emploees
-
మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం.. ఉద్యోగుల్లో మళ్ళీ మొదలైన భయం
ఇప్పుడిప్పుడే టెక్ కంపెనీలు కోలుకుంటున్నాయి. ఉద్యోగులను ఆఫీసులకు రప్పిస్తున్నాయి. అంతా సజావుగా సాగుతున్న వేళ ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మళ్ళీ ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియక.. కంపెనీలోని ఉద్యోగులలో ఒక్కసారిగా భయం మొదలైంది.వైర్డ్ గీక్ నివేదిక ప్రకారం.. ప్రొడక్ట్, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ విభాగంలో కోతలు ఉండవచ్చని తెలుస్తోంది. అయితే ఎంత మందిని తొలగించనున్నారు, ఎప్పుడు తొలగించనున్నారు అనే విషయాలు అధికారికంగా వెల్లడికాలేదు. వ్యాపారాన్ని నిర్వహించడంలో శ్రామిక శక్తి సర్దుబాట్లు తప్పనిసరి. సంస్థ భవిష్యత్తు కోసం ఈ తొలగింపు చేపడుతున్నట్లు తెలుస్తోంది.మైక్రోసాఫ్ట్ 2023లో కూడా లేఆప్స్ కింద ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాది ప్రారంభంలో మైక్రోసాఫ్ట్ తన గేమింగ్ విభాగంలో 2,000 ఉద్యోగాలను తగ్గించింది. గత నెలలో కంపెనీ అజూర్లోని పాత్రలతో సహా దాదాపు 1000 స్థానాలపై ప్రభావం చూపిన రౌండ్ తొలగింపులను చేపట్టింది. గత కొన్ని రోజులుగా కంపెనీ వేలాదిమంది ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు మరోమారు సంస్థ తీసుకున్న నిర్ణయం ఉద్యోగుల్లో భయాన్ని కలిగిస్తోంది. -
ఆగస్టు 14.. చాలామందికి జ్వరం?.. మీరూ ఆ జాబితాలో ఉన్నారా?.. పిచ్చెక్కిస్తున్న మీమ్స్!
సాధారణంగా ఉద్యోగులు లాంగ్ వీకెండ్ కోసం ఎదురు చూస్తుంటారు. ఇటువంటి అవకాశం దొరికితే అలా బయట తిరిగిరావాలని చాలామంది తపన పడుతుంటారు. ఆగస్టు 15 ఈసారి మంగళవారం నాడువచ్చింది.(ఆరోజు ప్రభుత్వ అధికారిక సెలవుదినం). దానికి ముందురోజు అంటే సోమవారం(ఆగస్టు 14). దేశంలోని చాలామంది ఉద్యోగులకు ఆరోజు జ్వరం(సెలవు కోసం) వస్తుందట. లేదా తమ ఇంటిలో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు లేదా శుభకార్యాలు ఉన్నాయంటూ సెలవు కోరుతున్నారు. When your sick leave for Monday is actually approved 🤭 #LongWeekend | #Fan pic.twitter.com/79Jw2yx0CD — Yash Raj Films (@yrf) August 11, 2023 సోమవారం ఒక్కరోజు గనుక సెలవు లభిస్తే, శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం వరుసగా 4 రోజులు సెలవులు వస్తాయి. దీంతో లాంగ్ వీకెండ్ లభిస్తుంది. ఈ సెలవుల్లో ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్ చేయవచ్చని చాలామంది భావిస్తున్నారు. ఈ విషయమై సోషల్ మీడియాలో పలు మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. వాటిలో జనం సెలవు కోసం ఎటువంటి కారణాలు చెబుతున్నారో తెలియజేస్తున్నారు. అవి ఎంతో ఫన్నీగా ఉంటూ అందరినీ కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ఇది కూడా చదవండి: ర్యాపిడో డ్రైవర్ రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై రావడమేంటి?.. బుక్ చేసిన టెకీకి వింత అనుభవం! Leaving office on #Friday knowing it’s a long weekend 🚀 pic.twitter.com/OWD8Rn9pfH — Hemaang (@JrSehgal) August 11, 2023 People returning to offices on 16th August after the long weekend: pic.twitter.com/WaQDHXCcjf — Kanika Choudhary (@DalRotiForLife) August 9, 2023 Every employee planning for 14 August sick leave 🤣🤣🤣🤣🤣🤣 pic.twitter.com/kkiLRG56US — Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) August 11, 2023 Managers permit sick leave on 14 August...😁😁😀😀 pic.twitter.com/uz3XOc3Jn7 — Gramin Banker 🏦 (@bankarBabu) August 5, 2023 *me applying 14 august sick leave* manager: pic.twitter.com/6DxW7sntpp — oh well (@highondhaniya) August 8, 2023 -
ఉద్యోగాలు కోల్పోతున్న గూగుల్ ఉద్యోగులు
-
EPFO: అధిక పెన్షన్‌కు ఆప్షన్ ఇలా!
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగి భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) పరిధిలో అధిక పెన్షన్ కోసం ఆన్లైన్ దరఖాస్తు మొదలైంది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అధిక పెన్షన్‌పై ఈపీఎఫ్ఓ మార్గదర్శకాలు జారీ చేసింది. అర్హత ఉన్న ఉద్యోగులు, పెన్షనర్లు.. అధిక పెన్షన్‌కు ఆప్షన్ ఇవ్వడంతోపాటు దరఖాస్తు నింపాలి. ఇందుకు ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్‌లో లింకును అందుబాటులోకి తెచ్చింది. 2014 సెప్టెంబర్ 1 తర్వాత పదవీ విరమణ పొందిన వారు, ప్రస్తుతం సర్వీసులో ఉండి అధిక పెన్షన్‌కు అర్హత ఉన్న వారు తమ వివరాలను నమోదు చేసుకోవడంతోపాటు జాయింట్ ఆప్షన్ ఇవ్వాలి. వీరు మే నెల 3 వరకు ఈ ప్రక్రియ పూర్తిచేసేందుకు గడువు విధించింది. అయితే 2014 సెప్టెంబర్ 1 కంటే ముందే పదవీ విరమణ పొంది అధిక పెన్షన్‌కు అర్హతలుండి ఆప్షన్ ఇచ్చి ఈపీఎఫ్ఓ ద్వారా తిరస్కరణకు గురైన వారు మాత్రం మార్చి 3లోపు జాయింట్ ఆప్షన్‌తోపాటు వివరాలు సమర్పించాలి. కాగా, అర్హులు ఎవరైనా జాయింట్ ఆప్షన్‌ను ఇవ్వకుంటే భవిష్యత్తులో అవకాశం ఉండదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. సర్వర్ సతాయింపు ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్‌లో అధిక పెన్షన్ లింకును ఎక్కువ మంది ఓపెన్ చేస్తున్నారు. దీంతో సర్వర్‌పై ఒత్తిడి పెరిగింది. సాధారణ సమయంలోనే అత్యంత నెమ్మదిగా ఉండే ఈపీఎఫ్ఓ వెబ్సైట్... తాజాగా అధిక పెన్షన్‌కు సంబంధించిన ఒత్తిడి పెరగడంతో స్తంభించిపోతోంది. వెబ్సైట్లో పేజీ తెరిచి ఆప్షన్ నమోదు లింకు, దరఖాస్తు లింకును క్లిక్చేస్తోంటే చాలామందికి ఎర్రర్ మెసేజ్ వస్తోంది. దీంతో అటు ఉద్యోగులు, ఇటు యాజమాన్యాలు గందరగోళానికి గురవుతున్నాయి. 2014 సెప్టెంబర్ 1 కంటే ముందే పదవీ విరమణ పొంది అధిక పెన్షన్‌కు అర్హతలున్న వారికి ఈ సాంకేతిక సమస్య గుబులు పుట్టిస్తోంది. -
వర్క్ ఫ్రమ్ హోమ్: ఉద్యోగులకు టీసీఎస్ కీలక ఆదేశాలు
సాక్షి, ముంబై: ఐటీ దిగ్గజం టీసీఎస్ తన ఉద్యోగులకు మరో కీలక సమాచారాన్ని అందించింది. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం, ఆంక్షలు పూర్తిగా ఎత్తివేత నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి గుడ్ బై చెప్పేందుకు దాదాపు అన్ని కంపెనీలు సిద్ధమవుతున్నాయి. టీసీఎస్ కూడా తన ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పిస్తోంది. అయితే ప్రత్యేక కారణాల రీత్యా ఇంటినుంచి పని చేయాలనుకునే వారికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఆరోగ్య కారణాల రీత్యా ఇంటి నుంచి పనిచేయాల్సి వస్తే.. కంపెనీ అంతర్గత వైద్యుల నిర్ధారణ అవసరం అని తాజాగా వెల్లడించింది. ఆయా ఉద్యోగులు వారి రోగ నిర్ధారణలు, చికిత్సలు, ధృవీకరణ పత్రాలను కంపెనీ-ప్యానెల్ మెడికల్ కమిటీ ద్వారా ధృవీకరించుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఇలా కొంతమంది ఉద్యోగులకు ఇంటినుండి పని చేయడానికి అనుమతి ఇచ్చినట్టు టీసీఎస్ తెలిపింది. (Maiden Pharma వివాదాస్పద మైడెన్కు భారీ షాక్: అక్టోబరు 14 వరకు గడువు) కాగా ఇటీవల ఉద్యోగులకు ఆఫీసులకు రావాలని ఆదేశించిన టీసీఎస్. ఇపుడిక ఉద్యోగుల హాజరును పర్యవేక్షిస్తోంది. వారంలో కనీసం మూడు రోజులు ఆఫీసులకు రావాలని ఆదేశించింది. కంపెనీ సూపర్వైజర్లు రూపొందించిన రోస్టర్ ప్రకారం, కార్పొరేషన్ తన సిబ్బందిని సెప్టెంబర్ 22న తమ కార్యాలయాలకు రిపోర్ట్ చేయాల్సిందిగా అభ్యర్థించింది. ఇప్పటికే ఆఫీసులకు వస్తున్నారని టీసీఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. టీసీఎస్‌లోని 6,16,171 మంది ఉద్యోగులలో మూడింట ఒక వంతు మంది కార్యాలయం నుంచే పనిచేయడం ప్రారంభించారని సోమవారం కంపెనీ త్రైమాసిక ఆదాయ ప్రకటన సందర్భంగా చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు. డిసెంబరు నుంచి రోస్టర్ ఆధారిత హాజరు తప్పనిసరిగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. (మస్క్ కొత్త బిజినెస్:10వేల బాటిల్స్ విక్రయం, నెటిజన్ల సెటైర్లు) -
ఇన్‌కం ట్యాక్స్ చెల్లింపులు: మీకు ఫారం -16 అవసరం లేదు
ప్రశ్న: నేను 2022 మార్చి 31వరకూ పర్మనెంట్ ఉద్యోగం చేశాను. రిటైర్ అయ్యాక ఏప్రిల్–మేలో ఓ ఉద్యోగం తర్వాత మారి జూన్, జూలై, ఆగస్టులో మరో ఉద్యోగం చేశాను. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మానేశాను.ఆరోగ్యం కుదుటపడ్డాకా కొన్ని రోజులు కన్సల్టెంటుగా చేశాను. కలిసి రాలేదు. దాంతో అక్టోబర్ నుండి మళ్లీ ఉద్యోగం. ఎక్కడా ట్యాక్సబుల్ ఇన్‌కం దాటలేదు. అందుకని పన్ను రికవరీచేయలేదు. జవాబు: ఒక ఆర్థిక సంవత్సరంలో ఇలా మీరు ఎన్ని ఉద్యోగాలు మారినా, మధ్యలో కన్సల్టెన్సీ చేసి మళ్లీ ఉద్యోగం .. ఇలా ఎన్నో చేస్తున్నారు. మీకు నెలకు వచ్చిన జీతం వివరాలు ఇవ్వలేదు. ఎవరూ పన్ను రికవరీ చేయలేదు. కాబట్టి ఫారం 16 ఇవ్వాల్సిన అవసరమూ లేదు. మీ జీతం, వేతనం అలాగే కన్సల్టెంటుగా మిగిలిన లాభం ఇలా.. మొత్తం ఆదాయం లేదా నికర ఆదాయం 2022–23 ఆర్థిక సంవత్సరానికి రూ. 5,00,000 దాటకపోతే మీకు ఎటువంటి పన్ను భారం ఏర్పడదు. నికర ఆదాయం రూ. 5,00,000 లోపల ఉంటే రిబేటు అమల్లో ఉండటం వల్ల పన్ను భారం పడదు. పన్ను రికవరీ జరగలేదు. ఇక ముందు కూడా జరగకపోతే రిఫండు ప్రశ్న రాదు. కాబట్టి రిటర్ను వేయనవసరంలేదు. కానీ ఒక విషయం ఆలోచించాలి. ఈ ఆర్థిక సంవత్సరం రెండు నెలల్లో యజమాని జీతం ఇచ్చారు కానీ పన్ను రికవరీ చేయలేదంటున్నారు. ఆ తర్వాత మూడు నెలల పాటు మరో యజమాని కూడా అదేవిధంగా చేశారు. అంటే ఈ ఇద్దరూ ఎవరి మటుకు వాళ్లు ‘‘మీరు పన్ను భారం పరిధిలోకి రాలేదు’’ కాబట్టి వదిలేశారు. ఉదాహరణగా, మొదటి యజమాని నెలకు రూ. 1 లక్ష ఇచ్చారనుకోండి. మీ జీతం రూ. 2 లక్షలు, బేసిక్ లిమిట్ దాటలేదు. కాబట్టి రికవరీ చేయలేదు. రెండో యజమాని కూడా నెలకు రూ. 1 లక్ష చొప్పున మొత్తం రూ. 3 లక్షలకు ఇచ్చారు అనుకోండి. మొత్తం రూ. 3 లక్షలు.. స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50,000 .. మిగతాది బేసిక్ లిమిట్ దాటలేదు అందుకని రికవరీ చేయలేదు. ఇక కన్సల్టెంటు ఎందుకు రికవరీ చేయలేదో తెలియదు. నాలుగో వ్యక్తి మరో యజమాని. ఇక ఇప్పుడు మీరే స్వయంగా మీ కొత్త యజమానికి తెలియజేయండి. గతంలో మీరు పుచ్చుకున్న జీతభత్య వివరాలు, వాటితో బాటు .. చెల్లించి ఉంటే ఇంటద్దె, మీరు చేసిన సేవింగ్స్, మెడిక్లెయిం, డొనేషన్లు .. ఇవన్నీ రాతపూర్వకంగా తెలియజేయండి. అన్నీ కలిపితే ట్యాక్సబుల్ ఇన్‌కం పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. కొత్త యజమానిని ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని ఆదాయాన్ని లెక్కించమనండి. ఆ ప్రకారం పన్నును రికవరీచేసి .. అంటే టీడీఎస్ చేసి లెక్కించి, చెల్లించమనండి. ఇదే సరైన మార్గం. ఒకవ్యక్తి ఒక సంవత్సర కాలంలో వచ్చినది పూర్తిగా పరిగణనలోకి తీసుకుని పన్ను భారం లెక్కించాలి సుమా! -
గురుకులాల్లో 317 గుబులు! జోనల్ ఉద్యోగుల్లో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీల్లోని ఉద్యోగుల్లో జీఓ 317 గుబులు మొదలైంది. రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో ఆమేరకు అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులను కేడర్ల వారీగా కేటాయించే ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది. తాజాగా సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీల్లో నూతన జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపులు జరపాలని ప్రభుత్వం ఆయా సొసైటీల కార్యదర్శులను ఆదేశించింది. దీంతో కేడర్ల వారీగా ఉద్యోగుల కేటాయింపుపై సొసైటీలు కసరత్తు మొదలుపెట్టాయి. ఇందులోభాగంగా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఎంఆర్ఈఐఎస్)లు జీఓ 317 అమలుకు ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ మేరకు క్షేత్రస్థాయి అధికారులకు మార్గదర్శకాలు ఇవ్వగా... అధికారులు చర్యలు వేగవంతం చేశారు. అతి త్వరలో తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూ ఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిభా ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఆర్ఈఐఎస్)ల పరిధిలోనూ కొత్త జోన్ల వారీగా ఉద్యోగ కేటాయింపు ప్రక్రియ మొదలు కానుంది. నూతన జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపులు పూర్తయితేనే కొత్తగా నియామకాలు, పోస్టింగులు ఇవ్వడానికి మార్గం సుగమం కానుంది. వివరాల సేకరణ షురూ ఎస్సీ, మైనార్టీ గురుకుల సొపైటీల్లో ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియ వేగవంతమైంది. ఉద్యోగుల నుంచి నిర్దేశించిన ఫార్మాట్లో వివరాలను సేకరించే పనిలో రీజినల్ కోఆర్డినేటర్లు బిజీ అయ్యారు. ఇప్పటికే దాదాపు సమాచారం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. వీటిని పరిశీలించాక సీనియారిటీ జాబితాను రూపొందించిన అనంతరం కేటాయింపులు జరుపుతారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఇతరత్రా నిర్దేశించిన కేటగిరీల్లోని ఉద్యోగులకు ప్రాధాన్యత ఇస్తారు. జోనల్ ఉద్యోగుల్లో గందరగోళం కొత్త జోనల్ విధానం ప్రకారం విభజన అంశం జోనల్ స్థాయి ఉద్యోగుల్లోనే ఎక్కువ గుబులు పుట్టిస్తోంది. ఇదివరకు రాష్ట్రంలో రెండు జోన్లు మాత్రమే ఉండేవి. కొత్త విధానంతో జోన్ల సంఖ్య ఏడుకు పెరిగింది, ఇందులో జోన్ పరిధి తగ్గింది. ఈ క్రమంలో జోనల్ స్థాయి ఉద్యోగుల స్థానికత ఆధారంగా కేటాయింపులు జరిపితే సగానికి పైగా ఉద్యోగులకు స్థానచలనం అనివార్యం కానున్నట్లు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో ఈ పరిస్థితుల్లో ఉద్యోగుల స్థానచలనం జరిగితే పిల్లల చదువులు, ఇతరత్రా అంశాల్లో ఇబ్బందులు తలెత్తుతాయనే వాదన ఉద్యోగ సంఘాల నుంచి వినిపిస్తోంది. కేడర్ల వారీగా ఉద్యోగుల విభజన ఇలా... జిల్లా స్థాయి: జూనియర్ అసిస్టెంట్, స్టోర్ కీపర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, ల్యాబ్ అటెండర్ జోనల్ స్థాయి: టీజీటీ, సూపరింటెండెంట్, ఫిజికల్ డైరెక్టర్ (గ్రేడ్ 2), లైబ్రేరియన్, సీనియర్ అసిస్టెంట్, స్టాఫ్ నర్స్, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్, వార్డెన్, పీఈటీ, ల్యాబ్ అసిస్టెంట్, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్, ప్లంబర్/ఎలక్ట్రీషియన్ మల్టీ జోనల్ స్థాయి: ప్రిన్సిపల్ (గ్రేడ్ 2), డిగ్రీ కాలేజీలోని లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్లు, హెల్త్ సూపర్వైజర్లు, జూనియర్ లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్ (గ్రేడ్ 1), పీజీటీలు. జిల్లా, మల్టీ జోన్లలో కొందరు జిల్లాస్థాయి, మల్టీ జోనల్ స్థాయి కేడర్ ఉద్యోగుల్లోనూ కొన్ని మార్పులు తప్పవని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జిల్లాల పరిధి కుదించుకోపోవడం, ఇదివరకు మల్టీ జోన్ లేకుండా రాష్ట్రస్థాయి పోస్టులుండగా... ఇప్పుడు ఆయా కేడర్లలోని ఉద్యోగుల్లో కొందరికి మార్పు తప్పదని తెలుస్తోంది. ప్రస్తుతం వివరాల సేకరణలో ఉన్న అధికారులు.. వారంలోగా సీనియారిటీ ఆధారంగా కేటాయింపులపై ప్రాథమిక జాబితాలు రూపొందిస్తే కొంత స్పష్టత రానుంది. మరోవైపు ఉద్యోగుల కేటాయింపులు మాత్రమే ఇప్పుడు జరిపి, స్థానచలనం జరిగితే కొంత సమయం ఇవ్వాలనే ఉద్యోగుల వినతులను ప్రభుత్వం పరిశీలిస్తోందని విశ్వసనీయ సమాచారం. చదవండి: Telangana: ఊరూరా గోదారే!.. కనీవినీ ఎరుగని జలవిలయం -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త?!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పనుంది. హోలీ పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ) పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మార్చి 16న కేంద్రం కేబినెట్ సమావేశం నిర్వహించనుందని, ఈ భేటీ అనంతరం డీఏపై స్పష్టమైన ప్రకటన వెలువడనుందని కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. డీఏ ఎంత పెరుగుతుందనే అంశంపై కేంద్రం స్పష్టత ఇవ్వనప్పటికీ ప్రస్తుతం ఉన్న 31శాతం డీఏను 34శాతానికి పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఒక వేళ కేంద్ర ప్రభుత్వం డీఏ పెంపుపై అధికారిక ప్రకటన చేస్తే.. 50 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షలకుపైగా పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. డీఏ పెంపుతో శాలరీ ఎంత పెరుగుతుంది? ఈ సారి ప్రకటనలో 3 శాతం డీఏ పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ఉద్యోగుల సగటు వేతనం కనీసం రూ.6,480 నుంచి.. అత్యధికంగా రూ.20 వేల వరకు పెరగొచ్చని తెలుస్తోంది. ఒక ఉద్యోగి బేసిస్ శాలరీ రూ.18,000 ఉంటే..కొత్త డీఏ (34 శాతం) వాటా రూ.6,120గా ఉంటుంది. ప్రస్తుతం 31 శాతం డీఏ (రూ.5,580) వస్తోంది. చదవండి: గ్యాప్ తీసుకోలేదు..వచ్చింది అంతే! ఎలన్ మస్క్ యుద్ధం వచ్చినా ఆగేలా లేడే! -
భారీగా ఉద్యోగాల కోతను విధించనున్న నోకియా
ఫిన్‌ల్యాండ్: ఫిన్నిష్ టెలికాం పరికరాల తయారీ సంస్థ నోకియా పొదుపు మంత్రాన్ని పాటిస్తోంది. ఇందులో భాగంగా 600 మిలియన్ యూరోల (715 మిలియన్ డాలర్లు) ఖర్చును తగ్గించేలా 2023 నాటికి 11 శాతం ఉద్యోగులను తగ్గిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. కొత్తగా వచ్చిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ పెక్కా లండ్మార్క్ నేతృత్వంలోని నోకియా తన విస్తృత పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా రాబోయే రెండేళ్ళలో మార్కెట్ పరిస్థితులను అనుసరించి ఉద్యోగ కోతలు ఉంటాయని తెలపింది.. ప్రణాళికాపరంగానే ఉద్యోగుల కోతలు రానున్న 18-24 నెలల వ్యవధిలో 80,000-85,000 ఉద్యోగులు మాత్రమే సంస్థలో ఉంటారని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నోకియాలో సుమారు 90,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. సూపర్ ఫాస్ట్ 5జి పరికరాల మార్కెట్లో ఆధిపత్యం చెలాయించడంలో తన పోటీదారులైన ఎరిక్సన్, హువాయ్లతో జరిగిన రేసులో నోకియా కు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. కాక గత ఏడాది లో జరిగిన ముఖ్యమైన వెరిజోన్ ఒప్పందాన్ని కోల్పోయి చైనాలోకి అడుగుపెట్టలేకపోయింది.గత ఏడాది ఆగస్టులో లండ్మార్క్ అధికారంలోకి వచ్చిన తరువాత, మాజీ సిఈఓ రాజీవ్ సూరి"ఎండ్-టు-ఎండ్ సొల్యూషన్స్" వ్యూహాన్ని రద్దు చేస్తూ ఆ స్థానంలో మరింత కేంద్రీకృత విధానాన్ని తీసుకొచ్చాడు. ఆల్కాటెల్-లూసెంట్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఫ్రాన్స్‌లో 1,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోవడంతో సహా, 2018 లో వ్యయ కోతలో భాగంగా విధించిన ఉద్యోగుల తొలగింపులే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. -
వర్క్ ఫ్రమ్ హోమ్‌కే 88శాతం ఉద్యోగుల ఓటు..!
భారత్‌లో 88శాతం మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌కే మొగ్గుచూపుతున్నట్లు యస్‌ఏపీ కాంకర్ సర్వే తెలిపింది. ఇంటి వద్ద నుంచి పని చేయడాన్ని ఉద్యోగులు సౌకర్యవంతగా భావిస్తున్నారని సర్వే తెలిపింది. దేశవ్యాప్తంగా ఆయా రంగాలకు చెందిన 300కంపెనీల ఉద్యోగుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని నివేదికను తయారీ చేసినట్లు కాంకర్ సర్వే తెలిపింది. ఇంటివద్ద నుంచి పనిచేసేటప్పుడు తమ ఉత్పాదక సామర్థ్యం మరింత పెరుగుతుందని 69శాతం మంది ఉద్యోగులు నమ్ముతున్నారు. ఇంట్లో పని చేయడంతో సమయం ఆదా అవుతుందని, కంపెనీలకే లాభమని ఉద్యోగులు విశ్వసిస్తున్నట్లు సర్వే తన నివేదికలో చెప్పుకొచ్చింది. అలాగే వర్క్-ఫ్రమ్-హోమ్ అవకాశాన్ని కల్పించిన కంపెనీలు తమకు అవసరమైన బ్రాండ్‌బాండ్ ఇంటర్నెట్, మొబైల్ రీఛార్జ్‌లు, ల్యాబ్స్‌ట్యాబ్స్ లాంటి కనీస సదుపాయాలను అందిస్తున్నట్లు 77శాతం మంది తెలిపారు. మిగిలిన 11శాతం మంది ఆఫీస్‌లో పనిచేసేందుకే ఆసక్తి చూపుతున్నారని నివేదిక తెలిపింది. కంపెనీలో అయితే హై స్పీడ్ డేటా ఉంటుందని, టీమ్ వర్క్ ఉంటుందని, స్నేహితులు ఉంటారని వారు భావిస్తున్నారు. మిగిలిన 1శాతం మంది తాము ఇల్లు లేదా ఆఫీసుల్లో ఎక్కడైన పని చేసేందుకు సిద్ధమని తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనాకేసులు పెరుగుతుండటంతో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. -
ఉద్యోగులకు పీడబ్ల్యూసీ బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: కరోనా దెబ్బతో అన్ని కంపెనీలు ఉద్యోగులను తగ్గిస్తున్న తరుణంలో ఆర్థిక సేవలందించే ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ) సంస్థ మాత్రం ఉద్యోగులకు ప్రమోషన్లు, బోనస్‌లతో బంపర్ ఆఫర్ ప్రకటించింది. కరోనా వైరస్ సవాళ్లు విసురుతున్నప్పటికీ, కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది వేతనాల పెంపు, పనితీరు ఆధారంగా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు పేర్కొంది. బోనస్‌లు ప్రమోషన్లను అక్టోబర్1 2020న ప్రకటించనున్నట్లు తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో అనేక సంక్షోభాలను ఎదుర్కొన్నామని, కానీ గత సంవత్సరాలతో పోలిస్తే వేతనాలు, ప్రమోషన్లు కొంత మేర తగ్గవచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కాగా సంస్థ క్లయింట్లకు మెరుగైన సేవలందించడమే తమ లక్ష్యమని పీడబ్లుసీ చీఫ్ పబ్లిక్ అధికారి పద్మజ అలగానందన్ తెలిపారు. మరోవైపు తమ సంస్థ వినియోగదారులకు అత్యుత్తమ సేవలందిస్తు అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన రేటింగ్ సాధించిందని పద్మజ పేర్కొన్నారు. (చదవండి: లాభాలతో పాటు విలువలూ ముఖ్యమే) -
పనుల్లోకి 2 కోట్లమంది కార్మికులు: సీఎంఐఈ
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌కు కొన్ని నిబంధనలలో కూడిన సడలింపులు ఇవ్వడంతో 2 కోట్ల మంది కార్మికులు తిరిగి పనుల్లో చేరారు. సడలింపులతో కొన్ని కంపెనీల కార్యాలయాలు, పరిశ్రమలు తెరుచుకోవడంతో భారతీయుల ఎంప్లాయిమెంట్ రేటు 2 శాతం పెరిగిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం ఏప్రిల్‌లో ఎంప్లాంయిమెంట్ రేటు 27 శాతంగా ఉండగా అది మే నాటికి 2 శాతం పెరిగి 29 శాతానికి చేరింది. మార్చి 25 నుంచి లాక్డౌన్ కారణంగా 12.2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని ఈ నివేదిక వెల్లడించింది. ఇక పరిశ్రమల్లో పనిచేసే లేబర్ పార్టిసిపేషన్ రేట్(ఎల్పీఆర్) వారం వారం పెరుగుతోందని మే 17 నాటికి ఇది 38.8 శాతం పెరిగిందని సీఎంఐఈ వెల్లడించింది. ఎల్పీఆర్ మార్చిలో 41.9 శాతంగా ఉందని అది ఏప్రిల్ నాటికి 35.6 శాతానికి తగ్గి మేనెలలో మరింత పుంజుకుందని పేర్కొంది. -
కాగ్నిజెంట్‌లో.. 400 ఎగ్జిక్యూటివ్‌లకు బై..బై
ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్ 400 మంది సీనియర్ అధికార స్థాయి ఉద్యోగులను తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డైరెక్టర్స్, సీనియర్ డైరెక్టర్స్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్స్(ఏపీపీఎస్), వీపీఎస్,ఎస్వీపీఎస్లను స్వచ్చందంగా పదవీవిరమణ చేయమని కాగ్నిజెంట్ కంపెనీ అడగవచ్చని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. రెండేళ్ల క్రితం కూడా సీనియర్, డైరెక్టర్‌స్థాయి ఉద్యోగులు 200 మందిని తొలగించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాదికూడా 400 మంది సీనియర్ ఉద్యోగులను వలంటరీ సపరేషన్ స్కీము కింద స్వచ్చందంగా ఉద్యోగాల నుంచి తప్పుకోమని ఈ కంపెనీ అడగనుంది.కాగా కాగ్నిజెంట్ కంపెనీలో ప్రపంచ వ్యాప్తంగా 2,90,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కంపెనీ వ్యయాలను తగ్గించుకునేందుకు, డిమాండ్ సప్లై ఆధారంగా ఉద్యోగులను విభజించి కొంత మేర ఉన్నతస్థాయి అధికార యంత్రాంగాన్ని తగ్గించుకునే ప్రయత్నాల్లో కాగ్నిజెంట్ ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. -
