ఉద్యోగుల వివరాలు ఆన్‌లైన్ చేయాలి | Employees of the details need to be online | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల వివరాలు ఆన్‌లైన్ చేయాలి

Published Fri, Sep 16 2016 12:46 AM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM

Employees of the details need to be online

  •  అడిషనల్‌ డైరెక్టర్‌ సూర్యప్రకాశ్‌
  • ఎంజీఎం : జిల్లా వైద్యారోగ్యశాఖలోని ఉద్యోగులు, ఫైళ్ల వివరాలను వెంటనే ఆన్‌లైన్‌ చేయాలని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌(ప్లానింగ్‌), జిల్లాల విభజన అధికారి సీహెచ్‌.సూర్యప్రకాశ్‌ ఆదేశించారు. వరంగల్‌లోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డీహెచ్‌ఓ సాంబశివరావుతో విభజన ప్రక్రియపై గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యప్రకాశ్‌ మాట్లాడుతూ వరంగల్‌ జిల్లా విభజన క్రమంలో నాలుగు కొత్త జిల్లాలుగా ఏర్పడుతున్న క్రమంలో లో శాఖకు సంబంధించి పూర్తి వివరాలు, ఫైళ్ల సమాచారాన్ని సెక‌్షన్ల వారీగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, ఈ ప్రక్రియను వేగంగా నిర్వహించాలని సూచించారు. నాలుగు జిల్లాల్లో కార్యాలయాల వివరాలు, జిల్లాల వారీగా ఫైళ్ల విభజనతో పాటు సామగ్రి సర్దుబాటు వివరాలపై చర్చించారు. సమావేశంలో అడిషనల్‌ డిఎంహెచ్‌ఓ మధుసూన్‌, ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ సదానందం, జిల్లా మాస్‌మీడియా అధికారి అశోక్‌రెడ్డి, స్వరూపరాణి, అన్వర్‌ పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement