు ప్రమాదంలో బాధితుల సహాయార్థం కీలక నిర్ణయం తీసుకుంది. పేటీఎం ద్వారా యూజర్లు అందించిన విరాళాలకు సమాన మొత్తంలో తాను కూడా చెల్లించ నుంది. ప్రమాదంలో బాధితులకు, వారి కుటుంబాలకు సాయం అందించేందుకు ఈ సొమ్మును వినియోగించనున్నారు. (జెరోధా ఫౌండర్, బిలియనీర్ నిఖిల్ కామత్ సంచలన నిర్ణయం) ఈ మేరకు పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ ప్రతిజ్ఞ చేశారు. వినియోగదారులు చెల్లించిన ప్రతీ రూపాయిక మరో రూపాయి జోడించి.. ఇలా సేకరించిన నిధులను ఒడిశా ముఖ్యమంత్రి సహాయనిధి బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేస్తామని ప్రకటించారు. "విరాళం ఇచ్చిన మొత్తంపై 80జీ పన్ను మినహాయింపు పొందవచ్చు. Paytm యాప్‌లోని 'ఆర్డర్ & బుకింగ్స్' విభాగం నుండి రసీదులను డౌన్లోడ్ చేసుకోవచ్చు అని కంపెనీ తెలిపింది. దీంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే తమ డొనేష్లనకుసంబంధించిన స్క్రీన్షాట్లను ట్విటర్లో పోస్ట్ చేశారు. (రూ. 4.95 లక్షల కోట్ల సామ్రాజ్యానికి వారసుడు, మాజీ క్రికెటర్ ఎవరో తెలుసా? ) ఇదీ చదవండి: నీతా అంబానీ ఔదార్యం: బాధితులకు భారీ సాయం Help the victims of the Odisha train tragedy 🙏 Paytm Foundation will match your contribution ₹ to ₹. A small donation can make a big difference❤️ Donate now on Paytm App: https://t.co/av9bdffnwS — Paytm (@Paytm) June 6, 2023 కాగా జూన్ 2న జరిగిన ప్రమాదంలో దాదాపు 288 మంది చనిపోయారని ఒడిశా ప్రభుత్వం తాజాగా ధృవీకరించింది. ఇంకా కొన్ని మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. దాదాపు 1,100 మంది గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తప్పిపోయిన వ్యక్తుల ఆచూకీ కోసం ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. Contribute to Odisha Train tragedy victims through Paytm. We will match all your contributions ₹ to ₹. Thanks for your contributions 🙏🏼 https://t.co/QTQM1LhS4H — Vijay Shekhar Sharma (@vijayshekhar) June 5, 2023 -
‘హిందూజకు చెల్లింపుల విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోంది’
సాక్షి, విజయవాడ: హిందూజ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎలాంటి ప్రగతి చూపకున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థకు ఉచితంగా డబ్బులిస్తోందని గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమని, అపోహలేనని ఇంధనశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల, విద్యుత్ పంపిణీ సంస్థల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని న్యాయ నిఫుణుల సలహా, సూచనల మేరకు పారదర్శకతతో, ప్రణాళికాబద్ధంగా, చట్టం ప్రకారం, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఎలక్ట్రిసిటీ రెగ్యులరేటరి కమిషన్ ఆదేశాలనుసారం, న్యాయశాఖ పరిశీలించి ధృవీకరించిన తర్వాతే హిందూజ సంస్థకు చెల్లింపుల విషయంలో నిర్ణయం తీసుకుందన్న విషయాన్ని విజయానంద్ స్పష్టం చేశారు. కాగా, శుక్రవారం విజయవాడలోని విద్యుత్ సౌధ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయానంద్ మాట్లాడుతూ.. హిందూజ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్‌కు సంబంధించిన పలు వాస్తవాలను ప్రజల దృష్టికి తెచ్చేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఏదైనా ఒక విద్యుత్ కొనుగోలు సంస్థతో ఒప్పందం చేసుకున్నప్పుడు ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరి చట్టాలు, నిబంధనలు, పవర్ పర్చేజ్ ఒప్పందం ప్రకారం ఆ ఒప్పందం గడువు పూర్తవ్వక ముందే విద్యుత్ సరఫరా కొనుగోలు చేయమని చెప్పిన పక్షంలో సాధారణంగా ఫిక్స్డ్ ఛార్జీలు, వేరియబుల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. పీపీఏ ఉన్నంత వరకు విద్యుత్ తీసుకున్నా, తీసుకోకపోయినా ఫిక్స్డ్ ఛార్జీలు తప్పక చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్‌కు ప్రభుత్వం డబ్బులు కట్టిందన్న మాటలు అవాస్తవమని, నిరాధారమని స్పష్టం చేశారు. మార్చి 2022 తర్వాత హిందూజ సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వం 1040 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసిందన్నారు. అంతేగాక రాష్ట్రానికి అదనంగా 15 మిలియన్ యూనిట్లు విద్యుత్ సరఫరా అవుతోందని విజయానంద్ తెలిపారు. హిందూజ సంస్థతో ప్రస్తుత ప్రభుత్వం ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా కొందరు దుష్ప్రచారం చేయడం తగదన్నారు. హిందూజ సంస్థతో 1994లోనే ఒప్పందం కుదిరిన విషయాన్ని గుర్తుచేశారు. ఇక, ఈ సమావేశంలో ఇంధన శాఖ జాయింట్ సెక్రటరీ బీఏవీపీ కుమార్ రెడ్డి, ఏపీసీపీడీసీఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జె.పద్మ జనార్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: ఎంపీ అవినాష్ రెడ్డి తల్లిదండ్రులిద్దరికీ అస్వస్థత -
అలర్ట్: ‘ఫోన్‌పే’లో అందుబాటులోకి వచ్చిన ఫీచర్ ఏంటో తెలుసా?
ప్రముఖ దేశీయ ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్‌పే యూపీఐ పేమెంట్ కోసం లైట్ పేమెంట్స్ ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ వల్ల రూ.200 లోపు చిన్న చిన్న లావాదేవీల కోసం ఎలాంటి పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. ఇప్పటికే ఫోన్‌పే ప్రత్యర్ధి సంస్థ పేటీఎం ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో యూపీఐ లైట్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ఫోన్‌పే సైతం ఈ సరికొత్త సేవల్ని వినియోగించేలా యూజర్లకు అవకాశం కల్పించింది. చిన్న చెల్లింపుల కోసం ముందుగానే యూపీఐ లైట్లో రూ.2,000 వరకు జమ చేసుకోవచ్చని ఫోన్‌పే తెలిపింది. ఫలితంగా బ్యాంకు ఖాతాతో సంబంధం లేకుండా వేగంగా చెల్లింపులు పూర్తవుతాయి. చెల్లింపులు జరిగే సమయంలో ఎలాంటి అవాంతరాలు ఉండవని వెల్లడించింది. అన్నీ బ్యాంకుల సపోర్ట్ ఫోన్‌పే యూపీఐ లైట్‌కు దేశంలో అన్నీ బ్యాంకుల్లో వినియోగించుకోవచ్చని ఆ సంస్థ సీఈవో సమీర్ నిఘమ్ చెప్పారు. యూపీఐ మర్చంట్, క్యూఆర్ కోడ్ చెల్లింపులకు అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్యాంక్ స్టేట్మెంట్తో పనిలేదు వీటితో పాటు యూపీఐ లైట్ వినియోగంతో ఆయా ట్రాన్సాక్షన్లపై యూజర్లకు మెసేజ్ అలెర్ట్ వెళ్లనుంది. యూజర్లు ఏ రోజు ఎన్ని లావాదేవీలు జరిపారో తెలుసుకునేందుకు వీలుగా ట్రాన్సాక్షన్ హిస్టరీ చూడొచ్చు. దీనికి సంబంధించి మెసేజ్ అలెర్ట్ పొందవచ్చు. తద్వారా చెల్లింపులపై బ్యాంక్ స్టేట్మెంట్, పాస్‌బుక్ అవసరం తీరిపోనుందని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. చెల్లింపుల్ని సులభతరం చేసేందుకే అయితే ఈ యూపీఐ లైట్ ఫీచర్ ద్వారా దేశంలో ప్రతి రోజు జరిగే చిన్న చిన్న లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకు ఫోన్‌పేలో ఈ కొత్త ఆప్షన్‌ను అభివృద్ది చేసినట్లు ఫోన్‌పే కో- ఫౌండర్, సీటీవో రాహుల్ చారి చెప్పినట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఎన్సీపీఐ నిర్ణయం.. యూపీఐ లైట్‌కి ఊతం ఇటీవల కాలంలో ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలలో జరిపే లావాదేవీల సమయంలో నెట్వర్క్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఈ సమస్యను అధిగమించేలా గత ఏడాది డిసెంబర్లో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ (ఎన్సీపీఐ) నెట్వర్క్ లేకపోయినా రూ.200 లోపు చిన్న చిన్న లావాదేవీలు జరిపేలా అనుమతిచ్చింది. చదవండి👉 కొనసాగుతున్న తొలగింపులు.. దిగ్గజ ఐటీ కంపెనీలో 600 మందిపై వేటు! -
తెలుగు రాష్ట్రాల్లో అటవీ సందర్శకులకు గుడ్ న్యూస్..
తెలుగు రాష్ట్రాల్లో అటవీ ప్రాంతాలను సందర్శించే వారి కోసం ఎన్హెచ్ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో విస్తరించి ఉన్న నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ అధికారులు, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) అనుబంధ సంస్థ ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ తాజాగా ఒప్పందం చేసుకున్నాయి. రెండు సంస్థల మధ్య కుదిరిన ఈ అవగాహన ఒప్పందం అటవీ ప్రాంతంలోకి వాహనాలు ప్రవేశించే ప్రక్రియను సులభతరం చేయడానికి మార్గం సుగమం చేస్తుందని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం.. ఫారెస్ట్ ఎంట్రీ పాయింట్ల వద్ద ఫాస్ట్‌ట్యాగ్ ఆధారిత చెల్లింపు వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. టైగర్ రిజర్వ్‌లోని వివిధ ప్రవేశ ద్వారాల వద్ద వసూలు చేసే ఎకోసిస్టమ్ మేనేజ్మెంట్ కోఆర్డినేషన్ (ఈఎంసీ) రుసుమును ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా వసూలు చేయనున్నారు. ఫారెస్ట్ ఎంట్రీ పాయింట్ల వద్ద ఫాస్ట్‌ట్యాగ్ ఆధారిత చెల్లింపులను ప్రారంభించడం వల్ల వాహనాల సుదీర్ఘ క్యూలు, జాప్యాలను నివారించవచ్చు. తద్వారా సందర్శకులు అటవీ ప్రాంతాలలోని అందాలను, ఆహ్లాదకర వాతావరణాన్ని, వన్యప్రాణులను ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆస్వాదించవచ్చు. టోల్ ప్లాజాల వద్ద ఆటోమేటిక్ టోల్ చెల్లింపుల కోసం ఎన్హెచ్ఏఐ ఫాస్ట్‌ట్యాగ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ సాంకేతికత ఆధారంగా పనిచేస్తుంది. దేశంమంతటా అన్ని ఫోర్-వీలర్లు, భారీ వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి. -
జీపే యూజర్లకు భారీగా క్యాష్‌బ్యాక్ సంచలనం: మీ రివార్డ్స్ చెక్ చేసుకోండి!
సాక్షి, ముంబై: ఆన్లైన్ చెల్లింపుల సంస్థ గూగుల్ పే ద్వారా కొంతమంది వినియోగదారులకు మనీ క్రెడిట్ అవ్వడం సంచలనంగా మారింది. కొంతమంది జీపే వినియోగదారుల ఖాతాల్లో అనూహ్యంగా ఏకంగా రూ. 88,000 వరకు జమ అవ్వడం కలకలం రేపింది. అయితే కంపెనీ వెంటనే లోపాన్ని గుర్తించి, క్రెడిట్ చేసిన మొత్తాలను సాధ్యమైన చోట వెనక్కి తీసుకుందిట. ఈ వార్త గుప్పుమనడంతో చాలామంది తమ ఖాతాలో ఏంత జమ అయిందా అని తెగ వెదికేశారట. అయితే ఇది అమెరికాలో జరిగిన పరిణామం మాత్రమే. భారతీయ వినియోగదారులకు ఇలాంటి క్రెడిట్స్ కు ఏ రకమైన సంబంధం లేదని గూగుల్ తెలిపింది. గూగుల్ పే యూజర్లకు స్క్రాచ్ కార్డ్స్ ద్వారా మహా అయితే రూ. 6 క్యాష్‌బ్యాక్ రివార్డ్స్ రావడమే గొప్ప. సాధారణంగా బెటర్ లక్ నెక్ట్స్ టైం అనే సందేశం ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటిది తాజాగా గూగుల్ పే యూజర్ల అకౌంట్లలోకి రూ.80 వేల వరకు ట్రాన్స్ఫర్ కావడంతో యూజర్లు గందరగోళంలో పడిపోయారు. గూగుల్ పే లో సాంకేతిక లోపం కారణంగానే ఈ పరిణామం చోటు చేసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా "డాగ్ఫుడింగ్" అనే ఫీచర్ పరీక్షిస్తున్న సమయంలో ఈ పొరబాటు దొర్లినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. కంపెనీ కొత్త ఫీచర్ టెస్టింగ్ సందర్భంగా తమ ఉద్యోగులకు చెల్లించే బదులు అనుకోకుండా నగదును కొంతమంది యూజర్లకు పంపించినట్టు సమాచారం. Uhhh, Google Pay seems to just be randomly giving users free money right now. I just opened Google Pay and saw that I have $46 in "rewards" that I got "for dogfooding the Google Pay Remittance experience." What. pic.twitter.com/Epe08Tpsk2 — Mishaal Rahman (@MishaalRahman) April 5, 2023 దీంతో పొరపాటున తమకు భారీగా డబ్బులు వచ్చినట్టు మిషాల్ రెహమాన్ అనే జర్నలిస్ట్ సహా కొంతమంది రెడిట్ యూజర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒక్కొక్కరికి 10 డాలర్ల నుంచి 1000 డాలర్ల వరకు జమ అయిందట.అయితే ఎంతమంది వినియోగదారుకు ఈ క్రెడిట్ లభించింది అనేది అస్పష్టం. అలాగే ఈ నగదు జమ గూగుల్ పిక్సెల్ వినియోగదారులకు పరిమితమైందా? లేక ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లనుకూడా ప్రభావితం చేసిందా అనేది కూడా స్పష్టత లేదు. ఈ విషయంలో కొంత మంది యూజర్లను మెయిల్ ద్వారా సంప్రదించింది గూగుల్. వీలైనంత సొమ్మును వెనక్కి తీసుకుంది. అంతేకాదు సంబంధిత క్రెడిట్‌ను యూజర్లు వాడేసినా, వేరే ఖాతాకు ట్రాన్స్ఫర్ చేసేసినా, తాము రివర్స్ చేయలేకపోతే, ఇక ఆ డబ్బు మీదే.. తదుపరి చర్యలు అవసరం లేదని కూడా గూగుల్ పేర్కొంది. మరోవైపు ఈ వ్యవహారంపై ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ కూడా ‘నైస్’ అంటూ వ్యంగ్యంగా స్పందించడం విశేషం. -
రిటైరైనా ‘సెటిల్మెంటు’ జరగదాయె!
సాక్షి, హైదరాబాద్: సర్వీసులో ఉన్నంత కాలం ప్రతినెలా జీతం నుంచి సంస్థ మినహాయిస్తూ వచ్చి న సొమ్ముల కోసం ఇప్పుడు వందలాది మంది ఆర్టీసీ పూర్వ ఉద్యోగులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఆర్టీసీ సహకార పరపతి సంఘం(సీసీఎస్)లో డిపాజిట్ అయి ఉన్న ఆ మొత్తాన్ని ఆర్టీసీ వినియోగించుకోవటంతో ఈ దుస్థితి తలెత్తింది. ఆ ర్టీసీలో ఉద్యోగులు ప్రతినెలా 7 శాతం తమ జీతం నుంచి మినహాయించి సహకార పరపతి సంఘంలో డిపాజిట్ చేస్తారు. ప్రస్తుతం సీసీఎస్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. దాని నిధులను ఆర్టీసీ వాడేసుకుని ఖాళీ చేయటంతో సీసీఎస్ భవితవ్యమే గందరగోళమైంది. అయితే ఇప్పటివరకు సీసీఎస్‌కు సంబంధించి మిగతా వ్యవహారాల్లో ప్రతిష్టంభన ఉన్నా.. రిటైరైన ఉద్యోగులకు సెటిల్మెంట్ల విషయంలో మాత్రం లోటు రానివ్వలేదు. కానీ గత ఆగస్టు నుంచి ఈ సెటిల్మెంట్ల విషయంలో కూడా ఆర్టీసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఆ నెల నుంచి పదవీ విరమణ పొందిన వారికి ఇప్పటి వరకు ఆ డిపాజిట్ మొత్తాలను ఇవ్వలేదని అంటున్నారు. సగటున ఒక్కో ఉద్యోగికి కనిష్టంగా రూ.6 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. అలా దాదాపు 500 మంది ఉద్యోగులకు ఈ మొత్తాన్ని చెల్లించలేదని చెబుతున్నారు. అధిక వడ్డీ ఆశతో.. సర్వి సులో ఉన్న ఉద్యోగులకు జీతాల నుంచి వచ్చే ఈ మొత్తమే చివరి వరకు ఆయువు పట్టు. అలా ప్రతినెలా జమ అయ్యే నిధులతోనే ఆ సంస్థ ఉద్యోగులకు రుణాలు ఇస్తుంది. ఆ డిపాజిట్ మొత్తాలపై అధిక వడ్డీని ఉద్యోగులకు చెల్లిస్తుంది. దీంతో చాలామంది మధ్యలో డిపాజిట్ మొత్తాన్ని తీసుకోకుండా పదవీవిరమణ వరకు అలాగే కొనసాగిస్తారు. కొందరైతే, రిటైర్ అయిన తర్వాత కూడా దాన్ని కొనసాగిస్తూ అధిక వడ్డీ పొందుతారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆగస్టు నుంచి ఆర్టీసీ సీసీఎస్‌కు పెద్దగా నిధులు విడుదల చేయకపోవటంతో పదవీవిరమణ పొందిన వారికి కూడా చెల్లించలేని దుస్థితి నెలకొంది. రిటైర్మెంట్ సెటిల్మెంట్లతో రకరకాల ప్రణాళికలు చేసుకుని, ఇప్పుడు ఆ మొత్తం అందని వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. -
సహారా కస్టమర్లకు గుడ్‌న్యూస్: ఇన్వెస్టర్లకు చెల్లింపులు
న్యూఢిల్లీ: సహారా గ్రూపునకు చెందిన నాలుగు కోపరేటివ్ (హౌసింగ్) సొసైటీల పరిధిలోని 10 కోట్ల మంది ఇన్వెస్టర్లకు, 9 నెలల్లోగా చెల్లింపులు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సెబీ వద్ద ఎస్క్రో ఖాతాలో సహారా గ్రూప్ డిపాజిట్ చేసిన రూ.24,000 కోట్ల నిధుల నుంచి రూ.5,000 కోట్లను సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోపరేటివ్స్కు బదిలీ చేయాలంటూ జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. (ఇదీ చదవండి: మీకీ విషయం తెలుసా? ఈ డెబిట్ కార్డ్‌పై: రూ. కోటి దాకా కవరేజ్) ఓ ప్రజాహిత వ్యాజ్యం విచారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థన మేరకు ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు రిటైర్ట్ జడ్జి ఆర్ సుభాష్ రెడ్డి చెల్లింపుల ప్రక్రియను పర్యవేక్షిస్తారని సుప్రీంకోర్టు తెలిపింది. పెద్ద ఎత్తున ప్రజల ప్రయోజనాలు ఇమిడి ఉండడంతో పిటిషనర్ల అభ్యర్థన సహేతుకంగా ఉందని కోర్టు అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చిందని కోపరేషన్ శాఖ ప్రకటన విడుదల చేసింది. (రెడ్మి 12సీ, రెడ్మి నోట్12 వచ్చేశాయ్! అందుబాటు ధరలే) -
సాధారణ యూపీఐ చెల్లింపులపై చార్జీలు ఉండవు..
న్యూఢిల్లీ: ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు జరిపే సాధారణ యూపీఐ చెల్లింపులపై ఎలాంటి చార్జీలు ఉండబోవని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) స్పష్టం చేసింది. ప్రీపెయిడ్ పేమెంట్ సాధానాల (పీపీఐ) ద్వారా జరిపే మర్చంట్ లావాదేవీలకు మాత్రమే ఇంటర్చేంజ్ చార్జీలు వర్తిస్తాయని, వాటికి సంబంధించి కస్టమర్లపై చార్జీల భారం ఉండబోదని ఒక ప్రకటనలో వివరించింది. ఇదీ చదవండి: కేజీ బేసిన్లో ఓఎన్జీసీ చమురు ఉత్పత్తి వాలెట్ల వంటి పీపీఐ సాధనాల ద్వారా రూ. 2,000కు మించి జరిపే చెల్లింపులపై 1.1 శాతం ఇంటర్చేంజ్ చార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, బ్యాంకులు, ప్రీపెయిడ్ సాధనాలు, వ్యాపారవర్గాలకు మాత్రమే ఇది పరిమితం కానున్నప్పటికీ దీనితో కస్టమర్లపై చార్జీల భారం పడనుందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎన్పీసీఐ తాజా వివరణ ఇచ్చింది. మరోమాటలో చెప్పాలంటే ఒక కంపెనీకి చెందిన వాలెట్ గల కస్టమరు మరో కంపెనీ వాలెట్ ఉన్న వర్తకులకు చెల్లింపులు జరిపినప్పుడు ఈ చార్జీలు వర్తిస్తాయి. రెండు వాలెట్ల మధ్య లావాదేవీలకు సంబంధించిన ఇంటర్చేంజ్ ఖర్చులను సర్దుబాటు చేసుకోవడానికి ఈ చార్జీలు సహాయపడతాయి. ప్రస్తుతం మొబైల్ వాలెట్ పేమెంట్ మార్కెట్లో ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటివి ప్రధాన సంస్థలుగా ఉన్నాయి. బ్యాంకు ఖాతా లేదా పీపీఐ/పేటీఎం వాలెట్ ద్వారా చెల్లింపులు జరిపినా ఏ కస్టమరుకూ ఎటువంటి చార్జీలు ఉండవని పేటీఎం తెలిపింది. -
ప్రభుత్వానికి వేదాంత షాక్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గుంప గుత్త లాభాల పన్ను (విండ్‌ఫాల్ ట్యాక్స్)కు నిరసనగా వేదాంత లిమిటెడ్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. తన గ్యాస్ క్షేత్రాల నుంచి ఆర్జించిన లాభంలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన 91 మిలియన్ డాలర్ల వాటాని (సుమారు రూ.773 కోట్లు) నిలిపివేసింది. జనవరి 31, ఫిబ్రవరి 20వ తేదీల్లో పెట్రోలియం, సహజవాయువు శాఖకు ఈ విషయమై వేదాంత సమాచారం కూడా ఇచ్చింది. స్థానికంగా (దేశీయంగా) ఉత్పత్తి అయ్యే చమురుపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ (ఎస్ఏఈడీ)ని కేంద్రం విధించింది. ఆరంభంలో టన్నుపై రూ.23,250 ప్రకటించగా (అంటే బ్యారెల్ చమురుపై 40 డాలర్లు).. ఆ తర్వాత టన్నుకు రూ.3,500కు తగ్గించింది. ఇది కాకుండా ఉత్పత్తి దారులు చమురు, గ్యాస్ రేటుపై ఆర్జించిన మొత్తంపైనా 10–20 శాతం రాయల్టీని చెల్లించాల్సి ఉంటుంది. వీటితోపాటు ఆదాయం నుంచి ఖర్చులను తీసివేసిన తర్వాత మిగిలిన లాభంలో ముందుగా నిర్ణయించిన మేరకు ప్రభుత్వం వాటా తీసుకోవచ్చు. ఇన్ని రకాలుగా ఉత్పత్తిదారులు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో వేదాంత రాజస్థాన్‌లోని బ్లాక్ ఉత్పత్తిపై ఈ ప్రత్యేక అదనపు ఎక్సైడ్ డ్యూటీ (ఎస్ఏఈడీ) చెల్లించేందుకు గాను 85.35 మిలియన్ డాలర్లు, కాంబే బేసిన్లో సీబీ–ఓఎస్/2 బ్లాక్‌కు సంబంధించి ఎస్ఏఈడీ కోసం 5.50 మిలియన్ డాలర్లను నిలిపివేసినట్టు పెట్రోలియం శాఖకు స్పష్టం చేసింది. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆర్థిక ప్రయోజనాలను పునరుద్ధరించేందుకే ఈ చర్య చేపట్టినట్టు వివరించింది. కేంద్రం విధించిన ఎస్ఏఈడీ, కాంట్రాక్టు ఒప్పందాలకు విరుద్ధమన్నది వేదాంత వాదనగా ఉంది. -
ట్విటర్ మాజీ సీఈవోపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన రిపోర్టు
న్యూఢిల్లీ: అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తన నెక్ట్స్ బాంబును ట్విటర్‌మాజీ సీఈవో జాక్ డోర్సేపై వేసింది. డోర్సే నేతృత్వంలోని చెల్లింపుల సంస్థ బ్లాక్ ఇంక్ భారీ అక్రమాలకు పాల్పడిందని గురువారం వెల్లడించింది. దీనికి సంబంధించిన రిపోర్ట్‌ను ట్విటర్ ఖాతాలో వెల్లడించింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ గురువారం ప్రకటించిన రిపోర్టులో జాక్ డోర్సే నేతృత్వంలోని బ్లాక్ సంస్థ అక్రమాలను బైట పెట్టింది. తమ రెండేళ్లలో పరిశోధనలో కీలక విషయాలను గుర్తించినట్టు షార్ట్ సెల్లర్ తన వెబ్సైట్లో ప్రచురించిన నోట్లో పేర్కొంది. ముఖ్యంగా తన కస్టమర్లను ఎక్కువగా చూపించి వారి ఖర్చులను తక్కువ చేసిందని ఆరోపించింది. తన ఫేక్ లెక్కలు,నకిలీ కస్టమర్ల సంఖ్యతో పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించడమే బ్లాక్ వ్యాపారం వెనుకున్న "మాయాజాలం"అని వ్యాఖ్యానించింది. బ్లాక్ సంస్థ "అండర్‌బ్యాంక్" కస్టమర్లలో ఎక్కువమంది నేరస్థులు లేదా అక్రమ కార్యకలాపాలలో పాల్గొన్న వ్యక్తులు న్నారని కూడా ఆరోపించింది. మోసం, ఇతర స్కామ్‌ల నిమిత్తం ఖాతాలను భారీగా సృష్టించడం, ఆపై అక్రమ నిధులను త్వర త్వరగా మళ్లించడం చేసిందని తెలిపింది. తాము సమీక్షించిన ఖాతాల్లో 40 శాతం నుండి 75 శాతం నకిలీవి, మోసానికి పాల్పడినవీ లేదా ఒకే వ్యక్తితో ముడిపడి ఉన్న అదనపు ఖాతాలని వెల్లడించింది. కాగా 2009లో ఏర్పాటైన బ్లాక్ సంస్థ మొబైల్ బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది. ఈ నివేదిక తర్వాత ప్రీమార్కెట్ ట్రేడింగ్‌లో బ్లాక్ షేర్లు 18 శాతం కుప్పకూలడం గమనార్హం. NEW FROM US: Block—How Inflated User Metrics and "Frictionless" Fraud Facilitation Enabled Insiders To Cash Out Over $1 Billionhttps://t.co/pScGE5QMnX $SQ (1/n) — Hindenburg Research (@HindenburgRes) March 23, 2023 -
జోరుగా పేటీఎం లావాదేవీలు.. 8.9 కోట్లకు చేరిన యూజర్ల సంఖ్య!
న్యూఢిల్లీ: చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం తన వృద్ధిని జనవరి, ఫిబ్రవరి నెలల్లోనూ కొనసాగించింది. ఈ రెండు నెలల్లో నెలవారీ లావాదేవీలు నిర్వహించిన సగటు యూజర్ల సంఖ్య 8.9 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోలిస్తే 28 శాతం వృద్ధి నమోదైంది. దేశవ్యాప్తంగా మర్చంట్ల వద్ద పేటీఎం సౌండ్‌బాక్స్ డివైజ్‌ల సంఖ్య 64 లక్షలకు చేరుకుంది. వీరు నెలవారీ సబ్స్క్రిప్షన్ చెల్లించే చందాదారులు. ఫిబ్రవరి నెలలో ఏర్పాటు చేసిన డివైజ్‌ల సంఖ్య 3 లక్షలుగా నమోదైంది. వర్తకుల వద్ద చెల్లింపుల లావాదేవీలు కూడా పెరిగాయి. స్థూల మర్చండైజ్ వ్యాల్యూ (జీఎంవీ) జనవరి, ఫిబ్రవరి నెలల్లో కలిపి రూ.2.34 లక్షల కోట్లుగా ఉంది. వార్షికంగా చూస్తే 41 శాతం వృద్ధి కనిపించింది. రుణ వితరణ వ్యాపారం కూడా తన జోరును కొనసాగించింది. తన ప్లాట్‌ఫామ్‌తో ఒప్పందం చేసుకున్న రుణదాతల ద్వారా రెండు నెలల్లో రూ.8,086 కోట్లను మంజూరు చేసింది. వార్షికంగా ఇది 286 శాతం వృద్ధి కావడం గమనించొచ్చు. రెండు నెలల్లో జారీ చేసిన రుణాల సంఖ్య 79 లక్షలుగా ఉంది. చదవండి👉 పాల ప్యాకెట్ తెచ్చిన అదృష్టం..వందల కోట్లు సంపాదిస్తున్న పేటీఎం సీఈవో! -
అమెజాన్ పేపై ఆర్బీఐ కొరడా: భారీ జరిమానా
సాక్షి,ముంబై: ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ చెల్లింపుల సంస్థ అమెజాన్ భారీ షాక్ తగిలింది. రెగ్యులేటరీ నిబంధనల ఉల్లంఘలన కింద ఆర్బీఐ అమెజాన్ పే (ఇండియా)పై రూ. 3.06 కోట్ల జరిమానా విధించింది. గతంలో ఆర్బీఐ జారీ చేసిన నోటీసులకు అమెజాన్‌పే స్పందనపై సంతృప్తి చెందని ఆర్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. అమెజాన్ పే (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (పిపిఐలు), నో యువర్ కస్టమర్ (కెవైసి) డైరెక్షన్‌కు సంబంధించిన కొన్ని నిబంధనలను పాటించలేని ఆర్బీఐ తేల్చింది. దీనికి సంబంధించిన రూ. 3.06 (రూ.3,06,66,000) కోట్ల పెనాల్టీ విధించినట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆదేశాలను పాటించనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలన్న ఆర్బీఐ నోటీసులకు సంస్థ స్పందనను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, నిబంధనలను పాటించలేదన్నఅభియోగం రుజువైన కారణంగా ఈ పెనాల్టీ విధించినట్టు తెలిపింది. (చదవండి : 2024 మారుతి డిజైర్: స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్‌తో, అతి తక్కువ ధరలో! ) -
పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్ కొత్త ఫీచర్లు వచ్చేశాయ్...క్యాష్ బ్యాక్ కూడా!
సాక్షి, ముంబై: ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్ చేసింది పిన్ లేకుండానే చెల్లింపులు చేసేలా పేటీఎం యాప్‌లో యూపీఐ లైట్ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీంతో పేటీఎం యూజర్లు పేమెంట్ చేసిన ప్రతిసారీ పిన్‌ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా సులభంగా పేమెంట్స్ చేసుకోవచ్చు. తద్వారా పేటీఎం వినియోగ దారులు కేవలం ఒక్క ట్యాప్‌తో రూ. 200 వరకు వేగంగా లావాదేవీలు చేయవచ్చు. రోజుకు రెండుసార్లు రూ. 2వేల వరకు లావాదేవీచేయవచ్చు. అంటే గరిష్ట పరిమితి రూ. 4 వేలు. నమ్మశక్యం కాని వేగంతో అనేక చిన్న యూపీఐ లావాదేవీలకు వీలు కల్పిస్తుందని, ఇలాంటి సౌకర్యాన్ని అందిస్తున్న ఏకైక ప్లాట్‌ఫారమ్ తమదేనని పేటీఎం పేర్కొంది. ఏ బ్యాంకుల యూజర్లకు ఈ సేవలు వర్తిస్తాయి కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌తో సహా తొమ్మిది బ్యాంకులు ప్రస్తుతం పేటీఎం లైట్ సర్వీసులకు మద్దతు ఇస్తున్నాయి. లావాదేవీల్లో ఎలాంటి గందరగోళం లేకుండా బ్యాంకునుంచి ఎస్ఎంఎస్, పేమెంట్స్ హిస్టరీ కూడా ఉంటుందని తెలిపింది. యూపీఐ లైట్‌ని యాక్టివేట్ చేసిన వినియోగదారులకు రూ. 100 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. డ్రైవ్ అడాప్షన్‌కు బ్యాలెన్స్‌గా రూ. 1,000 జోడిస్తుంది. క్యాన్సిల్ ప్రొటెక్ట్ ఫీచర్ ఈ ఫీచర్ భారతదేశంలోని ప్రజలకు డిజిటల్ చెల్లింపులను,అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యమని కంపెనీ వెల్లడించింది. తాజాగా తన యాప్‌లో ‘క్యాన్సిల్ ప్రొటెక్ట్’ అనే కొత్త ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టింది. దీనిద్వారా విమాన, బస్సు టిక్కెట్ల క్యాన్సిలేషన్‌పై 100 శాతం రీఫండ్ అందిస్తుంది. టికెట్ల క్యాన్సిల్ ప్రొటెక్ట్ కోసం కస్టమర్‌నుండి విమాన టికెట్ల బుకింగ్‌పై రూ. 149, బస్ టిక్కెట్లకు రూ. 25 వసూలు చేస్తుంది. తద్వారా షెడ్యూల్ సమయానికి కనీసం 24 గంటల ముందు షెడ్యూల్ చేసిన బయలుదేరే సమయానికి కనీసం నాలుగు గంటల ముందు క్యాన్సిల్ చేసిన బస్ టికెట్లపై 'క్యాన్సిల్ ప్రొటెక్ట్'తో 100 శాతం వాపసు క్లెయిమ్ చేయవచ్చు. క్యాన్సిల్ చేసుకున్న తక్షణమే సంబంధిత ఖాతాలోకి నగదు జమ అవుతుంది. Very proud of launching with @UPI_NPCI our latest in commitment to payments that are scalable and never fail. Upgrade your UPI experience by switching to @Paytm App ! Here payments never fail, tx are super fast and you don’t see clutter in your bank statement! All this 🚀🚀 pic.twitter.com/c1tr7J4V3A — Vijay Shekhar Sharma (@vijayshekhar) February 24, 2023 -
Upi-Paynow Linked: పేనౌతో ఎస్బీఐ జట్టు
ముంబై: యూపీఐ ప్లాట్‌ఫాం ఆధారంగా సీమాంతర చెల్లింపులకు వెసులుబాటు కల్పించే దిశగా సింగపూర్‌కి చెందిన పేనౌతో జట్టు కట్టినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వెల్లడించింది. భీమ్ ఎస్బీఐపే మొబైల్ యాప్ ద్వారా ఈ సదుపాయం పొందవచ్చని పేర్కొంది. భారత్ నుంచి సింగపూర్‌కు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ల ద్వారా, సింగపూర్ నుంచి భారత్‌కు యూపీఐ ఐడీ ద్వారా నగదు బదిలీ చేయొచ్చని వివరించింది. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం ద్వైపాక్షిక రెమిటెన్సులు ఏటా దాదాపు 1 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయి. -
ఒక్క క్లిక్‌తో చెల్లిస్తున్నారు.. తొలి స్థానంలో ఫోన్‌పే.. నమ్మశక్యం కాని అంకెలు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్స్టాంట్ రియల్ టైమ్ చెల్లింపుల వ్యవస్థ అయిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలు భారత్‌లో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. యూపీఐ పేమెంట్ యాప్స్ ద్వారా దేశవ్యాప్తంగా 2023 జనవరిలో ఏకంగా రూ.12,98,726.62 కోట్లు చేతులు మారాయంటే ఆశ్చర్యం వేయకమానదు. గత నెలలో మొత్తం 803 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. యూపీఐ వ్యవస్థ దేశంలో 2016 ఏప్రిల్‌లో అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి చూస్తే 2023 జనవరిలో నమోదైన గణాంకాలే అత్యధికం. టెలికం కంపెనీల దూకుడుతో పల్లెలకూ ఇంటర్నెట్ చొచ్చుకుపోయింది. స్మార్ట్ఫోన్లు జీవితంలో భాగమయ్యాయి. బ్యాంకు శాఖకు వెళ్లే అవసరం లేకుండా పేమెంట్ యాప్స్ ద్వారా దేశంలో ఎక్కడి నుంచైనా క్షణాల్లో సులభంగా, సురక్షితంగా చెల్లింపులు జరిపే అవకాశం ఉంది. ఈ అంశాలే ఇప్పుడు యూపీఐ వేగంగా విస్తరించడానికి కారణమయ్యాయి. నమ్మశక్యం కాని అంకెలు.. యూపీఐ లావాదేవీల విలువ తొలిసారిగా 2018 డిసెంబర్లో రూ.1 లక్ష కోట్ల మార్కును దాటింది. ఆ నెలలో 62 కోట్ల లావాదేవీలకుగాను రూ.1,02,595 కోట్ల విలువైన మొత్తం చేతులు మారింది. సరిగ్గా ఏడాదిలో లావాదేవీల విలువ రెట్టింపు అయింది. 2022 మే నాటికి లావాదేవీలు ఏకంగా రూ.10 లక్షల కోట్లకు ఎగిశాయి. 2017 జనవరిలో రూ.1,000 కోట్ల మార్కును దాటి రూ.1,696 కోట్ల లావాదేవీలు జరిగాయి. లావాదేవీలు అదే ఏడాది డిసెంబర్లో రూ.13,174 కోట్లకు చేరాయి. సరిగ్గా ఏడాదిలో లక్ష కోట్ల స్థాయికి ఎగిశాయి. ఈ గణాంకాలను చూస్తుంటే యూపీఐ పేమెంట్ యాప్స్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ ఇట్టే అర్థం అవుతోంది. 2023 జనవరి నాటికి 385 బ్యాంకులు యూపీఐ వేదికగా ఉన్నాయి. తొలి స్థానంలో ఫోన్‌పే.. దేశంలో యూపీఐ చెల్లింపుల్లో తొలి స్థానంలో నిలిచిన ఫోన్‌పే 2023 జనవరిలో రూ.6,51,108 కోట్ల లావాదేవీలను నమోదు చేసింది. గూగుల్ పే రూ.4,43,725 కోట్లు, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ యాప్ రూ.1,39,673 కోట్లతో ఆ తర్వాతి స్థానాలను కైవసం చేసుకున్నాయి. క్రెడ్ రూ.19,106 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ రూ.17,088 కోట్లు, యస్ బ్యాంక్ రూ.12,116 కోట్లు, భీమ్ రూ.8,164 కోట్లు, అమెజాన్ పే రూ.5,797 కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.3,324.8 కోట్లు, కొటక్ మహీంద్రా రూ.2,612 కోట్లు, ఐడీఎఫ్సీ బ్యాంక్ రూ.2,222 కోట్లు, ఎస్బీఐ రూ.1,902 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ రూ.1,467 కోట్లు సాధించాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్,, ఎయిర్టెల్, బజాజ్ ఫిన్సర్వ్, వాట్సాప్, మొబిక్విక్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ రూ.707 కోట్ల లావాదేవీలు నమోదు చేయడం విశేషం. చిన్న మొత్తాలే అధికం.. జనవరి గణాంకాల ప్రకారం మొత్తం 803 కోట్ల లావాదేవీల్లో కస్టమర్లు వర్తకులకు చెల్లించిన వాటా 54.88 శాతం కాగా వ్యక్తుల నుంచి వ్యక్తులకు జరిగిన లావాదేవీలు 45.12 శాతం ఉన్నాయి. కస్టమర్లు వర్తకులకు చెల్లించిన లావాదేవీల్లో రూ.500 లోపు విలువ కలిగినవి 83.36 శాతం కైవసం చేసుకున్నాయి. రూ.500–2,000 మధ్య 11.63 శాతం, రూ.2 వేలకుపైగా చెల్లించినవి 5.01 శాతం ఉన్నాయి. వ్యక్తుల నుంచి వ్యక్తులకు జరిగిన లావాదేవీల్లో రూ.500లోపు విలువ కలిగినవి 54.71 శాతం, రూ.500–2,000 మధ్య 22.11 శాతం, రూ.2 వేలకుపైగా చెల్లించినవి 23.18 శాతం ఉన్నాయి. -
హిండెన్‌బర్గ్ వివాదం: అదానీ గ్రూపు ప్రమోటర్స్ సంచలన నిర్ణయం
సాక్షి,ముంబై: అదానీ గ్రూప్- హిండెన్‌బర్గ్ వివాదం తరువాత మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సెప్టెంబర్ 2024నాటికి చెల్లించాల్సిన ప్లెడ్జ్ షేర్ల రిలీజ్ కోసం భారీ మొత్తాన్ని ముందుగానే చెల్లించనుంది. 1.1 బిలియన్ డాలర్లను చెల్లించనుంది. ఈమేరకు కంపెనీ ఒక ప్రకటన జారీ చేసింది. (ఇదీ చదవండి: అదానీ-హిండెన్‌బర్గ్: అదానీకి మరోషాక్! ఆ ప్రమాదం ఎక్కువే?) ఇటీవలి మార్కెట్ అస్థిరత దృష్ట్యా, అదానీ లిస్టెడ్ కంపెనీల షేర్ల మద్దతుతో మొత్తం ప్రమోటర్ పరపతిని తగ్గించడానికి ప్రమోటర్ల నిబద్ధత కొనసాగింపులో, మెచ్యూరిటీ కంటే ముందే 1,114 మిలియన డాలర్ల ప్రీ-పే మొత్తాలను చెల్లించనున్నామని ప్రకటించింది. ముందస్తు చెల్లింపులో భాగంగా ప్రమోటర్ హోల్డింగ్‌లో 12 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ల 168.27 మిలియన్ షేర్లు విడుదల చేయనుంది. అదానీ గ్రీన్ విషయానికొస్తే, ప్రమోటర్ హోల్డింగ్‌లో 3 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 27.56 మిలియన్ షేర్లను రిలీజ్ చేయనుంది. అలాగే, ప్రమోటర్ హోల్డింగ్‌లో 1.4 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అదానీ ట్రాన్స్‌మిషన్‌లోని 11.77 మిలియన్ షేర్లను రిలీజ్ చేయనుంది. కాగా అదానీ గ్రీన్ స్క్రిప్ వరుగా నాలుగో సెషన్లోనూ సోమవారం నాడు 5శాతం పడి లోయర్ సర్క్యూట్ అయింది. గత నెలతో పోలిస్తే సగానికి పైగా కోల్పోయింది. అదానీ గ్రూపు గత కొన్ని దశాబ్దాలుగా స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసాలు పాల్పడిందనే ఆరోపణలతో ఆమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్టు మార్కెట్లో ప్రకంపనలు రేపింది. దాదాపు 10 లిస్టెడ్ అదానీ గ్రూప్ కంపెనీలు భారీ నష్టాన్ని చవిచూశాయి. అయితే అదానీ గ్రూప్ హిండెన్‌బర్గ్ వాదనలను నిరాధారమైనదని కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. (ఇదీ చదవండి: Tech layoffs మరో టాప్ కంపెనీ నుంచి 6650 ఉద్యోగులు ఔట్!) -
ఎన్ఆర్ఐలకు గుడ్‌న్యూస్.. ఈ 10 దేశాల వారికే అవకాశం!
న్యూఢిల్లీ: ఎన్ఆర్ఐలకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సంతోషకర వార్త చెప్పింది. యూఎస్, కెనడా, యూఏఈ తదితర పది దేశాల్లోని వారు యూపీఐ ప్లాట్‌ఫామ్ ద్వారా నిధులను బదిలీ చేసుకోవచ్చని ఎన్పీసీఐ ప్రకటించింది. ఎన్ఆర్ఈ/ఎన్ఆర్వో ఖాతాలకు అనుసంధానంగా యూపీఐ ద్వారా నగదు బదిలీని చేసుకోవచ్చు. ఏప్రిల్ 30 నాటికి ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని యూపీఐ భాగస్వాములను ఎన్పీసీఐ కోరింది. సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, హాంగ్‌కాంగ్, ఒమన్, ఖతార్, యూఎస్ఏ, సౌదీ అరేబియా, యూఏఈ, యూకేలోని ప్రవాస భారతీయులకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ పది దేశాల టెలికం కోడ్‌పై యూపీఐ పనిచేసే ఏర్పాటును తీసుకువస్తున్నట్టు, సమీప భవిష్యత్తులో ఇతర దేశాలకూ దీన్ని విస్తరించనున్నట్టు ఎన్పీసీఐ తెలిపింది. ఎన్ఆర్ఐలు భారత్‌కు వచ్చినప్పుడు చెల్లింపులు, నగదు బదిలీ చేసుకునే సౌకర్యం ఇందులో ఉంటుందని ఎన్పీసీఐ చైర్మన్ విశ్వాస్ పటేల్ పేర్కొన్నారు. చదవండి: ఆటో ఎక్స్పో 2023: ఎలక్ట్రిక్ వాహనాలే హైలైట్, 5 మోడళ్లు ప్రపంచంలో తొలిసారి -
782 కోట్ల లావాదేవీలతో.. ఏకంగా రూ. 12.82 లక్షల కోట్ల యూపీఐ పేమెంట్స్
న్యూఢిల్లీ: ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) ద్వారా గత డిసెంబర్లో రికార్డు స్థాయిలో చెల్లింపులు జరిగాయి. 782 కోట్ల లావాదేవీల ద్వారా ఏకంగా రూ. 12.82 లక్షల కోట్ల పేమెంట్స్ నమోదయ్యాయి. 2016లో ప్రారంభమైన యూపీఐ ప్లాట్‌ఫామ్ దేశీయంగా డిజిటల్ పేమెంట్స్ విభాగంలో విప్లవాత్మక మార్పులు తేవడంలో కీలక పాత్ర పోషిస్తోందని ఆర్థిక సేవల విభాగం సోమవారం మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ట్వీట్ చేసింది. యూపీఐ చెల్లింపులు గతేడాది అక్టోబర్‌లో తొలిసారిగా రూ. 12 లక్షల కోట్ల మార్కును దాటాయి. నవంబర్‌లో రూ. 11.90 లక్షల కోట్లకు తగ్గినా, డిసెంబర్లో మళ్లీ పెరిగాయి. ప్రస్తుతం దాదాపు 381 బ్యాంకులు యూపీఐ ప్లాట్ఫామ్లో ఉన్నాయి. -
ఫోన్‌పే, గూగుల్‌పే నుంచి పొరపాటున వేరే ఖాతాకు.. ఇలా చేస్తే మీ పైసలు వెనక్కి!
గతంలో నగదు చెల్లింపులు జరపాలంటే బ్యాంకులకు వెళ్లడమో లేదా ఇంటర్నెట్ బ్యాంకులు వంటివి ఉపయోగించాల్సి వచ్చేది. కానీ టెక్నాలజీ పుణ్యమా అని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) రావడంతో ప్రజలు అటువైపు మొగ్గుచూపుతున్నారు. ఇది నగదు చెల్లింపుల విధానంలో ఓ విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చాయనే చెప్పాలి. ఎంతో సులువుగా అవతలి వాళ్లకు డబ్బులను ఈ విధానాన్ని ఉపయోగించి చిటికెలో పంపతున్నాం. అయితే ప్రజలకు కొన్ని సందర్భాల్లో నగదు పొరపాటున తాము అనుకున్న ఖాతాకు కాకుండా వేరు వారికి బదిలీ చేసిన ఘటనలు బోలెడు ఉన్నాయి. అటువంటి పరిస్థితి మీకు ఎదురైతే ఆ సమస్యకు పరిష్యారం గురించి ఇక్కడ తెలుసుకుందాం. యూపీఐ పేమెంట్స్‌ను ఉపయోగించి సెకనులో డబ్బులను అవతలి వాళ్ల బ్యాంక్ అకౌంట్‌కు పంపవచ్చు. ఈ విధానం సులువుగా ఉండడంతో మొదట్లో యూపీఐని ఉపయోగించే వారి సంఖ్య వేల నుంచి ప్రస్తుతం కోట్లకు చేరింది. అలా ప్రస్తుతం ఇది మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్ మాత్రమే కాదు రోడ్‌సైడ్ వెండర్ల నుంచి రిటైల్ షాపుల వరకు ఎక్కడ చూసిన ఇదే కనిపిస్తుంది. ఇది సురక్షితమైన చెల్లింపు వ్యవస్థ అయినప్పటికీ కొన్ని సార్లు అనుకోకుండా చేసే పొరపాటు మీ ఆర్థిక నష్టానికి దారితీయవచ్చు. వేరే ఖాతాకు నగదు బదిలీ.. వెనక్కి రావాలంటే ఇలా చేయండి యూపీఐ ఐడీని తప్పుగా నమోదు చేయడం లేదా పొరపాటుగా వేరొకరి బ్యాంక్ ఖాతాకు డబ్బు పంపడం లాంటివి జరుగుతుంటాయి. మనకో లేదా మనకు తెలిసిన వాళ్లకు ఈ పరిస్థితి ఎదురయ్యే ఉంటుంది. ఆ సమయంలో మీరు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఈ సమస్యకు పరిష్కారం చూపింది. ఆర్బీఐ ప్రకారం, మీరు సరైన చర్యలు తీసుకోవడం ద్వారా బదిలీ చేసిన మొత్తం నగదు తిరిగి పొందవచ్చు. డిజిటల్ సేవల ద్వారా అనుకోకుండా లావాదేవీలు జరిగితే, బాధిత వ్యక్తి మొదట ఉపయోగించిన చెల్లింపు వ్యవస్థతో ఫిర్యాదు చేయాలని పేర్కొంది. మీరు పేటీఎం (Paytm), గూగుల్ పే (Google Pay), ఫోన్‌పే (PhonePe) వంటి అప్లికేషన్ల కస్టమర్ సర్వీస్ నుంచి సహాయం పొందవచ్చు. వారి ద్వారా నగదు వాపసు కోసం అభ్యర్థించవచ్చు. చెల్లింపు వ్యవస్థ సమస్యను పరిష్కరించలేపోతే, డిజిటల్ లావాదేవీల కోసం ఆర్బీఐ ఏర్పాటు చేసిన అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చని తెలపింది. చదవండి: అయ్యో! ఎంత కష్టం, ఆఫీసుకు టాయిలెట్ పేపర్లు తెస్తున్న ట్విటర్ ఉద్యోగులు -
పేమెంట్ మోసాలపై ఫిర్యాదులకు ఆర్బీఐ దక్ష్
ముంబై: చెల్లింపుల లావాదేవీల్లో మోసాల ఉదంతాలను పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లు ఫిర్యాదు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ కొత్తగా దక్ష్ పేరిట అధునాతన వ్యవస్థను రూపొందించింది. ఇది జనవరి 1 నుంచి అందుబాటులోకి రానున్నట్లు, ఇప్పటివరకూ ఉన్న ఫ్రాడ్ రిపోర్టింగ్ మాడ్యూల్‌ను దీనికి మార్చనున్నట్లు తెలిపింది. పేమెంట్ ఫ్రాడ్‌లను బల్క్‌గా అప్లోడ్ చేయడంతో పాటు ఆన్లైన్ స్క్రీన్–ఆధారిత రిపోర్టింగ్, అలర్టులను జారీ చేయడం, నివేదికలను రూపొందించడం తదితర ఆప్షన్లు కూడా ఇందులో ఉంటాయని పేర్కొంది. ప్రస్తుతం పేమెంట్ ఫ్రాడ్‌లను ఫిర్యాదు చేసేందుకు ఎలక్ట్రానిక్ డేటా సబ్మిషన్ పోర్టల్ (ఈడీఎస్పీ)ని ఉపయోగిస్తున్నారు. -
సిబిల్ స్కోర్ సరిగ్గా లేకపోయినా బ్యాంక్ లోన్ వస్తుందా!
బ్యాంక్ నుంచి పొందే లోన్ ఎటువంటిదైనా సిబిల్ స్కోర్ బాగుండాలి. సిబిల్ స్కోర్ బాగుంటేనే మనం బ్యాంక్ నుంచి అవసరమైన రుణం పొందవచ్చు. కానీ క్రెడిట్ పేమెంట్ చేయక పోవడం వల్ల బ్యాంక్‌లు రుణాల్ని ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదు. కానీ సిబిల్ స్కోర్ బాగాలేకపోయినా కేవలం ఒక్క పద్దతిలోనే పర్సనల్ లోన్ పొందవచ్చు. కాకపోతే అది ఎంతవరకు సాధ్యమనేది బ్యాంక్ అధికారుల నిర్ణయంపై ఆదారపడి ఉంది. వడ్డీ రేటు ఎక్కువే పర్సనల్ లోన్‌కి సిబిల్ స్కోర్ చాలా అవసరం. కాబట్టి సిబిల్ స్కోర్ తగ్గకుండా టైం టూ టైం పేమెంట్ చేసేలా చూసుకోవాలి. మనలో చాలామంది క్రెడిట్ కార్డ్ స్కోర్ తక్కువగా ఉన్నా బ్యాంక్ లోన్ల కోసం ట్రై చేస్తుంటారు. అయతే బ్యాంక్ లు లోన్లను రిజెక్ట్ చేస్తుంటాయి. అయితే ఒక్క పద్దతిలో మాత్రమే సిబిల్ స్కోర్ సరిగ్గా లేకపోయినా లోన్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు సిబిల్ స్కోర్ సరిగ్గా లేకుండా మన లోన్ మొత్తం రూ.10లక్షలు అవసరం ఉంటే బ్యాంకులు రూ.5లక్షలు ఇచ్చేందుకు మొగ్గుచూపుతాయి. అంతకంటే ఎక్కువ రుణం ఇచ్చేందుకు నిరాకరిస్తాయి. క్రెడిట్ స్కోర్ ఎందుకు తగ్గిపోతుంది ►క్రెడిట్ కార్డ్ విషయంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు క్రెడిట్ కార్డ్ స్కోర్ పై ప్రభావితం చూపిస్తాయి. వాటిలో సమయానికి లోన్, ఈఎంఐ చెల్లించకపోవడం ►నాలుగైదు నెలల ఈఎంఐని ఒకేసారి కట్టడం ►తక్కువ సమయంలో ఎక్కువ క్రెడిట్ కార్డ్‌ల కోసం అప్లయి చేయడం ►క్రెడిట్ కార్డ్ ను లిమిట్‌గా వాడుకోకపోవడం వల్ల సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. మీ క్రెడిట్ కార్డ్ స్కోర్ కనీసం 750లు అంతకంటే ఎక్కువ ఉండేలా చూసువాలి. -
రేజర్‌పే, క్యాష్‌ఫ్రీ కంపెనీలకు ఆర్బీఐ షాక్
న్యూఢిల్లీ: పేమెంట్ గేట్‌వే సేవలు అందిస్తున్న రేజర్‌పే, క్యాష్‌ఫ్రీ పేమెంట్స్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాక్ ఇచ్చింది. పేమెంట్ ప్రాసెసింగ్ వ్యాపారంలో కొత్త కస్టమర్లను చేర్చుకోవడాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. ‘పేమెంట్ అగ్రిగేటర్, పేమెంట్ గేట్‌వే లైసెన్స్ కోసం ఆర్బీఐ నుంచి జూలైలో సూత్రప్రాయ ఆమోదం లభించింది. తుది లైసెన్స్ కోసం ఆర్బీఐకి కంపెనీ అదనపు సమాచారం అందించాల్సి ఉంది. అంత వరకు కొత్త ఆన్లైన్ వ్యాపారులను చేర్చుకోవడాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆర్బీఐ కోరింది’ అని రేజర్‌పే తెలిపింది. తాజా ఉత్తర్వుల ప్రభావం ప్రస్తుత వ్యాపారాలపై ఉండబోదని కంపెనీ వెల్లడించింది. చదవండి: భారత్‌లో అత్యంత ఖరీదైన కారు కొన్న హైదరాబాద్ వాసి.. వామ్మో అన్ని కోట్లా! -
షాకింగ్: గూగుల్ పే, పోన్‌పేలాంటి యాప్స్‌లో ఇక ఆ లావాదేవీలకు చెక్?
సాక్షి,ముంబై: డిజిటల్ ఇండియాలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చాలా సర్వసాధారణమైపోయాయి. ప్రతీ చిన్న లావాదేవీకి గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం లాంటి పేమెంట్ యాప్స్‌పై ఆధారపడటం బాగా పెరిగింది. అయితే అపరిమిత యూపీఐ లావాదేవీలకు సంబంధించి తాజా అంచనాలు యూజర్లకు షాకివ్వనున్నాయి. పేమెంట్ యాప్‌ల ద్వారా అన్లిమిటెడ్ పేమెంట్లు చేయకుండా నిబంధనలు త్వరలోనే అమల్లోకి రానున్నాయని భావిస్తున్నారు. త్వరలో డిజిటల్ యూపీఐ పేమెంట్లపై ట్రాన్సాక్షన్ లిమిట్ విధించనున్నారని తాజా నివేదికల సమాచారం. యూపీఐ డిజిటల్ సిస్టమ్‌లోని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), థర్డ్-పార్టీ యాప్ ప్రొవైడర్ల (TPAP) వాల్యూమ్ క్యాప్‌ను పరిమితం చేయనుంది. ఈ మేరకు వాల్యూమ్‌ను 30 శాతానికి పరిమితం చేసే విషయంపై రిజర్వ్ బ్యాంక్‌తో చర్చలు జరుపుతోంది. ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ PhonePe ఈ ఏడాది డిసెంబరు 31తోముగియనున్న గడువును కనీసం మూడు సంవత్సరాలు పెంచాలని ఇప్పటికే ఫోన్‌పే అభ్యర్థించింది. మరికొందరైతే ఐదేళ్లు పొడిగించాలని కోరుతున్నారు. అయితే ఈ నెలాఖరులోగా ఎన్పీసీఐ నిర్ణయం తీసుకోనుంది. కాగా 2020లో ఈ లావాదేవీల పరిమాణాన్ని 30 శాతానికి పరిమితం చేసేలా ప్రతిపాదించింది. ఎన్పీసీఐ థర్డ్-పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ UPIలో నిర్వహించబడే లావాదేవీలను నియంత్రించాలని భావించింది. ఆ తరువాత దీని అమలును రెండు సంవత్సరాలకు పొడిగించింది. మరి ఈ గడువును పొడిగించే అవకాశం ఉందా లేదా అనే దానిపై నవంబర్ చివరి నాటికి దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎలాంటి పరిమితులు లేకుండా యూపీఐ యాప్‌ల చెల్లింపులు చేసుకునే అవకాశం ఉంది. గూగుల్ పే, ఫోన్‌పే మార్కెట్లో దాదాపు 80 శాతం వాటా కలిగి ఉన్నాయి. -
తొలగింపు తరువాత పరాగ్ అగర్వాల్‌కు ఎన్ని వందల కోట్లు వస్తాయంటే?
న్యూఢిల్లీ: ప్రపంచ బిలియనీర్, ఎలాన్ మస్క్ మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విటర్‌ను సొంతం చేసుకున్నారు. అయితే ఈ డీల్‌ను పూర్తి చేసిన వెంటనే కీలక ఎగ్జిక్యూటివ్‌లపై వేటు వేయడం సంచలనం సృష్టించింది. 44 బిలియన్ డాలర్ల (సుమారు రూ.3.37 లక్షల కోట్లు)టేకోవర్ డీల్ తరువాత ట్విటర్ మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్, సీఎఫ్‌వో నెడ్ సెగల్, చీఫ్ లీగల్ ఆఫీసర్ విజయ గద్దె తొలగింపు తర్వాత భారీ మొత్తం అందుకోబోతున్నారు. ముఖ్యంగా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్‌కు సుమారు 42 మిలియన్ డాలర్ల అత్యధిక చెల్లింపును అందుకోబోతోన్నారు. మొత్తంగా తొలగించిన టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు 88 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. పరిశోధనా సంస్థ ఈక్విలర్ ప్రకారం, 42 మిలియన్లు డాలర్లు (రూ.3,457,145,328) పరాగ్ అగర్వాల్ సొంతం చేసుకుంటారు. పరాగ్ వార్షిక బేసిక్ సాలరీ, ఈక్విటీ అవార్డు ప్రకారం దీన్ని అంచనా వేసింది. అలాగే కంపెనీకి సంబంధించిన ప్రాక్సీ స్టేట్మెంట్ నిబంధనల మేరకు ఈ పరిహారం మొత్తం 42 మిలియన్ డాల్లరు ఉండవచ్చని రాయిటర్స్ అంచనా వేసింది. ఇన్సైడర్ ప్రకారం మాజీ సీఎఫ్‌వోకు 25.4 మిలియన్ డాలర్లు, చీఫ్ లీగల్ ఆఫీసర్ విజయ గద్దె 12.5 మిలియన్ డాలర్లు అందుకోనున్నారు. అలాగే చీఫ్ కస్టమర్ ఆఫీసర్ సారా పెర్సోనెట్ 11.2 మిలియన్ల డాలర్లు పొందుతారు. దశాబ్దం క్రితం ట్విటర్లో పరాగ్ ఎంట్రీ ఐఐటీ బాంబే , స్టాన్ఫోర్డ్ పూర్వ విద్యార్థి పరాగ్ అగర్వాల్ 2011లో ట్విటర్లో చేరారు. 2017 నుంచి ట్విటర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసరుగా ఉన్న ఆయననకు గత ఏడాది నవంబరులో సీఈవో నియమించింది కంపెనీ. 2021 నాటికి పరాగ్ మొత్తం పరిహారం $30.4 మిలియన్లు కాగా ట్విటర్ స్వాధీనం తరువాత ప్రపంచవ్యాప్తంగా ట్విటర్ సిబ్బందిలో 75 శాతం లేదా 5,600 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు గతంలో నివేదికలు పేర్కొన్నాయి. ట్విటర్ పునర్వ్యవస్థీకరణతోపాటు, ఉద్యోగులపై వేటు తప్పదనే అంచనాలొచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని ఇటీవల ట్విటర్ ప్రధాన కార్యాలయాన్ని సందర్భించిన సందర్బంగా మస్క్ ట్విటర్ ఉద్యోగులతో హామీ ఇచ్చారు. అయితే మస్క్ టేకోవర్, కీలక ఉద్యోగులపై వేటు తరువాత ఉద్యోగులు ఇప్పటికీ ఆందోళన చెందుతున్నారు. -
ఝన్‌ఝన్‌వాలా తరువాత నేనే! కట్ చేస్తే..ఓ టీస్టాల్ కుర్రోడి వైరల్ స్టోరీ
బెంగళూరుకు చెందిన ఒక టీ స్టాల్ ఓనర్ ఏకంగా క్రిప్టో కరెన్సీ చెల్లింపులను యాక్సెస్ చేయడం సెన్సేషన్‌గా మారింది. అది కూడా 'ఫ్రస్ట్రేటెడ్ డ్రాప్ అవుట్' టీ స్టాల్ నిర్వహిస్తూ బిట్‌కాయిన్ లావాదేవీలు చేయడం విశేషంగా నిలిచింది. ప్రస్తుతం ఇంటర్నెట్లో సంచలనంగా మారిన 22 ఏళ్ల శుభమ్ సైనీ వైరల్ స్టోరీ.. శుభమ్ సైనీ రేవారి, ఇందిరా గాంధీ యూనివర్సిటీ నుంచి బీసీఏ డ్రాప్ అవుట్. ఇంటర్నషిప్ చేద్దామని బెంగళూరు వచ్చాడు. అతనికి స్టాక్ మార్కెట్ అంటే ఆసక్తి ఎక్కువ. ఈ క్రమంలో క్రిప్టో ప్రపంచం అతనికి పరిచయమైంది. రాకేష్ ఝన్ ఝన్‌వాలా అంతటివాడిని కావాలని కలలు కన్నాడు. అలా 2020లో, మార్కెట్ 60శాతం క్రాష్ అయిన సమయంలో లాభాలను ఆర్జించాలనే ఆశతో క్రిప్టో మార్కెట్లో పెట్టుబడులు పెట్టాడు. రూ. 1.5 లక్షలపై వెయ్యి శాతం లాభాలు గడించాడు. అలా రూ. 30 లక్షల మేర లాభాలు రావడంతో గాల్లో తేలిపోయాడు. 2021 మార్కెట్ పతనంతో ఆ ఆనందం గాల్లోనే కలిసిపోయింది. ఎక్కడ నుంచి మొదలయ్యాడో అక్కడికే చేరాడు. కానీ అక్కడితో కుంగిపోలేదు. ఏమైనా చేయాలనే పట్టుదలతో కేవలం 30వేల పెట్టుబడితో ఆరు నెలల క్రితం టీ దుకాణం ప్రారంభించాడు. మట్టికప్పులో రూ. 20 లకి టీని విక్రయిస్తున్నాడు. ముఖ్యంగా క్రిప్టో లావాదేవీలతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాడు. 'చాయ్ విత్ క్రిప్టో' దుకాణం చాయ్ లవర్స్ హ్యాంగ్అవుట్గా మారిపోయింది. ప్రముఖ పెట్టుబడిదారుడు రాకేష్ ఝన్‌ఝన్‌వాలా తరువాత నేనే అనుకున్నా. కానీ అనుకున్నట్టుగా జీవితం సాగుదుగా. అనుకోని నష్టాలతో కంగిపోలే.. ఆత్మ విశ్వాసంతో, ఆత్మగౌరవంతో ఎదగాలని భావించాను. అందుకే చిన్నగా టీ స్టాల్ మొదలు పెట్టాను. ముఖ్యంగా పర్యావరణహితంగా మట్టి కప్పులనే వాడుతున్నాను. వారానికి సగటున 20-30 లావాదేవీలు జరుగుతాయనీ, తన పేమెంట్ సిస్టం యూజర్లకు బాగా నచ్చుతోందని శుభమ్ చెప్పారు. యూపీఐ లాంటి నగదు లావాదేవీలతోపాటు కస్టమర్లు క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు తన వద్ద చేయవచ్చని తెలిపాడు. దీంతోపాటు నార్త్ ఇండియా వంటకాలతో ‘క్లౌడ్ కిచెన్’ తో మరింత ఆకర్షిస్తున్నాడు. అంతేకాదు అతిపెద్ద గ్రీన్ అండ్ సక్సెస్‌పుల్ కేఫ్ బ్రాండ్ యజమానిగా ఎదగాలని శుభమ్ సైనీ భావిస్తున్నాడు. దీంతో నెటిజనులంతా ఆల్ ది బెస్ట్ బ్రో అంటు విషెస్ అందిస్తున్నారు. -
‘చకచకా చేయి’..యూరప్‌లోనూ యూపీఐ చెల్లింపులు
న్యూఢిల్లీ: యూరప్‌కు వెళ్లే వారు అక్కడ కూడా యూపీఐతో చెల్లింపులు చేసే రోజు అతి త్వరలో సాకారం కానుంది. ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్ఐపీఎల్) యూరప్‌కు చెందిన చెల్లింపుల సేవల సంస్థ ‘వరల్డ్‌లైన్’తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. యూరప్ వ్యాప్తంగా భారత చెల్లింపులను ఆమోదించడం ఈ ఒప్పందంలో భాగమని ఎన్ఐపీఎల్ ప్రకటించింది. యూరప్ లో భారతీయులు.. వరల్డ్లైన్కు చెందిన క్యూఆర్ కోడ్ ఆధారిత మర్చంట్స్ పీవోఎస్ల వద్ద యూపీఐతో చెల్లింపులు చేయడానికి వీలవుతుంది. అలాగే, రూపే డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతోనూ యూరోప్‌లో చెల్లింపులు చేసుకోవచ్చు. ప్రస్తుతం భారతీయులు అంతర్జాతీయ కార్డ్ నెట్‌వర్క్‌ల ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. బెల్జియం, నెదర్లాండ్స్, లగ్జెంబర్గ్, స్విట్జర్లాండ్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకోనున్నట్టు ఎన్ఐపీఎల్ తెలిపింది. వరల్డ్‌లైన్ క్యూఆర్ ద్వారా యూరప్‌లోని మరిన్ని దేశాల్లోకి యూపీఐని విస్తరించనున్నట్టు తెలిపింది. జీ20 దేశాలకు యూపీఐ, ఆధార్! కాగా, ప్రపంచవ్యాప్తంగా అందరికీ డిజిటల్ సేవలు అందించేందుకు వీలుగా.. జీ 20 దేశాలు యూపీఐ, ఆధార్ వంటి ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటు చేసి, అమలు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక ప్రోత్సాహక విభాగం కార్యదర్శి అనురాగ్ జైన్ అభిప్రాయపడ్డారు. విజ్ఞానం, ఆవిష్కరణ, స్థిరత్వం అన్నవి నూతనతరం ఆర్థిక వృద్ధి చోదకాలుగా పేర్కొన్నారు. భారత్ ఓపెన్ సోర్స్ ప్లాట్ ఫామ్‌లు అయిన కోవిన్, ఆధార్, యూపీఐ ఇంటర్ఫేస్ తదితర వాటిని సృష్టించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో జైన్ మాట్లాడుతూ. ఈ తరహా ఓపెన్ సోర్స్ (మార్పులకు వీలైన), పలు వ్యవస్థల మధ్య పనిచేసే ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటు చేయడంపై జీ20 దేశాలు దృష్టి సారించాలని సూచించారు. -
క్రెడిట్ కార్డ్ పేమెంట్ కష్టంగా మారిందా, అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
క్రెడిట్ కార్డ్... దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కార్డు ఉంది కదా అని ఇష్టానుసారంగా ఉపయోగిస్తే మాత్రం చివరకు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీని గురించి పూర్తిగా తెలియక కొందరు కార్డ్‌లో లిమిట్ ఉందని వాడుతూ తిరిగి చెల్లించే సమయంలో నానాఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కరోనా మహమ్మారి దెబ్బతో ఉద్యోగాల కోత, చెల్లించని బిల్లులు, క్లియర్ కాని ఈఎంఐ(EMI)ల ఫలితంగా లక్షలాది మంది వ్యక్తులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. చెల్లించని క్రెడిట్ కార్డ్ బిల్లుల కారణంగా.. ఆలస్యంగా కట్టడంతో ఫైన్లు, వడ్డీ రేట్లు పెరగడం వంటివి ఆర్థికంగా నష్టపరచడమే గాక మీ క్రెడిట్ స్కోర్‌కు తీవ్ర నష్టం కలిగిస్తాయి. ఆ సమయంలో వీటిని పాటించడం ద్వారా మీ భారం నుంచి కాస్త రిలీఫ్ పొందచ్చని నిపుణుల చెబుతున్నారు. 1. మినిమం బ్యాలెన్స్ చెల్లించడం క్రెడిట్ కార్డులోని మొత్తం రుణాన్ని చెల్లించకపోయినా, మినిమం బ్యాలెన్స్ నగదుని చెల్లించండి. దీని ద్వారా మీ క్రెడిట్ కార్డ్‌ని ఆపరేట్ చేసుకోవడంతో పాటు మీపై పడే వడ్డీ భారం కూడా తగ్గుతుంది. అంతేకాకుండా మీ క్రెడిట్ స్కోర్ పడిపోకుండా ఉంటుంది. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే దాని వల్ల భవిష్యత్తులో రుణాలు పొందడం కష్టంగా మారడంతో పాటు కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కనీస చెల్లింపును కూడా చేయకుంటే, అదనంగా లేట్ ఫైన్ కూడా కట్టాల్సి ఉంటుంది. 2. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం ద్వారా రుణ భారం నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. క్రెడిట్ కార్డు ఔట్ స్టాండింగ్ అమౌంట్ ఎక్కువగా ఉంటే.. దాన్ని చెల్లించేందుకు కొన్ని నెలల సమయం పట్టొచ్చు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో క్రెడిట్ కార్డు బిల్లు డేంజరస్ లెవెల్‌కు చేరే ప్రమాదం కూడా ఉంది. అటువంటి పరిస్ధితులు రాకముందే దాన్ని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దాంతో అదే బ్యాలెన్స్‌తో కొత్త క్రెడిట్ కార్డ్ పొందుతారు, అది కూడా తక్కువ వడ్డీ రేటు. కొత్త కార్డ్ కావడంతో సంస్థలు ఇచ్చే బెనిఫిట్స్‌తో పాటు చెల్లించేందుకు కాస్త సమయం దొరుకుతుంది. 3. పర్సనల్ లోన్‌గా మార్చుకోండి మీ క్రెడిట్ కార్డ్ బిల్లుల భారంగా మారి వాటిని సకాలంలో చెల్లించడం కుదరుని పక్షంలో పర్సనల్ లోన్ తీసుకుని వాటిని చెల్లించే అవకాశం ఉంటుంది. క్రెడిట్ కార్డ్‌లతో పోలిస్తే వ్యక్తిగత రుణాలు తక్కువ వడ్డీ రేటుతో మనకు లభిస్తాయి. పైగా క్రెడిట్ కార్డ్‌లా అధిక వడ్డీల భారం ఇందులో ఉండదు. వీటితో పాటు ఈఎంఐ( EMI) ఆఫ్షన్ కూడా ఉంటుంది. 4 మీ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించకపోవడం మంచిది రుణభారాన్ని మోస్తున్న కస్టమర్లు, ఆ బిల్లులు చెల్లించకుండానే మరిన్ని కొనుగోళ్లు చేయడం వల్ల మీ క్రెడిట్ కార్డ్‌లో బిల్లు కొండంత అవుతుంది. దాంతో అది మీ మొత్తం బకాయిపై వడ్డీ పడుతుంది, అది భారీ మొత్తంలో ఉంటుందని గుర్తించుకోవాలి. అందుకే క్రెడిట్ కార్డ్‌ని ఇష్టానుసారంగా కాకుండా క్రమపద్ధతిలో ఉపయోగించడం, అన్ని బకాయిలను క్లియర్ చేసుకుని, మళ్లీ ఉపయోగించడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: సామాన్యుడికి బిగ్ రిలీఫ్.. హమ్మయ్యా, రెండేళ్ల తర్వాత వాటి ధరలు తగ్గాయ్! -
బిల్‌డెస్క్‌కు భారీ షాక్, రూ. 38,400 కోట్ల కొనుగోలు డీల్ రద్దు
న్యూఢిల్లీ: దేశీ డిజిటల్ చెల్లింపుల కంపెనీ బిల్‌డెస్క్ కొనుగోలు ప్రతిపాదనను విరమించుకుంటున్నట్లు ప్రోజస్ ఎన్వీ తాజాగా పేర్కొంది. 4.7 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 38,400 కోట్లు) విలువైన ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు పేయూ నిర్వాహక సంస్థ ప్రోజస్ ఎన్వీ వెల్లడించింది. డీల్‌కు సంబంధించి గడువులోగా కొన్ని పరిస్థితులు అనుకూలించలేదని తెలియజేసింది. సెప్టెంబర్ ముగిసేలోగా ముందుగా చేసుకున్న కొన్ని ఒప్పంద పరిస్థితులను చేరుకోలేకపోవడంతో తాజా నిర్ణయానికి వచ్చినట్లు డచ్ ఈ–కామర్స్ దిగ్గజం ప్రోజస్ వివరించింది. అయితే ఈ డీల్‌కు సెప్టెంబర్ 5న కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) నుంచి అనుమతులు లభించినప్పటికీ ఏ ఇతర పరిస్థితులు అడ్డుపడ్డాయో వివరించకపోవడం గమనార్హం! డీల్ నిబంధనల ప్రకారం కాంట్రాక్టు ఆటోమేటిక్‌గా రద్దుకానున్నట్లు కూడా ప్రోజస్ వెల్లడించింది. భారీ కంపెనీగా బిల్‌డెస్క్‌ను పేయూ సొంతం చేసుకుని ఉంటే వార్షికంగా 147 బిలియన్ డాలర్ల విలువైన పరిమాణం(టీపీవీ) ద్వారా డిజిటల్ చెల్లింపుల దిగ్గజంగా ఆవిర్భవించి ఉండేది. ప్రత్యర్థి సంస్థలు రేజర్‌పే 50 బిలియన్ డాలర్లు, సీసీఎవెన్యూ(ఇన్ఫీబీమ్) 18–20 బిలియన్ డాలర్ల టీపీవీ కలిగి ఉన్నట్లు అంచనా. డీల్ పూర్తయిఉంటే ప్రోజస్ చేపట్టిన అతిపెద్ద కొనుగోలుగా నిలిచేది. కాగా.. గతేడాది ఆగస్ట్ 31న బిల్‌డెస్క్ కొనుగోలుకి ప్రోజస్ నగదు రూపేణా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తద్వారా భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న ఫిన్‌టెక్ రంగంలో విస్తరించేందుకు వీలు చిక్కేది. దేశంలో పెట్టుబడులు ప్రోజస్ మాతృ సంస్థ నేస్పర్స్ 4.5 లక్షల బిజినెస్‌లకు 100 రకాలకుపైగా చెల్లింపుల విధానాలలో సేవలు అందిస్తోంది. ప్రోజస్ ద్వారా దేశీయంగా దీర్ఘకాలిక ఇన్వెస్టర్‌గా కొనసాగుతోంది. స్విగ్గీ, ఫార్మ్ఈజీ తదితర టెక్నాలజీ కంపెనీలలో 6 బలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. ఇక బిల్‌డెస్క్‌ను ఆర్థర్ ఆండర్సన్, ఎంఎన్ శ్రీనివాసు, అజయ్ కౌశల్– కార్తిక్ గణపతి 2000లో ఏర్పాటు చేశారు. స్మార్ట్ఫోన్ల వినియోగంతో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ఊపందుకుంది. ఇది కంపెనీ పురోభివృద్ధికి సహకరించింది. డీల్ సాకారమైతే వ్యవస్థాపకులు ఒక్కొక్కరికీ 50 కోట్ల డాలర్ల చొప్పున లభించి ఉండేవి. బిల్‌డెస్క్‌లో జనరల్ అట్లాంటిక్ 14.2 శాతం, టీఏ అసోసియేట్స్ 13.1 శాతం, వీసా 12.6 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నాయి. ముగ్గురు ప్రమోటర్లకు దాదాపు 30 శాతం వాటా ఉంది. -
ఎవరికీ ఆదాయం రాకుండా ప్రభుత్వ నిబంధనలు
ముంబై: చెల్లింపుల సర్వీసులు అందించే సంస్థలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదాయం ఆర్జించేందుకు వీలు లేకుండా ప్రభుత్వ నిబంధనలు ఉంటున్నాయని యాక్సిస్ బ్యాంక్ సీఈవో అమితాబ్ చౌదరి వ్యాఖ్యానించారు. దీని వల్ల చిన్న సంస్థలు బతికి బట్టకట్టడం కష్టమవుతుందని పేర్కొన్నారు. ‘పేమెంట్స్ విభాగంలో మేము ఆదాయం ఆర్జించేందుకు ప్రభుత్వం ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు. దీన్ని అడ్డుపెట్టుకుని వేరే దగ్గరెక్కడో డబ్బు సంపాదించుకోవాలే తప్ప పేమెంట్స్ విభాగంలో ఏ సంస్థా సొమ్ము చేసుకోలేని పరిస్థితి ఉంది‘ అని గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చౌదరి చెప్పరు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు యూపీఐ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చినప్పటికీ ఆ సర్వీసులు ఉచితంగానే ఉండాలన్న ప్రభుత్వ ఆదేశాలు సదరు సంస్థలకు సమస్యగా మారాయి. యూపీఐ సేవలకూ మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) విధించే అంశంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో చౌదరి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యాక్సిస్ బ్యాంకు.. ఫ్రీచార్జ్ అనే పేమెంట్స్ కంపెనీని నిర్వహిస్తోంది. ‘ఆదాయం రాని సేవలు అందించడం ద్వారా వచ్చే నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు మాకు ఇతరత్రా అవకాశాలు కల్పించాలన్న సంగతి అర్థం చేసుకున్నా కూడా నియంత్రణ సంస్థలు పైసా రాని పనులెన్నో చేయాలంటూ బ్యాంకులను ఆదేశిస్తుంటాయి‘ అని చౌదరి చెప్పారు. ఈ నేపథ్యంలో బడా టెక్ కంపెనీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం ద్వారా ఆదాయాలు పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్, గూగుల్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చెప్పారు. -
రూపీలోనే ఇన్వాయిస్, చెల్లింపులు, భారీ ఊరట
న్యూఢిల్లీ: రూపాయి మారకంలోనే ఇన్వాయిసింగ్, చెల్లింపులు, ఎగుమతుల, దిగుమతుల సెటిల్ మెంట్లకు అనుమతిస్తూ వాణిజ్య శాఖ నిర్ణయం తీసుకుంది. రూపాయి మారకంలో వాణిజ్య నిర్వహణకు ఆసక్తి పెరగడంతో.. ఎగుమతులు, దిగుమతుల లావాదేవీలకు వీలుగా అదనపు ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్బీఐ ఈ ఏడాది జూలైలోనే బ్యాంకులను కోరడం గమనార్హం. ఆర్బీఐ నిర్ణయానికి అనుగుణంగా విదేశీ వాణిజ్య విధానంలో కొత్త పారాగ్రాఫ్‌ను చేర్చినట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ప్రకటించింది. -
చెల్లింపుల్లోనూ ప్రగతి.. ప్రజలకు వాస్తవాలు వివరించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: చేసిన అప్పులు చెల్లించే విషయంలో, ద్రవ్య లోటు విషయంలో దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మనం మంచి పరిస్థితిలో ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఈ మూడేళ్లలో చాలా మెరుగ్గా ఉందన్నారు. పన్నుల ఆదాయంలో అధిక భాగం రుణాల చెల్లింపులకే సరిపోతోందని దుష్ప్రచారం చేస్తున్నారని, నిజానికి గత ప్రభుత్వం కంటే, ఈ ప్రభుత్వం అప్పుల చెల్లింపులో చాలా సమర్థవంతంగా వ్యవహరిస్తోందని తెలిపారు. 2014 నుంచి 2019 వరకు దేశంలోని అన్ని రాష్ట్రాల సగటు ద్రవ్యలోటుతో పోలిస్తే, ఆంధ్రప్రదేశ్ సగటు ద్రవ్యలోటు 6.58 శాతంగా తేలిందని, ఈ మూడేళ్లలో (2019 – 2022) 5.73 శాతం మాత్రమేనని చెప్పారు. రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధిపై శుక్రవారం ఆయన అసెంబ్లీలో జరిగిన చర్చలో మాట్లాడుతూ.. అప్పుల చెల్లింపులో వాస్తవాలను ప్రజలముందుంచారు. 2018–19లో చంద్రబాబు హయాంలో గత ప్రభుత్వం రుణాల తిరిగి చెల్లింపులో వడ్డీ కింద రూ.15,342 కోట్లు, అసలు కింద రూ.13,545 కోట్లు.. మొత్తంగా రూ.28,886.69 కోట్లు చెల్లించిందని చెప్పారు. అదే మన ప్రభుత్వం వచ్చాక 2021–22లో వడ్డీ కింద రూ.21,449 కోట్లు, అసలు కింద రూ.14,559 కోట్లు.. మొత్తంగా రూ.36,008 కోట్లు చెల్లించామని స్పష్టం చేశారు. రాష్ట్ర సొంత ఆదాయం 2018–19లో రూ.62,426 కోట్లు అయితే.. అందులో రూ.28,886.69 కోట్లు.. 46.3 శాతం అప్పుల కోసం చెల్లించాల్సి వచ్చిందని తెలిపారు. 2021–22లో రూ.75,696 కోట్లు ఆదాయం ఉంటే.. అందులో 47.6 శాతం అప్పులు చెల్లించడానికి ఖర్చు చేశామన్నారు. కోవిడ్ సమయంలో అంటే 2021–22 ఏప్రిల్, మే నెలలో లాక్డౌన్ వల్ల మనకు రావాల్సిన ఆదాయానికి గండి పడిందని, అయినప్పటికీ ఇవాళ ఎకానమీ బాగుందని.. గ్రోత్ రేట్ పరుగులు తీస్తోందని తెలిపారు. ఈ ఐదేళ్లు ముగిసేసరికి గత ప్రభుత్వం కన్నా మన ప్రభుత్వం కచ్చితంగా మెరుగైన పని తీరు చూపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ చర్చలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. మూల ధన వ్యయం మనమే ఎక్కువ - రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులు, సంపద సృష్టి కోసం కాకుండా ప్రజాకర్షక పథకాలు, కార్యక్రమాలకే నిధులు వ్యయం చేస్తోందని చంద్రబాబు, ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోంది. ఇది కూడా పూర్తిగా అవాస్తవం. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో కంటే, మనందరి ప్రభుత్వం ఈ మూడేళ్లలో చాలా ఎక్కువ మొత్తాన్ని (క్యాపిటల్ ఇన్వెస్టిమెంట్) మూల ధన వ్యయం కింద ఖర్చు చేసింది. - విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న మనందరి ప్రభుత్వం వాటి కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వైద్య రంగంలో గణనీయ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇవన్నీ రాష్ట్ర ప్రజల మంచి కోసం మనం చేస్తున్నాం. - మూలధన వ్యయం కింద గత ప్రభుత్వం 2014–15లో రూ.7265 కోట్లు, 2015–16లో రూ.15,042 కోట్లు, 2016–17లో రూ.15,707 కోట్లు, 2017–18లో రూ.16,280 కోట్లు, 2018–19లో రూ.21,845 కోట్లు ఖర్చు చేసింది. ఐదేళ్లలో మొత్తం రూ.76,139 కోట్లు ఖర్చు చేసింది. ఏటా అది సగటున రూ.15,228 కోట్లు. - మనందరి ప్రభుత్వం వచ్చాక 2019–20లో మూలధన వ్యయంగా చేసిన ఖర్చు రూ.17,601 కోట్లు. 2020–21లో రూ.20,690 కోట్లు, 2021–22లో రూ.16,795 కోట్లు. ఈ మూడేళ్లలో ఏటా సగటున రూ.18,362.07 కోట్ల చొప్పున మొత్తం రూ.55,086 కోట్లు ఖర్చు చేసింది. - ఇదే సమయంలో కేంద్ర స్థాయిలో మూలధన వ్యయం (గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ జీఎఫ్‌సీఎఫ్) చూస్తే అంతకు ముందు నాలుగేళ్ల కంటే, గత మూడేళ్లలో తగ్గుతూ వస్తోంది. కేంద్రం నుంచి పన్నుల వాటా తగ్గుదల - కేంద్రం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాలకు వచ్చే వాటా, అందులో మన రాష్ట్రానికి వచ్చే వాటా కూడా మూడేళ్లుగా తగ్గుతూ వస్తోంది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు, కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 2015 నుంచి 2020 వరకు సెస్, సర్‌చార్జ్ మినహాయించి 42 శాతం మొత్తాన్ని రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉంది. - 15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు ఆ పన్నుల్లో 2025 వరకు 41% రాష్ట్రాలకు ఇవ్వాలి. కానీ కేంద్రం ఏనాడూ ఆ మొత్తంలో రాష్ట్రాలకు తమ పన్నుల ఆదాయాన్ని పంచలేదు. - 2019 నుంచి మన రాష్ట్రానికి ఆ ఆదాయం ఇంకా తగ్గింది. 2015–16లో కేంద్రానికి రూ.14,49,958 కోట్ల ఆదాయం రాగా, అందులో రాష్ట్రాలకు ఇచ్చింది రూ.5,06,193 కోట్లు. అంటే 42 శాతం ఇవ్వాల్సిన చోట 34.91 శాతం మాత్రమే ఇచ్చింది. ఐదేళ్లలో సరాసరి 34, 35 శాతం ఇస్తున్నారు. అందులో మన రాష్ట్రానికి 4.30 శాతం వస్తుంది. ఈ మూడేళ్లలో 35 శాతం కూడా రావడం లేదు. - 2015–16లో 34.91 శాతం, 2016–17లో 35.57 శాతం 2017–18లో 35.13 శాతం 2018–19లో 36.63 శాతం వస్తే.. మన ప్రభుత్వం వచ్చాక 2019–20లో 32.41 శాతం, 2020–21లో 29.35 శాతం, 2021–22లో 32.56 శాతం వచ్చింది. అయినప్పటికీ దేవుడి దయతో మెరుగైన ఆర్థిక క్రమశిక్షణ తీసుకురాగలిగాం. మన మనిషి సీఎం స్థానంలో లేడని విష ప్రచారం వాళ్ల మనిషి ముఖ్యమంత్రి స్థానంలో లేడు కాబట్టి ఈ ప్రభుత్వం మీద బురదజల్లాలన్న మైండ్‌సెట్‌తో కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. 2018–19లో ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ప్రవేశ పెట్టిన బడ్జెట్ రూ.2.28 లక్షల కోట్లు. మూడేళ్ల తర్వాత మనం ప్రవేశపెట్టిన బడ్జెట్ రూ.2.50 లక్షల కోట్లు. దాదాపు అదే బడ్జెట్. చంద్రబాబు కన్నా మనమే తక్కువ అప్పులు చేశాం. - మరి బాబు హయాంలో అమ్మఒడి, చేయూత, ఆసరా వంటి పథకాలు లేవు. అప్పుడు పెన్షన్ కేవలం ముష్టి వేసినట్టు.. రూ.1,000 ఇచ్చారు. ఇవాళ రూ.2,500 ఇస్తున్నాం. ఇవన్నీ కాకుండా మూలధన వ్యయం కూడా వాళ్ల కన్నా మన ప్రభుత్వమే ఎక్కువ చేసింది. - అప్పట్లో దోచుకో, పంచుకో, తినుకో ఒక్కటే స్కీం. చంద్రబాబు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు. ఎవరెవరికి ఎంత వాటాలు రావాలో అంత పంచుకుంటారు. ఎవరూ రాయరు, ఎవరూ చూపరు. అప్పుడప్పుడూ చంద్రబాబు మీద మా బాబు మంచోడనే రాతలు రాస్తారు. ఇవాళ అవినీతి లేదు, లంచాలు, వివక్ష కూడా లేదు. పాలనలో పారదర్శకత ఉంది. రాష్ట్ర ప్రజలందరూ ఇవన్నీ ఆలోచించాలని, వారి తప్పుడు మాటలు, అబద్ధాలను నమ్మవద్దని, ప్రభుత్వం చేసే మంచిని చూడమని ఈ సభ ద్వారా విన్నవిస్తున్నా.. అని స్పష్టం చేశారు. -
క్రెడిట్ కార్డ్ వాడకం మామూలుగా లేదుగా, తెగ కొనేస్తున్నారు!