ఆర్టీసీ విలీనంపై కార్మికుల హర్షం
-
క్రాప్ట్ అండ్ ఆర్ట్ ఉద్యోగులకు భరోసా కల్పించిన వైఎస్ జగన్
-
ఉద్యోగ సంఘాలతో ముగిసిన సీఎం సమావేశం
హైదరాబాద్ : ఉద్యోగ సంఘాల నాయకులతో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. ఉద్యోగ సంఘాల నాయకుల సమస్యలపై మంత్రి వర్గ ఉప సంఘంతో కలసి ప్రగతి భవన్లో చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర మరువలేనిదని, సెలవు దినాల్లో కూడా ఉద్యోగులు పని చేశారని కొనియాడారు. రెవిన్యూ రికార్డులను విజయవంతంగా ప్రక్షాళన చేశామని వెల్లడించారు. రెవిన్యూ వసూళ్లలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, పీఆర్సీపై త్రిసభ్య కమిటీ వేశామని, ఆగస్టు 15 లోపు రిపోర్టు వచ్చేలా ఆదేశిస్తామని చెప్పారు. బదిలీల విధివిధానాలపై అజయ్ మిశ్రా అధ్యక్షతన కమిటీ వేశామని, ఉద్యోగుల బదిలీల్లో దంపతులకు ప్రాధాన్యమిస్తామని వెల్లడించారు. జోనల్ విధానంపై కేబినేట్ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కేసీఆర్ కిట్ల వల్ల ప్రభుత్వ వైద్యులపై మూడు రెట్ల పని భారం పెరిగిందని, వారి సేవలను ప్రభుత్వం గుర్తిస్తుందని చెప్పారు. -
ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రెవెన్యూ సంఘాల నిరసన
జగిత్యాల: నర్సంపేట జిల్లాలో ఎమ్మెల్యే మాధవరెడ్డి కలెక్టర్లు మస్కూరుల కంటే అధ్వానంగా పనిచేస్తున్నారని ఎద్దేవ చేస్తూ మాట్లాడడాన్ని నిరసిస్తూ తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు గురువారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. వారు మాట్లాడుతూ కలెక్టర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లా ఎగ్జిక్యూటీవ్ మెజిస్ట్రేట్‌గా వ్యవహరిస్తున్న కలెక్టర్లపైనే అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. రెవెన్యూ ఉద్యోగుల సర్వీసుల సంఘం గౌరవ అధ్యక్షుడు హరి అశోక్‌కుమార్, ఎండీ.వకీల్, టీఎన్జీవోల అధ్యక్షుడు శశిధర్, కృష్ణ, మధుగౌడ్ పాల్గొన్నారు. -
పెన్షన్ భిక్ష కాదు.. ఉద్యోగి హక్కు
సుభాష్‌నగర్(నిజామాబాద్ అర్బన్) : ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెన్షన్ ప్రభుత్వం పెట్టే భిక్ష కాదని, అది ఉద్యోగి హక్కు అని ఏబీఆర్ఎస్ఎం జాతీయ ఉపాధ్యక్షులు పాలేటి వెంకట్రావు పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని ఏబీవీపీ కార్యాలయంలో తపస్ ఇందూర్ జిల్లా కార్యనిర్వాహక వర్గ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ... వృత్తి పట్ల నిబద్ధత కలిగిన కార్యకర్తల సమూహమే తపస్ సంఘం అని తెలిపారు. సీపీఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి, పాత పింఛన్ విధానాన్ని అమలుయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఇప్పకాయల సుదర్శన్, పాపగారి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సీపీఎస్ రద్దు కోరుతూ తపస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద 27వ తేదీన ధర్నా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ధర్నాకు సంబంధించిన పోస్టర్లను వారు విడుదల చేశారు. రాష్ట్ర కార్యదర్శి కీర్తి సుదర్శన్, జిల్లా కోశాధికారి రమేష్‌లాల్, నాయకులు కృష్ణవేణి, శ్రీకాంత్, లక్ష్మీనర్సయ్య, అరుణ్, నరోత్తం, వివిధ మండలాల బాధ్యులు నాగభూషణం, రాము, గోపి, సాయిలు పాల్గొన్నారు. ‘సీపీఎస్’ ను రద్దు చేయాలి:వెంకట్రావు కామారెడ్డి టౌన్: హర్యాన రాష్ట్రంలో మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని అఖిల భారత రాష్ట్రిక శైక్షిక్మహాసంఘ్(ఏబీఆర్ఎస్ఎం) న్యూఢిల్లీ జాతీయ ఉపాధ్యక్షుడు పాలెటి వెంకట్రావు అన్నారు. ఆదివారం సరస్వతి శిశుమందిర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తపస్ ఆధ్వర్యంలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని జిల్లా కేంద్రంలో ఈనెల 27న నిర్వహిస్తున్న ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణలో సీపీఎస్‌పై శాసనసభలో ఎటువంటి తీర్మాణాన్ని చేయకపోవడంతో సమస్య శాపంలా మారిందన్నారు. ఈ సమావేశంలో తపస్ జిల్లా అధ్యక్షుడు రమేష్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి రవీంద్రనాథ్, నాయకులు రమేష్, లక్ష్మిపతి, రాజశేకర్, ఆంజనేయులు, తదితరులున్నారు. -
ఉద్యోగుల వివరాలు ఆన్లైన్ చేయాలి
అడిషనల్ డైరెక్టర్ సూర్యప్రకాశ్ ఎంజీఎం : జిల్లా వైద్యారోగ్యశాఖలోని ఉద్యోగులు, ఫైళ్ల వివరాలను వెంటనే ఆన్లైన్ చేయాలని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అడిషనల్ డైరెక్టర్(ప్లానింగ్), జిల్లాల విభజన అధికారి సీహెచ్.సూర్యప్రకాశ్ ఆదేశించారు. వరంగల్‌లోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డీహెచ్ఓ సాంబశివరావుతో విభజన ప్రక్రియపై గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యప్రకాశ్ మాట్లాడుతూ వరంగల్ జిల్లా విభజన క్రమంలో నాలుగు కొత్త జిల్లాలుగా ఏర్పడుతున్న క్రమంలో లో శాఖకు సంబంధించి పూర్తి వివరాలు, ఫైళ్ల సమాచారాన్ని సెక్షన్ల వారీగా ఆన్లైన్లో నమోదు చేయాలని, ఈ ప్రక్రియను వేగంగా నిర్వహించాలని సూచించారు. నాలుగు జిల్లాల్లో కార్యాలయాల వివరాలు, జిల్లాల వారీగా ఫైళ్ల విభజనతో పాటు సామగ్రి సర్దుబాటు వివరాలపై చర్చించారు. సమావేశంలో అడిషనల్ డిఎంహెచ్ఓ మధుసూన్, ఆఫీస్ సూపరింటెండెంట్ సదానందం, జిల్లా మాస్‌మీడియా అధికారి అశోక్‌రెడ్డి, స్వరూపరాణి, అన్వర్ పాల్గొన్నారు. -
బకాయిల చెల్లింపులో జాప్యం
విద్యారణ్యపురి : సంవత్సరం కాలంగా నిరీక్షస్తున్నా ఉపాధ్యాయ, ఉద్యోగుల పీఆర్సీ బకాయిల చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేస్తోం దని పీఆర్టీయూ–టీఎస్ జిల్లా అధ్యక్షుడు పిం గిళి శ్రీపాల్‌రెడ్డి విమర్శించారు.శుక్రవారం హ న్మకొండలోని పీఆర్టీయూ భవనంలో నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మా ట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులలతో సమానంగా ఉండాలన్న వేతనాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. విద్యాశాఖలో పదేళ్లుగా ఖాళీగా ఉన్న పర్యవేక్షణాధికారుల పోస్టులు భర్తీ చేయకుండా ఆ పోస్టులలో ఎంఈఓలకు అదనపు బా« ద్యతలను అప్పగించి పనిభారం పెంచుతున్నారని ఆరోపించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా విద్యా వలంటీర్లను నియమించాలని డిమాండ్ చేశారు. పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరునగరి శ్రీనివాస్ మాట్లాడుతూ నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేయాలన్నారు. సమావేశంలో నాయకులు యాకూబ్‌రెడ్డి, సూరి బాబు, రాంరెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, వెంకట స్వా మి, తిరుపతిరెడ్డి, రాంచంద్రం, గఫార్, రాజాసురేందర్రెడ్డి, లక్ష్మణ్‌బాబు పాల్గొన్నారు. -
కాంట్రిబ్యూటరీ విధానాన్ని రద్దు చేయాలి
హన్మకొండ : ఉద్యోగులకు అమలు చేస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను రద్దు చేయాలని తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాÄæూస్ అసోషియేషన్ జిల్లా శాఖ డి మాండ్ చేసింది. సోమవారం హన్మకొండలో జరిగిన జిల్లా శాఖ సమావేశంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసేల ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఉద్యమ కార్యాచరణను రూపొందించింది. దీనికి సంబంధించిన వివరాలు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వి.లింగమూర్తి వెల్లడించారు. ఈ నెల 10న ఉద్యోగులందరూ నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపాలి. 11న అన్ని మండలాల్లో తహసీల్దార్లను కలిసి వినతిపత్రాలు అందజేయాలి. 16న ఆర్డీఓలకు వినతిపత్రం అందజేత, 22న కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత, సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లోని ఇందిరా పా ర్కు వద్ద ధర్నా చేయనున్నట్లు వివరించారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఉద్యోగులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఎస్.కుమారస్వామి, మనోహర్, శ్రీనివాస్‌రావు, బుచ్చన్న, వి.రాంబాబు పాల్గొన్నారు. -
ఉద్యోగులకు అండగా ఉంటా..
డిప్యూటీ సీఎం కడియం ఉద్యోగులకు అండగా ఉంటానని ఉప ముఖ్యమంత్రి శ్రీహరి అన్నారు. హన్మకొండలో గురువారం జరిగిన టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి హమీద్ అభినందన సభలో పాల్గొని మాట్లాడారు.. హన్మకొండ : ఉద్యోగులకు అండగా ఉంటానని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. టీఆర్ఎస్లోకి రావడం వల్ల తనకు అన్నీ మంచి శకునాలే జరిగాయని అన్నారు. హన్మకొండ నక్కలగుట్టలోని నందన గార్డెన్స్‌లో టీఎన్జీవోస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి హమీద్ అభినందన సభ గురువారం జరిగింది. సభలో కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. టీఎన్జీవోస్ యూనియన్, ఉద్యోగ జేఏసీ నాయకులతోపాటు తనను అభిమానించే వారు, తెలంగాణ కోరుకునే శక్తులు టీడీపీలో ఎన్ని రోజులుంటారు.. అందులోంచి బయటకు రావాలని వత్తిడి తెచ్చారని గుర్తు చేశారు. టీఆర్ఎస్లో చేరడంతో ఎంపీగా ఎన్నికయ్యాయని, ఊహించకుండానే డిప్యూటీ సీఎం అయ్యూనన్నారు. జిల్లాకు చెందిన కారం రవీందర్‌రెడ్డి టీఎన్జీవోస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక కావడం గర్వకారణమన్నారు. దేవీప్రసాద్ సలహాలు, సూచనలు తీసుకొని అధ్యక్షుడిగా రాణించాలన్నారు. రవీందర్‌రెడ్డికి, హమీద్‌కు ఉద్యోగులు చేదోడు వాదోడుగా ఉండాలని అన్నారు. ఉద్యోగుల సమస్యలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చెందకుండా ఇంకా కొందరు ప్రత్యక్షంగా, పరోక్షం కుట్రలు చేస్తున్నారన్నారు. పార్లమెంటరీ కార్యదర్శి దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ఉద్యోగులు