బకాయిల చెల్లింపులో జాప్యం
Published Sat, Aug 13 2016 12:22 AM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM
విద్యారణ్యపురి : సంవత్సరం కాలంగా నిరీక్షస్తున్నా ఉపాధ్యాయ, ఉద్యోగుల పీఆర్‌సీ బకాయిల చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేస్తోం దని పీఆర్‌టీయూ–టీఎస్ జిల్లా అధ్యక్షుడు పిం గిళి శ్రీపాల్‌రెడ్డి విమర్శించారు.శుక్రవారం హ న్మకొండలోని పీఆర్‌టీయూ భవనంలో నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మా ట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులలతో సమానంగా ఉండాలన్న వేతనాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. విద్యాశాఖలో పదేళ్లుగా ఖాళీగా ఉన్న పర్యవేక్షణాధికారుల పోస్టులు భర్తీ చేయకుండా ఆ పోస్టులలో ఎంఈఓలకు అదనపు బా« ద్యతలను అప్పగించి పనిభారం పెంచుతున్నారని ఆరోపించారు.
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా విద్యా వలంటీర్లను నియమించాలని డిమాండ్ చేశారు. పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరునగరి శ్రీనివాస్ మాట్లాడుతూ నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేయాలన్నారు. సమావేశంలో నాయకులు యాకూబ్‌రెడ్డి, సూరి బాబు, రాంరెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, వెంకట స్వా మి, తిరుపతిరెడ్డి, రాంచంద్రం, గఫార్, రాజాసురేందర్‌రెడ్డి, లక్ష్మణ్‌బాబు పాల్గొన్నారు.
Advertisement