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రతికూల ప్రభావాలు క్రమంగా తగ్గుముఖం పట్టి .. ఆర్థిక కార్యకలాపాలు, వినియోగం నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. క్రెడిట్ కార్డు, యూపీఐ చెల్లింపుల ధోరణులే ఇందుకు నిదర్శనమని నిపుణులు, మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ నెలవారీ గణాంకాల ప్రకారం ఏకీకృత చెల్లింపు విధానం (యూపీఐ) లావాదేవీలు ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ. 9.83 లక్షల కోట్లుగా ఉండగా ఆగస్టులో రూ. 10.73 లక్షల కోట్లకు చేరాయి. అలాగే పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) టెర్మినల్ ద్వారా క్రెడిట్ కార్డులతో చెల్లింపులు ఏప్రిల్‌లో రూ. 29,988 కోట్లుగా ఉండగా ఆగస్టు నాటికి రూ. 32,383 కోట్లకు చేరాయి. ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంలలో క్రెడిట్ కార్డుల వినియోగం రూ. 51,375 కోట్ల నుంచి రూ. 55,264 కోట్లకు చేరింది. 2017-2022 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో క్రెడిట్ కార్డులపై బకాయిలు వార్షిక ప్రాతిపదికన 16 శాతం మేర పెరిగినట్లు ఎస్బీఐ కార్డ్ ఎండీ రామ్మోహన్ రావు అమర తెలిపారు. ‘క్రెడిట్ కార్డులను ఉపయోగించడం పెరిగే కొద్దీ వాటితో ఖర్చు చేయడం కూడా పెరిగింది. గత కొద్ది నెలలుగా సగటున నెలకు క్రెడిట్ కార్డులపై చేసే వ్యయాలు రూ. 1 లక్ష కోట్లు దాటుతోంది. భారీ వినియోగ ధోరణులను ఇది సూచిస్తోంది. పండుగ సీజన్ రానుండటంతో ఇది మరింత పెరగవచ్చనే అంచనాలు నెలకొన్నాయి‘ అని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ ఊతం.. డిజిటల్ లావాదేవీలు ఇటు విలువపరంగా అటు అమ్మకాలపరంగా పెరుగుతుండటం ఎకానమీకి మేలు చేకూర్చే అంశమని పేనియర్‌బై ఎండీ ఆనంద్ కుమార్ బజాజ్ అభిప్రాయపడ్డారు. డిజిటల్ పేమెంట్లకు సంబంధించి వివిధ విధానాల విషయంలో భయాలను పక్కనపెట్టి ప్రజలు అలవాటు పడుతుండటాన్ని ఇది సూచిస్తోందని పేర్కొన్నారు. డిజిటల్ లావాదేవీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటం, ఆదాయాలు, స్మార్ట్ఫోన్ల వినియోగం పెరుగుతుండటం, ఇంటర్నెట్ కనెక్టివిటీ మెరుగు పడుతుండటం వంటి అంశాలు ఆన్లైన్ చెల్లింపుల వృద్ధికి దోహదపడుతున్నాయని బజాజ్ చెప్పారు. మరింతమంది వర్తకులు డిజిటల్ పేమెంట్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటూ ఉండటం మరో సానుకూలాంశమని వివరించారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల వారు కూడా యూపీఐని ధీమాగా వినియోగిస్తుండటంతో ప్రస్తుత పండుగ సీజన్లో ఈ విధానంలో చెల్లింపులు మరింతగా పెరిగే అవకాశం ఉందని సర్వత్రా టెక్నాలజీస్ ఎండీ మందర్ అగాషే చెప్పారు. మరోవైపు, డెబిట్ కార్డులు కాకుండా క్రెడిట్ కార్డుల ద్వారా చేసే ఖర్చులు పెరుగు తుండటానికి రెండు పార్శా్వలు ఉండవచ్చని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ (ఎకనమిక్ అడ్వైజరీ సర్వీసెస్) రణేన్ బెనర్జీ తెలిపారు. కుటుంబాలు నిజంగానే మరింతగా ఖర్చు చేస్తూ ఉండటం ఒక కోణం కాగా, ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా రుణాలపై ఆధారపడుతుండటం మరో కోణం కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. -
ఫీచర్ ఫోన్ యూజర్లకు ఊరట: వాయిస్‌తో యూపీఐ చెల్లింపులు
న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) పేమెంట్ సేవల్లో ఫీచర్ ఫోన్ వినియోగదారులకు భారీ ఊరట లభించనుంది. ఇప్పుడు బహుళ భాషల్లో వాయిస్ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేసుకోవచ్చు. వీటిలో హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ , బెంగాలీ భాషల్లోఇది అందుబాటులోఉంది. ఈ సేవ త్వరలో గుజరాతీ, మరాఠీ,పంజాబీ వంటి ఇతర భాషలలో అందుబాటులోకి రానుంది. ఎన్ఎస్డీఎల్పేమెంట్స్ బ్యాంక్ ఎన్పీసీఐ భాగస్వామ్యంతో టోన్‌ట్యాగ్ ఈ సౌకర్యాన్ని అభివృద్ధి చేసింది. ఈ ఫీచర్ దేశంలోని 400 మిలియన్ల ఫీచర్ ఫోన్ వినియోగదారులను వాయిస్ ద్వారా చెల్లింపు సేవలను యాక్సెస్ చేయడానికి అనుమతినిస్తుంది యూపీఐ పేమెంట్స్ స్మార్ట్ ఫోన్‌కు మాత్రమే పరిమితం కాకుండా ఏడాది మార్చిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సహకారంతో ఫీచర్ ఫోన్వినియోగదారులకు 'యూపీఐ 123పే' ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండా చెల్లింపులు చేసుకునే సౌలభ్యం వారికి లభించింది. ఇప్పుడు, VoiceSe అనే ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అంటే ఫీచర్ ఫోన్ వినియోగదారులు తమకు నచ్చిన భాషలో మాట్లాడి యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు. ఈ చెల్లింపుల కోసం వినియోగదారులు 6366 200 200 ఐవీఆర్ నంబర్‌కు కాల్ చేసి, తమ ప్రాంతీయ భాషను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కేవలం యుటిలిటీ బిల్లు చెల్లింపులు, బ్యాలెన్స్ ఎంక్వైరీ, ఫాస్ట్‌ట్యాగ్ యాక్టివేషన్ లేదా రీఛార్జ్ వంటివి చేసుకోవచ్చు, నిధులను బదిలీ చేయలేరు. టోన్‌ట్యాగ్ సహ వ్యవస్థాపకుడు, ల్యాబ్స్ డైరెక్టర్ వివేక్ సింగ్ మాట్లాడుతూ 100 శాతం డిజిటల్ అక్షరాస్యత లేదా స్మార్ట్‌ఫోన్‌పై ఆధారపడని డిజిటల్ చెల్లింపు పరిష్కారాలను అందించేందుకు, సిరి , అలెక్సాలకు మించిన వాయిస్ టెక్నాలజీని పరిశీలిస్తున్నామన్నారు. -
మెరుగ్గానే రిటైల్ రుణ వసూళ్లు
ముంబై:ఇటీవలి కాలంలో పెరిగిపోయిన వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం ప్రభావం సెక్యూరిటైజ్డ్ రిటైల్ రుణాల చెల్లింపులపై లేదని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. తాను రేటింగ్ ఇచ్చే సెక్యూరిటైజ్డ్ రుణాలకు సంబంధించి నెలవారీ వసూళ్ల రేషియో ఏ మాత్రం ప్రభావితం కాలేదని పేర్కొంది. రిటైల్ రుణ గ్రహీతలకు సంబంధించి చెల్లింపుల ట్రాక్ రికార్డు బలంగా ఉందని, ఆర్థిక కార్యకలాపాల్లో పురోగతి ఇందుకు మద్దతుగా నిలుస్తున్నట్టు వివరించింది. ఆర్బీఐ ఈ ఏడాది మే నుంచి మూడు విడతలుగా 1.4 శాతం మేర రెపో రేటను పెంచడం తెలిసిందే. దీంతో డిపాజిట్లు, రుణాలపై రేట్లు పెరిగేందుకు దారితీసింది. మార్ట్గేజ్ ఆధారిత సెక్యూరిటైజేషన్ రుణాల వసూళ్లు పుంజుకున్నట్టు వివరించింది. ఇక వాణిజ్య వాహన రుణాల వసూళ్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో 105 శాతంగా ఉంటే, అవి జూన్ చివరికి 98 శాతానికి తగ్గినట్టు క్రిసిల్ తెలిపింది. చమురుపై పన్ను, సుంకాలు మోస్తరు స్థాయికి రావడంతో అది అంతమంగా వినియోగదారుడికి ఊరటనిచ్చినట్టు పేర్కొంది. ‘‘ద్విచక్ర వాహన రుణాల వసూళ్లు స్థిరంగా ఉన్నాయి. నెలవారీ కలెక్షన్ల రేషియో గత కొన్ని నెలలుగా 98–99 శాతంగా కొనసాగుతోంది. ఎంఎస్ఎంఈ రుణాల వసూళ్లు 97 శాతం నుంచి 95 శాతానికి తగ్గాయి’’అని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక తెలిపింది. -
డబుల్‌పేమెంట్ జరిగిందా? స్టాక్మార్కెట్లో నష్టాలా? రిఫండ్ ఎలా?
ప్ర. నా పాన్ అకౌంటు, బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేశాను. డిపార్ట్మెంట్ వారు ‘‘రిఫండ్ ఫెయిల్’’ అని మెసేజీలు పంపుతున్నారు. బ్యాంకు వారిని సంప్రదిస్తే, ‘‘ఈ సమస్య మాది కాదు.. ఆదాయ పన్ను శాఖదే’’ అంటున్నారు. ఏం చేయాలి? – రాజు లక్ష్మి, ఈమెయిల్ ద్వారా జ. ఇటువంటి సమస్యలు చాలా వస్తున్నాయి. నిజంగా రెండూ అనుసంధానం అయిన పక్షంలో ‘‘రిఫండ్ ఫెయిల్’’ అయిందంటున్నారు కాబట్టి రెండు వైపులా చెక్ చేయండి. బ్యాంకులో మళ్లీ సంబంధించిన కాగితాలివ్వండి. ఆ తతంగం ముగిసిన తర్వాత డిపార్ట్మెంట్ సైట్లోకి వెళ్లి మీ రిఫండ్ క్లెయిమ్ బ్యాంకు వివరాలను అప్డేట్ చేసి, రీవేలిడేట్ చేయండి. సాంకేతిక సమస్యల వల్ల రికార్డులను అప్డేట్ చేయడంలో జాప్యం జరుగుతోంది. రీవేలిడేట్ చేసిన తర్వాత రిఫండు వస్తుంది. మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రాసెసింగ్‌లో ఉండి ఉంటే ఫర్వాలేదు. లేదంటే పోర్టల్‌లో ఒక కంప్లెయింట్ ఇవ్వండి. గ్రీవెన్సును నమోదు చేయవచ్చు. ( జ. సీపీసీ నుండి 143 (1) సమాచారం వచ్చింది. ‘‘సమాచారం మెయిల్‌కి పంపుతున్నాము. డిమాండ్ ఉంది .. చెల్లించాలి’’ అని ఉంది. ఏం చేయాలి. – కర్ణ, ఈ–మెయిల్ ద్వారా జ. గత వారాల్లో 143 (1) సమాచారం గురించి సవివరంగా తెలియజేశాం. 143 (1) సెక్షన్ సమాచారం కోసం, మెయిల్ కోసం వేచి ఉండండి. ఆ ఆర్డరులో ఏయే కారణాల వల్ల డిమాండ్ ఏర్పడిందో విశ్లేషించండి. అది కరెక్టు అయితే చెల్లించండి. కాకపోతే విభేదిస్తూ జవాబు ఇవ్వవచ్చు. సరిదిద్దవచ్చు. తగినకాలంలో సమాధానం ఇవ్వడం మర్చిపోవద్దు. ప్ర. నేను ఉద్యోగిని. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నా. నష్టం వచ్చింది. జీతం రూ. 5,00,000 దాటింది. రిటర్ను వేయాలా? ట్యాక్స్ ఎంత చెల్లించాలి? – మహ్మద్ షకీర్, ఈ–మెయిల్ ద్వారా జ. ఒక వ్యక్తికి ఒక పాన్ ఉండాలి. అలాంటి వ్యక్తి ఎన్ని సోర్స్‌ల ద్వారా ఆదాయం వచ్చినా ఒకే రిటర్నులో చూపించి ఒకేసారి వేయాలి. మీరు మీ జీతం వివరాలు, స్టాక్ మార్కెట్ వ్యవహారాలతో కలిపి ఒక రిటర్ను వేయాలి. స్టాక్ మార్కెట్లో 31-03-2023 నాటికి ఏర్పడ్డ లాభనష్టాలను తేల్చి, తెలుసుకుని వేయాలి. మీ బ్రోకింగ్ సంస్థ ఒక స్టేట్మెంట్ ఇస్తుంది. అన్ని వివరాలుంటే తప్ప పన్ను భారం నిర్ధారించలేము. ప్ర. ప్రభుత్వం డిడక్ట్ చేసిన టీడీఎస్ ఫారం 26ఏఎస్‌లో నమోదు కాలేదు. ఆ మేరకు డైరెక్టుగా చెల్లించి, రిటర్న్ దాఖలు చేశాను. ఈ నెలలో టీడీఎస్ పద్దులు నమోదయ్యాయి. – సుధా భరత్, ఈ-మెయిల్ ద్వారా జ. ఫారం 26ఏఎస్‌లో చెల్లింపుల గురించి మనం గత వారమే తెలుసుకున్నాం. ఎంట్రీలు ఆలస్యంగా పడటం, పడకపోవడం, తప్పులు పడటం వంటి ఉదాహరణలు ఎన్నో ఉంటున్నాయి. మీ కేసులో డబుల్ పేమెంటు జరిగినట్లు. మీరు చేసిన చెల్లింపు, టీడీఎస్ ఒకే ఆర్థిక సంవత్సరానికి సంబంధించినట్లయితే ఈ లోపల డిపార్టుమెంటు వారు అసెస్మెంటు చేసి రిఫండు ఇస్తారు. లేదా మీ అంతట మీరే స్వయంగా రివైజ్ చేసుకోవచ్చు. ఏదేనీ కారణం వల్ల ఎంట్రీలు తప్పుగా పడితే సరిదిద్దండి. సంవత్సరం మారితే డబుల్ పేమెంటు కాదు. ఒకే సంవత్సరానికి సంబంధించి, ఒకే ఆదాయం అయితే మీకు రిఫండు వస్తుంది. కేసీహెచ్ ఏవీఎస్‌ఎన్ మూర్తి, కేవీఎన్ లావణ్య -
TTD: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. తిరుమలలో యూపీఐ(Unified Payments Interface) విధానాన్ని ప్రవేశపెట్టినట్టు టీటీడీ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, పైలట్ ప్రాజెక్టు కింద గదుల కేటాయింపులో యూపీఐ విధానాన్ని అమలు చేస్తున్నట్టు టీటీడీ తెలిపింది. ఇక, త్వరలోనే తిరుమలలో అన్ని చెల్లింపులు యూపీఐ విధానంలోనే చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇది కూడా చదవండి: భక్తులకు గమనిక: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎప్పుడంటే.. -
క్రెడిట్ కార్డ్ ద్వారా యూపీఐ చెల్లింపులు: లింకింగ్ ఎలా?
సాక్షి, ముంబై: డిజిటల్ ఇండియాలో భాగంగా రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా వినియోగదారులకు కొత్త అవకాశాన్ని ప్రకటించింది. క్రెడిట్ కార్డ్ ద్వారా యూపీఐ లావాదేవీలకు అనుమతినివ్వనుంది. ద్వైమాసిక పాలసీ సమీక్ష, రెగ్యులేటరీ ప్రకటన సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం ఈ విషయాన్ని వెల్లడించారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌ను మరింత ప్రోత్సహించే లక్ష్యంలో భాగంగా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుందని శక్తికాంత దాస్ తెలిపారు. ఆర్బీఐ ప్రమోట్ చేసిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పిసిఐ) జారీ చేసిన రూపే క్రెడిట్ కార్డ్‌లతో తొలుత ఈ అవకాశాన్ని కల్పిస్తామని చెప్పారు. దీనికవసరమైన సిస్టమ్ డెవలప్మెంట్ పూర్తయిన తర్వాత తగిన సూచాలు అందిస్తామన్నారు. అలాగే యూపీఐలో మొత్తం 26 కోట్ల మంది ప్రత్యేక వినియోగదారులు, 5 కోట్ల మంది వ్యాపారులు ఉన్నారనీ మే నెలలో 594.63 కోట్ల యూపీఐ లావాదేవీల ద్వారా రూ.10.40 లక్షల కోట్లు ట్రాన్సాక్షన్స్ జరిగాయని ప్రకటించారు. ఆర్బీఐ ప్రకటించిన ఈ వెసులుబాటుతో యూపీఏ ప్లాట్‌ఫామ్స్‌కు క్రెడిట్ కార్డును లింక్ చేసి, కార్డు స్వైప్ చేయ కుండానే పేమెంట్స్ చేసుకోవచ్చు. అంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లేదా మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేసి క్రెడిట్ కార్డు చెల్లింపులు చేయవచ్చన్న మాట. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే వన్‌టైం పాస్వర్డ్ ఎంటర్ చేసిన తరువాత మాత్రమే పేమెంట్ పూర్తి చేయవచ్చు. కాగా ఇప్పటివరకు యూపీఐ ఖాతాలకు కేవలం డెబిట్ కార్డులను మాత్రమే లింక్ చేసుకునే సౌకర్యం ఉన్న సంగతి తెలిసిందే. అలాగే గూగుల్‌పే, ఫోన్ పే, పేటీఎం తదితర యూపీఐ ఆధారిత యాప్స్‌ను ఎంపిక చేసిన బ్యాంకులు క్రెడిట్, డెబిట్ కార్డు చెల్లింపులకు అనుమతిస్తున్నాయి. పేమెంట్స్ యాప్స్‌తో క్రెడిట్ కార్డ్ అనుసంధానం ఎలా? ♦ పేమెంట్ యాప్‌ను ఓపెన్ చేసి ప్రొఫైల్ పిక్చర్ పైన క్లిక్ చేయాలి. ♦ ఆ తర్వాత పేమెంట్ మెథడ్‌ను క్లిక్ చేస్తే యాప్‌లో బ్యాంకు అకౌంట్స్ జాబితా కనిపిస్తుంది ♦ ఇక్కడ యాడ్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు పైన క్లిక్ చేయాలి. ♦ తరువాత కార్డు నెంబర్, ఎక్స్పైరీ డేట్, సీవీవీ, కార్డ్ హోల్డర్ పేరు నమోదు చేసి, సేవ్ను క్లిక్ చేస్తే సరిపోతుంది. -
రూ.90తో మొదలై.. రూ.250 కోట్లకు!
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఈ– చలాన్ జరిమానా బకాయిలను భారీగా తగ్గించుకోవడానికి అవకాశం కల్పిస్తున్న ఈ– లోక్ అదాలత్ ఈ నెల 1న మొదలైంది. ఆ రోజు తెల్లవారుజామున 1.24 గంటలకు ఓ వాహనదారు తన ద్విచక్ర వాహనంపై ఉన్న జరిమానా మొత్తంలో రిబేటు పోను రూ.90 చెల్లించారు. ఇదే ఈ– లోక్ అదాలత్‌కు సంబంధించిన తొలి చెల్లింపు. ఇలా మొదలైన చెల్లింపులు బుధవారం నాటికి రూ.250 కోట్లకు చేరాయి. తొలుత ప్రకటించిన దాని ప్రకారం గురువారంతో ఈ– లోక్ అదాలత్ ముగియనున్న నేపథ్యంలో మరో 15 రోజుల పాటు ప్రభుత్వం గడువు పొడిగించిందని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. మొత్తమ్మీద రాష్ట్ర వ్యాప్తంగా కొన్నేళ్లుగా పేరుకు పోయిన ఈ–చలాన్ బకాయిలు రూ.1700 కోట్ల వరకు ఉన్నాయి. బుధవారం వరకు 2.57 కోట్ల చలాన్లకు సంబంధించి రూ.250 కోట్లను వాహనచోదకులు చెల్లించారు. ఈ స్కీమ్ ప్రారంభమైన తొలినాళ్లల్లో రోజువారీ చెల్లింపులు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉండగా... సోమవారం నుంచి ఇది రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఈ– లోక్ అదాలత్‌ను ఏప్రిల్ 15వ తేదీ వరకు ప్రభుత్వం గడువు పొడిగించిందని ట్రాఫిక్ అధికారులు పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారానే రూ.60 కోట్లు.. ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల చెల్లింపులు అత్యధికంగా పేటీఎం ద్వారా జరిగాయి. ఈ నెల 1 నుంచి ఇప్పటివరకు పేటీఎం, వాలెట్, యూపీఐ, పోస్ట్‌పెయిడ్, నెట్‌బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డ్‌ల ద్వారా రూ.60 కోట్ల ఈ– చలాన్ చెల్లింపులు జరిగాయి. (చదవండి: నిర్లక్ష్యం చూపారు.. నిలువెల్లా దోచారు) -
విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్! ఎయిర్‌లైన్స్‌కు పేమెంట్స్ ప్లాట్‌ఫామ్
ముంబై: దేశీ విమానయాన పరిశ్రమ కోసం పేమెంట్ ప్లాట్‌ఫామ్‌ను ప్రవేశపెట్టేందుకు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్(ఐఏటీఏ)తో చేతులు కలిపినట్లు గ్లోబల్ బ్యాంకింగ్ గ్రూప్ స్టాన్‌చార్ట్ తాజాగా వెల్లడించింది. దీనిలో భాగంగా ప్రస్తుతమున్న క్రెడిట్ కార్డులు తదితర అవకాశాలుకాకుండా ఐఏటీఏ పే ద్వారా కొత్తతరహా ఇన్స్టంట్ చెల్లింపులకు తెరతీయనున్నట్లు తెలియజేసింది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా యూపీఐ స్కాన్, పే, యూపీఐ కలెక్ట్ తదితరాలతో చెల్లింపులకు విమానయాన సంస్థలు వీలు కల్పించనున్నట్టు పేర్కొంది. ఈ తరహా సేవలు ఇప్పటికే యూరోపియన్ మార్కెట్లలో అందుబాటులో ఉన్నట్లు తెలియజేసింది. రియల్ టైమ్ చెల్లింపుల దేశీ పథకం యూపీఐ అండతో కస్టమర్లు విమాన టికెట్ల కొనుగోలుకి తమ బ్యాంకు ఖాతాల నుంచి అప్పటికప్పుడు చెల్లించేందుకు వీలు కలి్పంచనున్నట్లు వివరించింది. ప్లాట్‌ఫామ్‌ను దేశీయంగా ప్రారంభించాక ఐఏటీఏ ఈ సర్వీసులను ఇతర మార్కెట్లలోనూ ఆవిష్కరించేందుకు మద్దతివ్వనున్నట్లు స్టాన్‌చార్ట్ పేర్కొంది. -
వాణిజ్యంపై రష్యా–ఉక్రెయిన్ దెబ్బ..
న్యూఢిల్లీ: రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతలతో భారత వాణిజ్యంపై ప్రభావం పడనుంది. ఎగుమతులు, చెల్లింపులు, చమురు ధరలు మొదలైనవి కాస్త సమస్యాత్మకంగా మారనున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతాలకు చేసే ఎగుమతులను ఆపి ఉంచాలని ఎగుమతిదారులకు సూచించినట్లు ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో డైరెక్టర్–జనరల్ అజయ్ సహాయ్ తెలిపారు. యుద్ధం ఎన్నాళ్లు కొనసాగుతుందన్న దానిపై వాణిజ్యంపై ఎంత ప్రభావం పడుతుందన్నది ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ‘కోవిడ్–19 మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా.. ఇది మరో పెద్ద ఎదురుదెబ్బ. ఆ ప్రాంతంలో (రష్యా, ఉక్రెయిన్) వ్యాపార లావాదేవీల విషయంలో ఎగుమతిదారులు అప్రమత్తంగా ఉన్నారు‘ అని సహాయ్ వివరించారు. రష్యా, భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా 9.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఉక్రెయిన్‌తో ద్వైపాక్షిక వాణిజ్యం 2.3 బిలియన్ డాలర్లుగా ఉంది. అటు రష్యా, ఉక్రెయిన్‌తో పాటు ఆ ప్రాంతంలోని ఇతర దేశాలకు ఔషధాలను ఎగుమతి చేసే విషయంలో వేచి చూసే ధోరణి పాటిస్తున్నట్లు ఫార్మా పరిశ్రమ వర్గాలు తెలిపాయి. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని .. ఆ ప్రాంతంలోని తమ ఉద్యోగుల క్షేమంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ వర్గాలు తెలిపాయి. ‘ ఆయా దేశాలకు ఫార్మా ఎగుమతులపై ప్రస్తుతం ఆంక్షలేమీ లేవు. అయినప్పటికీ పరిస్థితులపై మరింత స్పష్టం వచ్చే వరకూ కాస్త వేచి చూడాలని భావిస్తున్నాం. అంతిమంగా యుద్ధ ఫలితంగా మాకు రావాల్సిన చెల్లింపులపై ప్రభావం పడకూడదు కదా‘ అని మరో ఫార్మా సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. ఫార్మా ఎగుమతి ప్రోత్సాహక మండలి (ఫార్మెక్సిల్) గణాంకాల ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరంలో ఉక్రెయిన్‌కు 181 మిలియన్ డాలర్లు, రష్యాకు 591 మిలియన్ డాలర్ల విలువ చేసే ఔషధాలు భారత్ నుంచి ఎగుమతి అయ్యాయి. గోధుమలపరంగా అవకాశాలు.. ప్రస్తుత సంక్షోభంతో గోధుమల ఎగుమతులను మరింతగా పెంచుకునేందుకు అవకాశాలు ఉన్నాయని, ఎగుమతిదారులు వీటిని అందిపుచ్చుకోవాలని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా గోధుమల ఎగుమతుల్లో రష్యా, ఉక్రెయిన్ వాటా పావు భాగం పైగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యధికంగా రష్యా ఎగుమతి చేస్తోంది. ఈజిప్ట్ అత్యధికంగా ఏటా 4 బిలియన్ డాలర్లపైగా విలువ చేసే గోధుమలను దిగుమతి చేసుకుంటోంది. ఇందులో రష్యా, ఉక్రెయిన్ల వాటా 70 శాతం మేర ఉంటుంది. అలాగే టర్కీ, బంగ్లాదేశ్‌లు కూడా రష్యా నుంచి గోధుమలు భారీగా కొనుగోలు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రష్యాపై ఆంక్షలు గానీ అమలైతే.. వివిధ దేశాలకు గోధుమలపరంగా దేశీ ఎగుమతిదారులకు అవకాశాలు లభించవచ్చని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. -
ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ పేమెంట్స్ చేయండిలా..!
Money Transfer Using UPI Without Internet: ప్రస్తుత ఈ డీజీటల్ ప్రపంచంలో టెక్నాలజీ వినియోగం పెరిగిపోతున్న కొద్ది కొత్త కొత్త సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. మొబైల్ అందుబాటులోకి వచ్చిన కొత్తలో స్మార్ట్‌ఫోన్ నుంచి పేమెంట్స్ చేసే విధానం వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ, ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లోనే బ్యాంకింగ్ లావాదేవీలన్నీ సులువుగా జరుగుతున్నాయి. ప్రజలు రోజుకు లక్షల రూపాయలను క్షణాల్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అయితే, ఈ సేవలన్నీ వాడుకోవాలంటే స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ ఉండాలి. కానీ, ఇంటర్నెట్ లేకున్నా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనే విషయం మనలో ఎందరికి తెలుసు. అవును, మీరు విన్నది నిజమే!. మన స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ లేకున్నా ఇతరులకు డబ్బులు పంపించే అవకాశం ఉంది. వినియోగదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి సులువుగా లావాదేవీలు జరపొచ్చు. ఆఫ్‌లైన్‌లో యూపీఐ లావాదేవీలు ఉపయోగించుకోవడానికి యూజర్లు *99# డయల్ చేయాల్సి ఉంటుంది. USSD 2.0 పద్ధతి ద్వారా ఈ సర్వీస్ ఉపయోగించుకోవడానికి వీలుంటుంది. అయితే, ఈ విధానాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) తీసుకొచ్చింది. ఆగస్టు 2016లో ఎన్పీసీఐ రెండు డీజీటల్ చెల్లింపు పద్ధతులను(యుపీఐ & *99#) ఇంటిగ్రేట్ చేసింది. ఇప్పుడు యూపీఐ లావాదేవీలకు ఇదే నెంబర్‌ను యూజర్లు ఉపయోగించుకోవచ్చు. మరి ఇంటర్నెట్ లేకపోయినా డబ్బులు పంపడానికి ఏఏ స్టెప్స్ ఫాలో కావాలో తెలుసుకోండి. స్మార్ట్‌ఫోన్‌లో *99# సౌకర్యాన్ని ఎలా ఉపయోగించాలి? మీ స్మార్ట్‌ఫోన్‌లో డయల్ ప్యాడ్ ఓపెన్ చేసి *99# అని టైప్ చేయండి. ఇప్పుడుMy Profile', 'Send Money', 'Receive Money', 'Pending Requests', 'Check Balance', 'UPI PIN', 'Transactions' అనే కొన్ని ఆప్షన్స్ వస్తాయి. డబ్బులు పంపాలంటే డయల్ ప్యాడ్‌లో 1 ప్రెస్ చేసి Send Money ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు మీరు మీరు ఫోన్ నెంబర్, యూపీఐ ఐడీ, అకౌంట్ నెంబర్ నుంచి డబ్బులు పంపే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఈ పేమెంట్స్ మెథడ్‌లో ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఫోన్ నెంబర్ సెలెక్ట్ చేస్తే మీరు ఎవరికి డబ్బులు పంపాలో వారి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు యుపీఐని ఎంచుకున్నట్లయితే, అప్పుడు మీరు యుపీఐ ఐడీని నమోదు చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే 11 అంకెల ఐఎఫ్ఎస్సీ కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీరు ఎంత మొత్తం పంపాలనుకుంటున్నారో టైప్ చేయాలి. ఆ తర్వాత మీ యూపీఐ పిన్ నమోదు చేసి send పైన క్లిక్ చేయాలి. ఇలా చేస్తే మీ అకౌంట్ నుంచి అవతలి వారి అకౌంట్లోకి డబ్బులు వెళ్తాయి. డబ్బు బదిలీ చేసిన తర్వాత రిఫరెన్స్ ఐడితో పాటు ఇతర లావాదేవీల వివరాలు కనిపిస్తాయి. భవిష్యత్తు లావాదేవీల కోసం లబ్ధిదారుడీగా గ్రహీతను సేవ్ చేయమని మిమ్మల్ని కోరుతుంది. ఈ సర్వీస్ ఉపయోగించడం వల్ల రూ.0.50 స్వల్ప ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానం ద్వారా గరిష్టంగా రూ.5 వేలు మాత్రమే పంపించడానికి అవకాశం ఉంటుంది. (చదవండి: ఓలా ఎలక్ట్రిక్ సంచనలం.. దేశంలో మరో భారీ ప్లాంట్ నిర్మాణం!) -
వరుస ఫెయిల్యూర్స్.. అయినా తగ్గలా.. ‘స్లైస్ పే’ రూపంలో గట్టి సక్సెస్ కొట్టి మరీ..
ఫెయిల్యూర్స్ అనేవి ఒకదాని తరువాత ఒకటి వరుస కడితే, ఎవరైనా ఏంచేస్తారు? ‘ఇక చాలు నాయనా’ అని వెనక్కితగ్గుతారు. సక్సెస్‌ను గట్టిగా కోరుకునేవారు మాత్రం ‘తగ్గేదేలా’ అనుకుంటారు. రాజన్ బజాజ్ ఈ కోవకు చెందిన యువకుడు. మూడు ఫెయిల్యూర్స్ తరువాత...‘స్లైస్ పే’ రూపంలో గట్టి సక్సెస్ కొట్టిన ఘనుడు... ‘బజాజ్’ అనే మాట వినిపించగానే పెద్ద పెద్ద కంపెనీలు గుర్తుకు వస్తాయి. అయితే ఈ ‘బజాజ్’కు రాజస్థాన్ అల్వార్‌లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన రాజన్ బజాజ్‌కు బీరకాయ పీచు బంధుత్వం కూడా లేదు. ఐఐటీ–ఖరగ్‌పూర్‌లో చదువుపూర్తయిన తరువాత రాజన్ ‘ఫ్లిప్‌కార్ట్’లో ఉద్యోగం చేశాడు. పదినెలల తరువాత... ‘ఇలా అయితే ఎలా?’ అనుకున్నాడు. దీనికి కారణం ఏదైనా ఒక స్టార్టప్ స్టార్ట్ చేసి స్టార్ అనిపించుకోవాలనేది తన కల. ‘ఫ్లిప్‌కార్ట్’లో తనకు చాలా బాగుంది. ఇలా సంతృప్తి పడి అక్కడే ఉంటే, తన కల కూడా కదలకుండా అక్కడే ఉంటుందని తనకు తెలుసు. ఉద్యోగం వదిలేసిన తరువాత... బెంగళూరులో ‘మెష్’ పేరుతో గేమింగ్ కన్సోల్స్, కెమెరా, డీవిడీలు అద్దెకు ఇచ్చే బిజినెస్‌ను స్టార్ట్ చేశాడు. తన బైక్‌పై తిరుగుతూ ఆర్డర్స్ డెలివరీ చేసేవాడు. ‘అద్దెకు తీసుకునే అవకాశం ఉన్నప్పుడు సెకండ్ హ్యాండ్, థర్డ్‌హ్యాండ్ నాసిరకం వస్తువులు మీకేలా?’ అనేది తన నినాదం అయింది. రెండు నెలల తరువాత డెలివరీ బాయ్‌ని నియమించుకున్నాడు. రెంటల్‌కు మార్కెట్ పెద్దగా లేకపోవడం, డ్యామేజీ...మొదలైన కారణాలతో ‘మెష్’కు టాటా చెప్పాడు. ఆ తరువాత ‘కార్ అండ్ బైక్’ రెంటల్ బిజినెస్‌లోకి వచ్చాడు. రోజుకు 20 నుంచి 30 వరకు ఆర్డర్లు వచ్చేవి. యాక్సిడెంట్స్ వల్ల వచ్చే నష్టాలు, కార్ల నిర్వాహణ కష్టం కావడంతో ఈ వ్యాపారానికి కూడా ‘బైబై’ చెప్పాడు. ఆ తరువాత ‘ఫర్నిచర్ రెంటల్’ బిజినెస్‌లోకి దిగాడు. ఇది కూడా నిరాశపరిచింది. ఆగిపోయాడు... ఆలోచించాడు... ‘చేసింది చాలు ఇక రాజస్థాన్‌కు వెళ్లిపోదాం’ అనుకోలేదు. పోయిన చోటే వెదుక్కోవాలి అంటారు కదా! ఆగిపోయాడు. ఆలోచించాడు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ‘బై–నౌ–పే–లాటర్’ (బీఎన్‌పీఎల్) వెంచర్ గుర్తుకు వచ్చింది. ఆ తరహాలోనే యువతరాన్ని లక్ష్యంగా పెట్టుకొని ‘స్లైస్ పే’ను స్టార్ట్ చేశాడు. ఇఏంఐ పేమెంట్స్ సర్వీస్‌గా చిన్న స్థాయిలో మొదలైన ‘స్లైస్’ ఇండియాలో చెప్పుకోదగ్గ ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీగా ఎదిగి, అమెరికన్ మల్టీనేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ ‘విసా’తో భాగస్వామ్యం కుదుర్చుకునే స్థాయికి ఎదిగింది. రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ) లైసెన్స్ తీసుకుంది. ‘స్లైస్’ స్టార్టప్ మెగా సక్సెస్ వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ‘గతంతో పోల్చితే యంగ్ జెనరేషన్‌కు క్రెడిట్ యాక్సెస్‌ను సులభతరం చేసింది స్లైస్’ అంటారు విశ్లేషకులు. మరి రాజన్‌ను అడిగి చూడండి. ఇలా అందంగా చెబుతాడు... ‘ఫెయిల్యూర్స్ గెలుపు పాఠాలు చెబుతాయి. అవి ఎవరికి వారు తెలుసుకోవాల్సిందే’ ! చదవండి: Suman Kalyanpur: ఓడిన కోకిల... ఆమె గొంతు కూడా అచ్చు లతా గొంతులాగే.. -
ఏజీఎస్ ట్రాన్సాక్ట్ ఐపీవో 19న
న్యూఢిల్లీ: పేమెంట్ సొల్యూషన్స్ అందించే ఏజీఎస్ ట్రాన్సాక్ట్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 19న ప్రారంభంకానుంది. 21న ముగియనున్న ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 680 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. అయితే తొలుత రూ. 800 కోట్లు సమకూర్చుకోవాలని వేసిన ప్రణాళికలను తాజాగా సవరించుకుంది. ఐపీవోలో భాగంగా కంపెనీ ప్రమోటర్‌తోపాటు, ప్రస్తుత వాటాదారులు రూ. 680 కోట్ల విలువైన ఈక్విటీని విక్రయానికి ఉంచనున్నారు. ప్రధానంగా ప్రమోటర్ రవి బి.గోయల్ రూ. 677 కోట్లకుపైగా విలువైన షేర్లను ఆఫర్ చేయనున్నారు. తొలుత రూ. 792 కోట్ల విలువైన ఈక్విటీని విక్రయించాలని ప్రణాళికలు వేయడం గమనార్హం. కాగా.. కంపెనీ సమీకృత ఓమ్నీ చానల్ పేమెంట్ సొల్యూషన్స్ అందిస్తోంది. ప్రధానంగా బ్యాంకులు, కార్పొరేట్లకు డిజిటల్, నగదు ఆధారిత సొల్యూషన్స్ సమకూర్చుతోంది. ఇంతక్రితం 2015లో ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్ రూ. 1,350 కోట్ల పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తదుపరి 2018లో ఐపీవో ద్వారా రూ. 1,000 కోట్ల సమీకరణకు సెబీ నుంచి అనుమతులు పొందింది. అయితే ఈ ప్రణాళికలను అమలు చేయలేదు. -
అమెరికా ‘రు(ర)ణ’ రాజకీయం!
అమెరికా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. దేశం అప్పులు.. వాటి చెల్లింపులను అడ్డుపెట్టుకుని ఆడుతున్న రాజకీయ నాటకం ఇంకొన్ని వారాలపాటు సాగనుంది. ఆర్థిక శాఖ మంత్రి జానెట్ ఎల్లెన్ తాజా ప్రకటనను బట్టి పరిమితిని సకాలంలో పెంచకపోతే డిసెంబరు 15వ తేదీ తరువాత అగ్రరాజ్యం అమెరికా చరిత్రలోనే తొలిసారి రుణ వాయిదాలను చెల్లించలేని పరిస్థితి ఎదుర్కోనుంది. అమెరికాకు అప్పులేంటి? చెల్లించ లేకపోవడం ఏమిటని ఆశ్చర్యపోనవసరం లేదు. ఎంత చెట్టుకు అంత గాలి అంటారు కదా.. అలాగే ఇదీనూ. కాకపోతే ఇక్కడ సమస్య డబ్బుల్లేకపోవడం కాదు. అప్పులపై ఉన్న పరిమితిని పెంచితేగానీ ప్రభుత్వం తన మాట నిలబెట్టుకునే పరిస్థితి లేకపోవడం!! పెంచకపోతే ఏమవుతుంది? రుణ పరిమితిని పెంచకపోతే అమెరికా తొలిసారి తాను చెల్లించాల్సిన రుణ వాయిదాలను చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అక్టోబరులో ఈ మొత్తం దాదాపు 28 లక్షల కోట్ల డాలర్ల వరకూ ఉంది. సకాలంలో రుణ వాయిదా చెల్లించకపోవడం ప్రతి ప్రభుత్వ కార్యక్రమంపై ప్రభావం చూపుతుంది. రాష్ట్రాలకు అందే నిధులు తగ్గుతాయి. గోల్డ్‌మ్యాన్ శాక్స్ సంస్థ అంచనా ప్రకారం సకాలంలో రుణ పరిమితి పెంచని పక్షంలో అమెరికన్ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందే ఆర్థికసాయంలో నలభైశాతం కోత పడే అవకాశం ఉంది. రక్షణ దళాల సిబ్బందికి పూర్తిస్థాయిలో, సకాలంలో వేతనాలు, ఫింఛన్ల వంటివి చెల్లించలేమని పెంటగాన్ అక్టోబరులోనే ఒక ప్రకటన జారీ చేసింది. వాయిదా చెల్లింపులో విఫలమైతే అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా విశ్వసనీయత దెబ్బతింటుంది. వడ్డీ రేట్లు పెరిగే అవకాశమూ ఉంది. ఇవన్నీ కలగలిస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ నష్టపోతుందన్నమాట. తాత్కాలిక ఉపశమనంగా 480 బిలియన్ డాలర్ల అదనపు రుణం తెచ్చుకోవడానికి అక్టోబరులో సెనేట్ ఒకే చెప్పింది.రుణపరిమితిని పెంచుకోవడానికి, రిపబ్లికన్లను ఒప్పించడానికి బైడెన్ యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రతిపక్ష రిపబ్లికన్లు ఏమంటున్నారు? వివాదానికి బాధ్యత డెమొక్రాట్లదేనన్నది రిపబ్లికన్ల వాదన. తమ మద్దతు లేకుండా కొత్త అంశాలపై డబ్బులు ఖర్చు పెట్టేందుకు డెమోక్రాట్లు ప్రయత్నిస్తున్నారని.. దాన్ని అడ్డుకుంటూండటం వల్లనే వారు నిస్పృహకు గురవుతున్నారని ఆరోపిస్తున్నారు. డెమోక్రాట్లు ఇంకోసారి ఏకపక్షంగా పన్నులు విధించడం, ఖర్చు పెట్టడాన్ని తాము అనుమతించేది లేదని మైనార్టీ నేత మిచ్ మెక్కానెల్ స్పష్టం చేశారు. తమ ఆర్థిక విధానాలను అమలు చేసేందుకు డెమొక్రాట్లు బడ్జెట్ సమీక్షను అడ్డుగా పెట్టుకుంటున్నారని, ఇంత చేయగలిగిన వాళ్లు రుణ పరిమితి పెంపుపై కూడా ఏదో ఒక చర్య తీసుకోవాలని అంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ డెమొక్రాట్ల వాదనలేమిటి? రుణ పరిమితి పెంపును రిపబ్లికన్లు అడ్డుకోవడాన్ని అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షాలవి ద్వంద్వ ప్రమాణాలని, ప్రమాదకరమైనవని, అమర్యాదకరమైనవి కూడా అని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థతో ఆటలాడుకుంటున్నాయన్నారు. అమెరికన్ సెనేట్‌లో దాదాపు 50 మంది డెమొక్రాట్లు (100 సభ్యులుండే అమెరికా ఎగువసభ సెనేట్‌లో 48 మంది డెమొక్రాట్లకు ఇద్దరు స్వంత్రుల మద్దతు ఉంది. మిగతా 50 మంది రిపబ్లికన్ పార్టీ సభ్యులు) ఉండగా... రుణ పరిమితిని పెంచేందుకు కనీసం మరో పది రిపబ్లికన్ ఓట్లూ అవసరమవుతున్నాయి. మొత్తం రుణాల్లో బైడెన్ హయాంలోనివి మూడు శాతం మాత్రమేనని, మిగిలినవన్నీ గత ప్రభుత్వాలవేనని డెమొక్రాట్లు అంటున్నారు. ట్రంప్ హయాంలో తాము మూడుసార్లు రుణ పరిమితి పెంపునకు సహకరించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఏమిటీ రుణ పరిమితి కథ? అమెరికా ప్రభుత్వం వివిధ రూపాల్లో సేకరించే పన్నుల మొత్తం కంటే ఎక్కువ ఖర్చు పెడుతుంది. ఇందుకోసం అన్ని ప్రభుత్వాల మాదిరిగానే అప్పులు చేస్తుంది. ఈ వ్యవహారమంతా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా నడుస్తుంది. అప్పుల కోసం అగ్రరాజ్యం విడుదల చేసే బాండ్లు ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన పెట్టుబడులుగా భావిస్తారు. 1939లో అమెరికన్ పార్లమెంటు ప్రభుత్వం చేయగలిగే అప్పులపై ఒక పరిమితిని విధిస్తూ చట్టం చేసింది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకూ కనీసం వందసార్లు ఈ పరిమితిని పెంచుకున్నారు. అంటే.. అవసరాన్ని బట్టి మరిన్ని అప్పులు చేసేందుకు ఎప్పటికప్పుడు అవకాశం కల్పించుకున్నారన్నమాట. అయితే ఇలా పరిమితి పెంచుకోవాలన్న ప్రతిసారి కూడా దానిపై కాంగ్రెస్‌లోని ఇరు పక్షాల మధ్య చర్చోపచర్చలు జరుగుతాయి. చివరకు ఇరుపక్షాలు కొన్ని పట్టువిడుపులతో ఏకాభిప్రాయానికి రావడం పరిమితిని పెంచుకోవడం కద్దు. అయితే ఇటీవలి కాలంలో ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంటోంది. 2013లోనూ రుణ పరిమితిని దాటేసే పరిస్థితి ఏర్పడింది. అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యయ ప్రణాళికను రిపబ్లికన్లు పూర్తిగా అడ్డుకున్నారు. అదేమాదిరిగా ఈ సారి కూడా రిపబ్లికన్లు రుణ పరిమితి అంశాన్ని అడ్డుపెట్టుకుని ఒక వివాదాన్ని సృష్టించారు. అయితే... ఇలాంటి విషయాలు చివరి నిమిషం వరకూ సాగడం.. చివరకు రాజీమార్గాలపై తెరవెనుక మంతనాలు, పట్టువిడుపులు, కొన్ని సవరణల తరువాత ఓకే కావడం చరిత్రలో ఇప్పటివరకూ జరిగిన తంతు! -
ఇక్కడి మెట్రోలో కార్డ్, క్యాష్ లేకున్నా ప్రయాణించవచ్చు..!
మెట్రో ట్రెయిన్లో ఎలాంటి కార్డ్, క్యాష్ లేకుండా ప్రయాణించే సరికొత్త టెక్నాలజీను రష్యా ఆవిష్కరించింది. కార్డ్, క్యాష్కు బదులుగా ఫేస్ రీడింగ్ ద్వారా చెల్లింపు జరిగే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ప్రపంచంలోనే మొదటిసారిగా ఈ తరహ చెల్లింపుల వ్యవస్థను రష్యా ప్రవేశపెట్టింది. మాస్కోలో సుమారు 240 మెట్రో స్టేషన్లలో ఈ వ్యవస్థను తీసుకొచ్చింది. వరల్డ్ లార్జెస్ట్ వీడియో సర్వెలెన్స్ సిస్టమ్‌ను మాస్కోను కల్గి ఉంది. కోవిడ్-19 సమయంలో, రాజకీయ ర్యాలీలు, క్వారెంటెన్కు తరలించే సమయంలో ఈ నిఘా వ్యవస్థ అక్కడి ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగపడింది. ఫేస్‌పే ఎలా పనిచేస్తుదంటే...! ఫేస్ పే సిస్టమ్‌ని ఉపయోగించే ముందు ప్రయాణికులు తమ చిత్రాన్ని ముందుగా ఆయా యాప్‌లో సమర్పించాలి. మాస్కో మెట్రో అప్లికేషన్ ద్వారా వారి డెస్టినేషన్ లొకేషన్స్, బ్యాంక్ కార్డులకు లింక్ చేయాలి. మెట్రోని ఉపయోగించడానికి, "ఫేస్ పే" తో నమోదు చేసుకున్న ప్రయాణికులు కేవలం ఒక నిర్దేశిత టర్న్స్టైల్ వద్ద ఏర్పాటు చేసిన కెమెరాను చూసిన వెంటనే పేమెంట్ జరిగిపోయినట్లు వస్తోంది . ఫేస్ పే ద్వారా ప్రయాణికుల డేటా సురక్షితంగా కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. చదవండి: వన్‌ప్లస్ కోఫౌండర్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్...! లాంచ్ ఎప్పుడంటే...! -
డిజిటల్ చెల్లింపుల్లో మనమే టాప్
సాక్షి, హైదరాబాద్: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ‘డిజిటల్ చెల్లింపు’లు చేసే వారి సంఖ్య విషయంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తోంది. మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో 44 శాతం జనాభా ‘డిజిటల్ పేమెంట్స్’ద్వారా తమ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. దీంతో వివిధ మాధ్యమాల ద్వారా అత్యధికంగా డిజిటల్ చెల్లింపులు చేసే రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ప్రధానంగా నగదు లావాదేవీలు జరిపే సంప్రదాయ దేశంగా ఉన్న భారత్‌లో గత కొన్నేళ్లలో నగదు వినియోగం తగ్గించే ప్రయత్నాలు చాలానే జరిగాయి. ఐయితే 2016లో విభిన్న అంశాలు తీవ్రస్థాయిలో ప్రభావితం చేయడంతో డిజిటల్ చెల్లింపులు క్రమంగా ఊపందుకోవడం మొదలయ్యాయి. పెద్దసంఖ్యలో స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి రావడంతో పాటు హైస్పీడ్ డేటా రావడంతో వీటి వేగం ఒక్కసారిగా పెరిగిపోయింది. కేంద్ర ప్రభు త్వం పెద్దనోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం తో పాటు, గత ఏడాదిన్నరకు పైగా యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసి, జనజీవనాన్ని అస్తవ్య స్తం చేసిన ‘కోవిడ్ మహమ్మారి’పరిణామాలతో కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ జెట్‌స్పీడ్‌ను అందుకున్నాయి. ఇదీ అధ్యయనం... ఐదేళ్ల కాలంలో తమ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యకలాపాలు, ఇతర అంశాలపై తాజాగా విడుదలైన ఫోన్‌పే పల్స్ ‘బీట్ ఆఫ్ ద ప్రోగ్రెస్’నివేదికలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా ఈ ఏడాది జులైలో 324 కోట్ల లావాదేవీలతో ›ప్రపంచస్థాయిలోనే రికార్డ్‌ను సృష్టించింది. ఇప్పటిదాకా యూపీఐ ప్లాట్‌ఫామ్ ద్వారా (గత జూలై ఆఖరుకు) రూ.6,06,281 కోట్ల లావాదేవీలు జరిగినట్టు ఈ నివేదిక వెల్లడించింది. గత ఐదేళ్లలో ఫోన్‌పే ద్వారా జరిపిన 2,240 కోట్ల లావాదేవీలను ప్రాంతాలు, కస్టమర్ల నివాస ప్రాంతాలు, కేటగిరీ తదితరాలను విశ్లేషించారు. దీంతోపాటు డిజిటల్ పేమెంట్స్, వాటి వల్ల తమ జీవితంపై ప్ర«భావం, తదితర అంశాలపై వ్యాపారులు, వినియోగదారులను ఇంటర్వ్యూ చేయడం ద్వారా, అధ్యయన నివేదికలు, వార్తాపత్రికల్లో వచ్చే వార్తలు, విశ్లేషణలు, డేటాబేస్ తదితర అంశాలన్నింటినీ విశ్లేషించి దేశంలో డిజిటల్ చెల్లింపుల తీరుతెన్నులపై ‘పల్స్’నివేదికను రూపొందించారు. -
ఆవు పేడతో వ్యాపారమా? అని నవ్వి ఊరుకున్నాను.. కానీ, ఇప్పుడు
పాడి లేని ఇల్లు, పేడ లేని చేను లేదు...అనేది పాత సామెత. ‘పేడ ఉన్న చోట పేమెంట్స్ ఉండును’ అనేది సరికొత్త సామెత. దీని లోతు తెలుసుకోవాలంటే ఛత్తీస్‌ఘడ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాకు వెళ్లాల్సిందే. చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఈ జిల్లా ఇప్పుడు దేశంలోని ఎన్నో ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచింది. చౌరియా, అంబగోర్, తహ్‌షిల్, గుమ్కా, సింఘాల, తెందెసాల్... ఇలా రాజ్‌నంద్‌గావ్ జిల్లాలోని ఎన్నో గ్రామాల్లో ఆవు పేడ అనేది ఆదాయ వనరుగా మారింది. మహిళలు స్వయం సహాయక బృందాలుగా ఏర్పడి విగ్రహాలు, మొబైల్ ఫోన్‌స్టాండ్లు, నర్సరీ పాట్స్... ఒక్కటనేమిటీ తమ సృజనాత్మకతకు పదును పెట్టి రకరకాల ఉత్పత్తులు తయారుచేస్తున్నారు. ఒకప్పుడు వీటి మార్కెట్ జిల్లా సరిహద్దులకే పరిమితం. ఇప్పుడు మాత్రం ఇ–కామర్స్ వేదికల పుణ్యమా అని అంతర్జాతీయస్థాయికి చేరింది. రోజురోజుకు ఆన్లైన్ మార్కెట్ ఊపందుకోవడం విశేషం. ‘మా పొరుగింటి ఆవిడ పేడ వ్యాపారం గురించి చెప్పగానే నవ్వి ఊరుకున్నాను. అలాంటి నేను ఇప్పుడు ఆవు పేడతో రకరకాల వస్తువులు తయారుచేస్తూ ఉపాధి పొందుతున్నాను’ అంటుంది అంబగోర్ గ్రామానికి చెందిన సబిత. ఆవు పేడ వ్యాపారాన్ని అధ్యయనం చేయడానికి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమబెంగాల్... మొదలైన రాష్ట్రాల నుంచి మహిళలు బృందాలుగా వస్తుంటారు. ‘ఈ వ్యాపారం రాబోయే కాలంలోగ్రామీణ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేస్తుంది. సేంద్రియ వ్యవసాయానికి ఊతం ఇస్తుంది’ అని చెప్పారు మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఒక ఉన్నతాధికారి. ఉత్తరప్రదేశ్‌లో అపర్ణ అనే లాయర్ తన వృత్తికి స్వప్తి పలికి పేడ వ్యాపారంలోకి దిగారు. గౌతమబుద్ధనగర్ జిల్లాలో పది ఎకరాల విస్తీర్ణంలో గోశాల నిర్వహిస్తున్నారు. ఇందులో 120 వరకు ఆవులు ఉన్నాయి. ఈ గోశాల నుంచి వచ్చే పేడతో రకరకాల వస్తువులు తయారుచేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ‘ఇది వ్యాపారమే కాదు. ఆవుపేడ ద్వారా అదనపు ఆదాయాన్ని అర్జించవచ్చు...అనే సందేశం ఇవ్వడం కూడా’ అంటున్న అపర్ణ వివిధ గ్రామాల నుంచి వచ్చే మహిళలకు ‘ఆవుపేడతో ఎలాంటి వస్తువులు తయారుచేయవచ్చు?’ ‘ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?’ ‘మార్కెట్ ఎలా చేయాలి?’ ‘పేడ నుంచి వర్మీ కంపోస్ట్ ఎలా తయారు చేస్తారు’... మొదలైన విషయాల్లో సలహాలు ఇస్తుంటారు. పంజాబ్‌లోని బులందపూర్‌లాంటి ఎన్నో గ్రామాల్లో ఆవుపేడను ఊరవతల వేసే అలవాటు ఉండేది. ఇప్పుడు ఆ అలవాటు మానుకొని పేడను జాగ్రత్త చేస్తున్నారు. పదిమంది మహిళలు ఒక బృందంగా ఏర్పడి పిడకలతో పాటు రకరకాల వస్తువులు తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇప్పుడు వీరి బాటలో ఎన్నో మహిళాబృందాలు పయనిస్తున్నాయి. -
ఇది తెలుసా? పబ్లిక్ హాలిడే అయినా జీతం పడుతుంది
ఒకటో తారీఖున ఆదివారామో, సెలవు రోజో వస్తే వేతన జీవులకు గండమే. సెలవు కావడంతో బ్యాంకులు జీతాలు జమ చేయవు. మరుసటి రోజు వరకు ఎదురు చూడాల్సిందే. అయితే ఇకపై ఈ ఇక్కట్లకు చెల్లు చీటి రాసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సండేలతో పాటు ఇతర పబ్లిక్ హాలిడేస్‌లో కూడా బల్క్ పేమెంట్ చేసేందుకు, ఖాతాదారులు చేసే కీలక చెల్లింపులు స్వీకరించేందుకు బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. ఎన్ఏసీహెచ్చ్ నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌజ్ (NACH) పథకాన్ని ఆగస్టు 1 నుంచి అమల్లోకి తెచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని ప్రకారం ఇకపై ఆదివారాలు, అధికారిక సెలవు రోజుల్లో కూడా శాలరీస్, డివిడెండ్లు, పెన్షన్లు తదితర చెల్లింపులు జరుగుతాయి. చెల్లింపులకు ఓకే వేతనాలు, పెన్షన్ల చెల్లింపులతో పాటు కరెంటు, గ్యాస్, టెలిఫోన్, వాటర్ బిల్లులు, ఈఎంఐ, ప్రీమియం వంటి చెల్లింపులను బ్యాంకులు తీసుకుంటాయి. వినియోగదారులకు మరింత మెరుగైన సౌకర్యవంతమైన సేవలు అందించే ప్రక్రియలో భాగంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న మరికొన్ని మార్పులు - భారత తపాల శాఖ ఆధీనంలోని పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఇప్పటి వరకు ఉచితంగా అందించిన డోర్ స్టెప్ సర్వీసెస్‌ని నిలిపేసింది. ఇకపై ఇంటి వద్దకు వచ్చి పోస్టల్ బ్యాంక్ సర్వీసెస్ అందిస్తే రూ. 20 ప్లస్ జీఎస్టీని వసూలు చేయనుంది. - పరిమితి మించిన తర్వాత ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి డబ్బులు వసూలు చేస్తే ఇప్పటి వరకు రూ. 15 సర్వీస్ ఛార్జీగా వసూలు చేస్తుండగా ఇప్పుడా మొత్తాన్ని రూ. 17కి పెంచారు. -
అమెజాన్‌లో పేమెంట్స్ త్వరలో ఇలా కూడా చేయొచ్చు..!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెజాన్ తన వినియోగదారులకు బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలతో భవిష్యత్తులో చెల్లింపులు చేయవచ్చునని పేర్కొంది. అందుకోసం అమెజాన్ క్రిప్టోకరెన్సీ చెల్లింపులకు సంబంధించిన బ్లాక్‌చెయిన్ ప్రొడక్ట్ లీడ్‌ను, డిజిటల్ కరెన్సీ నిపుణుల బృందాల నియామకం జరపాలని భావిస్తోంది. అమెజాన్ తాజా జాబ్ లిస్ట్ ప్రకారం..డిజిటల్ కరెన్సీ, బ్లాక్ చెయిన్ టూల్స్‌కు చెందిన నిపుణులను నియమించుకోనుంది. అంతేకాకుండా క్రిప్టోకరెన్సీకి సంబంధించిన పేమెంట్స్ రోడ్‌మ్యాప్‌ను కూడా ఏర్పాటుచేయాలని భావిస్తోంది. కస్టమర్ అనుభవం, టెక్నికల్ స్ట్రాటజీ, సామర్థ్యాలతో పాటు లాంచ్ స్ట్రాటజీ కోసం క్రిప్టోకరెన్సీ రోడ్‌మ్యాప్‌ను అభివృద్ధి చేయడానికి అమెజాన్ వెబ్ సర్వీసెస్(AWS)తో సహా ఇతర ప్రొడక్ట్ డెవలపింగ్ కంపెనీలతో అమెజాన్ జత కట్టనుంది. ప్రస్తుతం అమెజాన్ క్రిప్టోకరెన్సీలను చెల్లింపులుగా అంగీకరించలేదు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) ప్రస్తుతం బ్లాక్‌చైన్ సేవలను అందిస్తోంది. గతంలో టెస్లా అధినేత ఎలన్ మస్క్ కూడా క్రిప్టోకరెన్సీతో చెల్లింపులను నిలిపివేసిన తిరిగి క్రిప్టోకరెన్సీతో చెల్లింపులు చేయవచ్చునని పేర్కొన్నాడు. -
అంతా నా ఇష్టం, 7లక్షల కోట్లు ఆవిరి
తన మాటలతో బిజినెస్ ప్రపంచాన్ని శాసించే టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెస్లాకు చెందిన కార్లను కొనుగోలు చేసేందుకు బిట్కాయిన్ల(క్రిప్టో)ను అనుమతిస్తున్నట్లు ప్రకటించి మరోసారి హాట్ టాపిగ్గా మారారు. అయితే ఇదే బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్లను వ్యతిరేకిస్తూ మే13 ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ దెబ్బకు బిట్ కాయిన్ విలువ 15శాతం క్షీణించింది 56 వేల డాలర్ల నుంచి ఒక్కసారిగా 46వేల డాలర్లకు పడిపోయింది. దీంతో క్రిప్టో పెట్టుబడిదారులు కంగుతిన్నారు. Tesla & Bitcoin pic.twitter.com/YSswJmVZhP — Elon Musk (@elonmusk) May 12, 2021 తాజాగా క్రిప్టోకి సపోర్ట్ చేస్తూ ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలపై ఇన్వెస్టర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అమెరికాకు చెందిన ఇన్వెస్ట్ మేనేజ్మెంట్కు చెందిన 'ఏఆర్కే ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్' సంస్థ ఆర్థిక సాధికారత సాధనంగా బిట్‌కాయిన్(Bitcoin as a Tool for Economic Empowerment) అనే అంశంపై చర్చించింది. ఈ చర్చలో పాల్గొన్న మస్క్ బిట్ కాయన్ పై ప్రకటన చేశారు. 7లక్షల కోట్లు ఆవిరి ఏప్రిల్ నెల ప్రారంభంలో 65,000 డాలర్లుగా ఉన్న బిట్ కాయిన్ ధర.. ఏప్రిల్ 19(సోమవారం) రాత్రి 30వేల డాలర్లకు పడిపోయింది. దీంతో రూ.7 లక్షల కోట్ల (98 బిలియన్ల డాలర్లు) మేరకు నష్టపోయారు. అయితే రెండు రోజుల పాటు అలాగే కొనసాగినా గురువారం మార్కెట్లో 6.3 శాతం పెరగడంతో క్రిప్టో విలువ 31,547.88 డాలర్లకు చేరింది. ఇప్పుడు మరోసారి క్రిప్టో విలువ భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వివిధ కారణాలతో క్రిప్టోవిలువ భారీగా పడిపోయినా ఇప్పుడు ఎలాన్ మస్క్ ప్రకటనతో తిరిగి పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఐఆర్సీటీసీలో నెలకు రూ.30 - 80 వేలు సంపాదించండిలా ! -
Digital Payments: యాప్స్ నుంచి చెల్లిస్తున్నారు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం.. పేరు ఏదైనా ఇప్పుడు రియల్ టైం చెల్లింపుల కోసం వినియోగదార్లు తమ స్మార్ట్‌ఫోన్‌లో ఏదైనా ఒక పేమెంట్ యాప్ వాడుతున్నారు. కోవిడ్–19 మహమ్మారి కారణంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఆధారిత యాప్స్ వినియోగం దేశంలో అనూహ్యంగా పెరుగుతోంది. బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సులభంగా చెల్లింపులు, నగదు బదిలీ వంటి లావాదేవీలు క్షణాల్లో పూర్తి కావడం.. కచ్చితత్వం, అదనపు వ్యయాలు లేకపోవడం తదితర ప్రయోజనాలు ఉండడంతో వీటి పట్ల కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. కరెన్సీకి ప్రత్యామ్నాయంగా యూపీఐ యాప్స్ నిలిచాయంటే అతిశయోక్తి కాదేమో. 2020లో రియల్ టైమ్ లావాదేవీల పరిమాణం చైనాలో 1,500 కోట్లు దాటితే.. భారత్ ఏకంగా 2,500 కోట్లు నమోదైందంటే ఎంత వేగంగా కస్టమర్లు డిజిటల్ వైపు మళ్లుతున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ముఖ్య విషయమేమంటే ఫీచర్ ఫోన్ యూజర్లకూ యూపీఐ లావాదేవీలను పెద్ద ఎత్తున విస్తరించే పనిలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) నిమగ్నమైంది. ఇవీ యూపీఐ గణాంకాలు.. దేశంలో యాక్టివ్ యూపీఐ యూజర్లు సుమారు 20 కోట్లు ఉన్నారు. ఈ సంఖ్యను 2025 నాటికి 50 కోట్లకు చేర్చాలన్నది మొబైల్ పేమెంట్స్ ఫోరం ఆఫ్ ఇండియా లక్ష్యం. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం యూపీఐ లావాదేవీల పరిమాణం, విలువ రెండేళ్లలో మూడింతలు దాటింది. 2019 మే నెలలో రూ.1,52,449 కోట్ల విలువైన 73.3 కోట్ల లావాదేవీలు జరిగాయి. ప్రస్తుత సంవత్సరం ఇదే కాలంలో రూ.4,90,638 కోట్ల విలువైన 253.9 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ప్రస్తుతం 49 పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, 175 బ్యాంకులు, 16 థర్డ్ పార్టీలకు చెందిన యూపీఐ ఆధారిత యాప్స్ భారత్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో థర్డ్ పార్టీ యాప్స్‌దే హవా. పరిశ్రమలో వీటి వాటా ఏప్రిల్ గ ణాంకాల ప్రకారం ఫోన్‌పే 45%, గూగుల్ పే 34.3, పేటీఎం 12.14% వాటా దక్కించుకున్నాయి. సెకండ్ వేవ్ ప్రభావం.. యూపీఐ లావాదేవీల మీద సెకండ్ వేవ్ ప్రభావం పడింది. 2021 ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో పరిమాణం 4.14 శాతం తగ్గి 253.9 కోట్లు, విలువ 0.61% పడిపోయి రూ.4,90,638 కోట్లుగా ఉంది. ఈ ఏడాది మార్చిలో గరిష్టంగా రూ.5,04,886 కోట్ల విలువైన లావాదేవీలు నమోదయ్యాయి. పరిమాణం 273.2 కోట్లుంది. సున్నా లావాదేవీల నుంచి ఈ స్థాయికి అయిదేళ్లలో రావడం విశేషం. అయితే ప్రభుత్వం 2019 డిసెంబరులో మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) తొలగిస్తూ లావాదేవీల ఫీజును లేకుండా చేయడంతో దేశంలో యూపీఐ యాప్స్ హవాకు దారి తీసింది. కాగా, ఎండీఆర్ ఎత్తివేయడం వల్ల పేమెంట్ గేట్‌వే సంస్థల మనుగడపై ప్రభావం చూపిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన కమిటీ గతేడాది జూలైలో అభిప్రాయపడింది. ఈ నిర్ణయం పరిశ్రమలో ఆవిష్కరణలకు అడ్డుగా నిలిచిందని, ఉద్యోగాలు కోల్పోతున్నారని, డిజిటల్ పేమెంట్స్ మౌలిక వసతుల విస్తరణ నెమ్మదించిందని కమిటీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఎండీఆర్ తిరిగి ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇదే జరిగితే యూపీఐ లావాదేవీలపై ఫీజును కస్టమర్లు చెల్లించాల్సి వస్తుంది. బ్యాంకులకూ మేలు జరుగుతోంది.. డిజిటల్ లావాదేవీలను అన్ని బ్యాంకులూ ప్రోత్సహిస్తున్నాయి. తద్వారా వ్యయాలను తగ్గించుకుంటున్నాయి. గతంలో 3,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో బ్యాంకు శాఖలు నెలకొని ఉండేవి. ప్రస్తుతం తదుపరి తరం శాఖలు 1,500 చదరపు అడుగుల లోపుకే పరిమితమవుతున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఒకానొక దశలో ఏటా 80,000 మందిని నియమించుకున్నాయి. 2020లో ఈ సంఖ్య 5,113 మాత్రమేనని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తెలంగాణ కన్వీనర్ బి.ఎస్.రాంబాబు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. దేశవ్యాప్తంగా 80,000 పైచిలుకు ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకు శాఖలు నేడు 63,000లకు వచ్చి చేరాయని వెల్లడించారు. శాఖల విస్తరణ క్రమంగా తగ్గుతోందని, యూపీఐ యాప్స్ కారణంగా బ్యాంకులకూ మేలు జరుగుతోందని చెప్పారు. -
గూగుల్, ఫేస్బుక్ వార్తల్ని వాడుకుంటే.. మీడియా సంస్థలకి డబ్బు చెల్లించాలి
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలో ఫేస్బుక్, గూగుల్ వంటి డిజిటల్ ఫ్లాట్‌ఫారమ్‌లు ఏదైనా మీడియా సంస్థకి చెందిన వార్తల్ని వాడుకుంటే వాటికి డబ్బు చెల్లిం చాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆస్ట్రేలియా పార్ల మెంటు ఒక కీలక బిల్లుకు ఆమోదం వేసింది. న్యూస్ మీడియా చట్టానికి చేసిన సవరణల్ని గురువారం ఆస్ట్రేలియా పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆస్ట్రేలియా ట్రెజరర్ జోష్ ఫ్రైడెన్ బెర్గ్, ఫేస్బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్‌బర్గ్ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. మొదట్లో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఫేస్బుక్ తమ ప్లాట్‌ఫారమ్‌పై ఆస్ట్రేలియా వాసులు వార్తల్ని షేర్ చేయడంపై నిషేధాన్ని విధించింది. అయితే ప్రభుత్వం చట్ట సవరణల్లో మార్పులకు అంగీకరించడంతో ఫేస్ బుక్ వార్తల షేరింగ్‌పై నిషే«ధం ఎత్తి వేసింది. మరోవైపు ఫేస్బుక్, గూగుల్ సంస్థలు మీడియా సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకుంటున్నాయి. -
ఫేస్బుక్ వర్సెస్ ఆస్ట్రేలియా
కాన్బెరా: గూగుల్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాలు వార్తాసంస్థలకు డబ్బులు చెల్లించాలన్న చట్టం తెస్తున్న ఆస్ట్రేలియాపై దిగ్గజ టెక్ సంస్థ ఫేస్బుక్ సంచలనాత్మక తిరుగుబాటు చేసింది. ఆస్ట్రేలియాలోని ఫేస్బుక్ వినియోగదారులకు వార్తలను అందించడాన్ని, వారు తమ ప్లాట్‌ఫామ్‌పై వార్తలను షేర్ చేయడాన్ని బ్లాక్ చేసింది. అత్యవసర సేవలకు సంబంధించిన వివరాలు సహా ప్రభుత్వ సందేశాలను ప్రసారం చేయడాన్ని నిలిపేసింది. ఫేస్బుక్ చర్యను ఆస్ట్రేలియా ప్రభుత్వం ఖండించింది. ‘ఫేస్బుక్ నిర్ణయం సార్వభౌమ దేశంపై దాడి’అని ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ మంత్రి గ్రెగ్ హంట్ అభివర్ణించారు. ‘ఇది టెక్నాలజీపై నియంత్రణను దుర్వినియోగం చేయడమే’అని మండిపడ్డారు. వార్తలను షేర్ చేసినందుకు గూగుల్, ఫేస్బుక్ తదితర సంస్థలు ఆస్ట్రేలియా వార్తా సంస్థలకు డబ్బులు చెల్లించాలని, అందుకు ఆయా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవాలని పేర్కొంటూ ఆస్ట్రేలియా ఒక బిల్లును రూపొందించింది. ఆ బిల్లును ఆ దేశ ప్రతినిధుల సభ ఆమోదించింది. సెనెట్ ఆమోదించాక చట్టరూపం దాలుస్తుంది. తమ ప్లాట్‌ఫామ్‌కు, వార్తాసంస్థలకు మధ్య సంబంధాన్ని ఈ చట్టం తప్పుగా అర్థం చేసుకుందని ఫేస్బుక్ వ్యాఖ్యానించింది. -
జనవరి 1 నుండి మారబోయే అతి ముఖ్యమైనవి..
న్యూఢిల్లీ: చెక్ పేమెంట్ సంబంధించి మోసాలను అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2021 జనవరి 21 నుండి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురాబోతుంది. అలాగే ఎల్పీజీ సిలిండర్ ధరలు, జీఎస్టీ, యుపీఐ లావాదేవీల చెల్లింపు, వాట్సాప్ వంటి ఇలా సామాన్యుల జీవితాల్లో బాగా ప్రభావం చూపే చాలా నిబంధనలు జనవరి 1 నుంచి మారబోతున్నాయి. 2021 జనవరి 1 నుంచి రాబోయే కొత్త నిబంధనలు సామాన్యుని జీవితాన్ని బాగా ప్రభావితం చేయబోతున్నాయి. అందుకే ప్రతి ఒక్కరు ఈ మార్పుల గురుంచి తెలుసుకోవడం చాలా ముఖ్యం. జనవరి 1 నుండి మారబోయే అతి ముఖ్యమైన కొన్ని నియమాలు ఇక్కడ ఉన్నాయి. చెక్ పేమెంట్ సంబంధించి మోసాలను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2021 జనవరి 21 నుండి 'పాజిటివ్ పే సిస్టం' పేరిట కొత్త నిబంధనలు తీసుకురాబోతుంది. ఈ నూతన నిబంధన ద్వారా రూ.50 వేలకు పైబడిన చెక్ ఇచ్చినప్పుడు రీ కన్ఫర్మేషన్ చేసుకోవడం తప్పనిసరి చేసింది. ఇది వినియోగదారుడి అభీష్టానుసారం ఉంటుంది. అలాగే రూ.5 లక్షలకు మించి అంతకంటే ఎక్కువ మొత్తానికి సంబంధించిన చెల్లింపుల విషయంలో చెక్కులను తప్పనిసరి చేయాలని బ్యాంకులకు సూచించింది. కాంటాక్ట్‌లెస్ కార్డ్ లావాదేవీలను ప్రోత్సహించడానికి ఆర్బిఐ వాటి చెల్లింపుల పరిమితిని పెంచనున్నట్లు తెలిపింది. ఈ కొత్త నిబంధనలు 2021 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న లావాదేవీల పరిమితిని రూ.2,000 నుంచి రూ.5 వేలకు పెంచనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుత కరోనా మహమ్మారి సమయంలో ఈ డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. వాట్సాప్ కొత్తగా తీసుకొస్తున్న ఫీచర్స్‌ని ఉపయోగించుకునేందుకు వినియోగదారులు కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగించాలని పేర్కొంది. ఇందుకోసం ఆండ్రాయిడ్ 4.0.3, ఐఓఎస్ 9 కన్న పాత ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తున్న మొబైల్స్‌లో వాట్సాప్ సేవలు నిలిపివేయనున్నట్లు సంస్థ పేర్కొంది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చుల నేపథ్యంలో ప్రతికూల ప్రభావాన్ని అధిగమించడానికి కారు కంపెనీలైన మహీంద్రా, మారుతి సుజుకి ఇండియా కంపెనీలు తమ వాహనాల ధరలను జనవరి 1 నుండి పెంచనున్నట్లు తెలిపాయి. దేశంలో ల్యాండ్లైన్ల నుండి మొబైల్ ఫోన్లకు కాల్ చేయడానికి త్వరలో '0' నెంబర్ ను జోడించాల్సి ఉంటుంది అని ట్రాయ్ తెలిపింది. కొత్త వ్యవస్థను అమలు చేయడానికి జనవరి 1లోగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని టెల్కోస్‌ను టెలికాం విభాగం కోరింది. జనవరి 1, 2021 నుండి అన్ని ఫోర్ వీలర్ వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేస్తూ కేంద్ర రహదారి రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. డిసెంబర్ 1, 2017లోపు అమ్మిన ఎం, ఎన్ క్లాస్ నాలుగు చక్రాల వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేసింది. దీని కోసం 1989 సెంట్రల్ మోటారు వాహనాల నియమాలు సవరించారు. దీనికి సంబంధించి నవంబర్ 6న మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. అమెజాన్ పే, గూగుల్ పే, ఫోన్ పే నుండి లావాదేవీలపై వినియోగదారులు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. జనవరి 1 నుండి థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్లు నిర్వహిస్తున్న యుపీఐ చెల్లింపు సేవ (యుపీఐ చెల్లింపు) పై అదనపు ఛార్జీ విధించాలని ఎన్పీసీఐ నిర్ణయించినట్లు తెలిసింది. కొత్త సంవత్సరం నుంచి థర్డ్ పార్టీ యాప్‌లపై ఎన్పీసీఐ 30 శాతం పరిమితిని విధించింది. ఈ ఛార్జీని చెల్లించడానికి పేటీమ్ అవసరం. గూగుల్ తన పేమెంట్ అప్లికేషన్ గూగుల్ పే వెబ్ యాప్‌ని 2021 జనవరి1 నుంచి నిలిపివేయనున్నట్లు తెలుస్తుంది. అలాగే గూగుల్ పే ఇన్స్టంట్ మనీ ట్రాన్స్ఫర్ పేమెంట్ సిస్టమ్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపింది. దీని వల్ల చెల్లింపులు చేసినప్పుడు మనీ ట్రాన్స్ఫర్ కోసం చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మరీ ఈ విషయంపై గూగుల్ స్పందించలేదు. చమురు మార్కెటింగ్ సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లలో ముడి రేట్లను బట్టి ప్రతి నెల మొదటి రోజు ఎల్పీజీ ధరలను సవరించనున్నారు. ఈ కొత్త నిబంధన 2021 జనవరి 1 నుంచి అమలులకి రానుంది. 5 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న వ్యాపారాలు ప్రస్తుతం ట్రేడర్లు ఏడాదికి 12 రిటర్న్స్ దాఖలు చేసే బదులుగా జనవరి1 నుంచి నాలుగు జీఎస్టీ సేల్స్ రిటర్న్స్ దాఖలు చేస్తే సరిపోతుంది. కొత్త రూల్స్ అమలులోకి వచ్చినప్పటి నుండి పన్ను చెల్లింపుదారులు కేవలం 8 రిటర్న్స్ మాత్రమే దాఖలు చేయొచ్చు. ఇందులో 4 జీఎస్టీఆర్ 3జీ, 4 జీఎస్టీఆర్ 1 రిటర్న్స్ ఉంటాయి. దీంతో 94 లక్షల జీఎస్టీ చెల్లింపుదారులకు ఊరట కలుగనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎక్కువ మంది చిన్న వ్యాపారులకి ఊరట కలగడం విశేషం. -
నాలుగు బ్యాంకులతో వాట్సాప్ ఒప్పందం
వాట్సప్ పేమెంట్స్ కి గతంలో భారత ప్రభుత్వం ఆమోదించిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం దేశంలో రెండు కోట్ల మందికి వాట్సాప్ పేమెంట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా వాట్సాప్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిని కంపెనీ స్వయంగా ప్రకటించింది. వాట్సప్ పేమెంట్ కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పిసిఐ)కి చెందిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(యుపిఐ) సిస్టమ్ యూజర్లకు అందుబాటులోకి ఉందని కంపెనీ తెలిపింది.(చదవండి: 437 కోట్లు కాదు.. రూ.52 కోట్లు నష్టం!) సందేశాన్ని సురక్షితంగా పంపినంత తేలికగా డబ్బులను పంపించుకోవచ్చు. డబ్బు చెల్లింపుల కోసం స్థానిక బ్యాంకులకు వెళ్లకుండా సులభంగా డబ్బులను పంపవచ్చని సంస్థ తెలిపింది. సులభంగా, సురక్షితంగా డబ్బులను పంపించుకోవడానికి బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ.యాక్సిస్ బ్యాంక్‌లతో ఒప్పందం కుదుర్చుకున్నాం. డిజిటల్ ఎకానమీ, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లాంటి లాభాలను ఎక్కువ మందికి అందించేందుకు కృషి చేస్తున్నాం అని వాట్సప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్ తెలిపారు. 160కి పైగా బ్యాంకులకు వాట్సప్ పేమెంట్స్ సపోర్ట్ చేస్తుంది అని అన్నారు. డిజిటల్ ఇండియాలో మేము భాగస్వామ్యం అయినందుకు సంతోషిస్తున్నాం అని అన్నారు. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 12 కోట్ల మంది యూపీఐ యూజర్స్ ఉన్నారు. మొత్తం యూపీఐ యూజర్ల సంఖ్యలో ఇది 28 శాతం. ప్రతి నెల యుపీఐ లావాదేవీల సంఖ్య పెరుగుతుంది. తాజా గణాంకాల ప్రకారం 2020 నవంబర్‌లో 2.23 బిలియన్ లావాదేవీలు జరిగాయి. అక్టోబర్(2.07 బిలియన్) నెలలో జరిగిన లావాదేవీలతో పోలిస్తే 6.7 శాతం ఎక్కువ. -
డిపాజిటర్ల సొమ్ము భద్రం!!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు ఎదుర్కొంటున్న లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్వీబీ) తమ ఖాతాదారులకు భరోసా కల్పించడంపై దృష్టి పెట్టింది. డిపాజిటర్ల సొమ్ము భద్రంగానే ఉందని రిజర్వ్ బ్యాంక్ నియమించిన అడ్మినిస్ట్రేటర్ టీఎన్ మనోహరన్ తెలిపారు. ఖాతాదారులకు చెల్లింపులు జరిపేందుకు బ్యాంకు వద్ద తగినన్ని నిధులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆర్బీఐ నిర్దేశించిన గడువులోగా డీబీఎస్ బ్యాంక్ ఇండియాలో విలీన ప్రక్రియ పూర్తి చేయగలమని మనోహరన్ ధీమా వ్యక్తం చేశారు. ఎల్వీబీ వద్ద రూ. 20,000 కోట్ల మేర డిపాజిట్లు ఉండగా, ఇచ్చిన రుణాల పరిమాణం రూ. 17,000 కోట్ల స్థాయిలో ఉన్నాయి. సంక్షోభంలో చిక్కుకున్న ఎల్వీబీని గట్టెక్కించే ప్రయత్నాల్లో భాగంగా భారీ చెల్లింపులు చెల్లించకుండా నెల రోజుల పాటు (డిసెంబర్ 16 దాకా) బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీనితో ఖాతాదారులు రూ. 25,000కు మించి విత్‌డ్రా చేసుకోవడానికి లేదు. డీబీఎస్‌లో ఎల్వీబీని విలీనం చేసే ప్రతిపాదనకు సంబంధించి నవంబర్ 20న ఆర్బీఐ తుది ప్రకటన చేయనుంది. దీని ప్రకారం ఎల్‌వీబీలో డీబీఎస్ సుమారు రూ. 2,500 కోట్ల దాకా ఇన్వెస్ట్ చేయనుంది. డీబీఎస్‌కు సానుకూలం: మూడీస్ సింగపూర్‌కి చెందిన డీబీఎస్ బ్యాంక్.. భారత్‌లో తన వ్యాపారాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు ఎల్వీబీ విలీనం ఉపయోగపడగలదని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అభిప్రాయపడింది. కొత్తగా మరింత మంది రిటైల్, చిన్న, మధ్య స్థాయి కస్టమర్లను చేర్చుకోవడానికి ఇది తోడ్పడగలదని వివరించింది. ‘విలీనం తర్వాత డీబీఎస్ ఇండియా కస్టమర్ల డిపాజిట్లు, రుణాల పరిమాణం 50–70 శాతం దాకా పెరగవచ్చు‘ అని అంచనా వేసింది. డీబీఎస్ ఇండియాకు 27 శాఖలు ఉండగా విలీనంతో ఎల్‌వీబీకి చెందిన సుమారు 500 పైచిలుకు శాఖలు కూడా జత కానున్నాయి. డీబీఎస్‌కు కీలక మార్కెట్లలో భారత్ కూడా ఒకటి కావడంతో, ఆ సంస్థ కార్యకలాపాల విస్తరణ వ్యూహాలకు అనుగుణంగా ఎల్వీబీ డీల్ ఉండగలదని మూడీస్ తెలిపింది. ‘పటిష్టమైన మాతృసంస్థ దన్ను ఉంటుంది కాబట్టి డీబీఎస్‌లో విలీనం అంశం ఎల్వీబీ డిపాజిటర్లకు సానుకూలంగా ఉంటుంది‘ అని పేర్కొంది. బ్యాంకింగ్ సమస్యలను పరిష్కరించేందుకు భారత్‌లో అనుసరిస్తున్న విధానాల్లోని లోపాలను చూపే విధంగా .. ఎల్వీబీని గట్టెక్కించే ప్రక్రియ ఉందని తెలిపింది. మారటోరియం కారణంగా డిపాజిటర్లు, రుణదాతలకు సకాలంలో చెల్లింపులు జరపలేకపోవడం వల్ల బ్యాంకు తాత్కాలికంగా దివాలా తీసినట్లే అవుతుందని మూడీస్ తెలిపింది. మారటోరియం విధించే దాకా పరిస్థితి వెళ్లకుండా సమస్యాత్మక బ్యాంకులను చక్కదిద్దేందుకు ఆర్బీఐకి ప్రభుత్వం ఇటీవలే పూర్తి అధికారాలు ఇచ్చినప్పటికీ ఇలా జరగడం గమనార్హమని వ్యాఖ్యానించింది. తాజా పరిణామాలతో బుధవారం బీఎస్ఈలో ఎల్వీబీ షేరు 20 శాతం డౌన్ సర్క్యూట్‌ను తాకి రూ. 12.40 వద్ద క్లోజయ్యింది. విదేశీ బ్యాంకులో విలీనం వద్దు: ఏఐబీవోసీ డిమాండ్ విదేశీ బ్యాంకులో ఎల్వీబీని విలీనం చేసే ప్రతిపాదనను తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆఫీసర్ల యూనియన్ ఏఐబీవోసీ స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదన చూస్తుంటే విదేశీ బ్యాంకులకు తలుపులు బార్లా తెరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని డీబీఎస్‌లో ఎల్వీబీని విలీనం చేసే విషయంపై పునరాలోచన చేయాలంటూ ఆర్బీఐకి ఏఐబీవోసీ విజ్ఞప్తి చేసింది. పాతతరం బ్యాంకులు.. దాదాపు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లాగానే దేశానికి స్వాతంత్య్రం రావడానికి ఎంతో ముందు నుంచీ సేవలు అందిస్తున్నాయని ఏఐబీవోసీ ప్రెసిడెంట్ సునీల్‌కుమార్ తెలిపారు. -
కాంటాక్ట్‌లెస్ పేమెంట్లకే మొగ్గు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 విస్తృతి కారణంగా దేశంలో డిజిటల్ బ్యాంకింగ్, కాంటాక్ట్‌లెస్ పేమెంట్లు గణనీయంగా పెరిగాయి. నగదుకు బదులుగా డిజిటల్, కాంటాక్ట్ రహిత చెల్లింపులకే కస్టమర్లు మొగ్గుచూపుతున్నారని ఫైనాన్షియల్ సర్వీసెస్ టెక్నాలజీ కంపెనీ ఎఫ్ఐఎస్ సర్వేలో తేలింది. పేస్ పల్స్ పేరుతో చేపట్టిన ఈ సర్వేలో 2,000 మంది పాలుపంచుకున్నారు. 68 శాతం మంది ఆన్లైన్ లేదా మొబైల్ బ్యాంకింగ్ విధానంలో లావాదేవీలు జరుపుతున్నారు. మహమ్మారి తదనంతరం కూడా ఈ విధానాన్నే అనుసరిస్తామని 51 శాతం మంది స్పష్టం చేశారు. భవిష్యత్తులో క్యాష్, కార్డ్స్‌కు బదులుగా కాంటాక్ట్‌లెస్ పేమెంట్లను జరుపుతామని 48 శాతం మంది వెల్లyì ంచారు. మొబైల్ వాలెట్లతో.. భారత్‌లో మొబైల్ పేమెంట్ వాలెట్ల వినియోగమూ అంతకంతకూ పెరుగుతోందని నివేదిక వెల్లడించింది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం 2020 ఫిబ్రవరిలో మొబైల్ వాలెట్ల ద్వారా జరిగిన లావాదేవీల సంఖ్య 124.3 కోట్లు. మే నాటికి ఇది రెండింతలకుపైగా చేరి 253.2 కోట్లకు ఎగసింది. లావాదేవీల విలువ ఇదే కాలంలో రూ.2,836 కోట్ల నుంచి రూ.11,080 కోట్లకు చేరింది. సర్వేలో పాలుపంచుకున్న వారిలో 93 శాతం మందికిపైగా మొబైల్ వాలెట్లను వాడుతున్నారు. వీరిలో 24–39 ఏళ్ల వయసున్నవారే అధికం. చెల్లింపు అభిరుచులు రానున్న రోజుల్లో ఇదే విధంగా ఉంటాయని ఎఫ్ఐఎస్ ఎండీ మహేశ్ రామమూర్తి తెలిపారు. ఈ మార్పులకు తగ్గట్టుగా ఫైనాన్షియల్ సంస్థలు, విక్రయదారులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఆర్థికంగా కరోన ప్రభావం.. ప్రజలపై కరోన ఆర్థికంగానూ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉపాధికి సంబంధించిన సమస్యలను 70 శాతం మంది ఎదుర్కొన్నట్టు వెల్లడించారు. కరోనా మహమ్మారి కారణంగా తమ జీతాల్లో కోత పడిందని 49 శాతం మంది తెలిపారు. ఉద్యోగాలు తాత్కాలికంగా కోల్పోయామని 20 శాతం, శాశ్వతంగా పోయిందని 10 శాతం మంది చెప్పారు. 20 శాతం మందికి పదోన్నతి, 18 శాతం మందికి వేతనం పెంపు, 23 శాతం మందికి బోనస్ వాయిదా పడిందని వివరించారు. ఆదాయం తగ్గితే ఆర్థికంగా మూడు నెలలకు మించి భారాన్ని తట్టుకోలేమని 48 శాతం మంది వెల్లడించారు. ఆర్థిక ముప్పు అధికంగా యువ జంటలకే ఉందని సర్వే తేల్చి చెప్పింది. మహిళలపైనా ఈ ప్రభావం ఉందని పేర్కొంది. -
భారత్‌కు తగ్గనున్న చెల్లింపుల ఖాతా భారం
న్యూఢిల్లీ: చెల్లింపుల సమతౌల్యత (బీఓపీ) ఈ ఏడాది భారత్‌కు అనుకూలంగా పటిష్టంగా ఉండే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ సోమవారం తెలిపారు. ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో వాణిజ్య లావాదేవీలకు ఒక దేశం... ఇతర దేశాలకు చెల్లించాల్సి వచ్చే మొత్తం వ్యవహారాలకు ఉద్దేశించిన అంశాన్నే చెల్లింపుల సమతౌల్యతగా పేర్కొంటారు. ఒకవైపు ఎగుమతులు మెరుగుపడుతుండడం, మరోవైపు తగ్గుతున్న దిగుమతులు భారత్‌కు చెల్లింపుల సమతౌల్యత సానుకూల పరిస్థితిని సృష్టిస్తున్నాయని అన్నారు. ఫిక్కీ వెబ్‌నార్‌ను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు చూస్తే... ► ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎగుమతుల విషయానికి వస్తే, చక్కటి రికవరీ జాడలు ఉన్నాయి. ► ఎగుమతులు క్షీణతలోనే ఉన్నా... ఆ క్షీణ రేటు తగ్గుతూ వస్తుండడం కొంత ఆశాజనకమైన అంశం. ఏప్రిల్‌లో ఎగుమతులు భారీగా మైనస్ 60.28 శాతం క్షీణిస్తే, మేలో ఈ రేటు మైనస్ 36.47 శాతానికి తగ్గింది. తాజా సమీక్షా నెల జూన్‌లో ఈ క్షీణ రేటు మరింతగా మైనస్ 12.41 శాతానికి తగ్గడం గమనార్హం. ► 2019 ఎగుమతుల గణాంకాల పరిమాణంలో 91 శాతానికి 2020 జూలై ఎగుమతుల గణాంకాలు చేరాయి. దిగుమతుల విషయంలో ఈ మొత్తం దాదాపు 70 నుంచి 71 శాతంగా ఉంది. వెరసి ఈ ఏడాది భారత్ చెల్లింపుల సమతౌల్యం భారత్‌కు అనుకూలంగా ఉండనుంది. ► భారత్ పారిశ్రామిక రంగానికి చక్కటి వృద్ధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని భావిస్తున్నా. దేశీయ తయారీ, పారిశ్రామిక రంగానికి మద్దతు నివ్వడానికి ప్రభుత్వం తగిన అన్ని చర్యలూ తీసుకుంటోంది. -
ఆడిస్తున్నారు కానీ.. మ్యాచ్ ఫీజు చెల్లించట్లేదు
లండన్: ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ టి20 లీగ్ జరిగినా చక్కని ఆదరణ లభిస్తోంది. నిర్వాహకులు స్టార్లతో ఆడిస్తున్నారు... కానీ సరిగ్గా చెల్లించడమే లేదని అంతర్జాతీయ క్రికెటర్ల సంఘాల సమాఖ్య (ఎఫ్ఐసీఏ) తెలిపింది. ఐపీఎల్ గురించి తెలిసినవారెవరైనా... ఆటగాళ్లకు స్టార్డమ్తో పాటు అధిక ఆదాయం లీగ్‌ల ద్వారానే లభిస్తుందనే అనుకుంటారు. కానీ అన్ని లీగ్‌లు ఐపీఎల్లా లేవు. ఇదే ఆటగాళ్లకు ఆర్థిక కష్టాలను తెచ్చిపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టి20 లీగ్‌లు చెల్లింపుల విషయంలో ఆటగాళ్లను ఇబ్బంది పెడుతున్నాయని తాజా నివేదికలు తెలియజేస్తున్నాయి. ఎఫ్ఐసీఏ చేపట్టిన వార్షిక సర్వేలో ఇవి వెలుగులోకి వచ్చాయి. లీగ్‌ల్లో పాల్గొనే ఆటగాళ్లలో మూడోవంతు క్రికెటర్లు వేతనాలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. కొందరికి ఆలస్యంగా వేతనాలు అందగా... మరికొందరు రిక్తహస్తాలతోనే వెనుదిరిగినట్లు ఆ నివేదికల ద్వారా తెలిసింది. గ్లోబల్ టి20 కెనడా, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, అబుదాబి టి10, ఖతార్ టి10, యూరో టి20 స్లామ్, మాస్టర్స్ చాంపియన్స్ లీగ్‌ల్లో పాల్గొన్న 34 శాతం క్రికెటర్లు ‘చెల్లింపుల’ సమస్యలు ఎదుర్కొన్నట్లు ఎఫ్ఐసీఏ వెల్లడించింది. లీగ్‌ల నిర్వహణకు అనుమతులిచ్చే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఈ అంశంపై దృష్టి సారించాలని ఎఫ్ఐసీఏ సీఈఓ టామ్ మఫట్ కోరారు. మరోవైపు ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ రూపురేఖలు, తీరుతెన్నులు గజిబిజీగా ఉన్నాయన్న ఎఫ్ఐసీఏ... వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌ను సమస్యకు పాక్షిక పరిష్కారంగా అభివర్ణించింది. -
ఏటీఎంలల్లో సగానికి తగ్గిన క్యాష్ విత్‌డ్రా
కరోనా వైరస్ ప్రేరిత లాక్డౌన్ ప్రభావం కరెన్సీ నోట్లపై పడింది. లాక్డౌన్ విధింపు నేపథ్యంలో ఈ ఏప్రిల్‌లో ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ సగానికి పైగా తగ్గింది. దేశవ్యాప్తంగా అన్ని ఏటీఎంల నుంచి ఈ ఏప్రిల్‌లో రూ.1.27లక్షల కోట్ల నగదును మాత్రమే ఉపసంహరించుకున్నట్లు ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. అంతకు ముందు నెల మార్చిలో ఏటీఎంల ద్వారా రూ.2.51లక్షల కోట్ల ఉపసంహరణ జరిగినట్లు తెలుస్తోంది. మార్చిలో కంటే ఏప్రిల్‌లో పాయింట్ ఆఫ్ సేల్ వద్ద నగదు విత్‌డ్రా వాల్యూమ్స్ స్వల్పంగా పెరిగాయి. ఈ ఏప్రిల్‌లో పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) నుంచి రూ.110 కోట్ల నగదు ఉపసంరణ జరిగినట్లు ఆర్బీఐ గణాంకాలు తెలిపాయి. ప్రజలు నిత్యావసర కొనుగోళ్లకు అత్యధికంగా డిజిటల్ చెల్లింపులకే మొగ్గుచూపారు. ఏటీఎంల్లో డెబిల్ కార్డుల వినియోగం సైతం సగానికి పైగా పడిపోయింది. ఈ ఏప్రిల్‌లో డెబిట్ కార్డులను ఉపయోగించి రూ.28.52 కోట్లను ఉపసంహరించుకున్నారు. మార్చిలో ఇవే కార్డుల ద్వారా రూ.54.41 కోట్లను విత్‌డ్రా చేసుకున్నారు. ఈ ఏప్రిల్ నాటికి దేశంలో మొత్తం 88.68 కోట్ల కార్డులున్నాయి. ఇందులో 82.94 కోట్ల డెబిట్ కార్డులు, 5.73 కోట్ల క్రిడెట్ కార్డులున్నాయి. అంతకుముందు నెల మార్చిలో 88.63 కోట్ల కార్డులున్నాయి. ఇదే ఏప్రిల్ నాటికి దేశ వ్యాప్తంగా మీద 2.34లక్షల ఏటీఎంలు, 50.85లక్షల పీఓఎస్ ఉన్నాయి. -
చెల్లింపుల జోష్ : వొడాఫోన్ ఐడియా జంప్
సాక్షి,ముంబై: ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా గురువారం నాటి మార్కెట్లో దూసుకుపోతోంది. ఇవాళ ఇంట్రాడేలో షేర్ 15 శాతం లాభపడింది. ప్రధానంగా వొడాఫోన్ ఐడియాతో 200 మిలియన్ డాలర్ల చెల్లింపును వేగవంతం చేసినట్లు వోడాఫోన్ గ్రూప్ ప్రకటించింది. తమ సంస్థ కార్యకలాపాలను నిర్వహించేందుకు లిక్విడిటీని అందించినట్టు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వొడాఫోన్ ఐడియా వెల్లడించింది. దీంతో వరుసగా రెండో సెషన్లోనూ వొడాఫోన్ ఐడియాలో లాభాల జోరు కొనసాగుతోంది. (కరోనా కల్లోలం : జీడీపీపై ఫిచ్ షాకింగ్ అంచనాలు) ఆదిత్య బిర్లా గ్రూపుతో భారతీయ జాయింట్ వెంచర్లో 200 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 5 1,530 కోట్లు) చెల్లింపులను చేయనున్నట్టు బ్రిటిష్ టెలికాం దిగ్గజం వొడాఫోన్ పీఎల్ సీ వెల్లడించింది. వొడాఫోన్ ఐడియా తన కార్యకలాపాలను నిర్వహించడానికి ద్రవ్య లభ్యతకోసం ఈ చెల్లింపును వేగవంతం చేసినట్టు వొడాఫోన్ గ్రూప్, ఒక ప్రకటనలో తెలిపింది. నిబంధనల ప్రకారం ఈ చెల్లింపులు 2020 సెప్టెంబరులో జరగాల్సి ఉందని తెలిపింది. తద్వారా వొడాఫోన్ ఐడియా కస్టమర్లు, వేలాది మంది వొడాఫోన్ ఐడియా ఉద్యోగులు మొత్తం సుమారు 300 మిలియన్ల మంది భారతీయ పౌరులకు తమ మద్దతు లభించనుందని పేర్కొంది. కోవిడ్-19 సంక్షోభ సమయంలో తీసుకున్న అత్యవసర చర్యగా వెల్లడించింది. కాగా తాజా లాభాలతో వొడాఫోన్ ఐడియా మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.11,379 కోట్లకు చేరింది. (ఆసియాలో అపర కుబేరుడుగా అంబానీ) చదవండి : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాకివ్వనున్న జియో మార్ట్ -
యస్ ఖాతాదారులకు కాస్త ఊరట
న్యూఢిల్లీ: మారటోరియం వల్ల తాత్కాలికంగా నిలిపివేసిన కొన్ని సర్వీసులను యస్ బ్యాంక్ క్రమంగా పునరుద్ధరిస్తోంది. తాజాగా ఇన్వార్డ్ ఐఎంపీఎస్, నెఫ్ట్ సర్వీసులను పునరుద్ధరించినట్లు మంగళవారం మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో వెల్లడించింది. దీంతో యస్ బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డులు, రుణాలు తీసుకున్న వారు ఇతర బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లింపులు జరిపేందుకు వెసులుబాటు ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం తమ ఏటీఎంలన్నీ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని, ఇతర ఏటీఎంల నుంచి కూడా నిర్దిష్ట స్థాయిలో నగదు విత్‌డ్రా చేసుకోవచ్చంటూ యస్ బ్యాంక్ తెలిపింది. సంక్షోభంలో చిక్కుకున్న యస్ బ్యాంక్‌పై ఆర్బీఐ నెలరోజుల మారటోరియం విధించడంతో కస్టమర్లలో ఆందోళన నెలకొంది. నగదు విత్‌డ్రాయల్‌పై ఆంక్షలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌తో పాటు ఇతర ప్లాట్‌ఫాంల ద్వారా డిజిటల్ పేమెంట్స్ సేవలు కూడా నిల్చిపోవడం మరింత గందరగోళానికి దారి తీసింది. ఫారెక్స్ సర్వీసులు, క్రెడిట్ కార్డు కొనుగోళ్లపై ప్రతికూల ప్రభావం పడింది. యస్ బ్యాంక్‌లో టియర్ 1 బాండ్లేమీ లేవు: శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ నిధుల కొరతతో సతమతమవుతున్న యస్ బ్యాంక్‌లో తమకు టియర్ 1 స్థాయి బాండ్లేమీ లేవని శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ (ఎస్టీఎఫ్సీ) సంస్థ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. అప్పర్ టియర్ 2 స్థాయి బాండ్లలో 2010లో ఇన్వెస్ట్ చేసిన రూ. 50 కోట్లు మాత్రమే రావాల్సి ఉందని పేర్కొంది. ఆర్బీఐ రూపొందించిన పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక ప్రకారం.. సుమా రు రూ. 10,800 కోట్ల టియర్ 1 బాండ్ల చెల్లింపులు రద్దు కానున్న సంగతి తెలిసిందే. మరో వైపు, 2006లో జారీ చేసిన వారంట్లకు సంబ ంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తమపై రూ. 5 కోట్ల జరిమానా విధించినట్లు ఎస్టీఎఫ్సీ తెలిపింది. ప్రస్తుతం తమ గ్రూప్‌లో భాగమైన శ్రీరామ్ హోల్డింగ్స్ (మద్రాస్) (ఎస్‌హెచ్‌ఎంపీఎల్) అప్పట్లో రూ. 244 కోట్ల సమీకరణ కింద ఒక ప్రవాస భారతీయ వ్యక్తి నుంచి కూడా నిధులు సమీకరించినట్లు వివరించింది. ఈ లావాదేవీలో విదేశీ మారక నిర్వహణ (ఫెమా) చట్టాల ఉల్లంఘన జరిగింద న్న ఆరోపణలతో ఈడీ తాజా జరిమానా విధిం చినట్లు ఎస్టీఎఫ్సీ తెలిపింది. -
మరో 8,000 కోట్లు చెల్లించిన ఎయిర్టెల్
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్ కంపెనీ ఏజీఆర్ (సవరించిన స్థూల రాబడి) బకాయిలకు సంబంధించి శనివారం రూ.8,004 కోట్లు టెలికం విభాగానికి (డాట్)కు చెల్లించింది. గత నెల 17న ఈ కంపెనీ ఏజీఆర్ బకాయిల నిమిత్తం రూ.10,000 కోట్లు చెల్లించింది. మొత్తం మీద ఈ కంపెనీ చెల్లించిన ఏజీఆర్ బకాయిల మొత్తం రూ.18,004 కోట్లకు చేరింది. సుప్రీం కోర్టు తీర్పుననుసరించి ఈ మొత్తాలను చెల్లించామని భారతీ ఎయిర్టెల్ వెల్లడించింది. కాగా డాట్ అంచనాల ప్రకారం ఎయిర్టెల్ కంపెనీ ఏజీఆర్ బకాయిలు రూ.35,586 కోట్లుగా ఉన్నాయి. మరోవైపు ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వానికి రూ.23,701 కోట్ల ఏజీఆర్ బకాయిలు వసూలయ్యాయి. భారతీ ఎయిర్టెల్ రూ.18,004 కోట్లు, వొడాఫోన్ ఐడియా రెండు దశల్లో రూ.3,500 కోట్లు, టాటా టెలి సర్వీసెస్రూ.2,197 కోట్లు చొప్పున చెల్లించాయి. (డాట్‌ను ఆశ్రయించిన వొడాఫోన్ ఐడియా) చదవండి: చార్జీల వడ్డన: జియోకు భారీ షాక్ -
డాట్‌ను ఆశ్రయించిన వొడాఫోన్ ఐడియా
ముంబై : సగటు స్ధూల రాబడి (ఏజీఆర్)పై ప్రభుత్వానికి బకాయిల చెల్లింపుల సంక్షోభంలో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియా ఊరటను కోరుతూ టెలికాం శాఖ (డాట్)ను ఆశ్రయించింది. తమకు రావాల్సిన రూ 8000 కోట్ల జీఎస్టీ రిఫండ్‌ను సర్దుబాటు చేయాలని కోరింది. ఏజీఆర్ బకాయిల చెల్లింపుల షెడ్యూల్‌ను వాయిదా వేయాలని కూడా వొడాఫోన్ ఐడియా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. బకాయిల చెల్లింపులో ఊరట కల్పించాలని కంపెనీ చేసిన వినతిని సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చడంతో వొడాఫోన్ ఐడియాకు భారీ ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిల్లో కంపెనీ ఇప్పటికే రూ 3500 కోట్లు చెల్లించగా, స్వయం మదింపు ఆధారంగా రూ 23,000 కోట్లు ఇంకా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. ఇందులో రూ 7000 కోట్లు అసలు మొత్తం. మరోవైపు బకాయిల చెల్లింపునకు మూడేళ్ల మారటోరియం గడవు ఇవ్వాలని, లైసెన్స్‌ఫీజును ప్రస్తుతమున్న 8 శాతం నుంచి 3 శాతానికి తగ్గించాలని కంపెనీ డాట్‌ను కోరుతోంది. స్పెక్ర్టం వాడకం చార్జీలను సైతం 3 శాతం నుంచి 1 శాతానికి తగ్గించాలని కోరుతోంది. చదవండి : అలాగైతే వొడాఫోన్ మూతే.. -
డీహెచ్ఎఫ్ఎల్ 4,800 కోట్ల డిపాజిట్ల క్లెయిమ్‌లకు ఆమోదం
ముంబై: నిధుల సంక్షోభంలో ఉన్న దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్ఎఫ్ఎల్) ఇప్పటి వరకు రూ.4,800 కోట్ల డిపాజిట్ల చెల్లింపుల క్లెయిమ్‌లను ఆమోదించినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. సమారు 55,000 మంది డిపాజిట్ హోల్డర్లు రూ.5,200 కోట్ల డిపాజిట్లకు సంబంధించి క్లెయిమ్‌లను డిసెంబర్ 17 నాటికి దాఖలు చేయగా.. రూ.4,800 కోట్ల క్లెయిమ్‌లను అనుమతించినట్టు వెల్లడించాయి. వీరిలో రిటైలర్లతోపాటు యూపీ పవర్ కార్పొరేషన్ ఉద్యోగులు సైతం ఉన్నారు. వీటితో పాటు అన్ని రకాల క్లెయిమ్‌లు (రుణదాతలు సహా) కలపి రూ.93,105 కోట్లుగా ఉన్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. -
టెల్కోలకు భారీ ఊరట
సాక్షి, న్యూడిల్లీ: ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న టెలికం కంపెనీలకు ఊరటనిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. టెల్కోలు కట్టాల్సిన స్పెక్ట్రం చెల్లింపులకు సంబంధించి రెండేళ్ల పాటు మారటోరియం విధించింది. 2020–21, 2021–22 సంవత్సరాల్లో జరపాల్సిన చెల్లింపులకు ఇది వర్తిస్తుంది. దీంతో భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో సంస్థలకు సుమారు రూ. 42,000 కోట్ల మేర ఊరట లభించనుంది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) వివాదంలో ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో టెల్కోలు..దాదాపు 1.4 లక్షల కోట్ల మేర లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలు కట్టాల్సి రానున్న సంగతి తెలిసిందే. -
‘నవయుగ’ ముందు ఆందోళన
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు పనుల్లో తమకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పలువురు సబ్‌కాంట్రాక్టర్లు శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ ముందు ఆందోళన నిర్వహించారు. సుమారు వంద మంది వరకు కాంట్రాక్టర్లు ఉదయం గేటు ముందు బైఠాయించారు. కార్యాలయానికి వచ్చిన వాహనాలను అడ్డుకున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో సుమారు రూ.150 కోట్ల బిల్లులు బకాయి పడ్డారని, ప్రభుత్వం నుంచి ఈ డబ్బులు వచ్చినా.. నవయుగ కంపెనీ వాటిని తమకు చెల్లించడం లేదని ఆరోపించారు. వ్యవహారాన్ని సెటిల్ చేస్తామంటూ చైర్మన్ నుంచి కిందిస్థాయి అధికారుల వరకు గత కొంతకాలంగా తమను కార్యాలయం చుట్టూ తిప్పిస్తున్నారని దుయ్యబ ట్టారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు చైర్మన్‌తో అపాయింట్మెంట్ ఉందని చెప్పడంతో తామంతా ఇక్కడకు వచ్చామని, తీరా వచ్చాక చైర్మన్ లేడంటూ బయటకు పంపించారని ఆరోపించారు. తామంతా రోడ్డున పడ్డామని, ఇక ఆత్మహత్యలే శరణ్యమని ఆందోళన వ్యక్తం చేశారు. 11 నెలల నుంచి బిల్లులు చెల్లించడం నిలిపివేశారని ఆరోపించారు. మట్టి పనులు చేశాం.. తాను విజయవాడకు చెందిన కాంట్రాక్టర్‌నని, పోలవరం ప్రాజెక్టులో మట్టి పనులు చేశానని రాము అనే బాధిత కాంట్రాక్టర్ చెప్పారు. ఇందుకుగానూ రూ. 1.80 కోట్లు తనకు రావాల్సివుందన్నారు. గత జనవరి నుంచి మొన్నటి ఆగస్టు వరకు బిల్లుల చెల్లింపు జరగలేదని, ఎన్నిసార్లు అడిగినా ఎండీని అడుగుతామం టూ చెబుతున్నారని ఆరోపించారు. బిల్లులు బకాయిపడటంతో తనలాగే 50 మంది కాంట్రాక్టర్లు రోడ్డున పడాల్సి వచ్చిందన్నారు. సబ్ కాంట్రాక్టు తీసుకున్నాం.. పోలవరం ప్రాజెక్టులో ఎర్త్‌వర్క్ కోసం తాను నవయుగ నుంచి సబ్ కాంట్రాక్టు తీసుకోవడం జరిగిందని కిరణ్ అనే కాంట్రాక్టర్ తెలిపారు. రూ. 4.50 కోట్లు బకాయి పడ్డారని వెల్లడించారు. బకాయిలపై ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదని, చైర్మన్‌ను కలవడంలో తాత్సారం చేస్తున్నారని, అందుకే బాధితులమంతా ఇక్కడకు వచ్చామని తెలిపారు. -
వాట్సాప్ ‘పేమెంట్స్’కు లైన్ క్లియర్!
బెంగళూరు: మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో పూర్తి స్థాయిలో చెల్లింపుల సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించినట్లుగా పేమెంట్ డేటాను భారత్‌లోనే భద్రపర్చేందుకు అవసరమైన వ్యవస్థను సిద్ధం చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) ఆధారిత వ్యవస్థ ద్వారా వాట్సాప్ ఈ సేవలు అందించనుంది. ఈ సర్వీసుల కోసం ముందుగా ఐసీఐసీఐ బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. తర్వాత రోజుల్లో ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లతో పాటు ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కూడా జట్టు కట్టనున్నట్లు సమాచారం. ‘డేటా లోకలైజేషన్‌కి సంబంధించిన పనులన్నీ వాట్సాప్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆడిట్ ప్రక్రియ నడుస్తోంది. ఆడిటర్లు తమ నివేదికను రిజర్వ్ బ్యాంక్‌కు సమర్పించిన తర్వాత వాట్సాప్ తన పేమెంట్ సర్వీసులను పూర్తి స్థాయిలో విస్తరించేందుకు అవకాశం ఉంటుంది‘ అని సంబంధిత వర్గాలు వివరించాయి. గతేడాదే పైలట్ ప్రాజెక్టు.. అమెరికన్ సోషల్ నెట్వర్కింగ్ సైటు ఫేస్బుక్లో భాగమైన వాట్సాప్ 2018లోనే ప్రయోగాత్మకంగా పరిమిత సంఖ్యలో యూజర్లకు పేమెంట్ సేవలు అందించడం ప్రారంభించింది. గతేడాది ఫిబ్రవరిలో ఐసీఐసీఐ బ్యాంక్ భాగస్వామ్యంతో తమ యాప్‌లో పేమెంట్స్ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. అయితే, దీనిపై వివాదం రేగింది. నియంత్రణ సంస్థ ఆదేశాలకు విరుద్ధంగా డేటాను భారత్‌లో కాకుండా విదేశాల్లో భద్రపరుస్తుండటం, యూజర్ల డేటా భద్రతపై అనుమానాలు, వాట్సాప్‌లో తప్పుదోవ పట్టించే వార్తలు వైరల్‌గా మారుతుండటం తదితర అంశాలు ఈ ప్రాజెక్టుకు ప్రతిబంధకాలుగా మారాయి. అయితే, ప్రధానమైన డేటా లోకలైజేషన్ అంశంతో పాటు ఇతరత్రా సమస్యలన్నింటినీ వాట్సాప్ పరిష్కరించుకోవడంతో పూర్తి స్థాయిలో సేవలు ప్రారంభించేందుకు మార్గం సుగమం కాగలదని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. వెనక్కి తగ్గని ఆర్బీఐ .. సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నిబంధనల ప్రకారం.. చెల్లింపుల సేవలు అందించే సంస్థలు ముందుగా భారత్‌లో డేటా స్టోరేజీ సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఆడిట్ నివేదికను కూడా సమర్పించిన తర్వాతే సర్వీసులు ప్రారంభించాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటికే విదేశాల్లోని సర్వర్లలో డేటా నిల్వ, ప్రాసెస్ చేస్తున్న అంతర్జాతీయ సంస్థలు..మళ్లీ భారత్‌లో కూడా ప్రత్యేకంగా డేటా స్టోరేజీ చేయాలంటే శ్రమ, వ్యయాలతో కూడుకున్న వ్యవహారమని, తమకు మినహాయింపునివ్వాలని ఆర్బీఐని కోరాయి. కానీ భారత యూజర్ల డేటా భద్రత దృష్ట్యా నిబంధనలు పాటించి తీరాల్సిందేనంటూ రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. కావాలంటే డేటాను విదేశాల్లో ప్రాసెస్ చేసుకోవచ్చని, అయితే ఆ తర్వాత 24 గంటల్లోగా భారత్‌లోని సిస్టమ్స్‌లోకి బదలాయించాల్సి ఉంటుందని పేర్కొంది. దీంతో దారికొచ్చిన అంతర్జాతీయ సంస్థలు రిజర్వ్ బ్యాంక్ డేటా లోకలైజేషన్ నిబంధనల ప్రకారం భారత్‌లో తగిన వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ కూడా డేటా స్థానికత మార్గదర్శకాలను పాటిస్తూ ఈ మద్యే యూపీఐ ఆధారిత పేమెంట్ సర్వీసులు ప్రారంభించింది. ఇందుకోసం యాక్సిస్ బ్యాంక్‌తో జట్టు కట్టింది. తాజాగా వాట్సాప్ కూడా అదే బాటలో స్టోరేజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటోంది. ఇలా అంతర్జాతీయ దిగ్గజాలు నిర్దేశిత నిబంధనలు పాటించేలా చేయడంలో రిజర్వ్ బ్యాంక్ విజయం సాధించినట్లయిందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తాజా గణాంకాల ప్రకారం దేశీయంగా మొత్తం 39 థర్డ్ పార్టీ యాప్స్.. పేమెంట్స్ సర్వీసులు అందిస్తున్నాయి. గూగుల్ పే, అమెజాన్, ఉబెర్, ఓలా వంటి సంస్థలు ఇందులో ఉన్నాయి. -
వెబ్సైట్, యాప్ లేకపోయినా చెల్లింపులు
బెంగళూరు: పేమెంట్ సొల్యూషన్ల కంపెనీ రేజర్‌పే నూతనంగా పేమెంట్ పేజెస్ అనే సర్వీస్‌ను ఆరంభించింది. అన్ని రకాల వ్యాపారస్తులు ఆన్లైన్ చెల్లింపులను స్వీకరించేందుకు వీలుగా దీన్ని రూపొందించినట్టు ఈ సంస్థ తెలిపింది. ఎటువంటి హోస్టింగ్ వ్యయాలు, ఇంటెగ్రేషన్, నిర్వహణ చార్జీలు లేదా స్థిర ఫీజుల అవసరం ఇందులో ఉండదని పేర్కొంది. దేశ జీడీపీలో 30 శాతం వాటా కలిగిన చిన్న, మధ్య స్థాయి వ్యాపారుల్లో 68% మందికి వెబ్‌పోర్టళ్లు కానీ, యాప్స్ కానీ లేవని తెలిపింది. ఈ పరిస్థితుల్లో ఆయా వ్యాపారులకు పేమెంట్ పేజీని ఐదు నిమిషాల వ్యవధిలోపే రేజర్ పే పెమెంట్ పేజెస్ ఏర్పాటు చేస్తుందని తెలిపింది. -
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల లాభాలు ఆవిరి!
న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ఆగిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అభిప్రాయపడింది. గతంలో గుజరాత్, కర్ణాటక రాష్ట్ర ఎన్నికల సమయంలో ప్రభుత్వం ధరల పెరుగుదలను నిలిపివేసిన మాదిరిగా ఈసారి కూడా తాత్కాలిక ఆంక్షలు విధించే అవకాశం ఉందని పేర్కొంది. ఏప్రిల్–మే సమయంలో సాధారణ ఎన్నికల షెడ్యూల్ ఉండగా.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈకాలంలో ధరల పెంపు నిర్ణయం తీసుకోవద్దని ఆదేశించే అవకాశం ఉందని అంచనావేస్తోంది. ఈ నిర్ణయం వెలువడితే ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలైన ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ సంస్థల లాభాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని విశ్లేషించింది. -
క్రెడిట్ కార్డు... తీసుకుంటే లాభమే!
క్రెడిట్ కార్డులో అధిక చార్జీలు ఉంటాయని, రుణ భారంలో చిక్కుకుంటామన్న అభిప్రాయాలతో చాలా మంది వీటిని తీసుకునేందుకు సుముఖత చూపరు. కానీ, నాణేనికి ఇది ఒకవైపు మాత్రమే. మరోవైపు క్రెడిట్ కార్డుల వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అత్యవసరాలు, ఆన్లైన్ చెల్లింపులకు వినియోగించడం ద్వారా క్రెడిట్ స్కోరును పెంచుకునేందుకు క్రెడిట్ కార్డు వీలు కల్పిస్తుంది. మంచి క్రెడిట్ స్కోరు అనేది గృహ రుణం, వ్యక్తిగత రుణాలకు ఎంతో అనుకూలమన్న విషయం తెలిసిందే. వాస్తవానికి ప్రతీ సాధనానికి సానుకూల, ప్రతికూలతలు ఉన్నట్టే క్రెడిట్‌కార్డు విషయంలోనూ ప్రయోజనాలు, మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. కాకపోతే అందరికీ ఒకే విధంగా ఉండవు. వ్యక్తుల ప్రొఫైల్ ఆధారంగా మారిపోతుంది. కనుక క్రెడిట్‌కార్డు విషయంలో అనుకూలతలను ఉపయోగించుకుని, అననుకూలతలను అధిగమించడం మంచి నిర్ణయం అవుతుంది. ఈ నేపథ్యంలో క్రెడిట్ కార్డుల గురించి సమగ్ర వివరాలను అందించే కథనమే ఇది. సాక్షి, బిజినెస్ విభాగం: వడ్డీ లేకుండా రుణం సకాలంలో చెల్లింపులు చేసే వారికి అనుకూలం అత్యవసరాల్లో ఆదుకునే సాధనం ఆన్లైన్ షాపింగ్‌లు, బిల్లుల చెల్లింపులపై తగ్గింపులు మరెన్నో ఇతర ప్రయోజనాలు గడువులోపు చెల్లించకపోతే మాత్రం భారీ వడ్డీ క్రెడిట్ కార్డుల్లో ఎన్నో రకాలు ఎవరికి వారు తమకు అనువైనదే ఎంచుకోవాలి సకాలంలో బకాయిలు చెల్లించాలి క్రెడిట్ స్కోరు తక్కువ ఉంటే కార్డుకు తిరస్కారం క్రెడిట్ స్కోరుజీవితంలో కొన్ని సందర్భాల్లో రుణ అవసరం ఎంతో ఏర్పడవచ్చు. ముఖ్యంగా ఉన్నత విద్య కోసం రుణాలు, గృహ రుణాలు, వ్యాపార రుణాల కోసం బ్యాంకులను ఆశ్రయించినప్పుడు మంచి క్రెడిట్ స్కోరు ఉన్న వారికి రుణాలు సులభంగా వస్తాయి. మంచి క్రెడిట్ స్కోరు ఉన్న వారికి ఇతరులతో పోలిస్తే బ్యాంకులు వేగంగా ప్రక్రియను పూర్తి చేయడమే కాకుండా, తక్కువ వడ్డీ రేటును సైతం ఆఫర్ చేస్తుంటాయి. కాకపోతే క్రెడిట్ కార్డును వినియోగించే వారు క్రెడిట్ లిమిట్ దాటిపోకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. క్రెడిట్‌కార్డు పరిమితిలో 30–50 శాతం వరకే వినియోగించుకోవడం స్కోరును పెంచుకునే మంచి చర్యగా నిపుణులు పేర్కొంటున్నారు. దీన్ని రుణమిచ్చే సంస్థలు సానుకూలంగా చూస్తాయి. వడ్డీ రహిత అరువు క్రెడిట్ కార్డులో ఉన్న అత్యంత అనువైన ఫీచర్ వడ్డీ రహిత కాలం. క్రెడిట్ కార్డును సానుకూల ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలనుకుంటే ఇది చక్కని సదుపాయమే అవుతుంది. కార్డును బట్టి క్రెడిట్ లిమిట్ వినియోగించుకున్న తేదీ నుంచి 45–50 రోజుల వరకు వడ్డీ రహిత కాలం ఉంటుంది. అంటే ఈ కాల వ్యవధి దాటకుండా చెల్లింపులు చేస్తే వడ్డీ పడదు. కాకపోతే సకాలంలో చెల్లించే వారికే ఇది అనుకూలం. లేదంటే భారీ వడ్డీతో ప్రతికూలంగా మారుతుంది. అత్యవసరాలు అత్యవసరాలు చెప్పి రావు. ముఖ్యంగా వైద్య పరమైన అవసరాల్లో అప్పటికప్పుడు పెద్ద మొత్తం డబ్బులతో అవసరం పడొచ్చు. క్రెడిట్ కార్డును దాదాపు అన్ని ఆస్పత్రులూ అనుమతిస్తున్నాయి. కీలక సందర్భాల్లో ఎదురయ్యే తక్షణ ఖర్చులను క్రెడిట్ కార్డుతో గట్టెక్కడానికి వీలుంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఇబ్బందులను అధిగమించవచ్చు. ఆన్లైన్ చెల్లింపులు ఈ కామర్స్ కంపెనీల విస్తరణతో ఆన్లైన్ కొనుగోళ్లు పెరుగుతున్నాయి. వీటిల్లో చెల్లింపులకు క్రెడిట్ కార్డులు ఎంతో అనుకూలం. ఎందుకంటే క్రెడిట్ కార్డుల ద్వారా జీరో వడ్డీతో ఈఎంఐ చెల్లింపులకు అవకాశం కల్పిస్తున్నాయి. పైగా ఈఎంఐ కొనుగోళ్లపై ఇన్స్టంట్ డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా కనిపిస్తుంటాయి. కాకపోతే క్రెడిట్ కార్డు ఉంది కదా అని ఆలోచన లేకుండా జోరుగా షాపింగ్ చేస్తే ఆ తర్వాత లబోదిబోమనాల్సి వస్తుంది. బిల్లుల చెల్లింపులు క్రెడిట్ కార్డులతో ప్రతీ నెలా నిర్ణీత తేదీన బిల్లులు చెల్లింపులు జరిగేలా సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల గడువు దాటిన తర్వాత లేట్ ఫీజు పడకుండా సకాలంలో చెల్లింపులు జరిగిపోతాయి. బీమా ప్రీమియం వంటి ముఖ్యమైన సాధనాలు ల్యాప్స్ అవకుండా కూడా చూసుకోవచ్చు. నిష్ప్రయోజనం... క్రెడిట్ కార్డులు తీసుకుని వాడకుండా షెల్ఫ్‌లో పెట్టేస్తే ఎటువంటి ప్రయోజనం నెరవేరదు. ఒకటికి మించి కార్డులు తీసుకుని ఏదో ఒకదాన్ని వాడుతూ, మిగిలిన వాటిని అత్యవసరాల్లో ఉపయోగపడతాయనే భావనతో ఉంచుకుంటే సరిపోదు. వాటినీ మధ్య మధ్యలో వాడితేనే ప్రయోజనం. క్రెడిట్ లిమిట్ క్రెడిట్‌కార్డు లిమిట్‌ను కంపెనీలే నిర్ణయిస్తుంటాయి. అయితే, మీకు సౌకర్యం అనుకున్నంతకే లిమిట్‌ను మీరే నిర్ణయించుకోవచ్చు. ఉదాహరణకు క్రెడిట్ కార్డును రూ.లక్ష లిమిట్‌తో జారీ చేసిన తర్వాత... దాన్ని తరచుగా వినియోగిస్తూ, సకాలంలో బిల్లుల చెల్లింపులు చేసే వారికి కంపెనీలు క్రెడిట్ లిమిట్‌ను ఏటేటా పెంచుతుంటాయి. ఇలా పెంచడం సౌకర్యంగా లేకపోతే, పెంచొద్దని కోరే అవకాశం ఉంటుంది. క్రెడిట్ కార్డు ఎంపిక... క్రెడిట్ కార్డులు అన్నీ ఒకే విధంగా ఉండవు. కార్డులను బట్టి ప్రయోజనాలు మారిపోతుంటాయి. వార్షిక ఫీజులు, రివార్డు పాయింట్లు తదితర అంశాల ఆధారంగా మీకు అనువైన కార్డును ఎంపిక చేసుకోవాలి. గరిష్టంగా ఒకటి నుంచి మూడు కార్డులు మించకుండా జాగ్రత్తపడాలి. ఆర్థిక ప్రపంచంలో క్రెడిట్ కార్డు అన్నది ఓ కొకైన్ అని స్కాట్ ఆడమ్స్ అభివర్ణన. క్రెడిట్ కార్డుకు బానిస కాకుండా, దాన్ని మీ కోసం పనిచేయించుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. కొన్ని కార్డులు ప్రత్యేకంగా రెస్టారెంట్లలో చెల్లింపులపై డిస్కౌంట్లు ఇస్తుంటాయి. కొన్ని కార్డులు ప్రత్యేకంగా వాహనాలకు ఇంధనం నింపుకున్న సమయాల్లో రివార్డు పాయింట్లను క్యాష్ బ్యాక్‌గా పొందే సదుపాయంతో ఉంటాయి. ఈ అవసరాల కోసమే అయితే వీటిని తీసుకోవాలి. కొన్ని కార్డులపై విమానాశ్రయ లాంజెస్‌లో ఉచిత ప్రవేశ సదుపాయం ఉంటుంది. విదేశాలకు వెళ్లే సమయంలో క్రెడిట్ కార్డుకు బదులు ముందుగా కరెన్సీ లోడ్ చేసిన ట్రావెల్కార్డును తీసుకెళ్లడం వల్ల ఖర్చులు ఆదా చేసుకోవచ్చు. క్రెడిట్‌కార్డు ద్వారా విదేశాల్లో చెల్లింపులు చేస్తే కరెన్సీ మార్పిడి రేటు అధికంగా పడుతుంది. కానీ ట్రావెల్ కార్డుతోపాటు ఒక క్రెడిట్ కార్డును కూడా వెంట తీసుకెళ్లడం మంచిది. గడువు దాటితే వడ్డీ బాదుడు క్రెడిట్ కార్డుల బిల్లులను గడువు దాటకుండా తీర్చివేసే వీలుంటేనే కార్డు తీసుకోవాలి. లేదంటే క్రెడిట్ స్కోరు తీవ్రంగా దెబ్బతింటుంది. అదే జరిగితే తర్వాత రుణం లభించడం కష్టమవుతుంది. గడువు దాటితే మూడు రూపాయలు, అంతకంటే ఎక్కువ వడ్డీతో చెల్లించాల్సి రావడం భారంగా మారుతుంది. ఆన్లైన్లో డిస్కౌంట్ ప్రయోజనం పొందేందుకు క్రెడిట్ కార్డుతో చెల్లింపులు చేసిన వారు... గడువు వరకు ఆగకుండా వీలైనంత ముందే ఆ మొత్తాన్ని చెల్లించాలి. క్రెడిట్ కార్డుకు తిరస్కారం... క్రెడిట్ కార్డు ఇచ్చే ప్రతీ సంస్థ కూడా కార్డుదారుడు బకాయిలు తిరిగి చెల్లించగలరా అని చూస్తుంది. అధిక రిస్క్‌తోపాటు, తిరిగి చెల్లించే సామర్థ్యం తక్కువగా ఉంటే కార్డు ఇచ్చేందుకు నిరాకరిస్తాయి. వ్యాపార రంగంలోని వారికి, స్వయం ఉపాధిలో ఉన్న వారి నుంచి డిఫాల్ట్ రిస్క్ ఎక్కువగా ఉంటుందని లాడర్7 ఫైనాన్షియల్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు సురేష్ శెడగోపన్ తెలిపారు. తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని తెలుసుకోవాలంటే అందుకు ఉన్న ఏకైక మార్గం క్రెడిట్ రిపోర్ట్‌ను చూడడమే. ప్రతీ వ్యక్తి తన రుణచరిత్రను క్రెడిట్ స్కోరు రూపంలో తెలుసుకోవచ్చు. రుణాలకు తిరిగి చెల్లింపులు ఏ విధంగా ఉన్నాయి, రుణాల్లో సమతుల్యత, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని క్రెడిట్ బ్యూరో సంస్థలు క్రెడిట్ స్కోరును ఇస్తాయని బ్యాంక్ బజార్ డాట్ కామ్ ముఖ్య అభివృద్ధి అధికారి నవీన్‌చందాని తెలిపారు. ‘‘తక్కువ క్రెడిట్ స్కోరు గతంలో రుణాలకు సకాలంలో చెల్లింపులు చేయలేదని సూచిస్తుంది. లేదా రుణ ఖాతాలను సరిగ్గా మూసివేయలేకపోవడం వల్ల కూడా ఇలా జరిగి ఉంటుంది. అలాగే, రుణానికి అవకాశం ఉంది కదా అని అధిక మొత్తంలో తీసుకోవడం కూడా స్కోరుపై ప్రభావం చూపిస్తుంది. దీంతో క్రెడిట్ కార్డు దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది’’ అని చందాని వివరించారు. అలాగే, క్రెడిట్ స్కోరు మెరుగుపడినప్పటికీ, గత రుణాలకు సంబంధించి డిఫాల్ట్ విషయాన్ని క్రెడిట్ రిపోర్ట్‌లో పేర్కొనడం వల్ల కూడా క్రెడిట్ కార్డు పొందలేని పరిస్థితి ఎదురుకావచ్చన్నారు. ‘‘ఒకేసారి ఒకటి మించి క్రెడిట్ కార్డులకు దరఖాస్తు చేసుకోరాదు. అలా చేస్తే అన్నీ కూడా తిరస్కరణకు గురి కావచ్చు. ఇది క్రెడిట్ కోసం అర్రులు చాచినట్టు అవుతుంది. ఇలా ఒకటికి మించిన దరఖాస్తులు కూడా క్రెడిట్ స్కోరును తగ్గిస్తాయి’’ అని చందానీ వివరించారు. అందుకే తిరిగి చెల్లించే సామర్థ్యం ఉన్నవారే క్రెడిట్ కార్డుకు వెళ్లాలని సూచించారు. ముందుగా క్రెడిట్ స్కోరును పరిశీలించుకుని తక్కువగా ఉంటే, ఏవైనా తప్పులు ఉన్నాయోమో చూసుకుని సరిచేయించుకోవాలన్నారు. అలాగే, పాత బకాయిలు ఉంటే వాటిని తీర్చివేసిన తర్వాత క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
చెల్లింపులన్నీ ఈ–కుబేర్ ద్వారానే..
హన్మకొండ అర్బన్: డిజిటల్ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో ప్రతి నెలా చెల్లింపులు జరిపే ఉద్యోగుల వేతనాలకు సంబంధించి బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా ట్రెజరీ, ఆర్బీఐ ప్రతిష్టాత్మకంగా ఈ–కుబేర్ద్వారా చెల్లింపులు చేయనుంది. ఈ విధానం ద్వారా సత్వర చెల్లింపులు జరగడంతో పాటు ప్రభుత్వానికి భారీగా డబ్బులు ఆదా అవుతున్నాయి. దీంతో వేతనాలే కాకుండా ఇకపై ప్రభుత్వ పరంగా చేసే చెల్లింపులన్నీ ఈ–కుబేర్ విధానం ద్వారానే చేయాలని నిర్ణయించారు. దీని వల్ల ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే సంబంధిత లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమకానున్నాయి. మార్చి నుంచి మొదలు.. వేతనాలకు సంబంధించి ఆగస్టు నుంచి మొదలు పెట్టిన ప్రభుత్వం ప్రస్తుత మార్చి నుంచి గ్రామ పంచాయతీ బిల్లులు, మునిసిపాలిటీ, సీపీవో, జెడ్పీ, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ, జిల్లా గ్రంథా లయ సంస్థలు, కేయూ, కాళోజీ నారాయణరా వు హెల్త్ యూనివర్సిటీ, జూనియర్, డిగ్రీ కాలేజ్ నిధులు, ఇకపై ఈ కుబేర్ విధానం ద్వారా చెల్లిం పులు చేయనున్నారు. ప్రసుత్తం ఫిబ్రవరి 28 వర కు ఉన్న చెక్కులు సంబంధిత బ్యాంకుల ద్వారానే చెల్లిస్తారు. మార్చి ఒకటి నుంచి ఈ–కుబేర్ ద్వారా ట్రెజరీ అధికారులు పనులు చేపడతారు. ఎలాగంటే.. గతంలో ట్రెజరీలో పాస్ అయిన చెక్కులు బ్యాంకులకు ఎస్బీఐకి పంపేవారు. ఇకపై అలా కాకుండా ఖజానా నుంచి నేరుగా ఆర్బీఐ సర్వర్కి అప్లోడ్ చేస్తారు. దీని వల్ల డ్రాయింగ్ అధికారులు బ్యాంకుల చుట్టూ తిరిగే పనిలేదు. లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్ఓసీ)కూడా బ్యాకులకు పంపాల్సిన అవసరం లేదు. పర్సనల్ డిపాజిట్స్ ఉన్నా డీడీఓలు నేరుగా సాధారణ, ఎల్ఓసీ చెక్కులు తీసుకు రావాల్సి ఉంటుంది. డబ్బులు కూడా ఎన్ఈఎఫ్టీ పద్ధతిలో రెండు గంటల్లోపు చెల్లింపులు చేస్తారు. ఇవి పాత లెక్కనే.. గతంలో మాదిరిగా కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, భూసేకరణ, రైతుబంధు చెల్లింపులు ఈ–కుబేర్ విధానం ద్వారా కాకుండా బ్యాంకుల ద్వారా చెల్లింపులు చేస్తారు. ఈ–కుబేర్ చెల్లింపుల విషయంలో సంబంధిత డ్రాయింగ్ అధికారులు సందేహాలుంటే జిల్లా ఖజానా అధికారులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. -
పేమెంట్ వ్యవస్థలకు ప్రత్యేక నియంత్రణ అక్కర్లేదు: ఆర్బీఐ
ముంబై: పేమెంట్, సెటిల్మెంట్ చట్టంలో మార్పులకు ప్రభుత్వ ప్యానెల్ చేసిన సిఫారసులతో ఆర్బీఐ తీవ్రంగా విభేదించింది. పేమెంట్ వ్యవస్థల నియంత్రణ కచ్చితంగా ఆర్బీఐ పరిధిలోనే ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి చైర్మన్‌గా ప్రభుత్వం ఓ అంతర్గత మంత్రిత్వ శాఖల కమిటీని ఏర్పాటు చేసింది. పేమెంట్ అండ్ సెటిల్మెంట్స్ చట్టం(పీఎస్ఎస్), 2007కు చేయాల్సిన సిఫారసులతో ఈ కమిటీ ఓ ముసాయిదా నివేదికను సిద్ధం చేసింది. పేమెంట్ సంబంధిత అంశాలను పర్యవేక్షించేందుకు ఓ స్వంతంత్ర నియంత్రణ సంస్థ ఉండాలని సూచించింది. ‘‘ఆర్బీఐకి బయట పేమెంట్ వ్యవస్థల కోసం నియంత్రణ సంస్థ ఉండాల్సిన అవసరమే లేదు’’ అని సంబంధిత ప్రభుత్వ కమిటీకి ఆర్బీఐ తన అసమ్మతి నోట్‌ను సమర్పించింది. అయితే, నూతన పీఎస్ఎస్ బిల్లుకు ఆర్బీఐ పూర్తిగా వ్యతిరేకం కాదని స్పష్టం చేసింది. ‘‘మార్పులన్నవి ప్రస్తుత వ్యవస్థలను కుదిపివేసే మాదిరిగా ఉండకూడదు. అంతర్జాతీయంగా ప్రశం సలు పొంది, చక్కగా కొనసాగుతున్న మన దేశ వ్యవస్థల సామర్థ్యానికి సమస్యలు సృష్టించేలా ఉండకూడదు’’ అని ఆర్బీఐ తన నోట్లో పేర్కొంది. -
ఆర్టీసీ పాలిట ‘నష్ట’పరిహారం
సాక్షి, హైదరాబాద్: కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్లుగా ఆర్టీసీ నష్టాలకు అనేకానేక కారణాలు ఉన్నాయి. అప్పులు, పెరుగుతున్న డీజిల్ ధరలతో ముక్కుతూ మూలుగుతూ నెట్టుకొస్తోన్న ఆర్టీసీకి నష్టపరిహారం చెల్లింపులు అదనపు భారంగా మారాయి. ఏటా గరిష్టంగా రూ.35 కోట్ల వరకు వివిధ కేసుల్లో నష్టపరిహారంగా చెల్లిస్తోంది. ఈ పరిస్థితి తలెత్తడానికి కారణం ఆర్టీసీలో ప్రయాణీకులకు బీమా లేకపోవడమే. టోల్‌ట్యాక్స్, సెస్, రవాణా చార్జీలు మినహా టికెట్లపై ఇతర చార్జీలు వసూలు చేయరు. బీమా కింద ప్రత్యేకంగా ఎలాంటి రుసుం వసూలు చేయరు. ఇదే ఇప్పుడు ఆర్టీసీకి భారంగా మారింది. ప్రమాదాలు జరిగినపుడు చెల్లించాల్సిన నష్టపరిహారం సొంత నిధులనుంచే వెచ్చించాల్సి రావడం అదనపు భారంగా మారింది. ప్రస్తుతం క్యాట్ కార్డు, వనితా కార్డులకు మినహా ఎక్కడా బీమా సదుపాయం కల్పించడం లేదు. కొండగట్టు భారం రూ.1.8 కోట్లు తెలంగాణ ఆర్టీసీ చరిత్రలోనే ‘కొండగట్టు’అతిపెద్ద దుర్ఘటన. ఏకంగా 62 మంది అసువులు బాయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ప్రమాదంపై ఆర్టీసీ వెంటనే స్పందించి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. అంటే 62 మందికి రూ.1.8 కోట్లకుపైగా నష్టపరిహారం రూపంలో చెల్లించాలి. వీటిని సొంత నిధులనుంచే ఇవ్వాలి. ఈ విషయంలో బాధితుల కుటుంబసభ్యులు కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్‌ని ఆశ్రయిస్తే, ఈ మొత్తం ఇంకా పెరిగే అవకాశాలు లేకపోలేదు. కానీ, ప్రమాదం జరిగి నెలరోజులు గడుస్తున్నా.. బాధితులకు ఇంకా పూర్తిస్థాయిలో పరిహారం అందకపోవడంతో బాధిత కుటుంబాలు ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. రైల్వేలో బీమా ఎలా ఉందంటే.. రైల్వేలో బీమా సదుపాయంకోసం ప్రతి ఆన్లైన్ టికెట్‌పై 90పైసల చొప్పున వసూలు చేస్తున్నారు. ఇందుకోసం ఐసీఐసీఐ, సుందరం, శ్రీరామ్ ఫైనాన్స్‌లాంటి సంస్థలతో భారతీయ రైల్వే ఒప్పందం చేసుకుంది. ఆ లెక్కన బీమా తీసుకున్న ప్రయాణికులు ప్రమాదవశాత్తూ చనిపోతే రూ.10 లక్షల పరిహారం చెల్లిస్తారు. శాశ్వతంగా అంగవైకల్యానికి గురైతే రూ.7.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల వరకు పరిహారం లభిస్తుంది. మరోవైపు ఈ బీమా కాకుండా రైల్వే నుంచి వచ్చే నష్టపరిహారం కూడా అందుతుంది. వెంటనే పరిహారం చెల్లించాలి కొండగట్టు ప్రమాదంలో బాధితులందరికీ పరిహారం చెల్లించాలి. సంస్థపై భారం తగ్గాలంటే ఆర్టీసీలో బీమా అమలు చేయాలి. ఈ పథకం వల్ల మృతుల కుటుంబాలకే కాదు, క్షతగాత్రులకూ మెరుగైన వైద్యం అందే వీలుంది. కేవలం కొందరి ప్రయోజనాల కోసం ప్రజలకు ఉపయోగపడే మంచి పథకాలను నిలువరించడం సరికాదని నాగేశ్వరరావు (ఎన్ఎంయూ), హన్మంత్ ముదిరాజ్ (టీజేఎంయూ)లు అభిప్రాయపడ్డారు. వెంటనే ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. ఆర్టీసీలో ఎందుకు విఫలమైంది..? వాస్తవానికి ఆర్టీసీలోనూ ఇదే తరహా ప్రయత్నం జరిగింది. ఏటా తమపై పడుతున్న నష్టపరిహారం (దాదాపుగా రూ.35 కోట్లు) భారం తగ్గించడం, బాధితులకు మెరుగైన పరిహారాన్ని చెల్లించాలన్న తలంపుతో ఉన్నతస్థాయిలో చర్చలు జరిగాయి. తొలుత ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని అనుకున్నారు. ఇందుకోసం బజాజ్ అలయెన్స్, సుందరంఫైనాన్స్ లాంటి కంపెనీలు ఆర్టీసీతో ఒప్పందానికి ముందుకు వచ్చాయి. ప్రతిపాదన ప్రకారం ఈ ఒప్పందం అమలు కావాలంటే.. ప్రతి టికెట్‌పై ఎంతో కొంత చార్జీలు పెంచాలి, కానీ, చార్జీలు పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న ఆందోళనతో కొందరు ఈ ప్రతిపాదనను వాయిదా వేయించారని ఉన్నతాధికారులు వాపోతున్నారు. -
అన్ని రకాల చెల్లింపులకూ ఒకటే పీవోఎస్ పరికరం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్‌కు చెందిన పేమెంట్ సొల్యూషన్స్ కంపెనీ ‘పేస్విఫ్’ పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) పరికరాన్ని విడుదల చేసింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వ్యవస్థ కలిగిన ఈ పరికరాన్ని బుధవారమిక్కడ మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. యాప్స్‌తో కూడిన పీవోఎస్ డివైజ్‌ను వర్తకులు స్మార్ట్‌ఫోన్ మాదిరిగా వినియోగించుకోవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. క్రెడిట్, డెబిట్ కార్డులు, వాలెట్స్, ఆన్లైన్ పేమెంట్, యూపీఐ, భారత్ క్యూఆర్ వంటి అన్ని రకాల పేమెంట్ ఆప్షన్లను వినియోగించుకునే వీలుంటుందని పేర్కొంది. -
కళ్లు పోగొట్టినోళ్లకు చెల్లింపులు
సాక్షి, హైదరాబాద్: 2016 మే 26.. హైదరాబాద్‌లోని సరోజినీ కంటి ఆసుపత్రిలో ఆపరేషన్ వికటించి 13 మందికి కళ్లు పోయాయి. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. కంటి ఆపరేషన్‌కు కలుషితమైన ‘ఐవీ ఫ్లూయిడ్స్ ఆర్ఎల్ సొల్యూషన్’వాడటం వల్లే ఇంతమందికి కళ్లు పోయినట్లు అంచనా వేశారు. ఈ ఐవీ ఫ్లూయిడ్స్ సరఫరా చేసిన కంపెనీకి రూ.కోట్ల బిల్లులు చెల్లించేందుకు తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) ఇప్పుడు రంగం సిద్ధం చేసింది. సంబంధిత కంపెనీపై కేసులు నడుస్తుంటే, ఆ బిల్లుల సొమ్ము చెల్లించాలంటూ సర్కారుకు ప్రతిపాదనలు పంపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్లాక్ లిస్టులో పెట్టి విచారణ జరుపుతున్నా.. నాగపూర్‌కు చెందిన హసీబ్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆ ఐవీ ఫ్లూయిడ్స్‌ను సరఫరా చేసింది. సరోజినీ కంటి ఆసుపత్రిలో బాధితులకు ఆపరేషన్ సమయంలో 16,385, 16,386, 16,387 బ్యాచ్ నంబర్లోని ఐవీ ఫ్లూయిడ్స్‌ను ఉపయోగించారు. తర్వాత అవి కలుషితమైనవిగా అధికారులు గుర్తించారు. ఆ కంపెనీ సరఫరా చేసిన మిగిలిన ఐవీ ఫ్లూయిడ్స్‌ను ప్రభుత్వం తక్షణమే నిలుపుదల చేసింది. కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టింది. ఆ కంపెనీకి చెందిన కొన్ని ఐవీ ఫ్లూయిడ్స్ నమూనాలను పరీక్షలకు పంపింది. దీంతో ఆసుపత్రులు ఆ కంపెనీకి చెందిన ఐవీ ఫ్లూయిడ్స్ నిల్వలను వెనక్కు పంపేశాయి. దాదాపు రూ.1.35 కోట్ల విలువైన ఫ్లూయిడ్స్ జిల్లాల నుంచి తెప్పించారు. కొరత ఏర్పడకుండా టీఎస్ఎంఎస్ఐడీసీ ప్రమాణాలు పాటించే మరో కంపెనీకి చెందిన ఫ్లూయిడ్స్‌ను తక్షణమే తెప్పించి రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రులకు ప్రభుత్వం సరఫరా చేసింది. మరోవైపు తాను సరఫరా చేసిన ఐవీ ఫ్లూయిడ్స్‌కు బిల్లులు సమర్పించాలని ప్రభుత్వాన్ని హసీబ్ కంపెనీ కోరింది. దీటుగా స్పందించిన టీఎస్ఎంఎస్ఐడీసీ.. వెనక్కు పంపిన ఐవీ ఫ్లూయిడ్స్ నిల్వలకు బిల్లులు ఇవ్వబోమని స్పష్టంచేసింది. అయితే మొత్తం రూ.3.62 కోట్ల విలువైన ఐవీ ఫ్లూయిడ్స్ సరఫరా చేశామని, అందులో రూ.1.35 కోట్ల విలువైన సరుకును వెనక్కు తీసుకున్నందున అప్పటికే ఆసుపత్రుల్లో ఉపయోగించిన రూ.2.27 కోట్ల విలువైన సరుకుకు డబ్బులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కంపెనీ కోరింది. ఈ నేపథ్యంలో టీఎస్ఎంఎస్ఐడీసీ వర్గాలు కంపెనీకి పెండింగ్ బిల్లులను చెల్లించాలని ప్రభుత్వానికి నివేదించాయి. ఇటీవల జరిగిన సంస్థ మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో దీన్ని ప్రతిపాదించడం గమనార్హం. ప్రమాణాల్లో తేడా లేనందునే: టీఎస్ఎంఎస్ఐడీసీ హసీబ్ కంపెనీ సరఫరా చేసిన ఐవీ ఫ్లూయిడ్స్ నమూనాలను పరీక్షించగా.. ప్రమాణాల్లో ఎక్కడా తేడా లేదని నిర్ధారణ అయినట్లు టీఎస్ఎంఎస్ఐడీసీ చెబుతోంది. మరి బాధితుల కళ్లు ఎలా పోయాయన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. కలుషితమైనవనే అనుమానం ఉండటం, ఆ ఫ్లూయిడ్స్‌పై పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉండటంతో అప్పటివరకు నిల్వ ఉన్న సరుకును అధికారులు వెనక్కు పంపించారు. అప్పటికే వాడిన ఐవీ ఫ్లూయిడ్స్‌కు మాత్రం బిల్లులను చెల్లించాలని ప్రతిపాదించారు. మరోవైపు వాడిన ఫ్లూయిడ్స్ కూడా కలుషితం కాదని ఎలా నిర్ధారణ చేయగలరన్న ప్రశ్నకూ బదులు లేదు. ఈ పరిస్థితుల్లో కంపెనీకి బిల్లులు చెల్లించాలనుకోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాటి ప్రమాణాల్లో తేడా లేనందున బిల్లులు చెల్లించాలని భావిస్తున్నామని, దీనిపై మేనేజ్మెంట్ కమిటీకి ప్రతిపాదనలు పంపిన మాట వాస్తవమేనని టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ వేణుగోపాల్ ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. ఆ ప్రతిపాదనపై కమిటీ ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. -
సరికొత్త ఆవిష్కరణ : అన్ని సర్వీసులకు ఒకే బిల్లు
హైదరాబాద్ : దేశీయ అతిపెద్ద టెలికమ్యూనికేషన్ సర్వీసు ప్రొవైడర్ భారతీ ఎయిర్టెల్, తొలి డిజిటల్ క్వాడ్-ప్లే ప్లాట్‌ఫామ్ ‘ఎయిర్టెల్ హోమ్’ను లాంచ్ చేసింది. బహుళ ఎయిర్టెల్ సర్వీసులు వాడే గృహాల్లో కస్టమర్ అనుభవాలను సులభతరం చేసేందుకు దీన్ని తీసుకొచ్చింది. ఎయిర్టెల్ హోమ్ ద్వారా హోమ్ బ్రాడ్‌బ్యాండ్, పోస్టుపెయిడ్ మొబైల్, డిజిటల్ టీవీ అన్నింటిన్నీ మై ఎయిర్టెల్ యాప్‌పై సింగిల్ అకౌంట్లో నిర్వహించుకునేలా కంపెనీ తన కస్టమర్లకు అనుమతిస్తుంది. వివిధ ఎయిర్టెల్ సర్వీసులకు, పలు చెల్లింపు తేదీలు ఉంటాయి. వాటన్నింటిన్నీ గుర్తుంచుకోవాల్సినవసరం లేకుండా ఒకే బిల్లులో అన్ని సర్వీసులకు చెల్లించుకోవచ్చు. ప్రీమియం కస్టమర్ కేర్ యాక్సస్‌ను కూడా ఎయిర్టెల్ హోమ్ యూజర్లు పొందుతున్నారు. ఏకీకృత బిల్లులో 10 శాతం వరకు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఎయిర్టెల్ హోమ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఎయిర్టెల్ హోమ్బ్రాడ్బ్యాండ్ కస్టమర్లకు బీటా వెర్షన్లో అందుబాటులో ఉంది. వచ్చే కొన్ని వారాల్లో దేశవ్యాప్తంగా ఈ సర్వీసులను ఆవిష్కరించనుంది. ‘వన్ హోమ్, వన్ బిల్లు’ అనే బ్యానర్‌తో ఈ సర్వీసులను ఎయిర్టెల్ లాంచ్ చేసింది. ఎయిర్టెల్ హోమ్, ఎయిర్టెల్ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన తొలి ఆవిష్కరణ అని కంపెనీ సీఈవో జార్జ్ మతేన్ అన్నారు. కస్టమర్ జర్నీని ఇది మరింత సులభతరం చేస్తుందని తెలిపారు. ఎయిర్టెల్ హోమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి... మై ఎయిర్టెల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. అనంతరం ‘ఎయిర్టెల్ హోమ్’ బ్యానర్‌పై క్లిక్ చేయాలి. ప్రైమరీ అకౌంట్‌కు మీ ఎయిర్టెల్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ యాడ్ చేసుకోవాలి. యాడ్-ఆన్ అకౌంట్లగా అన్ని ఇతర ఎయిర్టెల్ కనెక్షన్లు(ఎయిర్టెల్ పోస్టుపెయిడ్ మొబైల్, హోమ్ బ్రాడ్‌బ్యాండ్, డిజిటల్ టీవీ)లను యాడ్ చేసుకోవాలి. అన్ని అకౌంట్ల ఏకీకృత బిల్లు చెల్లింపులకు అంగీకారం తెలపాలి. ఇప్పుడు మై ఎయిర్టెల్ హోమ్ క్రియేట్ అవుతుంది. అన్ని అకౌంట్లను మై ఎయిర్టెల్ యాప్‌లో నిర్వహించుకోవచ్చు. కొన్ని క్లిక్స్‌తోనే ఒకే బిల్లులో అన్ని చెల్లింపులు చేసుకోవచ్చు. -
పేటీఎం నుంచి సెకన్లలో ఆఫ్‌లైన్ పేమెంట్!
డిజిటల్ లావాదేవీల్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన పేటీఎం మరో కొత్త పేమెంట్ మోడ్‌ను లాంచ్ చేసింది. ట్యాప్ కార్డు పేరుతో భారత్‌లో తొలి ఆఫ్‌లైన్ పేమెంట్స్ సొల్యుషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కార్డు ద్వారా ఎన్ఎఫ్సీని వాడుతూ నగదును కంప్యూటర్ ఆథరైజ్డ్ పాయింట్ ఆఫ్ టర్మినల్స్‌కు బదిలీ చేయవచ్చు. నాన్-ఇంటర్నెట్ యూజర్లను టార్గెట్‌గా చేసుకుని పేటీఎం కార్డును పేటీఎం లాంచ్ చేసింది. పేటీఎం ట్యాప్ కార్డు ద్వారా ఎన్ఎఫ్సీని వాడుతూ సురక్షితంగా, తేలికగా డిజిటల్ పేమెంట్లను చేసుకోవచ్చు. సెకన్ల వ్యవధిలోనే ఈ పేమెంట్లను పూర్తి చేయవచ్చని కంపెనీ తెలిపింది. అయితే పేమెంట్లు జరుపడానికి యూజర్లు ట్యాప్ కార్డుపై ఉన్న క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేసి పేటీఎం అకౌంట్లలోకి మనీని యాడ్ చేయాల్సి ఉంటుంది. కన్జ్యూమర్లు, మెర్చంట్ల వద్ద ఉన్న అన్ని రకాల నెట్వర్క్ సమస్యలను ఇది అడ్రస్ చేస్తుంది. ట్యాప్ కార్డును వాడుతూ వెనువెంటనే డిజిటల్ పేమెంట్లు జరుపడం కోసం పేటీఎం ప్రస్తుతం ఈవెంట్లు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లు, కార్పొరేట్లతో భాగస్వామ్యం ఏర్పరచుకుంటోంది. పేమెంట్‌ను జరుపడానికి మెర్చంట్ టర్మినల్ వద్ద కస్టమర్ కార్డును ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఫోన్లను పట్టుకెళ్లకుండానే ఈ లావాదేవీలు జరుపుకోవచ్చు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి తాము కృషిచేస్తున్నామని, చాలా మందికి ఇంటర్నెట్ యాక్సస్ లేదని, దీంతో పాటు కొందరు ఆన్లైన్ పేమెంట్లు జరుపడానికి జంకుతున్నారని పేటీఎం సీఓఓ కిరణ్ వాసి రెడ్డి తెలిపారు. వారి కోసం పేటీఎం ట్యాప్ కార్డును తాము ఆఫర్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇది తమ యూజర్ల అవసరాల కోసం అంకితభావంతో తీసుకొచ్చామని, ఎప్పడికప్పుడు వినూత్నావిష్కరణలతో యూజర్ల ముందుకు వస్తున్నట్టు చెప్పారు. -
'అద్దె'రిపోయే ఆఫర్
దివ్య దర్శనం.. ద్రవ్యభారం.. ప్రముఖ దేవస్థానాలపై ‘ద్రవ్య’భారం - జనవరి నుంచి ఇప్పటి వరకూ బస్సుల అద్దె రూ.2.5 కోట్లు సగం టీటీడీ, మిగిలిన సగం ఏడు దేవస్థానాలు భరించాలని ఆదేశం అన్నవరం దేవస్థానం వాటాగా రూ.17.85 లక్షలట.. ‘సొమ్మొకరిది.. సోకొకరిది’ అన్నట్టుగా ఉంది ‘దివ్యదర్శనం ’ పథకం అమలు తీరు. ఈ పథకం కింద పేదలకు ఉచితంగా యాత్రలు చేయిస్తున్నామని ప్రభుత్వం ఓ పక్క ప్రచారం చేసుకుంటూనే.. మరోపక్క ఆ యాత్రలకయ్యే ఖర్చులను భరించాల్సిందేనంటూ దేవస్థానాలపై రుద్దడం విశేషం. - అన్నవరం(ప్రత్తిపాడు) తీర్థయాత్రలు చేయలేని పేద భక్తులను వివిధ పుణ్యక్షేత్రాలకు ఉచితంగా బస్సుల్లో తీసుకువెళ్లి దర్శనాల అనంతరం తిరిగి వారి స్వగృహాలకు చేర్చేందుకు ఉద్దేశించిన ‘దివ్యదర్శనం’ పథకాన్ని గత జనవరిలో ప్రభుత్వం ప్రారంభించింది. భక్తులకు దివ్యదర్శనం చేయిస్తున్నందుకు గాను అయ్యే రవాణా చార్జీల భారాన్ని ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు రాష్ట్రంలోని ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాలపై మోపింది. దివ్యదర్శనం పథకం కింద వచ్చే భక్తులకు ఇప్పటికే ఆయా దేవస్థానాలు ఉచిత వసతి, భోజనసౌకర్యం కల్పిస్తుండగా.. తాజాగా వారు వచ్చే బస్సుల అద్దె కూడా భరించాలని ఆదేశాల్లో పేర్కొంది. గత జనవరి నుంచి ఇప్పటి వరకూ ఈ ‘దివ్యదర్శనం’ బస్సులకు అద్దెల కింద రూ.2.5 కోట్లు ఖర్చుకాగా అందులో సగం తిరుమల తిరుపతి దేవస్థానం, మిగిలిన సగం ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాలు భరించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీని ప్రకారం సింహాచలం, అన్నవరం, ద్వారకాతిరుమల, విజయవాడ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, పెనుగంచిప్రోలు దేవస్థానాలు రూ.17,85 లక్షలు చొప్పున చెల్లించాలని దేవాదాయశాఖ ప్రిన్స్‌పల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలు అన్నవరం దేవస్థానానికి శనివారం అందాయి. సీజీఎఫ్ నుంచి చెల్లించే వీలున్నా.. ఏటా దేవస్థానాలు తమ వార్షికాదాయంలో 15శాతం ‘కామన్ గుడ్ ఫండ్ ’ తదితర నిధులకు చెల్లిస్తున్నాయి. ఒక్క అన్నవరం దేవస్థానమే సుమారు రూ.15 కోట్ల వరకూ చెల్లిస్తోంది. ఆ మొత్తం నుంచి ఈ ‘దివ్యదర్శనం’ పథకానికి నిధులు ప్రభుత్వం చెల్లించవచ్చు. కానీ అలా చేయకుండా మరలా అదనంగా దీనికి వసూలు చేయడంపై ఆలయ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దివ్యదర్శనం పథకం ఎన్ని రోజులు అమలైతే అన్ని రోజులు ఈ విధంగా దేవస్థానాలు ఈ భారం మోయాల్సిందేనని అధికారులు తెలిపారు. -
వాట్సాప్‌లోకి త్వరలో ఆ ఫీచర్ వచ్చేస్తోంది!
మెసేజింగ్ లో ఇప్పటికే వాట్సాప్ తనదైన ముద్ర వేసుకుంది. ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లతో వినియోగదార్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తాజాగా మరో ఫీచర్ ఫీచర్ తో వినియోగదారులను అలరించేందుకు వచ్చేస్తోంది. డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగిపోతుండటంతో యూపీఐ ద్వారా పేమెంట్లు చేసుకునేలా తమ యూజర్లకు అవకాశం కల్పించాలని సిద్ధమవుతోంది. ఇప్పటికే వాట్సాప్ దేశీయ బ్యాంకులు, ఇతర ఇన్ స్టిట్యూషన్లతో ప్రాథమిక చర్చలు ప్రారంభించినట్టు తెలిసింది. యూపీఐ ద్వారా తమ మొబైల్ ప్లాట్ ఫామ్ పైననే రెండు బ్యాంకుల మధ్య ఇన్ స్టాంట్ ఫండ్ ట్రాన్సఫర్ చేసుకునే సౌకర్యం కల్పించనుంది. ఈ సేవల ప్రారంభంలో కొంత సంక్లిష్టత ఉన్న కారణంగా వాట్సాప్, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఎన్పీసీఐ, ఇతర కొన్ని బ్యాంకులతో చర్చిస్తోందని, బ్యాంకులు, ఎన్పీసీఐతో తమ సిస్టమ్ ఎలా ఇంటిగ్రేట్ అవాలో నిర్ణయిస్తుందని ఓ సీనియర్ ఎస్బీఐ అధికారి చెప్పారు. యూపీఐను ఎన్పీసీఐ రన్ చేస్తోంది. ఈ యూపీఐ ఆధారంగా పనిచేసే 'పీర్-టు-పీర్(పర్సన్ నుంచి పర్సన్)' పేమెంట్ సేవలను వాట్సాప్ లో యూజర్లు వినియోగించుకోవచ్చు. నోట్ల రద్దు అనంతరం దేశాన్ని క్యాష్ లెస్ సొసైటీగా మార్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటలైజేషన్ కు ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్యాష్ లెస్ సొసైటీలో తాము భాగస్వామ్యం కావాలని సోషల్ మీడియా దిగ్గజాలు నిర్ణయించాయి. ఈ మేరకు హైక్ మొన్ననే పేమెంట్స్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్ కంటే ముందస్తుగా ఈ ఫీచర్ ను ప్రవేశపెట్టి, పేమెంట్స్ ఫీచర్ ను ప్రవేశపెట్టిన తొలి మెసేజింగ్ యాప్ గా పేరు తెచ్చుకుంది. అయితే వాట్సాప్ ద్వారా పేమెంట్స్ ను అమలు చేయాలంటే కొన్ని సెక్యురిటీ ప్రొటోకాల్స్ అవసరం పడతాయని, ఒకవేళ దీనికి ఆధార్ వాడాలనుకుంటే, అప్పుడు తాము బయోమెట్రిక్ అథన్టికేషన్ ఎనేబుల్ చేస్తామని మరో ఎగ్జిక్యూటివ్ చెప్పారు. ప్రస్తుతం వాట్సాప్ కు భారత్ లో 20 కోట్ల మంది యూజర్లున్నారు. వారిని మరింత పెంచుకునేందుకు వాట్సాప్ కృషిచేస్తోంది. -
విద్యాసంస్థలకు కేంద్ర కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం దేశంలోని కాలేజీలు, విశ్వవిద్యాలయాలు సహా ఇతర విద్యాసంస్థలకు కీలక ఆదేశాలను జారీ చేసింది. రానున్న విద్యాసంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో ఫీజుల్ని నగదు రూపంలో స్వీకరించరాదని కేంద్రం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సాహమిచ్చే దిశగా ఈ ఆదేశాలిచ్చింది. ఇకపై అన్ని ద్రవ్య లావాదేవీలు డిజిటల్ మోడల్ చెల్లింపుల ద్వారా పూర్తి చేయాలని అన్ని ఉన్నత విద్యా సంస్థలనను నరేంద్ర మోదీ ప్రభుత్వం కోరింది. క్యాంపస్‌లోని అన్ని క్యాంటీన్లు, ఇతర వ్యాపార సంస్థలు వారి బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో కలిపి భీమ్ యాప్ ఉపయోగించాలని సూచించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి డిజిటల్ విధానంలో ఫీజుల్ని చెల్లించే విధంగా మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర మానవవనరుల శాఖ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)ను ఆదేశించింది. క్యాంటీన్‌తో పాటు హాస్టల్లో అందిస్తున్న సేవలకు చెల్లింపుల కోసం ‘భీమ్’ యాప్‌ను వాడేలా విద్యార్థులను ప్రోత్సహించాలని కేంద్రం సూచించింది. ఇందుకోసం యుపిసికి ఓ నోడల్ అధికారిని నియమించి, యూజీసీకి నెలవారీ రిపోర్టులు పంపాలని విశ్వవిద్యాలయాలను ఆదేశించింది. -
పేమెంట్స్, మనీ ట్రాన్స్ఫర్ ఇక వాట్సాప్ నుంచి..
పేమెంట్లు, మనీ ట్రాన్స్ఫర్లు ఇక వాట్సాప్ నుంచి చేసుకోవాలనుకుంటున్నారా? అయితే త్వరలోనే ఈ సేవలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయట. భారత్ లో పెరుగుతున్న డిజిటల్ సర్వీసులకు వాట్సాప్ ఈ వినూత్న సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతుందని తెలుస్తోంది. ఫేస్బుక్ కు చెందిన వాట్సాప్ త్వరలోనే ఇండియాలో డిజిటల్ సర్వీసుల్లోకి రావడానికి సన్నద్ధమవుతున్నట్టు తాజా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు అనంతరం డిజిటల్ సర్వీసుల్లోకి భారతీయులు ఎక్కువగా మరలుతున్న క్రమంలో ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్ లో ఎక్కువగా ఫేమస్ అయిన వాట్సాప్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. యూపీఐ వాడుతూ పేమెంట్ సిస్టమ్ తో ఇంటిగ్రేట్ అయ్యేలా కంపెనీ ప్రస్తుతం వర్క్ చేస్తుందని, ఈ చాట్ యాప్ ద్వారానే అన్ని పేమెంట్లు జరిగేలా ఇండియన్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుందని ది కెన్ రిపోర్టు చేసింది. ఇండియా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ) తెలిసిన టెక్నికల్, ఫైనాన్సియల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఉద్యోగుల కోసం కంపెనీ గాలిస్తున్నట్టు వాట్సాప్ వెబ్ సైట్ కూడా ఓ ఉద్యోగ ప్రకటన ఇచ్చేసింది. వచ్చే ఆరు నెలల్లోనే ఈ సర్వీసులు ప్రారంభించబోతున్నారట. డిజిటల్ సర్వీసుల్లో దూసుకెళ్తున్న పేటీఎంకు చెక్ పెట్టి, వాట్సాప్ ఆ స్థానాన్ని కొట్టేయాలని యోచిస్తుందని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతమున్న 20 కోట్ల యూజర్ బేస్ ను మరింత పెంచుకోనుందని రిపోర్టు వెల్లడించింది. ఇండియన్ యూజర్ల కోసం ఓ స్పెషల్ ఫీచర్ ను తీసుకురాబోతున్నట్టు వాట్సాప్ అంతకముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. -
‘ఉపాధి’ వేతనాలకు ఢోకా లేదు
- 31లోగా పేమెంట్స్ అప్లోడ్ చేయండి - గ్రామీణాభివృద్ధి జాయింట్ కమిషనర్ బాల సుబ్రమణ్యం కర్నూలు(అర్బన్): జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కూలీల వేతనాలకు ఎలాంటి ఢోకా లేదని గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ కమిషనర్ బాలసుబ్రమణ్యం తెలిపారు. బకాయి పడ్డ బిల్లులన్నింటినీ త్వరలోనే విడుదల చేస్తామన్నారు. శుక్రవారం ఆయన డ్వామా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కూలీల వేతనాలు, మెటీరియల్ పేమెంట్స్‌తో పాటు ఇతర పేమెంట్స్‌కు సంబంధించిన బిల్లులను ఈ నెల 31వ తేదీలోగా అప్లోడ్ చేయాలన్నారు. వారంలోగా బిల్లుల విడుదలకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే వాటి విషయంలో కొంత జాప్యం జరుగుతున్నందునా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఫిబ్రవరి 2వ తేదీ నుంచి బకాయిపడిన మొత్తాలను విడుదల చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. కూలీల సంఖ్యను పెంచి పనుల లక్ష్యాన్ని సాధించాలన్నారు. హార్టికల్చర్ అవెన్యూ కింద రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారని, వాటిలో బతికి ఉన్న మొక్కలకు సంబంధించి కూడా పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేస్తామన్నారు. సమావేశంలో డ్వామా పీడీ డా.సీహెచ్ పుల్లారెడ్డి, ఏపీడీలు మురళీధర్, బీఎన్ సులోచన పాల్గొన్నారు. -
పేమెంట్స్ రెగ్యులేటరీ బోర్డు
చెల్లింపు వ్యవస్థల పర్యవేక్షణ, నియంత్రణకు సంబంధించి ఆరుగురు సభ్యులతో పేమెంట్స్ రెగ్యులేటరీ బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ప్రస్తుతమున్న బోర్డ్ ఆఫ్ రెగ్యులేషన్ అండ్ సూపర్విజన్ ఆఫ్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ స్థానంలో దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. రిజర్వ్ బ్యాంక్ పరిధిలో ఉండే ఈ బోర్డుకు.. ఆర్బీఐ గవర్నర్ సారథ్యం వహిస్తారు. -
పాత రూ.500నోట్లకు ఆఖరి అవకాశం
-
పాత రూ.500నోట్లకు ఆఖరి అవకాశం
న్యూఢిల్లీ: అధిక విలువ కలిగిన నోట్లను రద్దు చేస్తూ పాత రూ.500నోట్ల చెల్లుబాటయ్యే ప్రదేశాలు, గడువును కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే పాత రూ.1000 నోట్ల చెల్లుబాటు గడువు ముగిసిపోగా.. రూ.500 నోట్ల చెల్లుబాటు గడువు కూడా సమీపిస్తోంది. ఈ నెల 15 తర్వాత మెడికల్ షాపుల్లో, ప్రభుత్వ సర్వీసుల చెల్లింపుల్లో పాత రూ.500 నోటును స్వీకరించరు. ఆ తర్వాత ఈ నెల 31వరకూ బ్యాంకుల్లో డిపాజిట్ కోసం స్వీకరిస్తారు. నూతన సంవత్సరం ప్రారంభం నుంచి కేవలం ఆర్బీఐ శాఖల్లో మాత్రమే పాత రూ.500నోట్లను తీసుకుంటారు. -
ఇదే చివరి అవకాశం..త్వరపడండి!
ముంబై: కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన పెద్ద నోట్లతో చెల్లింపులకు నేడే (నవంబర్ 24)చివరి రోజు. రద్దయిన రూ.500, రూ.1000 నోట్ల వినియోగానికి ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ ఇవాల్టితో ముగియనుంది. ముఖ్యంగా పెట్రోల్ బంకులు, హాస్పిటల్స్,రైలు, బస్సు టికెట్లు సహా ప్రభుత్వానికి సంబంధించిన బిల్లులు చెల్లించడానికి రద్దయిన పాతనోట్ల అనుమతికి రోజు అర్థరాత్రి వరకే అవకాశం ఉంది. పాతనోట్లని కేవలం బ్యాంకుల్లో మార్పిడికి, లేదా డిపాజిట్లు చేసేందుకు అవకాశం ఉంది. అది కూడా డిశెంబర్ 30 వరకే. 1.ప్రభుత్వాసుపత్రులు 2. రైల్వే టిక్కెట్లు 3.పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ 4. ఎయిర్ లైన్ టిక్కెట్లు 5. మిల్క్ బూత్స్ 6. బరియల్ గ్రౌండ్స్ (శ్మశానాలు) 7. పెట్రోల్ బంకులు 8, మెట్రో రైలు టిక్కెట్లు 9. నేషనల్ హైవేలపై టోల్ ఛార్జీలు 10. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్లతో మెడిసిన్స్ 11. ఎల్పీ జీ సిలిండర్స్ 12. రైల్వే కేటరింగ్స్ 13.కరెంట్, వాటర్ బిల్స్ 14. ఆర్కియాలజీ సర్వే డిపార్ట్ మెంట్ల ఎంట్రీ టిక్కెట్లు 15. కోఆపరేటివ్ స్టోర్లు 16. ప్రభుత్వశాఖలు విధించిన పన్నులు, జరిమానాలు 17. ప్రభుత్వ సంస్థలు విక్రయించే విత్తన విక్రయ కేంద్రాలు కాగా నవంబర్ 8 న కేంద్ర ప్రభుత్వం ప్రకటించి పెద్ద నోట్ల రద్దు దేశవ్యాప్తంగా ఆందోళన రాజేసింది. అటు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కూడా ఈ వ్యవహారంతో అట్టుడుకుతున్నాయి. మరోవైపు ఆర్థికశాఖ ఎన్ని ఉపశమన చర్యలు ప్రకటిస్తున్నప్పటికీ, 16రోజుల తర్వాత కూడా బ్యాంకుల వద్ద, ఏటీఏం సెంటర్ల వద్ద జనం పడిగాపులు మాత్రం కొనసాగుతున్నాయి. అటు పాత నోట్ల చలామణి గడువును పొడిగించాలన్న డిమాండ్ కూడా భారీగానే వినిపిస్తున్న సంగతి తెలిసిందే. -
గీకే మిషన్లదే... గిరాకీ !
కరెన్సీ రూపంలో చెల్లించకుండా, షాపులో ప్లాస్టిక్ కార్డు గీకడం ద్వారా చెల్లింపులు జరపడానికి ఇవాళ అందరూ షాపుల్లో వాడుతున్న మిషన్లను ‘ఎలక్ట్రానిక్ డ్రాఫ్ట్ క్యాప్చర్ (ఇ.డి.సి)’ మిషన్ అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే, స్వైప్ కార్డ్ మిషన్. చైనాలో... సగటున ప్రతి 25 మందికి ఒక స్వైప్ మిషన్ ఉంది. మలేసియాలో సగటున ప్రతి 31 మందికీ, బ్రెజిల్లో ప్రతి 200 మందికీ ఒక మిషన్ ఉన్నాయి. కానీ, మన దేశంలో మాత్రం ఇప్పటికీ ఈ స్వైప్ మిషన్ల సంఖ్య తక్కువే. ఇక్కడ సగటున ప్రతి 900 మందికీ ఒక స్వైప్ మిషన్ ఉంది. 14.4 లక్షలు... ఈ ఏడాది జూలై నాటికి మన దేశవ్యాప్తంగా ఉన్న కార్డ్ స్వైప్ మిషన్ల సంఖ్య. తాజాగా ఈ పెద్ద నోట్ల రద్దు దెబ్బతో చేతిలో డబ్బులు లేక, జనమంతా కార్డుల వినియోగాన్ని ఆశ్రయిస్తున్నారు. చాలామంది చిల్లర వర్తకులు ఇప్పుడు కార్డ్ స్వైప్ మిషన్లు ఆర్డర్ చేస్తున్నారు. కాలేజ్ క్యాంటీన్లు, చిన్న స్థాయి వర్తకులు, టోకు వ్యాపారులు - ఇలా అందరూ ఆర్డర్ చేస్తుండడంతో, ఈ గీకే మిషన్ల గిరాకీ రెట్టింపయింది. దాంతో, కార్డ్ స్వైప్ మిషన్ల సంఖ్య దాదాపు 60 శాతం మేర పెరుగుతాయని అంచనా. ఏ.టి.ఎం.లలో డబ్బులు, మార్కెట్లో చిల్లర దొరకడం కష్టమవడంతో తాజాగా క్రెడిట్ కార్డుల వినియోగం ఒకే రోజులో 60 శాతం పెరిగింది. డెబిట్ కార్డులపై ఖర్చు చేయడం 108 శాతం ఎక్కువైంది. -
మెట్రోలో చెల్లింపులు మరింత సులభం...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హోల్‌సేల్ వ్యాపారంలో ఉన్న మెట్రో క్యాష్ అండ్ క్యారీ చిన్న వర్తకుల కోసం చెల్లింపులను మరింత సులభతరం చేసింది. డెబిట్, క్రెడిట్ కార్డులు, చెక్కులు, నెట్ బ్యాంకింగ్ విధానాన్ని ప్రోత్సహిస్తోంది. మొబైల్ వాలెట్‌తో సైతం చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు కంపెనీ ఎండీ అరవింద్ తెలిపారు. వర్తకుల మొత్తం లావాదేవీల్లో నగదు చెల్లింపులు 60 శాతం దాకా ఉంటాయని, పెద్ద నోట్ల రద్దుతో హోల్‌సేల్ వ్యాపారంపై ప్రభావం చూపిస్తోందని చెప్పారు. -
క్రెడిట్, డెబిట్ కార్డుదారులకు శుభవార్త!
-
క్రెడిట్, డెబిట్ కార్డుదారులకు శుభవార్త!
న్యూఢిల్లీ: క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారులకు శుభవార్త. వినియోగదారులను ఇబ్బందిపెడుతున్న ఈ కార్డుల లావాదేవీలపై చెల్లించే అదనపు చార్జ్ లను ఇక పైన ప్రభుత్వమే భరిస్తుందట! నగదు రహిత ఎకానమీని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసిన అన్ని చెల్లింపుల లావాదేవీల ఖర్చులను ఇకముందు తామే భరించనున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం వినియోగదారులు ప్రభుత్వానికి చెల్లిస్తున్న మర్చంట్ డిస్కౌంట్ రేట్( ఎండీఆర్) పేరిట చెల్లిస్తున్న చార్జీలను ఇక ముందు చెల్లించాల్సి అవసరం లేదని ఆర్థికమంత్రిత్వ శాఖ జారీ చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డులు లేదా డిజిటల్ మార్గాల ద్వారా ప్రజలు ఇక ఎలాంటి వర్తక డిస్కౌంట్ రేటును భరించాల్సిన అవసరం లేదని అని ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం జారీ చేసిన తాఖీదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి వివరణాత్మక మార్గదర్శకాలు మరియు కార్యాచరణ విధివిధానాలను జారీ చేయనున్నామని చెప్పారు. కాగా గతంలో ప్రభుత్వం డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ పబ్లిక్ ఎసెట్ మేనేజ్ మెంట్ (డీఐపీఏఎం) కార్యదర్శి నీరజ్ గుప్తా ఆధ్వర్యంలో ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు మరియు నెట్ బ్యాంకింగ్ సేవలను ప్రోత్సహించే యోచనలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ కార్డు లావాదేవీలపై 2012 లో రిజర్వ్ బ్యాంక్ రూ .2,000 పైన 0.75 శాతం, ఆ పైన చెల్లింపులపై 1 శాతంగా ఎండీఆర్ అదనపు చార్జీలను తగ్గించింది. అయితే క్రెడిట్ కార్డ్ చెల్లింపులులపై ఎలాంటి కోతను ప్రకటించలేదు. డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులపై ఎలాంటి అదనపు చార్జీలనూ వసూలు చేయరాదని ఈ ఏడాది మార్చిలో ఆర్బీఐ స్పష్టం చేసింది. దీనిపై ప్రజాభిప్రాయాన్ని కోరింది. అధికారిక లెక్కల ప్రకారం అక్టోబర్ 2015 నాటికి, దేశంలో 61.5 కోట్ల డెబిట్ కార్డు వినియోగదారులు, 2.3 కోట్ల క్రెడిట్ కార్డు హోల్డర్లు ఉన్నారు. -
బకాయిల చెల్లింపులో జాప్యం
విద్యారణ్యపురి : సంవత్సరం కాలంగా నిరీక్షస్తున్నా ఉపాధ్యాయ, ఉద్యోగుల పీఆర్సీ బకాయిల చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేస్తోం దని పీఆర్టీయూ–టీఎస్ జిల్లా అధ్యక్షుడు పిం గిళి శ్రీపాల్‌రెడ్డి విమర్శించారు.శుక్రవారం హ న్మకొండలోని పీఆర్టీయూ భవనంలో నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మా ట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులలతో సమానంగా ఉండాలన్న వేతనాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. విద్యాశాఖలో పదేళ్లుగా ఖాళీగా ఉన్న పర్యవేక్షణాధికారుల పోస్టులు భర్తీ చేయకుండా ఆ పోస్టులలో ఎంఈఓలకు అదనపు బా« ద్యతలను అప్పగించి పనిభారం పెంచుతున్నారని ఆరోపించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా విద్యా వలంటీర్లను నియమించాలని డిమాండ్ చేశారు. పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరునగరి శ్రీనివాస్ మాట్లాడుతూ నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేయాలన్నారు. సమావేశంలో నాయకులు యాకూబ్‌రెడ్డి, సూరి బాబు, రాంరెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, వెంకట స్వా మి, తిరుపతిరెడ్డి, రాంచంద్రం, గఫార్, రాజాసురేందర్రెడ్డి, లక్ష్మణ్‌బాబు పాల్గొన్నారు. -
కంపెనీ సీఈవోకు ఉద్యోగుల గిఫ్ట్!
-
కంపెనీ సీఈవోకు ఉద్యోగుల గిఫ్ట్!
ఏ కంపెనీలోనైనా ఉద్యోగులకు యాజమాన్యం జీతాలు పెంచే పద్ధతి చూస్తాం. ఓ కంపెనీ సీఈవో మాత్రం తన ఉద్యోగులకు స్వంత జీతంలో కొంత భాగాన్ని ఉద్యోగులకు జీతం పెంచేందుకు వెచ్చించాడు. దాంతో సీఈవో తమపై చూపిస్తున్న అభిమానానికి ఉద్యోగులు ఫిదా అయిపోయారు. తమను ఉద్యోగులుగా కాక స్వంత మనుషులుగా గుర్తిస్తున్న సీఈవోను సైతం సంతోషపెట్టాలనుకున్నారు. అందుకే సదరు సంస్థలో పనిచేసే ఉద్యోగులు వారి జీతాలనుంచీ సేకరించిన డబ్బుతో ఆయనకిష్టమైన బహుమతిని ఇచ్చి.. సర్ ప్రైజ్ చేశారు. తన కంపెనీలో పనిచేస్తున్న 120 మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికి ఏడాదికి 70 వేల డాలర్ల జీతాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్న గ్రేవిటీ కంపెనీ సీఈవో డాన్ ప్రైస్ పై ఉద్యోగులూ ప్రత్యేకాభిమానం ప్రదర్శించారు. తమ జీతాల్లో కొంత డబ్బు సేకరించి ఆయనకిష్టమైన, అత్యంత ఖరీదైన టెల్సా కారును కొని, బహుమతిగా ఇచ్చారు. ఈ అనుకోని సందర్భానికి ఆనందంలో మునిగిపోయిన సదరు సీఈవో.. తన సంతోషాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. తనకు ఉద్యోగులు బహుమతిగా ఇచ్చిన కారు ఫోటోతో పాటు.. ఈ విషయాన్ని నేను నమ్మలేకపోతున్నానని, నిజంగా షాక్ తిన్నానని, ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదంటూ పోస్ట్ చేశాడు. గ్రేవిటీ కంపెనీ సీఈవోగా ఉన్న డాన్ ప్రైస్ వేతనం 11 లక్షల డాలర్లు. అయితే దాన్ని 70 వేలకు తగ్గించుకున్న ఆయన.. మిగిలిన మొత్తాన్ని సంస్థలోని ఉద్యోగుల వేతనాలను పెంచేందుకు వినియోగించాడు. కంపెనీలో ఉద్యోగులందరికీ కనీసం ఏడాదికి 70 వేల డాలర్లు ఉండాలంటూ ఆయన తీసుకున్న నిర్ణయం అప్పట్లో ప్రపంచం మొత్తాన్నే ఆకట్టుకుంది. అయితే ఉద్యోగుల మనసులో అంతటి స్థానాన్ని సంపాదించిన డాన్ ప్రైస్ స్వంత సోదరుడి నుంచి ఓ కేసును ఎదుర్కొంటున్నాడు. గ్రేవిటీ కంపెనీలో వాటాదారుడుగా సోదరుడు.. ప్రైస్ అత్యధిక జీతం పొందుతున్నాడని అతనిపై కేసు వేశాడు. అయితే మూడు వారాల విచారణను ఎదుర్కొన్న డాన్... సోదరుడి కేసులో ప్రతి విషయాన్నీ ఆధారాలు సమర్పిస్తూ దీటుగా ఎదుర్కొంటూ వచ్చాడు. కేసు చివరి దశలో ఉండగా సంస్థ ఉద్యోగులకు భారీగా వేతనాలను పెంచేశాడు. -
రిటర్నులు ఎందుకు..?