భాగస్వాములు కావాలన్నారు. దేవీప్రసాద్‌కు టీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. కేసీఆర్ ఇచ్చిన మాట తప్పరని, ఏదో ఒక అవకాశం కల్పిస్తారన్నారు. జిల్లాకు దక్కిన గౌరవం: కారం రవీందర్‌రెడ్డి,టీఎన్జీవోస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు టీఎన్జీవోస్ యూనియన్‌కు తాను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జిల్లాకు దక్కిన అరుదైన గౌరవమని కారం రవీందర్‌రెడ్డి అన్నారు. జిల్లా ఉద్యోగులు అం దించిన సహకారంతో తాను ఈ స్థాయికి వచ్చానన్నా రు. రాష్ట్ర సాధన, ఉద్యోగుల సమస్యల సాధనకు జరి గిన పోరాటంలో జిల్లా ఉద్యోగులు కనబరిచిన పాత్ర అమోఘమన్నారు. నూతనంగా ఎన్నికైన నాయకత్వం టీఎన్జీవోస్ యూనియన్‌కు కేఆర్.ఆమోస్ నుంచి ఇప్పటివరకు అందించిన అన్ని నాయకత్వాల మార్గంలో తాము సేవలందిస్తామన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం అదనంగా రెండు గంటలు పని చేస్తామన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు ఉద్యోగులం నడుచుకుంటామన్నారు. టీఎన్జీవోస్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ ఉద్యమం సందర్భంగా టీఎన్జీవోస్ యూనియన్, ఉద్యోగులం ఇచ్చిన హామీ మేరకు అమరవీరుల కుటుంబాలకు ఒకటిన్నర రోజు జీతం విరాళంగా ఇచ్చి ఆదుకున్నామన్నారు. కమలనాథన్ కమిటీ ఉద్యోగుల విభజనను జూన్ వరకు పొడిగించిందని, దీనిని అక్టోబర్ వరకు పొడిగించే అవకాశముందని చెబుతోందని అన్నారు. సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ఈనెల 19న కాకతీయ మిషన్ కార్యక్రమంలో శ్రమదానం చేయనున్నట్లు చెప్పారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హామీద్ మాట్లాడుతూ ఉద్యోగులకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి హమీద్‌ను టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా శాఖ, ఉద్యోగ జిల్లా శాఖ, టీఎన్జీవోస్ యూనియన్ ఆయా ప్రభుత్వ శాఖల యూనిట్లు, ఇతర ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు ఘనంగా పూలమాలలు వేసి, పుష్పగుచ్ఛాలు అందించి శాలువా కప్పి ఘనంగా సన్మానించాయి. కాగా, డీసీసీబీ చైర్మన్ జంగా రాాఘవరెడ్డి కారం రవీందర్‌రెడ్డిని సన్మానించారు. టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోల రాజేష్‌కుమార్ అధ్యక్షతన జరిగిన అభినందన సభలో ఎంపీ అజ్మీర సీతారాంనాయక్, టీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు, నాయకులు ఇండ్ల నాగేశ్వర్రావు, జోరిక రమేశ్, ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ పరిటాల సుబ్బారావు, టీజీఓ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్మోహన్రావు, టీఎన్జీవోస్ యూనియన్ రాష్ట్ర నాయకులు రేచల్, జిల్లా నాయకులు రత్నవీరాచారి, హసనుద్దీన్, ఈగ వెంకటేశ్వర్లు, సురేందర్‌రెడ్డి, రత్నారెడ్డి, సదానందం, బి.రాము, బి.సోమయ్య, శ్యాంసుందర్, రాంకిషన్, ఇబ్రహీం హుస్సేన్, మాధవరెడ్డి, వేణుగోపాల్, శ్రీనివాస్, సాదుల ప్రసాద్, సామ్యేల్, కత్తి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
తపాలా ఉద్యోగుల సమ్మె.
తపాలా ఉద్యోగుల సమ్మె. నిజాంసాగర్, : తమ సమస్యలను పరిష్కారించాలని కొరుతూ తపాలా శాఖ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. మంగళవారం మండల కేంద్రాలోని సబ్ పోస్టాపీసు వద్ద తపా లా ఈడీ ఉద్యోగులు ధర్నా చేశారు. ఈ సందర్బంగా ఈడీ ఉద్యోగుల సంఘం మండలనాయకుడు భూమయ్య మాట్లాడుతూ జీడీఎస్ ఉద్యోగులకు సివిల్ సర్వంట్ హోదా కల్పించాలన్నారు. ఉద్యోగులకు ఎటువంటి పరీక్ష లేకుం డా ప్రమోషన్ కల్పించాలన్నారు. 25 శాతం ఎం టీఎన్ ఖాళీలను అవుట్ సోర్స్ ద్వారా భర్తీ చేయడం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. జీడీఎస్ ఉద్యోగులకు 50 శాతం డీఏను మూల వేతనంతో కలపాలన్నారు. పార్ట్‌టైం, కండిం జెంట్ ఉద్యోగులను పర్మినెంట్ చేసి, సవరించి న వేతనాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశా రు. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల తపాలా ఉద్యోగులు శరవణ్, బాలయ్య, శరవన్, రహీం, యూసూబ్, నారాయణరెడ్డి, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. జుక్కల్: మండల తపాలా కార్యాలయంలో ఆ శాఖ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. బీపీఎంలు వారి కింది సిబ్బంది మంగళవారం సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీపీఎంలు విశ్వనాథ్, సమద్ మాట్లాడుతూ బీపీఎంలను కింది సిబ్బందిని జీడీఎస్‌లో కొనసాగేలా చూడాలని అన్నారు. డీఏను పెంచాలని డిమాండ్ చేశారు. బీపీఎంలకు, కింది సిబ్బం దికి సివిల్ హోదా కల్పించాలని ఏడో వేతనం వర్తించేలా చూడాలని అన్నారు. సీనియర్, జూనియర్లకు జీడీఎస్లోకి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బీపీఎంలు శ్రీను, వీరేందర్, రాజేందర్, రవి, గౌస్ పాల్గొన్నారు.