చాలామంది రిటర్నులు ఎందుకు వెయ్యాలి అని అడుగుతారు. పాన్ ఉంటే వెయ్యాలి.. పాన్ లేకపోతే మంచిదే కదా.. మనం అస్సలు రిటర్ను వేయనక్కర్లేదు కదా.. మాకు ఆదాయం లేదు.. అయినా వెయ్యాలా? బంగారం ఉంటే.. కొంటే వెయ్యాలా? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు .. ఎన్ని ప్రశ్నలు వేసినా ఒకే ఒక్క జవాబు.. రిటర్నులు దాఖలు చేయండి. ఎందుకంటే.. మీ వయస్సును బట్టి బేసిక్ లిమిట్ ఉంటుంది. బేసిక్ లిమిట్ దాటి మీ నికర ఆదాయం ఉంటే రిటర్ను దాఖలు చేయాలి. నికర ఆదాయాన్ని లెక్కించండి. ఇదంతా చట్టాల కోసమేనని ఆలోచించకండి. దీనివల్ల ఇతరత్రా కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి. చట్టాన్ని గౌరవించండి.. పైన చెప్పిన విధంగా చట్టప్రకారం మీ గురుతరబాధ్యత నిర్వర్తించండి. కంపెనీల్లో డెరైక్టర్లూ రిటర్నులు దాఖలు చేయాలి.. భాగస్వామ్య సంస్థల్లో భాగస్వాములూ వేయాలి. కొత్త నిబంధనల ప్రకారం మీకు విదేశాలలో బ్యాంకు అకౌంటున్నా.. రిటర్నులు వేయాలి. విదేశాల్లో ఆస్తులున్నాయి.. రిటర్నులు వేయాలండి. అంతే కాకుండా విదేశీ సంస్థల్లో పెట్టుబడులుంటే రిటర్నులు దాఖలు చేయాలి. ట్యాక్సబుల్ ఇన్‌కం లేకపోయినా విదేశాల్లో ఉన్న అంశాలను రిటర్నుల్లో పొందుపర్చాలి. రీఫండ్లు పొందాలంటే,, చెల్లింపులు చేసే ప్రతివారు టీడీయస్ చేస్తున్నారు. అంటే మూలాల్లోనే కోత. కొంతమందికి ట్యాక్సబుల్ ఇన్‌కం దాటకపోయినా కోత తప్పటం లేదు. అధికారులకు భయం ఎక్కువవటం వలన కోత అమలు పరుస్తున్నారు. కోత పడిందంటే పన్ను ఖజానాకు జమయినట్లే. ఇలాంటి సందర్భంలో రిటర్నులు దాఖలు చేస్తే కానీ రీఫండ్ మీకు రాదు. కాబట్టి రిటర్నులు దాఖలు చేయాల్సిందే. అంతే కాదు. రీఫండ్ ఉంది అంటే.. ఆన్లైన్లో దాఖలు చేయాలి సుమా. డిడక్షన్లు క్లెయిమ్ చేయాలంటే.. అందరికీ సెక్షన్ 80 కింద డిడక్షన్లు ఉంటాయి. 80సీ, 80డీ, 80డీడీ, 80ఈ .. ఇలా ఎన్నో ఉన్నాయి. వీటి అన్నింటికి కాగితాలు ఉండాలి. రిటర్నులతో బాటు జతపర్చకపోయినా భద్రపర్చుకోవాలి. క్లెయిం కోసం స్థూల ఆదాయం లోంచి వీటిని మినహాయిస్తారు. కానీ స్థూల ఆదాయం మారవచ్చు.. ఉద్యోగస్తులకు ఎరియర్స్ రావొచ్చు.. ఇతరులకు గత ఆదాయం ఇప్పుడు రావొచ్చు. అందుకని డిడక్షన్లు సరిగ్గా క్లెయిమ్ చేస్తూ రిటర్నులు వేశారంటే మీరు మీ డిడక్షన్లన్నింటినీ డిక్లేర్ చేసినట్లే. ఉదాహరణకు.. మీ స్థూల ఆదాయం రూ. 3 లక్షల యితే.. 80సీ కింద రూ. 1,50,000 చెల్లించారనుకోండి.. ట్యాక్సబుల్ ఇన్‌కం రూ. 1,50,000 అవుతుంది.. పన్ను భారం ఏదు. ఇటువంటి సందర్భంలో ఏదైనా కారణం వలన ఆదాయం రూ. 1,00,000 పెరిగిందనుకోండి.. గతంలో మీరు చేసిన క్లెయిమ్ ఇప్పుడు మీ పన్ను భారం తగ్గిస్తుంది. షేర్లు అమ్ముతున్నారా.. షేర్ల లావాదేవీలలో.. నష్టం రావొచ్చు.. లాభం రావొచ్చు. చాలా మంది ఇటువంటి లావాదేవీలను డిక్లేర్ చేయడం లేదు. బేసిక్ లిమిట్ దాటకపోతే అస్సలు పట్టించుకోవడం లేదు. ఇన్‌కం సరే, లావాదేవీల్లో నష్టం రావచ్చు. ఈ నష్టాన్ని డిక్లేర్ చేయడం వలన మీకొచ్చే షేర్ల మీద వచ్చే ఆదాయం తగ్గుతుంది. తద్వారా పన్ను భారం తగ్గుతుంది. అలా సర్దుబాటు కాకపోయినా.. రాబోయే 8 సం.లు సర్దవచ్చు. అందువలన ఖచ్చితంగా ఈ లావాదేవీలను చూపించుతూ రిటర్నులు దాఖలు చేయండి. అమెరికా నుంచి అబ్బాయి పంపిస్తే.. విదేశాల నుంచి మీ అబ్బాయి/అమ్మాయి లేదా దగ్గర బంధువులు డబ్బులు పంపుతున్నారా. భయపడక్కర్లేదు. అక్కడ పన్ను చెల్లించిన ఆదాయం, మీ అకౌంటులో పడింది. ఇక్కడ పన్ను పడదు. కానీ మీరు చూపించాలి. అలాగే ఎన్నో ఆదాయాలు పన్నుకి గురికానివి ఉన్నాయి. గ్రాట్యుటీ, జీవిత బీమా మొదలైనవి ఆ కోవకి చెందినవే. ఇవన్నీ డిక్లేర్ చేస్తూ రిటర్నులు వేయండి. డిపార్ట్మెంట్ వారు అడిగినప్పుడు వివరణలు ఇవ్వవచ్చు. మరెన్నో ప్రయోజనాలు.. వీసా అధికారులు, బ్యాంకు అధికారులు, మీకు అప్పు ఇచ్చే వాళ్లు, క్రెడిట్ కార్డు సంస్థలు, కొన్ని క్లబ్బులు, కొన్ని సంస్థలు.. ఇలా ఎందరో ఆదిలోనే అడుగుతున్నారు మీ ఇన్‌కం ట్యాక్స్ రిటర్నులు. పన్ను భారం లేకపోయినా.. బేసిక్ లిమిట్ దాటకపోయినా వీటి విలువ అపారం. అందరూ వీటిని విశ్వసిస్తున్నారు. వీటి మీద ఆధారపడే మీకు ఎన్నో పనులు జరుగుతాయి. కాబట్టి ఇక ఆలస్యం ఎందుకు.. రిటర్నులు వేయడానికి ఉపక్రమించండి. - ట్యాక్సేషన్ నిపుణులు కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్‌లావణ్య -
వాసవీ బ్యాంకు డిపాజిటర్లకు చెల్లింపులు
హైదరాబాద్: వాసవీ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు డిపాజిటర్లకు గురువారం చెల్లింపులు జరిగాయి. డిపాజిట్ దార్లకు వారు డిపాజిట్ చేసిన మొత్తం, డిపాజిట్ నుంచి ఈక్విటీ షేర్హోల్డర్లకు మారిన వారికి, ఇతర సంస్థల డిపాజిటర్లకు (పి.డి.ఐ) మొత్తంలో ఐదు శాతం చెల్లింపులు చేస్తున్నట్టు డిప్యూటీ రిజిస్ట్రార్ ఎన్.వేణుగోపాల్‌శర్మ తెలిపారు. గురువారం మలక్‌పేటలోని బ్యాంకులో రూ.లక్ష పైన డిపాజిట్ దార్లకు నగదు చెల్లింపులు చేశారు. ఈ సందర్భంగా చిత్తూర్టౌన్ బ్యాంకుకు రూ.71 లక్షలు, భీమవరం అర్బన్‌బ్యాంకుకు రూ. 62 లక్షలు, విజయనగరం బ్యాంకుకు రూ.20 లక్షలు, వైజాగ్ బ్యాంకుకు రూ. 20 లక్షలు, ఇతర వ్యక్తిగత డిపాజిటర్లకు ఆయన చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రుణగ్రహీతలపై కఠిన చర్యలు చేపట్టి రికవరీలు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కోర్టు కేసుల వలన ఆగిన వాటిపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. ఇప్పటి వరకు రూ. 10 కోట్లు చెల్లింపులు చేశామని, ఈ విడత రూ.7 కోట్లు చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. డిసాజిటర్లు మే 31లోగా మలక్‌పేటలోని ప్రధాన కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. కాగా, జూన్ 1 నుంచి సికింద్రాబాద్‌లోని ఎంజీఎం రోడ్డు శాఖ నుంచి బ్యాంకు కార్యకలాపాలు కొనసాగుతాయన్నారు. -
పనిసరే.. పైసలేవీ!
► బకాయిల కోసం 12 లక్షల మంది ఉపాధి కూలీల ఎదురుచూపులు ► రెండు నెలలుగా రూ. 310 కోట్ల బకాయిలు ► కరువు కాలంలో పనుల్లేక తల్లడిల్లుతున్న పేదలు ► ఉపాధి కూడా ఆదుకోకపోవడంతో అరిగోస ► గ్రామాల్లో పథకంపై సన్నగిల్లుతున్న నమ్మకం ► డబ్బులివ్వకపోవడంతో పట్టణాలకు వలసబాట ► చట్టం ప్రకారం పనిచేసిన 15 రోజుల్లో డబ్బులివ్వాలి ► సర్కారు నిర్లక్ష్యంతో ఎక్కడా అమలుకాని నిబంధన ఈమె పేరు ఒర్సు సక్కుబాయి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గట్టుసింగారం. రెండు నెలల క్రితం చేసిన పనికి ఇప్పటివరకు డబ్బులు రాలేదు. ఈమెకు రూ.2,260, భర్తకు రూ.2 వేల బకాయిలు రావాలి. రెక్కాడితేగానీ డొక్కాడని ఈ కుటుంబం డబ్బులందక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ‘‘డబ్బులిస్తే బియ్యం కొనుక్కునేటోళ్లం. అప్పు చేసి ఇంటి సామాన్లు తెచ్చుకుంటున్నాం. పైసలడిగితే రేపుమాపు అంటున్నారు’’ అని ఈమె ఆవేదన వ్యక్తం చేస్తోంది! ఈమె పేరు పెంటగాని పద్మ. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్. ఉపాధి పనులు చేసినా డబ్బులు ఇవ్వకపోవడంతో మహిళా సంఘం నుంచి అప్పు తీసుకుంది. ఇప్పుడు వాళ్లు డబ్బులు కట్టాలని అడుగుతుండడంతో తలపట్టుకుంది. ‘బయట కూడా అప్పు పుట్టడం లేదు. ఇంట్ల ఎల్లుడు కష్టమైతంది. రెండ్రోజులుగా ఒక పూట తింటే ఇంకో పూట పస్తులుంటున్నం’ అంటూ గోడు వెల్లబోసుకుంది. ...ఇది ఒకరిద్దరి గోస కాదు.. చేసిన పనికి డబ్బులందక రాష్ట్రవ్యాప్తంగా 12.72 లక్షలమంది ఉపాధి కూలీలు ఇలాగే నానా అవస్థలు పడుతున్నారు! ఎనిమిది వారాల నుంచి డబ్బులు చెల్లించకపోవడంతో పేద కుటుంబాలు పస్తులుంటున్నాయి. ఉపాధి కూలీలకు రాష్ట్ర సర్కారు గత రెండు నెలలుగా దాదాపు రూ. 310 కోట్లబకాయిలు చెల్లించాల్సి ఉంది! కరువు రక్కసి కబంధ హస్తాల్లో రాష్ట్రం బందీ అయింది. ఎటు చూసినా నెర్రెలిచ్చిన పొలాలు, అడుగంటిన చెరువులు, కుంటలు, చుక్కనీరు రాని బోర్లే దర్శనమిస్తున్నాయి. అప్పుల ఊబిలో చిక్కుకున్న చిన్న, సన్నకారు రైతులంతా రోజువారీ కూలీలుగా మారిపోయారు. ఈ కరువు కాలంలోనైనా ఆధరువుగా నిలుస్తుందనుకున్న ఉపాధి హామీ పథకం ఏ మాత్రం భరోసా ఇవ్వలేకపోతోంది. పని చూపడంలో కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం, మండుటెండల్లో పని చేసినా నెలల తరబడి అందని కూలీ, క్షేత్రస్థాయిలో అంతులేని అవినీతి.. వెరసి ఈ పథకంపై కూలీలకు నమ్మకం సడలేలా చేస్తున్నాయి. ఏ జిల్లాలోనూ ఉపాధి పనులు సవ్యంగా సాగడం లేదు. ఉన్న ఊర్లో పని కరువవడంతో తల్లీపిల్లలను వదిలి ఆలితోపాటు పట్నం పోతున్నారు రైతు కూలీలు! జిల్లా స్థాయిలో కలెక్టర్లు పూర్తిస్థాయిలో ఉపాధి పనులను పట్టించుకోవడం లేదు. బాధ్యతలన్నీ పీడీల చేతుల్లో పెట్టడంతో పనులు సమగ్రంగా అమలు కావడం లేదు. గ్రామీణ స్థాయిలో పనులు కల్పించాల్సిన ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్ణీత సంఖ్య కంటే తక్కువగా ఉన్నారు. మరికొన్ని చోట్ల అవినీతికి పాల్పడిన వారిని తొలగించడం, వారి స్థానాల్లో మరొకరిని నియమించకపోవడంతోనూ క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సుప్రీం ఆగ్రహం వ్యక్తంచేసినా.. ఉపాధి హామీ నిధులు విడుదల చేయకపోవడంపై ఇటీవల సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘కరువు బారిన పడిన ప్రాంతాలకు తక్షణమే సాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. కరువు రోజుల్లో చేసిన పనికి ఏడాది తర్వాత డబ్బులు చెల్లిస్తే ఏం లాభం? మీరు నిధులివ్వకపోతే పనిచేయడానికి ఎవరూ రారు. తమ దగ్గర డబ్బుల్లేవని రాష్ట్రాలు మొత్తుకుంటున్నాయి.. జనానికి సాయం చేద్దామని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా లేదు’’ అంటూ తీవ్రంగా స్పందించింది. ఆ తర్వాతే కేంద్రం ఇటీవల తన వంతుగా బకాయిలను విడుదల చేసింది. రాష్ట్ర సర్కారు మాత్రం ఇప్పటికీ బకాయిలను విడుదల చేయలేదు. కూలీ పెంచినా ఏం ప్రయోజనం..? ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలిని రూ.180 నుంచి రూ.194కు పెంచింది. అయినా ఏ మాత్రం ప్రయోజనం ఉండడం లేదు. ప్రస్తుతం సగటున రోజుకూ రూ.వంద కూడా పడడం లేదని, చేసిన పనికి నెలలుగా ఎదురుచూస్తున్నామని కూలీలు గోడు వెల్లబోసుకుంటున్నారు. కూలి పెంచినా డబ్బులు సకాలంలో ఇవ్వకపోతే ఏం ప్రయోజనమని ప్రశ్నిస్తున్నారు. కరువు మండలాల్లో ప్రభుత్వం ఇటీవల పని దినాలను 100 రోజుల నుంచి 150కి పెంచింది. అయితే అది పూర్తిస్థాయిలో అమలైతేనే ప్రయోజనం ఉంటుంది. ప్రస్తుతం కరువుతో పల్లెల్లో ఏ పని దొరకడం లేదు. దీంతో జనం కూలి తక్కువైనా ఉపాధి పనికే వెళ్తున్నారు. కానీ పని చేసినా డబ్బులు ఎప్పుడు చేతికందుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. కరువు కాలంలో పట్టెడన్నం కోసం మండుటెండలో పనిచేస్తే.. ఎప్పుడో డబ్బులిస్తే ఏం ప్రయోజనమని కూలీలు వాపోతున్నారు. ఏ వారం డబ్బులు ఆ వారమే ఇవ్వాలని కోరుతున్నారు. 15 రోజుల్లో డబ్బులు ఇవ్వాల్సిందే.. ఉపాధి హామీ చట్టం ప్రకారం ప్రతి కూలీకి పనిచేసిన15 రోజుల్లోనే కూలి డబ్బులు చెల్లించాలి. లేకుంటే అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఈ అంశాన్ని చట్టంలో స్పష్టంగా పొందుపరిచారు. కానీ ప్రభుత్వమే నిధులు మంజూరు చేయకపోవడంతో అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. కూలీల డబ్బులు దారిమళ్లాయా? ఉపాధి హామీ పథకంలో పని చేసిన వారికి పంపిణీ చేయాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించినట్టు తెలుస్తోంది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు ఈ నిధులను ఉపయోగిస్తున్నట్టు అనుమానాలున్నాయి. కేంద్రం తన వాటాగా విడుదల చేస్తున్న ఉపాధి నిధులను రాష్ట్రం ఇలా ఇతర పథకాలకు మళ్లించడంపై విమర్శలు వస్తున్నాయి. వడదెబ్బతో మరణిస్తున్న కూలీలు గత పక్షం రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. సగటున 42 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూలీలు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వడదెబ్బకు గురై ప్రాణాలు విడుస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో సుమారు 40 మంది కూలీలు చనిపోయారు. గ్రామాల్లో ఏ పని దొరక్క వృద్ధులు సైతం ఉపాధి పనులకు వెళ్తున్నారు. అలాంటివారు ఎండలకు తాళలేకపోతున్నారు. వేసవి వెళ్లాక టెంట్లు వేస్తారా? పనిచేసే చోట కూలీల కోసం టెంట్లు వేయాలి. మెడికల్ కిట్లు అందుబాటు ఉంచాలి. చిన్నపిల్లల ఆలనకు ప్రత్యేక సౌకర్యం కల్పించాలి. కానీ ఇవేవీ ఎక్కడా కనిపించడం లేదు. సగం వేసవి గడిచిన తర్వాత ప్రభుత్వం నీడ కోసం టెంట్లు కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ ఆదేశాలు కలెక్టర్లకు అందాయి. పనిచేసే చోట ఈ టెంట్లు వేయాలంటే కనీసం నెలన్నర సమయమైనా కావాల్సిందే! టెంట్ల కొనుగోళ్లకు కమిటీలు నియమించడం, టెండర్లు, సరఫరా ప్రక్రియ పూర్తయ్యే సరికి వేసవి వెళ్లిపోవడం ఖాయంగా కన్పిస్తోంది. అంతులేని అవినీతి.. అరకొర రికవరీ ఉపాధి హామీ పనుల్లో కూలీలకు ఎంత దక్కుతుందో తెలియదు గానీ.. ఫీల్ట్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు చాలాచోట్ల అవినీతికి పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పనిచేస్తున్న వారి సంఖ్య కన్నా ఎక్కువ మంది పేర్లు రాయడం, వారి ఖాతాల్లో డబ్బులు పడ్డాక పంచుకోవడం వంటివి చేస్తున్నారని కూలీలు చెబుతున్నారు. ఇటీవల నిర్వహిస్తున్న గ్రామసభల్లో ఈ తరహా అవినీతి వెలుగు చూస్తోంది. అయితే రికవరీ ప్రక్రియ మాత్రం నత్తనడకన సాగుతోంది. పనుల్లోంచి తీసేసిన ఫీల్డ్ అసిస్టెంట్లు తిరిగి పై అధికారులను ప్రసన్నం చేసుకుని విధుల్లో కొనసాగుతున్నారు. జిల్లాల్లో ఇదీ పరిస్థితి.. ► నల్లగొండ జిల్లాలో రెండు నెలల బకాయిలు రూ.50 కోట్లకు చేరాయి. గతంలో రోజువారీ కూలీల సంఖ్య 1.70 లక్షలు ఉండేది. ఎండల నేపథ్యంలో అది 1.24 లక్షలకు చేరింది. రెండు నెలల్లోనే ఉపాధి కూలీలు 50 వేల వరకు తగ్గిపోయారు. ► ఖమ్మం జిల్లాలో 2.50 లక్షల మందికి జాబ్ కార్డులున్నాయి. కానీ క్రియాశీలక కూలీలు 90 వేల నుంచి 96 వేల మందే. ఈ జిల్లాలో కూలీలకు రూ.35 కోట్ల వేతనం చెల్లించాల్సి ఉంది. ► మహబూబ్‌నగర్ జిల్లాలో ఎనిమిది వారాలపాటు పనిచేసిన కూలీలకు రూ.29 కోట్లు చెల్లించాల్సి ఉంది. రెండు నెలలుగా డబ్బులందక పోవడంతో కూలీలు వలస బాట పడుతున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 1,14,958 మంది కూలీలు ఉపాధి పనులు చేస్తున్నారు. మార్చిలో కూలీల నమోదు 1.5 లక్షలకు చేరుకోగా ప్రస్తుతం 1.14 లక్షలకు పడిపోయింది. ► నిజామాబాద్ జిల్లాలో లక్షా 80 వేల మంది ఉపాధి పనులు చేస్తున్నారు. వీరందరికీ రూ.15.95 కోట్లు చెల్లించాల్సి ఉంది. బకాయిలు వెంటనే చెల్లించాలని రోజుకో చోట కూలీలు ఆందోళనలకు దిగుతున్నారు. ► రంగారెడ్డి జిల్లాలో 33 గ్రామీణ మండలాలుండగా.. ఇందులో 24 మండలాల్లో మాత్రమే ఉపాధి హామీ పథకం అమలవుతోంది. 1,39,851 మంది కూలీలు పనిచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రూ.42 కోట్లు బకాయిలున్నాయి. ► కరీంనగర్ జిల్లాలో రోజుకు సగటున లక్ష మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. వీరికి మూడు నెలల నుంచి వేతనాలు రావడం లేదు. జిల్లావ్యాప్తంగా సుమారు రూ.30 కోట్ల వేతనాలు కూలీలకు చెల్లించాల్సి ఉంది. ► ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 1.55 లక్షల మంది కూలీలకు ఈ ఏడాది జనవరి నుంచి డబ్బులు చెల్లించడం లేదు. ఈ బకాయిలు సుమారు రూ.64 కోట్లు ఉన్నాయి. ► మెదక్ జిల్లాలో లక్షకుపైగా కూలీలు ఉండగా వారికి ప్రభుత్వం రూ.11 కోట్ల మేర బకాయి పడింది. ► వరంగల్‌లో 1..04 లక్షల మంది కూలీలున్నారు. వీరికి రూ.32 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న ఉపాధి కూలీలు, పేరుకుపోయిన బకాయిల వివరాలివీ.. (కూలీల సంఖ్య లక్షల్లో.. బకాయిలో రూ.కోట్లలో..) జిల్లా కూలీలు బకాయిలు నల్లగొండ 1.24 50 ఖమ్మం 2.50 35 మహబూబ్‌నగర్ 1.14 29 నిజామాబాద్ 1.80 15.95 రంగారెడ్డి 1.39 42 కరీంనగర్ 1 30 ఆదిలాబాద్ 1.55 64 మెదక్ 1.06 11.40 వరంగల్ 1.04 32.6 మొత్తం 12.72 310 -
ఐటీ కోర్టు అప్పీల్‌కు ‘వివాద బకాయి’ పరిమితి పెంపు
న్యూఢిల్లీ: అనవసర, కాలయాపన వ్యాజ్యాలకు చెక్ చెప్పే దిశలో ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) మరో తాజా నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం... ఇకపై ఆదాయపు పన్ను శాఖ ఏదైనా కేసులో ఇన్కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ)లో అప్పీల్‌కు వెళ్లాలంటే.. లిటిగేషన్లో ఉన్న మొత్తం రూ. 10 లక్షల పైబడిన సొమ్ము విషయంలో పన్ను బకాయికి సంబంధించినదై ఉండాలి. ఇంతక్రితం ఈ సొమ్ము రూ.4 లక్షలుగా ఉండేది. హైకోర్టులో కేసు దాఖలుకు ఇంతక్రితం తరహాలో రూ. 10 లక్షలు కాకుండా రూ. 20 లక్షల పైబడి ఉండాలి. సుప్రీంకోర్టుకు సంబంధించిన పరిధి రూ. 25 లక్షలుకాగా... ఈ మొత్తంలో ఎటువంటి మార్పూ చేయలేదు. పన్ను బకాయిల విషయంలో పన్ను చెల్లింపుదారుడు ఐటీ అసెస్మెంట్ ఉత్తర్వుపై కమిషనర్ ఆఫ్ ఐటీ (అప్పీల్స్), ఐటీఏటీ, హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించాల్సి ఉంటుంది. అయితే కేవలం ‘సొమ్ము పరిమితి’ అంశం విషయంలో అయితే మాత్రమే అప్పీల్ చేయరాదని, ఇతర మెరిట్స్ సానుకూలంగా ఉంటే... దీనికి అనుగుణంగా అప్పీల్ నిర్ణయం తీసుకోవచ్చని కూడా సీబీడీటీ తన అధికారిక సూచనల్లో వివరణ ఇచ్చింది. -
కార్డుతో చెల్లిస్తే ప్రోత్సాహకాలు
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం లబ్ధి చేకూర్చనుంది. క్రెడిట్, డెబిట్ కార్డులతో లావాదేవీలు జరిపే వినియోగదారులకు ప్రోత్సహకాలు ఇవ్వాలని ఆలోచిస్తుంది. ముఖ్యంగా పెట్రోల్, గ్యాస్, రైల్వే టికెట్ల బుకింగ్ లావాదేవీల ఛార్జీలు తొలగించే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. ముఖ్యంగా నల్లధనాన్ని అరికట్టే ఉద్దేశంతోనే ఈ సరికొత్త ఆలోచనకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎలక్ట్రానిక్ కార్డుల ద్వారా చెల్లింపులు జరిపే వారికి కచ్చితంగా పన్ను చెల్లింపుల్లో రాయితీ కల్పించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రతిపాదనలు తయారు చేసినట్లు సమాచారం. గతంలో బడ్జెట్ సమావేశాల సమయంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ 'నల్లధనం ప్రవాహానికి అడ్డుకట్ట వేసే ఏకైక మార్గం డబ్బు రూపంలో చెల్లింపులను నిలువరింప జేయడం' అని ప్రకటించారు. లక్ష రూపాయలకు పైబడి చెల్లించేవారు తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ కార్డు ద్వారానే చెల్లించాలనే ప్రతిపాదన కూడా ఆ సమయంలో తీసుకొచ్చిన విషయం తెలిసిందే. -
‘సులభ మొబైల్’తో రైతులకు 56 వేల కోట్లు
న్యూఢిల్లీ: సులభతరమైన మొబైల్ ఆధారిత సేవల పరిచయం చేయడం ద్వారా రానున్న ఐదేళ్లలో భారతదేశంలోని ఏడు కోట్ల మంది చిన్న తరహా రైతుల ఆదాయాన్ని రూ. 56 వేల కోట్లకు పైగా పెంచవచ్చని ఒక సర్వే తెలిపింది. వ్యవసాయ సమాచారం, చెల్లింపులు, రుణాలు, ఫీల్డ్ ఆడిట్ లాంటి సాధారణ మొబైల్ సేవలు దాదాపు 2/3 వంతు రైతుల ఆదాయాన్ని ఏడాదికి సగటున రూ. 8,000 వరకు పెంచేందుకు దోహదం చేస్తాయని తన నివేదికలో పేర్కొంది. ఈ సేవల ద్వారా భారతదేశంలో ఉన్న ఏడు కోట్ల చిన్న తరహా రైతుల వ్యవసాయ ఆదాయాన్ని 2020 కల్లా రూ. 56 వేల కోట్లకు పెంచి మార్కెట్లను వృద్ధిలోకి తీసుకురావచ్చని ‘కనెక్టెడ్ ఫార్మింగ్ ఇండియా’ తన నివేదికలో తెలిపింది. వోడాఫోన్ ఫౌండేషన్ సహకారంతో పరిశోధన చేసిన సంస్థ నివేదిక ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం దేశంలో చాలా రైతు కుటుంబాలు రూ. 250 కంటే తక్కువ ఆదాయంతో ఆహారం, విద్య సదుపాయాల కోసం పోరాడుతున్నాయని తేలింది. ‘అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సాధారణ మొబైల్ సేవల ద్వారా 2/3 వంతు రైతుల ఆదాయాన్ని పెంచి, వారి జీవన పరిస్థితులను మెరుగుపరచడానికి వీలవుతుందని వోడాఫోన్ మీడియా ఎండీ, సీఈవో సునీల్ సూద్ వివరించారు. -
బిల్లుల కోసం చెరకు రైతుల ఆందోళన
సదాశివనగర్: నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలంలోని గాయత్రి షుగర్స్ ఫ్యాక్టరీ ముందు చెరకు రైతులు బుధవారం మధ్యాహ్నం ఆందోళనకు దిగారు. ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన బిల్లులు రూ.50 కోట్లను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఒప్పందం ప్రకారం ఖాతాల్లో ఇంకా బిల్లులు జమ చేయలేదని, వాటిని వెంటనే చెల్లించాలని కోరారు. కాగా, బకాయిల చెల్లింపులకు 15 రోజుల సమయం కావాలని షుగర్స్ ఫ్యాక్టరీ యాజమాన్యం కోరినట్టు సమాచారం. -
అసెంబ్లీ సాక్షిగా ‘చిల్లర’ వ్యవహారం
- బిల్లు ఆపేశారంటూ ఆర్అండ్బీ - అధికారులపై స్పీకర్‌కు ఫిర్యాదు - చెల్లించాల్సిన రూ. 80 వేల - విషయంలో వివాదం సాక్షి, హైదరాబాద్: అస్మదీయులైతే నిబంధనలు పక్కకు పెడతారు.. కోరినన్ని పనులు దక్కేలా చూస్తారు. తమవారు కాకపోతే కమీషన్ ఇవ్వనిదే బిల్లులు ముందుకు సాగవు.. రోడ్డు భవనాల శాఖ లో ఇలాంటి ఫిర్యాదులు కోకొల్లలు. తాజాగా ఆ శాఖ అధికారుల తీరుపై ఓ కాంట్రాక్టర్ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారికి ఫిర్యాదు చేశాడు. అధికారులు అడిగిన కమీషన్ గడువుకు ముందు ఇవ్వలేదని తనకు చెల్లించాల్సిన బిల్లు ఆపేశారని ఆరోపించాడు. ఆ అధికారికి రావాల్సి న బిల్లు విలువ రూ. 80వేలు మాత్రమే.. చివరకు రోడ్లు భవనాల శాఖ దగ్గరకు ఈ పంచాయితీ చేరింది. ఇదీ సంగతి...: శాసన సభ, మండలి భవనాల్లో ఫర్నీచర్, కుళాయి, నీటిపైపులకు రోజువారీ ఫిర్యాదుల ప్రకారం మరమ్మతులు చేసేందుకు ప్లంబర్, కార్పెంటర్లను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రక్రియ ఔట్సోర్సింగ్ పద్ధతిలో జరుగుతుంది. దీని టెండర్లను ఈ ఏడాది జనవరిలో పిలిచారు. 6నెలలకు రూ. 2.48 లక్షల కాంట్రాక్ట్‌ను పర్ఫెక్ట్ సర్వీసెస్ అనే సంస్థకు 5.2 శాతం తక్కువగా కట్టబెట్టారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో మూడు నెలలకు సంబంధించి రూ. 80వేలను చెల్లించాలని అధికారులను కాంట్రాక్టు సంస్థ కోరింది. ఎన్నిసార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా స్పందిచలేదని స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. అసెంబ్లీ, మండలి భవనాల పనులకు బిల్లులు చెల్లించేందుకు సిద్ధం చేసిన జా బితాలో పర్ఫెక్ట్ సర్వీసెస్ సంస్థ పనుల మొత్తాన్ని చేర్చకపోవడంతో ఈ వివాదం వచ్చింది. -
సదరం.. గందరగోళం
6 నె లలుగా ఊసే లేని క్యాంపులు వైద్యులకు నిలిచిపోయిన చెల్లింపులు శిబిరాలకు ముఖం చాటేస్తున్న డాక్టర్లు సంతకాల్లేక జారీ కాని వైకల్య నిర్ధారణ సర్టిఫికెట్లు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న వికలాంగులు పరీక్షల కోసం 15 వేల మంది నిరీక్షణ హన్మకొండ అర్బన్ : డీఆర్డీఏ పింఛన్ల విభాగం ఆధ్వర్యంలో ఇంతకాలం జిల్లాలో కొనసాగిన సదరం వైద్యశిబిరాల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా తయారైంది. వికలాంగుల వైకల్య శాతం నిర్ధారణకు నిరంతరం కొనసాగాల్సిన శిబిరాలు ఆరు నెలలుగా మూతబడ్డాయి. ఫలితంగా ప్రతి సోమవారం కలెక్టరేట్ ప్రజావాణికి వచ్చే వికలాంగుల సంఖ్య పెరుగుతోంది. నిధుల మంజూరులో సెర్ప్ అధికారుల నిర్లక్ష్యం... వైద్యశాఖ, డీఆర్డీఏ అధికారుల సమన్వయ లోపం వికలాంగుల పాలిట శాపంగా మారింది. సదరం వైద్య శిబిరాల నిర్వహణ ఎప్పుడు ప్రారంభమవుతాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. వైద్యులకు రూ.4 లక్షల బకాయిలు.. జిల్లాలో సదరం వైద్య పరీక్షల కోసం మహ బూబాబాద్, జనగామ, ఏటూరునాగారం, ఎంజీఎంలో ప్రత్యేక మెడికల్ బో ర్డులు ఏర్పాటు చేశారు. వీటిలో ఈఎన్టీ, ఆర్థో, సైకియాట్రిస్ట్, ఎంఆర్ వైద్యులు ఉంటారు. ప్రతి వైద్యుడు రోజుకు సుమారు 70 మంది వరకు రోగులను పరీక్షించడంతోపాటు వారికి సర్టిఫికెట్లు జారీ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఒక్కో పేషెంట్‌కు కొంత చొప్పున డీఆర్డీఏ ద్వారా సంబంధిత బోర్డులోని వైద్యులకు చెల్లింపులు చేయూలి. కానీ... చాలాకాలంగా అవి పెండింగ్‌లో పడ్డారుు. సుమారు రూ.4లక్షలకు పైగా బకాయిలు ఉండడంతో సదరం శిబిరాల నిర్వహణ,సర్టిఫికెట్ల జారీపై వైద్యులుఆసక్తి చూపడం లేదు. మూలకుపడ్డ 3 వేల సర్టిఫికెట్లు.. చేసిన పనికి డబ్బులు రాకపోవడంతో డాక్టర్లు శిబిరాల వైపు కన్నెత్తి చూడడం లేదు. చెల్లింపులు చేయనిదే సంతకాల విషయంలో వైద్యులను అడిగే ధైర్యం డీఆర్డీఏ అధికారులు చే యలేకపోతున్నారు. ఫలితంగా గతంలో సదరం పరీక్షలు చేయించుకున్న వారికి సంబంధించి సుమారు 3 వేల సర్టిఫికెట్లు వైద్యుల ధ్రువీకరణ సంతకాలు లేక మూలకుపడ్డాయి. దీంతో వికలాంగులు పింఛన్, ప్రభుత్వ పథకాల కోసం నెలల తరబడి ఎదురుచూస్తూ.. ఇబ్బందులు పడుతున్నారు. తమ గోడు ఎవరికి చెప్పాలో తెలియక ప్రతి సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్‌సెల్‌లో వినతిపత్రాలు ఇస్తున్నారు. పరీక్షల కోసం 15 వేల మంది నిరీక్షణ.. ఒక వైపు పరీక్షలు చేయించుకున్నవారు సర్టిఫికెట్ల కోసం నిరీ క్షిస్తుండగా... మరో వైపు కొత్తగా పరీక్షలు చేయించుకోవాల్సిన వారు, గతంలో తమకు అన్యాయం జరిగిందంటూ రీ అసెస్మెంట్కు దరఖాస్తు చేసుకున్నవారు జిల్లాలో 15వేల మంది వరకు ఉన్నారు. వీరందరూ క్యాంపులు ఎప్పుడు నిర్వహిస్తారా.. అని రోజు ఎదురుచూస్తున్నారు. మూడేళ్లుగా తిప్పుకుంటున్నారు.. నాకు చెముడు ఉంది. ఎడమ చేతికి రెండు వేళ్లు కూడా లేవు. 2011 నుంచి వికలాంగుల పింఛన్ రావడంలేదు. సదరం క్యాంపులకు వెళ్లి పరీక్షలు చేయించుకున్నా. ఎంజీఎంకు, డీఆర్డీఏ కార్యాలయూనికి తిరిగినా.. సర్టిఫికెట్ ఇవ్వలేదు. మొదటిసారి 39 శాతం ఉందని తొలగించారు. అప్పుడు చెముడు ఒక్కటే పరిశీలించారు. చేతి వేళ్లు లేని విషయం పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో తక్కువ శాతం వైకల్యం ఉంది. ఈ విషయం చెప్పి మళ్లీ సదరం పరీక్ష చేయాలని ఎన్నిసా ర్లు తిరిగినా... మేమే సమాచారం ఇస్తామంటున్నారు. మూడేళ్లుగా ఇదే పరిస్థితి. - సాదినేని శివకుమార్, కడిపికొండ సదరం శిబిరం నిరంతరం ఉండాలి వికలాంగులకు వైకల్య శాతం నిర్దారించేందుకు క్యాంపుల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండొద్దు. అలా ఉంటే వికలాంగులు నష్టపోవాల్సి వస్తుంది. పింఛన్లు, రేషన్‌కార్డులు, ఇంటి స్థలాల వంటివి ఒకసారి మంజూరు చేస్తే... మళ్లీ రెండు మూడేళ్లవరకు అవకాశం ఉండదు. ఈ మేరకు సదరం శిబిరాలను ఆటంకం లేకుండా నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకోవాలి. - లక్కిరెడ్డి సత్యం, వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు త్వరలో పరిష్కరిస్తాం... సదరం క్యాంపుల నిర్వహణలో కొంత ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే. వైద్యులకు చెల్లించాల్సిన మొత్తం సెర్ప్ నుంచి రావాల్సి ఉంది. అవి రాగానే ఇస్తాం. డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో సంతకాలు కాక సర్టిఫికెట్లు మూలకుపడ్డాయి. ఈ సమస్య ను కూడా త్వరలో పరిష్కరిస్తాం. క్యాంపుల నిర్వహణ బాధ్యత పూర్తిగా ఎంజీఎం మెడికల్ బోర్డుకే అప్పగించారు. చెల్లింపులు కాగానే... వారితో సంప్రదించి తదుపరి క్యాంపు తేదీలు ఖరారు చేస్తాం. - పద్మప్రియ, డీఆర్డీఏ,ఐకేపీ వికలాంగుల విభాగం డీపీఎం -
ఉపాధి..ఎలాచేసేది!
నెల్లూరు(పొగతోట), న్యూస్‌లైన్: వదలమంటే పాముకు కోపం, కరవమంటే కప్పకు కోపం అన్నచందంగా ఉంది ఉపాధి హామీ క్షేత్ర స్థాయి సిబ్బంది పరిస్థితి. అటు అధికారులతో చీవాట్లు తినలేక, ఇటు కూలీలకు సర్ది చెప్పుకోలేక హైరానాపడుతున్నారు. ఉపాధి హామీ పథకం అమల్లో సీఆర్డీ (కమిషనర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్) నూతన నిబంధనలతో క్షేత్ర స్థాయి సిబ్బంది అవస్థలు పడుతున్నారు. రెండు నెలల నుంచి కూలీలకు పేమెంట్లు చెల్లించలేదు. సుమారు రూ.4 కోట్లకు పైగా పేమెంట్లు నిలిచిపోయాయి. పేమెంట్ల చెల్లింపుల్లో జాప్యం వల్ల కూలీలు బాగా తగ్గిపోయారు. రెండు నెలల కిందట రోజుకు 80 వేలకు పైగా కూలీలు ఉపాధి పనులకు హాజరయ్యేవారు. ప్రస్తుతం రోజుకు 20 వేలకు మించడం లేదు. మంగళవారం 22 వేల మంది కూలీలు హాజరయ్యారు. కూలీలు ఉపాధి పనులకు హాజరు కాకపోవడంతో అధికారులు ఒత్తిడి చేస్తున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఆర్డీ నూతన నిబంధనలతో సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. కూలీల సంఖ్యను పెంచక పోతే వేతనాలు కట్ చేయడం లేదా ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. ఏపీఓలు, టీఏలపై అధికారుల ఒత్తిడి అధికంగా ఉంది. ఏపీఓలు ఎఫ్ఏలపై ఒత్తిడి చేస్తున్నారు. కూలీలను పెంచకపోతే చర్యలు తీసుకుంటామని ఒత్తిడి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్‌ఏలకు నిర్దేశించిన పని దినాలు కల్పించలేకపోతే వారి ఉద్యోగం ఊడుతుంది. పనిదినాలు కల్పించలేని ఎఫ్‌ఏలను తొలగించి సీనియర్ మేట్లుగా నియమిస్తున్నారు. పేమెంట్ల చెల్లింపులో జాప్యం కారణంగా కూలీలు పనులకు హాజరుకావడం లేదని ఎఫ్‌ఏలు వాపోతున్నారు. అధికారులు నిర్లక్ష్యం కారణంగా తాము ఉపాధి కోల్పోయి ఇబ్బందులుపడాల్సి వస్తోందని ఎఫ్‌ఏలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది పనిదినాలు కల్పించలేదనే కారణంగా 220 మంది ఎఫ్‌ఏలను సీనియర్ మేట్లగా నియమించారు. ప్రతి వారం ఎఫ్‌ఏలు డిమాండ్ క్యాప్చర్ అమలు చేయకపోతే వేతనాలు కట్ చేస్తున్నారు. డిమాండ్ క్యాప్చర్ సిస్టమ్‌పై కూలీలకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కూలీలు చేసిన పనులను మూడు రోజుల్లో అప్లోడ్ చేయకపోతే ఏపీఓ, టీఏ, కంప్యూటర్ ఆపరేటర్లపై సీఆర్డీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ప్లాంటేషన్ పనులు అధికంగా జరుగుతున్నాయి. మొక్కలు నాటే ముందు రైతులకు దుక్కి, మొక్కల నగదు చెల్లించాల్సి ఉంది. పేమెంట్లు చెల్లించకపోవడంతో మొక్కలు నాటేందుకు రైతులు ముందుకు రావడం లేదు. గ్రామల్లో టేకు, నిమ్మ మొక్కలు సిద్ధం చేసినా రైతులు ముందుకు రావడం లేదు. కూలీలకు పనులు లభించడం లేదు.